1393. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాది (రధి అల్లాహు అన్హు) కధనం :-
ఒకవ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్ళి తలుపు కన్నంలో నుంచి లోపలికి తొంగి చూడసాగాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో మొనలు గల ఒక ఇనుప దువ్వెన ఉంది. దాంతో ఆయన తల గోక్కుంటున్నారు. ఆయన తలుపు సందు నుండి తొంగి చూస్తున్న ఆ వ్యక్తిని చూసి “నీవు నన్ను ఇలా తొంగి చూస్తున్నావని తెలిస్తే నేనీ దువ్వెనతోనే కంట్లో పొడిచేస్తాను” అని అన్నారు. ఆ తరువాత అతనితో “ఇలా తొంగి చూడరాదన్న ఉద్దేశ్యంతోనే అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది” అని అన్నారు.