ఈర్ష్యాద్వేషాల నిషేధం (Prohibition of Envy)

అన్ అనసిబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు – అన్నరసూలల్లాహి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల,

“లా తబాగదూ, వలా తహాసదూ, వలా తదాబరూ, వకూనూ ఇబాదల్లాహి ఇఖ్ వానా, వలా యహిల్లు లి ముస్లిమిన్, ఐఁయ్యహ్ జుర అఖాహు ఫౌఖ తలాతతి అయ్యామ్” [ముత్తఫిఖున్అలైహి]

అనస్ ఇబ్నె మాలికిన్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా హితోపదేశం చేశారు

“1. మీరు ద్వేషించుకోవద్దు.

2. మీరు అసూయ (ఈర్ష్య) పడవద్దు.

3. మీరు ఒకరికొకరు వీపు చూపుకోవద్దు (దూరం కావద్దు) మరియు అల్లాహ్ దాసులై సహోదరులుగా ఉండండి. తోటి సోదరులతో మూడు రోజులకంటే ఎక్కువగా (అయిష్టంతో) మాట్లాడకుండా ఉండడం ముస్లింలకు అనుమతింపబడలేదు”

(బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు)

https://teluguislam.net/2010/10/27/prohibition-of-envy/

%d bloggers like this: