1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు
“లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బు స్సమావాతి వరబ్బుల్ అర్జి వ రబ్బుల్ అర్షిల్ కరీం”
[మహోన్నతుడు, మృదు మనస్కుడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అత్యున్నత సింహాసనాధిపతి (విశ్వసామ్రాజ్యాధినేత) అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. భూమ్యాకాశాల ప్రభువు, ప్రతిష్ఠాత్మక సింహాసనాధిపతి అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు].