కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) | మర్కజ్ దారుల్ బిర్ర్

kitab-at-tawheed-AbdulWahhab-book-cover

Touheed (Eka Daivaradhana) (Telugu) – Kitabut Touheed
Compiled by : Allama Mohammad bin Abdul Wahhab
Translated by : Abdul Rab bin Shaik Silar
Edited by : Dr. Sayeed Ahmed Oomeri Madani, S.M. Rasool Sharfi
Publisher : Markaz Darul Bir, Ahmad Nagar, Pedana A.P. India

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు] [ఫైల్ సైజ్ : 4 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

తొలిపలుకులు

  1. ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత
  2. ఏక దైవారాధన యొక్క ప్రాముఖ్యత, సకల పాప సంహారిణి
  3. ఏక దైవారాధకుడు విచారణ  లేకుండానే స్వర్గమున ప్రవేశించును
  4. బహు దైవరాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత
  5. “లా ఇలాహ ఇల్లల్లాహ్” నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితభోద చేయుట
  6. తౌహీద్ మరియు కలిమయే తౌహీద్ ధృవీకరణల సారాంశం
  7. కష్ట నష్టాల విముక్తికి తాయత్తులు , దారాలు, రక్ష రేకులు ధరించుట
  8. ఊదుట & తాయత్తులు ధరించుట నిషిద్దం
  9. రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా  భావించుట
  10. అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు
  11. అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామము పై అర్పణ కూడా నిషేధము
  12. అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే
  13. అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే
  14. అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే
  15. నిరాధారమైన సృష్టిని వేడుకొనుట
  16. “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు” –   (సబా  34 :23)
  17. సిఫారసు వాస్తవికత
  18. “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందిరికీ మార్గదర్శకత్వము ప్రసాదించగలడు” (28 :56)
  19. ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే
  20. పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం
  21. పుణ్యాత్ముల సమాధుల  విషయంలో హద్దు మీరుట ధైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట
  22. ఏక ధైవోపాసనను భధ్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను
  23. ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట
  24. చేతబడి
  25. జాదులోని కొన్ని విధానాలు
  26. జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి
  27. జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట
  28. దుశ్శకున (అపశకున) దర్శనము
  29. జ్యోతిష్యం గురించి
  30. నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట
  31. అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది
  32. అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉండుట
  33. ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను
  34. అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండరాదు – అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదు
  35. అల్లాహ్ నిర్ణయించిన విధి పై సహనం ఈమాన్ లోని అంతర్భాగమే
  36. ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే
  37. ఇహలోక లబ్ధికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’లాంటివి
  38. అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట
  39. ‘విశ్వసించితిమి ‘అను వారి వాస్తవము
  40. అల్లాహ్ నామములో, గుణ గణాలలో కొన్నింటిని తిరస్కరించటం
  41. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట
  42. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు
  43. అల్లాహ్ పై ప్రమాణం తో సంతృప్తి చెందని వాడు
  44. అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే
  45. కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు భాధ కలిగించినట్లే
  46. ఎవరినైనా రాజాధిరాజు అని పిలుచుట
  47. అల్లాహ్ నామాలను గౌరవించుట
  48. అల్లాహ్ ను , ఖుర్ఆనును, ప్రవక్త (సల్లాలహు అలైహి వసల్లం) ను హేళన చేసే వారి కోసం శాసనము
  49. అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత
  50. అల్లాహ్ సంతానం ప్రసాదిన్చినప్పుడు షిర్క్ కు పాల్పడుట
  51. అల్లాహ్ మహోన్నత నామములు
  52. అల్లాహ్ పై సలాం అని పలుకరాదు
  53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని పలుకరాదు
  54. “నా బానిస” అని పలుకరాదు
  55. అల్లాహ్ నామముతో యాచించు వానిని ఒట్టి చేతులతో పంపరాదు
  56. అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమె కోరవలెను
  57. కష్ట నష్టాలు సంభవించినప్పుడు “ఒక వేళ ఇలా జరిగి ఉంటే” అని పలుకుట
  58. గాలిని తిట్టుట నిషిద్దం
  59. అల్లాహ్ ను శంకించుట నిషిద్దం
  60. అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించేవారు
  61. చిత్రాలు,శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని
  62. ఎక్కువగా ప్రమాణములు చేయుట
  63. అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట
  64. అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట
  65. సృష్టిరాశులను సంతోష పెట్టడానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు
  66. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తౌహీదును పరిరక్షించారు, షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు
  67. అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము)

[పుస్తకం టెక్స్ట్]

తొలిపలుకులు

సర్వస్తోత్రాలు సకలలోక ప్రభువైన అల్లాహ్ కే. మహనీయులైన ఆయన ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, సహచరులందరిపై శాంతీ కారుణ్యాలుకురియుగాక! 

ఇక అసలు విషయానికి వస్తే…., 

ఏకదైవారాధన (తౌహీద్) ఇస్లాం ధర్మానికి పునాది. ఆధారం. మానవ హృదయాలకు జీవం. పరలోక ముక్తికి మార్గం. జీవితంలో దాన్ని పుణికిపుచ్చుకున్న మనిషి తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. పరలోకంలో అతనికి విచారణ అనేది ఉండదు. పోతే, తౌహీద్ విధానాన్ని లెక్క చేయకుండా అల్లాహు కు ఇతరుల్ని భాగస్వాములుగా నిలబెట్టినవారు ఖచ్చితంగా నరకానికి పోతారు. అందులో సందేహం అక్కర్లేదు. మనిషికి తౌహీద్ అవసరం అన్నపానీయాలకన్నా, గాలి నీరులకన్నా ఎక్కువ. 

సులభంగా బోధపడేందుకుగాను పండితులు తౌహీద్ ను మూడు భాగాలుగా విభజించారు: 

1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో (అస్మా వ సిఫాత్ లో) తౌహీద్,
2) ప్రభుత పరంగా (రుబూబియత్ లో ) తౌహీద్,
3) ఆరాధనలో (ఉలూహియత్ లో ) తౌహీద్ 

1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో తౌహీద్, అంటే అల్లాహ్ గురించిన పరిజ్ఞానంలో, అల్లాహ్ ను  గుర్తించటంలో ఏకదైవ భావనను కలిగివుండటం. దివ్యఖుర్ఆన్ మరియు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ప్రవచనాల్లో ప్రస్తావించబడిన విధంగా అల్లాహు కు అత్యుత్తమమైన పేర్లు, మహోన్నతమైన గుణవిశేషాలు ఉన్నాయని మనలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వాటితోనే మనం ఆయన్ని వేడుకుంటాము. ఎలాంటి అనుచిత వివరణలు ఇవ్వకుండా, మార్పులు చేర్పులు లేకుండా, వాస్తవాలకు విఘాతం కలగకుండా, స్థితిగతులను వివరించకుండా, పోలికలు సారూప్యతల జోలికి పోకుండా అల్లాహ్ నామాలను, గుణవిశేషాలను మనం సంపూర్ణంగా విశ్వసిస్తాము, ధృవపరుస్తాము. 

2) ఇక రుబూబియత్ లో  (ప్రభుత ప్రకారం) తౌహీద్. అల్లాహ్ కార్యాల్లోనూ, అల్లాహ్ చేతల్లోనూ అల్లాహ్ ఒకే ఒక్కడని నమ్మటమే ఈ తౌహీద్ ఉద్దేశం. అల్లాహ్ మాత్రమే ప్రభువు, సృష్టికర్త, యజమాని, ప్రదాత, జీవన్మరణాలకు అధిపతి, క్షమించేవాడు, కరుణ గలవాడు, ఈ విషయాలన్నిటిలో ఆయనకు మరో భాగస్వామి గాని, సహవర్తుడు గాని లేదు అని తౌహీద్లోని ఈ విభాగం చెబుతుంది. సృష్టిలోని అణువణువూ ప్రస్ఫుటం చేసే తౌహీద్ ఇది. సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ఈ తౌహీద్ నిశ్చలంగా ఉంటుంది. మనుషుల మతధర్మాలు వేరైనా, సంస్కృతీ నాగరికతలు విభిన్నమైనా అత్యంత సహజరూపంలో వారి ఉనికే ఈ తౌహీద్ ను చాటుతుంది. 

3) ఇక మిగిలింది ఆరాధన (ఉలూహియత్)లో తౌహీద్. ఇది దాసులు తమ కార్యాలను ఒకే దేవునికి అర్పించుకునే తౌహీద్. దీన్ని ఉద్దేశానికి, సంకల్పానికి సంబంధించిన తౌహీద్  గానూ చెప్పవచ్చు. ఆకాశం నుంచి గ్రంథాలు అవతరించటానికి గల లక్ష్యం ఇదే. లోకంలో ప్రవక్తలు ప్రభవించింది ఈ తౌహీద్ కోసమే. అసలు మనుషుల, జిన్నాతుల పుట్టుక పరమార్ధమే ఈ తౌహీద్. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: 

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!”  (సూరె జారియాత్ : 56) 

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ “తౌహీద్ పుస్తకం” గౌరవ విద్వాంసులు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్లాబ్ (రహిమహుల్లాహ్) రచించినది. ఆరాధనలోని తౌహీద్ గురించి సామాన్య ప్రజలకు తెలియజెప్పటానికి ఆయన ఈ పుస్తకం రాశారు. నాటి నుంచి నేటి దాకా ఎన్నో తరాలు ఈ పుస్తకం ద్వారా ప్రయోజనం పొందాయి. వివిధ భాషల్లో దీనికి అనువాదాలూ, తాత్పర్యాలూ రాయబడ్డాయి. 

నిన్న మొన్నటి దాకా మన తెలుగు జనావళికి ఇటువంటి పుస్తకం ఏదీ అందుబాటులో ఉండింది కాదు. ఎట్టకేలకు ఈ అవసరాన్ని గుర్తించిన గౌరవనీయులు అబ్దుర్రబ్ బిన్ షేఖ్ సిలార్ గారు అరబీ భాషలోని ఈ పుస్తకాన్ని సులభశైలిలో తెనుగీకరించటానికి పూనుకున్నారు. అల్లాహ్ దయవల్ల ఆయన ద్వారా ఈ కార్యం నెరవేరింది. అనంతరం ధార్మిక సోదరులు ఎస్. ఎమ్. రసూల్, షేఖ్ నసీరుర్రహ్మాన్, నేను ముగ్గురం ఈ పుస్తకాన్ని పునఃపరిశీలించి మూడవ ముద్రణకు పంపించాము. ఇప్పుడు ఈ పుస్తకం మునుపటి కన్నా శుద్ధంగా, సరికొత్తగా ప్రచురించబడుతోంది. 

రచయితకు, అనువాదకునికి, పరిశీలకులకు, ఇంకా ఈ సత్కార్యంలో పాలు పంచుకున్న వారందరికీ అల్లాహ్ ఇహపరలోకాల్లో ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటూ…… 

డా|| సయీద్ అహ్మద్ ఉమరి, మదనీ. 
జనరల్ సెక్రటరీ, 
మర్కజ్ దారుల్ బిర్, పెడన, 

పాఠము- 1 : ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْأِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించితిని.” (అజ్-జారియాత్-51:56) 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేసితిమి. ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు తాగూత్ (తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ఆరాధనకు తావివ్వకండని తెలుపుటకు.” (16:36) 

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا
నీ ప్రభువు నిర్ణయం చేసెను. మీరు కేవలం ఆయననే (అల్లాహ్) ఆరాధించండి మరియు తల్లిదండ్రులతో దయ, మర్యాదలతో వ్యవహరిం చండి అని.” (17:23) 

وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا
మరియు మీరంతా కేవలం అల్లాహ్ కు దాస్యము చేయండి మరియు ఆయనకు భాగస్వాములను కల్పించవద్దు.” (4:36) 

قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్‌ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.(అల్-అన్ ఆమ్-6:151) 

హజరత్ ముఆజ్ బిన్ జబల్ (రది యల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించెను: ఒకసారి నేను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇద్దరం ఒకే కంచర గాడిదపై ప్రయాణించుచుంటిమి. అప్పుడు దైవప్రవక్త నాతో ఈ విధముగా పలికెను: “ఓ ముఆజ్! అల్లాహ్ యొక్క హక్కు దాసులపై మరియు దాసులు హక్కు అల్లాహ్ పై ఏమిటో నీకు తెలుసునా?” జవాబుగా నేను “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసును” అని పలికితిని. అప్పుడు ప్రవక్త ఈ విధంగా తెలిపెను: “అల్లాహ్ హక్కు దాసులపై ఏమిటంటే, వారు ఒక్క అల్లాహ్ ఆరాధించాలి మరియు ఆయనకు సాటినిగాని లేదా భాగస్వాము లను గాని సృష్టించకూడదు. మరియు దాసుల హక్కు అల్లాహ్ పై ఏమిటంటే, ఏ దాసులైతే అల్లాహ్ కు సాటిని, భాగస్వామిని సృష్టించరో వారిని ఆయన శిక్షించకూడదు.” “నేను ఈ శుభవార్తను ప్రజలకు అందజేయనా?” అని నేను అడిగాను. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అన్నారు, “వద్దు. వారు దీనినే నమ్ముకుని కూచుండి పోగలరు. (బుఖారీ, ముస్లిం) 

దీనిలో 24 అర్థ తాత్పర్యములు గలవు 

1. జిన్నాతుల, మానవుల సృష్టికి కారణము తెలుపబడింది. 

2. ఆరాధన అంటే అసలు ఏక దైవారాధన. ఎందుకంటే ప్రవక్తలందరు 

తమ జాతులకు ఏక దైవారాధన గురించే ఉపదేశించారు. 

3. ఎవరైతే ఏకదైవారాధనకు కట్టుబడి ఉండరో, వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేయనట్లే. ‘కాఫిరూన్’ యొక్క ఆయత్ ప్రకారం, వేటినైతే మీరు ఆరాధిస్తున్నారో నేను వాటిని ఆరాధించువాణ్ణి కాదు (కాను).” (109-3) 

4. దీనితో ప్రవక్తలను ప్రభవింపజేయుటకు కారణము కూడా తెలియు చున్నది. 

5. అల్లాహ్ ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేసెను.

6. ప్రవక్తలందరి మతము ఒక్కటే. అది ఏక దైవారాధన. 

7. తాగూత్ (తమంతట తాము సృష్టించుకొన్న దేవతల)ను తిరస్కరించకుండా ఏక దైవారాధన సాధ్యము కాదు. 

8. “తాగూత్(తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ని తిరస్కరించి అల్లాహ్ నే విశ్వసించినవాడు సుస్థిరమైన, ఎప్పటికీ విడిపోని ఆశ్రయము పొందినవాడయ్యెను.” 

9. అల్లాహ్ ని తప్ప ఆరాధించబడేవి అన్నీ తాగూత్ అనబడును. 

10. అల్లాహ్ ఉపదేశించిన అతిముఖ్యమైన 10 ఉపదేశములలో ఏక దైవారాధన మరియు బహుదైవారాధన నిషేధం ప్రధానమైనవి. అల్లాహ్ ఖుర్ఆన్ (17:22)లో 18 ఉపదేశాలు తెలిపెను. వాటిలో మొదటిది మరియు చివరిది రెండూ కూడా బహుదైవారాధన నిషేధం గురించి తెలియ జేస్తున్నాయి. “ఇవి వివేకముతో నిండివున్న విషయములు. వీటిని నీ ప్రభువు నీ వైపునకు అవతరింపజేసెను.” (బనీ ఇస్రాయీల్-17:39). 

11. అల్లాహ్ ఖుర్ఆన్ లో తెలిపిన 10 ఉపదేశాలలోని ప్రధాన ఉపదేశం: “మీరు కేవలం ఒక్క అల్లాహ్క దాస్యం చేయండి. ఆయనకు భాగస్వాములను కల్పించకండి.” (అన్ నిసా- 4:36) 

12. ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఉపదేశించిన బోధనలు కూడా తెలుప బడ్డాయి. 

13. మనపై అల్లాహ్ కు ఉన్న హక్కు తెలుపబడింది. 

14. దాసులు అల్లాహ్ యొక్క హక్కు నెరవేర్చినప్పుడు, అల్లాహ్ పై దాసులకు ఉన్న హక్కు తెలుపబడింది. 

15. హదీసుల్లో తెలుపబడిన విషయాలు చాలా మంది అనుచరులకు తెలియవు. 

16. ఏదైనా అవసరాన్నిబట్టి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చును. 

17. ఎవ్వరికైనా మంచి వార్త తెలుపటం సున్నత్. 

18. అల్లాహ్ యొక్క దయాకరుణలను దృష్టిలో ఉంచుకొని మంచి పనులను ఆచరించడంలో నిర్లక్ష్యము చేయరాదు. 

19. మనకు తెలియని విషయాల పట్ల “అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కే బాగా తెలుసు” అనాలి. 

20. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు కొంత మందికే తెలియజేయ వచ్చును. మరికొందరికి తెలుపకుండా ఉండవచ్చును. 

21. ఈ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  యొక్క నిరాడంబరత మరియు సుహృ ద్భావము గోచరిస్తోంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అతి పెద్ద హోదాగల వారై నప్పటికీ కంచర గాడిదపై ప్రయాణించెను. ఒక సాధారణ వ్యక్తిని కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొనెను.

22. వాహనంపై వేరే వ్యక్తిని కూర్చోబెట్టుకోవచ్చును. 

23. ఈ హదీసు ద్వారా ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది. 

24. ఈ హదీసు ఏక దైవారాధన యొక్క విశిష్టతను తెలుపుతుంది. 

పాఠము-2 : ఏక దైవారాధన ప్రాముఖ్యత, సకల పాపసంహారిణి 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا اِيْمَانَهُمْ بِظُلْمٍ أُولَيكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُهْتَدُونَ 

“వాస్తవంగా విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి. వారే ఋజుమార్గంపై ఉన్నారు.” (అల్ అన్ ఆమ్- 6:82) 

హజరత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించారు. “ఎవరైతే ఈ విషయాలను నమ్మి సాక్ష్యమిస్తారో: అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటిగానీ భాగస్వాములు గానీ లేరు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆయన యొక్క దాసుడు, ప్రవక్త. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా ఆయన దాసుడు, ప్రవక్త. అల్లాహ్ యొక్క వాక్కు దానిని ఆయన మరియం అలైహస్సలాంకు అనుగ్రహించెను మరియు ఆయన అల్లాహ్ అనుగ్రహించిన ప్రాణం అని మరియు స్వర్గ నరకములు అక్షర సత్యాలని నమ్మి సాక్ష్య మిచ్చునో, వారిని అల్లాహ్ స్వర్గములో (ఎప్పటికైనా) ప్రవేశింపజేస్తాడు. అతని ఆచరణ ఎలాంటిదైనాసరే.” (బుఖారీ, ముస్లిం) 

హజరత్ ఉత్బాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందుటకు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు) అని విశ్వసించి సాక్ష్యమిస్తారో, అల్లాహ్ వారికొరకు నరకాన్ని నిషేధిస్తాడు. (బుఖారీ, ముస్లిం) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా ప్రబోధించారు: “ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఈ విధముగా విన్నవించెను. ఓ నా ప్రభూ! నాకు కొన్ని అతి ఉత్తమమైన వాక్యములు నేర్పుము. వాటితో నేను నిన్ను స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటాను. దానికి అల్లాహ్ ఈ విధముగా ఉద్బోధించెను: “ఓ మూసా! లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించి, స్మరించుము.” మూసా అలైహిస్సలాం ఈ విధముగా పలికెను: ఓ అల్లాహ్! నీ దాసులందరూ ఈ స్తోత్రములు స్మరించు చున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను. ఓ మూసా! సప్త భూమ్యాకాశాలు త్రాసులోని ఒక పళ్ళెంలో ఉంచి ఈ స్తోత్రాన్ని వేరే పళ్ళెంలో ఉంచిన ఎడల “లా ఇలాహ ఇల్లల్లాహ్” వాటన్నిటికంటే భారము కలది అగును. (ఇబ్నె హిబ్బాన్, హాకిం-సహీ సనద్) 

సునను తిర్మిజీలో హసన్ సనద్ హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశిస్తుండగా విన్నాను: అల్లాహ్ ఈ విధంగా ప్రబోధించెను “ఓ ఆదం కుమారుడా! నీవు నా వద్దకు భూమి నిండునంతటి పాపములతో వచ్చినా, నీవు ఆరాధనలో నాకు భాగస్వాములను కల్పించక వచ్చిన ఎడల నేను నిన్ను నా దయాదాక్షిణ్యాలతో క్షమించివేయగలను.” 

దీనిలో 20 అర్థ తాత్పర్యములు కలవు 

1. అల్లాహ్ అమిత కరుణామయుడు. 

2. అల్లాహ్ దృష్టిలో ఏకదైవారాధన ప్రధాన పుణ్యకార్యము. 

3. ఏకదైవారాధన పుణ్యకార్యమే కాకుండా పాపములను కూడా పరిహరించును. 

4. ఖుర్ఆన్లోని ఆయత్ (6:82) లో ‘జులుం’ అంటే అర్థం బహుదైవారాధన.

5. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు మరియు ఉత్బాన్ రదియల్లాహు అన్షు యొక్క రెండు హదీసులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల ఏక దైవారాధన యొక్క అర్థం స్పష్టంగా తెలియును. అంతే కాకుండా ఒట్టి నోటి మాటతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన స్వర్గ ప్రవేశము లభించుననుకోవటం పొరపాటని తెలియగలదు. 

6. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు తెలిపిన హదీసులోని 5 ఉపదేశములను క్షుణ్ణంగా పరిశీలించి ఆచరించవలెను.

7. హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్హు యొక్క హదీసులోని మాటలను క్షుణ్ణంగా పరిశీలించ వలయును.

8. ప్రవక్తలు కూడా స్తోత్రం తెలుసుకోవలసిన అవసరం కలిగివున్నారు. ఈ వాస్తవం కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

9. “లా ఇలాహ ఇల్లల్లాహ్” సప్త భూమ్యాకాశాల కంటే బరువైనప్పటికీ ఈ కలిమ చదివే వారి చాలా మంది పళ్ళెములు తేలికగా ఉండును.

10. దీని ద్వారా 7 ఆకాశాలే కాకుండా భూములు కూడా 7 ఉన్నట్లు తెలియు చున్నది. 

11. భూమ్యాకాశాలలో జీవరాశులు ఎన్నో జీవించుచున్నవి. 

12. అల్లాహు కు సాటిలేని ‘సిఫాత్'(గుణములు) ఉన్నట్లు తెలుస్తుంది. 

13. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్షు ఉల్లేఖించిన హదీసులోని “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క అర్థం బహుదైవారాధన ను పూర్తిగా విడనాడాలని స్పష్టం అగుచున్నది. 

14. ఈ విషయం కూడా గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఈసా అలైహిస్సలాం ఇద్దరినీ దాసులుగానూ, ప్రవక్తలుగానూ సంబోధించ బడింది. 

15. ప్రతివస్తువు అల్లాహ్ చే అనుగ్రహించబడినది. అదే విధముగా హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అల్లాహ్ అనుగ్రహింపబడెను.

16. ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించును. కాబట్టి హజరత్ ఈసా అలైహిస్సలాం యొక్క ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించెను

17. స్వర్గ నరకములపై విశ్వసించవలసిన ఆవశ్యకత తెలుపబడెను. 

18. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు ద్వారా, స్వర్గప్రవేశమునకు ఏకదైవారాధన నిబంధన అవసరమని తెలియ వస్తున్నది.

19. ప్రళయదినంనాడు మన అందరి పాప పుణ్యకార్యములు తూచబడును

20. ఈ హదీసులో అల్లాహ్ యొక్క ‘ముఖము’న్నదని తెలుపబడెను. కాని అది ఎట్లు ఉండును అనునది మనకు తెలుపబడలేదు అని నమ్మవలెను.

పాఠము-3 : ఏకదైవారాధకుడు విచారణ లేకుండానే స్వర్గమున ప్రవేశించును 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా పేర్కొనెను. 

ان ابراهيمَ كَانَ أَمَةً قَانِتَا لِلَّهِ حَنِيفًا، وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَة 

“నిశ్చయంగా ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం ప్రజలకు మార్గదర్శి. అల్లాహ్ యొక్క అమిత విధేయుడు. ఎప్పటికీ ఆయన పైనే మనస్సు నిలిపి యుండెను. ఆయన ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదు.” (~5-35-16:120) 

والَّذِينَ هُمْ بَرَتِهِمْ لَا يُشْرِكُونَ : ) 

“నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములు కల్పించరో వారే విశ్వాసులు.”(అల్-మోమినూన్-23:59) 

హుసైన్ బిన్ అబ్దుర్రహ్మాన్ రహమతుల్లాహి అలైహ్ ఈ విధంగా తెలిపెను: నేను ఒకసారి సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి దగ్గర హాజరై ఉంటిని. ఆయన “మీలో రాత్రి వ్రాలుతున్న నక్షత్రాన్ని ఎవరు తిలకించితిరి?” అని ప్రశ్నించెను. అప్పుడు “నేను తిలకించితినని” జవాబు పలికితిని. ఇంకా ఈ విధంగా విశదీకరించితిని. “నేను ఆ సమయంలో ప్రార్థనలో లేకుంటిని. ఆ సమయాన విషపురుగు యొక్క కాటుకు గురియై ఉంటిని.” అప్పుడు జుబైర్ “మరి, ఏమి చేసితివని” ప్రశ్నించెను. “నేను స్తోత్రము పఠించితిని” అని జవాబు ఇచ్చితిని. మరల ఆయన “అలా ఎందుకు చేశావు” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షాబిరహమతులాహి అలైహి ఒక హదీసు తెలిపెను. అందుచే నేను స్తోత్రము పఠించితిని (దమ్ చేసితిని)” అని వివరించితిని. మరల సయీద్ బిన్ జుబైర్ “షాబి రహమతుల్లాహి అలైహి మీకు ఏమి తెలిపెను?” అని ప్రశ్నించెను. 

నేను జవాబుగా ఆయన మాకు బురైదా బిన్ హాసైబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీసు తెలిపెను. “చెడు చూపు (దిష్టి) మరియు విషపురుగు కాటుకు తప్ప ఎట్టి పరిస్థితిలోను రుఖయ (స్తోత్ర పఠనము) చేయకూడదు.” అప్పుడు సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి మీరు ఆలకించి అమలు పరచినది సరియైనదే కావచ్చు, కాని మాకు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా జగత్ ప్రవక్త యొక్క ఈ హదీసును తెలిపిరి : 

నాకు చాలా మంది ప్రవక్తల అనుచరులను చూపబడెను. కొంతమంది ప్రవక్తలతో ఎక్కువ అనుచరులు ఉండిరి. మరి కొంతమంది ప్రవక్తలతో పాటు ఒకళ్ళిద్దరు అనుచరులు ఉన్నారు. నేను ఒక్క అనుచరుడు కూడా లేని ప్రవక్తను చూసితిని (తిలకించితిని). అంతలో నేను ఒక పెద్ద కూటమి (గుంపు) ని చూసి వీరు నా అనుచరులు అనుకొంటిని. కానీ వారు ప్రవక్త మూసా మరియు వారి అనుచరులని తెలుపబడెను. వారిలో 70 వేల మంది ఎలాంటి లెక్క, ఏ విధమైన శిక్షకు గురి కాకుండా స్వర్గమున ప్రవేశించుదురు అని పలికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు అనుచరులు 70 వేల మంది ఎవరై ఉంటారా అని ఆలోచనలో నిమగ్నులై ఉండిరి. మరల ప్రవక్త విచ్చేసినప్పుడు అనుచరులు ఆయనను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సంబోధించెను: 

“ఎవరైతే మంత్రదండనలు చేయరో, వైద్యము కొరకు వాతలు పెట్టించు కొనరో, జ్యోతిష్యము, హస్తసాముద్రికము, వాస్తులను నమ్మక ఒక్క అల్లాహ్ నే విశ్వసించి శిరసావహిస్తారో వారే!” ఇది విని ఉక్కాషా బిన్ ముహ్సన్ రదియల్లాహు అన్హు లేచి నిలబడి ఈ విధంగా పలికెను. “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను వారిలో ఒకణ్ణి చేయమని ప్రార్థించండి.” అప్పుడు ప్రవక్త, “మీరూ వారిలో ఒక్కరు” అని పలికెను. అంతలో వేరే వ్యక్తిలేచి నిలబడి, “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను కూడా వారిలో చేర్చమని ప్రార్థించండి”అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త అన్నారు, “ఉక్కాషా నీకంటే ముందే ఈ ప్రార్ధనను సొంతం చేసుకున్నాడు.” (దీనిని బుఖారి, ముస్లిం, తిర్మిజీ, నసాయి పొందుపరిచెను.) 

దీనిలో 22 అర్థ తాత్పర్యములు కలవు 

1. ఏకదైవారాధన విషయంలో జనుల స్థితిలో మార్పు కలదు.

2. అల్లాహ్ ఏకత్వంపై ఎలా అమలు చేయవలెనో తెలిసినది. 

3. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదని 

అల్లాహ్ యే స్పష్టముగా చెప్పెను. 

4. ఏ దైవప్రవక్త కూడా బహుదైవారాధనకు పూనుకోలేదని, ప్రవక్తలందరూ బహుదైవారాధనను నిరసించినట్లుగా అల్లాహ్, స్పష్టపరిచెను.

5. మంత్ర పఠనం, వాతలు పెట్టించుకోవటం వంటి పనులకు దూరంగా ఉండుట ఏకదైవారాధనలో అతి ప్రాముఖ్యము గలవి.

6. ఇటువంటి మూఢ నమ్మకములను నిరాకరించుటయే నిజంగా అల్లాహ్ పై నమ్మకము కలిగియున్నట్లు.

7. దీనిలో ప్రవక్త అనుచరులు యొక్క విద్యలో గల నైపుణ్యం కూడా అగుపడు తుంది. ఇటువంటి అతి ఉత్తమ స్థానము వారు వారి పుణ్యకార్యముల వలన పొందగలిగారు. 

8. దైవప్రవక్త అనుచరులు పుణ్యకార్యాలు చేయుటలో ఎలా ముందుండే వారో అర్థం అవుతుంది. 

9. చివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు అందరికంటే అధికులు మరియు ఉత్తములు. 

10. ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క ఘనత కూడా తెలుస్తోంది. 

11. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఇతర ప్రవక్తలందరి అనుచరులు చూపబడెను. 

12. ప్రతి సంతతినీ వారి వద్దకు పంపబడిన ప్రవక్తతో పాటు ప్రళయదినాన వేరువేరుగా హాజరుపరచబడును. 

13. ప్రవక్తల హితబోధనలను ప్రతి జాతిలోను చాలా తక్కువ మంది స్వీకరించిరి. 

14. కొంతమంది ప్రవక్తల హితబోధనలను ఎవ్వరూ స్వీకరించలేదు. 

15. ఎక్కువ అనుచరులున్నారని గర్వపడకూడదు. తక్కువ అనుచరులున్నారని బాధపడకూడదు. 

16. చెడు చూపు(దిష్టి) మరియు విష పురుగుల కాటుకు మాత్రం స్తోత్ర పఠనం చేయవచ్చును.

17. సయీద్ బిన్ జుబైర్ వాక్కుతో “సలఫె సాలిహీన్” యొక్క దైవజ్ఞానము కానవస్తుంది. మొదటి హదీసు, రెండవ హదీసుకు వ్యతిరేకం కాదు.

18. సలపె సాలిహీన్ ఒక మనిషిలో లేని సద్గుణం గురించి పొగడటానికి దూరంగా ఉండేవారు. 

19. దైవప్రవక్త, హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు ను “నీవు వారిలో ఒకడివి” అనుట దైవప్రవక్త సూచనలలో ఒకటి. 

20. దీని ద్వారా హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్షు యొక్క విశిష్ఠత బోధపడుతుంది.

21. ఏదైనా తెలియని విషయం గురించి మనం చర్చించుకోవచ్చును. 

22. హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు తర్వాత ప్రార్ధన కొరకు కోరిన వ్యక్తిని ఉత్తమ రీతిలో కూర్చోబెట్టుటలో ప్రవక్త యొక్క సుహృద్భావము కానవస్తుంది. 

పాఠము-4 : బహుదైవారాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధంగా ప్రబోధించెను: 

اِنَّ اللهَ لا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ ، وَمَن يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَ إِثْمًا عَظِيمات 

“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని(షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరినవారి పాపాలను క్షమించగలడు. అల్లాహ్ కు భాగస్వామ్య కల్పన చేసినవాడు ఘోరమైన అబద్ధమును కల్పించాడు” (4:48) 

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ విధంగా ప్రార్థించెను. 

وَاجْنُبْنِي وَبَنِى أَن نَّعْبُدَ الْأَصْنَامَة 

“(ఓ ప్రభువా) నన్ను మరియు నా సంతతిని విగ్రహారాధన నుండి రక్షించుము.” (14: 35) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించెను: 

“మీరు చిన్నషిర్క్క పాల్పడగలరని నాకు చాలా భయముగా ఉన్నది.” చిన్న షిర్క్క పాల్పడటం అంటే ఏమిటని ప్రశ్నించగా ఆయన “ఎదుటివాడు చూసి మెచ్చుకొనేందుకు చేయు పుణ్యకార్యములు” అని పలికెను. (ముస్నదె అహ్మద్-5:428-429) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను. 

“ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి.” (బుఖారీ) 

హజరత్ జాబిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించెను: 

“ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించ కుండా మరణిస్తాడో అతడు స్వర్గమున ప్రవేశించును. ఏ వ్యక్తి అయితే అల్లాహు ఆరాధనలో భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి. (ముస్లిం)

దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు. 

1. అల్లాహు సాటిగానీ, భాగస్వాములనుగానీ సృష్టించుటకు భయపడ వలెను. 

2. ఎదుటి వారు చూసేందుకు పుణ్యకార్యములు చేస్తే అల్లాహు భాగస్వాములను కల్పించినట్లే. 

3. ప్రదర్శనా బుద్ధితో మంచి పనులు చేసినట్లయితే స్వల్ప షిర్క్క పాల్పడినట్లే. 

4. పుణ్యాత్ముల విషయంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రదర్శనాబుద్ధి లాంటి చిన్న తరగతి షిర్క్క సంబంధించి భయపడవలసి ఉంటుంది. 

5. స్వర్గము మరియు నరకము మానవునికి సమీపములో ఉన్నవి. 

ఒకే హదీసులో స్వర్గ నరకముల గురించి విశదీకరింపబడెను. 

6. ప్రపంచంలో మనుగడ సాగించినంత కాలం ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించనివాడు స్వర్గమున ప్రవేశింపబడును.

7. ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తాడో అతడు నరకమున ప్రవేశించును. అతడు ఎంతటివాడైనా సరే. 

8. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనను, తన సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ ని వేడుకొనుటలో ఒక పెద్ద ఉపదేశము కలదు. 

9. “ఓ అల్లాహ్! ఈ విగ్రహాల వలన చాలా మంది మార్గభ్రష్టులైనారు” అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పలికెను. (ఖుర్ఆన్-14:36) అందువల్ల తనను, తన సంతతిని విగ్రహారాధన నుండి రక్షించమని అల్లాహ్ ని వేడుకొనెను. 

10. పైన తెలిపిన ఖుర్ఆన్ వాక్యాలు మరియు ప్రవక్త హదీసుల ద్వారా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ కి అర్థం క్షుణ్ణంగా తెలుపబడెను. 

11. “షిర్క్” నుండి రక్షించబడిన వాని ఘనత. 

పాఠము- 5 : “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితబోధ చేయుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించెను: 

قُلْ هَذِهِ سَبِيلِ اَدْعُوا إِلَى اللهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي وسبحن الله وَمَا أَنَا مِنَ المُشْرِكِينَ . 

(ఓప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి: “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను, అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించే(షిర్క్ చేసే) వారిలోని వాణ్ణి కాను.”(యూసుఫ్-12:108) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ ముఆజ్ రదియల్లాహు అన్హుని ‘యెమన్’ ప్రదేశానికి సాగనంపుతూ ఈ విధముగా ఉద్బోధన చేసెను: 

“నీవు గ్రంథ ప్రజల (క్రైస్తవుల) వైపుకు పయనించుచున్నావు. నీవు వారిని అన్నిటికంటే ముందు ఏకదైవారాధన చేయవలెనని ఆహ్వానించు. వారు నీ మాటను అంగీకరించిన పక్షములో వారికి అల్లాహ్ ఒక రోజులో 5 పూటల నమాజు (ప్రార్థన) ఆచరించుటకు ఆజ్ఞాపించెనని తెలుపు. వారు దీనికి కూడా అంగీకరిస్తే తర్వాత అల్లాహ్ ‘దానధర్మం’ (జకాత్) విధి కావించెనని వారికి తెలుపుము. అది వారిలోని ధనికుల దగ్గర నుండి సేకరించబడి, వారిలోని బీదవారికి పంచబడును. వారు వీటిని స్వీకరించిన పక్షములో వారి యొక్క మంచి వస్తువులను అర్థించకుము. దౌర్జన్యము చేసి వారి శాపమునకు గురికాకుము. ఎందుకంటే దౌర్జన్యము చేయబడిన వారి ప్రార్థనకు మరియు అల్లాహ్ కు మధ్య అడ్డు ఏదీ లేదు.” 

హజరత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్షు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“ఖైబర్ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా సంబోధించెను: “రేపు నేను మీలోని ఒక వ్యక్తి చేతికి జెండా ఇస్తాను. అతడు అల్లాహ్పట్ల ప్రవక్త పట్ల అమిత ప్రేమ కలవాడు. అల్లాహ్ మరియు ప్రవక్త కూడా అతనిని ప్రేమిస్తున్నారు. అతని చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని కల్పిస్తాడు.” అప్పుడు జెండా ఎవరి చేతికి ఇవ్వబడుతుందోనని అనుచరులు ఊహించసాగిరి. మరుసటి రోజు అలీ (రదియల్లాహు అన్హు) పిలువబడెను. అతని యొక్క కళ్ళు సరిగా లేకుండెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉమ్మిరాసి దుఆ చేయగా ఆయన కళ్ళు సరయ్యెను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ అలీ (రదియల్లాహు అన్షుకు ఈ విధముగా ఉద్బోధించెను: “శాంతముగా బయలుదేరి వెళ్ళుము. ఖైబర్ చేరి అన్నిటికంటే ముందు వారికి ఏకదైవారాధన గురించి తెలియజేయుము. అల్లాహ్ యొక్క ఆజ్ఞలను కూడా వారికి తెలుపుము. వారిలో ఒకళ్ళయినా నిజాన్ని స్వీకరించినచో అది మీకు ఎరుపు ఒంటే కంటే ఉత్తమమైనది.” 

దీనిలో 30 అర్థ తాత్పర్యములు కలవు 

1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు కూడా ప్రజలను అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవారు. 

2. ప్రదర్శనా బుద్ధితో చేయు పనుల వల్ల పుణ్యఫలం లభించదని అర్థమవుతుంది. 

3. ప్రజలను ఏకదైవారాధన వైపు పిలుచునప్పుడు మంచిగా ఉద్బోధించ వలెను. 

4. ఉత్తమ ఏకదైవారాధన ఏమనగా అల్లాహ్ కు ఎలాంటి లోపాలు లేవని అంగీకరించుట. 

5. బహుదైవారాధన చేయటమంటే, అల్లాహ్ ను కించపరచటమే. ఇంకా ఆయనకు భాగస్వాములున్నారని భావించుట.

6. బహు దైవారాధకులకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకత. 

7. ఇస్లాంకు ప్రధాన మూలాధారం ఏక దైవారాధన. 

8. జనులకు ఉద్బోధన ఏకదైవారాధనతో ప్రారంభించవలెను. 

9. అల్లాహ్ ను తప్ప ఎవరినీ ఆరాధించకూడదన్నా, ఏకదైవారాధన అన్నా ఒకే అర్థము. 

10. కొంత మందికి దైవగ్రంథము ఇవ్వబడినప్పటికీ, వారు ఏకదైవారాధన కు ప్రాముఖ్యత ఇవ్వలేదు.ఏక దైవారాధనయే సరియైనదని గ్రహించి కూడా వారు ఆచరణశీలురు కాలేదు. 

11. ఏకదైవారాధన గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపవలెను.

12. అన్నిటికంటే ముందు ప్రధాన అంశములు తెలుపవలెను. 

13. దీనిలో ‘విధి దానం’ (జకాత్) యొక్క లక్ష్యము కూడా తెలుపబడెను.

14. తెలుసుకోగోరిన వారికి, వాళ్ళ అనుమానాలను పోగొట్టవలెను.

15. ‘విధిదానం (జకాత్)లో మంచి ఆభరణములు తీసుకోకూడదు. వేటినైతే ఇస్తారో వాటినే తీసుకోవలెను. 

16. దౌర్జన్యము చేసి బాధింపబడ్డ వ్యక్తి శాపమునకు గురికాకుము. 

17. దౌర్జన్యము చేయబడిన వ్యక్తి యొక్క శాపమును అల్లాహ్ వెంటనే స్వీకరించును. 

18. దైవప్రవక్తలు మరియు వారి అనుచరులు ఇహలోకంలో కష్టములకు గురిచేయబడుటకు కారణం వారు ప్రజలను ఏకదైవారాధన వైపుకు ఆహ్వానించుటయే. 

19. దైవప్రవక్త, “రేపు నేను జెండా అలాంటి వ్యక్తికి ఇస్తాను ఎవరైతే…” అనటం 

ఆయన దైవప్రవక్త అగుటకు ఒక చిహ్నం. 

20. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళను నయపరచుట ఆయన దైవప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

21. దీనిలో అలీ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. 22. అనుచరులు ఆలోచనలో నిమగ్నులయిరి. 

23. దీనితో మంచి చెడుల విధిరాతపై కూడా విశ్వాసము కలుగును. ఏదైనా మనం కోరుకున్నట్లు కాక అల్లాహ్ నిర్ణయం ప్రకారం జరుగును.

24. శాంతముగా పయనించుము అని అలీ (రదియల్లాహు అన్హు)కు బోధించుట. 

25. ప్రతి పనికి ముందు ఇస్లాం వైపు ఆహ్వానించ వలయును. 

26. ఎట్టి పరిస్థితులలోను ఇస్లాం గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపుతూ ఉండవలెను. 

27. ఇస్లాం గురించి మంచిగా సామరస్యంతో బోధించవలెను. 

28. ఇస్లాం స్వీకరించిన పిదప అల్లాహ్ ఆజ్ఞలను క్షుణ్ణంగా తెలుసుకోవలెను. 

29. ఏ వ్యక్తి ద్వారా అయినా కనీసం ఒక్క వ్యక్తి అయినా మార్గ భ్రష్టతను విడనాడి దైవమార్గము స్వీకరించిన ఎడల అది ఎంతో ఉత్తమము. 

30. ఫత్వా: ఏదైనా ప్రశ్నపై సరైన జవాబిచ్చినప్పుడు ప్రమాణము చేయ వచ్చును. 

పాఠము-6 : తౌహీద్ మరియు కలిమయె తౌహీద్ ధృవీకరణల సారాంశం 

అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

أو ليك الذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إلى رَبِّهِمْ الوَسيلَةَ أَنهم اَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ 

عذابه اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَعْدُورًا ) 

“వీరు ఎవరినైతే (అల్లాహ్ ను  కాకుండా) ఆరాధిస్తున్నారో వారే అల్లాహ్ యొక్క సాన్నిధ్యం పొందుటకు ప్రయత్నిస్తుంటారు. ఒకరితో ఒకరు పోటీపడి ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షకు భయపడుచున్నారు. నిశ్చయముగా నీ ప్రభువు యొక్క శిక్ష భయపడ దగినటువంటిదే.” (బనీ ఇస్రాయీల్-17:57) 

وَإِذْ قَالَ ابْراهِيمُ لأَبِيهِ وَقَوْمِة انتي برام تما 

اِنَّنِي 

تَعْبُدُونَ الَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِيْنِ . 

وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ) 

“ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం తన తండ్రిని, తన జాతిని ఉద్దేశించి ఈ విధముగా పలికెను: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ విధమైన సంబంధములేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే కలిగియున్నది. ఆయనే నన్ను సన్మార్గమున నడుపును.” ఇబ్రాహీం ఈ వచనాన్నే తన వెనుక తన సంతానము కొరకు విడిచి వెళ్ళెను. వాళ్ళు అనుసరించగలరని. (అజ్-జుబ్రుఫ్-43:26-28) 

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّنْ دُونِ الله 

“వారు అల్లాహ్ ను విడిచి తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసికొనిరి.” (అత్-తౌబా-9:31) 

وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ 

انْدَادًا يُحِبُّونَهُمْ كَحُبّ الله 

“మరి కొందరు అల్లాహు భాగస్వాములను కల్పించి వారిని అల్లాహు అభివర్ణించే విధంగా అభివర్ణిస్తారు, ప్రేమించే విధంగా ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అల్లాహ్ నే అమితంగా ప్రేమిస్తారు.” (2:165) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు: “ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ను నమ్మి సాక్ష్యమిచ్చి, బహు దైవారాధనను నిరాకరించారో వాళ్ళ జీవితము ధన్యమైనది. అటువంటివారి ఆచరణ అల్లాహ్ చూచుకొనును.” 

దీనిలో 6 అర్థ తాత్పర్యములు కలవు 

1. అతి ముఖ్యమైన విషయం ఏకదైవారాధన. దాని అర్థం స్పష్టముగా తెలుపబడినది.

2. అల్లాహ్ ను విడిచి వేరే వారిని వేడుకొనుటయే బహుదైవారాధన, 

3. గ్రంథప్రజలు అల్లాహ్ ను వదిలి తమ మత గురువులను ఆరాధించే వారు కాదు. కేవలం వారు చూపిన వక్ర కార్యములను అనుసరించే వారు. అంటే అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరి ఆజ్ఞలను శిరసావహిస్తారో వారిని ఆరాధించినట్లు. 

4. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) తిరస్కారులను ఉద్దేశించి పలికిన వచనములు: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు సంబంధము లేదు. నా సంబంధము నన్ను సృష్టించిన అల్లాహ్ తోనే” అని. స్పష్టంగా కల్పిత దేవుళ్ళను నిరాకరించి, తనను సృష్టించిన అల్లాహ్ నే ఆరాధించటం చిత్త శుద్ధితో కూడుకున్న పని అని విశదీకరించెను. ఈ విధమైన స్పష్టమైన 

 ఏకదైవారాధననే ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన సంతతికి ఉద్బోధించి వెళ్ళెను. బహుశా వారు అనుసరించ గలరని. 

5. అల్లాహ్ ఖుర్ఆన్ తిరస్కారుల గురించి ప్రస్తావిస్తూ, వారు నరకము నుండి విముక్తి చెందలేరని తెలిపెను. వారు కల్పిత భాగస్వాములను అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించుచున్నారు. దీనితో అర్థం అయ్యే దేమనగా బహుదైవారాధకులు కూడా సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించి, ఆయనకు భాగస్వాములను కూడా కల్పించేవారు. అందుచే అల్లాహ్ ను విశ్వసించినప్పటికీ అల్లాహు భాగస్వాము లను కల్పించుట ద్వారా వారు నరక వాసుల య్యారు. అందుచే ఒక్క అల్లాహ్ నే ఆరాధించవలెను. ఆయనకు భాగస్వాములను కల్పించకుండా ఉన్నప్పుడే అల్లాహ్ విధేయులము కాగలము. లేనిచో నరకము నుండి విముక్తి అసంభవము. 

6. బహుదైవారాధనను ధిక్కరించకుండా కేవలం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన ఒక వ్యక్తి అల్లాహ్ విధేయుడు (ముస్లిం) కాలేడని హదీసులో స్పష్టముగా తెలుపబడింది. 

పాఠము-7 : కష్టనష్టాల విముక్తికి తాయత్తులు, దారాలు, రక్షరేకులు ధరించుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను. 

قُلْ أَفَرَعَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ إِنْ أَرَادَ نِيَ اللهُ بصْرِهَل هُنَّ كَشِفْتُ صُرَةٍ اَوْ اَرَادَنِي بِرَحْمَةٍ هَل هُنَّ ملَتْ رَحْمَتِهِ قَلْ حَسْبِيَ اللهُ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكَّلُونَ . 

“ఓ ప్రవక్తా! వారిని ఉద్దేశించి పలుకుము. ఒకవేళ అల్లాహ్ నన్ను దండించదలచిన ఎడల అల్లాహ్ ని కాదని మీరెవరినైతే ఆరాధిస్తున్నారో వారు నన్ను రక్షించగలరా? లేదా అల్లాహ్ నన్ను కరుణించదలచినచో వీరు అల్లాహ్ కరుణను అడ్డుకొనగలరా? మీరే ఆలోచించండి. నాకు అల్లాహ్ ఒక్కడే చాలని చెప్పండి, నమ్ముకునే వారు ఆయన్నే నమ్ముకుంటారు.”(అజ్-జుమర్-39:38) 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఒక వ్యక్తి తన చేతిలో ఇత్తడి కడియాన్ని తొడిగి ఉండటం చూసి, ఇది ఏమిటని ప్రశ్నించెను. ఆ వ్యక్తి ఇది ‘వాహినా’ (బలహీనత) కారణముగా తొడిగితిని అని జవాబు పలికెను. అప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  దీనిని తీసివేయి. అది(నీకు ఏమీ లాభము చేకూర్చదు) నిన్ను ఇంకా బలహీనపరుస్తుంది. అది తొడిగి ఉండగా నీకు మరణము సంభవిస్తే నీవు మోక్షము పొందలేవు” అని అన్నారు. (ముస్నద్ అహ్మద్-సహీసనద్) 

హజరత్ ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “తాయత్తులు ధరించే వారి కార్యములను అల్లాహ్ పూర్తి చేయకుండుగాక! గవ్వలు వ్రేలాడదీసే వారికి అల్లాహ్ శాంతినివ్వకుండుగాక! (ముస్నద్ అహ్మద్) 

“తాయత్తులు వ్రేలాడదీసే వారు అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించిన వారే.”  (ముస్నద్ అహ్మద్) 

ఇబ్నె అబీ హాతిం హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు గురించి ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయన ఒక వ్యక్తి చేతికి అనారోగ్య కారణంగా తాడు కట్టబడి ఉండుట చూచెను. ఆయన దానిని త్రెంచి వేసి ఖుర్ఆన్లోని ఈ ఆయత్పఠించెను. 

وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللهِ اِلَّا وَهُمْ مُّشْرِكُونَ . 

“అల్లాహ్ ని విశ్వసించిన వారిలోని అధికులు భాగస్వాములను కూడా కల్పిస్తూ ఉంటారు.” (యూసుఫ్-12:106) 

దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు 

1.తాయత్తులు లేదా ఏవైనా వస్తువులు ధరించుట నిషిద్ధము.
2. ప్రవక్త సహచరుడైనా తాయత్తులు ధరించి మరణించిన ఎడల మోక్షము పొందలేరు. ” చిన్న తరగతి షిర్క్ ఘోరపాపాల కన్నా అతిఘోరమైనది” అన్న దైవప్రవక్త సహచరుల మాటకు ఈ హదీసు సాక్ష్యం (సమర్ధన) లభిస్తోంది.
3. తెలియక చేసినప్పటికీ మోక్షము లభించదు. 

4. ఈ వస్తువులు ఇహలోకములో కూడా లాభదాయకంకావు. పైగా నష్టం కలిగిస్తాయి. ఎందుకంటే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “అది నిన్ను ఇంకా బలహీన పరుస్తుంది” అన్నారు. 

5. ఇలాంటి వక్ర ఆచరణలు చేయువానిని గట్టిగా వారించవలెను. 

6. ఎవరైతే ఏ వస్తువు వ్రేలాడదీయునో దానికి అప్పజెప్పబడును. 

7. తాయత్తులు ధరించేవారు అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించినవారే. 

8. జ్వరం వచ్చినా తాళ్ళు కట్టుట నిషిద్ధం. 

9. హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క వచనం ప్రకారం- ‘షిర్కె అక్బర్ ‘కు సంబంధించిన ఆయతు ‘షిర్కె అస్గర్ ‘కి కూడా వర్తించును.

10. దిష్టి నుండి కాపాడబడుటకు గవ్వలను తొడుగుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు. 

11. తాయత్తులు మరియు గవ్వలు తొడుగు వానిని శపించవచ్చును. 

తాయెత్తులు ధరించేవారి కార్యములను అల్లాహ్ పూర్తిచేయడు. గవ్వలు ధరించేవారిని అల్లాహ్ వారిమానాన వదిలేస్తాడు. (అంటే వారికి ఉపశమనం లభించదు). 

పాఠము-8 : ఊదుట మరియు తాయత్తులు ధరించుట నిషిద్ధం 

బుఖారీ, ముస్లింలలో హజరత్ అబూ బషీర్ అన్సారీ రదియల్లాహు అన్హు ఈ ఉల్లేఖనమును పొందుపరిచెను: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వెంట ప్రయాణించుచుంటిని. ప్రవక్త, ఒక చాటింపు వేయువానిని పంపి ఈ విధముగా చాటింపు వేయించెను. “ఏ ఒంటె మెడలోనూ (దిష్టి నివారించుటకు) కట్టబడిన ఏ వస్తువూ ఉండకూడదు. ఉన్న వాటిని తీసివేయ వలెను” అని. 

అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను: “మంత్రాలు, తాయత్తులు, తౌల అన్నీ అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించినట్లే (అని అర్థం)”. (ముస్నదె అహ్మద్, అబూ దావూద్) 

అత్తమాయిమ్ (తాయత్తులు): ఇతర వస్తువుల దిష్టి తగలకుండా ధరించే తాయత్తులు.

అర్రుఖా (మంత్ర పఠనం లేదా ఊదుట): షిర్క్ కు తావులేని స్తోత్రములు తప్ప వేరేవి పఠించకూడదు. 

తౌల: భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు ధరించునటు వంటివి. హజరత్ అబ్దుల్లా బిన్ హకీం రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: 

“ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను. “ఏ వ్యక్తి అయినా ఏదైనా ధరించిన యెడల అతనిని దాని వశము చేసి వేయబడును.” (ముస్నద్ అహ్మద్ వ సునన్ తిర్మిజీ). 

ఇమాం అహ్మద్ హజరత్ రువైఫీ రదియల్లాహు అన్హు ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్, ఎవరైతే తాయత్తులు ధరించుదురో, శుద్ధి కొరకు ఎండిన పేడ లేక ఎముక ఉపయోగించెదరో వారితో ప్రవక్తకు, ఇస్లాంకు సంబంధము లేదు.’ 

“ఎవరైతే ఒకరి మెడ నుంచి అయినా తాయత్తు తీసివేసిన యెడల అతనికి ఒక బానిసను విముక్తి కలిగించినంత పుణ్యము లభించును. (వకీ రహ్మతుల్లా అలైహ్ దీనిని పొందుపరచెను)

వకీ రహమతుల్లాహ్ అలై, ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ఇబ్నె మద్ రదియల్లాహు అన్హు తాయత్తులన్నింటినీ వారించెను. వాటిలో ఖుర్ఆన్ ఆయత్లు లిఖించి ఉన్నా, వేరేవి ఉన్నాసరే.” 

దీనిలో 8 అర్థ తాత్పర్యములు కలవు 

1. అత్తమాయిమ్, అర్రుఖా అర్థము తెలుపబడెను.

2. “అత్తాలా” అర్థము తెలుపబడెను.

3. అర్రుఖా, అత్తమాయిమ్, అత్తావిల అన్నియూ అల్లాహ్ కు భాగస్వాము లను కల్పించుటయే. 

4. దిష్టి మరియు విషపురుగు కాటు వైద్యమునకు అల్లాహ్ కు భాగస్వా ములు కల్పించనటువంటి స్తోత్రముల పఠనము వారించబడలేదు. 

5. ఖుర్ఆన్ ఆయత్లు లిఖించబడిన తాయత్తులు ధరించుట నిషిద్ధమా? కాదా అనే విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదము కలదు. అందుచే ధరించకపోవుటయే ఎంతో ఉత్తమము. 

6. దిష్టి విముక్తి కొరకు జంతువుల మెడలో ఏవైనా వస్తువులు వ్రేలాడదీ యుట అల్లాహు భాగస్వాములుగా కల్పించినట్లే. 

7. జంతువుల మెడలో ఏమైనా వ్రేలాడ దీయుట గట్టిగా వారించ బడినది. 

8. ఎవరి మెడలోనైనా వ్రేలాడుతున్న తాయత్తును తీసివేయుట ద్వారా కలుగు పుణ్యము తెలుపబడెను.  

9. ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై, అబూ బిన్ మస్ ఊద్  రజి అల్లాహు అన్హుగారి శిష్యులు. ఆయన తాయత్తులను ధరించుట నిషేధిం చబడినట్లు స్పష్టపరిచెను అని తెలిపెను. 

పాఠము-9 : రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా భావించుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

اَفَرَيَتُمُ اللتَ وَالْعُزَّى وَمَنْوةَ الثَّالِثَةَ الْأُخْرى 

“లాత్, ఉజ్జా మరియు మూడో విగ్రహమైన మనాత్ వాస్తవికతను గురించి ఆలోచించారా?” (అన్-నజ్-53:19-20) 

హజరత్ అబూవాఖిద్ లైసీ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను: “మేము ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోపాటు హునైన్ పట్టణానికి ప్రయాణించుచుంటిమి. మేము అప్పుడే క్రొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి. ఆ మార్గములో ఒక రేగి చెట్టు ఉంది. బహుదైవారాధకులు ఆ చెట్టును ప్రార్థించేవారు. వారి వస్తువులను కూడా ఆ చెట్టుకు వ్రేలాడదీసే వారు. దాని పేరు ‘జాత్ అన్వాత్.’ మా ప్రయాణంలో ఒక రేగి చెట్టు సమీపమునకు చేరినప్పుడు, ఓ ప్రవక్తా! ఏ విధముగానైతే బహుదైవారాధకుల కొరకు శుభము పొందుటకు “జాత్ అన్వాత్” ఉన్నదో, అటువంటిదే మా కొరకు కూడా ఒకటి నిశ్చయించండి అని చెప్పాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉద్బోధించారు: అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే ఉత్తముడు. ఇవి పూర్వీకుల విధానాలే! అయితే అల్లాహ్ పై ప్రమాణము చేసి చెబుతున్నాను. ఎవరి చేతిలోనయితే నాప్రాణముందో ఆయన సాక్షిగా చెబు తున్నాను. ప్రవక్త మూసా అలైహిస్సలామ్ ని, ఆయన అనుచరులు (బనీ ఇస్రాయీల్) ఏవైతే కోరారో మీరూ అవేకోరారు. “ఓ మూసా! ఏ విధముగా అయితే ఆరాధన కొరకు వారికి విగ్రహాలు కలవో అదే విధముగా మా కొరకు కూడా ఒక విగ్రహమును తయారుచేయి.” అప్పుడు ప్రవక్త మూసా (అలైహిస్సలాం), వారిని మీరు వట్టి తెలివిమాలిన వారు అని కోపగించారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, “మీరు కూడా పూర్వపు జాతులను అనుసరిస్తారు” అని చెప్పారు. (తిర్మిజీ) 

దీనిలో 22 అర్థ తాత్పర్యములు (పాఠములు) కలవు 

1. సూరయె నజ్ ఆయత్ (53:19-20) యొక్క అర్థం. 

2. అనుచరులు ‘జాత్ అన్వాత్’ గురించి అడుగుట ఏమిటంటే, అసలు వాస్తవికత ఏమిటని, ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో ఆ అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. 

3. అనుచరులు తమ అభిప్రాయము విన్నవించిరిగాని, అమలు పరచలేదు.. 4. అనుచరులు దానిని అల్లాహ్ స్వీకరించునని భావించిరి. 

5. అనుచరులకు ఇటువంటి పని చేయుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అని తెలియనప్పుడు, వేరే వారికి కూడా తెలియ నట్లు.
6. పుణ్యము మరియు క్షమాపణ అనుచరులకు లభించునట్లు అందరికీ లభించవు. 

7. అనుచరులు ‘జాత్ అన్వాత్’ కోరినప్పుడు, ప్రవక్త, వారు తెలియక అడిగారని ఊరుకొనక, ఇదే మార్గభ్రష్టత్వము, మీరు కూడా మునుపటి సంతతుల అడుగుజాడల్లో నడవగలరని స్పష్టముగా వివరించి నిరోధించెను. 

8. అన్నిటికంటే ముఖ్య విషయం, ప్రవక్త తన అనుచరులతో ఈ విధముగా సంబోధించుట. “మీరు కూడా ఇస్రాయీల్ సంతతి కోరినట్లు కోరు చున్నారు. వారు, ఓ మూసా! మా కొరకు కూడా ఒక విగ్రహాన్ని నిర్ణయిం చుము” అని పలికిరి. మీరు కూడా అదే విధముగా ప్రశ్నించారు. 

9. అటువంటి వస్తువులు, ప్రదేశములు, ఏ విధమైన శుభము కలిగించ జాలవని గుర్తించడమే ఏకదైవారాధనకు నిదర్శనము. దీనిని ప్రారంభంలో అనుచరులు కూడా గ్రహించలేకపోయారు. ఇది అతి జాగ్రత్తగా గ్రహిం చవలసిన విషయం. 

10. ప్రవక్త ముఖ్య విషయం కాబట్టి చేశారు. 

11. అనుచరులు ఈ విధముగా కోరుటతో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిరి. కానివారు అవిశ్వాసులు కాలేదు, దీనివలన షిర్క్ లో హెచ్చు తగ్గులు కలవని అర్థం అవుతుంది. 

12. అప్పుడే మేము ఇస్లాం స్వీకరించితిమి అంటే పాత వారికి ఇది తెలియక ఉండకూడదు.

13. ఆశ్చర్యము కలిగినప్పుడు “అల్లాహ్ అతి ఉత్తముడు” అని పలకవచ్చును. 

14. బహుదైవారాధన మరియు వక్ర కార్యములకు దారితీయునటువంటి వాటి నన్నిటినీ నిషేధించవలెను. 

15. దీనిలో పూర్వీకులను అనుసరించుటను నిషేధించబడెను

16. విద్యాభోధన చేయునప్పుడు కోపగించుకొనుట. (విద్యార్థులపై) 

17. ప్రవక్త దీనిలో మునుపటి సంతతుల విధానములను వివరించెను. 

18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా మునుపటి వారి వలె చేయగలరని తెలియపరచుట, ఆయన ప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

19. అల్లాహ్! యూదులను, క్రైస్తవులను వేటి గురించి అయితే నిందించెనో, నిశ్చయముగా అవి మన కొరకు కూడా వర్తించును. అటువంటి కార్యముల నుండి మనం అన్ని విధాలా దూరంగా ఉండి జాగ్రత్తగా మసలుకోవాలి. 

20. అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసావహించుటయే ఆరాధనకు నిదర్శనం. 

21. గ్రంధము అనుగ్రహించబడిన వారి విధానములు కూడా బహు దైవారాధకుల విధానముల వలె ఉండెను. 

22. ఎవరైతే చెడు నుంచి నిజం వైపుకు వస్తారో, వారిలో కొన్ని పాత పద్ధతులు ఇమిడి ఉంటాయి. వాటిని గ్రహించి జాగ్రత్తగా వాటి నుండి విముక్తి పొందుటకు ప్రయత్నించవలెను. 

పాఠము- 10 : అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు 

అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

قُلْ اِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَلَمِينَ لا شَرِيكَ لَهُ، وَبِنالِكَ أُمِرْتُ وَأنا أوّلُ الْمُسْلِمِينَ . 

“(ఓ ప్రవక్తా!) ఈ విధముగా ప్రకటించుము: నా ఆరాధన, నా అర్పణ, నా జీవితం, నా మరణం, సమస్తమూ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు సాటిగానీ, భాగస్వాములుగానీ లేరు. నాకు ఇదే ఆజ్ఞాపించబడినది మరియు నేను ప్రప్రథమంగా శిరసావహించిన విధేయుణ్ణి.” (6:162-163) 

فصل لربك وانحر: 

“కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.” (108:2) 

హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నాలుగు ఉద్బోధనలు చేసిరి. 

1) ఎవరైతే అల్లాహ్ కు తప్ప ఇతరులకు జంతువును అర్పిస్తారో వారు శాపగ్రస్తులవుతారు. 

2) ఎవరైతే తమ తల్లిదండ్రులను శపిస్తారో వారే స్వయంగా శాపగ్రస్తు లవుతారు.

3) బిర్అత్ లకు కు పాల్పడేవారికి ఎవరయితే ఆశ్రయం కల్పించుదురో, వారు కూడా శాపగ్రస్తులవుతారు. 

4) ఎవరైతే హద్దు రాళ్ళను మార్చివేస్తారో, వారు శాపగ్రస్తులవుతారు. 

(సహీముస్లింలో ఈ హదీసు పొందుపరచబడెను) 

హజరత్ తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించారు: 

“ఒక వ్యక్తి ఈగ కారణమున స్వర్గములో ప్రవేశించెను మరొక వ్యక్తి ఈగ కారణముననే నరకములో చేరెను.” అప్పుడు అనుచరులు అదెలా ప్రవక్తా? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా విశదీకరించెను: “ఇద్దరు వ్యక్తులు ఒక ప్రదేశము నుండి ప్రయాణం సాగించారు. అచ్చటి ప్రజలు వాళ్ళ విగ్రహానికి అర్పణ చేయకుండా ఎవ్వరినీ ఆ మార్గము నుండి వెళ్ళనిచ్చేవారు కాదు. వారు ప్రయాణీకులలో ఒకరిని అర్పణ చేయమని పిలిచిరి. అతడు అర్పించుటకు నా దగ్గర ఏమీ లేదని పలికెను. వారు ఈగ అయినా సరే అర్పించవలసినదేనని చెప్పారు. అతను ఈగను ఆ విగ్రహానికి అర్పించెను. అప్పుడు వారు అతనిని విడిచిపెట్టిరి. అతడు ఆ ఈగను విగ్రహానికి అర్పించుట వలన నరకమున ప్రవేశింప జేయబడెను. మరల వారు వేరే వ్యక్తిని నీవు కూడా ఏమైనా అర్పించి వెళ్ళుము అని పలికిరి. కాని అతను నేను ఒక్క అల్లాహు తప్ప వేటికీ అర్పించను అని పలికెను. వారు అతనిని చంపివేసిరి. అతను స్వర్గమున ప్రవేశింప జేయబడెను.” (ముస్నద్ అహ్మద్) 

దీనిలో 13 పాఠములు కలవు 

1. వాక్యము (6:162-163) యొక్క తఫ్సీర్ (భావము). 

2. వాక్యము (108:2) యొక్క తఫ్సీర్ (భావము). 

3. అల్లాహ్ యేతరులకు అర్పించువారిని శపించుట మొట్టమొదటిది. 

4.నీవు వేరే వారి తల్లిదండ్రులను శపించిన యెడల అతడు నీ తల్లిదండ్రు లను శపించును. ఆ కారణముగా నీవే నీ తల్లిదండ్రులపై శాపమునకు కారకుడవగుదువు. 

5. ఎవరైనా వక్ర కార్యములకు పూనుకున్న వ్యక్తికి ఆశ్రయము ఇచ్చిన యెడల అతడు శాపమునకు అర్హుడగును (వక్ర కార్యము అంటే అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించుట లేదా అల్లాహు, ప్రవక్తకు అవిధేయత చూపుట). 

6. హద్దుల రాళ్ళను మార్చినవారిపై శాపము. 

7. ప్రత్యేక వ్యక్తిని శపించుటలో మరియు ఎవరినీ గుర్తించకుండా శపిం చుటలో వ్యత్యాసము కలదు. 

8. ఒక్క ఈగను అర్పించి నరకమున ప్రవేశింపబడుట గమనార్హము.

9. ఈగను అర్పించిన వ్యక్తి అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశముతో చేయలేదు. అతను తనప్రాణమును కాపాడుకొనుటకు చేసెను. దీనితో అల్లాహ్ కు కాకుండా ఇతరులకు అర్పించుట ఎంత ఘోరమైన పాపమో అర్థమవుతుంది. 

10. అల్లాహ్ యొక్క నిజమైన విధేయుడు మరణించుటకు సిద్ధపడెను. కాని అల్లాహక్కు తప్ప ఇతరులకు అర్పించుటకు పూనుకోలేదు. 

11. వారిలో ఈగను విగ్రహానికి అర్పించి నరకమున ప్రవేశించిన వ్యక్తి కూడా ముస్లింయే. విశ్వాసంలేని యెడల ఒక్క ఈగ కారణముగా నరకమున ప్రవేశించెను.

12. ఈ హదీసు వేరొక హదీసు ‘స్వర్గ నరకములు మీ బూట్ల లేజుల కంటే సమీపమున కలవు” (బుఖారీ)ను ధృవీకరించెను.

13. ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం అన్నిటికంటే ముఖ్యము.

పాఠము-11 : అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామముపై అర్పణ కూడా నిషేధము 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

لَا تَقُمْ فِيهِ اَبَدًا لَمَسْجِدُ أُتِسَ عَلَى التَّقْوى مِنْ أَوَّلِ يَوْمٍ اَحَقُّ أَن تَقُومَ فِيهِ فِيهِ رِجَالُ تُحِبُّونَ 

ان يتَطَهَّرُوا وَاللهُ يُحِبُّ الْمُطَهِّرِينَ . 

“మీరు ఎప్పటికీ దానిలో నమాజు చేయకండి. ప్రారంభము నుండే భయ భక్తుల ప్రాతిపదికపై నిర్మించిన మసీదే నీవు నమాజు చేయదగినది. అందులో పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడేవారు ఉన్నారు. అల్లాహ్ నిశ్చయముగా పరిశుద్ధతను పాటించు వారిని ఇష్టపడును (ప్రేమించును).” (అత్-తౌబా 9:108) 

హజరత్ సాబిత్ బిన్ జహాక్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఒక వ్యక్తి ‘బువాన’ అనే ప్రదేశములో ఒంటెను అర్పించుదునని వాగ్దానము చేసుకొనెను. అతను ఆ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రస్తావించగా ఆయన ఈ విధముగా అడిగెను. “అచ్చట మునుపటి విగ్రహాలలో ఏదైనా (పూజింపబడు) విగ్రహము ఉన్నదా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. మరల ప్రవక్త ఈ విధముగా ప్రశ్నించారు: “అక్కడ బహుదైవారాధకులు ఉత్సవాలు జరుపుకునేవారా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. అప్పుడు ప్రవక్త, “నీ అర్పణ పూర్తి చేయుము” అని పలికెను. “గుర్తుంచుకోండి. ఏ వాగ్దానమైనా సరే (మొక్కు బడి) అల్లాహ్ యొక్క అవిధేయతకు సంబంధించినదైతే దానిని పూర్తి చేయ కూడదు (ఆచరించకూడదు). తమ అందుబాటుకు మించివున్న మొక్కుబడిని కూడా పూర్తిచేయనవసరంలేదు.” (దీనిని సుననె అబూదావూద్, సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో నిబంధనల మేరకు పొందుపరచబడెను.) 

దీనిలో 11 పాఠములు కలవు 

1. వాక్యము (9:108) యొక్క భావము. 

2. అల్లాహ్ విధేయత భూమిపై కూడా ప్రభావితపరచును. 

3. ఏదైనా కష్టమైన సమస్యను తెలియజేయుటకు అనుమానము లేకుండా విశదీకరించి తెలుపవలెను.

4. అవసరాన్నిబట్టి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని జవాబు చెప్పవలెను. 

5. ఏదైనా ప్రదేశంలో అర్పణకు వాగ్దానము చేయునప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చేయవలెను. 

6. మునుపటి రోజుల్లో అచ్చట విగ్రహారాధన జరిగిన ఎడల, ఇప్పుడు అచ్చట విగ్రహారాధన జరగనప్పటికీ అచ్చట మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధము. 

7. పాత ఆచారములు గల ఏ ప్రదేశములో కూడా మొక్కుబడి పూర్తి చేయకూడదు. 

8. ఎవరైనా బహుదైవారాధన జరుగు ప్రదేశములో మొక్కుబడి వాగ్దానము చేసిన యెడల ఆ మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధం. 

9. పండగలు చేయుటలో ముస్లిమేతరుల పద్ధతిని పాటించరాదు. 

10. అల్లాహ్ అవిధేయతకు పూనుకొను మొక్కుబడి నిషేధించబడినది. 

11. మనం చేయలేని వాగ్దానాలనుచేయుట నిషేధించబడినది. 

పాఠము-12 : అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సెలవిచ్చాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అల్-ఆరాఫ్-76:7) 

وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ

మీరు ఏదైతే ఖర్చు చేశారో, మొక్కుబడి చేసుకున్నారో, నిశ్చయముగా అల్లాహ్ కు తెలుసును.” (అల్-బఖర-2:270) 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను: 

“ఎవరైతే అల్లాహ్ విధేయతకు సంబంధించిన మొక్కుబడి చేశారో (వాగ్దానము చేశారో) వారు నిశ్చయముగా విధేయతను పూర్తి చేయవలెను. ఎవరైతే అల్లాహ్ అవిధేయతకు సంబందించిన మొక్కుబడి (వాగ్దానము) చేశారోవారు ఎట్టి పరిస్థితిలోనూ అవిధేయతకు పూనుకోకూడదు. 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. వాగ్దానము (మొక్కుబడి) పూర్తి చేయవలెను. 

2. మొక్కుబడి ఆరాధన కాబట్టి వేరే వారికి మొక్కుకొనుట అల్లాహు భాగస్వాములను కల్పించుట అని అర్థం. 

3. అల్లాహ్ అవిధేయతకు పాల్పడే మొక్కుబడులు చేయకూడదు. తెలియక చేసినా వాటిని పూర్తి చేయుట నిషిద్ధం. 

పాఠము-13 : అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను:

 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

“మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుకొను చుండెడివారు. ఈ విధముగా వారి గర్వము అధికమయ్యెను.” ( సూరా అల్ జిన్న్72:6) 

హజరత్ ఖౌలా బిన్తె హకీం (రదియల్లాహు అన్హా) గారి కథనం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ఉద్బోధిస్తుండగా నేను విన్నాను: ఎవరైతే ఏదైనా ప్రదేశములో దిగి, “నేను అల్లాహ్ సృష్టించిన ప్రతి దాని కీడు నుండి అల్లాహ్ సమస్త పదములతో శరణు కోరుచున్నాను” అని దుఆ చదివిన యెడల అతడు అక్కడ నుండి వెళ్ళనంత వరకు ఏ కీడు హాని కల్పించదు.” (ముస్లిం దీనిని పొందుపరచెను) 

దీనిలో 5 పాఠములు కలవు 

1. సూరె జిన్ (72 : 6) ఆయత్ అర్థం. 

2. అల్లాహ్ యేతరుల శరణు కోరటం అల్లాహు భాగస్వామ్యం కల్పించి నట్లు. 

3. అల్లాహ్ “పదములు” సృష్టి కావు. ఒకవేళ అల్లాహ్ పదములు సృష్టి అయినచో, సృష్టితో ప్రవక్త శరణు కోరే వారే కాదు. ఎందుకంటే సృష్టిలో దేనినైనా శరణు కోరుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు అగును 

4. దీనిద్వారా ఆ దుఆ (ప్రార్ధన) యొక్క విశిష్ఠత తెలుస్తోంది. 

5. ఏదైనా వక్ర పద్ధతి ద్వారా ఇహలోకంలో లాభము పొందుట లేదా చెడు నుంచి రక్షణ పొందుటకు ప్రయత్నించుట బహుదైవారాధన కాదని అనుకొనుట పొరపాటు. 

పాఠము- 14 : అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

“అల్లాహ్ ను వదలి నీకు లాభనష్టాలు కలిగించలేని వేటినీ వేడుకోకు. నీవు అలా చేసిన పక్షంలో దుర్మార్గుడవైపోతావు. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేసినచో స్వయంగా అల్లాహ్ తప్ప ఆ ఆపద నుంచి నిన్ను తొలగించువారు ఎవ్వరూలేరు. నీకు ఆయన మేలు చేయాలనుకుంటే ఆయన అనుగ్రహాన్ని ఎవ్వరూ నివారించలేరు. ఆయన తన దాసులలో తను తలచిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయముగా ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10:106-107) 

إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

“యదార్థముగా అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి విగ్రహాలే. మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. అల్లాహ్ ను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో అవి మీకు ఏ విధమైన ఉపాధి కల్పించలేవు. ఉపాధి కొరకు అల్లాహ్ అడగండి. ఆయనకే దాస్యం చేయండి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. ఆయన వైపునకే మీరు మరలించబడతారు.” (అన్ కబూత్ 29:17) 

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

“అల్లాహ్ ను  కాదని ప్రళయం వచ్చే వరకూ అతనికి సమాధానము ఇవ్వలేని వారిని మొరబెట్టుకునేవాడు, తమకు మొరబెట్టుకుంటు న్నాడనే విషయం కూడా తెలియని వారిని వేడుకుంటున్న వాడికంటే పరమ భ్రష్టుడు ఎవరు? ప్రజలందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46:5-6) 

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

“బాధితుడు మొరబెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని కష్టమును తొలగించు వాడెవడు? భూమిపై మిమ్ములను ప్రతినిధులుగా చేసినవాడెవడు? అల్లాహ్ తోపాటు మరొక దేవుడు కూడా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు.” (నమ్ల్  27:62) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క కాలంలో ఒక కపటుడు ముస్లింలకు కష్టనష్టములు కలిగించెడివాడు. అప్పుడు అను చరులు ప్రవక్త వద్దకుపోయి మొరబెట్టు కొనుదుము అని ప్రవక్త వద్దకు వెళ్ళిరి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారినుద్దేశించి ఈ విధముగా ప్రబోధించెను: “చూడండి! నా వద్ద మొరబెట్టుకో కూడదు. ఒక్క అల్లాహ్ వద్ద మాత్రమే మొరబెట్టుకొనవలెను.” (తబ్రానీ) 

దీనిలో 18 పాఠములు కలవు 

1. వేడుకొనుట అందరూ చేస్తారు. కాని మొరబెట్టుకొనుట బాధితులు మాత్రమే చేస్తారు. 

2. వాక్యము (10:106) యొక్క భావము తెలుపబడినది. 

3. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట, పెద్ద బహుదైవారాధన

4. ఎంతటి వ్యక్తి అయినా, అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనిన యెడల అతడు కూడా దుర్మార్గులలో చేరుతాడు. 

5. వాక్యము (10:107) యొక్క భావము తెలుపబడింది. 

6. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట అల్లాహ్ ను ధిక్కరించినట్లు. 

7. వాక్యము (29:17) యొక్క అర్థము తెలుపబడినది.

8. అల్లాహ్ ని తప్ప వేరేవారిని ఉపాధి కొరకు వేడుకొనరాదు, ఎలాగైతే స్వర్గం కొరకు అల్లాహ్ ని తప్ప మరెవ్వరితో కోరరో, అలాగే ఉపాధిని కూడా అల్లాహ్ ని తప్ప మరెవ్వరితోనూ కోరకూడదు. 

9. వాక్యము (46:5) యొక్క భావము తెలుపబడినది. 

10. ఎవరైతే అల్లాహ్ ని కాదని వేరే వారిని వేడుకుంటాడో, మొరబెట్టు కుంటాడో, అతన్ని మించిన మార్గభ్రష్టుడు ఎవ్వడూ లేడు. 

11. అల్లాహ్ ని తప్ప ఎవరికైతే మొరబెట్టుకుంటున్నారో, వానికి మొరబెట్టు కుంటున్న విషయం కూడా తెలియదు. 

12. అల్లాహ్ ని కాదని ఎవరినైతే వేడుకొంటున్నారో, వారు ప్రళయదినం నాడు వారిని వేడుకున్న కారణంగా వారికి శత్రువులవుతారు. 

13. వేటినైతే వేడుకుంటున్నారో వారు ప్రళయ దినాన్ని నిరాకరిస్తారు. 

14. అల్లాహ్ ని కాకుండా వేరే వారిని వేడుకొనుట, నిశ్చయముగా వారిని ఆరాధించినట్లు. 

15. అల్లాహ్ ని కాదని ఇతరులను వేడుకొనుట కారణముగానే ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువ మార్గభ్రష్టుడైనాడు. 

16. వాక్యము (27:62) భావము తెలుపబడినది. 

17. నిశ్చయముగా ఆలోచించదగ్గ విషయం ఏమనగా, బహు దైవా రాధకులు కూడా కష్టములలో నుండి మొరబెట్టుకొనువాని మొర ఒక్క అల్లాహ్ యే వినగలడని, కష్టముల నుండి ఒక్క అల్లాహ్ యే రక్షించగలడని విశ్వ సించి, కష్ట పరిస్థితులలో వారు కూడా ఏకాగ్రతతో ఒక్క అల్లాహ్న వేడు కునేవారు. 

18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకదైవారాధనను ఎటువంటి లోపాలు లేకుండా భద్రపరిచారు. అనుచరులకు ఏక దైవారాధన విషయంలో నీతి మర్యాదలను బోధించారు. అల్లాహ్ పట్ల అమితమైన మర్యాదలను, గౌరవాన్ని సమకూరుస్తూ వివరించారు. 

పాఠము- 15 :ఏ వస్తువునూ సృష్టించలేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రస్తావించెను: 

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

“ఏమిటి వీరు, వేటినీ సృష్టించలేని వారిని, అల్లాహ్ సృష్టింపబడిన వారిని, ఎవ్వరికీ సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు కూడా సహాయం చేసుకోలేని వారిని అల్లాహు కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (7:191-192) 

 وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍإِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

“అల్లాహ్ ని విడిచి వేటినైతే మీరు వేడుకుంటున్నారో వారు కనీసం ఖర్జూరపు గింజపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు. మీరు వారిని వేడుకున్నా, వారు మీ మొరలను ఆలకించలేరు. ఒకవేళ విన్నా ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు, వారు, మీరు అల్లాహ్ కు కల్పించిన భాగస్వామ్యమును తిరస్కరించుదురు. సత్యము ఎరిగిన అల్లాహ్ తప్ప ఎవ్వరూ మీకు ఈ సత్యసందేశమును అందజేయలేరు.” (35:13-14) 

హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉహుద్ యుద్ధంలో గాయపడ్డారు. ఆయన రెండు దంతాలు విరిగిపోయాయి. అప్పుడు ఆయన ఈ విధముగా చెప్పారు: “ఇటువంటి ప్రజలు ఏ విధముగా సాఫల్యము పొందు తారు?” అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము అవతరింపజేసెను. (బుఖారి) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజర్ నమాజు రెండవ రకాతు రుకూ నుంచి లేచి “సమి అల్లాహు లిమన్ హమిద, రబ్బనా వలకల్ హమ్ద్” చదివిన తరువాత “ఓ అల్లాహ్! ఫలానా వారిని శాపగ్రస్తులుగా చేయుము” అని పలికిరి. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు” అని తెలిపెను. 

మరోచోట ఈ విధముగా ఉల్లేఖించబడినది: 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సవ్వాన్ బిన్ ఉమయ్య, సుహైల్ బిన్ అమర్, హారిస్ బిన్ హిషామ్ శపిస్తుండగా ఈ వాక్యము అవతరింపబడెను: “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు.” వేరొకచోట, అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ఓ ప్రవక్తా! మీ సమీప బంధువులకు ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింపబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి నిలబడి ఈ విధముగా ప్రబోధించారు: “ఓ నా జాతి ప్రజలారా! మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అల్లాహ్ సమక్షములో మీకు నేను ఏ విధమైన సహాయమూ చేయలేను. ఓ నా మేనత్త సఫియా! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ సహాయమూ చేయలేను. ఓ నా ప్రియమైన కూతురు ఫాతిమా! నా వద్ద ఉన్న సంపదలో ఏమికావాలో అడిగి తీసుకో. కాని అల్లాహ్ సమక్షంలో నేను నీకు ఏ విధమైన సహాయమూ అందించలేను.” 

దీనిలో 12 పాఠములు కలవు 

1. వాక్యములు (7:191-192) భావము తెలుపబడెను. 

2. ‘ఉహద్’లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గాయపడుటను తెలుపబడెను. 

3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నమాజులో చివరి రుకూ తర్వాత దుఆ యే ఖునూత్ చదివినట్లు స్పష్టమవుతుంది. సహచరులు ఆయన వెనుక ఆమీన్ అని పలుకుట కూడా తెలుస్తుంది. 

4. ధిక్కరించిన వారినే శాపగ్రస్తులుగా చేయమని కోరబడినది.

5. విశ్వాసులను, ప్రవక్తను, ధిక్కారులు అతిగా కష్టాలకు గురిచేశారు. అంతేకాకుండా విశ్వసించిన వారు, దౌర్జన్యపరులకు సమీప బంధువులై నప్పటికీ వారిని హతమార్చిరి. ప్రవక్తని “ఎవరైతే తమ ప్రవక్తను గాయ పరిచితిరో” ఆయనను గాయపరచటమే కాకుండా, హతమార్చుటకు పూనుకొనిరి. ఆయన వారి సమీప బంధువైనప్పటికీ

6.ధిక్కారులు ఈ నీచ కార్యముల కారణంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారిని శాపగ్రస్తులుగా చేయమని కోరినప్పుడు అల్లాహ్, “ఆ విషయంలో మీకు ఏ అధికారమూ లేదు” అనే వాక్యమును అవతరింపజేసెను.

7. అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: “నిశ్చయముగా అల్లాహ్ వారిని క్షమించగలడు లేదా శిక్షించగలడు.” చివరికి అల్లాహ్ వారిని క్షమించెను. వారు విశ్వాసులయ్యారు.  

8. అవసరాన్ని బట్టి ఖునూత్ దుఆ చదవవచ్చునని అర్థం అవుతుంది

9. ఎవరినైతే శాపగ్రస్తులుగా చేయమని కోరబడుతుందో వారి పేరు తెలుపవచ్చును. 

10. “నీ సమీప బంధువులను ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింప బడినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమీప బంధువులను పిలిచి వారిని నరకము నుండి తమను తాము కాపాడుకోమని ఉద్బోధించుటను తెలుపబడినది. 

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఏకదైవారాధనకు పిలుపునిచ్చినప్పుడు ఆయనను ప్రజలు పిచ్చివాడని పలికారు. ఇప్పటికీ ఏకదైవారాధనకు పిలుపు ఇచ్చినచో అటువంటి మాటలే వినవలసి ఉంటుంది. 

12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తన బంధువులందరికీ, “నేను అల్లాహ్ సమక్షములో మీకు ఏ విధముగా కూడా సహాయ పడలేను అని పలికినప్పుడు, తన కన్న కూతురుతో కూడా ఇదే విధముగా పలికారు. ప్రవక్తయే నిస్సహాయులు అయినప్పుడు ఇతరులు ఏం సహాయం చేయగలరు. ఈ రోజుల్లో సహాయం కొరకు ఎవరినైతే వేడుకొంటున్నారో వారు ఏం సహాయం చేయగలరు చెప్పండి!! 

పాఠము – 16 : అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

“వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు. మీ ప్రభువు ఏమని పలికెను. అప్పుడు (దైవదూతలు) ఆయన సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడును” అని చెబుతారు. (సబా-34:23) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి హదీసును ఈ విధముగా ఉల్లేఖించెను. (బుఖారీ) 

“అల్లాహ్ ఆకాశములపై తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, దైవదూతలు ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ తమ రెక్కలను, శుభ్రమైన రాయిపై మెత్తని గొలుసు తగిలినప్పుడు వచ్చు శబ్దము వచ్చునట్లు ఆడిస్తారు. ఆ నిర్ణయం ఆ దైవదూతలందరికీ చేరుతుంది. వారి హృదయముల నుండి భయభ్రాంతులు తొలిగిన తరువాత వారు ఒకరినొకరు “అల్లాహ్ ఏమని సంబోధించెను” అని ప్రశ్నించుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూను” అని పలుకుతారు. షైతానులు ఆ మాటలను ఒక నిచ్చెనలాగా తయారై వింటారు. (షైతానులు మాటలను ఎలా చేరవేస్తారో హదీసు ఉల్లేఖకులు సుఫ్యాన్  సంజ్ఞలతో సహా వివరించారు. అందరికంటే పైన ఉన్న షైతాను తన క్రింద ఉన్న వారికి, ఆ షైతాను వాని క్రిందివానికి, ఆ విధముగా చివరి షైతాను జ్యోతిష్యులకు తెలియజేస్తాడు. కొన్ని సమయములలో ఆ మాట జ్యోతిష్యునికి చేరక ముందే షైతానులు పారద్రోలబడుతారు. కొన్ని సమయాల్లో షైతానులు జ్యోతిష్యునికి ఆ మాటను తెలియపరుస్తారు. జ్యోతిష్యుడు షైతాను తెలిపిన మాటలకు వంద అసత్యాలు జతపరుస్తాడు. ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, ప్రజలు ఫలానా రోజు ఆ జ్యోతిష్యుడు తెలిపాడు గదా? అందురు. అందు మూలంగా ఆ ఒక్క వార్త సరిగా తెలిపినందుకు ఆ జ్యోతిష్యుడు సత్యవంతుడు అని ప్రజలు నమ్ముతారు. వాస్తవానికి ఆ వార్త షైతాన్ ద్వారా ఆకాశము నుండి వినబడినదై ఉంటుంది. 

హజరత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్  (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అల్లాహ్ ఏమైనా అవతరింపజేసినప్పుడు అల్లాహ్ భయముతో సకల ఆకాశములపై భయాందోళనలు కమ్ముకుంటాయి. అప్పుడు ఆకాశం మీద ఉన్నవారు ఆ శబ్దానికి మూర్ఛబోయి సాష్టాంగములో పడిపోతారు. ఆ తర్వాత జిబ్రయీల్ దూత అందరి కంటే ముందు తల పైకెత్తుతారు. అల్లాహ్ తను అవతరింప జేసిన విషయాన్ని ఆయనకు తెలియజేస్తాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాం వేరే దైవదూతల దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వారు ఓ జిబ్రయీల్, మన ప్రభువు ఏమి అవతరింప జేసెను అని ప్రశ్నిస్తారు. అప్పుడు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ సత్యమును అవతరింపజేసెనని పలుకుతారు. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని తెలుపుతారు. అప్పుడు దైవ దూతలందరూ అదే సందేశాన్ని ఉచ్చరించుతారు. జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ సందేశాన్ని అందజేస్తారు.”

దీనిలో 22 పాఠములు కలవు 

1. వాక్యము (34:23) యొక్క భావము (అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి తెలుపబడెను.) 

2. ఈ వాక్యములో మేము ఫలానా వారిచే సిఫారసు చేయించు కోగలము అన్న భావన ఖండించబడినది

3. దీనిలో “అల్లాహ్ నిశ్చయముగా సత్యమును పలికెను, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు” అని తెలుపబడింది. 

4. దైవదూతలు ఒకరినొకరు ప్రశ్నించుకొనుట తరువాత జవాబు తెలుపుకొనుట ఇచ్చట పొందుపరచబడెను. 

5. దైవదూతలు ప్రశ్నించినప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం, అల్లాహ్ అవతరింపజేసిన సందేశము వారికి తెలియపరుస్తారు. 

6. దైవదూతలందరూ మూర్ఛపోయినప్పుడు అందరికంటే ముందు, జిబ్రయీల్ (అలైహిస్సలాం) తేరుకొంటారు. 

7. ప్రశ్నించిన దైవదూతలందరికీ జిబ్రయీల్ (అలైహిస్సలాం) జవాబు ఇస్తారు. 

8. మూర్ఛబోవుట దైవదూతలందరిపై సంభవించును.

9. అల్లాహ్ సంబోధించునప్పుడు ఆకాశము కంపించును. 

10. అల్లాహ్ ఆజ్ఞ మేరకు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క సందేశమును తెలియపరుస్తారు. 

11. షైతానులు రహస్యంగా అల్లాహ్ యొక్క సందేశములు వినుటకు ప్రయత్నించెదరు. 

12. దీని కొరకు వారు ఒకరిపై ఒకరు నిచ్చెనలా అధిరోహిస్తారు. 

13. ఈ షైతానులను పారద్రోలుటకు ఉల్కలు పంపబడును. 

14. కొన్ని సందర్భాలలో అల్లాహ్ సందేశము షైతాన్ కు చేరకముందే పారద్రోలబడును. కొన్ని సందర్భాలలో సందేశాన్ని షైతాను తన స్నేహి తునికి తెలుపుతాడు. 

15. కొన్ని సందర్భాలలో జ్యోతిష్యుని మాట నిజమవుతుంది. 

16. జ్యోతిష్యుడు ఆ ఒక్కమాటకు వంద అసత్యములు కలుపుతాడు. 

17. ప్రజలు ఒక సరియైన మాటకు కారణముగా జ్యోతిష్కుడిని నమ్ము తారు. నిశ్చయముగా ఆ ఒక్క సత్యము కూడా షైతాన్ ద్వారా సేకరించ బడినదే.

18. జ్యోతిష్కుని ఒక్క సరియైన మాటను ఆదర్శముగా తీసుకుంటారు గానీ, అతడి నూరు అసత్యాలను గ్రహించరు. 

19. షైతానులు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని, అబద్దములు పలుకు వారిని సత్యవంతులుగా చిత్రీకరిస్తారు. 

20. దీనిద్వారా అల్లాహ్ స్వభావములు కూడా నిర్ధారణ అవుతాయి. 

21. ఆకాశములపై సంభవించు కంపనలు అల్లాహ్ యొక్క భయముతో జరుగును.

22. దైవదూతలందరూ అల్లాహ్ కు సాష్టాంగ ప్రణామం చేస్తారు. 

పాఠము- 17: సిఫారసు వాస్తవికత 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను:

وَانْذِرُ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُ وا إِلَى رَبِّهِمْ لَيْسَ لَهُمْ 

مِنْ دُونِهِ وَلِيُّ وَلَا شَفِيعُ لَعَلَّهُمْ يَتَّقُونَ . 

“(ఓ ప్రవక్తా!) తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు సహాయము చేయువారుగానీ లేదా సిఫారసు చేయువారుగానీ ఎవ్వరూ లేని పరిస్థితిలో హాజరు కావలసి వస్తుందని భయపడేవారికి నీవు దీని ద్వారా ఉపదేశించుము. బహుశా వారు అల్లాహు కు భయపడగలరు.” (6:51)

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا
“సిఫారసు అధికారము అల్లాహ్ కలదు.” (39:44) 

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ
“ఆయన సమక్షములో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వారెవ్వరు?” (2:255) 

وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ

“ఆకాశంలో ఎంతోమంది దైవదూతలున్నారు, కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు, అల్లాహ్ ఎవరి గురించైనా ఏదైనా విన్నపం వినదలచుకుంటే, ఆ వ్యక్తి విషయంలో ఇష్టపడి సిఫారసుకు అనుమతిస్తేనే తప్ప.” (53:26) 

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ

“(ప్రవక్తా! ఆ బహుదైవారాధకులతో) ఈ విధముగా పలకండి. అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలోగానీ, భూమిలోగానీ రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములు కారు. వారిలో ఎవ్వరూ అల్లాహ్ కు సహాయకులు కూడా లేరు. అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతించునో, ఆ వ్యక్తికి తప్ప మరెవరికీ ఏ సిఫారసూ అల్లాహ్ సమక్షములో లాభదాయకము కాదు.” (34:22-23) 

షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

“అల్లాహ్ తను సృష్టించిన దానిలో సకల సృష్టిరాశుల యొక్క భాగస్వామ్యము ఏదీ లేదని స్పష్టపరిచెను. వేటినైతే బహు దైవారాధకులు భాగస్వాములుగా కల్పిస్తుండేవారో వాటన్నిటినీ అల్లాహ్ ఖండించెను. ఉదాహ రణకు ఎవరికీ భూమ్యాకాశాలలో ఏ విధమైన అధికారము లేదని స్పష్టపరి చెను. అలాగే అల్లాహు కు ఎవ్వరూ సహాయం చేయలేదు. నిశ్చయముగా బహుదైవారాధకులు ఆశిస్తున్న సిఫారసు, అసలు సిఫారసుకు భిన్నమైనదని ఖుర్ఆన్ స్పష్టము చేసెను

وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ
“ఎవరినైతే అల్లాహ్ స్వయంగా ఇష్టపడతాడో వారికి తప్ప మరెవ్వరికీ సిఫారసు చేయలేరు.” (అల్-అంబియా-21:28) 

“ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ప్రళయ దినం నాడు అల్లాహ్ సమక్షములో హాజరు అయి అల్లాహ్ ముందు సాష్టాంగ ప్రణామం చేయును. అల్లాహ్ ను స్మరించి వేడుకొనును. ఆ తరువాత ఆయన సాష్టాంగ ప్రణామం నుండి లేవగానే ఏమి కావలెనో కోరమని తెలుపబడును” అని ముహహ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వివరించెను. అప్పుడు హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు), “ఓ ప్రవక్తా! మీ సిఫారసు పొందే ఆ అదృష్టవంతులెవరు?” అని ప్రశ్నించెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో, అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని విశ్వసించి సాక్ష్యమిస్తారో వారు” అని పలికెను. 

దీనితో ఈ సిఫారసు అల్లాహ్ అనుమతితో, ఒక్క అల్లాహ్ యే ఆరాధనకు అర్హుడని నమ్మి సాక్షమిచ్చువానికే వర్తించును, బహు దైవారాధకులకు వర్తించదు. దీని ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమనగా ఏకదైవారాధకులపై అల్లాహ్ ప్రత్యేక దయాదాక్షిణ్యములు చూపును, ఎవరికైతే సిఫారసు చేయుటకు అనుమతి ఇవ్వబడెనో, వారి ప్రార్థన ద్వారా ఏక దైవారాధకులు మాత్రమే కనికరించబడతారు. సిఫారసు చేయు వాని (ప్రవక్త) సిఫారసు విశ్వసించిన వారికి మరియు అల్లాహ్ కు భయపడు వారికి మాత్రమే. 

దీనిలో 8 భావములు (పాఠములు) కలవు 

1. సిఫారసు గురించి పేర్కొనబడిన ఆయతుల యొక్క భావము తెలుప బడెను. 

2. నిషిద్ధ సిఫారసులు స్పష్టముగా తెలుపబడెను. 

3. అల్లాహ్ ఆజ్ఞతో స్వీకరించబడు సిఫారసు తెలుపబడెను. 

4. అతి ఉత్తమ సిఫారసుగా పేర్కొనబడెను. 

5. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ సమక్షములో సాష్టాంగ ప్రణామం చేస్తారు. సిఫారసుకు అనుమతింపబడినప్పుడే సిఫారసు చేయగలరు. 

6. సిఫారసుకు అందరికంటే ఎక్కువ అర్హులైనవారు విశ్వాసులు. 

7. ఈ సిఫారసుకుబహుదైవారాధకులు (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించువారు) అనర్హులు. 

8. సిఫారసు గురించి క్లుప్తంగా తెలుపబడినది. 

పాఠము- 18 : (ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

“(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందరికీ మార్గదర్శకత్వము ప్రసాదించ గలడు. ఆయనకు తన మార్గదర్శకత్వము స్వీకరించువారు ఎవరో తెలుసును.” (28:56) 

సయీద్ బిన్ ముసయ్యిబ్ (రహ్మతుల్లాహ్  అలై) తన తండ్రి ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అబూ తాలిబ్ చావు సమీపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విచ్చేసిరి, అప్పుడు ఆయన వద్ద అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య మరియు అబూ జహల్ కూర్చుని ఉండిరి. అప్పుడు ప్రవక్త ఈ విధముగా సంబోధించెను: “నా ప్రియమైన బాబాయి! అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వండి. నేను మీ సాక్ష్యమును అల్లాహ్ వద్ద సమర్పించుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరు అబూ తాలిబ్ తో, నీవు అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని చేజార్చుతావా? అని ప్రశ్నించిరి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఆ ఇద్దరూ తమ మాటలను మరీ మరీ తిప్పి ప్రశ్నించుచుండిరి. చివరికి అబూ తాలిబ్, తమ అబ్దుల్ ముత్తలిబ్ ధర్మము పైనే ఉండుటకు నిశ్చయించుకొనెను. అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమిచ్చుటకు నిరాకరించెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “నన్ను అల్లాహ్ వారించనంత వరకూ నేను మీ మోక్షము కొరకు అల్లాహ్ కు మనవి చేస్తాను” అని పలికెను. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యాలు అవతరింపజేసెను. 

مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ 

“బహుదైవారాధకుల మోక్షము కొరకు ప్రార్థించుట ప్రవక్తకూ, విశ్వాసులకూ తగని పని, వారు వారికి బంధువులైనప్పటికీ.” (9:113) 

అల్లాహ్ అబూతాలిబ్ గురించి ఖుర్ఆన్ (28:56)లో ఆ వాక్యము అవతరింపజేసెను. 

దీనిలో 12 పాఠములు కలవు 

1. వాక్యముల (28:56) భావము తెలుపబడెను. 

2. వాక్యముల (9:113) భావము తెలుపబడెను

3. ప్రవక్త “అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్య మివ్వమని కోరుట.” 

4. ప్రవక్త అబూ తాలిబి ని అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వమని కోరినప్పుడు వారు ఇద్దరు ఆయనను అడ్డుకున్నారు. 

5. తన బాబాయి అల్లాహ్ ను విశ్వసించాలని ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) శాయశక్తులా ప్రయత్నిం చారు.

6. ఎవరైతే అబ్దుల్ ముత్తలిబ్ విశ్వాసి అని అనుకుంటారో, వారికి అతను విశ్వాసి కాదని స్పష్టమవుతుంది. 

7. అబూ తాలిబ్ మోక్షము కొరకు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వేడుకొన్నప్పుడు, వారించబడెను.

8. చెడ్డవారితో స్నేహము చేయుట వలన అపార నష్టము వాటిల్లును

9. తమ తాతముత్తాతల సంప్రదాయములను, ఆధారములు లేకుండా పాటించుట నష్టదాయకము

10. అబూ జహల్ చేసినటువంటి వక్ర కార్యములు చేయువారందరికీ గుణపాఠము. 

11. జీవితపు చివరి ఘడియల్లోని ఆచరణలే మోక్ష భాగ్యము కలిగి ఉన్నవి. 

12. మార్గభ్రష్టులు చూపిన నిరాధార తాతముత్తాతల సంప్రదాయాలను (10:113) నమ్ముట వలననే అబూ తాలిబ్ విశ్వాసి కాలేకపోయారని గ్రహించవలెను. 

పాఠము- 19 : ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ

“ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయాలలో హద్దుమీరి ప్రవర్తించకండి. అల్లాహు కు సత్యం తప్ప వేరే ఏ విషయాలనూ ఆపాదించకండి.” (అన్-నిసా- 4:171) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వాక్యము (71:23) గురించి ఈ విధముగా వివరించెను: 

“వీరంతా (వద్, సువా, యగూస్, యవూఖ్, నసర్) నూహ్ (అలైహి స్సలాం) సంతతికి చెందిన మత పెద్దలు. వారు మరణించినప్పుడు అప్పటి ప్రజలు దుఃఖిస్తున్న సమయములో షైతాను ఆ ప్రజలకు ఆ పుణ్యవంతులు కూర్చునే చోట వారిని గుర్తించుకొనుట కొరకు వారి విగ్రహాలను ప్రతిష్ఠీకరించమని ఉసిగొల్పెను. వారు రాళ్ళను (విగ్రహాలను) ఆరాధించేవారు కాదు. అప్పటి ప్రజలు మరణించిన తర్వాత, వారి తర్వాత వచ్చిన ప్రజలు ధర్మ (మత) విద్యను కోల్పోయి, వాస్తవాలను మరచి ఆ విగ్రహాలను ఆరాధించుట ప్రారంభించారు.” (బుఖారి) 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపెను: 

“సలఫ్ సాలెహీన్ ఈ విధముగా విశదీకరించిరి. వారు మరణించిన తర్వాత వారి శిష్యులు. వారి సమాధుల వద్ద కూర్చొనుట ప్రారంభించారు. తరువాత వారి విగ్రహాలను తయారుచేశారు. ఆ విధముగా చాలా కాలము గడిచిన పిదప వారి ఆరాధన ప్రారంభమయ్యెను.”

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉద్బోధిం చెను. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే ఈసా ఇబ్నె మరియం (అలైహిస్సలాం) విషయంలో క్రైస్తవులు హద్దుమీరిపోయారో!! నేను ఒక దాసుణ్ణి. మీరు నన్ను అల్లాహ్ దాసుడు, ప్రవక్త అని పలకండి.” (బుఖారి, ముస్లిం) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈవిధముగా ప్రబోధిం చారు: “దైవదాసులు విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. హద్దుమీరి ప్రవర్తించుట వలనే పూర్వ ప్రజలు మార్గభ్రష్టులయ్యారు.” (అహ్మద్, తిర్మిజీ, అబూదావూద్) 

హజరత్ అబ్దులా బిన్ మస్ ఊద్  (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హద్దుమీరి ప్రవర్తించువారు నాశనమగుదురు” అని మూడు సార్లు పలికెను. 

దీనిలో 20 పాడములు కలవు 

1. ఈ భాగము మరియు రాబోవు 2 భాగములు చదివిన ఎడల ఇస్లాం మరియు ఇతర మతాల మధ్యగల భేదము స్పష్టమగును. మనస్సులను మార్చగల అధికారము అల్లాహ్ కే కలదని స్పష్టమగును. 

2. దైవప్రవక్తల విషయంలో హద్దు మీరుట వలనే భూమిపై మొదటి సారిగా విగ్రహారాధన ప్రారంభమయ్యెను. 

3. అల్లాహ్ పంపిన ప్రవక్తలు బోధించిన ధర్మములో మార్పులు చేయుట వలనే ప్రజలు మార్గభ్రష్టులయ్యారు. 

4. ప్రజలు వక్ర కార్యములకు తొందరగా లోనవుతారు. కాని ఇస్లాం దీనిని వారించెను

5. బహుదైవారాధన ప్రారంభమగుటకు కారణం, మత గురువుల విషయంలో హద్దుమీరుట, తదుపరి వారు తమ గురువుల విద్యను అర్థం చేసుకొనలేకపోవుట. 

6. వాక్యము (71:23) భావమును విశదీకరించి తెలుపబడెను. 

7. వాస్తవంగా మనిషి మంచికి దూరమవుతూ చెడుకి సమీపిస్తూ ఉంటాడు. 

8. సత్యమును నిరాకరించుట వలనే కల్పిత వక్ర కార్యములకు పాల్పడు తారని స్పష్టమవుతుంది. 

9. కల్పిత కార్యము చేయువానికి దాని ప్రతిఫలము తెలియనప్పటికీ షైతానులకు బాగా తెలుసును. 

10. హద్దుమీరి ప్రవర్తించుట నిషిద్ధం. హద్దుమీరి ప్రవర్తించుటకు దారితీయు విషయాలు తెలుసుకోవలెను. 

11. శ్మశానములో మంచి పని కొరకు కూర్చొనుట కూడా చాలా నష్ట దాయకము. 

12. విగ్రహాల నిషిద్ధం మరియు వాటిని తుడిచిపెట్టవలసిన ఆవశ్యకత స్పష్టమవుతుంది. 

13. బహుదైవారాధన లేదా అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అంటే అర్ధము స్పష్టముగా తెలుసుకోవలెను. కాని చాలా మంది ముస్లింలకు ఇది తెలియదు.

14. విచారకరమైన విషయం: వారు ఈ విషయాలను హదీసు పుస్తకాలలో చదువుతారు. వాటిని అర్థం చేసుకుంటారు. కాని వారు చేయు పనులు మత గురువులను గౌరవించుట కోసమే అనుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన బహుదైవారాధన, అవిశ్వాసులు చేయు విగ్రహారాధననే బహుదైవారాధన అని భావించుచున్నారు.

15. వాటిని వేడుకొనువారు, అవి సిఫారసు చేయగలవని నమ్మేవారు.

16. తదుపరి బహుదైవారాధకులు, మత పెద్దలు, ఆ విగ్రహాలను ఆరాధించుటకు అధిష్టించినట్లు భావించిరి. 

17. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే క్రైస్తవులు ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) విషయంలో హద్దుమీరిపోయారో!!! “నేను ప్రజలకు సఫలీకృత మార్గము చూపువాడను కాను” అని ప్రవక్త స్పష్టముగా తన బాధ్యతను నిర్వర్తించెను

18. హద్దుమీరి ప్రవర్తించువారు ఎప్పుడూ నాశనమవుతారు. 

19. దీని ద్వారా మత విద్య నభ్యసించవలసిన ఆవశ్యకత తెలియును. విద్య నభ్యసించకపోవుట వలన కలుగు నష్టము తెలియును. నూహ్ (అలైహిస్సలాం) సంతతిలో దైవ విద్య అంతరించిన కారణంగానే బహుదైవారాధన ప్రారంభమయ్యెను. 

20) మత గురువులు మరణించిన తదుపరి వారు దైవ విద్యనభ్యసించక పోవుటయే దైవవిద్య అంతరించుటకు కారణము. 

పాఠము – 20 : పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అస) ఈ విధముగా ఉల్లేఖించారు: 

“హజరత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు తను అబీసీనియాలో చూసిన ఒక చర్చి గురించి, అందులోని చిత్రాలు మరియు విగ్రహాల గురించి ప్రస్తావిం చెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ప్రబోధించెను: “వారిలోని మత గురువు మరణించినప్పుడు వారు అతని సమాధిపై మస్జిద్ కట్టెడివారు మరియు దానిలో ఇలాంటి చిత్రాలను చిత్రించెడివారు. వీరు అల్లాహ్ వద్ద అందరికంటే హీనులు.” వీరు రెండు చెడులను ఒక చోట జమచేసిరి. ఒకటి సమాధులను ఆరాధించుట, రెండవది చిత్రాలు చిత్రించుట. 

మరోచోట (బుఖారి, ముస్లిం) ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ లోకము విడిచి పోవునప్పుడు తీవ్రమైన జ్వరంతో దుప్పటి కప్పుకున్నారు. గాభరాపడి దుప్పటి ముఖంపైనుంచి తీసి ఈ విధముగా ప్రబోధించెను. 

యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులు కాగలరు! వారు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగాల ఆలయాలుగా మార్చిరి”. దీని ద్వారా ప్రవక్త ఉద్దేశ్యం తన అనుచరులను అటువంటి కార్యముల నుండి నివారించుట, ప్రవక్త సమాధిని, మస్జిద్ చేయగలరని భావించకుంటే ప్రవక్త సమాధి బహిరంగ ప్రదేశములో ఉండేది. 

హజరత్ జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మరణానికి ఐదు రోజుల ముందు ఈ విధముగా ప్రబోధిస్తుండగా విన్నాను: 

నేను అలాహ్ సమక్షమున ప్రకటించుచున్నాను. నేను ఎవ్వరినీ నా ప్రియమైన స్నేహితునిగా ప్రకటించలేదు. నన్ను అల్లాహ్ తన ప్రియమైన స్నేహితునిగా చేసుకొనెను. ఏ విధముగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాంని తన (ఖలీల్) స్నేహితునిగా చేసుకొనెనో, నేను నా అనుచరులలో ఎవరినైనా ప్రియ స్నేహితునిగా చేయదలచుకుంటే అబూబకర్ రదియల్లాహు అన్హు ని చేయుదును. మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకొనిరి. ఎట్టి పరిస్థితి లోను మీరు సమాధులను మస్జిదులుగా చేయవద్దు (పూజించవద్దు). నేను మిమ్మలను ఈ చెడు కార్యముల నుండి నివారించుచున్నాను” (ముస్లిం). 

ప్రవక్త తన చివరి ఘడియల్లో కూడా ఇటువంటి కార్యాముల నుండి నివారిం చెను. సమాధులను పూజించువారిని శాపగ్రస్తులు అగుదురని వక్కాణించెను. సమాధులను పూజించుట, సమాధుల వద్ద నమాజు ఆచరించుట నిషేధించ బడినది. ఆయిషా రదియల్లాహు అన్హా తెలిపెను: “ప్రవక్త సమాధిని మస్జిద్ చేయగలరని భావించకుంటే” యొక్క అర్థము కూడా ఇదే! అనుచరులు ఎప్పటికీ ప్రవక్త యొక్క సమాధిపై మస్జిద్ కట్టువారు కాదు. ఎందుకంటే ఏ ప్రదేశములో అయితే నమాజు చేయబడునో ఆ ప్రదేశము మస్జిద్ అనబడును. 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను. (బుఖారీ, ముస్లిం) “సకల భూమిని నా కొరకు మస్జిద్ మరియు శుద్ది పొందు ప్రదేశముగా చేయబడెను.” 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ప్రళయ దినం ఎవరిపై సంభవించునో వారు పరమ నీచులు మరియు ఎవరైతే సమాధులను మస్జిద్లుగా భావించుకుంటారో వారు కూడా పరమ నీచులు.” ఇబ్నె మస్ ఊద్  రదియల్లాహు అన్హు ఉల్లేఖించెను (ప్రామాణిక సనద్ ద్వారా ముస్నద్ అహ్మద్ మరియు సహీ సనద్ అబూహాతిం పొందు పరచెను. ఇది మర్ ఫు  హదీసు). 

దీనిలో 16 పాఠములు (భావాలు) కలవు 

1. మతగురువుల సమాధిపై మస్జిద్ నిర్మించుటను ప్రవక్తగారు స్పష్టముగా నిషేధించెను. 

2. బొమ్మలను, విగ్రహాలను తయారు చేయుట నిషేధింపబడెను. 

3. ఈ వక్ర కార్యముల నిషేధము మొదటి నుంచి ఉన్నప్పటికీ, మరల చివరి ఘడియల్లో, వాటిని నివారించుటతో, దాని ప్రాముఖ్యత స్పష్టమగుటయేగాక అది అతి పెద్ద పాప కార్యమని అర్థమగును.

4. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమాధిని కూడా ‘మస్జిద్’ చేయవద్దని స్పష్టపరచెను.

5. ప్రవక్తలు, మత గురువుల సమాధులపై మస్జిద్ లు కట్టి ఆరాధనలు చేయుట యూదుల, క్రైస్తవుల ఆచరణ

6. దాని కారణంగా (సమాధులపై మస్జిద్ లు నిర్మించిన యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులవుతారని పలికెను.

7. అందుమూలముగా వారు శాపగ్రస్తులగుదురని తెలుపుటకు కారణం, ముస్లింలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిపై మస్జిద్ కట్టకూడదని స్పష్టీకరించుట. 

8. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిని, బహిరంగ ప్రదేశములో లేకుండా చూడుటకు కారణము కూడా స్పష్టమగును. 

 9. సమాధులను మస్జిద్లు చేయుట అంటే అర్థం కూడా స్పష్ట మవుతుంది. 

10. ప్రవక్త సమాధులపై మస్జిద్ నిర్మించువారిని, ప్రళయదినం ఎవరిపై సంభవించునో వారిని ఒకేచోట విశదీకరించిరి, నిశ్చయముగా ఆయన, అవిశ్వాసము, బహుదైవారాధన అనుచరులలో ప్రబలుటకు ముందే అవి ఎట్లు ప్రబలునో, వాటి కష్టనష్టములు ఏమిటో క్షుణ్ణముగా విశదీకరించెను. 

11. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మరణమునకు 5 రోజుల ముందు ప్రబోధించిన ఖుత్బాలు రాఫిజీ, జహమియ (అను) కూటములు నిరాధారములైనవని స్పష్టమగును. రాఫిజా మొట్టమొదట సమాధిపై మస్జిద్ నిర్మించిరి. వారి వలనే ముస్లింలలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట, కల్పిత కార్యములు ప్రారంభమయ్యెను. 

12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  మరణించినప్పుడు, జ్వరము, తలనొప్పి వంటి బాధలు కలిగెనని తెలియుచున్నది.

13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ యొక్క ప్రియ స్నేహితుడు (ఖలీల్) అయ్యే అదృష్టం కలిగినది. 

14. ‘ఖలీల్’ అంటే ప్రియ స్నేహితుడు కంటే ఉత్తమమైన పదము.

15. దీనిలో అబూబకర్ సిద్దీక్ (రదియల్లాహు అన్హు) అందరికంటే ఉత్తమ అనుచరుడని స్పష్టమగును. 

16. ఈ ప్రబోధనలో అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా అర్హుడని స్పష్టమగును.

పాఠము-21 : పుణ్యాత్ముల సమాధుల విషయంలో హద్దుమీరుట దైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“ఓ అల్లాహ్ ! నా సమాధిని విగ్రహమువలె చేయకుము. దేనినైతే ప్రజలు పూజించుదురో వారిపై అల్లాహ్ ఆపద వచ్చిపడునో ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా మార్చుకుందురో.”

ఇబ్నె జరీర్ రహమతుల్లాహ్ అలైహ్ “అఫరఐ తుముల్లాత వల్ ఉజ్జా” యొక్క తఫ్సీర్, సుఫ్యాన్, మన్ సూర్  విధానములో ముజాహిద్ గారి ఉల్లేఖనంలో ఈ విధముగా విశదీకరించెను: 

“లాత్” హజ్ చేయుటకు వచ్చువారికి విపరీతమైన సేవలు అందించువాడు. అతడు మరణించిన తరువాత ప్రజలు అతని సమాధిపై, సమాధి సేవకులై కూర్చుండిరి. 

అబూ అల్ జవ్జా  కూడా హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్షు) నుంచి ఈ విధముగా ఉల్లేఖించారు: లాత్ హాజీలకు విపరీతమైన సేవలు అందించేవాడు. 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), సమాధులను దర్శించు స్త్రీలను శాపగ్రస్తులవుతారని పలికెను. సమాధులపై మస్జిద్ లు నిర్మించేవారు, సమాధుల వద్ద దీపములు వెలిగించేవారు కూడా శాపగ్రస్తులవు తారని పలికెను. (దీనిని  ‘అహ్లుస్ సునన్’ పొందుపరిచెను). 

దీనిలో 10 పాఠములు కలవు 

1. విగ్రహముల గురించి విశదీకరించబడెను (కాబా గృహములో అధిష్టిం చిన విగ్రహముల గురించి). 

2. ఆరాధన విశదీకరించబడెను. 

3. ప్రవక్త ఆయనకు ఏ కీడు సంభవించునని అనుమానము కలిగెనో వాటి నుండి అల్లాహ్ ను శరణు వేడుకొనెను. 

4. ప్రవక్త “యా అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించు విగ్రహముగా చేయకుము” అని ప్రార్థించినప్పుడు “మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా చేసుకొనిరి” అని కూడా స్పష్ట పరిచెను. 

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఇటువంటి పనులు చేసిన వారిపై విపరీతమైన ఆపదలు వచ్చిపడెను” అని ఉద్భోదించెను

6. ‘లాత్’ అరబ్బులలో అతి పెద్ద విగ్రహము. దాని ఆరాధన ఏ విధముగా ప్రారంభమయ్యేనో తెలుపబడెను. 

7. ‘లాత్’ ఒక మంచి సేవకుని సమాధిగా ఉండెనని తెలియుచున్నది. 

8. ‘లాత్’ సమాధిలో పూడ్చిపెట్టబడిన మనిషి పేరు. 

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “సమాధులను దర్శించు స్త్రీలు శాపగ్రస్తులగుదురని”  తెలిపెను. 

10. “సమాధులపై దీపములు వెలిగించువారు కూడా శాపగ్రస్తులగుదురని” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  పలికెను. 

పాఠము – 22 : ఏకదైవోపాసనను భద్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ

“(ప్రజలారా!) మీ నుంచే మీ వద్దకు ఒక ప్రవక్త విచ్చేసెను. మీరు హాని చెందుట ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తుండును. ఆయన విశ్వాసులపై వాత్సల్యం, కారుణ్యం కలవాడు.” ఒకవేళ వీరు విముఖత తెలిపినచో, మీరు వారితో ఈ విధముగా పలకండి, “నాకు అల్లాహ్ యే చాలును. ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన మహత్తరమైన అర్థ(సింహాసనము) కు ప్రభువు.” (9:128-129) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త చేసిన ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మీ ఇళ్ళను శ్మశానాలుగా చేయకండి, నా సమాధిని జాతర చేయు స్థలముగా మార్చకండి. మీరు ఎక్కడ ఉన్నా నాపై సలాము పంపండి. మీ సలాము నాకు చేర్చబడును”. (అబూ దావూద్ హసన్ సనద్ దీని రావి ‘సిఖహ్’) 

జైనుల్ ఆబిదీన్ అలీ బిన్ హుసైన్ (రహమతుల్లాహ్ అలైహ్) ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద ప్రార్థన చేయు చుండగా చూసి, అతనిని వారించి, నేను నీకు ఆ హదీసు తెలుపుదునా, అది నా తండ్రిగారు హజరత్ హుసైన్ (రదియల్లాహు అన్హు), నా తాతగారు హజరత్ అలీ (రదియల్లాహు అన్హు)తో, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి వినెను. ఆయన ఈ విధముగా సంబోధించెను: “నా సమాధిని జాతర ప్రదేశముగా మార్చకండి. మీరు (నమాజు చదకవ, ఖుర్ఆన్ చదవక, దుఆ చేయక) మీ ఇళ్ళను శ్మశానాలుగా మార్చుకోవద్దు. నాపై దరూద్ పంపు తుండండి, మీరు ఎక్కడ ఉన్నా మీ సలాము నాకు చేర్చబడును.” 

దీనిలో 9 ప్రకరణములు కలవు 

1. వాక్యము (9: 128-129) యొక్క భావము మరియు వివరణ తెలుపబడెను. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన అనుచరులను బహుదైవారాధన సరిహద్దుకు కూడా పోకుండా వారించెను. 

3. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాపై విశేష వాత్సల్యం, కరుణ కలిగియుండెను. మార్గదర్శకమును అతిగా కాంక్షించేవారు

4. ప్రవక్త తన సమాధిని దర్శించుటను ప్రత్యేకంగా వారించెను. ఆయన సమాధిని దర్శించుట మంచి కార్యము అయినప్పటికీ

5. సమాధులను ఎక్కువగా సందర్శించుటను ప్రవక్త వారించెను.

6. ప్రవక్త నఫిల్ నమాజులు ఇంటిలో ఆచరించమని ఉద్భోదించారు.

7. అనుచరులందరికీ శ్మశానములో నమాజు చేయరాదని తెలుసును.

8. సలాం ఎక్కడ ఉండి చెప్పినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు చేరును. దాని కొరకు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళనవసరం లేదు.

9. దీనిలో ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘బర్ జఖ్’ లో ఉన్నట్లు స్పష్టమగును. అనుచరులు పంపిన సలాములు ఆయనకు చేర్చబడును. 

పాఠము-23 : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను: 

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ

గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యా దైవాల (తాగూత్) పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు. (4:51) 

قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوت

“మీరు వారితో ఇలా చెప్పండి. నేను మీకు వారి గురించి తెలుపనా, ఎవరి పరిణామము పాపులకంటే హీనంగా ఉంటుందో? వారు అల్లాహ్ శాపగ్రస్తులైరి. ఆగ్రహించబడిరి. వారు కోతులు, పందులు చేయబడ్డారు. వారు తాగూతు దాస్యం చేశారు.” (5:60) 

قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

వారిలో ఎవరైతే తమ వ్యవహారములలో జయించారో, ” మేము తప్పకుండా వారిపై ఆరాధనాలయము నిర్మించెదము” అని పలికిరి. (18:21) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు మునుపటి సమాజములను అనుసరిస్తూ, వారితో సమానులై పోతారు. ఒకవేళ వారు పుట్టలో దూరినా, మీరు కూడా దూరిపోతారు.” అప్పుడు అనుచరులు, “మునుపటి సమాజములంటే యూదులు, క్రైస్తవులా?” అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘మరెవరు?’ అని జవాబు పలికారు. 

హజరత్ సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “అల్లాహ్ నా కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. నేను దాని యొక్క తూర్పు, పడమరలను తిలకించితిని. నా అనుచరులు రాజ్యము ఉన్నంత వరకు నా తుదిచూపు ఉన్నది. ఎంత వరకు అయితే నాకు భూమిని దగ్గర చేసి చూపెట్టబడెనో, నాకు ఒక ఎర్రటి, రెండవది, తెల్లటి నిధులు ప్రసాదించబడెను. నేను నా ప్రభువుతో నా అనుచరుల కొరకు ఈ విధముగా ప్రార్థించితిని. “వారిని అనావృష్టితో నాశనము చేయకుము. వారిపై బద్ధ శత్రువును అధిష్టించకుము. వారిని నాశనము చేసి విడిచిపెట్టగలడు. నా ప్రభువు ఈ విధముగా సెలవిచ్చెను: ఓ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), నేను నిర్ణయించిన తర్వాత అది మార్చబడదు. నేను మీ అనుచరుల విషయంలో మీ ప్రార్థన స్వీకరించితిని. వారిని అనావృష్టితో నాశనము చేయను. వారిని నాశనము చేసే బద్ద శత్రువులను కూడా నియమించను, శత్రువులందరూ వారికి వ్యతిరేకంగా ఏకీభవించినాసరే, కాని వారే ఒకరినొకరు నాశనము చేసుకొందురు. ఖైదీలుగా చేయుదురు. 

హాఫిజ్ బర్ ఖాని కూడా తన పుస్తకము ‘సహీ లో దీనిని పొందుపరచెను. “నాకు నా అనుచరులలో మార్గభ్రష్టము చెందిన మార్గదర్శకుల విషయంలో అపాయము కానవస్తుంది. ఒకవేళ వారిలో ఒకసారి యుద్ధము ప్రారంభమైన యెడల, ప్రళయదినం వరకూ అది ఆగదు. నా అనుచరులలో ఒక సమూహము బహదైవారాధకులతో చేయి కలిపేంతవరకూ, నా అనుచరులలో కొన్ని సమూహములు విగ్రహాలను పూజించనారంభించనంత వరకూ ప్రళయదినము సంభవించదు. నా ఉమ్మత్ లో  30 మంది దజ్జాల్లు వచ్చెదరు. వాళ్ళందరూ మేము ప్రవక్తలమని వాదన చేయుదురు. నేను చివరి ప్రవక్తను, నా తర్వాత వేరే ప్రవక్త ఎవ్వరూ రారు. నా అనుచరులలో ఒక సమూహము ఎల్లప్పుడూ సత్యమార్గములో ఉంటారు. అల్లాహ్ వారికి సహాయము చేస్తాడు. వారిని వదలి వెళ్ళువారు వారికి ఏమీ కీడు చేయలేరు. చివరికి ప్రళయ దినం సంభవించును. 

దీనిలో 14 ప్రకరణములు కలవు 

1. వాక్యము (4:51) భావము తెలుపబడెను (దానిలో విగ్రహాలు, షైతాన్ను ఆరాధించిన విషయం కలదు). 

2. వాక్యము (5:60) భావము కలదు. పాపులకంటే నీచమైన వారి గురించి తెలుపబడెను. 

3. వాక్యము (18:21) భావము కలదు. ‘కహఫ్’ వారి గుహపై మస్జిద్ నిర్మాణం గురించి తెలుపబడెను. 

4. జిబ్త్, తాగూత్లను విశ్వసించువారి గురించి తెలుపబడెను. 

5. తమ అవిశ్వాసము తెలిసిన అవిశ్వాసులు, విశ్వాసులకంటే ఉత్తములని యూదుల భావన. 

6. సత్యవంతులు ప్రతి కాలంలోను ఉన్నారు, ఉంటారు అని స్పష్టమవుతుంది. 

7. అనుచరులలో చాలా మంది బహుదైవారాధనకు పాల్పడతారు. 

8. ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ తాను ప్రవక్త అని వాదన చేసెను. అతడు ఏక దైవారాధన, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్య సంబోధమని నమ్మెడివాడు. కాని ఖుర్ఆన్లో ముహమ్మద్ (సల్లల్లాహు వ అలైహి వ సల్లం) చివరి ప్రవక్త అని విశ్లేషించినప్పటికి, కొన్ని సమూహములు అతనిని అనుసరించిరి. 

9. సత్యవంతులు సాంతం నాశనము కారు. ప్రళయ దినం వరకూ ఒక సత్యవంతుల సమూహము ఉంటుంది. 

10. సత్యవంతులను విడిచిపెట్టి వెళ్ళేవారు వారికి ఏ విధమైన కీడు చేయలేరు. 

11. సత్యవంతులు ప్రళయ దినం వరకూ ఉంటారు. 

12. ఈ ఉత్తమ నిదర్శనములు తెలుపబడెను. అల్లాహ్ తన ప్రవక్త కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపినవన్నీ నిజమని తెలిసినది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అల్లాహక్కు విన్నవించుకున్న రెండు దుఆలు స్వీకరించబడినట్లు తెలిపెను. మూడవ దుఆ స్వీకరించబడలేదు. తన ఉమ్మత్ లో  యుద్ధము ప్రారంభమై ప్రళయదినం వరకు అంతం కాదని తెలుపుట, నా ఉమ్మత్ లో  అసత్య ప్రవక్తలు వాదనలు చేయుదురు అని తెలిపెను. ప్రళయదినం వరకూ సత్య సమాజము అభివృద్ధి చెందుతుండు నని తెలుపుట. ఈ పైన తెలిపినవన్నీ సంభవించెను, ఏవైతే నమ్మశక్యము కానివో అవి జరిగెను. 

13. మార్గభ్రష్టత చెందిన నాయకుల వలనే ప్రవక్త అనుచర సమాజానికి అపాయము కలదని తెలుపబడింది. 

14. ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం)  విగ్రహారాధన యొక్క భావము విశదీకరించితెలిపెను. 

పాఠము- 24 : చేతబడి 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను: 

وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَريهُ مَالَهُ فِي الآخِرَةِ مِنْ خَلَاقٍ 

“ఈ విద్యను నేర్చుకొనేవారికి పరలోకములో భాగము ఏ మాత్రం లేదని వారికి బాగా తెలుసును.” (2:102)

يُؤْمِنُونَ بِالجبت والطاغوت 

“వారు విగ్రహాలను, షైతానులను విశ్వసిస్తున్నారు. వారు జిబ్త్, తాగూత్ ను విశ్వసించారు.”(4:51) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను. ‘జిబ్త్’ అనగా – చేతబడి (జాదూ), ‘తాగూత్’ అనగా షైతాన్.” 

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: “తాగూత్ అంటే ఎవరిపై షైతాన్ వచ్చునో అటువంటి జ్యోతిష్యుడు, ప్రతి దేశములో వేరే జ్యోతిష్యుడు ఉండేవాడు.” 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “ఏడు నాశనము చేయు పనుల నుండి తమను తాము కాపాడుకోండి.” అప్పుడు అనుచరులు ఆ ఏడు కార్యములు ఏవి అని ప్రశ్నించగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను: 

1. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట. 

2. చేతబడి చేయుట, మంత్రములతో కనికట్టు చేయుట. 

3. అనవసరంగా ఎవరినైనా సంహరించుట. 

4. వడ్డీ వ్యాపారము చేయుట. 

5. అనాధల సొమ్ము తినుట. 

6. శత్రువులతో యుద్ధము చేయునప్పుడు వెనుదిరిగి పారిపోవుట. 

7. పతివ్రతలపై అభాండము మోపుట. 

హజరత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: “జాదు (చేతబడి) చేయువానికి మరణ శిక్ష విధించండి.” (దీనిని తిర్మిజీ పొందుపరచెను. ఇది దైవప్రవక్త సహచరుని ఉవాచ అన్న విషయం సరైనదని తెలిపెను. 

బజాల బిన్ అబ్దహు ఈ విధముగా పేర్కొనెను. “ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు), జాదు చేయువారికి మరణ శిక్ష విధించమని ప్రకటించినప్పుడు, మేము ముగ్గురు చేతబడి చేయువారికి మరణశిక్ష విధించితిమి. (సహీబుఖారీ) 

హఫ్సా (రదియల్లాహు అన్హు) తన సేవకురాలిని జాదు చేసిన కారణముగా మరణశిక్ష విధింపజేసెను. (ముఅత్తా ఇమాం మాలిక్) 

ఇదే విధముగా జుందుబ్ (రదియల్లాహు అన్హు) దీనిని ధృవీకరించెను. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లా అలై) జాదు చేయువారికి మరణశిక్ష విధించారన్న విషయాన్ని ముగ్గురు అనుచరులు ధృవీకరించారని తెలిపెను. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (2:102)లో జాదు నేర్చుకొనేవారికి ప్రతిఫలము తెలుపబడెను. 

2. వాక్యము (4:51)లో జాదు చేయువారు విగ్రహాలను షైతానును విశ్వసిం చుదురని తెలుపబడెను. 

3. జిబ్, తాగూత్ యొక్క భావము మరియు వాటి మధ్య భేదము తెలుప బడెను. 

4. తాగూత్ జిన్నాతులు కూడా ఉంటారు. మానవులు కూడా ఉంటారు. 

5. వినాశము చేయు ఏడు కార్యములు తెలుపబడెను. వాటిని నివారించెను. 

6. జాదు చేయువాడు అవిశ్వాసి. 

7. జాదు చేసేవాడు క్షమాపణ కోరుకోకుండా చనిపోతే, అతడు నరకములోకి నెట్టివేయబడతాడు.

8. జాదు చేయువారు ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలములో కూడా ఉండిరి. ఇప్పటికీ ఉన్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

పాఠము- 25 : జాదులోని కొన్ని విధానాలు 

ఇమాం అహ్మద్ బిన్ హంబల్, ముహమ్మద్ బిన్ జాఫర్ నుంచి, ఆయన అవుఫ్ బిన్ హిబ్బాన్ బిన్ అల్ అలా నుంచి, ఆయన ఖతన్ బిన్ ఖుబైసా నుంచి, ఆయన తన తండ్రి ఖుబైసా నుంచి, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను. 

“పక్షులను ఎగురవేసి శకునము తీయుట, భూమిపై రేఖలు గీసి ప్రశ్నలు తీయుట (ప్రశ్నశాస్త్రము), ఏదైనా అడ్డు వచ్చినచో చెడు అని భావించుట, ఇవన్నీ జాదు యొక్క విధాన ములు.” 

(దీనిని ముస్నద్ అహ్మద్, అబూదావూద్, నసాయి, ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: 

“ఎవరైతే జ్యోతిష్యములో ఎంత భాగము నేర్చుకొనెనో, అంత జాదు నేర్చుకున్నట్లు, ఎంత ఎక్కువ నేర్చుకుంటే, దాని కారణముగా అంత (భాగము) ఎక్కువ పాపము పెరుగును.” (అబూదావూద్, సహీ సనద్ పొందుపరచెను) 

హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“ఎవరైతే ముడివేసి దానిలోకి ఊదునో, నిశ్చయముగా అతడు జాదు చేసెను. ఎవరైతే జాదు చేసెనో అతడు బహుదైవారాధనకు పాల్పడెను, ఏ వ్యక్తి అయినా (తన నడుముకు, మెడకు, చేతికి) ఏదైనా (కట్టిన లేక) వ్రేలాడదీసిన యెడల అతనిని దానికి అప్పగించబడును”. (సునన్ నసాయి) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “నేను మీకు “ఇదతు” గురించి తెలుపనా? అది ఒక దాడి. దాని ద్వారా ప్రజలలో కలత రేపబడును.” (ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: కొన్ని ప్రసంగాలలో కూడా ‘జాదు’ లాంటి ప్రభావం ఉండును

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. ‘తర్ ఖ్’, ‘తీయర’, ‘అయాఫ’, ‘జిబ్త్’ అన్నీ జాదు విధానములు. 

2. ఈ మూడింటి గురించి వివరముగా తెలుపబడెను. 

3. జ్యోతిష్యము కూడా జాదులో ఒక విధానము. 

4. ముడివేసి ఊదుట కూడా జాదు విధానము అని చెప్పబడింది. 

5. చాడీలు చెప్పి ప్రజలలో కలత రేపుట కూడా జాదు విధానము. 

6. కొంతమంది వాక్చాతుర్యము కొన్ని సమయాలలో జాదులాగ పని చేయును. 

పాఠము-26: జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి 

కొంత మంది ప్రవక్త సతీమణులు ముతహ్హరాత్ (రదియల్లాహు అన్హున్న) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొన్నట్లు ఉల్లేఖించిరి: (సహీముస్లిం) 

ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్ళి, ఏదైనా అడిగి తెలుసుకొని దానిని రూఢీ పరచినచో, 40రోజుల వరకు అతని నమాజు స్వీకరించబడదు.” (అబూదావూద్) 

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: 

“ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు లేదా గుప్త విద్యకలవాడి దగ్గరకు వెళ్ళి అతను తెలిపిన మాటలను ధృవీకరించినచో, ఈ వ్యక్తి మతము (ఇస్లాం)ను నిరాకరించిన వాడవుతాడు.” (అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ) (ఇమాం హాకిం దీనిని తన పుస్తకములో బుఖారీ, ముస్లింల సిద్ధాంతముల ప్రాతిపదికన సహీ అని తెలిపెను). 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. 

“శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను) 

ఇమాం బగ్వీ రహ్మతుల్లా అలైహ్ ‘అర్రాఫ్’ గురించి ఈ విధముగా తెలిపెను, కొన్ని మాటలతో కార్యముల విద్య యొక్క వాదన చేయుట, మాట ద్వారా తిరస్కరించబడిన, కోల్పోయిన వస్తువుల గురించి తెలుపుట, 

కొంతమంది విద్యావేత్తలు ‘అర్రాఫ్’ అనగా ‘కాహిన్’ అంటే భవిష్యత్తులో జరుగు వాటిని తెలుపువాడు అంటున్నారు. 

షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై), ‘అర్రాఫ్’, అనే పదము, అది కాహిన్, నుజూమి, రమ్మాల్, గుప్త విద్య వాదము చేయుదురో, వారందరి గురించి వాడబడుతుంది. 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా తెలిపెను: ఎవరైతే అక్షరములు (అబాజాద్) వ్రాసి లెక్క వేస్తారో, నక్షత్రముల ద్వారా లెక్క కడతారో నాకు తెలిసినంత వరకు ఈ విధముగా చేయువారికి అల్లాహ్ వద్ద ప్రళయ దినమున ఏ భాగ్యమూ లేదు. 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1. ఖుర్ఆన్ను విశ్వసించుట, కాహిన్ ను విశ్వసించుట ఈ రెండు ఒకే మనస్సులో జమ కాలేవు. 

2. కాహిన్ మాటను ధృవీకరించుట (కుఫ్ర) అవిశ్వాసానికి పాల్పడినట్లు. 

3. ‘కహానత్’ చేయించువాని గురించి నిషేధమని కూడా తెలుపబడెను. 

4. ‘ఫాల్’ (శకునము) తీయించుట కూడా నిషేధము. 

5. జాదు చేయించువాని పాపము తెలుపబడెను

6. “అబాజాద్” వ్రాసి లెక్క చేయువారి గురించి తెలుపబడెను. 

7. దీనిలో కాహిన్ మరియు అర్రాఫ్ మధ్య భేదము తెలుపబడెను. (వీరందరూ మతభ్రష్టులు. వీరికి ఇస్లాంతో ఎటువంటి సంబంధము లేదు) 

పాఠము – 27 : జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నషరహ్ (జాదుని జాదు ద్వారా తొలగించుట) గురించి ప్రశ్నించగా, ఆయన “అది షైతాను అమలు (పనులు) అని తెలిపిరి.” (అహ్మద్, అబూదావూద్ ఉత్తమ సనద్ పొందుపరచెను). 

ఇమాం అబూదావూద్ (రహ్మతుల్లాహ్ అలై) ఈ విధముగా తెలిపిరి: ఇమాం అహ్మద్ (రహమతుల్లాహ్ అలై)ను నషరహ్ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: 

“హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ఈ పనులన్నీ చెడ్డ పనులని అయిష్టత చూపేవారు.” 

ఇమాం ఇబ్నె ఖయ్యం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించిరి: 

“చేతబడితో నిరోధించుట. ఇది షైతాన్ కార్యము, నిషేధించబడినది. ఈ విషయంలో జాదును తొలగించువాడు, జాదు చేయబడినవాడు ఇద్దరూ షైతానికి ఇష్టమైన పనులు చేయుదురు. షైతాన్ సంతోషించే పనులు చేయుట ద్వారా షైతాన్ తన ప్రభావమును తొలగించును. దీనిలో 2 విధానములు కలవు. 

1. జాదును దాని ద్వారానే తొలగించుట. ఇది షైతాను పని. 

2. బహుదైవారాధనకు తావులేని ఖుర్ఆన్ వాక్యములు అల్లాహ్, దుఆ చేస్తూ జాదు యొక్క వైద్యము చేయవచ్చును. 

దీనిలో 2 ప్రకరణములు కలవు 

1. జాదు వైద్యము జాదు ద్వారా చేయుట నిషిద్ధము. 

2. ఖుర్ఆన్ ద్వారా జాదు వైద్యము చేయుట సరియైనది. 

పాఠము 28 : దుశ్శకున (అపశకున) దర్శనము 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

ألاَ إِنَّمَا بِرُهُمْ عِنْدَ اللهِ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ 

“నిశ్చయముగా వారి అపశకునం అల్లాహ్ అధీనంలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు.” (7:131) 

قَالُوا طَابِرُكُمْ مَعَكُمْ، اَبِنْ ذُكِرْتُم ، 

بل انتُم قَوْم مرفونَ ) 

అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు: “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది. ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించిపోయారు.” (36:19) 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖిం చారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధీ అల్లాహ్ ఆజ్ఞ లేకుండా సోకదు. దుశ్శకునం అనేది లేదు. గుడ్లగూబ కూతలు కూడా ఏ విధమైన అపశకునానికి దారితీయవు. ‘సఫర్’ నెలలో కూడా ఏ విధమైన అపశకునం లేదు.” (సహీబుఖారి,సహీముస్లిం) 

సహీ ముస్లింలో ఈ పదములు, అధికముగా పొందుపరచబడెను. 

“నక్షత్రముల బెడద మరియు భూతముల బెడద అనేవి అవాస్తవములు.” 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధి కూడా అందరికీ అంటదు. దుశ్శకునం అనేది లేదు. నాకు ‘ఫాల్’ అంటే ఇష్టం”. అప్పుడు అనుచరులు ప్రశ్నించారు: ‘ఫాల్’ అంటే ఏమిటి? అని.” “ఉత్తమమైన మంచి మాట” అని ప్రవక్త జవాబు ఇచ్చెను. 

ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దుశ్శకునం గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా ప్రబోధించెను: 

“వీటన్నింటికంటే ఉత్తమమైన మంచిమాట మేలైనది. అది ఏ ముస్లించి కూడా అతని విధి నుండి నివారించలేదు. అందుచేత ఎవరైనా చెడును చూచినప్పుడు ఈ దుఆ చదవవలెను: “ఓ అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చలేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహము లేనిదే మాకు మేలు చేకూర్చుకునే శక్తిగాని లేదా కీడు నుండి రక్షించుకునే శక్తిగాని లేదు.” (దీనిని అబూదావూద్ సహీ సనత్తో పొందుపరచెను.) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అపశకునమును విశ్వసించుట అల్లాహు కు భాగస్వాములను కల్పించుట. మనలో ఎవరు (సృష్టి కారణముగా కొన్ని అనుమానాలు కలిగినా) అల్లాహ్ ను విశ్వసించి ఆయనపై నమ్మకము ఉంచిన కారణముగా అల్లాహ్ దానిని నిర్మూలించును.” (అబూదావూద్, తిర్మిజీ) 

హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “అపశకునం అని ఎవరైతే తన కార్యమును మానుకొనెనో అతడు షిర్క్ చేసెను” అని ప్రవక్త తెలిపినప్పుడు అనుచరులు దానికి పాప పరిహారము ఏమిటి అని ప్రశ్నించిరి. దాని పాప పరిహారము ఈ దుఆ “యా, అల్లాహ్ ! నీవు అనుగ్రహించు మేలు తప్ప వేరే మేలు లేదు. నీవు విధించు కష్టము తప్ప వేరేకష్టము లేదు, నీవు తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు.” (ముస్నద్ అహ్మద్) 

ముస్నద్ అహ్మద్ లో హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారని పొందపరచబడినది: “నిన్ను ఏదైనా పని నుండి నివారించునది లేదా ప్రోత్సహించునది దుశ్శకునము.”

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యములు (7:131) మరియు (36:19)ల భావము విశదీకరించి తెలుప బడెను.

2. అల్లాహ్ ఆజ్ఞ లేకుండా ఏ వ్యాధి సోకదని స్పష్టపరచబడెను. 

3. దుశ్శకునం అనేది ఒట్టి భ్రమ అని స్పష్టపరచబడెను. 

4. గుడ్లగూబ కూతలతో అపశకునం వాటిల్లును అని భావించుట కూడా నిరోధించబడినది. 

5. ‘సఫర్’ నెల అపశకునం కలదని భావించుట కూడా నిరోధించ బడింది.

6. ఉత్తమమైన మంచి మాటలు తెలుపవలెను.

7. చెడు మాటలు, మంచి మాటల గురించి విశదీకరించబడెను. 

8. మనస్సులో ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అల్లాహ్ ను విశ్వసించుట వలన అవి దూరమగును

9. ఎవరికైనా మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు హదీసులో తెలుపబడిన దుఆ, “యా, అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చ లేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహం లేనిదే మాకు మేలు చేసే శక్తి ఎవరికీ లేదు. లేదా కీడు నుంచి రక్షించు కునే శక్తిగాని లేదు” అని చదువవలెను. 

10. అపశకునాలను భావించుట షిర్క్క పాల్పడుట అని స్పష్ట పరచబడెను.

11. అపశకునం గురించి విశదీకరించి తెలుపబడెను. 

పాఠము – 29 : జ్యోతిష్యం గురించి 

ఇమాం బుఖారీ (రహమతుల్లాహ్ అలై) తన సహీ బుఖారీలో హజరత్ ఖతాదా (రదియల్లాహు అన్హు) వచనములను పొందుపరచెను: 

“అల్లాహ్ ఈ నక్షత్రములను మూడు కారణముల కొరకు సృష్టించెను. ఆకాశమును అలంకరించుట కొరకు, షైతానులను పారద్రోలుటకు, సముద్రము, భూమిపై దారి తెలుసుకొనుటకు. ఎవరైనా వీటిని మించి వేరే కారణములు భావించిన ఎడల అతను తప్పు దోవ పట్టును, ప్రతి మేలు నుండి తన భాగము కోల్పోవును. అతను తనకు తెలియని జ్ఞానభారాన్ని తనపై మోపుకున్నాడు. 

హజరత్ ఖతాదా, సుఫ్యాన్ చంద్రుని చలనము గురించి తెలుసు కొనుట సరికాదనిరి. కాని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఇసఖ్ (రహమతుల్లాహ్ అలైహిమా) చంద్రుని ఘట్టములను తెలుసుకొనుటకు సమ్మతించెను. హజరత్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: మూడు రకాల ప్రజలు స్వర్గమున ప్రవేశింప లేరు. 

1. మత్తుపానీయములు సేవించుటకు అలవాటుపడినవారు.

2. బంధుత్వం త్రెంచుకొనువారు. 

3. ‘జాదు’ని విశ్వసించువారు. 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. నక్షత్రముల సృష్టికి కారణములు తెలుపబడెను.

2. ఈ కారణములు తప్ప వేరే కారణములు భావించుట నిషేధించ బడినది. 

3. చంద్రుని చలనములను గురించి తెలుసుకొనుటలో విద్యావంతుల మధ్య విభేదము కలదు. 

4. జాదు చెడ్డ పాపమని తెలుసుకొని కూడా దానిని నేర్చుకొనుట నిషేధించ బడినదని తెలియుచున్నది. 

పాఠము 30 : నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

దీనిని తిరస్కరించుటయే మీ జీవనోపాధిగా చేసుకొన్నారా?” (56:82) 

హజరత్ అబూ మాలిక్ అష్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మా సమాజములో ప్రజలు వీడని నాలుగు దురాచారములు కలవు. తమ వంశముపై గర్వపడుట, వేరే వంశములలో దోషములను వెలికితీయుట మరియు ఎత్తిపొడుచుట. నక్షత్రముల ప్రభావం వలన వర్షము కురియునని భావించుట. ఆప్తులు మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించుట. ఇంకా ఈ విధముగా పలికెను. ఈ విధముగా బట్టలు చించుకొని రోదించిన వారు తమ మరణమునకు ముందు అల్లాహ్ సమక్షములో క్షమాపణ కోరని ఎడల ప్రళయదినము రోజు వారికి గంధకము మరియు చర్మమును కష్టపరచు దుస్తులు తొడగింపబడును. 

హజరత్ జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా పేర్కొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హుదైబియా వద్ద ఒక రాత్రి వర్షము కురిసిన తరువాత మాకు ఫజర్ నమాజు చదివించిరి. ఆయన సలాముచేసి నమాజు ముగించిన తర్వాత అనుచరులను ఉద్దేశించి ఈ విధముగా ప్రబోధించారు: అల్లాహ్ ఏమన్నాడో మీకు తెలుసా? అనుచరులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును అని జవాబు పలికిరి. మరల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొనెను: అల్లాహ్ కృపతో మాపై వర్షము కురిసినది అని పలికిన వారు నన్ను విశ్వసించిరి. ఫలానా నక్షత్ర ప్రభావము వలన వర్షము కురిసినది అని పలికినవారు నన్ను నిరాకరించి నక్షత్రముల ప్రభావమును విశ్వసించిరి. (బుఖారి, ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపెను: కొంతమంది ఫలానా నక్షత్రము వలన లాభం చేకూరెను అని పలికి నప్పుడు అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ ఆయత్లను అవతరింపజేసెను. 

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ  وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

“నక్షత్రముల చలనముల ప్రమాణము, మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణము. నిశ్చయముగా ఇది ఒక మహోన్నతమైన ఖుర్ఆన్. సురక్షిత పరచ బడినది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సకల లోకాలప్రభువు అవతరింపజేసినది. అయినా మీరు ఈ దైవవాణిని నిర్లక్ష్యము చేయుచున్నారా? దీనిని తిరస్కరించటమే మీ జీవిత లక్ష్యంగా చేసుకున్నారా?” (56:75-82) 

దీనిలో 10 ప్రకరణములు కలవు 

1. వాక్యము(56:82) (ఖుర్ ఆన్ ని తిరస్కరించేవారిని గురించి తెలుపబడెను.)

2. నాలుగు దురాచారాల గురించి విశదీకరించబడెను.

3. వీటిలో కొన్ని కుఫ్ర్కు దారితీయునవి.

4. కొన్ని రకాల కుఫ్ర (కృతఘ్నత) కారణముగా మానవుడు ఇస్లాం ధర్మము నుంచి వెలుపలకు రాడు.

5. అల్లాహ్, “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలిపాడు. అల్లాహ్ అనుగ్రహం అవతరించిన మీదట ఈ సంఘటన జరిగింది.

6. విశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. 

7. అవిశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. (చిన్న వాక్కుతో విశ్వాసి అవిశ్వాసి అగును)

8. ఫలానా నక్షత్ర ప్రభావము సరియైనది అనుట అవిశ్వాసము. 

9. తెలియనివారు నీకు తెలుసునా అని అడిగి తెలుసుకొనవచ్చును.

10. ఎవరైనా మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించువారి శిక్ష తెలుప బడెను. “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. మరి కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలుపబడెను. 

పాఠము – 31 : అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను; 

وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُتِ اللهِ 

“కొంతమంది అల్లాహు కు సాటి మరియు భాగస్వాములను కల్పిస్తారు. అల్లాహ్ ని ప్రేమించవలసిన విధముగా వారిని ప్రేమిస్తారు.” 

قُلْ إِن كَانَ اَباؤُكُمْ وَابْنَاؤُكُم وَإخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ 

و اَمْوَالُ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَونَ كَسَادَهَا وَ 

مسكن تَرْضَوْنَهَا اَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَ رَسُولِهِ وَجِهَادِ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ ، وَاللهُ لَا يَهْدِ الْقَوْمَ الْفَسِقِينَ 

“(ప్రవక్తా!) ఇలా పలుకుము: ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తులు, మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీకు ఇష్టమైన మీ గృహాలు, అల్లాహకంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో జిహాద్ చేయుటకంటే మీకు ఎక్కువ ప్రియమైనచో అల్లాహ్ తన తీర్పును ఇచ్చేవరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు సన్మార్గము చూపడు.” (9:24) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు నన్ను మీ సంతానముకంటే, తల్లి దండ్రులందరికంటే ప్రియతమునిగా గ్రహించే వరకూ నిజమైన విశ్వాసులు కాజాలరు. (బుఖారీ, ముస్లిం) 

మూడు సుగుణములు ఎవరి వద్ద ఉండునో వారు విశ్వాస తియ్యదనము పొందుదురు. 

1. అల్లాహ్ ప్రవక్తను అందరికంటే ప్రియతములుగా గ్రహించినవాడు. 

2. స్వచ్ఛముగా అల్లాహ్ కొరకు వేరే వారిని ప్రేమించువాడు. 

3. అల్లాహ్ అతనిని అవిశ్వాసము నుండి రక్షించినప్పుడు అగ్నిలో ప్రవేశిం చుటకు అయిష్టపడునట్లుగా అతడు కుఫ్ర్ (అవిశ్వాసమున) కు అయిష్ట పడువాడు. 

ఇబ్నె జరీర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఉల్లేఖనాన్ని ఈ విధముగా పొందుపరచెను: “ఎవరైతే స్వచ్ఛముగా అల్లాహ్ ఇష్టపడుట కొరకు వేరే వారిని ప్రేమించునో, (చెడుల కారణముగా) అసహ్యించు కొనునో, స్నేహం చేయునో, చెడుల కారణముగా విభేదించినచో నిశ్చయముగా అల్లాహ్ స్నేహం వాటి వలననే ప్రాప్తించును.” ఎవరూ ఈ పై విధానములతో తప్ప నిశ్చిత విశ్వాసము పొందజాలరు, వారు ప్రార్థనలు చేయు నప్పటికీ, ఉపవాసములు ఉండునప్పటికీ చాలా మంది తన స్నేహం ప్రపంచ విషయాల కారణముగా పెంచుకొందురు. ఈ స్నేహం వారికి లాభ దాయకము కాదు. 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వాక్యము (2:166) “వారి సత్సంబంధాలు తెగిపోవును” ను విశదీకరిస్తూ ఈ విధముగా తెలిపెను: ఇచ్చట సత్సంబంధాలు అంటే, వారి స్నేహము, ప్రేమ, వారి సాధనముల సంబంధాలు అని అర్థము. 

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యము (2:165) అర్థము (అవిశ్వాసులు అల్లాహ్ ను  కాదని వేరే వారిని ప్రేమించుట) గురించి తెలుపబడెను. 

2. వాక్యము (9:24) అర్థము (అల్లాహ్ ప్రవక్తతో కాకుండా వేరే వాటిని ప్రేమించుట వలన కలుగు ప్రతిఫలము) తెలుపబడినది. 

3. తమ ప్రాణము, సంతానము, సంపద అన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించ వలయును. 

4. కొన్ని సమయములలో విశ్వాసము కోల్పోవుట అంటే పూర్తిగా అవిశ్వాసి అయినట్టు అర్థము కాదు. 

5. విశ్వాస తియ్యదనము కొన్ని సమయములలో తెలియును. 

6. నాలుగు మనసుకు సంబంధించిన కార్యముల కారణముగా మానవుడు అల్లాహ్ ప్రేమను పొందగలడు. అవి లేకుండా విశ్వాస రుచిని పొంద జాలడు. 

7. సాధారణంగా ప్రజల మధ్య స్నేహం ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తమే ఉంటుందని ప్రవక్త సహచరులు గ్రహించారు. 

8. ప్రళయ దినాన వారి సంబంధాలన్నీ తెగిపోవునని తెలుపుటను గ్రహించవలెను.

9. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించువారిలో కొంతమంది అల్లాహ్ ను అమితముగా ప్రేమించెదరు. 

10. వాక్యము (9:24)లో తెలిపినట్లు అవి అల్లాహ్ కంటే ప్రియమైనవైతే వారు నష్టము భరించుటకు సిద్ధపడవలెను. 

11. ఎవరైనా తన నిరాధారమైన విగ్రహమును అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించిన యెడల అది షిర్క్ అగును. 

పాఠము-32 : అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను: 

إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ 

“నిశ్చయముగా షైతాను తన మిత్రుల గురించి మిమ్ములను భయ పెట్టును. మీరు నిజమైన విశ్వాసులైతే వారికి భయపడకండి. నాకుభయపడండి.” (3:175) 

إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ 

“అల్లాహ్ ను  ప్రళయ దినమునూ విశ్వసించి, నమాజును స్థిరపరచువారు, జకాతు ఇచ్చేవారు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ మసీద్లలకు సేవకులూ, సంరక్షకులూ కాగలరు. వీరే మార్గ దర్శకత్వం పొందినవారని ఆశించవచ్చును.” (9:18) 

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ

“ప్రజలలో కొంతమంది మేము అల్లాహు విశ్వసించాము అని పలికేవారు న్నారు. కాని అల్లాహ్ మార్గంలో వారికి కష్టము కలిగినప్పుడు ప్రజలు పెట్టిన బాధలను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తారు.” (29:10) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా   ప్రబోధించెను: “నిశ్చయముగా నీవు అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచుకొనుట, అల్లాహ్ ప్రసాదించిన ఆహారమునకు ప్రజలను పొగడుట, అల్లాహ్ ప్రసాదించని ఎడల వేరేవారిపై నిందమోపుట ఇవన్నీ విశ్వాస క్షీణత వలనే! నిశ్చయముగా అల్లాహ్ ప్రసాదించిన ఆహారమును అత్యాశపరుని ఆశ పొందలేదు. ఇష్టపడని వారి అయిష్టత దానిని ఆపలేదు.” 

ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఎవరైతే ప్రజలను అయిష్టపరచి అయినా అల్లాహ్ ను ఇష్టపరచిన ఎడల అల్లాహ్ దానిని స్వీకరించును. ప్రజలను కూడా ఈ విషయములో ఇష్టపడు నట్లు చేయును. కాని ఎవరైతే అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచదలచుకుంటే అల్లాహ్ అతనిని నిరాకరించి ప్రజలను కూడా అతనితో అయిష్టపడునట్లు చేయును.” (దీనిని ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (3:175) భావము (ఒక్క అల్లాహ్ కే భయపడవలెనని) తెలుపబడెను. 

2. వాక్యము (9:18) యొక్క భావము (అల్లాహ్ మసీద్ సేవకుల గురించి) తెలుపడెను. 

3. వాక్యము (29:10) భావము (విశ్వాసము క్షీణించిన వారి గురించిన) తెలుపబడెను. 

4. విశ్వాసములో క్షీణత, పెరుగుదల కలదు. 

5. విశ్వాసము క్షీణించినటువంటి ఉదాహరణములు తెలుపబడెను. 

6. ఒక్క అల్లాహ్ భయపడుట ఇస్లాం విధులలో ఒకటి. 

7. ఒక్క అల్లాహ్ భయపడువాని యొక్క పుణ్యము తెలుపబడెను. 

8. ఎవరైతే ఒక్క అల్లాహ్ కే కాకుండా ఇతరులకు కూడా భయపడతాడో అతని శిక్ష తెలుపబడెను. 

పాఠము – 33 : ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను 


ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

وَعَلَى اللهِ فَتَوَكَّلُوا إِن كُنْتُمْ مُؤْمِنِينَ 

“మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఒక్క అల్లాహ్న నమ్ముకోండి.” (5:23) 

إنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ 

عَلَيْهِمْ أَيْتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ 

“అల్లాహ్ ను ప్రస్తావించినప్పుడు నిజమైన విశ్వాసుల హృదయాలు కంపిం చును. వారి సమక్షములో అల్లాహ్ ఆయత్లు పఠించినప్పుడు వారి విశ్వాసము పెరుగును. వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు.” (8:02) 

يَايُّهَا النَّبِيُّ حَسُبُكَ اللهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ 

“ఓ ప్రవక్తా! నీకు, నిన్ను అనుసరిస్తున్న విశ్వాసులకు అల్లాహే చాలు.” (8:64) 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ. 

“ఎవరైతే అల్లాహ్ ను  నమ్ముకుంటారో వారికి అల్లాహ్ యే చాలును.” (65:03) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా తెలిపెను: ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో వేసినప్పుడు ఆయన ఇలా అన్నారు: 

حسبنا الله ونعم الوكيل 

“నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు.” అదే విధముగా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, “అవిశ్వాసులు మీపై దండయాత్రకు సైన్యము సమకూర్చుకొనిరి “మీరు వారికి భయపడండి అని చెప్పారు. కాని ఆ సమయంలో ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారితో తలపడి నప్పుడు ఆయన విశ్వాసము ఇంకా పెరిగి ఆయన ఇలా అన్నారు: 

حَسبُنَا الله ونعم الوكيل 

“మాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు” (3:173) 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. ఒక్క అల్లాహ్ నే నమ్ముకొనుట ఇస్లాం విధి. 

2. ఇది విశ్వాస నిబంధన. 

3. వాక్యము (8:2) భావము (విశ్వసించిన వారి గుణములు) తెలుప బడెను. 

4. “వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు”కు భావము విశదీకరించబడెను. 

5. వాక్యము (65:3) భావము (అల్లాహ్న నమ్ముకొనువారికి అల్లాహ్ యే చాలును.) 

6. వాక్యము (నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ నేర్పరి)కు గల ప్రాముఖ్యత తెలుపబడెను. అల్లాహు ఇద్దరు స్నేహితులు. ఇబ్రాహీమ్ (అలై), ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) .

పాఠము 34 : అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం, అల్లాహ్ ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండటం గురించి

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

آقا مِنُوا مَكَرَ اللهِ فَلَا يَأْمَنُ مَكَرَ اللهِ إِلَّا القَوْمُ الخَيرُونَ 

“ఏమిటి మీరు అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉన్నారా? నిశ్చయముగా నాశనం కాబోయే వారు మాత్రమే అల్లాహ్ వ్యూహాలపట్ల నిర్భయముగా  ఉంటారు.” (7:99) 

قَالَ وَمَنْ يَقْنَطُ مِن رَّحْمَةِ رَبَّةٍ إِلا الضَّالُونَ : 

“మార్గభ్రష్టులే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు.” (15:56) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఘోర పాపములు ఏమిటని ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: “అల్లాహ్ పట్ల ఘోర షిర్క్ కు పాల్పడుట. అల్లాహ్ కారుణ్యము పట్ల నిరాశ చెందుట. అల్లాహ్ ఉపాయములంటే నిర్భయముగా ఉండుట.” 

హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఘోర పాపములు: అల్లాహు కు భాగస్వాములను కల్పించుట, అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండుట, అల్లాహ్ దయాకారుణ్యాల పట్ల నిరాశ చెందుట.  (దీనిని అబ్దుర్రజాక్ పొందుపరచెను) 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. వాక్యము (7:99) భావము (అల్లాహ్ యొక్క ఉపాయముల పట్ల నిర్భయముగా ఉండకూడదని) తెలుపబడెను.  

2. వాక్యము (15:56) భావము (మార్గభ్రష్టులే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుతారు) అని తెలుపబడెను. 

3. అల్లాహ్ వ్యూహాలకు నిర్భయముగా ఉన్నవారు భయభ్రాంతులకు గురి అవుతారు.

4. అల్లాహ్ కారుణ్యానికి నిరాశ చెందిన వారు కూడా భయభ్రాంతులకు గురిఅవుతారు.  

పాఠము  35 : అల్లాహ్ నిర్ణయించిన విధిపై సహనం – ఈమాన్ లోని అంతర్భాగమే

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

“అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపదా రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ (సరైన దిశలో) మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలూ తెలిసినవాడు.” (64:11) 

హజరత్ అల్ ఖమా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా విశదీకరిం చిరి: “దీని అర్థం ఏ వ్యక్తికైన కష్టము కలిగినప్పుడు అతడు ఇది అల్లాహ్ (తీర్పు) ఉపాయమని గ్రహించి దానిని సమ్మతించి మనస్సుతో అంగీకరిస్తాడు.” 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను “ప్రజలలో ధిక్కరించే రెండు అలవాట్లు కలవు. వంశములను ఎత్తిపొడుచుట, మరణించినప్పుడు బిగ్గరగా ఏడ్చుట.” (ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “కష్ట సమయములలో తమను తాము హింసించు కొనువారు, బట్టలు చించుకొనువారు, అజ్ఞానపు మాటలు పలుకు వారు, మాలోని వారు కారు.” (బుఖారీ, ముస్లిం) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి (తిర్మిజీ, హాకిం, తబ్రాని) “అల్లాహ్ తన దాసునికి మంచి చేకూర్చదల్చుకుంటే అతని పాపములకు ఇహలోకములోనే శిక్ష విధిస్తాడు, ఏ దాసునికి కీడు చేయదలచుకున్నాడో అతని పాపముల శిక్షను నిలిపివేస్తాడు. చివరికి ప్రళయ దినం రోజు అతని పాపములకు పూర్తి లెక్క కడతాడు.’ 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉపదేశిం చెను: “పెద్ద పరీక్ష, పెద్ద బహుమానము ఉండును. అల్లాహ్ ఏదైనా జాతిని ప్రేమించిన ఎడల వారిని పరీక్షించును. ఎవరైతే ఆ పరీక్షకు సమ్మతించునో అల్లాహ్ అతనిని అంగీకరిస్తాడు. ఎవరైతే ఈ పరీక్షకు సమ్మతించరో అల్లాహ్ వారిని నిరాకరిస్తాడు. ” (హసన్, తిర్మిజీ) 

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యము (64:11) భావము (అల్లాహ్ విశ్వసించిన వారి హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదించును.) 

2. అల్లాహ్ విధించిన విధిపై ఓర్పు వహించుట అల్లాహ్ ను విశ్వసించుట లో భాగము. 

3. ఎవరి వంశమునైన ఎత్తిపొడుచుట ఇస్లాంను ఉల్లంఘించినట్లే.

4. కష్ట సమయములలో ఓర్పు వహించక హింసించుకొనుట, బట్టలు చించుకొనుట, అజ్ఞాన కాలమునాటి పలుకులు పలుకువారు హెచ్చరించబడును. 

5. అల్లాహ్ తన దాసుని మంచి కోరును. 

6. ఎవరినైతే శిక్షించునో వారి గురించి తెలుపబడినది. 

7. అల్లాహ్ ఎవరిని ప్రేమించునో వారి గురించి తెలుపబడినది. 

8. అల్లాహ్ విధిపై అసంతృప్తి చెందుట నిషేధించబడినది. 

9. పరీక్ష సమయములలో సమ్మతించుటలో చాలా పుణ్యము కలదు. 

పాఠము- 36 : ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే 


ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను:

قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”) (18:110) 

హదీసే ఖుద్సీలో హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: 

ఎవరినైతే నాకు భాగస్వాములుగా చేస్తున్నారో నేను ఆ భాగస్వాములందరి నిరపేక్షాపరుణ్ణి. ఎవరైతే ఏదైనా కార్యము చేస్తూ అందులో మరెవరినైనా భాగస్వామిగా చేర్చితే నేను అతనిని, నాకు ఎవరినైతే భాగస్వామిగా నియమించాడో అతనికి ఆ కార్యాన్ని వదలి వేస్తాను (నాకు ఎటువంటి సంబంధము లేదు). 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రంబోధించెను: “నేను మీకు మసీహుద్దజ్జాల్ పీడ కంటే ఎక్కువ పీడ కలిగించే విషయము తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా అని అనుచరులు జవాబు పలికారు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పలికెను: ‘షిర్కె ఖఫీ’. ఎవరైనా నమాజు చదువు చున్నప్పుడు తమ నమాజును ఇతరులకు చూపుటకు మంచిగా ఆచరించుట. 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. వాక్యము (18:110) భావము (అల్లాహ్ ను కలియుటకు సత్కార్య ములు చేయవలెను. అల్లాహు సాటిగాని, భాగస్వాములనుగాని కల్పించి ఉండకూడదు అని) తెలుపబడెను. 

2. సత్కార్యములు అల్లాహ్ తోపాటు ఇతరుల కొరకు కొంచెం చేసినా, అది స్వీకరించబడదు. 

3. ఏదైనా కార్యములో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుటతో అది కారణము అల్లాహ్ ఈ కార్యమును అసలు నిరాకరించబడుటకు అంగీకరించడు. 

4. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించబడిన కార్యములు నిరాకరించ బడుటకు వేరొక కారణము, అల్లాహ్ వారు కల్పించిన భాగస్వాముల బలహీనతలకు అతీతుడు. 

5. ప్రవక్త, అనుచరుల విషయములో “ప్రజలకు చూపుటకు చేయు సత్కార్యముల” గురించి కలత చెందెడివారు. 

6. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యముల గురించి ఈ విధముగా తెలిపెను. ఒక వ్యక్తి నమాజును అల్లాహ్ కొరకు ఆచరిస్తూ ఎవరైనా చూస్తుంటే, నమాజును బాగా ఆచరిం చిన ఎడల అది ‘రియాకారి’ ప్రదర్శన అగును.  

పాఠము – 37 : ఇహలోక లబ్దికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’ లాంటివి 

ن كَانَ يُرِيدُ الحَياةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَقِ اِلَيْهِمْ اَعْمَا لَهُمُ 

مَنْ بهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ ) أو لَيْكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الأخرة إِلا النَّارُ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَيُطِل مَا كَانُوا 

يعملون 

“కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షణలను కోరుకొనేవారు చేసిన కార్యములకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడే ఇచ్చివేశాము. అందులో వారికి తగ్గించడమనేది జరుగదు. కాని పరలోకములో వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ప్రపంచంలో చేసినదంతా వ్యర్ధము. సత్కార్యములన్నీ నాశనం అగును.” (11:15-16) 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన హదీసును ఈ విధముగా ఉల్లేఖించారు: 

“డబ్బు దాసుడు నాశనం అగును. బట్టల దాసుడు నాశనం అగును. అతనికి ఇవి లభించిన ఎడల సంతోషించును. లభించని ఎడల అసంతృప్తి చెందును. అతడు నాశనం అయ్యెను. బెంగపడిన వాడయ్యెను. అతనికి గ్రుచ్చుకొన్న ముల్లు కూడా తీయజాలదు. “ఎవరయితే గుర్రం కళ్లెం పట్టుకొని అల్లాహ్ మార్గంలో బయలుదేరాడో, ఎవరి తల మాసి వుంటుందో, కాళ్లు దుమ్ము కొట్టుకొని ఉంటాయో వారికి శుభవార్త. వారిని సైన్యం ముందు పంక్తుల్లో నిలబెడితే, అలాగే నిలబడతాడు. వెనుక పంక్తుల్లో నిలబెడితే, వెనుకే నిలబెడతాడు. అతను అనుమతి కోరినా అతనికి ఆ అనుమతి లభించదు. అతను ఎవరి గురించి అయినా సిఫారసు చేస్తే ఆ సిఫారసూ స్వీకరించబడదు.” 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1. మానవుడు, పరలోకము కన్న ఇహలోకానికి ప్రాముఖ్యత నిచ్చుట నివారించబడినది

2. వాక్యము (11:15-16) భావము (కేవలం ఇహలోకము కోరుకునే వారికి పరలోకంలో స్థానము లేదు అని) స్పష్టంగా తెలియచేయబడింది.  

3. దీనిలో ఒక ముస్లింను డబ్బు దాసునిగా పేర్కొనుట గమనార్హము.

4. అతనికి ఇవ్వబడినప్పుడు సంతోషించును. లేనిచో అసంతృప్తి చెందును. 

5. అతడే నాశనమగును. భంగపడునని శపించటము జరిగింది. 

6. అతనికి ఎవరూ సహాయపడలేరు (అతనికి ముల్లు గ్రుచ్చుకొన్నా ఎవరూ తీయలేరు). 

7. అల్లాహ్ మార్గమున ఎంతటి కష్టములనైనను భరించి, తన కర్తవ్యమును నెరవేర్చువాడు ప్రశంసించబడును.

పాఠము-38 : అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా పేర్కొన్నారు: “మీ పై రాళ్ళ వర్షం కురిసే సమయం ఆసన్నమైనది. నేను మీకు ప్రవక్త ప్రబోధనలు వినిపించుచున్నాను. మీరే దానికి వ్యతిరేకంగా అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు చెప్తున్నారు అని పలుకుతున్నారు.” 

ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపారు: “నాకు వారిపై ఆశ్చర్యము కలుగుచున్నది.” హదీసు ఆధారము నిజమైనదని తెలిసి కూడా సుఘ్యాన్ సౌరి యొక్క అభిప్రాయముపై నడుచు చున్నారు. అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرة 

أن تَصِيبَهُم فِتْنَةٌ أو يُصِيبَهُمْ عَذَابٌ اليمن 

“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించువారు తాము ఏవైనా బాధల్లో చిక్కుకుపోతామే మోనని, ఏదైనా శిక్ష అవతరిస్తుందేమోనని భయపడవలెను.” (24:63) 

“ఫిత్నా” అంటే తెలుసా? షిర్క్. ఎవరైతే ప్రవక్త మాటలను ఉల్లంఘించునో అతని మనస్సులో దుష్టము రేగుట వలన అతడు నాశనమైపోవును. 

హజరత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ వాక్యము పఠించుచున్నప్పుడు విన్నారు: 

“వారు అల్లాహ్ ని కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువుగా చేసుకున్నారు. మరియమ్ కుమారుడు మసీహ్ (అలైహిస్సలాం) ను కూడా! వాస్తవానికి ఒకే దేవుడిని తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవ్వరూ అర్హులుకారు. ఆయన పరిశుద్ధుడు. వారు కల్పించు భాగస్వాములకు అతీతుడు.” (9:31) 

ఈ ఆయతులు విని నేను “మేము పండితులు, సన్యాసులను ఆరాధించేవారము కాదు” అన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా జవాబు పలికెను. “మీరు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారి మాటలపై నిషేధించలేదా? అల్లాహ్ నిషేధించిన వాటిని వారి మాటలపై హలాల్ చేసుకో లేదా?” అప్పుడు ఆయన “అవును” అని పలికిరి. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘ఇదే వారిని ఆరాధించుట’ అని పలికారు. (మస్నద్ అహ్మద్, సునన్ తిర్మిజ) 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1. వాక్యము (24:63) భావము (ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించిన వారు భయపడవలెను) తెలుపబడెను. 

2. వాక్యము (9:31) భావము (దానిలో పండితులను, సన్యాసులను ప్రభువుగా చేసుకొనుట గురించి) తెలిపెను. 

3. “ఆరాధన అంటే ఒక్క ప్రార్థనయే కాదు. ఆరాధన అంటే విధేయత చూపుట, ఆజ్ఞలను పాటించుట” అని హజరత్ హాతిం (రదియల్లాహు అన్షు) హదీసులో తెలుపబడింది. 

4. ప్రవక్త ప్రవచనమునకు వ్యతిరేకముగా ఎవరి ప్రవచనమూ ఆమోద యోగ్యము కాదని స్పష్టపరచబడెను. హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు), హజరత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) మరియు సుఫ్యాన్ సౌరి పేర్లను ప్రస్తావించుటను నిరాకరించెను. 

5. ప్రస్తుత కాలములో ప్రజలు తమ పండితుల ఆరాధనను అన్నింటికంటే ఉత్తమమైన సత్కార్యమని భ్రమలో పడివున్నారు. దీనిని విలాయత్ (పూచి) అనబడుతుంది. అదే విధముగా విద్య, శాస్త్రజ్ఞుల పేరుతో విద్యావంతు లను కూడా ఆరాధించుచున్నారు. చివరికి వ్యవహారం చెడి అవిద్యా వంతుల ఆరాధన కూడా జరుగుచున్నది. వీటన్నింటి నుండి వారించబడినది. ఇవన్నీ షిర్క్ పనులే. 

పాఠము 39 : ‘విశ్వసించితిమి’ అను వారి వాస్తవము 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

الم تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ أمَنُوا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إلى الطَّاغُوتِ وَقَدْ أمِرُوا أَن تَكْفُرُوا بِه . وَيُرِيدُ الشَّيْطنُ اَنْ يُضِلَهُمْ ضَللًا بَعِيدًا وَإِذَا قِيلَ لَهُمْ تعالوا إلى مَا أَنْزَلَ اللهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنْفِقِينَ يَصُدُّونَ عَنْكَ صدُودًا نَ فَكَيْفَ إِذَا اَصَابَتْهُمْ مُصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ 

جَاءُوكَ يَحْلِفُونَ باللهِ اِنْ اَرَدْنَا إِلا إِحْسَانًا وَتَوْفِيقات 

…..వాదన అయితే చేసి తమ వ్యవహారముల పరిష్కారము కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరుకునేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి, వారికి తాగూత్ను తిరస్కరించమని ఆదేశించబడింది. షైతాన్ వారిని పెడదోవ పట్టించి సన్మార్గమునకు బహుదూరముగా తీసుకుపోవాలని చూస్తున్నాడు. “అల్లాహ్ అవతరింపజేసిన దాని (ఖుర్ఆన్) వైపునకు రండి. ప్రవక్త వైపునకు రండి” అని చెప్పినప్పుడు, ఈ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకుపోవడాన్ని నీవు చూస్తావు. కాని వారు తమపై తెప్పించుకున్న ఆపద వారిపై వచ్చినప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. దేవుని సాక్షిగా మంచినే కాంక్షించాము. వారిని రాజీవరచుటకు ఉద్దేశించాము అని పలుకుదురు. (4:60-61) 

“భూమిపై అశాంతి, సంక్షోభము కలిగించకండి” అని వారితో పలికినప్పు డల్లా వారు “మేము సంస్కర్తలము మాత్రమే” అని పలికెదరు. 

“భూమిపై సంస్కరణ జరిగిన తరువాత దానిపై సంక్షోభాన్ని, సృష్టించ కండి. భయంతోను, ఆశతోనూ ఆయననే వేడుకోండి. నిశ్చయముగా అల్లాహ్ కారుణ్యం ఉదారబుద్ధిగలవారి సమీపమున కలదు.” (7-57) 

افحكم الجَاهِلِيَّةِ يَبْغُونَ ، وَمَنْ اَحْسَنُ من الله حُكْنَا القَوْم يُوقِنُونَ : 

“(వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాహ్ పై నమ్మకము గలవారి దృష్టిలో అల్లాహ్ కంటే ఉత్తమమైన తీర్పు చేయగలవారెవ్వరూ లేరు.” (5-50) 

హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “మీలో నాకు ప్రసాదించబడిన ఈ ధర్మశాస్త్రము లోబడి ఉండుటలో (తమ కోరికలన్నీ) వారు విశ్వాసులు కాజాలరు.” ( ఇమాం నవవీ దీనికి కితాబుల్ హజ్ సహీ సనద్ తో పొందుపరచెను.) 

షాబి (రహిమహుల్లాహ్)  ఈ విధముగా తెలిపెను: ఒక కపటుడు, ఒక యూదుని మధ్య వివాదము ఏర్పడెను. యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం తీసుకోరు కాబట్టి ఆయన దగ్గర ఈ సమస్య తీర్పు కోరెదము అని పలికెను. కాని ఈ కపటుడు, కాదు, మనము ఈ సమస్య తీర్పు కొరకు ఒక యూదుని వద్దకు పోవుదుము అని పలికెను. అతనికి యూదుని వద్ద లంచముతో పని జరుగునని తెలుసును. చివరికి వారిద్దరు జుహైనా సంతతికి చెందిన ఒక కాహిన్ (గుప్తవిద్యావాదులు) వద్ద ఆ సమస్యకు తీర్ప కోరెదమనిరి. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరింపబడెను. 

కొంతమంది విద్యావేత్తలు ఈ విధముగా తెలిపిరి: “ఇద్దరి మధ్య ఒక విషయములో విభేదము ఏర్పడెను. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరకు ఈ సమస్యకు తీర్పు కోరుదుమని పలికెను. కాని వేరే వ్యక్తి కాబ్ బిన్ అషరఫ్ వద్దకు పోవుదుమని పలికెను. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  దగ్గర తీర్పు కోరబడెను. ప్రవక్త తీర్పు ఇచ్చిన తరువాత మరల ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు తీర్పు కొరకు తీసుకొని వెళ్ళెను. అప్పుడు ఆ వ్యక్తి జరిగినదంతా తెలిపి ప్రవక్త తన పక్షములో తీర్పు ఇచ్చెనని తెలిపెను. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) రెండవ వ్యక్తిని నిజమేనా అని అడిగినప్పుడు అతడు నిజమేనని తెలిపెను. అంతటితో ఉమర్ (రదియల్లాహు అన్హు) అతడిని అంతమొందించెను. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరించబడెను. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (4:60) భావము మరియు తాగూత్ గురించి విశదీకరించ 

2. వాక్యము (2:11) భావము (సంక్షోభములు సృష్టించువారు తమను సంస్కర్తలు అని పలుకుదురు). 

3. వాక్యము (7-56) భావము (భూమిపై అల్లరి సృష్టించుట నివారించ బడెను). 

4. వాక్యము (5:50) భావము (అల్లాహ్ ను మించిన ఉత్తమ తీర్పు నిచ్చువాడు ఎవ్వరూ లేరు). 

5. వాక్యము (4-60)పై షాబీ (రహమతుల్లాహ్ అలై)ల విశదీకరణ తెలుపబడెను. 

6. స్వచ్ఛమైన విశ్వాసము, కపట విశ్వాసము గురించి తెలుపబడెను. 

7. కపటులతో హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నడవడిక తెలుప 

8. తన కోరికలు ఇస్లాం ధర్మశాస్త్రమునకు లోబడి లేని పక్షంలో అతడు విశ్వాసి కాజాలడు అని స్పష్టపరచబడెను. 

పాఠము 40 : అల్లాహ్ నామములలో, గుణగణాలలో కొన్నింటిని తిరస్కరించటం 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَنِ، قُلْ هُوَ رَى لَا اله إلا هُوَة عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابٍ . 

“వారు రహమాన్ (కరుణామయుడు)ని తిరస్కరించారు. వారితో ఇలా పలుకుము: ఆయనే(రహ్మన్) నా ప్రభువు. ఆయన తప్ప మరే దేవుడూలేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నాకు ఏకైక ఆశ్రయం.” (13:30) 

హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: “ప్రజలకు వారు అర్థం చేసుకొనే విషయాలు మాత్రమే తెలుపండి. (వారికి అర్థం కాని విషయాలను తెలిపి) వారు అల్లాహ్ ప్రవక్తను తిరస్కరించవలెనని మీరు ఆశించుచున్నారా?” (బుఖారి) 

ఇమామ్ అబ్దుల్ రజాక్, మఅమర్ నుండి, ఆయన ఇబ్నె తావూస్ నుండి, ఆయన తండ్రి తావూస్ నుండి ఈ విధముగా ఉల్లేఖించెను: హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఉల్లేఖనం: “ఒక వ్యక్తి అల్లాహ్ స్వభావమును గురించి ఒక హదీసు తెలుసుకొని చికాకుపడ్డాడు. అతనికి ఆ హదీసు నచ్చలేదు.” ఇది చూసి ఈ విధముగా తెలిపిరి: వీరి భయము విచిత్రమైనది. దృఢమైన స్పష్టమైన అల్లాహ్ వాక్యములు విన్నప్పుడు వీరిపై దుఃఖము తారసిల్లును. బహులార్థముగల వాక్యములు విని తిరస్కరించి) నాశనమగుదురు. (ముస్నద్ అబ్దురజ్జాఖ్). ఖురైష్ వంశస్థులు ప్రవక్త నోటి నుండి రహమాన్ (కరుణా మయుడు) అని విని వారు దానిని తిరస్కరించిరి. అప్పుడు అల్లాహ్ వాక్యము (13:10) అవతరించెను ముస్నద్ రజ్జాక్. 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1. అల్లాహ్ నామములు లేదా స్వభావములను తిరస్కరించిన ఎడల విశ్వాసము కోల్పోవుదురు. 

2. వాక్యము (13:10) భావము (రహమాన్ గురించి) తెలుపబడెను. 

3. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేని పక్షములో ఆ మాటను వదిలి వేయవలెను

4. ఏ మాట అయితే అల్లాహ్, ఆయన ప్రవక్తను తిరస్కరించినట్లు అగునో, అతని ఉద్దేశము తిరస్కరించుట కాకపోయినప్పటికీ అటువంటి మాటలకు దూరముగా ఉండవలెను. 

5. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు మా తెలిపినట్లు ఎవరైనా అల్లాహ్ నామము లేదా స్వభావమును తిరస్కరించిన ఎడల అతడు నాశనం అయ్యే స్థితికి చేరును.

పాఠము 41 : అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట 

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ

వారు అల్లాహ్ యొక్క భాగ్యమును గుర్తించి కూడా తిరస్కరిస్తారు. వారిలో చాలా మంది కృతఘ్నులు” (16:83)

పై వాక్యము వివరణలో ముజాహిద్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

“ఏ వ్యక్తి అయినా ఈ ధనము నా పిత్రార్జితము అని పలుకుట, అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించి నట్లు.” 

ఔన్ బిన్ అబ్దుల్లా ఇలా తెలిపెను: “ఫలానా వ్యక్తి లేకపోతే అలా జరిగేది’ అని పలుకుట. అల్లాహ్ భాగ్యమును తిరస్కరించుట. ఇబ్నె ఖుతేబా ఈ విధముగా తెలిపెను: “ఇది మా పూజితుల యోగ్యత చూపుట వలన లభించినది అని పలుకుట కూడా” ఈ వాక్యములో కూర్చబడినది. 

షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై) జైద్ బిన్ ఖాలిద్ జహనీ (రదియల్లాహు అన్హు) హదీసు “ఈ ఉదయం నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసించినారు. కొంతమంది తిరస్క రించినవారాయెను” అని అల్లాహ్ తెలిపెను. (ఈ హదీసు ఇంతకు ముందు వివరించబడినది) తరువాత “ఎవరైతే అల్లాహ్ కృపాకారుణ్యాలను వేరే వారి వైపునకు అనుగుణ్యం చేస్తారో, అల్లాహ్ కు భాగ స్వాములను కల్పిస్తారో అటువంటివారిని అల్లాహ్ ఖుర్ఆన్లో, ప్రవక్త హదీసులో గట్టిగా వారించెను. 

ఈ విషయమును విశదీకరించుటకు పూర్వపు మత గురువులు (అస్లాఫ్) ఈ ఉదాహరణలు పేర్కొనిరి: “కొంతమంది గాలి బాగా వీచింది” అని పలుకు దురు. “నావికుడు మంచి ప్రావీణ్యుడు, నేర్పరి” అని చాలా మంది పలుకుదురు. ఇటువంటి పలుకుల వలన మనిషి సులభంగా షిర్క్ లోకి జారిపోతాడు. 

దీనిలో 4 అర్థ తాత్పర్యములు కలవు. 

1. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను గుర్తించి, తిరస్కరించుట. 

2. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను తిరస్కరించే పలుకులు ప్రజల వాడుకలో ఉన్నవి. 

3. అల్లాహ్ భాగ్యములను తిరస్కరించునట్లు చేయు పలుకులు తెలుప బడెను

4. ఒకే మనస్సులో అల్లాహ్ ప్రసాదించిన భాగ్యముల అంగీకారము, తిరస్కారము ఉన్నట్లు తెలుస్తుంది. 

పాఠము 42 : అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ

ఇక మీకు తెలిసినప్పుడు అల్లాహ్ కు సాటి కల్పించకండి.” (2:22) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్యం తఫ్సీర్లో ఈ విధముగా తెలిపెను: “అన్-దాద్  అంటే భాగస్వాములను కల్పించుట” అని అర్థము. ఏదైతే చీకటి రాత్రిలో నల్లటి రాయిపై చీమ నడకకంటే గుప్తమైనది. భాగస్వాములను కల్పించుట అనేది ఈ విధముగా పలుకుట. “అల్లాహ్ యొక్క ప్రమాణము మరియు నీ జీవితముపై ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఓ వ్యక్తి నా ప్రాణము యొక్క ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఈ కుక్క లేనిచో మా ఇంటిలో దొంగలు పడేవారు” లేదా ఇలా పలుకుట, “అల్లాహ్ కోరుకున్నది, మీరు కోరుకున్నది” లేదా ఇలా పలుకుట “ఒకవేళ అల్లాహ్ లేకపోతే నీవులేవు” ఇటువంటి పలుకులలో అల్లాహ్ తోపాటు ఇతరులని చేర్చవద్దు. ఇవన్నీ అల్లాహ్ కు షిర్క్ వంటి మాటలు. (దీనిని ఇబ్నె అబీ హాతిం పొందుపరచెను) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“ఎవరైతే అల్లాహ్ పేరును తప్ప ఇతరుల ప్రమాణము చేయునో వాడు తిరస్కరించిన వాడయ్యెను. లేదా షిర్క్క పాల్పడినట్లు చేసెను. (దీనిని తిర్మిజీ పొందుపరచి హసన్ అని తెలిపెను. హాకిం సహీ అని తెలిపెను) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

“నా వద్ద అల్లాహ్ కాక ఇతరులపై స్వచ్ఛమైన ప్రమాణము చేయుటకంటే అల్లాహ్ పై అసత్య ప్రమాణము చేయుట మేలు.” 

హజరత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఇలా తెలిపారు: 

“అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది” అని పలకవద్దు. కాని ఈ విధముగా పలకండి, “ముందు అల్లాహ్ కోరుకున్నది ఆ తరువాత మీరు కోరుకున్నది.” (అబూ దావూద్, సనద్ సహీ) 

ఇబ్రాహీం నఖయి ఈవిధముగా విశదీకరించారు: “అవూజు బిల్లాహి వబిక” అని పలకరాదు. 

“అవూజు బిల్లాహి సుమ్మబిక” అని పలకవచ్చును. అదే విధముగా “లవ్ లా  అల్లాహు సుమ్మ ఫలానున్” అని పలకవచ్చును. “లవ్ లా అల్లాహు వఫులానున్” అని పలకరాదు. 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1.  అన్-దాద్ గురించి (2:22) వాక్యము భావము విశదీకరించబడెను. 

2. ‘షిర్కె అక్బర్’ గురించి అవతరించబడిన వాక్యములను అనుచరులు ‘షిర్కె అస్గర్’కి కూడా వివరిస్తూ విశదీకరించేవారని స్పష్టమగుచున్నది. 

3. అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులపై ప్రమాణము చేయుట షిర్క్. 

4. అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరున చేయు సత్యమైన ప్రమాణము, అల్లాహ్ పేరున చేయు అసత్య ప్రమాణము కంటే పెద్ద పాపము

5. వావ్ (మరియు), సుమ్మ (తర్వాత) అనే  పదములు అర్థములో చాలా వ్యత్యాసము కలదు

పాఠము 43 : అల్లాహ్ పై ప్రమాణముతో సంతృప్తి చెందనివాడు 

హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించారు. 

“మీరు మీ తాతముత్తాతల పేర ప్రమాణములు చేయకండి. ఎవరైతే అల్లాహ్ పేరున ప్రమాణము చేయునో అతడు తప్పక సత్యము పలకవలెను. ఎవరి కొరకు అయితే అల్లాహ్ ప్రమాణము చేసెనో అతడు అంగీకారము తెలపడో అల్లాహు కు ఏ విధమైన సంబంధము లేదు.” (దీనిని ఇబ్నె మాజా హసన్ సనద్ పొందుపరచెను) 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. తాతముత్తాతల పేర ప్రమాణము చేయుట నిషిద్ధము. 

2. ఎవరి కొరకు అయితే అల్లాహ్ పేరున ప్రమాణము చేయబడెనో అతడు అంగీకరించబడెను.

3. అల్లాహ్ పేరున ప్రమాణము చేసినప్పటికీ అంగీకరించని వారిని బెదిరింపబడెను. (జరగబోయే కీడు గురించి తెలుపబడెను.) 

పాఠము – 44 : అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే 

హజరత్ ఖుతైబ (రదియల్లాహు అన్హు)  ఈ విధముగా ఉల్లేఖించారు: ఒక యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గరకు వచ్చి ఈ విధముగా పలికెను: “మీరు (ముస్లింలు) అల్లాహ్ తో షిర్క్ కు పాల్పడు తున్నారు. అదెలాగంటే ఈ విధముగా పలుకుతారు” అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది, ఇంకా కాబా గృహము ప్రమాణము అని, దానికి జవాబుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఆజ్ఞాపించెను: 

ప్రమాణము చేయదలచిన వారు కాబా గృహ ప్రమాణము చేయకండి. కాబా గృహము యొక్క ప్రభువు పేరిట ప్రమాణము చేయండి. “అల్లాహ్ కోరినది మరియు మీరు కోరునది అని పలక వద్దు. “అల్లాహ్ కోరునది ఆ తరువాత మీరు కోరునది అని పలకండి.” (దీనిని నసాయి సహీ సనత్తో పొందు పరచెను) 

నసాయిలో హజరత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఈ విధముగా ఉన్నది: ఒక వ్యక్తి ప్రవక్తకు ఈ విధముగా చెప్పెను: “అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది. అప్పుడు ప్రవక్త ఇలా పలికిరి. “ఏమిటి నీవు నన్ను అల్లాహ్ కు సమానంగా చేసితివా? ఈ విధముగా పలుకు, ఒక్కడైన అల్లాహ్ కోరినది” అని. 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) సవతి సోదరుడు హజరత్ తుఫైల్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “నేను నా కలలో యూదుల సమూహంలో పోవుచున్నట్లు చూశాను. నేను వారితో ఇలా అన్నాను. మీరు గనుక హజరత్ ఉజైర్ (అలైహిస్సలాం) ని అల్లాహ్ కుమారుడని పలకనిచో మీరు చాలా మంచివారు. అప్పుడు వారు ఇలా అన్నారు: ‘మీరు కూడా మంచి వాళ్ళే అయి ఉండేవారు. మీరు అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కోరునది” అని పలకనిచో.” తరువాత క్రైస్తవుల గుంపు పోవుచుండగా నేను ఈ విధముగా పలికితిని, “మీరు మంచివారు అయి ఉండే వారు, మసీహ్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ కుమారుడని పలకనిచో.” అప్పుడు వారు “మీరు కూడా మంచి వాళ్ళేకాని మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకనిచో.” ఉదయం నేను ఈ కలను కొంతమందికి తెలిపి తరువాత ప్రవక్త వద్దకు పోయి తెలిపాను. అప్పుడు ప్రవక్త నీవు ఈ కలను ఎవరికైనా తెలిపావా? అని ప్రశ్నించారు. నేను తెలిపానన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  లేచి, అల్లాహ్ ను స్తుతించి, ఈ విధముగా ప్రబోధించిరి: “జుబైర్ చూసిన కల మీకు తెలిపెను. మీరు ఒక వాక్యం పలుకుచున్నారు. నేను మిమ్ములను ముందుగానే నివారించి ఉండవలసినది. ఎప్పుడూ మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకవద్దు. కాని, ఒక్క అల్లాహ్ అనుకున్నది అని పలకండి.” 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. యూదులకు ‘షిర్కె అస్గర్’ గురించి కూడా తెలుసును. 

2. మానవుడు తన ఇష్టానుసారంగా విషయాలను అర్థము చేసు కొనుటకు ప్రయత్నించును.

3. ఒక వ్యక్తి ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వద్ద “అల్లాహ్ ఇష్టం మరియు మీ యొక్క ఇష్టం” అని పలికినప్పుడు-ప్రవక్త అతనిని “నీవు నన్ను అల్లాహ్ కు సమానం చేస్తు న్నావా?” అని పలికిరి. ఇటువంటప్పుడు ఎవరైనా “ఓ ప్రవక్తా నీవు తప్ప నాకు శరణు ఇచ్చేవారు ఎవరూ లేరు” అను పలుకువారు ముష్రిక్కులు అగుటలో ఎటువంటి సందేహం లేదు. 

4. అల్లాహ్ ఇష్టం మరియు నీ ఇష్టం అనుట ‘షిర్కె అక్బర్’ కాదు. లేనిచో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందే నివారించి యుండేవారు. 

5. మంచి కల కూడా అల్లాహ్ సూచన.

6. మంచి కల ఒక్కొక్కసారి చట్టములను ప్రతిబింబించును.

పాఠము 45 : కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు బాధ కలిగించినట్లే 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

وَقَالُوا مَا هِيَ الحَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنا إلا الدهرُه وَمَا لَهُمْ بِذلِكَ مِنْ عِلم، إن هُمْ إِلَّا يَظُنُّونَ : 

వారు ఇలా అటున్నారు:“మన జీవితం కేవలం ఈ ప్రాపంచిక జీవితమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవితం. మనలను నాశనం చేసేది కాలభ్రమణమే తప్ప మరేదీ కాదు. వాస్తవానికి వారి వద్ద ఈ విషయమునకు సంబంధించి జ్ఞానమేదీ. లేదు. కేవలం వారు తమ ఊహలకు లోనైయున్నారు. (45:24) 

అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసె ఖుద్సీలో ఈ విధముగా ఉల్లేఖించెను: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఉపదేశించెను: 

“ఆదం కుమారుడు కాలాన్ని దూషించి నాకు బాధ కలిగిస్తాడు. వాస్తవానికి నేనే కాలాన్ని సృష్టించాను. రాత్రింబవళ్ళను నేనే మార్చేవాడిని” (సహీ బుఖారి). వేరొక హదీసులో ఈ విధముగా పేర్కొనెను: “కాలమును చెడ్డది అని పలక వద్దు. అసలు కాలము అల్లాహ్ కొరకే.. 

దీనిలో 4 ప్రకరణములు కలవు

1. కాలాన్ని దూషించుట, చెడ్డది అనుట నిషేధించబడినది. 

2. కాలాన్ని చెడ్డది అని పలుకుట అల్లాహ్ ను బాధపెట్టుట అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపారు. 

3. “ఫఇన్నల్లాహ హువద్దహర్” గురించి ఆలోచించవలెను. 

4. కొన్ని సమయాల్లో మానవుడు తనకు తెలియకుండానే కొన్ని తప్పులు పలుకుతుంటాడు. 

పాఠము 46 : ఎవరినైనా రాజాధి రాజు అని పిలుచుట 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “తనకు తాను రాజాధిరాజు అని పలుకువాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు. వాస్తవానికి అల్లాహ్ తప్ప ఎవరూ రాజాధిరాజు లేడు” (బుఖారి). 

హజరత్ సుఫ్యన్ సౌరి “మాలికు అలముల్క్” యొక్క అర్థము రాజాధిరాజు అని తెలిపిరి. మరొక హదీసులో ఈ విధముగా తెలుపబడింది: “ప్రళయదినం నాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు (దౌర్జన్యపరుడు) తనకు తాను రాజాధిరాజు అని చెప్పించుకున్నవాడు.” 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. ఎవ్వరినీ రాజాధిరాజు అనకూడదు. 

2. ఇటువంటి గౌరవనామాలు, బిరుదులతో కూడా పిలుచుట నిషేధము. 

3. ఇటువంటి నామాలతో పదాలు ఎప్పుడూ వాడకుండా, అందరూ జాగ్రత్త పడవలెను. మనస్సులో స్వచ్ఛందంగా వాటి భావములు తెలియకుండా చేసినను ఈ పదాలు వాడుట నిరోధించబడెను. 

4. ఈ పదాలు అల్లాహ్ ఘనత, మహత్యమునకు మాత్రమే వాడుట సముచితము. 

పాఠము 47 : అల్లాహ్ నామాలను గౌరవించుట

అల్లాహ్ ను అగౌరవపరచే పేర్లు దాసులకు ఉంటే వాటిని మార్చవలెను. హజరత్ అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయనను ప్రజలు అబుల్ హకం అని పిలిచెడివారు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో ఈ విధముగా పలికెను: “నిర్ణయించువాడు అల్లాహ్ యే, శాసనము కూడా ఆయనదే.” అప్పుడు అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికారు: “నా సంతతి వారు తమ విభేదముల పరిష్కారానికి నా వద్దకు వచ్చినప్పుడు నేను వారి మధ్య విభేదము లను పరిష్కరించినప్పుడు వారు అంతా అంగీకరించెదరు.” అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “అది చాలా మంచి మాట. నీ సంతానములో ఎవరెవరు ఉన్నారు?” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షురైహ్, ముస్లిం, అబ్దుల్లాహ్” అని తెలిపాను. ప్రవక్త పెద్ద కుమారుడెవరు అని అడిగెను. నేను “షురైహ్” అని తెలిపాను. అప్పుడు ప్రవక్త నన్ను “నీవు అబూ షురైహ్” అని (అబూదావూద్, ఇతరులు) పలికిరి. 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. అల్లాహ్ నామములు మరియు స్వభావములను పూర్తిగా గౌరవించ వలెను. భావము తెలియకుండా ఇతరులకు ఆ పేర్లను వాడరాదు. 

2. అల్లాహ్ నామాల గౌరవార్థం షిర్క్క అనుగుణంగా ఉన్న పేర్లను మార్చి వేయవలెను. 

3. మారు పేరు (పిలువబడు పేరు) ‘కునియత్’ కొరకు పెద్ద కొడుకును ఎన్నుకొనుట. 

పాఠము 48 : అల్లాహ్ ను , ఖుర్ఆన్ ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను హేళన చేసే వారి కొరకు శాసనము 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

ولين سالَتَهُمْ لَيَقُولُنَ إِنَّمَا كُنَّا نَخُوضُ وَتَلْعَبُ ، قُلْ آبِ اللهِ وَايَتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِرُونَ . 

(మీరు మాట్లాడుకుంటున్నదేమిటి?) అని ఒకవేళ వారిని అడిగితే “మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము” అని పలుకుదురు. మీరు వారితో ఇలా పలకండి. “మీ వేళాకోళం అల్లాహ్ నా, ఆయత్లతోనా, ఆయన ప్రవక్తతోనా.’ (9:65) 

హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ముహమ్మద్ బిన్ కాబ్, జైద్ బిన్ అస్లాం ఖతాదా (రహమతుల్లాహ్ అలైహి) ఈ విధముగా తెలిపారు:

తబూక్ యుద్ధ సందర్భంలో ఒక కపటుడు ఈ విధముగా పలికెను: “తిండికి ఎగబడువారు, అబద్ధము పలుకువారు, యుద్ధ సమయములో పిరికివారు ఈ విద్యావంతులను మించి మేము ఎవ్వరినీ చూడలేడు” అతడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అనుచరుల వైపు సైగ చేసి ఇలా పలికెను. అప్పుడు ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) అతడితో నీవు అబద్ధమాడు కపటుడవని పలికి, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ మాటలు తెలిపెదనని బయలు దేరెను. కాని ఆయన చేరక ముందే ఈ విషయము ‘వహీ’ (ఆయతులు) అవతరింపబడెను. ఆ కపటుడు కూడా క్షమాపణ తెలుపుటకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు చేరెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఒంటెపై ప్రయాణించుచుండెను. అతడు ఈ విధముగా విన్నవించు కొనెను: ఓ ప్రవక్తా! మేము సరదాగా వేళాకోళానికి అటువంటి మాటలు మాట్లాడుకొంటిమి, ప్రయాణ బాధలను మరచుటకు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా విశదీకరించిరి: 

 “ఆ దృశ్యం ఇంకా నా కళ్లకు కనిపిస్తోంది. ఆ వ్యక్తి దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కూర్చున్న ఒంటె అంబారీ తాడు పట్టుకొని ఉన్నాడు. అతని కాళ్లు రాళ్లపై ఈడ్చుకుంటూ వెళ్తున్నాయి. “మేము కేవలం వేళాకోళానికి, పరాచికానికి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం” అని అతను అంటున్నాడు. అప్పుడు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) ”అల్లాహ్, అల్లాహ్ వాక్యాలతో, ఆయన ప్రవక్తతోనా మీ పరాచికాలు? ఇప్పుడు సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత మళ్లీ అవిశ్వాసానికి పాల్పడ్డారు” అంటూ ముందుకు కదిలారు. అతని వంక చూడలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడనూ లేదు. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. ప్రవక్తను, ఆయన అనుచరులను, ఇస్లాం చిహ్నాలను హేళన చేసినవాడు అవిశ్వాసి అగును. 

2. ఎవరైనా అలా పలికితే, ఈ వాక్యం (9:65-66) అనుగుణంగా వారు అవిశ్వాసులుగా పరిగణించబడతారు. 

3. చాడీలు చెప్పుటకు, అల్లాహ్ మరియు ప్రవక్తల విషయంలో నిజా నిజాలు తెలుపుటకు భేదం కలదు. 

4. అల్లాహ్ అనంత కరుణామయుడైనప్పటికీ శిక్షల విషయంలో ఆయన విధానం విభిన్నంగా ఉంటుంది. 

5. కొన్ని పశ్చాత్తాపములు స్వీకరించబడేవిగా ఉంటాయి.

పాఠము – 49 : అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే “అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువువద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి(స్థానమే) లభిస్తుంది” అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియ పరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము. (41:50) 

ముజాహిద్ రహమతుల్లాహ్ అలై “హాజా లీ” కి వివరణ ఇస్తూ ఈ విధముగా తెలిపిరి: “ఈ సంపద నా కష్టార్జితము, నేను దీనికే అర్హుడను ” ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఈ పదమునకు “ఈ సంపద అసలు నాదే” అని విశదీకరించిరి. “ఈ సంపద నాకు నా జ్ఞానము మూలముగా లభించినది’ అను వాక్యమునకు ఖతాదా రహమతుల్లాహ్ అలై “ఈ సంపద నాకు నా అనుభవము, నా జ్ఞానముల కారణముగా లభించెను” అని విశదీకరించిరి. వేరే విద్యావేత్తలు “నేను అల్లాహ్ వద్ద ఈ సంపదకు అర్హుడను. అందుచే నాకు ఈ సంపద లభించినది” అని విశదీకరించిరి. ముజాహిద్ రహమతుల్లాహ్ అలై తెలిపిన దాని అర్థము కూడా ఇదే. “ఈ సంపద నాకు నా విశేషత, గౌరవము  కారణముగా లభించెను.” 

హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధను ఈ విధముగా ఉల్లేఖించారు: 

ఇస్రాయీల్ సంతతిలో ముగ్గురుని (ఒకడు తెల్ల మచ్చల రోగం గలవాడు, వేరొకడు బట్టతల గలవాడు, మూడవ వ్యక్తి అంధుడు) పరీక్షించుటకు, వారి వద్దకు అల్లాహ్ ఒక దైవదూతను పంపెను. దైవదూత తెల్లమచ్చల వాని వద్దకు వచ్చి నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని అడిగెను. “నాకు ఈ వ్యాధి నుండి విముక్తి, అందమైన చర్మము ఇష్టము” అని పలికెను. దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయము చేసెను. మంచి అందమైన చర్మము లభించెను. మరల ప్రశ్నించెను “నీకు ఏ సంపద ఇష్టము” అని. అతడు “ఒంటెలు లేదా ఆవులు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఒంటె ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఇలా ప్రార్థించెను: “అల్లాహ్! ఇతనికి ఈ ఒంటెలో భాగ్యము (సమృద్ధి) కలిగించుము.” తరువాత ఆ దైవదూత బట్టతలవాని వద్దకు వెళ్ళి నీకు “ఇష్టమైనది ఏమిటి!” అని ప్రశ్నించెను. దానికి అతడు “నాకు ఈ వ్యాధి దూరమై మంచి వెంట్రుకలు కావాలి” అని పలికెను. అప్పుడు దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయపరచి వెంట్రుకలు ప్రసాదించెను. తరువాత “నీకు ఏ సంపద ఇష్టము!” అని ప్రశ్నించెను. అతడు “నాకు ఒంటె లేదా ఆవు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఆవు ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఈ విధముగా ప్రార్థించెను: “అల్లాహ్ ఇతనికి ఆవులో భాగ్యము (సమృద్ధి) కలిగించుము” అని. తరువాత ఆ దైవదూత అంధుని వద్దకు వెళ్ళి ‘నీకు ఇష్టమైనది ఏమిటి?’ అని ప్రశ్నించెను. అతడు ‘అల్లాహ్ నాకు చూపును ప్రసాదించుట’ అని జవాబు పలికెను. అప్పుడు దైవదూత తన చేత్తో అతన్ని తాకినప్పుడు అల్లాహ్ అతనికి చూపును ప్రసాదించెను. మరల “నీకు ఏ సంపద ఇష్టం” అని ప్రశ్నించెను. అతడు ‘మేకలు’ అని జవాబు పలికెను. అతనికి సూడి మేక ఇవ్వబడెను. చాలా కాలము తర్వాత ఒంటె, ఆవు, మేకల యొక్క సంతానము పెరిగి, వారి సంపద బాగా పెరిగెను. మరల ఆ దైవదూత మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి నేను బీదవాడిని, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఒక ఒంటె దానము చేసిన ఎడల నేను దానిపై ప్రయాణము చేసి నా ఇంటికి చేరగలను. మీకు అందమైన చర్మము, ఈ సంపద ప్రసాదించిన అల్లాహ్ పేరుతో నేను మిమ్ములను అర్థిస్తున్నాను అని పలికెను. కాని అతడు నాకు చాలా అవసరాలు ఉన్నవి. నేను నీకు ఒంటెను ఇవ్వలేను అని పలికెను. దానికి దైవదూత “నీవు తెల్లమచ్చలతో ఉండేవాడివి, బీదవాడివి. నీకు ఇవన్నీ అల్లాహ్ ప్రసాదించెను. నాకు తెలుసును” అని పలికెను. దానికి అతడు “ఇది నా పిత్రార్జితము” అని పలికెను. మరల ఆ దైవదూత బట్టతల వాని దగ్గరకు వెళ్ళి మొదటివానితో పలికినట్లు పలికెను. అతడు కూడా అదే విధమైన సమాధానము పలికెను. అప్పుడు దైవదూత “నీవు అబద్ధము పలికేవాడివైతే అల్లాహ్ నిన్ను పాతస్థితికి చేర్చును” అని పలికెను. చివరికి దైవదూత మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళి “నేను బీద బాటసారిని, నా దగ్గర దారి ఖర్చులు లేవు. అల్లాహ్ యొక్క దయ, పిదప మీరు సహాయము చేయకపోతే నేను ఇంటికి చేరలేను. ఏ అల్లాహ్ అయితే నీకు చూపును ప్రసాదించెనో ఆ అల్లాహ్ పేరుపై నేను నిన్ను ఒక్క మేకను కోరుచున్నాను” అని పలికెను. అతడు ఈ విధముగా జవాబు పలికెను: “నేను అంధుణ్ణి. అల్లాహ్ నాకు నా చూపు ప్రసాదించెను. నీకు కావలసినంత సంపాదన తీసుకొని నీకు ఇష్టము వచ్చినంత వదలి వెళ్ళుము, అల్లాహ్ పేరుపై నీవు ఎంత తీసుకొని వెళ్ళినను నిన్ను వారించను.” అప్పుడు దైవదూత, “నీ సంపద నీ దగ్గరే ఉంచుము, మీరు పరీక్షించబడిరి. అల్లాహ్ మీ పట్ల ప్రసన్నుడయ్యెను. నీ ఇద్దరి స్నేహితుల పట్ల అప్రసన్నుడయ్యెను” అని చెప్పాడు. (బుఖారి, ముస్లిం) 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (41:50) యొక్క భావము (కృతఘ్నుడు హెచ్చరించబడెను). 

2. “లయఖూలన్న హాజా లీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను. 

3. “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను.

4. ముగ్గురి యొక్క సంఘటనలో దాగివున్న నీతిని గ్రహించవలెను. 

పాఠము 50 : అల్లాహ్ సంతానం ప్రసాదించినప్పుడు షిర్క్ కు  పాల్పడుట

ఖుర్ఆన్లో అల్లాహ్ విధముగా ఉపదేశించెను:

فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ

“అప్పుడు అల్లాహ్ వారికి చక్కని పవిత్రమైన సంతానము ప్రసాదించెను. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుకలో ఇతరులను సాటి కల్పించారు. వారు చేసే ఈ షిర్కు పనులకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడూను.” ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్ కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా?  (7: ఆరాఫ్: 190-191). 

ఇబ్నె హజం రహమతుల్లాహ్ అలై ఈ విధముగా తెలిపెను:

ఏదైనా పేరులో అల్లాహ్ దాస్యము కాకుండా ఇతరులకు దాస్యమని ఉన్న అది నిషిద్దము. ఈ విషయంలో మత గురువుల ఏకాభిప్రాయము కలదు. ఉదాహరణకు అబ్దుల్ అమర్, అబ్దుల్ కాబా, అబ్దుల్ ముత్తలిబ్ అటువంటి పేరు కాదు (దీని అర్థము బానిస అని వచ్చును, దాసుని పరిగణనలోకి రాదు). 

దీని విశ్లేషణలో హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపారు: “హవ్వా (అలైహిస్సలాం) గర్భవతి అయినప్పుడు, షైతాను వారి వద్దకు వచ్చి, నేను మిమ్ములను స్వర్గము నుండి బయటకు తీయించాను. మీరు నా మాట వినండి, లేకపోతే నీ గర్భములో ఉన్న శిశువునకు రెండు కొమ్ములు కల్పిస్తాను. ఆ శిశువు నీ గర్భమును చీల్చి బయటకు వచ్చును. మిమ్ములను అనేక విధాలుగా కష్టపెట్టును, అందుచే మీరు నా మాట విని మీకు కాబోయే సంతానాన్ని అబ్దుల్ హారిస్ అని నామకరణము చేయండి” అని వారిని భయ పెట్టెను. కాని ఆదం, హవ్వ (అలైహిస్సలాం) అతని మాటలను ఖాతరు చేయలేదు. వారికి ఒక చచ్చిన శిశువు పుట్టెను. మరల గర్భవతి అయినప్పుడు షైతాన్ వచ్చి మరల అదే విధముగా బెదిరించెను. ఈసారి వారి మనస్సుకు  సంతానముపై ప్రేమ ఆవరించింది. వారు తమ బిడ్డకు “అబ్దుల్ హారిస్” అని పేరు పెట్టారు. “వారు అల్లాహ్ ప్రసాదించిన సంతానము పై షిర్క్ కు పాల్పడిరి అన్న మాటకు భావం ఇదే. (దీనిని ఇబ్నె అబీహాతిమ్ నిజమైన ఆధారముతో హజరత్ ఖాతాదా రహమతుల్లాహ్ అలైహి ద్వారా పొందుపరచెను). 

ఆయన ఈ వాక్యము గురించి ఇలా వివరించెను: “ఆదం, హవ్వాలు షైతాన్ మాటలను మన్నించిరి, కాని షైతాన్ను ప్రార్థించలేదు మరియు ఇబ్నె అబీహాతిమ్ సపీసనద్ ముజాహిద్ (రహిమహుల్లాహ్)  యొక్క విశ్లేషణ ఈ విధముగా తెలిపెను: వారి సంతానము ఒక వేళ మానవుడి రూపమేమో అని భయపడిరి.” హజరత్ హసన్ బసరీ, సయీద్ (రహ్మతుల్లాఅలై) కూడా ఇటువంటి విశ్లేషణలు తెలిపిరి. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ కు తప్ప ఇతరులకు దాస్యము కలుగు ప్రతి నామము నిషేధించబడినది. 

2) వాక్యము (7:190) భావము (దానిలో బహుదైవారాధనకు తావు కల్పించు పేర్లు నిషేధించబడినవి) 

3) హదీసులో నామకరణములో గల షిర్క్ పదాలు తెల్పెను. కాని ప్రార్థనారాధనలలో కాదు. 

4) ఎవరికైనా చక్కని ఆరోగ్యవంతులైన సంతానము కలుగుట అల్లాహ్ ప్రసాదమే.

5) విధేయత చూపు భాగస్వామ్యమునకు, ప్రార్థనలు చేయుటకు మధ్య వ్యత్యాసమును మతపండితులు తెలిపిరి. 

పాఠము 51 : అల్లాహ్ మహోన్నత నామములు 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

وَلِلَّهِ الْأَسْمَاءِ الْحُسْنَى فَادْعُوهُ بِهَام 

وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَابِ 

“అల్లాహ్ కు అందమైన యోగ్యత గల పేర్లు గలవు. మీరు ఆయన్ను ఆ పేర్లతోనే మొరపెట్టుకోండి. ఆయన నామములతో భక్తిహీనత చేయువారిని విడనాడండి.” 

బుఖారీలో అబూ హురైరా(రదియల్లాహు అన్హు) గారి ముర్సల్ ఉల్లేఖనం లో ఈ విధముగా తెలిపెను: 

అల్లాహ్ కు 99 అందమైన యోగ్యతగల నామములు కలవు. ఎవరైతే వాటిని కంఠస్తము చేయునో వాడు స్వర్గమున ప్రవేశించును. అల్లాహ్ బేసి (సంఖ్యలో ఉన్నాడు). బేసి సంఖ్యను ఆయన ఇష్టపడతాడు. తిర్మిజీలో అల్లాహ్ యొక్క 99 అందమైన నామములు పేర్కొనబడెను.) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్య విశ్లేషణలో ‘ఇల్హాద్’ అంటే షిర్క్ అని తెలిపెను. బహుదైవారాధకులు ‘అల్లాహ్ నుండి అల్లాత్ మరియు అల్ అజీజ్ నుండి ‘అల్ ఉజ్జా’ అను పదములను ఉత్పన్నము చేశారు. (ఇబ్నె అబీహాతిం) 

అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన యోగ్యతగల నామములలో వేరే నామము లను చేర్చుటను ఇల్హాద్ (భక్తి హీనత) అని ఆమష్ తెలిపిరి. 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ కు స్వచ్ఛమైన యోగ్యత గల పేర్లు కలవని స్పష్టపరచబడెను. 

2) అల్లాహ్ పేర్లన్నీ స్వచ్ఛమైనవి.

3) అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన నామములను తిరస్కరించువారిని లక్ష్య పెట్టరాదు. 

4) ఇల్హాద్ భావము తెలుపబడెను. 

5) భక్తిహీనత గురించి తెలుపబడినది. 

6) అల్లాహ్ ను స్వచ్ఛమైన, అందమైన యోగ్యతగల నామములతో ప్రార్థించ మని ఆజ్ఞ ఇవ్వబడింది.

పాఠము – 52 : అల్లాహ్ పై సలాము అని పలకరాదు 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: నమాజులో మేము “అల్లాహ్ పై శాంతి కలుగును, ఫలానా వారిపై శాంతి కలుగును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సెలవిచ్చెను: “అల్లాహ్ పై శాంతి కలుగును అని పలకకండి. ఎందుకంటే, అల్లాహ్ యే స్వయంగా శాంతి కలిగించువాడు.” (బుఖారి, ముస్లిం)

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) సలాము గురించి విశ్లేషించబడింది. 

2) ఈ పదము (సలాము) ముస్లింలలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే బహుమతి. 

3) ఈ పదమును అల్లాహ్ పై అని పలకరాదు. 

4) అల్లాహ్ పై సలాము అని పలకరాదనుటకు కారణము తెలుపబడెను. 

5) అల్లాహ్ కొరకు చదవబడు సరియైన పదములు, చదవకూడదనే పదములు తెలుపబడెను. 

పాఠము – 53 : “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అనకూడదు 

హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ఉద్బోధించారు: 

మీలో ఎవ్వరూ “ఓ అల్లాహ్! నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని లేదా “ఓ అల్లాహ్ ! నీకు ఇష్టమైతే నాపై దయతలుచు” అని ప్రార్థించరాదు. నిశ్చయముగా అల్లాహ్ ను స్థయిర్యము మరియు విశ్వాసముతో ప్రార్థించి వేడుకోండి. ఎందుకంటే, అల్లాహు ను వారించగల వాడెవ్వడూ లేడు. (సహీ బుఖారీ, సహీ ముస్లిం) 

మీరు అల్లాహు ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని ప్రార్థించండి. ఎందుకంటే, అల్లాహ్ వద్ద ఏదీ పెద్దది కాదు. (సహీ ముస్లిం)

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ను ప్రార్థించునప్పుడు షరతు పెట్టి ప్రార్థించరాదు. 

2) షరతులతో కూడిన ప్రార్థన నిషేధానికి కారణము తెలుపబడెను. 

3) స్థయిర్యముతో, విశ్వాసముతో అల్లాహు ప్రార్థించవలెను. వేడుకోవలెను. 

4) అల్లాహ్ ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకొనవలెను.

5) అల్లాహ్ ను పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకోవలెనని పలుకుటకు గల కారణము తెలుపబడెను. 

పాఠము 54 : ‘నా బానిస’ అని పలకరాదు 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: 

“మీరెవరూ మీ సేవకులను, “నీ ప్రభువుకు అన్నం తీసుకొనిరా లేదా నీ ప్రభువుకు నీళ్ళు తీసుకొనిరా” అని పలకవద్దు. “అధికారి” అని పలకండి, మీ బానిసలను, “నా దాసుడు, నా దాసి ” అని పలకవద్దు. “నా సేవకులు” అని పలకండి”. (సహీ ముస్లిం) 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) ‘నా బానిస’ అనుట నిషిద్ధం. 

2) బానిసలు తమ అధికారిని ‘మా ప్రభువు’ అనుట నిషేధించబడింది. 

3) అధికారులు తమ సేవకులను “దాసులు, బానిసలు” అని పలుకుటకు బదులు సేవకులు అని పలకవలెనని బోధించబడెను.

4) బానిసలు తమ అధికారిని ‘మా అధికారి లేదా మా పెద్ద’ అని పలుకవలెను.

5) దీనికి అసలు కారణం, ఏకదైవారాధన శ్రేష్ఠతకు భంగము కలగకుండా ఉండటం. కనుక మాటలలో ఇతరులను, పిలుచుటలో కూడా ఏకదైవా రాధన శ్రేష్ఠతకు భంగం ఏర్పడకుండా జాగ్రత్త వహించవలెను. 

పాఠము 55 : అల్లాహ్ నామముతో యాచించువానిని ఒట్టి చేతుల్తో పంపరాదు 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనలను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“అల్లాహ్ నామముపై యాచించువారికి ఏమైనా తప్పకుండా ఇవ్వండి. అల్లాహ్ నామమున ఆశ్రయము కోరు వారికి ఆశ్రయము ఇవ్వండి. మిమ్ములను విందుకు ఆహ్వానించువారి విందును స్వీకరించండి. మీకు సహాయము చేసి లాభమును, మర్యాదను చేకూర్చిన వారికి, మీరు కూడా అతని సహాయమునకు సరిపడినంత సహాయమైనా చేయండి. లేక మీరు సహాయము చేయలేని పక్షములో వారి కొరకు అల్లాహ్ వారి మేలు తీర్చ గలిగాను అనుకున్నంత వరకు దుఆ చేయండి.” (అబూదావూద్, నసాయి-సహీ సనద్) 

దీనిలో 6 ప్రకరణమలు కలవు 

1) అల్లాహ్ నామముతో ఆశ్రయము కోరిన వారికి ఆశ్రయము ఇవ్వవలెను. 

2) అల్లాహ్ నామముతో యాచించిన వారికి ఏమైనా తప్పక ఇవ్వవలెను. 

3) ఆహ్వానమును స్వీకరించవలెను. 

4)సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వవలెను. 

5) సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వలేని వారు అతని మేలు కొరకు అల్లాహ్ తో దుఆ చేయవలెను.

6) సహాయము చేసిన వారి ప్రతిఫలముగా మేలు తీర్చగలిగాను అనుకున్నంత వరకు అల్లాహ్ దుఆ చేస్తుండవలెను. 

పాఠము 56 : అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమే కోరవలెను 

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: “అల్లాహ్ నామమున స్వర్గము తప్ప వేరేదీ యాచించవద్దు.” 

దీనిలో 2 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ముఖము నిమిత్తము పలికినప్పుడు అన్నిటినీ మించిన ఉద్దేశితము స్వర్గము కాకుండా వేరే వాటిని యాచించరాదు. 

2) అల్లాహు ముఖము కలదని స్పష్టమగుచున్నది. అది ఎలాగున్నదో మనకు తెలియదు. 

పాఠము – 57 : కష్టనష్టాలు సంభవించినప్పుడు ‘ఒకవేళ ఇలా జరిగి ఉంటే’ అని పలుకుట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الأمْرِ شَيء مَا قُتِلْنَا ههناء 

“….. (అల్లాహ్ మార్గములో వెళ్ళిన వారి గురించి) ఒకవేళ వీరు మా మాటలు విని ఉంటే చంపబడేవారు కాదని పలుకుచున్నారు.” (3:154) 

హజరత్ అబూహురైరా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: హజరత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: 

నీకు లాభదాయకమైన దానినే కాంక్షించు. ఒక్క అల్లాహ్ శరణము మాత్రమే కోరుకో, చేతకానివాడి వలె కూలబడకు, నీకు కష్టనష్టములు వాటిల్లితే “ఒకవేళ నేను ఇలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది” అని పలకకు, “ఇది అల్లాహ్ నిశ్చయించినది, ఆయన నిశ్చయము ప్రకారము జరిగినది” అని పలుకు. ఎందుకంటే, “ఒకవేళ అని” అనే పలుకు షైతాను అమలుకు దారితీస్తుంది. (సహీ ముస్లిం) 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1) వాక్యములు (3:154, 23:168) కు భావము (ఒకవేళ అనే పలుకు వారి గురించి తెలుపబడెను.) 

2) కష్టనష్టాలలో ఒకవేళ ఇలా చేస్తే ఇలా అయ్యేదేమో అనుట నిషిద్ధం. 

3) ఒకవేళ అని పలకకూడదు అనుటకు కారణము, షైతాన్ అమలుకు దారి తెరుస్తుంది. 

4) మంచి పలుకులు పలుకుటకు ప్రేరేపించబడెను. 

5) లాభదాయకమైన వాటినే కాంక్షించాలి, అల్లాహ్ సహాయము కోరాలి. 

6) చేతకానివాడి వలె కూలబడుట నివారించబడింది. 

పాఠము 58 : గాలిని తిట్టుట నిషిద్ధం 

హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“గాలిని తిట్టకండి. మీరు సుడిగాలిని చూసినప్పుడు ఇలా చదవండి: “ఓ అల్లాహ్ ! మేము ఈ గాలితో మంచిని కోరుచున్నాము, ఈ గాలిని ఆజ్ఞాపించబడిన దానిలో కూడా మంచిని కోరుచున్నాము. ఓ అల్లాహ్ ! మేము ఈ గాలిలోని చెడు నుండి నీ శరణు కోరుచున్నాము. ఈ గాలికి ఆజ్ఞాపించ బడిన చెడు నుండి కూడా నీ శరణు కోరుచున్నాము.” (తిర్మిజీ సహీ) 

దీనిలో 4 ప్రకరణములు కలవు

1) గాలిని తిట్టుట నివారించబడెను.

2) ఏదైనా అయిష్టమైనది కనపడినప్పుడు, అల్లాహు కు ఇష్టమైనది కోరుకోవలెను. 

3) గాలి తనంతట తాను వీయదు. అల్లాహ్ ఆజ్ఞ మేరకే వీయును. 

4) గాలి ఒక్కోసారి మంచి చేయుటకు ఆజ్ఞాపించబడును. ఒక్కోసారి చెడు చేయుటకు ఆజ్ఞాపించబడును.

పాఠము – 59 : అల్లాహ్ ను శంకించుట నిషిద్ధం 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

“వారు అల్లాహ్ పట్ల అసత్య, అజ్ఞాన, అశుద్ధమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. (వారితో) ఇలా పలుకుము: “ఈ విషయంలో (ఎవ్వరికీ అధికారము లేదు. సమస్త అధికారములు అల్లాహ్ అధీనంలో ఉన్నవి. వాస్తవానికి వారు తమ హృదయములలో దాచుకున్న వాటిని మీకు వ్యక్తం చేయడం లేదు. మేము స్వతంత్రాధికారములు కలిగి ఉంటే, మేము ఇచట చంపబడి ఉండే వారము కాదు అని పలుకుచున్నారు. వారితో ఇలా పలకండి, మీరు మీ ఇళ్ళల్లోనే ఉండినప్పటికీ మృత్యువు లిఖించబడి ఉన్నవారు స్వయంగా తమ ప్రాణాంతక స్థానాలకు తరలివచ్చి ఉండేవారు (ఈ వృత్తాంతము ఎందుకు జరిగిందంటే) అల్లాహ్ మీ హృదయాలలో దాగివున్న దానిని పరీక్షించుటకు, మీ మనస్సులలో ఉన్నదానిని స్వచ్చపరచుటకు. నిశ్చయముగా అల్లాహు కు ఆంతరంగిక స్థితి బాగా తెలుసును. వాస్తవానికి అల్లాహ్ ను శంకించువారిపైనే కష్టములు వచ్చిపడును.”

పై వాక్యములను గురించి ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించెను: 

“పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్తకు సహాయపడడు, ఆయన ధర్మము వైపునకు ఆహ్వానించుచున్న కార్యము సమసిపోవును” అని వారు శంకించిరి. ముస్లిములపై వాటిల్లిన ఆపద అల్లాహ్ విధి కాదని అనుమానపడిరి. అల్లాహ్ యొక్క విధి, నేర్పు, ప్రవక్త యొక్క సఫలతను వీరు శంకించిరి. ఇస్లాం అన్ని మతాలపై సఫలత పొందజాలదని అనుమానపడిరి. కపటుల, బహుదైవారాధకుల ఈ శంక వాక్యము (48:6)లో తెలుపబడినది. ఇటువంటి కుశంక అల్లాహ్ యొక్క గొప్పతనమునకు విరుద్ధము. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క జ్ఞానము, ముక్తి, గుణము, గౌరవాధిక్యతకు విరుద్ధము. 

ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ యొక్క తాత్పర్యము ఈ విధముగా చేయుచున్నారు: కపట విశ్వాసము గలవారు ఉహద్ యుద్ధము తర్వాత ఈ విధముగా అనుమానించసాగారు. అది ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్తకు సహాయము చేయడు. అప్పుడు ప్రవక్త ప్రచార ఆర్భాటం అంతరించిపోతుంది. మరో తాత్పర్యము ఈ విధముగా ఉంది: ప్రవక్తకు, విశ్వాసులకు, కలిగించిన ఇబ్బందుల ద్వారా కపటులు ఇలా శంకించేవారు, విధి అనేది అల్లాహ్ యొక్క వివేకం కాదు. 

అందుచే, “అల్లాహ్ అసత్యమును సత్యముపై ఆధిక్యత కలిగించునని యదార్థము సమసిపోవునని ఎవరయితే భావించెదరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధికి అనుగుణముగా జరిగెనని విశ్వసించరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధి నమ్మశక్యము కాదని భావించెదరో, ఇది కేవలం అతని ఇచ్చ అనుకొనెదరో” ఈ విధమైన కుశంక కలిగివుండుట తిరస్కారుల విధానము. తిరస్కారుల కొరకు నరకము స్థిర నివాసము. చాలా మంది తమ పనులలో శంకిస్తుంటారు. కాని అల్లాహ్ ను విశ్వసించేవారు, ఆయన స్వభావములను విశ్వసించేవారు, ఆయన ద్వారా ముక్తి మరియు గౌరవాధిక్యతను విశ్వసించేవారు ఈ శంకల నుండి సురక్షితముగా ఉండగలరు. 

జ్ఞానోదయము కలిగిన ప్రతి వ్యక్తీ తన మేలు కోరుకొని అల్లాహ్ ను శంకించక అటువంటి కుశంకములు కలిగినప్పుడు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవలెను. 

ప్రజలు అల్లాహ్ నిర్ణయించిన విధిని శంకిస్తుంటారు. ఇలాగై ఉంటే బాగుండేది అని పలుకుదురు. తమకు ప్రసాదించబడిన దానిని అల్పముగా భావించెదరు. అందుచే మనము కూడా కుశంక నుండి దూరముగా ఉన్నామా? లేదా? అని పరిశీలించు కోవలెను. ఒక అరబీ లోకోక్తి: “నీవు దాని నుండి దూరముగా ఉన్న ఎడల పెద్ద సాఫల్యము పొందిన వాడవు, కాని దూరముగా ఉన్నావని నేను తలచుటలేదు.” 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1) వాక్యము (3:154) యొక్క భావము (కుళంకుల గురించి) తెలుపబడెను. 

2) వాక్యము (48:6) యొక్క భావము (శంకించువారికి చెడు జరుగును అని) తెలుపబడెను.

3) లెక్కలేనన్ని విధములుగా జనులు శంకించుదురు. 

4) ఈ కుశంక నుండి అల్లాహ్ యొక్క స్వభావములను గుర్తించి, తన మనస్సు యొక్క పరీక్ష చేసుకోగలిగిన వారు మాత్రమే సురక్షితముగా ఉండగలరు. 

పాఠము 60 : అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించే వారు 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

నా ప్రాణము ఎవరి చేతిలో ఉన్నదో ఆయనపై ప్రమాణము, ఒకవేళ ఎవరి వద్దయినా కొండంత బంగారమున్నచో అతడు అల్లాహ్ మార్గములో దానము చేసినా అతని ఈ అమలు (దానము) అతడు విధిపై విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. 

తన బోధనకు ఆధారముగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ ఉపదేశమును ఉల్లేఖించెను. “విశ్వసించుట అనగా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయదినమును, అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట”. (ముస్లిం, హజరత్ ఉబాదాబిన్) 

ఉబాద్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) తన కుమారునికి ఈ విధముగా బోధించిరి: 

“ప్రియమైన కుమారుడా! నీకు సంభవించబోవు కష్టము నుండి నీవు రక్షించబడలేవు, నీకు సంభవించబోని కష్టము ఎప్పటికీ నీ వద్దకు రాదు అని విశ్వసించనంత వరకు విశ్వాసపు రుచిని నీవు పొందజాలవు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుంచి ఈ ఉపదేశమును వింటిని: అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి, దానిని వ్రాయమని ఆజ్ఞాపించెను. అది, ఓ నా ప్రభూ! ఏమి వ్రాయవలెను? అని అడిగెను. “ప్రళయ దినం వరకూ వచ్చు ప్రతి ప్రాణి విధిని వ్రాయుము” అని అల్లాహ్ సమాధాన మిచ్చెను: కుమారా, నేను ప్రవక్తను ఆయన ఈ విధముగా ఉపదేశిస్తుండగా విన్నాను: “ఎవరైతే ఈ విశ్వాసము కాక వేరే విశ్వాసముపై మరణిస్తాడో అతడు నా అనుచరులలోని వాడు కాదు.” (అబూ దావూద్, ముస్నదె అహ్మద్) 

“అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి దానితో ప్రళయ దినం వరకు సంభవించు నటువంటి వన్నీ వ్రాయించివేసెను.” (ముస్నదె అహ్మద్) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశమును ఇబ్నె వహబ్ ఈ విధముగా ఉల్లేఖించిరి: 

“ఎవరైతే మంచి లేదా చెడు విధిపై విశ్వసించరో, వారిని అల్లాహ్ నరకములో కాల్చును.” 

ఇబ్నె అద్ దైలమి ఈ విధముగా ఉల్లేఖించెను: 

నేను హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) వద్దకు పోయి నా మనస్సులో విధి గురించి కొంత అనుమానము కలదు, మీరు ఏదైనా హదీసు బోధించండి, అల్లాహ్ నా మనస్సులో నుంచి అనుమానమును తీసివేయుటకు” అని విన్నవించుకున్నారు. 

అప్పుడు హజరత్ ఉబై బిన్ కాబ్ అబీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా బోధించారు: 

“నీవు ధనమును దానము చేసినా, నీ ఈ అమలు (దానము) నీవు విధిపై విశ్వసించనంతవరకూ, నీకు ఏ కష్టము వాటిల్లబోతుందో అది వాటిల్లు తుందని, నీకు వాటిల్లబోని కష్టము వాటిల్లబోదని విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. నీ విశ్వాసము దీనికి భిన్నముగా ఉండి నీవు మరణించిన యెడల నీవు నరకమున చేరెదవు.” తరువాత నేను హజరత్ అబ్దులా బిన్ మసీద్, హజరత్ హుజేఫా బిన్ యమాన్, హజరత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ల వద్దకు వెళ్ళినప్పుడు వారు కూడా ప్రవక్త యొక్క ఇదే హదీసును బోధించిరి. (హాకిం దీనిని తన సహీలో పొందు పరచెను. ఇది సహీ హదీసు). 

దీనిలో 9 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట తప్పనిసరి. 

2) విధిని ఏ విధముగా విశ్వసించవలెనో విశదీకరించబడెను. 

3) విధిని విశ్వసించనివారి కార్యములు స్వీకరించబడవు.
4) విధిని విశ్వసించనివాడు ‘ఈమాన్’ మాధుర్యాన్ని పొందజాలడు.
5) అల్లాహ్ అన్నిటికంటే ముందు సృష్టించిన దానిని తెలుపబడెను.
6) కలము ప్రళయదినం వరకు సంభవించునటువంటివన్నీ వ్రాసివేసెను. 

7) విధిని విశ్వసించని వారికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో సంబంధము లేదు. 

8) ‘సలఫీలు’ అనుమానము కలిగినప్పుడు ఖుర్ఆన్, హదీసులు బాగా తెలిసిన వారిని సంప్రదించేవారు. 

9) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ద్వారా విధి గురించి స్పష్టముగా విశదీకరించబడెను. 

పాఠము 61 : చిత్రాలు, శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసు ఖుద్సీని ఈ విధంగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెనని సంబోధించెను: 

“నా సృష్టిలాంటి సృష్టిని తయారు చేయుటకు ప్రయత్నించిన వారికి మించిన దుష్టులెవరూ లేరు. వీరిని ఒక రవ్వంతటి వస్తువును చేసి చూపెట్ట మనండి.” (సహీ ముస్లిం, సహీ బుఖారి) 

హజరత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించెను. 

“సృష్టించుటలో అల్లాహ్ యొక్క సృష్టి ప్రతిరూపమును చేయువారు ప్రళయ దినాన అందరినీ మించి శిక్షించబడుదురు.’ (సహీ ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రబోధించిరి: 

ప్రతి శిల్పి, చిత్రకారుడు నరకములో ప్రవేశించును. అతడు తాను చేసిన ప్రతి చిత్రమునకు బదులుగా ఒక ప్రాణము చేసి, దాని ద్వారా ఆ చిత్రకారుడు నరకంలో శిక్షింపబడును. (బుఖారి, ముస్లిం) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“ఇహలోకంలో చిత్రము చేసిన వారిని ప్రళయ దినం నాడు ఆ చిత్రములో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని అతడు ఎప్పటికీ చేయలేక పోవును.” 

అబూ హయ్యాజ్ కథనం: అలీ (రదియల్లాహు అన్హు) నాతో ఇలా అన్నారు. “నన్ను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పంపిన పనిపై నిన్ను పంపనా? అది ఏమనగా ఏ శిల్పమునైనా లేదా ఎత్తుగా ఉన్న ఏ సమాధినా కూల్చకుండా వదలవద్దు.” (సహీ ముస్లిం) 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1) శిల్పములు, చిత్రపటములు చేసేవారిని హెచ్చరించబడెను. 

2) చిత్రించుటను నిషేధించటానికి కారణము, ఇది కూడా షిర్క్ జాతికి చెందినదే. 

3) అల్లాహ్ సృష్టికర్త. సృష్టి బలహీనమైనది. సృష్టిని అల్లాహ్ సృష్టించెను. సృష్టి దేన్నీ సృష్టించజాలదు. 

4) చిత్రకారుడు అందరికంటే ఎక్కువగా శిక్షించబడును. 

5) అల్లాహ్ ప్రతి చిత్రమునకు బదులు ఒక ప్రాణము సృష్టించి దాని ద్వారా చిత్రకారుణ్ణి నరకంలో శిక్షించును. 

6) చిత్రకారునికి అతడు వేసిన చిత్రములన్నింటిలో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని, అతడు చేయలేడు. 

7) విగ్రహాలు, ఎత్తయిన సమాధులు నిర్మూలించుటకు ఆజ్ఞాపించబడును. 

పాఠము 62 : ఎక్కువగా ప్రమాణములు చేయుట 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَاحْفَظُوا اَيْمَانَكُمْ . 

మీరు మీ ప్రమాణాలను పదిలము చేసుకోండి.” (5:89) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: (బుఖారి, ముస్లిం) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“(అసత్య) ప్రమాణము సరుకులను అమ్ముటకు పనికొచ్చునుగాని అది సమృద్ధిని హరించును.” 

హజరత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి : (తిబ్రాని, సహీ) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“మూడు రకాల జనులను అల్లాహ్ (ప్రళయ దినం) పలకరించడు. వారి పాపములను దూరము చేయడు, వారికి భయంకర శిక్ష విధించబడును.
1. వ్యభిచారము చేయు వృద్ధుడు.
2. గర్వము, అహంకారము గల బిచ్చగాడు.
3. అల్లాహ్ ను తన వ్యాపారముగా చేసుకొన్నవాడు. అల్లాహ్ పై ప్రమాణము చేసి సరుకును విక్రయించేవాడు, ప్రమాణము చేసి సరుకు అమ్మేవాడు. 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుస్సేన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “అన్నింటికంటే ఉత్తమమైన కాలము నా తరువాత వచ్చునది. ఆ పిమ్మట వచ్చునది” హజరత్ ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు)  “ప్రవక్త తన తరువాత రెండు కాలములు పలికారో లేక మూడు కాలములు పలకెనో నాకు గుర్తులేదు” అని తెలిపిరి. తరువాత ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “మీ తర్వాత కొందరు వస్తారు. వారు తమను సాక్ష్యానికి పిలవక ముందే సాక్ష్యం ఇస్తారు. నమ్మకద్రోహానికి పాల్పడతారు. నిజాయితీగా ఉండరు. మొక్కుబడులు చేస్తారు. కాని వాటిని పూర్తిచేయరు. వారిలో లావుతనం కనిపిస్తుంది” (సహీ ముస్లిం) 

అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“అందరికంటే ఉత్తమ ప్రజలు నా కాలపు ప్రజలు. పిమ్మట నా తరువాత వచ్చువారు. ఆ పిమ్మట తరువాత వచ్చువారు. తరువాత వచ్చువారు తమ ప్రమాణమునకు ముందే సాక్ష్యము పలుకుదురు. సాక్ష్యము ముందు ప్రమాణము చేయుదురు. (అంటే తమ ప్రమాణము చేయుటలోగాని, సాక్ష్యము పలుకుటలోగాని నిజాన్ని ఖాతరు చేయరు). ” 

హజరత్ ఇబ్రాహీం నఖయీ (రహమతుల్లాహ్ అలై) ఇలా తెలిపిరి: “మా చిన్న వయస్సులో మా పెద్దలు మమ్మల్ని వాగ్దానానికి, సాక్ష్యములకు కట్టుబడి ఉండవలెనని దండించెడివారు. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1) ప్రమాణాలను పదిలము చేయుటకు ఆజ్ఞాపించబడినది. 

2) ప్రమాణము చేసి సరుకు అమ్ముటవలన దానిలోని సమృద్ధిని కోల్పోతారు. 

3) సరుకును కొన్నప్పుడు, అమ్మినప్పుడు అనవసర ప్రమాణములు చేయువారిని హెచ్చరించబడెను.

4) నేరములకు కారణములు చిన్నవి అయినప్పటికీ అభిముఖము చూపుట వలన అవి పెద్దవి అగును. 

5) కోరక ముందు ప్రమాణము చేయువారిని నివారించబడెను. 

6) ప్రవక్త మూడు, నాలుగు కాలముల పరిమితుల ప్రాముఖ్యతను తెలిపి తరువాత జరుగునది తెలిపెను. 

7) సాక్ష్యము కొరకు ముందే సాక్ష్యము ఇచ్చుటకు సిద్ధమగువారిని వారించబడెను. 

8) సలఫె సాలిహీన్ పిల్లలను వాగ్దానానికి, సాక్ష్యానికి కట్టుబడి ఉండనిచో దండించెడివారు. 

పాఠము – 63 : అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

“మీరు అల్లాహ్ వాగ్దానము చేసినప్పుడు దానిని నెరవేర్చండి. అల్లాహ్ సాక్షిగా చేసిన ప్రమాణాలను భంగపరచకండి. ఎందుకంటే మీరు అల్లాహ్ ను  తమపై పూచీ చేసుకున్నారు. అల్లాహ్ కు మీ పనులన్నీ తెలుసును.” (16:91) 


2. వారు ఏకదైవారాధనకు వ్యతిరేకిస్తే రక్షణ రుసుము కట్టమని అడగండి. వారు అంగీకరిస్తే మీరు కూడా ఆమోదము తెలుపండి. 

హజరత్ బురైదా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ అధికారినైనా నియమించి నప్పుడు అల్లాహ్ కు భయపడమని, తోటి ప్రజలతో సత్ప్రవర్తన పాటించమని అతనికి ఉపదేశించి ఈ విధముగా ప్రబోధించెడివారు: ‘అల్లాహ్ మార్గములో అల్లాహ్ పేరున యుద్ధము చేయుము. అల్లాహ్ ని తిరస్కరించిన వారిపై యుద్ధము చేయుము. యుద్ధము చేయుముగాని అన్యాయము చేయవద్దు, మాట తప్పవద్దు, ఎవరి అవయవములూ కోయవద్దు. పిల్లలను హతమార్చవద్దు. తిరస్కారులను మూడు విషయముల వైపునకు పిలవండి. 

1. ఒక్క అల్లాహ్ ఆరాధించమని కోరండి. వారు అంగీకరించిన పక్షంలో ఇస్లాం స్వీకరించి మదీనాకు వలస వెళ్ళమని వారిని కోరండి. వారు అంగీకరిస్తే వారందరికీ వలస వెళ్ళిన వాళ్ళ హక్కులన్నీ లభించునని తెలుపండి. వలస వెళ్ళని ఎడల ఆ హక్కులు లభ్యము కావని తెలపండి. 

3. వారు రక్షణ రుసుము కట్టుటకు నిరాకరిస్తే అల్లాహ్ సహాయమును యాచించి వారితో యుద్ధము చేయండి. మీరు కోటలోని శత్రువులను ముట్టడించినప్పుడు, శత్రువులు మిమ్మల్ని అల్లాహ్ తరువాత ప్రవక్త నామముల పూచీ కొరినచో మీరు వారికి అటువంటి పూచీలను ఇవ్వకండి. కాని మీరు మీ యొక్క సొంత పూచీ ఇవ్వండి. మీరు మీ పూచీని ఖాతరు చేయని యెడల అది అల్లాహ్ ఆ తరువాత ప్రవక్తల పేర ఇచ్చిన పూచీకంటే స్వల్పమైన పూచీ. మీరు కోటను ముట్టడించినప్పుడు వారు అల్లాహ్ పేర సంధి చేసుకొందురు అంటే మీరు సంధి చేయకండి. ఎందుకంటే మీరు చేయు సంధిలో అల్లాహ్ పరిష్కార మార్గము ఉన్నదో లేదో మీకు తెలియదు.’ 

దీనిలో 7 ప్రకరణములు కలవు. 

1) అల్లాహ్ నామమున ఇచ్చిన పూచీ, ప్రవక్త నామమున ఇచ్చిన పూచీ, ఇతరులు పూచీలో వ్యత్యాసము కలదు. 

2) రెండు కష్ట సమస్యలు ఎదురైనప్పుడు వాటిలోని సులభమైన దానిని స్వీకరించవలెను. 

3) అల్లాహ్ మార్గములో అల్లాహ్ కొరకు యుద్దము చేయవలెను.
4) అల్లాహ్ ను తిరస్కరించినవారిపై యుద్ధము చేయవలెను. 

5) అల్లాహ్ యొక్క సహాయము యాచించి యుద్ధము చేయవలెను.

6) అల్లాహ్ నిర్ణయము, ఇతరుల నిర్ణయములో వ్యత్యాసము కలదు. 

7) అనుచరులు తీసుకున్న నిర్ణయం అల్లాహ్ అంగీకార యోగ్యమైనదని అనుకొనుట సరికాదని స్పష్టమగును. 

పాఠము – 64 : అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట 

హజరత్ జందుబ్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: 

ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రమాణము చేసి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు” అని పలికినప్పుడు అల్లాహ్ ఇలా తెలిపెను: అతడెవడు నా నామమున ప్రమాణము చేయువాడు, నేను ఫలానా వ్యక్తిని క్షమించనని. నేను అతనిని క్షమించితిని, ప్రమాణము చేసిన వ్యక్తి అమలు (కార్యములు) వృధా చేసితిని. (ముస్లిం) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసును ఈ విధముగా విశదీకరించిరి: 

“ఆ వ్యక్తి ఒక మంచి భక్తుడని, అతను పలికిన పలుకులు అతనిని ఇహపర లోకాలని నాశనము చేసివేసెను.’ 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ను పూచీ పెట్టి ప్రమాణము చేయుట నిషిద్దము. 

2) నరకము ప్రతి ఒక్కని సమీపములో ఉన్నది. 

3) స్వర్గము కూడా అదే విధముగా సమీపములో ఉన్నది. 

4) పై హదీసుతో ప్రవక్త ఈ హదీసు ధృవపరచబడెను: “కొన్ని సమయము లలో మానవుడు తన ఇహపర లోకములను నాశనము చేయుట (అగుట) కు కారణమైన పలుకులు పలుకును.” 

5) అల్లాహ్ మనలను కొన్ని సమయములలో మనము ఊహించని రీతిలో అ క్షమించును. 

పాఠము 65 : సృష్టిరాశులను సంతోషపెట్టటానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు 

హజరత్ జుబైర్ బిన్ ముత్యమ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక అజ్ఞాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఈ విధముగా పలికెను: 

“ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రాణములు పోవుచున్నవి, పిల్లలు ఆకలితో అలమటించిరి, పంట నాశనమగుచున్నది. మీరు దయచేసి అల్లాహ్ ను వర్షము కొరకు ప్రార్థించండి. మేము అల్లాహ్ ను  మీ వద్ద, మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసులుగా చేయుచున్నాము.” 

ప్రవక్త అతని మాటలు విని, “అల్లాహ్ పరిశుద్ధుడు, అల్లాహ్ పరిశుద్ధుడు అని చాలా సేపటి వరకు ఉచ్ఛరించుచుండిరి. సహచరులు దానిని గ్రహించిరి. చివరికి ప్రవక్త ఇలా ఉద్బోధించారు. “నీకై పశ్చాత్తాపము, అల్లాహ్ ఎవరో నీకు తెలియునా? అల్లాహ్ అతి ఉత్తముడు, ఆయనను ఎవరి ముందు సిఫారసు చేయువానిగా పలకరాదు.” 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మేము అల్లాహ్ ని మీ వద్ద సిఫారసు చేయువానిగా అనుదుము’ అనిన వారి కొరకు పశ్చా త్తాపము కోరిరి. 

2) అజ్ఞాని పలికిన పైపలుకులకు ప్రవక్త ముఖకవళికలు మార్పు చెందు టను సహచరులు గ్రహించారు. 

3) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజ్ఞాని పలికిన (మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసుగా చేయుచున్నాము) దానికి ఏమీ ప్రస్తావించలేదు

4) సుబహానల్లాహ్ (అల్లాహ్ పరిశుద్ధుడు)కు విశ్లేషణము తెలుపబడెను. 

5) విశ్వసించినవారు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి వర్షము కొరకు ప్రార్థన చేయించేవారని స్పష్టమగును. 

పాఠము 66 : ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తౌహీదు పరిరక్షించారు షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు 

హజరత్ అబ్దుల్లా బిన్ షిఖియ్యిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: నేను ఒకసారి బనూ ఆమిర్ ప్రతినిధి సంఘముతో పాటు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వెళ్ళి, “మీరు మా సర్దారు” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “సర్దారు అల్లాహ్ ఒక్కడే” అని పలికిరి. అప్పుడు మరల మేము, “మీరు మాకంటే ఉత్తములు, మాకంటే ఎక్కువ దయగలవారు’ అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “ఇటువంటి అర్హత గల పలుకులనే పలకండి. షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు. జాగ్రత్త వహించండి” అని పలికిరి. (అబూ దావూద్) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: కొంతమంది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఓ అల్లాహ్ ప్రవక్తా! మాలో అందరికంటే ఉత్తముడా!, అందరికంటే ఉత్తముని కుమారుడా! ఓ సర్దార్, సర్దారు కుమారుడా” అని మేము పిలిచితిమి. ప్రవక్త ఈ విధముగా జవాబు పలికిరి. “ఓ ప్రజలారా! మీరు అర్హమైన మాటలే పలకండి, షైతాను మిమ్ములను పెడత్రోవ పట్టించగలడు. నేను ముహమ్మద్ ను  అల్లాహ్ దాసుడను, అల్లాహ్ ప్రవక్తను. మీరు నన్ను అల్లాహ్ నాకు ప్రసాదించిన నా స్థానము నుండి పెంచకండని నేను మిమ్మల్ని వారించుచున్నాను. (ఉత్తమసనద్ నసాయి పొందుపరచెను. ) 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1) హద్దు మీరి మాట్లాడువారు హెచ్చరించబడెను. 

2) “మీరు మా సర్దార్” అని అంటే చెప్పవలసిన జవాబు తెలుపబడెను. 

3) వారు మామూలు మాటలు పలికినప్పటికీ, షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు జాగ్రత్త” అని హెచ్చరించిరి. 

4) “అల్లాహ్ నాకు ప్రసాదించిన స్థానము నుండి నన్ను పెంచవద్దు” అని ప్రవక్త పలకటంతో మనము కూడా దానిని స్పష్టంగా అర్థం చేసుకోవలెను. 

పాఠము 67 : అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము) 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను; 

وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ కనుగుణంగా అల్లాహు గౌరవించలేదు. ప్రళయ దినం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఉండును. సమస్తాకాశములు ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉండును. వారు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు.” (39:67) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక యూద పండితుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ఈ విధముగా పలికెను: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! మా పుస్తకాలలో ఈ విధముగా ఉన్నది: అల్లాహ్ ప్రళయ దినం నాడు సకలాకాశాలను ఒక వేలిపై, భూమండలమును ఒక వేలిపై, సకల వృక్షములను ఒక వేలిపై, ఒక వేలిపై బురదను, మిగిలిన సకల సృష్టిరాశుల్ని ఒక వేలిపై ఉంచి, తరువాత ‘నేనే మీ రాజును’ అని సెలవిచ్చును కదా!” అతని మాటలు విని ప్రవక్త చిరునవ్వు నవ్వి ఈ వాక్యమును పఠించెను: 

వారసలు అల్లాహ్ ను గౌరవించ వలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయదినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు. (39:67) 

(దీనిని సహీ ముస్లిం, సహీ బుఖారి, సునన్ తిర్మిజీ, సునన్ నసాయి, ముస్నదె అహ్మద్ పొందుపరచెను.) 

మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ ప్రళయ దినం నాడు సమస్త కొండలను, వృక్షములను ఒక వేలుపై ఉంచి, వాటిని ఊపి ‘నేనే రాజును, నేనే అల్లాహ్ ను’ అని పలుకును.” 

(సహీ ముస్లిం) మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ సమస్త ఆకాశాలను ఒక వేలిపై, నీటిని, బురదను ఒక వేలిపై, మిగిలిన సకల సృష్టిరాశిని ఒక వేలిపై ఉంచును.’ (బుఖారి) 

హజరత్ అబ్దులా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: అల్లాహ్ ప్రళయదినం నాడు ఆకాశాన్ని చుట్టి తన చేతిలో తీసుకొని నేనే రాజును (భూమిపై) అహంకారులు ఎక్కడ ఉన్నారు? అని పలుకును. సమస్త భూమండలాలను చుట్టి తన ఎడమ చేతిలో తీసుకొని “నేనే రాజును! అహంకారము, గర్వము కలవారు (ఈ వేళ) ఎక్కడ ఉన్నారు?” అని పలుకును.  (సహీ ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపిరి: “మీ చేతిలో రాగి గింజ ఎలా ఉండునో ఆ విధముగా అలాహ్ చేతిలో సప్త భూమ్యాకాశాలుండును.’ 

ఇబ్నె జరీర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: నాకు యూనుస్ ఒక హదీసు తెలిపెను. ఆయన ఇబ్నె వహబ్ నుంచి వినెను, ఆయన ఇబ్నె జైద్ నుంచి వినెను. ఆయన తండ్రితో వినెను. ఆయన తండ్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “సప్త ఆకాశాలు, కుర్చీతో పోల్చి చూసినచో, ఒక పెద్ద ప్రదేశములో సప్తనాణెములు వేసినట్లుండును. 

అబూజర్ గిఫారీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త యొక్క బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “అల్లాహ్ యొక్క కుర్చీని ఆయన అర్హ్ను పోల్చి చూసినప్పుడు, ఒక పెద్ద ప్రదేశము (మైదానము)లో ఒక ఇనుప ఉంగరము వేసినట్లుండును.” 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: మొదటి మరియు రెండవ ఆకాశముల మధ్య వేగవంతమైన గుర్రము ఐదువందల సంవత్సరముల ప్రయాణము చేయు (వ్యత్యాసము) దూరము కలదు. ఇదే విధముగా ప్రతి రెండు ఆకాశముల మధ్య ఇంతే దూరము కలదు. ఏడవ ఆకాశము మరియు కుర్చీకి మధ్య అంతే దూరము. కుర్చీ మరియు నీటికి మధ్య అంతే దూరము కలదు. నీటిపై అర్ష్ కలదు. అర్ష్ప అల్లాహ్ ఉన్నాడు. మీ ప్రతి కార్యము అల్లాహ్ కు తెలుసును.” (ఈ హదీసును ఇబ్నె మెహదీ హమద్ బిన్ సలమా నుంచి, ఆయన ఆసిం నుంచి, ఆయన జర్ నుంచి, ఆయన అబ్దుల్లా బిన్ మస్ ఊద్ నుంచి తెలిపెను. దీనిని మసూదీ ఆసిం నుంచి, ఆయన అబూ వాయల్ నుంచి, ఆయన అబ్దుల్లా నుంచి, ఆయన ప్రవక్త నుండి ఉల్లేఖించెను. హాఫిజ్ అద్ దహబి కూడా ఈ హదీసును పొందుపరచెను: హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: (భూమి మరియు ఆకాశానికి మధ్య ఎంత దూరమున్నదో తెలుసునా?” అని ప్రవక్త అడిగినప్పుడు, “అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త “వాటి మధ్య ఐదు వందల సంవత్సరాల ప్రయాణము చేయునంత దూరము కలదు. ప్రతి ఆకాశమునకు వేరే ఆకాశము నకు మధ్య అంతే దూరము కలదు. ఆకాశము యొక్క మందము కూడా అంతే. ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్య సముద్రము కలదు. దాని క్రింద మరియు పైభాగము మధ్య ఇంతే దూరము. అల్లాహ్ దానిపై ఉన్నాడు. ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము ఆయనకు తెలుసును.’ అని వివరించెను.(అబూదావూద్ పొందుపరచెను) 

దీనిలో 19 ప్రకరణములు కలవు 

1) వాక్యము (39:67) యొక్క భావము విశ్లేషించబడినది. 

2) హదీసులో తెలుపబడిన మాటలు యూదుల పుస్తకములలో కూడా కలవు. 

3) యూద పండితుని మాటలను ప్రవక్త స్వీకరించెను. ఖుర్ఆన్ వాక్యము కూడా అవతరించబడెను

4) యూద పండితుని స్వచ్ఛవచనములు విని ప్రవక్త నవ్వటం, ఆయన సంతోషానికి చిహ్నం.

5) అల్లాహ్ కు చేతులు ఉన్నవని స్పష్టమగుచున్నది. ఒక చేతిలో ఆకాశం, వేరొక చేతిలో భూమి ఉండును 

6) అల్లాహ్ కు ఎడమ చేయి అనునది ఉన్నట్టు అర్థమగును. 

7) మన చేతిలో రాగి గింజ ఉన్నట్లు, అల్లాహ్ చేతిలో భూమ్యాకాశాలు ఉండును. 

8) అల్లాహ్ ప్రళయదినం నాడు పొగరు మరియు అహంకారము చూపిన వారిని పిలుచును. 

9) అల్లాహ్ యొక్క కుర్చీ ఆకాశము కంటే పెద్దది.

10) అల్లాహ్ యొక్క అర్ష్  కుర్చీకంటే పెద్దది

11) అర్ష్, కుర్చీ, నీరు వేరు వేరు. 

12) ప్రతి రెండు ఆకాశముల మధ్య ఒక చురుకైన గుర్రము ఐదువందల సంవత్సరములు ప్రయాణించు దూరము కలదు. 

13. ఏడవ ఆకాశము మరియు కుర్చీ మధ్య దూరము తెలుపబడెను

14. కుర్చీ మరియు నీటికి మధ్య దూరము తెలుపబడెను.

15) అల్లాహ్ యొక్క అర్ష్ నీటిపై ఉన్నది. 

16) అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. 

17) భూమ్యాకాశాల మధ్య దూరము తెలుపబడెను. 

18) ప్రతి ఆకాశము యొక్క మందము ఐదు వందల సంవత్సరములు ప్రయాణించినంత ఉన్నది. 

19) ఏడవ ఆకాశముపై ఉన్న సముద్రము యొక్క క్రింది మరియు పై భాగముల మధ్య కూడా ఐదువందల సంవత్సరములు ప్రయాణించి నంత దూరము కలదు. 

సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ యే స్తుతింపబడుటకు అర్హుడు. ప్రవక్తపై, తమ అనుచరులపై, విశ్వసించిన వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి చేకూరును.