ధర్మపరమైన నిషేధాలు (పరిచయం): అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా ఆరాధనలో భాగమే [వీడియో]

బిస్మిల్లాహ్

[6:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు (పరిచయం)

అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!

మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.

దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.

ప్రియ సోదరా… ప్రియ సోదరి…

ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا] {الحشر:7}

దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి[. (సూరె హష్ర్ 59: 7).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

 (فَإِذَا نَهَيْتُكُمْ عَنْ شَيْءٍ فَاجْتَنِبُوهُ وَإِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ)

“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూ- లిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).

అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమపవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయనమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.

ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫ- లితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا] {الإنسان:3}

మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు[. (సూరె దహ్ర్ 76: 3).

అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.

ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్- ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపు- లకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకు- పోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).

ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 17 : బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు, దుఆ, ఇతర ఆరాధనలు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[7:44 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు – 17

17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు. అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు [1].

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُولُ الله : (لَعْنَةُ اللهِ عَلَى الْيَهُودِ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని ఆయిష (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం కురువుగాక! వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనస్థలం(మస్జిదులు)గా చేసుకున్నారు”. (బుఖారి/ అస్సలాతు ఫిల్ బీఅతి/ 436, ముస్లిం/ అన్నహ్ యు అన్ బినాఇల్ మసాజిద్ అలల్ ఖుబూర్…/ 531).

మరో ఉల్లేఖనంలో ఉంది:

(أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ إِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ).

“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).


[1]  సమాధి వద్ద నమాజు స్థితులు:

1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.

2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.

3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు