ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

హదీథ్׃ 05

من آداب العطاس ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

عن أبي هريرةَ رضيَ الله عنه عنِ النبيّ صلى الله عليه وسلم قال: إذا عطَسَ أحدُكم فليقل الحمد لله, وليقلْ له أخوه أو صاحبه ـ يَرحمكَ الله, فإذا قال له يَرحمكَ الله, فليقل: يَهديكُم الله ويُصلحُ بالكم) .رواه البخاري .

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు, అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల – ఇదా అతస అహదుకుమ్ ఫల్ యఖుల్ అల్ హదులిల్లాహ్, వల్ యఖూలల్లాహు అఖూహు అవ్ సాహిబహు యర్ హమకల్లాహ్, ఫఇదా ఖాల లహు యర్ హమకల్లాహ, ఫల్ యఖుల్ యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ బుఖారి.

అనువాదం: మీలో ఎవరైనా ఒకవేళ తుమ్మినప్పుడు, అల్ హందులిల్లాహ్ అని పలకవలెను. మరియు అతని దగ్గరున్న సోదరుడు గాని లేదా మిత్రుడు గాని జవాబుగా అతడి కోసం యర్ హమకల్లాహ్ అని పలకవలెను. అలా యర్ హమకల్లాహ్ అని పలికినప్పుడు, తుమ్మినతడు బదులుగా వారికోసం యహ్ దీ కుముల్లాహ్ వ యుశ్ లిహు బాలకుమ్ అని పలకవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన 7హి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

వివరణ:- ఈ హదీథ్ లో తుమ్మినతడు పొందే అల్లాహ్ యొక్క దీవెనల గురించి ప్రస్తావించబడినది. అతడికి లభించే పుణ్యాల గురించి తెలుపబడినది. అల్లాహ్ యొక్క అనంతమైన కరుణాకటాక్షాలు అతడి పై ఎలా అవతరిస్తున్నాయో ఈ హదీథ్ తెలియజేస్తున్నది. మానవుడికి అనారోగ్యం కలిగించే కొన్ని వాయువుల నుండి తుమ్ము మనల్ని కాపాడును. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించే తుమ్ముకు బదులుగా అల్ హమ్ దులిల్లాహ్ అని పలుకుతూ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది. అలా పలకటం ద్వారా తన చుట్టుప్రక్కల ఉన్నవారి ఆశీస్సులూ లభించటం జరుగును.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

అన్నపానీయములు సేవించే విధానం

హదీథ్׃ 04

من آداب الأكل والشرب ఇస్లాం ధర్మంలో అన్నపానీయములు సేవించే విధానం –

– عن عُمَرَ بْنِ أَبِي سَلَمَةَ. قَالَ: كُنْتُ فِي حَجْرِ رَسُولِ اللّهِ صلى الله عليه وسلم. وَكَانَتْ يَدِي تَطِيشُ فِي الصّحْفَةِ. فَقَالَ لِي: «يَا غُلاَمُ سَمّ اللّهَ. وَكُلْ بِيَمِينِكَ. وَكُلْ مِمّا يَلِيكَ» . رواه مسلم.

అన్ ఉమర్ బిన్ అబి సలమ ఖాల, కున్తు ఫీ హిజ్రి రసులిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం  వ కానత్ యదీ తతీషు ఫిస్సహ్ఫతి. ఫఖాలలీ, “యా గులాము సమ్మిల్లాహ వకుల్ బి యమీనిక్, వకుల్ మిమ్మా యలీక్” రవాహు ముస్లిం

అనువాదం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంపకంలో వారి ఇంటిలోనే నివాసముంటున్నప్పుడు, నా చేయి పళ్ళెంలో నలుమూలలా కదిలేది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా బోధించారు.” ఓ సేవకుడా! తినే ముందు అల్లాహ్ పేరును స్మరించు మరియు నీ యొక్క కుడిచేతితో భుజించు మరియు (పళ్ళెంలో) నీ వైపు నుండి తిను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- ఉమర్ బిన్ అబి సలమ రదియల్లాహు అన్హు తన బాల్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలోనే పెరిగారు. 2వ హిజ్రీ సంవత్సరంలో ఆయన జన్మించారు. అలీ బిన్ అబి తాలిబ్ రదియల్లాహు అన్హు ఖలీఫా గా ఉన్నప్పుడు, ఆయనను బహ్రీన్ యొక్క గవర్నర్ గా నియమించారు. మదీనా పట్టణంలో ఆయన 83వ హిజ్రీ సంవత్సరంలో మరణించారు.

వివరణ:- భోజనం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకటం మరియు కుడిచేతితో భుజించటం గురించిన ఇస్లాం ధర్మపు ఆదేశాలను ఈ హదీథ్ నిరూపిస్తున్నది. అలాగే ఎడమచేతితో అన్నపానీయాలు సేవించటం నిషేధించబడినది అనే విషయాన్ని కూడా ఋజువు చేస్తున్నది. ఎందుకంటే అలా తినటం ధర్మ పద్ధతి నుండి దారి తప్పిన వారి జీవనవిధానం. అలాంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండమని తెలియజేయబడినది. పైగా అది షైతాన్ యొక్క పద్ధతి మరియు అలవాటు.  ఇంకో హదీథ్ లో ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలన్నా, వారి నుండి తీసుకోవాలన్నా కుడిచేతిని మాత్రమే ఉపయోగించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు తెలుపబడినది. అలాగే పళ్ళంలో తన ముందున్న భాగం నుండి మాత్రమే భుజించమని కూడా ఆదేశించబడినది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

  1. ఏదైనా తినటం ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అని పలకమని ఇస్లాం ధర్మం ఆదేశిస్తున్నది.
  2. ఒకవేళ భోజనం ప్రారంభించే టప్పుడు బిస్మిల్లాహ్ అని పలకటం మరచిపోయినట్లయితే, భోజన సమయంలో జ్ఞాపకం రాగానే బిస్మిల్లాహి అవ్వలుహు, ఆఖిరుహు (అల్లాహ్ పేరుతో – మరియు ఆరంభంలో ఉన్నవాడు మరియు చిట్టచివరగా ఉండేవాడు అని పలకవలెను.
  3. భోజనం కుడి చేత్తో మరియు నీరు త్రాగటం కుడిచేత్తో మాత్రమే చేయవలెను.
  4. భోజనం ముగించిన తర్వాత మరియు నీరు త్రాగిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్ అని పలకవలెను.
  5. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో తన వైపు ఉన్నదానిలో నుండి తినవలెను.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

హదీథ్׃ 03

الدال على الخير كفاعله ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِي اللهُ عَنْهُ أَنَّ رَسُوْلُ اللهِ  صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  قَالَ: ” مَنْ دَعَا إِلَى هُدًى كَانَ لَهُ مِنَ الْأَجْرِ مِثْلُ أُجُوْرِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا، وَمَنْ دَعَا إِلَى ضَلَالَةٍ كَانَ عَلَيْهِ مِنَ الْإِثْمِ مِثْلُ آثَامِ مَنْ تَبِعَهُ لَا يَنْقُصُ ذَالِكَ مِنْ آثَامِهِمْ شَيْئًا” رواه مسلم

అన్ అబిహురైరా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల : మన్ దఆ ఇలా హుదన్ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా దలాలథిన్ కాన అలైహి మినల్   ఇథ్ మి  మిథ్ లు  ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్ ” రవాహ్ ముస్లిం.

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖించారు, అబి హురైరా = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారిని స్వీకరించుగాక, ఖాల = చెప్పారు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, హుదన్ = ఋజుమార్గం, కాన = అటువంటి, లహు = వారు, మినల్ = నుంచి, అజ్ రి = పుణ్యం, మిథ్ లు = ఉదాహరణకు, ఉజూరి = వారి పుణ్యం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక =  అటువంటి, మిన్ = నుంచి, ఉజూరిహిమ్ =వారి పుణ్యం,  షైయ్యిన్  = ఏదైనా సరే, వ = మరియు, మన్ = ఎవరైతే, దఆ = ఆహ్వానం,  ఇలా = వైపుకు, దలాలథిన్ = చెడుపనులు,  కాన = అయ్యాడు, అలైహి = అతని మీద, మినల్  = నుంచి, ఇథ్ మి = పాపం, మిథ్ లు = ఉదాహరణకు, ఆథామి = అతని పాపం, మన్ = ఎవరైతే, తబిఅహు = అనుసరించినవారు, లా = లేకుండా, యన్ ఖుశు = తగ్గింపు, దాలిక = అటువంటి, మిన్ = నుంచి, ఆథామిహిమ్ = అతడి పాపం, షైయ్యిన్ = ఏదైనా సరే.

అనువాదం :- అబుహురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు “ఎవరైతే సత్యమార్గం(ఋజుమార్గం) వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా. మరియు  ఎవరైతే అసత్యమార్గం(పాపం) వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా. ముస్లిం.

వివరణ:- ఇస్లాం ధర్మం మంచిపనులు, పుణ్యకార్యాల వైపు ఆహ్వానించటాన్ని ప్రోత్సహిస్తున్నది.  ఇంకా ఎవరైతే సమాజంలో మంచిని పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి ఫలితం లభిస్తుంది. అంటే పిలుపు నిచ్చిన వారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు. అదే విధంగా ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని నిరుత్సాహ పరుస్తుంది. ఇంకా ఎవరైతే సమాజంలో చెడును వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి శిక్ష పడుతుంది. అంటే పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ సరిసమానంగా అంతే మోతాదులో పాపం పొందుతారు. అమలు చేసినవారి పాపంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభలు׃

1. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ప్రోత్సహించవలెను. ఇందులో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

2. మంచి పనులు (పుణ్యకార్యాలు) వ్యాపింపచేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

3. చెడు పనులు (పాపపుకార్యాలు) ఆపటానికి ప్రచారం చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పాపాలు మీ ఖాతాలో జమ అవుతాయి. అమలు చేసిన వారితో పాటు  మీ మీద కూడా నరకశిక్ష పడుతుంది. కాబట్టి పాపకార్యాలు, చెడుపనులను నిరుత్సాహపరచటానికి, అరికట్టటానికి అందరూ నడుం బిగించవలెను.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన హిజ్ 7వ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లు జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

ప్రశ్నలు

1. మన్ దఆ  ఇలా ____ కాన లహు మినల్ అజ్ రి మిథ్ లు ఉజూరి మన్ తబిఅహు లా యన్ ఖుశు జాలిక మిన్ ఉజూరిహిమ్ షైయ్యిన్, వ మన్ దఆ ఇలా _______  కాన అలైహి మినల్ ఇథ్ మి మిథ్ లు ఆథామి మన్ తబిఅహు లా యన్ ఖుశు దాలిక మిన్ ఆథామిహిమ్ షైయ్యిన్

2. ఎవరైతే ______ వైపునకు ప్రచారం చేస్తారో వారికి కూడా (అతని పిలుపు ననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పుణ్యం మరియు ప్రతిఫలం దొరుకుతుంది, పిలుపు ఇచ్చిన వారికి మరియు అనుసరించివానికి సరిసమానంగా, ఎటువంటి తగ్గింపు లేకుండా.

3. ఎవరైతే _________వైపునకు ఆహ్వానిస్తారో వారికి కూడా (అతని పిలుపుననుసరించి) ఆ దారిలో నడిచిన వారికి లభించేటంతటి పాపం లభిస్తుంది, పిలుపిచ్చిన వారికి మరియు అనుసరించి వారికి సరిసమానంగా – ఎటువంటి తగ్గింపు లేకుండా.

4. ఇస్లాం ధర్మం మంచి పనులు, పుణ్యకార్యాలు చేయటానికి పిలుపివ్వమని ప్రోత్సహిస్తున్నది.  _______________ (తప్పు  / ఒప్పు)

5. ఇంకా ఎవరైతే సమాజంలో _____ పెంపొందించటానికి ప్రయత్నిస్తారో వారికి కూడా ఆ మంచి పనులు చేసినవారికి లభించేటంతటి _____ లభిస్తుంది.

6. మంచి పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ _______ అంతే మోతాదులో పుణ్యం పొందుతారు. అమలు చేసినవారి పుణ్యంలోనుండి ఎటువంటి తగ్గింపూ ఉండదు.

7. ఇస్లాం ధర్మం చెడుపనులు, పాపపు కార్యాలు చేయటాన్ని ________ పరుస్తుంది.

8. ఎవరైతే సమాజంలో చెడు పనులు వ్యాపింపజేస్తారో వారికి కూడా ఆ పాపపు పనులు చేసినవారికి లభించేటంతటి పాపం లభిస్తుంది. ________ (తప్పు / ఒప్పు)

9. పాపపు పనులు చేయమని పిలుపు నిచ్చినవారూ మరియు చేసినవారూ ________ అంతే మోతాదులో పాపం పొందుతారు.

10. మంచి పనులు, పుణ్యకార్యాల వైపు పిలవటాన్ని ________. దీనిలో అల్లాహ్ తరుపునుండి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.

11. మంచి పనులు (పుణ్యకార్యాలు) ________ చేయవలెను. అవి ఎంత చిన్నవైనాసరే. ఎంతమంది వాటిని అమలు చేస్తారో అంతమంది యొక్క పుణ్యం మీకు లభిస్తుంది.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్). అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా


ధర్మ ప్రచారం (దావా) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/dawah/

మర్యాదపూర్వక సంభాషణ & స్నేహపూర్వక కలయిక

طيب الكلام وطلاقة الوجه

عَنْ اَبِىْ ذَرٍّ قَالَ لِى النَّبِىُّ ^ لَا تَحْقِرَنَّ مِنَ الْـمَعْرُوْفِ شَيْـﺌـاً وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ (رواه مسلم)

తాత్పర్యం:- అన్ అబిదరిన్  రదియల్లాహు అన్హు ఖాల – ఖాలలిన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం “లా తహ్ ఖిరన్న మినల్ మఅరూఫి షైఅన్ – వలౌ అన్ తల్ ఖా అఖాక బి వజ్ హిన్ తల్ ఖ్”

అన్ = ఉల్లేఖన , అబిదరిన్ = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి),  రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక  ,  ఖాల = తెలిపారు, లీ = నాకు, అన్నబియ్యు = ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్),  లా తహ్ ఖిరన్న = చిన్నదిగా భావించవద్దు (అల్పమైనదిగా), మినల్ మాఁరూఫి= పుణ్యాలలో నుండి ,  షైఅన్ = ఏదైనా,  వలౌ = ఒకవేళ, అన్ తల్ ఖా = నీవు కలుసుకుంటే,  అఖాక = తోటి సోదరుడితో,  బి వజ్ హిన్ తల్ ఖ్ = ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కూడిన ముఖంతో.

అనువాదం:- అబిదర్  రదిఅల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(ఓ అబూదర్!) ఏ మంచిపనినైనా అల్పమైనదిగా భావించకు, ఒకవేళ అది నీ తోటి సోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో ఆహ్లాదకరంగా కలవడమైనా సరే,” సహీముస్లిం హదీథ్ గ్రంథం

వివరణ:- ఈ హదీథ్మనకు ఇస్లాం బోధించే మరియు చేయమని ప్రోత్సహించే మంచి పనులలో అవి ఎంత చిన్నవైనా  వాటిని ఎప్పుడూ అల్పమైనవిగా భావించరాదని తెలియజేస్తున్నది.ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుణ్ణి ఎప్పుడు కలిసినా, పలకరించినా మనస్పూర్తిగా, పూర్తి సంతోషంగా, నవ్వు ముఖంతో ఆహ్లాదకరంగా పలకరించాలి – ఇది చాలా అల్పమైన విషయంగా కనిపించినప్పటికీ. ఎందుకంటే రూపం ఎప్పుడూ అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. సంతోషంగా, చిరునవ్వుతో మన తోటి సోదరులను కలవడం, వారిలో కూడా సంతోషాన్ని, తన తోటి సోదరుల పట్ల – అల్లాహ్ కొరకు – ప్రేమాభిమానాలను, గౌరవాన్ని పెంపొందిస్తాయి. అంతేకాక ఇస్లాం నైతిక విలువలకు, సంస్కారానికి విలువనిచ్చే మతమని ఈ హదీథ్ తెలియజేస్తున్నది.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

  1. (షరిఅహ్ కు లోబడి) మంచిపని ఎంత చిన్నదైనాసరే అల్పమైనదిగా ఎప్పుడూ తలంచరాదు.
  2. తోటి వారితో ఎప్పుడూ ఆహ్లాదకరంగా, సంతోషంగా కలవాలి.
  3. తోటి ముస్లిం సోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయాలను ఫ్రోత్సహించాలి.
  4. మన తోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా పుణ్యకార్యాలలో ఒకటి అని మర్చిపోరాదు.

హదీథ్  ఉల్లేఖించిన వారి పరిచయం׃ అబిదర్  రదియల్లాహు అన్హు ఇస్లాం ధర్మవిషయాల అమలులో ఎటువంటి రాజీ పడనివ్యక్తిగా ప్రసిద్ధిచెందారు. ప్రారంభకాలంలోనే ఇస్లాం స్వీకరించారు. మక్కా నుండి మదీనా వలస పోయినవారిలో ఒకరు.  హిజ్రీ 32వ సంవత్సరం, మూడవ ఖలీఫా ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో మరణించారు.

ప్రశ్నలు

  1. “లా తహ్ ఖిరన్న మినల్ _____ షైఅన్ – వలౌ అన్ తల్ ఖా _____బి వజ్ హిన్ తల్ ఖ్”
  2. “(ఓ అబూదర్!) ఏ మంచిపనినైనా ______ భావించకు, ఒకవేళ అది నీ తోటి సోదరుణ్ణి __________ ముఖంతో ఆహ్లాదకరంగా కలవడమైనా సరే,”
  3. ఇస్లాం ప్రోత్సహించే మంచి పనులు ఎంత చిన్నవైనా  వాటిని ________ భావించరాదు
  4. ఒక ముస్లిం తన తోటి వారిని ఎప్పుడు కలిసినా, పలకరించినా మనస్పూర్తిగా, పూర్తి సంతోషంగా, చిరునవ్వు ముఖంతో పలుకరించాలి. _______  ( తప్పు  /  ఒప్పు)
  5. రూపం ఎప్పుడూ _______ ప్రతిబింబిస్తూ ఉంటుంది.
  6. సంతోషంగా మనతోటి సోదరులను కలవడం, వారిలో కూడా సంతోషాన్ని, తనతోటి వారిపట్ల – అల్లాహ్ కొరకు – ప్రేమాభిమానాలును, గౌరవాన్ని ___________.
  7. __________ నైతిక విలువలకు, సంస్కారానికి విలువనిచ్చే సత్యమైన ధర్మం.
  8. (షరిఅహ్ కులోబడి) ________ఎంత చిన్నదైనాసరే అల్పమైనదిగా ఎప్పుడూ తలంచరాదు.
  9. తోటి వారితో ఎప్పుడూ __________, __________ కలవాలి.
  10. తోటి ముస్లిం సోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయాలను __________.
  11. మన తోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా __________ ఒకటి అని మర్చిపోరాదు.
  12. అబిదర్  రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity

الإخلاص في العمل చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity –

1 – عن  عمرَ بنَ الخَطّابِ t المِنْبَرِ قال: سَمعْتُ رَسولَ اللّهِ r يَقولُ «إِنّما الأعْمَالُ بالنّيات, وإِنّمَا لِكُلّ امْرِىءٍ ما نَوَى: فَمَنْ كانتْ هِجْرَتُه إِلى دُنْيَا يُصِيبُها, أَوْ إِلى امْرَأَةٍ يَنْكِحُها, فَهِجْرَتُه إِلى ما هاجَرَ إِلَيه» . رواه البخاري

హదీథ్

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు  మెంబర్ (మస్జిద్ లోని ప్రసంగ వేదిక) పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఈ ప్రకటనను తాను విన్నానని ఉల్లేఖించారు.

అనువాదం నిశ్చయంగా ఏ పనికైనా దొరికే ప్రతిఫలం తమ మనోసంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే నిశ్చయంగా ఏ ఆజ్ఞకైనా. (దొరికే ప్రతిఫలం వారి మనో సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది) మరియు ఎవరైతే ప్రపంచం కోసం వలస వెళతారో వారికి అదే (ఆ ప్రపంచమే) లభిస్తుంది. ఇంకా ఎవరైతే ఒక స్త్రీని పెళ్ళాడటానికి వలస వెళతారో, వారి వలస ఆ పెళ్ళి కొరకే పరిగణింపబడుతుంది. సహీ బుఖారి హదీథ్ గ్రంథం.

వివరణ: మక్కానగరపు ఖురైషీ అవిశ్వాసులు ఇస్లాం స్వీకరించిన వారిని అనేక రకాల  అత్యాచారాలకు గురి చేసారు. ఆ బాధల నుండి తప్పించుకోవటానికి అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ముస్లింలను ముందుగా హబ్షా(యుథోపియా)కు తర్వాత మదీనాకు వలస పోవటానికి అనుమతించారు. అప్పుడు అనేక మంది ముస్లింలు మదీనాకు వలస పోయారు. ఇస్లాం కోసం వారు చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా అనేక పుణ్యాలు లభించనున్నట్లు ప్రకటింపబడినది. ఆ సమయంలో ఒకతను తనను వివాహమాడాలంటే మదీనాకు వలస చెయ్యమని షరతు విధించిన ఉమ్మె ఖైస్ అనే మహిళను పెళ్ళాడటానికి మదీనా పట్టణానికి వలస చేసినాడు. అతడికి కూడా పుణ్యాలు లభిస్తాయా లేదా అనే సందేహానికి జవాబుగా పై హదీథ్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు. ఈ హదీథ్ ఒక సాధారణ నియమాన్ని బోధిస్తున్నది.అదేమిటంటే ఎవరైనా సరే అతడు పొందే ప్రతిఫలం పూర్తిగా అతడి అసలైన సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప ఏ మాత్రం అతడు చేసే పనులపై కాదు. అవి పైకి చాలా మంచి పనులుగా కనబడినా సదుద్దేశ్యంతో కూడినవి కాకపోవచ్చు (లోపల దురుద్ధేశ్యంతో కూడినవై  ఉండవచ్చును).

ఉల్లేఖకుని పరిచయం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్ హు ప్రఖ్యాతి చెందిన సహాబాలలో ఒకరు. రెండవ ఖలీఫా గా ఇస్లాం రాజ్యానికి సేవలందించారు. వీరి పరిపాలనా కాలంలోనే అప్పటి అత్యంత బలవంతమైన పర్షియన్ మరియు రోమన్ సామ్రాజ్యాలను ముస్లింలు జయించారు.

ఈ హదీథ్ ద్వారా మానవజాతికి కలిగే ప్రయోజనాలు (లాభాలు):

1.  ఇస్లాం లో సంకల్పమే ఏ పనికైనా పునాది వంటిది.

2.  కేవలం అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే చిత్తశుద్ధి గల సంకల్పంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చూపిన పద్ధతి ప్రకారం ఏ పనైనా చేసినట్లైతే దానిని అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు.

3.  సరైన సంకల్పంతో నిత్యజీవితంలో చేసే ప్రాపంచిక పనులన్నింటికీ  ప్రస్తుత జీవితంలోనూ, చనిపోగానే మొదలయ్యే పరలోక జీవితంలోను ప్రతి ముస్లిం మంచి ప్రతిఫలం పొందుతాడు. ఆ పనులలోని చిత్తశుద్ధి వలన  అవన్నీ అల్లాహ్ కు సమర్పించిన ఆరాధనలుగా లెక్కించబడును. బోధించే టీచరు, చదువుకునే విద్యార్థి, లావాదేవీలు చేసే వ్యాపారస్తుడు – వీరందరూ చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ కోసమే గనుక తమ తమ పనులు చేస్తున్నట్లైతే, నిజంగా వారు అల్లాహ్ ను ఆరాధిస్తున్నట్లే.

4.  ఎవరైనా  ముస్లిం మంచి పని చేయాలని సంకల్పం చేసుకుని, ఏవైనా కారణాల వలన పూర్తి చేయలేక పోయినా సంకల్పంలోని చిత్తశుద్ధి ఆధారంగా అతడికి ప్రతిఫలం లభిస్తుంది.

5.  అల్లాహ్ ను అంగీకరింపజేయాలనే నిజమైన సంకల్పం ఈ జీవితంలోను, రాబోయే జీవితంలోను జయప్రదమైన మంచి ఫలితాన్నిస్తుంది.

6.  ఇస్లామీయ జీవనవిధానంలోని భాగమైన వుదూ చేయడం (ప్రత్యేక పద్ధతిలో ముఖం, కాళ్ళు చేతులు కడుక్కోవటం),గుసుల్ చేయటం (ప్రత్యేక వద్ధతిలో స్నానం చేయడం),తయమ్మమ్ చేయడం (నీరు దొరకని పరిస్థితిలో లేక అనారోగ్య సమయంలో పరిశుభ్రపరచుకోవడం), నమాజు చేయడం, జకాతు దానం ఇవ్వడం, హజ్ యాత్ర చేయడం, రమదాన్ నెలలోని చివరి పది రోజులు మస్జిద్ ఎతేకాఫ్ అంటే ఏకాంతవాసం చేయడం వంటి అన్ని రకాల ఆరాధనలు సరైన సంకల్పం లేకుండా ఆచరించినట్లైతే వాటిని అల్లాహ్  స్వీకరించడు మరియు ఎటువంటి ప్రతిఫలం లభించదు.

7.  ఎంత మంచి పనైనా సరే చెడు సంకల్పంతో చేసినట్లైతే అది స్వీకరింప బడదు. చేసే ప్రతి పని కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చెయ్యాలి – అది జీవిత దినచర్యైనా లేక ఆరాధనకు సంబంధించినదైనా. ఇటువంటి గొప్ప సంకల్పం వలన కలిగే అత్యంత ముఖ్యమైన లాభం అల్లాహ్ కోసమే చేస్తున్నానని నిశ్చయించుకున్నప్పుడు చెడు పనుల నుండి దూరమవటానికి అవకాశమున్నది.  ఇంకా మంచి పనులు చేయటంలో నిర్లక్ష్యం తగ్గుతుంది.

ప్రశ్నలు

  1. నిత్యజీవితం లోని మామూలు పనులు కూడా కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామనే సంకల్పం వలన కలిగే లాభాలు తెలుపండి.
  2. ఈ హదీథ్ ను మీ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలనుకుంటున్నారు?
  3. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గురించి క్లుప్తంగా వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

[Audio] ఖురాన్ ఆడియో mp3

Telugu Qur’an Audio – దివ్యఖుర్ఆన్ తెలుగు ఆడియో mp3
బోధకుడు, ఉపన్యాసకుడు: హమీదుల్లాహ్ షరీఫ్

S.No Telugu Surah Name Audio (mp3)
1 అల్ ఫాతిహా 001_Al_Fatiha_Begining 
2 అల్ బఖర 002_Al_Baqara_Cow 
3 అలి ఇమ్రాన్ 003_AleImran_Family_of_Imran 
4 అన్ నిసా 004_AnNisa_Woman 
5 అల్ మాయిద 005_AlMaeda 
6 అల్ అన్ ఆం 006_AlAnAam_Animal 
7 అల్ ఆరాఫ్ 007_AlAraaf_Heights 
8 అల్ అన్ ఫాల్ 008_AlAnfal_War Booty 
9 అత్ తౌబా 009_AtTouba_Repent 
10 యూనుస్ 010_Yunus 
11 హూద్ 011_Hud 
12 యూసుఫ్ 012_Yusuf 
13 అర్ రాద్ 013_ArRad_Thunder 
14 ఇబ్రాహీమ్ 014_Ibrahim 
15 అల్ హిజ్ర్ 015_AlHijr_Mountain_People 
16 అన్ నహ్ల్ 016_Alnahl 
17 బనీ ఇస్రాయీల్ 017_AlIsra_BaniIsrayil 
18 అల్ కహఫ్ 018_Alkahef 
19 మర్యమ్ 019_Maryam 
20 తాహా 020_Taahaa 
21 అల్ అంబియా 021_Alanmbiya 
22 అల్ హజ్ 022_Alhajj 
23 అల్ మూ’మినూన్ 023_Almominoon 
24 అన్ నూర్ 024_Alnoor 
25 అల్ ఫుర్ఖాన్ 025_Alfurqaan 
26 అష్ షుఅరా 026_Shuara 
27 అన్ నమ్ల్ 027_Alnaml 
28 అల్ ఖసస్ 028_Alqases 
29 అల్ అన్ కబూత్ 029_Al3nkabooth 
30 అర్ రూమ్ 030_Alroom 
31 లుఖ్మాన్ 031_Luqmaan 
32 అన్ సజ్ దహ్ 032_Alsajda 
33 అల్ అహ జాబ్ 033_Alahzab 
34 సబా 034_Saba 
35 ఫాతిర్ 035_Faatir 
36 యాసీన్ 036_Yaassiin 
37 అస్ సాఫ్ఫాత్ 037_Alssaaffaat 
38 సాద్ 038_Szwaadh 
39 అజ్ జుమర్ 039_Alzumar 
40 అల్ మూ’మిన్ 040_Ghafir 
41 హా మీమ్ అన్ సజ్ దహ్ 041_Fussilat 
42 అష్ షూరా 042_Shuraa 
43 అజ్ జుఖ్ రుఫ్ 043_Alzukhraff 
44 అద్ దుఖాన్ 044_Aldukhan 
45 అల్ జాసియహ్ 045_Aljaasthiyaa 
46 అల్ అహ్ ఖాఫ్ 046_Alahqaaf 
47 ముహమ్మద్ 047_Muhammed 
48 అల్ ఫత్ హ్ 048_Alfateh 
49 అల్ హుజురాత్ 049_Alhujraat 
50 ఖాఫ్ 050_Qhaaf 
51 అజ్ జారియాత్ 051_Alzaariyaat 
52 అత్ తూర్ 052_Althoor 
53 అన్ నజ్మ్ 053_Alnajm 
54 అల్ ఖమర్ 054_Alqamar 
55 అర్ రహ్మాన్ 055_Alrehman 
56 అల్ వాఖి అహ్ 056_Alwaaqhiyah 
57 అల్ హదీద్ 057_Alhadheed 
58 అల్ ముజాదలహ్ 058_Almujadilaah 
59 అల్ హష్ర్ 059_Alhashr 
60 అల్ ముమ్ తహినహ్ 060_Almumtahina 
61 అస్ సఫ్ 061_Alssaff 
62 అల్ జుముఅహ్ 062_Aljumaah 
63 అల్ మునాఫిఖూన్ 063_Munafiqoon 
64 అత్ తగాబున్ 064_Altaqaabun 
65 అత్ తలాఖ్ 065_Altalaaqh 
66 అత్ తహ్రీమ్ 066_Altahreem 
67 అల్ ముల్క్ 067_Almulk 
68 అల్ ఖలమ్ 068_Alqalam 
69 అల్ హాఖ్ఖహ్ 069_Alhaaqqah 
70 అల్ మఆరిజ్ 070_Almaarij 
71 నూహ్ 071_Noah 
72 అల్ జిన్న్ 072_Aljinn 
73 అల్ ముజ్జమ్మిల్ 073_Almuzzammil 
74 అల్ ముద్ధస్సిర్ 074_Almuddaszir 
75 అల్ ఖియామహ్ 075_Alqiyaamah 
76 అద్ దహ్ర్ 076_Insan 
77 అల్ ముర్సలాత్ 077_Almurselaat 
78 అన్ నబా 078_AnNaba 
79 అన్ నాజి ఆత్ 079_AnNaziath 
80 అబస 080_Abasa 
81 అత్ తక్వీర్ 081_Altakweer 
82 అల్ ఇన్ ఫితార్ 082_Infitaar 
83 అల్ ముతఫ్ఫిఫీన్ 083_AlMutaffifeen 
84 అల్ ఇన్ షిఖాఖ్ 084_AlInshiqaq 
85 అల్ బురూజ్ 085_AlBurooj 
86 అత్ తారిఖ్ 086_AtTariq 
87 అల్ ఆలా 087_AlAla 
88 అల్ గాషియహ్ 088_AlGasiya 
89 అల్ ఫజ్ర్ 089_AlFajr 
90 అల్ బలద్ 090_AlBalad 
91 అష్ షమ్స్ 091_Ash-Shams 
92 అల్ లైల్ 092_Al-Lail 
93 అజ్ జుహా 093_Ad-Doha 
94 అలమ్ నష్రహ్ 094_Ash-Shura 
95 అత్ తీన్ 095_AtTeen 
96 అల్ అలఖ్ 096_AlAlaq 
97 అల్ ఖద్ర్ 097_AlQadr 
98 అల్ బయ్యినహ్ 098_AlBayyina 
99 అజ్ జిల్ జాల్ 099_zalzala 
100 అల్ ఆదియాత్ 100_AlAadiyat
101 అల్ ఖారిఅహ్ 101_AlQariya 
102 అత్ తకాసుర్ 102_AtTakhathur 
103 అల్ అస్ర్ 103_AlAsr 
104 అల్ హుమజహ్ 104_AlHumaza 
105 అల్ ఫీల్ 105_AlFeel 
106 ఖురైష్ 106_AlQuraish 
107 అల్ మాఊన్ 107_AlMaoon 
108 అల్ కౌసర్ 108_AlKauther 
109 అల్ కాఫిరూన్ 109_AlKaafiroon 
110 అన్ నస్ర్ 110_AnNasr 
111 అల్ లహబ్ 111_AlMasad 
112 అల్ ఇఖ్లాస్ 112_AlIkhalas 
113 అల్ ఫలఖ్ 113_AlFalaq 
114 అన్ నాస్ 114_AnNas 

 

దివ్య ఖురాన్ సందేశం (Divya Qur’an Sandesham)

దివ్య ఖురాన్ సందేశం (Divya Qur'an Sandesham)

దివ్య ఖురాన్ సందేశం (Divya Qur’an Sandesham)
అనువాదం: డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
మక్కా అల్-ముకర్రమా, స’ఊదీ అరేబియా

Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina. Translated by Dr Abdul Raheem Mohammed Moulana (heading the Department of Nephrology in the King Abdul Aziz Hospital in the holy city of Makkah)

సూరా మీద క్లిక్ చేసి చదవండి లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి

దివ్య ఖురాన్ సందేశం | సూరాల ప్రకారం | ఆడియో | అరబిక్ & తెలుగు
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1UiUCNk9NFacjjFBmvCCPj

30 పారాలు (Para / Juz) – పిడిఎఫ్ [PDF]

పారా (జుజ్) నెంబర్ మీద క్లిక్ చేసి చదవండి లేదా పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి

దివ్య ఖురాన్ సందేశం | సూరాల ప్రకారం | ఆడియో | అరబిక్ & తెలుగు
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1UiUCNk9NFacjjFBmvCCPj

mp3 ఆడియో ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి :

https://archive.org/details/telugu-divya-quran-sandesham-surah-audio

1.Al-Fatiha] –  | 2.Al-Baqarah-Part-1Part-2Part-3]-[3.Ale-Imran-Part-1]- Part-2]-[4.An-Nisa-Part-1Part-2Part-3]-[5.Al-Maidah-Part-1Part-2]-[6.Al-Anam-Part-1Part-2]-[7.Al-Araf-Part-1Part-2]-[8.Al-Anfal]-[9.At-Taubah]-[10.Yunus] –  [ 11.Hud] –  [ 12.Yusuf]-[13.Ar-Rad]-[14.Ibrahim]-[15.Al-Hijr]-[16.An-Nahl]-[17.Al-Isra]-[18.Al-Kahf]-[19.Maryam]-[20.TaHa]-[21.Al-Anbiya]-[22.Al-Hajj]-[23.Al-Muminoon]-[24.An-Nur]-[25.Al-Furqan]-[26.Ash-Shuara]-[27.An-Naml]-[28.Al-Qasas]-[29.Al-Ankabut]-[30.Ar-Rum]-[31.Luqman]-[32.As-Sajdah]-[33.Al-Ahzab]-[34.Saba]-[35.Fatir]-[36.Ya-Sin]-[37.As-Saffat]-[38.Sad]-[39.Az-Zumar]-[40.Ghafir]-[41.Fussilat]-[42.Ash-Shura]-[43.Az-Zukhruf]-[44.Ad-Dukhan]-[45.Al-Jasiyah]-[46.Al-Ahqaf]-[47.Muhammad]-[48.Al-Fath]-[49.Al-Hujurat]-[50.Qaf]-[51.Adh-Dhariyat]-[52.At-Tur]-[53.An-Najm]-[54.Al-Qamar]-[55.Ar-Rahman]-[56.Al-Waqiah]-[57.Al-Hadid]-[58.Al-Mujadila]-[59.Al-Hashr]-[60.Al-Mumtahana]-[61.As-Saf]-[62.AlJumuah]-[63.Al-Munafiqun]-[64.At-Taghabun]-[65.At-Talaq]-[66.At-Tahrim]-[67.Al-Mulk]-[68.Al-Qalam]-[69.Al-Haqqah]-[70.Al-Maarij]-[71.Nooh]-[72.Al-Jinn]-[73.Al-Muzzammil]-[74.Al-Muddassir]-[75.Al-Qiyamah]-[76.Al-Insan]-[77.Al-Mursalat]-[78.An-Naba]-[79.An-Naziat]-[80.Abasa]-[81.At-Takwir]-[82.Al-Infitar]-[83.Al-Mutaffiffin]-[84.Al-Inshiqaq]-[85.Al-Buruj]-[86.At-Tariq]-[87.Al-Ala]-[88.Ak-Ghashiyah]-[89.Al-Fajr]-[90.Al-Balad]-[91.Ash-Shams]-[92.Al-Layl]-[93.Ad-Duhaa]-[94.Ash-Sharh]-[95.At-Tin]-[96.Al-Alaq]-[97.Al-Qadr]-[98.Al-Bayyinah]-[99.Al-Zalzalah]-[100.Al-Adiyat]-[101.Al-Qariah]-[102.At-Takathur]-[103.Al-Asr]-[104.Al-Humazah]-[105.Al-Fil]-[106.Al-Quraish]-[107.Al-Maoon]-[108.Al-Kawthar]-[109.Al-Kafirun]-[110.Al-Nasr]-[111.Al-Masad]-[112.Al-Ikhlas]-[113.Al-Falaq]-[114.An-Nas]

దివ్య ఖురాన్ సందేశం [ఆడియో] – పారాల ప్రకారం

[యూట్యూబ్ ప్లే లిస్ట్ | దివ్య ఖురాన్ సందేశం |అరబిక్-తెలుగు | 30 పారాలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2yL91eY7XtuZ6Nlk2moXWU

అరబిక్-తెలుగు ఆడియో MP3 – పారాల ప్రకారం

ప్రతి ఆయత్ అరబీలో చదివిన తర్వాత, తెలుగు అనువాదం చదవబడుతుంది. పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు 

పారా  01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10

పారా  11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20

పారా  21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30

[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]

తెలుగు అనువాదం మాత్రమే ఆడియో MP3 – పారాల ప్రకారం

అరబీ ఆయత్ చదవకుండా, తెలుగు అనువాదం మాత్రమే చదవబడుతుంది. పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు 

పారా  01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 | 10

పారా  11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20

పారా  21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30

[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హజ్జ్ విధానం – bin Baz

hajj - ibn baz

How the Prophet Muhammad (Peace be upon him) performed Hajj – by Shaykh Ibn Baaz

[Read or Download PDF]

కాలి మేజోడులపై మసహ్ చేయడం (Wiping over the socks/shoes)

కాలి మేజోడులపై మసహ్ చేయగలమనుటకు ఆధారం׃బుఖారి మరియు ముస్లిం – అనిల్ ముగీరహ్ ఇబ్ని షుఅబత  రదియల్లాహు అన్హు ఖాల ׃ కున్తు మఅన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) వహువ యత వజ్జఉ ఫఅహ్ వయ్ తు లి అన్ జఅ ఖుప్ఫైహి ఫఖాల- దఅహుమా ఫఇన్నీ అద్ ఖల్ తుహుమా తాహిరతైన్. ఫమసహ అలైహిమా-ముగీర బిన్ షేబ రదిఅల్లాహు అన్హు అంటున్నారు׃ నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుదూ చేయబోగా నేను ఆయన కాలిమోజోడులను తీయడానికి వంగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను వారిస్తూ, ఇలా పలికారు – ఉండనివ్వండి! వీటిని తీయకండి! నేను ఈరెండు మోజోడులను పరిశుద్ధ అవస్థలో తొడిగాను అంటూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనరెండు మోజోడులపై మసహ్ చేశారు”

మోజోడులపై మసహ్ ఎప్పుడు చేయగలం ?

  1. మోజోడులను వుదూచేసిన తరువాత తొడిగి ఉండాలి
  2. మురికి, మాలిన్యాల నుండి మోజోడులను శుభ్రపరచి ఉండాలి
  3. ఇస్లామీయ ధర్మశాస్త్రం (షరీఅహ్) దీనికి ఏర్పరచిన పరిమిత సమయం మించరాదు
    1. ) స్థానికులకు ఒక రాత్రి-ఒక పగలు (24 గంటలు)
    2. ) బాటసారులకు మూడు రాత్రులు-మూడు పగళ్లు (72 గంటలు)
    3. గమనిక׃ తొలిసారి మసహ్ చేయగానే మసహ్ యొక్క సమయం మొదలగును
  4. వుదూనందు కాలిని ఎంతవరకు కడుగుతామో, అంతవరకు మోజోడు కూడా కప్పిఉంచాలి
  5. ఈ రెండు మోజోడులు సక్రమ (హలాల్) సంపాదనతో కొనుకున్నవై ఉండాలి.

మసహ్ చేయు విధాన ׃

  1. రెండు చేతులను నీటితో తడుపుకొనవలెను
  2. పాదపు ఉపరితలభాగంపై అంటే పై భాగంపై చేతిని సరచాలి. అంటే కాలివేళ్ళనుండి మొదలుపెట్టి, పాదపు కట్టు వరకు అలా చేయాలి. కేవలం ఒక్కమారు చేస్తే చాలు.
  3. కుడి చేతితో కుడుపాదంపై , ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి

మసహ్ ను భంగ పరచు విషయలు ׃

  1. మోజోళ్ళను కాలి నుండి తీసివేయడం వలన
  2. గుసుల్ విధిగా చేయవలసి రావడం వలన
  3. నిర్ణీత కాలం గడచి పోవడం వలన

Source: ఫిఖ్ హ్ – మొదటిస్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – బాషా ముహమ్మద్ (సాబ్ బాషా)

వుదూ – Wudhu

ుదూ (కాలకృత్యాలు) ׃

(నిరూపణ ఖుర్ఆన్ ద్వారా) {المائدة:6}

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى المَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الكَعْبَيْنِ]

దివ్యఖుర్ఆన్ అల్ మాయిద 5׃6 “యా అయ్యుహల్లదీన ఆమనూ ఇదా ఖుమ్ తుమ్ ఇలస్సలాతి ఫగ్ సిలూ వుజూహకుమ్ వ ఐదియకుమ్ ఇలల్ మరాఫిఖి వమ్ సహూ బి రుఊసికుమ్ వ అర్ జులకుమ్ ఇలల్ కఅఁబైన్” – “ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజుకొరకు లేచినప్పుడు మీ ముఖాలను మరియు  మోచేతుల వరకు చేతులను కడుక్కోండి, తలపై తడి చేతులతో తుడవండి, కాళ్ళను చీలమండాల వరకు కడుక్కోండి”

ుదూ ప్రాముఖ్యత ׃

ముస్లిం హదీథ్ గ్రంథం׃ అన్ అబూ హురైర రదియల్లాహు అన్హు అన్నన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల “ఇదా తవద్దాఅల్ అబ్దుల్ ముస్లిము అవిల్ ముఅమిను (1) ఫగసల వజ్ హహు ఖరజ మిన్ వజ్ హిహ కుల్లు ఖతీఅతిన్ నజర ఇలైహా బిఐనైహి మఅల్ మాఇ ఔ మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ, (2) ఫఇదా గసల యదైహి ఖరజ మిన్ యదైహి కుల్లు ఖతీఅతిన్ కాన బతషత్ హా యదాహు మఅఁల్ మాఇ ఔ  మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ. (3) ఫఇదా గసల రిజ్ లైహి ఖరజత్ కుల్లు ఖతీఅతిన్ మషత్ హా రిజ్ లాహు మఅఁల్ మాఇ ఔ మఅఁ ఆఖిరి ఖత్రిల్ మాఇ హత్తా యఖ్రుజ నఖియ్యమ్మినద్దునూబ్”

అనువాదం׃ అబి హురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – ఎప్పుడైతే ముస్లిం (అల్లాహ్ దాసుడు) వుదూలో తన ముఖం కడుగునో అప్పుడు ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని అతను (తన) కళ్ళతో చూచినటువంటి (చిన్న) పాపాలన్నీ కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు చేతులను కడుగునో తన రెండు చేతులతో చేసినటువంటి (చిన్న) పాపాలన్నీ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు కాళ్ళను కడుగునో తన రెండు కాళ్ళ సహాయంతో అతను నడిచివెళ్ళి చేసినటువంటి (చిన్న) పాపాలన్నియూ ఆ నీటితో గాని లేక నీటి చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. తుదకు వుదూతో అతను పూర్తిగా పరిశుద్ధుడతాడు.

అబూ దావూద్ హదీథ్ గ్రంథం ׃ అన్ అలీ బిన్ అబి తాలిబ్ రదియల్లాహు అన్హు ఖాల – ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “మిఫ్ తాహుస్సలాతిత్తుహూర్” – అలీ బిన్ అబితాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు – నమాజు యొక్క తాళం చేవి పరిశుభ్రతయే.

ుదూ యొక్క నిబంధనలు ׃

  1. పరిశుభ్రతా సంప్రాప్త సంకల్పం (మనస్సులో) చేసుకోవలెను
  2. స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని వినియోగించవలెను
  3. వుదూనందు శుభ్రపరచవలసిన శరీరాంగములను ఏదేని వస్తువు కప్పి ఉంచినట్లైతే దానిని తొలగించవలెను. ఉదా,, చేతిలో టైట్ గా ఉండి నీరు చొరబడనీయని స్థితిలో ఉన్న గడియారము, క్రీడాకారుల చేతిబంధం.

ుదూ ప్రత్యేకతలు׃ అంటే వుదూ నందు గల విధులు, పద్ధతులు(సున్నతులు)

ుదూ నందు గల విధులు (తప్పకుండా చేయవలసినవి

  1. ముఖం పూర్తిగా కడగాలి (నీరు పుక్కలించడం, గర్ గర చెయ్యడం, ముక్కును శుభ్ర పరచడం కూడా చెయ్యాలి)
  2. రెండు చేతులను మోచేతుల వరకు కడగాలి
  3. తల మరియు చెవులు తడపాలి
  4. రెండు కాళ్లను, చీలమండలాల వరకు కడగాలి
  5. క్రమపద్ధతిని పాటించాలి. అంటే దేని తర్వాత ఏది చెయ్యాలో అదే క్రమంలో చెయ్యాలి

ుదూ నందు సున్నతులు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన పద్దతులు

(ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, కాబట్టి వీటిని తప్పక పాటించటానికి ప్రయత్నించవలెను)

  1. “బిస్మిల్లాహ్” అని ఉచ్ఛరించడం
  2. రెండు చేతులనూ మణికట్టువరకు నీటితో మూడుసార్లు కడగాలి, మరియు చేతివేళ్ల నడుమ ఖిలాల్ చేయాలి (అప్పుడే నిదుర నుండి లేచిన వారికైతే ఇది అనివార్యం)
  3. మూడుసార్లు నోట నీరుతీసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. అదేవిధంగా మూడుసార్లు ముక్కు నందునూ నీరు ఎక్కించి తీసివేయాలి
  4. మూడుసార్లు ముఖం కడగాలి
  5. గడ్డమునందు నీటితో ఖిలాల్ చేయాలి.
  6. మొదట కుడి చేతిని మోచేతి వరకు కడగాలి, తరువాత అదే విధంగా ఎడమ చేతిని కూడా కడగాలి.
  7. తల యొక్క మసహ్ చేయాలి. ముందు నుదుటి వైపునుండి తడిచేతులను తల వెనుక వరకు తీసుకెళ్లి మరల అక్కడ నుండి ముందుకు తీసుకురావాలి.
  8. మొదట కుడికాలిని పాదం యొక్క పై కట్టు (చీలమండలం) వరకు కడగాలి. తరువాత ఎడమకాలిని కూడా కడగాలి.
  9. కుడివైపు నుండి మొదలు పెట్టాలి
  10. తప్పనిసరిగా వజూను ఒక క్రమపద్ధతిలో మాత్రమే చేయాలి. (అంటే ఖుర్ఆన్ నందు ఆదేశించబడిన క్రమంలో)
  11. వుదూ తరువాత ఈ దుఆ చేయాలి “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్” – నేను సాక్ష్యమిస్తున్నాను – (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప. ఆయనకు ఎవ్వరూ సాటికారు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను   ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసుడు మరియు అల్లాహ్ యొక్క వాస్తవమైన ప్రవక్త. ఓ అల్లాహ్! నన్ను పశ్చాత్తాపపడు మరియు పరిశుద్ధంగా ఉండే వారిలోని వాడిగా చేయుము.

హదస్ అల్ అస్గర్ ׃ వజూను భగ్నపరచు విషయాలు

  1. మల-మూత్రాదుల విసర్జన మరియు (అపానవాయువు)నిష్క్రమణ వలన
  2. దీర్ఘనిద్ర – మరుపుచేత
  3. కామవాంఛ లేదా మామూలుగాగానీ నేరుగా మర్మాంగాలను స్పర్శించుట వలన
  4. ఒంటె మాంసం తినడం వలన

Source: ఫిఖ్ హ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్)
అనువాదం : –  బాషా ముహమ్మద్ (సాబ్ బాషా)