వేటి పై జకాహ్ చెల్లించుట విధి (తప్పని సరి)

  1. బంగారము, వెండి, ధనము (డబ్బు)
  2. పంటలు, పండ్లు
  3. వ్యాపారపు సామాను
  4. జంతువులు (మేసే జంతువులు మేకలు, ఆవులు, గేదెలు, దున్నపోతులు, ఒంటెలు)
క్రమ
సంఖ్య
సంపద నిర్ణీత పరిమితి (నిసాబ్) జకాహ్ శాతము
1. బంగారము 85 గ్రాములు 2.5% బంగారము లేదా దాని యొక్క విలువ (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
2. వెండి 595 గ్రాములు 2.5% వెండి లేదా దాని యొక్క విలువ (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
3. నగదు ధనం 85 గ్రాముల బంగారం గానీ లేదా 595 గ్రాముల వెండి ఈ రెంటిలో దేని విలువ తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని నగదు ధనం యొక్క నిర్ణీత పరిమితి (నిసాబ్)  గా పరిగణించాలి. దాని విలువ యొక్క 2.5% (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
4. వ్యాపార వస్తువులు 85 గ్రా, బంగారం గానీ లేదా 595 గ్రా, వెండి ఈ రెంటిలో దేని విలువ తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని నగదు ధనపు నిర్ణీత పరిమితి (నిసాబ్)  గా పరిగణించాలి. ఇదే నిర్ణీత పరిమితి (నిసాబ్)  వ్యాపార వస్తువులకు కూడా వర్తిస్తుంది. దాని విలువ యొక్క 2.5% (ఒక హిజ్రి సం. పూర్తి ఐన పిదప)
5. నిలువ చేయదానికి & వాటి ఘన పరిమాణం ద్వారా కొలవడానికి వీలైన పంటలు.

ఉదా: గోధుమ, బార్లీ, మొక్కజొన్న, ఖర్జూరాలు, వరి,ఎండబెట్టి నులువ చేయదగిన ఫలాలు, పప్పు దినుసులు ….

618 కిలోగ్రాములు / 300 ‘సా’ (1 ‘సా’ = 4 దోసెళ్ళు) వర్షం ద్వారా ఏ ఖర్చూ లేకుండా పండినచో 10%.

ఖర్చు చేసి కష్టించి పండించినచో 5%

(పంట చేతికి వచ్చిన వెంటనే జకాహ్ చెల్లించాలి).

6. ఖనిజాలు,లోహాలు,మొదలైనవి.
(ఉదా: బంగారము, వెండి, సీసము, రాగి)
బంగారము మరియు వెండి యొక్క నిర్ణీత పరిమితి (నిసాబ్) దీనికి కూడా వర్తిస్తుంది. 2.5% (భూమి నుంచి వెలుపలికి తీసిన వెంటనే జకాహ్ చెల్లించాలి)
7. రికాజ్ (అవిశ్వాసుల యొక్క పాతిపెట్టబడిన ఖజానాలు) దీనికి నిర్ణీత పరిమితి (నిసాబ్)  లేదు. ఎంత కొద్ది మొత్తంలో నిధి బయటపడినా దాని పై జకాహ్ ల్లించవలసిందే. 20% (భూమి నుంచి వెలుపలికి తీసిన వెంటనే జకాహ్ చెల్లించాలి).
జంతువుల పై జకాతు
1). ఇంటిలో పని కొరకు లేదా పాల కొరకు ఉంచిన వాటికి జకాతు లేదు
2). కట్టివేసి మేపే జంతువులకు జకాతు లేదు.
1. మేకలు, గొర్రెలు 40 నుండి 120 వరకు 1 మేక లేదా 1 గొర్రె
మేకలు, గొర్రెలు 121 నుండి 200 వరకు 2 మేకలు లేదా 2 గొర్రెలు
మేకలు, గొర్రెలు 201 … 3 మేకలు లేదా 3 గొర్రెలు
మేకలు, గొర్రెలు తరువాత ప్రతి నూటికి 1 మేక లేదా 1 గొర్రె చొప్పున
2. ఆవు, గేదె, ఎద్దు, దున్నపోతు 30 నుండి 39 వరకు
40 నుండి 59 వరకు
60 ఉన్నట్లైతే – – – 

తరువాత ప్రతి 30 కి

తరువాత ప్రతి 40 కి

1 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు
2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు
2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు – రెండు జకాతుగా ఇవ్వాలి. 

1 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు

2 సం. ఆవు/గేదె/ఎద్దు/దున్నపోతు

3. ఒంటెలు ప్రతి 5 ఒంటెలకు 20 వరకు 1 మేక (25 ఉంటే 5 మేకలు)
ఒంటెలు 25 నుండి 35 వరకు 1సం. ఆడఒంటె/2 సం. మగఒంటె
ఒంటెలు 36 నుండి 45 వరకు 2 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 46 నుండి 60 వరకు 3 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 61 నుండి 75 వరకు 4 సం. ఆడ ఒంటె.
ఒంటెలు 76 నుండి 90 వరకు 2 సం. ఆడ ఒంటెలు రెండు
ఒంటెలు 91 నుండి 120 వరకు 3 సం. ఆడ ఒంటెలు రెండు.
ఒంటెలు 121 నుండి  ప్రతి 40 ఒంటెలకు
ప్రతి 50 ఒంటెలకు
2 సం. ఆడ ఒంటె ఒకటి.
3 సం. ఆడ ఒంటె ఒకటి.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

జకాహ్ (విధి దానము) – Zakah: Obligatory Charity

జకాహ్ అర్థము:నిర్నీత సమయంలో, నిర్ణీత ధనమునుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది.

జకాహ్ ఆవశ్యకత: ఇస్లాం మూలస్థంభాలలో జకాహ్ ఒక ముఖ్య మూలస్థంభము. ఖుర్’ఆన్ లో చాలా చోట్ల అల్లాహ్ సలాహ్ తో పాటు జకాహ్ ని కూడ విధిగా పేర్కొన్నాడు.

Al-Baqarah (2):43 : وَأَقِيمُواْ الصَّلاَةَ وَآتُواْ الزَّكَاةَ وَارْكَعُواْ مَعَ الرَّاكِعِينَ

“సలాహ్ ను స్థాపించండి మరియు జకాహ్ ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. (అల్లాహు తఆలా ముందు వంగే వారితో మీరూ వంగిపోండి)” (2:43)

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు:

“ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్యమైన ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట, 2) సలాహ్ ని స్థాపించుట, 3) జకాహ్ (విధి దానం) చెల్లించుట, 4) హజ్ చేయుట, 5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”

2వ హిజ్రీ సంవత్సరములో జకాహ్ విధిగా చేయబడినది. ఎవరైతే జకాహ్ విధిని నిరాకరించారో వారు అవిశ్వాసానికి పాల్బడినట్లు. అతను జకాహ్ చెల్లించినప్పటికీ లేదా చెల్లించకపోయినా. మరియు ఎవరైతే జకాహ్ విధి అని నమ్మి సాక్ష్యమిచ్చి, చెల్లించుటలో సోమరితనం ప్రవర్తించిన ఎడల అతను దుర్మార్గుడు. మరియు ఎవరైనా జకాహ్ చెల్లించుట నిరాకరించిన యెడల వారికి విరుధ్ధంగా ధర్మ యుధ్ధం చేయడం జరుగును.

జకాహ్ ప్రాముఖ్యతలు:

  1. హృదయాన్ని మరియు ధర్మాన్ని శుభ్రపరచును. జకాహ్ పన్ను కాదు. జకాత్ చెల్లించుటవలన ఆ ధనంలో శుభం మరియు అభివృధ్ధి కలుగును.
  2. తోటి మానవులపై దయ కలుగును, మరియు సమాజంలో ఏకత్వం పెంపొందును.
  3. ఎవరిపై అయితే జకాహ్ విధి చేయబడినదో అతనికి పరీక్ష. అతను జకాహ్ చెల్లించుటద్వారా అల్లాహ్ కు సమీపమగును. మరియు అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించిన వాడగును.

జకాహ్ ఎప్పుడు విధి అగును:

  1. ముస్లింలపై, ఎందుకంటే జకాత్ వలన శుభ్రత మరియు శుభం ప్రాప్తమగును. అవిశ్వాసి అశుభృడు.
  2. స్వతంత్రుడై ఉండాలి. వేరే వారిపై ఆధారపడి ఉండరాదు.
  3. జకాతు చెల్లించడానికి కావలసిన నిర్ణీత పరిమితి (నిసాబ్) – పూర్తి అయి ఉండాలి.
  4. సమాజంలో శాంతిబధ్రతలు ఉండాలి మరియు ఆ ధనంలో వేరేవారి హక్కు ఉండరాదు.
  5. ఒక సంవత్సరము పూర్తి కావాలి.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

జకాహ్ ఎవరికి చెల్లించాలి? (Recipients of Zakah)

జకాహ్ ఎవరికి చెల్లించాలి:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاء وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللّهِ وَابْنِ السَّبِيلِ فَرِيضَةً مِّنَ اللّهِ وَاللّهُ عَلِيمٌ حَكِيمٌ

“ఈ జకాహ్ నిధులు కేవలం నిరుపేదలకు, అక్కర గలవారికి, జకాత్ సేవకులకు, ఇంకా ప్రోత్సాహం కొరకు, బానిసల విముక్తికి, ఋణగ్రస్తుల సహాయానికి, దైవమార్గంలో మరియు బాటసారుల కొరకు ఇది అల్లాహ్ తరఫు నుంచి నిర్ణయించ బడినది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూనూ.”  (దివ్య ఖుర్’ఆన్ 9:60).

  1. నిరుపేదలు: తమ కొరకు భోజన సదుపాయాలు చేకూర్చుకొనలేరు
  2. అక్కరగలవారు: తమ ఇంటివారి కొరకు భోజన సదుపాయములు చేకూర్చుకొనలేరు.
  3. జకాహ్ సేవకులు: వారికి వేరే ఉపాధి లేనిచో దీని నుండి ఉపాధి ఇవ్వ వచ్చును.
  4. ప్రోత్సాహం కొరకు: ఇస్లాం వైపుకు మొగ్గు చూపిన యెడల అతనికి దీని నుండి అతని మనస్సు కుదుట పడడానికి ఇవ్వవచ్చును.
  5. బానిసలవిముక్తికి:బానిసలను, ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ ధనమును వినియోగించవచ్చును
  6. ఋణగ్రస్తుల సహాయానికి: అప్పు తీసుకుని తీర్చలేని వారి కొరకు.
  7. అల్లాహ్ మార్గములో కష్టపడే వారి కొరకు: కష్టాల పాలైన వారికి, కష్టాలకు గురి అవుతున్న వారికి, ధర్మపోరాటం కొరకు, ఖర్చు చేయవచ్చును.
  8. బాటసారికి: ప్రయాణీకుల దగ్గర డబ్బులు లేని యెడల అతను ధనవంతుడైనా ఆ సమయములో అతని దగ్గర ప్రయాణపు ఖర్చులు మరియు భోజన ఖర్చులు లేని యెడల అతనికి ఇవ్వ వచ్చును.

జకాహ్ కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు:

  1. జకాహ్ నిధిని పైన తెలిపిన అన్నింటి పై లేదా ఒక దానిపై లేదా కొన్నిటి పై ఖర్చు చేయవచ్చును.
  2. అవిశ్వాసులకు జకాహ్ ఇవ్వబడదు. ఇస్లాం లోకి రాదలచుకుంటే  ప్రోత్సహించుట కొరకు తప్ప.
  3. ధనవంతులకు లేదా బనీ హాషీం తెగ వారికి గాని జకాహ్ ఇవ్వరాదు.
  4. సమీప బంధువులలో నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి జకాహ్ చెల్లించుట ఉత్తమము.
  5. తమపై ఆధారపడిన వారికి జకాతు చెల్లించుట నిషిధ్ధము. ఉదా: తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనుమలు, మునుమరాళ్ళు, తాత ముత్తాతలు.
  6. ఎక్కడ జకాహ్ వసూలు చేయబడునో అదే ప్రాంతములో జకాహ్ ఖర్చు చేయుట ఉత్తమము.
  7. భార్య తన భర్తకు జకాహ్ ఇవ్వ వచ్చును.  భర్త భార్యకు ఇవ్వరాదు.
  8. తమ వాడుకలో ఉన్న వస్తువులపై జకాతు లేదు. కాని బంగారం, వెండినగలపై జకాతు చెల్లించివేయుట ఉత్తమం
  9. కిరాయి కొరకు ఇవ్వబడే వస్తువులపై జకాహ్ లేదు. కానీ దానిపై వచ్చే ఆదాయం పై జకాతు చెల్లించాలి.
  10. పంటలు మరియు పండ్ల పై, పంట పండిన వెంటనే, కోసినప్పుడే జకాతు చెల్లించి వేయాలి.
  11. భూమి త్రవ్వకాలలో లభ్యమైన ధనము, ససంపదలో 20% జకాతు చెల్లించాలి.
  12. జకాహ్ సమయం పూర్తికాగానే జకాత్ చెల్లించాలి.
  13. జకాహ్ చెల్లించకుండా చనిపోయిన యెడల అతని వారసులు జకాహ్ చెల్లించి అతని జకాహ్ అప్పును తీర్చవలెను

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

పుణ్యఫలాలు [పుస్తకం]

Punya-Falaalu-Doors-to-Great-Rewards


టైటిల్
: పుణ్యఫలాలు (Doors to Great Rewards)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ : దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు

(Great Rewards of certain acts of worship in Islam) – E-Book

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

దివ్య ఖుర్ఆన్ శ్రేష్ఠత

حفظ القرآن: عَنْ عَائِشَةَ رَضي الله عنها عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَثَلُ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَهُوَ حَافِظٌ لَهُ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَمَثَلُ الَّذِي يَقْرَأُ وَهُوَ يَتَعَاهَدُهُ وَهُوَ عَلَيْهِ شَدِيدٌ فَلَهُ أَجْرَانِ).

1-ఖుర్ఆన్ కంఠస్తం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఆయిషా ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).

تلاوة القرآن الكريم: عَنْ أَبِي أُمَامَةَ البَاهِلِي  رَضِيَ ٱللَّٰهُ عَنْهُ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ).

2-ఖుర్ఆన్ పారాయణం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

تعلم القرآن وتعليمه: عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ).

3- ఖుర్ఆన్ నేర్చుకోవటం, నేర్పించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ నేర్చుకునేవాడు మరియు నేర్పేవాడు మీలో మేలైనవారు”. (బుఖారీ 5027).

4- సూర ఇఖ్లాస్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రశ్నించారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?” దానికి సహచరులు ‘ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఎలా చదవగలడు? ప్రవక్తా!’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “ఖుల్ హువల్లాహు అహద్ (సూరా) ఖుర్ఆన్ లో మూడవ వంతుకు సమానం”. (ముస్లిం 811. బుఖారీ 5015).

5- “ముఅవ్విజతైన్”: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఈ రాత్రి అవతరించిన ఆయతుల గురించి నీకు తెలియదా? అంతటి గొప్ప ఆయతులు ఎప్పుడూ అవతరించలేదుః ‘ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్’ మరియు ‘ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్’ సూరాలు”. (ముస్లిం 814)

6- సూర బఖర: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీరు మీ ఇళ్ళను శ్మశానంగా చేసుకోకండి. సూర బఖర పారాయణం ఏ ఇంట్లో జరుగుతుందో అందులో నుంచి షైతాన్ పారిపోతాడు”. (ముస్లిం 780).

7-సూర బఖర మరియు ఆలె ఇమ్రాన్: అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానుః “ఖుర్ఆన్ చదవండి. అది ప్రళయదినాన తన్ను చదివినవారి పట్ల సిఫారసు చేస్తుంది. రెండు పుష్పములైన సూర బఖర, సూర ఆలె ఇమ్రాన్ లు చదవండి. అవి రెండు మేఘాలుగా లేక రెండు ఛాయాలుగా లేక రెండు వరుసల్లో ఎగురుతున్న పక్షుల్లాగా ప్రళయదినాన వస్తాయి. వాటిని చదివినవారి కోసం అవి వాదిస్తాయి. సూర బఖర చదవండి. దాన్ని చదివితే భాగ్యం. విడనాడితే దౌర్భాగ్యం. మాంత్రికులకు అది అసాధ్యం”. (ముస్లిం 804).

8- ఆయతుల్ కుర్సీ: ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “అబూ ముంజిర్! నీవు కంఠస్తం చేసిన అల్లాహ్ గ్రంథంలో గొప్ప ఆయతు ఏదో నీకు తెలుసా?” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ప్రశ్నించారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేనన్నాను. ప్రవక్త మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. {అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం…} (సూర బఖరలోని 255వ ఆయతు) అని జవాబిచ్చాను. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (సంతోషంతో) నా ఛాతిపై కొట్టి “అల్లాహ్ సాక్షిగా! జ్ఞానం నీకు సులభంగా అబ్బుతుంది అబుల్ ముంజిర్” అని చెప్పారు. (ముస్లిం 810)

9- సూర బఖర చివరి ఆయతులు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సూర బఖరలోని చివరి రెండు ఆయతులు రాత్రి వేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు”. (బుఖారీ 5009). ఇమాం నవవీ రహిమహుల్లాహ్ దీని భావం ఇలా చెప్పారుః ‘తహజ్జుద్ కొరకై లేవకున్నాపరవాలేదు అని ఒక భావం. షైతాన్ బారి నుండి కాపాడుకోవటానికి ఇవి సరిపోతాయనేది రెండవ భావం. ఆపదల నుండి రక్షించబడటానికి అనేది మూడవ భావం. అయితే ఇవన్నీ కూడా దీని భావంలో వస్తాయని కూడా చెప్పబడింది.

10- సూర కహఫ్ లోని మొదటి ఆయతులు కంఠస్తం చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ” సూర కహఫ్ యొక్క మొదటి ఆయతులు కంఠస్తం చేసిన వ్యక్తి దజ్జాల్ కీడు నుండి రక్షింపబడుతాడు”. (ముస్లిం 809). మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః “మొదటి పది ఆయతులు కంఠస్తం చేసినవారికి……”.

అల్లాహ్ స్మరణ మహత్త్వం

11-అల్లాహ్ యొక్క అధిక స్మరణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారరు: “‘ముఫర్రిదూన్’ ముందుకు వెళ్ళారు. ‘ముఫర్రిదూన్’ ఎవరు ప్రవక్తా! అని అడిగారు సహచరులు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు”. (ముస్లిం 2676).

12- “అల్లాహ్ ను స్మరించేవాని మరియు స్మరించనివాని ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 6407). ముస్లింలోని ఉల్లేఖనం ఇలా ఉందిః “అల్లాహ్ స్మరణ జరిగే ఇల్లు మరియు అల్లాహ్ స్మరణ జరగని ఇల్లు ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది”. (ముస్లిం 779).

13- సుబ్ హానల్లాహ్: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమక్షంలో ఉండగా “ప్రతి రోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించడం మీలో ఎవరికైనా కష్టమా?” అని అడిగారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). ఆ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ‘మాలో ఎవరైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “వంద సార్లు సుబ్ హానల్లాహ్ అని స్మరిస్తే వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి. లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి” అని సమాధానమిచ్చారని సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2698).

14- “సుబ్ హానల్లాహి వబిహందిహీ” అని రోజుకు వంద సార్లు ఎవరు పఠిస్తాడో అతని పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2691).

15- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “సుబ్ హానల్లాహి వబి హందిహీ” అని ఉదయం వందసార్లు, సాయంకాలం వంద సార్లు ఎవరైతే పఠిస్తారో, అతనికంటే ఉత్తమమైన సత్కార్యం ప్రళయదినాన మరెవరిదీ ఉండదు. అదే విధంగా లేదా అంతకు మించి పఠించిన వ్యక్తి సత్కార్యం తప్ప”. (ముస్లిం 2692).

16- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః  “రెండు వచనాలున్నాయి. అవి (పఠించడానికి) నాలుక పై తేలిగ్గానే ఉంటాయి. కాని పరలోకపు త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడయిన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి, (అవేమిటంటేః) సుబ్ హానల్లాహి వబిహందిహీ, సుబ్ హానల్లాహిల్ అజీం (అల్లాహ్ పరమపవిత్రుడు, పరిశుద్ధుడు నేనాయన్ని స్తుతిస్తున్నాను. పరమోత్తముడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు). (బుఖారీ 6406. ముస్లిం 2694).

17- అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారుః “సూర్యుని కాంతి ఎన్నిటిపై పడుతుందో వాటన్నిటి కంటే అధికంగా “సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అనడం నాకు చాలా ఇష్టం”. (ముస్లిం 2695).

18- “ఎవరైనా ప్రతి నమాజు తర్వాత 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ మరియు 33 సార్లు అల్లాహు అక్బర్ అని పఠిస్తే, ఇవి 99, మరియు లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అని 100 పూర్తి చేస్తే అతని పాపాలు క్షమించబడతాయి. ఒక వేళ అవి సముద్రం నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే. (ముస్లిం 597).

19-లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాః అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి “నేను స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా? అని చెప్పారు. తప్పకుండా తెలియజేయండని నేనన్నాను. అప్పుడాయన r “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”. (బుఖారీ 6409. ముస్లిం 2704).

20-సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వఅన అబ్దుక వఅన అలా అహ్దిక వవఅదిక మస్తతఅతు అఊజుబిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారుః “ఎవరు ఈ దుఆ పూర్తి నమ్మకంతో ఉదయం చదివి, సాయంకాలం రాక ముందే చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడు. ఎవరు రాత్రిపూట దాన్ని చదివి, తెల్లవారక ముందే చనిపోతాడో అతడూ స్వర్గవాసుల్లో ఒకడు”. (బుఖారీ 6306). (అనువాదం: ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడెవ్వడూ లేడు. నీవే నన్ను సృష్టించావు. నేను నీ దాసుణ్ణి. నేను నీతో చేసిన (దాస్య) ప్రమాణాన్ని, వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటాను. నా ద్వారా జరిగిన చెడు (వల్ల కలిగే దుష్పరిణామాల) నుండి నీ శరణు వేడుకుంటున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకొంటున్నాను. నేను చేసిన అపచారాలను ఒప్పుకుంటున్నాను. నా అపరాధాలను మన్నించు. పాపాలను మన్నించేవాడు నీవు తప్ప నాకు మరెవ్వరూ లేరు).

21- నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవ వలసిన దుఆ: “ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని వేడుకుంటే లేదా మరేదైనా దుఆ చేసుకుంటే అది అంగీకరింపబడు తుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

22-లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ వచనాలను ప్రతి రోజూ వంద సార్లు పఠించే వాడికి పది మంది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది.  పైగా అతని కర్మల రికార్డులో వంద సత్కర్మలు అదనంగా వ్రాయబడతాయి. ఆ రికార్డులో నుంచి వంద దుష్కర్మలు తొలగించి వేయబడతాయి. అంతే గాకుండా ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ వచనాలు అతడ్ని షైతాన్ బారి నుండి రక్షిస్తాయని హామీ కూడా ఉంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాజాలదు. (బుఖారీ 6403. ముస్లిం 2691). [అనువాదం: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటి లేరు. రాజ్యాధికారం అంతా ఆయనదే. సర్వ స్తుతి, స్తోత్రాలకు ఆయనే యోగ్యుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు].

23- అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ప్రవచించారుః “ఎవరైనా “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పది సార్లు చదివితే అతనికి ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురి మనుషులను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 2694).

24- జిక్ర్ సమావేశాల శ్రేష్ఠత: అబూ హురైరా మరియు అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః  “ఎవరైనా కొంత మంది అల్లాహ్ ను స్మరిస్తూ కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడుతారు. (అల్లాహ్) కారుణ్యం వారిని ఆవరిస్తుంది. శాంతి వారిపై అవతరిస్తుంది. అల్లాహ్ వారి ప్రస్తావన తన వద్ద ఉన్నవారి ముందు చేస్తాడు”. (ముస్లిం 2700).

25- ప్రవక్తపై దరూద్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒకసారి దరూద్ పంపుతారో అతనిపై అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

26- తిన్నత్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనండి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అనడం అల్లాహ్ కు చాలా ఇష్టం. (ముస్లిం 2734).

వుజూ, నమాజుల ఘనత

27- ఉత్తమ రీతిలో వుజూ చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తాడో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”. (ముస్లిం 245).

28- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా ఎవరైనా వుజూ చేసి, ఆ తర్వాత (ఐదు పూటల) ఫర్జ్ నమాజులు చేస్తే, అవి వాటి మధ్యలో జరిగే పాపాల పరిహారానికి కారణమవుతాయి”. (ముస్లిం 231).

29- వుజూ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సజావుగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు” అని పలికితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తనకు ఇష్టమైన ద్వారం గుండా అందులో అతను ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

30- అజాన్ యొక్క జవాబు, ప్రవక్తపై దరూద్: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారుః “ముఅజ్జిన్ అజాన్ ఇస్తుండగా విన్నపుడు అతను చెప్పిన విధంగానే చెప్పి ఆ తరువాత నాపై దరూద్ పంపండి. నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ పదిసార్లు కరుణ పంపుతాడు”. (ముస్లిం 384).

31- అజాన్ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ؆ ఉల్లేఖించారుః “అజాన్ విని (దాని జవాబు ఇచ్చిన  తర్వాత) ఈ దుఆ చదివిన వ్యక్తి ప్రళయం దినాన నా సిఫారసుకు అర్హుడవుతాడుః “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ”. (బుఖారీ 614).

32- అజాన్ యొక్క మహత్తు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ యొక్క అజాన్ శబ్దాన్ని విన్న మానవులు, జిన్నాతులు ఇంకా ఎవరైనా సరే,  ప్రళయదినాన వారు దానికి తప్పక సాక్ష్యం ఇస్తారు. (బుఖారీ 609).

33- మస్జిద్ నిర్మాణం: ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) మస్జిదె నబవీని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారుః మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నానుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు”. (బుఖారీ 450. ముస్లిం 533).

34- ఇమాంతో పాటు ఆమీన్ అనటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమామ్ ఆమీన్ అన్నప్పుడు మీరూ అమీన్ అని పలకండి. (అప్పుడు దైవదూతలు కూడా ఆమీన్ అంటారు). ఎవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ కు అనుగుణంగా ఉంటుందో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 780. ముస్లిం 410).

35- నమాజుకు తొలి వేళలో బయలుదేరటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశిం చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “వేళ కాగానే తొలి వేళలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615. ముస్లిం 437).

36- ఇంట్లో వుజూ చేసి, మస్జిద్ కు కాలినడకతో వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారు: “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

37- మస్జిద్ కు నడచి వెళ్లటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం మహనీయ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి మాటల్ని నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 587).

38- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తికి అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (బుఖారీ 662. ముస్లిం 669).

39- సున్నతె ముఅక్కద: ఉమ్మె హబీబా ؅ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజు పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు”. (ముస్లిం: 1696).

అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.

40- తహజ్జుద్ నమాజ్: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే (తహజ్జుద్) నమాజు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బదులిచ్చారు. (ముస్లిం 2756).

41- ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయటం: నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నాను అని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

42- సక్రమంగా వుజూ చేసి జుమాకు వెళ్ళి, నిశబ్దంగా, శ్రద్ధగా ఖుత్బా వినటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా t ఉల్లేఖించారుః “ఎవరైతే సక్రమంగా వుజూ చేసి, జుమా కొరకు వచ్చి, నిశబ్దంగా ఉండి, శ్రద్ధగా ప్రసంగం వింటాడో అతని ఈ జుమా నుండి మళ్ళీ జుమా వరకు ఇంకా మూడు రోజుల అదనంగా (అంటే మొత్తం పది రోజుల పాపాలు) మన్నించబడతాయి”. (ముస్లిం 1987).

43-శీఘ్రంగా జుమా నమాజు కొరకు వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జుమా రోజు దైవదూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటె ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తికి లభించే పుణ్యానికి సమానం. ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం ). 

44- జనాజా నమాజ్ మరియు ఖననంలో పాల్గొనుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూహురైరా r ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).

ఉపవాస (రోజా) ఘనతలు

45- విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను రోజాలుండుట: “ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 38. ముస్లిం 760).

46- విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ చేయుట: “విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ పాటించిన వ్యక్తి పూర్వ పాపాలు క్షమించ బడున”ని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చినట్లు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 37. ముస్లిం 759). 

47- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా రమజానుపవా సాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర కాలం రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).

48- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు మూడు విష యాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).

42- అరఫా దినాన ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, వచ్చే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

43- ఆషూరా దినపు ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

వివిధ ఘనతలు

51- పశ్చాత్తాపం: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః “పశ్చిమ దిశ నుండి సూర్యోదయానికి ముందు వరకు అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు”. (ముస్లిం 2703).

52- హజ్, ఉమ్రాల ఘనత: “ఎవరైనా ఒక ఉమ్రా తరువాత మరొక ఉమ్రా చేస్తే, ఆ రెండు ఉమ్రాల మధ్య కాలంలో అతని వల్ల జరిగిన పాపాలకు రెండవ ఉమ్రా పరిహారం అవుతుంది. మబ్రూర్ హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1773. ముస్లిం 1349).

53- జిల్ హిజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జిల్ హిజ్జ మొదటి దశలో చేసిన సత్కార్యాలకున్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన r “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధన ప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).

54- విద్యాభ్యాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లే ఖించారుః “విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అల్లాహ్ అతని కొరకు ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు. (ముస్లిం 2646).

55- ధర్మావగాహన: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని ముఆవియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “అల్లాహ్ ఎవరి పట్ల మేలు కోరుతాడో అతనికి ధర్మావగాహన ప్రసాదిస్తాడు”. (బుఖారీ 71. ముస్లిం 2389).

56- ధర్మప్రచారం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు సన్మార్గం వైపునకు పిలుస్తారో, అతనికి దానిని అనుసరించేవారంత పుణ్యం లభిస్తుంది. (ఆచరించేవారి) పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. (ముస్లిం 2674).

57- మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా చెడును చూసినచో తన చేత్తో దాన్ని రూపు మాపాలి. ఈ శక్తి లేకుంటే తన నోటి (మాట, ఉపదేశం)తో, ఈ శక్తి కూడా లేనిచో మనుస్సులో దాన్ని చెడుగా భావించి (దానికి దూరంగా ఉండాలి). ఇది విశ్వాసం యొక్క అధమ స్థానం”. (ముస్లిం 49).

58- సలాంను వ్యాపింపజేయటం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ‘ఏ ఇస్లాం మేలైనది’ అని ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని. ఆయన r ఇలా సమాధానమిచ్చారుః “అన్నం తినిపించు. నీకు పరి చయం ఉన్నవారికీ, లేనివారికీ సలాం చేయి”. (బుఖారీ 12. ముస్లిం 29).

59- అల్లాహ్ కొరకే ప్రేమ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ప్రళయదినాన అల్లాహ్ ఇలా అంటాడుః నా కొరకే పరస్పర ప్రేమ సంబంధాలను పెంచుకున్న వారెక్కడున్నారు? ఈ రోజు నా ఛాయ తప్ప ఏ ఛాయాలేని రోజు, నేను వారిని నా ఛాయలో ఉంచుతాను”. (ముస్లిం 6548).

60- సత్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సత్యాన్ని మీరు విడనాడకండి. సత్యం మనిషిని పుణ్యకార్యాల వైపునకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లపుడు సత్యం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి)గా మార్చేస్తుంది”……. (బుఖారీ 6094. ముస్లిం 2607).

61- సత్ప్రవర్తన: “మీలో ఉత్తమ నడవడికగలవారే మేలైనవారు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనేవారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 3559. ముస్లిం 2321).

62- చిరునవ్వు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబూ జర్ r ఉల్లేఖించారుః “ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు – అది నీ తోటి సోదరునితో నగుమోముతో కలియుటయే అయినా సరే”. (ముస్లిం 2626).

63- మృదుత్వం: “మృదుత్వం కోల్పోయిన వ్యక్తి సర్వ మేళ్ళను కోల్పోయినట్లే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని జరీర్ t ఉల్లేఖించారు. (ముస్లిం 2592).

64- రోగిని పరామర్శించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఆయన r సేవకుడైన సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారుః “ఎవరు రోగిని పరామర్శించ టానికి వెళ్తాడో అతను (తిరిగి వచ్చే వరకు) స్వర్గపు తోటలో ఉంటాడు”. (ముస్లిం 2568).

65- సహనం: “ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప పరిహారానికి కారణభూతం అవుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 5642. ముస్లిం 2573).

66- సత్కార్యం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ప్రతి సత్కార్యం సదకాయే”. (బుఖారీ 6021. ముస్లిం 1005).

67- ఒకరి కష్టం దూరం చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారుః “ఇహలోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్నయినా ఎవరయినా దూరం చేస్తే, పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఋణగ్రస్తునికి వ్యవధి ఇస్తాడో, ఇహపరాల్లో అతడికి అల్లాహ్ సుఖసంపదలు నొసంగుతాడు”. (ముస్లిం 2699).

68- అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “అల్లాహ్ ప్రళయదినాన ఆపదల నుండి కాపాడుట ఎవరికి ఇష్టమో వారు రుణగ్రస్తుని రుణ చెల్లింపుకై గడువు ఇవ్వాలి. లేదా మొత్తానికే మన్నించాలి”. (ముస్లిం 1563).

69- అనాథ సంరక్షణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ r ఉల్లేఖించారుః “నేను మరియు అనాథుల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళ్ళను కలిపి చూపించారు. (బుఖారీ 6005).

70- వితంతువులు మరియు పేదలను ఆదుకోవటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “పేదలు మరియు వితంతువుల సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారిలాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ రాత్రిళ్ళు దైవారాధనలో గడిపే వారితో సమానుడవుతాడు”. (బుఖారీ 5353. ముస్లిం 2982).

71- ముస్లిం సోదరుని కోసం దుఆ చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా t: “ఎవరు తన సోదరుని వెనక అతని కొరకు దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).  

72- రక్త సంబంధం పెంచుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “తన ఉపాధిలో సమృద్ధిని, దీర్ఘా యుష్షును కోరే వ్యక్తి బంధుత్వ హక్కులను నెరవేర్చాలి”. (ముస్లిం 2557).

73-సదఖా: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా తన మంచి (ధార్మిక) సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ మంచి వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది”. (బుఖారీ 1410. ముస్లిం 1014).

74-ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్నాశించటం: అబూ మస్ఊద్ బద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశ్యంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే, అది అతని ‘సదకా’ (మంచి దానం)గానే పరిగణించ బడుతుంది”. (బుఖారీ 55. ముస్లిం 1002).

75- కూతుళ్ళకు సుశిక్షణ: అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “ఎవరైతే ఇద్దరు బాలికలకు వారు పెళ్ళి ఈడుకు చేరుకునే వరకు మంచి శిక్షణ ఇస్తాడో అతను మరియు నేను ప్రళయదినాన ఇలా ఉంటాము అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ వ్రేళ్ళను కలిపారు”. (ముస్లిం 2631).

76- ఎడతెగని పుణ్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికి లభిస్తునే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).

77- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలగించుటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారుః “ఒక వ్యక్తి దారిన నడచిపోతూ దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతని (గత పాపాల్ని) మన్నించాడు”. (బుఖారీ 2472 ముస్లిం 1914).

78- ఆరోగ్యం, తీరిక: హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారుః “రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడియున్నారు. ఒకటిః ఆరోగ్యం. రెండవదిః తీరిక”. (బుఖారీ 6412).

79-సంతానం చనిపోయినవారు చేసే సహనానికి ఫలితం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః నేను నా దాసునికి ప్రియమైనవారిని చంపినపుడు అతను సహనం వహిస్తే, పుణ్యాన్నాశిస్తే దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారీ 6424).

80-ఏడుగురిని అల్లాహ్ తన ఛాయలో ఉంచుతాడు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడా తప్ప మరెలాంటి నీడ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలోః (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. (2) తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 1423. ముస్లిం 1031).

81- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి దర్శించటానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి ఉండమని పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు. అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడుః “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో పాటు నీ వైపు పంపాడు. నీవు అతడ్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).

82- అతి స్వల్పమైన షిర్క్ నుండి కూడా దూరముండాలి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఏ మాత్రం షిర్క్ చేయనివాడు (భాగస్వామ్యం కల్పించనివాడు) అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటే స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనకు సాటి కల్పించే మనిషి అదే స్థితిలో కలుస్తే నరకంలో చేరుతాడు”. (ముస్లిం 270).

83- బల్లిని చంపుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దెబ్బకే బల్లిని చంపినవారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ. మూడు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ”. (ముస్లిం 2240).

84- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం: ఆయిషా ؅ ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?’ అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని ఆయన సమాధానమిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).

85- మంచి సంప్రదాయం (సున్నతె హసన): ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(ప్రజలు మరచిపోయిన) ఇస్లాంలోని ఒక మంచి సంప్రదాయాన్ని ఎవరు పునరారంభిస్తారో అతనికి దాని పుణ్యంతో పాటు అతని తర్వాత దాన్ని అనుసరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు.  ఇక ఎవరు ఇస్లాంలో ఒక చెడు సంప్రదాయాన్ని మొదలెడతారో దాని పాప భారం అతనిపై పడుతుంది. ఇంకా అతని తర్వాత ఎవరు దాన్ని అవలంబిస్తారో వారి పాప భారం కూడా అతనిపై పడుతుంది. మరి వారి పాపాల్లో ఏ కొరతా జరగదు”. (ముస్లిం 2351).


(1) రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.

హజ్ యాత్రికులకు ప్రత్యేక సూచనలు

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్

హజ్ యాత్రికుల కోసం కొన్ని ముఖ్య సూచనలు

1. కేవలం అల్లాహ్ కోసమే మీ సంకల్పాన్ని నిశ్చయించుకోవటం.

ఉమ్రా లేక హజ్ యాత్ర కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామని దృఢసంకల్పం చేసుకోవలెను. ఈ పుణ్యయాత్రలో వెచ్చించే సమయానికి, సంపదకు, శారీరక ప్రయాసలకు ప్రసాదించబడే ప్రతిఫలితం మీ సంకల్పంలోని చిత్తశుద్ధి మరయు అల్లాహ్ ను మెప్పించే మీ ప్రయత్నంలోని దైవసమర్పణ, భయభక్తుల పై ఆధారపడి ఉంటుంది. దివ్యఖుర్ఆన్ లో సూరహ్ బఖరా 2:197 లో అల్లాహ్ హజ్ యాత్రికులను ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు – హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామగ్రి. ఇంకా ఇదే వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు అరఫాత్ నుండి బయలుదేరి, మష్ అఁరె హరామ్ వద్ద ఆగి, అల్లాహ్ ను స్మరించండి. అల్లాహ్ మీకు హితోపదేశం చేసిన విధంగా ఆయనను ధ్యానించండి. చేసిన పాపాల గురించి పశ్చాత్తాపం, తౌబా (క్షమాపణ వేడుకోవటం), అల్లాహ్ ధ్యానం, నమాజు, ఖుర్ఆన్ పఠనం, ఇంకా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అల్లాహ్ తప్పక చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవటం, మరియు తోటివారికి కష్టం, నష్టం కలిగించకుండా సహనంతో , ఓర్పుతో మెలగటం, వీలయినంత ఎక్కువగా సహాయసహకారాలు అందించటం మొదలైన వాటిని మీరు అత్యుత్తమైన విధంగా ఆచరించటానికి ప్రయత్నించవలెను.  సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని ‘హజ్జె మబ్రూర్ (అంటే సున్నత్ ప్రకారం చేసిన హజ్) వలన గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి’ అనే  ముఖ్యవిషయం తప్పక గుర్తుంచుకోవలెను. కాబట్టి హజ్ యాత్రను చాలా జాగ్రత్తగా, ప్రతి అడుగు అల్లాహ్ స్వీకరించే విధంగా వేయవలెను. ప్రతి మాట అల్లాహ్ మెచ్చే విధంగా పలక వలెను. అల్లాహ్ యొక్క ధ్యానం, ఆయా ఆరాధనా పద్ధతులతో పాటు ఇతరులకు ఎటువంటి కష్టం కలిగించకుండా హజ్ యాత్ర పూర్తి చేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను.

2. హజ్, ఉమ్రా మరియు వాటికి సంబంధించిన నియమ నిబంధనలను నేర్చుకోవటం.

ప్రతి ఒక్కరు హజ్ యొక్క షరతులు మరియు తప్పని సరిగా ఆచరించవలసిన ఆచరణలు, హజ్ యొక్క మూలస్థంభాలు మరియు సున్నత్ విధానములు పూర్తిగా నేర్చుకుని అల్లాహ్ ఆదేశించిన ఈ ఆరాధనను సరైన జ్ఞానంతో ఉత్తమంగా నెరవేర్చటానికి  ప్రయత్నించవలెను.  హజ్ గురించి తెలుసుకునే అన్ని సౌకర్యాలు ఉన్నా, స్వయంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంతోనే ఏదో విధంగా పూర్తిచేయాలనుకోవటం ఎంతటి అవివేకం. అజ్ఞానం వలన చేయవలసిన ఆచరణలు వదిలివేయటం లేక చేయకూడని పనులు చేయటం ద్వారా తప్పులు జరిగి, పాపములు జరిగి, హజ్ నిర్వీర్యం కావటానికి  అవకాశం ఉన్నది. పూర్వకాలంలోను మరియు ప్రస్తుత కాలంలోను అనేక మంది ఇస్లామీయ పండితులు (ఉలేమాలు) హజ్ యాత్ర గురించి వివరంగా వ్రాసిన అనేక పుస్తకములు వివిధ భాషలలో మనకు అందుబాటులో ఉన్నాయి. హజ్ యాత్రికులు వీటిని చదవ వలెను.  ఏదైనా విషయం అర్థం కాకపోతే, పండితులను(ఉలేమాలను) లేక జ్ఞానవంతులను సంప్రదించి తెలుసుకోవలెను.

3. పాపముల నుండి క్షమాపణ వేడుకోవటం (తౌబా చేయటం)

దివ్యఖుర్ఆన్ సూరహ్ అత్ తహ్రీమ్ 66:8 – అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – విశ్వసులారా! చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకుంటూ అల్లాహ్ వైపుకు మరలండి”

నిజమైన తౌబా (అంటే పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ) యొక్క చిహ్నాలు:-

ü   చెడు పనున్నింటినీ మరియు పాపములన్నింటినీ వదిలివేయటం.

ü   చేసిన చెడు పనుల మరియు పాపముల గురించి చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం.

ü   మరల అటువంటి చెడు పనులు, పాపములు తిరిగి చేయకుండా దృఢంగా నిర్ణయించికోవటం.

ü   ఇతరులకు చెందిన సంపద, గౌరవమర్యాదలు..మొదలైన వాటిని తిరిగి వారికి అప్పగించడం.

ü   హజ్ యాత్ర ఖర్చుల కోసం ధర్మబద్ధమైన (హలాల్) సంపాదనను ఎన్నుకోవడం.

ప్రతి ఒక్కరు హజ్ చేయటం కోసం ధర్మబద్ధమైన (హలాల్) పద్ధతి ద్వారా సంపాదించిన ధనాన్ని మాత్రమే ఎన్నుకోవలెను.  ఎవరైనా హజ్ యాత్ర పూర్తిచేసినా గాని, ఒకవేళ వారి సంపాదన అధర్మ పద్ధతుల ద్వారా సంపాదించినదైతే, వారి హజ్ స్వీకరించబడినదనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు ఒకవేళ ఎవరైనా పవిత్రమైన సంపాదనతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్అని పలకగానే, లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు పవిత్రమైనవి, మీ వాహనం పవిత్రమైనది మరియు మీ హజ్ స్వీకరించబడుతుందిఅని ఆకాశం నుండి జవాబు వస్తుంది.కాని ఒకవేళ ఎవరైనా అధర్మపద్ధతిలో సంపాదించిన ధనంతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్అని పలకగానే, లా లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు అపవిత్రమైనవి, మీ వాహనం అపవిత్రమైనది మరియు మీ హజ్ పాపములతో నిండి ఉన్నది మరియు అది స్వీకరించబడదుఅని ఆకాశం నుండి జవాబు వస్తుంది. కాబట్టి హజ్ యాత్ర ఖర్చులకు కేవలం పవిత్రమైన, ధర్మంగా మరియు ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా సంపాదించిన ధనం మాత్రమే వెచ్చించవలెను. హజ్ ప్రయాణం కోసం మంచి నడవడిక గల స్నేహితులను ఎన్నుకోండి. ప్రయాణ సంప్రదాయములు (ఆదాబె సఫర్), ప్రయాణంలో చేసే వివిధ దుఆ (ప్రార్థన) లు ముందుగా తెలుసుకోవలెను. ప్రయాణ ప్రారంభంలో చేయవలసిన ప్రార్థనలు మీకు తెలుపబడును. వాహనం ఎత్తుగా ఉండే ప్రదేశం వైపుకు ప్రయాణించేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని, పల్లం వైపుకు ప్రయాణించేటప్పుడు సుభహానల్లాహ్ అని, దారిలో విరామం కోసం ఆగినప్పుడు అఊదు బి కలిమాతిల్లాహిత్తామత మిన్ షర్రి మా ఖలఖ్ అంటే అతడే సృష్టించిన దుష్టశక్తుల బారి నుండి నేను పవిత్రమైన, సంపూర్ణమైన అల్లాహ్ యొక్క పదాల ద్వారా రక్షణ వేడుకుంటున్నాను అని ప్రార్థించినట్లయితే విశ్రాంతి ప్రదేశాలలో వారికి అల్లాహ్ కృప వలన ఎటువంటి హాని కలుగదు.

4. హజ్ యాత్రికులకు కొన్ని ముఖ్యసూచనలు

1.    నమాజు సమయం అయినప్పుడు, వెంటనే చేస్తున్న పని ఆపి, నమాజు కోసం తయారు కావలెను. నమాజును ఆలస్యం చేసే లేక నమాజు ను నిరోధించే ఏ పనిలోను అల్లాహ్ యొక్క శుభాలు ఉండవు.

2.    మీ ఖాళీ సమయాలలో, వీలయినంత ఎక్కువగా ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం చేయటానికి ప్రయత్నించవలెను. మీరు చదివే ప్రతి ఒక్క అక్షరానికి కనీసం 10 పుణ్యాలు ప్రసాదించబడతాయనే హదీథ్ ను మరిచిపోవద్దు.

3.    తోటి వారితో మంచిగా ప్రవర్తించండి, ఉత్తమమైన పద్ధతిలో వ్యవహరించండి.

4.    ఎటువంటి ప్రయోజనం కలిగించని అనవసర విషయాల గురించిన వాదనలు, ఘర్షణలు చేయవద్దు. దీని వలన మీ అమూల్యమైన దుఆల సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్ వీటిని నిషేధించాడు. సూరహ్ బఖరా 2:197 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు  హజ్ సమయంలో అతడు కామచేష్టలకూ, దుష్కార్యాలకూ, ఘర్షణలకూ దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం అల్లాహ్ కు తెలుస్తుంది’. కాబట్టి హజ్ యాత్రకోసం సంకల్పం (నియత్) చేసుకున్న ప్రతి ఒక్కరు, అన్ని విధాల తప్పుడు మాటలను, అశ్లీలపు (బూతు)  పదాలను పలుకరాదు. నాలుకను పూర్తిగా అదుపులో ఉంచుకోవలెను. ఏదేని కారణం వలన అల్లాహ్ యొక్క ధ్యానంలో, స్మరణలో నాలుకను బిజీగా ఉంచలేకపోయినా, అనవరపు నిషేధించబడిన మాటలలో దానిని బిజీ చేయవద్దు. కాబట్టి ప్రతి హజ్ యాత్రికుడు అరఫాత్, మీనా, ముజ్దలిఫాలలోని ఈ ఉత్తమమైన సమయాన్ని తమకు ఇహపరలోకాలలో ప్రయోజనం కలిగించే ఇస్లామీయ ధర్మవిషయాలు నేర్చుకోవటంలో, తోటివారికి సహాయ పడటంలో, అల్లాహ్ యొక్క ధ్యానంలో, వివిధ ఆరాధనలలో, ప్రార్థనలలో పూర్తిగా గడపవలెను. హాని కలిగించే విషయాల నుండి, మాటల నుండి, సమయాన్ని వృధా చేయటం నుండి దూరంగా ఉండవలెను.

5.    ఇస్లాం ధర్మం ప్రకారం జీవిస్తున్న స్నేహితుడితో హజ్ యాత్ర చేయటానికి ప్రయత్నించండి. తోటివారిలో అటువంటి వ్యక్తిని కనిపెట్టి వారితో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించవలెను.

6.    మీకు అందజేయబడిని వివధ ఇస్లామీయ కార్యక్రమముల నుండి ప్రయోజనం పొందటానికి ప్రయత్నించవలెను.

7.    మీ గ్రూపులోని ముఅఁల్లిమ్ (బాధ్యులైన వారు) అనుమతి లేకుండా ఆయా ప్రాంతాల నుండి వేరే చోటుకి వెళ్ళవద్దు. మీకు వేరే చోటుకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడినట్లయితే, ఆరోగ్యం పాడైతే, అలసిపోతే, మీ గ్రూపు ముఅఁల్లిమ్ (సూపర్ వైజరు)కు వెంటనే తెలియజేయవలెను. దీని వలన మీకు త్వరగా సహాయం అందించటానికి అవకాశం ఉంటుంది.

8.    ప్రయాణ సౌలభ్యం కోసం మన కేంద్రం నుండి హజ్ కు వెళ్ళుతున్న వారందరినీ కొన్ని గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకు ఒక్కో ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్)ను నియమించటం జరుగుతుంది. మీకు కేటాయించబడిన గ్రూపు పేరు (నెంబరు), ముఅఁల్లిమ్ పేరు, మొబైల్ నెంబరు, మీనాలోని టెంట్ నెంబరు తప్పక గుర్తుంచుకోవలెను. ఒక గ్రూపులోని వారు వేరే గ్రూపువారితో అనుమతి లేకుండా ఎక్కువ సమయం గడపటం నిషేధించబడినది.

9.    హజ్ యాత్ర మొదలైనప్పటి నుండి తిరిగి వచ్చేవరకు పొగత్రాగటం (సిగరెట్) పూర్తిగా నిషేధించబడినది. ఒంటరిగా ఉన్నా (బాత్రూమ్ లోనైనా సరే), అందరితో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, తమ తమ టెంట్ లలో ఉన్నా – ఏ సమయంలోను మొత్తం హజ్ యాత్రలో అస్సలు పొగత్రాగరాదు.

10. విశ్రాంతి, విరామ సమయాలలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించవలెను.

11. మీకు ఏదైనా సందేహం కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మీ గ్రూపుకు బాధ్యత వహిస్తున్న ధర్మ ప్రచారకుడిని (దాయిని) వెంటనే సంప్రదించవలెను. ఇన్షా అల్లాహ్ మీకు సరైన సహాయం ఉత్తమమైన రీతిలో వెంటనే లభిస్తుంది.  అలా వీలుపడక పోతే కనీసం మీతో ఉన్న ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్) నైనా సంప్రదించ వలెను.

5. క్రింది విషయాలను మరచిపోవద్దు.

1.    ఇన్షా అల్లాహ్ మన హజ్ ప్రయాణం జిల్ హజ్ నెల 6వతేదీ అంటే 15th Dec 2007, శనివారం నాడు ప్రారంభం కాబోతున్నది.

2.    మీతో పాటు ఒరిజినల్ ఇఖామా తో పాటు దాని ఫోటోకాపీ కూడా తీసుకు రావలెను.

3.    ఉదయం 11.30 గంటలకు మస్జిదె సుదైరీ, రబువా ప్రచార కేంద్రం దగ్గర తప్పక హాజరు కావలెను.

4.    స్వంత బట్టలు, ఇహ్రామ్, బెల్టు, సబ్బు, రబ్బరు చెప్పులు, టూత్ బ్రష్, టూత్ పేష్టు మొదలైన పర్సనల్ వస్తువులు ఒక చిన్న బ్యాగులో సర్దుకుని  వెంట తీసుకు రావలెను. దీనిని బస్సు క్రింది భాగంలోని లగేజీ ప్రాంతంలో ఉంచవలెను. ఇంకో ఇహ్రామ్ మరియు బెల్టు మాత్రం వేరే చేతిసంచి (ప్లాష్టిక్) లో బస్సులోని తమ తమ సీటు పై భాగంలో ఉంచవలెను.

5.    హజ్ యాత్రకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన పుస్తకాలు ముందుగానే మీకివ్వబడును. దీనితో పాటు దివ్యఖుర్ఆన్ భావం యొక్క తెలుగు అనువాదం కూడా ఇవ్వబడును.

6.    హజ్ లో ఖుర్బానీ ఇవ్వటం కోసం అవసరమైన ధనం మీతో పాటు ఉంచుకో వలెను.

7.     మీతో పాటు బ్లాంకెట్లు, పరుపులు తీసుకు రావద్దు. అవసరమైన చోట అందజేయబడును.

8.    ప్రతి ఒక్కరు తోటి ప్రయాణికుడికి వీలయినంతగా సహాయసహకారాలు అందజేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను. వారు కూడా మీలాగే అల్లాహ్ యొక్క గౌరవ అతిథులనే విషయం మరచిపోవద్దు.

6. అత్యంత ముఖ్యమైన విషయం

ఇక్కడ నుండి మా గ్రూపులో బయలుదేరిన హజ్ యాత్రికులందరూ, తిరిగి ఇక్కడకు వచ్చే వరకు ఎట్టిపరిస్థితులలోను ఎటువంటి కారణం వలనైనా సరే, గ్రూపును వదలకూడదు. ఎవరైనా తమ దూరదేశాల నుండి హజ్ కోసం వచ్చిన బంధువులను, స్నేహితులను కలవాలనే ఆలోచనలతో ఉన్నట్లయితే, ఇప్పుడే మాకు తెలియజేయవలెను. మక్కా చేరిన తర్వాత, మా గ్రూపును వదిలి వేరే వారితో గడపటం పూర్తిగా నిషేధించబడినది. ఇది మనందరి శ్రేయస్సుకోసం లాభదాయకం.

7. ఎమర్జన్సీ సందర్భంలో సంప్రదించ వలసిన వ్యక్తుల ఫోను నెంబర్లు చిన్న పేపరు పై వ్రాసుకుని ఎల్లప్పుడూ దగ్గరగా ఉంచుకోవలెను. మధ్య మధ్యలో వారికి ఫోను చేసి మీ క్షేమసమాచారములు తెలియజేస్తూ ఉండవలెను.

8.హజ్ యాత్ర నుండి తిరుగు ప్రయాణంలో తీసుకు రావలసిన ముఖ్యమైన సందేశం.

హజ్ యాత్రలో ఎక్కువ సమయం స్మరిస్తూ, పలుకుతూ, వింటూ గడిపిన తల్బియా (లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లాషరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద, వన్నేమత, లకవుల్ ముల్క్, లాషరీక లక్) లోని లాషరీక లక్ అనే పవిత్ర ప్రవచనాన్ని జీవితాంతం పాటించాలనే దృఢసంకల్పం. ఇక నుండి కేవలం ఒక్క అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాస్యం చేయననే తిరుగులేని నిర్ణయం. ఏ చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఇక నుండి కేవలం అల్లాహ్ నే వేడుకోవాలనే కృతనిశ్చయం – ఇయ్యాక నాఅఁబుదు ఇయ్యాక నస్తయీన్ (కేవలం నిన్నే ఆరాధిస్తాను మరియు సహాయం కోసం కేవలం నిన్నే అర్థిస్తాను) పై అచంచల విశ్వాసం. లబ్బైక్ – అల్లాహుమ్  లబ్బైక్ (హాజరయ్యాము, యా అల్లాహ్ హాజరయ్యాము) – అనే పవిత్ర ప్రవచనాలను అల్లాహ్ కు డైరక్టుగా ఎటువంటి మధ్యవర్తులు (ఇమాములు, ముజావర్లు, పూజారులు) లేకుండా విన్నవించుకుంటున్నామో, హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా సుఖసంతోషాలలో, కష్టనష్టాలలో మన వేడుకోళ్ళను కేవలం అల్లాహ్ కే సమర్పించుకోవాలనే ఏకైక లక్ష్యం. మనల్ని ప్రతి క్షణం గమనిస్తాడనే కఠోర సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అల్లాహ్ ఇష్టపడే విధంగా మన శేషజీవితాన్ని ఇస్లాం ధర్మం ప్రకారం జీవించాలనే తపన & కృషి.

9. అల్లాహ్ మీ హజ్ యాత్రను స్వీకరించుగాక!

10. హజ్ మబ్రూర్…………………….. హజ్ మబ్రూర్………………………………. హజ్ మబ్రూర్

మీలాదున్నబీ – సంభాషణ (Milad-un-Nabee)

బిస్మిల్లాహ్
టైటిల్: మీలాదున్నబీ – సంభాషణ – Download

అనువాదకులు : సలీం సాజిద్ అల్ మదనీ
పునర్విచారకులు : అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్

క్లుప్త వివరణ: ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది – వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.


బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

జునైద్: అస్సలాము అలైకుమ్

అబ్దుల్లాహ్: వ అలైకుమ్ అస్సలామ్. ఏంటి పొద్దున ఇలా వచ్చారు? ఇవ్వాళ షాపు దగ్గరికి వెళ్ళలేదా?

జునైద్: ఇవ్వాళ మిలాదున్నబీ కదా! బజార్లో దుకాణాలన్నీ కూడా మూసే ఉంటాయి.

అబ్దుల్లాహ్: అంటే మీరు ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారన్న మాట.

జునైద్: ఎందుకని అడిగారు? మీరు జరుపుకోవటం లేదా?

అబ్దుల్లాహ్: ఇస్లాంలో మనకు పండుగలు రెండే కదా!

1) ఈదుల్ ఫిత్ర్
2) ఈదుల్ అజహా

జునైద్: ఈ మూడో పండుగ, ఈదె మీలాదున్నబీ కూడా ఉంది కదా!

అబ్దుల్లాహ్: అలాగా! మరయితే ఈదె మీలాదున్నబీ రోజున మనం ఈద్గాహ్ కు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నామా?

జునైద్: ఈదె మీలాదున్నబీ రోజునయితే ఈద్గాలో చేసే ప్రార్థనలే లేవు కదా?

అబ్దుల్లాహ్: మరి మిగతా రెండు పండుగ రోజుల్లో నమాజులు ఎందుకు చేస్తున్నాం?!

జునైద్: అవి చేయాలి కాబట్టి చేస్తున్నాం.

అబ్దుల్లాహ్: అదే; అవి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాను.

జునైద్: ఎందుకంటే ఆ నమాజులు చేయమని మనకు ఆజ్ఞాపించబడింది.

అబ్దుల్లాహ్: ఈదె మీలాద్నుబీ రోజున నమాజు చేయాలని ఆజ్ఞాపించబడలేదా మరి?!

జునైద్: ఆజ్ఞాపించబడలేదేమో! అందుకనేగా ఎవరూ ఆ రోజు ఈద్గాహ్ కు వెళ్ళి నమాజ్ చేయనిది!

అబ్దుల్లాహ్: నమాజు సంగతి పక్కన పెడదాం. అసలు మీలాదున్నబీ జరుపుకోవాలని ఎక్కడైనా రాసి ఉందా?

జునైద్: అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు నేనెక్కడా వినలేదు. అలాగని జరుపుకోరాదని కూడా ఎక్కడా లేదుగా?!

అబ్దుల్లాహ్: మరి ఆ రోజు పండుగ నమాజు జరుపుకో రాదని మాత్రం ఎక్కడయినా ఉందా?!

జునైద్: లేదు, అలాంటిదేమీ లేదు.

అబ్దుల్లాహ్: మరి మీరు ఆరోజు పండుగ ప్రార్థన ఎందుకు చేయరు?

జునైద్: అసలు మీరు ఏం చెప్పదలచుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.

అబ్దుల్లాహ్: నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇస్లాంలో ఈ పండుగకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవు. ఒకవేళ ఈ పండుగ గనక నిజంగా ఉండి ఉంటే ఇతర రెండు పండుగల్లాగా ఈ పండుగ రోజు కూడా నమాజు చేయబడేది. హదీసుల్లో దాని ప్రాధాన్యత వివరించబడేది. దాని ఆదేశాల గురించి, నియామాల గురించి దైవప్రవక్త వివరించి ఉండేవారు.

జునైద్: అంటే ఈ పండుగ జరుపుకునేవారు తప్పు చేస్తున్నారని నీ అభిప్రాయమా?

అబ్దుల్లాహ్: ముస్లింల ఆచరణ పేరు ఇస్లాం కాదు, ఖుర్ఆన్ హదీసుల వివరణే ఇస్లాం. ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కానిది ఇస్లాం ధర్మం కాదు. ఎవరయినా ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కాని దానిని ధర్మంగా భావిస్తున్నట్లయితే అతను ధర్మంలో కల్పితానికి పాల్పడుతున్నాడన్న మాట. అది ఘోరనేరం. దాన్ని ‘బిద్అత్’ అంటారు. బిద్అత్ లకు దూరంగా ఉండమని దైవ ప్రవక్త (సల్లల్లా హు అలైహి వ సల్లం) తన అనుచర సమాజాన్ని ఎంతగానో హెచ్చరించారు.

జునైద్: దైవప్రవక్త సహచరుల (సహాబాల) వారి శిష్యుల (తాబయీన్ల) కాలంలో ఎవరయినా ఈ పండుగ జరుపుకునేవారా?

అబ్దుల్లాహ్: ప్రసక్తే లేదు. సహాబాల, తాబయీన్ల తర్వాత ఏ ఇమామూ, ఏ హదీసువేత్త కూడా ఈ పండుగ జరుపుకోలేదు. అహెలె-సున్నత్ కు చెందిన నలుగురు ఇమాముల్లో ఎవరూ కూడా అసలు ఈ పేరు సైతం వినలేదు. ఈ కొత్త పోకడ (బిద్అత్) హిజ్రీ  శకం 625 నుంచి మొదలైంది.

జునైద్: అది సరే. నాదొక చిన్న సందేహం. ఒక ముస్లిం తనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పుకుంటూ ఆయన పుట్టిన రోజున, ఆయన గౌరవార్థం ఏ కార్యమూ చేయకుండా గడిపేయటం భావ్యమా చెప్పండి?!

అబ్దుల్లాహ్: అవునండీ, అదే భావ్యం. ఎందుకంటే సహాబాలుగాని, వారి శిష్యులుగాని, సలఫ్ పండితులుగాని ఈ పండుగ జరుపుకున్నట్లు మీకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇకపోతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ప్రేమాభిమానాల సంగతి! ఖుర్ఆన్ గ్రంధాన్ని, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) చూపిన విధానాన్ని అనుసరించటం ద్వారా అవి వ్యక్తమవు తాయిగాని ఆయన పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం ద్వారా కాదు. క్రీ.శ. 625కు పూర్వం గడిచిన ప్రజలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద ప్రేమ లేదంటారా? దైవప్రవక్త ( సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ కాలాన్ని ఉత్తమ కాలంగా అభివర్ణించారు మరి!

జునైద్: క్రైస్తవులు తమ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ (ఈద్ మిలాద్) జరుపు కుంటారు. మన ప్రవక్త, ప్రవక్తలందరిలో కెల్లా గొప్పవారు. అలాంటప్పుడు మన ప్రవక్త పుట్టిన రోజును మనం జరుపుకోకుండా ఎలా ఉంటాం?

అబ్దుల్లాహ్: క్రైస్తవులు తమ ప్రవక్తను ‘దేవుడు’, దేవుని కుమారుడు అంటారు. మరి వారికి పోటీగా మనం కూడా మన ప్రవక్తను ‘దేవుడు,’ ‘దేవుని కుమారుడు’ అని అందామా? మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకనేగా ఖుర్ఆన్, హదీసులు క్రైస్తవుల్ని మార్గ విహీనులుగా ఖరారు చేస్తున్నాయి. వాళ్లంతా తమ ప్రవక్త బోధనలకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. క్రిస్మస్ కూడా క్రైస్తవులు తాము స్వయంగా కల్పించుకున్న ఆచారమే తప్ప ఈసా ప్రవక్త దాని గురించి బోధించలేదు.

జునైద్: మిలాదున్నబీ పండుగ దురాచారమయితే కాదు కదా! అది మంచి ఆచారమే కదా!

అబ్దుల్లాహ్: అది మంచి ఆచారమే అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహ చరులు ఆ పండుగ ఎందుకు జరుపుకోలేదు? ఆ కాలంలో పండుగ జరుపుకోవటానికి వారి దగ్గర డబ్బులు లేకనా? సంవత్సరానికి రెండు పండుగలు జరుపుకునేవారికి ఇంకొక్క పండుగ భారమవుతుందా?

జునైద్: ప్రవక్త సహచరుల కాలంలో జరగని చాలా పనులు ఈ కాలంలో జరుగుతున్నాయి. ఈ రోజు మనం మోటారు వాహనాల్లో, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. మరి మీరు ప్రవక్త సహచరుల ఇస్లాంను అనుసరిస్తూ గాడిదలపై, గుర్రాలపైనే స్వారీ చేయవచ్చు కదా!

అబ్దుల్లాహ్: అయ్యా! విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల వల్ల ఇస్లాం కల్పితం కాదు. ధర్మంలో నూతన పోకడల వల్ల ఇస్లాం కల్పితం అవుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిం చారు: “ఎవరైనా ధర్మంలో ఏదైయిన కొత్త విషయాన్ని సృష్టిస్తే దాన్ని తిరస్కరించాలి” (సహీహ్ బుఖారి, ముస్లిం). దీని గురించి వివరిస్తూ హాఫిజ్ ఇబ్నెహజర్ (రహిమహుల్లాహ్) ఏమన్నారో చూడండి: “నూతన విషయం అంటే ధర్మంలో నూతన విషయం. ధర్మంలో ఎవరైనా నూతన విషయాలను జొప్పిస్తే దాన్ని తిరస్కరించాలన్నమాట” (ఫత్ హుల్ బారీ 5/322). దీని ద్వారా అర్థమయ్యిందేమిటంటే ప్రతి కొత్త విషయం ఖండించదగింది కాదు. ధర్మంతో, ధర్మజ్ఞానంతో సంబంధం ఉన్న వినూత్న కల్పితాలు మాత్రమే ఖండించదగినవి. అలాంటి కొత్త విషయాలను ధర్మంలో భాగంగా, పుణ్యప్రదంగా భావించి చేస్తే అలాంటి నూతన విషయాలన్నీ ఖండించదగినవే. ఇకపోతే ప్రాపంచిక విషయాలంటారా?! వాటి గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు! “ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. వారు వాటిపై స్వారీ చేయటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి, ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు.” (సూరయె నహ్లి:8). ఆ కాలంలో ప్రజలకు తెలియని వస్తువులను, వాహనాలను కూడా ఉపయోగించవచ్చని పై ఆయతుల్లో అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు. అంటే ధర్మ సమ్మతమైన రీతిలో విజ్ఞాన శాస్త్రం ద్వారా ఉనికిలోకి వచ్చిన వినూత్న ఆవిష్కరణ లన్నిటినీ మనం ఉపయోగించవచ్చన్నమాట.

జునైద్: మరి సంతానం కలిగినప్పుడు వేడుక ఎందుకు జరుపుకుంటారు?

అబ్దుల్లాహ్: ఎందుకంటే సంతానం కలిగిన ఏడవ రోజున ‘అఖీఖా’ చేయమని షరీఅతు (ఇస్లామీయ ధర్మ శాస్త్రం) స్వయంగా ఆదేశించింది. ఏ పని చేయమని అయితే షరీఅత్ ఆదేశిస్తుందో అది ధర్మమైపోతుంది.

ఇప్పుడు చెప్పండి! రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపమని షరీఅత్ ఆదేశించిందా? లేక అలా చేయమని ఎవరైనా బోధించి ఉన్నారా? లేదు. షరీఅత్ లో అటువంటి ఆజ్ఞ ఏదీ లేదు, ప్రవక్తగాని ఆయన సహచరులుగాని దీని గురించి బోధించలేదు. అదీగాక సంతానం పుట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే వేడుక జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కాదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలై హి వ సల్లం) ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారా ఏమి? సంతానం పుట్టిన తర్వాత ఏదో రోజు వేడుక జరుపుకుంటారు. అదే రోజు వేడుక జరుపుకోవటమనేది ఎక్కడా లేదు. అదీ ఆ ఒక్క రోజు! ప్రతి యేడు కాదు!

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినప్పుడు అబూలహబ్ ఒక బానిసరాలిని విడుదల చేశాడని చెబుతారు?!

అబ్దుల్లాహ్: చేశాడు.. నిజమే! అది ఎందుకు? తనకు భాతృజుడు కలిగాడన్న ఆనందంతో అతను అలాచేశాడు. అంతేగాని ప్రపంచంలో ఒక గొప్ప ప్రవక్త పుట్టాడని అతను బానిసరాలిని విడుదల చేయలేదు సుమా! అది గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఈ పని పుణ్యప్రదమైనదే అయితే తనకు ప్రవక్త పదవీ బాధ్యతలు లభించిన తరువాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్లీ ఎప్పుడన్నా అలా చేయమని ఆదేశించారా? ప్రపంచంలోని ఇతర జనాల్లాగే అబూలహబ్ కూడా తనకు భాతృజుడు కలిగాడని తెలియగానే సంబరపడ్డాడు. ఏ ఇంట పిల్లవాడు పుట్టినా ఆ ఇంటి వారికి ఆనందం కలగటమనేది సహజం. అతను ఆ రోజును పండుగగా తలచి బానిసను విడుదల చేయలేదు. దైవప్రవక్త పదవీ బాధ్యతల పట్ల అబూలహబ్ కు ప్రేమ ఉన్నట్లయితే అతను జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ద్వేషిస్తూ ఉండేవాడు కాదు. అతన్ని, అతని భార్యను శపిస్తూ ఖుర్ఆన్లో ఒక సూరా సాంతం అవతరించేది కాదు. అలాంటప్పుడు అబూలహబ్ చేసినదాన్ని సమర్ధిస్తూ మిలాదున్నబీ పండుగ జరుపుకుంటున్నట్లయితే అది దైవప్రవక్త సంప్రదాయం కాదు, అబూలహబ్ సంప్రదాయం.

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టిన తేది విషయంలో చరిత్రకారుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయని చెబుతుంటే విన్నాను. అసలు వాస్తవం ఏమిటి?

అబ్దుల్లాహ్: అల్లాహ్ అభీష్టం మేరకే అలా జరిగింది. ఇస్లాం ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచటానికి, ఇస్లాంలో ఇటువంటి కల్పనలు జరగకుండా ఉండటానికి అల్లాహ్ వారిని ఒకే అభిప్రాయం మీద నిలబడనీయలేదు. ఇప్పటివరకూ మేము చెబుతూ వస్తున్నది కూడా అదే కదా! పూర్వం ప్రజలు ఈ పండుగ జరుపుకునేవారు కాదు. తర్వాత కాలంలోనే ఈ ఆచారం సృష్టించబడింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని, ఆయన సహచరులు గాని రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపుకొని ఉన్నట్లయితే ముస్లింలందరూ ఆ తేదిని బాగా గుర్తు పెట్టుకునేవారు. ఇక ఆ తర్వాత ఆ తేది విషయంలో ముస్లింల మధ్య భేదాభిప్రాయమే నెలకొని ఉండేది కాదు.

జునైద్: సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినరోజు పండుగ మొదటి నుంచి జరుపు కోవటం జరగలేదని నేను ఒప్పుకుంటున్నాను. మరి నేటి వైజ్ఞానిక యుగంలోనూ దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) గారి నిజమైన పుట్టిన తేది కనుగొనబడ లేదేమిటి?

అబ్దుల్లాహ్: చూడండి! ఆయన మరణించిన తేది రబీవుల్ అవ్వల్ 12 అన్న విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇకపోతే ఆయన పుట్టిన తేది గురించి జరిపిన ఆధునిక పరిశోధనల్లో తేలిందేమిటంటే ఆయన పుట్టింది రబీవుల్ అవ్వల్ 9వ తేదిన. ఖాజీ సులైమాన్ గారి ‘రహ్మతుల్లిల్ ఆలమిన్’ గ్రంధంలో, మౌలానా షిబ్లీ నోమానీ గారి “సీరతున్నబీ” గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.

జునైద్: అసలు ఈ మిలాదున్నబీ పండుగ ఎక్కణ్ణుంచి ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది?

అబ్దుల్లాహ్: ఇదెక్కడి వింతండి బాబూ? ఒక విషయాన్ని వారు కనిపెట్టి దాని ఆధారాలు మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలం నుంచి – ఇమాములు, హదీసువేత్తలకాలం వరకు ఈ పండుగ ఆనవాళ్లు కూడా చరిత్రలో కనిపించవు. ఈ ఆచారం హిజ్రీ  శకం 625 నుంచి ప్రారంభమైంది. ధర్మజ్ఞానం లేని కొందరు మనుషులు ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారు.

జునైద్: నిజంగా ఇది అన్యాయమే కదా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు చేయని పనిని మనమెందుకు చేయాలి?

అబ్దుల్లాహ్: జజాకల్లాహ్ ఖైరా! నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకున్నందుకు అల్లాహ్  నాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను.

జునైద్: మీరు చెప్పిన మాట అర్థమయింది. ఇంకొక చిన్న సందేహం. ఈ పండుగ జరుపుకునేవారు సామాన్యంగా మంచి ఉద్దేశ్యంతోనే చేస్తారు. మరో వైపు హదీసులో ఇలా ఉంది కదా! “ఆచరణలన్నీ సంకల్పం (ఉద్దేశం) పైనే ఆధారపడి ఉంటాయి”.

అబ్దుల్లాహ్: మీకు ఏదైనా సహీహ్ హదీసు చూపించి అది నా ఆచరణలకు భిన్నంగా ఉందని చెబితే అటువంటి సమయంలో వారు “మా మౌల్వీ సాహెబ్ గారు అలాగే చేస్తాము” అని చెప్పి దాటవేస్తారు. ఇప్పుడు మీకు సహీహ్ హదీసు గుర్తొచ్చింది. కాని మేమలా చేయము. ఆ హదీసు నూటికి నూరు పాళ్లు కరెక్టే. కాని బిద్అత్ అంటే ఏమిటో తెలుసా? ఆ ఆచరణ మంచి ఉద్దేశంతోనే చేయబడుతుంది. కాని అసలు ఆ పనిమాత్రం చెడ్డదై ఉంటుంది. స్వీకారానికి అనర్హమై ఉంటుంది. అల్లాహ్ సమక్షంలో ఒక పని స్వీకృతికి నోచుకోవాలంటే ఒకటి: ఆ పని మంచి ఉద్దేశంతో చేయ బడి ఉండాలి. రెండు: అది సున్నత్ కు అనుగుణంగా జరిగి ఉండాలి. ఈ రెండు నియమాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ ఆచరణ స్వీకరించబడదు. ఖుర్ఆన్ హదీసుల్లో చాలా చోట్ల ఈ విషయం పస్తావించబడింది.

జునైద్: మిలాదున్నబీ పండుగ చేస్తే అసలు ఎటువంటి పుణ్యం లభించదంటారా?

అబ్దుల్లాహ్: అసలు దాని ఉనికే ఇస్లాంలో లేనప్పుడు అది పుణ్యకార్యం ఎలా అవుతుంది చెప్పండి. పైగా ఇదొక బిద్అత్ (కొత్త పోకడ). ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడటం సామాన్యమైన నేరం కాదు సుమా! మీరు పుణ్యం ఏమిటి అని అడుగుతున్నారు. అసలు పరలోకంలో ఇటువంటి వారికి కౌసర్ సరస్సు నీళ్ళు కూడా లభించవు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా వారిని తమ దగ్గరకు రానీరు. ఒక హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పి ఉన్నారు:

“ప్రళయదినాన నేను నా అనుచర సమాజం వారికి కౌసర్ సరస్సు నుంచి నీళ్లు త్రాపుతూ ఉంటాను. అప్పుడు నా అనుచర సమాజంలోని కొందరిపై దైవదూతలు లాఠీచార్జీ చేస్తుంటారు (వుజూ ప్రభావం మూలంగా వారి కాళ్ళు, చేతులు ప్రకాశిస్తూ ఉంటాయి). వారు ఏం తప్పు చేశారని వాళ్ళని కొడ్తున్నారు అని నేను అడుగుతాను. వాళ్లను నా దగ్గరికి రానీయండి వారు నా అనుచరులే అని అంటాను. అప్పుడు దూతలు సమాధానం ఇస్తారు: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీ తదనంతరం వీళ్ళు ధర్మంలో ఎటువంటి మార్పులు చేశారో మీకు తెలియదు”. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వాళ్ళని దూరంగా తరిమేయండి. ఎందుకంటే నా తదనంతరం వాళ్ళు నా ధర్మంలో మార్పులు చేశారు. అందులో కొత్త ఆచారాలు కల్పించారు” అని విసుక్కుంటారు.”

జునైద్: అమ్మో! విషయం చాలా భయంకరమైనదే! మీరు నాకు ఈ హదీసు వినిపించి నా కళ్లు తెరిపించారు. మీరు నాకు సరైన మార్గం చూపినందుకు అల్లాహ్ మీకు మేలు చేయుగాక! ఇన్షా అల్లాహ్ నేను కూడా నా స్నేహితులు, బంధువులందరికీ ఈ విషయం తెలియజేసి వారికి సరైనమార్గం చూపుతాను. వారు అన్ని రకాల బిద్అత్ లను, దురాచారాలను వదలిపెట్టి సరైన మార్గంలో నడిచేలా చేస్తాను.

అబ్దుల్లాహ్: అల్లాహ్ మనందరికి సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమిన్

రాసినవారు: మౌలానా అబ్దుల్ ఖుద్దూస్ సలఫీ ముహమ్మద్ సలీమ్ సాజిద్ అల్ మదనీ రియాద్.
పున:పరిశీలించిన వారు: షేఖ్ అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్

దివ్యఖుర్ఆన్ మరియు దాని విభజన (The Divison of Quran into Parts)

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : సయ్యద్ యూసుఫ్ పాషా

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం

దివ్యఖుర్ఆన్ లోని విభిన్న విషయాలకు అనుగుణంగా మరియు ఒక నిర్ణీత సమయంలో దానిని పూర్తిగా పఠించే పాఠకుల సౌకర్యానికి అనుగుణంగా ఆ దివ్యగ్రంథం అనేక అధ్యాయాలుగా, భాగాలుగా, అంశాలుగా విభజించబడినది. ఈ విభజనకు ఇవ్వబడిన అరబీ భాషా పదాలు – మన్ జిల్,  జుజ్, సూరహ్, రుకూ మరియు ఆయహ్. ఒక్కో అనువాదంలో ఈ అరబీ పదాలు ఒక్కో విధంగా అనువదించబడినవి. అంటే వేర్వేరు అనువాదములలో వీటికి వేర్వేరు అర్థములు, వివరణలు వేర్వేరుగా ఇవ్వబడెను. కాని తరచుగా సూరహ్, ఆయహ్ వంటి కొన్ని పదములను వాటి అసలు భాష అయిన అరబీ భాషలోనే వాడటం జరుగుతున్నది. అంతే కాని, అరబీ భాషాపదాలకు బదులుగా వాటి అనువాదపు పదములు అంతగా వాడుకలో లేవు.

– ఆయహ్ آية

ఆయహ్ అనేది ఖుర్ఆన్ యొక్క ఒక యూనిట్ అంటే ఒక అతి చిన్నభాగం, ఇది అల్లాహ్ తరఫున మానవజాతికి పంపబడిన మార్గదర్శకత్వము. కాబట్టి, ఖుర్ఆన్ యొక్క ఆ అతి చిన్నభాగాలు ఆయహ్ అంటే అల్లాహ్ యొక్క వివేకానికి చిహ్నాలు అని పిలవబడటంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ఖుర్ఆన్ అనేది ఒక కావ్యగ్రంథం కాదు కాబట్టి, ఆయహ్ కు బదులుగా వచనం, శ్లోకం లేదా సూక్తి అనే పదాలు వాడటం సరైన పద్ధతి కాదు. ఖుర్ఆన్ లోని ప్రతి ఆయహ్ ఒకే సైజులో ఉండదు. వేర్వేరు సూరహ్ లలో వేర్వేరు సైజులలో ఉన్నది. కేవలం రెండే అక్షరాలతో ఒక్కో ఆయహ్ అతి చిన్న సైజులో ఉండవచ్చు లేదా అనేక పదాలతో పెద్ద సైజులో ఉండవచ్చు. ఉదాహరణకు ‘హా-మీమ్’ అనేది ఖుర్ఆన్ లోని అతి చిన్న ఆయహ్. దీనిలో కేవలం రెండే అక్షరాలు ఉన్నాయి. ఖుర్ఆన్ లో ఒక్కోచోట ఆయహ్ యొక్క  పరిమాణం ఆయతుల్ కుర్సీ అంతటి పెద్దది కూడా కావచ్చు. అది అరబీభాషా వ్యాకరణంలోని ఏ నియమం పైనా ఆధారపడిలేదు. కాబట్టి ఆయహ్ యొక్క సైజును లేదా ఆయహ్ యొక్క విభజనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన ప్రకారం మాత్రమే స్వీకరించవలెను. ఖుర్ఆన్ లో మొత్తం ఎన్ని ఆయహ్ లు ఉన్నాయి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే దివ్యఖుర్ఆన్ లో కనీసం 6500 ఆయహ్ లు ఉన్నాయనేది పండితుల అభిప్రాయం.

– సూరహ్ سورة

సూరహ్ (బహువచనం సువర్) అంటే అరబీ భాషాపరంగా వరుస, పంక్తి, క్రమము, కంచె అని అర్థం. అయితే సాంకేతిక భాషాపరంగా సూరహ్ అనేది విభజింపబడిన ఖుర్ఆన్ గ్రంథపు భాగాలకు ఇవ్వబడిన పేరు. దివ్యఖుర్ఆన్ లో 114 సూరహ్ లు ఉన్నాయి. అవన్నీ ఒకే సైజులో లేవు. అతి చిన్ని సూరహ్ లో కేవలం మూడే ఆయహ్ లు ఉన్నాయి. ఉదాహరణ – సూరహ్ అల్ అసర్, సూరహ్ అన్నస్ర్ మరియు సూరహ్ అల్ కౌథర్. అతి పెద్ద సూరహ్ అయిన అల్ బఖరహ్ లో 286 ఆయహ్ లు ఉన్నాయి. మనం చదివే ఇతర గ్రంథాల మాదిరిగా దివ్యఖుర్ఆన్ లో సూరహ్ ల(భాగాల) విభజన విషయం, చర్చ లేదా అంశం ఆధారంగా జరుగలేదు. సూరహ్ లో చర్చించబడుతున్న విషయం ఆకస్మికంగా ఒక అంశం నుండి వేరే అంశానికి మారడాన్ని పాఠకులు తరచుగా గమనిస్తారు. ఇతర ఏ గ్రంథంలోనూ కనబడని ఈ ప్రత్యేకతే దివ్యఖుర్ఆన్ కు ఒక విశేష గుర్తింపును ఆపాదిస్తున్నది. అలాగే, ఒక సూరహ్ లో మరల చిన్న అధ్యాయాలు గాని, పేరాలు గాని లేవు. కాబట్టి అధ్యాయం అవేది ‘సూరహ్’ అనే ఈ అరబీ పదానికి అనువాదం కాజాలదు.

– రుకూ رُكو

రుకూ అనబడే చిన్న భాగాలుగా ఖుర్ఆన్ లోని సూరహ్ లు విభజింపబడినవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో గాని లేదా వారి సహచరుల (సహాబాల) కాలంలో గాని జరుగలేదు. తర్వాత కాలంలో హజ్జాజ్ బిన్ యూసుఫ్ అనే ఒక ఇస్లామీయ రాజ్యపాలకుని అధ్వర్యంలో పాఠకుల సౌలభ్యం కోసం ఖుర్ఆన్ లోని సూరహ్ లు రుకూలుగా విభజింపబడినవి. ఖుర్ఆన్ లో ع అనే అరబీ అక్షరం, దాని పై నుండే సంఖ్యల ద్వారా అవి గుర్తింప బడును.

– జుజ్ جُز

జుజ్ అనబడే దాదాపు 30 సమానమైన భాగాలుగా ఖుర్ఆన్ విభజింబడినది. పాఠకులు సులభంగా పఠించడానికి, ప్రత్యేకంగా రమదాన్ పవిత్ర మాసంలో ప్రతి రాత్రి పఠించడానికి వీలుగా ఇలా విభజింపబడినది. ఈ భాగాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల (సహాబాల) కాలంలో కూడా ఉండేవని ఔస్ బిన్ హుదైఫా ఉల్లేఖించిన ఈ హదీథ్ ద్వారా తెలుస్తున్నది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వారి సహచరులు (సహాబాలు) ఖుర్ఆన్ ను ఎలా విభజించినారని సహాబాలను ఔస్ బిన్ హుదైఫా ప్రశ్నించగా, వారు ఇలా జవాబిచ్చినారు, “మూడో వంతు, ఐదో వంతు, ఏడో వంతు, తొమ్మిదవ వంతు, పదకొండవ వంతు, పదమూడవ వంతు & ముఫశ్శిల్ నుండి చివరి వరకు”.

– హిజ్బ్

ఖుర్ఆన్ లోని ప్రతి జుజ్ నాలుగు హిజ్బ్ లుగా విభజింపబడినది. మరల ప్రతి హిజ్బ్ నాలుగు భాగాలుగా విభజింపబడినది – పేజీ ప్రక్కభాగంలో నిర్ణీత ఆయహ్ లకు ఎదురుగా నాలుగింట మొదటిది రుబు (1/4), నాలుగింట రెండోది నిస్ఫ్ (1/2) మరియు నాలుగింట మూడోది థులుథ్ (3/4) అని సూచింపబడి ఉండును.

– మన్జిల్ منزل

ఖుర్ఆన్ గ్రంథం మరల మన్జిల్ అనబడే సమానమైన ఏడు భాగాలుగా విభజింపబడినది. ఇది మన్జిల్ منزل అనే చిహ్నం దానికి సంబంధించిన వరుసక్రమ సంఖ్యతో సహా పేజీ ప్రక్కన ఉండే మార్జిన్ స్థలంలో కనబడును. ఒక వారంలో ఖుర్ఆన్ గ్రంథ పఠనాన్ని పూర్తి చేసేందుకు వీలుగా సహాబాలు ఈ విభజన చేసినారు. మొదటి మన్జిల్ లో సూరహ్ ఫాతిహా కాకుండా ఖుర్ఆన్ లోని మొదటి మూడు సూరహ్ లు ఉన్నాయి, రెండవ మన్జిల్ లో ఐదు, మూడవ మన్జిల్ లో ఏడు, నాలుగవ మన్జిల్ లో తొమ్మిది, ఐదవ మన్జిల్ లో పదకొండు, ఆరవ మన్జిల్ లో పదమూడు మరియు ఏడవ మన్జిల్ లో మిగలిన అరవై ఐదు సూరహ్ లు ఉన్నాయి.

– జతలు, జంటలు, జోడీ

ఖుర్ఆన్ లోని కొన్ని సూరహ్ లు జంటలుగా గుర్తింపబడినాయి. ఉదాహరణకు – సూరహ్ అల్ బఖరహ్ మరియు సూరహ్ ఆలే ఇమ్రాన్. అలాగే సూరహ్ బని ఇస్రాయీల్ మరియు అల్ కహఫ్. వాటిలో ఉపదేశింపబడిన విషయపు సారూప్యం వలన అవి జంటలుగా గుర్తింపబడినవి. అయితే ఇతర ఏ సూరహ్ కూ జోడీగా గుర్తింపబడని కొన్ని ప్రత్యేక సూరహ్ లు కూడా ఉన్నాయి ఉదారహణకు సూరహ్ యాసీన్.

– మక్కా మరియు మదీనాహ్ సూరహ్ ల విభజన

అవతరణ క్రమాన్ని పరిశోధిస్తూ, వాటి అవతరణ సమయాన్ని బట్టి ఖుర్ఆన్ గ్రంథంలోని సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు మదీనాహ్ సూరహ్ లుగా పండితులు విభజించారు.  ఈ విభజన ద్వారా ఖుర్ఆన్ సూరహ్ లలో కొన్ని మక్కా సూరహ్ లని మరియు మిగిలినవి మదీనాహ్ సూరహ్ లని ప్రసిద్ధి చెందినవి. హిజ్రహ్ కు (అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మక్కా నగరం నుండి మదీనా పట్టణానికి వలస పోయిన సమయం) పూర్వం అవతరించిన సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు హిజ్రహ్ తర్వాత అవతరించిన సూరహ్ లను మదీనాహ్ సూరహ్ లుగా విభజింపబడినవి. ఈ విధానం ప్రకారం మొత్తం సూరహ్ లు ఏడు మక్కా – మదీనాహ్ సూరహ్ ల సమూహాలుగా  విభజించబడినవి – వీటిలో మొత్తం మక్కా సూరహ్ ల సంఖ్య 86 & మదీనాహ్ సూరహ్ ల సంఖ్య 28. కేవలం కొన్ని సూరహ్ ల అవతరణ పై తప్ప, ఈ అవతరణ క్రమం పై దాదాపు పండితులందరి ఏకాభిప్రాయం ఉన్నది. కొన్ని సూరహ్ లలోని ఆయహ్ లన్నీ అవతరణ క్రమాన్ని అనుసరించి, ఒకే విభాగం లోనికి అంటే మక్కా సూరహ్ లేక మదీనాహ్ సూరహ్ ల విభాగంలోనికి రావని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు సూరహ్ హజ్జ్ లోని ఆయహ్ లన్నీ మక్కాలో అవతరించినవని కొందరు, మదీనాహ్ లో అవతరించినవని మరికొందరు అభప్రాయపడుతున్నారు. అయితే రెండు అభిప్రాయాలూ సరైనవే. ఎందుకంటే దానిలో మక్కాలో అవతరించిన కొన్ని ఆయహ్ లు మరియు మదీనాహ్ లో అతవరించిన కొన్ని ఆయహ్ లు ఉన్నాయి.

చివరిగా –ఖుర్ఆన్, సూరహ్ అల్ ఇస్రా  17: 80 – “ఓ నా రబ్ (ఓ నా ప్రభూ)!నీవు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు.ఎక్కడ నుండి తీసినా, సత్యంతో తియ్యి. నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా.”

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన అత్తిర్మిథీ & ఇబ్నె మాజా హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించేవారని తెలుపబడినది – “ఓ అల్లాహ్, నీవు ఉపదేశించిన దానిలో నాకు శుభాన్ని ప్రసాదించుము. నాకు ప్రయోజనం చేకూర్చే వాటిని నాకు బోధించుము. మరియు నాలో జ్ఞానాన్ని పెంపొందించుము. అన్ని పరిస్థితులలోనూ సకల ప్రశంసలు నీకే చెందును. నరకంలోనికి వెళ్ళేవారి పరిస్థితి (జీవనవిధానం) నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.” ఆమీన్.

దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత

క్లుప్త వివరణ: ఈ పుస్తకంలో మొత్తం సంవత్సరంలోనే అత్యంత పవిత్ర దినాలైన దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాల ప్రాముఖ్యత, వాటిలో చేయవలసిన శుభకార్యాలు వివరంగా చర్చించబడినాయి.

మొత్తం సంవత్సరంలోని ఇతర దినాల కంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు ఎలా విభిన్నమైనవి?

కాలాన్ని సృష్టించిన అల్లాహ్ కే సకల ప్రశంసలు చెందును. ఆయనే కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాల కంటే శుభప్రదమైనవిగా మరియు కొన్ని ప్రత్యేక నెలలను, దినాలను, రాత్రులను ఇతర నెలల, దినాల, రాత్రుల కంటే శుభప్రదమైనవిగా చేసెను. ఈ శుభకాలములో తన దాసుల పై అల్లాహ్ చూపుతున్న ప్రత్యేక కారుణ్యం వలన వారి పుణ్యాలు అనేక రెట్లు గుణింపబడును. ఇది వారిని మరిన్ని పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించి, అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధించే ఆసక్తిని వారిలో కలిగించును. అలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి చేయవలసిన ప్రయత్నాలను ముస్లింలలో పునరుద్ధరించి, తన మరణాన్ని తద్వారా తీర్పుదినాన్ని ఎదుర్కొనటానికి తయారుగా ఉండేటట్లు చేయును.

ఈ ఆరాధనా కాలం అనేక శుభాలను తెచ్చుచున్నది. వాటిలో కొన్ని శుభాలు – తమ తప్పులను, పాపాలను సరిదిద్దుకుని ప్రాయశ్చతం చేసుకునే అవకాశాలు, తమ ఆరాధనలలోని మరియు ధర్మాచరణలలోని కొరతలను, లోపములను భర్తీ చేసుకునే అవకాశాలు. ఈ ప్రత్యేక సమయాలు కొన్ని ప్రత్యేక ఆరాధనలను కలిగి ఉంటాయి. వీటిని మనస్పూర్తిగా, చిత్తశుద్ధితో ఆచరించటం ద్వారా దాసులు తమ ప్రభువైన అల్లాహ్ కు దగ్గరయ్యే అవకాశాన్ని పొందుతారు. ఇంకా అల్లాహ్ తన ఇష్టానుసారం ప్రసాదించే ప్రత్యేక దీవెనలను, కరుణాకటాక్షాలను కూడా పొందుతారు. ఈ ప్రత్యేక నెలలలో, దినాలలో, ఘడియలలో వీలయినన్ని ఎక్కువ ఆరాధనలు చేస్తూ, అధిక పుణ్యాలు సంపాదించటానికి మరియు తన ప్రభువైన అల్లాహ్ సారూప్యాన్ని పొందటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న వ్యక్తులే ఇహపరలోకాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. అల్లాహ్ ప్రత్యేక దీవెనల ప్రసరణ వలన, తాము భయంకరమైన నరకాగ్ని జ్వాలల నుండి సురక్షితంగా ఉన్నానని ఆశిస్తూ, సంతోషంతో ఉంటారు. (ఇబ్నె రజబ్, అల్ లతాయిఫ్, p.8)

ప్రతి ముస్లిం తమ జీవితపు విలువను తప్పకుండా గ్రహించవలెను. చనిపోయేలోగా అల్లాహ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధిస్తూ, అనేక పుణ్యాలు సంపాదించటానికి తీవ్రంగా ప్రయత్నించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

“మరియు మీపై రూఢీ అయినది రానంత వరకు, మీ ప్రభువును ఆరాధించండి.” [సూరహ్ అల్ హిజ్ర్ 15:99] ముఫస్సిరీన్ (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలు) ఇలా తెలిపినారు: “రూఢీ అయినది రానంత వరకు అంటే ఖచ్చితమైన, నిస్సందేహమైన మరణము సమీపించనంత వరకు.”

ఆరాధనల కోసం ప్రత్యేకింపబడిన అటువంటి శుభసమయాలలో దిల్ హజ్జ్ మాసంలోని మొదటి పది దినాలు కూడా వస్తాయి. అల్లాహ్ వీటిని సంవత్సరంలోని మిగతా దినాల కంటే ఉత్తమమైనవిగా, ఉన్నతమైనవిగా ఎన్నుకొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఉపదేశించిన ఈ హదీథ్ ను వారి సహచరుడైన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు: “మంచి పనుల (పుణ్యకార్యాల) ను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా వేరే దినాలేమీ లేవు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కంటేనా?” వారు ఇలా సమాధానమిచ్చినారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కూడా కాదు, అయితే తనను మరియు తన సంపదను అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధంలో పూర్తిగా సమర్పించుకుని, ఖాళీ చేతులతో మరలి వచ్చినతను తప్ప” (సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథం, 2/457).

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “బలిదానపు (ఖుర్బానీ) పది దినాలలో చేసే పుణ్యకార్యాల కంటే ఎక్కువ విలువైనదీ, ఉత్తమమైనదీ అల్లాహ్ దృష్టిలో మరేదీ లేదు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించినారు, “అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధం కంటేనా?” (దారిమి గ్రంథం, 1/357; అల్ ఇర్వాలో తెలుపబడినట్లు దీని ఉల్లేఖకుల పరంపర హసన్ వర్గీకరణలోనికి వచ్చును, 3/398).

ఈ పవిత్ర ఉపదేశాలు మరియు ఇటువంటివే ఇతర ఉపదేశాలు సూచిస్తున్న దానిని బట్టి, ‘సంవత్సరంలోని మిగిలిన అన్ని దినాల కంటే ఈ పది దినాలు ఎంతో ఉత్తమమైనవి’ అనటానికి ఎటువంటి సందేహామూ లేదు. ఇవి రమదాన్ నెలలోని చివరి పది దినాల కంటే కూడా ఉత్తమమైనవి. కాని రమదాన్ నెలలోని చివరి పది రాత్రులు తమలో వెయ్యి నెలల కంటే ఉన్నతమమైన లైలతుల్ ఖదర్ అనే రాత్రిని కలిగి ఉండటం వలన ఎంతో ఉత్తమమైనవి. అంటే సంవత్సరం మొత్తం దినాలలో దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు మిగిలిన అన్ని దినాల కంటే ఎంతో ఉత్తమమైనవి మరియు సంవత్సరం మొత్తం రాత్రులలో రమదాన్ మాసపు చివరి పది రాత్రులు మిగిలిన అన్ని రాత్రుల కంటే. ఈ విధంగా వేర్వేరు వ్యాఖ్యానాల, ఉల్లేఖనల మధ్య సమతుల్యాన్ని, పరిష్కారాన్ని సాధించవచ్చును. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 5/412).

ఈ పది దినాలు ప్రత్యేకమైనవి అనటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి:

అల్లాహ్ ఖుర్ఆన్ లో కొన్నిచోట్ల ఆ ప్రత్యేక పది దినాలపై ప్రమాణం చేసియున్నాడు. వేటిపైనైనా ప్రమాణం చేయటమంటే అది వాటి ప్రత్యేకతను, గొప్పతనాన్ని, ప్రయోజనాల్ని సూచిస్తుంది. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఉషోదయాల ప్రమాణంగా; పది రాత్రుల ప్రమాణంగా” [సూరహ్ అల్ ఫజర్ 89:1-2]. ఇక్కడ ఉషోదయాలంటే దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలని ఇబ్నె అబ్బాస్, ఇబ్నె అజ్జుబేర్, ముజాహిద్, ఇంకా ముందు తరం మరియు తర్వాత తరం వారు అభిప్రాయపడినారు. “ఇదే సరైన అభిప్రాయం.” అని ఇబ్నె కథీర్ తెలిపినారు (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 8/413)పైన తెలిపిన సహీహ్ హదీథ్ లలో ఈ పది దినాలను ఇహపరలోకాలలో అత్యుత్తమమైన దినాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించినట్లు తెలుసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పది దినాల ప్రత్యేకతల మరియు హజ్ యాత్రికులు ఈ సమయంలో పవిత్ర కాబాగృహం దగ్గర చేస్తున్న ప్రత్యేక ఆరాధనల కారణంగా ఈ ఉత్తమ సమయంలో మంచి పనులు, పుణ్యకార్యాలు సాధ్యమైనంత ఎక్కువగా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ప్రోత్సహించినారు. ఈ మంచి సమయంలో తస్బీహ్ (“సుభహానల్లాహ్”), తహ్మీద్ (“అల్ హమ్దులిల్లాహ్”) మరియు తక్బీర్ (“అల్లాహ్ అక్బర్”) ఎక్కువగా ఉచ్ఛరించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఈ హదీథ్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “తను పుణ్యకార్యాలను అమితంగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా అల్లాహ్ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహ్ అక్బర్), తహ్మీద్ (అల్ హమ్దులిల్లాహ్) ఉచ్ఛరించవలెను” (అహ్మద్ హదీథ్ గ్రంథం, 7/224; అహ్మద్ షాకిర్ దీనిని సహీహ్ గా వర్గీకరించెను).ఈ పది విశిష్ట దినాలలో యౌమ్ అరఫాహ్ అంటే అరఫాహ్ దినం కూడా ఉన్నది. అల్లాహ్ ఇదే దినమున తన ధర్మాన్ని సంపూర్ణం చేసినాడు. ఈ ఉత్తమ దినమున ఉండే ఉపవాసము రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేయును.  ఈ ఉత్తమ దినాలలో యౌమ్ అన్నహర్ (బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం) కూడా ఉన్నది. ఇది సంవత్సరం మొత్తం దినాలలో అత్యుత్తమమైన దినం మరియు హజ్జ్ దినాలలో అత్యుత్తమమైన దినం. ఈ దినము ఇతర అన్ని దినాల మాదిరిగా కాకుండా ఆరాధనలను ప్రత్యేక పద్ధతిలో ఒక చోటికి చేర్చును. ఈ పది దినాలలో బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం మరియు హజ్జ్ దినాలు కూడా ఉన్నాయి.

ప్రశ్న: ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?

సున్నహ్ ప్రకారం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాల ప్రకారం) బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ దిల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను.  ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించి ఉన్నారు: “దిల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: “అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు.” (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని బలిదానం(ఖుర్బానీ) స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు బలిదానం (ఖుర్బానీ) సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు.  ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.

వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ.  అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.

ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.

కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై  ఈ నిషేధము వర్తించదు.

ఇంకా, ఈ నిబంధన బలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.

ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.

పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.

ఈ పది దినాలలో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది దినాలు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి  పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికి విలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది దినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనను తాను అంకితం చేసుకోవలెను. మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి.  ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.

దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు:

ఉపవాసం. దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఒక హదీథ్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: “అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను.'”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: ” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.” (అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.) తక్బీర్. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో తక్బీర్ (“అల్లాహు అక్బర్”), తహ్మీద్ (“అల్హమ్దులిల్లాహ్”), తహ్లీల్ (“లా ఇలాహ ఇల్లల్లాహ్”) మరియు తస్బీహ్ (“సుభహానల్లాహ్”) అని బిగ్గరగా  ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్ఛరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్ఛరించలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్ఛరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

“వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి…” [సూరహ్ అల్ హజ్జ్ 22:28]

నిర్ణీత దినాలంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లోని పదాలలో “(దిల్ హజ్జ్ మాసపు) మొదటి పది దినాలు నిర్ణీత దినాలని” ఉన్నది.

తక్బీర్ లో “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)” మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.

తక్బీర్ పలకటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్ఛరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా మరియు అబు హురైరా రదియల్లాహు అన్హు లు దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్ఛరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్ఛరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్ఛరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్ఛరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్ఛరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్ఛరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.

పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నహ్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి ఈ హదీథ్: “ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నహ్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నహ్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు.” (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)

హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ ఇలా ప్రకటించినారు: “స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు.”మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును. ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను. ఖుర్బానీ – బలిదానం సమర్పించటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేలి కూడా ఉన్నాయి. చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని అన్ని తప్పుడు పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని  పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.

ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.

ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.” [సూరహ్ అల్ ఖశశ్ 28:67]

సమయం త్వరత్వరగా గడిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు.” [సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]

కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.

గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.

అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో

80% ఖురాన్ పదాలకు అర్ధాలు

80% of Quranic Words in Telugu80% words of the Holy Quran have been compiled for ease of learning. This is just pocket sized booklet consisting of 28 pages (14 papers)

[Download PDf Here]

 

ఇస్లామిక్ తెలుగు డిక్షనరీ – Dr. Muhammad Taqiuddeen al-Hilaalee & Dr. Muhammad Muhsin Khan

The Islamic Telugu Dictionary – From the Translation of Meanings of Noble Quran By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee and Dr. Muhammad Muhsin Khan

[Download the PDF Here]