అన్నిసా 4:116 :- “అల్లాహ్‌కు సాటి (భాగస్వామ్యం) కల్పించు వారిని అల్లాహ్ అస్సలు క్షమించడు. షిర్క్ తప్ప వేరే పాపములను అల్లాహ్ తన ఇష్టానుసారం క్షమిస్తాడు”
قال الله تعالى:)إِنَّهُ مَن يُشْرِكْ بِاللّهِ فَقَدْ حَرَّمَ اللّهُ عَلَيهِ الْـجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِـمِينَ مِنْ أَنصَارٍ( الـمـائدة:72
అల్ మాయిద 5:72:- “నిశ్చయంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించువారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు అతని నివాసము నరకమే, పాపాత్ములకు సహాయం చేయువారు ఎవ్వరూ లేరు”. అంటే అల్లాహ్‌కు భాగస్వాములు కల్పించువారు అవిశ్వాసులు. చనిపోయిన వారిని వేడుకొనుట, సమాధులకు మొక్కుట, అల్లాహ్ పేరుమీద కాకుండా వేరేవాని పేరుమీద బలి ఇచ్చుట..మొదలైనవన్నీ షిర్క్‌లోని విధానములు.
2. తమకి మరియు అల్లాహ్‌కి మధ్య ఎవరినైనా మధ్యవర్తి (సిఫార్సు చేసేవాడు)గా చేసి వేడుకొనుట, మరియు వారిని నమ్ముట వారి సిఫారసుపై నమ్మకం ఉంచుట అవిశ్వాసమే అవుతుందని ఇస్లామీయ పండితులందరి అభిప్రాయం.
3. ఎవరైనా, అవిశ్వాసిని, లేదా బహుదైవారాధకుడిని, అవిశ్వాసి అని నమ్మనివారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే, వారు కూడా అవిశ్వాసులుగా భావించబడతారు.
4. ఎవరైనా వేరే విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లమ్ తెచ్చిన నిబంధనల (షరిఅహ్) కంటే ఉత్తమమైన విధానమని అనుకుంటే వారు అవిశ్వాసులు. వేరే వారి మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ మాటపై ప్రాముఖ్యత ఇచ్చువారు అవిశ్వాసులు.
5. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క షరిఅహ్ (నియమనిబంధనల) ను హృదయపూర్వకంగా స్వీకరించకపోవుట అవిశ్వాసము. అతను దానిపై అమలు చేస్తున్నా మనస్సు దానికి వ్యతిరేకంగా నిర్ణయించిన ఎడల అతను అవిశ్వాసి అగును.
قال الله تعالى:)ذَلِكَ بِأَ نَّـهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَـالَـهُمْ( [محمد:9].
ముహమ్మద్ 47:9:- “ఎందుకంటే వారు అల్లాహ్ అవతరించిన షరియత్‌ను అంగీకరించలేదు. అందుచే అల్లాహ్ వారి కార్యములను వ్యర్ధము చేసేను.”
6. అల్లాహ్ గురించి గాని ప్రవక్త గురించి గాని లేదా షరిఅహ్ ను ఎగతాళి చేసినవారు అవిశ్వాసులు.
అత్తౌబా 9:65–66:- “ప్రకటించండి! ఏమిటీ, అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయటానికా? మరియు ఆ ప్రవక్తతో ఎగతాళియా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు”
7. జాదు (చేతబడి) చేయుట మరియు చేయించుట కూడా అవిశ్వాసుల పని.
అల్ మాయిద 5:51:- “మీలో ఎవరైనా వారితో (అవిశ్వాసులతో) స్నేహం చేసిన యెడల నిశ్చయంగా వారు వారిలో వారే. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ ఋజుమార్గం చూపడు.”
9. ఇస్లామీయ షరిఅహ్‌లో కొన్నింటిని విడిచిపెట్టే సదుపాయం కొందరికుందని భావించువారు అవిశ్వాసులు.
قال الله تعالى:)وَمَن يَـبْتَغِ غَيْرَ الإِسْلاَمِ دِينًا فَلَن يُقْبَـلَ مِنْـهُ وَهُوَ فِي الآخِرَةِ مِنَ الْـخَاسِرِينَ( [آل عمران:85]
ఆలె ఈమ్రాన్ 3:85 :- “ఎవరైనా విధేయతా ధర్మం (ఇస్లాం) కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల, వారి విధానం స్వీకరించబడదు. ప్రళయదినం రోజున అతడు నష్టపోయేవారిలోని వాడగును.”
10. అల్లాహ్ యొక్క దీన్ (ధర్మం)తో సంబంధం లేకుండా జీవించువారు, ఇస్లాం గురించి నేర్చుకోనివారు, ఆచరించనివారు అవిశ్వాసులు.
قال الله تعالى:)وَمَنْ أَظْلَمُ مِـمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا إِنَّا مِنَ الْـمُجْرِمِينَ مُنـتَقِمُونَ( [السجدة:22]
అస్సజ్దా 32:22:- “తన ప్రభువు వాక్యాల ద్వారా బోధించబడినపుడు, వాటి పట్ల విముఖుడయ్యే వానికంటే దుర్మార్గుడెవరు? అటువంటి అపరాధులతో మేము తప్పక ప్రతీకారం తీర్చుకుంటాము.”
పైన తెలుపబడిన అవిశ్వాసకార్యముల నుండి మేము చాలా జాగ్రత్త వహించాలి. అల్లాహ్ యొక్క భయంకర శిక్షల నుండి భయపడుతూ, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకుంటుండాలి మరియు అల్లాహ్ ఈ పాపాల నుండి మమ్మల్ని రక్షించమని, కాపాడమని వేడుకుంటుండాలి. యా అల్లాహ్! మమ్మల్ని అవిశ్వాసం నుంచి కాపాడు. ఆమీన్.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విధేయత లేదా సంతోషంగా విధేయత చూపుట. ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహ్‌కు విధేయుడు అగుట. ఏ ఆజ్ఞలనైతే అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు తెలియజేసెనో, వాటిని తు.చ. తప్పకుండా పాటించుటయే విధేయత చూపుట అగును. అల్లాహ్‌కు ఇష్టమైన ప్రతి పని, అది ఏదైనా సరే, కనపడేది కానీవండి, కనపడనది కానీవండి, మనసులో ఆలోచన కానీవండి, నోటితో పలికే పలుకులు కానీవండి, చేతులతో చేసే పనులు కానీవండి ఆరాధన (ఇబాదత్) అనబడును. అంటే ప్రతి ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధనలో కాస్త చిన్నపాటి భాగస్వామ్యం యొక్క వాసన కూడా లేకుండా చేయాలి మరియు ప్రతి కార్యమును మన ప్రవక్త సల్లల్లాహు వ అలైహి వసల్లం తెలిపిన విధంగానే అమలు చేయాలి మరియు స్వకల్పిత కార్యములు చేయరాదు.
స్వీకరించబడే ఆరాధనలు (ఇబాదహ్): నమాజు, కాబా యొక్క తవాఫు, హజ్, ఉపవాసములు, దుఆ, సజ్దా(~సాష్టాంగం), రుకూ, అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుట, అల్లాహ్ నే సహాయం కోరుట, యాచించుట, ఆశించుట, అల్లాహ్ స్వీకరణ కోసం ఎతేకాఫ్ పాటించుట, ప్రార్ధన, ఆరాధన, విధేయత, శరణు వేడుట, దైవభీతి, ప్రేమ, అభిమానం, మనసులోని ఏకాగ్రత, అల్లాహ్ వైపు మనస్సు లగ్నమై ఉండుట, బలి, దానం, వేడుకొనే సకల విధానములు – కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుట…. ఇంకా ఏవైతే ఖుర్‌ఆన్ మరియు హదీసులలో చేయమని ఆదేశింపబడినాయో వాటిని చేయుట మరియు నిషేధింపబడినాయో వాటి నుండి దూరంగా ఉండుట. మరి ఎవరైనా వీటిని అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు చేసిన ఎడల అతడు ముష్రిక్ (బహుదైవారాధకుడు) అగును.
)وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَـهًا آخَرَ لا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمـَا حِسَابُهُ عِندَ رَبِّهِ إِنَّهُ لا يُفْلِحُ الْكَافِرُونَ( [المؤمنون:117]
మూమినూన్ 23:117:- “ఎవరైతే అల్లాహ్‌తో పాటు వేరే ఆధారం లేని వారిని వేడుకొనే వారి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు ఎప్పటికీ సాఫల్యం(ముక్తి) పొందలేరు.”
قال الله تعالى:)وَ أَنَّ الْـمَسَاجِدَ لِلَّهِ فَلا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا( [الـجن:18]
జిన్ 72:18:-“మస్జిద్ లు ఒక్క అల్లాహ్‌కే పరిమితం, మరి అల్లాహ్‌తో పాటు మరెవరినీ యాచించకండి (ప్రార్ధించకండి), వేడుకోకండి” అంటే ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్ కొరకే ప్రత్యేకించి అంకితం చేయుట.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ప్రతి పనిలో ఇస్తిఖారా చేయడాన్ని గురించి బోధించేవారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారీ 1162).
దాని విధానం: రెండు రకాతుల నమాజు చేసి, తరువాత ఇలా దుఆ చేయాలి. అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక, వ అస్తఖ్దిరుక బిఖుద్రతిక, వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం, ఫఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు, వ తఅ లము వలా అఅ లము, వ అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅ లము అన్న హాజల్ అమ్ర [2] ఖైరున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వ ఆఖిబతి అమ్రీ, ఫఖ్ దుర్ హులీ, వయస్సిర్ హులీ, సుమ్మ బారిక్ లీ ఫీహి, వ ఇన్ కుంత తఅ లము అన్న హాజల్ అమ్ర([2]) షర్రున్ లీ ఫీ దీనీ, వ మఆషీ, వఆఖిబతి అమ్రీ, ఫస్రిఫ్ హు అన్నీ, వస్రిఫ్ నీ అన్హు, వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్ జినీ బిహీ).
([2]) ఇక్కడ ‘హాజల్ అమ్ర’కు బదులుగా తన అవసరాన్ని పేర్కొనాలి. లేదా ‘హాజల్ అమ్ర’ అంటూ తన అవసరాన్ని ఆలోచించుకోవాలి.
ఈ దుఆ యొక్క భావం: ఓ అల్లాహ్! నీ జ్ఞానం సాక్షిగా నేను శ్రేయస్సును అర్థిస్తున్నాను. నీ శక్తి పేరిట నేను నీ మహత్తర కటాక్షాన్ని అభ్యర్థిస్తు- న్నాను. నీవే సర్వశక్తిమంతుడివి, నాకు రవ్వంత కూడా శక్తి లేదు. నీవు సర్వజ్ఞుడివి. నేను జ్ఞానం లేనివాణ్ణి. అగోచరమైన విషయాలన్నీ నీకే బాగా తెలుసు. అల్లాహ్! నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామాల రీత్యా నాకు శ్రేయస్కరమైనదయితే దానిని నాకు ప్రాప్తం చెయ్యి. దానిని నాకు శుభకరమైనదిగా చెయ్యి. ఒకవేళ నీ దృష్టిలో ఈ పని నా ఇహపరాల రీత్యా, పరిణామ ఫలం రీత్యా నా పాలిట చెడుదైతే, ఆ పని నుండి నన్ను దూరంగా ఉంచు, దాని నుండి నన్ను కాపాడు. నా శ్రేయోశుభాలు ఎందులో ఉన్నాయో దానిని నాకు ప్రాప్తం చెయ్యి. తరువాత దాని మీద నాకు మక్కువ, ఏకాగ్రతలు కూడా కలిగించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం (ఖుర్ ఆన్ 2:255).
అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
1019. హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గరున్న దైవగ్రంథ ఆయతుల్లో అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహు లా ఇలాహ ఇల్లాహువల్ హయ్యుల్ ఖయ్యూమ్’ అనే ఆయతు (కావచ్చు) ‘ అని అన్నాను నేను. అప్పుడాయన నా రొమ్ము తట్టి, ‘అబుల్ ముంజిర్! నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!’ అని అభినందించారు. (ముస్లిం)
(అంటే ‘ఖుర్ఆన్ జ్ఞానశుభంతోనే నీకు అన్నిటికన్నా గొప్ప ఆయతు ఏదో తెలిసింది’ అని చెప్పటమే దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం.)
ముఖ్యాంశాలు
“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ‘ఆయతుల్ కుర్సీ’కు సంబంధించిన వచనం. ఇక్కడ దీనిభావం, మొత్తం ఆయతుల్ కుర్సీ అని అర్థం చేసుకోవాలి. ఈ ఆయతులో మహోన్నతమైన అల్లాహ్ గుణగణాలు, మహోజ్వలమైన ఆయన అధికారాలు ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయతు ఎంతో మహత్యంతో కూడుకున్నది.
“నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!” అంటే నీకు ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన, సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అబ్బాలని భావం. ఇక్కడ జ్ఞానమంటే ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం. ఇహపరాల్లో మనిషికి సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అదే!
1020. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం :
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను రమజాన్ మాసపు జకాత్ (అంటే ఫిత్రా) సొమ్ముకు కాపలా ఉంచారు. (ఓరోజు – రాత్రి) ఎవరో ఒకతను వచ్చి దోసిళ్ళతో ఆ ధాన్యాన్ని దొంగిలించసాగాడు. వెంటనే నేనతన్ని పట్టుకొని, “(ఎవర్నువ్వు?) పద దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి” అని గద్దించాను. అందుకతను, (భయపడిపోతూ) “అవసరాల్లో ఉన్నానయ్యా! భార్యా బిడ్డలు గలోణ్ణి, ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చిపడింది” అన్నాడు. నేనతన్ని (దయతలచి) వదలి పెట్టాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త సన్నిధికి వెళ్ళాను). దైవప్రవక్త నన్ను పిలిచి “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. దానికి నేను, “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టాను” అని చెప్పాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు. చూస్తూ ఉండు” అన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతనికోసం మాటేసి ఉన్నాను. అతను వచ్చి దోసిళ్ళతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. (నేను మెల్లిగా వెళ్ళి అతన్ని పట్టుకొని), ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త దగ్గరికి తీసుకువెళ్తాను” అన్నాను. అందుకతను, “నన్ను వదలి పెట్టండి, అవసరాల్లో ఉన్నాను. భార్యాబిడ్డలు గలోణ్ణి. ఇంకెప్పుడూ రాను. (ఈ ఒక్క సారికి వదలి పెట్టండి)” అని బ్రతిమాలాడు. అందుకని అతన్ని వదలి పెట్టేశాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళాను) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను పిలిచి, “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తనమీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్దం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు” అని చెప్పారు.
మూడోసారి కూడా నేనతనికోసం మాటేసి కూర్చు న్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం నింపుకోసాగాడు. నేనతన్ని పట్టుకొని “ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారీ నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు” అని గద్దిస్తూ అన్నాను. దానికతను, “నన్ను వదలి పెట్టండి. నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను. వాటి మూలంగా అల్లాహ్ మీకు ప్రయోజనం చేకూరుస్తాడు” అని అన్నాడు. నేను, “ఏమిటా వచనాలు?” అని అడిగాను. అందుకతను, “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళి నప్పుడు ఆయతుల్ కుర్సీ పఠించండి. అలా చేస్తే తెల్లవారే వరకు, మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని వదిలేశాను.
తెల్లవారిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో మాట్లాడుతూ, “రాత్రి నువ్వు పట్టుకున్న వాణ్ణి ఏం చేశావ్?” అని అడిగారు. “దైవప్రవక్తా! అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వచనాల మూలంగా అల్లాహ్ నాకు ప్రయోజనం చేకూరుస్తాడట. అందుకని నేనతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. “ఏమిటా వచనాలు?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అప్పుడు నేను, ఆ వచ్చిన వ్యక్తి నాతో “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతుల్ కుర్సీ పఠించండి” అని అన్నాడని చెప్పాను. “అలాచేస్తే మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని కూడా అన్నాడని చెప్పాను.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో, “విను, అతను పెద్ద అబద్ధాలకోరు. అయినప్పటికీ అతను నీతో నిజం చెప్పాడు. అబూహురైరా! మూడు రాత్రుల నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నారు. నేను “తెలీద’న్నాను. “అతను షైతాన్” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (బుఖారీ)
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత వెల్లడౌతోంది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఆ వచనాలను పఠించి నిద్రపోవాలని ఇందులో బోధించబడింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లహుమ్మహ్దినీ ఫీమన్ హద య్ త, వ ఆఫినీ ఫీమన్ ఆఫయ్ త, వ తవల్లనీ ఫీమన్ తవల్లయ్ త, వ బారిక్ లీ ఫీమా ఆతై త, వఖినీ షర్ర మా ఖదై త, ఫ ఇన్నక తఖ్ ధీ వలా యుఖ్ ధా అలైక, ఇన్నహు లా యుజిల్లు మన్ వాలైత, [వలా య ఇజ్జు మన్ ఆద య్ త] తబారక్ త రబ్బనా వత ఆలయ్ . ( తిర్మిజీ , అబూదావూద్ )
ఓ అల్లాహ్ ! నీవు హిత బోధనిచ్చిన వారిలోనే నాకు హిత బోధనివ్వు . నీవు స్వస్థత నిచ్చిన వారిలోనే నాకు స్వస్థత ఇవ్వు . నీవు సంరక్షకత్వం వహించిన వారిలోనే నాకు సంరక్షణ కలిపించు . నాకు నీవు ప్రసాదించిన దానిలో నాకు శుభాన్ని ఇవ్వు . నీవు నా కోసం నిర్ణయించిన దానిలో కీడు నుండి నన్ను కాపాడు . నిర్ణయించే వాడవు నీవే . నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ నిర్ణయించలేరు . నీవు మిత్రునిగా చేసుకున్న వారిని ఎవరూ అవమాన పరచలేరు . నీవు విరోధం వహించినవాడు ఎన్నటికీ గౌరవనీయుడు కాలేడు . మా ప్రభూ ! నీవు అమిత శుభములు కలవాడవు . ఉన్నతమైన ఘనత కలవాడవు .
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది, పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.
1- పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేదిఅత్యంతఘోరమైనపాపిష్టిపని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.
2- క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}
3- స్వర్గం నిషేధించబడినది: ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –
భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.
4- పుణ్యకార్యాలన్నీవ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.
ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు
భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}
5- ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.
భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు
“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –
అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప, నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.
6- ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు – “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును, ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం …”
కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.
7- ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన) అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.
నూహ్ 71:23:-“ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”
పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు. కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.
హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రబ్బనా వజ్ అల్ నా ముస్లిమైని లక వ మిన్ జుర్రియ్యతినా ఉమ్మతన్ ముస్లిమతల్ లక వ అరినా మనాసికనా వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్రహీం
ఓ మా ప్రభూ ! మా ఇద్దరినీ నీ విధేయులుగా చెయ్యి. మా సంతానం నుండి నీ కొరకు ఒక ముస్లిం సమాజాన్ని తయారు చెయ్యి, మాకు నిన్ను ఆరాధించే పద్దతులను నేర్పు, మా పశ్చాతాపాన్ని అంగీకరించు, నిస్సందేహంగా నీవు పశ్చాతాపాన్ని అంగీకరించే వాడవు. దయామయుడవు. [2:128]
రబ్బనా లాతు ఆఖిజ్ నా ఇన్ నసీనా ఔ అఖ్ తానా. రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్ రన్ కమాహమల్ తహూ అలల్లజీన మిన్ ఖబ్ లినా.రబ్బనా వలా తుహమ్మిల్ నా మా లా తాఖత లనా బిహీ వ అఫు అన్నా వగ్ ఫిర్ లనా వర్ హమ్ నా అన్త మౌలానా ఫన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. (2:286)
ఓ మా ప్రభూ ! నీవు పంపిన దానిని విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించితిమి . ప్రవక్తకు విధేయులైతిమి . కావున విశ్వసించిన సాక్షులలో మమ్ము వ్రాసికొనుము [3:53]
రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్ రినా వ సబ్బిత్ అఖ్ దామనా వన్ సుర్ నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్
ఓ మా ప్రభూ ! మా పాపములను , మా కార్యములలో , మేము మితిమీరి పోయిన దానిని క్షమించుము . మా పాదములను స్థిరముగా ఉంచుము . అవిశ్వాసులను జయించుటకు మాకు సహాయపడుము (3:147)
రబ్బి ఇన్నీ అవూదు బిక అన్ అస్ అలక మా లైస లీ బిహీ ఇల్మ్ వ ఇల్లా తగ్ ఫిర్ లీ వ తర్ హమ్ నీ అకున్ మినల్ ఖాసిరీన్
నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయదలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను. (11 : 47)
నా ప్రభూ! నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిస్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచిస్థితి లోనే తియ్యి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు. (17 : 80)
రబ్బిష్ రహ్ లీ సద్ రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉక్ దతమ్ మిల్ లిసానీ యఫ్ కహూ కౌలీ
ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ని విశాలమైనదిగా చేయి. నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి. నా నాలుక ముడిని విప్పు, ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు. (20 : 25 – 28)
రబ్బి హబ్ లీ హుక్ మౌ వ అల్ హిక్నీ బిస్సాలిహీన్ వజ్ అల్లీ లిసాన సిద్ కిన్ ఫిల్ ఆఖిరీన్ వజ్ అల్ నీ మివ్ వరసతి జన్నతిన్ నయీమ్ వ లా తుఖ్ జినీ యౌమ యుబ్ అసూన్
నా ప్రభూ! నాకు ‘ప్రజ్ఞ’ను ప్రసాదించు. నన్ను సద్వర్తనులలో కలుపు. భావితరాల వారి (నోటి)లో నన్ను కీర్తిశేషునిగా ఉంచు. అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను (కూడా ఒకడిగా) చెయ్యి. ప్రజలు మళ్లీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు (26 : 83 – 85,87)
రబ్బి అవ్ జి’నీ అన్ అష్ కుర ని’మతకల్లతీ అన్ అమ్ త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అ’మల సాలిహన్ తర్ దాహు వ అద్ ఖిల్నీ బి రహ్మతిక ఫీ ఇబాదిక స్సాలిహీన్
నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో. (27 : 19)
రబ్బనగ్ ఫిర్ లనా వలిఇఖ్వాని నల్లదీనా సబకూనా బిల్ ఇమానీ వలా తజ్ అల్ ఫీ ఖులుబినా గిల్లల్-లిల్లదీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్ రహీమ్
మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. (59 : 10)
రబ్బి అవ్ జి’నీ అన్ అష్ కుర ని’మతక అల్లతీ అన్ అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అ’మల సాలిహన్ తర్దాహు వ అస్ లిహ్ లీ ఫీ జుర్రియ్యతీ ఇన్నీ తుబ్ తు ఇలైక వ ఇన్నీ మినల్ ముస్లిమీన్
నా ప్రభూ! నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలు తున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి. (46 : 15)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
The Noble Quran – a Miracle from Allah (Subhanahu wa Ta’ala) రచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ – తఖీయుద్దీన్ అల్ హిలాలీ అంశాల నుండి : కింగ్ ఫహద్ దివ్యఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్ (ముద్రణాలయం) సంస్థ అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ ,పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను
(సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ , తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన అంతిమ సందేశం) – ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల వెలుగులో………
“మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ సంభవం కాదు: వాస్తవానికిది పూర్వగ్రంథాలలో మిగిలి ఉన్న దానిని సత్యాన్ని ధృవపరుస్తోంది: మరియు ఇది ముఖ్య సూచనలను వివరించే గ్రంథం: ఇది సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్ తరుపు నుండి వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు!”
{ఖుర్ఆన్ 10వ అధ్యాయం ‘యూనుస్’ లోని 37వ ఆయత్ యొక్క భావపు అనువాదం}
“మరియు ఎవరైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించ బడదు మరియు అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు”
{ఖుర్ఆన్ 3వ అధ్యాయం ‘ఆలె ఇమ్రాన్’ (మర్యం తండ్రి అయిన ఇమ్రాన్ కుటుంబం) లోని 85వ ఆయత్ యొక్క భావపు అనువాదం}
حدثنا عبدُ الله بنُ يُوسفَ : حدثنا الليث :حدثنا سعيد الـمقبري، عن أبيه، عن أبي هريرة قال:قال النبي ^ :(( ما مِنَ الأنبياءِ نَبيٌّ إلا أعطي من الآيات ما مِثله آمن عليهِ البَشرُ، وَإنَّمـا كان الَّذي أوتيتُـه وحيا أوحاهُ الله إليَّ، فأرجُو أن أكُونَ أكثرَهُم تَابعاً يوم القِيامَـةِ)).
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 379వ హదీథ్ లో నమోదు చేయబడిన అబుహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:
“ప్రవక్తలలో అద్భుతాలు ఇవ్వబడని ప్రవక్తలు లేరు, వేటి వలనైతే ప్రజలు విశ్వసించేవారో. అలాగే నాకు ఈ దివ్యవాణి (ఒక మహిమగా) ఇవ్వబడినది దేనినైతే అల్లాహ్ నా పై అవతరింపజేసాడో. కాబట్టి, పునరుత్థాన దినమున వేరే ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్య కంటే నా అనుచరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాను”
حدثنا محمد بن عبادة : أخبرنا يزيد : حدثنا سليم بن حيان، وأثنى عليه : حدثنا سعيد بن ميناء: حدثنا أو سمعت جابر بن عبدالله يقول: جاءت ملا ئكة إلى النبي ^ و هو نائم، فقال بعضُهم : إنه نائم ، وقال بعضهم :إن العين نائمة والقلب يقظان، فقالوا : إنَّ لصا حبكم هذا مثلاً، فاضربوا له مثلاً، فقال بعضهم : إنه نائم، و قال بعضهم : إنَّ العين نائمةٌ، والقلب يقظان، فقالوا: مثله كمثل رجل بنى داراً، وجعل فيها مأدبة وبعث داعياً، فمن أجاب الداعي دخل الدار وأكل من المأدبة، ومن لم يجب الداعي لم يدخل الدار و لم يأكل من المأدبة. فقالوا : أوَّلوها له يفقهها، فقال بعضهم : إنه نائم، وقال بعضهم إن العين نائمة والقلب يقظان، فقالوا : فالدار، الجنة، والداعي محمد ^ ، فمن أطاع محمداً ^ فقد أطاع الله، ومن عصى محمداً ^ فقد عصى الله، و محمد ^ فرق بين الناس. تابعه قتيبة، عن ليثٍ، عن خالدٍ، عن سعيد بن أبي هلالٍ، عن جابرٍ: حرج علينا النبي ^.
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 9వ గ్రంథపు 385వ హదీథ్ లో నమోదు చేయబడిన జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు-
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పండుకుని ఉన్నప్పుడు కొందరు దైవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఇలా పలికారు “ఆయన నిద్ర పోతున్నారు”. అప్పుడు మిగిలిన వారు ఇలా వ్యాఖ్యానించారు “ఆయన కళ్ళు నిద్ర పోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది”. అప్పుడు వారిలా పలికారు “మీ యొక్క ఈ సహచరుడిలో ఒక నిదర్శనం ఉన్నది”. ఆ తర్వాత వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన లోని నిదర్శనాన్ని కనిబెడదాం” అప్పుడు వారిలోని మరొక దైవదూత ఇలా జవాబిచ్చారు “ఆయన నిద్రపోతున్నారు” మరొక దైవదూత మళ్ళీ “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అని తిరిగి పలికారు.
అప్పుడు వారిలా పలికారు “ఆయనలోని నిదర్శనం (ఉదాహరణ) ఇలా ఉన్నది – క్రొత్తగా ఇల్లు కట్టిన ఒక వ్యక్తి, విందు భోజనం ఏర్పాటు చేసి, ప్రజలను ఆహ్వానించటానికి దూతను (వార్తాహరుడిని) పంపినాడు. అప్పుడు ఎవరైతే ఆ దూత యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఆ ఇంటిలో ప్రవేశించారో, వారు విందు భోజనం ఆరగించారు (తిన్నారు). ఇంకా ఎవరైతే ఆ వార్తాహరుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేదో, వారు ఆ ఇంటిలో ప్రవేశించనూ లేదు మరియు విందు భోజనం తిననూ లేదు” అప్పుడు మిగిలిన దైవదూతలు ఇలా పలికారు “ఈ దృష్టాంతాన్ని (ఉదాహరణను) ఆయనకు వివరించినట్లయితే, ఆయన కూడా దీనిలోని నిగూఢార్థాన్ని తెలుసుకోగలరు” అప్పుడు వారిలోని ఒక దైవదూత ఇలా పలికారు “ఆయన నిద్రపోతున్నారు” మిగిలిన వారు మళ్ళీ ఇలా పలికారు “ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి, కాని ఆయన హృదయం మేలుకునే ఉన్నది” అప్పుడు వారు మళ్ళీ ఇలా పలికారు “ఉదాహరణలోని క్రొత్త ఇల్లు స్వర్గానికి ఉపమానంగా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విందు భోజనానికి పిలిచిన దైవదూత (వార్తాహరుడు) కు ఉపమానంగా మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విధేయతగా అనుసరిస్తారో, వారు అల్లాహ్ ను విధేయతగా అనుసరించినట్లే. మరియు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపుతారో, వారు అల్లాహ్ కు అవిధేయత చూపినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్యసందేశం ద్వారా ప్రజలలోని దైవభక్తులను వేరు చేసారు, చెడు నుండి మంచిని వేరుపర్చారు మరియు అవిశ్వాసుల నుండి విశ్వాసులను విడదీశారు”
حدَّثنا مُحَمَّد بن سِنانٍ: حدَّثنا فليح بن سليمان: حدَّثنا هلال بن علي‘ عن عبد الرَّحمنِ بنِ أبي عمرة، عن أبي هريرة قال : قال رسول الله^: أنا أوْلى النَّاسِ بعيسى ابنِ مريم في الدُّنيا والآخرة، والأنبِـياء إخوةٌ لعَلاَّت، أُمَّهاتهم شتَّى ودينهم واحد. وقال إبراهيم بن طهمان، عن موسى بن عُقبة، عن صفوان بن سُليم، عن عطاء بن يسار، عن أبي هريرة رضي الله عنه قال :قال رسول الله ^
సహీహ్ బుఖారీ హదీథ్ సంకలనంలోని 4వ గ్రంథపు 652వ హదీథ్ లో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:
“ఈ లోకంలోను మరియు పరలోకంలోను మర్యం కుమారుడైన ఈసా-యేసు (అలైహిస్సలాం) కు మొత్తం మానవజాతిలో నేనే అత్యంత దగ్గరి వాడిని. ప్రవక్తలు తండ్రి తరుపున సోదరులు, వారి తల్లులు వేరు, కాని వారి ధర్మం ఒక్కటే (అదే ఏకైక దైవారాధన)”
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరుడనే సత్యాన్ని (Prophethood ను) తప్పక విశ్వసించవలెను.
حدَّثني يونس بن عَبدالأعلى: أخبرنا ابنُ وهْب قال: وأخبرني عمرو أنَّ أبا يونس حدَّثه عن أبي هُريرة عن رسول الله صلّى الله عليه و سلَّم أنَّه قال: والذي نَفْس مُحمَّد بِيده لا يَسمَعُ بِي أحدٌ من هذه الأُمَّةِ يهودي ولا نصراني ثمَّ يموت ولم يؤمن بالذي أُرسلْتُ بِه إلاَّ كان من أصحاب النَّار. (رواه مسلم في كتاب الإيمان)
సహీహ్ ముస్లిం హదీథ్ సంకలనంలోని – విశ్వాసమనే మొదటి హదీథ్ గ్రంథపు 24వ భాగంలో నమోదు చేయబడిన అబు హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా తెలిపారు:
“ఎవరి చేతిలో ముహమ్మద్ యొక్క ఆత్మ ఉన్నదో ఆయన (అల్లాహ్) సాక్షిగా, యూదులలో మరియు క్రైస్తవులలో నా గురించి విని, ఏ దివ్యసందేశంతో (ఏకైక దైవారాధనా సందేశం) నేను పంపబడినానో, దానిని విశ్వసించకుండా చనిపోయే వారెవరూ ఉండరు. కాని వారిలో ఎవరైతే అలా విశ్వసించక చనిపోతారో, వారు నరకాగ్ని నివాసులుగా మిగిలిపోతారు.”
(ఖుర్ఆన్ లోని 3:116వ వచనం కూడా చూడండి)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.