عَنْ أُمِّ الْمُؤْمِنِينَ أُمِّ عَبْدِ اللَّهِ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: قَالَ: رَسُولُ اللَّهِ صلى الله عليه و سلم : مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ [رَوَاهُ الْبُخَارِيُّ] ،[وَمُسْلِمٌ] وَفِي رِوَايَةٍ لِمُسْلِمٍ: مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ
అనువాదం
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా ( రదియల్లాహు అన్హా) ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:
“ఎవరైతే మా ఈ ధర్మములో లేనటువంటి (విషయాలను) ఆరంభిస్తారో అవి తిరస్కరించబడతాయి (అవి అంగీకరించబడవు).”
సహీహ్ ముస్లిం ఉల్లేఖనంలో ఇలా పేర్కొనబడింది:
“ఎవరైనా ఏదైన ఆచరణ చేస్తే, ఆఆచరణ పట్ల మా ఆజ్ఞా ఏమి లేనట్లైతే అది తిరస్కరించబడుతుంది (అంగీకరించబడదు).”
పుస్తక సూచనలు
సహీహ్ బుఖారీ-2697, సహీహ్ ముస్లిం-1718.
తెలుగు రియాజుస్సాలిహీన్ 1 – పేజి 273, హ170.
(సహీహ్ బుఖారి – ఒడంబడికల ప్రకరణం. సహీహ్ ముస్లిం – వ్యాజ్యాల ప్రకరణం).
హదీసు ప్రయోజనాలు
1. అన్ని రకాల ‘బిద్అత్’ లు ధూత్కరించబడుతాయి. చేసేవాడి ఉద్దేశము మంచిదైన సరే. దీనికి ఆధారం: ‘ఎవరైతే మా ఈ ధర్మములో లేనటువంటి విషయాలను) ఆరంభిస్తారో అవి తిరస్కరించ బడతాయి’.
2. ‘బిద్అత్ ‘కి పాల్పడే వారికి దూరంగా వుండాలి.
3. ధార్మిక పరమైన కార్యాలకు విరుద్ధమైనవి అంగీకరించబడవు. ప్రవక్త వాక్యము ప్రకారం: ఎవరైనా ఏదైన ఆచరణ చేస్తే, ఆ ఆచరణ పట్ల మా ఆజ్ఞా ఏమియు లేనట్లైతే అది తిరస్కరించబడుతుంది. దీనికై ఒక సంఘటన: ఒక సహాబి పండుగ రోజున నమాజుకు ముందే జిబహ్ చేసారు, అప్పుడు ప్రవక్త ( అతనికి ‘నీ మేక కేవలం మాంసపు మేకే’ అని చెప్పారు.
4. ‘దీన్'(అల్లాహ్ ధర్మము) లో ‘బిద్అత్’ని ప్రారంభించటం ‘హరాం’ నిషిద్దం. వాక్య పరమైన ‘బిద్అత్’ పట్ల: “మన్ అహదస”, ఆచరణ పరమైన ‘బిద్అత్’ పట్ల “మన్ అమిల” అనే వాక్యాల ద్వారా వ్యక్తమవుతుంది.
5. కర్మలు అంగీకరించబడటానికి అవి ‘సున్నత్’ ప్రకారమై ఉండాలి.
6. గోప్యమైన విషయాలలో ఆదేశం మారదు. దీనికై : “ఆ ఆచరణ పట్ల మా ఆజ్ఞ ఏమియు లేదు”. అనే వాక్యంతో ఆధారం తీసుకొనబడింది.
7. వారించడం అనేది అలజడిని అరికడుతుంది. వారించబడినవన్నీ ‘దీన్’ ధర్మములో లేనివే, దాన్ని తిరస్కరించాలి.
8. సంతానము లేకపోయినా తన పేరును ‘కునియత్’ (అబ్బాయి పేరుతో జతపరిచి)తో పిలుచుకోవచ్చు. ఎందుకంటే ‘ఆయెషా (రదియల్లాహు అన్హా) ‘ కు ఎలాంటి సంతానము లేదు.
9. ‘షరీఅత్’ ధర్మశాసనాన్ని అల్లాహ్ పరిపూర్ణం చేసాడు.
10. తన సమాజం పట్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తపన, వారి కర్మలు ధూత్కరించ బడతాయెమోనన్న భయముతో వాటికి దూరంగా వుండండి అని ఆదేశించారు.
హదీసు ఉల్లేఖులు
మోమినీన్ ల మాతృమూర్తి ఆయిషా సిద్దీఖ (రజియల్లాహు అన్హా) :
మోమినీన్ల మాతృమూర్తి, ఉమ్మె అబ్దుల్లాహ్, ఆయిషా సిద్దీఖ బిన్తె అబు బక్ర్ (రదియల్లాహు అన్హు). వీరి తల్లి పేరు ఉమ్మె రొమాన్, ఆమిర్ బిన్ ఉవైమిర్ చెల్లెలు కనానియహ్ తెగ నుండి వున్నవారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ కంటే రెండు సంవత్సరాల ముందు ‘షవ్వాల్’ మాసములో ఆమెతో వివాహమాడారు. ఒక ఉల్లేఖనంలో 3 సంవత్సరాల ముందు అనే ప్రస్తావన దొరుకుతుంది. ఆయన పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమె వయస్సు 6 లేక 7 సం||లు||. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె వయస్సు 9 సం||లు||. ఆమె యొక్క ‘కున్నియత్’ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఆమె అక్క కొడుకు అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ పేరు పై ఉమ్మె అబ్దుల్లాహ్ అని పెట్టారు. పొగడ్తలు మరియు విశిష్ఠతలతో అతీతులు. ఆమె పై నిందారోపణలు మోపినప్పుడు ఖుర్ఆన్ గ్రంధము ‘సూరె నూర్’లో అల్లాహ్ ఆమె పట్ల పవిత్రతను అవతరింపజేసాడు. హి.శ 57లేదా 58న రంజాన్ నెల 17వ తేదీన మంగళవారం నాడు మరణించారు. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారు జనాజ నమాజ్ చదివించారు. ‘బఖీ’ స్మశానంలో పాతి పెట్టడం జరిగింది. ఉర్వా వాక్కు ప్రకారం: అరబ్ కవితలు, ఫిఖ్ హ్, మరియు వైద్యశాస్త్రంలో ఆమె కంటే గొప్పగా తెలిసినవారు ఎవరూ లేరు.
(రి. సా. ఉర్దు – 1, పేజి:36)
—
అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/
https://youtu.be/s1wHqzntmgE – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [5 నిముషాలు]
బిద్అత్ (కల్పితాచారం) కు సంభందించిన మరింత సమాచారం, పుస్తకాలు , ఆడియో వీడియోల కొరకు క్రింది లింక్ నొక్కండి:
https://teluguislam.net/others/bidah/