హదీసు 3: ఇస్లాం యొక్క మూల స్తంభాలు | అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్

عَنْ أَبِي عَبْدِ الرَّحْمَنِ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْت رَسُولَ اللَّهِ صلى الله عليه و سلم يَقُولُ: ” بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إلَهَ إلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ”. [رَوَاهُ الْبُخَارِيُّ] ، [وَمُسْلِمٌ].

పదాల విశ్లేషణ 

బునియ  بُنِيَ
(క్రియ): పునాది కట్టబడినది, నిర్మించబడినది 

عَلَى خَمْسٍ అలా ఖమ్ సిన్ : అయిదు స్తంభాల మీద 

إِقَامَ الصَّلَاةِ ఇఖామస్సలాతి:
నమాజుని వాటి షరతులతోపాటు ఎల్లప్పుడు ఆచరించుట 

إِيْتَاءِ الزَّكَاةِ ఈతాయిజ్జకాతి : జకాత్ ను హక్కుగల వారికి ఇవ్వుట 

بَيْتُ الله బైతుల్లాహ్ : అల్ కఅబతు 

అనువాదం 

హజ్రత్ ఇబ్నె ఉమర్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తునారు: “నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా చెబుతుండగా విన్నాను:

ఇస్లాం ధర్మం ఐదింటి పై ఆధారపడి వుంది.
1. అల్లాహ్ తప్ప వేరొక (నిజమైన) ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన (అల్లాహ్) దాసుడని, మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలుకుట,
2. నమాజ్ స్థాపించుట,
3. జకాత్ చెల్లించుట,
4. అల్లాహ్ గృహము (కాబా) యొక్క “హజ్” యాత్ర చేయుట,
5.పవిత్ర రమదాన్ మాసపు ఉపవాసాలు పాటించుట”. 

హదీసు ప్రయోజనాలు 

1. ఐదు పూటల నమాజు యొక్క అవశ్యకత, దీనిపైనే ఇస్లాం నిలబడియున్నది. 

2. ఆలోచనల్లో చొచ్చుకుపోవటానికి జ్ఞానేంద్రియాల ద్వారా అర్ధమైయ్యే ఉపమానాలు ఇవ్వటం. ఇస్లాం మరియు దాని మౌలికల ఉపమానం పునాది పై నిర్మితమైయున్న ఇల్లు లాంటిది. 

3. ఐదు పూటల నమాజు చేయగలిగే శక్తి వున్న ప్రతి ఒక్కరిపై నమాజ్ పాటించుట విధి. ఎవరైతే షహాదతైన్, మరియు నమాజును విడనాడుతారో వారు ‘కుఫ్ర్’ చేసినట్లే (తిరస్కారానికి గురైనట్లై). 

4. ‘మాసము’ అనే పదము చెప్పకుండా కేవలం ‘రమదాన్’ పదము తోనే మాసము అని చెప్పుకోవచ్చు. 

5. ఇస్లాం అనేది అనేక రకాల విధులతో నిర్మితమైయున్నది. 

సూచనలు

సహీహ్ బుఖారీ-8, సహీహ్ ముస్లిం-16 
తెలుగు రియాజుస్సాలిహీన్ 2 – పేజి 72, హ1075.
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, విశ్వాస ప్రకరణలు) 

హదీసు ఉల్లేఖులు 

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు): 

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ బిన్ నుఫైల్ బిన్ అబ్దుల్ ఉజ్జా అల్ ఖరషి, ‘అల్ అదవి’ అనేది పేరు. అబూ అబ్దుర్రహ్మాన్ కున్నియత్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నతులను అందరికన్న ఎక్కువ అనుసరించే వారు. ఇందుకనే ఆయనకు ‘ముత్తబె సున్నత్‘ (సున్నత్ ను  అనుసరించేవారు) అనే బిరుదుతో గుర్తుచేయడం జరుగుతుంది. తమ తండ్రిగారుతోపాటు పిన్నతనంలోనే ఇస్లాం స్వీకరించి ముస్లిం అయ్యారు. ఆయన్ను ‘జాహిద్‘ (ప్రాపంచికతను విడనాడేవాడు), మరియు గట్టిజ్ఞానము గల సహాబాలో లెక్కించబడుతారు. మొదటి సారిగా ‘ఖన్ దఖ్‘ యుద్ధములో పాల్గున్నారు. పిన్న వయస్సు కారణంగా ‘బదర్’ యుద్ధములో అనుమతించబడలేదు. ‘ఖన్ దఖ్’ యుద్ధము తరువాత ఏ యుద్ధలములోనూ వెనుకవుండలేదు. ఎక్కువ హదీసులు ఉల్లేఖించే వారిలో వీరు కూడా వున్నారు. ఈయనతో హదీసు గ్రంధాల్లో దాదాపు 1630 హదీసులు ఉల్లేఖించిబడ్డాయి. 

(రి.సా. ఉర్దు – 1, పేజి:49)

అల్ అర్బయీన్ అన్నవవియ్యహ్ – 40 హదీసుల సమాహారం(మెయిన్ పేజీ)
https://teluguislam.net/40h/