ఒక వ్యక్తి వేరొక వ్యక్తి తరపున హజ్ & ఉమ్రా చేయడం (హజ్, ఉమ్రా అల్-బదల్)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/q2tZ4aHJ2es – [4 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇతరుల తరపున ఉమ్రా లేదా హజ్ చేయడానికి గల షరతులను వివరించబడ్డాయి. తన కోసం ఉమ్రా లేదా హజ్ చేసిన వ్యక్తి మాత్రమే ఇతరుల తరపున చేయగలడు. ఒకవేళ బ్రతికి ఉన్న వారి తరపున చేయాల్సి వస్తే, ఆ వ్యక్తి ఆర్థికంగా స్థోమత కలిగి ఉండి, ప్రయాణం చేయలేనంత అనారోగ్యంతో లేదా వృద్ధాప్యంతో బాధపడుతున్నప్పుడు మాత్రమే అనుమతించబడుతుంది. దీనికి ఆధారంగా, తన వృద్ధుడైన తండ్రి తరపున హజ్ చేయవచ్చా అని ప్రవక్త ముహమ్మమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగిన ఒక మహిళ యొక్క హదీసు ఉదహరించబడింది.
ఇతరుల తరపున ఉమ్రా లేదా హజ్ చేయడం
ఒక వ్యక్తి మరో వ్యక్తి వైపు నుండి ఉమ్రా లేదా హజ్ చేయడం. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు, విషయం అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తో నేను చెప్తున్నాను గమనించండి. నేను ఇక్కడ సౌదియాలో ఉన్నాను. నా యొక్క ఫ్రెండ్ తన తల్లి వైపు నుండి ఉమ్రా చేయమని నాకు చెబుతున్నాడు. ఆ తల్లి ఇంకా బ్రతికి ఉంది. అయితే, నేను ఆ తల్లి వైపు నుండి ఉమ్రా చేయవచ్చునా?
ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, నేను ఒకరి వైపు నుండి ఉమ్రా చేస్తున్నానంటే ముందు నేను నా తరఫు నుండి ఉమ్రా చేసి ఉండాలి. హజ్ విషయమైతే హజ్ చేసి ఉండాలి. ఇదొకటి అర్థమైంది కదా? రెండోది, ఎవరి వైపు నుండి నేను ఉమ్రా చేస్తున్నానో, అతను నా సొంత తల్లి, తండ్రి అయి ఉంటే అది వేరే విషయం. అంటే, చనిపోయిన నా తల్లి, నా తండ్రి వైపు నుండి నేను ఉమ్రా చేయడం, వారికి పుణ్యం లభించాలని, ఇలా చేయవచ్చు.
కానీ ఇప్పుడు వచ్చిన ప్రశ్నలో మరో వ్యక్తి తల్లి గురించి నేను ఉమ్రా చేయడం. అయితే ఇలా ఎప్పుడు చేయవచ్చంటే, స్వయంగా ఆ తల్లి ఆర్థికంగా, డబ్బు పరంగా హజ్ లేదా ఉమ్రా చేసేటువంటి శక్తి కలిగి ఉంది, కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఆమె ప్రయాణం చేసే స్థితిలో లేదు. అంటే ఆరోగ్యం ఆమెకు సహకరించదు ప్రయాణం చేయడానికి.
అబూ దావూద్ లో వచ్చిన హదీస్, అదే ఒక స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్నించింది, ప్రవక్త హజ్ చేసిన సందర్భంలో, నా తండ్రి చాలా వయోవృద్ధులు,
شَيْخٌ كَبِيرٌ
(షేఖున్ కబీర్)
చాలా వృద్ధుడు.
أَدْرَكَتْهُ فَرِيضَةُ اللَّهِ
(అద్రకత్ హు ఫరీదతుల్లాహ్)
అల్లాహ్ యొక్క విధి (హజ్) ఆయనపై విధిగా అయింది,
لَا يَثْبُتُ عَلَى الرَّاحِلَةِ
(లా యస్బుతు అలర్రాహిల)
కానీ అతను వాహనంపై కూర్చుండలేడు.
అంతటి వయోవృద్ధులు, అంతటి ఆరోగ్యం క్షీణించిన వారు. అతని వైపు నుండి నేను చేస్తే ఎలా అని అంటే, ప్రవక్త అనుమతించారు.
ఒకవేళ వాస్తవంగా ఇలాంటి స్థితి ఉండేది ఉంటే, చేయడంలో ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు.
అల్లాహ్ నన్ను క్షమించు గాక. అబూ దావూద్ లో ఈ హదీస్ ఉంది అందులో అనుమానం లేదు. హదీస్ కానీ ఇది సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో కూడా ఉంది. నాకు అబూ దావూద్ యొక్క రిఫరెన్స్ గుర్తొస్తే అదే నేను చెప్పేశాను. సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 1513, అలాగే సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 1855, అలాగే ముస్లిం సహీహ్ ముస్లిం హదీస్ నెంబర్ 1334 మరియు అబూ దావూద్ లో 1809.
హజ్జ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [ యూట్యూబ్ ప్లే లిస్ట్]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2o33G4d-Mob_ncywRmvJze