ముస్లింలు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ (పెట్టుబడి) చేయవచ్చా? అనుమతి ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి?
https://youtu.be/U5R1ga7xuAI [5 నిముషాలు]
Can Muslims invest in share market?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ముస్లింలు స్టాక్ మార్కెట్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చా అనే ప్రశ్నకు ఈ ప్రసంగంలో సమాధానం ఇవ్వబడింది. కంపెనీ యొక్క ప్రధాన వ్యాపారం ఇస్లాంలో నిషేధించబడిన (హరామ్) వస్తువులతో (మద్యం వంటివి) ఉండకూడదని మరియు దాని ఆర్థిక లావాదేవీలలో వడ్డీ (రిబా) వంటి హరామ్ అంశాలు ఉండకూడదని స్పష్టం చేయబడింది. టెక్నాలజీ కంపెనీల వంటివి హలాల్ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, అవి వడ్డీ ఆధారిత బ్యాంకు రుణాలపై ఆధారపడితే, ఆ షేర్లలో పెట్టుబడి పెట్టడం కూడా అనుమతించబడదని వివరించబడింది. అంతేకాక, చాలా షేర్ ట్రేడింగ్‌లు వాస్తవ సరుకులు లేదా ఆస్తులు లేకుండా, కేవలం డబ్బుతో డబ్బు వ్యాపారంలా (ఊహాజనితంగా) జరుగుతాయని, ఇది కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించారు. అందువల్ల, ఏదైనా షేర్లో పెట్టుబడి పెట్టే ముందు దాని వ్యాపార సరళి, ఆర్థిక మూలాల గురించి క్షుణ్ణంగా పరిశోధించి, ధర్మ పండితులను సంప్రదించి, అది పూర్తిగా హలాల్ అని నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలని నొక్కి చెప్పబడింది.
بارك الله فيك شيخ
[బారకల్లాహు ఫీక్ షేక్]
షేక్, అల్లాహ్ మీకు శుభాలు ప్రసాదించుగాక.
ఇది స్టాక్ మార్కెట్ షేర్స్ గురించి. ముస్లింలు స్టాక్ మార్కెట్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చా? ఒకవేళ అనుమతి ఉంటే, ఎటువంటి కండిషన్స్ చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయగలం? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మనం కొందరు చెప్తారు, హరామ్ బిజినెస్ లేకుండా టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఈ టెక్నాలజీ కంపెనీస్ కూడా, అన్నీ కూడా రిబాతో డీల్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ వాళ్ళు బ్యాంకు నుంచే లోన్ తెచ్చుకుంటారన్నమాట. లోన్ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్లకు, వాళ్లకు వచ్చే ప్రాఫిట్ లో ఆ రిబాను కూడా కలుపుకుంటారన్నమాట. ఆ రిబాను కూడా కలుపుకొని ప్రాఫిట్ షేర్ చేస్తారు వాళ్ళ షేర్ హోల్డర్స్ కి. ఇటువంటి పరిస్థితుల్లో మనము, మనకు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఈ షేర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి?
దీనికి సంక్షిప్తంగా, చాలా చిన్నగా సమాధానం కూడా ఇవ్వొచ్చు, చాలా దీర్ఘంగా కూడా సమాధానం ఉంటుంది. ముందు చిన్న సమాధానం వింటాము, అర్థమయ్యేది ఉంటే అల్హందులిల్లాహ్. అదేమిటంటే, ఈ రోజుల్లో షేర్ మార్కెట్ అని చాలా మంది షేర్స్ కొనడం, అమ్మడం అనేది స్వయం తాముగానీ లేదా వేరే ఎవరిదైనా, వేరే ఎవరి ద్వారానైనా గానీ చేస్తారో, అందులో ఇస్లాం నిషేధించిన మత్తు, ఖమర్ మరియు ఇంకా వేరే ఇట్లాంటి డైరెక్ట్ వేటినైతే ఇస్లాం నిషేధించిందో, అలాంటి విషయాల, వస్తువుల వ్యాపారం అనేది ఉండకూడదు.
అలాగే, ఇండైరెక్ట్‌గా ఏవైతే హరామ్ ఉన్నాయో, ఉదాహరణకు టెక్నాలజీ అనేది చెప్పారు, హలాల్ కానీ అందులో ఇంట్రెస్ట్, వడ్డీ, మిత్తి, బ్యాజ్, రిబా ఏదైతే ఉందో, దాని కారణంగా అది హరామ్ అవుతుంది. సంక్షిప్తంగా, ఇస్లాంకు వ్యతిరేకమైన డైరెక్ట్ బిజినెస్ గానీ లేదా హలాల్ బిజినెస్‌గా కనబడుతున్న దానిలో ఇస్లాంకు వ్యతిరేకమైన ఏదైనా హరామ్ అందులో ఉంది అంటే, అలాంటి వాటిలో మనం షేర్స్ కొనకూడదు, అలాంటి వాటిలో మనం పాలుపంచుకోకూడదు, పొత్తు కలవకూడదు.
అంతేకాకుండా, కొంతమంది ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ మరియు ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో జరిగే ఎన్నో షేర్స్ నిరాధారంగా ఉంటాయి. అంటే ఏమిటి? వాస్తవానికి వెనక అక్కడ ఏ సరుకు లేదు, సామాను లేదు. కొనే, అమ్మే అటువంటి సామానులు లేవు. కేవలం పైసాకు పైసా అటువంటి బిజినెస్ నడుస్తుంది. ఒకవేళ ఇట్లాంటిది ఏది ఉన్నా కూడా సరియైనది కాదు. అందుకొరకు, ఇక్కడ దీనికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన సమాధానం కంటే, సంక్షిప్త సమాధానమే మేలు. ఏంటి? ఎగ్జాంపుల్, నీవు ఒక షేర్ కొనాలనుకుంటున్నావు. ఎవరైనా వచ్చి నీకు ఏదైనా ఒక షేర్లో ఇన్వెస్ట్ చేయమని చెబుతూ ఉంటే, ఆ సందర్భంలో నీపై చాలా గొప్ప బాధ్యత ఉంది. వెంటనే అతని ఒక్కని మాట విని ఏ రకంగా కూడా మోసపోకుండా, వారి యొక్క పద్ధతి ఏమిటి? ఏ ఎందులో వారి యొక్క షేర్స్ ఉన్నాయి? ఆ యొక్క సామానులు, సరుకులు ఏమిటి? అవి ఏ ఆధారంగా, ఏ బేస్ మీద ఆ బిజినెస్ నడుస్తుంది? ఇస్లామిక్ నాన్-ఇంట్రెస్ట్ మరియు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ లోని ద్వారా నడుస్తుందా? లేక ఇట్లాంటి ఏమైనా హరామ్ విషయాలు ఉన్నాయా? వివరంగా తెలుసుకోవాలి. కేవలం వారి ద్వారా తెలుసుకొని తృప్తి పడకూడదు. ఆ వివరాలను ధర్మ పండితులతో, దగ్గరలో ఉన్న వారితో తెలుసుకోవాలి. మొత్తం వివరించాలి వారికి. ఆ తర్వాత అది హలాల్ లేక హరామ్ అనేది. ఎందుకంటే, ఈ దగ్గరిలో కొన్ని కాలాల్లో, 10, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి మనం ఎన్నో ఇట్లాంటివి చూశాము. క్వాంటం అని, ఇంకా వేరే చైన్ బిజినెస్ సిస్టంలో లాంటి వాటిలో పాలు పంచుకోవడం, ఇన్వెస్ట్ చేయడం, ఇంకా వేరే కొన్ని గోల్డ్ స్కీములలో, గోట్ స్కీములలో, లేదా ఇంకా వేరే కొన్ని ఆస్ట్రేలియాకు పంపుతున్నటువంటి ఆ ప్రత్యేక పూలు అని, ఎన్నో రకాలుగా ఎందరో వచ్చి బిజినెస్‌లు ఉన్నాయి, మీరు ఇందులో షేర్ తీసుకోండి అన్నట్లుగా చెప్పి, అవి హలాల్ అని కొన్ని చోట్ల నుండి తప్పుడు ఫత్వాలు తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేశారు. అందుకొరకు, ఒక నలుగురిని ఇలాంటి విషయాలలో వేరువేరు ధర్మ పండితులను కలుసుకొని మనం ఇందులో ముందడుగు వేయాలి. సంక్షిప్తంగా, ఎక్కడ ఇస్లాంకు వ్యతిరేకమైన ఏదైనా విషయం ఉంది అంటే, అలాంటి షేర్స్ మనం కొనకూడదు.
جزاكم الله خيرا شيخ
[జజాకుముల్లాహు ఖైరన్ షేక్]
షేక్, అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
ఇతరములు
- వడ్డీ తినుట [వీడియో]
- భర్త వడ్డీ సంపాదన నుండి భార్య ఎలా దూరముండాలి? [ఆడియో]
- ఇస్లాంలో చీటీ పాటాలు వెయ్యవచ్చా? [వీడియో]

You must be logged in to post a comment.