
حَدَّثَنَا إِسْمَاعِيلُ، قَالَ حَدَّثَنِي مَالِكٌ، عَنْ إِسْحَاقَ بْنِ عَبْدِ اللَّهِ بْنِ أَبِي طَلْحَةَ، أَنَّ أَبَا مُرَّةَ، مَوْلَى عَقِيلِ بْنِ أَبِي طَالِبٍ أَخْبَرَهُ عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم بَيْنَمَا هُوَ جَالِسٌ فِي الْمَسْجِدِ وَالنَّاسُ مَعَهُ، إِذْ أَقْبَلَ ثَلاَثَةُ نَفَرٍ، فَأَقْبَلَ اثْنَانِ إِلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم وَذَهَبَ وَاحِدٌ، قَالَ فَوَقَفَا عَلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم فَأَمَّا أَحَدُهُمَا فَرَأَى فُرْجَةً فِي الْحَلْقَةِ فَجَلَسَ فِيهَا، وَأَمَّا الآخَرُ فَجَلَسَ خَلْفَهُمْ، وَأَمَّا الثَّالِثُ فَأَدْبَرَ ذَاهِبًا، فَلَمَّا فَرَغَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم قَالَ
أَلاَ أُخْبِرُكُمْ عَنِ النَّفَرِ الثَّلاَثَةِ أَمَّا أَحَدُهُمْ فَأَوَى إِلَى اللَّهِ، فَآوَاهُ اللَّهُ، وَأَمَّا الآخَرُ فَاسْتَحْيَا، فَاسْتَحْيَا اللَّهُ مِنْهُ، وَأَمَّا الآخَرُ فَأَعْرَضَ، فَأَعْرَضَ اللَّهُ عَنْهُ ”
అబూ ‘వాఖిద్ అల్లెతి (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు; ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మసీదులో కూర్చొని ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు ఇంకా కొందరు కూడా అక్కడ కూర్చోని ఉన్నారు. ఇంతలో ముగ్గురు మనుషులు అక్కడకు వచ్చారు. వారిలో ఇద్దరయితే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు ప్రసంగం వినేందుకు వచ్చారు. మూడో మనిషి అక్కణుంచి వెళ్లిపొయ్యాడు. ఆ ఇద్దరూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుకు వచ్చి కొంతసేపు నిలబడ్డారు. అంతలో వారిలో ఒకడు సభలో మధ్యన ఒకచోట కొంచెం ఖాళీ స్థలం ఉండటాన్ని గమనించి అక్కడకు పోయి కూర్చున్నాడు. రెండో అతను సభలో జనం వెనుక భాగంలో కూర్చున్నాడు. మూడో అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు. తమ ప్రసంగాన్ని ముగించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈ ముగ్గురి వ్యక్తుల గురుంచి మీకు తెలుపనా? ఒకతను ఆ అల్లాహ్ శరణు కోరుకున్నాడు; అల్లాహ్ అతన్ని కరుణించి అతనికి స్థలాన్ని ప్రసాదించాడు. రెండో అతను సభ లోపలకు చొరబడటానికి పోయి కూర్చోటానికి సిగ్గుపద్డాడు. అల్లాహ్ కూడా అతన్ని చూసి సిగ్గుపడ్డాడు, అతనిపై కృప చూపాడు. మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు.”
సహీహ్ బుఖారి. 3 వ అధ్యాయం “జ్ఞానం”. హదీథ్ నెంబర్:66
You must be logged in to post a comment.