https://youtu.be/1hjBCp_drL8
[3:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన హదీసులను ఈ ప్రసంగం వివరిస్తుంది. మొదటి హదీసు, జుమా ప్రసంగం జరుగుతున్నప్పుడు ఆలస్యంగా వచ్చి, ముందు వరుసలకు చేరుకోవడానికి ప్రజలను దాటుకుంటూ, వారి భుజాలను తోసుకుంటూ వెళ్ళడం నిషిద్ధమని స్పష్టం చేస్తుంది. అలా చేయడం ఇతరులకు ఇబ్బంది మరియు బాధ కలిగించడమేనని ప్రవక్త హెచ్చరించారు. రెండవ హదీసు, జుమా ప్రసంగం వింటున్నప్పుడు నిద్రమత్తు (కునుకు) వస్తే, ఆ స్థలం నుండి లేచి వేరే చోట కూర్చోవాలని సూచిస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రమత్తు దూరమవుతుందని ప్రవక్త తెలిపారు. ఈ రెండు హదీసులు జుమా రోజున ముస్లింలు పాటించవలసిన మర్యాదలు మరియు నియమాలను తెలియజేస్తాయి.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
జుమాకు సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు.
ఈరోజు, జుమా సందర్భంలో ప్రజల మధ్యలో నుండి దాటి ముందుకు వెళ్ళడం.
సునన్ అబీ దావూద్ (1118) మరియు సునన్ నిసాయి (1398)లో అబ్దుల్లా బిన్ బుస్ర రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
جَاءَ رَجُلٌ يَتَخَطَّى رِقَابَ النَّاسِ يَوْمَ الْجُمُعَةِ
(జా అ రజులున్ యతఖత్తా రిఖాబన్-నాసి యౌమల్ జుముఆ).
జుమా రోజు ఒక వ్యక్తి ప్రజల యొక్క మెడలను చీల్చుతూ ముందుకు రాసాగాడు.
وَالنَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ
(వన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం యఖ్తుబు).
ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తున్నారు, అంటే జుమా ప్రసంగం ప్రసంగిస్తున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని చూసి,
اجْلِسْ فَقَدْ آذَيْتَ
(ఇజ్లిస్ ఫఖద్ ఆదైత)
“అక్కడే కూర్చో, నీవు ప్రజలకు ఇబ్బంది కలిగించావు, బాధ కలిగించావు” అని చెప్పారు.
ఇది సహీహ్ హదీస్. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ఎవరైతే జుమా నమాజులో ముందు వస్తారో, ముందు పంక్తులను వారు పూర్తి చేయాలి. స్థలము ఖాళీగా వదిలి వెనుక కూర్చుండే ప్రయత్నం చేయకూడదు. మరియు వెనుక వచ్చేవారు ఇద్దరి మధ్యలో నుండి, వారి మెడలను, వారి యొక్క భుజాలను ఈ విధంగా చీలుస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఇది మంచి విషయం కాదు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎక్కడ స్థలం దొరుకుతుందో వెనుక వచ్చేవారు అక్కడే కూర్చునే ప్రయత్నం చేయాలి.
జుమా సందర్భంలో కునుకు వస్తే ఏమి చేయాలి?
దీనికి సంబంధించిన హదీస్ అబూ దావూద్ (1119) మరియు తిర్మిది (526)లో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను:
إِذَا نَعَسَ أَحَدُكُمْ وَهُوَ فِي الْمَسْجِدِ فَلْيَتَحَوَّلْ مِنْ مَجْلِسِهِ ذَلِكَ إِلَى غَيْرِهِ
(ఇదా నఅస అహదుకుమ్ వహువ ఫిల్ మస్జిద్ ఫల్-యతహవ్వల్ మిన్ మజ్లిసిహి దాలిక ఇలా గైరిహి)
“మీలో ఎవరైనా మస్జిద్ లో ఉండగా అతనికి కునుకు వస్తే, అతడు తన కూర్చున్న ఆ స్థలాన్ని వదిలి వేరే స్థలంలో వెళ్ళాలి, స్థలం మార్చుకోవాలి.”
దీని ద్వారా ఏం తెలిసింది? ఈ విధంగా మనకు కునుకు అనేది దూరమైపోతుంది, స్థలం మార్చడం మూలంగా.
అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు రెండు హదీసులు మనం తెలుసుకున్నాము. అల్లాహు తఆలా మరింత ఎక్కువ ధర్మజ్ఞానం ఖురాన్ హదీసుల ఆధారంగా మనకు ప్రసాదించు గాక. వాటి ప్రకారం ఆచరించి ఇతరులకు ధర్మ ప్రచారం చేసే అటువంటి సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
—
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/