4 వ అధ్యాయం : షిర్క్ నుండి భయపడుట
ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]
(అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)
https://teluguislam.net/2019/10/25/al-qawlul-sadeed/
యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl
باب الخوف من الشرك
4వ అధ్యాయం: షిర్క్ నుండి భయం చెందుట
[إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ]
“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు”. (నిసా 4:48).
[وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ]
(ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడైతే ఇబ్రాహీమ్ ఇలా వేడుకున్నాడో: “నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి. నన్నూ, నా సంతానాన్నీ విగ్రహాల పూజ నుంచి కాపాడు.” (ఇబ్రాహీం 14:35).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الْأَصْغَرُ قَالُوا: وَمَا الشِّرْكُ الْأَصْغَرُ يَا رَسُولَ اللهِ؟ قَالَ: الرِّيَاءُ
“అతి ఎక్కువగా నేను మీ పట్ల భయం చెందేది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) కు మీరు పాల్పడుతారని”, అప్పుడు సహచరులు “అదేమిటి”? అని అడిగితే “ప్రదర్శనాబుద్ధి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బదులిచ్చారు. (ముస్నద్ అహ్మద్ 23630).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారు:
مَنْ مَاتَ وَهُوَ يَدْعُو مِنْ دُونِ اللهِ نِدًّا دَخَلَ النَّار
“అల్లాహ్ తో మరొకరిని సాటి కల్పించి, దుఆ చేసేవాడు (అర్ధించేవాడు) అదే స్థితిలో చనిపోతే నరకంలో చేరుకుంటాడు” (బుఖారి 4497).
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
مَنْ لَقِيَ اللهَ لَا يُشْرِكُ بِهِ شَيْئًا دَخَلَ الْجَنَّةَ، وَمَنْ لَقِيَهُ يُشْرِكُ بِهِ دَخَلَ النَّارَ
“అల్లాహ్ తో మరెవ్వరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోయిన వ్యక్తి స్వర్గంలో చేరుకుంటాడు. అల్లాహ్ తో సాటి కల్పించి చనిపోయిన వ్యక్తి నరకంలో చేరుకుంటాడు”. (ముస్లిం 93).
ముఖ్యాంశాలు
1. షిర్క్ నుండి భయపడుట. (لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ నిసా 4:48, وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ ఇబ్రాహీం 14:35)
2. ప్రదర్శనాబుద్ధి షిర్క్‌లో వస్తుంది. (أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الْأَصْغَرُ. حم 23630)
3. అది “షిర్కె అస్గర్” (చిన్న షిర్క్) లో వస్తుంది. (పై హదీసు ఆధారంగానే)
4. సత్కార్యాలు చేసేవారిలో అది చోటు చేసుకుంటుందన్న భయం ఎక్కువ ఉంటుంది.
5. స్వర్గనరకాలు సమీపములోనే ఉన్నాయని తెలిసింది. (ముస్లిం 93)
6. ఒకే హదీసులో రెండిటిని కలిపి చెప్పడం జరిగింది.
7. షిర్క్ చేయకుండా చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు స్వర్గంలో చేరుతాడు. షిర్క్ చేసి చనిపోయి అల్లాహ్ తో కలసినవాడు నరకంలో పోతాడు. అతడు అందరికన్నా ఎక్కువ ప్రార్థనలు చేసినవాడైనప్పటికినీ.
8. ముఖ్య విషయం: ఇబ్రాహీం (అలైహిస్సలాం) తమను, తమ సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ తో దుఆ చేశారు.
9. “ప్రభూ! ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి” (14: 36). అంటూ (దుర్మార్గంలో పడుతున్న) అధికసంఖ్యాకులతో గుణపాఠం నేర్చుకొని “ఓ ప్రభూ! నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుము” అని అర్ధించారు.
10. ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) తెలిపిన ప్రకారం ఇందులో “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావం ఉంది.
11. షిర్క్ నుండి దూరమున్నవారి ఘనత తెలిసింది.
తాత్పర్యం
షిర్క్ తౌహీద్ కు విరుద్ధం. దాని రెండు రకాలు: ఒకటి షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్ = జలీ). రెండవది: షిర్కె అస్గర్ (చిన్న షిర్క్ = ఖఫీ)
షిర్కె అక్బర్ అంటే: అల్లాహ్ తో ‘మొరపెట్టుకున్నట్లు, భయం చెందినట్లు, ప్రేమంచినట్లు ఇతరులతో మొరపెట్టుకొనుట, భయం చెందుట, ప్రేమించుట. సారాంశమేమనగా: అల్లాహ్ కు చేయవలసిన ప్రార్ధనలు, ఆరాధనలు ఇతరులకు చేయుట షిర్కె అక్బర్. దీనికి పాల్పడినవానిలో ఏ మాత్రం తౌహీద్ లేనట్లే. అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించింది ఇలాంటి ముష్రికుల పైనే. అతని నివాసం నరకం. ఇక ఏవైనా ఇలాంటి పనులు చేస్తూ దానిని “వసీల”, “పుణ్యపురుషుల ప్రేమ”, అన్న పేర్లతో నిజాన్ని వక్రీకరిస్తే అది కూడా షిర్క్ అవుతుంది.
షిర్కె అస్గర్ అంటే: షిర్కె అక్బర్ వరకు చేర్పించే సాధనాలు, కార్యాలు. ఉదాహరణకు: “గులువ్వ్ ” (అతిశయోక్తి. అంటే: పుణ్యపురుషుల విషయంలో హద్దులు మీరుట), అల్లాహ్ యేతరుల ప్రమాణం, చూపుగోలుతనం, ప్రదర్శనాబుద్ధి మొదలగునవి).
ఇతరములు: