మరుగుదొడ్డికి (టాయిలెట్ –హమ్మాము) పోవునప్పుడు అనుసరించవలసిన నియమములు:
- మరుగుదొడ్డి (Toilet -హమ్మామ్)లో ప్రవేశించే ముందు చదవవలసిన దుఆ. ఇది బయటచదవవలెను.
- ఎవ్వరికీ కనబడని ప్రదేశములలో మాత్రమే మలమూత్ర విసర్జన చేయవలెను.
- ఖిబ్లా వైపు ముఖం గాని వీపుగాని చేయకూడదు.
- తొడలు కడుపును నొక్కేటట్లు కూర్చోవలెను.
- మలమూత్రములు ఒంటికి, బట్టలకు అంటకుండా జాగ్రత్త పడవలెను.
- మరుగుదొడ్డిలో నుండి మాట్లాడకూడదు.
- నిషేధ ప్రాంతములలో మలమూత్ర విసర్జన చేయరాదు.
- మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రపరచుకొను విధానం – a) ఎడమచేతితో b) నీటితో c) నీరులేనిచోట బేసి సంఖ్యలో ఇటుక, మట్టి(గడ్డలు) లేదా శుభ్రపరచగల వేరే వాటితో శుభ్రపరచవలెను.
- బైటికి వచ్చిన తర్వాత “గుఫ్ రానక్” అర్థం – “ఓ అల్లాహ్! నేను క్షమాపణ వేడుకొనుచున్నాను” అని పలకవలెను. లేదా “అల్ హందులిల్లాహిల్లదీ అద్ హబఅన్నిల్ ఆదా వ ఆఫాని” సకల స్త్రోత్రములు అల్లాహ్ కొరకే, ఆయనే నన్ను ఈ అపరిశుభ్రత నుండి శుభ్రపరచి నాకు ప్రశాంతత నొసంగెను.
“అల్లాహుమ్మ ఇన్ని అఁఊదుబిక మినల్ ఖుబ్ థి వల్ ఖబాయిథ్”
ఓ అల్లాహ్! నీచులైన మగ మరియు ఆడ జిన్నాతుల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.
10. మరుగుదొడ్డిలో ప్రవేశించునప్పుడు ముందు ఎడమకాలు లోపల పెట్టవలెను. బయటకు వచ్చునప్పుడు ముందు కుడికాలు బయట పెట్టవలెను.