కోపతాపాల గురించి హెచ్చరిక (warning about becoming angry)

హదీథ్׃ 09

التحذير من الغضب కోపతాపాల గురించి హెచ్చరిక

عن أبي هريرةَ رضيَ الله عنه أنّ رجلاً قال للنبيّ صلى الله عليه وسلم أوصِني. قال: ((لا تَغضب )) . فردّدَ مراراً, قال: ((لا تَغضب)) . رواه البخاري

అన్ అబి హురైరత రదియల్లాహు అన్హు అన్న రజులన్ ఖాలలిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం  అవ్ శిని, ఖాల – లా తగ్దబ్, ఫరద్దద మిరారన్, ఖాల – లా తగ్దబ్ రవాహుల్ బుఖారీ.

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అడగినారు – నాకు ఉపదేశం చేయండి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోపగించుకోవద్దు అని బోధించారు. ఆ వ్యక్తి మాటిమాటికీ అదే ప్రశ్నను అడుగగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిసారి అదే జవాబు (కోపగించుకోవద్దు) ఇచ్చారు.

హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం:- అబుహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రదియల్లాహు అన్హు ఖైబర్ యుద్ధం జరిగిన 7హి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలోనికి చేరారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచుకున్నవారిలో ఒకరు.

వివరణ – కోపతాపాలకు దూరంగా ఉండమని ఈ హదీథ్ బోధిస్తున్నది. కాబట్టి కోపం కలిగించే పరిస్థితుల నుండి మరియు పరిసరాల నుండి మనం కాపాడుకోవలెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రశ్నించిన వ్యక్తిని కోపం నుండి దూరంగా ఉండమనే జవాబునే అనేక సార్లు ఇచ్చినారు. దీనిని బట్టి కోపం నుండి దూరంగా ఉండవలసిన ఆవశ్యకత మనకు అర్థం అవుతున్నది. ఈ ప్రశ్న అడిగిన సహచరుడికి కోపం ఎక్కువగా ఉండేది. ప్రశ్న అడిగిన సహచరుడిలో ఏ బలహీనతలున్నాయో, ఏ ఏ తప్పులున్నాయో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి వాటి నుండి బయటకు వచ్చేటట్లు, వాటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన ఉపదేశం చేసేవారు.

ఈ హదీథ్ ద్వారా నేర్చుకోవలసిన విషయాలు

  1. ఇస్లాం ధర్మం కోపతాపాల నుండి దూరంగా ఉండమని ఆదేశిస్తున్నది.
  2. కోపతాపాలు షైతాన్ ఆచరణలు కాబట్టి అవి మానవుడికి కీడును మాత్రమే కలిగిస్తాయి.
  3. ముస్లింలు అనవసరంగా ఎవరిపైనా కోపగించుకో కూడదు.
  4. ఓర్పు, సహనం వంటి మంచి గుణాలను ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది.
  5. కోపతాపాలు ఎక్కువగా ఉన్నవారు అనేక విధాలుగా నష్టపోతారు.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా