కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి (Dua while entering and exiting from toilet)

హదీథ్׃ 08

آداب قضاء الحاجةకాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి

عن  أنس بن مالك رضي الله عنه قال: كان النبي r إذا دخلَ الخلاء قال: اللهمّ إني أعوذ بك منَ الخُبثِ والخبائث». رواه البخاري

عن عائشةَ رضي الله عنه , أنّ النبيّ rكانَ إذا خَرَجَ مِنَ الخلاءِ قالَ: «غُفْرَانَكَ». رواه الترمذي وغيره

అన్ అనసిబ్ని మాలికిన్ రదియల్లాహు అన్హు ఖాల కానన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం – ఇదా దఖలల్ ఖలాఅ, ఖాల అల్లాహుమ్మ ఇన్ని అఊదుబిక మినల్ ఖుబ్థి వల్ ఖబాయిథ్ – రవాహుల్ బుఖారి.

అనువాదం:- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళినప్పుడు, ఇలా ప్రార్ధించేవారు, అల్లాహ్ నేను మగ దుష్ట శక్తులు మరియు ఆడ దుష్టశక్తుల నుండి నీ శరణు వేడుకుంటున్నాను.

ఇదే విషయం పై ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఇంకో హదీథ్ లో ఇలా తెలుపబడినది –  కాలక్రుత్యాలు తీర్చుకుని బయటకి వచ్చినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం “గుఫ్రానక అంటే మేము నీ యొక్క మన్నింపును కోరుతున్నాము” అని పలికేవారు.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

వివరణ: బహిర్భూమి కోసం (టాయిలెట్ -హమామ్) వెళ్ళే ముందు పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. ఇంకా ప్రయాణంలో, ఎడారి ప్రాంతాలలో, పొలాల్లో, మైదానాలలో లేక పల్లెటూర్లలో అంటే ఆధునిక యుగపు టాయిలెట్ లు లేనిచోట బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా పైన తెలిపిన ప్రార్థన చేయవలెను. దీనికి కారణం మానవుడికి కీడు చేసే దుష్టశక్తులు అన్నిచోట్లా ఉంటాయి. అనస్ రదియల్లాహు అన్హు హదీథ్ ద్వారా మనకు తెలిసేదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బిగ్గరగా పై ప్రార్థన (దుఆ) చేసేవారు కాబట్టి మనం కూడా పైకి వినబడే విధంగా ప్రార్థన చేయవలెను. ఈ ప్రార్థన ద్వారా మానవుడికి కీడు చేయగలిగే మరియు మానవులకు కనబడని మగ, ఆడ జిన్నాతుల వంటి దుష్టశక్తుల నుండి మనం అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాము. మరియు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ సమయంలో ఏమైనా పొరపాట్లు, తప్పులు జరిగినట్లయితే, వాటిని మన్నింపమని అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా