దిన చర్యల పాఠాలు [పుస్తకం]

బిస్మిల్లాహ్

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు]

సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

విషయ సూచిక 

క్రింది అన్నీ చాఫ్టర్లు PDF లింకులు గా ఇవ్వబడ్డాయి.

  1. సమయాన్ని కాపాడి అప్రయోజక పనులలో వృధా చేయక ఉండుట మంచిది
  2. తావీజు గురుంచి ఆదేశం
  3. జ్యోతిషుల వద్దకు పోవుట నిషిద్దం
  4. ఇంద్రజాలం , దాని నుండి హెచ్చరిక
  5. మంత్రము
  6. అల్లాహ్ పై తప్ప ఇతరుల పేరున ప్రమాణం చేయుట నిషిద్ధం
  7. దుశ్శకునం
  8. అల్లాహ్ పై నమ్మకం
  9. దుఆ అంగీకార ఘడియలు
  10. సామూహిక నమాజ్ వాజిబ్ (తప్పనిసరి)
  11. సామూహిక నమాజు ఘనత
  12. మస్జిద్ కు నిదానంగా , ప్రశాంతంగా వెళ్ళుట అభిలషణీయ
  13. నమాజుకు ముందుగానే వచ్చి , నిరీక్షించుట ఘనతగల విషయం
  14. తహియ్యతుల్ మస్జిద్
  15. సామూహిక నమాజు లో మొదటి పంక్తి ఘనత
  16. పంక్తులను సరి చేసుకొనుట విధి
  17. సామూహిక ఫజ్ర్ నమాజు ఘనత
  18. అస్ర్ నమాజు యొక్క ఘనత
  19. తహజ్జుద్
  20. నఫిల్ నమాజు ఆదేశాలు
  21. జుమా ఘనత, దాని సాంప్రదాయ మర్యాదలు
  22. జుమా నమాజుకు త్వరగా హాజరవతంలోని ఘనత – దాన్ని కోల్పోవటం గురుంచి హెచ్చరిక
  23. జుమా రోజు యొక్క ధర్మాలు, సంస్కారాలు
  24. పండుగ నమాజు ఆదేశాలు
  25. జిల్ హిజ్జ తోలి దశ ఘనత – దాని సంభందిత ఆదేశాలు
  26. ఖుర్బానీ
  27. సూర్య చంద్ర గ్రహణముల నమాజు – [పోస్ట్ లింక్]
  28. ఇస్తిస్ఖా (వర్షం కోరుట)
  29. ఇస్తిస్ఖా నమాజు
  30. వర్షానికి సంభందించిన ఆదేశాలు
  31. ఇస్తిఖార (మార్గదర్శక) నమాజు
  32. అనాధల భాద్యత వహించుటలో ఘనత , వారిని ప్రేమతో చూసుకోనుట అభిలషణీయం
  33. అనాధల సొమ్ము తినుట నిషిద్దం
  34. మనిషి తను ప్రేమించు వారితో ఉండును
  35. చిత్ర పటములు , వాటి ఆదేశాలు
  36. స్వప్నం దాని ఘనత మరియు దాన్ని గురుంచి అభాద్ద మాడేవారికి హెచ్చరిక
  37. మంచి స్వప్నాల ధర్మాలు , సంస్కారాలు
  38. ఆహ్వానము స్వీకరించుట
  39. అనుమతి మర్యాదలు
  40. షైతాను ముస్లింల మధ్య ఏ కలహాల్నైతే సృష్టిస్తాడో వాటి నుంచి జాగ్రత్తగా ఉండుట తప్పనిసరి
  41. వాగ్దాన భంగం నిషిద్దం
  42. మోసం , దాని గురుంచిన హెచ్చరిక
  43. కోపం నివారించబడింది. కోపం వచ్చినపుడు ఏమి చదవాలి ఏమి చేయాలి?
  44. శ్మశానవాటిక దర్శనం
  45. మత్తు సేవించుట నిషిద్దం
  46. జగడం, వాగ్వివాదం చేయుట గురుంచి హెచ్చరించ బడినది
  47. చెట్లు, తోటల పెంపకం యెక్క ఘనత
  48. క్రయ విక్రయాలకు సంభందిచిన ఆదేశాలు
  49. మితిమీరిన నవ్వు నివారించబడినది
  50. అసత్య ప్రమాణం చేయుట కఠినంగా నివారించ బడినది
  51. అబద్దపు సాక్ష్యం నిషేదించబడినది
  52. శపించుట నివారించబడినది
  53. కవిత్వం
  54. చెడు పదాలు ఉచ్చరించుట నివారించబడినది
  55. జిహాద్ (ధర్మ పోరాటం) ఘనత
  56. షహీద్, ముజాహిద్ లకు లభించు ప్రతిఫలం
  57. ప్రవక్త సహచరులు – జిహాద్
  58. ముస్లింల అవసరాలు తీర్చు ఘనత
  59. బిద్అత్ నుండి దూర ముండి ,ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అనుసరించుట విధి
  60. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కై దరూదు పంపు ఘనత
  61. రుణ గ్రస్తునికి వ్యవధి ఇచ్చుట లోని ఘనత
  62. వడ్డీ, దాని నుండి హెచ్చరిక
  63. ఖుర్ ఆన్ పారాయణ ఘనత
  64. సూరె భఖర , ఆలె ఇమ్రాన్ ఘనత
  65. అల్లాహ్ మార్గములో దానధర్మాలు చేయు ఘనత
  66. ఉత్తమమైన దానం
  67. గుప్త దానపు ఘనత
  68. సముచిత కారణం వలన బహిరంగంగా దానం చేయుట సమ్మతమే
  69. బిక్షాటన నివారణ, అర్ధింపు లేకుండా ఆత్మా సంతృప్తి తో తీసుకోనుట యోగ్యం
  70. ఉచ్చారించుటకు నివారించబడిన పలుకులు
  71. మృత్యువును స్మరించండి. చావును కోరకండి
  72. మృత్యువు ఆసన్నమైనప్పుడు పాటించవలసిన ఆదేశాలు
  73. అంతిమ ఆచరణ ప్రకారం ఫలితం
  74. జనాజా నమాజు ఆదేశాలు
  75. జనాజా నమాజు లో ఏమి చదవాలి
  76. జనాజా ఆదేశాలు
  77. ఖననం చేయుట, దానికి సంభందించిన ఆదేశాలు
  78. సహన ప్రోత్సాహం.కష్టమొచ్చినప్పుడు ఏమి చదవాలి?
  79. వీలునామా, దాని ఆదేశాలు
  80. ఆస్తి పంపకం, ఆదేశాలు
  81. మనిషి మరణం పట్ల పెదబోబ్బులు,(విదివ్రాతపై)అసంతృప్తి చెందకుండా కన్నీరు కార్చుట తప్పు కాదు
  82. సంతాన వియోగం కలిగిన వారు చేసే ఓర్పు పై పుణ్యం గలదు
  83. జనాజా నమాజు చేయు, శవపేటిక వెంట వేల్లుతలోని ఘనత.దాని సంభందిత కొన్ని ఆదేశాలు
  84. సమాధిలో మృతునికి ఏమి జరుగుతుంది?
  85. సమాధిని నేల మట్టంగా ఉంచాలన్న ఆదేశం
  86. మస్జిదె హరాం (మక్కా లోని పరిశుద్ద మస్జిద్), మదీనా మస్జిద్ (నబవి)ల ఘనత
  87. మక్కా ఆదేశాలు
  88. కూతురికి ఇష్టం లేని వారితో పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేయుట నిషిద్దం
  89. ఐకమత్యపు ఆదేశం , విచ్చిన్నం నుండి నివారణం
  90. అమాతులను కాపాడాలని, దాన్ని (హక్కు గలవారికి) ఇచ్చేయాలని ఆదేశం
  91. అల్లాహ్ వైపునకు పిలుచు ఘనత
  92. అతిశయం తో కూడిన ప్రశంస నివారించబడినది
  93. పాటల నిషిద్దత
  94. మహానుభావుడైన అల్లాహ్ దే గొప్పతనం. విస్తృతమైన రాజ్యం అతనిదే – [పోస్ట్ లింక్]

[పూర్తి పుస్తకాన్ని క్రింద చదవండి]

1-సమయాన్ని కాపాడి, ప్రయోజనం లేనివాటిలో వృథా చేయక ఉండుట విధి

عن ابن عباس ™ قال: قال رسول الله : نِعْمَتَانِ مَغْبُونٌ فِيْهِمِا كَثِيْرٌ مِنَ النَّاسِ: اَلصِّحَّةُ وَالْفَرَاغُ.

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ చెప్పారుః “రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడియున్నారు. ఒకటిః ఆరోగ్యం. రెండవదిః తీరిక”. (బుఖారి 6412).

عن عائشة رضي الله عنها أنها قالت: كَانَ رَسُولُ اللَّهِ ﷺ إِذَا دَخَلَ الْعَشْرُ (أَيْ عَشْرُ رَمَضَانَ) أَحْيَا اللَّيْلَ وَأَيْقَظَ أَهْلَهُ وَجَدَّ وَشَدَّ الْمِئْزَرَ

ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: రమజాను చివరి పది రోజులు రాగానే ప్రవక్త ﷺ రాత్రి జాగారణ చేసి సతీమణుల్ని మేల్కొలిపి నడుము బిగించేవారు. (అనగా ఇతోధికంగా ఆరాధనలో నిమగ్నులయ్యేవారు. (బుఖారి, ముస్లిం).

عن ابن مسعود ™ عن النبي ﷺ قال: لاَ تَزُولُ قَدَمَا ابْنِ آدَمَ يَوْمَ الْقِيَامَةِ مِنْ عِنْدِ رَبِّهِ حَتَّى يُسْأَلَ عَنْ خَمْسٍ: عَنْ عُمُرِهِ فِيْمَ أَفْنَاهُ وَعَنْ شَبَابِهِ فِيْمَ أَبْلاَهُ وَمَالِهِ مِنْ أَيْنَ اكْتَسَبَهُ وَفِيْمَ أَنْفَقَهُ وَمَاذَا عَمِلَ فِيْمَا عَلِمَ؟

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ప్రళయదినాన అల్లాహ్ సమక్షములో ఐదు విషయాలు ప్రశ్నించ బడనంత వరకు ఆదం కుమారుడు కదలలేడు. ఆ ప్రశ్నలు ఇవిః  జీవితకాలాన్ని ఏ ఏ కార్యాల్లో గడిపావు.  యవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు.  ధనం ఎలా సంపాదించావు.  ఎలా ఖర్చు చేశావు.  తెలుసుకున్న విషయాలపై ఎంతవరకు ఆచరించావు”. (తిర్మిజి).  

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: مَنْ خَافَ أَدْلَجَ وَمَنْ أَدْلَجَ بَلَغَ الْمَنْزِلَ أَلَا إِنَّ سِلْعَةَ اللَّهِ غَالِيَةٌ أَلَا إِنَّ سِلْعَةَ اللَّهِ الْجَنَّةُ

“భీతిగలవాడు వేకువ జామునే ప్రయాణం మొదలెడుతాడు. ఇలా వేకువజామునే ప్రయాణం చేసినవాడు క్షేమంగా గమ్యస్థానం చేరుకుంటాడు. వినండి! అల్లాహ్ సామాగ్రి అమూల్యమైనది. ఇంకా వినండి! అల్లాహ్ సామాగ్రి స్వర్గం” అని ప్రవక్త ﷺ చెప్పినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (తిర్మిజి).

విశేషాలుః

1- ఫలితమున్న విషయాల్లో సమయవాడకాన్ని అదృష్టంగా భావించడం తప్పనిసరి.

2- నిశ్చయంగా ఆదం కుమారుడు తన సమయం పట్ల ప్రశ్నించబడును.

3- సమయం విషయంలో అతిగా మితిమీరినవారు తమ సమయాన్ని వృథా చేసి దాని విషయంలో మోసంలో పడియున్నవారే.

2- తావీజు గురించి ఆదేశం

[قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِنْ دُونِ الله إِنْ أَرَادَنِيَ اللهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ قُلْ حَسْبِيَ اللهُ عَلَيْهِ  يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ] {سورة الزمر 38}

సరే చూడండి, మీరు అల్లాహ్ ను వదలి ఎవరినైతే ఆరాధించు చున్నారో వారు, అల్లాహ్ నాకు కీడు చేయగోరినచో దానిని తొలగింప గలరా, లేక అల్లాహ్ నన్ను అనుగ్రహింప గోరినచో దానిని ఆపగలరా, అని ఓ ప్రవక్తా వీరిని ప్రశ్నించుము. నాకు అల్లాహ్ యే చాలును. ఆధారపడగోరేవారు అతనిపైనే ఆధారపడవలెను అని ఓ ప్రవక్తా పలుకుము. (39: జుమర్: 38).

عن عقبة بن عامر قال: قال رسول الله ﷺ: مَنْ تَعَلَّقَ تَمِيمَةً، فَلَا أَتَمَّ اللهُ لَهُ. وفي رواية: مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ

ప్రవక్త ﷺ ఇలా ప్రబోధించినట్లు ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరు తావీజు వేసుకున్నారో అల్లాహ్ వారి (ఆ ఉద్దేశాన్ని) పూర్తి చేయకూడదు”. మరో ఉల్లేఖనంలో ఉందిః “ఎవరు తావీజు వేసుకున్నారో వారు షిర్క్ చేసినట్లు”. (అహ్మద్ 17404, 17422).

وعن عبد الله بن عكيم ™ قال: قال رسول اللهﷺ: مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيه.

అబ్దుల్లాహ్ బిన్ ఉకైం కథనం, ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “ఎవరైనా ఏదైనా తావీజు వేసుకున్నచో వారు దాని వైపునకే అప్పగించ బడుతారు”. (తిర్మిజి).  

عن عبد الله بن مسعود ™ قال: سمعت رسول الله ﷺ يقول: إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  కథనం, నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానుః “మంత్రం, తావీజులు, మరియు ‘తివల’ ఇవన్నియు షిర్క్”. ‘తివల’ అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం. (అహ్మద్).

విశేషాలు:

1- ఎవరైతే తావీజు వేసుకొని అది లాభనష్టాలు చేకూరుస్తుందని నమ్ముతారో, వారు పెద్ద షిర్క్ చేసినవారవుతారు. అలా అల్లాహ్ ను గాక ఇతర వస్తువుల్లో కూడా లాభనష్టాలు ఉన్నాయని నమ్మినందు వలన. ఒక వేళ అది సబబు, ఆధారం అని నమ్మినచో అది చిన్న షిర్క్ అగును.

2- తావీజులు వేసుకొనుట యోగ్యం కాదు. అది ఖుర్ఆన్ ఆయతులతో వ్రాసింది అయినప్పటికి కూడా. ఎందుకనగా ప్రవక్త సహచరులు అలా చేయలేదు. ఇది ఇతర వస్తువులను తావీజుగా వేసుకొనుటకు కారణ మవుతుంది. ఖుర్ఆను ఆయతులను వృత్తిగా మార్చినట్లవుతుంది.

3- వాహనాల్లో (ఇండ్లల్లో, దుకాణాల్లో) తగిలింపబడే పత్రాలు, మరియు వాటిని పోలియున్నవి కూడా తావీజు లాంటివే. వాహనాల్లో (ఇండ్లల్లో, దుకాణాల్లో) దిష్టి తగలకూడదని ఖుర్ఆన్ పెట్టడం కూడా సరైన విషయం కాదు.

3- జ్యోతిష్యుల వద్దకు పోవుట నిషిద్ధం

[قُلْ لاَ يَعْلَمُ مَنْ فِي السَّمَوَاتِ وَالأَرْضِ الْغَيْبَ إِلاَ الله] النمل  65

వారితో ఇలా అనండి, భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం  కలవాడు మరెవ్వడూ లేడు. (27: నహ్ల్: 65).

عن بعض أزواج النبي عن النبي ﷺ قال: مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ لَيْلَةً.

ప్రవక్త ﷺ భార్యల్లో ఒకరు, ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారని తెలిపారుః “జ్యోతిష్యుని వద్దకు పోయి, అతన్ని ఏ విషయమైనా అడిగినవారి 40రోజుల నమాజు అంగీకరింపబడదు”. (ముస్లిం).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: مَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ أَوْ أَتَى امْرَأَته حَائِضًا أَوْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا فَقَدْ بَرِئَ مِمَّا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ.

“జ్యోతిష్యుని వద్దకు పోయి అతని మాటలను నమ్మేవారు, లేక భార్య ఋతుస్రావంలో ఉన్నప్పుడు సంభోగించేవారు, లేక తన భార్య మల దారిలో సంభోగించేవారు ముహమ్మద్ ﷺ పై అవతరించిన ధర్మానితో సంబంధం లేనివారగును” అని ప్రవక్త ﷺ హెచ్చరించినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (అబూ దావూద్).

عن عائشة قالت: سأل رسولَ الله ﷺ  أُناسٌ عن الكهان فقال: لَيسُوا بِشَيء، فقالوا: إنهم يحدثوننا أحيانا بالشيء فيكون حقا؟ فقال رسول الله ﷺ: تِلْكَ الْكَلِمَةُ مِنَ الْحَقِّ يَخْطِفُهَا الْجِنِّيُّ فَيقُرُّهَا فِي أُذنِ وَليِّهِ فَيَخْلِطُونَ مَعَهَا مِائةَ كَذْبَةٍ.

హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా కథనం: కొంత మంది ప్రవక్త ﷺ ను జ్యోతిష్యుల గురించి ప్రశ్నించారు. “వారి విషయం (సత్యమైనది) కాదు” అని ప్రవక్త ﷺ బదులిచ్చారు. ‘ప్రవక్తా! వారు మాతో చెప్పే విషయం ఒక్కోసారి నిజమవుతుంది కదా?’ అని వారు తమ సందే- హాన్ని స్పష్టం చేశారు. వారికి ప్రవక్త ﷺ ఇలా సముదాయించారుః “ఒక నిజాన్ని జిన్న్ అందుకొని తన శిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానిలో వంద అబద్దాలు కల్పిస్తాడు”. (బుఖారి, ముస్లిం).  

విశేషాలుః

1- జ్యోతిష్యుల వద్దకు వెళ్ళుట నిషిద్ధం. వారు అగోచర జ్ఞానం గలవార- మని జరిగినది, జరుగబోయేది అంతా తెలియునని చెప్పుకునేవారు.

2- జ్యోతిషి ఒకప్పుడు ఒక మాట సత్యం చెప్పినా అందులో వంద అబద్దాలు కల్పుతాడు.

3- చెయ్యి చూసి, పాత్ర అడుగులో చూసి, రాశి ఫలం ద్వారా (అగోచర విషయాలు) చెప్పుట), అదృష్టం గురించి తెలియజేయుట, ఇవన్నియు జ్యోతిష్యం కోవకే వస్తాయి.

4- ఇంద్రజాలం, దాని నుండి హెచ్చరిక

2:102  وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ

వారు సులైమాను రాజ్య కాలము షైతానులు పఠించునట్టి దానిని అనుసరించిరి. సులైమాను అవిశ్వాసి కాలేదు. కాని షైతానులు జనులకు ‘జాల’ విద్యను నేర్పుతూ అవిశ్వాసులైరి. వారు బాబిల్ నగరమందు హారూతు మారూతు అన్న దైవదూతలకు నొసంగ-బడిన దానిని అనుసరించిరి. ఆ ఇద్దరు దూతలు మేము పరీక్షకు ఉన్నాము కావున మీరు అవిశ్వాసులు కాకండి అని చెప్పనంత వరకు ఎవరికి వారు నేర్పకుండిరి. ఆ పిదప వారు ఆ ఇద్దరి నుండి భార్యాభర్తలకు ఎడబాటు కలిగించునట్టి జాలవిద్య నేర్చుకొను-చుండిరి. వారు దాని వలన అల్లాహ్ సెలవు లేక (అల్లాహ్ ఆజ్ఞ లేనిది) ఎవరికిని నష్టము కలిగింపజాలరు. కాని వారు నేర్చు-కున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. (2: బఖర: 102).

[وَلاَ يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَى] سورة طه 69

మంత్రగాడు ఎచ్చటికి పోయిననూ జయం పొందడు. (20: తాహా: 69).

عن أبي هريرة ™ عن النبيﷺ قال: اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ، قَالُوا: يَا رَسُولَ اللهِ وَما هُنّ؟ قَالَ: الشِّرْكُ بِاللَّهِ، وَالسِّحرُ، وَقَتلُ النَّفسِ الَّتِي حَرَّمَ اللهُ إِلاّ بِالْحَقِّ، وَأَكلُ الرِّبَا، وَأَكلُ مَالِ الْيَتِيمِ، وَالتَّوَلِّي يَومَ الزَّحفِ، وَقَذفُ الْمُحصَنَاتِ الْمُؤمِنَاتِ الْغَافِلاَت [متفق عليه]

అబూ హురైర రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్నుద్దేశించి, “మిమ్మల్ని సర్వ నాశనం చేసే పనులకు దూరంగా ఉండండి” అని హెచ్చరించారు. ఆ పనులేమిటి ప్రవక్తా అని అడిగారు సహచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారుః “అల్లాహ్ కు సాటి కల్పించడం. చేతబడి చేయడం. ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం. వడ్డీ సొమ్ము తినడం. అనాథ సొమ్మును హరించి వేయడం. ధర్మయుద్ధంలో వెన్నుజూపి పారిపోవడం. ఏ పాపమెరగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1-  చేతబడి నిషిద్ధం. అది నాశనం చేయు పాపాలలో ఒకటి.

2- అల్లాహ్ యొక్క ఈ ఆదేశమాధారంగాః “మేము పరీక్షకు ఉన్నాము. కావున మీరు అవిశ్వాసులు కాకండి” ఇస్లాం నుంచి బహిష్కరించువాటిలో అదీ ఒకటి. ఎందుకనగా అది షైతానును ఆరాధిస్తే తప్ప సాధ్యం కాదు.

3- చేతబడి చేయువారి వద్దకు పోవుట వారితో కలసి ఏ వ్యవహారమైన నడుపుట కూడా నిషిద్ధం.

5- మంత్రము

عن عبد الله بن مسعود ™ قال: سمعت رسول الله ﷺ يقول: إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْك

“మంత్రము, తావీజులు, మరియు “తివల” షిర్క్” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (“తివల” అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం). (అహ్మద్, అబూదావూద్).

عن عائشة ؅أَنَّ النَّبِيَّﷺ رَخّصَ فِي الرُّقَى مِنْ كُلِّ ذِي حُمَّة

‘హుమ్మ’ అయినచో మంత్రం చేయుటకు ప్రవక్త ﷺ సెలవిచ్చారని

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. (‘హుమ్మ’ అనగా తేలు మరియు విషపురుగుల విషం. అవి కాటు వేస్తే మంత్రించవచ్చును). (బుఖారి, ముస్లిం).

عن عائشة ؅ أَنَّ النَّبِيَّ ﷺ كَانَ يَنْفُثُ عَلَى نَفْسِهِ فِي الْمَرضِ الَّذِي مَاتَ فِيهِ الْمُعَوِّذَاتِ، فَلَمَّا ثَقُلَ كُنتُ أَنفُثُ عَلَيهِ بِهِنّ، وَأَمسَحُ بِيَدِ نَفسِهِ لِبَركتِها

ఆయిషా రజియల్లాహు అన్హా కథనం: ప్రవక్త ﷺ చనిపోయే ముందు అనారోగ్యంగా ఉన్న కాలంలో ‘ముఅవ్విజాత్’ చదివి, తమరు స్వయంగా ఊదుకునేవారు. వారికి అస్వస్థత పెరిగినప్పుడు ఆ ‘ముఅవ్విజాత్’ నేను చదివి, తమ చెయ్యి శుభంగా ఉంటుందని ఆయన చేతితోనే తుడిచేదాన్ని. (బుఖారి, ముస్లిం). (‘ముఅవ్విజాత్’ అనగా సూర ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్).

عن عائشة ؅ أن النبي ﷺ كان يعوّذ بعض أهله، يمسح بيده اليمنى ويقول: أللَّهُمَّ رَبَّ النَّاسِ أَذْهِبِ الْبَاسَ اِشْفِ أَنتَ الشَّافِي، لاَ شِفَاءَ إِلاَّ شِفَاؤُكَ، شِفَاءً لاَ يُغَادِرُ سَقَماً

ఆయిష రజియల్లాహు అన్హా కథనం: ప్రవక్త ﷺ తమ ఇంటివారిలో ఒకరికి ‘దుఆ’ చేస్తూ కుడి చెయితో తూడుస్తూ ఈ ‘దుఆ’ చదివేవారుః “అల్లాహుమ్మ రబ్బన్నాస్, అజ్ హిబిల్ బాస్, ఇష్ఫి అంతష్షాఫీ లా షిఫాఅ ఇల్లా షిఫాఉక షిఫాఅన్, లా యుగాదిరు సఖమ”. (ఓ ప్రజల ప్రభువైన అల్లాహ్! బాధను తొలగించు. స్వస్థత కలిగించు. నీవే స్వస్థత ప్రసాదించువానివి. నీ వద్ద తప్ప మరో చోట స్వస్థత లేదు. వ్యాది నామరూపాల్లేకుండా ఉండే నివారణను ప్రసాదించు). (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఖుర్ఆన్ మరియు ధర్మబద్ధమైన ‘దుఆ’లతో కూడిన మంత్రం చేయవచ్చును.

2- ఖుర్ఆన్ మరియు ధర్మమైన ‘దుఆ’లతో కాకుండా వేరే ‘దుఆ’లతో

కూడిన మంత్రం నిషిద్ధం.

3- అల్లాహ్ యేతరులతో ‘దుఆ’ పై ఆధారపడిఉన్న మంత్రం పెద్ద షిర్క్.

4- మనిషి తనకు తాను దుఆ లేక మంత్రం చేసుకొనుట ధర్మం. మరో వ్యక్తి చేయాలనే ఆవశ్యం ఏమీ లేదు.

6- అల్లాహ్ పై తప్ప ఇతరుల పేరున ప్రమాణం చేయుట నిషిద్ధం

عن ابن عمر ؆ عن النبي ﷺ قال: أَلَا إِنَّ اللَّهَ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ مَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ

మహాప్రవక్త ﷺ బోధించినట్లు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా  ఉల్లేఖించారుః “నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని మీ తండ్రి, తాతల పేరిట ప్రమాణం చేయుటను నివారించాడు. ఎవరైనా ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ పేరుతోనే చేయాలి. లేదా మానుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

وعن بريدة  أن رسول الله ﷺ قال: من حلف بالأمانة فليس منّا

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అమానత్ (అప్పగింత) ప్రతిజ్ఞ చేసేవాడు మాలోనివాడు కాడు”. (అబూ దావూద్).

وعن ابن عمر ؆ أَنَّهُ سَمِعَ رَجُلًا يَقُولُ لَا وَالْكَعْبَةِ فَقَالَ ابْنُ عُمَرَ لَا يُحْلَفُ بِغَيْرِ اللَّهِ فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللَّهِ ﷺ يَقُولُ مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ كَفَرَ أَوْ أَشْرَكَ

ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం ప్రకారం, అతను ఒక వ్యక్తిని ‘కాబా సాక్షిగా’ అని ప్రమాణం చేస్తూ చూసి, అల్లాహ్ పై తప్ప ఇతరుల ప్రమాణం చేయకు. నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానుః “ఎవరైతే అల్లాహ్ పై తప్ప ఇతరుల ప్రమాణం చేస్తారో వారు కుఫ్ర్ లేక షిర్క్ చేసినవారవుతారు”. (తిర్మిజి).   

విశేషాలుః

1- అల్లాహ్ పై తప్ప ఇతరుల ప్రమాణం చేయుట నిషిద్ధం. అది చిన్న షిర్క్. చిన్న షిర్క్ పెద్దపాపాల్లో ఒక పాపం.

2- ప్రవక్త, కాబా, గౌరవం (మర్యాద), జీవితం మొదలైన సృష్టిరాసుల ప్రమాణం చేయుట నిషిద్ధం.

3- అల్లాహ్, ఆయన పవిత్ర నామాల, గుణాల ప్రమాణం మాత్రమే చేయుట ధర్మసమ్మతమైనది.

7- దుశ్శకునం

عن أنس ™ قال: قال رسول الله ﷺ: لَا عَدْوَى وَلَا طِيَرَةَ وَيُعْجِبُنِي الْفَأْلُ الصَّالِحُ الْكَلِمَةُ الْحَسَنَةُ

“అంటు వ్యాదీ లేదు. దుశ్శకునమూ లేదు. మంచి మాటయే నాకు మంచి శకునంగా అనిపిస్తుందని” ప్రవక్త ﷺ ప్రవచించినట్లు అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.  (బుఖారి, ముస్లిం).

عن ابن مسعود ™ عن رسول الله قال ﷺ : الطِّيرَةُ شِركٌ

“అపశకునం షిర్క్” అని ప్రవక్త ﷺ చెప్పినట్లు ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (అబూదావూద్).

విశేషాలుః

1- అపశకునం నివారించబడింది. అదేమనగా (ఏదైనా పనినుద్దేశించి వెళ్తూ పావురం ఇటు వైపు ఎగిరింది లేక పిల్లి అడ్డువచ్చిందని ఇలాంటి అపశకునంతో ఆ పని మానేయుట.

2- అపశకునం అనేది షిర్క్. ఎందుకనగా అల్లాహ్ తప్ప ఇతరులలో లాభనష్టాలు కలిగించు శక్తి ఉందన్న నమ్మకంతో అది ఒక పని వదిలేయుటకు కారణమవుతుంది.

3- మంచి శకునం ధర్మమైనది. ఎందుకంటే అందులో అల్లాహ్ పై మంచి నమ్మకం మరియు సద్భావం ఉంటుంది కాబట్టి.

8- అల్లాహ్ పై నమ్మకం

[وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ] سورة الطلاق :3

అల్లాహ్ ను నమ్మకున్నవారికి ఆయనే (అల్లాహ్ యే) చాలు (65: తలాఖ్: 3).

[وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ] سورة التغابن: 13

మరియు విశ్వాసులు అల్లాహ్ పైనే ఆధారపడాలి. (64: తగాబున్: 13).

عن ابن عباس ؆ عن النبي ﷺ قال: عُرِضَتْ عَلَيَّ الْأُمَمُ فَرَأَيْتُ النَّبِيَّ وَمَعَهُ الرُّهَيْطُ وَالنَّبِيَّ وَمَعَهُ الرَّجُلُ وَالرَّجُلَانِ وَالنَّبِيَّ لَيْسَ مَعَهُ أَحَدٌ إِذْ رُفِعَ لِي سَوَادٌ عَظِيمٌ فَظَنَنْتُ أَنَّهُمْ أُمَّتِي فَقِيلَ لِي هَذَا مُوسَى صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَقَوْمُهُ وَلَكِنْ انْظُرْ إِلَى الْأُفُقِ فَنَظَرْتُ فَإِذَا سَوَادٌ عَظِيمٌ فَقِيلَ لِي انْظُرْ إِلَى الْأُفُقِ الْآخَرِ فَإِذَا سَوَادٌ عَظِيمٌ فَقِيلَ لِي هَذِهِ أُمَّتُكَ وَمَعَهُمْ سَبْعُونَ أَلْفًا يَدْخُلُونَ الْجَنَّةَ بِغَيْرِ حِسَابٍ وَلَا عَذَابٍ ثُمَّ نَهَضَ فَدَخَلَ مَنْزِلَهُ فَخَاضَ النَّاسُ فِي أُولَئِكَ الَّذِينَ يَدْخُلُونَ الْجَنَّةَ بِغَيْرِ حِسَابٍ وَلَا عَذَابٍ فَقَالَ بَعْضُهُمْ فَلَعَلَّهُمْ الَّذِينَ صَحِبُوا رَسُولَ اللَّهِ ﷺ  وَقَالَ بَعْضُهُمْ فَلَعَلَّهُمْ الَّذِينَ وُلِدُوا فِي الْإِسْلَامِ وَلَمْ يُشْرِكُوا بِاللَّهِ وَذَكَرُوا أَشْيَاءَ فَخَرَجَ عَلَيْهِمْ رَسُولُ اللَّهِ ﷺ فَقَالَ مَا الَّذِي تَخُوضُونَ فِيهِ فَأَخْبَرُوهُ فَقَالَ هُمْ الَّذِينَ لَا يَرْقُونَ وَلَا يَسْتَرْقُونَ وَلَا يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [متفق عليه]

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని, ఇబ్నె అబ్బాస్ రజియ- ల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. నేను ఒక ప్రవక్తను చూశాను. ఆయనతో ఆయన చిన్న అనుచర సంఘముంది. మరొక ప్రవక్తతో ఒకరిద్దరే ఉన్నారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తనూ చూశాను. ఆ తర్వాత ఒక పెద్ద జన సమూహం ఏర్పడింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం మూసా అలైహిస్సలాం మరియు ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. మళ్ళీ బ్రహ్మాండమైన జన సమూహం చూశాను. ఇది నీ అనుచర సమాజమే. వీరిలో 70వేల మంది ఏలాంటి విచారణ, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారని తెలుప బడింది.” ప్రవక్త ﷺ ఈ మాట చెప్పిన తరువాత లేచి ఇంట్లోకెళ్ళారు. అక్కడున్న అనుచరులు ఆ డెబ్బై వేల మంది ఎవరు కావచ్చన్న ఆలోచనల్లో పడ్డారు. కొందరు ‘ఇస్లాంలోనే జన్మించి ఏ మాత్రం అల్లాహ్ తో సాటి కల్పించనివారు’ కావచ్చునని అన్నారు. మరెన్నో విషయాలు అనుకుంటున్న సందర్భంలో ప్రవక్త ﷺ వారి ముందుకు వచ్చారు. అనుచరులు అనుకున్న విషయాలు ప్రవక్త ﷺ కు తెలిపారు. అప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “వారు మంత్రాలు చేయండని ఎవరిని అడగబోరు. కాల్పులు, వాతలతో చికిత్స చేయించుకోరు. దుశ్శకునాలను పాటించరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ‘తవక్కుల్’ (అల్లాహ్ పై నమ్మకం) స్థానం ఎంత గొప్పదో తెలిసింది. ఇది అన్ని రకాల ఆరాధనలలోకెల్లా గొప్పది.

2- వాస్తవంగా దాన్ని పొందుటయే విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి కారణమగును.  

9-దుఆ అంగీకార గడియలు

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: أَقْرَبُ مَا يَكُونُ الْعَبْدُ مِنْ رَبِّهِ وَهُوَ سَاجِدٌ فَأَكْثِرُوا الدُّعَاءَ [أخرجه مسلم]

“తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దాలోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి” అని ప్రవక్త మహానీయులు ﷺ బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن أنس ™ قال: قال رسول الله ﷺ: الدُّعَاءُ بَينَ الأَذَانِ وَالإِقَامَةِ لاَ يُردّ

అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనంలో ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు”. (తిర్మిజి).   

عن سهل بن سعد ™ قال: قال رسول الله ﷺ: ثِنتَانِ لاَ تُردّان ـ أَوْ قَلَّمَا تُردَّانِ: الدُّعَاءُ عِندَ النِّدَاءِ، وَعِندَ الْبَأْسِ حِينَ يُلْحِمُ بَعضُهُم بَعْضًا

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించినట్లు సహల్ బిన్ సఅద్ ఉల్లేఖించారుః “రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటిః అజాన్ వేళలో చేసే దుఆ. రెండవదిః జిహాద్ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ”. (అబూ దావూద్).

عَنْ أَبِي هُرَيْرَةَ™  أَنَّ رَسُولَ اللَّهِ ﷺ قَالَ :يَنْزِلُ رَبُّنَا تَبَارَكَ وَتَعَالَى كُلَّ لَيْلَةٍ إِلَى السَّمَاءِ الدُّنْيَا حِينَ يَبْقَى ثُلُثُ اللَّيْلِ الْآخِرُ فَيَقُولُ مَنْ يَدْعُونِي فَأَسْتَجِيبَ لَهُ مَنْ يَسْأَلُنِي فَأُعْطِيَهُ مَنْ يَسْتَغْفِرُنِي فَأَغْفِرَ لَهُ. [متفق عليه]

అబూహురైరా రజియల్లాహు అన్హు  ఉల్లేఖనంలో, ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి “నాతో మొరపెట్టుకునే- వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు. (బుఖారిః 1145. ముస్లిం: 758).

عن جابر ™ قال: سمعت رسول الله ﷺ يقول: إِنَّ فِي اللَّيْلِ لَسَاعَةً لَا يُوَافِقُهَا رَجُلٌ مُسْلِمٌ يَسْأَلُ اللَّهَ خَيْرًا مِنْ أَمْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا أَعْطَاهُ إِيَّاهُ وَذَلِكَ كُلَّ لَيْلَةٍ

“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిమయితే అల్లాహ్ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త ﷺ చెబుతుండ గా నేను విన్నానని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం).

విశేషాలుః

1- కొన్ని ప్రత్యేక సమయాలున్నవి వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాలకంటే ఎక్కువగా ఉంటుంది.

2- ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాస పడాలి.

3- ఆ సమయాల్లో కొన్ని ఇవిః సజ్దాలో, అజాన్ ఇఖామత్ ల మధ్యలో. రాత్రి చివరి గడియలో. జిహాద్ లో శత్రువులతో భేటి జరిగినప్పుడు.

10- సామూహిక నమాజ్ వాజిబ్ (తప్పనిసరి)

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: إِنَّ أَثْقَلَ صَلَاةٍ عَلَى الْمُنَافِقِينَ صَلَاةُ الْعِشَاءِ وَصَلَاةُ الْفَجْرِ وَلَوْ يَعْلَمُونَ مَا فِيهِمَا لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا وَلَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ آمُرَ رَجُلًا فَيُصَلِّيَ بِالنَّاسِ ثُمَّ أَنْطَلِقَ مَعِي بِرِجَالٍ مَعَهُمْ حُزَمٌ مِنْ حَطَبٍ إِلَى قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهُمْ بِالنَّارِ [متفق عليه]

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “వంచకులకు అతి భారమైన నమాజు ఇషా మరియు ఫజ్ర్. ఒకవేళ ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసివచ్చినా తప్పకుండా వస్తారు. నమాజు కొరకు ఇఖామత్ ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నియమించి, నా వెంట కొంత మందిని కట్టెల మోపుతో సహా తీసుకొని, సామూహిక నమాజులో హాజరు కాని వారి వైపు వెళ్ళి వారు ఇండ్లల్లో ఉండగానే వారి ఇండ్లను తగల బెడదా-మని (ఎన్నో సార్లు) అనుకున్నాను”. (బుఖారి, ముస్లిం).  

عن أبي هريرة ™ قال: أَتَى النَّبِيَّ ﷺ رَجُلٌ أَعْمَى فَقَالَ يَا رَسُولَ اللَّهِ إِنَّهُ لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى الْمَسْجِدِ فَسَأَلَ رَسُولَ اللَّهِ ﷺ أَنْ يُرَخِّصَ لَهُ فَيُصَلِّيَ فِي بَيْتِهِ فَرَخَّصَ لَهُ فَلَمَّا وَلَّى دَعَاهُ فَقَالَ: هَلْ تَسْمَعُ النِّدَاءَ بِالصَّلَاةِ قَالَ: نَعَمْ قَالَ: فَأَجِبْ

అబూహురైర రజియల్లాహు అన్హు  కథనం: ఒక గ్రుడ్డి వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్తా! మస్జిద్ వరకు దారి చూపే మార్గదర్శి నాకు ఎవ్వడూ లేడు అని చెప్పి, ప్రవక్త అతనికి ఇంట్లోనే నమాజు చేసుకొనుటకు సెలవిస్తే బాగుంటుందని కోరాడు. ప్రవక్త ﷺ అతనికి సెలవిచ్చారు. అతను తిరిగి పోతుండుగా పిలిచి, “ఏమి నీవు నమాజు పిలుపు (అజాన్) వింటావా?” అని అడిగారు. దానికి అతను అవునన్నాడు. అప్పుడు ప్రవక్త ﷺ “నీవు పిలుపుకు జవాబివ్వాలి” అని చెప్పారు. (అనగా సామూహిక నమాజులో పాల్గొనాలి). (ముస్లిం).

عن عبد الله بن مسعود ™ قال: مَنْ سَرَّهُ أَنْ يَلْقَى اللَّهَ غَدًا مُسْلِمًا فَلْيُحَافِظْ عَلَى هَؤُلَاءِ الصَّلَوَاتِ حَيْثُ يُنَادَى بِهِنَّ فَإِنَّ اللَّهَ شَرَعَ لِنَبِيِّكُمْ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُنَنَ الْهُدَى وَإِنَّهُنَّ مِنْ سُنَنِ الْهُدَى وَلَوْ أَنَّكُمْ صَلَّيْتُمْ فِي بُيُوتِكُمْ كَمَا يُصَلِّي هَذَا الْمُتَخَلِّفُ فِي بَيْتِهِ لَتَرَكْتُمْ سُنَّةَ نَبِيِّكُمْ وَلَوْ تَرَكْتُمْ سُنَّةَ نَبِيِّكُمْ لَضَلَلْتُمْ. وَلَقَدْ رَأَيْتُنَا وَمَا يَتَخَلَّفُ عَنْهَا إِلَّا مُنَافِقٌ مَعْلُومُ النِّفَاقِ وَلَقَدْ كَانَ الرَّجُلُ يُؤْتَى بِهِ يُهَادَى بَيْنَ الرَّجُلَيْنِ حَتَّى يُقَامَ فِي الصَّفِّ.

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఇలా చెప్పారుః “ఏ వ్యక్తైతే ప్రళయదినాన ముస్లింగా అల్లాహ్ ఆజ్ఞల్ని పాలించే దాసునిగా అల్లాహ్ ని సందర్శించా- లని అభిలషిస్తాడో అతను (ఐదు పూట్ల) నమాజులను కాపాడుకోవాలి. వాటి కొరకు పిలుపు కూడా ఇవ్వబడుతుంది. నిశ్చయంగా అల్లాహ్ మీ ప్రవక్తకు “సుననుల్ హుదా” (సన్మార్గ ధర్మములను) బోధించాడు. ఈ (ఐదు వేళల నమాజులు కూడా) “సుననుల్ హుదా”లో చేరియు-న్నవి. వంచకుడు తనింట్లో నమాజు చేసినట్లు మీరు కూడా ఇండ్లల్లోనే నమాజు చేస్తే మీరు మీ ప్రవక్త పద్ధతిని విడిచిన వారవుతారు. మీరు గనుక మీ ప్రవక్త పద్ధతిని విడనాడారంటే దుర్మార్గులవుతారు. మేము చూసేవారము జమాఅతుతో నమాజును తప్పించుకునే వాడు వంచ-కుడే. అతని వంచకత్వం అందరికీ తెలిసేయుండేది. ఒక వ్యక్తి ఇద్దరు మనుషుల సహాయముతో వచ్చి నమాజు పంక్తిలో నిలబడేవాడు”. (ముస్లిం: 654).

విశేషాలుః

1- పురుషులపై సామూహిక నమాజు విధిగా ఉంది.

2- సామూహిక నమాజును తప్పించుకొనుట వంచకుని గుణం.

11- సామూహిక నమాజు ఘనత

وعن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((صَلَاةُ الرَّجُلِ فِي الْجَمَاعَةِ تُضَعَّفُ عَلَى صَلَاتِهِ فِي بَيْتِهِ وَفِي سُوقِهِ خَمْسًا وَعِشْرِينَ ضِعْفًا وَذَلِكَ أَنَّهُ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ خَرَجَ إِلَى الْمَسْجِدِ لَا يُخْرِجُهُ إِلَّا الصَّلَاةُ لَمْ يَخْطُ خَطْوَةً إِلَّا رُفِعَتْ لَهُ بِهَا دَرَجَةٌ وَحُطَّ عَنْهُ بِهَا خَطِيئَةٌ فَإِذَا صَلَّى لَمْ تَزَلْ الْمَلَائِكَةُ تُصَلِّي عَلَيْهِ مَا دَامَ فِي مُصَلَّاهُ اللَّهُمَّ صَلِّ عَلَيْهِ اللَّهُمَّ ارْحَمْهُ وَلَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا انْتَظَرَ الصَّلَاةَ))

మహాప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మనిషి సామూహికంగా చేసే నమాజు పుణ్యం తన ఇంట్లో, వీధిలో ఒంటరిగా చేసే నమాజుకన్నా పాతిక రెట్లు ఎక్కువ శ్రేష్ఠమైనది. అదిః అతను శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళ్తుంటే, (మస్జిదులో ప్రవేశించే వరకు) అతను వేసే ప్రతి అడుగుకు ఒక్కొక్కటి చొప్పున అతనికి అంతస్తు పెంచబడు-తుంది. (అదీగాక అతని వల్ల జరిగిన) ఒక్కొక్క పాపాన్ని తుడిచివేయబడుతుంది. ఇక అతను నమాజు పూర్తి చేసుకొని ఎంతకాలం నమాజు చేసిన స్థలములో ఉంటాడో అంత కాలం దైవదూతలు “అల్లాహ్ ఇతన్ని కరుణించుము” అని దుఆ చేస్తుంటారు. మీలోనెవరైతే (మస్జిద్ లో వచ్చాక, సామూహిక) నమాజు కోసం నిరీక్షిస్తారో వారికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది”. (బుఖారి, ముస్లిం).

عن أبي الدرداء ™ قال سمعت رسول الله ﷺ يقول: ((مَا مِنْ ثَلَاثَةٍ فِي قَرْيَةٍ وَلَا بَدْوٍ لَا تُقَامُ فِيهِمْ الصَّلَاةُ إِلَّا قَدْ اسْتَحْوَذَ عَلَيْهِمْ الشَّيْطَانُ فَعَلَيْكَ بِالْجَمَاعَةِ فَإِنَّمَا يَأْكُلُ الذِّئْبُ الْقَاصِيَةَ قَالَ زَائِدَةُ قَالَ السَّائِبُ يَعْنِي بِالْجَمَاعَةِ الصَّلَاةَ فِي الْجَمَاعَةِ))

“ఏ బస్తీలో లేదా పల్లెలో అయితే ముగ్గురు ముస్లింలుండీ సామూహిక నమాజు చేయరో వారి (ఆంతర్యాల) పై షైతాన్ ఆధిపత్యం పొందుతాడు. అందువల్ల మీరు నమాజును సామూహికంగా ఆచరించండం మీ విధిగా భావించండి. ఎందుకనగా తన మంద నుండి వేరయిపోయిన మేకనే తోడేలు సునాయాసంగా హతమార్చుతుంది” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అంటూ అబూ దర్దా తెలిపారు. (అబూదావూద్).

وعن عبد الله بن عمر ™ أن رسول الله ﷺ قال: (( صلاة الجماعة تَفضُل صلاةَ الفذّ بسبع وعشرين درجة))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించినట్లు అబ్దుల్లాహిబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “వ్యక్తిగతంగా చేసే నమాజుకన్నా సామూహికంగా చేసే నమాజు ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- సామూహిక నమాజు ఘనత చాలా గొప్పది.

2- మనిషి తను ఒంటరిగా చేసేదానికంటే, సామూహికంగా చేయు నమాజుకు శ్రేష్ఠత ఎక్కువ.

3- సామూహిక నమాజు నుండి తప్పించుకొనుట మనిషిపై, షైతాను ఆధిపత్యం సంపాదించటానికి కారణం అవుతుంది.

12- మస్జిద్ కు నిదానంగా, ప్రశాంతంగా వెళ్ళుట అభిలషణీయం

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: ((إِذَا سَمِعْتُمْ الْإِقَامَةَ فَامْشُوا إِلَى الصَّلَاةِ وَعَلَيْكُمْ بِالسَّكِينَةِ وَالْوَقَارِ وَلَا تُسْرِعُوا فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا وَمَا فَاتَكُمْ فَأَتِمُّوا))

“మీరు సామూహిక నమాజు ఇఖామత్ విన్నప్పుడు నిదానంగా, ప్రశాంతంగా రండీ, పరుగెత్తిరాకండి. సామూహిక నమాజు ఏ మేరకు లభిస్తే అది చేయండి. మిగిలిన భాగాన్ని (వ్యక్తిగతంగా ఇమాం సలాం పలికిన తరువాత) పూర్తి చేసుకోండి” అని ప్రవక్త ﷺ బోధించినట్లు అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).   

عَنْ أَبِي قَتَادَةَ ™ قَالَ بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ النَّبِيِّ ﷺ إِذْ سَمِعَ جَلَبَةَ رِجَالٍ فَلَمَّا صَلَّى قَالَ: مَا شَأْنُكُمْ قَالُوا اسْتَعْجَلْنَا إِلَى الصَّلَاةِ قَالَ فَلَا تَفْعَلُوا إِذَا أَتَيْتُمْ الصَّلَاةَ فَعَلَيْكُمْ بِالسَّكِينَةِ فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوا وَمَا فَاتَكُمْ فَأَتِمُّوا))

అబూ ఖతాద ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త ﷺతో నమాజు చేస్తూ ఉండగా ప్రవక్త ﷺ ఏదో గోల విని, నమాజు ముగించాక “ఏమిటి సంగతి” అని మందలించారు. ‘మేము నమాజు కొరకు తొందరపాటు చేశాము ప్రవక్తా!’ అని వారు చెప్పారు. “మీరు అలా చేయకండి. మీరు నమాజుకు వచ్చెటప్పుడు పూర్తి నిదానంగా రండీ. (ఇమాంతో ఎన్ని రకాతులు) లభిస్తే అన్ని చదువుకోండి. దొరకనివి తర్వాత పూర్తి చేసుకోండి”. (ముస్లిం).

విశేషాలుః

1- పూర్తి నిదానం మరియు శాంతితో నమాజుకు నడిచి రావాలని ఆదేశమివ్వబడింది.

2- తొందరపాటుతో పరిగెత్తిపోవడం నివారించబడింది. అది రుకూ పొందే ఉద్దేశంతో అయినప్పటికీ అలా చేయకూడదు.

13- నమాజుకు ముందుగానే వచ్చి, నిరీక్షించుట ఘనతగల విషయం

وعن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: صَلَاةُ الرَّجُلِ فِي الْجَمَاعَةِ تُضَعَّفُ عَلَى صَلَاتِهِ فِي بَيْتِهِ وَفِي سُوقِهِ خَمْسًا وَعِشْرِينَ ضِعْفًا وَذَلِكَ أَنَّهُ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ خَرَجَ إِلَى الْمَسْجِدِ لَا يُخْرِجُهُ إِلَّا الصَّلَاةُ لَمْ يَخْطُ خَطْوَةً إِلَّا رُفِعَتْ لَهُ بِهَا دَرَجَةٌ وَحُطَّ عَنْهُ بِهَا خَطِيئَةٌ فَإِذَا صَلَّى لَمْ تَزَلْ الْمَلَائِكَةُ تُصَلِّي عَلَيْهِ مَا دَامَ فِي مُصَلَّاهُ اللَّهُمَّ صَلِّ عَلَيْهِ اللَّهُمَّ ارْحَمْهُ وَلَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا انْتَظَرَ الصَّلَاةَ

మహాప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మనిషి సామూహికంగా చేసే నమాజు పుణ్యం తన ఇంట్లో, వీధిలో ఒంటరిగా చేసే నమాజుకన్నా పాతిక రెట్లు ఎక్కువ శ్రేష్ఠమైనది. అదిః అతను శుభ్రంగా సముచిత రీతిలో వుజూ చేసి కేవలం నమాజు చేసే ఉద్దేశంతో మస్జిద్ కు వెళ్తుంటే, (మస్జిదులో ప్రవేశించే వరకు) అతను వేసే ప్రతి అడుగుకు ఒక్కొక్కటి చొప్పున అతనికి అంతస్తు పెంచబడుతుంది. (అదీగాక అతని వల్ల జరిగిన) ఒక్కొక్క పాపాన్ని తుడిచివేయబడుతుంది. ఇక అతను నమాజు పూర్తి చేసుకొని ఎంతకాలం నమాజు చేసిన స్థలములో ఉంటాడో అంత కాలం దైవదూతలు “అల్లాహ్ ఇతన్ని కరుణించుము” అని దుఆ చేస్తుంటారు. మీలోనెవరైతే (మస్జిద్ లో వచ్చాక, సామూహిక) నమాజు కోసం నిరీక్షిస్తారో వారికి నమాజు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుంది”. (బుఖారి, ముస్లిం).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: ((لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا)) متفق عليه

ప్రవక్త ﷺ బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. అదే విధంగా ఇషా, ఫజ్ర్, (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వచ్చెదరు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- శీఘ్రముగా నమాజుకు వచ్చుట చాలా శ్రేష్ఠమైనది.

2- నమాజు కొరకు నిరీక్షించుట కూడా చాలా పుణ్య కార్యం.

14- తహియ్యతుల్ మస్జిద్

عن أبي قتادة ™ أن رسول الله ﷺ قال: إذا دخل أحدكم المسجد فليركع ركعتين قبل أن يجلس.

ప్రవక్త ﷺ ఆదేశించారని, అబూ ఖతాద రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా మస్జిద్ లో ప్రవేశించినప్పుడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్) చేసుకొని కూర్చోవాలి”. (బుఖారి, ముస్లిం).

عن جابر بن عبد الله ؆ قال: جَاءَ سُلَيْكٌ الْغَطَفَانِيُّ يَوْمَ الْجُمُعَةِ وَرَسُولُ اللَّهِ ﷺ يَخْطُبُ فَجَلَسَ فَقَالَ لَهُ يَا سُلَيْكُ قُمْ فَارْكَعْ رَكْعَتَيْنِ وَتَجَوَّزْ فِيهِمَا ثُمَّ قَالَ إِذَا جَاءَ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَالْإِمَامُ يَخْطُبُ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ وَلْيَتَجَوَّزْ فِيهِمَا

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా  కథనం: ప్రవక్త ﷺ జుమా ప్రసంగం చేస్తుండగా సులైక్ అల్ గత్ఫానీ రజియల్లాహు అన్హు  వచ్చి కూర్చున్నాడు. ప్రవక్త ﷺ అతనితో ఇలా చెప్పారుః “ఓ సులైక్! నిలబడు రెండు రకాతులు సంగ్రహంగా చేసుకో”, మళ్ళీ ఇలా ఆదేశించారుః “మీలోనెవరైనా జూమా రోజు మస్జిద్ లోకి వచ్చినప్పుడు ఇమాం ఖత్బా ఇస్తున్నప్పటికీ సంగ్రహంగా రెండు రకాతులు చేసుకోవాలి”. (బుఖారి, ముస్లిం).  

విశేషాలుః

1- మస్జిద్ లో ప్రవేశించిన తరువాత, అందులో కూర్చోదలుచుకున్న వారు రెండు రకాతులు చదువుట అభిలషణీయం.

2- ఇమాం జుమా ప్రసంగం ఇస్తున్నప్పటికీ (రెండు రకాతులు) చేయుట అభిలషణీయం.

15- సామూహిక నమాజులో మొదటి పంక్తి ఘనత

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا [متفق عليه]

ప్రవక్త ﷺ బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. అదే విధంగా ఇషా, ఫజ్ర్, (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వచ్చెదరు”. (బుఖారి, ముస్లిం).

عن ابي سعيد الخدري ™ أن رسول الله ﷺ رأى في أصحابه تأخّرا فقال لهم: تَقَدَّمُوا

فَأْتَمُّوا بِي وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمْ اللَّهُ

అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ అనుచరుల (నమాజు పంక్తు- లలో) వెనక ఉండటం చూసి ఇలా నచ్చజెప్పారుః “మీరు ముందుకు రండి. నన్ను అనుసరించడి. మీ వెనుకనున్నవారు మిమ్మల్ని అను- సరించాలి. కొందరు మనుషులు (ఎల్లప్పుడూ పుణ్యకార్యముల నుండి) వెనుకబడి యుంటారు. చివరికి అల్లాహ్ వారిని వెనుకనే బడేస్తాడు. (ముస్లిం).

عن ابي هريرة ™ قال: قال رسول الله ﷺ: خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا. [مسلم]

“పురుషుల పంక్తులలో మొదటి పంక్తి చాలా శ్రేష్ఠమైనది. అందు అంతిమ పంక్తి శ్రేష్ఠమైనది కాదు. స్త్రీల పంక్తుల్లో ఆఖరు పంక్తి చాలా శ్రేష్ఠమైనది. అందు మొదటిది శ్రేష్ఠమైనది కాదు”. (ముస్లిం).

విశేషాలుః

1- నమాజ్ (సామూహికంగా మస్జిద్ లో చేయుటకు, మొదటి పంక్తిలో (స్థలం పొందుటకు) అందరికంటే ముందు వెళ్ళుట ఘనతగల విషయం.

2- పురుషుల పంక్తులలో మొదటిది చాలా శ్రేష్ఠమైనది. అంతిమ పంక్తి శ్రేష్ఠమైనది కాదు.

3- మొదటి పంక్తులలో వెనుకబడి మొండితనమునకు దిగకూడదని హెచ్చరించబడింది.

16- పంక్తులను సరి చేసుకొనుట విధి

عن جابر بن سمرة ™ قال: قال رسول اللهﷺ: أَلَا تَصُفُّونَ كَمَا تَصُفُّ الْمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا فَقُلْنَا يَا رَسُولَ اللَّهِ وَكَيْفَ تَصُفُّ الْمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا قَالَ يُتِمُّونَ الصُّفُوفَ الْأُوَلَ وَيَتَرَاصُّونَ فِي الصَّفِّ.]

జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు  కథనం: “ఏమి? దైవదూతలు తమ ప్రభువు సమక్షంలో నిలబడే వరుస రీతిలో మీరు నిలబడరా?” అని ప్రశ్నించారు దైవప్రవక్త ﷺ. దైవదూతలు ప్రభువు యెదుట ఎలా నిలబడతారు? అని మేమడగ్గా, “వారు మొదటి పంక్తులను పూర్తి చేసి దగ్గరదగ్గరగా కలిసి నిలబడుతారు” అని ప్రవక్త ﷺ బదులిచ్చారు. (ముస్లిం).

وعن أبي مسعود ™ قال: كان رسول اللهﷺ يمسح مناكبنا في الصلاة ويقول: اسْتَوُوا وَلَا تَخْتَلِفُوا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ لِيَلِنِي مِنْكُمْ أُولُو الْأَحْلَامِ وَالنُّهَى ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ. [أخرجه مسلم]

అబూ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మా భుజాలను నిమురుతూ “చక్కగా నిలబడండి, వెనకా ముందూ విభిన్న రీతుల్లో నిలబడకండి. అలా నిలిచినచో మీలో మనస్పర్థలేర్పడును. మీలో విద్యాజ్ఞానంగలవారు నాకు సమీపంలో ఉండాలి. వారి వెనుక వారికంటే విద్యాజ్ఞానంలో తక్కువ ఉన్నవారు. వారి వెనుక వారికంటే విద్యాజ్ఞానంలో తక్కువ ఉన్నవారు” అనేవారు. (ముస్లిం).

وعن أنس ™ قال: قال رسول الله ﷺ: سَوُّوا صُفُوفَكُم فَإنَّ تَسوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلاة.

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీ పంక్తులను చక్క బరుచుకోండి. పంక్తి చక్క బరుచుట నమాజ్ సంపుర్ణమగుటకు ఒక కారణం”. (ముస్లిం). మరో ఉల్లేఖనం ముస్లింలో ఉందిః

وعن النعمان بن بشير ™ قال: كَانَ رَسُولُ اللَّهِ ﷺ يُسَوِّي صُفُوفَنَا حَتَّى كَأَنَّمَا يُسَوِّي بِهَا الْقِدَاحَ حَتَّى رَأَى أَنَّا قَدْ عَقَلْنَا عَنْهُ ثُمَّ خَرَجَ يَوْمًا فَقَامَ حَتَّى كَادَ يُكَبِّرُ فَرَأَى رَجُلًا بَادِيًا صَدْرُهُ مِن الصَّفِّ فَقَالَ: ((عِبَادَ اللَّهِ لَتُسَوُّنَّ صُفُوفَكُمْ أَوْ لَيُخَالِفَنَّ اللَّهُ بَيْنَ وُجُوهِكُمْ))

నుఅమానిబ్ని బషీర్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ మా పంక్తులను ఎంత చక్క బరచే వారంటే దానితో బాణపు గురి సరి చేస్తున్నారా అనిపించేది. చివరికి మేము పంక్తులను సరి చేసుకునే విషయం అర్థం చేసుకున్నామని వారనుకున్నారు. ఒకసారి నమాజు చేయించుటకు వచ్చి అల్లాహు అక్బర్ అనే ముందు ఒక వ్యక్తిని పంక్తిలో కొంచం ముందుకు చూసి, “అల్లాహ్ దాసులారా! మీరు మీ పంక్తులను సరి చేసుకోండి లేదా అల్లాహ్ మీలో మనఃస్పర్థలు కలిగించును” అని పురమాయించారు.

عن أنس ™ عن النبي ﷺ قال: ((أَقِيمُوا صُفُوفَكُمْ فَإِنِّي أَرَاكُمْ مِنْ وَرَاءِ ظَهْرِي)) وَكَانَ أَحَدُنَا يُلْزِقُ مَنْكِبَهُ بِمَنْكِبِ صَاحِبِهِ وَقَدَمَهُ بِقَدَمِهِ. البخاري

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అనస్ ™ ఉల్లేఖించారుః “మీరు మీ పంక్తు-లను చక్కబరుచుకోండి. మీరు నా వెనుక నిల్చున్నప్పుడు కూడా నేను మిమ్మల్ని చూడగలుగుతాను”. (ప్రవక్త ఈ మాట విని) మాలోని ఒక వ్యక్తి తనతోటి సహోదరుని భుజముతో భుజము, పాదముతో పాదమును కలిపి నిలబడేవాడు. (బుఖారి). 

విశేషాలుః

1- ప్రవక్త ﷺ ఆదేశానుసారం పంక్తులను చక్కబరుచుట తప్పనిసరి. పంక్తుల్లో తేడాను గురించి ఆయన ﷺ హెచ్చరించారు కూడా.

2- పంక్తులు చక్కగానుండక పోవుట ప్రార్థన చేసేవారిలో మనస్పర్థ- లగుటకు ఒక కారణం.

3- పంక్తులను చక్కబరుచుట సంపూర్ణమైన నమాజ్ లోని ఒక భాగం.

17- సామూహిక ఫజ్ర్ నమాజ్ ఘనత

عَنْ أَبِي هُرَيْرَةَ ™ قَالَ سَمِعْتُ رَسُولَ اللَّهِ ﷺ يَقُولُ: ((تَفْضُلُ صَلَاةُ الْجَمِيعِ صَلَاةَ أَحَدِكُمْ وَحْدَهُ بِخَمْسٍ وَعِشْرِينَ جُزْءًا وَتَجْتَمِعُ مَلَائِكَةُ اللَّيْلِ وَمَلَائِكَةُ النَّهَارِ فِي صَلَاةِ الْفَجْرِ ثُمَّ يَقُولُ أَبُو هُرَيْرَةَ فَاقْرَءُوا إِنْ شِئْتُمْ [إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا] الإسراء:78

“సామూహికంగా చేసే నమాజ్ పుణ్యం మీలో ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజ్ కంటే 25 రెట్లు శ్రేష్ఠమైనది. ఫజ్ర్ నమాజు సమయంలో రాత్రి వేళ వచ్చే దూతలు, పగటి వేళ వచ్చే దూతలు పరస్పరం సమావేశమవుతారు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ హురైర ఉల్లేఖిస్తూ, ఇలా చెప్పారుః దీని సాక్ష్యం మీరు చూడ దలుచుకుంటే చదవండి ఖుర్ఆన్ ఆయతుః {నిశ్చయంగా తెల్లవారు జామున ఖుర్ఆన్ పఠించునప్పుడు దైవదూతలు వచ్చియుందురు}. (17:78). (బుఖారి, ముస్లిం).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: إِنَّ أَثْقَلَ صَلَاةٍ عَلَى الْمُنَافِقِينَ صَلَاةُ الْعِشَاءِ وَصَلَاةُ الْفَجْرِ وَلَوْ يَعْلَمُونَ مَا فِيهِمَا لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا وَلَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ آمُرَ رَجُلًا فَيُصَلِّيَ بِالنَّاسِ ثُمَّ أَنْطَلِقَ مَعِي بِرِجَالٍ مَعَهُمْ حُزَمٌ مِنْ حَطَبٍ إِلَى قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهُمْ بِالنَّارِ متفق عليه

ప్రవక్త ﷺ ప్రబోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “కపట విశ్వాసులకు అతిభారమైన నమాజు ఇషా మరియు ఫజ్ర్. ఒక వేళ ఈ రెండు నమాజులకు ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే వారీ నమాజుల్లో పాల్గొనడానికి మోకాళ్ళ మీద కుంటుకుంటూ రావలసి వచ్చినాసరే తప్పకుండా వచ్చెదరు. నమాజు కొరకు ఇఖామత్ ఇవ్వమని చెప్పి, నమాజు చేయించడానికి (నా స్థానంలో) మరొకరిని నియమించి, నా వెంట కొంత మందిని వారితో కట్టెల మోపును తీసుకొని సామూహిక నమాజులో హాజరు కాని వారి వైపు వెళ్లి వారు ఇండ్లల్లో ఉండగానే వారి ఇండ్లను తగలబెడదామని (ఎన్నోసార్లు) అనుకున్నాను”.

عن عثمان ™ قال: سمعت رسول الله ﷺ يقول: مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا قَامَ نِصْفَ اللَّيْلِ وَمَنْ صَلَّى الصُّبْحَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا صَلَّى اللَّيْلَ كُلَّهُ.

“ఇషా నమాజు సామూహికంగా చేసినవారికి సగం రాత్రి నమాజు చేసినంత పుణ్యం లభించును. ఫజ్ర్ నమాజు సామూహికంగా చేసిన వారికి రాత్రంతా నమాజు చేసినంత పుణ్యం లభించును” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని ఉస్మాన్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు.

عن جندب بن عبد الله ™ قال: قال رسول الله ﷺ: مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِي ذِمَّةِ اللَّهِ فَلَا يَطْلُبَنَّكُمْ اللَّهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ فَإِنَّهُ مَنْ يَطْلُبْهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ يُدْرِكْهُ ثُمَّ يَكُبَّهُ عَلَى وَجْهِهِ فِي نَارِ جَهَنَّمَ. [رواه مسلم]

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేసిన వ్యక్తి అల్లాహ్ రక్షణలో ఉంటాడు. అల్లాహ్ తన రక్షణలో ఉంచినదాని గురించి మిమ్మల్ని విచారించకుండా (జాగ్రత్తగా) ఉండండి. అతను తన రక్షణలో ఉన్న దాని విషయంలో విచారించి (విచారింపబడిన వ్యక్తి నేరస్తుడుగా) పట్టుబడుతే ఆయన అతన్ని తలక్రిందులుగా చేసి నరకములో పడవేస్తాడు”. (ముస్లిం).

విశేషాలుః

1- ఫజ్ర్ నమాజ్ ఘనత, అది దూతలు హాజరయ్యే సమయమని తెలిసింది.

2- అది వంచకులకు కష్టంగా ఉంటుంది.

3- సామూహికంగా నమాజు చేసిన వ్యక్తి అల్లాహ్ రక్షణలో ఉంటాడు.

18- అస్ర్ నమాజ్ యొక్క ఘనత

[حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَوةِ الْوُسْطَى وَقُومُوا لِلَّهِ قَانِتِينَ] البقرة: 238

మీరు మీ నమాజులను సంరక్షించుకోండి. ప్రత్యేకంగా మధ్యనుండు నమాజును. మరియు అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. (2: బఖర: 238).

عن أبي هريرة ™ قال: سمعت رسول الله ﷺ يقول: يَتَعَاقَبُونَ فِيكُمْ مَلَائِكَةٌ بِاللَّيْلِ وَمَلَائِكَةٌ بِالنَّهَارِ وَيَجْتَمِعُونَ فِي صَلَاةِ الْفَجْرِ وَصَلَاةِ الْعَصْرِ ثُمَّ يَعْرُجُ الَّذِينَ بَاتُوا فِيكُمْ فَيَسْأَلُهُمْ وَهُوَ أَعْلَمُ بِهِمْ كَيْفَ تَرَكْتُمْ عِبَادِي فَيَقُولُونَ تَرَكْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ وَأَتَيْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ

“మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్, నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రాంతా మీతో పాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశానికి వెళ్ళినప్పుడు -ఇదంతా మీ ప్రభువు గుర్తెరిగి ఉంటాడు- అయినా వారినుద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదలిపెట్టి వచ్చారని” అడుగుతాడు. దానికి దైవదూతలు మేము వారి దగ్గర్నుంచి బయలుదేరేటప్పుడు వారు నమాజు చేస్తుండటం కనిపించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజు స్థితిలో చూశాము” అని సమాధానమిస్తారు అని ప్రవక్త ﷺ తెలుపుతుండగా నేను విన్నాను అని అబూహూరైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి 555, ముస్లిం 632).

عن جرير بن عبد الله ™ قال: كنا يوما جلوسا عند النبي ﷺ إذْ نظر إلى القمر ليلة البدر قال: إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ لَا تُضَامُونَ فِي رُؤْيَتِهِ فَإِنْ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَصَلَاةٍ قَبْلَ غُرُوبِ الشَّمْسِ فَافْعَلُوا، ثم قرأ جرير [وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا]

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ కథనం ఇలా ఉందిః మేము ఒకసారి దైవప్రవక్త ﷺ చెంత కూర్చొని ఉండగా ప్రవక్త ﷺ పున్నమి చంద్రుడ్ని చూసి మాతో ఇలా అన్నారుః “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే మీరు (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవలసిన (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడ కుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. ఇలా అన్న తర్వాత (నీవు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు నీ ప్రభువు ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన్ని స్మరించు). (20: 130). అన్న ఖుర్ఆను ఆయతు  పఠించారు జరీర్ రజియల్లాహు అన్హు . (బుఖారి, ముస్లిం).

عن أبي موسى الأشعري ™ قال: قال رسول الله ﷺ: مَنْ صَلَّى الْبَرْدَينِ دَخَلَ الْجَنَّة

అబూమూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త ﷺ ఆదేశించారుః “రెండు చల్లని వేళల్లో చేయవలసిన (ఫజ్ర్, అస్ర్) నమాజులను (ప్రతీ రోజు క్రమం తప్పకుండా) చేసే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి, ముస్లిం).

عن بريدة ™ قال قال رسول الله ﷺ: مَن تَرَكَ صَلاَةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ

“అస్ర్ నమాజు వదిలినవారి కార్యములన్నియు వ్యర్థమగును” అని ప్రవక్త ﷺ సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు.

విశేషాలుః

1- అస్ర్ నమాజ్ ఘనత చాలా ఉంది.

2- దాన్ని కాపాడుకొనుట స్వర్గ ప్రవేశానికి కారణం అవుతుంది.

3- దాన్ని వదిలిన వారికి కఠిన హెచ్చరిక ఉంది.

19- తహజ్జుద్

దాని ఘనత

[تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا] السجدة:16

వారి వీపులు పడకలకు ఎడంగా ఉంటాయి. తమ ప్రభువును వారు భయంతోనూ, ఆశతోనూ వేడుకుంటారు. (32: అస్సజ్దా: 16).

[كَانُوا قَلِيلاً مِنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ، وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ] الذاريات:17ـ18

రాత్రి వేళలో చాలా తక్కువ నిదురపోయేవారుగా అదే రాత్రి చివరి గడియలలో క్షమాపణ వేడుకునేవారుగా ఉండేవారు. (51: జారియాత్: 18).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: أَفْضَلُ الصِّيَامِ بَعْدَ رَمَضَانَ شَهْرُ اللَّهِ الْمُحَرَّمُ وَأَفْضَلُ الصَّلَاةِ بَعْدَ الْفَرِيضَةِ صَلَاةُ اللَّيْلِ.

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “రమజాను మాసపు ఉపవాసాల తరువాత శ్రేష్ఠమైన ఉపవాసాలు అల్లాహ్ యొక్క మాసము ముహర్రంలో పాటించేవి. ఫర్జ్ నమాజు తరువాత శ్రేష్ఠమైన నమాజ్ రాత్రి నమాజ్” (తహజ్జుద్). (ముస్లిం).

عن أبي سعيد الخدري ™ قال: قال رسول الله ﷺ: مَنْ اسْتَيْقَظَ مِنْ اللَّيْلِ وَأَيْقَظَ امْرَأَتَهُ فَصَلَّيَا رَكْعَتَيْنِ جَمِيعًا كُتِبَا مِنْ الذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ.

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూసఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి అయితే రాత్రి పూట మేల్కొని, తన ఇంటి వారిని మేల్కొలిపి, ఇద్దరు నమాజు చేసుకున్నచో వారిద్దరూ అల్లాహ్ ను అధికంగా స్మరించే స్త్రీ పురుషులలో లిఖించబడుతారు”. (అబూ దావూద్).

عن ابي هريرة ™ أن رسول الله ﷺ قال: يَعْقِدُ الشَّيْطَانُ عَلَى قَافِيَةِ رَأْسِ أَحَدِكُمْ إِذَا هُوَ نَامَ ثَلَاثَ عُقَدٍ يَضْرِبُ كُلَّ عُقْدَةٍ عَلَيْكَ لَيْلٌ طَوِيلٌ فَارْقُدْ فَإِنْ اسْتَيْقَظَ فَذَكَرَ اللَّهَ انْحَلَّتْ عُقْدَةٌ فَإِنْ تَوَضَّأَ انْحَلَّتْ عُقْدَةٌ فَإِنْ صَلَّى انْحَلَّتْ عُقْدَةٌ فَأَصْبَحَ نَشِيطًا طَيِّبَ النَّفْسِ وَإِلَّا أَصْبَحَ خَبِيثَ النَّفْسِ كَسْلَانَ.

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మనిషి రాత్రి వేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చులి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని అల్లాహ్ ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది. తర్వాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తర్వాత నమాజ్ చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారు జామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”. (బుఖారి, ముస్లిం).   

عن جابر ™ قال: سمعت رسول الله ﷺ يقول: إِنَّ فِي اللَّيْلِ لَسَاعَةً لَا يُوَافِقُهَا رَجُلٌ مُسْلِمٌ يَسْأَلُ اللَّهَ خَيْرًا مِنْ أَمْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا أَعْطَاهُ إِيَّاهُ وَذَلِكَ كُلَّ لَيْلَةٍ.

“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిం వ్యక్తి అయితే అల్లాహ్ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. అది అలాగే ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త ﷺ తెలుపగా నేను విన్నాను, అని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు.

విశేషాలుః

1- తహజ్జుద్ ఘనత చాలా ఉంది.

2- తహజ్జుద్ నమాజ్ హృదయం (ధర్మమునర్థం చేసుకొనుటకు), విశాలంగా యుండుటకు మరియు శుద్ధి కొరకు ఒక కారణం.

తహజ్జుద్ విధానం

عن عائشة ؅ قالت: ما كان رسول الله ﷺ يزيد في رمضان ولا في غيره على إحدى عشرة ركعة، يصلي أربعا فلا تسأل عن حسنهن وطولهن، ثم يصلي أربعا فلا تسأل عن حسنهن وطولهن، ثم يصلي ثلاثا، قالت عائشة: قلت يا رسول الله أتنام قبل أن توتر؟ قال: يا عائشة إن عينيّ تنامان ولا ينام قلبي

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: రమజాను మాసంలో అయినా ఇతర మాసాలలో అయినా ప్రవక్త ﷺ పదకొండు రకాతులకు మించి (నఫిల్) నమాజ్ చేసేవారు కాదు. మొదట నాలుగు రకాతులు చేస్తారు. ఈ నాలుగు రకాతుల నమాజ్ ఎంతో సుందరంగా, సుదీర్ఘంగా, వర్ణనాతీతంగానూ ఉంటుంది. దాని తరువాత మరో నాలుగు రకాతుల నమాజు చేస్తారు. ఇది కూడా ఎంతో సుందరంగా, సుదీర్ఘంగా, వర్ణాతీ-తంగా ఉంటుంది. ఆ తరువాత మరో మూడు రకాతులు చేస్తారు. నేను దైవ ప్రవక్తను ఉద్దేశించి, ‘మీరు విత్ర్ నమాజ్ చేయడానికి ముందు పడుకుంటారా? అని అడిగాను. అందుకాయన “ఆయిషా! నా కళ్ళు తప్పక నిద్రిస్తాయి. కాని హృదయం మాత్రం (మేల్కొనే ఉంటుంది. అది) ఎన్నటికీ నిద్రించదు” అని బదులిచ్చారు. (బుఖారి, ముస్లిం).   

عن عبد الله بن عمرو ؆ أن رسول الله ﷺ قال له: أَحَبُّ لصَّلَاةِ إِلَى اللَّهِ صَلَاةُ دَاوُدَ عَلَيْهِ السَّلَام وَأَحَبُّ الصِّيَامِ إِلَى اللَّهِ صِيَامُ دَاوُدَ وَكَانَ يَنَامُ نِصْفَ اللَّيْلِ وَيَقُومُ ثُلُثَهُ وَيَنَامُ سُدُسَهُ وَيَصُومُ يَوْمًا وَيُفْطِرُ يَوْمًا

ప్రవక్త ﷺ తనకు చెప్పినట్లు అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ప్రియమైన నమాజ్ ప్రవక్త దావూద్ నమాజ్. మరియు ప్రియమైన రోజా కూడా ప్రవక్త దావూద్ రోజా. వారు సగం రాత్రి పడుకుని మూడవ భాగంలో (నమాజు చేయుటకు) లేచి మళ్ళీ ఆరవ భాగంలో నిద్రించేవారు. ఒక రోజు వదలి మరొక రోజు ఉపవాసం ఉండేవారు”. (బుఖారి).

عن ابن عمر ™ أن رجلا سأل رسول الله ﷺ عن صلاة الليل فقال رسول الله ﷺ: صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى

ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ తో రాత్రి వేళ (తహజ్జుద్) నమాజ్ గురించి అడిగాడు, దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “రాత్రి వేళ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం సమీపిస్తుందని భావించినపుడు ఒక రకాత్ పఠించాలి. దీని వల్ల (అప్పుడు చేసిన) మొత్తం నమాజులు విత్ర్ అయిపోతాయి”. (బుఖారి, ముస్లిం).  

عن عائشة ؅ قالت: كان رسول الله ﷺ إذا قام من الليل افتتح صلاته بركعتين خفيفتين.

‘ప్రవక్త ﷺ రాత్రి మేల్కొన్నచో నమాజు యొక్క ప్రారంభం సంగ్రహమైన రెండు రకాతులతో చేసేవారు’ అని ఆయిష రజయల్లాహు అన్హా తెలిపారు. (ముస్లిం).

విశేషాలుః

1- రాత్రి నమాజు రెండేసి రకాతులు.

2- రాత్రి (తహజ్జుద్) నమాజ్ పదకుండు రకాతులు ధర్మ సాంప్రదాయం.

3- రాత్రి మూడవ భాగములో మేల్కొని నమాజ్ చేయుట ఘనతతో కూడినది.

4- రాత్రి నమాజు సంగ్రహమైన రెండు రకాతులతో ఆరంభించాలి.

20- నఫిల్ నమాజ్ ఆదేశాలు

వాహనములో నమాజ్:

عن عبد الله بن عمر ؆ أن النبي ﷺ كان يسبح على ظهر الراحلة قِبَلَ أيّ وجه توجّه ويوتر عليها، غير أنه لا يصلي عليها المكتوبة

‘వాహనం ఏ దిక్కు తిరిగి నడుస్తున్నా సరే ప్రవక్త ﷺ దాని మీదే ఉండి నఫిల్ మరియు విత్ర్ నమాజులు చేసేవారు. కాని ఫర్జ్ నమాజులు వాహనంపై చేసేవారు కారు’ అని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి).

عن عامر بن ربيعة  ™ قال: رأيت رسول الله ﷺ وهو على الراحلة يسبح يومئ برأسه أي وجه توجّه، ولم يكن رسول الله يصنع ذلك في الصلاة المكتوبة

‘ప్రవక్త ﷺ వాహనంపై ఉండి నఫిల్ నమాజ్ చేస్తున్నది నేను చూశాను. వాహనం ఏ దిశలో తిరిగినా దాని మీదే (రుకూ, సజ్దాలు) సైగల ద్వారా నిర్వర్తించేవారు. ప్రవక్త ﷺ ఫర్జ్ నమాజులు వాహనంపై చేసేవారు కారు, అని ఆమిర్ బిన్ రబీఅ ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

నఫిల్ నమాజ్ కూర్చొని చేయవచ్చునుః

عن عائشة ؅ قالت: كان رسول الله ﷺ يصلي في بيتي قبل الظهر أربعا، ثم يخرج فيصلي بالناس ثم يدخل فيصلي ركعتين، وكان يصلي بالناس المغرب فيدخل فيصلي ركعتين، ويصلي بالناس العشاء ويدخل بيتي فيصلي ركعتين، وكان يصلي من الليل تسع ركعات فيهن الوتر، وكان يصلي ليلا طويلا قائما وليلا طويلا قاعدا، وكان إذا قرأ وهو قائم ركع وسجد وهو قائم وإذا قرأ قاعدا ركع وسجد وهو قاعد، وكان إذا طلع الفجر صلى ركعتين

ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: నా ఇంట్లో ప్రవక్త ﷺ జొహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు చేసి, (మస్జిద్) వెళ్ళి నమాజు చేయించి, ఇంటికి తిరిగి వచ్చి రెండు రకాతులు చదివేవారు. మగ్రిబ్ నమాజ్ చేయించి, వచ్చి (ఇంట్లో) రెండు రకాతులు చేసేవారు. ఇషా నమాజ్ చేయించి, వచ్చి నా ఇంట్లో రెండు రకాతులు చదివేవారు. రాత్రి వేళ విత్ర్ తో సహా తొమ్మిది రకాతుల నమాజ్ చేసేవారు. ఒక రాత్రి నిలబడి చాలా దీర్ఘంగా నమాజ్ చేసేవారు. ఒక్కో రాత్రి కోర్చొని చాలా దీర్ఘంగా నమాజ్ చేసేవారు. అయితే నిలబడి చేసేటప్పుడు రుకూ, సజ్దాలు నిలబడి చేసేవారు. కూర్చొని చేసేటప్పుడు రుకూ, సజ్దాలు కూర్చునే చేసేవారు. ఉషోదయం తరువాత (ఫజ్ర్ యొక్క ఫర్జ్ నమాజుకు ముందు) రెండు రకాతులు చేసేవారు. (ముస్లిం).

عن عبد الله بن عمرو ؆ أن رسول الله ﷺ قال: صلاة الرجل قاعدا نصف الصلاة

“కూర్చొని నమాజ్ చేసేవారికి సగం (పుణ్యం లభించును)” అని ప్రవక్త ﷺ చెప్పారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

విశేషాలుః

1- నఫిల్ నమాజ్ వాహనంలో కూర్చొని చేయవచ్చును. అది ఏ దిశలో తిరిగి వెళ్తన్నా పర్వాలేదు.

2- నఫిల్ నమాజ్ కూర్చొని చేయుట ధర్మసమ్మతం.

3- కూర్చొని నమాజ్ చేయువారికి నిలబడి చేసేవారిలో సగం పుణ్యం మాత్రమే లభిస్తుంది.

21- జుమా ఘనత, దాని సాంప్రదాయ మర్యాదలు

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: خير يوم طلعت عليه الشمس يوم الجمعة، فيه خلق آدم وفيه أُدخل الجنة وفيه أخرج منها

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా మహోన్నతమైన రోజు జుమా రోజు. అదే రోజు ఆదం అలైహిస్సలాం  జన్మించారు. అదే రోజు స్వర్గంలో ప్రవేశించారు. అదే రోజు స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు”. (ముస్లిం).

عن أبي هريرة™  قال: قال رسول الله ﷺ: من توضّأ فأحسن الوضوء ثم أتى الجمعة فاستمع وأنصت غفر له ما بينه وبين الجمعة وزيادة ثلاثة أيام، ومن مسّ الحصا فقد لغا.

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరైతే సముచిత రీతిలో వుజూ చేసుకొని జుమా నమాజు కోసం వచ్చి నిశబ్దంగా, శ్రద్ధతో ఖుత్బ (ప్రసంగం) వింటారో, ఈ జుమా నుంచి మరో జుమా వరకు, ఇంకా మూడు రోజులు ఎక్కువ వారు క్షమించబడుతారు. రాళ్ళు ముట్టి (లేక వాటితో ఆడి)నవాడు వ్యర్థ పని చేసినవాడగును. (వ్యర్థ పని అనగా జుమా పుణ్యం కోల్పోయాడు అని). (ముస్లిం).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: الصلوات الخمس والجمعة إلى الجمعة ورمضان إلى رمضان مكفرات ما بينهن إذا اجتنبت الكبائر. [مسلم]

“ఐదు వేళలో చేసే నమాజులు, ఒక జుమా నుంచి మరో జుమా వరకు, రమజాను మరో రమజాను వరకు ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి విమోచనకారకులు అవుతాయి. అయితే పెద్ద పాపాల నుండి దూరంగా ఉండుట తప్పనిసరి.” అని ప్రవక్త ﷺ చెప్పారని, అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ ذكر يوم الجمعة فقال: فيها ساعة لا يوافقها عبد مسلم وهو قائم يصلي يسأل الله شيئا إلاّ أعطاه إياه، وأشار بيده يقلّلها.

ప్రవక్త ﷺ జుమా విషయం ప్రస్తావిస్తూ ఇలా చెప్పారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఆ రోజు ఓ ప్రత్యేక (శుభ) ఘడియ ఉంది. ఆ ఘడియలో ఎవరైనా ముస్లిం భక్తుడు నమాజు స్థితిలో అల్లాహ్ ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కోర్కెను తప్పకుండా తీరుస్తాడు”. ప్రవక్త ﷺ ఈ సంగతి చెబుతూ “ఆ ఘడియ అతి స్వల్పంగా ఉంది” అని చేత్తో సైగ చేశారు. (బుఖారి, ముస్లిం).  

విశేషాలుః

1- వారపు ఏడు రోజుల్లో జుమా రోజు ఉత్తమమైన రోజు.

2- జుమా నమాజు ఘనత. అది పాపాల క్షమాపణకు ఒక కారణం.

3- అందులో ఒక ఘడియ ఉంది. అందులో ఏ ముస్లిం భక్తుడైతే అల్లాహ్ తో దుఆ చేస్తాడో అతని దుఆ అంగీకరింపబడును.

22- జుమా నమాజుకు త్వరగా హాజరవటంలోని ఘనత – దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక

[يَا أَيُّهَا الَّذِينَ ءَامَنُوا إِذَا نُودِيَ لِلصَّلوَةِ مِنْ يوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ

وَذَرُوا الْبَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَّكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] الجمعة:9

ఓ విశ్వాసుల్లారా! శుక్రవారం నాడు నమాజుకుగాను పిలువబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానము వైపునకు పరుగెత్తిరండి. మరియు వ్యాపారం వదలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇదీ మీకు చాలా మేలైనది. (62: జుమాః 9).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: من اغتسل يوم الجمعة غسل الجنابة ثم راح فكأنما قرّب بدنة، ومن راح في الساعة الثانية فكأنما قرّب بقرة، ومن راح في الساعة الثالثة فكأنما قرّب كبشا أقرن،ومن راح في الساعة الرابعة فكأنما قرّب دجاجة، ومن راح في الساعة الخامسة فكأنما قرّب بيضة، فإذا خرج الإمام حضرت الملائكة يستمعون الذكر.

ప్రవక్త ﷺ ఇలా బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరయితే శుక్రవారం రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ (సంపూర్ణ స్నానం) చేసి మస్జిద్ కు (అందరికంటె మందు) వెళ్తాడో, అతనికి ఒక ఒంటె బలిదానం (ఖుర్బానీ) చేసినంత పుణ్యం లభించును. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభించును. మూడవ వేళలో వచ్చినతనికి కొమ్ములుగల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభించును. నాల్గవ గడియలో వెళ్ళినతనికి ఒక కోడి అల్లాహ్ మార్గములో బలిదానం చేసినంత పుణ్యం లభించును. ఐదవ వెళలో వెళ్ళేవానికి దైవమార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభించును. ఆ తరువాత ఇమాం (ప్రసంగించడానికి) వచ్చినప్పుడు దైవదూతలు కూడా ప్రసంగం వినటానికి హాజరవుతారు. (బుఖారి, ముస్లిం).  

عن ابن عمر ™ أنه سمع رسول الله ﷺ يقول: لينتهينّ أقوام عن ودعهم الجمعات أو ليختمن الله على قلوبهم ثم ليكونُنَّ من الغافلين.

“జుమా నమాజు చేయనివారు తమ ఈ అలవాటును త్యజించకుంటే, అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారు ఆలక్ష్యపరుల్లో చేరిపోతారు” అని ప్రవక్త ﷺ చెప్పగా అతను విన్నట్లు ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా  ఉల్లేఖించారు. (ముస్లిం).

విశేషాలుః

1- జుమా నమాజ్ అజాన్ విన్న వెంటనే త్వరపడి మస్జిద్ లోకి చేరాలని ఆదేశించబడింది.

2- జుమా నమాజ్ కు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది.

3- జుమా నమాజ్ వదిలేవారికి హెచ్చరించబడింది. అలా చేయుట వారి హృదయం మూసి వేయబడటానికి కారణమగును.

23- జుమా రోజు యొక్క ధర్మాలు, సంస్కారాలు

عن أبي سعيد الخدري ™ أن النبي ﷺ قال: من قرأ سورة الكهف يوم الجمعة أضاء له من النور ما بين الجمعتين.

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూసఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరయితే జుమా రోజు సూరె కహ్ ఫ్ పఠిస్తారో, వారి కోసం రెండు జుమాల మధ్య జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది”. (హాకిం, బైహఖి).  

عن عبد الله بن بسر ™ قال: جاء رجل يتخطى رقاب الناس يوم الجمعة والنبي ﷺ يخطب، فقال النبي ﷺ: اجلس فقد آذيت وآنيت.

అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి పంక్తులను చీల్చుకుంటూ ముందుకు దూసుకొని వస్తుండగా చూసిన ప్రవక్త ఇలా ఆజ్ఞాపించారుః “కూర్చో, నీవు ఆలస్యంగా వచ్చావు. చాలా బాధ కలిగించావు”. (అబూదావూద్, నసాయి).

عن أبي هريرة ™ أن النبي ﷺ قال: إذا قلت لصاحبك يوم الجمعة أَنصت والإمام يخطب فقد لغوت.

“జుమా రోజున ఇమాం ప్రసంగిస్తున్నప్పుడు, నీవు గనుక నీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశబ్దంగా ఉండు’ అని అన్న కూడా నీవొక పనికిమాలిన కార్యమునకు పాల్పడిన వాడవుతావు”. (బుఖారి, ముస్లిం).

عن أوس بن أوس ™ قال: قال رسول الله ﷺ: إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا عليّ من الصلاة فيه، فإن صلاتكم معروضة عليّ، قالوا: يا رسول الله ﷺ كيف تُعرَض صلاتنا عليك وقد أرِمت؟ قال: إن الله حرّم على الأرض أجساد الأنبياء.

ఔస్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా తెలిపారుః “మీకున్న ఈ రోజుల్లో అన్నిటికన్నా మహోత్తరమైన రోజు జుమారోజు. ఆ రోజు మీరు నాపై దరూద్ అధికంగా పంపండి. మీ దరూద్ నా వరకు చేరుతుంది”. అనుచరులడిగారుః ప్రవక్తా! మీ వరకు దరూద్ ఎలా చేరుతుంది? మీరు చనిపోయి మట్టిలో కలిసిపోతారు కదా?. దానికి సమాధానంగా ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “అల్లాహ్ భూమిపై ప్రవక్తల దేహాలను నిషిద్ధపరిచాడు”. (అంటే వారి దేహాలను భూమి నష్టపరచదు). (అబూదావూద్, ఇబ్ను మాజ).  

విశేషాలుః

1- జుమా నమాజుకు శీఘ్రముగా వెళ్ళుట అభిలషణీయం.

2- జుమా ప్రసంగ సమయంలో నిశబ్దంగా ఉండుట తప్పనిసరి.

3- జుమా రోజున సూరె కహ్ ఫ్ పఠించుట.

4- జుమా రోజున ప్రవక్త ﷺ పై దరూద్ అధికంగా చదవాలి.

24- పండుగ నమాజు ఆదేశాలు

عن أنس ™ قال: كان رسول الله ﷺ لا يغدو يوم الفطر حتى يأكل تمرات [أخرجه البخاري]. وفي رواية: يأكلهن وترا.

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) రోజున ఖర్జూర పండ్లు తిని (పండుగ నమాజ్ చేయుటకు ఈద్గాహ్) వెళ్ళేవారు. (బుఖారి). మరో ఉల్లేఖనంలో బేసి సంఖ్యలో తినేవారని ఉంది.

عن بريدة™ قال: كان رسول اللهﷺ لا يخرج يوم الفطر حتى يطعم ولا يطعم يوم الأضحى حتى يصلّي.  [أخرجه الترمذي]

బురైద రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్ రోజు అల్పాహారం తీసుకోకుండా (ఈద్గాహ్) వెళ్ళేవారు కాదు. ఈదుల్ అజ్హా (బక్రీద్ పండుగ) రోజున మాత్రం పండుగ నమాజ్ చేసుకొని వచ్చే వరకు ఏమీ తినేవారు కాదు. (తిర్మిజి).  

عن ابن عمر ™ قال: كان رسول الله ﷺ و أبو بكر وعمر يصلّون العيدين قبل الخطبة.

ప్రవక్త ﷺ, అబూ బక్ర్ మరియు ఉమర్ రజియల్లాహుఅన్హుమాలు రెండు పండుగల నమాజులు ఖుత్బా (ప్రసంగానికి) ముందే చదివేవారు అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా తెలిపారు. (బుఖారి).  

عن جابر بن سمرة ™ قال: صلّيت مع رسول الله ﷺ العيدين غير مرّة ولا مرّتين بلا أذان ولا إقامة.

నేను ప్రవక్త ﷺతో పండుగ నమాజులు ఒకటికి రెండు సార్లకంటే ఎక్కువ చదివాను. అందులో అజాన్ మరియు ఇఖామత్ ఏదీ ఉండేది కాదు అని జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు  తెలిపారు. (ముస్లిం).   

عن أبي سعيد الخدري ™ قال: كان النبي ﷺ يخرج يوم الفطر والأضحى إلى المصلى، وأوّل شيء يبدأ به الصلاة، ثم ينصرف فيقوم مقابل الناس ـ والناس على صفوفهم ـ فيعظهم ويذكّرهم.

అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  కథనం: ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గాహ్ వెళ్ళి, ముందుగా నమాజ్ చేయించేవారు. ఆ తరువాత బారులు తీరి తమ తమ స్థానాల్లో కూర్చొని ఉన్న ప్రజల ముందు నిలబడి వారికి ధర్మబోధ, జ్ఞానోపదేశాలు చేసేవారు. (బుఖారి).  

عن ابن عباس ™ أن النبي ﷺ صلّى يوم العيد ركعتين، لم يصلِّ قبلهما ولا بعدهما.

ప్రవక్త ﷺ పండుగ రోజు రెండే రెండు రకాతులు చదివారు. దానికి ముందూ, వెనక ఏ నమాజు చదవలేదని ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా  చెప్పారు. (బుఖారి).

عن عائشة ؅ أن رسول الله ﷺ كان يكبّر في الفطر والأضحى في الأولى سبع تكبيرات وفي الثانية خمسا.

ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా నమాజులలోని మొదటి రకాతులో ఏడు తక్బీర్లు, రెండవ రకాతులో ఐదు తక్బీర్లు చెప్పేవారు. (అబూదావూద్).  

عن أبي واقد الليثي ™ قال: كان رسول اللهﷺ يقرأ في الأضحى والفطر بـ [ق وَالْقُرْآنِ الْمَجِيدِ]  و [اقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ ]

ప్రవక్త ఈదుల్ అజ్హా మరియు ఈదుల్ ఫిత్ర్ నమాజుల్లో సూరె ‘ఖాఫ్ వల్ ఖుర్ఆనిల్ మజీద్’ మరియు సూరె ‘ఇఖ్తరబతిస్సాఅతు వన్ షఖ్ఖల్ ఖమర్’ పారాయణం చేసేవారు. (ముస్లిం).

పండుగ రోజు ఖుత్బ (ప్రసంగం):

عن ابن عمر ™ أن رسول الله ﷺ كان يصلّي في الأضحى والفطر ثم يخطب بعد الصلاة

ప్రవక్త ﷺ ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హాలలో ముందు నమాజ్ చేయించి, తర్వాత ప్రసంగించేవారు అని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా  ఉల్లేఖించారు.

عن جابر ™ قال: كان النبي ﷺ إذا كان يوم عيد خالف الطريق

పండుగా రోజున దారి మర్చేవారు అని జాబిర్ రజియల్లాహు అన్హు  తెలిపారు. (అనగా వచ్చి దారి వేరు, వెళ్ళే దారి వేరు). (ఇవి రెండూ బుఖారిలో ఉన్నవి).

عن أم عطية ؅ قالت: أمرنا رسول الله ﷺ أن نُخْرجهن في الفطر والأضحى: العواتق والحيّض وذوات الخدور، فأما الحيّض فيعتزلن الصلاة ويشهدن الخير ودعوة المسلمين، قالت: يا رسول الله إحدانا لا يكون لها جلباب؟ قال: تُلْبسها أختها من جلبابها.

ఉమ్మె అతియ రజియల్లాహు అన్హా కథనం ఇలా ఉందిః రెండు పండుగ సందర్భాల్లోనూ యువతులు, బహిష్టు స్త్రీలు, పరదా పహిళల్ని (మాతో పాటు ఈద్గాహ్ కు) తీసుకు వెళ్ళవలసినదిగా ప్రవక్త ﷺ మమ్మల్ని ఆదేశించారు. బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు చేసే చోటు నుంచి కొంచెం దూరంగా ఉండాలని. అయితే ధర్మబోధ (ప్రసంగం) వినుటకు మరియు నమాజీలతో దుఆ (వేడుకోలు)లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రవక్తా ﷺ! మాలో ఎవరి దగ్గరయినా దుప్పటి (బురఖ) లేకపోతే (ఆమె ఈద్గాహ్ ఎలా వెళ్తుంది)?అని (ఉమ్మె అతియ) ప్రశ్నించింది. దానికి ప్రవక్త ﷺ ఆమె స్నేహితురాలు తన దగ్గరున్న దుప్పట్లలో ఒకటి ఆమెకు ఇవ్వాలి” అన్నారు.   (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఈదుల్ ఫిత్ర్ నమాజుకు వెళ్లే ముందు ఖర్జూరపు పండ్లు తినుట ధర్మ సాంప్రదాయం.

2- ఈదుల్ అజ్హా రోజు పండుగ నమాజు చేసుకునే వరకు ఏమీ తినకపోవడం ధర్మసాంప్రదాయం.

3- పండుగా నమాజుల్లో అజాన్, ఇఖామత్ లు లేవు.

4- పండుగ నమాజు చేయుట ఇస్లాం ధర్మాల్లో ఒకటి.

5- అవి రెండే రకాతులు. మొదటి రకాతులో ఏడు తక్బీర్లు. రెండవ రకాతులో ఐదు తక్బీర్లు.

6- రెండు రకాతుల్లో సూరె ఖాఫ్ మరియు సూరె ఖమర్ పారాయణం చేయుట ధర్మం.

7- పండుగ రోజు ప్రసంగం నమాజ్ తరువాత జరగాలి.

8- పండుగ నమాజు కోసం ఒకదారి నుండి వెళ్ళి, మరో దారిన తరిగి రావటం ధర్మం.

9- స్త్రీలు సయితం పర్దతో పండుగ నమాజు కొరకు వెళ్ళుట ధర్మం.

25- జిల్ హిజ్జ తొలి దశ ఘనత – దాని ఆదేశాలు

عن ابن عباس ™ قال: قال رسول الله ﷺ: ما من أيامٍ العمل الصالح فيها أحب إلى الله من هذه الأيام. يعني أيام العشر، قالوا: يا رسول الله ولا الجهاد في سبيل الله؟ قال: ولاالجهاد في سبيل الله، إلاّ رجل خرج بنفسه وماله فلم يرجع من ذلك بشيءٍ

ప్రవక్త ﷺ ప్రవచించారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా  ఉల్లేఖించారుః “జిల్ హిజ్జ మొదటి పది రోజుల్లో చేసే సత్కార్యాలు ఇతర రోజుల్లో చేసే వాటికన్నా అల్లాహ్ కు చాలా ప్రీతిగలవి”. అల్లాహ్ మార్గంలో పోరాడుట కూడా అంత ప్రీతిగలది కాదా? అని అనుచరులు ప్రశ్నించగా “అల్లాహ్ మార్గంలో పోరాడుట కూడా అంత ప్రీతిగలది కాదు. కాని ఏ వ్యక్తి తన ధన, ఆత్మతో పాటు అందులో పాల్గొని, తిరిగి రాకుండా ఉండిపోయాడో (అతని ఈ ఆచరణ మరీ ప్రీతిగలది)” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు.

عن أم سلمة ؅ أن النبي قال ﷺ: إذا دخلت العشر وأراد أحدكم أن يضحّي فلا يمسّ من شعره وبشره شيئا. وفي رواية: فليمسك عن شعوره وأظفاره.

ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో మహాప్రవక్త ﷺ ఇలా తెలిపారుః “జిల్ హిజ్జ నెల వంక కనపడి మొదటి దశ ప్రారంభం అయితే మీలో ఎవరైనా ఖుర్బానీ ఇవ్వదలుచుకుంటే అతను తన శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళు తీయకూడదు”. (ముస్లిం).

విశేషాలుః

1- జిల్ హిజ్జ మొదటి దశ ఘనత గలది.

2- అందులో సత్కార్యాలు అధికంగా చేయుట అభిలషణీయ.

3- ఖుర్బానీ ఇవ్వదలుచుకున్న వ్యక్తి జిల్ హిజ్జ నెల వంక చూశాక మొదటి దశ గడిసే వరకు తన గోళ్ళు, వెంట్రుకలు తీయకూడదు.

26- ఖుర్బానీ

[لَنْ يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلاَ دِمَاؤُهَا وَلَكِنْ يَّنَالُهُ التَّقْوَى مِنْكُمْ] الحج:37

వాటి మాంసమూ లేదా వాటి రక్తమూ అల్లాహ్ కు చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. (22: హజ్: 37).

عن أنس ™ قال: ضحّى رسول الله ﷺ بكبشين أملحين أقرنين ذبحهما بيده وسمى وكبّر ووضع رجله على صفاحهما.

ప్రవక్త ﷺ కొమ్ములుగల, గోదుమ రంగుగల రెండు గొర్రెల ఖుర్బానీ ఇచ్చారు. వాటి మెడ క్రింద కాలు పెట్టి “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని పలికి స్వయంగా తన చేతితో జిబహ్ చేశారు అని అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن ابي بردة ™ أنه ضحّى قبل الصلاة فقال رسول الله ﷺ: تلك شاة لحم. فقال: يا رسول الله، إن عندي جذعة من المعز؟ فقال: ضحِّ بها ولا تصلح لأحد غيرك، ثم قال ﷺ: من ضحّى قبل الصلاة فإنما ذبح لنفسه ومن ذبح بعد الصلاة فقد تمّ نسكه وأصاب سنة المسلمين.

అబూ బుర్ద రజియల్లాహు అన్హు  కథనం: తను (ఈదుల్ అజ్హా రోజు) నమాజుకు ముందే ఖుర్బానీ చేశారు. అప్పుడు ప్రవక్త ﷺ (కు ఈ విషయం తెలిసి) “ఇది సాధరణ మేక మాంసం”. (అనగా నమాజుకు ముందు చేసినందున నీ ఖుర్బానీ కాలేదు). ‘ప్రవక్తా! ﷺ నా వద్ద ‘జజఅ’ (ఆరు మాసములు నిండిన మేక పిల్ల) మాత్రమే ఉంది’ అని అతనడిగాడు. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “దాని ఖుర్బానీ ఇవ్వు. కాని ఆ ఈడుగల మేక నీకు తప్ప మరెవ్వరికీ సమ్మతం కాదు”. ఇంకా ఇలా చెప్పారుః “ఎవరయితే (ఈదుల్ అజ్హా) నమాజుకు ముందు ఖుర్బానీ చేస్తారో, అది తన కొరకు జిబహ్ చేసుకున్నట్లు. ఎవరయితే నమాజు తర్వాత చేస్తారో వారి ఖుర్బానీ పూర్తి అయినట్లు. వారు ముస్లింల సున్నతును పాటించినవారవుతారు”. (బుఖారి, ముస్లిం).   

عن جابر ™ قال: قال رسول الله ﷺ: لاتذبحوا إلاّ مسنّة إلاّ أن تعسُر عليكم فتذبحوا جذعة من الضّان.

“పళ్లు వచ్చి ఉన్న (ఒక సంవత్సరం ఈడుగల) జంతువునే జిబహ్ చేయండి. అది దొరుకుట అతికష్టమైనప్పుడే ఆరు మాసాలు నిండిన గొర్రె పిల్లను జిబహ్ చేయండి”. (ముస్లిం).

విశేషాలుః

1- ఖుర్బానీ చేయుట ధర్మం.

2- ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి తాను స్వయంగా తన చేతితో జిబహ్ చేయుట అభిలషణీయం.

3- నమాజ్ తర్వాత ఖుర్బానీ జంతువును జిబహ్ చేయాలి. ముందు చేయరాదు.

27- సూర్య చంద్ర గ్రహణముల నమాజు

عَنْ أَبِي بَكْرَةَ ™ قَالَ: كُنَّا عِنْدَ رَسُولِ اللَّهِ ﷺ فَانْكَسَفَتِ  الشَّمْسُ، فَقَامَ النَّبِيُّ ﷺ يَجُرُّ رِدَاءَهُ حَتَّى دَخَلَ المَسْجِدَ، فَدَخَلْنَا، فَصَلَّى بِنَا رَكْعَتَيْنِ حَتَّى انْجَلَتِ الشَّمْسُ، فَقَالَ ﷺ: إِنَّ الشَّمْسَ وَالقَمَرَ لاَ يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ، فَإِذَا رَأَيْتُمُوهُمَا، فَصَلُّوا، وَادْعُوا حَتَّى يُكْشَفَ مَا بِكُمْ

అబూ బక్రా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఉండగా సూర్యగ్రహణం అయ్యింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మస్జిద్ లోకి ప్రవేశించారు. మేము కూడా ప్రవేశించాము. అప్పుడు రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం విడిచాడు. ఆ తరువాత (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఇలా) చెప్పారుః “ఏ ఒకరి చావు కారణంగా సూర్య చంద్ర గ్రహణాలు సంభవించవు. మీరొక వేళ సూర్యచంద్ర గ్రహణాలు చూస్తే అది విడే వరకు నమాజ్ చదవండి. అల్లాహ్ ను వేడుకోండి”. (బుఖారి 1040).  

عَنْ عَائِشَةَ ؅ أَنَّهَا قَالَتْ: خَسَفَتِ الشَّمْسُ فِي عَهْدِ رَسُولِ اللَّهِ ﷺ، فَصَلَّى رَسُولُ اللَّهِ ﷺ بِالنَّاسِ، فَقَامَ، فَأَطَالَ القِيَامَ، ثُمَّ رَكَعَ، فَأَطَالَ الرُّكُوعَ، ثُمَّ قَامَ فَأَطَالَ القِيَامَ وَهُوَ دُونَ القِيَامِ الأَوَّلِ، ثُمَّ رَكَعَ فَأَطَالَ الرُّكُوعَ وَهُوَ دُونَ الرُّكُوعِ الأَوَّلِ، ثُمَّ سَجَدَ فَأَطَالَ السُّجُودَ، ثُمَّ فَعَلَ فِي الرَّكْعَةِ الثَّانِيَةِ مِثْلَ مَا فَعَلَ فِي الأُولَى، ثُمَّ انْصَرَفَ وَقَدْ انْجَلَتِ الشَّمْسُ، فَخَطَبَ النَّاسَ، فَحَمِدَ اللَّهَ وَأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: إِنَّ الشَّمْسَ وَالقَمَرَ آيَتَانِ مِنْ آيَاتِ اللَّهِ، لاَ يَخْسِفَانِ لِمَوْتِ أَحَدٍ وَلاَ لِحَيَاتِهِ، فَإِذَا رَأَيْتُمْ ذَلِكَ، فَادْعُوا اللَّهَ، وَكَبِّرُوا وَصَلُّوا وَتَصَدَّقُوا ثُمَّ قَالَ:  يَا أُمَّةَ مُحَمَّدٍ وَاللَّهِ مَا مِنْ أَحَدٍ أَغْيَرُ مِنَ اللَّهِ أَنْ يَزْنِيَ عَبْدُهُ أَوْ تَزْنِيَ أَمَتُهُ، يَا أُمَّةَ مُحَمَّدٍ وَاللَّهِ لَوْ تَعْلَمُونَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيلًا وَلبَكَيْتُمْ كَثِيرًا

ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్య గ్రహణం సంభవిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు నమాజ్ చేయించారు. నమాజులో చాలా దీర్ఘంగా ఖియాం చేసారు (నిలబడ్డారు). రకూ కూడా సుదీర్ఘంగా చేసారు. మళ్ళీ ఎక్కువ సేపు ఖియాం చేశారు. అయితే మొదటిసారి కన్నా ఈ సారి కొంచెం తక్కువ సేపు ఖియాం చేశారు. అలాగే తిరిగి రుకూ చేశారు. అయితే మొదటి రకూ కన్నా కొంచెం తక్కువ సేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. ఆదే విధంగా ఆయన రెండవ రకాతులో కూడా చేశారు. (ఇలా నమాజ్ పూర్తి చేసి) ప్రజల వైపు తిరిగారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం పూర్తిగా వీడాడు. ఆ తరువాత ఖుత్బా ఇచ్చారు. అందులో ఆయన అల్లాహ్ స్తోత్రం తరువాత ఇలా అన్నారుః “సూర్యచంద్రులు, రెండూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో, లేక పుట్టడం వల్లనో సూర్యచంద్ర గ్రహణాలు సంభవించవు. సూర్యగ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని సంభవిస్తే మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. అల్లాహ్ మహిమ, ఔన్నత్యాలను కీర్తించండి. నమాజు చదవండి. దానధర్మాలు చేయండి”. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడటం జరిగితే, వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ పౌరుషం అల్లాహ్ కే వస్తుంది. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు”. (బుఖారి 1044, ముస్లిం 901).

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو ؆، قَالَ: لَمَّا كَسَفَتِ الشَّمْسُ عَلَى عَهْدِ رَسُولِ اللَّهِ ﷺ نُودِيَ إِنَّ الصَّلاَةَ جَامِعَةٌ

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే “అస్సలాతు జామిఅ” అని ప్రజలను పిలవడం జరిగింది. (బుఖారి 1045, ముస్లిం 2942).

విశేషాలుః

1- సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తే “అస్సలాతు జామిఅ” అని పిలుపు ఇవ్వాలి.

2- అందరూ కలసి, జమాఅతుతో దీర్ఘమైన నమాజ్ చేయాలి.

3- ప్రతి రకాతులో రెండు ఖియాంలు మరియు రెండు రుకూలు చేయాలి.

4- నమాజ్ తరువాత ఇమాం ప్రసంగించాలి, బోధచేయాలి.

5- సత్కార్యాలు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి.

6- దుష్కార్యాల నుండి దూరముండడని హెచ్చరించాలి

7- అల్లాహ్ యొక్క జిక్ర్, స్మరణలు అధికంగా చేయమనాలి.

8- దానధర్మాలు అధికంగా చేయండని చెప్పాలి.

9- నవ్వులాట, వినోదంలో కాకుండా పరలోక చింతలో సమయం గడపాలి.

10- అధికంగా పాపాల మన్నింపుకై క్షమాభిక్ష కోరాలి (ఇస్తిగ్ఫార్ చేయాలి).

28- ఇస్తిస్ఖా (వర్షం కోరుట)

జుమా ఖుత్బాలో ఇస్తిస్ఖాః

عن أنس بن مالك ™ أن رجلا دخل يوم الجمعة من باب كان وجاه المنبر ورسول

الله ﷺ قائم يخطب، فاستقبل رسولَ الله قائما فقال: يا رسول الله هلكت المواشي وانقطعت السبل فادع الله يُغيثنا قال: فرفع رسول الله ﷺ يديه فقال: اللهم اسقنا، اللهم اسقنا، اللهم اسقنا. قال أنس: ولا والله ما نرى في السماء من سحاب ولا قزَعة ولا شيئا، وما بيننا وبين سلع من بيت ولا دار فطلعت من ورائه سحابة مثل الترس، فلما توسّطت السماء انتشرت ثم أمطرت، قال: والله ما رأينا الشمس ستا، ثم دخل رجل من ذلك الباب في الجمعة المقبلة ورسول الله ﷺ قائم يخطب فاستقبله قائما فقال: يا رسول الله هلكت الأموال والنقطعت السبل فادع الله يمسكها، قال: فرفع رسول الله ﷺ يديه ثم قال: اللهم حوالينا ولا علينا، اللهم على الآكام والجبال والآجام والظراب والأودية ومنابت الشجر، قال: فانقطعت وخرجنا نمشي في الشمس

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు  ఇలా ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ నిలబడి ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి జుమా రోజు మెంబర్ కు ఎదురుగా ఉన్న ద్వారం తో ప్రవేశించాడు. ప్రవక్త ﷺ అభిముఖాన నిలబడి, ఓ ప్రవక్తా! (కరువు కారణంగా) పశువులు నాశనమయ్యాయి. రహదారులు చెడిపోయి (ప్రయణాలు కష్టమయ్యాయి). మీరు అల్లాహ్ తో వర్షం కురిపించమని దుఆ చేయండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త ﷺ తమ రెండు చేతులు ఎత్తి “ఓ అల్లాహ్! నీవు మాకు వర్షం కుర్పించు, ఓ అల్లాహ్! నీవు మాకు వర్షం కుర్పించు, ఓ అల్లాహ్! నీవు మాకు వర్షం కుర్పించు” అని దుఆ చేశారు. (ఆ తరువాత జరిగిన విషయాన్ని) అనస్ రజియల్లాహు అన్హు  ఇలాతెలిపారుః అల్లాహ్ సాక్షిగా! ఆ సమయానిక ఆకాశంలో మచ్చుకు ఒక మబ్బు తునక కానరాలేదు. మాకు ‘సలఅ’ కొండకు మధ్యలోని అన్ని ఇళ్ళూ స్పష్టంగా  కనబడుచున్నాయి. ఆ మరుక్షణమే (సలఅ కొండ) వెనుక నుంచి డాలు లాంటి మేఘమాలికలు కమ్ముకురావడం మొదలయి, ఆకాశానికి మధ్యలోకొచ్చి. మళ్ళీ ఆకాశామంతటా వ్యాపించి వర్షం కురువసాగింది. అల్లాహ్ సాక్షిగా! ఆరు రోజుల వరకు మేము సూర్యుడ్ని చూడనే లేదు. తరువాత జుమాలో అదే వ్యక్తి, అదే ద్వారం నుంచి ప్రవేశించాడు. అప్పుడు ప్రవక్త ﷺ ప్రసంగిస్తున్నారు. ఆయనకు ఎదురుగా నిలబడి ఓ ప్రవక్తా! (అధిక వర్షం కారణంగా) పశువులు నాశనమయ్యాయి. రహదారులు తెగి (ప్రయాణాలు ఆగిపోతున్నవి). వర్షమును ఆపాలని మీరు అల్లాహ్ ను వేడుకోండి అని విన్నవించాడు. ప్రవక్త ﷺ తమ రెండు చేతులు ఎత్తి “అల్లాహ్! మా చుట్టు ప్రక్కన (వర్షం కర్పించు). మా మీద వద్దు. అల్లాహ్! పీఠభూముల మీద, పర్వతాల మీద, అడవుల్లో, గుట్టల మీద, లోయల్లో, చెట్లూచేమలు పెరిగే ప్రాంతములో కుర్పించు” అని దుఆ చేశారు. అనస్ ﷺ తెలిపారుః అప్పుడు వర్షం ఆగిపోయింది మేము ఎండలో నడుచుకుంటూ వెళ్ళాము. (బుఖారి, ముస్లిం).     

విశేషాలుః

1- ఈ హదీసులో ప్రవక్త ﷺ మహత్యాల్లో నుంచి ఒకదాని ప్రస్థావన ఉంది.

2- జుమాలో వర్షం కొరకు దుఆ చేయుట ధర్మసమ్మతం.

3- ప్రజలకు వర్షం వలన నష్టం ఏర్పడినప్పుడు, వర్షం కురువకూడదని అల్లాహ్ తో దుఆ చేయవచ్చును.

29- ఇస్తిస్ఖా నమాజ్

عن عبد الله بن زيد ™ قال: رأيت النبي ﷺ يستسقي فتوجّه للقبلة يدعو وحوّل رداءه ثم صلى ركعتين، جهر فيهما بالقراءة

ప్రవక్త ﷺ వర్షం కోసం అల్లాహ్ ను ప్రార్థించినప్పుడ నేను చూశాను, ఆయన ఖిబ్లా వైపు ముఖం చేసి, ప్రార్థిస్తూ తమ దుప్పటిని తిరిగేసి కప్పుకున్నారు. మళ్ళీ రెండు రకాతుల నమాజు చేశారు. అందులో శబ్దంతో ఖుర్ఆన్ పఠించారు అని అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).  

عن عائشة ؅ قالت: شكا الناس إلى رسول الله ﷺ قحوط المطر، فأمر بمنبرٍ فوضِع له في المصلّى ووعد الناسَ يوما يخرجون فيه، قالت عائشة: فخرج رسول الله حين بدا حاجب الشمس، فقعد على المنبر فكبّر ﷺ وحمد الله عزّوجلّ، ثم قال: إنكم شكوتم جدب دياركم واستئخار المطر عن إبَّانِ زمانِه عنكم، وقد أمركم الله عز وجل أن تدعوه ووعدكم أن يستجيب لكم، ثم قال: الحمد لله رب العالمين الرحمن الرحيم ملك يوم الدين، لا إله إلاّ الله يفعل ما يريد، اللهمّ أنت الله لآإله إلاّ أنت الغني ونحن الفقراء، أنزل علينا الغيث واجعل ما أنزلت لنا قوة وبلاغا إلى حين، ثم رفع يديه فلم يزل في الرفع حتى بدا بياض إبطه، ثم حوّل إلى الناس ظهره، وقلب ـ أو حوّل ـ رداءه وهو رافع يديه، ثم أقبل على الناس ونزل فصلى ركعتين، فأنشأ الله سحابة فرعدت وبرقت ثم أمطرت بإذن الله، فلم يأت مسجده حتى سالت السيول، فلما رأى سرعتهم إلى الكن ضحك ﷺ حتى بدت نواجذه فقال: أشهد أن الله على كل شيء قدير وأني عبد الله ورسوله.

ఆయిష రజియల్లాహు అన్హా కథనం: వర్షం లేక కరువు సంభవించిందని ప్రజలు ప్రవక్త ﷺతో ఫిర్యాదు చేశారు. మెంబర్ ఈద్గాహ్ లో పెట్టవలసినదిగా ప్రవక్త ﷺ ఆదేశించి, దానికి ఒక దినం నిర్ణయించి, ప్రజలను ఆ రోజున అక్కడికి వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆయిష రజియల్లాహు అన్హా ఇంకా ఇలా చెప్పారుః సూర్యుడు ఉదయించే సందర్భంలో ప్రవక్త ﷺ బయలుదేరారు. మెంబర్ పై కోర్చొని, అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ, స్తోత్రము పలుకుతూ ఇలా అన్నారుః  “దేశంలో కరువు వచ్చిందని, ఈ వర్ష కాలంలో వర్షం కురువడం లేదని మీరు ఫిర్యాదు చేశారు. నిశ్చయంగా మీరు వేడుకోవాలని అల్లాహ్ ఆదేశించాడు, ఆయన మీ వేడుకలను అంగీకరిస్తానని వాగ్దానం చేశాడు”. మళ్ళీ ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీం, మాలికి యౌమిద్దీన్, లాఇలాహ ఇల్లల్లాహు యఫ్అలు మా యురీద్. అల్లాహుమ్మ అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ గనియ్యు వ నహ్ నుల్ ఫుఖరా, అన్ జిల్ అలైనల్ గైస వజ్అల్ మా అన్ జల్ త లనా ఖువ్వతఁ వబలాగన్ ఇలా హీన్”. (భావం: సర్వ స్తోత్రములు కేవలం అల్లాహ్ కే చెందును. అతడే సర్వ లోకములకు పోషకుడు, కరుణించువాడు, ప్రేమించువాడు, తీర్పు దినమునకు అధికారి. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. తను కోరినది చేయువాడు. ఓ అల్లాహ్ నీవే ఆరాధ్యం దైవం, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవు అక్కర లేనివాడవు. మేము అక్కరగలవారము. మాకు వర్షం కుర్పించు. నీవు కుర్పించు వర్షం ద్వారా మాకు బహుకాలము వరకు బలమును, మేలును కలుగ జేయుము). తర్వాత ప్రవక్త ﷺ రెండు చేతులు పైకి ఎత్తారు. చంకల తెలుపు కనబడినంత ఎత్తులో ఎత్తారు. తర్వాత ప్రజల వైపు తన వీపును జేసి దుప్పటిని తిరిగేశారు. అప్పుడు కూడా చేతులు ఎత్తారు. మళ్ళీ ప్రజల వైపు ముఖం చేసి మెంబరు నుండి దిగి, రెండు రకాతుల నమాజు చేశారు. అప్పుడే అల్లాహ్ ఓ మబ్బును పంపాడు. అది ఉరిమింది. మెరిసింది. అల్లాహ్ దయతో కురిసింది కూడా. ప్రవక్త ﷺ మస్జిద్ కు చేరుకోక మందే కాలవల్లో, గుంటల్లో వర్షం నీళ్ళు పారాయి, ప్రవక్త అనుచరులు తమ ఇండ్లకు పరుగెత్తుకుంటూ పోవడం చూసి ప్రవక్త ﷺ నవ్వారు. పక్క పళ్ళు కూడా కనబడ్డాయి. అప్పుడన్నారుః “అల్లాహ్ సర్వ శక్తుడు, నేను అల్లాహ్ దాసున్నని ఆయన ప్రవక్తనని సాక్ష్యమిస్తున్నాను”. (అబూదావూద్).

عن أبي هريرة ™ قال: خرج رسول الله ﷺ يوما يستسقي فصلى بنا ركعتين بلا أذان ولا إقامة، ثم خطبنا ودعا الله وحوّل وجهه نحو القبلة رافعا يديه، ثم قلب رداءه فجعل الأيمن على الأيسر والأيسر على الأيمن.

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం: ఒక రోజు ఇస్తిస్ఖా చేయుటకు బయటికేళ్ళారు ప్రవక్త ﷺ. రెండు రకాతుల నమాజు చేయించారు. అందులో అజాన్, ఇఖామత్ ఏదీ లేదు. తరువాత ఉపన్యసించారు. రెండు చేతులు ఎత్తి ఖిబ్ల వైపు ముఖం చేసి అల్లాహ్ తో దుఆ చేశారు. దుప్పటిని తిరిగేశారు. కుడి వైపునున్నది ఎడమ వైపుకూ, ఎడమ వైపునున్నది కుడి వైపుకూ. (ఇబ్ను మాజ).

عن ابن عباس ™ أن رسول الله ﷺ خرج متبذّلا متواضعا متضرّعا

ప్రవక్త ﷺ విధేయ వినమ్రతతో భయభక్తులతో (ఇస్తిస్ఖాకు) వెళ్ళారు అని ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా  ఉల్లేఖించారు. (తిర్మిజి).  

విశేషాలుః

1- ఇస్తిస్ఖా నమాజు చేయుట అభిలషణీయం. అందులో రెండు రకాతుల నమాజు . ఒక ఖుత్బా ఉండాలి.

2- ఇస్తిస్ఖా తర్వాత దుప్పటి త్రిప్పి వేయుట అభిలషణీయం.

3- ఖుత్బా నమాజుకు ముందయినా, తర్వాతయినా ఇవ్వచ్చునూ.

రెండూ విధానాలూ యోగ్యమే.

4- అల్లాహ్ భయభీతులతో విధేయ వినమ్రతలతో వెళ్ళుట అభిలషణీయం.

30- వర్షానికి సంబంధించిన ఆదేశాలు

నక్షత్రం వలనే మాకు వర్షం కురిసింది అనుట నిషిద్ధం:

عن زيد بن خالد الجهني ™ قال: صلى لنا رسول الله ﷺ صلاة الصبح با لحديبية على إثر سماء كانت من الليل فلما انصرف النبي ﷺ أقبل على الناس فقال: هل تدرون ماذا قال ربكم؟ قالوا: الله ورسوله أعلم. قال: قال: أصبح من عبادي مؤمن بي وكافر، فأما من قال: مطرنا بفضل الله ورحمته فذلك مؤمن بي وكافر بالكوكب، وأما من قال: بنوء كذا وكذا فذلك كافر بي مؤمن بالكوكب.

జైద్ బిన్ ఖాలిదిల్ జుహ్నీ ఉల్లేఖనం ప్రకారం: హుదైబియ ప్రాంతంలో ప్రవక్త ﷺ మాకు ఫజ్ర్ నమాజ్ చేయించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన ﷺ అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు అని వారన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు. “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులయిపోయారు. మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు. (బుఖారి, ముస్లిం).

వర్షం కురిసినప్పుడేమనాలి?:

عن عائشة ؅أن رسول الله ﷺ كان إذا رأى المطر قال: اللهم صيِّبا نافعا.

ఆయిష రజియల్లాహు అన్హా కథనం: ప్రవక్త ﷺ వర్షం కురవడం చూసి, “అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅ” (ఓ అల్లాహ్ లాభం చేకూర్చే వర్షాలు కురిపించు) అని దుఆ చేసేవారు. (బుఖారి).  

వర్షం ఎప్పుడు కురుస్తుందో అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు.

عن ابن عمر ؆ قال: قال رسول الله ﷺ: مفتاح الغيب خمس لا يعلمها إلا الله: لا يعلم أحد ما يكون في غد، ولا يعلم أحد ما يكون في الأرحام، ولاتعلم نفس ماذا تكسب غدا، وما تدري نفس بأيّ أرض تموت، وما يدري أحد متى يجيء المطر

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అగోచర విషయాల తాళపు చెవులు ఐదున్నవి. అవి అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ తెలియవు. రేపు ఏమి జరగనున్నదో ఎవ్వరికీ తెలియదు. గర్భకోశంలో ఏమున్నదనేదీ ఎవ్వరికీ తెలియదు. తాను రేపటి రోజున ఏమి సంపాదించబోతున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో, ఏ వ్యక్తీ ఎరుగడు. వర్షం ఎప్పుడు కురుస్తుందో ఎవ్వరికీ తెలియదు.

విశేషాలుః

1- ఫలాన నక్షత్ర ప్రభావంతో లేక ఫలానా నక్షత్ర ప్రవేశం మూలంగా మనకు వర్షం కురిసిందనుట నిషిద్ధం. అల్లాహ్ దయ, కరుణతో కురిసిందనాలి.

2- వర్షం కురిసేది చూసి “సయ్యిబన్ నాఫిఅ” అనుట అభిలషణీయం.

3- వర్షం పడుట అగోచర విషయాల్లో ఒకటి. అది ఎప్పుడు కురుస్తుం- దనే ఖచ్చిత సమయం నిర్థారంగా అల్లాహ్ కు మాత్రమే తెలుసు.

31- ఇస్తిఖార నమాజ్

عن جابر ™ قال: كان رسول الله ﷺ يعلّمنا الاستخارة في الأمور كلّها كالسورة من القرآن، يقول:إذا همّ أحدكم بالأمر فليركع ركعتين من غير الفريضة، ثم ليقل: ((اللهمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمَ، فَإِنَّكَ تَعْلَمُ وَلآ أَعْلَمُ وَأَنْتَ عَلاَّمُ الْغُيُوبِ، اَللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هّذَا الأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي ـ أو قال : عَاجِلِ أَمْرِي وَآجِلِهِ ـ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي، فَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةَ أَمْرِي ـ أو قال: عاجل أمري وآجله ـ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِيَ الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ رَضِّنِي بِهِ، قال ويسمِّي حاجته.

జాబిర్ రజియల్లాహు అన్హు  కథనం ఇలా ఉందిః మాకు ప్రవక్త ﷺ ఖుర్ఆన్ ‘సూర’ నేర్పించినట్లే అన్ని కార్యాలలో మేము ‘ఇస్తిఖార’ చేయాలని బోధించేవారు. వారు ఇలా చెప్పేవారుః “మీలో ఎవరయినా ఏదైనా కార్యం చేయదలచినప్పుడు ఫర్జ్ నమాజును గాక (నఫిల్) రెండు రకాతులు చేసి, ఇలా దుఆ చెయ్యాలిః అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బి ఇల్మిక వ అస్తఖ్ దిరుక బి ఖుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్ లికల్ అజీం. ఫఇన్నక తఅలము వలా అఅలము వఅన్ త అల్లాముల్ గుయూబ్. అల్లహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరున్ లీ ఫీ దీనీ వ మఆషీ  వఆఖిబతి అమ్రీ -అవ్ ఖాల ఆజిలి అమ్రీ – వ ఆజిలిహి ఫఖ్ దుర్ హు లీ వయస్సిర్ హు లీ, ఫఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రున్ లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ – అవ్ ఖాల ఆజిలి అమ్రీ- వ ఆజిలిహి ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ రజ్జినీ బిహీ. (భావం: ఓ అల్లాహ్ నీ జ్ఞానోదయ సహకారం కొరకు నిరీక్షిస్తున్నాను. నీ దివ్య సహకారం తో నాకు శక్తిని ప్రసాదించు. నీ గొప్ప దయ నాకు అనుగ్రహించవలసినదిగా నేను నిన్నే వేడుకుంటున్నాను. నిశ్చయంగా నీవే శక్తి సామంతుడవు. నేను శక్తి హీనుడను. సర్వం తెలిసిన అమోఘ జ్ఞానివి నీవే. నేనించుక జ్ఞానిని, ఓ అల్లాహ్ నేను చేయదలపెట్టిన ఈ పని, నా గురించి, నా మతం గురించి, నా చివరి జీవితం గురించి, ఇహపరములను గురించి మంచిదై యుంటే నీ దయా కరుణలతో దాన్ని నా గురించి సులువు చేయుము. ఒక వేళ నేను చేయదలపెట్టిన ఈ కార్యం నా గురించి, నా చివరి జీవితం గురించి, ఇహపరాలను గురించి మంచిది కాకున్నచో వెంటనే నీ దయా కరుణలతో ఈ పని నుండి నన్ను తప్పించి కాపాడుము. చెడును దూరపరచి మంచిని ప్రసాదించి, నేను దానితో సంతోషపడుటకు దయ చేయుము). తన కార్యమేమిటో దాని పేరు “అన్న హాజల్ అమ్ర” అన్న చోట చెప్పాలి. (బుఖారిః 6382).

విశేషాలుః

1- విశ్వాసి ఏదైనా పని చేస్తూ దాని ఫలితార్థము తెలిసిరానప్పుడు “ఇస్తిఖార” నమాజ్ చేయుట అభిలషణీయం.

2- పని చేసే దృఢ నిశ్చయానికొచ్చే ముందు, ఇది అన్ని కార్యాల్లోనూ చేయవచ్చును.

32- అనాథల బాధ్యత వహించు ఘనత – వారిని ప్రేమతో చూసుకొనుట అభిలషణీయం

[فَأَمَّا الْيَتِيمَ فَلاَ تَقْهَرْ] الضحى:9

అనాథల పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు. (93: జుహా: 9).

[وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًأ] الإنسان:8

అల్లాహ్ ప్రేమతో పేదలకూ, అనాథలకూ, ఖైదీలకూ అన్నం పెట్టేవారు. (76: దహ్ర్: 8).

عن سهل بن سعد ™ قال: قال رسول الله ﷺ: أنا وكافل اليتيم في الجنة هكذا، وأشار بالسبابة والوسطى وفرّج بينهما

ప్రవక్త ﷺ ఉపదేశించారని, సహల్ బిన్ సఅద్ ఉల్లేఖించారుః “నేను మరియు అనాథ పోషణ బాధ్యతా వహించినతను స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త ﷺ తమ మధ్య వ్రేలుకు చూపుడు వ్రేలుకు మధ్య కొంచెం ఎడం ఉంచి చూపించారు. (బుఖారి, ముస్లిం).  

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: كافل اليتيم ـ له أو لغيره ـ أنا وهو كهاتين في الجنة. وأشار الراوي باسبابة والوسطى.

“అనాథ సంరక్షకుడు -ఆ అనాథ అతని దగ్గరి వాడైనా దూరపు వాడైనా- మరియు నేను స్వర్గంలో ఇలా ఉంటాము”. ఉల్లేఖనకర్త తన చూపుడు వ్రేలు మధ్య వ్రేలు కలిపి చూపించాడు. (ముస్లిం).

విశేషాలుః

1- అనాథుల్ని పరిరక్షించుట చాల ఘనతగల విషయం ఇది ప్రోత్సహించబడింది.

2- అనాథుల బాధ్యత వహించుట స్వర్గ ప్రవేశానికి, అందులో ఉన్నత

స్థానాలకు కారణమవుతుంది.

3- దగ్గరి వారిలో నున్న అనాథుల సంరక్షణలో కూడా ఇదే పుణ్యం లభిస్తుంది.

33- అనాథల సొమ్ము తినుట నిషిద్ధం

[إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَى ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا وَسَيَصْلَوْنَ سَعِيرًا]

అనాథల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడుతారు. (4: నిసా: 10).

عن أبي هريرة ™ عن النبيﷺ قال: اجتنبوا السبع الموبقات، قالوا: يا رسول الله وما هنّ؟ قال: الشرك بالله، والسحر، وقتل النفس التي حرّم الله إلاّ بالحق، وأكل الربا، وأكل مال اليتيم، والتولي يوم الزحف، وقذف المحصنات المؤمنات الغافلات.

అబూహురైర ఉల్లేఖనం ప్రకారం: “మిమ్మల్ని సర్వ నాశనం చేసే పనులకు మీరు దూరంగా ఉండండి” అని హెచ్చరించారు. ‘అవేమిటి ప్రవక్తా!’ అని అడిగారు సహచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారుః “(1) అల్లాహ్ కు సాటి కల్పించడం. (2) చేతబడి. (3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చడాన్ని నిషేధించిన ప్రాణిని హతమార్చడం. (4) వడ్డీ సొమ్ము తినడం. (5) అనాథ సొమ్మును హరించి వేయడం. (6) ధర్మ యుద్ధంలో వెన్ను జూపి పారిపోవడం. (7) ఏ పాపమెరగని అమయాక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం”. (బుఖారి, ముస్లిం).

عن خويلد بن عمر الخزاعيّ ™ قال: قال النبي ﷺ: اللهم إنّي أُحرِّج حق الضعيفين: اليتيم والمرأة.

ఖువైలిద్ బిన్ ఉమర్ ఖుజాఈ రజియల్లాహు అన్హు  ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “ఓ అల్లాహ్! నేను బలహీనులైన ఇద్దరి హక్కుల్ని ఆదరణీయమైనవిగా పరిగణిస్తున్నాను. ఒకటిః అనాథల హక్కు. రెండవదిః స్త్రీల హక్కు”. (నసాయి).

విశేషాలుః

1- అన్యాయంగా అనాధుల సొమ్ము తినుట నుండి హెచ్చరించబడింది.

2- అది ముస్లింను నాశనం చేయు పాపాల్లో ఒకటి.

34- మనిషి తను ప్రేమించువారితో ఉండును

عن أنس بن مالك ™ أن أعرابيا قال لرسول الله ﷺ: متى الساعة؟ قال له رسول الله : ما أعددت لها؟ قال: حبّ الله ورسوله، قال: المرأ مع من أحبّ

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః ఒక గ్రామీణుడు ప్రవక్త ﷺ తో ప్రళయం ఎప్పుడని అడిగాడు. “నీవు దాని కొరకు ఏమి కూడగట్టావు” అని ప్రశ్నించారు ప్రవక్త ﷺ. ‘అల్లాహ్ ప్రేమ, ఆయన ప్రవక్త ప్రేమ’ అని జవాబిచ్చాడు ఆ మనిషి. ప్రవక్త ﷺ చెప్పారుః “మనిషి తను ప్రేమించువారితో ఉంటాడు”. (ముస్లిం).

عن عبد الله بن مسعود ™ قال: جاء رجل إلى رسول الله ﷺ فقال: يا رسول الله، كيف ترى في رجل أحبّ قوما ولما يلحقْ بهم؟ قال رسول الله ﷺ: المرء مع من أحبّ

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  కథనం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి, ప్రవక్తా! ఒక వ్యక్తి వద్ద కొందరి ప్రేమ చాలా ఉంటుంది గాని, అతనిలో వారిలాంటి ఆచరణ ఉండదు. అతని పట్ల మీరేమంటారు? అని అడిగాడు. ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “మనిషి తను ప్రేమించువారితో ఉంటాడు”. (ముస్లిం).  

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: الأرواح جنود مجنَّدة فما تعارف منها ائتلف وما تناكر منها اختلفت

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఆత్మలు రకరకాల సైన్యం లాంటివి. (అనగా ప్రతి మనిషి స్వభావం, గుణం మరో మనిషికి భిన్నంగా ఉంటుంది). ఎవరి స్వభావం ఎవరితో సరిపోతుందో వారు వారితో సహవాసిగా ఉంటారు. ఎవరి స్వభావం ఎవరికి భిన్నంగా ఉంటుందో వారు వారితో దూరంగానే ఉంటారు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- మహాపురుషులను, పుణ్యాత్ములను ప్రేమించుటలో ఘనత ఉంది. ఆ ప్రేమ, స్వర్గంలో వారి తోడును కలుగజేస్తుంది. ప్రేమికుని ఆచరణలో ఏ కొంత కొరత ఉన్నాసరే.

2- అవిశ్వాసుల, పాపాత్ముల ప్రేమలో నష్టపోయే భయమున్నది.

3- ఎవరయితే ఒక జమాఅత్ తో ప్రేమతో ఉంటారో వారు ప్రళయదినాన వారితో ఉందురు.

35- చిత్రపటములు – వాటి ఆదేశాలు

عن أبي طلحة ™ قال: قال رسول الله ﷺ: لاتدخل الملائكة بيتا فيه كلب ولا صورة

“కుక్క మరియు చిత్రము ఉన్న ఇంటిలో దైవదూతలు ప్రవేశించరు” అని ప్రవక్త ﷺ సెలవిచ్చినట్లు, అబూ తల్హ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

عن عبد الله بن مسعود ™ قال: سمعت رسول الله ﷺ يقول: إن أشدّ الناس عذابا عند الله يوم القيامة المصوِّرون.

“ప్రళయదినాన అల్లాహ్ వద్ద ప్రజలలో అందరికంటే కఠిన శిక్ష చిత్రాలు చిత్రించేవారికి అగును” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, మస్లిం).

عن عائشة ؅ أنها اشترت نَمْرقة فيها تصاوير، فلما رآها رسول الله ﷺ قام على الباب فلم يدخل، فعرفت في وجهه الكراهية، قالت: قلت يا رسول الله أتوب إلى الله ورسوله، ماذا أذنبت؟ قال: ما بال هذه النمرقة؟ قالت: اشتريتها لتقعد عليها وتوسّدها، فقال رسول الله ﷺ: إن أصحاب هذه الصور يعذَّبون يوم القيامة ويقال لهم: أَحْيوا ما خلقتم، وقال: إن البيت الذي فيه الصور لا تدخله الملائكة.

ఆయిష రజియల్లాహు అన్హా కథనం: తను ఒక దిండు కొన్నారు. దానిపై బొమ్మలు వేసి ఉన్నాయి. ప్రవక్త ﷺ దాన్ని చూచి, తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖములో ఆగ్రహ చిహ్నాలను చూసి, ‘ప్రవక్తా! నేను అల్లాహ్ ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి’ అని అన్నాను. దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. ‘ఈ దిండుని మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను’ అని చెప్పాను నేను. అప్పుడు ప్రవక్త ﷺ “బొమ్మలను వేసి (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో. (అతనా పని చేయలేడు)” అని చెప్పారు ప్రవక్త ﷺ. “బొమ్మలు, చిత్రములున్న ఇండ్లల్లో దైవదూతలు ప్రవేశించరు” అని కూడా చెప్పారు. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఫోటోలు చిత్రించుట నిషిద్ధం. అది మహా పాపాల్లో ఒకటి.

2- చిత్రాలున్న ఇండ్లల్లో దైవదూతలు ప్రవేశించరు.

3- ప్రళయదినాన చిత్రకారులకు అందరికంటే ఎక్కువ శిక్ష పడుతుంది.

36- స్వప్నం దాని ఘనత మరియు దాని గురించి అబద్దమాడేవారికి హెచ్చరిక

عن ابي هريرة ™ قال: سمعت رسول الله ﷺ يقول: لم يبق من النبوّة إلاّ المبشِّرات، قالوا وما المبشّرات؟ قال: الرؤيا الصالحة.

ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నానంటూ అబూహురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖిస్తున్నారుః “దైవదౌత్యంలో మిగిలినది ‘ముబష్షిరాత్’ మాత్రమే”. ముబష్షిరాత్ అంటేమిటి? అని అడిగారు అనుచరులు. “మంచి స్వప్నం” అని జవాబిచ్చారు ప్రవక్త ﷺ. (బుఖారి).

عن أبي قتادة ™ قال: سمعت رسول الله ﷺ يقول: الرؤيا من الله والحلم من الشيطان، فإذا رأى أحدكم شيئا يكرهه فلينـفُثْ عن يساره ثلاث مرات وليتعوّذ بالله من شرها، فإنها لن تضرّه.

“మంచి స్వప్నం అల్లాహ్ తరఫున, చెడు స్వప్నం షైతాన్ తరఫున వస్తాయి. మీలో ఎవరయినా అసహ్యమైన కలగన్నచో ఎడమ వైపు మూడు సార్లు ఉమ్మి వేయాలి. దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి. అది తనకు హాని కలిగించదు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ ఖతాద రజియల్లాహు అన్హు  ఉల్లేఖిస్తున్నారు. (బుఖారి, ముస్లిం).

عن ابن عباس ؆ عن النبي ﷺ قال: من تحلّم بحلم لم يره كُلِّف أن يعقد بين شعيرتين ولن يفعل.

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “స్వప్నం చూడనిదే ఇలా ఇలా కలగన్నానని అబద్దం చేప్పేవారు రెండు గోదుమ గింజలకు ముడి వేయాలని శిక్షించబడుతారు. వారు ఎన్నటికీ అలా చేయలేరు”. (బుఖారి).  

విశేషాలుః

1- మంచి స్వప్నాల విషయం చాలా గొప్పది. ‘ముబష్షిరాత్’ దైవ దౌత్యంలో ఒక భాగం.

2- మంచి స్వప్నం అల్లాహ్ తరఫున, చెడు స్వప్నం షైతాన్ తరఫున వస్తాయి.

3- స్వప్నాలను గురించి అపద్దాలు చెప్పేవారికి కఠిన శిక్షపడును.

37- మంచి స్వప్నల ధర్మాలు – సంస్కారాలు

عن أبي قتادة ™ قال: سمعت رسول الله ﷺ يقول: الرؤيا من الله والحلم من الشيطان، فإذا رأى أحدكم شيئا يكرهه فلينـفُثْ عن يساره ثلاث مرات وليتعوّذ بالله من شرها، فإنها لن تضرّه. وزاد في رواية: وليتحوّل عن جنبه الذي كان عليه.

“మంచి స్వప్నం అల్లాహ్ తరఫున, చెడు స్వప్నం షైతాన్ తరఫున వస్తాయి. మీలో ఎవరయినా అసహ్యమైన కలగన్నచో ఎడమ వైపు మూడు సార్లు ఉమ్మి వేయాలి. దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి. అది తనకు హాని కలిగించదు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ ఖతాద రజియల్లాహు అన్హు  ఉల్లేఖిస్తున్నారు. (బుఖారి, ముస్లిం). మరో ఉల్లేఖనంలో “ఏ ప్రక్కన పడుకున్నాడో ఆ ప్రక్కను మార్చాలి” అని ఉంది.

عن أبي سعيد الخدري ™ أنه سمع رسول الله ﷺ يقول: إذا رأى أحدكم الرؤيا يحبها فإنما هي من الله فليحمد الله عليها وليحدّث بها، وإذا رأى غير ذلك مما يكره فإنما هي من الشيطان، فليستعذ بالله من شرّها ولا يذكرها لأحد فإنها لاتضرّه.

“మీలో ఎవరయినా తనకు నచ్చిన మంచి కలగన్నచో అది అల్లాహ్ తరఫు నుండి (అని తెలుసుకోవాలి). అల్లాహ్ స్తోత్రము పఠించాలి. దాన్ని ఇతరులకు చెప్పుకోవచ్చును. అలాగాక మరేదైనా ఇష్టం లేని చెడు స్వప్నం చూసినచో అది షైతాన్ తరఫునే ఉంటుంది. దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఎవరికీ దాని గురించి తెలుపకూడదు. దాని మూలంగా అతనికి ఏలాంటి హాని కలగదు” అని ప్రవక్త ﷺ చెప్పగా అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  విన్నారని ఉల్లేఖిస్తున్నారు.

عن جابر ™ قال: سمعت النبي ﷺ يخطب فقال: لايحدّثنَّ أحدكم بتلعُّب الشيطان به في منامه.

ప్రవక్త ﷺ ప్రసంగిస్తూ చెప్పిన ఈ విషయం నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నిద్రలో షైతాన్ తనతో ఆడే విషయాన్ని (అంటే పీడకలలను) మీలో ఎవ్వరూ ఇతరులకు చెప్పకూడదు”. (ముస్లిం).

విశేషాలుః

1- ఒక విశ్వాసుడు తనకు అసహ్యంగా అనిపించిన దాన్ని స్వప్నంలో చూస్తే ఎడమ వైపున మూడు సార్లు ఉమ్మివేయాలి. దాని కీడు నుండి మరియు షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి మరియు ప్రక్క మార్చాలి.

2- విశ్వాసుడు తనకు ఇష్టములేని దాన్ని స్వప్నంలో చూసినచో ఎవరికీ చెప్పకూడదు. అది అతనికి నష్టం కలిగించదు.

3- ఎవరయినా పీడకలలు మరియు షైతాన్ యొక్క ఆటలు నిద్రలో చూసినచో ఇతరులకు తెలియజేయ కూడదు. మంచి స్వప్నాలను గురించి ఇతరులతో చెప్పుకోవచ్చును.

38- ఆహ్వానము స్వీకరించుట

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: حق المسلم على المسلم خمس: ردّ السلام، وعيادة المريض، واتباع الجنائز، وإجابة الدعوة، وتشميت العاطس.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఒక ముస్లింపై మరొక ముస్లిం హక్కులు ఐదున్నవిః (1) సలాం చేస్తే జవాబిచ్చుట. (2) వ్యాదిగ్రస్తుడైతే పరామర్శించుట. (3) జనాజా (శవపేటిక) వెంట (శ్మశానానికి) పోవుట. (4) ఆహ్వానిస్తే స్వీకరించుట. (5) తుమ్మినవారు (అల్ హందులిల్లాహ్ అని పలికితే విన్నవారు యర్ హముకల్లాహ్ అని) జవాబిచ్చుట”. (బుఖారి, ముస్లిం).

عن ابن عمر ؆ قال: قال رسول الله ﷺ: إذا دُعي أحدكم إلى الوليمة فليأتها.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “మీలో ఎవరయినా వలీమ (దావత్ కు) ఆహ్వానించబడితే అందులో పాల్గొనాలి”. (ముస్లిం).

عن جابر ™ قال: قال رسول الله ﷺ: إذا دعي أحدكم إلى طعام فليجب فإن شاء طعم وإن شاء ترك.

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఎవరయినా భోజనానికి ఆహ్వానించబడితే దాన్ని స్వీకరించాలి. (ఆకలి ఉండి) ఇష్టముంటే తినాలి. లేకుంటే వదలివేయాలి”. (ముస్లిం).

عن ابي هريرة ™ أنه قال: بئس الطعام طعام الوليمة يدعى إليه الأغنياء ويترك المساكين، فمن لم يأت الدعوة فقد عصى الله ورسوله.

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఇలా తెలిపారుః విందుల్లో అత్యంత హేయమయినది కలవారిని ఆహ్వానించి, నిరుపేదల్ని వదలేసిన వలీమా విందు. ఇంకా ఎవరయితే (బలమయిన కారణం లేకుండానే) విందు పిలుపును తిరస్కరిస్తాడో అతడు అల్లాహ్ ఆయన ప్రవక్తకు అవిధేయుడయినట్లు. (ముస్లిం).

విశేషాలుః

1- వలీమా ఆహ్వానాన్ని స్వీకరించాలని ఆదేశించబడింది.

2- ఆహ్వానాన్ని స్వీకరించుట ఒక ముస్లింపై మరో ముస్లింకు గల హక్కు.

3- ఆహ్వానపు స్వీకరణ అనేది కేవలం భోజనానికే పరిమితం కాకూడదు.

39- అనుమతి మర్యాదలు

[يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَدْخُلُوا بُيُوتًا غَيْرَ بُيُوتِكُمْ حَتَّى تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَى أَهْلِهَا]

విశ్వసించిన ప్రజలారా! మీ ఇండ్లల్లోకి తప్ప, ఇతరుల ఇండ్లల్లోకి ప్రవేశించకండి, ఆ ఇంటివారి అంగీకారం పొందనంత వరకు, ఇంటి వారికి సలాం చేయనంతవరకు. (24: నూర్: 27).

[وَإِذَا بَلَغَ الأّطْفَالُ مِنْكُمْ الْحُلُمَ فَلْيَسْتَئْذِنُوا كَمَا اسْتَئْذَنَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ] النور: 59

మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు తమ పెద్దలు అనుమతి తీసుకొని (వచ్చే) విధంగానే, వారు కూడా అనుమతి తీసుకొని మరీ రావాలి. (24: నూర్: 59).

عن جابر ™ قال: أتيت النبي ﷺ في دين كان على أبي فدققت الباب، فقال: من ذا؟ فقلت: أنا، فقال: أنا! أنا كأنه كرهها

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను నా తండ్రిపై ఉన్న అప్పు విషయంలో మాట్లాడటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తలుపు తట్టాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లోపలి నుంచి “ఎవరు?” అని అడిగారు.  ‘నేను’ అని అన్నాను. (పేరు చెప్పక నేను అన్నందుకు) ప్రవక్త ﷺ అసహ్యించుకున్నట్లుగా “నేను, నేను” అని అన్నారు. (బుఖారి, ముస్లిం).

عن سهل بن سعد ™ قال: قال رسول الله ﷺ:  إنما جُعِل الاستئذان من أجل البصر

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “చూపు (ముందు పడకూడదని) అనుమతి తీసుకొనుట ఒక పద్దతిగా (మర్యాదగా) నిర్ణయించబడింది”. (బుఖారి, ముస్లిం). ).

عن كلدة بن الحنبل ™ قال: أتيت النبي ﷺ فدخلت عليه ولم أسلّم، فقال النبي ﷺ ارجع فقل: السلام عليكم أ أدخل؟

కిల్ద బిన్ హంబల్ రజియల్లాహు అన్హు  కథనం: నేను ప్రవక్త ﷺ వద్దకు సలాం చేయకుండా వచ్చాను, అప్పుడు ప్రవక్త ﷺ “తిరిగి బైటికి వెళ్ళిపో, మళ్ళీ అస్సలాము అలైకుం అంటూ, ‘ప్రవేశించాలా?’ అని అనుమతి కోరుతూ ప్రవేశించు” అని బోధించారు. (అబూ దావూద్, తిర్మిజి).  

عن أبي موسى الأشعري ™ قال: قال لي رسول الله ﷺ:  إذا استأذن أحدكم ثلاثا فلم يُؤذن له فليرجع

ప్రవక్త ﷺ నన్ను ఉద్దేశించి ఇలా బోధించారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఎవరయినా మూడు సార్లు అనుమతి కోరిన తర్వాత అనుమతి పొందకుంటే వెనుక తిరిగి రావాలి”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరాలని ఆదేశించబడింది.

2- అనుమతి కోరేవారిని మీరెవరని ప్రశ్నించబడితే ‘నేను’ అని చెప్పకూడదు. తన పేరు చెప్పాలి.

3- అనుమతి కోరుట మూడు సార్లు. అనుమతి పొందితే సరి. పొందకుంటే అనుమతి కోరిన మనిషి వెనుతిరిగి రావాలి.

40- షైతాన్ ముస్లిముల మధ్య సృష్టించే కలహాల నుండి జాగ్రత్తగా ఉండుట తప్పనిసరి

[وَقُلْ لِّعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أّحْسَنُ إِنَّ الشَّيْطَانَ يَنْزَغُ بَيْنَهُمْ] الإسراء:53

ప్రవక్తా! నా (విశ్వాసులయిన) దాసులకు వారు తమ నోట అత్యుత్తమమయిన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు. అసలు మానవుల మధ్య కలహాలు సృష్టించటానికి ప్రయత్నం చేసేవాడు షైతానే. (17: బనీ ఇస్రాఈల్: 53).

عن جابر ™ قال: سمعت رسول الله ﷺ يقول: ((إن الشيطان أيس أن يعبده المصلّون في جزيرة العرب، ولكن في التحريش بينهم))

ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అరెబియా ద్వీపంలోని నమాజ్ చేసేవారు తన్ను ఆరాధిస్తారన్న ఆశ షైతాన్ కు ఇక లేదు. కాని ముస్లిముల మధ్య వైషమ్యాగ్నిని (కలహాల్ని) రేకెత్తించే విషయంలో అతను నిరాశచెందలేదు”.

عن جابر ™ قال: سمعت رسول الله ﷺ يقول: إن عرش إبليس على البحر فيبعث سراياه فيفتنون الناس، فأعظمهم عنده أعظمهم فتنةً

ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఇబ్లీసు పీఠము సముద్రంపై ఉంది. తను అక్కడి నుండి తన సైన్యాన్ని పంపుతూ ఉంటాడు. వారు కలహాలు సృష్టిస్తూ ఉంటారు. వారిలో ఎవడైతే అతి పెద్ద కలహం, వైరం సృష్టిస్తాడో అతడే అతిగొప్పవాడు”. (ముస్లిం).  

عن عبد الله بن مسعود ™ قال: قال رسول الله ﷺ: ما منكم من أحد إلا وقد وكِّل به قرينه من الجنّ، قالوا: وإياك يا رسول الله؟ قال: وإياي، إلاّ أن الله قد أعانني عليه فأسلم فلا يأمرني إلاّ بخير

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ప్రతి వ్యక్తితో ఒక సహచరుడు జిన్నుల నుంచి నిర్ణయించబడ్డాడు”. మీకు సయితం ఇలా ఉందా ప్రవక్తా? అని అనుచరులు అడుగగా “అవును నాతో కూడా, కాని అల్లాహ్ నాకు సహాయం చేశాడు. నాతో ఉన్నవాడు ముస్లిమయ్యాడు అతడు నాకు మంచిని తప్ప మరో విషయం చెప్పుడు”. (ముస్లిం).

విశేషాలుః

1- ఇబ్లీసు యొక్క శత్రుత్వం విశ్వాసులతో కఠినంగా ఉంది.

2- మనుషులలో ఉత్పన్నమయ్యే కలహాల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా అది షైతాన్ పని. వాటిని అంతం చేసి ప్రేమ భావాలు కుదిరించాలి.

41- వాగ్దాన భంగం నిషిద్ధం

[يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُـقُودِ] المائدة: 1

ఓ విశ్వాసులారా! ఒడంబడికలను (ఒంప్పందాలను) పూర్తి చేయండి. (5: మాఇద: 34).

[وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولاً] الإسراء:34.

చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దాన విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. (17: ఇస్రా: 34).

عن عبد الله بن عمرو ™ أن النبي ﷺ قال: أربع من كنّ فيه كان منافقا خالصا، ومن كانت فيه خصلة منهن كانت فيه خصلة من نفاق حتى يدعها: إذا اؤْتُمن خان، وإذا حدّث كذب، وإذا عاهد غدر، وإذا خاصم فجر

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ వ్యక్తిలో ఈ నాలుగు గుణాలుంటాయో అతను అసలైన మునాఫిఖ్ (కపట విశ్వాసి). ఒక వేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దాన్ని విసర్జించనంత వరకు అతనిలో మునాఫఖత్ (కపటత్వం)కు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ నాలుగు గుణాలు ఇవిః (1) అతన్ని నమ్మి ఏదయినా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. (2) నోరు విప్పితే అబద్దం పలుకుతాడు. (3) వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోడు. (4) ఎవరితోనయినా తగువులాట జరిగితే తిట్లకు దిగుతాడు”. (బుఖారి, ముస్లిం).

عن ابن مسعود ™ قال: قال النبي ﷺ: لكل غادر لواء يوم القيامة، يقال هذه غدرة فلان

“ప్రళయదినాన వాగ్దాన భంగం చేసిన ప్రతి వ్యక్తితో ఒక పతాకం ఉండును. ఇది ఫలానా వాగ్దానం భంగపరచినవాని పతాకం అని చెప్పబడును” అని ప్రవక్త ﷺ తెలిపారని ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).   

విశేషాలుః

1- వాగ్దాన భంగం నిషిద్ధం. దాని గురించి హెచ్చరించబడింది.

2- అది కపట విశ్వాసుల గుణం.

3- ప్రళయదినాన వాగ్దానం భంగపరచినవాని గురించిన ప్రకటన అతను చేసిన ఆ పాపాన్ని బట్టి జరుగుతుంది.

42- మోసం – దాని గురించిన హెచ్చరిక

عن أبي هريرة ™ أن رسول الله ﷺ مرّ على صُبْرة طعام فأدخل يده فيها فنالت أصابعه بللا، فقال: ما هذا يا صاحب الطعام؟ قال: أصابته السماء يا رسول الله، قال: افلا جعلته فوق الطعام كي يراه الناس، من غشّ فليس مني

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ఇలా ఉందిః (ఒకసారి) ప్రవక్త ﷺ ధాన్యాల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేయగా వేళ్ళకు తేమ అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షం కురిసినందు వలన తడిసినవి (అయితే అవి క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు. “వాటిని పైన ఎందుకు ఉంచలేదు. ప్రజలకు తెలిసిపోవును కదా, మోసము చేయువారు మాలోని వారుకాదు” అని ప్రవక్త ﷺ స్పష్టం చేశారు. (ముస్లిం).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: من حمل علينا السلاح فليس منا ومن غشّنا فليس منا

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మాపై ఆయుధాన్ని ఎత్తేవారు మాలోనివారు కారు. మమ్మల్ని మోసం చేయువారు మాలోనివారు కారు”. (ముస్లిం).

عن تميم بن أوس الداري  أن النبي ﷺ قال:  الدين النصيحة، قلنا لمن يا رسول الله؟ قال: لله ولكتابه ورسوله ولأئمّة المسلمين وعامتهم

ప్రవక్త ﷺ ప్రవచించారని, తమీం బిన్ ఔస్ అద్దారి రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “దీన్ చిత్తశుద్ధితో కూడిన శ్రేయోభిలాషకు మారుపేరు”. మూడు సార్లు ఇలా అన్నారు ప్రవక్త ﷺ. ఈ శ్రేయోభిలాష ఎవరి పట్ల? అని మేమడిగాము. “అల్లాహ్ పట్ల, ఆయన గ్రంథం పట్ల, ఆయన ప్రవక్త పట్ల, ముస్లిముల నాయకుని పట్ల వారి సామాన్య ప్రజల పట్ల” అని బదులిచ్చారు. (ముస్లిం).

విశేషాలుః

1- ముస్లింలకు మోసం చేయుట నిషిద్ధం. అది పెద్ద పాపాలలో ఒకటి.

2- ముస్లింలకు హితబోధ చేయుట విధి. వారి గురించి మంచిని కోరాలి.

43- కోపం నివారించబడింది. కోపం వచ్చినప్పుడు ఏమి చదవాలి ఏమి చేయాలి?

عن أبي هريرة  أن رجلا قال للنبي ﷺ: أوصني، قال: لاتغضب، فردّ ذلك مرارا، قال: لا تغضب

అబూ హురైర రజియల్లాహు అన్హు  కథనం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺతో నాకు హితవు చేయండీ అని కోరాడు, ప్రవక్త ﷺ అతనికి “నీవు కోపగించుకోకు” అని చెప్పారు. అతను మరీ మరీ కోరాడు, అయినా ప్రవక్త ﷺ ఇదే చెప్పారుః “నీవు కోపగిగంచుకోకు”. (బుఖారి). 

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ليس الشديد بالصرعة ولكنّ الشديد الذي يملك نفسه عند الغضب

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, దైవసందేశహరుల ప్రవచనం ఇలా ఉందిః “కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసినవాడు అసలయిన శూరుడు కాడు. తనకు ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపేవాడే వాస్తవానికి పరాక్రమశాలి”. (బుఖారి, ముస్లిం).

عن أبي ذرّ ™ أن رسول الله ﷺ قال: إذا غضب أحدكم وهو قائم فليجلس، فإن ذهب عنه الغضب وإلاّ فليضطجع

ప్రవక్త ﷺ ఇలా బోధచేశారని, అబూ జర్ర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఎవరయినా నిలబడి ఉన్నప్పుడు కోపం వస్తే కూర్చోవాలి. ఇలా కోపం తగ్గిపోతే మంచిది. లేకుంటే పడుకోవాలి”. (అబూ దావూద్).

عن سليمان بن صُرد ™ قال: استبّ رجلان عند النبي ﷺ ونحن عنده جلوس وأحدهما يسبّ صاحبه مغضبا، قد احمرّ وجهه، فقال النبي ﷺ إنّي لأعلم كلمة لو قالها لذهب عنه ما يجد: أعوذ بالله من الشيطان الرجيم

సులైమాన్ బిన్ సుర్ద్ రజియల్లాహు అన్హు  కథనం: ఇద్దరు వ్యక్తులు ప్రవక్త ﷺ ఎదుట ఒకరినొకరు దూషించకుంటున్నారు. మేము కూడా ప్రవక్త సమక్షంలోనే కోర్చొని ఉన్నాము. వారిద్దరిలో ఒకడు కోపంతో తన సోదరుణ్ణి దూషిస్తున్నాడు, అతని ముఖం ఎర్రపడింది. (అతని ఈ పరిస్తితిని చూసి) ప్రవక్త ﷺ చెప్పారుః “నాకు ఒక వాక్యం తెలుసు అది అతను చదివితే అతని కోపం తగ్గిపోతుంది. అదిః అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం”. (ఓ అల్లాహ్ దుష్ట షైతాను నుండి నీ శరణు కోరుచున్నాను). (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- కోపాన్ని వదులుకోవాలని ప్రవక్త ﷺ ఉపదేశించారు. ఆగ్రహం కలిగినప్పుడు నిగ్రహం చూపేవారిని ప్రశంసించారు.

2- నిలబడియున్న వ్యక్తికి ఆగ్రహం కలుగుతే, కూర్చోవాలని బోధించాలి. ఈ ఉపాయంతో కోపం తగ్గితే సరే. లేకపోతే పడుకోవాలని ఉపదేశించాలి.

3- ఆగ్రహం కలిగిన వ్యక్తి అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం చదవాలని ప్రవక్త ﷺ ఉపదేశించారు.

44- శ్మశానవాటిక దర్శనం

عن بريدة ™ قال: قال رسول الله ﷺ: كنت نهيتكم عن زيارة القبور فزوروها أخرجه مسلم. وزاد الترمذي: فإنها تذكّركم الآخر

ప్రవక్త ﷺ ప్రవచించారని, బురైద రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నేను ఇంతకు ముందు శ్మశానవాటికకు వెళ్ళకుండా మిమ్మల్ని నివారించాను. ఇప్పుడు మీరు వాటి దర్శనం చేయండి”. (ముస్లిం). తిర్మిజిలో ఉంది “ఎందుకంటే సమాధులు ప్రళయదిన జ్ఞాపకాన్ని తాజా చేస్తాయి”.  

عنه ™ قال: كان النبي ﷺ يعلّمهم إذا خرجوا إلى المقابر أن يقول قائلهم: اَلسَّلاَم عَلَيْكُمْ أَهْلَ الدِّ يَارِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُسْلِمِينَ وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لاَحِقُونَ، أَسْأَلُ اللَّهَ لَنَا وَلَكُمْ الْعَافِيَةَ

బురైద ﷺ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ శ్మశానవాటికకు వెళ్ళినప్పుడు (వెళ్ళిన వ్యక్తి అందులో ప్రవేశించే ముందు) ఈ దుఆ చదవాలని వారికి నేర్పేవారుః అస్సలాము అలైకుం అహ్లద్దియారి మినల్ ముఅమినీన వల్ ముస్లిమీన వఇన్నా ఇన్షాఅల్లాహు బికుం లాహిఖూన్. అస్అలుల్లాహ లనా వ లకుముల్ ఆఫియ. (ముస్లిం).

عن ابي مرثد ™ قال: سمعت رسول الله ﷺ يقول: لاتصلّوا إلى القبور، ولا تجلسوا عليها

“మీరు సమాధుల వైపు (ముఖము చేసి) నమాజ్ చేయకండి. వాటిపై కూర్చోకండి” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు.  

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: لأن يجلس أحدكم على جمرة فتحرقَ ثيابَه فتخلصُ إلى جلده خير له من أن يجلس على قبر

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని, ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి, దాని సెగ శరీరానికి కల్గునట్టి పరిస్థితి సమాధిపై కూర్చునే దానికంటే మేలు”. (అనగా సమాధిపై కూర్చోవడం తప్పు అని హెచ్చరించబడుతున్నది). (ముస్లిం).

విశేషాలుః

1-శ్మశానవాటిక దర్శనం అభిలషణీయం. అది ప్రళయదినాన్ని స్మరింపజేస్తుంది.

2- ప్రవక్త ﷺ నేర్పిన విధంగా శ్మశానవాటికలో ప్రవేశించునప్పుడు సలాం చేసి ప్రవేశించుట అభిలషణీయం.

3- సమాధుల వైపు (ముఖము చేసి) నమాజు చేయుట నిషిద్ధం.

45- మత్తు సేవించుట నిషిద్ధం

[إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالأَنْصَابُ وَالأَزْلآمُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ] المائدة:90

విశ్వాలారా! సారాయి, జూదము, విగ్రహాలు, పాచికల ద్వారా జోస్యం. ఇవన్నియు అసహ్యకరమై షైతాను పనులు. వాటిని విసర్జించండి. (5: మాఇద: 90).

عن ابن عمر ™ قال: قال رسول الله ﷺ: كل مسكر خمر وكل مسكر حرام، ومن شرب الخمر في الدنيا فمات وهو يدمنها ولم يستب، لم يشربها في الآخرة

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ప్రతి మత్తుగల వస్తువు మధ్యపానం. ప్రతి మత్తుగల వస్తువు నిషిద్ధం. ఇహలోకములో మధ్యపానం సేవించినవాడు దానికి బానిస అయినవాడు క్షమాపణ కోరక ముందే చనిపోయినచో, పరలోకంలో దాన్ని నోచుకోలేడు”. (ముస్లిం).

عن جابر ™ قال: قال رسول الله ﷺ: كل مسكر حرام، إن على الله عهدا لمن شرب المسكر أن يسقيه من طينة الخبال، قالوا: يا رسول الله وما طينة الخبال؟ قال: عرق أهل النار أو عصارة أهل النار

ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారని, జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ప్రతి మత్తుగల వస్తువు నిషిద్ధం. నిశ్చయంగా మత్తు సేవించినవ వారికి అల్లాహ్ ‘తీనతుల్ ఖబాల్’ త్రాగిస్తానని నిశ్చయించాడు”. ‘తీనతుల్ ఖబాల్’ అంటేమిటి ప్రవక్తా? అని అక్కడున్నవారడిగారు. “నరకవాసుల చెమట లేక వారి చీము([1])” అని జవాబిచ్చారు ప్రవక్త ﷺ. (ముస్లిం).

عن طارق بن سويد ™ أنه سأل النبي ﷺ عن الخمر فنهاه، فقال: إنما أصنعه للدواء؟ فقال: إنه ليس بدواء، ولكنه داء

తారిఖ్ బిన్ సువైద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు: తను ప్రవక్త ﷺ తో మధ్యపానం విషయంలో ప్రశ్నించారు, అయితే ప్రవక్త ﷺ నివారించారు. ‘నేను ఔషధం కొరకు తయారు చేస్తాను’ అని అంటే ప్రవక్త ﷺ “అది ఔషధం కాదు, వ్యాధి” అని నచ్చజెప్పారు. (ముస్లిం).

عن عبد الله بن عمر ™ قال : قال رسول الله ﷺ: من شرب الخمر في الدنيا لم يقبل الله له صلاة أربعين صباحا، فإن تاب تاب الله عليه فإن عاد لم يقبل الله له صلاة اربعين صباحا، فإن تاب تاب الله عليه، فإن عاد لم يقبل الله له صلاة أربعين صباحا، فإن تاب تاب الله عليه، فإن عاد الرابعة لم يقبل الله له صلاة أربعين صباحا، فإن تاب لم يتب الله عليه وسقاه من نهر الخبال

ప్రవక్త ﷺ ఇలా బోధించారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఇహలోకములో మధ్యపానం సేవించేవారి 40రోజుల నమాజు స్వీకరించబడదు. అతడు తౌబా చేస్తే అల్లాహ్ అతన్ని మన్నిస్తాడు. తిరిగి అదే అలవాటుకు లోనయుతే 40 రోజుల నమాజు స్వీకరించబడదు. మళ్ళీ తౌబా చేస్తే అల్లాహ్ అతన్ని మన్నిస్తాడు. తరువాత తిరిగి అదే పని చేస్తే అతని 40 రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక నాల్గవసారి కూడా అతడు తిరిగి అదే పని చేశాడంటే అతడు తౌబా చేసినా అల్లాహ్ అతన్ని మన్నించడు. అతనికి నరకంలో ‘ఖబాల్’ నది యొక్క (చెముట, చీము) త్రాగిస్తాడు”. (తిర్మిజి).

విశేషాలుః

1- మధ్యం సేవించుట నిషిద్ధం.

2- సేవించేవారికి కఠిన శిక్ష ఉంది.

3- అది వ్యాధి, ఔషదం కాదు.

46- జగడం, వాగ్వివాదం చేయుట గురించి హెచ్చరించబడింది

عن ابي أمامة ™ قال: قال رسول الله ﷺ: ما ضلّ قوم بعد هدىً كانوا عليه إلاّ أوتوا الجدل، ثم قرأ [مَا ضَرَبُوهُ لَكَ إِلاَّ جَدَلاً]

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబూ ఉమామ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ జాతి కూడా సన్మార్గంపై ఉన్న తరువాత దుర్మార్గంలో పడినది కేవలం వారిలో జగడము వచ్చినందు వలన మాత్రమే. మళ్ళీ ప్రవక్త ﷺ ఈ ఆయతు పఠించారు, భావం: ఈ అభ్యంతరాన్ని వారు కేవలం పిడివాదం కోసమే నీ ముందుకు తీసుకువచ్చారు. (43:58). (తిర్మిజి).

عن عائشة ؅ قالت: قال رسول الله ﷺ: إن أبغض الرجال إلى الله الألدّ الخصِم

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “అల్లాహ్ దృష్టిలో అందరికంటే పరమ అసహ్యకరమైన వ్యక్తి కరడుగట్టిన జగడాలమారి”. (బుఖారి, ముస్లిం).  అబూ దావూద్ లో ఉందిః

عن أبي أمامة  قال: قال رسول الله ﷺ: أنا زعيم ببيتٍ في ربض الجنة لمن ترك المراء وإن كان محِقًّا، وبيتٍ في وسط الجنة لمن ترك الكذب وإن كان مازحا، وبيتٍ في أعلى الجنة لمن حسُن خُلقه

ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని, అబూ ఉమామ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరయితే హక్కు తనదైనప్పటికి వివాదాన్ని, జగడాన్ని వదులుకుంటారో వారికి స్వర్గంలో నివాస స్థలం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. పరిహాసానికైనా అసత్యము చెప్పని వ్యక్తి కోసం స్వర్గం మధ్యలో నివాసం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సదా తన గుణగణాల సంస్కరణ పట్ల శ్రద్ధ చూపే వ్యక్తికి స్వర్గపు అత్యున్నత భాగంలో నివాసం ప్రాప్తిస్తుందని నేను హామీ ఇస్తున్నాను”.

عن جابر ™ أن رسول الله ﷺ قال: إن من أحبكم إليّ وأقربكم مني مجلسا يوم القيامة أحاسنكم أخلاقا، وإن أبغضكم إليّ وأبعدكم مني يوم القيامة الثرثارون والمتشدّقون والمتفيهقون، قالوا: يار سول الله قد علمنا الثرثارون والمتشدّقون، فما المتفيهقون؟ قال: المتكبّرون

జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “మీలో నాకు ప్రియుడు, ప్రళయదినాన నాకు తోడుగా కూర్చునేవాడు మీలో సద్ప్రవర్తన గలవాడు. మీలో నాకు అసహ్యంగా, ప్రళయదినాన దూరంగా ఉండేవాడు మాటలమారి, ఆత్మస్తుతి లేక ప్రగల్భాలు పలికేవాడు మరియు ‘ముతఫైహిఖూన్'”. ప్రవక్తా మాటలమారి, ఆత్మస్తుతి, లేక ప్రగల్భాలు పలికేవాళ్ళంటే మాకు తెలుసు కాని ‘ముతఫైహిఖూన్’ అంటే ఎవరు? అని అడుగారు అనుచరులు. దానికి ప్రవక్త ﷺ ఇలా జవాబిచ్చారుః “అహంకారులు”. (తిర్మిజి).

విశేషాలుః

1- ఏదైనా ఔచిత్యముంటే తప్ప జగడమును మానుకోవాలని ప్రోత్స-హించబడింది. వివాదం అవసరమున్నా కూడా సరళంగా వాదించాలి.

2- జగడములో కూడా కఠినత్వం గురించి హెచ్చరించబడింది.

3- వాగ్వివాదమును వ్యాపింపజేయుట దుర్మార్గమునకు ఒక గుర్తు.

4- ప్రవక్త ﷺ ప్రగాల్భాలు పలికేవాడిని అసహ్యించుకునేవారు. వారు ప్రళయదినాన కూడా ప్రవక్త ﷺ తో దూరంగానే ఉంటారు.

47- చెట్లు, తోటల పెంపకము యొక్క ఘనత

عن جابر ™ : أن رسول الله ﷺ دخل على أم مبشِّر الأنصارية في نخل لها فقال لها النبي ﷺ: من غرس هذا النخل أمسلم أم كافر؟ فقالت: بل مسلم، فقال: لا يغرس رجل مسلم غرسا ولا يزرع زرعا فيأكل منه إنسان ولا دابة ولا شيء إلاّ كانت له صدقةٌ

జాబిర్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ ఉమ్మె ముబష్షిర్ అన్సారియ రజియల్లాహు అన్హా గారి తోటలోకి వెళ్ళారు. “ఈ ఖర్జూరపు చెట్టు ఎవరు నాటారు? ముస్లిమా లేక అవిశ్వాసియా?” అని అడిగారు. ఆమె ముస్లిమని చెప్పింది. అప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో మనుషులుగాని, పశువులుగాని లేదా ఇంకేదైనా తిన్న పక్షంలో అది అతని తరఫున సదఖా (దానము) అవుతుంది”. (ముస్లిం).

عن جابر ™ قال: قال رسول الله ﷺ: ما من مسلم يغرس غرسا إلا كان ما أُكِل منه له صدقة وما سُرِقَ منه له صدقة وما أَكل السبع منه فهو صدقة وما أَكلت الطير فهو له صدقة ولا يزرؤُه أحد إلاّ كان له صدقةٌ

ప్రవక్త ﷺ ఉపదేశించారని, జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరయినా ముస్లిం ఒక మొక్క నాటిన తరువాత దాని నుంచి ఎవరైనా తిన్నచో అది అతనికి సదఖా అగును. ఎవరయినా దొంగలించినా అది అతనికి సదఖా అగును. పశువులు తిన్నా అది అతనికి సదఖా. పక్షులు తిన్నా అది అతనికి సదఖా అగును. ఇంకా ఎవరయినా తీసుకున్నందున అందులో తరిగినచో అదీ అతనికి సదఖా అగును”. (ముస్లిం).

విశేషాలుః

1- చెట్లు నాటుట. తోటలు పెంచుట ఘనతగల విషయం.

2- మనుషులు, పశువులు ఆ చెట్ల నుండి, తోటల నుండి ఏది తిన్నా, నాటిన వ్యక్తికి మాత్రం సదఖా (పుణ్యం లభించును).

48- క్రయవిక్రయాలకు సంబంధించిన ఆదేశాలు

عن أبي هريرة ™ أن رسول الله ﷺ مرّ على صُبْرة طعام فأدخل يده فيها فنالت أصابعه بللا، فقال: ما هذا يا صاحب الطعام؟ قال: أصابته السماء يا رسول الله، قال: افلا جعلته فوق الطعام كي يراه الناس؟ من غشّ فليس مني

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ఇలా ఉందిః (ఒకసారి) ప్రవక్త ﷺ ధాన్యాల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేయగా వేళ్ళకు పదును అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షం కురిసినందు వలన తడిసినవి (అయితే అవి క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు. “వాటిని పైన ఎందుకు ఉంచలేదు. ప్రజలకు తెలిసిపోవును కదా, మోసము చేయువారు మాలోని వారుకాదు” అని ప్రవక్త ﷺ స్పష్టం చేశారు. (ముస్లిం).

عن حكيم بن حزام ™ عن النبي ﷺ قال: البيِّعان بالخيار ما لم يتفرّقا فإن صدقا وبيّنا بورك لهما في بيعهما وإن كذبا وكتما الحق محقت بركة بيعهما

ప్రవక్త ﷺ ప్రవచించారని, హకీం బిన్ హిజాం రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “కొనుగోలు చేయు వ్యక్తి మరియు అమ్మకము చేయు వ్యక్తి (సరుకు నిరాకరించే హక్కు) ఇద్దరు విడిపోయేంత వరకు ఉంటుంది. ఇద్దరూ సత్యంపై ఉండి (లోపం లేక మరేదైనా అవసరమయిన విషయం) స్పష్టం చేసుకుంటే ఇద్దరికీ తమ సరుకులో శుభం కలుగుతుంది. ఒకవేళ ఇద్దరూ అసత్య వ్యవహారం చేసుకొని వాస్తవికతను కప్పి ఉంచితే ఇద్దరి సరుకుల్లో నుంచి శుభం నశించిపోతుంది”. (ముస్లిం).

వ్యపారంలో ప్రమాణం చేయుట నిషిద్ధం

عن أبي هريرة ™ قال: سمعت رسول الله ﷺ يقول: الحلِفُ منفقة للسّلعة ممحقة للربح

“ప్రమాణంతో సరుకు అమ్ముడుబోతుంది కాని లాభాన్ని, శుభాన్ని

నశింపజేస్తుంది” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن ابي قتادة ™ أنه سمع رسول الله ﷺ يقول: إيّاكم وكثرة الحلِف فإنه ينفق ثم يمحق

“చీటికీ మాటికీ ప్రమాణం చేయకండి. ఇది వృద్ధి పరిచేదిగా కనిపించినా, చివరికి  నష్టపరుస్తుంది” అని ప్రవక్త ﷺ చెప్పగా అబూ ఖతాద రజియల్లాహు అన్హు  విన్నట్లు ఉల్లేఖిస్తున్నారు. (ముస్లిం).

విశేషాలుః

1- కొనుగోలు, అమ్మకంలో మోసం చేయుట నివారించబడింది. అది పెద్ద పాపాలలో ఒకటి.

2-  కొనుగోలు చేసిన వ్యక్తి అమ్మకం చేసిన వ్యక్తి మధ్య సరుకు వెనక్కి ఇచ్చే తీసుకునే హక్కు ఇద్దరు విడిపోయే వరకు ఉంటుంది.

3- సరుకు విక్రయించడంలో ప్రమాణం చేయుట నివారించబడింది. అది వ్యాపారంలో శుభాన్ని నశింపజేస్తుంది.

49- మితిమీరిన నవ్వు నివారించబడింది

عن أبى هريرة ™ قال: قال رسول الله ﷺ: لا تكثروا الضحك فإن كثرة الضحك تميت القلب

“మితిమీరి నవ్వకండి. మితిమీరిన నవ్వు హృదయాన్ని చంపుతుంది” అని ప్రవక్త ﷺ హెచ్చరించినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (అహ్మద్).

عن عائشة رضي الله عنها قالت: ما رأيت النبي ﷺ مستجمعا ضاحكا حتى أرى منه لهواته، إنما كان يتبسم

‘ప్రవక్త ﷺ కొండనాలుక అగుపడే విధంగా విరగబడి నవ్వింది నేనెప్పుడూ

చూడలేదు. ఆయన చిరునవ్వు నవ్వేవారు’ అని ఆయిష రజియల్లాహు అన్హా తెలిపారు. (బుఖారి).

عن أبى ذر ™ قال: قال رسول اللهﷺ: تبسمك في وجه أخيك لك صدقة، وأمرك بالمعروف ونهيك عن المنكر صدقة، وإرشادك الرجل فى أرض الضلال لك صدقة، وبصرك للرجل الرديءِ البَصَرِ لك صدقة، وإماطتك الحجر والشوكة والعظم عن الطريق لك صدقة، وإفراغك من دلوك في دلو أخيك لك صدقة

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబూ జర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ముస్లిం సోదరుణ్ణి చిరునవ్వు నవ్వుతూ కలుసుకోవడంలో నీకు ఒక పుణ్యం. మంచిని ఆదేశించి చెడును నివారించుటలో నీకు ఒక పుణ్యం. దారి తప్పినవారికి నీవు దారి చూపుడం కూడా నీకు పుణ్యం. తక్కువ చూపుగల వ్యక్తికి (దారిలో తనకు అవసరమున్నదాన్ని) చూపుట నీకు పుణ్యం. దారి నుండి ముళ్ళు, రాయి, బొక్కను పక్కకు చేయుట నీకు పుణ్యం. నీ సోదరునికి ఒక బొక్కెన నీళ్ళు తీసి ఇచ్చుట కూడా నీకు పుణ్యం”. (తిర్మిజిః 1956).

విశేషాలుః

1- మితిమీరి నవ్వుట నివారించబడింది.

2- అది హృదయాన్ని నాశనం చేస్తుంది.

3- అది ప్రవక్త పద్దతి కాదు.  

50- అసత్య ప్రమాణం చేయుట కఠినంగా నివారించబడింది

عن عبد الله بن مسعود ™ أن النبي ﷺ قال: من حلف على مال امرئ مسلم بغير حق لقي الله وهو عليه غضبان، قال: ثم قرأ رسول اللهﷺ مصداقه من كتاب الله:

[اِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللهِ وَاَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا اُولَئِكَ لاَ خَلَقَ لَهُمْ فِى الْآخِرَةِ وَلاَ يُكَلِّمُهُمُ اللهُ وَلاَ يَنْظُرُ اِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلاَ يُزَكِّيْهِمْ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ] آل عمران 77

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “ఎవరయితే ఒక ముస్లిం వ్యక్తి సొమ్ముపై అన్యాయంగా ప్రమాణం చేస్తాడో, అతడు అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహ్ అతని పట్ల కోపంగా ఉంటాడు”. మళ్ళీ ప్రవక్త ﷺ దీనికి ఆధారంగా ఈ ఖుర్ఆన్ ఆయతు పఠించారుః {ఇక ఎవరు అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో, వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. ప్రళయం రోజున అల్లాహ్ వారిని పలుకరించడు. వారి వైపు చూడడు. వారిని పరిశుద్ధులుగా చెయ్యడు. పైగా వారికి అత్యంత బాధకరమయిన శిక్ష పడుతుంది” (3: సూరె ఆలె ఇమ్రాన్: 77). (బుఖారి, ముస్లిం).  

عن أبى أمامة ™ أن رسول اللهﷺ قال: ن اقتطع حق امرئ مسلم بيمينه فقد أوجب الله له النار وحرم عليه الجنة فقال رجل: وإن كان شيئا يسيرا يا رسول الله؟ قال: وإن كان قضيبا من أراك

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూ ఉమామ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరయితే ఒక ముస్లిం వ్యక్తి హక్కును తన అసత్య ప్రమాణంతో అపహరించుకుంటాడో అతనిపై నరకం విధి చేసి, స్వర్గాన్ని అల్లాహ్ నిషేధించాడు”. ఒక వ్యక్తి లేచి ‘ఒక వేళ అది చిన్న వస్తువు అయి ఉంటే?’ అని అడిగాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “అవును అది ఒక చెట్టు యొక్క చిన్న ముక్కయినా సరే” (అపహరించుకుంటే అతని స్థానం నరకం). (ముస్లిం).

عن عبد الله بن عمرو ™ عن النبيﷺ قال: الكبائر: الإشراك بالله، وعقوق الوالدين،

وقتل النفس، واليمين الغموس

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖించారుః “అల్లాహ్ తో సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, హత్య చేయుట మరియు ‘యమీనె గమూస్’ ఘోరమయిన పాపాల్లో లెక్కించబడుతాయి”. (బుఖారి).

وفى رواية: أن أعرابيا جاء النبيﷺ فقال: يا رسول الله ما الكبائر؟ قال: الإشراك بالله قال: ثم ماذا؟ قال: اليمين الغموس قلت ما اليمين الغموس؟ قال: الذى يقتطع مال امرئ مسلم.

మరొక ఉల్లేఖనంలో ఇలా ఉందిః ‘ఒక గ్రామీణుడు ప్రవక్త వద్దకు వచ్చి ‘ఘోరమయిన పాపాలు ఏమిటి?’ అని అడిగాడు. దానికి ప్రవక్త ﷺ “అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కల్పించుట” అని బదులిచ్చారు. అతను ఇంకా ఏవి? అని అడిగాడు. “‘యమీనె గమూస్’ అని ప్రవక్త ﷺ చెప్పారు. ‘యమీనె గమూస్’ అంటేమిటి అని అడగ్గా,”అన్యాయంగా ఒక ముస్లిం వ్యక్తి సొమ్మును అపహరించుకొనుటకు అసత్య ప్రమాణం చేయుట” అని నముదాయించారు ప్రవక్త ﷺ.

విశేషాలుః

1- అసత్య ప్రమాణాలతో ముస్లిం సోదరుని సొమ్మును అపహరించు కొనుట కఠినంగా నిషేధించబడినది.

2- అలా చేయువానికి కఠిన శిక్ష ఉంది. అతని ఆ అసత్య ప్రమాణం అతన్ని నరకంలో పడేస్తుంది.

3- ఇలాంటి దుర్గుణం నుండి అతిదూరంగా ఉండుట కూడా తప్పనిసరి.

51- అబద్ధపు సాక్ష్యం కఠినంగా నిషేధించబడినది

[وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ] الحج 30

అసత్య పలుకుల నుండి దూరంగా ఉండండి. (22: హజ్: 30).

[وَلاَ تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ اِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ اُولَئِكَ كَانَ عَنْهُ مَسْؤُولاً]

మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనుస్సు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగతుంది. (17: బనీ ఇస్రాఈల్: 36). 

وعن أبي بكرة ™ قال: قال رسول الله ﷺ: ألا أنبئكم بأكبر الكبائر؟ قلنا: بلى يارسول الله، قال: الإشراك بالله، وعقوق الوالدين. وكان متكئا فجلس فقال: ألا وقول الزور. فما زال يكررها حتى قلنا ليته سكت.

ప్రవక్త ﷺ మమ్మల్ని ఉద్దేశించి ఇలా ప్రశ్నించారని, అబూ బక్ర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అన్నింటికంటే ఘోరమైన పాపాల గురించి నేను మీకు తెలుపనా?”. దానికి మేము ‘తప్పకుండా తెలుపండి ప్రవక్తా!’ అని అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం” అని తెలిపారు. ఆ తర్వాత ఆయన ఆనుకొని కూర్చున్న వారల్ల ఒక్కసారిగా లేచి సరిగ్గా కూర్చొని “జాగ్రత్తగా వినండీ! అబద్దమాట్లాడ్డం (అన్నింటికంటే ఘోరమైన పాపం)” అని అన్నారు. ఇలా మరీ మరీ చెబుతూ పోయారు. చివరికి మేము మనుస్సులో ‘అయ్యో! ఈయన ఈ మాటలు ఇక చాలిస్తే బాగుండును’ అని అనుకున్నాం. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- అసత్య సాక్ష్యం ఇచ్చుట కఠినంగా నిషేధించబడింది.

2- అది అబద్ధం మరియు ఇందులో ముస్లిముల హక్కుల అపహరణ జరుగుతుంది, కాబట్టి పాపాల్లో అతి ఘోరమైనదిగా పరిగణించబడింది.

52- శపించుట నివారించబడింది

عن ثابت بن الضحاك ™ قال: قال رسول الله ﷺ: لعن المؤمن كقتله

“విశ్వాసిని దూషించడం అతడ్ని హత్య చేయడంతో సమానం” అని ప్రవక్త ﷺ తెలిపారని, సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. 

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: لا ينبغي لصديق أن يكون لعانا

ప్రవక్త ﷺ బోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “సత్యవంతుడు శపించువాడు కావటం సమ్మతమైన విషయం కాదు”. (ముస్లిం).

عن أبي الدرداء ™ قال: قال رسول الله ﷺ: لا يكون اللعانون شفعاء ولا شهداء يوم القيامة

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూ దర్దా రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “దూషించువారు ప్రళయదినాన సిఫారసు చేయలేరు. సాక్ష్యమూ ఇవ్వలేరు”. (ముస్లిం). 

عن ابن مسعود ™ قال: قال رسول الله ﷺ: ليس المؤمن بالطعان ولا اللعان ولا الفاحش ولا البذيء

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఒకరి లోపాలు ఎంచేవాడు, దూషించేవాడు, అశ్లీల పదాలు పలికేవాడు, దుర్భాషలాడేవాడు విశ్వాసుడు కాడు”. (తిర్మిజి).

عن أبي الدرداء ™ قال: قال رسول الله ﷺ: إن العبد إذا لعن شيئا صعدت اللعنة إلى السماء فتغلق أبواب السماء دونها ثم تهبط إلى الأرض فتغلق أبوابها دونها ثم ـاخذ يمينا وشمالا فإذا لم تجد مساغا رجعت إلى الذي لُعِن فإن كان أهلا لذلك وإلا رجعت لقائلها

ప్రవక్త ﷺ ఇలా బోధించారని, అబూ దర్దా రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మానవుడు ఎవరినైనా శపించినప్పుడు, ఆ శాపం ఆకాశం వైపు వెళ్తుంది. అక్కడ దాని తలుపులు మూసి ఉంటాయి. అప్పుడు దిగి భూమి వైపుకు వస్తుంది. దాని తలుపులూ మూసి ఉంటాయి. కుడి వైపు, ఎడమ వైపు వెళ్తుంది. ఎక్కడా సందు పొందనిచో, శపించబడినవాని వైపు వెళ్తుంది. ఒక వేళ అతడు దానికి అర్హుడై ఉంటే అతనిపై, లేనిచో తిరిగి శపించినవాడిపై పడుతుంది. అనగా ఆ శాపం వానికే తగులుతుంది”. (అబూ దావూద్).

విశేషాలుః

1- విశ్వాసుల్ని శపించడం గురించి హెచ్చరించబడింది.

2- అధర్మంగా, అన్యాయంగా శపించినచో ఆ శాపం తిరిగి శపించిన-వానికే తలుగుతుంది.

3- శపించడం సత్యవంతుల, భక్తుల లక్షణం కాదు.

53- కవిత్వం

[وَالشُّعْرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ، اَلَمْ تَرَ اَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ، وَاَنَّهُمْ يَقُولُونَ مَا لاَ يَفْعَلُونَ، اِلاَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللهَ كَثِيْرًا وَانْتَصَرُوا مِنْ بَعْدِ مَا ظُلِمُوا]

కవులు, వారి వెనక మార్గభ్రష్టులే నడుస్తూ ఉంటారు. వారు ప్రతి లోయలో దారి తప్పటాన్ని, తాము ఆచరించని దాన్ని చెప్పటాన్ని చూడటం లేదా? విశ్వసించి మంచి పనులు చేసేవారు అల్లాహ్ ను అమితంగా స్మరించేవారూ, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతికార చర్య తీసుకునేవారు తప్ప. (26: షుఅరా: 224-227).

عن أبي بن كعب ™ قال: إن النبي ﷺ قال: إن من الشعر حكمة

“కవిత్వంలో వివేకంతో కూడిన విషయముంటుంది” అని ప్రవక్త ﷺ తెలిపారని, ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు.  (బుఖారి).

عن البراء بن عازب ™ أن رسول الله ﷺ قال يوم قريظة لحسان: اهج المشركين فإن جبريل معك

బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు  కథనం: బనూ ఖురైజాతో యుద్ధం జరిగిన రోజున ప్రవక్త ﷺ హస్సాన్ బిన్ సాబిత్ తో ఇలా అన్నారుః “(నీ కవిత్వంతో) అవిశ్వాసుల హేళనచేయి, జిబ్రీల్ నీతో ఉన్నాడు”.

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: لأن يمتلئ جوف رجل قيحا حتى يريه خير له من أن يمتلئ شعرا.

“ఒక వ్యక్తి కడుపు చీముతో నింపుకోవడం, తదుపరి అది దాన్ని పాడు చేయడం అనేది కవితాల కాలుష్యంతో కలుషితమవడంకన్నా మేలైనది” అని ప్రవక్త ﷺ సెలవిచ్చినట్లు అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- కవిత్వంలో (నైతిక ప్రమాణాల పరిపోషణకు వినియోగపడే) మంచి కవిత్వం ఉంటుంది. (నైతిక ప్రమాణాలను భంగపరిచే) చెడు కవిత్వం కూడా ఉంటుంది. (దీనిలో మొదటి రకం మొదటి రెండు హదీసుల్లో, రెండవ రకం మూడవ హదీసులో వచ్చింది).

2- మనిషికి అల్లాహ్ ‘జిక్ర్’ (స్మరణ), ఖుర్ఆన్ పఠనం లేకుండా కవితాలను కంఠస్తం చేయడం మంచిది కాదని హెచ్చరించబడింది.

54- చెడు పదాలు ఉచ్చరించుట నివారించబడింది

ముస్లింను ఓ కాఫిర్ అని అనుట నివారించబడింది.  

عن ابن عمر ™ قال: قال رسول الله ﷺ: إذا قال الرجل لأخيه: يا كافر، فقد باء

بها أحدهما، فإن كان كما قال وإلا رجعت عليه

“ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడ్ని కాఫిర్ అని పిలిస్తే, వారిద్దరిలో ఒకరు తప్పకుండా అవిశ్వాసి అయిపోతాడు. అంటే కాఫిర్ అని చెప్పబడినవాడు అలా ఉంటే సరి, లేనిచో చెప్పినవాడే కాఫిర్ అయ్యే (ప్రమాదముంటుందని)” ప్రవక్త ﷺ చెప్పినట్లు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

عن أبي ذر ™ أنه سمع رسول الله ﷺ يقول: من دعا رجلا بالكفر أو قال: عدو الله، وليس كذلك إلا حار عليه

“ఎవరయినా ఒక వ్యక్తిని కాఫిర్ అనీ లేక దైవశతృడా అని పిలిచినచో, అప్పుడతడు (పిలువబడినవాడు) అలాంటివాడు కానిచో, ఆ మాట చెప్పినవాని వంకే తిరుగుతుంది” అని ప్రవక్త ﷺ తో విన్నట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

عن أبي المليح عن رجل قال: كنت رديف النبي ﷺ فعثرت دابته فقلت: تعس الشيطان، فقال: لا تقل تعس الشيطان، فإنه يعظم حتى يصير مثل البيت، ويقول: بقوتي صرعته، ولكن قل: بسم الله، فإنك إذا قلت ذلك تصاغر حتى يصير مثل الذباب

ప్రవక్త ﷺ యొక్క ఒక అనుచరుడు ఇలా చెప్పాడని, అబూ ములైహ్ ఉల్లేఖించారుః నేను ప్రవక్త ﷺ వెనక సవారిపై కూర్చున్నాను. ఆ సవారి పోటురాయి తగిలి పడబోయింది. నేను ‘తఇసష్షైతాన్’ (షైతాన్ నాశనమవుగాకా) అని అన్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “‘తఇసష్షైతాన్’ అనకు. అలా అన్నప్పుడు వాడు ఉప్పొంగి ఒక ఇల్లంత అయిపోతాడు. ‘నా శక్తితో నేను పడేశాను’ అని అంటాడు. అయితే ‘బిస్మిల్లాహ్’ అను. ఇలా అన్నప్పుడు వాడు కృంగిపోయి ఈగ లాగా అయిపోతాడు”. (అహ్మద్).

విశేషాలుః

1- ముస్లింను కాఫిర్ అనుట నివారించబడింది.

2- ముస్లింను దైవశతృడా అనుట నివారించబడింది.

3- ఈ పదాలు ఎవరినుద్దేశించి చెప్పబడ్డాయో వారు దానికి అర్హులు కానట్లయితే, అవి చెప్పినవారి వైపుకే తిరుగుతాయి.

4- ప్రమాద సమయాల్లో ‘తఇసష్షైతాన్’ అనుట నివారించబడింది. దానికి బదులుగా ‘బిస్మిల్లాహ్’ అనాలని ఆదేశించబడింది.

55- జిహాద్ (ధర్మ పోరాటం) ఘనత

[يآاَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ اَدُلُّكُمْ عَلَى تِجَارَةٍ تُنْجِيْكُمْ مِنْ عَذَابٍ أَلِيْمٍ، تُؤْمِنُونَ بِاللهِ وَرَسُولِهِ وَتُجَاهِدُونَ فِي سَبِيلِ اللهِ بِأَمْوَالِكُمْ وَ أَنْفُسِكُم ذ’لِكُمْ خَيْرٌ لَّكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] الصف 11

విశ్వాసులారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వ్యాపారమేమిటో నేను మీకు తెలుపనా? అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ సంపదలను, మీ ప్రాణాలను ధారపోసి పోరాడండి. మీరు గనక గ్రహిస్తే ఇదే మీకు మేలైనది. (61: సఫ్: 10,11).

عن أبي هريرة ™ قال: أن رسول الله ﷺ سئل أي العمل أفضل؟ قال: إيمان بالله ورسوله قيل: ثم أي؟ قال: الجهاد في سبيل الله، قيل: ثم ماذا؟ قال: حج مبرور.

అబూ హురైర ﷺ కథనం: అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణ ఏమిటి? అని ప్రశ్న వచ్చింది. దానికి ప్రవక్త ﷺ “అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను విశ్వసించుట. ఆ తరువాత ఏది అని వచ్చిన ప్రశ్నకు “అల్లాహ్ మార్గంలో పోరాడటం” అని చెప్పారు. ఆ తరువాత శ్రేష్ఠమైన ఆచరణ ఏది? అని అడిగినందుకు “సమ్మతింపబడిన హజ్” అని సమాధానమిచ్చారు ప్రవక్త ﷺ. (బుఖారి, ముస్లిం).

وعن أنس ™ أن رسول الله ﷺ قال: لغدوة فى سبيل الله أو روحة خير من الدنيا وما فيها

“అల్లాహ్ మార్గంలో ఒక ప్రొద్దు లేక ఒక సాయంకాలము గడుపుట, ప్రపంచం మరియు అందులో ఉన్నవాటన్నింటి కంటే ఎంతో ఉత్తమం” అని ప్రవక్త ﷺ తెలిపారని, అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

وعن عبد الرحمن بن جبير ™ قال: قال رسول الله ﷺ: ما اغبرت قدما عبد في سبيل الله فتمسه النار

“అల్లాహ్ మార్గంలో దుమ్ముపట్టిన దాసుని పాదాలు నరకములో చేరవు” అని ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అబ్దుర్ రహ్మాన్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి).

وعن أبي هريرة ™ قال: قيل: يا رسول الله ما يعدل الجهاد في سبيل الله؟ قال: ((لا تستطيعونه)) فأعادوا عليه مرتين أو ثلاثا،كل ذلك يقول: لا تستطيعونه، ثم قال: ((مثل المجاهد في سبيل الله كمثل الصائم القائم القانت بآيات الله لا يفتر من صلاة ولا صيام حتى يرجع المجاهد في سبيل الله))

అబూ హురైర రజియల్లాహు అన్హు  కథనం: అల్లాహ్ మార్గంలో పోరాడడం లాంటి ఆచరణకు సరిసమానమైన ఆచరణ మరేదైనా ఉందా? అని ప్రవక్త ﷺ ముందు ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త ﷺ “అది చేసే స్థోమత మీలో లేదు” అని సమాధానమిచ్చారు. వారు తిరిగి రెండు మూడు సార్లు ప్రశ్నించారు. ప్రవక్త ﷺ మీలో చేసే స్థోమత లేదు అనే బదులిచ్చారు. చివరికి ఇలా చెప్పారుః అల్లాహ్ మార్గంలో వెళ్ళిన యుద్ధవీరునికి సరిసమానంగా ఏదైనా ఆచరణ ఉంటే అది అతను తిరిగి వచ్చే వరకు అలసిపోకుండా నమాజులు, ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్ అయతులను పఠిస్తూ ఉండేవానీ లాంటి ఆచరణ ఉంటుంది”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- అల్లాహ్ మార్గంలో పోరాడడం ఘనతగల విషయం.

2- అన్ని రకాల ఆచరణలోకెల్లా జిహాద్ అతి ఉత్తమమైనది.

3- నరకాగ్ని నుండి రక్షణకు అది ఒక మంచి కారణం.

56- షహీద్, ముజాహిద్ లకు లభించు ప్రతిఫలం

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((تضمن الله لمن خرج في سبيله، لا يخرجه إلا جهاد في سبيلي وإيمان بي وتصديق برسلي فهو علي ضامن أن أدخه الجنة أو أرجعه إلى منزله الذي خرج منه لما نال من أجر أو غنيمة، والذي نفس محمد بيده، ما من كلم يكلم في سبيل الله إلا جاء يوم القيامة كهيئته يوم كلم لونه لون الدم وريجه ريح المسك، والذي نفس محمد بيده لو لا أن يشق على المسلمين ما قعدت خلاف سرية تغزو في سبيل الله أبدا، ولكن لا أجد سعة فأحملهم ولا يجدون سعة ويشق عليهم أن يتخلفوا عني، والذي نفس محمد بيده لوددت أن أغزو في سبيل الله فأقتل ثم أغزو فأقتل ثم أغزو فأقتل))

ప్రవక్త ﷺ ప్రబోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అల్లాహ్ తన మార్గంలో వెళ్ళిన వ్యక్తి పూచి తీసుకున్నాడు. (అల్లాహ్ ఇలా చెప్పాడుః) “అతడు నన్ను విశ్వసించి, నా ప్రవక్తలను ధృవీకరించి, నా మార్గంలో వెళ్ళాడు గనుక అతడ్ని స్వర్గంలో లేక (దైవదారిలో పోరాడిన) ప్రతిఫలం లేదా విజయధనంతో ఇంటికి చేర్పించు బాధ్యత నాది”. (ప్రవక్త ﷺ చెప్పారుః) ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! అల్లాహ్ మార్గంలో గాయపడితే, ఆ గాయపడిన వీరుడు, ఇప్పుడిప్పుడే గాయపడిన విధంగా ప్రళయదినాన (అల్లాహ్ సమక్షంలో) వస్తాడు. ఆ గాయము రంగు రక్తందే, దాని వాసనలో కస్తూరి సువాసన ఉంటుంది. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! విశ్వాసులకు బాధగా లేకుంటే నేను అల్లాహ్ మార్గంలో వెళ్ళే ఏ సైన్యం వెంట వెళ్ళకుండా ఇక్కడ ఉండేవాడ్ని కాను. వారిని నా వెంట తీసుకొని వెళ్ళే స్తోమత నాలో లేదు. వారు స్వయంగా వెళ్ళుటకు వారిలో స్తోమత లేదు. నేను వారిని వదలిపోయినచో వారు బాధపడుతారు. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి! అల్లాహ్ మార్గంలో పోరాడాలి, షహీద్ అయిపోవాలి. మళ్ళీ పోరాడాలి, షహీద్ అయిపోవాలి. మళ్ళీ పోరాడాలి, షహీద్ అయిపోవాలని నా కోరిక”. (బుఖారి, ముస్లిం).

وعن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((ما يجد الشهيد من مس القتل إلا كما يجد أحدكم من مس القرصة))

“అల్లాహ్ మార్గంలో షహీద్ అయ్యే వ్యక్తి వధించబడేటప్పుడు మీలో గిచ్చబడిన వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ అతనికి కలుగుతుంది” అని ప్రవక్త ﷺ చెప్పారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (తిర్మిజి).

وعن أنس ™ أن النبي ﷺ قال: ((ما أحد يدخل الجنة يحب أن يرجع إلى الدنيا وله ما على الأرض من شيء إلا الشهيد يتمنى أن يرجع إلى الدنيا فيقتل عشر مرات، لما يرى من الكرامة))

అనసు ﷺ కథనం: ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “స్వర్గంలో చేరిన ఏ ఒక్కడూ ప్రపంచములోకి తిరిగి రావాలని కోరుకోడు. అతనిదేమున్నదని ఈ భూమిలో అలా కోరడానికి, కాని షహీద్ తను ప్రపంచంలో తిరిగి రావాలని, పదేపదే షహాదత్ (అమరత్వం) పొందాలని కోరుకుంటాడు. ఎందుకనగా అందులో ఉన్న గౌరవము, విలువను అతడు చూస్తాడు”. (బుఖారి, ముస్లిం).

وعن عبد الله عمرو ™ أن رسول الله ﷺ قال: ((يغفر الله للشهيد كل شيء إلا الدين))

“అల్లాహ్ షహీద్ యొక్క అప్పు తప్ప అన్నిటినీ క్షమిస్తాడు” అని ప్రవక్త ﷺ చెప్పారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

విశేషాలుః

1- జిహాద్ స్థానం చాలా గొప్పది. స్వర్గ ప్రవేశానికి అది గొప్ప కారణం.

2- షహీద్ ప్రతిఫలం చాల గొప్పది. అతను వధించబడుతున్నప్పుడు చాలా స్వల్పంగా బాధ కలుగుతుంది.

3- పాపాల విమోచనానికి షహాదత్ గొప్ప కారణం.

  • షహీద్ అంటే అమరవీరుడు. షహాదత్ అంటే అమరత్వం పొందుట.

57- ప్రవక్త సహచరులు – జిహాద్

عن أنس ™ قال: انطلق رسول الله ﷺ وأصحابه حتى سبقوا المشركين إلى بدر وجاء المشركون، فقال رسول الله ﷺ: ((لا يَقدِمَنَّ أحد منكم إلى شيء حتى أكون أنا دونه)) فدنا المشركون، فقال ﷺ: ((قوموا إلى جنة عرضها السماوات والأرض)) فقال عمير بن الحِمام: يا رسول الله! جنة عرضها السماوات والأرض؟ قال: ((نعم)) قال: بخ بخ! فقال رسول الله ﷺ: ((ما يحملك على قولك بخ بخ؟)) قال: لا يا رسول الله إلا رجاءَ أن أكون من أهلها، قال: ((فإنك من أهلها)) فأخرج تمرات من قَرَنه فجعل يأكل منهن ثم قاتلهم حتى قتل.

అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ మరియు ఆయన సహచరులు అవిశ్వాసులకంటే ముందు బద్ర్ మైదానంలో చేరుకున్నారు. ఆ తర్వాత అవిశ్వాసులు చేరారు. అప్పుడు ప్రవక్త ﷺ “మీలో ఏ ఒక్కరు నన్ను కాదని ఏ విషయానికైనా ముందుకు వేళ్ళకూడదు” అని చెప్పారు. అవిశ్వాసులు మరింత దగ్గరయ్యాక “లేండి! భూమ్యాకాశాల వైశాల్యం గల స్వర్గం వైపునకు లేచి నిలబడండి” అని ఆజ్ఞ ఇచ్చారు. అమైర్ బిన్ హిమాం అను ఒక అనుచరుడు ‘భూమ్యాకాశాల వైశాల్యముగల స్వర్గమా?’ అని అడిగాడు. ప్రవక్త ﷺ “అవును” అన్నాక, అతను బఖ్ బఖ్ అని అన్నాడు. “బఖ్ బఖ్ అంటేమిటి? అలా ఎందుకన్నావు” అని ప్రవక్త అతడ్ని మందలించారు. దానికి అతడు ‘ఏమి లేదు ప్రవక్తా! నేను ఆ స్వర్గవాసుల్లో ఒకన్ని కావాలన్న కాంక్ష మాత్రమే’ అని సమాధానమిచ్చాడు. “అయితే వారిలో నీవు ఒకడివి అవుతావు” అని ప్రవక్త ﷺ అతనికి శుభవార్త ఇచ్చారు. ఆ తరువాత అతడు అమ్ములపొది నుంచి ఖర్జూరములు తిని, యుద్ధములో పాల్గొని షహీద్ అయ్యాడు. (ముస్లిం).

وعن أنس ™ قال: غاب عمي أنس ين النضر ™ عن قتال بدر، فقال: يا رسول الله لئن الله أشهدني قتال المشركين ليرين الله ما أصنع. فلما كان يوم أحد صنع هؤلاء ـ يعنىالمشركين ـ ثم تقدم فاستقبله سعد بن معاذ فقال: يا سعد بن معاذ! الجنة ورب النضر إني أجد ريحها من دون أحد، فقال سعد: فما استطعت يا رسول الله ما صنع، قال أنس: فوجدنا به بضعا وثمانين ضربة بالسيف أو طعنة برمح أو رمية بسهم.

అనస్ రజియల్లాహు అన్హు  కథనం: బద్ర్ యుద్ధంలో నా పినతండ్రి అనసుబ్ను నజర్ పాల్గొన లేకపోయాడు. అతడు ప్రవక్త ﷺ తో కలిసినప్పుడు ప్రవక్తా! అవిశ్వాసులతో జరిగే యుద్ధంలో పాల్గొనే భాగ్యం ఒక వేళ అల్లాహ్ నాకు ప్రసాదిస్తే నేను ఎలా పోరాడుతానో అల్లాహ్ తప్పక చూస్తాడు అని చెప్పాడు. (ఆ రోజు వచ్చేసింది) అది ఉహద్ రోజు. అవిశ్వాసులు ఏమి చేయాలనుకున్నారో (అది చేసి తీరడానికి సంసిద్ధమై వచ్చేశారు. ఇటు ప్రవక్త ﷺ మరియు ఆయన సహచరులు వచ్చారు). అనసుబ్ను నజర్ కూడా (ప్రవక్తతో చేసిన తన వాగ్దానాన్ని పూర్తి చేయుటకు) బయలుదేరాడు. ఎదురుగా సఅద్ బిన్ మఆజ్ రజియల్లాహు అన్హు  కలిశాడు. అతన్ని చూసి, సఅద్ బిన్ మఆజ్! నజర్ ప్రభువు సాక్షిగా! నేను ఉహద్ అటు వైపు  నుండి స్వర్గ పరిమళాన్ని ఆఘ్రాణిస్తున్నాను అని చెప్పాడు. తరువాత సఅద్, అనసుబ్ను నజర్ యొక్క విషయాన్ని ప్రవక్త ﷺ యదుట ప్రస్తావిస్తూ నేను అలా చేయలేకపోయాను అని వాపోయేవారు. అనసుబ్ను మాలిక్ రజియల్లాహు అన్హు  ఆయన గురించి ఇలా చెప్పారు. (ఆ ఉహద్ రోజున అనసుబ్ను నజర్ ధైర్యంగా పోరాడి, ఎందరో అవిశ్వాసుల్ని హతమార్చి తానూ షహీద్ అయ్యారు). ఆయన దేహముపై 80కి పైగా ఖడ్గం, బాణం మరియు బల్లెముల గాయాలు చూశాము. (బుఖారి, ముస్లిం).

وعن شداد بن الهاد ™ أن رجلا من الأعراب جاء إلى النبي ﷺ فآمن به واتبعه، ثم قال: أهاجر معك، فأوصى به النبي ﷺ بعض أصحابه، فلما كانت غزاة غَنِمَ النبي شيئا فقسم وقسم له، فأعطى أصحابه ما قسم له، وكان يرعى ظهرهم، فلما جاء دفعوا إليه فقال: ما هذا؟ قالوا: قِسمٌ قسم لك النبي ﷺ، فأخذه فجاء إلى النبي ﷺ فقال: ما هذا؟ قال: ((قسمة لك)) قال: ما على هذا اتبعك ولكن أتبعك على أن أرمى ههنا ـ وأشار إلى حلقه ـ بسهم فأموت فأدخل الجنة، فقال: إن تصدق الله يصدقك، فلبثوا قليلا ثم نهضوا في قتال العدو، فأتي به النبي يحمل قد أصابه سهم حيث أشار فقال النبي ﷺ: ((أهو هو؟)) قالوا: نعم، قال: ((صدق الله فصدق)).

షద్దాద్ బిన్ హాద్ రజియల్లాహు అన్హు  కథనం: ఒక గ్రామీణుడు ప్రవక్త ﷺ వద్దకు వచ్చి, ప్రవక్తను విశ్వసించి అనుసరించ గలిగాడు. (ప్రవక్త, విశ్వాసులు మక్కాను వదలి మదీన వలసపోయే రోజుల్లో) ప్రవక్తా! నేను కూడా మీతో వెళ్తాను అని కోరాడు. ప్రవక్త ﷺ తమ సహచరులకు అతని విషయమున వసియ్యతు చేశారు. (మదీన వచ్చిన తరువాత) ఒక యుద్ధంలో ప్రవక్త ﷺ విజయ ధనం పొందారు. దాన్ని పంపిణి చేసేటప్పుడు ఒక వాట అతనికి తీశారు. అతను మదీనవాసుల ఒంటెల కాపరి గనుక ఆ సందర్భంలో లేనందున ఆ వాటా (ప్రవక్త ﷺ) తమ సహచరులకు ఇచ్చారు. అతను (సాయంకాలం) వచ్చిన తరువాత, వారు అతని వాట అతనికి ఇచ్చారు. (దాన్ని చూసి నివ్వెరపోయి) ‘ఇదేమిటి?’ అని అతను ప్రశ్నించగా ‘ఇది విజయధనంలోని నీ వాట, నీకు ప్రవక్త ﷺ ఇచ్చారు అని వారు బదులు చెప్పారు. అది తీసుకొని ప్రవక్త వద్దకు వచ్చి ‘ఇదేమిటి? ప్రవక్తా’ అని ప్రశ్నించాడు. “ఇది నీ వాట” అని సమాధానమిచ్చారు ప్రవక్త ﷺ. ‘నేను ఇందుకు కాదు మిమ్మల్ని అనుసరించేది, ఇక్కడ – తన గొంతు వైపు వ్రేళు చూపుతూ- బాణము తగిలి షహీద్ అయి స్వర్గంలో చేరాలని మిమ్మల్ని అనుసరించేది’ అని తన లక్ష్యాన్ని తెలియబరచాడు. ప్రవక్త ﷺ చెప్పారుః “నీ ఈ మాటను నీవు నీ ఆచరణతో నిరూపిస్తే అల్లాహ్ తన వాగ్దానాన్ని పూర్తిచేస్తాడు. (అంటే నీకు అదే విధంగా షహాదత్ ప్రసాదిస్తాడు”). ఆ తరువాత కొద్ది రోజుల్లో ఒక యద్ధం జరిగింది. (విశ్వాసులతో పాటు అతనూ పాల్గొని అందులో షహీద్ అయ్యాడు). అతని మృతదేహాన్ని ప్రవక్త వద్దకు తీసుకురావడం జరిగింది. అతను ఏ విధంగా షహాదత్ పొందాలని ఒకప్పుడు ప్రవక్త యదుట తెలియబరచాడో, అదే విధంగా అతని కంఠంలో బాణం తగిలి దాని మూలంగానే అతను షహీద్ అయ్యాడు. అతన్ని చూసి, “ఇతను ఆ వ్యక్తియే కదా?” అని ప్రవక్త అడుగగా, సహచరులు అవును అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు. “తన మాటను తన ఆచరణ ద్వారా నిరూపించాడు గనుక అల్లాహ్ అతనికి తను కోరుకున్న విధంగా షహాదత్ ప్రసాదించాడు”. (నసాయి).  

విశేషాలుః

1- సహచరుల విశ్వాస బలం, అల్లాహ్ మార్గంలో పోరాడుతూ షహాదత్ పొందాలనే కోరిక ఎంతగా ఉండేదో తెలుస్తుంది.

2- వారి ధైర్యం, శౌర్యం మరియు సత్కార్యాల కోసం ఎలా ముందుండే వారో తెలుస్తున్నది.

58- ముస్లిముల అవసరాలు తీర్చు ఘనత

عن ابن عمر ™ أن رسول الله ﷺ قال: ((المسلم أخو المسلم لايظلمه ولا ييسلمه، ومن كان في حاجة أخيه كان الله في حاجته، ومن فرج عن مسلم كربة فرج الله عنه بها كربة من كرب يوم القيامة، ومن ستر مسلما ستره الله يوم القيامة))

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఒక ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. కనుక అతనికి ఏలాంటి అన్యాయం చేయడు. అతన్ని నిస్సహాయ స్థితిలో వదడు. ఎవరైతే తన సోదరుడి అవసరాన్ని తీరుస్తూ ఉంటారో, అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు. ఎవరైతే ఒక ముస్లిం యొక్క లోటుపోట్లను మరుగుపరుస్తాడో, అతని తప్పిదాలను అల్లాహ్ కప్పి పుచ్చుతాడు”. (బుఖారి, ముస్లిం).  

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: ((من نفس عن مؤمن كربة من كرب الدنيا نفس الله عنه كربة من كرب يوم القيامة، ومن يسر على معسر يسر الله عليه في الدنيا والآخرة، ومن ستر مسلما ستره الله في الدنيا والآخرة، والله في عون العبد ما كان العبد في عون أخيه، وما اجتمع قوم في بيت من بيوت الله يتلون كتاب الله ويتدارسونه فيما بينهم إلا نزلت عليهم السكينة، وغشيتهم الرحمة، وحفتهم الملائكة وذكرهم الله فيمن عنده، ومن بطأ به عمله لم يسرع به نسبه))

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  తెలిపారుః “ఇహలోకం లో ఒక విశ్వాసునికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్ని ఎవరైతే దూరం చేస్తాడో, పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఋణ- గ్రస్తునికి వ్యవధి ఇస్తాడో, ఇహపరాల్లో అతడికి అల్లాహ్ సుఖసంపదలు నొసంగుతాడు. ఎవరైతే విశ్వాసుని లోపాల్ని మరుగుపరుస్తాడో, ఇహపరాల్లో అతని దోషములను అల్లాహ్ కప్పి పుచ్చుతాడు. ఏ మానవుడైతే తన సోదరుడి సహాయంలో ఉంటాడో అల్లాహ్ అతని సహాయములో ఉంటాడు. ఎవరైతే అల్లాహ్ గ్రంథాన్ని పఠించుటకు, నేర్చుకొనుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహంలో సమావేశమవుతారో వారిపై శాంతం అవతరిస్తుంది. ఆయన కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని ముట్టడించుకుంటారు. తన సమీపంలోనున్న దూతల్తో అల్లాహ్ గర్వంగా వారి గురించి ప్రస్తావించి, వారిని ప్రశంసిస్తాడు. అయితే ఎవరైతే తమ ఆచరణలో వెనకబడతారో వారి వంశం వారి పురోగతికి తోడ్పడదు”. (ముస్లిం).

విశేషాలుః

1- విశ్వాసుల అవసరాలను తీర్చుట, ప్రత్యేకంగా నిరుపేదల, బలహీనుల అవసరాలను తీర్చుట చాలా ఘనతగల విషయం.

2- మస్లిం సోదరునికి సహాయపడే వారికి, వారి నిస్సహాయ స్థితిలో అల్లాహ్ సహాయపడతాడు.

59- బిద్అత్ నుండి దూరముండి, ప్రవక్త ﷺ  ను అనుసరించుట విధి

[قُلْ اِنْ كُنْتُمْ تُحِبُّونَ اللهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللهَ وَيَغْفِرْلَكُمْ ذُنُوبَكُمْ] آل عمران 31

నీవు ప్రజలకు ఇలా చెప్పుముః మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. (3: ఆలె ఇమ్రాన్: 31).

[فَلاَ وَرَبِّكَ لاَ يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لاَ يَجِدُونَ فِي أَنْفُسِهِمْ حَرَجاً مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيْمًا] النساء 65

నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనుస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానిని యధాతథంగా శిరసావహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. (4: నిసా: 65).  

عن عائشة رضي الله عنها قالت: قال رسول الله ﷺ: ((من أحدث في أمرنا هذا ما ليس منه فهو رد)) متفق عليه. وفي رواية: ((من عمل عملا ليس عليه أمرنا فهو رد))

ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారని, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ఇస్లాంలో ఎవరైతే కొత్త విషయాన్ని ప్రవేశపెడతారో అది రద్దు చేయబడుతుంది”. (బుఖారి, ముస్లిం). మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః “ఏ పని గురించైతే మా ఆదేశం లేదో ఆ పని ఎవరైనా చేసినచో అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు”. (ముస్లిం).

عن العرباض بن سارية ™ قال: وعظنا رسول الله ﷺ موعظة بليغة، وجلت منها القلوب وذرفت منها العيون، فقلنا: يا رسول الله! كأنها موعظة مودع فأوصنا، قال: ((أوصيكم بتقوى الله والسمع والطاعة وإن تأمَّر عليكم عبد حبشي، وإنه من يعش منكم فسيرى اختلافا كثيرا فعليكم بسنتي وسنة الخلفاء الراشدين المهديين عضوا عليها بالنواجذ، و إياكم ومحدثات الأمور فإن كل بدعة ضلالة))

ఇర్బాజ్ బిన్ సారియ రజియల్లాహు అన్హు  కథనం: ఒకసారి ప్రవక్త ﷺ బ్రహ్మాండమైన ఉపన్యాసమిచ్చారు. హృదయాలు కంపించిపోయాయి. కంటి ఆశ్రువులు కారాయి. అయితే మేమన్నాముః ఓ ప్రవక్తా! ఇది మీ అంతిమ ప్రసంగంగా మాకు అనిపిస్తున్నది. మాకు వసియ్యత్ చేయండి అనగా ప్రవక్త ﷺ ఈ విధంగా వసియ్యత్ చేశారుః “అల్లాహ్ కు భయభక్తులు కలిగి ఉండండి. మీ నాయకుడు ఇథోపియాకు చెందిన వ్యక్తి అయినప్పటికి మీరు అతని మాట వినండి. విధేయత పాటించండి. నా తరువాత మీలో బ్రతికియున్నవారు అనేక విబేధాలు చూస్తారు. అలాంటప్పుడు మీరు నా పద్దతి, నా సాంప్రదాయాన్ని మరియు సన్మార్గంపై ఉన్న ఖులఫాయె రాషిదీన్ పద్దతిని ఆవశ్యకమైనదిగా భావించండి. దాన్ని దౌడపళ్ళతో గట్టిగా పట్టుకోండి. జాగ్రత్తా! (ధర్మంలో) క్రొత్త క్రొత్త విషయాలు ప్రవేశపెట్టకండి. ప్రతి క్రొత్త విషయం దుర్మార్గం”. (అబూదావూద్, తిర్మిజి).

وعن جابر ™ قال: كان رسول الله ﷺ إذا خطب يقول: ((إن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد ﷺ وشر الأمور محدثاتها وكل بدعة ضلالة))

జాబిర్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ ప్రసంగించినప్పుడల్లా ఇలా ప్రవచించేవారుః “మంచి మాట అల్లాహ్ గ్రంథం యొక్క మాట, మంచి మార్గం ప్రవక్త ముహమ్మద్ ﷺ మార్గం. అన్ని విషయాల్లో చెడు విషయమేమనగా, కొత్త విషయాల్ని (ఇస్లాం ధర్మంలో) ప్రవేశపెట్టడం. ప్రతి కొత్త విషయము దుర్మార్గం”. (ముస్లిం).

విశేషాలుః

1- ఇస్లాం ధర్మంలో కొత్త విషయాల్ని (బిద్అత్) ప్రవేశపెట్టడం నిషిద్ధం. అంటే అల్లాహ్ ఆరాధన ప్రవక్త ﷺ పద్దతికి భిన్నమైన పద్దతిలో చేయుట నిషిద్ధం అని భావం.

2- అది కబీర గునాహ్ గా (మహాపాపాల్లో లెక్కించబడుతుంది. అలాంటి ఆచరణ స్వీకరించబడదు.

3- అన్ని రకాల ‘బిద్అత్’ల నుండి జాగ్రత్తగా, దూరంగా ఉండుట తప్పనిసరి. అన్నియు చెడ్డవీ మరియు దుర్మార్గము.

4- అల్లాహ్ ప్రేమనూ, క్షమాపణం పొందే మార్గం ప్రవక్త ﷺ అనుచరణలోనే ఉంది.

60- ప్రవక్త ﷺ కై దరూద్ పంపు ఘనత

[إنَّ اللهَ وَ مَلاَئِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ، يَأيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيماً]

అల్లాహ్ మరియు ఆయన దూతలు దైవ ప్రవక్తకై దరూద్ ను పంపుతారు. విశ్వాసులారా మీరు కూడా ఆయనకై దరూద్, సలాములు పంపండి. (33: అహ్ జాబ్: 56).

عن عبد الله بن عمرو ™ أنه سمع رسول الله ﷺ يقول: ((من صلى علي صلاة واحدة صلى الله عليه بها عشرا))

“ఏ వ్యక్తి అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో, అతనిపై పది సార్లు అల్లాహ్ కారుణ్యాన్ని కుర్పిస్తాడు” అని ప్రవక్త ﷺ చెప్పగా అబ్దుల్లాహ్ బిన్ అమర్ ﷺ విని, ఉల్లేఖించారు.

عن أوس بن أوس ™ قال: قال رسول الله ﷺ: ((إن من أفضل أيامكم يوم الجمعة فأكثروا عليّ من الصلاة فيه، فإن صلاتكم معروضة عليّ، قالوا: يا رسول الله ﷺ كيف تُعرَض صلاتنا عليك وقد أرِمت؟ قال: إن الله حرّم على الأرض أجساد الأنبياء))

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని, ఔస్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీకున్న రోజుల్లో అన్నిటికన్న మహోత్తరమైన రోజు శుక్రవారం. ఆ రోజు మీరు నాపై దరూద్ అధికంగా పంపండి. మీ దరూద్ నా వరకు చేరుతుంది”. అనుచరులడిగారుః ప్రవక్తా! మీ వరకు దరూద్ ఎలా చేరుతుంది. మీరు చనిపోయి మట్టిలో కలిసిపోతారు కదా? దానికి సమాధానంగా ప్రవక్త ﷺ “అల్లాహ్ భూమిపై ప్రవక్తల దేహాలను నిషిద్ధ పరిచాడు” అని చెప్పారు. (అబూ దావూద్, ఇబ్ను మాజ).

عن أبى هريرة ™ قال: قال رسول الله ﷺ: ((لا تجعلوا قبري عيدا، وصلوا علي فإن صلاتكم تبلغني حيث كنتم))

ప్రవక్త ﷺ ఆదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నా సమాధిని మీరు ‘ఈద్గాహ్’ చేయకండి. నాపై దరూద్ పంపండి. మీరు ఏ ప్రాంతములో ఉన్నా మీ దరూద్ నా వరకు చేర్పించబడుతుంది”.  

وعن أبي هريرة  ™قال: قال رسول الله ﷺ: ((ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام)) أخرجه أبوداود

ప్రవక్త ﷺ ఆదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నాకు సలాం పంపినప్పుడల్లా, అల్లాహ్ నా ఆత్మను నా దేహములో పంపుతాడు. నేను సలాం పంపిన వ్యక్తికి జవాబిస్తాను”. (అబూ దావూద్).

 عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((رغم أنف رجل ذكرت عنده فلم يصل علي)) أخرجه الترمذي

ప్రవక్త ﷺ ఆదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి యెదుట నేను ప్రస్తావించబడుతానో, అతడు నాపై దరూద్ పంపనిచో అతని ముక్కు మట్టిలో కలువుగాకా”. (తిర్మిజి).

విశేషాలుః

1- ప్రవక్త ﷺ పై దరూద్ పంపడం అభిలషణీయం.

2- ప్రత్యేకంగా జుమా రోజున ఎక్కువగా పంపాలి.

3- ప్రవక్త ﷺ పై దరూద్ పంపేవారికి చాల పుణ్యం గలదు.

61- ఋణగ్రస్తునికి వ్యవధి ఇచ్చుటలోని ఘనత

عن حذيفة ™ قال: قال رسول الله ﷺ: ((تلقت الملائكة روح رجل ممن كان قبلكم، فقالوا: أعملت من الخير شيئا؟ قال: لا، قالوا: تذكر، قال: كنت أدين الناس فآمر فتياني أن يُنظِروا المعسر ويتجوزوا عن الموسر، قال: قال الله عزوجل: تجوزوا عنه))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, హుజైఫ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీకంటే ముందు కాలంలో దైవదూతలు ఒక వ్యక్తి ఆత్మతో కలసి, ‘నీవు ఏదైనా సత్యార్యం చేసియున్నావా?’ అని అడిగారు. అతను ‘లేదు’ అని బదులిచ్చాడు. వారు ‘గుర్తు తెచ్చుకో’ అనగా అతడన్నాడుః ‘నేను ప్రజలకు అప్పిచ్చేవాణ్ణి, తర్వాత నా పనివాళ్ళకు ఇలా ఆదేశించేవాణ్ణిః బీదవాడైన ఋణగ్రస్తునికి వీలయినంత వ్యవధి ఇవ్వండి. కలిమిలో నున్న ఋణగ్రస్తుని పట్ల మెతకవైఖరి అవలంభించండి. ఆ తర్వాత ప్రవక్త ﷺ అతని గురించి ఇలా చెప్పారుః “అతన్ని మన్నించండి” అని అల్లాహ్ చెప్పాడు. (ముస్లిం).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: ((كان رجل يداين الناس فكان يقول لفتاه: إذا أتيت معسرا فتجاوز عنه لعل الله يتجاوز عنا، فلقي الله فتجاوز عنه)) أخرجه مسلم

అబూ హురైర రజియల్లాహు అన్హు  కథనం, ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “ఒక వ్యక్తి ప్రజలకు అప్పు ఇస్తూ తన పనివాళ్ళకు ఇలా చెప్పేవాడుః మీరు నిరుపేద ఋణగ్రస్తుని వద్దకు వసూలుకై వెళ్ళినప్పుడు (అతడు వ్యవధి కోరితే) వ్యవధి ఇవ్వండి. అల్లాహ్ మన పట్ల మన్నింపు వైఖరిని అవలంభించగలడు. అతను చనిపోయిన తర్వాత అల్లాహ్ అతన్ని మన్నించాడు”. (ముస్లిం).

عن أبي قتادة ™ أنه طلب غريما له فتوارى ثم وجده، فقال: إني معسر، فقال: آلله؟ قال: آلله، قال: فإني سمعت رسول الله يقول: ((من سره أن ينجيه الله من كرب يوم القيامة فلينفس عن معسر أو يضع عنه))

అబూ ఖతాద రజియల్లాహు అన్హు  కథనం: అతను తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తి వద్దకు వసూలుకై వెళ్ళినప్పుడు (ఋణగ్రస్తుడు అబూ ఖతాదను చూసి) దాక్కున్నాడు. మళ్ళీ అతను కలసి ‘నేను చాలా పస్తుల్లో ఉన్నాను’ అని అన్నాడు. ‘అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పగలవా?’ అని అబూ ఖతాద అడగగా, ‘అల్లాహ్ ప్రమాణం చేసి చెప్ప గలను’ అని అన్నాడు. అప్పుడు అబూ ఖతాద రజియల్లాహు అన్హు  ఇలా చెప్పారుః ‘నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానుః “ప్రళయ దినాన కలిగే వ్యధా భరితమైన శిక్ష నుండి తమను అల్లాహ్ రక్షించడాన్ని ఇష్టపడేవవారు ఋణగ్రస్తునికి వీలయినంత వ్యవధి ఇవ్వాలని లేదా అతనిపై నుండి ఋణ భారాన్ని పూర్తిగా మన్నించివేయాలి”. (ముస్లిం).

విశేషాలుః

1- పస్తుల్లో ఉన్న ఋణగ్రస్తునికి వ్యవధి ఇచ్చుట లేదా అప్పును మన్నించుటలో ఘనత చాలా ఉంది.

2- ప్రళయదినాన కలిగే కష్టాల నుండి రక్షణకు అదీ ఒక కారణం.

3- అది అల్లాహ్ మన్నింపును పొందుటకు కూడా ఒక మార్గం.

62- వడ్డీ – దాని నుండి హెచ్చరిక

[اَلَّذِينَ يَاْكُلُونَ الرِّبَوا لاَ يَقُومُونَ اِلاَّ كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ذَلِكَ بِاَنَّهُمْ قَالُوْا اِنَّمَا الْبَيْعُ مِثْلَ الرِّبَوا وَ اَحَلَّ اللهُ الْبَيْعَ وَ حَرَّمَ الرِّبَوا فَمَنْ جَاءَهُ مَوْعِظَةٌ مِنْ رَّبِّهِ فَانْتَهَى فَلَهُ مَا سَلَفَ وَاَمْرُهُ اِلَى اللهِ وَمَنْ عَادَ فَاُولَئِكَ اَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُون،َ يَمْحَقُ اللهُ الرِّبَوا وَيُرْبِى الصَّدَقَاتِ وَاللهُ لاَ يُحِبُّ كُلُّ كَفَّارٍ اَثِيمٍ] البقرة 275،276

వడ్డీ తినేవారి స్థితి షైతాను సోకడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురికావటానికి కారణం వారు ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు. వడ్డీని నిషిద్ధం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి, అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. (2: బఖర: 275, 276).

[يَاَ اَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبوا اِنْ كُنْتُمْ مُؤْمِنِين فَاِنْ لَمْ تَفْعَلُوا فَاْذَنُوا بِحَرْبٍ مِنَ اللهِ وَرَسُولِهِ] البقرة 278،279

విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్డడకు భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడచిపెట్టండి. కాని ఒకవేళ  మీరు అలా చెయ్యకపోతే మీపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. (2: బఖరః 278,279).

عن أبي هريرة ™ عن النبيﷺ قال: (( اجتنبوا السبع الموبقات))، قالوا: يا رسول الله وما هنّ؟ قال: ((الشرك بالله، والسحر، وقتل النفس التي حرّم الله إلاّ بالحق، وأكل الربا، وأكل مال اليتيم، والتولي يوم الزحف، وقذف المحصنات المؤمنات الغافلات))

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఇలా ఉల్లేఖించారుః ఒక సారి ప్రవక్త ﷺ అనుచరల్ని ఉద్దేశించి, “మిమ్మల్ని సర్వ నాశనం చేసే పనులకు దూరంగా ఉండండ”ని హెచ్చరించారు. ‘ఆ పనులేమిటి పవక్తా? అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారుః “(1) అల్లాహ్ కు సాటి కల్పిచడం. (2) చేతబడి. (3) ధర్మసమ్మతంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం. (4) వడ్డీ సొమ్ము తినడం. (5) అనాధ సొమ్మును హరించి వేయడం. (6) ధర్మ యుద్ధంలో వెన్ను జూపి పారిపోవడం. (7) ఏ పాపమెరగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం”. (బుఖారి, ముస్లిం).

عن ابن مسعود  ™قال: (لعن رسول الله ﷺ آكل الربا وموكله).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  కథనం: వడ్డీ సొమ్ము తినేవాడు, తినిపించువాడు ఇద్దరినీ ప్రవక్త ﷺ శపించారు. (ముస్లిం).

విశేషాలుః

1- చాలా కఠినంగా వడ్డీ నిషేధించబడింది. అది వినాశానికి గురి చేసే మహా పాపాల్లో ఒకటి.

2- అది బర్కత్ (శుభము)ను హరింపజేస్తుంది. హఠము సాధించి వడ్డీ తినేవారు అల్లాహ్, ఆయన ప్రవక్త ﷺ తో యుద్ధానికి సిద్ధమైన వారగుదురు.

3- వడ్డీ తినువారు ప్రవక్త ﷺ నోట శాపగ్రస్తులయ్యారు.

63- ఖుర్ఆన్ పారాయణ ఘనత

عن ابى هريرة ™ قال: قال رسول الله ﷺ: ((أيحب أحدكم إذا رجع الى اهله ان يجد فيه ثلاث خلفات عظام سمان؟)) قلنا: نعم، قال: ((فثلاث آيات يقراهن احدكم في صلاته خير له من ثلاث خلفات عظام))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీలో ఒక వ్యక్తి తన ఇంటికి పోయినప్పుడు అక్కడ అతనికి బలిసిన, చూలుగల మూడు ఒంటెలు లభించడం సంతోషమేనా, ఇష్టమేనా? అని అడిగారు ప్రవక్త ﷺ. ‘అవును’ అని మేమన్నాము. అప్పుడు ప్రవక్త ﷺ “మీలో ఒక వ్యక్తి నమాజులో మూడు ఆయతులు చదివాడంటే అది అతనికి బలసిన, చూలుగల మూడు ఒంటెలకంటే ఎంతో ఉత్తమం” అని విశదపరిచారు. (ముస్లిం).

عن عبد الله بن مسعود ™ قال: قال رسول الله ﷺ: ((من قرأ حرفا من كتاب الله  فله حسنة، والحسنة بعشر أمثالها، لا اقول: الم حرف، ولكن ألف حرف، ولام حرف، وميم حرف،)) أخرجه الترمذي

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ﷺ ఉల్లేఖించారుః “ఎవరైతే అల్లాహ్ (పంపిన దివ్య) గ్రంథం నుండి ఒక్క అక్షరం చదువు-తారో వారికి ఒక్క పుణ్యం. ఒక్క పుణ్యం పది రెట్లు ఎక్కువ లభించును. అలిఫ్, లాం, మీమ్ ను ఒక్క అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక్క అక్షరం. లామ్ ఒక్క అక్షరం. మీమ్ ఒక్క అక్షరం”. (తిర్మిజి).

عن عائشة رضي الله عنها قالت: قال رسول الله ﷺ: ((الذي يقرأ القرآن وهو ماهر به مع السفرة الكرام البررة، والذي يقرأ القرآن ويتعتع فيه وهو عليه شاق له اجران))

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారని, ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ కంఠస్తం చేసినవారు విధేయులైన, గౌరవనీయులైన దైవదూతలతో ఉంటాడు. మరొక వ్యక్తి ఖుర్ఆన్ పఠించడం అతనికి ఎంతో ప్రయాసతో కూడిన పని. అయినప్పటికీ దాన్ని పఠించి కంఠస్తం చేస్తాడు. అలా రెట్టింపు పుణ్యానికి అర్హుడవుతాడు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఖుర్ఆన్ పారయణం ఘనత తెలిసింది.

2- ఒక్కో అక్షరానికి ఒక్కో పుణ్యం.

3- ఖుర్ఆన్ కంఠపాటి స్వర్గంలో గౌరవనీయులైన దైవదూతలతో ఉంటాడు.

4- కష్టం, ప్రయాసంతో ఖుర్ఆన్ పఠించు వ్యక్తికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.

64- సూరె బఖర, ఆలె ఇమ్రాన్ ఘనత

عن أبي هريرة ™ أن رسول الله قال ﷺ: ((لا تجعلوا بيوتكم مقابر، إن الشيطان ينفر من البيت الذي تقرأ فيه سورة البقرة))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మీరు మీ గృహాలను శ్మశానంగా మార్చకండి. ఏ ఇంట్లో సూరె బఖర పారాయణం జరుగుతుందో ఆ ఇంటి నుండి షైతాన్ అతి దూరంగా ఉంటాడు”. (ముస్లిం).

عن أبي أمامة الباهلي ™ قال: سمعت رسول الله يقولﷺ: ((اقرؤوا القرآن فإنه يأتي يوم القيامة شفيعا لأصحابه، اقرؤوا الزهراوين البقرة و سورة آل عمران فإنهما تأتيان يوم القيامة كأنهما غمامتان ـ أو كأنهما غيايتان ـ أو كأنهما فرقان من طير صوافٍّ تحاجّان عن أصحابهما، اقرؤوا سورة البقرة فإنّ أخْذَها برَكة وتركها حسرة ولا تستطيعها البطلة))

“ఖుర్ఆన్ చదవండి. అది ప్రళయదినాన తన్ను చదివినవారి పట్ల సిఫారసు చేస్తుంది. రెండు పుష్పములుః సూరె బఖర, సూరె ఆలె ఇమ్రాన్ చదవండి. అవి రెండు మేఘాలుగా లేక రెండు వరుసలో ఎగురుతున్న పక్షుల్లాగా ప్రళయదినాన వస్తాయి. వాటిని చదివినవారి పట్ల అవి వాదిస్తాయి. సూరె బఖర చదవండి. దాన్ని చదివితే భాగ్యం. విడనాడితే దుర్భాగ్యం. మాంత్రికులకు అది సాధ్యపడదు” అని ప్రవక్త ﷺ తెలిపారని అబూ ఉమామ బాహిలీ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن أبي مسعود ™ قال: قال النبي ﷺ: ((من قرأ الآيتين من آخر سورة البقرة في ليلة كفتاه))

ప్రవక్త ﷺ ప్రవచించారని, అబూ మస్ఊద్ ఉల్లేఖించారుః “బఖరా సూరాలోని చివరి రెండు ఆయతుల్ని రాత్రి వేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- సూరె బఖర, సూరె ఆలె ఇమ్రాన్ ఘనత.

2- వాటిని చదివినవారి (మోక్షం కొరకు అల్లాహ్ తో) అవి వాదిస్తాయి.

3- సూరె బఖర చదువుతే ఇంటి నుండి షైతాన్ దూరమవుతాడు.

4- సూరె బఖరలోని చివరి రెండు ఆయతుల ఘనత.

65- అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయు ఘనత

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((ما من يوم يصبح العباد فيه إلاّ ملكان ينزلان فيقول أحدهما: اللهمّ أعط منفقا خلفا، ويقول الآخر: اللهمّ أعط الممسك تلفا))

“ప్రతి రోజు ఉదయం ప్రజలు నిద్ర నుండి మేల్కొనగానే ఇద్దరు దూతలు అవతరిస్తారు. వారిలో ఒకరు అల్లాహ్ ను ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్! దానం ఇచ్చేవాడికి మరింత ప్రసాదించు అని. రెండో దూత ఓ అల్లాహ్! పిసినారి సంపదను నాశనం చెయ్యి అని ప్రార్థిస్తారు” అని ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు.  

عن ابي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((ما نقصت صدقة من مال، وما زاد الله عبدا بعفوٍ إلاّ عِزًّا، وما تواضع أحدٌ لله إلاّ رفعه الله عزّوجلّ))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “సదఖా వల్ల సంపాదనలో కొరత ఏర్పడదు. మన్నింపు వైఖరి అవలంభించిన దాసుని గౌరవాన్ని అల్లాహ్ ద్విగుణీకృతం చేస్తాడు. ఎవరైతే అల్లాహ్ కొరకు వినమ్రుడవుతాడో అల్లాహ్ అతన్ని ఉన్నతునిగా చేస్తాడు”. (ముస్లిం).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((من تصدّق بعدل تمرة من كسب طيّبٍ ولا يقبل الله إلا الطيب، فإن الله يقبلها بيمينه ثم يربِّيها لصاحبها، كما يربّي أحدكم فُلُوَة حتى تكون مثل الجبل))

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా

సెలవిచ్చారుః “అల్లాహ్ వద్దకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే అల్లాహ్ దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం లాగా పెరిగిపోతుంది”. (బుఖారి, ముస్లిం).

عن ابن مسعود ™ قال: قال رسول الله ﷺ: ((لا حسد إلاّ في اثنتين: رجل آتاه الله مالاً فسلّطه على هَلَكته بالحق، ورجل آتاه الله الحكمة فهو يقضي بها ويعلمها))

ప్రవక్త ﷺ ఇలా బోధించారని, ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరుః అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు సత్కార్యాల్లో వినియోగించే వ్యక్తి. రెండోవాడుః అల్లాహ్ (ఖుర్ఆన్, హదీసు) విద్య ప్రసాదించగా దాన్ని రేయింబవళ్ళు చదివించడంలో, దానికనుగుణంగా తీర్పు చేయడంలో నిమగ్నుడయి ఉండే వ్యక్తి”. (బుఖారి, ముస్లిం).

[لاَ خَيْرَ فِي كَثِيرٍ مِّنْ نَّجْوَاهُمْ إِلاَّ مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلاَحٍ بَيْنَ النَّاسِ وَمَنْ يَفْعَلْ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا] النساء: 114

ప్రజలు జరిపే రహస్య సమాలోచనల్లో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కానీ ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (4: నిసాః 114).

[وَمَا أَنْفَقْتُمْ مِنْ شَيِءٍ فَهُوَ يُخْلِفُهُ] سبأ:39

మీరు దేన్నైనా ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే (అల్లాహ్) మీకు మరింత ఇస్తాడు. (34: సబా: 39).

عن عبد الله بن الشخير ™ قال: أتيت النبي ﷺ وهو يقرأ [أَلْهَـكُمُ التَّكَاثُرُ] قال: ((يقول ابن آدم: مالي مالي، قال: وهل لك ياابن آدم من مالكَ إلاّ ما أكلتَ فأفنيت، أو لبست فأبليت، أو تصدّقت فأمضيت؟))

ప్రవక్త ﷺ సూరె {అల్ హాకుముత్తకాసుర్} పఠిస్తుండగా నేను చేరుకున్నాను. అప్పుడు ప్రవక్త ﷺ “మానవుడు నా ధనం, నా సంపద అని అంటాడు. ఓ మానవుడా! నీవు తిని నశింపజేసినదీ, ధరించి పాడుచేసినదీ, దానధర్మాలు చేసి ముందుకు పంపుకున్నదీ తప్ప ఇంకెక్కడ? నీ ధనం” అని బోధించారని, అబ్దుల్లాహ్ బిన్ షుఖైర్ రజియల్లాహు అన్హు  కథనం. (ముస్లిం).  

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: (( بينما رجل بفلاة فسمع صوتا في سحابة: اسقِ حديقة فلان، فتنحّى ذلك السحاب فأفرغ ماءه في حرّة، فإذا شرجة من تلك الشراج قد استوعبت ذلك الماء كله، فتتبعَ الماء فإذا رجل قائم في حديقته يحوِّل الماء بمسحاته فقال: يا عبد الله مااسمك؟ قال فلان للاسم الذي سمع في السحابة، فقال له يا عبد الله لِمَ تسالني عن اسمي؟ فقال: إني سمعتُ صوتا في السحاب الّذي هذا ماؤه يقول اسقِ حديقة فلان لاسمك، فما تصنع فيها؟ قال: أمّا إذْ قلتَ هذا فإنّي أنظر إلى ما يخرجُ منها فأتصدّقَ بثلثه وآكل أنا وعيالي ثلثه وأردُّ فيها ثلثه)) 

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త ﷺ ఇలా తెలిపారుః “ఒక వ్యక్తి ఓ మైదానంలో వెళ్తుండగా ఒక మేఘము నుండి ‘ఫలాన తోటలో కుర్పించు’ అని శబ్దం విన్నాడు. ఆ మేఘము పక్కకు జరిగి ఓ బంజరు భూమిలో కురిసింది. అక్కడి నుండి ఆ నీళ్ళన్నియూ ఒక కాలువ గుండా (ఒక తోటలోకి) వెళ్ళాయి. ఆ వ్యక్తి ఆ కాలువను అనుసరించి (ఆ తోటలో ప్రవేశించాడు). అక్కడ ఒక మనిషి తన తోటలో పారతో నీళ్ళు కడుతున్నాడు. (ఈ వ్యక్తి ఆ మనిషిని ఉద్దేశించి) ఓ ‘అబ్దుల్లాహ్’! (అల్లాహ్ దాసుడా) నీ పేరేమిటి? అని అడిగాడు. (ఈ వ్యక్తి) మేఘములో విన్న పేరే ఆ మనిషి చెప్పాడు. ‘అబ్దుల్లాహ్’ నీవు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అని (ఆ మనిషి) అడిగాడు. (కాలువ గుండా పారుతూ వచ్చిన నీళ్ళ వైపు సైగ చేస్తూ) ఈ నీళ్ళు కుర్పించిన మేఘమతో ఫలాన వ్యక్తి తోటలో కుర్పించు అన్న శబ్దం విన్నాను. నీవు చేసేదేమిటి? అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు ఆ మనిషి నీవు అడిగినందుకు చెబుతున్నాను. (లేకుంటే నేను చెప్పేవాణ్ణి కానుః కోత అయి, పంట ఇంట్లో) తెచ్చిన తర్వాత దాన్ని చూసి మూడు భాగాలు చేసి, ఒక భాగము దానం చేస్తాను. ఒక భాగము నా పిల్లలు నేను తింటాము. మరొక భాగము (విత్తనంగా) తిరిగి భూమిలో వేస్తాను”. (ముస్లిం).

[وَمَا تُنْفِقُوا مِنْ خَيْرٍ فَلأَنْفُسِكُمْ] البقرة: 272

మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. (2: బఖరః 272).

عن عقبة بن عامر ™ قال: سمعت رسول الله ﷺ يقول: ((كل امريء في ظلّ صدقته حتى يُفصل بين الناس))

“ప్రజల తీర్పు పూర్తి అయ్యే వరకు ప్రతి వ్యక్తీ తన దానధర్మాల ఛాయలో ఉంటాడు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు  అల్లేఖించారు. (అహ్మద్).   

عن عدي بن حاتم ™ أن رسول الله ﷺ قال: (( اتقوا النار ولو بشق تمرة))

“ఒక ఖర్జూరపు ముక్క అయినా సరే దానం చేసి, నరకాగ్ని నుండి

మిమ్మల్ని మీరు కాపాడుకోండి” అని ప్రవక్త ﷺ ఉపదేశించగా నేను విన్నాను అని అదీ బిన్ హాతిం ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: ((إذا مات ابن الإنسان انقطع عمله إلاّ من ثلاث: إلاّ من صدقة جارية، أو علم ينتفع به، أو ولد صالح يدعو له))

ప్రవక్త ﷺ ప్రబోధించారని, అబూ హురైర ﷺ ఉల్లేఖించారుః “మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణలు అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. (1) సదఖ జారియ (సుదీర్ఘ కాలం వరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం) (2) ప్రయోజనకరమయిన విద్యాజ్ఞానం. (3) అతనికై ప్రార్థించే ఉత్తమ సంతానం. (ముస్లిం).

విశేషాలుః

1- అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయు ఘనత.

2- ధర్మసమ్మతంతో సంపాదించి చేసిన దానమే స్వీకరించబడుతుంది.

3- ధన సంపదలో వృద్ధి, శుభం కలుగుటకు దానధర్మాలు కూడా ఒక కారణం.

4- దానం చేసిన ధనమే చివరికి ముస్లింకు (పరలోక సౌఖ్యానికి) మిగిలేది.

5- దానధర్మాల సబబుగానే ప్రళయం నాటి కఠిన సంఘటనల నుండి మోక్షం ప్రాప్తియగును.

6- అది పాక్షికంగా అయినప్పటికినీ నరకం నుండి దూరముండుటకు కారణమగును.

7- దానధర్మాలు చేసిన వ్యక్తి మరణించినప్పుటికీ వాటి పుణ్యాలు అతనికి లభిస్తునే ఉంటాయి.

66- ఉత్తమమైన దానం

عن أبي هريرة ™ قال: قال الرسول ﷺ: ((خير الصدقة ما كان على ظهر غِنًى، وابدأ بمن تعول))  

ప్రవక్త ﷺ ప్రబోధించారని, అబూ హురైర ﷺ ఉల్లేఖించారుః “ఉత్తమమైన దానం ఏదంటే, అది చేసిన తర్వాత కూడా సంపన్నత మిగలాలి. మరియు ముందుగా నీ పోషణలో ఉన్న వారితో ప్రారంభించుము”. (బుఖారి).

عن ابي هريرة ™ قال: جاء رجل إلى رسول الله ﷺ فقال: يا رسول الله أيّ الصدقة أعظم أجرا؟ قال: ((أن تصدّقّ وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى، ولا تُمْهِل حتى إذا بلغَتِ الْحُلْقومَ قلتَ: لفلان كذا ولفلان كذا، وقد كان لفلان))

అబూ హురైర రజియల్లాహు అన్హు  కథనం ఇలా ఉందిః ఒక వ్యక్తి ప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, ప్రవక్తా! ఎవరి దానధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది? అని అడిగాడు. దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “నీవు ఆరోగ్యంగా ఉండి, అత్యధికంగా ధనాశ కలిగి ఉన్న రోజుల్లో (ఖర్చు చేస్తే), పేదవాణ్ణయిపోతానన్న భయంతో పాటు ధనికుడయిపోవాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ చేసే దానం అత్యంత ఉత్తమమైనది. కనుక దానం చేయడంలో నీవు అంత్యకాలం దాపురించేదాకా వేచి ఉండకు. ప్రాణం కంఠంలో వచ్చి కొన ఊపిరితో కొట్టుకునే స్థితి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తికి అంతిస్తాను, ఫలానా మనిషికి ఇంతిస్తాను అని చెబితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడది ఫలానా, ఫలానా వారిదయిపోయినట్లే (నీవిచ్చేదేమి లేదు)”. (బుఖారి, ముస్లిం).   

عن سلمان بن عامر ™ قال: قال رسول الله ﷺ: ((الصدقة على المسكين صدقة، وهي على ذي الرحم ثنتان صدقة وصلة))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, సల్మాన్ బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నిరుపేదకు దానం ఇచ్చుట ఒక దానం (పుణ్య ఫలం అయితే, నిరుపేద) బంధువుకు ఇస్తే ఒకటి దానం చేసిన పుణ్యఫలమైతే మరొకటి బంధుప్రేమకు సంబంధించిన పుణ్యఫలం లభించును”. (అహ్మద్).

విశేషాలుః

1- నిరుపేద బంధువులకు దానం చేయడం, ఇతరులకు చేయడం కంటే శ్రేష్ఠం.

2- ఆరోగ్యంగా ఉండి, దీర్ఘ వయస్సు పొందే ఆశతో, పేదవాణ్ణయి-పోతానన్న భయంతో కూడి చేసిన దానం చాల శ్రేష్ఠమైనది.

67- గుప్తదానపు ఘనత

[إِنْ تُبْدُو الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ وَإِنْ تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ}] البقرة:271

మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కాని రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. (2: బఖరః 271).

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: (( سبعة يُظِلّهم الله في ظلّه يوم لا ظلّ إلاّ ظلّه: إمام عادل، وشابّ نشأ في عبادة الله، ورجل قلبه معلَّق بالمساجد، ورجلان تحابّا في الله اجتمعا عليه وتفرّقا عليه، ورجل دعته امرأة ذات منصب وجمال فقال: إني أخاف الله، ورجل تصدّق بصدقة حتى لا تعلم شماله ما تنفق يمينه، ورجل ذكر الله خاليا ففاضت عيناه))

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడ తప్ప మరెలాంటి నీడ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. (2) తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్యకార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః  

1- గుప్త దానం బహిరంగంగా చేసేదానంకంటే ఉత్తమం.

2- గుప్త దానం చేసినవారికి ప్రళయదినాన అల్లాహ్ అర్ష్ (సింహాసన) ఛాయలో చోటు లభిస్తుంది. దీనితో గుప్తదానం ఘనత స్పష్టం అవుతుంది.

68- సముచిత కారణం వలన బహిరంగంగా దానం చేయుట సమ్మతమే

عن جرير ™ قال: ((كنّا عند رسول الله ﷺ في صدر النهار، فجاء قوم حفاة عراة مجتابي النمار والعباء متقلّدي السيوف عامتهم من مضر ـ بل كلهم من مضر ـ فتمعّر وجه رسول الله ﷺ لِما رأى بهم من الفاقة، فدخل ثم خرج فأمر بلالاً فأذّن وأقام فصلّى ثم خطب فقال: [يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ الَّذِي خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالاً كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تّسَاءَلُونَ بَهِ وَالأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا] والآية التي في الحشر [يَا أَيُّهَا الَّذِينَ ءَامَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ وَاتَّقُوا اللَّهَ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ] تصدّق رجل من ديناره من درهمه من ثوبه من صاع بُرّه من صاع تمره حتى قال: ولو بشق تمرة، قال: فجاء رجل من الأنصار بصرّة كادت كفّه تعجز عنها ـ بل قد عجزت ـ قال: ثم تتابع الناس حتى رأيت كومين من طعام وثياب حتى رأيت وجه رسول الله ﷺ يتهلّل كأنه مُذهَبة فقال رسول الله ﷺ: من سنّ في الإسلام سنة حسنة فله أجرها وأجر من عمل بعده من غير أن ينقص من أجورهم شيءٌ، ومن سنّ في الإسلام سنة سيّئة كان عليه وزرها ووزر من عمل بها من بعده من غير أن ينقص من أوزارهم شيءٌ))

జరీర్ రజియల్లాహు అన్హు  కథనం: మేము ఉదయం పూట ప్రవక్త ﷺ సన్నిధిలో ఉండగా, వట్టి కాళ్ళతో, నగ్న దేహంతో, మెడ నుంచి క్రింద వ్రేలాడుతతుండే తోలుదుస్తులు ధరించి, తలవారి తగిలించుకొని కొంత మంది వచ్చారు. అందులో అనేకులు – కాదు- అందరూ ‘ముజర్’ వంశానికి చెందినవారు. వారి పేదరికాన్ని చూసిన ప్రవక్త ముఖము మారిపోయింది. లోనికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. బిలాల్ రజియల్లాహు అన్హు  కు ఆదేశించారు. అతను అజాన్ ఇచ్చి ఇఖామత్ చెప్పారు. ప్రవక్త ﷺ నమాజ్ చేయించి (ఈ ఆయతులు పఠించి) ప్రసంగించారుః మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ అల్లాహ్ పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ మీ హక్కును కోరుకుంటారో, ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచుట మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరిక్షిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. (4: నిసాః 1). మళ్ళీ సూరె హషర్ నుండి ఈ ఆయతులను పఠించారుః విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అల్లాహ్ కు భయుడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు. (59:18). (ప్రవక్త ప్రసంగం ముగిసిన తర్వాత) ఒక వ్యక్తి ఒక దిర్హమ్, బట్టలు, ఒక సాఅ గోదుమలు, ఒక సాఅ ఖర్జూరం (ఎవరి వద్ద ఏదుంటే అది ప్రవక్త ముందు తీసుకువచ్చి దానధర్మాల వర్షం కురిపించారు). చివరికి “ఒక ఖర్జూరం ముక్కయినా సరే” దానం చెయ్యండని ప్రవక్త ﷺ ఆదేశించారు. ఒక అన్సార్ వ్యక్తి బరువైన ఒక సంచి అతికష్టంగా మోసుకుంటూ తీసుకొచ్చాడు. సహచరులు ఒకరి వెనుకొకరు తీసుకురావడం మొదలెట్టారు. చివరికి ధాన్యాలు, దుస్తుల రెండు కుప్పలు చూశానని, అప్పుడు ప్రవక్త ﷺ ముఖమును స్వర్ణంలా తలతలలాడుతూ, ఇలా ఉపదేశించగా చూశానని (జరీర్ రజియల్లాహు అన్హు ) తెలిపారుః “ఏ వ్యక్తి ఇస్లాం-లోని ఒక (విడనాడబడిన) సత్సాంప్రదాయాన్ని ఆచరించడం ప్రారంభిస్తాడో, అతనికి తను ఆచరించిన పుణ్యం, ఇంకా అతని తర్వాత దాన్ని ఆచరించేవారి పుణ్యం – వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత లేకుండా- అతనికి లభించును. మరెవడయితే ఇస్లాంలో ఒక దుష్సాంప్రదాయాన్ని ప్రారంభిస్తాడో అతనికి తాను చేసిన పాప భారం, ఇంకా అతని తర్వాత దాన్ని ఆచరించేవారి పాప భారము -వారి పాపాల్లో ఏలాంటి తగ్గింపు జరగకుండా- అతడిపై వేయబడును”. (ముస్లిం). 

విశేషాలుః

1- ఔచిత్య కారణంగా దానం బహిరంగంగా చేయుట యోగ్యం.

2- అది ‘రియా’ (చూపుగోలుతనం)లో లెక్కించబడదు. మంచికి ఆదర్శంగా ఉంటుంది.

69- భిక్షాటన నివారణ, అర్థింపు లేకుండా ఆత్మసంతృప్తితో తీసుకొనుట యోగ్యం

عن عبد الله بن عمر ™ قال: قال النبي ﷺ: ((ما يزال الرجل يسأل الناس حتى يأتي يوم القيامة ليس في وجهه مُزعةُ لحم))

ప్రవక్త ﷺ ఇలా హితోపదేశం చేశారని, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియ-ల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “ఎల్లప్పుడు ప్రజల దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు ప్రళయదినాన ముఖాన ఒక్క మాంసపు తునకైనా లేనివాడై (వికృత ముఖాకృతితో) వస్తాడు”. (బుఖారి, ముస్లిం).

عن حزام بن حكيم ™ قال: ((سألت رسول الله ﷺ فأعطاني، ثم سألته فأعطاني، ثم سألته فأعطاني، ثم قال: يا حكيم، إن هذا المال خضرة حلوة فمن أخذه بسخاوة نفس بورك له فيه، ومن أخذه بإشراف نفس لم يبارك فيه، كالذي يأكل ولا يشبع، اليد العليا خير من اليد السفلى))

హకీం బిన్ హిజామ్ రజియల్లాహు అన్హు  కథనం: నేనొకసారి ప్రవక్త ﷺ ను (కొంతధనం) అడిగితే ఆయన ఇచ్చారు. నేను (అది చాలక) మళ్ళీ అడిగాను. ప్రవక్త ﷺ నాకు మరింత ప్రసాదించారు. నేను (తృప్తి చెందక) మళ్ళీ అడిగాను. ఆయన నాకు మరికాస్త ప్రసాదించి ఇలా అన్నారుః “హకీం! ఈ ప్రాపంచిక సంపద (పైకి) ఎంతో పచ్చపచ్చగా, మధురంగా ఉండవచ్చు. కాని దాన్ని ఆత్మసంతృప్తితో తీసుకునే వ్యక్తికి అందులో శుభం కలుగు తుంది. అత్యాశతో అడిగే వాడికి అందులో ఎలాంటి శుభం ఉండదు. అతను ఎంత తిన్నా కడుపునిండని వ్యక్తిలాంటివాడు. (గుర్తుంచుకో) ఇచ్చే చేయి పుచ్చుకునే చేయికంటే ఎంతో శ్రేష్ఠమైనది”. (బుఖారి, ముస్లిం).  

عن عمر ™ قال: (( كان رسول الله ﷺ يعطيني العطاء فأقول: أعطِهِ من هو أفقر إليه منِّي، فقال: خذه، إذا جاءك من هذا المال شيء وأنت غير مشرف ولا سائلٍ، فخذه، وما لا فلا تُتْبعه نفسك))

ఉమర్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ నాకేదైనా ప్రసాదిస్తున్నప్పుడు ‘దీని అవసరం నాకంటే ఎక్కువ ఉన్నవాడికి ఇవ్వండి’ అని అనేవాడ్ని నేను. ఈ విషయం గురించి ఓ రోజు ప్రవక్త ﷺ ప్రస్తావిస్తూ “అత్యాశకు పోకుండా ఉండి, అర్థించకుండానే నీకేదైనా సంపద లభిస్తే నిరభ్యంతరంగా తీసుకో. అలా లభించకపోతే దాన్ని గురించి పట్టించుకోకు” అని అన్నారు. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- అధిక అవసరం లేనప్పుడు ప్రజల్ని ధనం, (డబ్బు) అడుగుట నివారించబడింది.

2- అర్థింపు లేకుండా పుచ్చుకొనుట యోగ్యమే.

70- ఉచ్చరించుటకు నివారించబడిన పలుకులు

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((لا تسبّوا الدهر، فإن الله هو الدهر))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “కాలాన్ని దూషించకండి. నిశ్చయంగా కాలం అల్లాహ్ యే”. (ముస్లిం).

عن حذيفة ™ أن النبي ﷺ قال: ((لا تقولوا: ما شاء الله وشاء فلان، قولوا: ما شاء الله ثم فلان))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, హుజైఫా రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి ఇష్ట ప్రకారం అని అనకండి. అల్లాహ్ ఇష్ట ప్రకారం, మళ్ళీ ఫలానా వ్యక్తి ఇష్టప్రకారం అని అనండి”. (అహ్మద్).  

عن طفيل بن سَخْبَرَة ™ أن رسول الله ﷺ قال: (( لا تقولوا ما شاء اللهُ وما شاء محمدٌ))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, తుఫైల్ బిన్ సఖ్ బర ﷺ ఉల్లేఖించారుః “అల్లాహ్ మరియు ముహమ్మద్ ﷺ కోరినట్లు అని అనకండి”. (అహ్మద్).

విశేషాలుః

1- కాలాన్ని దూషించుట నివారించబడింది.

2- అల్లాహ్ మరియు ఫలానా వ్యక్తి ఇష్టప్రకారం అని అనుట నివారించబడింది. అల్లాహ్ కోరినట్లు మళ్ళీ మనిషి కోరినట్లు అనాలి.

71- మృత్యువును స్మరించండి. చావును కోరకండి

عن ابي هريرة ™ قال: قال رسول الله ﷺ: (( أكثِروا من ذكر هاذم اللذات))

“కోరికల్ని హరించివేసేదాన్ని (మృత్యువును) మీరు అత్యధికంగా స్మరిస్తూ ఉండండి” అని ప్రవక్త ﷺ ప్రభోదించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (తిర్మిజి).

عن أنس ™ قال: قال رسول الله ﷺ: ((لا يتمنّينّ أحدكم الموت لضرٍّ نزل به، فإن كان لا بدّ متمنّيا فليقل: اللهمّ أحيني ما كانت الحياة خيرا لي، وتوفّني إذا كانت الوفاة خيرا لي))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “బాధలు, కష్టాలు దాపురించినప్పుడు మీలో ఎవ్వరూ చావును కోరరాదు. ఒకవేళ మరీ దుర్భరం, దుస్సహనమయిన పరిస్థితి ఏర్పడితే ‘అల్లాహ్! నాకు జీవితం మేలు కలిగించే వరకు జీవించి ఉండనివ్వు. చావే నాకు మేలయినప్పుడు నాకు చావునివ్వు అని అర్థించవచ్చు. (బుఖారి, ముస్లిం).  

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((لا يتمنّين أحدكم الموت ولا يدعُ به من قبل أن يأتيه، إنه إذا مات أحدكم انقطع عمله وإنه لا يزيد المؤمن عمره إلاّ خيرا))

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూ హురైర ™ ఉల్లేఖించారుః “చావు దాని నిర్ణీత సమయంలో రాకముందే మీకు మీరు దాన్ని కోరకండి. అది రావాలని (అంటే మీరు చనిపోవాలని) అర్థించకండి. మీలో ఎవరైనా చనిపోయారంటే తన ఆచరణ అంతమైపోతుంది. విశ్వాసునికి తన వయస్సు మేలే చేకూర్చుతుంది”. (ముస్లిం).

విశేషాలుః

1- చావును అత్యధికంగా స్మరిస్తూ ఉండడం అభిలషణీయం.

2- కష్టాలు దాపురించినప్పుడు చావు కోరుట నివారించబడింది.

72- మృత్యువు ఆసన్నమైనప్పుడు పాటించవలసిన ఆదేశాలు

عن أبي سعيد الخدري ™ قال: قال رسول الله ﷺ: ((لقّنوا موتاكم لآ إله إلاّ اللهُ))

“మృత్యువుకు (సమీపములో ఉన్నవారి యెదుట) ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ చదువుతూ ఉండండి” అని ప్రవక్త ﷺ  ఆదేసించారని,  అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن معاد بن جبل ™ قال: قال رسول الله ﷺ: ((من كان آخر كلامه لآ إله إلاّ اللهُ دخل الجنة))

“ఎవరి చివరి మాట ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ ఉండునో వారు స్వర్గంలో చేరుదురు” అని ప్రవక్త ﷺ తెలిపినట్లు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن جابر ™ قال: سمعت النبي ﷺ قبل وفاته بثلاث يقول: ((لا يموتَنَّ أحدكم إلاّ وهو يحسن بالله الظنّ))

“మీలో ఎవరైనా చనిపోయేటప్పుడు అల్లాహ్ పట్ల సద్భావం, మంచి నమ్మకం కలిగియుండాలి” అని ప్రవక్త ﷺ తమ మరణానికి మూడు రోజులు ముందు చెబుతుండగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

విశేషాలుః

1- కలిమహ్ ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ ఘనత చాలా ఉంది.

2- మృత్యువుకు సమీపములో ఉన్నవారి యెదుట కలిమ చదువుట ధర్మం. అలా చేస్తే వారు (శ్వాసపోయే ముందు) కలిమ చదవగలరు.

3- అల్లాహ్ పట్ల సద్భావం, మంచి నమ్మకం కలిగియుండాలని ఆదేశించబడింది.

73- అంతిమ ఆచరణ ప్రకారం ఫలితం

عن عبد الله بن مسعود ™ قال: حدّثنا رسول الله ﷺ وهو الصادق المصدوق: ((إن أحدكم يُجمع في بطن أمّه أربعين يوما ثم يكون علقة مثل ذلك، ثم يكون مضغة مثل ذلك، ثم يبعث الله إليه ملكا بأربع كلمات، فيُكتب: عمله، وأجله، ورزقه، وشقيّ أم سعيد، ثم يُنفَخ فيه الروح، فإن الرجل ليعمل بعمل أهل النار حتى ما يكون بينه وبينها إلا ذراع فيسبق عليه الكتاب فيعمل بعمل أهل الجنة فيدخل الجنة، وإن الرجل ليعمل بعمل أهل الجنة حتى ما يبقى بينه وبينها إلاّ ذراع فيسبق عليه الكتاب فيعمل بعمل أهل النار فيدخلَ النار))

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం, ప్రవక్త ﷺ సత్యమూర్తి, ఇది తిరుగులేని సత్యం. ఆయన ఇలా ప్రవచించారుః “మీలో ప్రతి వ్యక్తి మాతృగర్భంలో ఈ విధంగా రూపోందుతాడు. మొదట 40 రోజుల దాకా (వీర్య బిందువు రూపంలో ఉంటాడు. తర్వాత అన్నే రోజులు ద్రవరక్త రూపంలో ఉంటాడు. ఆ తర్వాత అన్నే రోజులు మాంసపు ముద్ద (పిండం) రూపంలో ఉంటాడు. ఆ తర్వాత అల్లాహ్ ఒక దూతను నాలుగు ఆజ్ఞలు ఇచ్చి పంపుతాడు. -అతని కర్మలు, మృత్యువు, ఉపాధిని ఇంకా అతను దౌర్భాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా అనే విషయాన్ని వ్రాయమని ఆదేశిస్తాడు. ఆ తర్వాత అతనిలో ప్రాణం పోయబడుతుంది.

పోతే మీలో ఒక వ్యక్తి నరకవాసుల ఆచరణ చేస్తూ ఉంటాడు. (ఆ దుష్కర్మల కారణంగా) అతనికి, నరకానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉంటుంది. అంతలో అతని విధివ్రాత గెలిచి అతను స్వర్గవాసులు చేసే పనులు చేస్తాడు. (తత్ఫలితంగా అతను) స్వర్గంలో చేరుకుంటాడు. అదే విధంగా మరొకడు స్వర్గవాసులు చేసే ఆచరణ చేస్తూ ఉంటాడు. అతనికి, స్వర్గానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. అంతలో అతని విధివ్రాత గెలిచి అతను నరకవాసులు చేసే పనులు చేస్తాడు. (తత్పర్యవసానంగా అతను) నరకం పాలవుతాడు. (బుఖారి, ముస్లిం).

عن جابر ™ قال: سمعت رسول اللهﷺ يقول: (( يُبْعث كلّ عبد على ما مات عليه))

“ప్రతి వ్యక్తి (ఏ విశ్వాసం, ఆచరణపై) మరణిస్తాడో ఆ ప్రకారంగా లేపబడుతాడు” అని ప్రవక్త తెలిపారని, జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).  

74- జనాజ నమాజ్ ఆదేశాలు

عن ابن عباس ™ قال: سمعت رسول الله ﷺ يقول: ((ما من رجل يموت فيقوم على جنازته أربعون رجلا، لايشركون بالله شيئا إلاّ شفّعهم الله فيه))

“ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని జనాజలో అల్లాహ్ కు ఏ మాత్రం సాటి కల్పిం చని నలబై మంది పాల్గొన్నచో అల్లాహ్ అతని పట్ల వారి సిఫారసు స్వీకరిస్తాడు” అని ప్రవక్త ﷺ చెప్పినప్పుడు నేను విన్నాను అని ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖిస్తున్నారు . (ముస్లిం).

عن عائشة ؅ قالت: قال رسول الله ﷺ: ((ما من ميّت يصلِّي عليه أمةٌ من المسلمين يبلغون مائةً كلهم يشفعون له إلاّ شُفِّعُوا فيه))

“ఏ (ముస్లిం వ్యక్తి) జనాజాలో 100 సంఖ్యలో ముస్లిములు పాల్గొని, నమాజ్ చదివి, అతని గురించి సిఫారసు చేస్తారో వారి సిఫారసు అంగీకరించబడుతుంది” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని ఆయిష రజియల్లాహు అన్హా. (ముస్లిం).

عن سمرة بن جندب ™ قال: (( صليت وراء النبي ﷺ على امرأة ماتت في نفاسها، فقام عليها وسطها))

సముర బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు  కథనం: నేను ఒకసారి ప్రవక్త ﷺ వెనక ఒక స్త్రీ జనాజా నమాజు చేశాను. ఆ స్త్రీ ప్రసూతి స్థతిలో ఉండగా చనిపోయింది. ప్రవక్త ﷺ జనాజా నమాజు చేయిస్తున్నప్పుడు శవానికి మధ్య (ఎదురుగా) నిలబడ్డారు. (బుఖారి).

عن أبي غالب رحمه الله قال: (( صليت مع أنس بن مالك ™ على جنازة رجل فقام حيال رأسه، ثم جاؤوا بجنازة امرأة من قريش فقالوا: يا اباحمزة صلِّ عليها، فقام حيال وسط السرير، فقيل له هكذا رأيت النبي ﷺ قام من الجنازة مقامك ومن الرجل مقامك منه؟ قال: نعم)) 

అబూ గాలిబ్ (అల్లాహ్ వారిని కరుణించుగాకా!) కథనం: నేను అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు  వెనక ఒక వ్యక్తి జనాజా నమాజు చేశాను. ఆయన ఆ శవపు తలకెదురుగా నిలబడ్డారు. ఆ తర్వాత ఖురైషు వంశానికి చెందిన ఒక స్త్రీ జనాజ వచ్చింది. తీసుకొచ్చినవారు (అనసుబ్ను మాలిక్ ని ఉద్దేశించి) అబూ హంజా ఆమె జనాజ చేయించండి అని కోరారు. అప్పుడు ఆయన శవానికి మధ్య (ఎదురుగా) నిలబడ్డారు. ‘పురుషుని శవానికి ఆ విధంగా (అంటే: తలకు ఎదురుగా), స్త్రీ శవానికి ఈ విధంగా (అంటేః శవానికి మధ్య) మీరు నిలబడ్డారే? ప్రవక్త ﷺ కూడా అదే విధంగా నిలబడ్డారా?’ అని ప్రజలు అనస్ రజియల్లాహు అన్హు  ని ప్రశ్నించగా, ఆయన ‘అవును’ అని సమాధానమిచ్చారు. (తిర్మిజి).

عن عبد الرحمن بن أبي ليلى رحمه الله قال: كان زيد يكبّر على جنائزنا أربعا، وإنه كبّر على جنازةٍ خمسا، فسألتُهُ فقال: ((كان رسول الله ﷺ يكبّرها))

అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా (అల్లాహ్ వారిని కరుణించుగాకా!) కథనం: జైద్ బిన్ అర్ ఖమ్ రజియల్లాహు అన్హు  మాలో (ఎవరయినా చనిపోతే) నాలుగు తక్బీర్లతో జనాజా నమాజు చేయించేవారు. ఒకసారి ఒక జనాజా నమాజు ఐదు తక్బీర్లతో చేయించారు. ఏంటి ఇలా? అని నేను ప్రశ్నించాను. దానికి అతను ‘ప్రవక్త ﷺ ఇలా చేసేవారు’ అని బదులిచ్చారు. (ముస్లిం).

సమాధిపై నమాజు చేయుటః

عن أبي هريرة ™ (( أن أسود ـ رجلا كان أو امرأة ـ كان يقمّ المسجد فمات ولم يعلم النبي ﷺ بموته فذكره ذات يوم فقال: ما فعل ذلك الإنسان؟ قالوا: مات يا رسول الله، قال: أفلا آذنتموني؟ فدلّوني على قبره، فأتى قبره فصلّى عليه))

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ఇలా ఉందిః ఒక నల్ల మనిషి -పురుషుడో లేక స్త్రీయో- మస్జిద్ సేవ చేస్తూ ఉండేవాడు. అతను చనిపోయినప్పుడు ప్రవక్త ﷺ కు అతని మరణ వార్త అందలేదు. తర్వాత ఒక రోజు ఆ మనిషి గురించి జ్ఞాపకం చేయగా అతను చనిపోయాడని చెప్పారు ప్రవక్త సహచరులు. అప్పుడు ప్రవక్త ﷺ “ఆ సంగతి నాకెందుకు తెలియజేయలేదు మీరు” అని “సరే, నాకతని సమాధి చూపండి” అని అన్నారు. ప్రవక్త ﷺ అతని సమాధి దగ్గరకు వెళ్ళి అతని కోసం జనాజ నమాజు చేశారు. (బుఖారి, ముస్లిం).  

عن ابي هريرة ™: ((أن رسول الله ﷺ نَعَى النجاشيّ في اليوم الذي مات فيه، وخرج بهم إلى المصلّى فصفّ بهم وكبّر عليه أربع تكبيرات))

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం: నజ్జాషీ (నీగస్ చక్రవర్తి) చనిపోయిన రోజు అతని మరణవార్తను ప్రవక్త ﷺ మాకు విన్పించి, నమాజు చేసే స్థలానికి వెళ్ళిపోయారు. అక్కడ అనుయాయులతో కలసి (జనాజా నమాజు కోసం) పంక్తులు ఏర్పరచి నాలుగు తక్బీర్లు పలికారు. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఇమాం స్త్రీ శవానికి మధ్య, పురుషుని శవానికి తలకు ఎదురుగా నిలబడాలి.

2- నాలుగు తక్బీర్లు చేయాలి.

3- ఐదు తక్బీర్లు కూడా చేయవచ్చును.

4- జనాజా నమాజులో ఎంత ఎక్కువ మంది పాల్గొంటారో అంత మంచిది.

5- సమాధి వద్ద కేవలం జనాజా నమాజు చేయవచ్చు.

6- పరోక్షంగా ఉన్న మృతుని నమాజు (జనాజా గాయిబానా) చేయుట ధర్మసమ్మతమే.

75- జనాజా నమాజులో ఏమి చదవాలి

సూరె ఫాతిహ చదవాలిః

عن طلحة بن عبد الله بن عوف رحمه الله قال: ((صليت خلف ابن عباس  على جنازة فقرأ بفاتحة الكتاب، قال: لتعلموا أنها سنّة)) 

నేను ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు  వెనుక ఒక జనాజా నమాజు చేశాను. అతను అందులో సూరె ఫాతిహా చదివి ‘ఇది ప్రవక్త ﷺ సాంప్రదాయం అన్నది మీకు తెలియాలని (నేను శబ్దంతో చదివాను)’ అని చెప్పారు. (బుఖారి).

జనాజా నమాజులో దుఆః

عن عوف بن مالك ™ قال: صلى رسول الله ﷺ على جنازة، فحفظت من دعائه وهو يقول: (( اللهمّ اغفر له، وارحمه، وعافه، واعف عنه، وأكرم نزله ووسّع مُدخله، واغسله بالماء والثلج والبرد، ونقّه من الخطايا كما نقيت الثوب الأبيض من الدنس، وأبدله دارا خيرا من داره، وأهلا خيرا من أهله، وزوجا خيرا من زوجه، وأدخِله الجنة، وأعِذه من عذاب القبر ـ أو من عذاب النار ـ قال: حتى تمنّيت أن أكون أنا ذلك الميت))

ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు  కథనం: ప్రవక్త ﷺ ఒక జనాజా నమాజు చేయించారు. (అందులో ఆయన చదివిన దుఆ ఎంత బావుండిం- దంటే నేను) దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. (ఏ శవం ముందు నిలబడి ప్రవక్త ﷺ ఈ దుఆ చదివారో) ఆ శవం నేనై ఉన్నింటే బావుండేది అన్న తలంపు నాలో వచ్చింది. అదిః అల్లాహుమ్మగ్ ఫిర్ లహూ వర్ హమ్ హూ వ ఆఫిహీ వఅఫు అన్హు వ అక్రిమ్ నుజులహీ వవస్సిఅ ముద్ ఖలహూ వగ్ సిల్ హు బిల్ మాఇ వస్సల్ జి వల్ బర్ద్. వ నఖ్ఖిహీ మినల్ ఖతాయా కమా నఖ్ఖైతస్సౌబల్ అబ్ యజ మినద్దనస్. వ అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ వ అహ్లన్ ఖైరమ్ మిన్ అహ్లిహీ వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహీ వ అద్ ఖిల్ హుల్ జన్నత వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి ఔ మిన్ అజాబిన్నార్. (అల్లాహ్! ఈ మృతుని పాపాలను క్షమింపుము. ఇతడ్ని కరుణింపుము. ఇతనికి మోక్షం నొసంగుము. ఇతని పొరపాట్లను మన్నింపుము. ఇతనికి మంచి ఆతిథ్యం సలుపుము. ఇతని సమాధిని విశాల పరుచుము. ఇతడ్ని నీళ్ళతో, మంచుతో. వడగళ్ళతో శుద్ధి పరుచుము. తెల్లని వస్త్రము మురికి నుండి ఎలా శుభ్రపరచబడుతుందో అలా ఇతన్ని పాపాల నుండి శుభ్రపరుచుము. ఇతని (ఇక్కడి) గృహమునకు బదులు (అక్కడ) మంచి గృహము నొసంగుము. ఇతనిని స్వర్గంలో ప్రవేశింప- జేయుము. సమాధి మరియు నరక శిక్షల నుండి రక్షించుము). (ముస్లిం).

విశేషాలుః

1- జనాజా నమాజులో సూరె ఫాతిహ చదువుట ధర్మం.

2- జనాజా నమాజులో ప్రవక్త ﷺ పై దరూద్ పంపిన తర్వాత శవం కోసం (పైన తెలిపిన) దుఆ చదవాలి.

76- జనాజా ఆదేశాలు

శవమును చుంబించుట యోగ్యం:

عن عائشة رضي الله عنها :(( أن أبابكر الصدّيق ™ قبّل النبي ﷺ بعد موته)) 

అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు  ప్రవక్త ﷺ చనిపోయిన తర్వాత

(ఆయనను) చుంబించారు అని ఆయిష రజియల్లాహు అన్హా తెలిపారు. (బుఖారి).

మృతులను దూషించుట నివారించబడిందిః

عن عائشة رضي الله عنها قالت: قال النبي ﷺ: ((لا تسبّوا الأموات فإنهم قد أفضوا إلى ما قدّموا))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “మృతులను దూషించకండి. ఎందుకంటే తాము ముందుగా పంపినదంతా వారు ఈ పాటికి పొందే ఉంటారు”. (బుఖారి).

జనాజా త్వరగా తీసుకెళ్ళాలిః

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: ((أسرعوا بالجنازة فإن تك صالحة فخير تقدّمونها إليه، وإن تك سوى ذلك فشرّ تضعونه عن رقابكم))

ప్రవక్త ﷺ ప్రబోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మృతదేహాన్ని (శ్మశానికి) తీసుకెళ్ళడంలో తొందర చేయండి. ఎందుకంటే మృతుడు పుణ్యాత్ముడయి ఉంటే అతడ్ని మీరు సత్పర్యవసానం వైపుకు తీసుకెళ్తున్నారన్న మాట. ఒక వేళ అతడు పాపాత్ముడయి ఉంటే అతనొక చెడు మయం. దాన్ని మీరు మీ భుజాల నుండీ దించేయడానికి వెళ్తున్నారన్న మాట”. (బుఖారి, ముస్లిం). 

عن ابي هريرة ™ عن النبي ﷺ قال: ((نفس المؤمن معلّقة بدينه حتى يقضى عنه))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “విశ్వాసుని ఆత్మ అతని అప్పు కారణంగా, దాన్ని అదా చేయనంత వరకు ఆగి యుంటుంది”. (తిర్మిజి).   

عن ابن عباس ™ قال: قال النبي ﷺ: (( اللحد لنا والشق لغيرنا))

“‘లహద్’ మన కోసం, షిఖ్ ఇతరుల ‘కోసం'” అని ప్రవక్త ﷺ చెప్పారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు  తెలిపారు. (షిఖ్ అంటేః మృతుడ్ని పెట్టడానికి త్రవ్విన సమాధి. లహద్ అంటేః ఆ సమాధిలో అడుగున ఖిబ్లా వైపు లోపల (డొక్కా మాదిరిగా, చంక తరహాలో) చేయటం. దానినే బగ్ లీ అనీ అంటారు). (తిర్మిజి).

విశేషాలుః

1- మృతున్ని చుంబించవచ్చును.

2- మృతుల్ని దూషించుట నివారించబడింది.

3- జనాజా త్వరగా తీసుకెళ్ళాలి.

4- చనిపోయిన వ్యక్తిపై అప్పు ఉంటే అతని వారసులు దాన్ని అతి-తొందరలో చెల్లించుట తప్పనిసరి.

5- సమాధి త్రవ్వినప్పుడు లహద్ పద్దతిలో ఉంటే మంచిది.

77- ఖననం – దానికి సంబంధించిన ఆదేశాలు

عن عقبة بن عامر ™ قال: (( ثلاث ساعات كان رسول الله ﷺ ينهانا أن نصلّي فيهنّ أو نقبر فيهن موتانا: حين تطلع الشمس بازغة حتى ترتفع، وحين يقوم قائم الظهيرة حتى تميل الشمس، وحين تضّيّف الشمس للغروب حتى تغرب))

ఉఖ్బా బిన్ ఆమిర్ ﷺ కథనం: మూడు వేళల్లో నమాజు చేయటాన్ని, మేము మా శవాలను ఖననం చేయుటను ప్రవక్త ﷺ నివారించేవారు. (1) సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మరియు పూర్తిగా పైకి వచ్చే వరకు ఉండే వేళ. (2) మట్టమధ్యాహ్నం సూర్యుడు తల మీది నుండి వాలె వరకు. (3) సూర్యుడు క్రుంకినప్పుడు. అతడు పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం).

عن ابن عمر ™ (( أن النبي ﷺ كان إذا أدخل الميت القبر قال: بسم الله وبالله وعلى ملّة رسول الله))

ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ﷺ శవాన్ని సమాధిలో దించేటప్పుడు “బిస్మిల్లాహి వబిల్లాహి వ అలా మిల్లతి రసూలిల్లాహ్” (అల్లాహ్ పేరుతో, అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, ప్రవక్త ﷺ మతాన్ననుసరించి (సమాధిలో పెడుతున్నాను)) చదివేవారు. (తిర్మిజి).  

عن أنس ™ قال: ((شهدنا بنت رسول الله ﷺ ـ ورسول الله ﷺ جالس على القبر ـ فرأيت عينيه تدمعان، فقال: هل فيكم أحدٌ لم يقارف الليلة؟ فقال أبو طلحة: أنا، قال: فانزل في قبرها، فنزل في قبرها فقبرها))

అనసు ﷺ కథనం, ప్రవక్త ﷺ కూతురిని దహనం చేయుటకు వెళ్ళినప్పుడు మేము పాల్గొన్నాము. ప్రవక్త ﷺ ఓ సమాధి ప్రక్కన కూర్చున్నారు. ఆయన కళ్ళ నుండి ఆశ్రువులు కారుతుండగా నేను చూశాను. “ఈ రాత్రి మీలో తమ భార్యతో సంభోగించని వారెవరైనా ఉన్నారా?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనున్నాను ప్రవక్తా అని అబూ తల్హా రజియల్లాహు అన్హు  అన్నారు. “ఆమెను (నా కూతుర్ని) దహనం చేయుటకు మీరు సమాధిలో దిగండి” అని ఆయన్ని ఆదేశించారు ప్రవక్త ﷺ. (బుఖారి).

విశేషాలుః

1- సూర్యుడు ఉదయిస్తున్నప్పటి నుంచి పైకి వచ్చే వరకు, మిట్టమధ్యానం నుంచి కొంచెం ప్రక్కకు వాలే వరకు. ఆస్తమించుటకు కొంచం ముందు నుండీ (పూర్తిగా ఆస్తమించే వరకు) శవాలను దహనం

చేయుట నివారించబడింది.

2- శవాన్ని సమాధిలో దించేవారు “బిస్మిల్లాహి వబిల్లాహి వ అలా మిల్లతి రసూలిల్లాహ్” అనుట ధర్మ సాంప్రదాయం.

3- స్త్రీని సమాధిలో తనకు “మహ్రమ్” కానివారు కూడా దించవచ్చును. (మహ్రమ్ అంటేః వివాహ నిషిద్ధత బంధుత్వం గల పురుషుడు).

78- సహనప్రోత్సహం. కష్టమొచ్చినప్పుడు ఏమి చదవాలి?

[الَّذِينَ إِذَا أَصَابَتْهُمْ مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ  أُولَئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ وَأُولَئِكَ هُمُ الْمُهْتَدُونَ ] البقرة:156و157

కష్టకాలం దాపురించినప్పుడు “మేము అల్లాహ్ కే చెందినవారము అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము” అని అనేవారికి, వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహములను కుర్పిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రమిస్తాయి. వారే సన్మార్గముపై ఉన్నవారు. (2: బఖరః 156,157).

عن أنس ™ عن النبي ﷺ قال: ((الصبر عند الصدمة الأولى))

“ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం” అని ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం).  

عن أم سلمة رضي الله عنها قالت: سمعت رسول الله ﷺ يقول: ((ما من مسلم تصيبه مصيبة فيقول ما أمره الله: إنا لله وإنا إليه راجعون، اللهم اجرني في مصيبتي، وَاخْلِفْ لي خيرا منها، إلا أخلف الله له خيرا منها))

“కష్టం దాపురించిన విశ్వాసుడు అల్లాహ్ ఆదేశానుసారం “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహుమ్మఅజుర్ నీ ఫీ ముసీబతీ వఖ్ లుఫ్ లీ ఖైరమ్ మిన్ హా” చదివాడంటే అల్లాహ్ అల్లాహ్ అతనికి దానికి మంచి ప్రతిఫలం నొసంగును”. (ముస్లిం).

عن صهيب ™ قال: قال رسول الله ﷺ: ((عجبا لأمر المؤمن إن أمره كله خير وليس ذلك إلاّ للمؤمن، إن أصابته سرّاء شكر فكان خيرا له وإن أصابته ضرّاء صبر فكان خيرا له))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, సుహైబ్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “విశ్వాసుని వ్యవహారం విచిత్రమైంది. అతను చేసే ప్రతి పనీ శుభకరమైనదే. ఈ శుభం ఒక విశ్వాసికి తప్ప మరెవరికీ లభించదు. అతనికి సంతోషం కలిగితే అల్లాహ్ కృతజ్ఞతా భావంలో మునిగిపోతాడు అది అతనికి శుభం కలుగజేస్తుంది. బాధ కలిగితే సహనం వహిస్తాడు. అది కూడా అతనికి శుభంగానే పరిణమిస్తుంది”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- కష్టాలపై ఓర్పు వహించు ఘనత.

2- కష్టారంభంలోనే ఓర్పు వహించుట ప్రశంసనీయమైనది.

3- కష్టాలు దాపురించినప్పుడు సహనంతో మెలుగుట విశ్వాసుల గుణం.

4- కష్టం దాపురించనప్పుడు పైన తెలిపిన దుఆ చదవాలి.

79- వీలునామా – దాని ఆదేశాలు

عن ابن عمر ™ أن رسول الله ﷺ قال: ((ما حق امريء مسلم له شيء يريد أن يوصي فيه يبيت ليلتين إلاّ ووصيته مكتوبة عنده)) متفق عليه

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఒక ముస్లిం ఏదైనా వస్తువు కలిగి యుండి, దాని విషయంలో వీలునామా వ్రాయదలచినప్పుడు (వెంటనే వ్రాయాలి). రెండు రాత్రులు గడిచినా వీలునామా వ్రాయక దాన్నలాగే ఉంచడం అతనికి ధర్మం కాదు”. (బుఖారి, ముస్లిం).  

عن سعد بن أبي وقاص ™ قال: ((قلت يا رسول الله: أنا ذو مال ولايرثني إلاّ ابنة

لي واحدة، أفأتصدّق بثلثي مالي؟ قال ﷺ: لا. قلت: أفأتصدّق بشطره؟ قال: لا. قلت: أفأتصدّق بثلثه؟ قال: الثلث، الثلث كثير، إنك أن تذر ورثتك أغنياء خير من أن تذرهم عالة يتكففون الناس))

సఅద్ బిన్ అబీ వఖాస్ రజియల్లాహు అన్హు  కథనం: నేను (ఒక సందర్భంలో) ప్రవక్తా! నేను ధనవంతుణ్ణి. నాకు ఒక్క కూతురు తప్ప వారసులెవ్వరూ లేరు. ఈ స్థితిలో నేను మూడింట రెండింతలు దానం చేయవచ్చా? అని అడిగాను.  ప్రవక్త “వద్దు” అని చెప్పారు. ‘అర్థ భాగం చేయవచ్చా?’ అని అడిగాను. అది కూడా “వద్దు” అని చెప్పారు. ‘మూడింట ఒక వంతు చేయవచ్చా?’ అని అడిగాను. అప్పుడు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “మూడింట ఒక వంతు ఆస్తిని దానం చెయ్యి. నిజానికి ఇది కూడా ఎక్కువే. నీ వారసులు ప్రజల ముందు చేతులు జాపి దేబరించేలా వారిని నిరుపేదలుగా, నిరాధారులుగా చేసి వెళ్ళడం కంటే ఆస్తిపరులుగా చేసి వెళ్ళడం ఎంతో ఉత్తమం”. (బుఖారి, ముస్లిం).

عن ابي أمامة الباهلي ™ قال: سمعت رسول الله ﷺ يقول: ((إن الله قد أعطى كلَّ ذي حق حقه، فلا وصية لوارث))

“ప్రతి హక్కుదారుని హక్కును అల్లాహ్ నిర్ణయించాడు. ఏ వారసునికి (మరణించే వ్యక్తి) ప్రత్యేకంగా వీలునామా వ్రాయించాల్సిన పనిలేదు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ ఉమామ బాహిలీ ఉల్లేఖించారు. (అబూ దావూద్, తిర్మిజి).

عن عائشة رضي الله عنها أن رجلا أتى النبي ﷺ فقال: ((يا رسول الله، إن أمّي افتُلِتَتْ نفسُها ولم توصِ، وأظنّها لو تكلّمت تصدّقت، أفلها أجر إن تصدّقتُ عنها؟ قال: نعم))

ఆయిష రజియల్లాహు అన్హా కథనం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నా తల్లి హటాత్తుగా చనిపోయింది. (చనిపోయే ముందు) ఆమె మాట్లాడగలిగి ఉంటే అల్లాహ్ మార్గంలో దానం చేసి ఉండేదని నేను భావిస్తున్నాను. నేనిప్పుడు ఆమె తరఫున దానం చేస్తే దాని పుణ్యం ఆమెకు చేరుతుందా? అని అడిగాడు. దానికి ప్రవక్త ﷺ “చేరుతుందని” చెప్పారు. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- ఏదైనా వస్తువు కలిగి యుండి, దాని విషయంలో వీలునామా వ్రాయదలచిన వ్యక్తి వెంటనే వ్రాయాలని, అందులో ఎవరికీ అన్యాయం చేయకూడదని ఆదేశించడం జరిగింది.

2- మనిషి చనిపోయే ముందు తన ఆస్తిలో మూడింట ఒక వంతు విషయంలో వీలునామా వ్రాయవచ్చును.

3- వారసుల్లో ప్రత్యేకంగా ఒకరికి (ధర్మం నిర్ణయించిన దానికంటే) ఎక్కువగా చెందేటట్లు ప్రత్యేకంగా వీలునామా వ్రాయించడం నివారించబడింది.

4- ఒక వ్యక్తి తను మరణించే ముందు వీలునామా వ్రాయనప్పటికీ అతని తరఫున దానం చేయవచ్చును.

80- ఆస్తి పంపకం – ఆదేశాలు

عن ابن عباس ™ قال: قال رسول الله ﷺ: ((ألحِقوا الفرائض بأهلها فما بقي فهو لأولى رجل ذكرٍ))

ప్రవక్త ﷺ ప్రబోధించారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “వారసుల కోసం (ఖుర్ఆన్ లో) నిర్ణయించబడిన (ఆస్తి) వాటలను ఆయా వారసులకు ఇచ్చేయండి. ఆ తర్వాత ఏదయినా మిగిలితే మృతునికి అతి సన్నిహితులయిన పురుష బంధువులకు ఇవ్వాలి”. (బుఖారి, ముస్లిం).

عن ابي أمامة الباهلي ™ قال: سمعت رسول الله ﷺ يقول: ((إن الله قد أعطى كلَّ

ذي حق حقه، فلا وصية لوارث))

“ప్రతి హక్కుదారుని హక్కును అల్లాహ్ నిర్ణయించాడు. ఏ వారసునికి (మరణించే వ్యక్తి) ప్రత్యేకంగా వీలునామా వ్రాయించకూడదు” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అబూ ఉమామ బాహిలి ఉల్లేఖించారు. (అబూ దావూద్, తిర్మిజి).

 عن أسامة بن زيد ™ أن النبي ﷺ قال: ((لا يرث المسلم الكافر ولا يرث الكافر المسلم))

“విశ్వాసుడు అవిశ్వాసుని (ఆస్తికి) వారసుడు కాజాలడు. అదే విధంగా అవిశ్వాసి విశ్వాసుని (ఆస్తికి) వారసుడు కాలేడు” అని ప్రవక్త ﷺ తెలిపారని, ఉసామ బిన్ జైద్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

విశేషాలుః

1- ఆస్తి పంపకాల వివరములు స్వయంగా అల్లాహ్ నిర్ణయించాడు.

2- వారసుని కొరకు ప్రత్యేకంగా వీలునామా వ్రాయకూడదు.

3- (అల్లాహ్ నిర్ణయించిన) వారసులకు వారి వాటా పంపకం జరిగిన తర్వాత, మిగిలనది మృతునికి అతి సన్నిహితుడైన పురుషునికి ఇవ్వాల్సి ఉంది.

4- విశ్వాసి అవిశ్వాసి (ఆస్తికీ), అవిశ్వాసి విశ్వాసి (ఆస్తికీ) వారసులు కాలేరు.

81- మనిషి మరణం పట్ల పెడబొబ్బులు, (విధివ్రాతపై) అసంతృప్తి చెందకుండా కన్నీరు కార్చుట తప్పు కాదు

عن أنس بن مالك ™ قال: دخلنا على أبي سيف القين ـ وكان ظئرا لإبراهيم ـ فأخذ رسول الله ﷺ إبراهيم فقبّله وشمّه، ثم دخلنا عليه بعد ذلك ـ وإبراهيم يجود بنفسه فجعلت عينا رسول الله ﷺ تذرفان، فقال عبد الرحمن بن عوف ™: وأنت يا رسول الله ؟! فقال ﷺ : ((إن العين تدمع والقلب يحزن ولا نقول إلا ما يُرضِي ربَّنا، وإنا لفراقك يا إبراهيم لمحزونون))

అనసుబ్ను మాలిక్ రజియల్లాహు అన్హు  కథనం, మేము అబూ సైఫ్ అల్ ఖైన్ వద్దకు వచ్చాము. – అతను ప్రవక్త కుమారుడైన ఇబ్రాహీంకు పాలసంబంధిత తండ్రి- ప్రవక్త ﷺ ఇబ్రాహీంను ఎత్తుకొని ముద్దుపెట్టారు, ఆఘ్రాణించారు. ఆ పాటికి మేము అక్కడికి చేరుకున్నాము. ఇబ్రాహీం అవసాన దశలో ఉన్నాడు. ప్రవక్త ﷺ కళ్ళ నుండి ఆశ్రువులు కారాయి. అలా చూసిన అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు  ‘మీరు కుడా (ఏడుస్తున్నారా) ప్రవక్తా! అని అడిగారు.  “కంటి నీరు కారుతాయి. మనుస్సు బాధపడుతుంది. మా ప్రభువు సంతృప్తి పడే మాటలు తప్ప మరెవీ పలుకము. ఇబ్రాహీం నీవు మాతో దూరమైనందుకు మాకు బాధగా ఉంది” అని ప్రవక్త ﷺ చెప్పారు. (బుఖారి).  

عن أسامة بن زيد ™ قال: أرسلتْ بنتُ النبي ﷺ: إنّ ابني قد احتُضر فاشهدها، فأرسل يُقْرِئُ السلام ويقول: ((إن للّه ما أخذ وله ما أعطى وكل شيء عنده بأجل مسمَّى، فلتصبر ولتحتسب))، فأرسلت تقسم عليه ليأتينّها، فقام ومعه سعد بن عبادة ومعاذ بن جبل وأبيّ بن كعب وزيد بن ثابت ورجال رضي الله عنهم، فرُفِع إلى النبي ﷺ الصبيّ فأقعده في حجره ونفسه تقعقع، ففاضت عيناه ﷺ، فقال سعد: يار سول الله ما هذا؟ قال: ((هذه رحمة جعلها الله في قلوب من شاء من عباده، وإنما يرحم الله من عباده الرحماء))

ఉసామ బిన్ జైద్ కథనం: ప్రవక్త ﷺ కుమార్తెలలో ఒకరు ‘నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి’ అని ప్రవక్త ﷺ కు (ఒక వ్యక్తి ద్వారా) కబరు చేశారు. అయితే ప్రవక్త ﷺ సలాం తెలిపి, దానికి సమాధానంగా “అల్లాహ్ వెనక్కి తీసుకునేది అయనదే, తాను ప్రసాదించినది కూడా ఆయనదే. ఆయన ప్రతి వస్తువుకు ఒక గడువు (జీవితకాలం) నిర్ణయించాడు. అందువల్ల (ఈ విషాద సంఘటన పట్ల) నీవు సహనం వహించి, పుణ్యాన్ని ఆశించు” అని చెప్పి పంపారు. ప్రవక్త ﷺ కుమార్తె ప్రమాణం చేసి ‘మీరు తప్పక రావాలి’ అని మళ్ళీ కబురు పంపారు. దాంతో ప్రవక్త ﷺ సఅద్ బిన్ ఉబాద, ముఆజ్ బిన్ జబల్, ఉబై బిన్ కఅబ్, జైద్ బిన్ సాబిత్ మరి కొందరు సహచరుల్ని (రజియల్లాహు అన్హుం) వెంట బెట్టుకొని వెళ్ళారు. పిల్లవాడ్ని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. ఆ పసివాడి ఊపిరి కొట్టుమిట్టాడుతుంది. ఆ పరిస్థితి చూసి ప్రవక్త ﷺ కంటతడి పట్టారు. అప్పుడు సఅద్ బిన్ ఉబాద రజియల్లాహు అన్హు  (ఆశ్చర్యపోయి చూస్తూ) ప్రవక్తా! ఇదేమిటి (మీరు దుఃఖిస్తున్నారు)?’ అని అడిగారు. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “ఇది అల్లాహ్ తను కోరినదాసుల హృదయాల్లో ఉంచిన కారుణ్యం. తోటి మానవుల్ని కరుణించే వారినే అల్లాహ్ కరుణిస్తాడు”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- సంతాపం, పెడబొబ్బులు లాంటివి లేకుండా మరియు విధివ్రాతపై అసంతృప్తి చెందకుండానూ మృతుని పట్ల కన్నీరు కార్చుట తప్పు కాదు.

2- ప్రవక్తది కారుణ్యం మరియు దాక్షిణ్యంగల హృదయం.

82- సంతానవియోగం కలిగనవారు చేసే ఓర్పుపై పుణ్యం గలదు

عن أنس ™ قال: قال رسول الله ﷺ: ((ما من الناس مسلم يموت له ثلاثة من الولد لم يبلغوا الحِنث إلاّ أدخله الله بفضل رحمته ‏إياهم))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ ముస్లిం వ్యక్తి సంతానంలోనయితే ముగ్గురు ప్రాజ్ఞులు కాక ముందే మరణిస్తారో వారి (తల్లిదండ్రుల్ని) అల్లాహ్ తన దయ, కారుణ్యంతో స్వర్గంలోకి ప్రవేశింపజాస్తాడు”. (బుఖారి).

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((لايموت لأحد من المسلمين ثلاثة من الولد فتمسَّه النار إلاّ تحلّة القسم))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఏ ముస్లిం వ్యక్తి సంతానంలోనయితే ముగ్గురు చనిపోతారో అతడు నరకానికి పోడు. ప్రమాణం నెరవేర్చడానికి తప్ప”. (బుఖారి, ముస్లిం).

عن ابي سعيد الخدري ™ قال: قال رسول الله ﷺ: ((أيّما امرأة مات لها ثلاثة من الولد كانوا لها حجابا من النار، قالت امرأة: واثنان؟ قال: واثنان))

ప్రవక్త ﷺ ప్రవచించారని, అబూ సఈద్ ఖుద్రీ ﷺ ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి సంతానంలోనయితే ముగ్గురు చనిపోయారో వారు తమ తల్లి నరకంలోకి చేరకుండా అడ్డుగా ఉంటారు”. (ఈ విషయాన్ని విని ఒక స్త్రీ) ఎవరి సంతానంలోనయితే ఇద్దరు చనిపోయారో వారికీ ఇదే వర్తిస్తుందా? అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ “ఎవరి సంతానంలోనయితే ఇద్దరు చనిపోయారో వారికి కూడా” అని సమాధానమిచ్చారు. (బుఖారి).

విశేషాలుః

1- సంతానాన్ని కోల్పోయినందుకు ఓర్పు వహించుట ఘనతగల విషయం.

2- సంతానం కోల్పోయినందుకు ఓర్పు వహించుట స్వర్గ ప్రవేశానికి అర్హత పొందినట్లు.

3- అల్లాహ్ కారుణ్యం చాలా గొప్పది. అతని దయ విశాలమైనది.

83- జనాజా నమాజు చేయుట, శవపేటిక వెంట వెళ్ళుటలోని ఘనత. దాని ఆదేశాలు

عن ابي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((من شهد الجنازة حتى يصلّي عليها

فله قيراط، ومن شهدها حتى تُدفن فله قيراطان. قيل: وما القيراطان؟ قال: مثل الجبلين العظيمين))

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “జనాజాలో పాల్గోని జనాజా నమాజు అయ్యే వరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక ‘ఖిరాత్’ పుణ్యం లభిస్తుంది. శవఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు ‘ఖిరాత్’ల పుణ్యం లభిస్తుంది”. ‘ఖిరాత్’లంటేమిటి? అని అడగ్గా “రెండు పెద్ద కొండల పరిమాణం” అని ప్రవక్త ﷺ జవాబిచ్చారు. (బుఖారి, ముస్లిం).  

وعن البراء بن عازب ™ قال: ((أمرنا رسول الله ﷺ بسبع: بعيادة المريض، واتباع الجنائز، وتشميت العاطس، ونصر الضعيف، وعون المظلوم، وإفشاء السلام، وإبرار المقسم))

ఏడు విషయాల గురించి ప్రవక్త ﷺ మాకు ఆదేశించారని, బరాఉబ్ను ఆజిబ్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః (1) రోగిని పరామర్శించుట. (2) శవపేటిక వెంట నడుచుట. (3) తుమ్మినవారు (అల్ హందు లిల్లాహ్ అన్నప్పుడు యర్ హముకల్లాహ్ అని) బదులిచ్చుట. (4) అగత్యపరులకు సహాయపడుట. (5) పీడితునికి మద్దతు ఇచ్చుట. (6) సలాంను విస్తృతం చేయుట. (7) చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుట. (బుఖారి, ముస్లిం).

عن أبي سعيد الخدري ™ عن النبي ﷺ قال: ((إذا رأيتم الجنازة فقوموا، فمن تبعها فلا يقعد حتى توضع))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారుః “మీరు శవపేటిక (జనాజా) వస్తుండగా చూస్తే నిలబడిపోండి. జనాజ వెంట వెళ్ళేవాడు దాన్ని క్రింద పెట్టేంత వరకు కూర్చోరాదు”. (బుఖారి, ముస్లిం).

عن أمِّ عطيةَ رضي الله عنها قالت: ((نُهِينا عن اتباع الجنائز ولم يعزم علينا)) 

‘మమ్మల్ని (స్త్రీలను) జనాజా (శవపేటికల) వెంట (శ్మశానానికి) వెళ్ళకుండా వారించటం జరిగేది. అయితే ఈ విషయంలో మరీ అంత తీవ్రవైఖరి అవలంభించేవారు కారు’ అని ఉమ్మె అతియ రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు.

విశేషాలుః

1- శవపేటిక వెంట వెళ్ళుట ధర్మసాంప్రదాయం.

2- వారికి గొప్ప పుణ్యం ఉంది.

3- శవపేటిక వెంట వెళ్ళేవారు దాన్ని క్రింద పెట్టేంత వరకు కూర్చోక పోవడం ధర్మసాంప్రదాయం.

4- స్త్రీలను శవపేటిక వెంట వెళ్ళుటను నివారించటం జరిగింది.

84- సమాధిలో మృతునికి ఏమి జరుగుతుంది?

మృతుడు తన బంధువులు తిరిగి వెళ్తుండగా వారి పాదాల శబ్దాన్ని సమాధిలో వింటాడు.

عن أنس ™ عن النبي ﷺ قال: ((العبد إذا وضع في قبره وتولى وذهب أصحابه ـ حتى إنه ليسمع قرع نعالهم ـ أتاه ملكان فأقعداه فيقولان له: ما كنت تقول في هذا الرجل محمد ﷺ؟ فيقول: أشهد أنه عبد الله ورسوله. فيقال له: انظر إلى مقعدك من النار قد أبدلك الله به مقعدا في الجنة. قال النبي: فيراهما جميعا. وأما الكافر ـ أو المنافق ـ فيقول : لاأدري، كنت أقول ما يقول الناس. فيقال : لا دريت ولا تليت، ثم يضرب بمطرقة من حديد ضربة بين أذنيه، فيصيح صيحة يسمعها من يليه إلاّ الثقلين))

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని, అనస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి సమాధిలో పెట్టబడిన తర్వాత అతని సంబంధీకులు తిరిగి వెళ్తుండగా వారి పాదరక్షక శబ్దాన్ని అతడు వింటుంటాడు. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ఇలా అడుగుతారు. ‘ముహమ్మద్ (ﷺ) పట్ల నీవు ఏమనేవానివి?’ అతడు (విశ్వాసుడైతే ఇలా) అంటాడుః ‘ఆయన అల్లాహ్ దాసుడు, అల్లాహ్ ప్రవక్త’. ‘ఇదిగో చూడు నరకంలో నీ స్థలం, (నీవు విశ్వాసునివి గనుక) అల్లాహ్ దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం నీకు నొసంగాడు’ అని అతనికి (స్వర్గం, నరకం రెండూ చూపబడుతాయి). “అతడు ఆ రెండిటినీ చూస్తాడని” ప్రవక్త ﷺ తెలిపారు. అదే అవిశ్వాసి లేక మునాఫిఖ్ (వంచకుడు) అయి ఉంటే (దూతలు అడిగినదానికి) ‘నాకు తెలియదు. ప్రజలు అన్నదే నేననేవాణ్ణి’ అని అంటాడు. అప్పుడు ‘నీవు తెలుసుకోలేదు, (ఖుర్ఆన్) పఠించలేదు’ అని ఇనుప గదములతో అతని రెండు చెవుల మధ్య ఒక పెట్టు పెడితే దాన్ని భరించలేక అరుస్తాడు. అతని కేకను ఇరుజాతులు (మానవులు, జిన్నాతులు) తప్ప సమీపములో ఉన్న వారందరు వింటారు”. (బుఖారి).

స్వర్గంలో లేక నరకంలో తన స్థలం గురించి మృతునికి శుభవార్త ఇవ్వబడుతుందిః

عن عبد الله بن عمرو ™ أن رسول الله ﷺ قال: ((إن أحدكم إذا مات عرِض عليه مقعدُه بالغداة والعشيّ، إن كان من أهل الجنة فمن أهل الجنة، وإن كان من أهل النار فمن أهل النار، يقال له: هذا مقعدك حتى يبعثك الله إليه يوم القيامة))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతడు స్వర్గవాసి అయితే స్వర్గం, నరకవాసి అయితే నరకం పొద్దుమాపు అతని సమక్షంలో ఉంచబడుతుంది. ప్రళయంనాడు అల్లాహ్ నిన్ను లేపే వరకు ఇదిగో నీ స్థలం” అని అనబడుతుంది. (ముస్లిం).   

విశేషాలుః

1- సమాధిలో దైవదూతలు మృతుణ్ణి ప్రశ్నిస్తారన్న విషయం (పై హదీసు ద్వారా) రుజువవుతున్నది.

2- సమాధిలో శిక్ష లేక వరాలు నొసంగబడుతాయి అని రుజువవుతున్నది.

3- ప్రళయానికి ముందే మృతుడు నరకం లేక స్వర్గంలో ఉన్న తన నివాసాన్ని చూసుకుంటాడు.

85- సమాధిని నేలమట్టంగా ఉంచాలన్న ఆదేశం

عن أبي الهيّاج رحمه الله قال: قال لي علي بن أبي طالب ™ : ألا أبعثك على ما بعثني عليه رسول الله ﷺ: ((ألاّ تدع تمثالا إلاّ طمسته، ولاقبرا مشرفا إلاّ سوّيته))

అబుల్ హయ్యాజ్ రహిమహుల్లాహ్ కథనం: ఒకాసారి అలీ రజియల్లాహు అన్హు  ‘ప్రవక్త ﷺ నన్ను ఏ కార్యానిర్వహణకు పంపారో, దానిగ్గానూ నేను నిన్ను పంపుతున్నాను. నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దాన్ని చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దాన్ని నేలమట్టం చెయ్యి’ అని నన్ను పురమయించారు. (ముస్లిం). 

عن فضالة بن عبيد ™ قال: ((سمعت رسول الله ﷺ يأمر بتسويتها))

(గోరీలను ఎత్తుగా ఉంచకుండా) నేలమట్టం చేయాలని ప్రవక్త ﷺ ఆదే-శించగా నేనూ విన్నాను అని ఫుజాల బిన్ ఉబైద్ ఉల్లేఖించారు. (ముస్లిం).

عن جابر ™ قال: ((نهى رسول الله ﷺ أن يجصص القبر وأن يقعد عليه وأن يبنى عليه))

గోరిని గచ్చు చేయుట, దానిపై కూర్చుండుట. దాన్ని కట్టడంలా నిర్మించుటను ప్రవక్త ﷺ నివారించారని జాబిర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (ముస్లిం).

عن ابن مرثد الغنوي  قال: قال رسول الله ﷺ: ((لا تجلسوا على القبر ولا تصلّوا إليها))

సమాధిపై కూర్చోకండి. మరియు దాని వైపు ముఖము చేసి నమాజు చేయకండి, అని ప్రవక్త ﷺ చెప్పారని, అబూ మర్సద్ గనవి ఉల్లేఖించారు.

విశేషాలుః

1- గోరిలపై కట్టడాలు కట్టడం లేక వాటిని ఎత్తు చేయడం, గచ్చుతో నిర్మించడం నిషిద్ధం.

2- సమాధిపై కూర్చుండుట నివారించబడింది.

3- దాని వైపు ముఖం చేసి నమాజు చేయుట నిషిద్ధం.

86- మస్జిదె హరాం (మక్కాలోని పరిశుద్ధ మస్జిద్), మదీన మస్జిద్ (నబవి)ల ఘనత

[وَمَنْ يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ] الحج:25

పరిశుద్ధ మస్జిదు (కాబా మస్జిదు) విషయంలో అల్లాహ్ ఇలా తెలిపాడుః {దీనిలో నిజాయితీ నుండి వైదొలగి, అన్యాయపు పద్దతిని అవలంభించేవాడికి మేము వ్యధాభరితమైన శిక్షను రుచి చూపిస్తాము}. (22: హజ్: 25).

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: ((صلاة في مسجدي هذا أفضل من ألف صلاة فيما سواه إلاّ المسجد الحرام))

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “నా మస్జిద్ (అంటే మస్జిదె నబవి)లో చేసే ఒక్క నమాజు కాబా మస్జిదు తప్ప ఇతర యావత్తు మస్జిదులలో చేసే వెయ్యి నమాజుల కంటే కూడా ఎక్కువ శ్రేష్ఠమైనది”. (ముస్లిం).

عن أبي هريرة ™ عن النبي ﷺ قال: ((لا  تُشَدُّ الرحال إلاّ إلى ثلاثة مساجد: مسجدي هذا، ومسجد الحرام، ومسجد الأقصى))

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “మూడు మస్జిదుల దర్శనం కోసం తప్ప మరే దర్శనానికి ప్రయాణం చేయకూడదు. (1) ఈ నా మస్జిద్ (మస్జిదె నబవి). (2) మస్జిదె హరాం (కాబా మస్జిద్). (3) {ఫాలస్తీనాలోని} మస్జిదె అఖ్సా”. (బుఖారి, ముస్లిం).

عن أبي هريرة  قال: قال رسول الله ﷺ: ((مابين بيتي ومنبري روضة من رياض الجنة ومنبري على حوضي)) متفق عليه

అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖనలో ప్రవక్త ﷺ ప్రవచించారుః “నా ఇంటికి మరియు మెంబర్ కు మధ్య గల చోటు స్వర్గపువనాలలో ఒక వనమవుతుంది. మరియు నా మెంబర్ నా హౌజ్ పై ఉంటుంది. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- మస్జిదె హరాం, మస్జిదె నబవిలలో చేసే నమాజుల ఘనత.

2- ఆరాధనార్థం, దర్శనార్థం మరియు పుణ్యాపేక్షతో పైన తెలిపిన మూడు మస్జిద్ లకు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయరాదు.

3- ప్రవక్త ﷺ మరియు మెంబర్ కి మధ్యగల ప్రాంతం యొక్క ఘనత చాలా గలదు.

87- మక్కా ఆదేశాలు

عن ابن عباس ™ قال: قال رسول الله ﷺ يوم فتح مكة: ((إنّ البلد حرّمه الله، لايعضد شوكُه ولا ينفَّرُ صيده ولايلتقط لقطته إلاّ من عرّفها))

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు  కథనం: మక్కా జయింపబడిన రోజు ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః “ఈ నగరాన్ని అల్లాహ్ గౌరవప్రదమైన క్షేత్రంగా నిర్ణయించాడు. ఇక్కడ ఓ చెట్టు యొక్క ముల్లు సయితం విరిచేయరాదు. జంతువుల్ని వేటాడడం, వాటిని తరమడం లాంటివి చేయరాదు. నేల మీద పడిన వస్తువులను ఎవ్వరూ తీసుకోరాదు. కాకపోతే దాన్ని దాని యజమానికి అప్పగించే ఉద్దేశ్యంతో తీసుకోవచ్చును”. (ముస్లిం).

ఇహ్రాం స్థితిలో ఉన్న వ్యక్తి (ఏఏ ప్రాణుల్ని) చంపవచ్చును?

عن عائشة رضي الله عنها عن النبي ﷺ أنه قال: ((خمس فواسق يقتلن في الحل والحرام: الحية والغراب الأبقع والفأرة والكلب العقور والحديّا))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “హానికరమయిన ఐదు ప్రాణులను “హరం” లోపల, వెలుపల ఎక్కడయినా చంపవచ్చును. అవిః పాము, కాకి, ఎలుక, కరిచే కుక్క మరియు గద్ద”. (బుఖారి, ముస్లిం).

విశేషాలుః

1- మక్కా చాల గౌరవప్రదమైన స్థలం.

2- అక్కడ చెట్లు నరుకుట, నేలపై వేటాడుట లాంటి కార్యాలు నిషిద్ధం.

3- నేలపై పడిన వస్తువులను తీసుకొనుట కూడా యోగ్యం కాదు. కాని వాటిని వాటి అసలు యజమానికప్పగించే ఉద్దేశంతో మాత్రం తీసుకోవచ్చును.

4- ఆ ప్రాంతములో హానికరమయిన ప్రాణుల్ని మాత్రం చంపవచ్చును. ఉదాః పాము, కాకి, ఎలుక, కరిచే కుక్క, గద్ద మొదలైనవి.

88- కూతురికిష్టం లేని వారితో పెళ్ళి చేసుకోమని ఆమెను బలవంతం చేయుట నిషిద్ధం

عن أبي هريرة ™ أن رسول الله قال ﷺ: ((لاتُنكَح الأيِّم حتى تستأمر، ولا تنكح البكر حتى تستأذن، قالوا: يا رسول الله وكيف إذنها؟ قال: أن تسكت))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “వితంతువు లేక విడాకులు పొందిన స్త్రీ తన నోటి మాట ద్వారా సమ్మతి తెలియజేయనంత వరకు ఆమె వివాహం కాజాలదు. అలాగే కన్య, తన ఆమోదం తెలుపనంత వరకు ఆమె వివాహం కూడా కాజాలదు”. ప్రవక్త ﷺ అనుచరులు ఈ మాటలు విని ‘ఎలా ఆమె (కన్య) ఆమోదం’ అని అడిగారు. “ఆమె నిరాకరించకుండా మౌనం వహించడమే ఆమె ఆమోదం అవుతుంది” అని అన్నారు ప్రవక్త ﷺ. (బుఖారి, ముస్లిం).  

عن ابن عباس  أن النبي قال ﷺ: ((الأيِّم أحقّ بنفسها من وليّها، والبكر تستأذن في نفسها وإذنها صمْتها))

ప్రవక్త ﷺ సెలవిచ్చారని, ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “వితంతువు లేక విడాకులు పొందిన స్త్రీ తమ పట్ల తమ యజమానికంటే ఎక్కువ హక్కు గలది. కన్య స్వయంగా తన ఆమోదం తెలుపాలి. ఆమె ఆమోదం నిరాకరించకుండా మౌనం వహించడమే”. (ముస్లిం).  

عن خنساء بنت خدامٍ الأنصارية أن أباها زوّجها وهي ثيب فكرهت ذلك، ((فأتت رسول الله ﷺ فردّ نكاحها))

ఖన్సా బిన్తె ఖిదాం అన్సారియ రజియల్లాహు అన్హా కథనం: ఆమె వితంతువు. ఆమె తండ్రి ఆమె వివాహం ఆమెకు ఇష్టం లేని ఒక వ్యక్తితో చేశాడు. ఆమె ప్రవక్త వద్దకు వచ్చి (ఈ విషయం తేలిపింది) ప్రవక్త ﷺ ఆ వివాహాన్ని భంగపరిచారు. (బుఖారి).

విశేషాలుః

1- తండ్రి తన కూతురి పెళ్ళి సందర్భంలో ఆమె అనుమతి, అభిప్రాయం తప్పక తెలుసుకోవాల్సి ఉంది.

2- కన్య నిరాకరించకుండా మౌనం వహిస్తే అదే ఆమె ఆమోదం.

3- ధర్మబద్ధమైన పెళ్ళి అగుటకు వివాహిత ఆమోదం కూడా ఒక షరతు.

89- ఐక్యమత్యపు ఆదేశం – విచ్ఛిన్నం నుండి నివారణ

[وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلا تَفَرَّقُوا] آل عمران:103

అందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాల్లో పడకండి. (3: ఆలె ఇమ్రాన్: 103).

عن عرفجة  قال: سمعت رسول الله ﷺ يقول: ((إنها ستكون هنات و هنات، فمن أراد أن يفرق أمر هذه الأمة وهي جميع فاضربوا بالسيف كائنا من كان))

“ఉపద్రవాలు, ఘోర ప్రమాదాలు సంభవించనున్నాయి. అలాంటప్పుడు ఐక్యంగా ఉన్న ముస్లిం సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న వ్యక్తి ఎవడైనా సరే నరికెయ్యండి” అని ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నాను అని అర్ ఫజ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారు. (బుఖారి, ముస్లిం). 

عن أبي هريرة ™ قال: قال رسول الله ﷺ: ((إن الله يرضى لكم ثلاثا ويكره لكم ثلاثا، فيرضى لكم أن تعبدوه ولا تشركوا به شيئا، وأن تعتصموا بحبل الله جميعا، وأن تطيعوا من ولاّه الله أمركم، ويكره لكم قيل وقال وكثرة السؤال وإضاعة المال))

ప్రవక్త ﷺ ఉపదేశించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “అల్లాహ్ మీ కొరకు మూడు విషయాలను ఇష్టపడ్డాడు. మరియు మూడు విషయాలను అసహ్యించుకున్నాడు. ఇష్టపడ్డవిః (1) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి, అతనితో భాగస్వాముల్ని కల్పించకండి. (2) అందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. (3) అల్లాహ్ మీపై నిర్ణయించిన నాయకునికి విధేయులుకండి. ఇక అసహ్యించుకునేవిః (1) వ్యర్థమైన సంభాషణల్ని. (2) అధికంగా ప్రశ్నించడాన్ని. (3) ధనం వ్యర్థంగా వ్యయపరచడాన్ని”. (బుఖారి, ముస్లిం).

عن العرباض بن سارية ™ قال: وعظنا رسول الله ﷺ موعظة بليغة، وجلت منها القلوب وذرفت منها العيون، فقلنا: يا رسول الله! كأنها موعظة مودع فأوصنا، قال: ((أوصيكم بتقوى الله والسمع والطاعة وإن تأممر عليكم عبد حبشي، وإنه من يعش منكم فسيرى اختلافا كثيرا فعليكم بسنتي وسنة الخلفاء الراشدين المهديين عضوا عليها بالنواجذ، و إياكم ومحدثات الأمور فإن كل بدعة ضلالة))

ఇర్ బాజ్ బిన్ సారియ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి ప్రవక్త ﷺ బ్రహ్మాండమైన ఉపన్యాసమిచ్చారు. హృదయాలు కంపించి- పోయాయి. కంటి ఆశ్రువులు కారాయి. అయితే మేమన్నాముః ఓ ప్రవక్తా! ఇది మీ అంతిమ ప్రసంగముగా మాకు అనిపిస్తున్నది. మాకు వసియ్యత్ చేయండి అనగా ప్రవక్త ﷺ ఈ విధంగా వసియ్యత్ చేశారుః “అల్లాహ్ కు భయభక్తులు కలిగి ఉండండి. మీ నాయకుడు ఇథోపియాకు చెందిన వ్యక్తి అయినప్పటికి మీరు అతని మాట వినండి. విధేయత పాటించండి. నా తరువాత మీలో బ్రతికియున్నవారు అనేక విబేధాలు చూస్తారు. అలాంటప్పుడు మీరు నా పద్దతి, నా సాంప్రదాయాన్ని మరియు సన్మార్గంపై ఉన్న ఖులఫాయె రాషిదీన్ పద్దతిని ఆవశ్యకమైనదిగా భావించండి. దాన్ని దౌడపళ్ళతో గట్టిగా పట్టుకోండి. జాగ్రత్తా! (ధర్మంలో) క్రొత్త క్రొత్త విషయాలు ప్రవేశపెట్టకండి. ప్రతి క్రొత్త విషయం దుర్మార్గం”. (అబూదావూద్, తిర్మిజి).

విశేషాలుః

1- అల్లాహ్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవాలని ఆదేశం.

2- విచ్ఛిన్నం కావడం, విభేదాల్లో పడటం కఠినంగా నివారించబడింది.

3- విభేదాలు ఏర్పడినప్పుడ ప్రవక్త ﷺ పద్దతిని గట్టిగా పట్టుకోవాలని ఆదేశం.

90- అమానతులను కాపాడాలని, దాన్ని (హక్కు గలవారికి) ఇచ్చేయాలని ఆదేశం

[إِنَّا عَرَضْنَا الأَمَانَةَ عَلَى السَّمَوَاتِ والأَرْضِ وَالْجِبَالِ فَأَبَيْنَ أَن يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ

مِنْهَا وَحَمَلَهَا الإِنْسَانُ إِنَّهُ كَانَ ظَلُومًا جَهُولاً ] الأحزاب:72

మేము ఈ అమానతును ఆకాశాల ముందూ, భూమి ముందూ, పర్వతాల ముందూ పెట్టాము. అవేవీ దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి భయపడ్డాయి. కాని మానవుడు దాన్ని తనపై మోపుకున్నాడు. నిస్సందేహంగా, అతడు అన్యాయం చేయువాడు, మూర్ఖుడుగా ఉన్నాడు. (33: అహ్జాబ్: 72).

[إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الأَمَانَاتِ إِلَى أَهْلِهَا] النساء:58

అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. (4: నిసా: 58).

[إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الأَمِينُ ] القصص:26

బలవంతుడూ, నమ్మకస్తుడూ అయినవాడే మీకు నౌకరుగా పెట్టుకోవటానికి అన్ని విధాలా ఉత్తముడు. (28: ఖసస్: 26).

[وَالَّذِينَ هُمْ لأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ] المعارج:32

తమ అమానతులను పరిరక్షించేవారు, తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారు. (70: మఆరిజ్: 32).

عن ابي هريرة ™ قال: ((بينما النبي ﷺ في مجلس يحدّث القوم جاء أعرابيّ فقال: متى الساعة؟ فمضى رسول الله يحدّث. حتى إذا قضى حديثه قال: ((أين السائل عن الساعة؟)) قال: ها أنا يا رسول الله. قال: ((إذا ضُيِّعت الأمانة فانتظر الساعة))، قال: كيف إضاعتها؟ قال: ((إذا وُسِّد الأمر إلى غير أهله فانتظر الساعة))

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ఓ సమావేశములో కూర్చొని మాట్లాడుతుండగా ఒక గ్రామస్తుడు ప్రవేశించి ‘ప్రళయం ఎప్పుడు? అని ప్రశ్నించాడు. అయినా ప్రవక్త ﷺ మాటల్లోనే నిమగ్నులయి ఉన్నారు. మాట అయిపోయిన తరువాత “ప్రళయం గురించి ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడున్నాడు” అని అడిగారు ప్రవక్త ﷺ. ‘నేనే ఓ ప్రవక్తా!’ అని అతడు ముందుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “అమానతును కాపాడకుండా, వృథా చేయబడినప్పుడు నీవు ప్రళయాన్ని నిరీక్షించు” ‘అది వృథా ఎలా అవుతుంది?’ అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. దానికి “ఏ ఒక విషయంలో కూడా దానికి అనర్హులైనవారికప్పగించబడినప్పుడు నీవు ప్రళయాన్ని వేచించు” అని చెప్పారు మహాప్రవక్త ﷺ. (బుఖారి).

عن أنس ™ قال: قلّما خطبنا رسول الله ﷺ إلاّ قال: ((لا إيمان لمن لا أمانة له، ولا دين لمن لا عهد له))

ప్రవక్త ﷺ ప్రసంగించినప్పుడుల్లా ఈ విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించేవారుః “ఎవరిలోనైతే అమానతు లేదో వారిలో విశ్వాసం లేదు. ఎవరికయితే వాగ్దానం పట్ల గౌరవం లేదో వారిలో ధర్మం లేదు” అని అనస్ రజియల్లాహు అన్హు   ఉల్లేఖించారు. (అహ్మద్).

విశేషాలుః

1- అమానతు చాల గొప్ప విషయం. దాన్ని కాపాడాలని ఆదేశించబడింది.

2- అమానతును భద్రపరుచుట సాఫల్యులైన విశ్వాసుల గుణం.

3- ఎవరి అమానతు వారికి అప్పగించాలని ఆదేశించడం జరిగింది.

4- అమానతు లేనివారిలో విశ్వాసం ఉండదు అని తెలుస్తుంది.

91- అల్లాహ్ వైపునకు పిలుచు ఘనత

[وَمَنْ أَحْسَنُ قَوْلاً مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ]

అల్లాహ్ వైపునకు పిలిచి మంచి మనులు చేసి నేను ముస్లింను అని ప్రకటించే వ్యక్తి మాటకంటే మంచి మాట మరెవరిది కాగలదు. (41: హామీమ్ అస్సజ్దా: 33).

[ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ] النحل:125

ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో మరియు చక్కని హితబోధతో. (16: నహల్: 125).

[قُلْ هَذِهِ سَبِيلِي أَدْعُوا إِلَى اللَّهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي] يوسف:108

ఇది నా మార్గం. నేను, నన్ను అనుసరించినవారు స్పష్టమైన సూచనను అనుసరించి అల్లాహ్ వైపు పిలుచుచున్నాము. (12: యూసుఫ్: 108).

عن سهل بن سعد ™ ان النبي ﷺ قال لعليّ بن أبي طالب ™ يوم خيبر: ((انفذ على رسلك حتى تنزل بساحتهم ثم ادعهم ألى الإسلام وأخبرهم بما يجب عليهم من حق الله تعالى فيه، فوالله لأن يهدي الله بك رجلا واحدا خير لك من حمر النعم))

సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు  కథనం: ఖైబర్ రోజున ప్రవక్త ﷺ అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు  ని ఉద్దేశించి ఇలా అన్నారుః “శాంతంగా వారి ప్రాంతమునకు వెళ్ళీ వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించు. ఇస్లాంలో వారిపై విధిగా ఉన్న అల్లాహ్ హక్కుల్ని గురించి వారికి తెలుపు. అల్లాహ్ సాక్షిగా! నీ (హితబోధతో) అల్లాహ్ ఒక వ్యక్తికైనా సన్మార్గం చూపాడంటే అది నీకు ఎర్ర ఒంటెల కంటే అతి ఉత్తమం. (బుఖారి, ముస్లిం).

عن أبي هريرة ™ أن رسول الله ﷺ قال: ((من دعا إلى هدى كان له من الأجر مثل أجور من تبعه لاينقص ذلك من أجورهم شيئا، ومن دعا إلى ضلالة كان عليه من الإثم مثل آثام من تبعه لاينقص ذلك من آثامهم شيئا))

ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః “ఎవరైతే సన్మార్గం వైపునకు పిలుస్తారో, వారికి దానిననుసరించిన వారికి లభించినంత పుణ్యం లభిస్తుంది. దాని వలన అనుసరించిన వారి పుణ్యాల్లో ఏలాంటి తగ్గింపు జరగదు. అలాగే దుర్మార్గం వైపునకు పిలిచినవారికి దానిననుసరించిన వారికెంత పాపం కలుగునో అంతే పాపం కలుగును. దానిననుసరించినవారి పాపాల్లో ఏ మాత్రం తగ్గింపు జరగదు”. (ముస్లిం).

విశేషాలుః

1- అల్లాహ్ వైపునకు పిలుచు ఘనత.

2- ఒకరి హితబోధతో అల్లాహ్ ఎవరికైనా సన్మార్గం ప్రసాదిస్తే, అందువల్ల అతనికి గొప్ప ప్రతిఫలం లభించును.

3- ఎవరైతే ప్రజల్ని సత్కార్యాల్లోని ఒక సత్కార్యమైనా చేయుటకు బోధిస్తారో వారికి, దానిననుసరించిన వారికెంత పుణ్యం లభించునో అంతే పుణ్యం లభించును.

92- అతిశయంతో కూడిన ప్రశంస నివారించబడింది

عن أبي بكرة ™ قال: مدح رجل رجلا عند النبي ﷺ فقال: ((ويحك قطعت عنق صاحبك، قطعت عنق صاحبك، ـ مرارا ـ إذا كان أحدكم مادحا صاحبه لا محالة فليقل: فلانا واللهُ حسيبه ولا أزكّي على الله أحدا ـ إن كان يعلم ذلك ـ كذا وكذا))

అబూ బక్రా రజియల్లాహు అన్హు కథనం: మహా ప్రవక్త ﷺ సమక్షంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రశంసించాడు. ఆయన “అయ్యో, నీవు నీ సోదరుని మెడ నరికావు” అని అనేక సార్లన్నారు. తర్వాత “మీలో ఎవరైనా మరొకరిని ప్రశంసించటం తప్పనిసరి అయితే, ‘ఫలానా వ్యక్తి నా దృష్టిలో ఇలాంటివాడు. అల్లాహ్ కే అన్నీ తెలుసు. అల్లాహ్ సదృశంగా నేను ఎవరినీ పొగడను’ అని పలకాలి. ఆ పొగడబడే వ్యక్తి గురించి అతనికి వాస్తవంగా ఆ విధంగా తెలిసియుంటెనే అలా అనాలి. (బుఖారి, ముస్లిం).

وعن أبي موسى ™ قال: ((سمع النبي ﷺ رجلا يُثْني على رجل ويُطْريه في المدحة، فقال: لقد أهلكتم ـ أو قطعتم ظهر ـ الرجل))

ఒక వ్యక్తి మరో వ్యక్తిని అతిశయోక్తిగా ప్రశంసిస్తుండగా మహాప్రవక్త ﷺ అది విని, “మీరు అతన్ని నాశనం చేశారు” అని లేక “అతని వీపు విరగ్గొట్టారు” అని అన్నారని అబూ మూసా రజియల్లాహు అన్హు  తెలిపారు. (బుఖారి, ముస్లిం).

عن المقداد ™ قال: (( أمرنا رسول الله  أن نحثو في وجوه المدّاحين التراب)) 

ముఖస్తుతులు చేసేవారిని మేము చూస్తే వారి ముఖాన ఇంత మన్ను వేయాల“ని ప్రవక్త ﷺ మమ్మల్ని ఆదేశించేవారు. (ముస్లిం).

విశేషాలుః

1- అతిశయోక్తిగా ప్రశంసించడం నివారించబడింది.

2- ప్రశంసించు వ్యక్తి ఒక పరిధిలో ఉండి అతనికి తెలిసినంత వరకే ప్రశంసిస్తూ ఇలా అనాలిః మా దృష్టిలో ఇలాంటివాడు. అల్లాహ్ యే అన్నీ తెలిసినవాడు.

3- ముఖస్తుతి చేసేవారి ముఖాన మన్ను పోయాలని అదేశించటం జరిగింది.

93- పాటల నిషిద్ధత

[وَمِنَ النَّاسِ مَنْ يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ ويتخذها هزوا]

జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికీ, ఈ మార్గం వైపునకు పిలిచే పిలుపును ఎగతాళి చేయటానికీ, మానవులలోనే మనస్సును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకు వచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు. (31: లుఖ్మాన్: 6).

عن أبي مالك الأشعري ™ أنه سمع النبي ﷺ يقول: ((ليكونن من أمتي أقوام يستحلّون الحر والحرير والخمر والمعازف، ولينزلنّ أقوام إلى جنب علم يروح عليهم بسارحة لهم، يأتيهم ـ يعني الفقير ـ لحاجة فيقولوا: ارجع إلينا غدا، فيبيتهم الله، ويضع العلم ويمسخ الآخرين قردة وخنازير إلى يوم القيامة))

“నా అనుచరుల్లో కొందరు వ్యభిచారాన్ని, పట్టును, మత్తుపానీయాలను, వాద్యమును ధర్మసమ్మతమైనవిగా చేసుకుంటారు. (వాస్తవానికి అవి నిషిద్ధం) వారిలో కొందరు ఒక పర్వతపుటంచున నిలుస్తారు. సాయంకాలమున వారి వద్దకు వారి మేకలకాపరి వస్తాడు. ఒక బీదవాడు అతనికి అవసరమున్న వస్తువును అడుగుతూ వస్తాడు. ‘నీవు రేపు వచ్చేయి’ అని వారంటారు. అదే రాత్రి అల్లాహ్ వారిపై ఆ పర్వతాన్ని పడవేసి నాశనం చేస్తాడు. అందులో మరి కొందరిని కోతి, పందిగా మార్చేస్తాడు. వారు ప్రళయం వరకు (అదే శిక్ష అనుభవిస్తూ ఉంటారు)” అని ప్రవక్త ﷺ చెప్పగా విన్నట్లు అబూ మాలిక్ అష్అరి ﷺ  ఉల్లేఖించారు. (బుఖారి).

విశేషాలుః

1- వాద్యము, పాటలు నిషిద్ధం. అవి పనికిమాలినవి, నిషిద్ధమైనవి.

2- వాటిని ప్రవక్త ﷺ అనుచరజాతిలో కొందరు ధర్మసమ్మతంగా చేసుకుంటారు.

94- మహానుభావుడైన అల్లాహ్ దే గొప్పతనం. విస్తృతమైన రాజ్యం అతనిదే

وعن أبي ذر ™ عن النبي ﷺ فيما يروى عن الله تبارك وتعالى أنه قال: (يا عبادي إني حرمت الظلم على نفسي وجعلته بينكم محرما، فلا تظالموا، فلا تظالموا يا عبادي كلكم ضالّ إلاّ من هديته فاستهدوني أهدكم، يا عبادي كلكم جائع إلاّ من أطعمته فاستطعموني أُطعمكم، يا عبادي كلكم عارٍ إلاّ من كسوته فاستكسوني أُكسكم، يا عبادي إنكم تخطئون بالليل والنهار وأنا أغفر الذنوب جميعا فاستغفروني أغفر لكم، يا عبادي إنكم لن تبلغوا ضرّي فتضرّوني ولن تبلغوا نفعي فتنفعوني، يا عبادي لو أن أولكم وآخركم وإنسكم وجنكم كانوا على أتقى قلب رجل واحد منكم مازاد ذلك في ملكي شيئا، يا عبادي لو أن أولكم وآخركم وإنسكم وجنكم كانوا على أفجر قلب رجل واحد ما نقص ذلك من ملكي شيئا، يا عبادي لو أنّ أوّلكم وآخركم وإنسكم وجنكم قاموا في صعيد واحد فيسألوني فأعطيت كل واحد مسألته ما نقص ذلك مما عندي إلاّ كما ينقص المخيط إذا أُدخل البحر، يا عبادي إنما هي أعمالكم أُحصيها لكم ثم أُوفّيكم إيّاها، فمن وجد خيرا فليحمد الله ومن وجد غير ذلك فلا يلومنّ إلاّ نفسه))

అల్లాహ్ ఈ విధంగా బోధించినట్లు ప్రవక్త మహానీయులు ﷺ తెలిపారని అబూజర్ రజియల్లాహు అన్హు  ఉల్లేఖించారుః

“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరిపై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి. నా దాసులారా! మీరందరు మార్గం తప్పినవారు, నేను సన్మార్గం ఎవరికి ప్రసాదించానో వారుతప్ప. కనుక నాతోనే సన్మార్గం కొరకై అర్థించండి. నేను సన్మార్గం చూపుతాను. నా దాసులారా! మీరందరు నగ్నంగా ఉండేవారు నేను దుస్తులు ప్రసాదించినవారు తప్ప, కనుక దుస్తులకై నాతో అర్థించండి నేను మీకు దుస్తులు ప్రసాదిస్తాను. నా దాసులారా! మీరు రాత్రింభవళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు నేను సర్వ పాపాల్ని క్షమిస్తూ ఉంటాను. కనుక నాతో క్షమాపణ కోరండి నేను మిమ్మల్ని మన్నిస్తాను. నా దాసులారా! మీరు నాకు నష్టం చేకూర్చడానికి ఎంత ప్రయత్నం చేసినా, నష్టం చేకూర్చలేరు. లాభం చేయాలనుకున్నా లాభం చేయలేరు. నా దాసులారా! మీలోని మొదటివారు, చివరివారు, మానవులు, జిన్నాతులు సయితం అందురూ మీలోని ఎక్కువ దైవభీతి కలిగిన వ్యక్తిలా అయిపోయినా దాని వల్ల నా రాజ్యంలో ఏ కొంచమూ ఎక్కువ కాదు. నా దాసులారా! మీలోని మొదటివారు, వెనకటివారు మానవులూ, జిన్నాతులు అందరూ మీలోని ఒక దుర్మార్గునిలా అయిపోయినా నా రాజ్యంలో ఏ మాత్రం లోటు కలుగదు. నా దాసులారా! మీలోని మొదటివారు, వెనకటివారు మానవులూ, జిన్నాతులూ కలిసి ఒక మైదానంలో గుమికూడి నేను మీలో ప్రతి ఒక్కడు అడిగినంత ఇచ్చినప్పటికినీ సముద్రంలో సూదిని ముంచి తీస్తే (ఎంత నీరు తరుగుతుందో) అంత కూడా నా వద్ద ఉన్న దానిలో తరుగదు. నా దాసులారా! మీరు చేసే కార్యాల్ని నేను లెక్కిస్తాను. దాని ప్రతిఫలం సంపూర్ణంగా మీకు నొసంగుతాను. ఎవరైతే సత్ఫలితం పొందుతాడో అతడు అల్లాహ్ స్తోత్రము పఠించాలి. అలాగాక దుష్ఫలితం పొందినవాడు తన ఆత్మనే నిందించుకోవాలి. (ముస్లిం).

విశేషాలుః

1- పవిత్రుడైన అల్లాహ్ దే గొప్పతనం. మరియు విస్తృతమైన రాజ్యం అతనిదే.

2- అల్లాహ్ శక్తి, బలము, చాలా గొప్పది. ఆయన ఏ మాత్రం అక్కరలేనివాడు. తన సృష్టి నుండి అతీతుడు.

3- మానవులు అల్లాహ్ తరఫున సన్మార్గం, ఆహారం, మన్నింపు పొందుటకు చాలా అవసరం కలిగియున్నారు.


[1] అరబీ పదం ‘ఉసార’ ఉంది. దీని భావం నరకవాసుల చీము, రక్తము ఇంకా శరీరము నుండి వెళ్ళే చెడు పదార్థం అనీ కొందరు పండితులు చెప్పారు