సుత్రాహ్

నమాజు చేసే వాని ముందు నుండి నడిచే వారు, కొంచెం అవతల నుండి పోవటానికి వీలుగా, నమాజు చేస్తున్న వ్యక్తికి ముందు ఉంచవలసిన సరిహద్దులాంటి అడ్డు. ఎందుకంటే సలాహ్ చేయువాని ముందు నుంచి వెళ్ళుట నిషిద్ధం.

1) ఏదైనా వస్తువు సలాహ్ చేయువానికి సజ్దా కంటే కాస్త దూరంగా నిట్టనిలువుగా ఉంచవలెను.

2) ఆ వస్తువు ఒక మూర పొడవు ఉంటే చాలా ఉత్తమం.

3) సుత్రాహ్ ఇమాం ముందు ఉంచిన ఎడల అది ముఖ్తదీకి (ఇమాం వెనుక నమాజు చదివే వారు) కూడా  సరిపోవును. మరల ముఖ్తదీ (ఇమాం వెనుక నమాజు చదివే వారి) ముందు కూడా ఉంచవలసిన అవసరం లేదు. ఒకవేళ ముందు నుండి ఎవరైనా వెళ్ళి నట్లయితే, అతన్ని అడ్డుకోవడం నమాజు చేయువానిపై విధిగా ఉన్నది.

గమనిక: నమాజు చేసే వ్యక్తి ముందు నుండి దాటి వెళ్ళడం నిషిద్ధం (హరాం).