గుసుల్ (శుద్ధి స్నానం చేయటం) – Ghusl

గుసుల్ (స్నానం చేయటం)׃ ] {المائدة:6} ……. وَإِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوا….. [

దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిద 5׃6 “వ ఇన్ కున్ తుమ్ జునుబన్ ఫత్తహ్హరూ ”-“మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి శుద్ధులు కండి”

ఏఏ కారణ వలన గుసుల్ వాజిబ్ (విధి) అయిపోతుంది?

  1. వీర్యస్ఖలనం చేత – స్వప్నం వలన కానీ, స్త్రీలతో సరసాలాడడం వలన కానీ.
  2. రతిక్రియలలో పాల్గొనడం వలన – వీర్యస్ఖలనం అయిననూ, అవకపోయిననూ
  3. స్త్రీల వస్త్రస్రావం నిలిచిపోయాక అంటే బహిష్టు ఆగిపోయిన తరువాత
  4. పురుటి ముట్టు నిలిచిపోయాక అంటే ప్రసవానంతర రక్తస్రావం నిలిచిపోయాక
  5. అవిశ్వాసి ఇస్లాం స్వీకరించాక
  6. ముస్లిం యొక్క మరణం తర్వాత (అంటే మృతశరీరానికి గుసుల్ ఇవ్వడం)

గుసుల్ విధానం ׃ గుసుల్ నందు చేయవలసిన తప్పనిసరి కార్యలు׃

  1. పరిశుద్ధతను పొందు సంకల్పం చేయాలి
  2. దేహం మొత్తాన్ని నీటితో కడగాలి (ముక్కులో నీరు ఎక్కించడం, గరగరచేయడం, నోటిలో నీరు తీసుకుని పుక్కిలించడం కూడా భాగమే)
  3. వెంట్రుకల మధ్య కూడా వేళ్ళతో శుభ్రం (ఖిలాల్) చేయాలి.

గుసుల్ లోని సున్నతులు ׃

  1. ఆరంభానికి ముందు బిస్మిల్లాహ్ అనడం
  2. రెండు అరిచేతులను మూడేసి సార్లు కడగడం
  3. మర్మస్థానాన్ని ఎడమచేతితో కడగడం, దుర్గంధాన్ని దూరం చేయడం
  4. వుదూ చేయడం
  5. తల వెంట్రుకలను మూడుసార్లు కడగడం
  6. మొత్తం శరీరాన్ని కడగడం, మొదట కుడిభాగాన్ని కడుగుతూ ప్రారంభించాలి. తరువాత ఎడమభాగం కడగాలి.