[2 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రతి నమాజు తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (కల్పితాచారం) కిందికి వస్తుందా? https://www.youtube.com/watch?v=uT6QWE7p4EI [9 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నమాజ్ తర్వాత చేతులెత్తి దుఆ చేయడం బిద్అత్ (మతంలో కొత్త ఆచారం) అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ఆధారంగా చేతులెత్తి దుఆ చేయడాన్ని మూడు రకాలుగా విభజించారు. మొదటిది, ప్రవక్త గారు స్పష్టంగా చేతులెత్తిన సందర్భాలు (వర్షం కోసం దుఆ, అరఫా మైదానంలో దుఆ), ఇక్కడ మనం కూడా చేతులెత్తాలి. రెండవది, ప్రవక్త గారు దుఆ చేసినా చేతులెత్తని సందర్భాలు (సజ్దాలో, తషహ్హుద్ లో), ఇక్కడ మనం కూడా చేతులెత్తకూడదు. మూడవది, స్పష్టమైన ఆదేశం లేని సాధారణ సందర్భాలు. ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ అంగీకరించబడుతుందని హదీసులో ఉన్నప్పటికీ, ప్రవక్త గారు ప్రతి నమాజ్ తర్వాత క్రమం తప్పకుండా చేతులెత్తినట్లు రుజువు లేదు. కాబట్టి, దీనిని ఒక తప్పనిసరి అలవాటుగా మార్చుకోవడం ప్రవక్త విధానానికి విరుద్ధం మరియు బిద్అత్ అయ్యే ప్రమాదం ఉందని పండితులు వివరించారు. అప్పుడప్పుడు వ్యక్తిగతంగా దుఆ చేసుకుంటే తప్పు లేదు, కానీ దీనిని ఒక స్థిరమైన ఆచారంగా చేసుకోకూడదు.
ఏ నమాజ్ తర్వాత అయినా సరే చేతులెత్తి దుఆ చేయడం ఇది బిద్అత్ అంటున్నారు, ఇది నిజమా? అని అడుగుతున్నారు.
ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటి? నమాజుల తర్వాత దుఆ చేయడం బిద్అత్ అని అంటున్నారు. అయితే వాస్తవానికి, ప్రశ్న చాలా సంక్షిప్తంగా ఉంది. దీన్ని కొంచెం విడమరిచి అర్థం చేసుకునే అవసరం ఉంది. అప్పుడు ఇందులో బిద్అత్ ఏమిటి? సున్నత్ ఏమిటి? చేయవలసింది ఏమిటి? చేయకూడనిది ఏమిటి? మనకు అర్థమవుతుంది. ముందు అసలు ప్రశ్నలోనికే వెళ్దాం మనం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ద్వారా మనకు తెలుస్తుంది, ఫర్జ్ నమాజ్ ప్రత్యేకంగా, ఫర్జ్ నమాజుల గురించి. వాటి చివరి భాగం, అది సలాం కంటే ముందు కావచ్చు, సలాం తర్వాత కావచ్చు. మరికొన్ని ఉల్లేఖనాల్లో సలాం తర్వాత అన్నటువంటి ప్రస్తావన కూడా ఉంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. ఆ సమయంలో చేసే దుఆ అంగీకరించబడుతుంది. అలాంటప్పుడు, ఈ హదీథ్ విన్నవారు ఏమనుకుంటారు? మనం దుఆ చేయడంలో తప్పేంటి? కానీ ఇక్కడ మరో ప్రశ్నలో ఉన్నటువంటి విషయం, చేతులెత్తి దుఆ చేయడం అని ఇక్కడ ప్రస్తావన ఉంది.
దుఆలో చేతులు ఎత్తడంపై హదీసులు
అయితే, అబూ దావూద్ లోని ఒక హదీథ్,
إِنَّ اللَّهَ حَيِيٌّ كَرِيمٌ (ఇన్నల్లాహ హయ్యియున్ కరీమున్) అల్లాహు త’ఆలా చాలా సిగ్గుపడువాడు, ఎంతో ఉదారుడు.
అయితే ఎప్పుడైతే దాసుడు రెండు చేతులెత్తి అల్లాహ్ తో ఏదైనా దుఆ చేస్తాడో, అతని చేతులను, అతనికి ఏమీ ప్రసాదించకుండా తిరిగి ఉత్తగా, ఖాళీగా, ఏమీ ఇవ్వకుండా తిరిగి పంపేయడం అల్లాహ్ కు స్వయంగా ఇది ఇష్టం కాదు.
దీని ద్వారా ఏమర్థమవుతుంది? అంటే, మనం దుఆ చేసేటప్పుడు చేతులెత్తాలి. మొదటి హదీస్ ద్వారా, ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ స్వీకరించబడుతుంది అని, ఈ హదీస్ ద్వారా చేతులెత్తి చేస్తే మరీ స్వీకరించబడుతుంది అని, అల్లాహ్ తప్పకుండా ప్రసాదిస్తాడు అని. అలాంటప్పుడు మనం నమాజుల తర్వాత దుఆ చేసి, చేయడానికి చేతులు ఎత్తడం తప్పు లేదు అని ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది, కదా?
షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వారి ఫత్వా: మూడు స్థితులు
అయితే, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ యొక్క ఫత్వా దీని గురించి ప్రత్యేకంగా చదవడం జరిగింది. ఆయన చాలా మంచి సమాధానం ఇచ్చారు. ఏం చెప్పారు?
దుఆలో మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దుఆ చేస్తూ మనం ఎప్పుడు చేతులెత్తాలి, ఎప్పుడు చేతులెత్తకూడదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినే మనం అనుసరించాలి. అయితే, ఇక్కడ మనకు మూడు స్థితులు అనండి లేదా మూడు లెవెల్లు కనబడుతున్నాయి.
ఒకటి, కొన్ని సందర్భాలలో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తూ చేతులెత్తినట్లు రుజువు ఉంది. అక్కడ మనం తప్పకుండా చేతులెత్తాలి. ఉదాహరణకు, జుమా ఖుత్బా ఇస్తూ ఉండగా వర్షం కొరకు దుఆ చేసినప్పుడు చేతులెత్తి దుఆ చేశారు.
اللَّهُمَّ أَسْقِنَا (అల్లాహుమ్మ అస్ఖినా) ఓ అల్లాహ్, మాకు వర్షం కురిపించు.
సలాతుల్ ఇస్తిస్కా (వర్షం కొరకు నమాజ్) చేసినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు అని రుజువు ఉన్నది. హజ్ చేస్తున్నప్పుడు మైదానే అరఫాత్ లో ఉన్నారు, చాలా దీర్ఘ సమయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతులెత్తి దుఆ చేశారు. చివరికి ఒంటె మీద కూర్చుండి చేతులెత్తి దుఆ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఒంటెను నడపడానికి ఒక కట్టె ఉంటుంది కదా, అది కింద పడిపోయినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెయ్యి అలాగే ఎత్తి ఉన్నారు, మరో చెయ్యితో ఆ కింద పడిపోయిన వస్తువును తీసుకున్నారు. అంటే ఈ విధంగా ఎక్కడైతే ప్రవక్త చేతులెత్తారు అని మనకు రుజువు ఉందో, అక్కడ మనం చేతులెత్తాలి.
కానీ, ఎక్కడ ప్రవక్త చేతులెత్తలేదు, దుఆ చేశారు కానీ చేతులెత్తలేదు, అక్కడ మనం అలాగే దుఆ చేయాలి కానీ చేతులెత్తకూడదు. ఉదాహరణకు, సజ్దాలో దుఆ చేయండి అని చెప్పడం జరిగింది, దుఆ అంగీకరించబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే, తషహ్హుద్ లో ఉన్నప్పుడు కూడా మీరు దుఆ చేయండి అని చెప్పడం జరిగింది. కానీ ఈ సందర్భాలలో చేతులెత్తే ప్రస్తావన లేదు. అలాగే జుమా ఖుత్బా సందర్భంలో, సందర్భంలో, వేరే కొన్ని దుఆలు చేశారు కానీ చేతులెత్తినట్లు ఏ రుజువు లేదు, సుబూత్ లేదు. అందుకొరకు ఆ సందర్భాల్లో మనం చెయ్యి ఎత్తకూడదు. రెండు స్థితులు అర్థమైనాయి కదా?
ఇక మూడవది, ఏ సందర్భాల గురించి అయితే ఎత్తినట్లు, ఎత్తలేనట్లు ఏ ప్రస్తావన లేదో, అలాంటి చోట మనం ఏదైనా అడపాదడపా ఎత్తితే నష్టం లేదు కానీ, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం, దానిని ఒక అలవాటుగా చేసుకోవడం ఇది ప్రవక్త విధానానికి వ్యతిరేకం అవుతుంది.
ముగింపు మరియు తీర్మానం
ఫర్జ్ నమాజ్ తర్వాత దుఆ, దీని ఘనత వచ్చి ఉంది. కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజ్ యొక్క వివరణ ఎంతో మంది సహాబాలు ఉల్లేఖించారు. కానీ చేతులెత్తి దుఆ చేసినట్లు ఎక్కడైనా ఉల్లేఖనం ఉందా? లేదు. అందు గురించి, షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆలు ఫర్జ్ నమాజ్ తర్వాత చేసి, ఆ తర్వాత చేతులెత్తి ఒకవేళ దుఆ చేసుకుంటే అభ్యంతరం లేదు.
అయితే మరి, షేఖ్ బిన్ బాజ్, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ ఇంకా ఇతర పండితుల గురించి మనకు తెలుస్తుంది, వారు ఫత్వా ఏమిచ్చారు? ఫర్జ్ నమాజ్ తర్వాత చెయ్యి ఎత్తి దుఆ చేయడం బిద్అత్ అని. మరి ఎందుకు వీరు ఇలా చెప్పారు? ఎందుకు వీరు ఇలా చెప్పారంటే, మన వద్ద కొంతమంది ఇంకా వేరే ఏరియాలో కూడా, సలాం తింపిన తర్వాత ప్రవక్తతో ఏ ఏ దుఆలు అయితే రుజువై ఉన్నాయో, అవి ఆ విధంగా చదవకుండానే చేతులెత్తి దుఆ చేసే ఒక అలవాటుగా చేసుకుని ప్రతీ నమాజ్ తర్వాత చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు, అవును మరి, ఇది ప్రవక్త యొక్క సున్నత్ కాదు మరియు ప్రతీ సారి చేస్తున్నారు, అందుకొరకే ఇది బిద్అత్ లో వచ్చే ప్రమాదం ఉంటుంది, అందుకొరకే బిద్అత్ అని ఫత్వా ఇచ్చారు.
అందుకొరకు, దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. షేఖ్ అబ్దుల్లా అల్ జిబ్రీన్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఫత్వాను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక ఎక్కడైతే ప్రస్తావన లేదో, చెయ్యి ఎత్తినట్లు, ఎత్తనట్లు, అక్కడ ఎప్పుడైనా ఒక్కసారి మనం ఎత్తి దుఆ చేస్తే అందులో పాపం లేదు కానీ, అదే ఒక అలవాటుగా చేయకూడదు.
هذا ما نعلم، والله أعلم بالصواب (హాదా మా న’అలం, వల్లాహు అ’అలం బిస్సవాబ్) ఇది మాకు తెలిసినది, మరియు సరైనది అల్లాహ్ కే బాగా తెలుసు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.