ఒక ముస్లిం తన జీవితంలో ప్రతి రోజు ఎన్నిసార్లు సూరతుల్ ఇఖ్లాస్, ఫలఖ్ & నాస్ చదవాలి
https://youtu.be/dy6dlz_jG4g ⏰ 03:20 నిమిషాలు
🎤 నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రతి ముస్లిం రోజూ సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలఖ్, మరియు సూరా అన్-నాస్లను ఎప్పుడు, ఎన్నిసార్లు పఠించాలో వివరించబడింది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒకసారి, ఉదయం (అద్కార్ అస్-సబాహ్) మరియు సాయంత్రం (అద్కార్ అల్-మసా) దుఆలలో మూడుసార్లు, మరియు నిద్రపోయే ముందు మూడుసార్లు అరచేతులలోకి ఊది శరీరంపై తుడుచుకుంటూ పఠించాలని చెప్పబడింది. ఈ విధంగా ప్రతి సూరాను రోజుకు 14 సార్లు పఠిస్తారని లెక్కించారు. ఒకవేళ ఉదయం మరియు సాయంత్రం అద్కార్లను ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజ్‌ల తర్వాత చేస్తే, ఆ మూడుసార్లు చేసే పఠనంలోనే నమాజ్ తర్వాత చేసే ఒకసారి పఠనం కూడా కలిసిపోతుందని, అప్పుడు మొత్తం సంఖ్య 12 అవుతుందని స్పష్టం చేశారు. ఈ సూరాల ఘనతను తెలుసుకొని, ఇతర సందర్భాలలో కూడా వాటిని పఠించాలని ప్రోత్సహించారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ప్రతి ముస్లిం, ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
సూరాలు చదవాలి. ఇవి ఐదుసార్లు అవుతాయి. మరియు ఉదయం అద్కార్, అద్కారుస్ సబాహ్ అని ఏవైతే అంటామో, morning supplications, వాటిలో కూడా ఈ మూడు సూరాలూ, సూరాలు మూడేసి సార్లు చదవాలి.
అలాగే అద్కారుల్ మసా, సాయంకాలం చదివే అద్కార్లలో కూడా ఈ మూడు సూరాలు, ఇఖ్లాస్, ఫలఖ్, నాస్ మూడేసి సార్లు చదవాలి. ఎన్ని అయినాయి? ఉదయం మూడు, సాయంకాలం మూడు, ఆరు. మరియు ప్రతీ ఫర్జ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి. ఐదు. పదకొండు అయినాయి.
మళ్లీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి, అందులో ఊది, ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి, తలపై, ముఖముపై, శరీరం ముందు భాగం, మిగతా శరీర భాగములతో తుడుచుకోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ విధంగా మొత్తం 14 సార్లు అవుతుంది.
పఠనాల సంఖ్య మరియు ఒక ప్రత్యేక మినహాయింపు
అద్కారుస్ సబాహ్‌లో మూడు సార్లు, మూడు మూడు సార్లు, అద్కారుల్ మసాలో మూడు మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు, మూడు మూడు సార్లు, తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజ్‌ల తర్వాత ఒక్కొక్కసారి, పద్నాలుగు.
కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ. ఎవరైనా అద్కారుస్ సబాహ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగ్రిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు, అలాంటప్పుడు వారు
మూడుసార్లు
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్, ఏకైకుడు.” (112:1)
మూడుసార్లు
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
(ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను వేకువ ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (113:1)
మూడుసార్లు
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్)
(ఓ ముహమ్మద్!) ఇలా అను : “నేను మానవుల ప్రభువు శరణు వేడుకుంటున్నాను.” (114:1)
చదువుకున్నారంటే, ఫజ్ర్ తర్వాత ఒక్కొక్కసారి, మగ్రిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే, అంటే మూడుసార్లు చదివితే, ఇంక్లూడ్ (include) అయిపోతుంది. ఎందుకంటే ఫజ్ర్ తర్వాత అద్కారుస్ సబాహ్ ఉద్దేశంతో, మగ్రిబ్ తర్వాత అద్కారుల్ మసా ఉద్దేశంతో చదువుతున్నారు గనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే, టోటల్ 12 సార్లు అవుతాయి.
ఇవే కాకుండా ఒక ముస్లిం ఈ సూరాల ఘనతను, సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్, సూరతున్నాస్ ఘనతలను హదీథుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాసులో హాజరవుతూ ఉండండి.