హదీసు పరిచయం – (బస్తవి) (12 పేజీలు) [PDF]
హదీసు అంటే ఏమిటి? ఖురాన్ లో హదీసు ప్రస్తావన? ఖురాన్ వివరణలో హదీసు ప్రాముఖ్యత. హదీసు వివేక పూరితమైనది. ఇస్లాం ను అర్ధం చేసుకోవడానికి హదీసు అవసరం. హదీసులు కూడా అల్లాహ్ దగ్గర నుండి వచ్చినవే. హదీసు ప్రత్యేకతలు…
పరిచయము
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
ప్రవక్త (స) ‘హదీసు’ల సేవకుడు అబ్దుస్సలామ్ బ‘స్తవీ ముస్లిమ్ సోదరులకు విన్నవించుకునేది ఏమనగా ప్రస్తుత కాలంలో అవిశ్వాసం, దైవ ధిక్కారం, నాస్తికత్వం, మార్గభ్రష్టత్వం రోజురోజుకూ వ్యాపిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. పరాయి వారే కాదు, ముస్లిములు కూడా వీటికి గురై తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు. ఖుర్ఆన్ను తమ కల్పిత మూఢ నమ్మకాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అంతే కాదు ప్రవక్త (స) ‘హదీసు’ల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ వీరు ఈ ‘హదీసు’ల ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలుసు కుంటే ఏనాడూ ఇటువంటి మహా పాపాలకు పాల్పడరు. ఇందులో చాలా సులభమైన పద్ధతిలో ‘హదీసు’లను అనువదించడం వివరించడం జరిగింది. అల్లాహుత’ఆలా మనందరికీ ‘హదీసు’లను అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్!
Read More “హదీసు పరిచయము & ప్రాముఖ్యత – అబ్దుస్సలామ్ బ‘స్తవీ – మిష్కాతుల్ మసాబీహ్”