ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [పుస్తకం]

ఇస్లామియా జుమా ప్రసంగాలు - షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [పుస్తకం]

పుస్తకం: ఇస్లామీయ జుమా ప్రసంగాలు
సంకలనం : ఫజీలతు ష్షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ ఆర్రస్సీ
అనువాదం :షేఖ్ అబ్దుల్లాహ్ జామయీ,షేఖ్ అబ్దుల్ మాబూద్ జామయీ

ఈ సంపుటంలో ఇస్లాంకు సంబంధించిన మూల విశ్వాసాలు, ఆదేశాలు, బోధనల యొక్క ప్రత్యేకతలను, ఘనతలను పొందుపరిచారు. అదే విధంగా ఇస్లాం ను భంగపరిచే విషయాలు మరియు సంవత్సరంలోని అనేక వేళలకు సంబంధించినటువంటి ప్రసంగాలను సైతం పొందుపరచడం జరిగింది…

ఈ ఉపన్యాసాలను సంకలనం చేయడంలో, నా దృష్టిలో ప్రవక్త యొక్క ప్రబోధాలను ప్రతిబింబించే మూడు ముఖ్యమైన విషయాలపై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. మొదటి విషయం ఏమిటంటే, విశ్వాసం యొక్క చర్చలపై ఎక్కువ శ్రద్ధ చూపబడింది, ఎందుకంటే ప్రవక్త యొక్క ఉపన్యాసాలు; అల్లాహ్ యొక్క అనుగ్రహల గురించి, ఆయన ప్రశంస గురించి, మరియు ఆయన పరిపూర్ణ లక్షణాల ప్రస్తావన గురించి ఉండేవి. అలాగే ఇస్లాం మూల సూత్రాల ప్రస్తావన, స్వర్గం మరియు నరకం మరియు పరలోకం యొక్క ప్రస్తావన, దైవభీతి, అల్లాహ్ యొక్క ఆగ్రహం, మరియు ఆయన ప్రసన్నతను ఎలా పొందాలి అనే అంశాలను కలిగి ఉండేవి. ఏ విధంగానైతే ఈ విషయమై (జాదుల్ మఆద్) అనే పుస్తకములో ఇబ్నే ఖయ్యిం (రహిమహుల్లాహ్) గారు పేర్కొన్నారో.

రెండవ మరియు మూడవ విషయం ఏమిటంటే, నేను క్లుప్తతతో పాటు సమగ్రతను దృష్టిలో ఉంచుకున్నాను, ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహుఅలైహి వసల్లం) వారు ఉపన్యాసం చిన్నదిగా మరియు నమాజ్ సుదీర్ఘంగా చేసేవారు.

శుక్రవారం జరిగే ఉపన్యాసాలు సమాజంపై విద్యాపరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి, మరియు ఇటువంటి ప్రసంగాలు వక్తలను  ధార్మికంగా తీర్చిదిద్దడానికి ఎంతో సహాయపడతాయి, కాబట్టి ఈ లక్ష్యాల దృష్ట్యా ఇస్లామియా జుమా ప్రసంగాలు అనే ఈ పుస్తకంలో 64 అంశాలపై ప్రసంగాలను పొందుపరచడం జరిగింది.

అల్లాహ్ తో దుఆ ఏమనగా ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన వారికి,మరియు దీని గురించి కృషి చేసిన వారికి మరియు దీనిని ప్రచురించినవారికి ఇహపరాల సాఫల్యాన్ని ప్రసాదించుగాక!

1) అల్లాహ్ ఉనికిపై విశ్వాసం
2) అల్లాహ్ యొక్క రబూబియత్ పై విశ్వాసం
3) ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్’యే అని విశ్వసించడం తప్పనిసరి
4) అల్లాహ్ నామాలపై, గుణగణాలపై విశ్వాసం
5) దైవ దూతలపై విశ్వాసం
6) దైవ గ్రంధాలపై విశ్వాసం
7) దైవ ప్రవక్తలపై విశ్వాసం – 2 ప్రసంగాలు – [మొదటి భాగం] – [రెండవ భాగం]
8) అంతిమ దినంపై విశ్వాసం – 8 ప్రసంగాలు – [భాగం 01] [02] [03] [04] [05] [06] [07] [08]
9) విధి వ్రాతపై విశ్వాసం

01) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) పై విశ్వాసం యొక్క షరతులు, నిబంధనలు
02) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) పై విశ్వాసం యొక్క అవశ్యకతలు
03) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క గొప్పతనానికి గల పది కారణాలు
04) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – విధేయత
05) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – ఆయన్ను ప్రేమించడం
06) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – అవిధేయత పట్ల జాగ్రత్త వహించడం
07) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – ఆయన సహాబాలను గౌరవించడం
08) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – ఆయన కుటుంబీకుల(అహ్లె-బైత్)ను గౌరవించడం
09) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – ఆయన సతీమణులను గౌరవించడం
10) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క హక్కు – ఆయనపై దరూద్ పంపడం
11) ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم)పై దరూద్ పంపడం వలన కలిగే లాభాలు
12) ప్రవక్త (صلى الله عليه وسلم) హిజ్రత్ ద్వారా లభించే పదహారు పాఠాలు

1) మొదటి విషయం- షిర్క్
2) రెండవ విషయం- ముష్రిక్లను కాఫిర్లుగా నమ్మక పోవడం
3) మూడవ విషయం- ఇతరుల పద్దతి ప్రవక్త పద్ధతి కన్నా ఉత్తమమైనదిగా భావించడం
4) నాల్గవ విషయం- ప్రవక్త తెచ్చిన షరియత్ (ధర్మం)లో ఏ ఒక్క భాగాన్ని ద్వేషించుట
5) ఐదవ విషయం- ధర్మంలోని ఏదైనా ఆజ్ఞ గురించి ఎగతాళి చేయుట
6) ఆరవ విషయం- జాదు (చేతబడి)
7) ఏడవ విషయం- జ్యోతిష్యం
8) ఎనిమిదవ విషయం- విశ్వాసులకు వ్యతిరేకంగా కాఫిర్లకు సహాయం చేయుట
9) తొమ్మిదవ విషయం- ఇస్లాం నుంచి తొలిగిపోవచ్చు అనే విశ్వాసం కలిగిఉండటం
10) పదవ విషయం- : ఇస్లాంకు విముఖుత చూపుటం

భాగాలు: [పార్ట్ 01] [పార్ట్ 02] [పార్ట్ 03] [పార్ట్ 04] [పార్ట్ 05] [పార్ట్ 06] [పార్ట్ 07] [పార్ట్ 08]

1) నమాజ్ ప్రాముఖ్యత
2) నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత
3) సామూహిక నమాజ్ విధి-వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం
4) జుమా నమాజ్ యొక్క ప్రత్యేకతలు, ఘనతలు

1) మొహర్రం నెల మరియు ఆషూరా ఉపవాసం గొప్పతనం
2) జుమా రోజు ప్రత్యేకతలు మరియు గొప్పతనం
3) రంజాన్ నెలకు గల ముఖ్య పది ఉద్దేశాలు
4) రంజాన్ నెలకు గల ముప్పై ప్రత్యేకతలు- మొదటి భాగం
5) రంజాన్ నెలకు గల ముప్పై ప్రత్యేకతలు- రెండవ భాగం
6) ప్రజలకు రమజాన్ మాసంలో ఖుర్ఆన్ పఠన గురించి ప్రోత్సహించడం
7) లైలతుల్ ఖద్ర్ యొక్క పది ప్రత్యేకతలు
8) రమజాన్ పండుగ గురించి పది ముఖ్యమైన విషయాలు
9) జిల్ హిజ్జా నెల పది రోజుల ప్రత్యేకతలు మరియు ఘనత
10) అరఫా దినం యొక్క ప్రత్యేకతలు
11) ఈదుల్ అద్హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు

VII. బైతుల్ మఖ్దిస్, మస్జిదె అఖ్సా యొక్క పది ప్రత్యేకతలు