హదీస్ కాంపిటీషన్ -1442 రంజాన్ (2021)

బిస్మిల్లాహ్

ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ హదీసు కంఠస్థ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చును.మీ సౌకర్యం ప్రకారంగా కంఠస్థం చేసి wa.me/966533458589 నెంబర్ కి చూడకుండా మీరు వినిపించి వాయిస్ మెసేజ్ పెట్టగలరు. ఏప్రిల్ 6వ తేదిన పరీక్ష జరుగును. దాని వివరాలు త్వరగా మేము తెలుపుతాము ఇన్ షా అల్లాహ్

హదీస్ కాంపిటీషన్ -1442 రంజాన్ (2021)
యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2sS-qyktIUO9W1gpnf1M46

హదీస్ నెంబర్ : 01

మొదటి హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

البخاري 3277 – أنَّ أَبَا هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ يَقُولُ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِذَا دَخَلَ رَمَضَانُ فُتِّحَتْ أَبْوَابُ الجَنَّةِ، وَغُلِّقَتْ أَبْوَابُ جَهَنَّمَ وَسُلْسِلَتِ الشَّيَاطِينُ»

ఇజా దఖల రమజాను ఫుత్తిహత్ అబ్వాబుల్ జన్నహ్, వగుల్లిఖత్ అబ్వాబు జహన్నమ్, వసుల్సిలతిష్ షయాతీన్

రమజాను మాసము ప్రవేశించిందంటే స్వర్గపు ద్వారాలు తెరువబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి మరియు షైతానులను ఖైదు చేయడం జరుగుతుంది

సహీ బుఖారీ 3277 – అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం

హదీస్ నెంబర్ : 02

రెండవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

صحيح ابن خزيمة 2212 – حَدَّثَنَا عَلِيُّ بْنُ سَعِيدٍ التُّسْتَرِيُّ، أَخْبَرَنَا الْحَكَمُ بْنُ نَافِعٍ، عَنْ شُعَيْبٍ يَعْنِي ابْنَ أَبِي حَمْزَةَ، عَنْ عَبْدِ اللَّهِ بْنِ أَبِي حُسَيْنٍ، حَدَّثَنِي عِيسَى بْنُ طَلْحَةَ، عَنْ عَمْرِو بْنِ مُرَّةَ الْجُهَنِيِّ قَالَ: جَاءَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلٌ مِنْ قُضَاعَةَ، فَقَالَ لَهُ: يَا رَسُولَ اللَّهِ أَرَأَيْتَ إِنْ شَهِدْتُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّكَ رَسُولُ اللَّهِ، وَصَلَّيْتُ الصَّلَوَاتِ الْخَمْسَ، وَصُمْتُ الشَّهْرَ، وَقُمْتُ رَمَضَانَ، وَآتَيْتُ الزَّكَاةَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ مَاتَ عَلَى هَذَا كَانَ مِنَ الصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ»

[التعليق] 2212 – قال الألباني: إسناده صحيح والتستري هو علي بن سعيد بن جرير النسائي مات سنة 56 أو 57 ومائتين

ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి: నేను ‘సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప మరెవ్వడూ లేడని మరియు మీరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త’ అని సాక్ష్యమిచ్చి, ఐదు పూటల నమాజు స్థాపించి, రమజాన్ మాసమెల్లా ఉపవాసముండీ, అందులో చేయవలసిన ఇతర ఆరాధనలు చేస్తూ, జకాత్ (విధిదానం) కూడా చెల్లిస్తూ ఉంటే నా సంగతేమిటి అని అడిగాడు.  అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

మన్ మాత అలా హాజా కాన మినస్ సిద్దీఖీన వష్షుహదాఅ

ఎవరు ఈ స్థితిలో చనిపోతారో అతను సత్యవంతుల్లో, అమరవీరుల్లో లెక్కించబడతాడు


సహీ ఇబ్ను హిబ్బాన్ 2212 – షేఖ్ అల్బానీ సహీ అన్నారు
ఉల్లేఖనం : అమ్ర్ బిన్ ముర్రహ్ అల్ జుహనీ

హదీస్ నెంబర్ : 03

మూడవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

وَنَادَى مُنَادٍ: يَا بَاغِيَ الْخَيْرِ أَقْبِلْ، وَيَا بَاغِيَ الشَّرِّ أَقْصِرْ، وَلِلَّهِ عُتَقَاءُ مِنَ النَّارِ، وَذَلِكَ فِي كُلِّ لَيْلَةٍ

వ నాదా మునాదిన్: యా బాగియల్ ఖైరి అఖ్బిల్, వయా బాగియష్షర్రి అఖ్సిర్, వలిల్లాహి ఉతఖాఉ మినన్నార్, వజాలిక ఫీ కుల్లి లైలహ్.

(రమజాను ఆరంభంలో) ఒక ప్రకటన చేసేవాడు ప్రకటన చేస్తాడు: ఓ పుణ్యాన్నాశించేవాడా! (పుణ్యకార్యాల్లో) ముందుకు సాగిపో!. ఓ పాపాన్నాశించేవాడా! (పాప కార్యాల నుండి) ఆగిపో! నరకాగ్ని నుండి విముక్తి పొందే దాసులు అనేకముంటారు (వారిలో ఒకిరివి నీవు అయిపో). ఇలా రమజానులోని ప్రతి రాత్రి జరుగుతూ ఉంటుంది.

ఇబ్ను మాజ 1642 – షేఖ్ అల్బానీ సహీ అన్నారు. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు

హదీస్ నెంబర్ : 04

నాలుగవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

كُلُّ عَمَلِ ابْنِ آدَمَ لَهُ، إِلَّا الصِّيَامَ، فَإِنَّهُ لِي وَأَنَا أَجْزِي بِهِ

కుల్లు అమలిబ్ని ఆదమ లహు ఇల్లస్సియాం, ఫఇన్నహూ లి వఅన అజ్‘జీ బిహ్

మానవుడు చేసే ప్రతి సత్కార్యం అతని కొరకే,
[అల్లాహ్ చెప్పాడు:] కాని ఉపవాసం అది నా కొరకు, నేనే దాని సత్ఫలితం అతనికి ప్రసాదిస్తాను

[బుఖారీ 1904]

హదీస్ నెంబర్ : 05

ఐదవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

وَالصِّيَامُ جُنَّةٌ، وَإِذَا كَانَ يَوْمُ صَوْمِ أَحَدِكُمْ فَلاَ يَرْفُثْ وَلاَ يَصْخَبْ [ولا يَجهَل]،

“వస్సియాము జున్నహ్, వఇజా కాన యౌము సౌమి అహదికుమ్ ఫలా యర్ ఫుస్ వలా యస్ ఖబ్ [వలా యజ్ హల్]”

ఉపవాసము ఢాలు వంటిది
( అంటే పాపాల నుండి మరియు నరకము నుండి అడ్డు). మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న రోజు అశ్లీలానికి, వాదులాట్లకు [మరియు మూర్ఖత్వానికీ] పాల్పడకూడదు.

[బుఖారీ 1904]

హదీస్ నెంబర్ :06

ఆరవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

فَإِنْ سَابَّهُ أَحَدٌ أَوْ قَاتَلَهُ، فَلْيَقُلْ إِنِّي امْرُؤٌ صَائِمٌ ”

“ఫఇన్ సాబ్బహూ అహదున్ ఔ ఖాతలహు ఫల్ యఖుల్ ఇన్నిమ్ రుఉన్ సాఇమ్”

ఎవరైనా అతనితో తిట్లకు, గొడవకు దిగితే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పాలి


[బుఖారీ 1904]
అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం

హదీస్ నెంబర్ :07

ఏడవ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

الصَّلَوَاتُ الْخَمْسُ، وَالْجُمُعَةُ إِلَى الْجُمُعَةِ، وَرَمَضَانُ إِلَى رَمَضَانَ، مُكَفِّرَاتٌ مَا بَيْنَهُنَّ إِذَا اجْتَنَبَ الْكَبَائِرَ

అస్సలవాతుల్ ఖమ్ స్, వల్ జుముఅతు ఇలల్ జుముఅహ్, వరమజాను ఇలా రమజాన్, ముకఫ్ఫిరాతుమ్ మాబైనహున్న్, ఇజజ్ తనబల్ కబాఇర్

ఘోర పాపాలకు దూరంగా ఉంటే ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరొక జుమా, ఒక రమజాన్ నుండి మరొక రమజాన్ వరకు మధ్య జరిగిన పాపాలకు పరిహారమవుతాయి.

ఉల్లేఖనం అబూ హురైరా రజియల్లాహు అన్హు
[సహీ ముస్లిం 233]

హదీస్ నెంబర్ :08

8వ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

مَنْ صَامَ رَمَضَانَ، إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

మన్ సామ రమజాన ఈమానవ్ వహ్ తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహ్

ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ రమజాను మాసమెల్లా ఉపవాసం పాటిస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి


సహీ బుఖారీ 38
ఉల్లేఖనం: అబూ హురైరా రజియల్లాహు అన్హు

హదీస్ నెంబర్ : 09

9వ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

మన్ ఖామ రమజాన ఈమానవ్ వహ్ తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహ్

ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ రమజాను మాసమెల్లా తరావీహ్ చేస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి


సహీ బుఖారీ 37
ఉల్లేఖనం: అబూ హురైరా రజియల్లాహు అన్హు

హదీస్ నెంబర్ :10

10వ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

مَنْ قَامَ لَيْلَةَ القَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

మన్ ఖామ లైలతల్ ఖద్రి ఈమానవ్ వహ్ తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహ్

ఎవరు విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశిస్తూ లైలతుల్ ఖద్ర్ (ఘనమైనరేయి)లో జాగారం (చేస్తూ సత్కార్యాలు) చేస్తారో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి


సహీ బుఖారీ 1907
ఉల్లేఖనం: అబూ హురైరా రజియల్లాహు అన్హు

హదీస్ నెంబర్ : 11

11వ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

مَنْ لَمْ يَدَعْ قَوْلَ الزُّورِ وَالعَمَلَ بِهِ، فَلَيْسَ لِلَّهِ حَاجَةٌ فِي أَنْ يَدَعَ طَعَامَهُ وَشَرَابَهُ

మల్లమ్ యదఅ ఖౌలజ్జూరి వల్ అమల బిహ్, ఫలైస లిల్లాహి హాజతున్ ఫీ అఁయ్యదఅ తఆమహు వషరాబహ్

ఎవరు (ఉపవాసం ఉండి) అసత్యపు మాట మరియు ఆచరణ వదలరో ఆ వ్యక్తి అన్నపానీయాలను వదిలిపెట్టడం పట్ల అల్లాహ్ కు ఏలాంటి ఆసక్తి ఉండదు.


సహీ బుఖారీ 1903
ఉల్లేఖనం: అబూ హురైరా రజియల్లాహు అన్హు

హదీస్ నెంబర్ :12

12వ హదీసు అరబీ & తెలుగు లో విని కంఠస్థం చేయండి

بُنِيَ الإِسْلاَمُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لاَ إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلاَةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَالحَجِّ، وَصَوْمِ رَمَضَانَ

బునియల్ ఇస్లాము అలా ఖమ్స్: షహాదతి అల్లాఇలాహ ఇల్లల్లాహు వఅన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, వఇఖామిస్సలాహ్, వఈతాఇజ్జకాహ్, వల్ హజ్జ్, వసౌమి రమజాన్.

ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఉంది: అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట, నమాజ్ స్థాపించుట, జకాత్ (విధిదానం) చెల్లించుట, హజ్ చేయుట మరియు రమజాను మాసమెల్లా ఉపవాసముండుట.


సహీ బుఖారి 8
ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా

గమనిక: మిగతా హదీసులు ఒక్కక్కటిగా జత చేస్తాము, ఇన్ షా అల్లాహ్

%d bloggers like this: