
ధర్మజ్ఞానం ఎవరివద్ద అభ్యసించాలి?
రచన:ఫజీలతుషేఖ్ హుసైన్ మదనీ (హఫిజహుల్లాహ్)
పున:పరిశీలన: డా. సయీద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
అనువాదం: సయ్యద్ ఇలియాస్, కావలి (హఫిజహుల్లాహ్)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [12 పేజీలు]
ధర్మజ్ఞానం ఎవరి వద్ద అభ్యసించాలి?
డా. సయీద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/F-MBBti-ISY (86 min)
అనువాదకుని పలుకులు
జ్ఞానులు, అజ్ఞానులు సమానం కాగలరా? (ఖురాన్ 39:9)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఉద్బోధిస్తుండగా తాను విన్నానని అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేసారు: “అల్లాహ్ జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి లాక్కోని పైకి లేపుకోడు. కాని ఉలమాల (పండితుల) మరణం ద్వారా జ్ఞానాన్ని లేపుకుంటాడు ఆ విధంగా ఒక్క జ్ఞాని కూడా మిగలకుండా చేస్తాడు. ఆ తర్వాత ప్రజలు ఆజ్ఞానులను తమ నాయకులుగా (గురువులుగా) చేసుకుంటారు. వారిని ఏదైయిన ప్రశ్న అడిగితే వారు తమ అజ్ఞానంతోనే తీర్పులు ఇస్తారు. ఫలితంగా స్వయంగా తాము మార్గభ్రష్ఠులు అవుతారు. ఇతరులను కూడా మార్గభ్రష్టత్వానికి గురిచేస్తారు.” (బుఖారీ, ముస్లిం)
పై హదీసు ద్వారా మనం చాలా విషయాలను అర్ధం చేసుకోవలసి ఉంది:
1.జ్ఞానం అనేది పుస్తకాలలో, సి.డి. లలో, ఇంటర్నెట్ లో ఉందా? లేదా ఉలమాల హృదయాలలోన?
2.ఒకవేళ పుస్తకాలలో మరియు సి.డి.లలో అయితే అల్లాహ్ వాటిని లేపుకొనే అ జ్ఞానాన్ని అంతం చేసేవాడు, ఉలమాలకు మృత్యువు ప్రసాదించి కాదు
3.మనం ఎవరిని మార్గదర్శకులుగా చేసుకోవాలి? జ్ఞానమున్న పండితులనా? లేక మిడి మిడి జ్ఞానం కలవారినా?
సోదర సోదరీమణులారా! ఈనాడు మన చుట్టూ ఎంతో మంది ఇస్లాం జ్ఞానాన్ని బోధించే ఉలమాలు ఉన్నప్పటికిని మనం మన గురువులు, మార్గదర్శకులు నాయకులుగా అజ్ఞానులను చేస్తుకుంటున్నాము. కేవలం పై పై తళుకులు చూసి జ్ఞానికి అజ్ఞానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక పోతున్నాము. తద్వారా మన పరలోక జీవితం సంకటంలో పడిపోతుంది. మనం ఉలమాలకు (పండితులకు) ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వడం లేదు. దానికి బదులుగా మన తలలపై అజ్ఞానులు స్వారీ చేస్తున్నారు. ధార్మిక పండితులు ధర్మ జ్ఞానం కోసం ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఎన్నో త్యాగాలు చేసి పరదేశాలకు సైతం ప్రయాణాలు చేసి ధర్మ జ్ఞానార్జన చేశారు. అటువంటి వారిని వదలి ఇతరత్రులను మన మార్గదర్శకులుగా చేసుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. ప్రపంచంలో ఎప్పుడెప్పుడైతే అజ్ఞానులు నాయకులుగా, మార్గదర్శకులుగా అయ్యారో ఆ సమాజంలో మన ఊహకందని కొత్త కొత్త సమస్యలు, ఉపద్రవాలు బయలుదేరుతాయి. ఇంకా అలాగే ఆ జాతి సమూలంగా నాశనం అవుతుంది.
ఈనాడు చాలామంది నెట్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసి చదివేసి, యూ ట్యూబ్ లో ప్రసంగాలు విని తమవద్ద గొప్ప జ్ఞానం ఉందని తామే గొప్ప విద్వాంసులుగా భావిస్తున్నారు. సాధారణంగా పుస్తకాలు, టి.వి., సి.డి., నెట్ల ద్వారా విద్యాభ్యాసం చేసినవారు గర్వానికి గురి అవుతూ ఉంటారు. అదే గురువు వద్ద విద్యాభ్యాసం చేసిన వ్యక్తికి అణుకువ, సామాజిక మర్యాదలు వంటి సద్గుణాలు అలవడుతాయి
బహుదూరపు బాటసారులమైన మనకు ఈ ఉలమాలు ఆకాశంలో మిరిమిట్లు గొల్పుతూ దారి తప్పిన ప్రయాణికులకు మార్గం చూపే నక్షత్రాల లాంటి వారు. ఎడారిలో దప్పికగొన్న బాటసారులకు దాహాన్ని తీర్చు ఒయాసిస్ లాంటి వారు. వీరి చెలిమి, సాంగత్యము ఎన్నడూ నష్టం చేకూర్చదు.
మనము ఆరోగ్యము క్షీణిస్తే వైద్య సలహాల కొరకు వైద్యవృత్తిలో ఆరితేరిన వైద్యుణ్ణి సంప్రదిస్తాము. అలాగే ఇల్లు కట్టాలన్నా మంచి ఇంజనీరును వెతుకుతాము ఇలా ఐహిక జీవితానికి సంబంధించిన ప్రతి పనికి ప్రావీణ్యులను సంప్రదిస్తాము.
కానీ ఒక్క ధర్మ విషయములో సలహాలు మరియు సూచనలకు ఏ దారినపోయే దానయ్యనో అడుగుతాము. తెలిసీతెలియక అతనిచ్చే సలహాలను పాటించి మన ఇహ పరాలను నాశనం చేసుకుంటున్నాము. తెలియకపోతే కనీసం ధర్మపండితుల (ఉలమాలు) ను అడిగి తెలుసుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం లేక స్వయంగా మార్గభ్రష్టులవుతూ ఇతరులను మార్గభ్రష్టత్వానికి గురిచేస్తున్నారు. అఖీదా, ఆరాధనలు, జకాత్, వ్యాపారలావాదేవీలు ఆస్తిపాస్తుల పంపకాలు ఇంకా ప్రతి విషయంలోను స్వయంగా మిడి మిడి జ్ఞానంతో వారికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉలమాలను ప్రక్కన పెట్టి పై పై తళుకులు బెళుకులను చూసి అల్ప జ్ఞానులను ప్రశ్నించి మోసపోతున్నారు.
ఉర్దూలో ఒక కవి ఇలా అంటున్నాడు. దాని భావం
తెలిసీ తెలియని వైద్యునితో ఆయుష్షుకు ముప్పు
తెలిసీ తెలియని పండితునితో విశ్వాసానికే ముప్పు
అల్లాహ్ మనందరికి ప్రావీణ్యులైన పండితులను మన మార్గదర్శకులుగా చేసుకునే భాగ్యాన్ని కల్పించుగాక. అమీన్
ఈ పుస్తకం“ఇల్మేదీన్ కిన్ సే సీఖే”ను తెలుగు భాషలోనికి అనువాదం చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ముందుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పుస్తక రచయిత ఫజీలతు షేఖ్ సయ్యద్ హుసైన్ ఉమరీ మదనీ (హఫిజహుల్లాహ్) “ధర్మ జ్ఞానము మనం ఎవరి వద్ద నేర్చుకోవాలి?” అన్న విషయంపై ఖుర్ఆన్ సహీహ్ హదీసులు మరియు సలఫెసాలెహీనుల సూక్తుల ద్వారా ఎంతో చక్కగా వివరించారు. అల్లాహ్ వారికి ఇహ పరలోకాలలో తగిన ప్రతిఫలం ప్రసాదించుగాక. పుస్తకం చదివిన వెంటనే నేను షేఖ్ గారికి ఫోన్ చేసి ఈ పుస్తకాన్ని నేను తెలుగులో అనువదిస్తాను అని అన్నాను. అందుకు షేఖ్ మదనీ హఫిజహుల్లాహ్ ఎంతో సంతోషంతో నాకు ఆ భాధ్యతను అప్పగించారు. తప్పులు లేకుండా అనువాదం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అల్లాహ్ నుప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. ఈ పుస్తకం పున:పరిశీలన విషయంలో నాకు తోడ్పడిన డా॥ సయీద్ అహ్మద్ మదని (హఫిజహుల్లాహ్) గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
సయ్యద్ ఇలియాస్, కావలి
B.A., Arabic, EFL-University
بسم الله الرحمن الرحيم
الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، وعلى آله وصحبه أجمعين، أما بعد :
ధర్మజ్ఞానం ఎవరి వద్ద అభ్యసించాలి?
ఈ రోజులలో సహృదయంతో ఇస్లాం ధర్మాన్ని అవలంబిస్తూ ధర్మజ్ఞానాన్ని కూడా అభ్యసించాలి అని దృఢమైన సంకల్పం గల వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అందులోను చాలామంది జ్ఞానార్జన కొరకు మాధ్యమమును ఎన్నుకొనుటలో తప్పులు చేస్తుంటారు. కొందరు ఫిలాసఫర్ ల వద్ద విద్యను అభ్యసిస్తుంటారు. ఒక పద్ధతి ప్రకారం సరైన జ్ఞానాన్ని వీరు అభ్యసించి ఉండరు. పోగా వీరి ఆలోచనా విధానాలు మరియు బోధనలు ఇస్లాంకు విరుద్ధంగా ఉంటాయి. మరికొందరైతే తమ భాషా ప్రావీణ్యత, మంచి పదజాలంతో కథలు వళ్లించి ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగీకుల వద్ద విద్యాభ్యాసన చేస్తూ ఉంటారు. వీరి వద్ద తమ పదజాలంతో ఎదుటి వారిని సంతృష్ట పరచుట తప్ప ఏమీ ఉండదు. ఈ ఆధునిక యుగంలో కొందరైతే తెలియకుండానే కొత్త కొత్త వ్యక్తుల, మార్గభ్రష్టత్వానికి గురిచేసే వెబ్ సైట్ల ద్వారా విద్యను అభ్యసిస్తారు. విద్యాభ్యాసన యదార్థానికి ఇది ధర్మభ్యాసన కనుక ఇందులో ఎంతో జాగ్రత్త వహించాలి.
ముహద్దిస్, ముఫస్సిర్, ఫఖీ మరియు ముజ్తహిద్, కలల గూడార్థములను వివరించగల గొప్ప తాబయీ ముహమ్మద్ బిన్ సీరీన్ బసరీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(1) إِنَّ هَذَا الْعِلْمَ دِينَ فَانْظُرُوا عَمَّنْ تَأْخُذُونَ دِينَكُمْ
“ఇన్న హాజల్ ఇల్మ దీనున్, ఫన్జురూ అమ్మన్ తాఖుజూన దీనకుమ్”
“ నిశ్చయముగా ఈ జ్ఞానము అనేది నీ దీన్ (ధర్మం), నీవు నీ ధర్మాన్ని (ఇస్లాం) ఎవరి వద్ద అభ్యసిస్తున్నావో పరీక్షించుకో?”
కాబట్టి కేవలం జ్ఞానవంతుడిని అనే తోలు కప్పుకుని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లేక సోషల్ మీడియా మరియు సోషల్ నెట్వర్క్ ల ద్వారా, బ్రదర్, సిస్టర్ లుగా పరిచయం చేసినంత మాత్రాన, ఒక వ్యాసం లేక ఒక పుస్తకం వ్రాసినంతనో లేక అఖీదా మరియు మన్ హజ్ ను ప్రక్కన పెట్టి చరిత్ర పై గొప్ప ప్రసంగం చేసినంతనో లేక ఒక వ్యాసం వ్రాసినంత మాత్రానో లేక ఏదైనా అంశంపై ఒక పండితుని ప్రసంగం వినిన లేక ఏదో ఒక పుస్తకం చదివినంతనే లేక రకా రకా ఆంగ్ల భాషలో మాట్లాడినంతనో ఇంకా అవసరం లేకుండానే తన ప్రశంశ కొరకు ఫోటోలు ప్రింట్ చేపించుకున్నంత మాత్రాన అతను ఇస్లాం ధర్మపు ప్రతి అంశాన్ని వివరించగల పండితుడు లేక ప్రతి విషయంలో మనం అతని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించగల యోగ్యత గల పండితుడు కాజాలడు.
ఈమామ్ ఇబ్నేరుష్ద్ ఈవిధంగా అంటున్నారు:
(2) كَانَ الْعِلْمُ فِي الصُّدُورِ فَصَارَ الْآنَ فِي الثِّيَابِ
కాన అల్-ఇల్ము ఫీ అస్-సుదూరి, ఫసార అల్-ఆన ఫీ అత్-థియాబి
“జ్ఞానం హృదయాలలో ఉండేది. ప్రస్తుతానికి దుస్తులలో ఉంది.”
(ఒకప్పుడు జ్ఞానం హృదయాలలో పదిలంగా ఉండేది. కాని ప్రస్తుతం ప్రజలు స్క్రీన్ మీద కనిపించే మేకప్, దుస్తులకే ప్రాముఖ్యత ఇస్తున్నారు.)
ప్రస్తుతం ఇస్లామిక్ మదరసాల నుండి ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొస్తున్న కొంతమంది ఇంకా క్రొత్తగా పుట్టుకొస్తున్న దాయీలు, అఖీదా మరియు విశ్వాసాల గురించి అజ్ఞానంతో కూడిన ఎటువంటి ఆలోచనలు, కోణాలు ప్రజల ముందు ఉంచుతున్నారంటే ధర్మం సంపూర్ణం గావింపక ముందు వాటి గురించి ప్రవక్త వారు ప్రవచించ లేదు, సహబా (రజియల్లాహు అన్హుమ్) వారు మాట్లాడే ధైర్యం చెయ్యలేదు.
آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
“ఏమి అల్లాహ్ సుబహానహుతాలా ఈ విధంగా చేసేందుకు వీరికి అధికారం ఇచ్చాడా లేక వీరే స్వయంగా అల్లాహ్ పై అపవాదులు ఆపాదిస్తున్నారా?” (3) (సూరే యూనుస్ 10:59)
“మరి ఎవరైతే అల్లాహ్ పై అసత్యాలు మోపుతారో వారు సాఫల్యం పొందలేరు.(4) వారే దుర్మార్గులు (5) మరియు పాపులు (6)“
(సూరే యూనుస్ 10:69, ఆలె ఇమ్రాన్ 3:94, నిసా 4:50)
కాని సహబీల విషయమై తాబయీన్ లలో అబూహుసైన్ ఉస్మాన్ బిన్ ఆసిమ్ (రహమతుల్లాహి అలైహి) వారు ఈ విధంగా అంటున్నారు.
(7)إِنَّ أَحَدَكُمْ لَيُفْتِي فِي الْمَسْأَلَةِ لَوْ وَرَدَتْ عَلَى عُمَرَ بْنِ الْخَطَّابِ لَجَمَعَ لَهَا أَهْلَ بَدْرٍ
“ఇన్న అహదకుమ్ లయుఫ్తీ ఫిల్ మస్అలతి, లవ్ వరదత్ అలా ఉమర బ్నిల్ ఖత్తాబి, లజమఅ లహా అహ్ల బద్రిన్”
“ప్రతి విషయంలోను మీలో ఎవరో ఒకరు తప్పకుండా ఫత్వా ఇచ్చేస్తారు. ఒకవేళ ఇదే విషయం ఉమర్ (రజియల్లాహు అన్హు) వారి ముందు ప్రవేశపెడితే వారు దానిని పరిష్కరించుటకు బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాలను సమావేశపరచేవారు.”
ముఫ్తియె హిజాజ్, ఈమామె దారుల్ హిజ్రా ఈమామ్ మాలిక్ (రహమతుల్లాహి అలైహి)వారు అంటున్నారు “నేను ఒక విషయంలో సుమారు పది సంవత్సరాలకు పైగా యోచిస్తున్నాను. కాని ఆ విషయమై నాకు ఇప్పటికిని ఒక సదాభిప్రాయం ఏర్పడలేదు“.(8) “ఒక వేళ తప్పని సరిగా సమాధానం ఇవ్వవలసి వచ్చినపుడు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా చెప్పలేను” అనేవారు” (9)
తఫ్సీర్, హదీస్, ఫిఖా, ఉసూలే ఫిఖా, లుగా (భాషాతత్వము) అదబ్ (సాహిత్యము) లకు ఈమాము అయిన ఈమాము షాఫయీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు. “ ధర్మజ్ఞానాన్ని గూర్చి ఎటువంటి వారు చర్చించారంటే, కొన్ని విషయాలను వారు చర్చించకుండా మౌనం పాటించి ఉంటే వారి కొరకు అది బహు శ్రేయస్కరంగా ఉండేది. ఇన్నాల్లా వారు (తప్పుల నుండి) సురక్షితంగా ఉండేవారు (10)
“ఈమామ్ ఇబ్నే హజం (రహమతుల్లాహి అలైహి) వారు ఏమంటున్నారంటే “ విద్యకు, విద్యావంతులకు అత్యంత నష్టం కలిగించే దుస్థితి ఏమిటంటే అనర్హులు* జ్ఞానానికి మరియు పండితులకు (ఉలమాలు) సంబంధించిన విషయాలలో అనవసరంగా తలదూర్చడం. ఎందుకంటే వారు అజ్ఞానాన్ని జ్ఞానంగా మరియు అరాచకాన్ని సంస్కరణగా భావిస్తారు. (11)
షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) వారు “ఇస్లాం ధర్మం విషయంలో అజ్ఞానంతో మాట్లాడడం, ఆ విధంగా మాట్లాడే వారికి సహాయం చెయ్యడం ఇంకా ఇస్లాం ధర్మానికి సంబంధం లేని విషయాలను ఇస్లాంలో చేర్చడం” ఎవ్వరికిని ధర్మసమ్మతం (హలాల్) కాదు అని అన్నారు. (12)
ఇంకా ఎవడైనా అజ్ఞానంతో ఉలమాలను విభేదిస్తూ మాట్లాడితే అతడ్ని ఆపాలి అప్పటికిని అతను మితిమీరి ప్రవర్తిస్తే అజ్ఞానులకు బుద్ధి చెప్పే రీతిలోనే అతనికి బుద్ధి చెప్పాల్సివస్తుంది. పండితునిగా చెలామణి అవుతున్నప్పటికిని ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినందుకుగాను అతని మాటను నమ్మడం జరుగదు. (13)
ఒకడు కావాలని ఉద్దేశ్య పూర్వకంగా అబద్ధం చెప్పకపోయినా అజ్ఞానంతో ధర్మం విషయంలో మాట్లాడితే అతడు అబద్దీకుడే (14)
కొందరైతే పేరు ప్రఖ్యాతుల కోసం ఉలమాల అసాధారణ ఫత్వాలు మరియు అరుదైన సూక్తులను ప్రజల ముందు ఒక క్రొత్త రీసెర్చ్ లాగా ప్రవేశపెడుతారు. కాని ఈమామ్ ఔజాయీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(15) مَنْ أَخَذَ بِنَوَادِرِ الْعُلَمَاءِ خَرَجَ مِنَ الْإِسْلَامِ
“ ఎవడైతే ఉలమాల అరుదైన సూక్తులను ఎన్నుకొనునో అతను ఇస్లాం నుండి వైదొలగిపోయాడు” (16)
సలఫెస్సాలేహీన్ బలంగా ఖండించిన ఈ విషయాలను గురించి న్యాయపరమైన యదార్థ విచారణ చేస్తే అజ్ఞానులు లేక అల్ప జ్ఞానులు నిజానికి తమను తాము మోసం చేసుకుంటూ, పూర్తి ముస్లిం సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది.
గమనిక: ఇస్లాంలో ధర్మజ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రతి ఒక్కరు అర్హులే, కాని ఇక్కడ అనర్హులు అంటే ధర్మజ్ఞానాన్ని ఆర్జించవలసిన రీతిలో ఆర్జించకుండా మిడి మిడి జ్ఞానంతో ఉలమాలు చెయ్యవలసిన పనులు చెయ్యడం (ఫత్వాలు వగైరాలు ఇవ్వడం) అంటే డాక్టరు కాకుండానే కంపౌండర్లు ఆపరేషన్ చేసినట్లు (ప్రతి ఒక్కరూ తమ జ్ఞాన పరిధిని తెలుసుకొని ప్రవర్తించాలి.
(అనువాదకుడు)
ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో
(17) “سَيَأْتِي عَلَى النَّاسِ سَنَوَاتٌ خَدَّاعَاتٌ … وَيَنْطِقُ فِيهَا الرُّوَيْبِضَةُ ” قِيلَ: وَمَا الرُّوَيْبِضَةُ؟ قَالَ: “الرَّجُلُ التَّافِهُ فِي أَمْرِ الْعَامَّةِ”
“ అతి త్వరలో ప్రజలపై ఎటువంటి సంవత్సరాలు వస్తాయంటే అందులో కపటం మరియు మోసం చాలా ఎక్కువగా ఉంటుంది… ఆ రోజులలో రువైబిజా (అజ్ఞానులు, అయోగ్యులు)(18, 19) మాట్లాడెదరు (ప్రవక్త వారితో) రువైబిజా ఏమిటి? అని ప్రశ్నించడం జరిగింది. అందుకు ప్రవక్త వారు” అల్పుడు, అజ్ఞాని అయిన వ్యక్తి ప్రజల విషయాలలో మాట్లాడతాడు. కొన్ని కథనాలలో అల్పుడు, అజ్ఞాని అని కాకుండా పరమ కపటి మరియు తెలివితక్కువ వాడు అన్న పదాలు ఉన్నాయి. కనుక ధర్మ జ్ఞానాన్ని ఎటువంటి పండితుడి వద్ద అభ్యసించాలంటే అతను ధర్మాన్ని అభ్యసించుటలో ఇతరులకు నేర్పే విషయంలో అల్లాహ్ కు భయపడేతత్వం కలిగిఉండాలి. (20) తెలియని విషయాలలో మౌనం వహించేవాడై ఉండాలి (21) ఇంకా అతని జ్ఞానం కేవలం పుస్తకం లేక ఇంటర్నెట్ ద్వారా ఆర్జించినది కాకుండా విశ్వసనీయమైన గురువు ద్వారా ఆర్జించినదై ఉండాలి.
గ్రంథం యొక్క వెలుగులో మరియు గురువుగారి పర్యవేక్షణలో జ్ఞానాన్ని ఆర్జించుటకు గల ప్రధానమైన కారణము ఏమిటంటే, గ్రంథాలన్నింటిలో కెల్లా వివరణాత్మకమైన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము(22) అయినప్పటికిని దానిని బోధించుటకు అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారిని పంపించెను (23) తద్వారా బోధన మరియు తబ్లీగ్ (ప్రచారము, విద్యావ్యాప్తి) చేసేటప్పుడు ఎలాంటి మార్గభ్రష్టత్వము, క్రమరాహిత్యము మరియు అసమానతలు చోటుచేసుకోరాదని, ఆవిధంగా చూసిన ఖుర్ఆన్ యొక్క ఉపమానాలను ప్రజలకన్నా మిన్నగా ధర్మజ్ఞానమున్న పండితులే బాగుగా ఎరుగుదురు. (24) ఇంకా విషయాన్ని తెలుసుకొనుటకు పదాల యొక్క మూలాల వరకు వెళ్తారు (25) అటువంటప్పుడు సత్యాన్ని ప్రేమించే వారుగా నిజమైన పండితుల వద్దనే జ్ఞానాన్ని ఆర్జించాలి. (26) లేకపోతే సత్ జ్ఞానము అంతరించిపోతుంది. దీనిని గురించే ఈమామ్ షాఫయీ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు.
(27) مَنْ تَفَقَّهَ مِنْ بُطُونِ الْكُتُبِ ضَيَّعَ الْأَحْكَامَ
“ ఎవడైతే కేవలం పుస్తకపు పేజీలతో ధర్మజ్ఞానాన్ని ఆర్జించునో అతను ఆజ్ఞలను కాలరాసినట్లే” (27)
మిసర్ (ఈజిప్ట్) దేశస్థుడు 9వ హిజ్రీకి చెందిన ముహద్దిస్, ఫఖీ, తత్వవేత్త మరియు సాహిత్యకర్త అహ్మద్ అష్ – షుమాన్నీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు.
(28) مَنْ يَأْخُذِ الْعِلْمَ عَنْ شَيْخٍ مُشَافَهَةً يَكُنْ مِنَ الزَّيْفِ وَالتَّصْحِيفِ فِي حَرَمِ
وَمَنْ يَكُنْ آخِذَ الْعِلْمِ مِنْ صُحُفٍ فَعِلْمُهُ عِنْدَ أَهْلِ الْعِلْمِ كَالْعَدَمِ
“ ఎవరైతే నేరుగా గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అతను తన జ్ఞానంలో కల్తీలు మరియు తప్పుల నుండి సురక్షితంగా ఉంటాడు. మరి ఎవడైతే గురువు లేకుండా కేవలం పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అటువంటి జ్ఞానం ఉలమాల వద్ద లేని దానితో సమానం.
గమనించవలసిన విషయం ఏమిటంటే జ్ఞానాన్ని నిజమైన జ్ఞానవంతులు అందులోను నిష్ఠార్థులు మరియు గొప్ప పండితుల వద్ద ఆర్జించే విషయమై విశ్వసనీయ అఖీదా పుస్తకాలలో పేర్కొనడం జరిగింది. మరి దాని వైపే ఖులఫాయె రాషిదీన్ లలో అమీరుల్ ముమినీన్ ఉమర్ రజియల్లాహు అన్ హు వారు ప్రోత్సహించారు.
(29) أَلَا وَإِنَّ النَّاسَ بِخَيْرٍ مَا أَخَذُوا الْعِلْمَ عَنْ أَكَابِرِهِمْ ، وَ لَمْ يَقُمِ الصَّغِيرُ عَلَى الْكَبِيرِ، فَإِذَا قَامَ الصَّغِيرُ عَلَى الْكَبِيرِ فَقَدْ
“ తస్మాత్ ! ప్రజలు తమ పెద్దల వద్ద జ్ఞానం ఆర్జించినంతకాలం ఇంకా జ్ఞానార్జన కొరకు చిన్నవారు పెద్ద వారి ముందు నించున్నంతసేపు సురక్షితంగా ఉంటారు. అలాకాక ఎప్పుడైతే చిన్నవాళ్ళు పెద్దవారికి బదులుగా నిలబడతారో నిశ్చయంగా వాళ్ళు నాశనం అవుతారు”
గమనించవలసిన విషయం ఏమిటంటే, పెద్ద పెద్ద ఉలమాల వద్ద జ్ఞానాన్ని ఆర్జించమని ప్రోత్సహిస్తూ ప్రధాన అఖీదా పుస్తకాలలో ప్రస్తావించుటకు గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతి అంటూ లేకుండా మిడి మిడి జ్ఞానమున్న వారివద్ద, అవిశ్వసనీయ మరియు అవాస్తవ వ్యక్తుల వద్ద జ్ఞానాన్ని ఆర్జిస్తామో అక్కడ అఖీదా మరియు మన్ హాజ్ లలో లోపం ఏర్పడుతుందనే భీతి అంటిపెట్టుకొని ఉంటుంది. షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు :
“ కొందరు ఏమన్నారంటే, ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళు మిడి మిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు, తెలిసీ తెలియని ఫఖీ, అర్థవైద్యుడు ఇంకా సగం తెలిసిన వ్యాకరణవేత్త, (అది ఎలాగంటే) మిడిమిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు ధర్మాన్ని నాశనం చేస్తే, తెలిసీ తెలియని ఫఖీ పట్టణాలలో ఉపద్రవాలు సృష్టిస్తాడు, అర్థవైద్యుడు ప్రాణానికి ముప్పుగా మారుతాడు అలాగే సగం తెలిసిన వ్యాకరణవేత్త భాషను సర్వనాశనం చేస్తాడు (30)
జ్ఞానాన్ని ఆర్జించేందుకు కేవలం పుస్తకాల పైనే ఆధారపడకుండా ప్రావీణ్యుడైన గురువును ఎంపిక చేసుకొని అతని యెడల అణుకువతో మెలగవలెను. అదేవిధంగా అతని విశిష్టత, శ్రద్ధ మరియు ప్రావీణ్యతను దృష్టిలో ఉంచుకొని గురువును ఎన్నుకోవాలి.
ఇదే విషయాన్ని ఈమామ్ షౌకాని (రహమతుల్లాహి అలైహి) వారు అంటున్నారు :
“ నిపుణత గల వ్యక్తి వద్ద సాధన చెయ్యనంత వరకూ మానవుడు ఆ వృత్తికి న్యాయం చేయలేడు. ఉదాహరణకు హదీసు జ్ఞానార్జకుడైన ఒక వ్యక్తి ముహద్దసీనుల (హదీసు శాస్త్రంలో ప్రావీణ్యులు) వద్ద హదీసు జ్ఞానాన్నైతే నేర్చుకున్నాడు కాని హదీసు పదాలను అర్థం చేసుకునేందుకు వారి వద్దనే భాషా పరిజ్ఞానాన్ని అభ్యసించదలిస్తే భాషాభ్యాసన విషయంలో అతను తప్పుచేస్తున్నట్లే.. ఒకవేళ అతను అనర్హుల వద్ద జ్ఞానార్జన చేసి అనర్హుడై ఉండి ఉలమాల సూక్తులకు విలువనిచ్చిన గ్రుడ్డి పశువు మాదిరిగా మార్గభ్రష్టుడు అవుతాడు. జ్ఞానాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఇంకా అతిశయోక్తి కలిగించే మాటలు, అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతాడు (31)
ఆలా కాక ఒక విషయంలో నిలకడగా ముందుకు వెళ్తూ ఫత్వాలు గుప్పించకుండా ఒక పద్ధతి ప్రకారం ఉలమాల పర్యవేక్షణలో, జ్ఞానం వెలుగులో నిజాయితీగా దావత్, ఇస్లాహ్ (సంస్కరణ) చేస్తూ స్వయంగా ఆచరిస్తున్నట్లైతే ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా అది ప్రశంసింపదగిన విషయము (32)
ఉలేమాలను గౌరవించుట
“ప్రతి ముస్లిం యొక్క శ్రేష్ఠత కాబతుల్లా:ను మించినది“.(33) అతని ధన, ప్రాణ మరియు గౌరవ మర్యాదల సంరక్షణ విధిగానున్నది. అందులోను ముఖ్యముగా ఉలేమాలను గౌరవించడం అనేది తూచ తప్పక పాటించవలసిన విషయం. ఏ విద్యార్థియైన లేక జ్ఞానమున్న పండితుడైనా ఒకవేళ అతను ఉలమాలను గౌరవించకపోతే అతని ప్రస్తావన పండితులలో కాదుకదా సామాన్య ముస్లిం ప్రజానీకంలో కూడా ఉండదు. ఎందుకంటే రసూలుల్లు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటున్నారు.
(34) لَيْسَ مِنْ أُمَّتِي مَنْ لَمْ يُجِلَّ كَبِيرَنَا وَيَرْحَمْ صَغِيرَنَا وَيَعْرِفْ لِعَالِمِنَا حَقَّهُ”
“మా పెద్దలను గౌరవించని, మా చిన్నారులను కరుణించని మరియు మా ఆలిమ్ యొక్క హక్కును ఎరుగని వ్యక్తికి నా ఉమ్మత్ (అనుచర సమాజం) తో ఎటువంటి సంబంధం లేదు” (35)
ఆలిమ్ యొక్క హక్కును (తెలుసుకోవడం, నెరవేర్చడం) అంటే (అతని వ్యక్తిత్వపు హక్కుకాదు) అతని జ్ఞానపు హక్కును తెలుసుకోవడం. కాబట్టి మానవుడు, అల్లాహ్ తఆలా ఆలిమ్ కు ప్రసాదించిన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి (ఇంకా) ఆ ఉన్నత స్థానం అనేది జ్ఞానం కారణంగా ప్రసాదించడం జరిగింది. (36)
ఎందుకంటే ఉలమాలను గౌరవించుట ఇంకా వారి హక్కులను పర్యవేక్షించుటలో మానవునికి మార్గదర్శకత్వము లభిస్తుంది. లేకపోతే అతను అవమానానికి, నష్టానికి గురికావలసి వస్తుంది. ఇంకా అతను పాపాత్ముడు అవుతాడు (37)
ఉలమాలు, యదార్థానికి వారు ప్రవక్తల వారసులు. (38) మరి ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో బిగ్గరగా మాట్లాడడం నిషిద్ధమే. (39) అదేవిధంగా ఉలమాలతో కూడా బిగ్గరగా మాట్లాడరాదు. ఎందుకంటే ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేసే వారి కొరకు అల్లాహ్ తఆలా చాలునో (40) ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరిహసించిన ఉత్ బా, షైబా, వలీద్, ఉమయ్య ఇంకా ఉక్ బాబిన్ అబీముయిత ను బద్ర్ యుద్ధంలో నాశనం చేసెను. (41) ఎవరైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని పరిహసించిన అబ్దుల్లా బిన్ ఖమిఅ లాంటి వాణ్ణి ఒక అడవి గొర్రెతో ముక్కలు ముక్కలుగా చేయించాడో (42) ఎవరైతే ఉత్ బా బిన్ అబిలహబ్ లాంటి ప్రవక్త పరిహాసకుడ్ని పులితో చంపించెనో (43) అదే అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వారసులు అయిన ఉలమాలను పరిహసించే వారి కొరకునూ చాలును.
బుఖారా రాజ్యాధికారి అయిన ఖాలిద్ బిన్ అహ్మద్ అజ్-జుబలీ అనే వ్యక్తి ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి విషయంలో మితిమీరి ప్రవర్తించి వారిని నానా విధాలుగా బాధించినప్పుడు ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు అతనిని గూర్చి బద్-దుఆ చేసెను. దాని పర్యవసానంగా అల్లాహ్ తఆలా అతని రాజ్యాధికారాన్ని లాగేశాడు, అతనిని నీచ స్థితికి దిగజార్చెను, తుదిశ్వాస విడిచేవరకూ కూడా అతను జైలు గోడల మధ్య ఖైదీగా మగ్గుతూనే ఉన్నాడు. (44)
حوالہ جات (References)
- صحيح مسلم المقدمة باب في أن الإسناد من الدين …
- سورة نمل / ٦٤
- خلاصة الأثر في أعيان القرن الحادي عشر لمحمد أمين المحبي، حرف الهمزة والألف /ج 1/ ص 275
- سورة يونس / ٥٩
- سورة ال عمران / ٩٤
- سورة نساء / ٥٠
- تاريخ دمشق لابن عساكر، ذكر من اسمه عثمان بن عاصم … بعض كبار ہیں اور یمین کے بارے میں حسین ہے جو غلط ہے اور صحیح ابو الحصين ہے۔
- شرح اصول اعتقاد اهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … جماع ابواب ذكر ما روي عن النبي …
- جامع بيان العلم و فضله لابن عبد البر، باب كراهية القول في دين الله بغير علم
- الرسالة للامام الشافعي، باب تجنب اهل الكلام
- الأخلاق و السير في مداواة النفوس لابن حزم، ذم الجهل …
- مجموع الفتاوى لابن تيمية، كتاب الصلاة، باب شروط الصلاة / ج 22 / ص 230
- الرد على البكري لابن تيمية، علم السلوك، من تكلم في الدين … / ج 1 / ص 444
- السنن الكبرى للبيهقي، كتاب الشهادات، باب ما يجوز شهادة اهل الأهواء …
- اوزاعي كے روایت ہے اس کے لیے دیکھئے: تذکرة الحفاظ
- سنن ابن ماجه، كتاب الفتن، باب العزلة، على بن ابی بکر کی الزوائد میں اسنادہ صحیح …
- وريک روایت میں ہے کہ اس کے شر سے بچ کر رہو۔ دیکھئے: شعب الإيمان للبيهقي، باب نشر العلم، فصل قال وينبغي …
- إكمال المعلم بفوائد صحيح مسلم للقاضي عياض، كتاب الفتن، باب ذهاب الإيمان آخر الزمان …
- كفاية الحاجة في شرح سنن ابن ماجه للسندي، على سنن ابن ماجه…
- سورة فاطر/٢٨
- سورة بني إسرائيل/ ٣٦
- سورة يوسف/١
- سورة البقرة/١٢٩، سورة آل عمران/ ١٦٤، وسورة الجمعة/ ٢
- سورة عنكبوت/ ٤٣
- سورة النساء/ ٨٣
- سورة النحل/ ٤٣، سورة الأنبياء/ ٧
- تذكرة السامع و المتكلم في أدب العالم و المتعلم لابن جماعة، الباب الثاني في أدب المتعلم…
- الضوء اللامع لأهل القرن التاسع للسخاوي، ثلث ذكر من اسمه محمد… حرف الميم، / ج 9 / ص 118
- شرح أصول اعتقاد أهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … سياق ما روي عن النبي … في الحث … اور اس کے آخری قول الصغير الكبير للطبراني، باب العين، عطاء بن مسعود … قیل … میں ابن مسعودؓ سے بھی مروی ہے۔
- مجموع الفتاوى لابن تيمية، علم السلوك، فصل في الأمراض والشفاء … /ج 10 / ص 118
- أدب الطلب و منتهى الأرب للشوكاني، ص 118
- صحيح مسلم، كتاب الإيمان، باب الدليل على دخول …، ” انزل حيث ينزلك” …
- جامع الترمذي، أبواب البر والصلة، باب ما جاء في شفقة المسلم … اور فصل من أهان قریشا، ابو دانی صامت سے بھی…
- المسند للشاشي، مسند عبادة بن الصامت، / ج 3 / ص 273، ليكن اس میں لیس منا ہے اور مسند احمد میں اس کی جگہ لیس من امتی ہے اور طبرانی کبیر (حدیث: ۷۲۳۵) میں بھی ہے۔
- البحر الزخار بمسند البزار، / ج 7 / ص 179، حدیث: 2740، مسند احمد: 26523
- فيض القدير شرح الجامع الصغير للمناوي، حرف اللام / ج 5 / ص 386 / ح 7659
- السير، سرش الجامع الصغير للمناوي، حرف اللام / ج 3 / ص 331
- سنن أبي داود، أول كتاب العلم، باب الحث على طلب العلم… بروایت ابوالدرداء جامع ترمذی …
- سورة الحجرات / 2
- سورة الحجر / 95
- صحيح البخاري، كتاب الوضوء، باب إذا ألقي على ظهر المصلي … بروایت ابن مسعود
- مسند الشاميين للطبراني، ما انتهى إلينا من مسند ثور بن يزيد، عن مكحول…
- موسوعة الدفاع عن رسول الله، لعلى بن نايف الشحود، المجلد الباب التاسع المستهزئون وردود أفعالهم، عاقبة عتبة بن أبي لهب والأسود …
- البداية والنهاية لابن كثير، ذكر سنة ست وخمسين ومائتين، من توفي فيها من الأعيان/ ج 11/ ص 535
మిగతా ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://telugusialm.net/?p=4259

You must be logged in to post a comment.