లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం

అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: నేను నా జాతివారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు ఆయన ఇలా ఆదేశించారుః "శుభవార్త వినండి! మీ వెనక ఉన్నవారికి ఈ శుభవార్త ఇవ్వండిః ఎవరు పూర్తి (హృదయాంతర) సత్యాలతో లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం పలుకుతాడో అతడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు". మేము ప్రవక్త వద్ద నుండి బయలుదేరి ప్రజలకు ఈ శుభవార్త ఇస్తూ వెళ్లాము. అంతలో ఉమర్ రజియల్లాహు అన్హు మాకు కలిశారు. మమ్మల్ని ప్రవక్త వద్దకు తీసుకొచ్చి, 'ప్రవక్తా! ఇక ప్రజలు దీనిపైనే ఆధారపడి పోతారు. (సత్కార్యాలు చేయడం మానుకుంటారు) అని అన్నారు. దానికి ప్రవక్త మౌనం వహించారు. (అహ్మద్. సహీహ 712).