హదీథ్׃ 06
تحريم الغش మోసం చేయటం నిషేధించబడినది –
حَدَّثَنِي يَحْيَىٰ بْنُ أَيُّوبَ وَ قُتَيْبَةُ وَ ابْنُ حُجْرٍ . جَمِيعا عَنْ إِسْمَاعِيلَ بْنِ جَعْفَرٍ . قَالَ ابْنُ أَيُّوبَ : حَدَّثَنَا إِسْمَاعِيلُ . قَالَ: أَخْبَرَنِي الْعَلاَءُ عَنْ أَبِيْهِ، عَنْ أَبِي هُرَيْرَةَ ”أَنَّ رَسُولَ اللَّهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ، فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابـِعُهُ بَلَلاً،فَقَالَ: مَا هذَا يَا صَاحِبَ الطَّعَامِ ؟ قَالَ: أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللَّهِ ! قَالَ: أَفَلاَ جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، “مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي “ رواة صحيح مسلم
హద్దథని యహ్యా ఇబ్ను అయ్యూబ వ ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్, జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్, ఖాల ఇబ్ను అయ్యూబ, హద్దథనా ఇస్మాయీలు, ఖాల అఖ్బరనీ అల్ అలాఉ అన్ అబీహి, అన్ అబీ హురైరత అన్న రసూలుల్లాహి మర్ర అలా శుబ్రతి తఆమిన్, ఫఅద్ఖల యదహు ఫీహా, ఫనాలత్ అశాబిఉహు బలలన్, ఫఖాల “మాహాదా యా శాహిబత్తాఆమి”? ఖాల “అశాబత్ హుస్సమాఉ యా రసూలల్లాహ్” ఖాల “అఫలా జఅల్తహు ఫౌఖ అత్తఆమి కై యరాహు అన్నాసు, మన్ గష్ష ఫలైస మిన్నీ” రవాహ్ సహీ ముస్లిం.
అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ ముస్లిం హదీథ్ గ్రంధంకర్త ← యహ్యా ఇబ్ను అయ్యూబ ← ఖుతైబతు వ ఇబ్ను హుజ్రిన్ ← జమీఆన్ అన్ ఇస్మాయీల ఇబ్ని జాఫరిన్ ← ఇబ్ను అయ్యూబ ← ఇస్మాయీలు ← అల్ అలాఉ అన్ అబీహి ← అబీ హురైరత (రదియల్లాహుఅన్హు) ← అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.
అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆహార ధాన్యపు గుట్ట దగ్గర నుండి పోవటము జరిగినది, అప్పుడు వారు తమచేతిని ఆధాన్యం లోనికి జొప్పినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క చేతివ్రేళ్ళకు తేమ తగిలినది(నీటితో తనవ్రేళ్ళు తడిసిపోయినవి) అప్పుడు వారు ఆహర ధాన్యం విక్రయించే వాడితో “ఏమిటి ఇది?” అని అడిగినారు. అతను ఇలా జవాబు చెప్పినాడు “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇది ఆకాశం నుండి కురిసిన వర్షం వలన నెమ్ము అయినది”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించినారు, “నీవు ఈ తడిసిన ధాన్యమును అందరికి కనపడే విధంగా పైన ఎందుకు ఉంచలేదు?, దానిని ప్రజలందరు చూడగలిగేవారు కదా! ఎవరైతే మోసం చేస్తాడో అతడు నావాడు కాజాలడు”. సహీ ముస్లిం హదీథ్ గ్రంధం.
ఉల్లేఖకుని పరిచయం:
అబు హురైరా రదియల్లాహు అన్హు పూర్తి పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ. ఆయన 7వ హిజ్రీ సంవత్సరంలో ఖైబర్ విజయం సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలోనికి చేరినారు. ఎక్కువ హదీథ్ లను జ్ఞాపకం ఉంచిన వారిలో సహచరులలో (సహాబాలలో) ఒకరు.
Source : హదీథ్ – రెండవ స్థాయి [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – ముహమ్మద్ కరీముల్లాహ్