జకాహ్ ఎవరికి చెల్లించాలి:
إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاء وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللّهِ وَابْنِ السَّبِيلِ فَرِيضَةً مِّنَ اللّهِ وَاللّهُ عَلِيمٌ حَكِيمٌ
“ఈ జకాహ్ నిధులు కేవలం నిరుపేదలకు, అక్కర గలవారికి, జకాత్ సేవకులకు, ఇంకా ప్రోత్సాహం కొరకు, బానిసల విముక్తికి, ఋణగ్రస్తుల సహాయానికి, దైవమార్గంలో మరియు బాటసారుల కొరకు ఇది అల్లాహ్ తరఫు నుంచి నిర్ణయించ బడినది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూనూ.” (దివ్య ఖుర్’ఆన్ 9:60).
- నిరుపేదలు: తమ కొరకు భోజన సదుపాయాలు చేకూర్చుకొనలేరు
- అక్కరగలవారు: తమ ఇంటివారి కొరకు భోజన సదుపాయములు చేకూర్చుకొనలేరు.
- జకాహ్ సేవకులు: వారికి వేరే ఉపాధి లేనిచో దీని నుండి ఉపాధి ఇవ్వ వచ్చును.
- ప్రోత్సాహం కొరకు: ఇస్లాం వైపుకు మొగ్గు చూపిన యెడల అతనికి దీని నుండి అతని మనస్సు కుదుట పడడానికి ఇవ్వవచ్చును.
- బానిసలవిముక్తికి:బానిసలను, ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ ధనమును వినియోగించవచ్చును
- ఋణగ్రస్తుల సహాయానికి: అప్పు తీసుకుని తీర్చలేని వారి కొరకు.
- అల్లాహ్ మార్గములో కష్టపడే వారి కొరకు: కష్టాల పాలైన వారికి, కష్టాలకు గురి అవుతున్న వారికి, ధర్మపోరాటం కొరకు, ఖర్చు చేయవచ్చును.
- బాటసారికి: ప్రయాణీకుల దగ్గర డబ్బులు లేని యెడల అతను ధనవంతుడైనా ఆ సమయములో అతని దగ్గర ప్రయాణపు ఖర్చులు మరియు భోజన ఖర్చులు లేని యెడల అతనికి ఇవ్వ వచ్చును.
జకాహ్ కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు:
- జకాహ్ నిధిని పైన తెలిపిన అన్నింటి పై లేదా ఒక దానిపై లేదా కొన్నిటి పై ఖర్చు చేయవచ్చును.
- అవిశ్వాసులకు జకాహ్ ఇవ్వబడదు. ఇస్లాం లోకి రాదలచుకుంటే ప్రోత్సహించుట కొరకు తప్ప.
- ధనవంతులకు లేదా బనీ హాషీం తెగ వారికి గాని జకాహ్ ఇవ్వరాదు.
- సమీప బంధువులలో నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి జకాహ్ చెల్లించుట ఉత్తమము.
- తమపై ఆధారపడిన వారికి జకాతు చెల్లించుట నిషిధ్ధము. ఉదా: తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనుమలు, మునుమరాళ్ళు, తాత ముత్తాతలు.
- ఎక్కడ జకాహ్ వసూలు చేయబడునో అదే ప్రాంతములో జకాహ్ ఖర్చు చేయుట ఉత్తమము.
- భార్య తన భర్తకు జకాహ్ ఇవ్వ వచ్చును. భర్త భార్యకు ఇవ్వరాదు.
- తమ వాడుకలో ఉన్న వస్తువులపై జకాతు లేదు. కాని బంగారం, వెండినగలపై జకాతు చెల్లించివేయుట ఉత్తమం
- కిరాయి కొరకు ఇవ్వబడే వస్తువులపై జకాహ్ లేదు. కానీ దానిపై వచ్చే ఆదాయం పై జకాతు చెల్లించాలి.
- పంటలు మరియు పండ్ల పై, పంట పండిన వెంటనే, కోసినప్పుడే జకాతు చెల్లించి వేయాలి.
- భూమి త్రవ్వకాలలో లభ్యమైన ధనము, ససంపదలో 20% జకాతు చెల్లించాలి.
- జకాహ్ సమయం పూర్తికాగానే జకాత్ చెల్లించాలి.
- జకాహ్ చెల్లించకుండా చనిపోయిన యెడల అతని వారసులు జకాహ్ చెల్లించి అతని జకాహ్ అప్పును తీర్చవలెను
Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా