కాలి మేజోడులపై మసహ్ చేయడం (Wiping over the socks/shoes)

కాలి మేజోడులపై మసహ్ చేయగలమనుటకు ఆధారం׃బుఖారి మరియు ముస్లిం – అనిల్ ముగీరహ్ ఇబ్ని షుఅబత  రదియల్లాహు అన్హు ఖాల ׃ కున్తు మఅన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) వహువ యత వజ్జఉ ఫఅహ్ వయ్ తు లి అన్ జఅ ఖుప్ఫైహి ఫఖాల- దఅహుమా ఫఇన్నీ అద్ ఖల్ తుహుమా తాహిరతైన్. ఫమసహ అలైహిమా-ముగీర బిన్ షేబ రదిఅల్లాహు అన్హు అంటున్నారు׃ నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుదూ చేయబోగా నేను ఆయన కాలిమోజోడులను తీయడానికి వంగాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను వారిస్తూ, ఇలా పలికారు – ఉండనివ్వండి! వీటిని తీయకండి! నేను ఈరెండు మోజోడులను పరిశుద్ధ అవస్థలో తొడిగాను అంటూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనరెండు మోజోడులపై మసహ్ చేశారు”

మోజోడులపై మసహ్ ఎప్పుడు చేయగలం ?

  1. మోజోడులను వుదూచేసిన తరువాత తొడిగి ఉండాలి
  2. మురికి, మాలిన్యాల నుండి మోజోడులను శుభ్రపరచి ఉండాలి
  3. ఇస్లామీయ ధర్మశాస్త్రం (షరీఅహ్) దీనికి ఏర్పరచిన పరిమిత సమయం మించరాదు
    1. ) స్థానికులకు ఒక రాత్రి-ఒక పగలు (24 గంటలు)
    2. ) బాటసారులకు మూడు రాత్రులు-మూడు పగళ్లు (72 గంటలు)
    3. గమనిక׃ తొలిసారి మసహ్ చేయగానే మసహ్ యొక్క సమయం మొదలగును
  4. వుదూనందు కాలిని ఎంతవరకు కడుగుతామో, అంతవరకు మోజోడు కూడా కప్పిఉంచాలి
  5. ఈ రెండు మోజోడులు సక్రమ (హలాల్) సంపాదనతో కొనుకున్నవై ఉండాలి.

మసహ్ చేయు విధాన ׃

  1. రెండు చేతులను నీటితో తడుపుకొనవలెను
  2. పాదపు ఉపరితలభాగంపై అంటే పై భాగంపై చేతిని సరచాలి. అంటే కాలివేళ్ళనుండి మొదలుపెట్టి, పాదపు కట్టు వరకు అలా చేయాలి. కేవలం ఒక్కమారు చేస్తే చాలు.
  3. కుడి చేతితో కుడుపాదంపై , ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి

మసహ్ ను భంగ పరచు విషయలు ׃

  1. మోజోళ్ళను కాలి నుండి తీసివేయడం వలన
  2. గుసుల్ విధిగా చేయవలసి రావడం వలన
  3. నిర్ణీత కాలం గడచి పోవడం వలన

Source: ఫిఖ్ హ్ – మొదటిస్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : – బాషా ముహమ్మద్ (సాబ్ బాషా)