తయమ్మమ్

నీరు అందుబాటులో లేని సమయంలో లేదా అనారోగ్యం కారణంగా నీటిని వాడలేని సమయంలో సుభ్రమైన మట్టి ద్వారా శుభ్రత పొందుట.

وَإِنْ كُنْتُمْ مَرْضَى أَوْ عَلَى سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِنْكُمْ مِنَ الغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ مَا يُرِيدُ اللهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِنْ حَرَجٍ وَلَكِنْ   يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ المائدة :6

దివ్యఖుర్ఆన్ అల్ మాయిద 5:6ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేదా ప్రయాణావస్థలో ఉంటే, లేదా మలమూత్ర విసర్జన చేస్తే, లేదా భార్యను కలుసుకుంటే – అప్పుడు నీళ్ళుదొరకని పక్షంలో పరిశుభ్రమైన మట్టి ఉపయోగించండి. అంటే మట్టిపై చేతులు తట్టి వాటితో ముఖం, చేతులు రుద్దుకోండి. అల్లాహ్ మీ జీవితాన్ని కష్టాలకు గురి చేయదలచ లేదు. మీరు కృతజ్ఞులై ఉండేందుకు ఆయన మిమ్ముల్ని పరిశుభ్రపరచి, మీకు తన అనుగ్రహాలను పూర్తిగా ప్రసాదించదలిచాడు.

తయమ్మమ్ ఎప్పుడు విధి (తప్పనిసరి) అగును ?

  1. నీరు లభించని సమయంలో
  2. నీరు ఉన్నా త్రాగడానికి సరిపడేదానికంటే ఎక్కువలేని యెడల.
  3. నీటితో శుభ్రత పొందిన ఎడల అతనికి ఆరోగ్యము చెడిపోయే అవకాశం ఉన్న ఎడల.
  4. విపరీతమైన చలి ఉండి, వేడి నీళ్ళు దొరక నప్పుడు.

గమనిక తయమ్మమ్ స్నానం మరియు వుదూ రెండింటికీ బదులుగా సరిపడును.

తయమ్మమ్ చేయు విధానము:

  1. శుభ్రమైన ఇసుక లేదా మట్టిని వాడవలెను. భూమిని కప్పబడి ఉన్న శుభ్రమైన మట్టి అంటే మెత్తటి మట్టి లేదా రాళ్ళపై పడి ఉండే దుమ్మూ దూళిని వాడవలెను.
  2. సంకల్పము చేయవలెను.
  3. బిస్మిల్లాహ్ అని తయమ్మమ్ చేయుట సున్నత్
  4. ముస్లిం హదీథ్: అమ్మార్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు. మేము అపవిత్రమైనాము. మాకు నీరు లభించలేదు. అప్పుడు మేము భూమిపై దొర్లినాము మరియు నమాజు ఆచరించాము. తర్వాత ఈ సంఘటనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కు తెలిపాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. మీరు ఈవిధంగా చేస్తే సరిపోయేది – ఆని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండుచేతులను భూమిపై కొట్టి ఆ చేతులకు అంటుకున్న దుమ్మును నోటితో ఊదివేసి తన ముఖముపై మరియు తన అరచేతులపై రుద్దుకొనెను.

గమనిక : ఎడమచేతితో కుడిచేతిపై, కుడి చేతితో ఎడమచేతిపై మణికట్టువరకు రుద్దవలెను. భూమిపై ఎక్కువ దుమ్ము ఉన్నచో చేతులు కొట్టిన తర్వాత చేతులపై ఊదుట సున్నత్.

తయమ్మమ్ ను భంగపరచే విషయములు :

  1. వుదూ మరియు గుసుల్ ని భంగపరచే అన్ని విషయములు తయమ్మంను భంగపరుచును.

నీరు లభించిన ఎడల మరియు నీటిని వాడడము హానికరముగా లేనట్లయితే తయమ్మమ్ భంగమగును.