జనాజ నమాజు

సలాతుల్ జనాజ విధానం :

  1. జనాజ (శవపేఠిక)ను ఇమాం మరియు ఖిబ్లాకి మధ్యలో ఉంచవలెను.
  2. మృతదేహం పురుషునిదైతే తల దగ్గర, స్త్రీ దైతే మధ్యలో ఇమాం నుంచోవలెను.
  3. తక్బీర్ చెప్పిన తర్వాత చేతులు కట్టుకుని సూరె ఫాతిహా నిశ్శబ్దంగా చదవవలెను.
  4. రెండవ తక్బీర్ చెప్పి అందరూ నిశ్శబ్దంగా దరూద్ చదవవలెను.
  5. మూడవ తక్బీర్ చెప్పి అందరూ నిశ్శబ్దంగా మృతుని కొరకు దుఆ చేయవలెను.

1 దువాఅల్లాహుమ్మగ్ ఫిర్లి హయ్యినా, వ మయ్యితినా, వ షాహిదినా,వ గాఇబినా, వ సగీరినా, వ కబీరినా, వదకరినా, వఉన్ థానా, అల్లాహుమ్మ మన్అహ్ యయ్ తహు మిన్నా ఫఅహ్ యిహి అలల్ ఇస్లామి వ మన్ తవఫ్ఫయ్ తహు మిన్నా ఫత వఫ్ఫహు అలల్ ఈమాని అల్లాహుమ్మ లాతహ్ రింనా అజ్.రహు వ లాతఫ్ తిన్నాబఅదహు.

ఓ అల్లాహ్! నన్ను మాలో బ్రతికి ఉన్నవారినీ, చనిపోయినవారినీ, ఇక్కడున్నవారినీ, ఇక్కడ లేని వారినీ, పిన్నలనూ, పెద్దలనూ, మా మగవారినీ, మా ఆడవారినీ అందరినీ క్షమించు. ఓ అల్లాహ్! మాలో ఎవరిని  సజీవంగా ఉంచినా ఇస్లాంపైనే ఉంచు. ఎవరికి మరణం ప్రసాదించినా విశ్వాసస్థితిలో మరణింప జేయి. ఈ మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించడం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్నిదూరం చెయ్యకు. ఇతని తరువాత మమ్మల్ని పరీక్షలకు గురిచేయకు (సన్మార్గానికి దూరం చేయకు).

2 వ దువా –

“اللهم اغفر له، وارحمه، وعافه، واعف عنه، وأكرم نزله، ووسع مدخله، واغسله بالماء والثلج والبرد، ونقه من الخطايا كما ينقى الثوب الأبيض من الدنس، وأبدله دارا خيراً من داره، وأهلاً خيراً من أهله، و زوجاً خيراً من زوجه، وأدخله الجنة، وقه فتنة القبر وعذاب النار.

అల్లాహుమ్మగ్ ఫిర్ లహు, వర్ హంహు వ ఆఫిహి, వ అఫ్ఉ అన్ హు, వ అకరిమ్ నుజులహు, వవస్సి ముద్ ఖలహు, వగ్ సిల్ హు, బిల్ మాయి వథ్థల్ జి, వల్ బరది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖితథ్థౌబుల్ అబ్ యదు మినద్దనసి, వ అబ్ దిల్ హు, దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్ లన్ ఖైరన్ మిన్ అహ్ లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహి, వ అద్ ఖిల్ హుల్ జన్నత వఖిహి ఫిత్నతల్ ఖబ్రి వ అజాబిన్నారి.

ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతని మీద దయ చూపు, అతన్ని క్షమించి శిక్షనుండి కాపాడు, అతన్ని మన్నించు, అతనికి ఉత్తమ స్థానము ప్రసాదించు, అతనికి విశాలమైన నివాసము ప్రసాదించు, అతని పాపములను నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి, తెల్లని వస్త్రాన్ని మురికి నుండి శుభ్రపరచినట్లు అతన్ని పాపాలనుండి శుభ్రపరుచు. అతనికి ఇహలోకపు ఇల్లు కంటే మంచి ఇల్లుని, ఇహలోకపు సంతతి కంటే ఉత్తమ సంతతిని, ఇహలోకపు ఇల్లాలి కంటే మంచి ఇల్లాలిని ప్రసాదించు. అతనిని స్వర్గంలో ప్రవేశింపజేయి. సమాధి శిక్షనుండి నరకాగ్ని శిక్షనుండి అతన్ని రక్షించు.

6.  ఆ తర్వాత 4వ తక్బీర్ పలికి సలాంచేసి కుడి వైపు తిరగవలెను,