అదనపు నమాజులు

అదనపు నమాజులు (నఫిల్ మరియు సున్నతులు):

తిర్మిథి హదీథ్: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలిపారు. నిశ్చయంగా ప్రళయదినంరోజు సలాహ్ గురించి అన్నిటికంటే ముందు విచారణ జరుపబడును. ఎవరైతే దీనిలో ఉత్తీర్ణులౌతారో వారు నిజంగా ఉత్తీర్ణులౌతారు. ఉత్తీర్ణులు కానివారు నాశనమౌతారు. ఫరద్ సలాహ్ లో కొంచెం తగ్గిన ఎడల అల్లాహ్ దైవదూతలనుద్ధేశించి “చూడండి! నా  దాసుని నఫిల్ సలాతులుంటే వాటి ద్వారా ఫరద్ సలాతులను పూర్తి చేయండి” అని పలుకును.

సున్నతే  ుఅక్కద నమాజులు :

  1. ఫజర్ సలాహ్ కి ముందు 2 రకాతులు (చిన్నగా చదవడం,సున్నత్ ఉత్తమం) మొదటి రకాతులో సూరె అల్ కాఫిరూన్ మరియు 2వ రకాతులో అల్ అహద్ చదవటం సున్నత్
  2. 4 రకాతులు దొహర్ కి ముందు మరియు 2 రకాతులు తర్వాత చదవవలెను.
  3. మగ్ రిబ్ తర్వాత 2 రకాతులు చదవవలెను. మొదటి రకాతులో అల్ కాఫిరూన్ మరియు రెండవ రకాతులో అల్ అహద్ చదవటం సున్నత్
  4. ఇషా తర్వాత 2 రకాతులు చదవవలెను.

 రాత్రి నమాజులు మరియు వితర్ నమాజు :

عن عبدالله بن عمر رضي الله عنهما قال: أن رجلا سأل النبي r عن صلاة الليل فقال:”مثنى مثنى فإذا خشيت الصبح فأوتر بركعة”  (رواه البخاري ومسلم)

బుఖారి మరియు ముస్లిం హదీథ్ : అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించారు. ఒక వ్యక్తి రాత్రి నమాజు గురించి ప్రశ్నించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉద్బోధించారు “రాత్రిపూట చదువే నఫిల్ సలాహ్ రెండు, రెండు రకాతులు చేసి చదవండి. మీరు ప్రాత: కాలము ఆసన్నమయ్యే సమయం మీరు ఒక రకాతు వితర్ చదివి సలాహ్ ను పూర్తి చేయండి”

  1. వితర్ సమయం ఇషా తర్వాత నుండి ఫజర్ కి ముందు వరకు
  2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం 11 రకాతులు లేదా 13 రకాతులు తహజ్జుద్ చదివేవారు.
  3. రుకూ మరియు సజ్దాలు ఎక్కువసేపు చేయడం ఉత్తమం.
  4. రాత్రి చివరిభాగంలో చదవడం ఉత్తమము.
  5. చివరి మూడు రకాతులలో ఆల్ ఆలా , అల్ కాఫిరూన్, అల్ ఇఖ్లాస్ చదవడం సున్నత్
  6. సజ్దా మరియు రుకూలలో ఎక్కువ సేపు దుఆలు చేయుట ఉత్తమము.

సలాతుల్ దొహా (ఉదయపు సలాహ్):

عن أبي هريرة رضي الله عنه قال: “أوصاني خليلي rبثلاث، صيام ثلاثة أيام من كل شهر، وركعتي الضحى، وأن أوتر قبل أن أنام”  (رواه البخاري ومسلم)

బుఖారి మరియు ముస్లిం హదీథ్ : అబూహురైరా రదియల్లాహు అన్ హు ఇలా ఉల్లేఖించారు, ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు 3 విషయాలు వసీయహ్ (తాకీదు) చేశారు. నెలలో 3 రోజులు ఉపవాసం చేయమని, 2 రకాతులు దొహా సలాహ్ చదవమని మరియు నిద్రించుటకు ముందు వితర్ సలాహ్ చదవమని.

  1. సలాతుల్ దొహా సూర్యుడు సాంతం ఉదయించిన తర్వాత నుండి మిట్టమధ్యానం రాకముందు వరకు
  2. సలాతు దొహా – 2 నుండి 8 రకాతుల వరకు

ఇస్తిఖారహ్ దుఆ (సలాతుల్ ఇస్తిఖారహ్) :

1.రెండు రకాతులు సలాహ్ చేయవలెను.

2.ఆ తర్వాత అల్లాహ్ తో అతి ముఖ్యమైన కార్యం విషయంలో సన్మార్గం చూపుట కొరకు ఈ దుఆ చదవవలెను.

అల్లాహుమ్మ ఇన్ని అస్తఖీరుక, బి ఇల్మిక, వ అస్తఖ్ దిరుక, బిఖుద్రతిక, వ అస్అలుక, మిన్ ఫద్లికల్ అజీమి, ఫ ఇన్నక తఖ్ దిరు వలా అఖ్ దిరు, వతఅఁలము వలా ఆలము వ అంత అల్లాముల్ గుయూబి అల్ హుమ్మ ఇన్ కుంత తఅఁలము అన్న హాదల్ అమ్రఖైరుల్ లి ఫీదీని వ మఆషీ వఆఖిబతి అమ్రీ (అవ్ ఖాల ఫీ ఆజిలి అమ్రీ, వ ఆజిలిహి) ఫఅఖ్ దుర్ హులీ, వఇన్ కుంత తఅఁలహు అన్న హాదల్ అమ్ర షర్రుల్ లి ఫీ దీని వ మఆషీ వఆఖిబతి అమ్రీ (అవ్ ఖాల ఫీ ఆజిలి అమ్రీ వ ఆజిలిహీ) ఫస్ రిఫ్ హు అన్ని వస్ రిఫ్ నీ అన్ హు వఖ్ దుర్ లి అల్ ఖైర హైథు కాన తుమ్మ రద్దినీ బిహీ .

ఓ అల్లాహ్! నేను నీతో నీ జ్ఞానము ద్వారా మేలు కోరుకొనుచున్నాను. నీ శక్తి (ఖుదరత్) ద్వారా నేను నీతోబలం కోరుకుంటున్నాను. మరియు నేను నీ నుండి దయాదాక్షిణ్యాలు కోరుకుంటున్నాను. నీవే సర్వశక్తిగలవాడవు. నేను శక్తిహీనుణ్ణి నీవు అన్నీ తెలిసినవాడవు. నేను ఏమీ తెలియనివాడను. నీవు సకల జ్ఞానము కలవాడవు. ఓ అల్లాహ్! ఈ కార్యం ఇహపర లోకములలో సన్మార్గము మరియు మంచి ఫలితము కలుగజేయునదై ఉంటే నా కొరకు సునాయాసం చేయి. ఈ పనిలో నాకు శుభం ప్రసాదించు. ఒకవేళ ఈ పని అపమార్గము మరియు దుష్ఫలితము కలుగజేయునదైతే ఈపని నుండి నన్ను దూరం చేయి మరియు నేను ఎక్కడ ఉన్నా నా కొరకు మంచిని ప్రసాదించు మరియు నన్ను ఆ మంచిని ఇష్టపడునట్లు చేయి.

 తహయత్తుల్ మస్జిద్ :

 عن أبي قتادة السلمي رضي الله عنه قال- قال رسول اللهr: “إذا دخل أحدكم المسجد فليركع ركعتين قبل أن يجلس” (البخاري ومسلم)

ముస్లిం హదీథ్ : అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉద్భోదించారు “మీలో ఎవరైనా మస్జిద్ లో ప్రవేశించిన ఎడల కూర్చోక ముందు రెండు రకాతులు చదవవలెను”. అన్ అబీ ఖతాదా రదియల్లాహు అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఖాల ఇదా దఖల ఆహదుకుముల్ మస్జిద్ ఫల్ యర్ కఅఁ  రక్ అతయ్ ని ఖబ్ ల అన్ యజ్ లిస – రవాహు ముస్లిం

ుదూ తర్వాతి సున్నత్ నమాజు  – వుదూ తర్వాత రెండు రకాతులు సున్నహ్ చదవవలెను.

عن أبي هريرة رضي الله عنه أن النبيr قال: “يا بلال حدثني بأرجى عمل عملته في الإسلام فإني سمعت دف نعليك بين يدي في الجنة. قال: ما عملت عملا أرجى عندي أني لم أتطهر طهورا في ساعة ليل أو نهار إلا صليت بذلك الطهور ما كتب لي أن أصلي.” (رواه البخاري ومسلم)

సజ్దా తిలావహ్ – ఖుర్ఆన్ పఠించునప్పుడు, వినునప్పుడు సజ్దా ఆయత్ వచ్చిన ఎడల సజ్దా చేయవలెను. 15 చోట్ల ఖుర్ఆన్ లో సజ్దా ఆయత్ లు కలవు

– عن عبد الله بن عمر رضي الله عنهما قال: “كان رسول اللهr  يقرأ علينا القرآن فإذا مر بالسجدة، كبر وسجد وسجدنا معه.” (رواه ابو داود)

సజ్దా షుకుర్ :

عن أبي بكرة رضي الله عنه قال: “أن النبيr كان إذا أتاه أمر يسره أو بشر به خر ساجدا شكرا لله تبارك وتعالى.” (رواه أبو داود والترمذي وابن ماجه)

ఇబ్నె మాజా హదీథ్ – ఆబూబకరాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు శుభసందేశము వచ్చినప్పుడు లేదా బషారత్ ఇవ్వబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కు కృతజ్ఞతా పూర్వకంగా సాష్టాంగం (సజ్దా) చేసేవారు. సజ్దా షుకుర్ కొరకు వుదూ షరతు కాదు.