[2 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –22
22- మనిషి, జంతువు, పక్షి, చేప లాంటి ప్రాణం ఉన్న వాటి చిత్రాలు చిత్రించకు [1]. గుర్తింపు కార్డు మరియు పాస్ పోర్టు లాంటి అత్యవసర విషయాలకు తప్ప. (ఇది యోగ్యమని భావించకు).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి చిత్రకారుడు నరకంలో ఉంటాడు. తాను చిత్రించిన ప్రతి చిత్రపటంలో ప్రాణం పోయబడుతుంది. అది అతనిని నరకంలో శిక్షిస్తూ ఉంటుంది”. (ముస్లిం 2110).
[1] చిత్రాలు చిత్రించడం అల్లాహ్ రుబూబియత్ లో జుల్మ్ (అన్యాయం, దౌర్జన్యాని)కి పాల్పడినట్లగును. సృష్టించుట, ఆదేశించుటలో అల్లాహ్ ఏకైకుడు, ఆయనకు ఎవ్వరూ భాగస్వామి లేరు. “వినండి! సృష్టిం- చుట, ఆదేశించుట ఆయన పనియే. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ చాలా శుభము గలవాడు”. (ఆరాఫ్ 7: 54).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షిర్క్ అవుతుందని ఏదైతే సమాధానం మీరు చదివారో, దీని వివరం తెలుసుకునేకి ముందు ఒక హదీసు విందాము :
ముఆవియా (రజియల్లాహు అన్హు) ఒక చోట వచ్చారు, ఆయన్ని చూసి అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ (తాబిఈ) నిలబడ్డారు, అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రజియల్లాహు అన్హుమా) (సహాబి బిన్ సహాబీ) కూర్చొని ఉన్నారు. ఇది చూసి ముఆవియ (రజియల్లాహు అన్హు) అబ్దుల్లాహ్ బిన్ ఆమిర్ తో చెప్పారు : “కూర్చో, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను:
“ప్రజలు తన కొరకు నిలబడాలని ఎవడు ఇష్టపడతాడో అతను తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవాలి”. అబు దావూద్ లో ‘అహబ్బ’అనే పదం ఉంది అంటే ఇష్టపడతాడో, కోరుకుంటాడో, తిర్మిజిలో ఉంది: ‘సర్ర’అంటే నచ్చుతుందో, సంతోషం ఏర్పడుతుందో. అంటే అతడ్ని చూసి నిలబడని వారిని సంతోషంగా చూడడు, వారితో ప్రేమగా ఉండడు, నిలబడినవారి పట్ల సంతోషంగా వ్యవహరిస్తాడు.
ఈ సమస్య అంటే “ఒకరిని చూసి నిలబడటం” అనే విషయంలో కొన్ని వివరాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా అవసరం.
1- నేను ఏదైనా సమావేశంలో వస్తే, లేదా ప్రజలు నన్ను చూస్తే నిలబడాలని ఇష్టపడడం, కాంక్షించడం నిషిద్ధం.
ఇది గర్వానికి దారి తీస్తుంది, అప్పుడు గర్వం లేకున్నా గర్వ చిహ్నాల్లోకి వస్తుంది.
2- మనిషి ఇలాంటి కోరిక, కాంక్ష వల్ల నరకం పాలవుతాడని హెచ్చరించడం జరిగింది.
3- ఈ కోరిక, కాంక్ష ఉన్నవారిని చూసి నిలబడేవారు, ఓ నిషిద్ధ కార్యానికి సహాయం చేసినవారవుతారు.
4- ఇలాంటి కోరిక లేనివారి కొరకు కూడా నిలబడకూడదు, ఈ నిలబడటం అనే అలవాటు వారిలో ఆ కోరికను జనింపజేసే ప్రమాదముంది.
5- ఇక ఎవరైతే తమ ధర్మపరమైన బడాయితనాన్ని చాటుకుంటున్నారో, అనుయాయులు వారిని గౌరవించాలి, మర్యాద పాటించాలని కోరుకుంటున్నారో వారు నిజసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గౌరవమర్యాదలో జోక్యం చేసుకుంటున్నారు, కనుక అలాంటివారి కొరకు నిలబడుట షిర్క్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంది.
6- ఇంట్లో పెద్దలు వస్తే పిల్లలు, నిలబడుట లేదా టీచర్లు క్లాస్ రూంలోకి వస్తే స్టూడెంట్స్ నిలబడుట కూడా మంచి అలవాటు కాదు.
7- కొందరు ఒక చోట ఉన్నారు ఎవరైనా వారి బంధువు, గురువు లాంటి పెద్దలు వచ్చారు అప్పుడు వారు నిలబడి, రెండు అడుగులు ముందుకు వచ్చి వచ్చే వ్యక్తికి స్వాగతం పలుకుతే పాపం కాదు. సహీ బుఖారీ 3043లో ఉంది: ఒక సందర్భంలో సఅద్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు ప్రవక్త ఔస్ వంశంవారితో మీ నాయకుడైన సఅద్ వచ్చారు నిలబడి స్వాగతించండని ఆదేశించారు.
అలాగే ప్రయాణం నుండి వచ్చినవారిని స్వాగతించడానికి నిలబడి సలాం చేయడం, ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (హగ్, అలాయిబలాయి) చేయడం యోగ్యమే. ప్రవక్త తమ కూతురింటికి వెళ్ళినప్పడూ, కూతురు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు నిలబడి స్వాగతం పలికేవారని అబూ దావూద్ 5217 మరియు ఇతర హదీసుల్లో ఉంది.
(ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఉన్నాయి, ఫత్ హుల్ బారీ 11/49-51 మరియు షేఖ్ అల్బానీ గారి సహీహాలోని హదీసు 357, మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ గారి మజ్మూఉల్ ఫతావా 24/2 చూడవచ్చును)
2) మనకు ఏదయినా నష్టం జరిగినప్పుడు “నేను ఒక వేళ అలా చెయ్యకపోతే బాగుండేది” అని అనవచ్చునా?
”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్ తఆలా సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను అలా చేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్ తఆల కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే ఒకవేళ అనేది షై’తాన్ ద్వారాన్ని తెరచి వేస్తుంది”.(సహీ ముస్లిం).
3) ప్రళయదినం నాడు అత్యధిక శిక్ష పడేది వీరిలో ఎవరికి ?
A) బొమ్మలు గీసే వాళ్లకు
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.
4497. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.
4495. ‘ఆయి’షహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.
4496. అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిందంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయ రాదు అని హెచ్చరించడం జరిగింది
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.
4498.’అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారు చేసే ప్రతి ఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది”. ఇబ్నె ‘అబ్బాస్ (రజియల్లాహు అన్హు) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరం వస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.