సమర్పణ: దారుల్ హుదా, ఉడుపి (కర్ణాటక) – “ది ప్రాఫెట్ ఆఫ్ మెర్సీ” (నబియ్యుర్ రహ్మహ్) ప్రదర్శనశాల
100 చిత్ర పోస్టర్లు | 103 పేజీలు
“లౌ అరఫ్తహు ల అహబబ్తహు” – మీరు ఆయన గురించి తెలుసుకుంటే ఆయన్ని అభిమానిస్తారు. ఈ పుస్తకం దారుల్ హుదా, ఉడుపి వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడిన “ప్రవక్త కారుణ్యం” ప్రదర్శనశాల (The Prophet of Mercy Exhibition Hall) లోని 100 పోస్టర్ల తెలుగు సంకలనం. ప్రతి పోస్టర్లో ఖుర్ఆన్ ఆయతు లేదా సహీహ్ హదీసు అసలు అరబీ పాఠంతో పాటు దాని తెలుగు అనువాదం మరియు ఆధారం (రిఫరెన్స్) ఇవ్వబడ్డాయి.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ ﷺను సర్వలోకాల వారికి కారుణ్యంగా పంపాడు. ఆయన కారుణ్యం మనుషులకే పరిమితం కాదు – తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, పొరుగువారు, సేవకులు, అనాథలు, రోగులు, ఖైదీలు, అప్పుల్లో ఉన్నవారు, ముస్లిమేతరులు, చివరికి జంతువులు మరియు పక్షుల వరకు విస్తరించింది. ఈ చిన్న చిన్న పోస్టర్ల ద్వారా ఆ కారుణ్యాన్ని, ప్రవక్త ﷺ ఉత్తమ నడవడికను సులభంగా, ఆకర్షణీయంగా తెలుసుకోవచ్చు. ముస్లిమేతర సోదరులకు ప్రవక్త ﷺను పరిచయం చేయడానికి (దావహ్) కూడా ఇది చక్కని సాధనం.

You must be logged in to post a comment.