అల్లాహ్ ఆగ్రహం, కారణాలు మరియు రక్షణ మార్గాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/eVzukmkn268 [22 నిముషాలు]
ఈ జుమా ఖుత్బాలో అల్లాహ్ ఆగ్రహం (గజబ్) అంటే ఏమిటి, సలఫుల విశ్వాసం ప్రకారం ఈ గుణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, షిర్క్, కుఫ్ర్, అన్యాయంగా విశ్వాసిని హతమార్చడం, అబద్ధపు ప్రమాణం వంటి ఏ పాపాలు మనిషిని అల్లాహ్ ఆగ్రహానికి గురిచేస్తాయి, మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలు ఏమిటి అనే విషయాలు ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడ్డాయి.
📄 PDF డౌన్లోడ్ చేసుకోండి: అల్లాహ్ ఆగ్రహం – కారణాలు, రక్షణ మార్గాలు (PDF)
మొదటి ఖుత్బా
إنَّ الحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
అల్లాహ్ రక్షణను, తఖ్వాను ఉపదేశిస్తూ ఖుర్ఆన్ ఆజ్ఞాపిస్తున్నది:
﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ﴾
“ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్కు భయపడవలసిన రీతిలో భయపడండి మరియు ముస్లింలుగా మాత్రమే మరణించండి.”
అల్లాహ్ యొక్క ఆగ్రహం (غضب) అంటే ఏమిటి? (సలఫుల విశ్వాసం)
గౌరవనీయులైన ముస్లింలారా! అల్లాహ్ రహ్మాన్ (కరుణామయుడు), రహీమ్ (కృపాశీలుడు) మాత్రమే కాదు; ఆయన ధిక్కారులను, దుర్మార్గులను శిక్షించే ‘ఖహ్హార్’, ‘జబ్బార్’ మరియు తీవ్రంగా ఆగ్రహించేవాడు కూడా.
[1] సిఫతె గజబ్ (ఆగ్రహం అనే గుణం): అల్లాహ్కు ఆగ్రహం (غضب/ سخط) అనే గుణం ఉందని ఖుర్ఆన్, సున్నహ్ స్పష్టంగా ధ్రువీకరిస్తున్నాయి [అల్ మౌసూఅతుల్ అఖదియ్యహ్ 2/171].
[2] సలఫె సాలిహీన్ విధానం: అహ్లె సున్నత్ వల్ జమాఅత్ మరియు పూర్వీకులైన సలఫుల విశ్వాసం ప్రకారం, అల్లాహ్ ఆగ్రహం ఆయన ఘనతకు, ఔన్నత్యానికి తగినట్లుగా ఉంటుంది [షర్హు లుమ్అతిల్ ఏతిఖాద్ 2/16].
దీనిని మానవుల కోపంతో పోల్చకూడదు (మానవుని కోపం శరీరంలో రక్తం ఉడకడం, అసహనం వల్ల కలుగుతుంది, కానీ అల్లాహ్ అలాంటి లోపాలన్నింటికీ అతీతుడు) [తఫ్సీర్ ఇబ్ను ఉసైమీన్ సూరె నిసా 2/86]. అల్లాహ్ ఆదేశం ఇది:
﴿لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ﴾
“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూచేవాడు.” [సూరె షూరా 42:11].
[3] ఇమామ్ అబూ జాఫర్ అత్-తహావీ తన ప్రసిద్ధ గ్రంథం “అల్ అఖీదతుత్ తహావియహ్”లో పేర్కొన్నారు:
“అల్లాహ్ ప్రసన్నుడు అవుతాడు మరియు ఆగ్రహిస్తాడు; కానీ సృష్టిలోని ఎవరిలానూ కాదు” [అల్ మౌసూఅతుల్ అఖదియ్యహ్ 2/171].
[4] తీర్పు దినాన అల్లాహ్ యొక్క ఆగ్రహం: తీర్పు దినాన ప్రవక్తలు సైతం భయపడిపోయే స్థితి ఉంటుంది. షఫాఅత్ (సిఫారసు) హదీసులో ప్రవక్తలు ఈ విధంగా పలుకుతారు:
«إِنَّ رَبِّي قَدْ غَضِبَ الْيَوْمَ غَضَبًا لَمْ يَغْضَبْ قَبْلَهُ مِثْلَهُ، وَلَنْ يَغْضَبَ بَعْدَهُ مِثْلَهُ»
“నిశ్చయంగా ఈ రోజు నా రబ్బ్ (ప్రభువు) ఎంత తీవ్రంగా ఆగ్రహించాడంటే, ఇంతకుముందెన్నడూ ఆయన ఇంతటి ఆగ్రహానికి గురికాలేదు, ఇక ముందు ఎన్నడూ ఇంత ఆగ్రహానికి గురికాడు” [బుఖారీ 4712, ముస్లిం 194].
[5] కారుణ్యం ఆగ్రహాన్ని అధిగమించింది: అయినప్పటికీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ముందుంచాడు. ప్రవక్త ముహమ్మద్ ﷺ తెలిపారు:
«إِنَّ رَحْمَتِي غَلَبَتْ غَضَبِي»
(మరొక ఉల్లేఖనంలో: «إِنَّ رَحْمَتِي سَبَقَتْ غَضَبِي»)
“నిశ్చయంగా నా కారుణ్యం నా ఆగ్రహాన్ని అధిగమించింది (లేదా ముందంజ వేసింది)” [బుఖారీ 7553, ముస్లిం 2751].
అల్లాహ్ ఆగ్రహానికి గురిచేసే ముఖ్య కారణాలు (موجبات الغضب)
అల్లాహ్ అకారణంగా ఎవరిపై ఆగ్రహించడు; మానవులు చేసే పాపం, అన్యాయం అల్లాహ్ ఆగ్రహానికి దారితీస్తాయి. అయితే వాటిలో ముఖ్యమైనవి కొన్ని తెలుపడం జరుగుతుంది:
[1] అల్లాహ్ ఆగ్రహానికి అత్యంత ప్రధాన కారణం ఆయనకు భాగస్వాములను కల్పించడం (అంటే షిర్క్ చేయడం), సత్యాన్ని తిరస్కరించడం (అంటే కుఫ్ర్ చేయడం) మరియు నిఫాఖ్ (కపట విశ్వాసానికి) పాల్పడడం.
﴿وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا﴾
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (సూరె ఫత్హ్ 48:6)
﴿… مَّن شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ اللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ﴾
ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది. (సూరె నహ్ల్ 16:106).
[2] ఒక అమాయక విశ్వాసి ప్రాణాన్ని బలిగొనడం ఎంతటి మహాపాపమో ఖుర్ఆన్ ఇలా హెచ్చరిస్తున్నది:
﴿وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا﴾
ఎవరైనా ఒక విశ్వాసిని ఉద్దేశపూర్వకంగా చంపితే, అతనికి ప్రతిఫలం నరకమే. అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ అతనిపై ఆగ్రహించాడు, అతనిని శపించాడు మరియు అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధం చేశాడు.” [సూరె నిసా 4:93]
[3] సత్యాన్ని తెలుసుకుని, దానిని ఆచరించకుండా నిరాకరించడం అల్లాహ్ ఆగ్రహానికి కారణం (ఉదాహరణకు, యూదుల వైఖరిపై అల్లాహ్ ఆగ్రహం వ్యక్తమైంది):
﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ﴾
“ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఎవరిపై ఆగ్రహించాడో ఆ ప్రజలతో స్నేహం చేయకండి.” [ముమ్ తహినహ్ 60:13]
[4] తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, వారి మనస్సును నొప్పించడం అల్లాహ్ ఆగ్రహానికి ప్రత్యక్ష కారణం. ప్రవక్త ﷺ ఆదేశం:
«رِضَى الرَّبِّ فِي رِضَى الوَالِدِ، وَسَخَطُ الرَّبِّ فِي سَخَطِ الْوَالِدِ»
అల్లాహ్ ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది. అల్లాహ్ ఆగ్రహం తండ్రి కోపంలో ఉంది. [తిర్మిజి 1899, షేఖ్ అల్బానీ సహీ అన్నారు].
[5] వ్యాపారంలో లేదా హక్కులను కాజేయడానికి అల్లాహ్ పేరుతో అబద్ధపు ప్రమాణాలు చేయడం అల్లాహ్ ఆగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. లిఆన్ (భార్యాభర్తల మధ్య ప్రమాణాల) విషయంలో ఖుర్ఆన్ లో ఉంది:
﴿وَالْخَامِسَةَ أَنَّ غَضَبَ اللَّهِ عَلَيْهَا إِن كَانَ مِنَ الصَّادِقِينَ﴾
“ఐదవసారి, అతడు (భర్త) సత్యవంతుడే అయితే తనపై అల్లాహ్ ఆగ్రహం పడుగాక అని ప్రమాణం చేయాలి.” [సూరె నూర్ 24:7].
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:
«مَنْ حَلَفَ عَلَى مَالِ امْرِئٍ مُسْلِمٍ بِغَيْرِ حَقِّهِ، لَقِيَ اللهَ وَهُوَ عَلَيْهِ غَضْبَانُ»
ఒక ముస్లిము హక్కును అన్యాయంగా కాజేయడానికి అబద్ధపు ప్రమాణం చేసిన వ్యక్తిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉంటాడు. (ముస్లిం 138).
[6] ప్రజలను అన్యాయంగా కొట్టే, హింసించే వారి గురించి ప్రవక్త ﷺ హెచ్చరిస్తూ, వారు ఉదయం అల్లాహ్ ఆగ్రహంలో బయలుదేరి, సాయంత్రం అల్లాహ్ ఆగ్రహంలో తిరిగి వస్తారని తెలిపారు [ముస్లిం 2857]. «يُوشِكُ، إِنْ طَالَتْ بِكَ مُدَّةٌ، أَنْ تَرَى قَوْمًا فِي أَيْدِيهِمْ مِثْلُ أَذْنَابِ الْبَقَرِ، يَغْدُونَ فِي غَضَبِ اللهِ، وَيَرُوحُونَ فِي سَخَطِ اللهِ»
[7] ఫర్జ్ నమాజులను, విధులను విడిచిపెట్టి పాపాల్లో మునిగి తేలడం: తౌబా చేసుకోకుండా నిరంతరం పాపాలను ఆచరిస్తూ పోవడం దైవ ఆగ్రహాన్ని తెచ్చిపెడుతుంది [12][21][22].
«مَنْ تَرَكَ صَلَاةً لَقِيَ اللَّهَ وَهُوَ عَلَيْهِ غَضْبَانُ»
ఎవరైతే ఒక నమాజును వదిలేస్తారో, వారు అల్లాహ్ను కలిసినప్పుడు అల్లాహ్ వారి పట్ల ఆగ్రహంతో ఉంటాడు. (తబ్రానీ 11782).
ఈ లింక్ teluguislam.net/ab ను తెరచి, సర్చ్ (ఫైండ్) బాక్స్ లో ఆగ్రహం, ఆగ్రహం (అరబీలో غضب) అని రాయండి, అక్కడ ఫలితాల్లో (Result)లో వచ్చిన ఆయతులను శ్రద్ధగా చదవండి, అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసే మరిన్ని ఎక్కువ కారణాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండండి. అల్లాహ్ మనల్ని రక్షించుగాక!
أَقُولُ قَوْلِي هَذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ مِنْ كُلِّ ذَنْبٍ، فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ.
రెండవ ఖుత్బా
الحَمْدُ لِلَّهِ رَبِّ العَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ.
అల్లాహ్ ఆగ్రహం నుండి రక్షణ మార్గాలు
గౌరవనీయులైన ముస్లింలారా! అల్లాహ్ ఆగ్రహం ఎంత భయంకరమైనదో, దాని నుండి బయటపడే మార్గాలను కూడా ఇస్లాం అంతే స్పష్టంగా చూపించింది. తెలుసుకోవలసినది ఏమిటంటే ప్రతి సత్కార్యం ద్వారా అల్లాహ్ మనల్ని ఆయన ఆగ్రహం నుండి దూరంగా ఉంచుతాడు. అయితే వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ తెలుపుతున్నాము:
[1] నిజాయితీతో కూడిన తౌబా మరియు ఇస్తిగ్ఫార్: పాపాలు చేయగానే ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడి అల్లాహ్ను క్షమాపణ కోరడం వల్ల అల్లాహ్ ఆగ్రహం తొలగి ఆయన ప్రసన్నత లభిస్తుంది. అల్లాహ్ మూసా అలైహిస్సలాం మాటను ఇలా ప్రస్తావించాడు:
﴿وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ﴾
నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను. (తాహా 20:84).
[2] తల్లిదండ్రులను సంతోషపెట్టడం మరియు బంధువులతో సత్సంబంధాలు: తల్లిదండ్రుల సేవ మరియు బంధువులను ఆదరించడం దైవ ఆగ్రహం నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలంవారి ఈ హదీసు శ్రద్ధగా చదవండి:
«رِضَى الرَّبِّ فِي رِضَى الوَالِدِ، وَسَخَطُ الرَّبِّ فِي سَخَطِ الْوَالِدِ»
అల్లాహ్ ప్రసన్నత తండ్రి ప్రసన్నతలో ఉంది. అల్లాహ్ ఆగ్రహం తండ్రి ఆగ్రహంలో ఉంది. [తిర్మిజి 1899, షేఖ్ అల్బానీ సహీ అన్నారు].
[3] రహస్య దానం (సదఖయె సిర్ర్): అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చడంలో రహస్య దానానికి ఉన్నంత ప్రభావం మరెందులోనూ లేదు. ప్రవక్త ﷺ ప్రవచించారు:
«إِنَّ صَدَقَةَ السِّرِّ تُطْفِئُ غَضَبَ الرَّبِّ »
“నిశ్చయంగా రహస్యంగా ఇచ్చే దానం అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లారుస్తుంది.” [సహీ తర్గీబ్ 888].
ప్రవక్త ﷺ మరో హదీసులో ఇలా తెలిపారు:
«صَنَائِعُ الْمَعْرُوفِ تَقِي مَصَارِعَ السُّوءِ، وَصَدَقَةُ السِّرِّ تُطْفِئُ غَضَبَ الرَّبِّ، وَصِلَةُ الرَّحِمِ تَزِيدُ فِي الْعُمُرِ»
“సత్కార్యాలు చెడు ముగింపుల నుండి కాపాడుతాయి, రహస్య దానం అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లారుస్తుంది, బంధుత్వాలను కలపడం ఆయుష్షును పెంచుతుంది.” [సహీ తర్గీబ్ 889].
సలఫె సాలిహీన్ ఆచరణ: అలీ బిన్ హుసైన్ (జైనుల్ ఆబిదీన్) రాత్రిపూట చీకట్లో స్వయంగా రొట్టెల బస్తాను భుజాన మోసుకుంటూ వెళ్లి పేదవారి గుమ్మాల ముందు ఉంచేవారు. వారు సెలవిచ్చేవారు: إِنَّ الصَّدَقَةَ فِي سَوَادِ اللَّيْلِ تُطْفِئُ غَضَبَ الرَّبِّ عَزَّ وَجَلَّ “చీకటి రాత్రిలో చేసే రహస్య దానం అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లారుస్తుంది” [జామిఉల్ ఉలూమి వల్ హికమ్ 2/140].
అల్లాహ్ ఖుర్ఆన్లో సెలవిచ్చాడు:
﴿إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ﴾
“ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్కు మీరు చేసేదంతా తెలుసు.” [సూరె బఖర 2:271].
[4] సున్నత్ దుఆలను నిత్యం చదవడం: ప్రవక్త ముహమ్మద్ ﷺ సజ్దాలో మరియు విత్ర్ నమాజ్ చివరలో ఈ విశిష్టమైన దుఆను వేడుకునేవారు:
«اللهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ، وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ، وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ»
“ఓ అల్లాహ్! నీ ఆగ్రహం నుండి నీ ప్రసన్నత ద్వారా శరణు కోరుతున్నాను; నీ శిక్ష నుండి నీ క్షమాభిక్ష ద్వారా శరణు కోరుతున్నాను; నీ నుండి నీ వైపునకే శరణు వేడుకుంటున్నాను. నేను నీపై తగిన స్తుతిని లెక్కించలేను; నీవు నిన్ను ఎలా ప్రశంసించుకున్నావో నీవు అలాగే ఉన్నావు.” [ముస్లిం 486].
[5] ప్రజలపై దయ చూపడం మరియు మన స్వంత కోపాన్ని అణచుకోవడం: సృష్టి పట్ల దయ చూపేవారిపై సృష్టికర్త దయ చూపుతాడు మరియు తన ఆగ్రహాన్ని వారిపై నుండి తొలగిస్తాడు.
ప్రియులారా! మన జీవితాలను పరిశీలించుకుందాం. అల్లాహ్ ఆగ్రహానికి గురిచేసే షిర్క్, అబద్ధాలు, అన్యాయాలు, తల్లిదండ్రులను బాధపెట్టడం వంటి పనులకు దూరంగా ఉంటూ, రహస్య దానాలు, తౌబా, ఇస్తిగ్ఫార్ల ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందుదాం.
عِبَادَ اللَّهِ، إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَى وَيَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ وَالْبَغْيِ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ. فَاذْكُرُوا اللَّهَ الْعَظِيمَ يَذْكُرْكُمْ، وَأَقِمِ الصَّلَاةَ.
మరిన్ని ఖుత్బాలు:
https://teluguislam.net/k/