అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత (Dhikr of Allaah) – Audio

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.

Listen / Download Mp3 Here (Time 21:30)

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదు (Bidah Innovation in Islam)

ధర్మంలో కల్పితాలు, మూఢాచారాలు సృష్టించరాదనే నిషేధం గురించి ఈ ఉపన్యాసంలో ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

Listen / Download Mp3 Here (Time 20:40)

 

ఖాదియానియత్ (Khadiyaniat) [పుస్తకం]

డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
PDF – mobile friendly ( మొబైల్ ఫ్రెండ్లీ పీడీఎఫ్) – 98 పేజీలు

ఖాదియానీల వాస్తవికత – డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరీ మదనీ హఫిజహుల్లాహ్
https://youtu.be/XwpnAVo0Oew [65 నిముషాలు]

విషయ సూచిక

  1. ముందు మాట [PDF] [6p]
  2. మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF] [15p]
  3. రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF] [30p]
  4. ఖాదియానీ విశ్వాసాలు [PDF] [8p]
  5. పాద సూచికలు [PDF] [6p]
  6. ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF] [25p]

అధ్యాయాలు

మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF]

  1. ఒక ఖాదియాని ఇమామ్‌తో సౌమ్యంగా సంభాషణ
  2. ఒక ఖాదియానీ ప్రెసిడెంట్‌ అమాయకపు సంభాషణ
  3. పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం
  4. ఖాదియానియత్‌ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు
  5. ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం

రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF]

  1. అసలు ఖాదియానియత్‌ అంటే ఏమిటి?
  2. ఖాదియానీ మతంలో వర్గాలు
  3. ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం
  4. మిర్జా  వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పనిచేసింది
  5. బాల్యం, విద్యాభ్యాసం
  6. మిర్జా  గులాం అహ్మద్‌ ఖాదియాని ఉద్యోగం
  7. యవ్వనంలో ఆయన వ్యాపకాలు
  8. ‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం
  9. దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం
  10. మిర్జా  రచనలు
  11. హేయమైన మరణం
  12. ఖాదియానీల ఉనికిలో వాస్తవ కారణాలు
  13. అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక
  14. పాశ్చాత్యవాదులు మరియు గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీ దైవదౌత్యం
  15. హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం
  16. గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర
  17. ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు
    • ఖాదియానియ్యత్‌ తొలి ఖలీఫా నూరుద్దీన్‌
    • లాహోరు వర్గ స్థాపకుడు ముహమ్మద్‌ అలీ లాహోరీ
    • ముహమ్మద్‌ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు

ఖాదియానీ విశ్వాసాలు [PDF]

  1. గులాం అహ్‌మద్‌ గురించి ఖాదియానీల విశ్వాసాలు, పుస్తకాలు
  2. అల్లాహ్‌ గురించి ఖాదియానీల విశ్వాసం
  3. ఈసా బిన్‌ మర్యమ్‌ (అలైహిస్సలామ్‌) గురించి వారి విశ్వాసం
  4. దైవదౌత్యం & దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి
  5. ఖుర్‌ఆన్‌ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం
  6. ఖాదియాన్‌ నగరం గురించి వారి విశ్వాసం
  7. ఖాదియానియత్‌ ఒక నూతన మతం మరియు ప్రత్యేక షరీఅత్‌

పాద సూచికలు [PDF]

ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF]

  1. తాను దైవప్రవక్తనని మిర్జా వాదన
  2. దైవవాణి తనపై అవతరిస్తుందని మిర్జా ఉద్దాటన
  3. “దైవదౌత్య పరిసమాప్తి (ఖత్మె నుబువ్వత్‌) ఒక తప్పుడు విశ్వాసం, ఇస్లాం ఒక పైశాచిక మతం” అంటూ వ్యర్థ ప్రేలాపనలు
  4. మిర్జాను తిరస్కరించినవారు నరకవాసులవుతారని హెచ్చరిక
  5. తన దగ్గరకు జిబ్రయీల్‌ దూత వచ్చారని మిర్జా డాంబికాలు
  6. తనపై వర్షం లాగా వహీ అవతరించిందని మిర్జా ఉద్దాటన
  7. తనను విశ్వసించనివారు అక్రమ సంతానంగా పుట్టినవారని నోరుపారేసుకోవటం
  8. ఖుర్‌ఆన్‌ ఆకాశంపైకి ఎత్తుకోబడిందని, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వా సల్లం) మళ్లీ ఈ లోకంలోకి పంపబడతారని మిర్జా చేసిన అర్థరహిత వాదనలు
  9. “మగవారు పందులు, స్రీలు ఆడకుక్కలు” అంటూ మిర్జా పలికిన అతి హీనమైన మాటలు
  10. ఖాదియాన్‌ పేరు ఖుర్‌ఆన్‌లో ఉందని వితండవాదం
  11. మస్జిదె అఖ్సా  అంటే మస్జిదె ఖాదియాన్‌ … వింత వాదన
  12. ఖాదియాన్‌ డెమాస్కస్‌ను పోలివుందని అర్దరహిత వ్యాఖ్యలు
  13. అల్లాహ్‌ సంతకం చేశాడని బొంకటం
  14. అల్లాహ్‌ పురుషుడు, తాను స్త్రీ అంటూ మిర్జా వ్యర్థ ప్రసంగం
  15. తాను గర్భం దాల్చానని మిర్జా గాలిమాటలు
  16. తాను దేవుణ్ణి అని బొంకటం
  17. ఈసా (అలైహిస్సలామ్‌) పరుల్ని దూషించేవారని, అబద్ధం చెప్పేవారని నిందలు
  18. ఈసా (అలైహిస్సలామ్‌) గ్రంథచౌర్యం చేసి ఇంజీలు రాశారని అపవాదు
  19. ఈసా (అలైహిస్సలామ్‌) వద్ద మహిమలు ఏవీ ఉండేవి కావని దుష్ప్రచారం
  20. ఈసా (అలైహిస్సలామ్‌) మద్యం సేవించేవారని నీలాపనింద
  21. తాను ఈసా (అలైహిస్సలామ్‌), హుస్సేన్‌ (రది అల్లాహు అన్హు)లను మించిన వాణ్ణని మిర్జా  గొప్పలు
  22. మర్యమ్‌(అలైహస్సలామ్‌)పై నీలాపనింద
  23. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)ను కించపరచటం
  24. హజ్రత్‌ ఫాతిమా (రది అల్లాహు అన్హా) పట్ల అవమానకర ధోరణి

– ఖాదియాని వహీ (కితాబె ముబీన్‌)లోని కొన్ని నమూనాలు

– ఆంగ్లంలో వహీ

[పుస్తకం టెక్స్ట్]

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ముందు మాట 

الحمد لله نحمده ونستعينه، ونستغفره، ونعوذ بالله من شرور أنفسنا، ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له، ومن يضلل فلا هادي له، ونشهد أن لا إله  إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله وبعد: 

అల్హమ్దులిల్లాహి నహ్మదుహూ వనస్తయీనుహు వనస్తగ్  ఫిరుహూ, వనవూజు బిల్లాహి మిన్ షురూరి అనుఫుసినా వమిన్ సయ్యిఆతి ఆమాలినా, మన్ యహ్ ది హిల్లాహు ఫలా ముజిల్ల లహూ, వమైఁ యుజి లిల్ ఫలా హాదియ లహూ వనష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ, వనష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ వబాద్. 

ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి దైవదౌత్యం సమాప్తం అయిందని విశ్వసిస్తాడు. ముహమ్మద్ ప్రవక్త ﷺ ను దైవప్రవక్త అని మరియు చివరి ప్రవక్త అని సంపూర్ణంగా విశ్వసిస్తేనే ఒక వ్యక్తి పూర్తి విశ్వాసి అవుతాడు. ఎందుకంటే అల్లాహ్ ఆయన ﷺ ద్వారానే దైవదౌత్య పరంపరను ముగించాడు. ఆయనే చిట్టచివరి ప్రవక్త. ఆయన తరువాత ఏ ప్రవక్తా రాడు. అల్లాహ్ ఇలా సెల విస్తున్నాడు: 

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
ముహమ్మద్ ﷺ మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు”. (అహ్ జాబ్ 33 : 40) 

لو كان بعدى نبيا لكان عمر بن الخطاب 
ప్రవక్త ﷺ స్వయంగా ఇలా ప్రవచించారు: “నా తరువాత ఎవరయినా ప్రవక్త అయితే ఉమర్ (రదియల్లాహు అన్హు) అవుతారు”. (ముస్తద్రక్ అల్ హాకిమ్ : 3 – 29) 

ఆయన ﷺ విశ్వం మొత్తానికి ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ప్రళయం వరకు ఆయనే ప్రవక్త. ఆయన తరువాత మరే ప్రవక్తా రావడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. ఎందుకంటే సాధారణంగా ప్రవక్తల రాక మూడు కారణాలతో కూడుకుని ఉంటుంది. అవన్నీ ఆయన ﷺ తోనే నెరవేరాయి. 

1) ప్రవక్త ﷺ రాక ముందు వచ్చిన ప్రవక్తలందరూ ఓ నిర్ణీత ప్రాంతానికో, తెగ కోసమో వచ్చారు. వేరే ప్రాంతాల కోసం వేరే ప్రవక్త అవసరం ఉండేది. కాని ముహమ్మద్ ﷺ దైవదౌత్యం, ధర్మం విశ్వ లోకాల కోసం చేయబడింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
“(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము” (అంబియా 21 : 107) 

మరో చోట ఇలా సెలవీయబడింది: 

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا
“ఓ ప్రవక్తా, ముహమ్మద్! మేము నిన్ను ప్రజల కోసం శుభవార్తాహరునిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.” (సబా 34 : 28) 

2) ముహమ్మద్ ﷺ రాక పూర్వం కొన్ని ధర్మాలు అసంపూర్ణంగా ఉండేవి. వాటిని సంపూర్ణం గావించడానికి ప్రవక్తలు వచ్చేవారు. కాని ప్రవక్త ﷺ ధర్మం సంపూర్ణం చేయబడింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”. (మాయిద 5 :3) 

3) ముహమ్మద్ ﷺ రాకపూర్వం ఏ ధర్మం వచ్చినా అది మార్పులకు గుర య్యేది. దానిని సరి చేయడానికి ప్రవక్తను పంపడం జరిగేది. కాని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకొచ్చిన ధర్మ పరిరక్షణ బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకుంటూ ఇలా అన్నాడు: 

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”. (అల్ హిజ్ర్15:9) 

పైన పేర్కొన్న మూడు కారణాలను పరిశీలిస్తే దైవదౌత్య పరంపర కొనసాగే కారణాలేవీ ఇక మిగిలి లేవని అర్థం అవుతుంది. కనుక అల్లాహ్ మరో ప్రవక్తను పంపే అవకాశం లేనే లేదు. 

కాని ప్రవక్త ﷺ చెప్పిన భవిష్యవాణి ప్రకారం అబద్ధపు దైవదౌత్య ప్రకటన కర్తలు పుట్టుకొస్తారు. వారు తమను ప్రవక్తలుగా ప్రకటించుకుని తమ పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మహాప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: 

لا تقوم الساعة حتى يبعث دجالون كذابون قريبا من ثلاثين كلهم  يزعم أنه رسول الله  
ప్రళయానికి పూర్వం చివరి కాలంలో సుమారు ముప్పై మంది అబద్ధపు దజ్జాల్ లు పుడతారు. వారు తమను దైవప్రవక్తలమని ప్రకటించుకుంటారు”. (సహీహ్ బుఖారీ) 

దైవదౌత్య చివరి కాలంలో ముసైలమ కజ్జాబ్, అస్వద్ అనసీ లాంటి వారు అబద్ధపు దైవదౌత్య ప్రకటనలు చేసి దుర్మరణం పాలయ్యారు. 

అలాంటి వారిలోని వాడే మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని. అతను భారత్-పాక్ విభజనకు ముందు సామ్రాజ్య శక్తుల నీడలో పాశ్చాత్తవాద గర్భం నుండి పుట్టుకొచ్చినవాడు. ఇస్లాంకు భిన్నంగా ఇతడు ఖాదినియాత్ పేరుతో వేరే కుంపటి పెట్టుకోవటానికి ప్రయత్నించాడు. ప్రవక్త ﷺ కు పోటీగా తనను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. ముహమ్మద్ ﷺ ధర్మానికి పోటీగా ముస్లిం సమాజ పరిసరాల్లో ఖాదియానియత్ పేరుతో ఒక మహావృక్షాన్ని పాతాడు. దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం కష్టతరమైపోతుంది. ఎందుకంటే ఆ మత ప్రచారకులు, గ్రామాలలో అమాయక ముస్లిములను వారి ధర్మం నుంచి దూరం చేసి తమ మతావలంబీకులను చేయడంలో తలమునకలై ఉన్నారు. మస్జిద్ లేని చోట మస్జిద్ పేరుతో తమ ఆరాధనాలయాలను నిర్మిస్తున్నారు. ఇమామ్ లు లేని చోట తమ వారిని పెట్టుకుంటున్నారు. ఇమామత్, ఖుత్బాత్ ల పేర వారు తమ మతాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. దీన్ని భారత దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ చూడొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని సుదూర ప్రాంతాలు ఒకింత ఎక్కువగానే దీనికి ప్రభావితమై ఉన్నాయి. 

భారత దేశం ప్రజాస్వామిక దేశం. ఇక్కడి పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. వారు తమకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించచ్చు. ఇష్టంలేని మతాన్ని విడనాడవచ్చు. అదే విధంగా ఖాదియానీలకు తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికుంది. కాని విచారకర విషయం ఏమిటంటే వాళ్లు ప్రజలను మోసం చేసి ఇస్లాం ధర్మం పేరుతో తమ అసత్య విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు. 

అసలు ఖాదియానీ విశ్వాసాలు అతి బలహీనమైనవి. తమ దేవుడు మర్చి పోతాడని, పొరబాటు పడతాడని, నిద్రపోతాడని, సంభోగిస్తాడని ఇలా చిత్రవిచిత్ర విశ్వాసాలు కలిగినవారు ఖాదియానీలు. వారి ప్రవక్త గులాం అహ్మద్ ఖాదియాని. అల్లాహ్ గురించి అబద్ధాలు చెప్పటమే అతని ప్రవృత్తిలాగా అనిపిస్తుంది. ‘కితాబె ముబీన్’ పేరుతో అతనికి ఒక ప్రత్యేక పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకాన్ని అవతరింపజేసిన దైవదూత ఎవరనుకు న్నారు? గడ్డం గీసుకుని సూటుబూటులో ఉండే ఓ ఆంగ్లేయ యువకుడు. వారి పుణ్య క్షేత్రం ఖాదియాన్. అక్కడ వారి స్వర్గ శ్మశానవాటిక ఉంది. ఆ శ్మశాన వాటికలో ఖననమైనవారు కర్మల లెక్క, విచారణ ఏమీ లేకుండా నేరుగా స్వర్గానికి వెళతాడని ఖాదియానీల నమ్మకం. ఖచ్చితంగా ఆ స్వర్గం కూడా ఎలాంటి స్థలం అయి ఉంటుందంటే అందులోకి వెళ్ళినవాడు తిన్నగా నరకంలోకి పోయి పడతాడు. 

కాని తమ ఈ అసత్యపు విశ్వాసాలను ప్రచారం చేయడానికి అమాయక ముస్లిములను మోసం చేయడం, తమ మతాన్ని ఇస్లాం అని చెప్పి, తమ ఆరాధనాలయాలను మస్జిద్ లని చెప్పి ముస్లిముల ధర్మాన్ని, విశ్వాసాన్ని విక్రయించడం ఎంతటి హేయమయిన చర్యలు అంటే వాటిని ఒక సాధారణ ముస్లిం కూడా సహించలేడు. మీ చేతుల్లో ఉన్న ఈ చిరుపుస్తకం ఉద్దేశం అదే! ఖాదియానీల అసలు రూపాన్ని ముస్లిం ప్రజానీకం ముందు బట్టయలు చేయడం! 

ఈ పుస్తకంలోని ప్రతి విషయం ఆధారాలతో నిరూపించబడింది. వారి పుస్తకాల్లోని కొన్ని నమూనాల ఛాయాగ్రహణాలు (ఫోటోలు) తీసుకొని వాటిని పుస్తకం చివర్లో ఆధారాలుగా పేర్కొనడం జరిగింది. తద్వారా పాఠకులకు ఆధారాలు తెలియాలని, దృఢ సంకల్పంతో ఉన్న విషయాన్ని తెలియ పరచాలని, అంతేగాకుండా ఖాదియానియత్ వాస్తవాన్ని తెలుసుకుని దాని అపాయకర వలలో చిక్కుకోకుండా తమను, ఇంకా మొత్తం ముస్లిం సమాజాన్ని రక్షించాలని. 

ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. 

1) మొదటి భాగంలో సందేశ ప్రచార (దావత్) రంగంలో నేరుగా ఖాదియానీలతో జరిగిన చర్చలు, సంభాషణలు, వాదోపవాదాలు పాఠకుల సౌలభ్యం నిమిత్తం పొందుపరచబడ్డాయి. ఆ అనుభవాల ద్వారా ఖాదియానిల సిద్ధాంతాలను అర్థం చేసుకోవటం తేలికవుతుంది. ఆ మతంలోని డొల్లతనాన్ని నలుగురి ముందు బట్టబయలు చేసి ఇతరులను దాని నుంచి రక్షించటానికి వీలవుతుంది. 

2) రెండో భాగం ఈ పుస్తకంలోని కీలకాంశం. అది నా డాక్టరేట్ థీసెస్ లోని ఒక భాగం. దాన్ని నేను సౌదీ అరేబియాలోని జామి అతుల్ ఇమామ్ లో సమర్పించి వున్నాను. మర్కజ్ దారుల్ బిర్ లో విద్యనభ్యసించి తర్వాత అక్కడే అధ్యాపక సేవలందిస్తున్న నా శిష్యురాళ్ళు దాన్ని తెలుగులోకి అనువదించడం కోసం ఎంతో కృషి చేశారు. తేట తెలుగు భాషలోకి దానిని అనువదించారు. అల్లాహ్ దయవల్ల వారు చేసిన కృషి వల్లనే నేను ఈ పుస్తకాన్ని రూపొందించగలిగాను. వారు చేసిన కృషికిగాను అల్లాహ్ వారికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించుగాక! 

3) మూడో భాగంలో స్వయంగా ఖాదియానీల పుస్తకాల నుండి తీసుకున్న ఫోటోలను ఆధారాల క్రింద పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకంలోని ప్రతి విషయం ఆధారాలతో నిరూపించబడింది. అందుకోసమే ఆధారాలు కూడా పాఠకుల చేతుల్లో ఉంటే మంచిదని భావించాను. అవసరమైన ఆధారాలు నాకు కువైట్లో లభ్యమయ్యాయి. వాటిని ఇవ్వడంలో కువైట్లో ఉండే మౌలానా ఆరిఫ్ జావెద్ గారు నాకు ఎంతో సహకరించారు. అల్లాహ్ ఆయనకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక!

ఈ పుస్తకం అన్ని హంగులతో చివరి రూపం దాల్చినందుకు మొదట నేను అల్లాహ్ కు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ తరువాత నా మిత్రుడు మౌల్వీ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ హఫిజహుల్లాహ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈ పుస్తకానికి మెరుగులు దిద్ది అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రియతమ మౌల్వీ అబ్దుష్షుకూర్ ఉమరి సల్లమహు గారు ఈ పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎంతో క్షుణ్ణంగా దీన్ని చదివి తగిన సూచనలు చేశారు. లక్ష్మీనారాయణ గారు ఈ పుస్తకాన్ని కంపోజ్ చేశారు. అబ్దుల్ వకీల్ గారు ప్రింటు చేయించే బాధ్యత తీసుకున్నారు. ఇంకా దీన్ని పాఠకుల ముందుకు తీసుకురావటానికి ఎవరెవరయితే నాకు రవ్వంతయినా సహాయం చేశారో వారందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ వారికి ఇహపర లోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక! 

– డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరీ, మదనీ 

[1] మొదటి అధ్యాయం : సంవాదనలు 

ఒకప్పుడు ఖాదియాని ప్రచారకులు పంజాబ్ నుండి బయలుదేరి దక్షిణ భారతదేశంలోని ధార్మిక జ్ఞానం బొత్తిగా ఉండని, మన ధార్మిక పండితులు చేరుకోవటానికి వీలుండని ఏదో మారుమూల ప్రదేశాన్ని, పల్లె ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడి అమాయక ప్రజలను తమ కల్లబొల్లి మాటలతో వలలో వేసుకునేవారు. అయినప్పటికి అల్లాహ్ దయవల్ల ఎప్పుడైనా, ఎవరైనా ఇస్లాం దాయి ఆ ప్రాంత ప్రజల గురించి తెలిసి వారికి ఇస్లాం ధర్మ సత్యతను బోధిస్తే, దాంతో ఊరి ప్రజలకు సత్యం బోధపడేది. అప్పుడు ఊరి ప్రజలే ఆ ఖాదియానీ ప్రచారకుణ్ణి తమ ప్రాంతం నుంచి పారదోలేవారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. నేడు మన పిల్లలు, మన ప్రాంతం వారు స్వయంగా ఖాదియాన్ పట్టణమునకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి, శిక్షణను పొంది తిరిగి వచ్చి తమ తమ ప్రాంతాల్లోని మస్జిద్ లను ఆక్రమించేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని అక్కడి నుండి తొలగించటం చాలా పెద్ద సమస్యగా మారిపోతోంది. 

[1.1] ఒక ఖాదియాని ఇమామ్ తో  సౌమ్యంగా సంభాషణ 

ఇటీవలే జరిగిన ఒక సంఘటన: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో మేము ఒక ధర్మప్రచార (దావత్) పర్యటనలో ఉన్నాము. ఏలూరు నగరం నుండి బయలుదేరి జంగారెడ్డి గూడెం వైపు వెళుతున్న మేము మార్గానికి ఎడమ వైపున ఒక సుందరమైన చిన్న మస్జిద్ ను చూశాము. ఆ మస్జిద్ పేరు మస్జిద్- ఎ-నూర్. మా సహచరుల ద్వారా తెలిసింది, అది ఖాదియానీల మస్జిద్ అని. ఇది విన్న మేము మా వాహనాన్ని ఆ మస్జిద్ వైపునకు మరలించాము. అక్కడి వారిని ప్రశ్నించగా ఆ మస్జిద్ ఇమామ్ ఖాదియాన్ పట్టణంలో విద్యను అభ్యసించి వచ్చాడని తెలిసింది. కాసేపటికి సూటుబూటు వేసుకుని, తలమీద టోపీ ఏమీ లేకుండా చింపిరి గడ్డంతోవున్న 20 లేక 22 సంవత్సరాల ఒక కుర్రాడు వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు: “నేను ఖాదియాన్ పట్టణంలో 7 సంవత్సరాల కోర్సు పూర్తి చేసి ఇప్పుడు (ఇక్కడ) ఈ మస్జిద్ ఇమామ్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను.” 

కుర్ర ఇమాము మాటలు విని నేను, “అలాగైతే మీరు ఇస్లాం గురించి చాలా విషయాలు తెలుసుకుని వుంటారు. నేను మీ నుండి ఇస్లాం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాలలో మీరు నాకు సహకరిస్తారా?” అని అడిగాను. అందుకు అతను చాలా సంతోషపడిపోయి ముందుకు వచ్చాడు. అప్పుడు మీ ఈ రచయితకు – ఆ ఖాదియానీకు మధ్య క్రింది విధంగా సంభాషణ మొదలైంది. 

మీ రచయిత: “ 7 సంవత్సరాల కోర్సులో మీకు అల్లాహ్ గురించి చాలా గొప్పగా చెప్పి వుంటారు. మరి మీరు చెప్పగలరా అల్లాహ్ ఎక్కడ వున్నాడో?” 

ఖాదియాని (తొందరపడుతూ): “అల్లాహ్ ప్రతి చోటా ఉంటాడు.” 

మీ రచయిత: “ప్రతిచోట…. అంటే మీ కాలి పాదానికి – మీరు తొడుక్కున్న బూటుకి మధ్యలో కొంత ఖాళీ చోటు ఉంది కదా! అందులో కూడానా?”

ఖాదియాని: “అయ్యయ్యో అలా ఎలా అవుతుందండి. అల్లాహ్ కాలి క్రింద ఎలా ఉంటాడు?” 

మీ రచయిత: “మీరే కదా అన్నారు ‘ప్రతి చోటా’ అని. మరి కాలి క్రింద చోటులేదా? అది చోటు కాదా?” 

ఖాదియాని: “మీరు అసలు అల్లాహ్ ను అంత సులువుగా గుర్తించలేరు. అల్లాహ్ ను గుర్తించటం చాలా కష్టం.” 
మీ రచయిత: “అలా అయితే మీరే చెప్పండి అల్లాహ్ ను ఎలా గుర్తించాలో?” 

ఖాదియాని: “ఇప్పుడు చూడండి. పాలున్నాయి. మేము పాలతో పెరుగు చేస్తాము పెరుగుతో మజ్జిగ చేస్తాము, మజ్జిగతో వెన్న తీస్తాము, ఆ వెన్నను కరిగించి నెయ్యి చేస్తాము. అలాగే అల్లాహ్ ను కూడా గుర్తించాలి.” 

మీ రచయిత: “అలా అయితే మీరు చెబుతున్న దేవుణ్ణి గుర్తించటం. చాలా కష్టమేనండి బాబూ! కాని మా నిజఆరాధ్య దైవం అల్లాహ్. ఆయనను గుర్తించటం అస్సలు కష్టం కాదు తెలుసా?” 

ఖాదియాని: “అవునా. సరే మీరే చెప్పండి. అల్లాహ్ ఎక్కడ వున్నాడో? 

మీ రచయిత:“దివ్యఖుర్ఆన్ ఇలా ఉంది: 

الرحمن على العرش استوی (سوره طه (۵) 
కరుణామయుడైన అల్లాహ్ ఏడు ఆకాశాలపై మహోన్నతమైన అర్ష్ (సింహాసనం) మీద ఆసీనుడై వున్నాడు. (సూరా తాహా:5) 

ప్రియ ప్రవక్త ﷺ ఒకసారి ఒక బానిసరాలి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు ఆమె “అల్లాహ్ ఏడు ఆకాశాల పై మహోన్నతమైన అర్ష్ (సింహాసనం) మీద ఆసీనుడై వున్నాడు” అని కరెక్టు సమాధానం ఇచ్చింది. (సుననె అబూదావూద్, 1:305) ఇంత సులువైన విషయం మీ కోర్సులో నేర్పబడలేదా?” 

ఖాదియాని: “మీ వల్ల మాకు మంచి విషయాలు తెలిశాయి. తమరికి ధన్య వాదాలు.” 

మీ రచయిత: “మీ మహా గురువు మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని గురించి మీ మత విశ్వాసం ఏమిటి?” 

ఖాదియాని: “ఆయన మహ్దీ (అలైహిస్సలామ్)!” 

మీ రచయిత: “మహ్దీ గారి గురించి మేము హదీసుల్లో చదివిన దానిని బట్టి ఆ మహాత్ముని కాలంలోనే దజ్జాల్ వస్తాడు. ఈసా ప్రవక్త ఆకాశం నుండి భూమిపైకి దింపబడతారు.” 

ఖాదియాని: “అరె! దజ్జాల్ ఎందుకు రాలేదు? వచ్చేశాడు కదా! అదే అమెరికా, దజ్జాల్ వచ్చేశాడు కదా! అదేనండి అమెరికా రూపంలో! 

మీ రచయిత: “మహ్ దీ కాలంలోనే ఈసా ప్రవక్త ఆకాశం నుండి దిగి దజ్జాల్ ను సంహరిస్తారని కూడా హదీసుల్లో మేము చదివాము. మీరు చెబుతున్నది చాలా విడ్డూరంగా ఉంది. మీ మహ్దీ గారు లోకాన్ని విడిచి కాల గర్భంలో కలిసి పోయారు. మీరు అనుకుంటున్న దజ్జాలు మాత్రం భూమిని దర్జాగా ఏలు తున్నాడు. ఇక మీ ఈసా (యేసు) విషయానికొస్తే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.. 

ఖాదియాని: “(తడబడిపోతూ అన్నాడు): ఇదిగో చూడండి. మేము అర్థం చేసుకున్న ఇస్లాం వేరు. మీరు చెబుతున్న ఇస్లాం వేరు. అందుకని, మేము అర్థం చేసుకున్న ఇస్లాంపైనే మేము మరణించే వరకు వుంటాము. మీ ఇస్లాం మీకు మా ఇస్లాం మాకు.” 

మీ రచయిత: అలాగైతే మన ఈ సంభాషణను బట్టి మీ మతం వేరని, మా మతం వేరని, మా అల్లాహ్ వేరని, మీ ఆరాధ్య దైవం వేరని, మీ మహ్దీ వేరని, మా ప్రవక్తలు వేరని, మీరు ఖాదియాని మతస్తు లని, మా ధర్మం ఇస్లాం అని స్పష్టంగా అర్థమవుతోంది. కనుక మేము మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము. మిమ్మల్ని మీరు ఇతరుల ముందు ముస్లింలుగా పరిచయం చేసుకొని ప్రజలకు మోసం చేయకండి. 

ఖాదియాని: మా వరకు మేముంటామండి. మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మీ పని చూసుకోండి. మీ హితబోధ మాకు అక్కరలేదు. 

[1.2] ఒక ఖాదియానీ ప్రెసిడెంట్ అమాయకపు సంభాషణ 

పై సంభాషణ తర్వాత మేము మా ప్రయాణం కొనసాగించాము. రావికం పాడు అనే ఒక గ్రామంలో ఖాదియానీలు ఉండే ఇంకో మస్జిద్ ను చూశాము. అక్కడివారిని అడిగితే తెలిసింది ఏమిటంటే, ఆ మస్జిద్ ప్రెసిడెంట్ ఖాదియాన్ వెళ్ళి హజ్ చేసివచ్చాడు.

మస్జిద్ తెరిచే ఉంది. ప్రెసిడెంటుగారు మస్జిద్ లో నే ఉన్నారు. ఆయన్ను కలిసి, “మీరు ఇస్లాం ధర్మం వదిలి ఖాదియాని మతాన్ని ఎందుకు అవలంబించారు?” అని అడిగాము. ఆయన కాసేపు మాతో వాదులాడాడు. చివరికి ఇలా మాకు అసలు తేడా ఏముందండీ! ఇదిగో… ఇది మా నమాజ్ కు సంబంధించిన పుస్తకం అన్నాడు: “మీకు, ఇందులో ఏమైనా తప్పులుంటే చూపించండి?” 

నిజంగా ఆ పుస్తకాన్ని చూసినప్పుడు చాలా వరకు అందులో సున్నత్ ప్రకారమే నమాజ్ పద్ధతి వివరించబడి ఉంది. పెద్దగా అభ్యంతరకర విషయాలు ఏవీ అందులో లేవు. అప్పుడు నేనన్నాను, “సరేగాని చిట్టచివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తర్వాత కూడా ఒక ప్రవక్త వచ్చాడని ఖాదియానీలు చెబుతారు – మీ విశ్వాసం కూడా అదేనా?” 

ఆ ప్రెసిడెంటు ఎంతో అమాయకంగా జవాబు ఇచ్చాడు. “అయ్యా! ఒక క్రొత్త ప్రవక్త వచ్చినంత మాత్రాన ఏం మునిగిపోతుంది, మంచే జరుగుతుంది కదా! సమాజాన్ని మరింతగా సంస్కరించటానికి వీలవుతుంది. ఇంకో ప్రవక్త వస్తే మీకు ఈర్ష్య ఎందుకండయ్యా?” 

మీ రచయిత: “అల్లాహ్ క్షమించాలి (అస్తగ్ ఫిరు ల్లాహ్)! ప్రజలు ఇంత అజ్ఞానంలో ఉన్నా మనం పట్టించుకోవటం లేదంటే… ఈ పరిస్థితి చాలా బాధాకరం.” 

మేము వారికి సత్యం బోధించే ప్రయత్నం చేశాము. కాని వారు వినలేదు. మా ప్రయాణం ముందుకుసాగింది. “ఈ ప్రజలకు ఎలా బోధించాలి? లోకంలో దైవప్రవక్తల పరంపర ముగిసింది అని వారికి తెలియజేసేది ఎలా? వారిని ఈ ఖాదియాని భ్రష్టత్వం నుండి బయటకు తీసేదెలా?” అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. 

అమాయకులైన ఈ ప్రజలు ఖాదియానియత్ సత్యమైన మతం అని నమ్మటానికి గల కారణాలు కూడా చాలా విచిత్రమైనవి. చాలా వరకు ప్రజలు ఈ మతాన్ని స్వీకరించడానికి కారణం: (1) ఖాదియానీలు వీరికోసం మస్జిద్ లు కట్టించి ఇస్తారు, (2) ఒకవేళ ఏదైనా మస్జిదులో ఇమాము లేకపోతే ఆ ఏర్పాటు కూడా వారే చేస్తారు. (3) వారి పిల్లలకు ఉర్దూ వ్రాయటం, చదవటం మరియు (4) ఖుర్ఆన్ పారాయణం నేర్పిస్తారు. 

క్లుప్తంగా చెప్పుకోవాలంటే, నిజధర్మమైన ఇస్లాం మతం పేరు చెప్పి ఖాదియానీలు తమ సిద్ధాంతాలను ప్రజలకు నేర్పుతున్నారు. సామాన్య ప్రజలు వారు చేస్తున్నది ఇస్లాం మత బోధనే అనుకుని మోసపోతున్నారు. ఆ విధంగా ఇస్లాం వ్యతిరేక ఖాదియానీ విశ్వాసాలు ఆ అమాయక ప్రజల్లో బలంగా నాటుకుంటున్నాయి. “వారు మాకోసం మస్జిద్ కట్టించి ఇచ్చారు. ఒక ఇమామును కూడా ఏర్పాటు చేశారు. మాకు ఇంకా ఏం కావాలి?” అని అనుకుంటున్నారు. 

ఎంత దౌర్భాగ్యమో చూడండి! మన ముస్లిం సమాజం నిర్లక్ష్య నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుంది? ఈ అమాయక ప్రజలను ఖాదియానీ కుట్రల నుంచి మనం ఎప్పుడు రక్షిస్తాం? ధర్మప్రచార, సంక్షేమ కార్యక్రమాలు మనం ఇంకా ఎప్పుడు ఆరంభిస్తాం? 

ఈ విధంగా ఆలోచిస్తూ మా ప్రయాణ బృందం ముందుకు సాగింది. నిజంగా ఈ దావత్ పర్యటనలో ఎన్నో వాస్తవాలు మా ముందుకు వచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటి: ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా లోనే దాదాపు 12 ఖాదియానీల మస్జిద్ లు నిర్మించబడ్డాయి. వెయ్యికి పైగా అక్కడి ప్రజలు ఖాదియాన్ వెళ్ళి హజ్ చేసి వచ్చారు. 200 మంది పిల్లలు విద్య నేర్చుకోవటం కోసం ఖాదియాన్ వెళ్ళివున్నారు. కొందరు ఒక సంవత్సరం కోర్సులో, మరికొందరు రెండు సంవత్సరాల కోర్సులో, ఇంకొందరు మూడు సంవత్సరాల కోర్సులో, ఇంకా కొందరు ఏడు సంవత్సరాల కోర్సులో ఇలా ఆ పిల్లలు ఖాదియానీ విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఈ సైన్యం తమ గ్రామాల్లోకి అడుగుపెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రమాదాలైతే చాలానే పొంచి వున్నాయి. అయితే ఈ పరిస్థితిని మార్చటం అసాధ్యమని కూడా మేము నిరాశకూ లోనుకావటం లేదు. ఎందుకంటే, నిరాశ అవిశ్వాసంతో సమానం! 

[1.3] పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం 

దేవరపల్లి గ్రామంలో ఖాదియానీల కేంద్రము ఉన్నదని ప్రయాణం మధ్యలో మాకు తెలిసింది. మేము గ్రహించింది ఏమిటంటే, బాహ్యప్రపంచానికి దూరంగా అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ గ్రామంలో మస్జిదులాంటి ఒక చిన్న భవనము ఉంది. అందులో ఒక పెద్ద టీ.వి. ఉంది. ఆ భవనంపై ఒక పెద్ద డిష్ యాంటినా అమర్చబడి ఉన్నది. లండన్ నుండి నేరుగా ఇక్కడికి ఖాదియాని ప్రోగ్రాములు ప్రసారం చేయబడతాయి. ఖాదియానీ మత ప్రచార కులకు జీతాలు పంపిణీ అయ్యేది, ఖాదియాని క్రిములు సమాజంలోకి వ్యాపించేది ఈ కేంద్రం నుంచే. 

[1.4] ఖాదియానియత్ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు 

ఖాదియానియత్ ఇస్లాం కాదు, అది ఇస్లాంకు విరుద్ధమైన మతం. ఈ విషయాన్ని నిరూపించే గట్టి ఆధారం మాకు ఆ గ్రామంలోనే లభించింది. గ్రామ ప్రజలలో ఇద్దరు వ్యక్తులు ఖాదియానియత్ మతాన్ని అవలంబించి తర్వాత కొన్నాళ్ళకు పశ్చాత్తాపంతో మళ్ళీ ముస్లిములయ్యారు. అసలు ఆ ఇద్దరు ఖాదియాని మతం ఎందుకు అవలంబించారు? మరలా ఏ విధంగా వారికి దాని నుండి విముక్తి లభించింది? అన్నది నేను తెలుసుకోదలచాను. 

ఈ ఇద్దరు అదృష్టవంతులలో ఒకరు ఆర్.యం.పి. డాక్టరు. మేము ఆయన ఇంటికి వెళ్ళి, ఆయనను కలిసి విచారించాము, “ఏవండీ! మీరు ముందు ఖాదియానిగా ఎందుకు మారారు? మారడానికి అసలు కారణం ఏమిటి? ఆ తర్వాత ఆ మతాన్ని ఎందుకు వదిలేసారు?” 

ఆర్.ఎం.పి. డాక్టరు గారు ఇలా చెప్పుకొచ్చారు: అయ్యా! మొదట్లో నాకు ఖాదియానియత్ పేరుతో ఒక ప్రత్యేక మతముందని కూడా తెలియదు. ముస్లిం ధార్మిక బృందాలు ఇక్కడకు వస్తుంటాయి. ఈ ఖాదియానియత్ కూడా అలాంటి ఒక బృందమే అనుకుని వాళ్ళతో నేను కలసి పోయాను. ఆ తర్వాత వాళ్లు నాకు ఇలా ప్రబోధించారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త) అని కలిమా పఠించినప్పుడు నీవు దృష్టిలో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ‘ముహమ్మద్’ అంటే మరెవరో కాదు, మహాగురువులు (ఆలా హజ్రత్), వాగ్దానం చేయబడిన మెస్సయ్య (మసీహె మౌవూద్), మహ్దీ గారే. ఎందు కంటే ఈ యుగంలో ఆ పేర్లతోనే ముహమ్మద్ ﷺ మళ్ళీ రెండవసారి అవతరించారు. అంటే ముహమ్మద్ ﷺ ఆలా హజ్రత్ గారి రూపంలో మళ్ళీ ఈ లోకంలో అవతరించారన్నమాట.” 

ఈ మాటలు చెప్పి డాక్టరు గారు మాకు ఒక చార్టు చూపించారు. ప్రతి ఖాదియాని ఇంట్లోనూ అది వేలాడబడి ఉంటుంది. ఆ చార్టులో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని ఫోటో ఉంది. దాని క్రింద సూరతుల్ జుముఆ లోని ఒక ఆయతు “వ ఆఖరీన మిన్ హమ్ లమ్మా యల్ హఖూ  బిహిమ్” లిఖించబడి వుంది. తర్వాత వచ్చే తరాలవారి కోసం కూడా ముహమ్మద్ ﷺ ప్రవక్తగా పంపించబడ్డారు అని మాటకు అర్థం. అయితే మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ ఒక దైవప్రవక్త అని నిరూపించటం ఆ లేఖనం ఉద్దేశం. ఈ కాలంలో ముహమ్మద్ ﷺ ‘మహాగురువు’ (ఆలా హజ్రత్), మసీహె మౌవూద్, మహ్దీ గారైన మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ రూపంలో అవతరించారన్నది ఆ చార్ట్ అంతరార్థం. ఖాదియానియత్ అసత్య మతం అని చెప్పే సంఘటన ఇది. 

ఇక ఖాదియానియత్ అబద్ధపు మతం అని నిరూపించడానికి డాక్టరు గారు చూపెట్టిన రెండవ ఆధారం, వారి మహాగురువు (ఆలా హజ్రత్) గులామ్ అహ్మద్ ఖాదియాని హిందువుల కొరకు కృష్ణావతారం ఎత్తి వచ్చారన్న ఖాదియా నీల విశ్వాసం. అందువల్లనే విగ్రహాల పూజకు కూడా ఈ మతంలో అనుమతి ఉంది. 

ఈ మాట చెప్పి డాక్టరు గారు మాకు ఒక ఫోల్డర్ చూపించారు. మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని వెలిబుచ్చిన ఆ ఇస్లాం విరుద్ధ అపనమ్మకం అందులో అత్యంత స్పష్టంగా రాయబడి ఉంది. 

[1.5] ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం 

నేను వాదనలు జరిపేవాణ్ణి (మునాజిర్ని) కాను. స్వభావ రీత్యా కూడా అసలు నేను వాదనల్ని ఇష్టపడను. ఎందుకంటే మొదటి నుంచి ‘వాదన’ దావత్ విధానంలో లేదు. అల్లాహ్ దివ్యగ్రంథంలో మౌలికంగా దావత్ కు రెండే రెండు పద్ధతులు తెలుపుతున్నాడు. 

1) విజ్ఞతా వివేచనంతో సంభాషించటం 

2) మంచి హిత బోధ. 

అల్లాహ్ దివ్యఖుర్ఆన్ ఈ విధంగా అన్నాడు: 

ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ


నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు.” (ఖుర్ఆన్ 16:125) 

ఇంకో విషయం ఏమిటంటే, వాదనలో గెలుపొందినంత మాత్రాన వారు సత్యంపై ఉన్నట్లు కాదు. ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా? గెలిచిన ప్రతివాడు సత్యంపై ఉన్నట్లు కాదు. ఒక వ్యక్తి అసత్యంపై ఉండి కూడా తన వాక్చాతుర్యంతో సత్యవంతులపై గెలుపొందగలడు. 

కాని ఒక ఖాదియాని ప్రచారకుని తుంటరితనం మూలంగా నేను సంవా దానికి సిద్ధం కావలసి వచ్చింది. గుంటూరు జిల్లాలో నగరానికి కొద్ది దూరంలో “ఎల్దేవరపాడు” అనే గ్రామం ఉంది. అక్కడ అహ్లె హదీసు మస్జిద్ ఒకటి నిర్మించబడింది. మన సమాజ నిర్లక్ష్యం కారణంగా ఒక ఖాదియాని ప్రచారకుడు రమజాన్ నెలలో అందులో తరావీహ్ నమాజ్ చేయించాడు. ఆ తర్వాత తన మదర్సా ఒకటి తెరిచి క్రమంగా మస్జిదును ఆక్రమించుకున్నాడు. అతని బోధనల ద్వారా అతను ఖాదియానీ అన్న సంగతి తెలిసొచ్చింది. అప్పుడు మన సత్య ప్రచారకుల (దాయీల) బృందం ఒకటి అక్కడికి చేరుకుంది. కాని వారు అతన్ని అక్కడ నుండి పంపివేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కాని సఫలం కాలేకపోయారు. ఇంకో సమూహం కూడా అలాగే ప్రయత్నించింది. కాని ఆ  ఖాదియాని నానా హంగామా చేశాడు. నేను కూడా మీలాగా ముస్లిమునే? నన్ను మస్జిద్ నుండి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? అనటం మొదలు పెట్టాడు. “నువ్వు ముస్లింవి కావు. ఖాదియానీవి” అన్నారు మన దాయీలు. అప్పుడు ఆ ఖాదియాని ఛాలెంజ్ చేస్తూ, “మీరు నన్ను ముస్లిం కానని నిరూపించండి. ఇక్కడ నుండి వెళ్ళిపోతాను” అన్నాడు. 

విషయం ఇంత దాకా వచ్చిన తర్వాత మన దాయీలు నాకు కబురు పెట్టారు. చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ వివాద వాతావరణం నెలకొని ఉంది. తరతమ భేదం లేకుండా గ్రామ ప్రజలందరు పోగయ్యారు. పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఖాదియానీల తరఫున వాదించటానికి వారి అతిపెద్ద నాయకుడు, ఆ ప్రాంతపు ప్రెసిడెంటు సలీం ‘ అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. 

వాదనా విధానం నిర్ణయించబడింది. ఇరువైపుల నుంచి వాదించేవారు ఖరారు చేయబడ్డారు. ముస్లింల తరఫున వాదించటానికి డా. సయీద్ అహ్మద్ ఉమరీ, మదనీ అనగా మీ ఈ రచయిత ముందుకు వచ్చాడు. ఖాదియానీల తరఫున వాదించే అతను సలీం. ఈ వాదన అంతా తెలుగు భాషలోనే నడుస్తుందని చెప్పుకోవటం జరిగింది. వాదనను సౌమ్యమైన సంభాషణగా మార్చేందుకు నేను శతవిధాలా ప్రయత్నించాను. కాని ప్రత్యర్థి అసలు మా మాట వింటే కదా! దైవప్రవక్త యేసు ﷺ ఆకాశానికి ఎత్తుకోబడ్డారా? లేక సహజ మరణానికి గురయ్యారా? అని తన తరపున కొత్త వాదన లేవనెత్తాడు. 

ఈ విషయంలో ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, మెస్సయ్య (యేసు అలైహిస్సలామ్) సహజ మరణానికి గురయ్యారు. అయితే ఆయన ఇస్రాయీల్ జాతి మెస్సయ్య. ఇక మర్యమ్ కుమారుడైన మెస్సయ్య మరెవరో కాదు, స్వయానా వారి ప్రవక్త అయిన మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీయే. ప్రవక్త యేసు (అలైహిస్సలాం) ను ఆకాశానికి ఎత్తుకున్న విషయంపై కొందరు ముస్లిం పండితులకు కూడా నమ్మకం లేకపోవటం దురదృష్టకరం. మర్యమ్ కుమారుడైన యేసు సహజ మరణానికి గురయ్యారని వారంటారు. ఉదాహరణకు ఇమామ్ రాజీ తన “తఫ్సీరె కబీర్”లో ఈసాను ఆకాశానికి ఎత్తుకోబడిన విషయాన్ని తిరస్కరించారు. వాస్తవం ఏమిటంటే, ఆయనకు అసలు “అల్లాహ్ పైన ఆకాశాలపై ఉన్నాడు” అన్న ఇస్లామీయ నమ్మకంతోనే విభేదం ఉంది. ఒకవేళ ఈసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ ఆకాశాల పైకి ఎత్తుకున్నాడు అనే విషయాన్ని నమ్మితే, అప్పుడు ఆయన అల్లాహ్ ఏడు ఆకాశాలపై ఉంటాడని నమ్మవలసి వస్తుంది. అది తాను కల్పించుకున్న సిద్ధాంతానికి విరుద్ధంగా పోతోంది. కాబట్టి ఆయన యేసు (అలైహిస్సలామ్)ను ఆకాశానికి ఎత్తుకోబడినట్లు ఖుర్ఆన్ చెబుతున్న వాస్తవాన్ని తిరస్కరించేశారు. 

యేసు (అలైహిస్సలామ్) ను అల్లాహ్ పైకి లేపుకున్నాడనే మాటని సర్ సయ్యద్ ఖాన్ కూడా తిరస్కరించారు. ఎందుకంటే సర్ సయ్యద్ ఖాన్ మొదటి నుంచి మహత్యాలను, అద్భుతాలను (మోజిజాత్ లను) నమ్మేవారు కాదు. అదే విధంగా గులామ్ అహ్మద్ ఖాదియాని కూడా అల్లాహ్ యేసును పైకి లేపుకున్నా డనే విషయాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఆ “మసీహ్ మౌవూద్” తానే అవ్వాలని ఆయనకు ఆశ ఉండేది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అయినా నేను ఈ విషయంపై మాట్లాడటానికి పూర్తిగా నిరాకరించాను. “ఖాదియానీలు ముస్లింలు కారు” అన్న విషయం గురించి మాట్లాడటానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. కనుక మన సంభాషణ దీనిపైనే జరగాలని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అక్కడ ఎక్కువ మందికి నా అభిప్రాయం నచ్చింది. “ఖాదియానీలు ముస్లింలు కారు” అన్న విషయం గురించే మాట్లాడాలని గట్టిగా చెప్పటంతో ప్రత్యర్ధులు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన వాదన తీరు ఇది: 

మీ రచయిత: సలీమ్ భాయ్! మనం స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం. 

మీరు ముస్లిమా కాదా అన్న విషయం మాత్రమే మేము తెలుసుకో వాలనుకుంటున్నాము. కనుక విరుచుకుపడి మాట్లాడుకోవలసిన అగత్యం మనకు లేదు. దైవప్రవక్త ముహమ్మద్ ﷺ తన దగ్గరకు వచ్చే వ్యక్తి ముస్లిమా కాదా అని నిర్థారించుకోవటానికి రెండే రెండు ప్రశ్నలు వేసేవారు. అవే రెండు చిన్న చిన్న ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ మీరు సమాధానం ఇస్తే మీరు మా ముస్లిం సోదరులవుతారు. జవాబు ఇవ్వలేకపోతే మీ మతం ఇస్లాం కాదు, మీరందరు ఈ మస్జిద్ని వదిలేయాలి

ఖాదియాని: ఈసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ ఆకాశంపైకి లేపుకున్న విషయం గురించి మాట్లాడుకుంటే మంచిది. 

మీ రచయిత: చూడు తమ్ముడూ! ఖాదియానీలు ముస్లింలు కారు అని నిరూపించటానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. కనుక ఆ విషయంపైనే మనం మాట్లాడుకుందాం. 

ఖాదియాని: సరే, మీ మొదటి ప్రశ్న అడగండి. 

మీ రచయిత అడిగిన మొదటి ప్రశ్న: “అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?” 

ఖాదియాని: అల్లాహ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతారేంటి? అల్లాహ్ అంటే ఏదైనా కనపడే వస్తువా? “అల్లాహ్ భూమ్యాకాశాల జ్యోతి” (నూరుస్సమావాతి వల్ అర్ద్). అలాంటప్పుడు అల్లాహ్ ఫలానా చోట ఉన్నాడని ఎలా చెప్పగలను? 

మీ రచయిత: ఇది ఇస్లాంలో మొట్టమొదటి పాఠం. దైవప్రవక్త ﷺ  కాలంలో ఆయన దగ్గరకు ఒక బానిసరాలిని తీసుకురావటం జరిగింది. ఆమె ముస్లిమా? కాదా? అని నిర్ధారించుకోవటానికి దైవప్రవక్త ﷺ ఆమెకు ఇదే ప్రశ్న వేశారు. ఆ బానిసరాలు వెంటనే సమాధానం ఇచ్చింది. అలాగే మీరు కూడా ముస్లిం అయితే ఇస్లాంలోని ఈ మొదటి పాఠం మీకు గుర్తుండేది. కాని మీరు ముస్లిం కాదు. అందుకే చెప్పలేకపోయారు. 

ఖాదియాని: అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పరు, చెప్పలేరు కూడా. 

మీ రచయిత: మీరు అలా అనకండి, ఇక్కడ నా పక్కన ఈ మధ్యనే ఇస్లాం స్వీకరించిన అబ్దుల్లాహ్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను ఇస్లాం స్వీకరించి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అయినా అల్లాహ్ ఎక్కడున్నాడో అబ్దుల్లాహ్ చెప్పగలడు. అబ్దుల్లాహ్! అల్లాహ్ ఎక్కడున్నాడో చెప్పగలవా? (అని అబ్దుల్లాహ్ ను అడగటం జరిగింది). వెంటనే అబ్దుల్లాహ్ లేచి తన మాతృభాష తెలుగులోనే సమాధానం ఇచ్చాడు, “అల్లాహ్ ఏడు ఆకాశాలపైన మహోన్నత అర్ష్ పై ఉన్నాడు”. 

ప్రత్యర్థి మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పోయినట్లు పాయింటు రాసుకోమని మధ్యవర్తిని ఉద్దేశించి చెప్పటం జరిగింది. 

ఇక రెండో ప్రశ్న:-

మీ రచయిత: నా రెండో ప్రశ్న దైవదౌత్యానికి సంబంధించినది. అయ్యా! మీరు దైవదౌత్యం (నబువ్వత్, రిసాలత్) గురించి వివరించండి. అలాగే మీ మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని ఎలాంటి ప్రవక్త అన్నది కూడా చెప్పండి. 

ఖాదియాని: దైవదౌత్యం (రిసాలత్, నబువ్వత్) వివరణ ఏమిటో నాకు తెలియదు. కాని మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని మసీహే మౌవూద్ (తిరిగి వస్తారని చెప్పబడిన యేసు ప్రవక్త), ఇంకా ఆయన మహ్ దియే మాహూద్ (వాగ్దానం చేయబడిన మహ్దీ). ఆయన దైవసందేశహరులు (రసూల్), దైవ ప్రవక్త (నబీ) అయితే కారు. 

మీ రచయిత: మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తాను దైవప్రవక్తనని ప్రకటిం చుకున్నారు. అంతేకాదు, తాను వ్రాసిన పుస్తకంలో ఆయన తాను ఒక దైవసందేశహరుణ్ణి, దైవప్రవక్తను మాత్రమే కాదు, హిందువుల కోసం తాను శ్రీకృష్ణ అవతారాన్ని అని కూడా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నేను నిరూపించినా కూడా మీరు ఆయన్ని నమ్ముతారా? 

ఖాదియాని: గురువర్యులు మిర్జా మహ్దీమాత్రమే. అంతకు మించి ఆయన మరేమీ కారు. 

మీ రచయిత: ఆ సమయంలో నేను ఒక వ్రాత పత్రము అతని ముందుంచాను. నేను ఒక విజ్ఞాన పర్యటనలో వున్నప్పుడు లండన్లోని బ్రిటిష్ లైబ్రరీ నుండి దాని నకలును సంపాదించాను. అది స్వయానా మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తన ప్రెస్ లో ముద్రింప జేసింది. ఆ పత్రం చదివి వినిపించబడింది. తెలుగు భాషలో దాని అర్థం కూడా వివరించటం జరిగింది. అది విన్న తర్వాత ఖాదియానీ ముఖకవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. 

ఆ పత్రిక సారాంశం ఏమిటంటే, మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తాను ముస్లిముల కొరకు ముహమ్మద్ యొక్క మరో అవతారమనీ, క్రైస్తవుల కొరకు మర్యమ్ కుమారుడు ఈసా (యేసు అలైహిస్సలామ్) అవతారమని, ఇక హిందువుల కొరకు తాను కృష్ణుడి అవతారంగా పంపించబడిన వాడినని బహిరంగంగా ప్రకటించుకున్నాడు. 

వ్యవహారం కృష్ణుడి అవతారం వరకు వెళ్ళింది కనుక నేను అక్కడున్న వారిని ఉద్దేశించి, “కృష్ణుడు ఎవరండీ?!” అని అడిగాను. అక్కడున్న వారంతా ముక్తకంఠంతో, “కృష్ణుడు హిందువుల దేవుడు” అని సమాధానం ఇచ్చారు. “మరి తనను తాను కృష్ణుడిని అని చెప్పుకునేవాడు ఏ మతానికి చెందిన వాడవుతాడు?” అని నేను అడిగాను. “హిందువు అవుతాడ”ని అందరూ అన్నారు. 

“ఇటువంటి ప్రకటన చేసిన వ్యక్తిని ‘ఒక దైవప్రవక్త’ అని లేక ‘మహ్దీ’ అని పొగిడేవారు ముస్లింలు అవగలరా?” 

“వారు ముస్లింలు కాలేరు” – ప్రజల సమాధానం. 

“ఇతను ఇస్లాం వ్యతిరేకి. ఇతన్ని మస్జిద్ నుండి గెంటేయండి” అంటూ కొందరు ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. 

అప్పుడు నేనన్నాను, “అయ్యా! సలీమ్ గారిని మస్జిద్ నుండి పంపించ వలసిన అవసరం లేదు, ఆయన కలిమా చదువుకుంటే ఆయన కూడా మన ముస్లిం సోదరుడే. మనతోపాటు మస్జిద్ లో  ఆయన కూడా నమాజు చెయ్యవచ్చు.” 

కాని సలీమ్ కలిమా చదవటానికి ఒప్పుకోలేదు. తానూ ముస్లింనేనని వాదించసాగాడు. రుజువు క్రింద తనకు గుర్తున్న దుఆలు, జిక్ర్ లు అన్నీ పదేపదే వల్లించసాగాడు. నేను అతనితో అన్నాను, “మీరు వల్లిస్తున్న ఈ దుఆలన్నీ ఇంతకుముందు మీరు ముస్లింగా వున్నప్పుడు నేర్చుకున్నవి. కాని ఆ తర్వాత మీరు ఖాదియాని కావడం వలన ఇస్లాం ధర్మం నుండి మరలిపోయారు. ఇప్పుడు కలిమా పఠించి మీరు మళ్ళీ ముస్లిం అయిపోండి.” 

“నా ధర్మం నాది. మీ ధర్మం మీది. ఈ మస్జిద్ మీది. మీ మస్జిద్ ను మీరే చూసుకోండి” అని చెప్పి మొత్తం ఆరుగురు ఖాదియానీలు మస్జిద్ నుండి బయటికి వెళ్ళిపోయారు. ఖాదియాని ఇమామ్ ఇంట్లో వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత ఊరు వాళ్ళు చెప్పడం వలన పోలీస్ ను పిలిపించి ఆ గ్రామం నుంచి పంపించివేశాము. ఈ విధంగా ఖాదియానీ కుట్రల నుంచి మస్జిద్ రక్షించబడింది. గ్రామ ప్రజలు ఖాదియానీల అపాయము నుండి బయటపడ్డారు. (అల్ హందు లిల్లాహ్) 

రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు 

అసలు ఖాదియానియత్ అంటే ఏమిటి? 

ఖాదియానీ అనే పదం పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ అనే పట్టణాన్ని సూచిస్తుంది. ఖాదియానీ మతం అక్కడే పుట్టింది. ఈ ప్రాంతం ప్రస్తుత భారత దేశంలోనే ఉంది. ఈ ఖాదియాన్ గడ్డ పైనే ఖాదియాని మతస్థాపకుడైన మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని క్రీ.శ. 1839లో జన్మించాడు. 1900లో బ్రిటిషు సామ్రాజ్య శక్తులు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం భారత ఉపఖండంలో దీని తాలూకు బీజాలు నాటారు. ముస్లింలను వారి ధర్మం నుంచి దూరం చేయటం, ముఖ్యంగా ముస్లింల హృదయాల నుంచి విశ్వాసాన్ని, ముహమ్మద్ ప్రవక్త ﷺ పట్ల అనుసరణా పిపాసను తొలగించి ముస్లింలు ఆంగ్లేయ సామ్రాజ్య శక్తులకు ఎదురు తిరగకుండా చేసుకోవటం దీని ప్రధాన ఉద్దేశం. ఆంగ్లంలో “రిలిజియస్” (Religious) అనే ఒక మాసపత్రికను వారు ప్రారంభించారు. అది వారి లక్ష్యాలు, సంకల్పాలకు దర్పణం పట్టేది. నేటికి కూడా ఆ పత్రిక వెలువడుతోంది. గులాం అహ్మద్ పేరు మీద ఈ మతాన్ని ‘అహ్మదియా మతం’ అని కూడా పిలుస్తారు. అలాగే మిర్జా గులాం పేరుతో దీనిని “మీర్జాయీ మతం’గా కూడా పిలుస్తారు.’ [1]

ఖాదియానీ మతంలో వర్గాలు 

ఈ మతం రెండు వర్గాలుగా విడిపోయి వుంది. మొదటి వర్గం అహ్మదియా అని పిలువబడుతుంది. దాని నాయకుడు నూరుద్దీన్. వీరి స్థావరము పాకిస్తాన్లోని “రబ్వహ్” అనే ప్రాంతం. ఈ వర్గీయులు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానిని అల్లాహ్ ప్రవక్త అని, ప్రళయానికి పూర్వం రాబోయే యేసు (మసీహె మౌఊద్) అని, ముస్లిం సమాజం ఎదురు చూస్తున్న మహ్దీ (మహ్దియే ముంతజిర్ ) అని, ఇంకా అల్లాహ్ పంపిన ప్రవక్తలందరిలోకెల్లా మిర్జా గులాం అహ్మద్ శ్రేష్టుడని విశ్వసిస్తారు. మీర్జాపై విశ్వాసముంచినవారు స్వర్గవాసులవు తారని, మిర్జాను విశ్వసించనివారు నరకానికి వెళతారని వీరి నమ్మకం. 

నూరుద్దీన్ తోపాటు మహమూద్ అహ్మద్ బిన్ గులాం అహ్మద్, ముహమ్మద్ సాదిక్ (ఖాదియాని ముఫ్తి) మొదలగువారు కూడా ఈ వర్గంలో ప్రముఖులు. వాస్తవంలో గులాం అహ్మద్ తన చేతులారా స్థాపించిన మతం ఇదే. మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ బోధనలకు ఇది పరిపూర్ణ ప్రాతినిధ్యం వహిస్తుంది. అతని విశ్వాసాలను వాస్తవరీతిలో అంటిపెట్టుకొని వుంది. 

ఇక రెండవ వర్గం “అహ్మదియా లాహోరియా’గా పిలువబడుతుంది. ఈ వర్గానికి నాయకుడు ముహమ్మద్ అలీ లాహోరీ. పాకిస్తాన్ లోని ప్రముఖ పట్టణం లాహోర్ ఈ వర్గానికి కేంద్రప్రాంతం. వీరి విశ్వాసాల ప్రకారం మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని దైవప్రవక్త కాదు, దైవసందేశహరుడు కూడా కాదు, ఆయన ఒక సామాజిక సంస్కర్త, సమాజ పునరుద్ధారకుడు, ఆయన్ని తిరస్కరిం చటం పాపం, ధర్మం పట్ల తీవ్ర అవిధేయత క్రిందికి వస్తుంది. అయితే ఈ వర్గం వారి విశ్వాసాలు స్వయానా మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని చెప్పిన మాటలతో, ఆయన బోధనలతో ఏమాత్రం పొసగటం లేదు. ఖాదియానీ బోధనలు – ఈ వర్గంవారి విశ్వాసాలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. ఈ విషయా లన్నిటి గురించి రాబోయే పేజీల్లో వివరంగా చర్చించుకుందాం. ఈ వర్గపు పెద్దల్లో ఖాజా కమాలుద్దీన్, ముహమ్మద్ అహ్సన్ అమ్రూహీ చాలా ప్రముఖులు. [2]

ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం 

గులాం అహ్మద్ బిన్ గులాం ముర్తజా బిన్ అతా ముహమ్మద్ ఖాదియాని జననం క్రీ.శ. 1839లో, మరొక కథనం ప్రకారం 1840లో [3] పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో జరిగింది. వీళ్ళ కుటుంబం మొగల్ వంశంలోని “బర్ లాస్” అనే శాఖకు చెందినది. మిర్జా జీవిత చరిత్ర రాసిన వారందరూ అతను పూర్వీకుల గురించి ఈ వివరాలే నమోదు చేశారు. అయితే పర్షియన్ల గురించి హదీసుల్లో గొప్పగా చెప్పబడటం గురించి తెలుసుకున్న అతను తన పూర్వీకులు పర్షియన్లు అని, ఆ మేరకు తన వద్దకు దైవసందేశం (వహీ) అవతరించిందని చెప్పుకున్నాడు [5]. తర్వాత తన వంశీయులు చైనీయులని చెప్పటం ప్రారంభించాడు [6]. ఒకసారి అతను తాను దైవప్రవక్త ﷺ కుమార్తె అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) వంశంలో పుట్టినవాణ్ణని ప్రకటించుకున్నట్లు కూడా దాఖ లాలు ఉన్నాయి. చివరగా తాను దైవప్రవక్త ఇసహాఖ్ సంతతిలో పుట్టినవాణ్ణని కూడా అతను చెప్పాడు. [7]

మిర్జా వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పని చేసింది

తన వంశధార, తన పూర్వీకుల గురించి గులాం అహ్మద్ ఖాదియానికి ఇంత సందిగ్ధత, ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికినీ తన కుటుంబం బ్రిటీషు సామ్రాజ్య శక్తులకు తొత్తులుగా వ్యవహరించింది అన్న విషయంపై మాత్రం ఆయనకు సంపూర్ణ నమ్మకం ఉండేది. పైగా దీనిపై ఆయన చాలా సంబరపడి పోయేవాడు. దానిని అత్యంత గౌరవప్రదంగా భావించేవాడాయన. ఆయన ఒక చోట ఇలా రాశాడు: ‘ఇండియాలో ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల శ్రేయోభావంతో, చిత్తశుద్ధితో మెలిగిన కుటుంబాలన్నిటిలోకి మా కుటుంబం తమ పట్ల అత్యంత విశ్వాసంతో ఉందని బ్రిటీషు ప్రభుత్వం అంగీకరిస్తుంది. మా నాన్న, మా వంశం వాళ్ళందరూ మొదటి నుంచి బ్రిటీషు ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉండేవారు, బ్రిటీషు ప్రభుత్వాన్ని వేన్నోళ్ళా పొగిడేవారు. ఎన్నో చారిత్రక సంఘటనల ద్వారా ఈ విషయం రుజువు అవుతోంది. ఇది నా భ్రమ కాదు, పెద్ద పెద్ద ఆంగ్లేయ అధికారులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. [8]

మిర్జాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతని తండ్రి సైన్యాన్ని తయారు చేసి బ్రిటీషువారికి సైనిక శక్తిని సమకూరుస్తున్నాడు. అతని సోదరుడు గులాం ఖాదిర్ కూడా బ్రిటీషు సేవలో రేయింబవళ్ళు తరించిపోతున్నాడు. కొంత వయసు వచ్చిన తర్వాత తనకు సామాజిక స్పృహ కలుగుతున్నప్పుడు తన వంశం వాళ్ళందరూ కలిసి ఆంగ్లేయ సైనికాధికారుల కోసం ఒక మంచి సైనిక శిబిరం లాగా ఉపయోగపడుతున్నట్లు మిర్జా కళ్లారా చూశాడు. ఇస్లామీయ పునరుద్ధరణను అణగదొక్కటానికి, లోకంలో ముస్లింల ఉనికే లేకుండా చేయటానికి ముస్లిం విరోధ శక్తులు మిర్జా ఇంటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తూ ఉండేవారు. ప్రత్యేక వనరులు, సాధనాల ద్వారా స్కీములు తయారు చేయబడి యావత్ దేశంలో అమలుపరచబడేవి. బ్రిటీషువారికి తన కుటుంబం ఈ విధమైన సేవలు అందించటాన్ని మిర్జా గులాం అహ్మద్ “అదృష్టం”గా వర్ణించుకున్నాడు. పైగా పదే పదే తన గ్రంథాల్లో ఈ విషయాన్ని గురించి చాలా గొప్పగా ప్రస్తావించు కున్నాడు.[9] ఒక గ్రంథంలో ఆయన రాస్తాడు, “ఆంగ్లేయ ప్రభుత్వం సుదీర్ఘ కాలం పాటు వర్ధిల్లటం కోసం, దాని చిరకాల ఉనికి కోసం మేము మా ప్రాణా లను త్యాగం చేయటానికి కూడా ఎన్నటికి వెనుకాడము. [10]

బాల్యం, విద్యాభ్యాసం 

మిర్జా ప్రాథమిక విద్యాభ్యాసం ఆయన ఇంట్లోనే జరిగింది. ఫజల్ ఇలాహీ, ఫజల్ అహ్మద్, గులాం అలీ షాహ్ మొదలగువారు ఆయన గురువులని చెబుతారు. అరబీ వ్యాకరణంలోని నహ్వ్, సర్ఫ్, తర్కం, ప్రాథమిక స్థాయి ధార్మిక, సాహిత్య జ్ఞానం ఆయన అభ్యసించాడు. తన విద్యా అర్హతల గురించి ఆయన ఒకచోట ఇలా చెప్పుకున్నాడు: “నేను కొంచెం పెరిగి ప్రాజ్ఞ దశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి పర్షియన్ భాష నేర్చుకున్నాను. అరబీ నహ్వ్, సర్ఫ్ వ్యాకరణాలు, మరికొన్ని విద్యలు అభ్యసించాను. వైద్య విద్యలో కూడా నా ప్రవేశం అంతంత మాత్రమే. అసలు మా నాన్నగారు జోతిష్య శాస్త్రంలో మహా నిష్ణాతులు. కనుక ఆ శాస్త్రానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఆయన నాకు చదివించారు. అంతేకాదు, ఆ శాస్త్రంలో పాండిత్యం సంపాదించుకోమని కూడా ఆయన నన్ను ప్రోత్సహిస్తుండేవారు. అయితే ఇన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ హదీసు విద్యలో గాని, ఉసూల్ (ఇస్లామీయ మూల సూత్రాల్లో) గాని, ఫిఖ్హ్  (ధర్మావగాహన) విద్యలో గాని నా జ్ఞానం సున్న. [11]

ఆంగ్ల భాషపై కూడా కొన్ని పుస్తకాలు తన తండ్రి అభ్యసించారని మిర్జా తనయుడు షబ్బీర్ అహ్మద్ ఖాదియానీ చెప్పాడు. “మా నాన్న సియాల్కోట్ లో వున్నప్పుడు ప్రభుత్వ అధికారుల కోసం రాత్రిపూట అక్కడ ఒక బడి ప్రారంభమయింది. నాన్నగారు ఆ పాఠశాలకు చదవటానికి వెళ్తుండేవారు. ఆంగ్లంలో ఒకటి, రెండు పుస్తకాలు ఆయన అక్కడ చదివారు. [12]

మిర్జా విద్యా అర్హతలు ఇంతమటుకే. ఖుర్ఆన్, వ్యాఖ్యానం (తఫ్సీర్), హదీసులు, హదీసు పరిజ్ఞానం (ఉలూముల్ హదీస్), ధర్మావగాహనం (ఫిఖ్ ), ధర్మావగాహన మూల సూత్రాలు (ఉసూలె ఫిఖ్) లాంటి అతి ముఖ్యమైన విద్యలు నేర్చుకోవటానికి ఆయనకు అస్సలు అవకాశం లభించలేదు. బహుశా ఆయన ఈ విద్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉండవచ్చు లేక అవకాశం ఉన్నప్పటికి కూడా పసితనం నుంచే తనకు గల విపరీతమైన రోగాల మూలంగా ఆయనకు వాటిని నేర్చుకునే అవకాశం రాకపోయి ఉండవచ్చు. కుడిచేతి బెణుకు, టి.బి., అతిసార, మూర్ఛ, తలతిరుగుడు, కండరాల బలహీనత, మతిమరుపు, విపరీతమైన బలహీనత – ఏకకాలంలో ఆయనకు ఈ వ్యాధులన్నీ ఉండేవి.[13] (అల్లాహ్ ఈ వ్యాధుల నుంచి అందరిని రక్షించుగాక! ఆమీన్) 

మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఉద్యోగం, యవ్వనంలో ఆయన వ్యాపకాలు 

కొంతకాలం తరువాత మిర్జా గులాం అహ్మద్ సియాల్కోట్ న్యాయ స్థానంలో 15 రూపాయల నెలసరి జీతంపై ఉద్యోగం చేశాడు. 1864 నుంచి 1868 వరకు ఇదే వృత్తిలో కొనసాగాడు. తన ఆంగ్లభాష కొద్దిగా మెరుగుపడగానే న్యాయవిభాగంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత కొన్ని రోజులకు అదే సంవత్సరం 1868లోనే ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ తన తండ్రితోపాటు ఉద్యోగంలో చేరిపోయాడు. [15]

ఇవండీ మిర్జా గులాం అహ్మద్ బాల్యం మరియు ఆయన యవ్వన దశ విశేషాలు! ఇకపోతే ఆయన జీవితమంతా ఆంగ్ల ప్రభుత్వానికి సహకారం అందించటంలో, ఆంగ్లేయులకు వత్తాసు పలకటంలోనే గడిచిపోయింది. దీనిగురించి స్వయంగా ఆయన ఏమంటున్నాడో వినండి: “నా జీవితంలోని అధిక భాగం నేను ఆంగ్లేయ ప్రభుత్వానికి సహకరించటంలో, ఆంగ్లేయులకు వత్తాసు పలకటం లోనే గడిపాను. ఆంగ్లేయులపై జిహాద్ విధికాదనీ, పైగా ఆంగ్లపాలకులకు విధేయత చూపటం విధి అన్న విషయాలపై మేము రచించిన గ్రంథాలను, వ్యాసాలను ఒకచోట పోగుచేస్తే వాటితో యాభై అల్మారాలు నిండుతాయి. ఆ గ్రంథాలను భారీ సంఖ్యలో మేము ఈజిప్ట్, సిరియా లాంటి అరబ్బు దేశాల్లో, కాబుల్, రోమ్ వంటి ఇతర దేశాల్లో వ్యాపింపజేశాము. [16]

వివిధ మతాలు, వర్గాలవారి మధ్య వాదనలు, ప్రతివాదనలు, తర్జన భర్జనలు జరుగుతున్న కాలంలో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని జీవితం మొదలయింది. పాశ్చాత్తవాదులు, క్రైస్తవులు కూడా తమ ధర్మం, తమ దృక్పథాలను జోరుగా ప్రచారం చేస్తున్న కాలం అది. వీళ్లు ఎంతో ప్రభావవంతమైన రీతిలో క్రైస్తవాన్ని వ్యాపింపజేసేవారు. అంతేకాదు, ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తుండేవారు. ఆ పరిస్థితులకు ప్రభావితుడైన మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని కూడా ఆ రంగంలోకి దిగిపోయాడు. దాంతో నలుగురిలో ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సమయంలోనే ఆయన ఇస్లాం ధర్మ ఔన్నత్యాన్ని రుజువు చేస్తూ, క్రైస్తవం, ఇంకా భారతదేశంలోని ఇతర మతధర్మాలను వ్యతిరేకిస్తూ ఒక గ్రంథం రాయటం మొదలుపెట్టాడు. దానికి “బరాహీనె అహ్మదియా” అని నామకరణం చేశాడు. 

‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం 

ఈ గ్రంథ రచన 1879లో మొదలయింది. ఆయన ఆ సంవత్సరమే వివిధ పండితులకు, వ్యాసరచయితలకు తాను అటువంటి ఒక గ్రంథాన్ని రచించ బోతున్నట్లు లేఖోముఖంగా తెలిపాడు. అంతేకాదు, ఈ గ్రంథ రచనలో తమ అమూల్య సలహాలతో తనకు సహకరించాలని, అలాగే తాము రాసిన వ్యాసాలు ఏవైనా ఉంటే వాటిని తనకు అందజేయాలని, అవి తనకు గ్రంథ రచనలో తోడ్పడతాయని కూడా విన్నవించుకున్నాడు. ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినవారిలో సయ్యిద్ చిరాగ్ అలీ అగ్రగణ్యుడు. ఆ గ్రంథం నాలుగు భాగాలుగా విభజించబడింది. గ్రంథంలోని 562వ పేజీలో రచయిత తరఫున ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఒక ప్రకటన ప్రచురించబడింది. మిర్జా మొదటిసారిగా ఇటువంటి ప్రకటన చేశాడు. ఇస్లాం ధర్మం సత్యవంతమైనదని నిరూపించటానికి తాను అల్లాహ్ తరఫున నియమితుడైనవాడినని, ఈ విషయంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నా తాను వాటిని తీర్చి, వారి అనుమానాలను నివృత్తి చేసి, నోళ్ళు మూయించగలడు అన్నది ఆ ప్రకటన సారాంశం. అతని మాటల్లో చెప్పుకోవాలంటే: “ఇస్రాయీల్ సంతతి ప్రవక్త అయిన యేసు మాదిరిగా అత్యంత అణకువ, విధేయత, దీన బలహీన స్థితిలో ప్రజా జీవితాలను చక్కదిద్దే విషయమై ఆలోచించమని అల్లాహ్ నాపై బాధ్యతను మోపాడు. ఆ లక్ష్యంతోనే నేను “బరాహీనె అహ్మదియా” రచనకు పూనుకున్నాను. అభ్యంతరాలు లేవనెత్తేవారి నోరు మూయించే 37 జవాబులు ఈగ్రంథంలో నేను సేకరించాను. ఈ గ్రంథం యొక్క ఒక ప్రతిని నేను మీకు పంపిస్తూ మీకు తెలియజేయునది ఏమనగా – ఈ గ్రంథంలో వున్న సత్యాలను గురించి తెలుసుకున్న తరువాత కూడా ఎవరైనా వీటిని తిరస్కరిస్తే అది వారిపాలిట నష్టదాయ కంగా పరిణమిస్తుందని అల్లాహ్ నుంచి నాకు దివ్యసంకేతం (ఇల్హామ్) అందింది. [18]

ఆ గ్రంథంలోనే మిర్జా తరఫున ఇంకో విషయం కూడా చెప్పబడింది, “ఎవరైనా ఖాదియాన్ పట్టణం వచ్చి నిరంతరాయంగా అక్కడ ఒక సంవత్సరం పాటు నివాసం వుంటే అతనికి ఆకాశంలో చిత్ర విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి. ఎవరికైనా అలా కనిపించకపోతే నేను వారికి రెండువందల రూపాయలు బహుమానంగా ఇస్తాను. [19]

దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం. 

అప్పటివరకు అనామక జీవితం గడుపుతున్న తనకు ఒక్కసారిగా కీర్తి ప్రతిష్టల అందలం లభించటంతో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని మిడిసి పడటం మొదలెట్టాడు. తనకు లభిస్తున్న ప్రజాదరణను వాడుకోవటానికి ప్రయ త్నించాడు. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా తన గురించి అబద్ధపు ప్రకటనలు చేయటం ప్రారంభించాడు. 

మౌలానా మౌదూది (రహ్మలై) దశల వారీగా అతను చేసిన ప్రకటనలను చారిత్రక క్రమంలో అమర్చి వాటి గురించి విశ్లేషణ జరిపారు. దాని సారాంశం ఈ క్రింద పేర్కొనబడుతోంది. 

1. 1880 – 1888 మధ్యకాలంలో మిర్జా గులాం అహ్మద్ బాగా ఉత్తేజంతో పనిచేస్తున్న ఒక ధర్మప్రచారకుని (దాయీ)గా, ఇస్లాం తరఫున వాదించేవాని (మునాజిర్)గా ప్రఖ్యాతిగాంచాడు. ఈ కాలంలో ఆయన ఇస్లాంపై జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటిస్తున్నవానిగా కనిపించాడు. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా వున్నాయి. నిజానికి అతను నాటి సామ్రాజ్యశక్తులు, పాశ్చాత్తవాదులు రూపొందించిన ఒక ముందస్తు వ్యూహాన్ని భవిష్యత్తులో అమలుపరచే మార్గాన్ని తన అబద్ధపు ప్రకటనల ద్వారా సుగమం చేస్తున్నాడు. అయితే ఈ దశలోని అతని చెడు తలంపులను ముస్లింలు పసిగట్టలేకపోయారని దీనర్థం ఎంతమాత్రం కాదు. ముస్లిం సమాజంలోని పండితులు అతని కదలికలన్నిటిని గమనిస్తూ, అతని ఇస్లాం విరుద్ధ ప్రకటనల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. ఆ కాలంలో మిర్జా తాను ముస్లిం సమాజంలోని వలీలందరిలోకెల్లా ఉత్తమమైనవాణ్ణి అని చెప్పుకుంటూ ఉండేవాడు. [20] 

2. 1889 – 1890 మధ్యకాలం. ఈ దశలో ఆయన తనను ఈ యుగంలో ముస్లిం సమాజ పునరుద్ధరణకై పుట్టిన మహావ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. అల్లాహ్ తరఫున నియమించబడిన వానిని (మామూర్ మినల్లాహ్) అని కూడా చెప్పుకున్నాడు. తనను అనుసరించమని ప్రజలను ఆదేశించేవాడు. తాను యేసు ప్రవక్త అంతటివాణ్ణని కూడా అనేవాడు. 

3. 1891లో మిర్జా గులాం అహ్మద్, “ఇస్రాయీల్ సంతతికి చెందిన ప్రవక్త యేసు మరణించారు. ఆయన ప్రళయానికి పూర్వం తిరిగి వస్తారని చెప్ప బడింది. ఆ మళ్ళీ రాబోయే యేసుని (మసీహె మౌవూద్ ని) నేనే. అంతేకాదు, ముస్లిం సమాజం ఎదురుచూస్తున్న మహ్దీని కూడా నేనే. ప్రళయానికి పూర్వం యేసు మళ్ళీ వస్తారు అని అల్లాహ్ చెప్పివున్న సంగతి నాకు ఇంతకు ముందు తెలియదు. తెలిసివుంటే ఈ ప్రకటన నేను ఎప్పుడో చేసివుండేవాణ్ణి.” అయితే “బరాహీనె అహ్మదియా”లో ఆయన స్వయంగా “యేసు చనిపోలేదు. ఆకాశానికి ఎత్తుకోబడ్డారు”[21] అని ప్రస్తావించి ఉన్నాడు. అంటే తన రెండో ప్రకటనతో ఆయన “బరాహీనె అహ్మదియా”లో ప్రస్తావించిన మాటను రద్దుపరచుకున్నాడన్న మాట. 

4. 1900 సంవత్సరం అబ్దుల్ కరీమ్ అనే ఆయన అనుయాయి ఒకతను జుమా ప్రసంగం ఇస్తూ, “మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని దైవప్రవక్త, దైవసందేశహరులు. దైవప్రవక్త ముహమ్మద్ ﷺను విశ్వసించటం ఆ కాలంలో సహచరులకు (సహాబాకు తప్పనిసరి (వాజిబ్) అయినట్లు నేడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానిని విశ్వసించటం కూడా తప్పనిసరి” అని ప్రకటించాడు. తన అనుయాయి ప్రకటనను మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని నిజమని ధృవీకరించాడు. అయితే ఈ దశలో ఆయన పరిపూర్ణ దైవదౌత్యం (నబువ్వత్) గురించి ఏమీ ప్రకటించలేదు. కేవలం దైవదౌత్యం (నబువ్వత్)లో స్వల్ప భాగస్వామినని, అయితే ఆ స్వల్ప భాగస్వామ్యం కూడా యేసు (ఈసా) ప్రవక్త దైవదౌత్యం కంటే ఉన్నతమైనదని చెప్పు కొచ్చాడు. 

5. 1901లో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని స్వయంగా, తాను దైవప్రవక్త నని, దైవసందేశహరుణ్ణి అని ఎంతో నిస్సిగ్గుగా ప్రకటించుకున్నాడు. జలాలుద్దీన్ షమ్స్ అనబడే మిర్జా అనుచరుడు ఒకాయన ఈ ప్రకటనను గురించి వివరిస్తూ ఇలా చెప్పాడు; “1901 కు ముందు రాసిన గ్రంథాల్లో మహాత్ములు సయ్యిద్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని తాను దైవ ప్రవక్తను కాను అని ప్రకటించారు. తాను దైవప్రవక్తను కానని, తాను దివ్యసంకేతాలు అందేవ్యక్తి (ముల్ హిమ్)నని మునుపటి గ్రంథాల్లో రాశారు. అయితే ప్రస్తుతం ఆయనకు పరిపూర్ణ దైవదౌత్యం లభించింది. అసలు విషయం ఏమిటంటే, ఇంతకుమునుపు ఆయన దైవదౌత్యం అసంపూర్ణంగా ఉండేది. అందుకని దానిగురించి ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. అయితే 1901 తర్వాత ఆయన దైవదౌత్యం పరిపూర్ణం అయింది. కనుక ఆయన ఇప్పుడు తన పరిపూర్ణ దైవదౌత్యాన్ని ప్రకటిస్తున్నారు. [22]

6. అంతకుమునుపు చేసిన ప్రకటనలతోపాటు 1904లో మిర్జా ఖాదియాని మరో కొత్త ప్రకటన చేశాడు, “నేను కృష్ణుణ్ణి” అని. [23]

అదే సంవత్సరం గులాం అహ్మద్ ఖాదియాని “ఇహ్తిరామె ఖుదుస్” పేరుతో ఒక కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేశాడు. ఆ కాన్ఫెరెన్స్ లో ఆయన నిస్సంకోచంగా పై విషయాన్ని గురించి వివరిస్తూ ఇలా అన్నాడు: “ఒకసారి కాదు, నిరంతరాయంగా నాపై వహీ (అల్లాహ్ సందేశం) అవతరిస్తూ ఉంది, నేను హిందువుల కోసం కృష్ణుణ్ణి అని, ముస్లింలు, క్రైస్తవుల కోసం మళ్ళీ వస్తారని చెప్పబడిన యేసు (మసీహె మౌవూద్) ని అని. [24]

అబద్ధాలకోరు, దైవదౌత్య అసత్య ప్రకటనకర్త మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని పై ప్రకటనతోపాటు ఇంకోమాట కూడా అన్నాడు, తాను ఈ కాలంలో ముస్లింల కొరకు ముహమ్మద్ ﷺ యొక్క మరో అవతారమని, నా రూపంలో ముహమ్మద్ ﷺ మళ్ళీ ఈ లోకంలో అవతరించారని అన్నాడు. ఆధారం క్రింద ఖుర్ఆన్అని సూరె జుముఆలో “ఆఖిరీన మిన్ హుమ్  లమ్మా యల్ హఖూ బిహిమ్” అన్న ఆయతు చూపెట్టాడు. ఈ కారణం చేతనే నేడు ఏ ఖాదియాని అయినా “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అని నోటితో అంటే, అతను మనసులో “ఈ కలిమాలో ముహమ్మద్ అంటే గులాం అహ్మద్ ఖాదియాని” అని గట్టిగా నమ్ముతాడు. 

మిర్జా రచనలు 

మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఎన్నో రచనలు చేసినట్లు చెబుతారు. వాటిలో కొన్ని ఇవి: 

1. అర్బయీన్  2. ఆర్యధర్మ్  3. గజాలతుల్ అవ్ హాం  4. ఇస్తిఫ్తా  5. ఏజాజ్ అహ్మదీ  6. ఏజాజుల్ మసీహ్  7. అంజామె ఆథమ్  8. అన్వారే ఇస్లామ్ 9. బరాహీనె అహ్మదియా 10. అత్ తబ్లీగ్ 11. తజల్లియాతె ఇలాహియా 12. తజ్కిరయె వహీయె ముఖద్దస్ 13. మజ్మూఅ ముకాషఫాతే గులాం ఖాదియాని 14. హుజ్జతుల్లాహి హఖీ ఖతుల్ మహ్దీ 15. కషఫుల్ గితా నజ్ముల్ హుదా 16. నిషానుస్సమా 17. నుస్రతుల్ హఖ్ 18. నుజూలుల్ మసీహ్ 19. నసీముద్దావా

ఇవేగాకుండా మరెన్నో పుస్తకాలు ఈ దైవదౌత్య అసత్య ప్రకటనకర్త రచించినట్టుగా చెబుతారు. 

హేయమైన మరణం 

దైవదౌత్య ప్రకటనకర్త మిర్జా గులామ్ ఖాదియానీ చేసే ప్రకటనలకు వ్యతిరేకంగా ప్రముఖ అహ్లెహదీస్ పండితులు మౌలానా సనావుల్లా అమృత్ సరి (రహిమహుల్లాహ్) ఎప్పుడూ సవాలుగానే మారారు. ఆయన మీర్జాతో పాటు అనేక సంవాదాలు చేశారు. ప్రతి సంవాదంలోనూ మిర్జా ఓడిపోయి పరాభవం పాలయ్యే వాడు. ఎట్టకేలకు షేఖ్ సనావుల్లా అమృత్ సరి(రహిమహుల్లాహ్) గారితో ఆందోళన చెంది 1907లో మిర్జా స్వయంగా ఆయన్ను ముబాహలా కోసం ఆహ్వానించాడు. ఇద్దరిలో ఎవరైతే అబద్దమాడుతారో వారు నిజం చెప్పినవాడు బతికుండగానే మరణిస్తాడని ఛాలెంజ్ చేశాడు. అతనే స్వయంగా అల్లాహ్ ను “ఓఅల్లాహ్ ! సత్యం చెప్పిన వాడు బతికుండగానే అబద్ధం చెప్పిన వాడికి ప్రాణాంతక వ్యాధి సోకేలా చేయి’ అని వేడుకున్నాడు. ఉదాహరణకు ప్లేగు లేదా గత్తర లాంటి రోగాలు. [25]

చివరకు 1908 మేలో మిర్జా ఖాదియానీ గత్తర వ్యాధి సోకి లా హెూర్లోని ఒక మరుగుదొడ్లో మరణించి తాను దైవదౌత్యపు అబద్ధపు ప్రకటనలు చేశానని నిరూపించుకున్నాడు. అతని మృతదేహాన్ని ‘ఖాదియాన్’కు తీసుకువచ్చారు. అతను రూపొందించుకున్న స్మశాన వాటిక ‘బహష్ తి  మఖ్బిరా’ లో అతన్ని ఖననం చేశారు. [26]

మిర్జా ఖాదియానీ హేయమైన మరణం తరువాత కూడా మౌలానా సనావుల్లా అమృత్సరి నలభై ఏళ్ల వరకు జీవించారు. 1945 మే 15వ తేదీన తన 80వ ఏట మరణించారు. సత్యమేదో అసత్యమేదో స్పష్టపరిచిన ఈ ముబాహలా తరువాత ప్రజలు మౌలానా సనావుల్లా అమృత్సరిని ‘ఖాదియానీల విజేత’ అనే బిరుదుతో సత్కరించారు. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యం ప్రసాదించుగాక! (ఆమీన్) 

ఖాదియానీల ఉనికికి వాస్తవ కారణాలు: 

(1) మిర్జా ఖాదియాని మరియు అతని కుటుంబం ఎప్పుడూ సామ్రాజ్య వాద శక్తుల కోసమే త్యాగాలు చేస్తూ వచ్చిందని గత పేజీల్లో మేము మిర్జా ఖాదియానీ మరియు అతని అనుచరులు మిర్జా చేసిన వ్యాఖ్యల ద్వారా తెలియజెప్పాము. “ఖాదియానియ్యత్” సామ్రాజ్యవాద శక్తుల సృష్టి అని చెప్ప టానికి మిర్జా గులాం అహ్మద్ చేసిన ఆ వ్యాఖ్యలు చాలు. ఈ విషవృక్షాన్ని పెంచి పెద్దచేసినవారు ఆంగ్లేయులు. స్వయంగా ఆయనే ఈ విధంగా వ్యాఖ్యా నించాడు: “నేను ప్రచారం చేస్తున్న ధర్మం రెండు ప్రాధమిక సూత్రాలపై ఆధారపడి ఉంది. అంటే నేను ఏ ధర్మాన్నైతే విశ్వసిస్తున్నానో, ప్రజలను ఏ ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నానో ఆ ఇస్లాం ధర్మం రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం, మేము అల్లాహు విధేయులై ఉండాలి. రెండు, మనం బ్రిటీషు ప్రభుత్వానికి సేవలు చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వమే దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడుతుంది. మనల్ని తన రక్షణలోకి తీసుకుని దౌర్జన్యపరుల నుంచి రక్షిస్తుంది. [28]

1931లో బ్రిటన్ చక్రవర్తి ఐదో జార్జి భారతదేశాన్ని పర్యటించినప్పుడు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ కుమారుడు మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ స్వాగత సభను ఏర్పాటు చేశాడు. అందులో అతను ఇలా అన్నాడు: ఈ మతం ” ఖాదియానియ్యత్ పునాది ప్రస్తుత ప్రభుత్వ విధేయతపై, అన్ని రకాల కల్లోలాలకు (అంటే దేశాన్ని దాస్యాన్నుండి విముక్తి కల్పించడం కోసం జరిగే పోరాటాలకు) దూరంగా ఉండడంలోనే ఆధారపడి ఉంది. ఈ మతంలో సభ్యత్వం పొందడం కోసం ఈ మత స్థాపకుడు ఒక నిబంధన కూడా పెట్టాడు. అదేమిటంటే, వారు ప్రస్తుత ప్రభుత్వానికి బ్రిటీషు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి. అందుకనే ఈ మతావలంబీకులు ఎల్లప్పుడూ కల్లోలాలకు దూరంగా ఉండింది. ఈ విధంగా కూడా ఈ మతం ఇతరులకు ఆదర్శం. [29]

(2) పైన పేర్కొన్న వివరణల తరువాత సామ్రాజ్యవాద శక్తులతో ఖాదియానియ్యత్ వారికి సంబంధాలు ఉన్నాయనడానికి మరిన్ని రుజువులు అవసరం లేదు. దీన్ని అర్ధం చేసుకోడానికి పైన పేర్కొన్న సాక్ష్యాలు చాలు. ఈ నిషిద్ధవృక్షాన్ని పెంచడానికి పురికొల్పిన కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతయినా ఉంది. జిహాద్ ను వీడడం, సున్నత్ ను  తిరస్కరించడం ఈ రెండూ ఎలాంటి ప్రాధమిక విషయాలంటే దీని ద్వారా సామ్రాజ్యశక్తులకు ఎంతో బలం చేకూరిందనే వాస్తవాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం. కనుక ఎవరయితే ఈ రెండు విషయాల్లో క్రియాశీల పాత్రపోషించారో వారిని సామ్రాజ్యశక్తులు ఘనంగా ఆహ్వానించాయి, స్వాగతించాయి. వ్యవహారం ఇలాంటిది కనుక ఖాదియానియ్యత్ అధిక ప్రయోజనం పొందడానికి ఈ రెండు విషయాలే తమ ఏర్పాటు అసలు లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. ఒక వైపు జిహాద్ చేయకూడదని నిరంతరం ఫత్వాలు జారీ చేశారు. మరో వైపు ఇస్లామ్ సాంప్రదాయాలను తిరస్కరించసాగారు. కనుక ఈ వర్గం ఇతర మతాలకంటే కూడా సామ్రాజ్యవాద శక్తులకు, పాశ్చాత్తవాదులకు ప్రియం కాసాగింది. 

జిహాద్ కు అంటే దౌర్జన్యాన్ని వ్యతిరేకించే శక్తికి సామ్రాజ్యవాదులు ఎప్పుడూ భయపడేవారు. ముస్లిములలో జిహాద్ చేయాలనే తపన, అమరగతులవ్వాలనే ఆరాటం ఎక్కడ జాగృత మవుతుందోనని పాశ్చాత్తవాదులు ఆందోళన చెందేవారు. కాబట్టి మిర్జా ఖాదియానీ జిహాద్ చేయకూడదని తన కాలంలో చాలా స్పష్టంగా ఫత్వా జారీచేశాడు. ఈ అంశంపై ఎన్నో రచనలు కూడా చేశాడు. ఆయన రాసిన ఒక వాక్యం ఇలా ఉంది: మసీహ్ మౌఊద్ కాలంలో జిహాద్ పూర్తిగా రద్దు చేయబడింది”. [30]

ప్రవక్త ﷺ సాంప్రదాయాలు (సున్నత్లు) పూర్తి సాక్ష్యాలు, ఆధారాలతో ముస్లిమ్ల వద్ద మిగిలి ఉండడాన్ని పాశ్చాత్తులు చూడలేకపోయేవారు. ముస్లిములు ప్రవక్త ﷺ సాంప్రదాయాల ఆధారంగా తమ అసలైన ధర్మం వైపు మళ్లిపోతారేమోనని వారు ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవారు. ఒక వేళ ఇలా జరిగితే ప్రపంచంలో వారు బలం పుంజుకోవడం ఖాయం అని భావించేవారు. కనుక పాశ్చాత్తవాదుల లక్ష్యాలు పూర్తిచేయడం కోసం మిర్జా ఖాదియానీ స్వయంగా తనను అనుసరించమని ప్రజలను ఆహ్వానిస్తూ, కొత్త ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలని తాకీదు చేస్తూ బహిరంగంగానే ప్రవక్త ﷺ సాంప్రదాయాలను తిరస్కరించేవాడు. ఇలా అనేవాడు: “నేను నిరంతరం చెబుతూనే ఉన్నాను, నేను పఠిస్తుంది ఖురాన్ మరియు తౌరాత్ మాదిరిగా దేవుని వాక్యాలే. నేను జిల్లీ [31], బురూజీ [32] మరియు ప్రవక్తను. ధార్మిక విషయాల్లో నాకు విధేయత చూపడం ముస్లిములపై ఎంత విధో అదే విధంగా నేను ఈసాను అనే విషయాన్ని కూడా ముస్లిములు అంతే విధిగా విశ్వసించాలి. నా సందేశం అందినప్పటికీ దాన్ని అంగీకరించడానికి తిరస్కరించిన వారు, నేను ఈసాను అని విశ్వసించని వారు, నాపై అవతరించే వహీ అల్లాహ్ తరఫు నుండి వస్తుందని విశ్వసించని వారు ప్రళయం నాడు ప్రశ్నించబడతారు. వారు ముస్లిం గా చనిపోయినా సరే. ఎందుకంటే వారు విశ్వసించడం తప్పనిసరి అయిన స్పష్టమైన విషయాన్ని తిరస్కరించారు. ఒకవేళ నేను అబద్ధం చెబితే నేను చనిపోవాలి! అంతే కాదు నేను మూసా (అలైహిస్సలాం), దావూద్ (అలైహిస్సలాం), మరియు ముహమ్మద్ ﷺ మాదిరిగా నిజమైన ప్రవక్తను. అల్లాహ్ నన్ను ధ్రువపరచడానికి పదివేల కంటే ఎక్కువగా ఆకాశ మహిమలను అవతరింపజేశాడు. స్వయంగా ఖుర్ఆన్ నేను ప్రవక్తనని సాక్ష్య మిచ్చింది. ప్రవక్తలు నేను రాబోయే కాలాన్ని కూడా నిర్ధారించారు. వారు నిర్ధారిం చిన కాలం ఇదే. ఖుర్ఆన్ కూడా ఈ కాలాన్నే ధ్రువపరుస్తుంది. భూమ్యాకాశాలు మరియు ప్రవక్తలందరూ దీనికి సాక్ష్యంగా ఉన్నారు. [33]

ఇలాంటి అబద్దపు ప్రకటనలు చేయడం నిశ్చయంగా ఖుర్ఆన్, హదీసులు మరియు ఆకాశ గ్రంథాలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడమే అవుతుంది. అయినప్పటికీ ఈ ప్రకటన కర్త అప్పుడప్పుడు ఖుర్ఆన్ దైవగ్రంధం అని, దానికి విధేయులవడం తప్పనిసరి అని అంగీకరిస్తాడు కూడా. కాని అతను ప్రవక్త ﷺ సాంప్రదాయాల గురించి తన పుస్తకాలలో ఎక్కడ కూడా తాను ప్రవక్త ﷺ సాంప్రదాయాలను అనుసరిస్తున్నానని కాని, సహాబాల బాటలో నడుస్తు న్నానని గాని సూచనా ప్రాయంగా కూడా రాయలేదు. 

షేఖ్ అబ్దుల్లా సామర్రాయి ఇలా పేర్కొన్నారు: ‘సామ్రాజ్యవాద శక్తులు ఇస్లాం వ్యతిరేక శక్తులను వినియోగం కోసం విశ్లేషించాయి. సంస్కృతి, సాంప్రదాయాలను మరియు ఇస్లాం రూపురేఖలను మార్చడానికి ధనసంపదలు, పరిపాలన, అధికారం ఆశ చూపించారు. బలవంతంగా కూడా తమ లక్ష్యాలను చేరుకోవాలనుకున్నారు. కాని ఫలితంగా వారికి ద్వేషం, వైరం మరియు తిరుగు బాటు తప్ప ఏమీ దొరకలేదు. కనుక ఇస్లాంను ఎదుర్కోడానికి వేరే విధానాన్ని అవలంబించడానికి పూనుకున్నారు. స్వయంగా ముస్లిముల ధార్మిక విషయాల్లో ఎలాంటి విషయాలను చేర్చారంటే అవి చూడ్డానికి ఇస్లాం పరమైనవే అయి వుంటాయి. ఇస్లాం మౌలిక విషయాలలోనివే అయిఉంటాయి. ఇస్లాం చిహ్నాలను గౌరవిస్తున్నట్లుగానే కనిపిస్తాయి. అంతేకాదు బాహ్యంగా ప్రతి ఒక్కరికీ ఇస్లాం మౌలికాంశాలపై నడుచుకోవాలని ఒత్తిడి చేస్తాయి. కాని అంతర్గతంగా విధ్వంసానికి దారితీస్తాయి. ఒక సమయం రాగానే ఇస్లాం మౌలికాంశాలన్నిటినీ తనతో కలుపుకుని మునిగిపోవడానికి ప్రయత్నిస్తాయి. కాని ఇస్లాం మౌలికాంశాలు పరస్పరం పటిష్టంగా, సక్రమంగా ఉన్నాయి. కనుక వాటిని ధ్వంసం చేయడం అంత తేలిక కాదు. అందుకనే దైవదౌత్య ప్రకటనతో దైవదౌత్య సమాప్తమనే పటిష్ట ఇస్లామీయ విశ్వాసంపై దెబ్బకొట్టే మైలురాయిగా పనికొస్తుంది. ఇలా విశ్వాసంలో కల్లోలం సృష్టించడానికి మార్గం సుగమం చేస్తే మొత్తం ఇస్లామ్ భవనాన్నే కూల్చడం సులభతరం అవుతుంది. ఆ తరువాత ఇతర ఇస్లామ్ మౌలిక విషయాలను కూడా తుడిచివేయడంలోనూ విజయం సాధించవచ్చు. [34]

అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక 

“The arrival of British Empire in India” అనే బ్రిటీషు ప్రభుత్వంలోని ఒక దస్తావేజు ద్వారా ఈ వాస్తవం వెల్లడయింది. భారతీయ ముస్లిములను తమ బానిసలు చేసుకోడానికి, వారిని బలవంతంగా తమ ప్రభుత్వానికి విధేయు లను చేసుకోడానికి ఇక్కడి పరిస్థితులను, స్థితిగతులను, వనరులు సమీక్షించి రమ్మని క్రీ.శ.1869లో బ్రిటన్ ప్రభుత్వం పాశ్చాత్తవాదులు మరియు పాస్టర్లతో కూడిన నేతల ఒక బృందాన్ని భారతదేశానికి పంపిందని తెలుస్తుంది. కనుక ఈ బృందం క్రీ.శ.1870లో ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సమాచారం తీసుకుని తిరిగి వెళ్లిపోయింది. ప్రభుత్వానికి నివేదికను సమర్పించడంలో సఫలం అయింది. దాని సారాంశం ఇది: ముస్లిములలో అధికమంది తమ ఉలమాలను గుడ్డిగా నమ్ముతున్నారు. వారిలో తనను ప్రవక్తగా ప్రకటించుకునే ఒక వ్యక్తిని వెతికి పట్టుకుంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం తప్పకుండా అతనికి తోడవుతుంది. అలాంటి వ్యక్తిని వెతకడం కష్టమే అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారమయితే ప్రభుత్వం చాలా సులువుగా తమ పర్యవేక్షణలో అతని దైవదౌత్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం మొత్తం భారతదేశం మన ఆధీనంలోనే ఉంది. ఈ ప్రణాళికను కార్యరూపం దాల్చేలా చేయాల్సిన అవసరం మనకు ఎంతయినా ఉంది. తద్వారా భారతదేశంలోని వివిధ తెగలు మరియు స్వాతంత్య్ర యోధులైన ముస్లిముల మధ్యలో అంతర్గత విభేదాలు సృష్టించి పోట్లాడుకునేలా చేయవచ్చు. [35]

కనుక బ్రిటన్ ప్రభుత్వం తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఒక సరైన వ్యక్తిని ఈ పని కోసం ఎంచుకొని, అతనికి శిక్షణ ఇచ్చి సమర్ధుడిని చేయడం కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి వారి దృష్టి మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ మీద పడింది. ఈ పనికి అతనే అర్హుడని ఈ క్రింది విషయాల ద్వారా నిర్ధారించారు: 

1- ఒంటరిగా ఈ పనిని చేసే సామర్ధ్యం అతనిలో ఉండాలి. ఆంగ్లేయుల సేవ చేస్తాడని గుర్తింపు పొంది ఉండాలి. చారిత్రాత్మకంగా, ఆచరణాత్మకంగా బ్రిటన్ ప్రభుత్వం ఆధిపత్యాన్ని అంగీకరించేవాడయి ఉండాలి. వారి సేవలను కూడా గుర్తించేవాడయి ఉండాలి.

2- ముస్లిమ్ అయి ఉండాలి. అతను ఇస్లాంపై దాడుల్ని ఎదుర్కొనే వీరుడుగా ప్రచారం పొంది ఉండాలి. భావజాల యుద్ధంలో ఇస్లామ్ శత్రువులతో తలపడేవాడై ఉండాలి. అతను వ్యాసాలు రాయడంలో, ప్రసంగాలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. సందర్భం, సమయాన్ని బట్టి తన వైఖరిని మార్చుకోవడంలో ప్రావీణ్యుడై ఉండాలి. 

3- సాహిత్యరంగానికి చెందిన వ్యక్తయి ఉండాలి. నేరుగా అనుభవరంగంలో దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఊసరవెల్లిలా రంగులు మార్చే నైపుణ్యం ఉండాలి. అప్పుడప్పుడు ముజద్దిద్  (సమాజ పునరుద్ధారకుడి)లా, మేధావిలా, సూఫీలా నటించాలి. చివరిగా (అబద్దపు) దైవదౌత్య స్థానాన్ని పొందడంలో సఫలం కావాలి. 

4- ఆంగ్లేయుల సామ్రాజ్య శక్తుల విషయంలో పారదర్శకంగా మరియు ఆప్తమిత్రుడిలా ఉండాలి. అతనిలో ఇస్లామ్ కు పోటీగా ఒక కొత్త కట్టడం నిర్మించేలా సమర్దుడై ఉండాలి. తన కార్యం పూర్తయ్యే వరకు నిజా యితీగా ఉండాలి. 

5-అతనిలో ధార్మికపరంగా నేతృత్వ సామర్ధ్యం ఉండాలి. ఇస్లాం విశ్వాసపు పునాదులపై ఏర్పడిన వర్గానికి నాయకత్వం వహించే అనుభవం ఉండాలి. యాధృచ్చికమో లేదా దురదృష్టమో కానీ ఈ లక్షణాలన్నీ మిర్జా అహ్మద్ ఖాదియానీలో ఉన్నాయి. వాటిలో కొన్ని లేకపోయినా ఆంగ్లేయులు ఆ లోటును పూడ్చడానికి అతనిలో సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. మిర్జా ఖాదియాని తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకోవడం కోసం అవసరమయిన వనరులన్నిటినీ ఒకచోట చేర్చారు. [36]

పాశ్చాత్తవాదులు మరియు గులామ్ అహ్మద్ ఖాదియానీ దైవదౌత్యం: 

పాశ్చాత్తవాదుల విషయానికి వస్తే వారికి మిర్జాఖాదియానీకి మధ్య సంబంధాలున్నాయన్న విషయం ఈ క్రింది వివరాలతో అవగతం అవుతుంది. 

మొదటి ఆధారం ఏమిటంటే మేము పైన ప్రస్తావించిన సామ్రాజ్యవాద శక్తుల ప్రణాళికను విజ్ఞులు, కుతంత్రులయిన పాశ్చాత్తవాదులు రూపొందించారు. దాన్ని వారు ముస్లిముల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే రూపొందించారని ముందుమాటలో పేర్కొనడం జరిగింది. 

రెండో స్పష్టమైన ఆధారం ఏమిటంటే, దైవదౌత్య ప్రకటన హఠాత్తుగా సంభవించిన పరిణామం కాదు. పాశ్చాత్తవాదుల ప్రణాళిక ప్రకారం మెల్లమెల్లగా ఒక నిర్ణీత కాలంలో జరిగింది. ఒకవేళ మనం గత అధ్యాయాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా పాశ్చాత్తవాదుల విధానాలు (మిన్ హాజియాత్ ) సర్  సయ్యద్ అహ్మద్ ఖాన్, చిరాగ్ అలీ, అమీర్ అలీ మరియు అల్లామ ఇక్బాల్ లాంటి కొందరు ప్రఖ్యాత వ్యక్తులను సృష్టించాయి. వారు ప్రవక్త ప్రకటన మార్గాన్ని సుగమం చేయడానికి పరోక్షంగా కృషి చేశారు. 

కనుక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దైవదౌత్యాన్ని ఈ విధంగా పరిచయం చేశారు: దైవదౌత్యం దైవ కానుక కాదు అల్లాహ్ ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి. ఇది సహజ నైపుణ్యం. ఇందులో ఇవరికీ ఎలాంటి ప్రాధాన్యతే లేదు. మానవునిలో ఉండే వేల సామర్ధ్యాలు, మానవునిపై అవతరించే వరాలకు ప్రత్యేకత ఉండదు. మానవుడు సహజంగా ఏదైనా ఒక కళలో నిష్ణాతుడై ఉంటాడు. ఆ కళా నైపు ణ్యమే అతనికి ఉపాధిని తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు కమ్మరిని తీసుకుంటే అతన్ని అతని కళలో మేటిగా, ప్రవక్తగా అర్హుడు”. [37]

అదేవిధంగా అల్లామ ఇఖ్బాల్ (రహ్మలై) దైవదౌత్యాన్ని ఈ విధంగా నిర్వచించారు: “దైవదౌత్యం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, సర్వసంగ పరిత్యాగులకు కలిగే ప్రత్యేక మగత స్థితి. సూఫీలు మరియు ప్రవక్తల మధ్య తేడా ఏమిటంటే, సూఫీల చివరి గమ్యం అల్లాహ్ వరకు చేరుకోవడం. కాని ప్రవక్తల్లో గొప్ప నైపుణ్యత ఉంటుందంటే వాళ్లు దాంతో ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి తెరతీసి మానవజీవిత దశను పూర్తిగా సత్యత వైపునకు మరలుస్తారు. [38]

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ విధంగా పేర్కొన్నారు. దైవదౌత్యం ఒక సహజ వస్తువు. అది దైవప్రసాదం కాదు. దీని ఆధారంగానే ఆయన ‘Adison మరియు ‘Seattle’ లాంటి ఆంగ్లేయులను ప్రవక్తలుగా పరిగణించారు. [39]

అల్లామ ఇఖ్బాల్ నిర్వచనం ప్రకారం వెల్లడవుతున్న విషయం ఏమిటంటే, దైవదౌత్యం సంపాదించే వస్తువు. మనిషి కృషితో దీన్ని సాధించగలడు. అల్లామ ఇఖ్బాల్ రాసిన ఒక కవిత తాత్పర్యం “ఇమామ్ గజాలీలో దైవదౌత్యపు ఠీవి కనబడుతుంది” ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది. అదే విధంగా పద్దెని మిదో శతాబ్దంలో గ్రీకు జాతీయుడైన ‘Cont’ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారు. [40] 

ఏదేమైనప్పటికీ దైవదౌత్యం సహజంగా ప్రాప్తమయిందని నిరూపించాలనుకున్నా లేదా కృషి ద్వారా ప్రాప్తమయిందనుకున్నా ఈ రెండు దృక్పధాలు దైవదౌత్యం దైవ ప్రసాదితం అనే విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. ప్రతి ప్రవక్తకు దైవదౌత్యం కొరకు ద్వారాలు తెరువబడతాయి. ఈ పదునైన ఆయుధాన్నే మిర్జా ఖాదియానీ జీవితాంతం ఇస్లాం నిర్మాణంపై వినియోగించాడు. దాన్ని కూల్చడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. 

దైవదౌత్య సమాప్తం గురించి అల్లామ ఇఖ్బాల్ ఇలా వ్యాఖ్యానించారు: నిశ్చయంగా ఇస్లామ్ రాకతో మానవ మేధస్సు ఉత్థాన స్థాయికి చేరిందని ప్రస్ఫుట మయింది. ఇస్లామ్ లో దైవదౌత్యం ప్రామాణికత చివరి స్థాయికి చేరుకుంది. అందుకనే దాని ద్వారాలు మూతపడిపోయాయి. [41]

అల్లామ ఇఖ్బాల్ “దైవదౌత్య సమాప్తాన్ని మానవ మేధ సంపూర్ణతకు కారణంగా పేర్కొన్నారు. దీని భావం ఏమిటంటే, ఒకవేళ మానవ మేధ పతనా వస్థకు చేరితే దైవదౌత్యం మళ్లీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఇవన్నీ పాశ్చాత్తవాదులు సృష్టించిన వినూత్న దృక్పధాల ఫలితం. మిర్జా ఖాదియానీ తనను దైవప్రవక్తగా పేర్కొనడానికి ఇవన్నీ బలమైన కారణాలుగా, మైలురాయిగా నిలిచాయి. 

హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం 

మూడో ఆధారం ఏమిటంటే, మిర్జా ఖాదియానీ అనేక రోగాల బారిన పడ్డాడు. యవ్వనంలోనే ఆయనకు హిస్టీరియా వ్యాధి సోకింది. ఈ వ్యాధి పాశ్చాత్త వాదుల ఆలోచనలకు అనుగుణంగా మిర్జా ఖాదియానీ దైవదౌత్యం కోసం ఎంతో తోడ్పడింది. ఎందుకంటే ఈ స్థితిలో అతను నరాల బలహీనతతో మూర్ఛ పోయేవాడు. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయి మైకం ఆవహించేది. 

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ మూర్ఛనే వహీ అవతరించే సందర్భంగా ఆయన ﷺ ఎదుర్కొనే పరిస్థితులతో పోల్చారు. ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త తన మాటలనే తన చెవుల ద్వారా బయటి వ్యక్తి తనతో మాట్లాడుతున్నట్లు వింటాడు. తన రెండు కళ్లతో చూస్తాడు. అంటే తన ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడని భావిస్తాడు. (ఈ వివరణ ఖియాస్ మఅల్ ఫారిక్) మతిస్థిమితంలేని వాడు తన ముందు ఎవరూ లేకపోయినా ఏదో మాటలు తనకు వినబడుతున్నట్లు తన ముందు మనషులు ఉన్నట్లు వారితో తాను మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తుండడం మనలో చాలా మంది చూస్తూనే ఉంటారు. కాని అతని ముందు ఎవరూ ఉండరు. ఇదంతా ఒట్టి భ్రమ మాత్రమే. ఒక వస్తువు వైపు తన శక్తినంతా ప్రయోగించినందుకుగాను ఇలా జరుగుతుంటుంది. [42]

ఈ భావనతోనే పాశ్చాత్తవాదులు వహీ అవతరణ, మతితప్పి పోతూ ఉండే మూర్ఛ వ్యాధికి మధ్య ఎలాంటి తేడా లేదని వాదిస్తుంటారు. ఆకాశం నుంచి అవతరించే వహీ, మూర్ఛ రోగం ఒకటేనని అంటారు. పాశ్చాత్తవాదులు ఇలా ఎందుకు వాదిస్తుంటారంటే మూర్ఛవ్యాధికి, వహీకి తేడా ఉండకూడదని, ప్రజలు ప్రవక్త ﷺ) దైవదౌత్యాన్ని ఒక మూర్ఛ స్థితిగానే భావించాలని, తద్వారా గులాం మిర్జా ఖాదియానీ ప్రకటించే కొత్త దైవదౌత్య ద్వారాలు సరళంగా తెరుచుకోవాలని. ‘లోథ్రోబ్ స్టోదార్డ్’ అనే పాశ్చాత్తవాది ఇలా అంటాడు: ముహమ్మద్ ﷺ నిరక్ష్య రాస్యులు. ఆయనకు చదవడం, రాయడం రాదు. ఆయన తత్వవేత్తా కాదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉండేవారు. దాని ఫలితంగా ఆయనలో అంచెలంచెలుగా మగత స్థితిలో ఒక కొత్త విశ్వాసం రూపుదిద్దుకుంది. దాన్ని ఆయన విగ్రహారాధనను నిర్మూలించడానికి మూలంగా భావించేవారు. [43]

ఈ పాశ్చాత్తవాదే మరో చోట ఇలా పేర్కొన్నాడు: ముహమ్మద్ ﷺ పై అవతరించే వహీ, ఆయన లేవనెత్తిన ప్రచారానికి మూల కారణం ఆయనపై అప్పుడప్పుడు ఆవహించే మూర్ఛ రోగమే. [44]

‘దర్శింగమ్’ అనే మరో పాశ్చాత్తవాది ఇలా అంటాడు: ముహమ్మద్ ﷺ అధిక సమయం గుహలోయల్లో చెప్పుల్లేకుండా తిరిగేవారు. సూర్యతాపానికి పరితపించేవారు. అక్కడి లోయల్లో పెద్దపెద్ద అంగలతో నడిచేవారు. ఆయన లోయల్లో నడిచేటప్పుడు అక్కడున్న రాళ్లలో నుంచి శబ్దాలు వస్తున్నట్టు ఆయనకు సంశయం కలిగేది. మీరు చూడలేదా! శీతాకాలపు రాత్రిళ్లలో నక్షత్రాల సమూహాలు ఎడారిని తలపిస్తుంటాయి. వాటి నుంచి వెలువడే కాంతి నుంచి అగ్నిరాజేసి నప్పుడు వచ్చే మంటల శబ్దం వస్తున్నట్టుంటుంది. ముహమ్మద్ ﷺ పై అవతరించే వహీ కూడా అలాంటిదే. అంతే తప్ప అది విశ్వంలోని మరే వస్తువూ కాదు. [45]

గులామ్ అహ్మద్ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర : 

పాశ్చాత్తవాదులు తమ ప్రయత్నాలు కొందరు ముస్లిమ్ మేధావుల భావాల ద్వారా దైవదౌత్య సాధనలో యూదులు, క్రైస్తవ విధానాలను ముస్లిముల మధ్య వ్యాప్తి చేయడంలో సఫలీకృతం అయ్యారు. ఈ భావాన్నే తీసుకుని దాని విత్తనం ద్వారా మిర్జా ఖాదియానీ అబద్ధపు దైవదౌత్యం ప్రస్ఫుటమయింది. “ఖాదియానియత్’ రూపంలో అది దినదిన ప్రవర్ధమానం అయింది. 

ఖాదియానియత్ పురోభివృద్ధికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే “ప్రకృతివాదం (నేచరీ వర్గం)” కూడా పాశ్చాత్తవాదుల సృష్టేనన్న చారిత్రక వాస్తవం బట్టబయలవుతుంది. ఖాదియానీ వర్గం వెలుగులోకి రావడానికి ఈ వర్గమే దానికి ఎంతగానో తోడ్పడిందని నిరూపితమయింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న సత్సంబంధాలే దీనికి ఆధారాలు. 

అల్లామ ఇహ్సాన్ ఇలాహి జహీర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “మిర్జా ఖాదియానీ దగ్గరకు కొందరు అత్యాశాపరులు, ద్రోహులు స్వయంగా చేరారు లేదా వారిలో ఆశ కలిగించి అతని దగ్గర చేర్పించారు. వారు డబ్బులకు తమ అంతరాత్మలను అమ్ముకున్నారు. ద్రోహబుద్ధిగల ఈ ఆధ్యాత్మిక గురువులే మిర్జా దైవదౌత్యాన్ని ప్రచారం చేశారు. మిర్జా ఖాదియానీది కేవలం కీలుబొమ్మ పాత్ర. అతనికి సూచించిన విషయాలు మాత్రమే అతను చెప్పేవాడు. ఈ విషయాలు మేము చారిత్రక రుజువులు, ప్రత్యక్ష సాక్షుల ఆధారాల ద్వారా తెలుపుతున్నాము. స్వయంగా మిర్జా ఖాదియాని ఈ వాస్తవాలకు చెందిన ఆధారాలను చూపుతున్నాడు. ఆధారం ఏమిటంటే, మిర్జా ఖాదియానీ ఒక పుస్తకం రాయాలని సంకల్పం చేసుకున్నాడు. దాని కోసం అతను ప్రజల సహాయం కోరాడు. చరాగ్ అలీని ఉద్దేశించి ఇలా అంటున్నాడు: మీ ఉత్తరం అందింది. చాలా సంతోషం కలిగింది. దీనికి ముందు నేను ఇస్లామ్ కు సేవ చేయాలనుకుంటున్నాను. మీ ఉత్తరం ద్వారా నాకు ధైర్యం వచ్చింది. ఒక వేళ మీ దగ్గర నేను రాయాలనుకున్న పుస్తకానికి సంబంధించిన వ్యాసాలు ఉంటే తప్పకుండా పంపగలరు. [46]

మిర్జా ఇంకా ఇలా అంటున్నాడు. దైవదౌత్య ఆధారాల గురించి మీ వ్యాసం ఇంకా అందలేదు. దీని కోసం నేను ఎంతగానో నిరీక్షిస్తున్నాను. నేను రెండవసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. దీనికి సంబంధించిన వ్యాసం మీరు వీలైనంత త్వరగా పంపగలరు. [47]

ఏదేమైనప్పటికీ రెండు వర్గాలు అంటే నేచరీ వర్గం మరియు ఖాదియానీ వర్గం మధ్య ఉన్న పటిష్ట సంబంధాల ఆధారంగా ఈ రెండు వర్గాల విశ్వాసాల్లో ఏకాభిప్రాయం ఉందని, ముఖ్యంగా లాహెూర్కు చెందిన ఖాదియానీ వర్గ విశ్వాసం మరియు నేచర్ వర్గ విశ్వాసాలు ఒక్కటేనని రుజువవుతుంది. ఎందు కంటే ఏ విధంగా సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ దైవదూతలు, జిన్నులు, స్వర్గనరకాలు, అగోచర విషయాలు (ఆలముల్ గైబ్), మహిమల వాస్తవాలను తిరస్కరించారో అదే విధంగా ముహమ్మద్ అలీ లాహోరీ కూడా ఈ విషయాలన్నిటినీ తిరస్కరించాడు. అందుకనే ఖాదియానీలు ఇస్లామ్ ధర్మపరిధిలో లేరని మొత్తం సమాజం ఏకీభవించినట్లే, కొందరు ఉలమాలు సర్ సయ్యద్ అహ్మద్ ను కూడా ఇస్లాం ధర్మ తిరస్కారిగా పరిగణించారు. 

ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు: 

ఖాదియానీ వర్గంలో కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారి పేర్లు: నూరుద్దీన్, ముహమ్మద్ అలీ, మిర్జా బషీరుద్దీన్ ఇబ్నె గులామ్ అహ్మద్ ఖాదియానీ, ముహమ్మద్ అహ్మద్ బిన్ గులామ్ అహ్మద్ ఖాదియానీ, కమాలుద్దీన్, ముహమ్మద్ అహసన్ అమ్ రోహి, యార్ ముహమ్మద్, అబ్దుల్లాహ్ తీమాపూరి మరియు ముహమ్మద్ సాదిఖ్. వీరందరికి నూరుద్దీన్ మరియు ముహమ్మద్ అలీ నాయకులుగా ఉండేవారు. రాబోయే పేజీల్లో వారి గురించి మేము ప్రత్యేకంగా ప్రస్తావిస్తాము. 

ఖాదియానియ్యత్ తొలి ఖలీఫా నూరుద్దీన్ : 

హకీమ్ నూరుద్దీన్ బిన్ హాఫిజ్ గులామ్ రసూల్ క్రీ.శ. 1841, హి.శ 1258లో జన్మించాడు. అరబీ, ఫార్సీలో కొంత విద్యను పొందాడు. దానితో పాటు భూగోళం, గణిత శాస్త్రాల్లో ప్రాథమిక విద్య నభ్యసించాడు. అరబీ వ్యాకరణం (నహూ), తర్కం, తౌహీద్కు సంబంధించిన పుస్తకాలు కూడా చదివాడు. 

ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేయనారంభించాడు. తర్వాత ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ మధ్యకాలంలోనే తనకు తెలిసిన కొందరు గురువుల దగ్గర శిష్యరికం పొంది మరింత విద్యనార్జించాడు. చివరగా ఒక వైద్యునిగా పని చేయడం మొదలు పెట్టాడు. ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికాడు. [48]

ఈ మధ్యకాలంలోనే మిర్జా గులామ్ ఖాదియాని పరిచయం అయ్యాడు. అప్పుడు అతను ‘సియాల్ కోట్’లో ఉండేవాడు. పరిచయం స్నేహంగా మారింది. మిర్జా ఖాదియానీ ‘బరాహీన్ అహ్మదియ’ అనే పుస్తకం రాస్తే దాన్ని నిర్ధారించేందుకు తస్ధికే బరాహీన్ అహ్మదియ’ అనే పుస్తకం రాసి మిర్జా ఖాదియానీ చేతులపై బైత్(ప్రమాణం) చేసి ఆయనకు భక్తుడయ్యాడు. ఇతను ఆ పుస్తకంలో ఎంతటి దిగజారిన వాక్యాలు రాశాడంటే “ఈ వ్యక్తి (అంటే మిర్జా) దైవప్రవక్తనని ప్రకటించుకుని తానే షరీఅత్ కర్తనని, ఖుర్ఆన్ షరీఅత్ ను రద్దు చేస్తున్నానని అంటే దాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తాను. దాన్ని తిరస్కరించడానికి నా దగ్గర ఏ కారణమూ ఉండదు”. [49]

అల్లామ ఇహన్ ఇలాహి జహీర్ (రహ్మతుల్లా అలైహి) ఇలా పేర్కొంటు న్నారు: నూరుద్దీన్ గురించి ఒక విషయం చాలా ప్రచారంలో ఉంది. సమాజ పునరుద్ధరణ పిలుపు నుంచి దైవదౌత్య ప్రకటన వరకు మిర్జా గులాం ఖాదియానీ తరఫు నుంచి అన్వయిస్తున్న విషయాలన్నిటి వెనుక నూరుద్దీన్ అనే వ్యక్తిత్వం దాగి ఉంది. మౌలానా అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మతుల్లా అలైహి) అభిప్రాయం కూడా ఇదే. [50]

ఈ ధార్మిక పండితుల అభిప్రాయాలు సరైనవే. ఎందుకంటే మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ హదీసు విద్యగాని, ఇస్లాం ధర్మశాస్త్ర విద్యగానీ అభ్యసించలేదు. అతనికి అరబీ భాష కూడా అంతంత మాత్రమే వస్తుంది. కాని నూరుద్దీన్ అరబీ భాషలో ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా అతను హిజాజ్ ప్రాంతంలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు. [51]

నూరుద్దీన్ ప్రకృతివాద నేచరీ వర్గానికి చెందిన గురువుల దగ్గర కూడా శిష్యరికం పొందాడు.పాశ్చాత్త భావాలను పెంపొందించుకుని షరీఅత్ ఆదేశాలను, ఇస్లామ్ సంస్కృతిని ప్రకృతి మరియు స్వభావాలకు అనుగుణంగా చేయాలని అంటాడు. 

మౌలానా సయ్యద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మతుల్లా అలైహి) ఇలా పేర్కొం టున్నారు: నూరుద్దీన్ ది అస్థిర వ్యక్తిత్వం. అతనికి బుద్ధిలోపం ఉంది. మొదట్లో పండితులు అనుకరణ (తక్లీద్)ను తిరస్కరించి స్వేచ్ఛా భావాలు కలవానిగా మారాడు. ఆ తరువాత ధార్మిక విశ్వాసాలను మరియు ఖుర్ఆన్ ను ప్రకృతి, స్వభావానికి అనుగుణంగా చేసుకునే వర్గంలో చేరిపోయాడు. ఖుర్ఆన్ మరియు హదీసులకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మార్పుచేయసాగాడు. ఈ మార్పులన్నీ భారతదేశంలో పాశ్చాత్త ఆంగ్ల సంస్కృతి పేర ఆచరించసాగారు. 

వాస్తవం ఏమిటంటే ఈ కొత్త విధానం నిరూపించబడిన వాస్తవాలు, సాక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రకృతి విధానాన్ని అమలు పరచడానికి ఏ మార్గాన్ని అనుసరించ డానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. అరబీ భాషను రకరకాలుగా మార్చి తమ విధానాన్నే అమలు పరచడానికి పూనుకునే వారు. అందుకనే వారు మహిమలను, అగోచర విషయాలను ఉన్నదున్నట్లు విశ్వసించకుండా వాటికి అనవసర వివరణలు ఇచ్చేవారు. [52]

చివరకు నూరుద్దీన్ క్రీ.శ.1892లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాదియాన్ కు వెళ్లిపోయాడు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. క్రీ.శ 1981లో మిర్జా తరువాత ఆయన ఖిలాఫత్ పై ప్రమాణం తీసుకోవడం జరిగింది. తొలి ఖలీఫాగా సత్కారం పొందాడు. ప్రజలు అతన్ని “ఖలీఫయె మసీహుల్ మౌఊద్ నూరుద్దీన్ ఆజమ్”గా పిలువసాగారు. ఆరు సంవత్సరాల వరకు ఖిలాఫత్ స్వీయ ప్రకటిత కిరీటధారుడై క్రీ.శ. 1914 మార్చి 13న మరణించాడు. అతని తరువాత మిర్జా గులాం ఖాదియానీ కుమారుడు మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అతని వారసుడయ్యాడు. [53]

లాహోూరు వర్గ స్థాపకుడు ముహమ్మద్ అలీ లాహోరీ: 

ఏ పుస్తకంలోనూ ఈయన జన్మదినం మరియు జన్మస్థలం ప్రస్తావన దొరకదు. కాని ఆయన లాహెూరు నగరంలో నివసించేవారు. అక్కడే లాహెూరు ఖాదియానీ వర్గానికి అంకురార్పణ జరిగింది. దాని ద్వారానే అతన్ని లాహెూరీ అంటారు. ముహమ్మద్ అలీ లాహోరీ ఉన్నత విద్యనభ్యసించాడు. ఎమ్. ఏ చదివాడు. ఉన్నత విద్యనభ్యసించినప్పటికీ ఉద్యోగం దొరకలేదు. చివర్లో అతనికి సామ్రాజ్యవాద భూతం ఆవహించింది. విలువైన విశ్వాసాన్ని అమ్ముకున్నాడు. ఇస్లామ్ గోడలను కూల్చడానికి, ముస్లిముల విశ్వాసాల్లో అనుమానాలు రేపడానికి, వారి మధ్య కల్లోల బీజం నాటడానికి, మిర్జా ఖాదియానీకి సహాయం చేయడానికి సామ్రాజ్యవాద శక్తులు అతన్ని అసత్యవాది అయిన మిర్జాగులామ్ ఖాదియానీకి భాగస్వామునిగా చేర్చారు. ప్రతిఫలంగా అతనికి భారీమొత్తంలో వేతనం లభించేది. [54]

మిర్జా గులామ్ ఖాదియానీ దైవదౌత్యాన్ని ప్రకటించినప్పుడు ముహమ్మద్ అలీ లాహెూరీ ఖాదియాన్లో మిర్జా గులామ్ అహ్మద్ తో పాటు జమాఅత్ కార్య దర్శిగా ఉన్నాడు. అప్పుడప్పుడు భారతదేశంలో నిర్వహించబడే సభలకు ఖాదియానీ ప్రతినిధిగా పాల్గొనేవాడు. [55]

సామ్రాజ్యవాదుల ప్రణాళికల ప్రకారం మిర్జా గులామ్ ఖాదియాని ఖాదియానియత్ కు చెందిన భావాలు, విశ్వాసాలను విద్యావంతులైన ముస్లిమ్ లలో వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఆంగ్ల భాషలో “Revive of Religions” అనే మాస పత్రికను ప్రారంభించినప్పుడు ముహమ్మద్ అలీ లాహోరీ దానికి సంపాద కునిగా నియమించబడ్డాడు.[56]

మరోవైపు ఖాదియానీలను తిరస్కరించడానికి, వారిని మార్గభ్రష్టులుగా పేర్కొనడానికి ఉలమాలు ఏకమయ్యారు. దీన్ని ఎవరూ విభేదించలేదు. అతన్ని విశ్వసించిన వారు మార్గభ్రష్టులవుతారని ఫత్వాలు జారీ చేశారు. అనేక రచనలు చేశారు. ఖాదియానియత్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని, దాన్ని ఇస్లామ్ నుంచి బహిష్కరించాలని, వారిని ముస్లిమేతరులుగా పరిగణించాలని ముస్లిములు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినప్పుడు సామ్రాజ్యవాదులు ముస్లిము లను మార్గభ్రష్టులను చేసే తమ పన్నాగం పారదని భయపడసాగారు. కనుక గులామ్ అహ్మద్ ఖాదియానీ రైట్ హ్యాండ్ గా  భావించే ముహమ్మద్ అలీ లాహెూరీకి అత్యాశ చూపి ఒక కొత్త జమాఅత్ ప్రారంభించాల్సిందిగా కోరారు. ముహమ్మద్ అలీ వారి కోరిక మేరకు గులామ్ అహ్మద్ ఖాదియానీ ఎప్పుడూ దైవదౌత్యాన్ని ప్రకటించు కోలేదని కేవలం అతను ముజద్దిద్ మరియు ముల్టిమ్ మాత్రమేనని ప్రకటించాడు. 

ముస్లిములను మార్గ భ్రష్టులను చేయడానికి ముహమ్మద్ అలీ లాహెూరీ ఈ కుట్ర పన్నాడు. ఇలా ముస్లిములు అతని ఉచ్చులో చిక్కుకుని ఇస్లామ్ కు దూరమయి ఖాదియానియత్ను ధర్మంగా భావిస్తారనుకున్నాడు. చివరికి ఇలా సామ్రాజ్యవాద శక్తులు మరియు ముహమ్మద్ అలీ లాహెూరీల పరస్పర సహకారాలతో లాహెూరీ జమాఅత్ ఏర్పడింది. [57]

ముహమ్మద్ అలీ లాహెూరీ ఇలా ప్రకటించాడు: నా ఖాదియానీ సోదరులారా! అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను: ఒక వేళ ఈ నమ్మకం సరైనదే అయితే దైవదౌత్య పరంపర ఇంకా పూర్తి కాలేదు. ప్రవక్తలు వస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మహమూద్ అహ్మద్ తన పుస్తకం “అన్వారుల్ ఖిలాఫ’లో దీని గురించి వివరణ ఇచ్చారు. అయినా కూడా వేల సంఖ్యను దాటిన ఈ వర్గాలు ఎందుకు పరస్పరం తిరస్కరించుకుంటున్నాయి? వీటిలోని ఇస్లామీయ ఐక్యత ఎందుకు దూరమవుతుంది? [58]

ముహమ్మద్ అలీ లాహెూరి మొదట్లో మిర్జా గులాం అహ్మద్ బోధనలను ఉన్నదున్నట్టుగా అంగీకరించేవారు. కాని ఆ తరువాత ఆయన మిర్జా ఖాదియానీ చేసిన దైవదౌత్య ప్రకటనకు వివరణ ఏమిచ్చారంటే “మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని చేసిన దైవదౌత్య ప్రకటన మరియు ఆయన ప్రబోధించిన ‘హులూలో (ఆత్మ పరమాత్మలో లీనమయ్యే) విశ్వాసం మగత ఆవహించిన స్థితిలో ప్రస్ఫుట మయింది. సూఫీ ఇబ్నె అరబీ తదితరులతో నిరూపితమయిన విషయం లాంటిదే ఇది కూడాను. ఇంకోమాట కూడా ఉంది. ‘నబీ’ అనే పదానికి మొట్టమొదటి అర్ధం శుభవార్త నిచ్చేవాడు. నబీకు హెచ్చరించేవాడని కూడా అర్ధం ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సమాచారం ఇస్తాడు.” ఇవే కాకుండా వేరే అనవసర వివరణలు కూడా ఇవ్వసాగారు. [59]

మీ రచయితకు లా హెూరీ ఖాదియానీ జమాఅత్తో చర్చించే, దాని గురించి నేరుగా సమాచారం పొందే అవకాశం దొరికింది. సంభాషణ మధ్యలో వాళ్లు కూడా తమను ముస్లిములుగా భావిస్తారని తెలిసింది. ఖుర్ఆన్ను ప్రస్తావించి దాని నుంచి తమ భావం రాబట్టుకోవటానికి రుజువులు కూడా చూపెడ తారు. కాని హదీసులను మాత్రం వీరు తీవ్రంగా తిరస్కరిస్తారు. హదీసుల్లో సహీహ్ మరియు జయీఫ్ హదీసులు కలగలసిపోయాయని కనుక వీటితో ఆధారాలు చూపడం సరికాదని అంటారు. వీళ్లు గులామ్ అహ్మద్ ఖాదియానీ తొలికాలంలోని కొన్ని రచనలు, ముహమ్మద్ అలీ లాహెూరీ పుస్తకాలు నాకు కానుకగా ఇచ్చారు. క్రింద వాటి పేర్లు పేర్కొనడం జరిగింది. దీంతో ఆ వర్గంవారి మూలగ్రంథాలు ఎలాంటివో, వారు ముస్లిముల్లో ఎలాంటి భావాలను పెంపొందించాలను కుంటున్నారో అర్ధం అవుతుంది. 

నాకు కానుకగా ఇచ్చిన మిర్జా గులామ్ అహ్మద్ పుస్తకాలు: 

  • 1) హుజ్జతుల్ ఇస్లామ్ : రియాజ్ ప్రెస్ అమృత్సర్, ఇండియా ప్రచురణ 
  • 2) అల్ బలాగుల్ ముబీన్: అహ్మదియ అన్జుమన్ ఇషాఅత్ ఇస్లామ్ ముంబై, ఇండియా 
  • 3) ముఖద్దమె హఖీఖతె ఇస్లామ్ : ఆయినె కమాలాతె ఇస్లామ్ నుంచి సేకరణ, ప్రచురణ కర్త పేరు లేదు
  • 4) బగ్దాద్ కానుక : (అరబీ): అలమాఅతుల్ అహ్మదియ ఇషాఅతుల్ . ఇస్లామ్ లాహెూర్ పాకిస్తాన్

ముహమ్మద్ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు: 

  • 5) బయానుల్ ఖుర్ఆన్: (రెండు పెద్దపెద్ద భాగాల్లో అందమైన ప్రచురణతో) అల్ జమాఅతుల్
    అహ్మదియతుల్ లాహూరియ, లాహెర్, హి.శ. 1401 
  • 6) వఫాతె మసీహ్ వ నుజూలె మసీహ్: అల్ జమీఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 7) ఇత్మామె తక్ఫీర్’ అహ్లె ఖిబ్ల అల్ జమీఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 8) హఖీఖతె ఇఖ్తిలాఫ్ (ఖాదియానియత్ గురించి) రెండు భాగాల్లో: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 9) జమాఅతె అహ్మదీయలోని రెండు వర్గాలు: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 10) మన విశ్వాసాలు: సదరుద్దీన్ అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 11) లా నబియ్య బాదీ: షేర్ ముహమ్మద్ మలిక్ : అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 12) ఇస్ముహూ అహ్మద్, సదరుద్దీన్: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 13) ఆకాశపు సాక్షి, ఖుర్షిద్ ఆలమ్, అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 14) అహ్మదీలు ముస్లిములు (దక్షిణాఫ్రికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, 1986) 

వాళ్లు ఈ పుస్తకాలన్నీ నాకు (మీ రచయితకు ఉచితంగానే ఇచ్చారు. మొత్తం జమాఅత్ తమ అంధవిశ్వాసాలను వ్యాప్తి చేయడానికి, ప్రచారం చేయ డానికి ఎంత కృషి చేస్తున్నారో విదిత మవుతుంది. వాళ్లు ఈ కార్యం కోసం తమ సమయాన్నే కాకుండా ధనాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ‘వహుమ్ యహ్సబూన అన్నహుమ్ యుహాసినూన సున్అ’. 

ప్రస్తావించిన పుస్తకాల్లో ముఖ్య పుస్తకం వారి ఖుర్ఆన్ వ్యాఖ్యానం. అది ‘బయానుల్ ఖుర్ఆన్’ పేరుతో పిలువబడుతుంది. [60]

నేను (మీ రచయిత) బయానుల్ ఖుర్ఆన్ను చదివాను. బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాతకు మరియు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు పోలికలున్నాయని స్పష్టమయింది. ఎందుకంటే ఏవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మార్పులు చేర్పుల ద్వారా ఖుర్ఆనీ విద్యను మరియు భావాలను ప్రకృతి, స్వభావాలకు అనుగుణంగా రూపొందించాలనుకున్నారో మరియు మహిమలు [61]  రఫయె మసీహ్ [62] జిన్నాత్ [63] అగోచర విషయాల ను తిరస్కరించారో అదే విధంగా బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాత కూడా ఈ విషయాలను మరియు వాస్తవాలను తిరస్కరించారు. [64] 

అదేవిధంగా బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాత ఖుర్ఆన్ మరియు దాని వాస్తవ భావాలతో చెలగాటం ఆడాడు. మౌలానా అబుల్ హసన్ అలీ నద్వీ (రహిమహుల్లాహ్) కూడా తన పుస్తకం ‘అల్ ఖాదియానీ వల్ ఖాదియానియత్ లో అందులో మార్పు చేసిన అనేక విషయాల గురించి చర్చించారు. తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఖాదియానియత్ తన భావాలు, దృక్పథాలు, విశ్వాసాల దర్పణంలో నేచరీ వర్గం దానికి అనుగుణంగానే ఉంది. వేరేగా లేదు. కొందరు రచయితలు ముహమ్మద్ అలీ లాహెూరీని సర్ సయ్యద్ శిష్యునిగా పరిగణిం చారు. 

[4] ఖాదియానీ విశ్వాసాలు 

[4.1] గులామ్ అహ్మద్ ఖాదియానీ గురించి ఖాదియానీల విశ్వాసాలు: 

ఖాదియానియత్ వర్గ స్థాపకుడు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానిని విశ్వసించే విషయంలో ఖాదియానీల రెండు వర్గాలలో భేదాభి ప్రాయాలున్నాయి. అహ్మదీ ఖాదియానీ అనే వర్గం గులామ్ మిర్జా దైవ ప్రవక్త అని, మరియు మసీహె మౌఊద్ (పునరాగమన ఈసా అలైహిస్సలామ్) అని, ముస్లిం సమాజం నిరీక్షిస్తున్న మహ్దీ అని అంటారు. ఈ వర్గం వారు నిర్వహించే పత్రిక “అల్ ఫజ్లో” చాలా స్పష్టంగా ‘ వేరే ప్రవక్తల మాదిరిగా గులామ్ అహ్మద్ ఖాదియానీ కూడా ఒక ప్రవక్త’ అని తెలిపింది. అదే విధంగా మిర్జా గులామ్ ఖాదియానీ కుమారుడు మిర్జా షబ్బీర్ అహ్మద్ కూడా ఇలా పేర్కొన్నాడు: సూర్యుడు ఉదయించటం ఎంత స్పష్టమో గులామ్ అహ్మద్ ప్రవక్త అన్న విషయం అంతే స్పష్టం. ముహమ్మద్ ﷺ  ఆయన్ను ‘దైవప్రవక్త’ అని పిలిచారు. అల్లాహ్ ఆయనను యా అయ్యుహన్నబియ్యు’ అని సంబోధిస్తూ వహీ చేశాడు”. [67]

రెండో వర్గం అహ్మదీ లాహెూరీ విశ్వాసం ఏమిటంటే మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ దైవప్రవక్తగాని దైవసందేశహరుడుగాని కాదు. అతను సంస్కర్త మరియు పునరుద్ధారకుడు మాత్రమే. ఆయన్ను తిరస్కరించేవాడు పాపాత్ముడు. దీని గురించి ముహమ్మద్ అలీ లాహోరీ ఇలా ప్రకటించాడు: ‘నేను లాహోూరీ అహ్మదియ వర్గ నేత ముహమ్మద్ అలీ లాహోరీని అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను విశ్వసించే విషయం ఏమిటంటే, హజ్రత్ మిర్జాగులామ్ అహ్మద్ కేవలం పునరుద్ధారకుడు మాత్రమే. ఆయన దైవ ప్రవక్త కాదు. ఆయన పునరాగమన ఈసా (అలైహి). ఆయన్ని తిరస్కరించినవాడు ఇస్లాం పరిధిని అతిక్రమించినట్లు కాదు. మిర్జా గులాం అహ్మద్ విశ్వాసం కూడా ఇదే. [68]

అయితే ముహమ్మద్ అలీ లాహోరీ మరియు లాహోరీ జమాఅత్కు సంబంధించి పైన పేర్కొనబడిన విశ్వాసాలు మిర్జా గులాం ప్రబోధనలకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. ఎందుకంటే ఈ సంచికలోనే ఈ విషయం కూడా రాయబడి వుంది: మిర్జా గులాం అహ్మద్ ఖాదియానికు మేము మొట్టమొదటి అనుయా యులం, మిర్జా అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్త. ఇది సత్యం. ఉపద్రవాలు తలెత్తుతున్న ఈ యుగంలో అల్లాహ్ ఆయన్ను సత్య మార్గదర్శనం కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయనకు విధేయత చూపనిదే సాఫల్యం, విముక్తి సాధ్యం కాదని కూడా మేము విశ్వసిస్తున్నాం. [69]

అదే విధంగా పైన పేర్కొన్న విషయాల నేపథ్యంలో క్రింద పేర్కొనబడు తున్న విషయాలు ఎంత విరుద్ధంగా ఉన్నాయో మీరే గమనించండి. స్వయంగా ముహమ్మద్ అలీ లాహెూరీ ఇలా పేర్కొంటున్నాడు: మిర్జా గులామ్ అహ్మద్ మళ్లీ వస్తానని చెప్పబడిన ఈసా (అలైహి) అని, ముస్లిమ్ సమాజం ఎదురు చూస్తున్న మహ్దీ అని, దైవప్రవక్త అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన స్థానం నబీ మరియు రసూల్కు మధ్యలో ఉంటుంది. ఆయన్ను విశ్వసించనివారు సాఫల్యం పొందలేరని మా నమ్మకం. [70]

[4.2] అల్లాహ్ గురించి ఖాదియానీల విశ్వాసం: 

అల్లాహ్ గురించి ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, అల్లాహ్ ఉపవాసాలు ఉంటాడు. నిద్రపోతాడు, మేల్కొంటాడు. రాస్తాడు, ముద్రవేస్తాడు. అల్లాహ్ పొరపాట్లు కూడా జరుగుతాయి. అతను సంభోగం కూడా చేస్తాడు. (సుబ్ హానల్లాహి వ తఆలా అమ్మా యసిపూన్) 

మిర్జా గులాం ఖాదియానీ ఇలా అన్నాడు: తాను నమాజ్ చేస్తానని, ఉపవాసాలు ఉంటానని, నిద్రపోతానని, మేల్కొంటానని అల్లాహ్ నాకు చెప్పాడు.’ [71]

మిర్జా మరోచోట తన సంఘటనను ఇలా తెలుపుతున్నాడు: నేను మగతలో మరియు మహిమల ద్వారా నా ప్రతిపాదనలను ఆమోద ముద్ర వేయడానికి అనేక పత్రాలు నేను అల్లాహ్ ముందు ఉంచడం చూశాను. అల్లాహ్ నా సమక్షంలో ఆ ప్రతిపాదనలను అంగీకరించాడు. వాటిపై ఎర్ర సిరాతో ముద్ర కూడా వేశాడు. నాతో పాటు నా విధేయుడు అబ్దుల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు. అల్లాహ్ వాటిపై సంతకం చేసిన తరువాత తన కలాన్ని విదిలించాడు. దాంతో ఆ ఎర్ర సిరా మరకలు నా దుస్తులపై, అబ్దుల్లాహ్ దుస్తులపై పడ్డాయి. మగతలో నుంచి బయటకు వచ్చిన తరువాత చూస్తే నా బట్టలు, అబ్దుల్లాహ్ బట్టలు ఎర్ర సిరాతో రంగరించి ఉన్నాయి. ఆ సమయంలో మా దగ్గర ఎర్ర సిరా లేదు. అబ్దుల్లాహ్ దగ్గర ఆ బట్టలు ఇప్పటికీ ఉన్నాయి. [72]

[4.3] ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలాం) గురించి వారి విశ్వాసం: 

గులామ్ అహ్మద్ ఖాదియానీ తనను ఈసా బిన్ మర్యమ్ గా చెప్పుకోడానికి ఈసా (అలైహి)ను రెండు వ్యక్తులుగా చేశాడు. ఒకరు బనీ ఇస్రాయీల్లోని ఈసా అని, ఆయన సహజ మరణం పొందారని అన్నాడు. కాని ఆయన అక్రమ సంతానం అని, తాగుబోతు అని, కాని ఈసా బిన్ మర్యమ్ అల్లాహ్ కుమారుడు అని, ఆయన తాగుబోతు కాదని, అతను తానేనని చెప్పుకొచ్చాడు. 

మిర్జా ఖాదియాని తాను పునరాగమన ఈసానని చెప్పుకునే స్థితిని గురించి ఇలా రాశాడు: తొలి దశలో నన్ను నేను ఒక యవ్వన కన్యగా భావించుకున్నాను. (మర్యమ్ బిస్త్ ఇమ్రాన్). ఆ తరువాత అల్లాహ్ నాలో తన మగతనాన్ని ప్రస్ఫుటం చేశాడు. దాంతో నేను గర్భం దాల్చాను. ఆ తరువాత పది నెలల తరువాత నేను మర్యమ్ బిన్తె ఇమ్రాన్ నుంచి ఈసా బిన్ మర్యమ్ గా మారాను. [73]

దురదృష్టం వరిస్తే నీడ కూడా తోడు విడిచి పోతుందట. ఆంగ్లేయులు మిర్జాను అందరికంటే యోగ్యుడిగా, వివేకవంతునిగా భావించుకున్నారు. కాని అతను ఎంత మూర్ఖుడని తేలాడంటే అతని నోటి నుంచి వెలువడిన మాటలను రాయాలంటే పేపర్ పెన్ను కూడా సిగ్గుతో తలదించు కుంటాయి. మానవత్వం కూడా తల దించుకుంటుంది. “సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్” భావం ఏమిటో బాహ్యకళ్లు చూశాయి! మీర్జా వాదనలు, ప్రకటనలు చదివి సాధారణ మనిషి కూడా అర్ధం చేసుకుంటాడు అతను ఎంతటి నీచుడో, నికృష్ణుడో. ఒక మంచి వ్యక్తి నోటి నుంచి అలాంటి మాటలు ఎన్నటికీ రావు. 

[4.4] దైవదౌత్యం మరియు దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి: 

దైవదౌత్యం మరియు దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, ముహమ్మద్ ﷺ తోనే దైవదౌత్యం పూర్తి కాలేదు. ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగుతుంది. అల్లాహ్ అవసరాన్ని బట్టి ప్రవక్తలను పంపు తూనే ఉంటాడు. మిర్జా గులామ్ అహ్మద్ దైవ ప్రవక్తల్లో ఉత్తమ ప్రవక్త.[74]

మిర్జా ఇలా పేర్కొంటాడు: ‘ప్రపంచంలో ఎవరికీ ప్రసాదించని వస్తువులను నాకు ప్రసాదించాడు’. [75]. ఇంకా ఇలా అన్నాడు: ‘సామూహికంగా ప్రవక్తలందరికీ కలిపి ఇచ్చిన వస్తువులను నాకొక్కనికే ఇవ్వడం జరిగింది’.[76]

మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ కుమారుడు మిర్జా మహమూద్ అహ్మద్ ఇలా పేర్కొన్నాడు: అల్లాహ్ అవసరాన్ని బట్టి ఈ సమాజం మార్గదర్శ కత్వం కోసం తప్పనిసరిగా ప్రవక్తలను పంపుతూనే ఉంటాడని ఖాదియానీలమైన మేము విశ్వసిస్తాం’. [77]

ఆయన ఇంకా ఇలా పేర్కొన్నాడు: అల్లాహ్ ఖజానా ఖాళీ అయిందని ప్రజలు భావిస్తున్నారా? వారు అలా భావిస్తున్నట్లయితే అది తప్పు. వారికి అల్లాహ్ శక్తి గురించి తెలీదు. ఒక్క ప్రవక్త కాదు వేల సంఖ్యల్లో ప్రవక్తలను ఆయన పంపగలడు. [78]

[4.5] ఖుర్ఆన్ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం: 

మిర్జా గులామ్ ఖాదియాని విశ్వాసం ఏమిటంటే, అతని దగ్గర దైవవాణి తీసుకువచ్చే దూత ఒక ఆంగ్లయువకుడు. అతని దగ్గరికి ఆంగ్లంలో దైవవాణి వస్తుంది. 

మిర్జా ఖాదియాని ఇలా అంటున్నాడు: ‘నేను జిబ్రయీల్ ను ఒక అందమైన ఆంగ్ల యువకుని రూపంలో చూశాను. అతని వయసు సుమారు 20 సంవత్స రాలు ఉంటుంది. అతను ఒక కుర్చీ మీద ఆసీనుడై ఉన్నాడు. అతని ముందు ఖరీదైన ఒక టేబుల్ ఉంది. నేను అతనితో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అన్నాను. అతను అవునన్నట్టు అంగీకరించాడు. ఆంగ్లంలో ‘I Love You’ (నేను నిన్ను ప్రేమిస్తున్నాను), ‘I am with you’ (నేను నీతో ఉన్నాను), I shall help you (నేను నీకు సహాయం చేస్తాను). దాంతో పాటే నాపై వణుకు ఆవహించింది. I can do what I want (నేను చేయాలనుకున్న దాన్ని చేస్తాను అని అన్నాడు. నేను అతని భాషను, మాటతీరును బట్టి అతను ఒక ఆంగ్ల యువకుడని అర్ధం చేసుకున్నాను. అతను నా తల దగ్గర ఉన్నాడు.’ [79]

మిర్జా ఖాదియానీ ఇలా కూడా అన్నాడు: జిబ్రయీల్ నా దగ్గరకు వచ్చారు. నన్ను ఎన్నుకున్నారు. నా వైపు వేలితో సైగ చేస్తూ, అల్లాహ్ శత్రువుల నుంచి నిన్ను రక్షించుగాక! అన్నారు. [80]

ఇంకా ఇలా అన్నాడు: మహిమాన్వితుడైన అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను: ఏ విధంగా నేను ఖుర్ఆన్ మరియు ఆకాశ గ్రంధాలను విశ్వసిస్తానో అదే విధంగా నేను నాపై అవతరించే దైవవాణిని విశ్వసిస్తాను. నాపై అవతరించబడే దైవవాణి అల్లాహ్ వాక్కులని నేను విశ్వసిస్తున్నాను. ఖుర్ఆన్ అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధమని ఎలా విశ్వసిస్తున్నానో ఇది కూడా అలాంటిదేనని విశ్వసిస్తున్నాను.” [81]

ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, వారి గ్రంధం అల్లాహ్ వైపు నుంచే అవతరించింది. దాని పేరు “కితాబున్ ముబీన్ (స్పష్టమైన గ్రంధం)”. అది ఖుర్ఆన్ కాదు. ముహమ్మద్ యూసుఫ్ ఖాదియానీ ఇలా అంటున్నాడు: అల్లాహ్ గులామ్ అహ్మద్ ఖాదియానీకి కలిగిన దైవిక సంకేతాలన్నిటిని కలిపి ‘అల్ కితాబుల్ ముబీన్’ అని పేరు పెట్టాడు. ప్రతి ఒక ఇల్హామ్ కు ఆయత్ అని పేరు పెట్టాడు. కనుక ఎవరయితే ప్రవక్త కోసం గ్రంధం అవతరించడం తప్పనిసరి అంటారో వారు మిర్జా గులామ్ అహ్మద్ దైవదౌత్యాన్ని విశ్వసించాలి. ఎందుకంటే అల్లాహ్ ఆయన పై గ్రంధాన్ని అవతరింపజేశాడు. దానికి ‘అల్ కితాబుమ్ ముబీన్’ అని పేరు పెట్టాడు. అల్లాహ్ ఈ గుణంతో సత్కరించాడు. తిరస్కారులకు ఈ విషయం ఎంత కంటగింపుగా మారినా సరే. [82]

[4.6] ఖాదియాన్ నగరం గురించి వారి విశ్వాసం: 

ఖాదియాన్ నగరం గురించి ‘అల్ ఫజల్’ అనే పత్రికలో ఖాదియాన్ అంటే ఏమిటో రాసి ఉంది. అది అల్లాహ్ స్పష్టమైన గొప్ప చిహ్నాల్లో ఒకటి. ఏ విధంగానయితే హజ్రత్ పునరాగమనం చెందిన ఈసా(మిర్జాగులామ్ ఖాదియానీ) పేర్కొన్నాడో. ఈ నగరం దైవప్రవక్త సామ్రాజ్యం, నివాసం, జన్మస్థలం, మరణించిన భూమి కూడా. ఈ నగరంలో ఒక ఇల్లు ఉంది. అందులో ప్రపంచానికి సాఫల్యం ఇచ్చేవాడు, దజ్జాల్ ను చంపేవాడు, శిలువను విరగ్గొట్టే వాడు, ఇస్లామ్ ధర్మాన్ని ఇతర ధర్మాలపై ఆధిపత్యం వహించేలా చేసేవాడు ఉన్నాడు. [83]

ఖాదియానీల రెండో ఖలీఫా మహమూద్ అహ్మద్ బిన్ మిర్జా ఖాదియానీ ఇలా పేర్కొన్నాడు: మీకు నేను సత్యమే చెబుతాను. ఖాదియాన్ భూభాగం చాలా పవిత్రమైందని నాకు తెలుపడం జరిగింది. అందులో అతనికి మక్కా, మదీనాపై అవతరించే పవిత్ర అనుగ్రహాలు అవతరిస్తాయి. [84]

‘అల్ ఫజల్’ పత్రికలో ఇలా కూడా ఉంది: 

“بے شک سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام  إلى المسجد الأقصى الذي باركنا حوله (۸۵) 

‘నిశ్చయంగా సుబహానల్లజీ అస్రా బి అబ్ దిహీ లైలమ్ మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అఖ్సలజీ బారక్ నా హౌలహూ” [85] లో మస్జిదె అఖ్సా అంటే మస్జిదె ఖాదియాన్ అని భావం. ఎందుకంటే ముహమ్మద్ ﷺ ను మస్జిద్ హరామ్ నుంచి ఈ మస్జిద్ వరకే తీసుకెళ్లడం జరిగింది. ఇది ఖాదియాన్ కు తూర్పు దిశలో ఉంది. అది గులామ్ అహ్మద్ ఖాదియానీ మహిమల కేంద్రం. దీన్ని ప్రవక్త ﷺ కు కానుకగా ఇచ్చారు. [86]

ఖాదియానీల ఇలాంటి అబద్ధపు ప్రకటనలు నిశ్చయంగా ముస్లిములను బైతుల్ మక్దిస్  మరియు మస్జిద్ అక్సాకు దూరం చేయడానికి పన్నిన హేయమైన కుట్ర. అల్లాహ్ మమ్మల్నందరినీ వారి కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి రక్షించుగాక! (ఆమీన్) 

[4.7] ఖాదియానియత్ ఒక నూతన ధర్మం మరియు ప్రత్యేక షరీఅత్ 

ఖాదియానీలు తాము ఒక కొత్త ధర్మాన్ని అవలంబిస్తున్నామని, తమకు ఒక ప్రత్యేక షరీఅత్ ఉందని, మిర్జా అనుయాయులు (సహాబీలు), ప్రవక్త అనుయాయులని భావిస్తారు. మిర్జా ఇలా పేర్కొంటున్నాడు: 

నా సమాజం రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఒక వర్గం ఈసా తత్వాన్ని అనుసరిస్తుంది, అది నాశనమవుతుంది. మరో వర్గం మహ్దీ విధానాన్ని అవలంబిస్తుంది. అది సాఫల్యం పొందుతుంది. [87]

మీర్జా ఖాదియానీ ఇంకా ఇలా అన్నాడు: షరీఅత్ అంటే ఏమిటో బాగా తెలుసుకోండి. ఆదేశాలు, ఆంక్షలనే షరీఅత్ అంటారు. కనుక ఎవరయితే ఈ విధిని నిర్వహిస్తారో తన సమాజం కోసం ఏదైనా ధర్మాన్ని రూపొందిస్తాడో అతను ధర్మకర్త అనబడతాడు. కనుక నేను కూడా ధర్మకర్తనే. ఎందుకంటే నాక్కూడా ఆదేశాలు, ఆంక్షల గురించి దైవవాణి అవతరించింది. ఏదైనా ధర్మంలో కొత్త ఆదేశాలే ఉండాలన్న ఆంక్ష ఏమీ లేదని బాగా గుర్తుంచుకోండి. ఖుర్ఆన్లో ఉన్న బోధనలే తౌరాత్ గ్రంధంలో ఉన్నాయన్న విషయం మీకు తెలీదా? ఇది దాన్నే సూచిస్తుంది: ‘ఇన్న హాజా లఫిస్సుహుఫిల్ ఊలా సుహుఫి ఇబ్రాహీమ వ మూసా”. [88]

ఇంకా ఆయన ఇలా అన్నాడు నా వర్గంలో చేరిన వాడు వాస్తవంగా ముహమ్మద్ ﷺ  అనుయాయుల్లో (సహాబీల్లో) పరిగణించబడతాడు’. ‘అల్ ఫజల్’ పత్రికలోని వాక్యం ఇలా ఉంది: నిశ్చయంగా ఎవరయితే ఖాదియానియత్ను విశ్వసించి గులామ్ అహ్మద్ ను చూస్తాడో అతను ‘సహాబీ’ అనబడతాడు. [90]

ఎదేమైనప్పటికీ, స్పష్టమైన ఈ ఆధారాల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ‘ఖాదియానియత్ ఇస్లామ్ కు వ్యతిరేకం మరియు అది అసత్య ధర్మం. ఏకేశ్వరోపాసన, దైవదౌత్యంపై కాకుండా వేరే రెండు ఇతర పునాదులపై ఏర్పడింది. మిర్జాగులామ్ ఖాదియాని తన నోటితోనే అనేక సార్లు ఈ విషయాన్ని వెల్లడించాడు. షహాదతుల్ ఖుర్ఆన్లో ఇలా రాస్తున్నాడు: నిశ్చయంగా నేను ప్రజలకు బోధిస్తున్న ఇస్లాం ధర్మం రెండు పునాదులపై ఆధారపడి ఉంది. ఒకటి, మేము అల్లాహ్ కు విధేయత చూపాలి. రెండోది, మాకు సుఖశాంతులు కల్పించి, తన ఛాయలో చోటు కల్పించి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వానికే విధేయులవ్యాలి. అదే బ్రిటీష్ ప్రభుత్వం. ” [91]

ఈ విస్పష్ట రుజువుల ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వ కేంద్ర న్యాయ శాఖ ఈ విధంగా తన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది: ఖాదియానియత్ తన సంపూర్ణ అభివృద్ధిలో మైనారిటీ కలది. తమను ముస్లిములుగా ప్రకటించుకునే అనుమతి వారికి లేదు. వారి ఆరాధనాలయాలను మస్జిద్ అని కూడా పిలువకూడదు”. [92]

ఖురాన్ వీడియో : 67. సూర అల్ ముల్క్ (Salah Bukhaatir)

Qur’an Video : 67.Surah Al Mulk – Salah Bukhatir (Telugu Subtitles)
Reciter : Salah Bukhatir
Telugu Translation : ఆహ్సనుల్ బయాన్

[Download Video Here]

[Download Telugu Translation]

విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్ ఈమాన్) – Taqwiyatul Iman [పుస్తకం]

బిస్మిల్లాహ్

విశ్వాస ప్రదాయిని (Taqwiyatul Iman – తఖ్వియతుల్ ఈమాన్)
(ప్రతి ధార్మిక పౌఠశాలలో బోధన, శిక్షణ, అధ్యయనం కొరకు ఉండవలసిన పుస్తకం)

Shah Ismaeeil Shaheed (rahimahullah)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ ( రహిమహుల్లాహ్)

ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [112 పేజీలు]

చాఫ్టర్లు

విషయసూచిక

1వ అధ్యాయం – తౌహీద్ (దేవుని ఏకత్వం) వివరణ [PDF] [8p]

  1. ప్రజల అజ్ఞానం
  2. షిర్క్ చేష్టలు
  3. విశ్వాస వాదనలు షిర్క్ చేష్టలు
  4. ఖుర్ఆన్ తీర్పు
  5. అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూలేడు
  6. అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవరూ లేడు
  7. అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు
  8. షిర్క్ వాస్తవికత

2వ. అధ్యాయం – షిర్క్ (బహుదైవారాధన) రకాలు [PDF] [7p]

  1. జ్ఞానంలో షిర్క్
  2. అధికారంలో షిర్క్
  3. ఆరాధనల్లో షిర్క్
  4. రోజువారి పనుల్లో షిర్క్

3వ. అధ్యాయం – షిర్క్ లోని కీడు, తొహీద్ లోని మేళ్ళు [PDF] [13p]

  1. బహుదైవారాధన క్షమార్హం కాదు
  2. షిర్క్ కు దృష్టాంతం
  3. షిర్క్ మహాపరాధం
  4. సాఫల్యానికి మార్గం తౌహీద్
  5. అల్లాహ్ షిర్క్ ను లెక్కచెయ్యడు
  6. ఆత్మావస్థలో తౌహీద్ అంగీకారం
  7. షిర్క్ ధృవపత్రం కాజాలదు
  8. ‘మరుపు సాకు’ స్వీకరించబడదు
  9. ప్రవక్తల, గ్రంథాల మౌలిక బోధన
  10. ఏకదైవారాధన మరియు మన్నింపు

4వ. అధ్యాయం – అగోచర జ్ఞానంలో షిర్క్ ఖండన [PDF] [10p]

  1. షిర్క్ ఖండన
  2. అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది
  3. అగోచర జ్ఞానముందని చెప్పేవాడు అబద్ధాల కోరు
  4. అగోచరాల జ్ఞానం
  5. అల్లాహ్ ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
  6. లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
  7. ప్రవక్తల అసలు మిషన్
  8. ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
  9. అగోచర జ్ఞానం గురించి ప్రవక్త ప్రవచనం
  10. మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
  11. అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసిన వారు ఎవరూ లేరు

5వ. అధ్యాయం – అధికారం వినియోగంలో షిర్క్ ఖండన [PDF] [15p]

  1. అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవడం
  2. లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
  3. అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు
  4. అల్లాహ్ నే మొరపెట్టుకోండి
  5. అనుమతితి లేనిదే సిఫారసు లేదు
  6. సిఫారసు రకాలు
  7. గౌరవభావ సిఫారసు అసాధ్యం
  8. ప్రేమ కలిగిన సిఫారసు అసాధ్యం
  9. అనుమతితో సిఫారసు
  10. రుజుమార్గం
  11. అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు
  12. అల్లాహ్ పైనే భారం మోపాలి
  13. బంధుత్వముూ పనికిరాదు

6వ. అధ్యాయం – ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం [PDF] [16p]

  1. ఆరాధన నిర్వచనం
  2. ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం
  3. సజ్జహ్ (సాప్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే
  4. దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్
  5. అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి
  6. దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం
  7. అధికారం కేవలం అల్లాహ్ ది మాత్రమే
  8. ఇష్టమొచ్చిన దేవుళ్ళ పేర్లు పెట్టడం షిర్క్
  9. స్వయం కల్పిత ఆచారాలు షిర్క్
  10. ప్రజలను తమ గౌరవార్థం నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం
  11. విగ్రహాల ఆస్థానాల ఆరాధనా భావం కూడా షిర్క్
  12. దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం
  13. ప్రళయ సూచనలు
  14. ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని
  15. విగ్రహాల ప్రదక్షిణ

7వ అధ్యాయం – ఆచార వ్యవహారాలలో షిర్క్ నిషిద్ధం [PDF] [29p]

  1. షైతాను కలతలు
  2. సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు
  3. వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు
  4. పశువుల విషయంలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు
  5. హలాల్ హరామ్ (ధర్మం-అధర్మం)
  6. నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్
  7. జ్యోతిష్కుడు మాంత్రికుడు,…..
  8. జ్యోతిష్య సంఖ్యా శాస్త్రాలపై విశ్వసించే పాపం
  9. శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు
  10. అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి
  11. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు
  12. అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి
  13. కేవలం ‘అల్లాహ్ తలిస్తే’ అనండి
  14. దైవేతరుల పై ప్రమాణం చేయడం షిర్క్
  15. మ్రొక్కుబడుల గురించి ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) తీర్పు
  16. సజ్దహ్ కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను గౌరవించండి
  17. ఎవరినైనా దాసుడనిగానీ, దాసి అని గానీ అనడం.
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించే విధానం
  19. ‘సయ్యద్’ పదానికి రెండు అర్థాలు
  20. చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
  21. ఘోరమైన ఐదు పాపాలు
  22. తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

[సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు]

ముఖ్యాంశాలు :

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబందించిన సామూహిక నమాజులకు హాజరు కావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతివంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగి పోయినా, చీకటి వల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులగానే పరిగణించ బడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన అల్లాహ్ తరుఫు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడినది.

189 వ అధ్యాయం – మస్జిదులకు కాలి నడకన వెళ్ళటం – హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

http://wp.me/p2lYyT-fA

Related Links:

 

తౌబా (పశ్చాత్తాపం) [పుస్తకం]

repent-too-late

పశ్చాత్తాపం- Toubah – Repentence
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [34 పేజీలు]
[2 MB]

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

విషయ సూచిక :

క్రింది చాఫ్టర్లు PDF లింకులుగా ఇవ్వబడ్డాయి

  1. తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత [11p]
  2. తౌబా నిబంధనలు [3p]
  3. తౌబా విధానాలు [3p]
  4. సత్యమైన తౌబా [3p]
  5. తౌబా చేయుటకు సహాయపడే విషయాలు [3p]
  6. పాప పరిహారాలు [4p]
  7. ప్రశ్నోత్తరాలు [9p]
    1. పాపాలు చాలా ఎక్కువగా ఉంటే ఎలా తౌబా చేయాలి?
    2. స్నేహితులు అడుకున్నప్తుడు ఎలా తౌబా చేయాలి?
    3. స్నేహితులు అవమానపరుస్తారన్స్న భయంలో ఎలా తౌబా?
    4. తౌబా చేసిన తర్వత అదే తప్పు మళ్ళీ జరిగితే ఎలా?
    5. ఒక పాపం చేస్తూ వేరే పాపం నుండి తౌబా చేయవచ్చా?
    6. గతంలో తప్పిపోయిన నమాజు, ఉపవాసాలు… ఎలా?
    7. సొమ్ము దొంగతనం చేసిన ఉంటే ఎలా తౌబా చేయాలి?
    8. వ్యభిచారానికి పాల్యడిన వ్వక్తి ఎలా తౌబా చేయాలి?
    9. వివాహానికి ముందు జరిగిన తప్పు గురించి చెప్పాలా?
    10. పురుషులు పరస్పరం, స్త్రీలు పరస్పరం చెడుకు పాలడితే ఎలా?

ప్రియ సోదరా/సోదరీ ! ఒక తల్లి తన చంటి పిల్ల పట్ల చూపే ప్రేమకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అల్లాహ్ తన దాసుల పట్ల చూపుతాడు  అని గుర్తుంచుకో !! తన తౌబాలో  సత్యవంతుడైన వ్యక్తిని అల్లాహ్ తప్పక మన్నిస్తాడు. వ్యక్తిగతంగా తౌబా ద్వారం చివరి శ్వాస వరకు ఉంది. సామాన్యంగా ప్రళయానికి ముందు పశ్చిమ దిశ నుండి సూర్యోదయం అయ్యే వరకు ఉంది.

అల్లాహ్ మనందిరికీ క్షమాబిక్ష కోరుతూ, తౌబా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు గాక! అమీన్ !!

ఎవరైనా ఏదైనా పాపకార్యానికి పాల్పడటమో లేదా తనకు తాను అన్యాయం చేసుకోవడమో జరిగి ఆ తర్వాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే, అలాంటి వాడు అల్లాహ్ ను క్షమాశీలుడు, అపార కరుణాప్రదాతగా పొందగలడు. (నిసా 4: 110).

తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత

సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. కరుణ, శాంతి కురువుగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై.

ఒక వ్యక్తి ఇబ్రాహీం బిన్ అద్ హమ్ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి నేను పాపాలు చేసి స్వయంగా నాపైనే అన్యాయం చేసుకున్నాను. నాకేదైనా ఉపదేశం చేయండి అని విన్నవించుకున్నాడు. ఇబ్రాహీం చెప్పారుః “ఐదు విషయాలు నీవు పాటించగలిగితే పాపాల వల్ల నీకు నష్టం కలగదు (నీతో పాపం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది). అప్పుడు అవేమిటి? అని ఆ వ్యక్తి అడిగాడు. ఇబ్రాహీం ఇలా సమాధానం చెప్పారు:

ఇబ్రాహీం:  పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ ప్రసాదించే ఆహారం తినడం మానుకో.

ఆ వ్యక్తిః  ‘అయితే నేను ఎక్కడి నుండి తినాలి? ఈ ధర్తిపై ఉన్నదంతా అల్లాహ్ దే కదా?’

ఇబ్రాహీం: అల్లాహ్ ఇచ్చిన ఆహారం తిని, అల్లాహ్ అవిధేయతకు పాల్పడటం (పాపం చేయటం) న్యాయమేనా?

ఆ వ్యక్తిః  ‘కాదు’. ‘అయితే రెండవదేమిటి’?

ఇబ్రాహీం: నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ యొక్క భూమిపై నివసించకు.

ఆ వ్యక్తిః  ‘ఇది మొదటి దానికంటే మరీ కష్టమైనది, అయినా నేను ఎక్కడ ఉండాలి’?

ఇబ్రాహీం: అల్లాహ్ యొక్క భూమిపై ఉండి, దుష్కార్యానికి పాల్ప- డటం మంచిదేనా?

ఆ వ్యక్తిః  మంచిది కాదు. మూడవది ఏమిటో తెలుపండి.

ఇబ్రాహీం:     నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ చూడని ప్రాంతములోకి వెళ్ళు.

ఆ వ్యక్తిః  ఎక్కడికి వెళ్ళాలి? రహస్యబహిరంగాలన్నియూ ఆయనకు తెలుసు కదా!!

ఇబ్రాహీం:     నీవు అల్లాహ్ ప్రసాదించిన ఆహారం తింటూ, ఆయన ధర్తిపై నివసిస్తూ, ఆయన చూస్తూ ఉండగా పాపానికి ఒడిగడతావా?

ఆ వ్యక్తిః  అలా చేయను. అయితే నాల్గవది ఏమిటి?

ఇబ్రాహీం: ప్రాణంతీసే దూత వచ్చినప్పుడు “ఇప్పుడే నా ప్రాణం తీయకు, తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు నాకు వ్యవధి ఇవ్వు” అని చెప్పు.

ఆ వ్యక్తిః  అతడు నా మాట వినడు, నాకు వ్యవధి ఇవ్వడు కదా?

ఇబ్రాహీం:    తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు చావు నుండి తప్పించుకునే స్థోమత లేనివాడివి నీవు ఎలా పాపానికి ముందు అడుగు వేస్తావు?

ఆ వ్యక్తిః  సరే. ఐదవదేమిటి?

ఇబ్రాహీం:   నరకపాలకులు నిన్ను నరకంలోకి తీసుకుపోవటానికి వచ్చినప్పుడు నీవు వారి వెంట వెళ్ళకు.

ఆ వ్యక్తిః  వారు నన్ను వదలరు, నా అర్థింపును ఆలకించరు.

ఇబ్రాహీం: అలాంటప్పుడు నీకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది?

ఆ వ్యక్తిః  ఇక చాలండి. నేను అల్లాహ్ తో పశ్చాత్తాప భావంతో స్వచ్ఛమైన క్షమాపణ కోరుకుంటాను. (అంటే తౌబా, ఇస్తిగ్ఫార్ చేస్తాను).

 అల్లాహ్ విశ్వాసులందరికీ తౌబా ఆదేశమిచ్చాడుః

విశ్వాసులారా! మీరంత కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమా- భిక్షన వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు[. (నూర్ 24: 31).

తన దాసుల్లో రెండు రకాలవారున్నారు అని అల్లాహ్ తెలిపాడుః

  • 1-పాపం జరిగిన వెంటనే తౌబా చేయువారు.
  • 2-తౌబా చేయకుండా, తమ అత్మలపై అన్యాయం చేయువారు.

తౌబా చేయనివారే అన్యాయం చేయువారు[. (హుజురాత్ 49:11).

మానవుడు ఎల్లప్పుడూ తౌబా అవసరం గలవాడు. ఎందుకనగ అతని నుండి ఏదో అపరాధం జరుగతూ ఉంటుంది. అయితే అపరాధుల్లో తౌబా చేయువారే మంచివారు.

తౌబా చేయడం వల్ల ఇహపరాల్లో అనేక లాభాలు 

  • మనిషి తౌబా చేసి తన ప్రభువుకు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు అవుతాడు. (సూర బఖర 2: 222).
  • సాఫల్యానికి, మోక్షానికి మార్గం తౌబా. (సూర్ నూర్ 24: 31)
  • ఆ వ్యక్తి పట్ల అల్లాహ్ చాలా సంతొషిస్తాడు. (సహీ ముస్లిం 2675)
  • ఇహపరాల్లో సుఖసంతోషాలు ప్రాప్తమవుతాయి. (హూద్ 11: 3).
  • పాపాల ప్రక్షాళనం జరుగుతుంది. (జుమర్ 39: 53, తహ్రీమ్ 66: 8).
  • పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి. (ఫుర్ఖాన్ 25: 70).
  • వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, సంతానం ఇంకా అనేక శుభాలు వర్థిల్లుతాయి మరియు శత్రువులపై బలం పుంజుకుంటారు. (హూద్ 11: 52, నూహ్ 71: 10 – 12).

అనేక మందికి గురి అయిన ఒక పీడ ఏమనగ, నిర్లక్ష్యం కారణంగా వారు రేయింబవళ్ళు పాపాలకు పాల్పడుతూ ఉంటారు, మరికొందరు పాపాన్ని అతిచిన్న చూపుతో చూస్తూ, దానిని అల్పమైనదిగా భావిస్తారు. దానిని ఏ మాత్రం లక్ష్య పెట్టరు.

కాని మన ప్రవక్త సహచరుల దృష్టిలో పాపం యొక్క భయం ఎలా ఉండెనో ఈ క్రింది హదీసు ద్వారా గమనించండిః

قَالَ عَبْدُ اللهِ بْنُ مَسْعُودٍ : إِنَّ الْمُؤْمِنَ يَرَى ذُنُوبَهُ كَأَنَّهُ قَاعِدٌ تَحْتَ جَبَلٍ يَخَافُ أَنْ يَقَعَ عَلَيْهِ وَإِنَّ الْفَاجِرَ يَرَى ذُنُوبَهُ كَذُبَابٍ مَرَّ عَلَى أَنْفِهِ. {قَالَ بِهِ هَكَذَا فَطَارَ}

ఇబ్నుమస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః నిశ్చయంగా విశ్వాసుడు తన పాపాలను ఎలా భావిస్తాడంటే అతడు ఓ పర్వతం క్రింద కూర్చొని ఉన్నాడు, అది అతనిపై అప్పుడో, ఇప్పుడో పడనుందని భయపడుతూ ఉంటాడు. దుర్మార్గుడు తన పాపాల్ని తన ముక్కుపై వాలిన ఒక ఈగ మాదిరిగా భావిస్తాడు, అతడు తన చెయితో ఇలా అంటాడు అది లేచిపోతుంది. (బుఖారి 6308. తిర్మిజి 2497).

జ్ఞానంగల విశ్వాసుడు పాపం చిన్నదేకదా అని చూడడు, పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనదో, దానిని చూస్తాడు. అయినా మానవుడు నిరపరాధి కాడు, కనుక అల్లాహ్ అతని కొరకు తౌబా ద్వారం తెరచి ఉంచాడు. తౌబా చేయాలని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం శ్రద్ధగా చదవండిః

]ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

((التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لاَ ذَنْبَ لَهُ))

“పాపం చేసిన తర్వాత (పశ్చాత్తాపపడి) తౌబా చేసే వ్యక్తి, ఏ మాత్రం పాపం లేని వ్యక్తిగా మారుతాడు”. (ఇబ్ను మాజ).

ఇంతే కాదు, అతడు తన తౌబాలో సత్యవంతుడైతే అల్లాహ్ అతని పాపాల్ని పుణ్యాల్లో మారుస్తాడు. చదవండి ఈ ఆదేశం:

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటివారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

ముస్లిం చేసే తప్పుల్లో అతి పెద్ద తప్పు; తౌబా చేయడంలో జాప్యం చేయడం.

 కొంతమంది ఓ తప్పు చేస్తారు. అలా ఒక నిషిద్ధ కార్యానికి పాల్పడ్డారని తెలిసి కూడా తౌబా చేయడంలో జాప్యం చేస్తారు. వాస్తవానికి మృత్యువు ఆసన్నమయ్యే కాలాన్ని మనిషి ఎరుగడు గనక పాపాల మన్నింపుకై తౌబా చేయడంలో తొందరపడుట తప్పనిసరి.

తనకు గుర్తున్నవి, గుర్తు లేనివి అన్ని రకాల పాపాల మన్నింపుకై అధికంగా తౌబా చేస్తూ, అల్లాహ్ వైపునకు మరలుట తప్పనిసరి. అలాగే పాపాలు ఎంత ఘోరమైనవి అయినా సరే, తౌబా చేయడంలో తొందరపడుట కూడా అనివార్యం. (కొందరు తౌబా చేయడంలో తొందరపడరు, లేనిపోని తుచ్ఛమైన భావనాలకు గురి అయి, మరింత ఆలస్యమే చేస్తూ పోతారు, అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాలి) ‘మీ ప్రభువుని నేనే, మీ పూజలకు అర్హుడిని నేనే’ అన్న వాదన కంటే ఘోరమైన కుఫ్ర్, అవిశ్వాసం, తిరస్కారం మరొకటి లేదు. ఇలాంటి వాదనయే ఫిర్ఔన్ చేశాడు. అతని మాట ఖుర్ఆనులో ఇలా పేర్కొనబడినదిః ]ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు[. (ఖసస్ 28: 38). మరోచోట అతని వాదన ఇలా వచ్చిందిః ]నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును[. (నాజిఆత్ 79: 24). అతను ఇంతటి ఘోరాతిఘోరమైన వాదనలు చేసినప్పటికీ, పరమప్రభువైన అల్లాహ్, ప్రవక్త మూసా అలైహిస్సలాంను అతని వైపునకు పంపుతూ ఇలా ఆదేశించాడుః

ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, అతడు హద్దులు మీరాడు. అతనికి ఇలా బోధించుః పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే, నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా?[. (నాజిఆత్ 79: 17-19).

అతడు మూసా అలైహిస్సలాం మాటను స్వీకరించి, స్వచ్ఛమైన తౌబా గనక చేసి ఉంటే, అల్లాహ్ తప్పక అతడ్ని క్షమించేవాడు.

ఇది కూడా తెలుసుకో! ఎవరయినా ఒక పాపం నుండి తౌబా చేసిన తర్వాత మళ్ళీ అదే పాపానికి పాల్పడితే, మళ్ళీ తౌబా చేయాలి. తప్పు జరిగినప్పుడల్లా తౌబా చేస్తూ ఉండాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు.

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

 కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు [. (జుమర్ 39: 53).

మరికొందరు కొన్ని రకాల పాపాల నుండి తౌబా చేయరు. దానికి కారణం: ప్రజల మాటల, వదంతుల భయంతో, లేదా తాను ఏ సమాజంలో జీవితం గడుపుతున్నాడో అందులో అతని ప్రతిష్ఠకు ముప్పు కలుగుతుందన్న భయంతో, లేదా తన ఉద్యోగం పోతుందన్న భయంతో. అయితే ఇలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడు వీటిని మరవవద్దుః చనిపోయిన తర్వాత సమాధిలో మరియు తన ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు తాను ఒంటరిగానే ఉంటాడు. చివరికి ప్రభువు అతడ్ని అతని ఆచరణ గురించి ప్రశ్నించినప్పుడు ఏ ఒక్కడూ అతని వెంట ఉండడు. ఆ కరుణామయుని భయంతో తౌబా చేయకుండా, ఇతరుల భయంతో ఇంకెన్నాళ్ళు పాపపుజీవితమే గడుపుతూ ఉందాము ఆలోచించండి.

మరికొందరు తౌబా చేయకపోవడానికి కారణం; ఎవరో అతని తౌబాకు అడ్డుపడుతున్నారని, లేదా ఎవరో దుష్చేష్టలను ఆకర్షవంతగా, సరైనవిగా చూపిస్తున్నారని. అయితే వారు కూడా అల్లాహ్ యందు అతనికి ఏ మాత్రం ఉపయోగపడరు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ అతను స్వచ్ఛమైన తౌబా చేసి, ఏదైనా దుష్కార్యాన్ని వదులుకుంటే, తప్పక అల్లాహ్ దానికి బదులుగా అతనికి ఏదైనా మేలైనదానిని నొసంగుతాడు.

 మరికొందరు తప్పుపై తప్పు చేస్తునే ఉంటారు. అలా చేయకండి అని బోధ చేసినప్పుడు ‘అల్లాహ్ క్షమించేవాడు’ అని బదులిస్తారు. ఇది మూర్ఖత్వం, పిచ్చివాదం. ఇలా షైతాన్ వారిని దుర్మార్గ వలలోనే చిక్కుకొని ఉండి, బయటకు రాకుండా చేస్తున్నడాని తెలుసుకోవాలి. అల్లాహ్ అపార కరుణాప్రదాత, క్షమించేవాడు అన్నది వాస్తవమే. కాని ఎవరి కొరకు అన్నది కూడా తెలుసుకోవాలి కదా! అయితే తెలుసుకోః పాపాలను వదలి, సత్కార్యాలు చేసేవారి కొరకు అల్లాహ్ కారుణ్యం చాలా సమీపంలో ఉంది. మంకుతనంతో దుష్కార్యాలకు పాల్పడేవారి కోసం కాదు. అల్లాహ్ ఆదేశాన్ని గమనించండిః

నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది[. (ఆరాఫ్ 7: 56).

 అల్లాహ్ కరుణించే, క్షమించేవాడు అయినప్పటికీ, దుష్టులను శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ ఈ ఆదేశం చదవండిః

నేను చాలా క్షమించేవాడిని, కరుణించేవాడిని అనీ మరియు దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధకరమైన శిక్షే అని నా దాసులకు తెలియజేయుము[. (ఆరాఫ్ 7: 56).

 సోదరులారా! తౌబా చేయక పోవడానికి లేదా చేయడంలో ఆలస్యం అవడానికి సంబంధించిన కొన్ని కారణాలు, వాటి పరి- ష్కారాలు  గత పేజిలలో తెలిపాము. క్రింద తౌబా నిబంధనలు తెలుసుకుందాము.

తౌబా నిబంధనలు

తౌబా నిబంధనలు అంటేః ఒక మనిషి ఏదైనా పాపం నుండి తౌబా చేస్తున్నప్పుడు, అతని తౌబాను అల్లాహ్ స్వీకరించాలంటే,  ఈ మూడు నిబంధనలు ఉన్నాయి. అప్పుడే అది నిజమైన తౌబా అగును. వాటిని ధర్మ వేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా సేకరించారు.

1- ఏ పాపం నుండి తౌబా చేస్తున్నాడో ఆ పాపాన్ని విడనాడాలి.

2- ఆ పాపం గుర్తుకు వచ్చినప్పుడల్లా సిగ్గుతో కుమిలిపోవాలి.

3-ఇక ముందు ఆ పాపం చేయకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి.

పాపం యొక్క సంబంధం మానవుని మరియు అతని ప్రభువు మధ్య ఉంటే, పై మూడు నిబంధనలు పాటించాలి. ఒకవేళ పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే, పై మూడిటితో పాటు ఈ నాల్గవది కూడా పాటించాలిః

4- ఎవరిపైనా ధన, మాన, ప్రాణ సంబంధమైన హక్కులో ఏదైనా అన్యాయం చేసి ఉంటే, అతని హక్కు అతనికి తిరిగి ఇవ్వాలి. లేదా అతనితో క్షమాపణ కోరుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله : مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ الْيَوْمَ قَبْلَ أَنْ لَا يَكُونَ دِينَارٌ وَلَا دِرْهَمٌ إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా తన సోదరుని మానమర్యాదలకు సంబంధించిన విషయంలోగాని లేదా మరే విషయంలోగాని ఏదైనా దౌర్జన్యానికి/ అన్యాయానికి పాల్పడి ఉంటే, దీనార్లుగాని, దిర్హములుగాని (డబ్బు, ధనాల ప్రయోజనం) ఉండని ఆ రోజు రాక ముందు, ఈ రోజే అతను (హక్కుదారుని హక్కు ఇచ్చేసి, లేదా అతని ద్వారా మాఫీ పొంది) ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. (ఇలా చేయని పక్షంలో ఆ రోజు పాప ప్రక్షాళన పద్ధతి ఇలా ఉంటుందిః) దౌర్జన్యపరుని వద్ద సత్కార్యాలు ఉంటే, అతని దౌర్జన్యానికి సమానంగా సత్కార్యాలు అతని నుండి తీసుకొని (పీడుతులకు పంచడం జరుగుతుంది). ఒకవేళ అతని వద్ద సత్కార్యాలు లేకుంటే పీడుతుని పాపాలు తీసుకొని అతనిపైన మోపడం జరుగుతుంది”. (బుఖారి 2449).

ఏ బాధితుడైనా ఈ హదీసు తెలిసిన తర్వాత తన శక్తిమేర ప్రయత్నం చేసినప్పటికీ, తాను బాధించిన వ్యక్తిని కలుసుకోలేక, లేదా అతని హక్కు ఇవ్వలేక పోతే, ఈ స్థితిలో కేవలం అల్లాహ్ మన్నింపుకై ఆశించాలి. అల్లాహ్ మనందరిని తన కరుణ ఛాయలో తీసుకొని మన్నించుగాక.

హక్కుల్లో

 గత పేజిల్లో మాన, ప్రాణ, ధన సంబంధిత హక్కుల విషయం వచ్చింది గనక, వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

1-  ధనసంబంధిత హక్కుః ధనానికి సంబంధించిన హక్కు ఎలాగైనా హక్కుదారునికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదా అతడ్ని కలుసుకొని మాఫీ చేయించుకోవాలి. ఒకవేళ అతని చిరునామ తెలియక, లేదా సాధ్యమైనంత వరకు వెతికినప్పటికీ అతడ్ని పొందలేకపోతే, లేదా ధన పరిమాణం గుర్తు లేకుంటే, ఏదైనా ఒక పరిమాణం నిర్ణయించుకొని అతని తరఫున దానం చేయాలి.

ఒకటిః (ప్రాయశ్చితంగా, దౌర్జన్య ప్రమాణంలో) ఏదైనా ధనం కోర- వచ్చు. రెండవదిః దౌర్జన్య ప్రమాణంలో ప్రతీకారం తీసుకోవచ్చు. మూడవదిః మాఫీ చేయవచ్చు. ఒకవేళ హక్కుగల వ్యక్తి తెలియకుంటే అతని తరఫున దానం చేయాలి. అతని కొరకు దుఆ చేయాలి.

2- శారీర సంబంధిత హక్కుః శారీరకంగా ఎవరిపైనైనా ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, దౌర్జన్యపరుడు పీడితునికి లొంగిపోవాలి. అతడు తన హక్కు ఈ క్రింది మూడు పద్ధతుల్లో ఏదో ఒక రకంగా తీసుకోవచ్చుః

3- మానమర్యాద హక్కుః ఇది ఎన్నో రకాలుగా ఉంటుందిః పరోక్షంగా నిందించుట, ఏదైనా అపనింద మోపుట, చాడీలు చెప్పుట, కలసిఉన్నవారి మధ్య విభేదాలు సృష్టించి వారిని విడదీయుట వగైరా. ఈ రకంగా ఎవరినైనా బాధించి ఉంటే, అతని వద్దకు వెళ్ళి మన్నింపు కోరుకోవాలి. శక్తానుసారం వారికి చేసిన కీడుకు బదులుగా మేలు చేయాలి. వారి కొరకు దుఆ చేయాలి.

తౌబా విధానాలు

పాపాల్లో కొన్ని మహాఘోరమైన పాపాలున్నాయి. వాటికి పాల్పడినవారు ఎలా తౌబా చేయాలి అన్న విషయమే క్రింది భాగంలో తెలుసుకోబుతున్నాము. అయితే చాలా శ్రద్ధగా చదవండి, ఇతరులకు ప్రయోజనం కలగజేయండి.

1- హంతకుని తౌబాః ఉద్ధేశపూర్వకంగా ఎవరినైనా చంపిన వ్యక్తిపై మూడు రకాల హక్కులుంటాయి.

ఒకటి: అల్లాహ్ కు సంబంధించిన హక్కుః అంటే సత్యమైన తౌబా చేయాలి. ఇందులో పైన తెలిపిన మూడు/నాలుగు నిబంధనలు వస్తాయి.

రెండవది: హతుని వారసుల హక్కుః హంతకుడు వారికి లొంగిపోవాలి. వారు ఇతడి నుండి మూడిట్లో ఏదైనా ఒక రకంగా తమ హక్కు తీసుకుంటారు. A: ప్రాయశ్చితంగా అతని నుండి ధనం తీసుకుంటారు. లేదా B: అతడ్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు. లేదా C: అతడ్ని మన్నించి వదలుతారు.

మూడవది: హతుని హక్కుః ఈ హక్కు అతనికి ఇహలోకంలో ఇవ్వరాదు.

అందుకని హంతకుడు తన తౌబాలో సత్యవంతుడై, తనకు తాను హతునివారసులకు అప్పగిస్తే, అల్లాహ్ అతని ఆ అపరాధాన్ని మన్నిస్తాడు. హతునికి ప్రళయదినాన మేలైన ప్రతిఫలం నొసంగుతాడు.

2-  వడ్డీ తినే, తీసుకునే వారి తౌబాః వడ్డీ తీసుకొనుట, తినుట నిషిద్ధం అని తెలిసిన తర్వాత, తౌబా చేయు వ్యక్తి, వడ్డీ తీసుకోవడం మరియు తినడం మానుకోవాలి. ఇక ఎప్పుడూ తీసుకోకుండా, తినకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి. ఇంతకు ముందు ఏదైతే తిన్నాడో, తీసుకున్నాడో అది గుర్తుకు వచ్చినప్పుడు ‘ఛీ’ అని సిగ్గు చెందాలి. ఈ విషయాల్ని పాటించినప్పుడే అతని తౌబా నిజమగును. అతను వడ్డీ ద్వారా సంపాదించిన ధనం గురించి పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నవి. అయితే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా, షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ సఅదీ మరియు ఇబ్ను ఉసైమీన్ రహిమహుముల్లాహ్ ఇలా చెప్పారుః

తౌబా చేయటానికి ముందు తీసుకున్న వడ్డీ అతనిదే అయి యుంటుంది. అతను దానిని తన ఏ అవసరాలకైనా సరే ఉపయోగించ వచ్చును. అందులో ఏలాంటి అభ్యంతరం లేదు. ఏ వడ్డీ సొమ్ము వచ్చేది ఉందో దానిని తీసుకోకుండా అసలు సొమ్ము మాత్రమే తీసుకోవాలి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు, వడ్డీని నిషిద్ధం (హరాం) చేశాడు. కనుక తన ప్రభువు యొక్క ఈ హితబోధ అందిన వ్యక్తి, ఇక ముందు వడ్డీ తినడం త్యజిస్తే, పూర్వం జరిగిందేదో జరిగింది, దాని పరిష్కారం అల్లాహ్ చూసుకుంటాడు[. (బఖర 2: 275).

సత్యమైన తౌబా

చెడును వదులుకునేవారు సామాన్యంగా ఏదైనా కారణంగానే వదులుకుంటారు. కాని తన తౌబా అంగీకరించబడాలి అని కాంక్షించే వ్యక్తి, అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే తౌబా చేయుట తప్పనిసరి.

ఎవరైనా తన పాపం, తన ప్రఖ్యాతిలో మరియు ఉద్యోగంలో అడ్డు పడుతుందన్న భయంతో పాపాన్ని విడనాడితే అది తౌబా అనబడదు.

ఎవరు తన ఆరోగ్యం చెడిపోతుందని లేదా (ఏయిడ్స్) లాంటి వ్యాదికి గురి కావలసి వస్తుందన్న భయంతో ఏదైనా దుష్చేష్టను వదులుకుంటే అది తౌబా అనబడదు.

ఎవరైతే దొంగతనం చేసే శక్తి లేనందుకు, పోలీసు, లేదా కాపలాదారుని భయానికి దొంగతనం మానుకుంటే అది తౌబా కాదు.

డబ్బు లేనందుకు మత్తు సేవించడం, మాధకద్రవ్యాలు వాడటం మానుకుంటే అది తౌబా అనబడదు.

తన మనస్ఫూర్తిగా కాకుండా, వేరే ఏదైనా కారణం వల్ల, ఉదాహరణకు తప్పు చేసే శక్తి లేనందుకు తప్పు చేయకుంటే అది తౌబా అనబడదు.

తౌబా చేయు వ్యక్తి మొదట తప్పు యొక్క చెడును గోచరించాలి. ఉదాహరణకుః స్వచ్ఛమైన తౌబా చేసే వ్యక్తి, జిరిగిన ఆ తప్పును తలచి తృప్తి చెందడం, సంతోషించడం అసంభవం, లేక భవిష్యత్తులో తిరిగి చేయాలని కాంక్షించడం కూడా అసంభవం.

అదే విధంగా ఏ చెడు నుండి తౌబా చేశాడో, ఆ చెడుకు తోడ్పడే సాధనాలన్నిటికీ దూరంగా ఉండడం తప్పనిసరి. ఉదాహరణకుః మత్తు సేవించడం, సినిమాలు చూడడం నిషిద్ధం అని తెలిసిన తర్వాత, వాటి నుండి తౌబా చేసిన వ్యక్తి మత్తు మరియు సినిమాలకు సంబంధించిన పరికరాలన్నిటికి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రాంతంలో వెళ్ళ కూడదు. స్నేహితుల్లో వాటికి బానిస అయినవారి నుండి దూరం ఉండాలి.

 అనేక మంది చెడు పనులకు అలవాటు పడేది చెడు స్నేహితుల ద్వారానే. అయితే ఇక్కడ చెడు స్నేహితులను వదలుకోవడం కష్టంగా ఏర్పడినప్పుడు ప్రళయదినాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడి దుష్మిత్రులు అక్కడ పరస్పరం శత్రువులవుతారు, శపించుకుంటారు. (చూడండి సూర జుఖ్రుఫ్ 43: 67: الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు  శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు). అందుకే తౌబా చేసిన వ్యక్తి తన పాత స్నేహితులను, సత్కార్యాల వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే వారికి దూరంగానే ఉండాలి.

 తౌబా చేసిన వారిలో కొందరు తన పాత మిత్రులను సత్కార్యం వైపునకు పిలిచే సాకుతో మళ్ళీ వారితోనే కలసిపోవటానికి షైతాన్ ప్రేరేపిస్తాడు. స్వయంగా వారు కొత్తగా సత్కార్య మార్గాన్ని అవలంబించారు గనక, తమ మిత్రులపై మంచి ప్రభావం చూపలేకపోతారు. ఇలా ఇది పాత పాపానికి పాల్పడడానికి కారణం అవుతుంది. అందుకు అతను వారికి బదులుగా మంచి మిత్రుల్ని ఎన్నుకోవాలి. వారు అతని మంచికై తోడ్పడతారు, సన్మార్గంపై ఉండడానికి బలాన్నిస్తారు.

తౌబా చేయుటకు సహాయపడే విషయాలు

1- సంకల్పశుద్ధి, స్వచ్ఛత అల్లాహ్ కొరకే ఉండాలి:- పాపం వదలడానికి ఇది ప్రయోజనకరమైన ఆధారం. దాసుడు తన ప్రభువు కొరకే చిత్తశుద్ధి చూపినప్పుడు, పశ్చాత్తాపపడి, క్షమాభిక్షలో సత్యవంతుడైనప్పుడు అల్లాహ్ ఆ విషయంలో అతనికి సహాయపడతాడు. తౌబా చేయడానికి అతడ్ని అడ్డగించే వాటిని అతని నుండి దూరంగా ఉంచుతాడు.

2- మనుస్సును నిర్బంధించుటః- ఒక వ్యక్తి పాపం చేయకుండా తన మనస్సును నిర్బంధించాడంటే అల్లాహ్ అతనికి సహాయపడతాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము[. (అన్కబూత్ 29: 69).

3- పరలోక ధ్యాసః- అల్పమైన ఇహలోకాన్ని, అతిత్వరలో నశించే ఈ ప్రపంచాన్ని తలచి, విధేయులకు పరలోకంలో సిద్ధంగా ఉన్న భోగభాగ్యలు, అవిధేయుల గురించి ఉన్న కఠిన శిక్షను తలచుకుంటూ ఉంటే అపరాధానికి గురి కాకుండా ఉండడానికి ఇది ముఖ్యమైన అడ్డుగా నిలుస్తుంది.

4-ప్రయోజనకరమైన వాటిలో కార్యమగ్నుడై, ఒంటరితనం, తీరిక లేకుండా ఉండుటః- పాపాల్లో పడటానికి ముఖ్య కారణం తీరిక. ఇహపరాల్లో లాభం చేకుర్చేవాటిలో మనిషి నిమగ్నుడై ఉంటే, దుర్మార్గం చేయడానికి తీరిక పొందడు.

5-ఉద్రేకానికి గురి చేసే విషయాలకు, పాపాన్ని గుర్తు చేసే వాటికి దూరంగా ఉండాలిః- పాపానికి గురిచేసే కారణాల్ని ప్రేరేపించే వాటికి, సినిమాలకు, పాటలకు, అశ్లీల రచణలకు, నీతిబాహ్యమైన మ్యాగ్జిన్స్ (పత్రికల)కు ఇలా దుర్వాంఛల్ని ఉత్తేజ పరిచే వాటికి దూరంగా ఉండాలి.

6-సజ్జనులకు దగ్గరగా, దుర్జణులకు దూరంగా ఉండాలిః- సజ్జనుల తోడు మంచి చేయుటకు సహాయపడుతుంది, పుణ్యాత్ములను అనుసరిం- చాలని ప్రోత్సహిస్తుంది, దుర్మార్గానికి, చెడుకు అడ్డుపడుతుంది.

7-దుఆః- మహాప్రయోజనకరమైన చికిత్స ఇది. దుఆ విశ్వాసుల ఆయుధం. అవసరాలు తీర్చే బలమైన హేతువు. అల్లాహ్ ఆదేశాలను చదవండిః

నీ ప్రభువు ఇలా అంటున్నాడుః నన్ను ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను[. (మోమిన్ 40: 60).

విలపిస్తూ, గోప్యంగానూ మీ ప్రభువును వేడుకోండి. [. (ఆరాఫ్ 7:55).

నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి. నన్ను విశ్వసించాలి. ఇలా వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది[. (బఖర 2: 186).

పాప పరిహారాలు

అల్లాహ్ తన దాసులపై విధించిన ప్రార్థనల్లో తన గొప్ప దయ, కరుణతో కొన్నిటిని చిన్నపాపాల పరిహారానికి సాధనంగా చేశాడు. వాటిలో కొన్ని ఈ క్రిందివిః

1-విధిగా ఉన్న ఐదు పూటల నమాజులు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْخَطَايَا

“మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అతను అందులో ప్రతి రోజు ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని శరీరంపై మురికి ఉంటుందా”? అని ప్రవక్త అడిగారు. దానికి సహచరులు చెప్పారుః ఎలాంటి మురికి మిగిలి ఉండదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “ఐదు పూటల నమాజు సంగతి కూడా ఇలాంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు”. (ముస్లిం 667, బుఖారి 528).

2-జుమా నమాజు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ

“ఎవరైనా చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు కొరకు వచ్చి, అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా జుమా ప్రసంగం వింటే, వెనకటి జుమా నుండి ఈ జుమా వరకు, అదనంగా మూడు రోజుల పాపాల మన్నింపు జరుగుతుంది. (ముస్లిం 857).

3- రమజాను ఉపవాసాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశించి రమజాను ఉపవాసాలు పాటించాడో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారి 38, ముస్లిం 760).

4- హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ حَجَّ هَذَا الْبَيْتَ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ

“ఏలాంటి వాంఛలకు లోనవకుండా, అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లఘించకుండా కాబా గృహం యొక్క హజ్ చేసిన వ్యక్తి, అదే రోజు పుట్టినవానిలా హజ్ నుండి తిరిగి వస్తాడు”. (బుఖారి 1820, ముస్లిం 1350).

5- అరఫా (జిల్ హిజ్జ మాసం యొక్క 9వ) రోజు ఉపవాసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

صَومُ يَومِ عَرَفَةَ يُكَفِّرُ السَّنَةَ الْمَاضِيَةَ وَالْبَاقِيَة

“అరఫా రోజు యొక్క ఉపవాసము గడిసిన ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సర పాపాలన్నిటిని తుడిచివేస్తుంది”. (ముస్లిం 1162).

6- రోగాలు, కష్టాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَا يُصِيبُ الْمُسلِمَ مِنْ نَصَبٍ، وَلاَ وَصَبٍ، وَلاَ هَمٍّ، وَلاَ حُزنٍ، وَلاَ أَذًى، وَلاَ غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُّهَا إِلاَّ كَفَّرَ اللهُ بِهَا مِن خَطَايَاه

“ముస్లింకు అలసట, అవస్త, చింత, వ్యాకులత, బాధ మరియు దుఃఖం ఏదీ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అల్లాహ్ దాని కారణంగా అతని పాపాలను తుడిచివేస్తాడు”. (బుఖారి 5642, ముస్లిం 2573).

మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ

“అల్లాహ్ ఎవరికి మేలు చేయగొరుతాడో, అతనిని పరీక్షిస్తాడు”. (బుఖారి 5645).

7- ఇస్తిగ్ఫార్ (అంటే అస్తగ్‘ఫిఅల్లాహ్ అని పలకడం): అధికంగా పాపాల్ని మన్నించే కారణాలలో ఇది అతి ముఖ్యమైనది. చదవండి అల్లాహ్ ఆదేశం:

ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉన్నంత వరకు వారిని శిక్షించడం అనేది అల్లాహ్ సాంప్రదాయం కాదు[. (అన్ఫాల్ 8: 33).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

طُوبَى لِمَنْ وَجَدَ فِي صَحِيفَتِهِ اسْتِغْفَاراً كَثِيرًا

“ఎవరి కర్మపత్రంలో ఎక్కువగా క్షమాభిక్షలుంటాయో వారికి శుభవార్త”. (ఇబ్ను మాజ 3818).

ప్రశ్నోత్తరాలు

1- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాపాలు చాలా ఉన్నాయి. నేను గతంలో చేసిన పాపాలన్నిటినీ అల్లాహ్ మన్నిస్తాడో లేదో తెలియదు?

జవాబుః అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

 హదీసె ఖుదుసీలో ఇలా ఉందిః

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله  يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలై- హి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

అంతేకాదు, తన దాసుల కొరకు అల్లాహ్ కారుణ్యం మరీ విశాలమైనది. ఎవరు తమ తౌబాలో సత్యవంతుడయి తేలుతాడో అల్లాహ్, గతంలో వారితో జరిగిన పాపాలన్నిటినీ పుణ్యాల్లో మారుస్తాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

 అందుకు, పాపాలు ఎన్నీ ఉన్నా, ఎంతటి ఘోరమైనవైనా ఏ మాత్రం నిరాశ చెందకుండా తొందరగా తౌబా చేయుటకు ముందడుగు వేయాలి.

2- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటాను. కాని నా దుష్ట స్నేహితులు నన్ను తౌబా చేయనివ్వడం లేదు. ఇందుకు నా బలహీనత, నీరసం కూడా తోడ్పడుతుంది. అయితే నేను ఏమి చేయాలి?

జవాబుః తౌబా విషయంలో ఓపిక మరియు నిలకడ అవసరం ఎంతైనా ఉంటుంది. తన తౌబాలో మనిషి ఎంతవరకు సత్యత చూపుతున్నాడో తెలియడానికి ఇది ఓ పరీక్ష. అందుకు వారిని అనుసరించకుండా, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి వారి విషయమే అల్లాహ్ ఎంత చక్కగా తెలిపాడో గమనించుః

కనుక నీవు సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. విశ్వసించనివారు నిన్ను చులకన భావంతో చూడ- కూడదు సుమా! (అంటే నీవు వారి మాటలకు ఏమాత్రం లొంగి- పోకూడదు)[. (రూమ్ 30: 60).

దుష్ట స్నేహితులు అతడ్ని తమ వైపు మలుపుకోటానికి నానారకాల ప్రయత్నాలు చేస్తారన్నది తౌబా చేసే వ్యక్తి తెలుసుకోవాలి. కాని ఎప్పుడైతే వారు అతని సత్యత మరియు ధర్మంపై బలమైన నిలకడ చూస్తారో అతడ్ని వదిలేస్తారు.

3- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాత స్నేహితులు నన్ను నలుగురిలో అవమాన పరుస్తారని బెదిరిస్తున్నారు. వారి వద్ద నా పాత ఫోటోలు, కొన్ని నిధర్శనాలున్నాయి. నా ప్రఖ్యాతి మట్టిలో కలుస్తుందని నాకు భయం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో నేనేమి చేయాలి?

జవాబుః ముందు షైతాన్ మిత్రులతో సమరం చేయాల్సి ఉంటుంది. షైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవని కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నీవు వారికి మొగ్గు చూపావంటే వారు మరిన్ని రుజువులు నీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు అని కూడా తెలుసుకో. ఈ విధంగా మొదటికీ, చివరికి నీవు నష్టపోతావు. కాని నీవు అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉండు. “హస్బియల్లాహు వ నిఅమల్ వకీల్” (నాకు అల్లాహ్ యే చాలు ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు) అని చదువుతూ ఉండు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితోనైనా భయం చెందినప్పుడు ఈ దుఆ చదివేవారు.

اللَّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِي نُحُورِهِمْ، وَنَعُوذُ بِكَ مِنْ شُرُورِهِم

“అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిమ్ వ నఊజు బిక మిన్ షురూరిహిమ్”.

(ఓ అల్లాహ్ మేము నిన్ను వారి ఎదుట అడ్డుగా చేస్తున్నాము. వారి కీడు నుండి నీ శరణు కోరుతున్నాము).

వాస్తవంగా ఇది కఠిన సందర్భం. కాని అల్లాహ్ కూడా భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడు. ఆయన వారిని అవమాన పరచడు. భక్తులకు అల్లాహ్ సహాయంగా ఉన్న ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గాధ చదువుః

మర్సద్ బిన్ అబీ మర్సద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్లో ఒకరు. ఆయన, మదీనాకు వలసపోయే శక్తిలేని ముస్లిములను మక్కా నుండి మదీనా చేర్పించేవారు. మక్కాలో ఆయనకు ఇస్లాంకు ముందు పరిచయమున్న ఒక అభిసారిక ఉండేది. ఆమె పేరు ‘అనాఖ్’. ఆయన, మక్కాలో ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని మదీనా చేర్పిస్తానని మాట ఇచ్చి ఉండెను. తర్వాత సంఘటన ఆయన నోటే విందాము/ చదువుదాముః నేను మక్కా నగరానికి వచ్చి, పౌర్ణమి రాత్రిలో ఒక గోడ ఛాయలో నిల్చున్నాను. అనాఖ్ నన్ను దూరం నుండే చూసి, దగ్గరికి వచ్చి, నన్ను గుర్తు పట్టి ‘వచ్చేసెయి, ఈ రాత్రి మనం కలసి ఆనందంగా గడుపుకుందాము’ అని అంది. “అనాఖ్! అల్లాహ్ వ్యభిచారాన్ని నిషేధించాడు” అని నేను బదులిచ్చాను. ఇది విన్న వెంటనే అనాఖ్ ‘ఓ ప్రజలారా! ఈ వ్యక్తి మీ ఖైదీలను విడిపించుకు వెళ్తున్నాడు’ అని బిగ్గరగా అరిచింది. అప్పుడే ఎనిమిది మంది నా వెంట పడ్డారు. నేను పరిగెత్తి ఒక గుహలో ప్రనేశించాను. వారు గుహ వరకు వచ్చి నాపైనే, అంటే; గుహ ముఖంద్వారం వద్ద నిల్చున్నారు. కాని అల్లాహ్ వారిని అంధులుగా చేశాడు. వారు నన్ను చూడలేకపోయారు. చివరికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మాటిచ్చిన నా స్నేహితుని వద్దకు వెళ్ళి అతడ్ని మదీనా చేర్పించాను.

ఈ విధంగా అల్లాహ్, విశ్వాసులను, తౌబా చేసేవారిని కాపాడతాడు.

ఒకవేళ నీవు భయపడే విషయమే గనక బయటపడి, నీవు నీ విషయం స్పష్టం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, నీ నిర్ణయాన్ని ఎదుటివారి ముందు స్పష్టం చేయి, నీవు చేసిన దానిని ఒప్పుకుంటూ ‘అవును, నేను అపరాధునిగా ఉంటిని, కాని అల్లాహ్ వైపునకు మరలి నేను తౌబా చేశాను’ అని నిక్కచ్చిగా చెప్పేసెయి. అసలు అవమానం, ఇది కాదు. ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో, దైవదూతల, జిన్నాతుల మరియు సర్వమానవుల ముందు కలిగే అవమానమే అసలు అవమానము.

4- ప్రశ్నః నేను ఒక తప్పు చేసిన తర్వాత తౌబా చేస్తాను. నా మనుస్సు అదుపులో ఉండలేక అదే తప్పు మళ్ళీ జరిగితే, నేను ముందు చేసిన తౌబా వ్యర్థం అయిపోయి, మొదటి తప్పుతో పాటు తర్వాత తప్పు కూడా నా పత్రంలో ఉంటుందా?

జవాబుః ఒక తప్పు చేసిన తర్వాత నీవు తౌబా చేసినచో అల్లాహ్ ఆ తప్పును మన్నిస్తాడు. తర్వాత అదే తప్పు మళ్ళీ చేసినచో, కొత్తగా తప్పు చేసినట్లు లిఖించబడుతుంది. అందుకు మళ్ళీ తౌబా చేయాల్సి ఉంటుంది. కాని మొదటి తప్పు తన కర్మ పత్రంలో ఉండదు.

5-ప్రశ్నః నేను ఒక పాపంలో మంకుతనం వహిస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుందా?

జవాబుః ఒక పాపం చేస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుంది. కాని రెండు పాపాలు ఒకే రకమైనవి కాకూడదు. ఉదాహరణకుః వడ్డీ తినే, తీసుకునే వ్యక్తి ఇక నుండి వడ్డీ వ్యవహారానికి దూరంగా ఉంటానని తౌబా చేస్తున్నప్పుడు, అతను మత్తు సేవించేవాడు కూడా ఉండి, దీనిని నుండి తౌబా చేయకుంటే, వడ్డీ గురించి చేసిన తౌబా నిజమగును, అది అంగీకరించబడును. కాని ఒక వ్యక్తి ఇక నుండి మత్తు సేవించనని తౌబా చేసి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు మానుకోకుంటే, లేదా ఒక స్త్రీతో వ్యభిచారానికి పాల్పడి తౌబా చేస్తూ, మరో స్త్రీతో వ్యభిచారానికి ఒడిగడితే ఇలాంటి తౌబా అనేది అంగీకరించబడదు.

6- ప్రశ్నః నేను గతంలో నమాజ్, ఉపవాసం, జకాత్ మొదలయిన కొన్ని విధులను పాటించలేదు. అందుకు నేనేమి చేయాలి?

జవాబుః వదిలివేసిన నమాజులు తిరిగి చేయాలని (అంటే ఖజా) ఏమీ లేదు. కాని స్వచ్ఛమైన తౌబా చేయాలి. ఇక ముందు చాలా శ్రద్ధగా నమాజులను కాపాడాలి. ఎక్కువగా క్షమాపణ కోరుతూ ఉండాలి. అలాంటప్పుడు అల్లాహ్ తప్పక మన్నించవచ్చు.

ఉపవాసాలు వదిలిన వ్యక్తి, ఉపవాసాలు ఉండలేకపోయిన రోజుల్లో ముస్లింగానే ఉంటే ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక్కో నిరుపేదకు కడుపునిండా అన్నం పెట్టాలి. జకాత్ ఇవ్వలేకపోయిన ముస్లిం, గత ఎన్ని సంవత్సరాల జకాత్ ఇవ్వలేకపోయాడో అన్ని సంవత్సరాల జకాత్ లెక్కేసుకోని ఒకేసారి చెల్లించాలి.

7-ప్రశ్నః నేను కొంతమందికి సంబంధించిన సొమ్ము దొంగలించాను. ఆ తర్వాత తౌబా చేశాను. కాని నాకు వారి చిరునామాలు తెలియవు. అలాంటప్పుడు నేనేమీ చేయాలి?

జవాబుః పూర్తి ప్రయత్నాలు చేసి వారి చిరునామాలు కనుగొనాలి. వారి చిరునామాలు లభ్యమవుతే వారి నుండి దొంగలించిన సొమ్ము వారికి అప్పగించాలి. సొమ్ము ఎవరిదో ఆ వ్యక్తి చనిపోయినచో, ఆ సొమ్ము అతని వారసులకు ఇవ్వాలి. తగిన ప్రయత్నం చేసి వారిని వెతికినప్పటికీ వారు తెలియకుంటే వారి తరఫున, వారికి దాని పుణ్యం లభించే సంకల్పంతో దానం చేయాలి. వారు అవిశ్వాసులైనా సరే. వారికి దాని ప్రతిఫలం అల్లాహ్ ఇహములోనే ఇస్తాడు. పరలోకంలో ఇవ్వడు.

8-ప్రశ్నః నేను వ్యభిచారానికి పాల్పడ్డాను. నేను ఎలా తౌబా చేయాలి. ఆ స్త్రీ గర్భిణి అయితే ఆ సంతానం నాకే చెందుతుందా?

జవాబుః స్త్రీ యొక్క ఇష్టం, అంగీకారంతో చేసిన వ్యభిచారానికి నీపై కేవలం తౌబా విధిగా ఉండును. సంతానం అక్రమ సంబంధ ఫలితమైనందకు నీది కాదు. అతని ఖర్చులు ఇచ్చే బాధ్యత కూడా నీపై ఉండదు. ఇలాంటి సంతానం అతని తల్లితోనే ఉండును.

ఈ విషయాన్ని కప్పి ఉంచడానికి ఆ స్త్రీతో వివాహం కూడా చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి మరియు ఆ స్త్రీ ఇద్దరూ స్వచ్ఛంగా తౌబా చేస్తే, ఆ వ్యక్తి ఆమెతో వివాహం చేసుకోవచ్చును. కాని మొదటి అక్రమ సంబంధం వల్ల ఆమెకు గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే.

 ఒకవేళ అత్యాచారం, బలవంతంతో వ్యభిచారం జరిపి ఉంటే, ఆమెపై చేసిన అత్యాచారానికి బదులుగా, అతడు ఆమెకు ఆమె తోటి సోదరీమనులు తమ వివాహంలో పొందిన మహర్ కు సమానంగా ధనం ఇవ్వాలి. స్వచ్ఛమైన తౌబా చేయాలి. అతడు ఉన్న ప్రాంతంలో ఇస్లామీయ చట్టం అమలులో ఉండి, అతని వ్యవహారం చట్టం దృష్టిలోకి వస్తే ధర్మప్రకారంగా అతనిపై “హద్” (వ్యభిచార శిక్ష) విధింపబడును.

9-ప్రశ్నః ఒక మంచి వ్యక్తితో నా వివాహం జరిగింది. వివాహానికి ముందు అల్లాహ్ ఇష్టపడని కొన్ని సంఘటనలకు నేను గురయ్యాను. ఇప్పుడు నేనేమి చేయాలి?

జవాబుః స్వచ్ఛమైన తౌబా చేయి. గతంలో జరిగిన విషయాలు నీ భర్తకు తెలియజేయుట నీపై అవశ్యకత ఏమీ లేదు. అందుకు నీవు కుండ బద్దలు గొట్టి సంసారం పాడు చేసుకోకు.

10- ప్రశ్నః గుదమైధనం (సోడోమీ) లాంటి పాపానికి గురైన వ్యక్తి తౌబా చేయునప్పుడు ఏ విధులు వర్తిస్తాయి?

జవాబుః ఆ దుష్చర్యకు పాల్పడిన ఇద్దరూ స్వచ్ఛమైన తౌబా చేయాలి.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడిన లూత్ అలైహిస్సలాం జాతివారిపై అల్లాహ్ ఎలాంటి విపత్తు కుర్పించాడో అతనికి తెలియదా?

  • వారి చూపులను తీసుకొని వారిని అంధులుగా చేశాడు.
  • వారిపై పేలుడు వదిలాడు.
  • వారి ఆ నగరాన్ని తల్లక్రిందులుగా చేశాడు
  • దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళను ఎడతెగకుండా కుర్పించాడు. ఇలా వారందరినీ నాశనము చేశాడు.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడ్డవారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

مَنْ وَجَدْتُمُوهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوطٍ فَاقْتُلُوا الْفَاعِلَ وَالْمَفْعُولَ بِهِ

“లూత్ అలైహిస్సలాం జాతివారు పాల్పడిన లాంటి దుష్చర్యకు పాల్పడినవారిని మీరు చూసినట్లయితే ఆ ఇద్దరినీ నరికి వేయండి”. (అబూ దావూద్ 4462, తిర్మిజి 1456, ఇబ్ను మాజ 2561).

ఇలాంటి దుష్కార్యానికి పాల్పడినవారు స్వచ్ఛమైన తౌబా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ తో అధికంగా క్షమాభిక్ష కోరుట కూడా తప్పనిసరి.

ఇస్లామీయ నిషేధాలు – జాగ్రత్తలు (Prohibitions in Islam)


prohibitions-in-islamఅంశాల నుండి
: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ నసీరుద్దీన్

[ఇక్కడ Download PDF]

 

 

islamic-prohibitions1

islamic-prohibitions2

islamic-prohibitions3

%d bloggers like this: