
ఇషా తర్వాత 4 రకాతులు = లైలతుల్ ఖద్ర్ లోని 4 రకాతుల పుణ్యం

తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *

నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
عَنْ أُمِّ حَبِيبَةَ رضي الله عنها زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ(.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు:
ఫజ్ర్ కు ముందు 2. (2)
జుహ్ర్ కు ముందు 2 + 2 = 4. (6)
జుహ్ర్ తర్వాత 2. (8)
మగ్రిబ్ తర్వాత 2. (10)
ఇషా తర్వాత 2. (12)
(పై 12 రకాతుల సంఖ్యను సామాన్యంగా ‘సున్నతె ముఅక్కద’ అంటారు)
2:238 حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّهِ قَانِتِينَ
నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి.
2:239 فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ
పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు
—
మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) | జాదుల్ ఖతీబ్
తఫ్సీర్ సూరతుల్ బఖర యూట్యూబ్ ప్లే లిస్ట్ : https://bit.ly/3g0JCxR
ప్రవక్త ముహమ్మద్ ﷺ నమాజు విధానము
శుచి శుభ్రత మరియు అంత్యక్రియల విధానము
Book of : Namaz & Janaez
Composition By: Zafarullah khan Nadvi
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [198 పేజీలు] [3 MB]
అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.
Read More “ప్రవక్త ముహమ్మద్ ﷺ నమాజు విధానము – జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ [పుస్తకం]”
[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/meraj-kanuna-namaz
[PDF] [27 పేజీలు]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు:
ఇస్లామీయ సోదరులారా!
ఈ రోజు జుమా ఖుత్బాలో (ఇన్షా అల్లాహ్) అల్లాహ్ సామీప్యం పొందడానికి అన్నింటికన్నా గొప్ప మాధ్యమం, కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత అయిన ఒక (ముఖ్యమైన) ఆచరణ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఏ ముస్లిమ్ అయినా ప్రాపంచిక ఆందోళనలకు, దు:ఖానికి గురై నిరుత్సాహ స్థితిలో ఈ ఆచరణ నిమిత్తం అల్లాహ్ ముందు నిలబడితే అతని ఆందోళన, దు:ఖాల భారం తగ్గి అతనికి అసలైన హృదయ ప్రశాంతత లభిస్తుంది. ఆ ఆచరణ పేరు నమాజ్. అల్లాహ్ దీనిని అర్హత కలిగిన ప్రతి ముస్లిమ్ పై విధిగా ఖరారు చేశాడు.
విధిగా చేయబడిన ఆచరణలన్నీ ఈ భూమి మీదే విధిగా గావించబడగా, నమాజ్ ను మాత్రం అల్లాహ్ తన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వైపునకు పిలిచి, ఆకాశాలపై తాను అనుకొన్న చోట దానిని విధి (ఫర్జ్)గా చేయడం దీని ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను సూచిస్తుంది. .
మేరాజ్ సంఘటనను గూర్చి చెబుతూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:
Read More “మేరాజ్ కానుక – నమాజ్ (కంటి చలువ మరియు హృదయ ప్రశాంతత) | జాదుల్ ఖతీబ్”

మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగ బడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్ బఖర 2:281)
ధార్మిక సోదరులారా….
ఈ రోజు జుమా ప్రసంగంలో జనాజా నమాజ్ ఘనత, ఆదేశాల గురించి తెలుసుకుందాం. ఇది ఎలాంటి గమ్యం అంటే ఏదో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ గమ్యానికే చేరుకోవాలి. అల్లాహ్ కూడా ఆ దినం గురించే ఇలా భయపెడు తున్నాడు: “మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.” (అల్ బఖర 2: 287)
ప్రియసోదరులారా..
జనాజా పూర్తిగా తయారయిన తర్వాత ఖనన విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకూడదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే తన నివాసాన్ని చేరుకోవటంలో త్వరగా విజయం పొందుతాడు. ఒకవేళ చెడ్డవాడైతే అతని బరువును మోయటం నుండి మీ భుజాల త్వరగా బరువు తగ్గించుకుంటాయి. జనాజా వెంట వెళ్ళడంలోనే అధిక పుణ్యాలు ఉన్నాయి. అకారణంగా జనాజా కంటే ముందు వాహనం మీద వెళ్ళటం మంచిది కాదు. జనాజాను మోస్తూ వెంట వెంటనే వెళ్ళటం ఉత్తమం. దగ్గరగా ఉంటూ మూడు సార్లు మోస్తే అతని భాధ్యత పూర్తయినట్లే ఇక ఎన్ని సార్లు మోస్తే అన్ని పుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి. జనాజా ఎవరిదైనా కూడా దాన్ని చూసి నిలబడటం ఉత్తమం. జనాజా నమాజ్ అయ్యేంత వరకు మృతుని వద్ద ఉండే వానికి ఉహద్ పర్వతం మాదిరిగా ఒక రాశి పుణ్యఫలం పొందుతారు. ఖనన సంస్కారం అయ్యేంత వరకు వేచి ఉన్న వానికి రెండు రాశుల పుణ్యఫలం పొందుతారు. శవపేటికను నేలపై ఉంచే వరకూ ఎవరూ కూర్చోకూడదు.

مَنْ خَرَجَ مِنْ بَيْتِهِ مُتَطَهِّرًا إِلَى صَلاَةٍ مَكْتُوبَةٍ فَأَجْرُهُ كَأَجْرِ الْـحَاجِّ الْـمُحْرِمِ وَمَنْ خَرَجَ إِلَى تَسْبِيحِ الضُّحَى لاَ يُنْصِبُهُ إِلاَّ إِيَّاهُ فَأَجْرُهُ كَأَجْرِ الْـمُعْتَمِر {أبوداود 558، صحيح الترغيب 320 حسن}
తమ ఇంటి నుండి వుజూ చేసుకొని ఫర్జ్ నమాజు చేయుటకు బయలుదేరే వ్యక్తికి ఇహ్రాం స్థితిలో ఉన్న హాజీ లాంటి పుణ్యం లభిస్తుంది. మరెవరయితే కేవలం సలాతుజ్జుహా ఉద్దేశ్యంతో లేస్తారో అతనికి ఉమ్రా చేసే వ్యక్తి లాంటి పుణ్యం లభిస్తుంది.
(అబూ ఉమామ ఉల్లేఖనం. అబూ దావూద్ 558, సహీ తర్గీబ్ 320)
మూత్రం శుద్ధి చేసుకొని వెళ్లిన తర్వాత మూత్రం పడిందేమో అని ఫీలింగ్ వస్తుంది. దీనికి పరిష్కారం ఎమన్నా ఉందా?
చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. తప్పకుండ వినండి మరి
తహారా (శుద్ధి, శుచీశుభ్రత)
https://teluguislam.net/?p=606
You must be logged in to post a comment.