ఫిత్రా దానము (జకాతుల్ ఫిత్ర్) – Zakat-ul-Fitr

zakat-ul-fitrఫిత్రా దానము అర్థము: ఈదుల్ ఫిత్ర్ పండుగకు ముందు ఆహారధాన్యాల నుండి (బియ్యం, గొధుమలు మొదలగు వాటి నుండి) ఒక “సా” (3 కేజీలు) బీద ముస్లిములకు దానం చేయుట. ఇది ఉపవాస స్థితిలో జరిగే చిన్నచిన్న తప్పులకు పరిహారము వంటిది.

ఫిత్రా దానము విధి అగుటకు కారణము: హదీథ్ లలో ఈ విధముగా తెలుపబడినది: ఇది ఉపవాసి యొక్క చిన్నచిన్న పొరపాట్లను దూరము చేయును. బీదవారుకూడా అందరితో కలిసి పండుగ జరుపుకుంటారు, మరియు అల్లాహ్ కు కృతఙతలు తెలుపుకోవడానికి – ఎవరైతే మనచేత రమదాన్ నెల ఉపవాసములు పూర్తి చేయించి ఇస్లాం యొక్క ఒక మూల స్థంభము పై అమలు చేసే శక్తిని మనకు ప్రసాదించాడో.

ఎవరిపై ఫిత్రా విధి చేయబడినది: ‘ప్రతి ఒక్కరిపై’ అనగా అప్పుడే పుట్టిన శిశువునుండి, పెద్దవారి వరకు, మరియు బానిసల తరఫు నుండి, అందరి తరఫు నుండి ఆ ఇంటి పెద్ద ఫిత్రా దానము చెల్లించాలి.

“అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ముస్లిం పై, స్వతంతృడుగాని, బానిసగానీ, పురుషుడుగాని, స్త్రీ గానీ, పిల్లలు గానీ, పెద్దవారుగానీ, అందరిపై ఒక ‘సా’ గోధుమలు లేదా ఒక ‘సా’ బార్లీ దానముగా తీయుటను విధిగావించిరి.” (ముత్తఫఖున్ అలైహ్)

ఫిత్రా దానము ఎవరికి చెల్లించాలి: బీద ముస్లిములకు.

ఫిత్రా దానము గురించి గుర్తుంచుకొన వలసిన విషయాలు:

  1. ఫిత్రా దానము ఈదుల్ ఫిత్రా కి ముందు చెల్లించవలెను.
  2. ఈదుల్ ఫిత్ర్ కు ఒకటి, రెండు రోజులు ముందుగా కూడా చెల్లించవచ్చును.
  3. ఈదుల్ ఫిత్ర్ పండుగ తరువాత చెల్లించిన యెడల అది మామూలు దానము అగును. కనుక పండుగకు ముందే తప్పక చెల్లించవలెను.

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

ఉపవాసపు నిబంధనలు – Rules of Fasting

ఉపవాసపు మూల స్థంభములు:

  1. ఉపవాసపు సంకల్పము.
  2. ఉపవాసమును భంగపరిచే వాటి నుండి వేకువజాము నుండి సూర్యాస్తమయము వరకు వేచి వుండుట.

ఉపవాసపు నిబంధనలు:-

  1. ముస్లిం అయి వుండాలి.
  2. యుక్త వయసుకు చేరి వుండాలి.
  3. బుద్ధి గలవాడై ఉండాలి (పిచ్చి వాడుగాని మతి స్థిమితము లేని వాడై వుండారాదు.)
  4. బాటసారి కోసం ఉపవాసం తప్పని సరికాదు.
  5. ఇది స్త్రీలకు  పరిమితము – బహిష్టు వచ్చిన సమయమున ఉపవాసము ఉండరాదు.

ఉపవాసము సరియగునకు నిబంధనలు:-

  1. ఇస్లాం స్వీకరించుట
  2. ముందు నుంచే (వాజిబ్) ఉపవాసములు సంకల్పము చేయుట
  3. బుద్ది కలిగి ఉండుట.
  4. ఉపవాసము భంగపరిచే వాటి గురించి తెలిసి ఉండుట.
  5. బహిష్టు రాకుండా ఉండుట మరియు ప్రసవించిన తర్వాత శుభ్రతపొందుట.

ఉపవాసపు విధాన మరియు సున్నతులు :- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఆలైహి వసల్లం ఇలా ఉద్బోదించారు “ ప్రజలు ఇఫ్ తార్ తొందరగా చేయుట వలన శుభాలు పొందుతారు. (బుఖారి & ముస్లిం)

ఇఫ్ తార్ ముందు దుఆ చేయుట:-ఉపవాసము ఉన్నవారు ఇఫ్ తార్ కి ముందు చేసే దుఆ రద్దు చేయబడదు.

రమదాన్ ప్రత్యేకంగా శ్రద్ధగా చేయవలసిన శుభకార్యాలు:-

  1. సహరీ చివరి ఘడియలలో చేయవలెను.
  2. అధికంగా నఫిల్ సలాహ్ చేయవలెను
  3. ఖుర్ ఆన్ పఠనము  చాలా ఎక్కువగా చేయవలెను
  4. ఉమ్రా చేయవలెను
  5. తరావీహ్ సలాహ్ చేయవలెను
  6. ఎతెకాఫ్ లో కూర్చో వలెను.
  7. పుణ్యకార్యములు చాలా ఎక్కువగా చేయవలెను

ఉపవాసములో చేయకూడని పనులు:-

  1. గర్ గరా చేయుట గొంతు వరకూ నీళ్ళు వెళ్ళ నివ్వుట లేదా ముక్కులు నీరు లోపలకు పీల్చుట.
  2. అబద్ధము  చెప్పుట, చాడీలు చెప్పుట, అశ్లీల మాటలు మాట్లాడుట.
  3. అశ్లీల పనులను ప్రోత్సహించుట ఉదా: టివి చూడుట, పాటలు వినుట మొదలైనవి.

పైన తెలిపిన వాటి నుండి మిమ్మల్ని మీరు తప్పక కాపాడుకోవలెను.

ఎలాంటి పరిస్థితులలో ఉపవాసము లేకుండా ఉండవచ్చును :-

  1. ప్రయాణము కారణముగా
  2. అనారోగ్యము కారణముగా
  3. ఎవరినైనా ప్రాణాపాయము నుండి కాపాడుట కొరకు, గర్భిణి స్త్ర్రీ లేదా పాలు ఇచ్చే తల్లి. (వీరు తమ ఉపవాసములను తర్వాత పూర్తి చేసూకోవలెను.)

ఉపవాసమును భంగపరిచేవి :-

  1. తినుట, త్రాగుట, ఇటువంటి ఏ పనైనా
  2. భార్యతో కలియుట
  3. బలవంతంగా వాంతి చేయుట
  4. అశ్లీల మాటలు, లేదా చేష్టలు లేదా టివి చూచుట వలన మనీ వెలువడుట
  5. స్త్రీకి మాసపు నెత్తురు లేదా గర్భిణీ స్త్రీకి నెత్తురు రావడంవలన
  6. ఎక్కువగా నెత్తురు పొవుట లేదా తీయుట
  7. ఉపవాసాన్ని  ఉపసంహరించుకున్నట్లు సంకల్పము చేసుకొనుట (అతను తినకపొయిన త్రాగకపొయినా కూడా)

పైన తెలుపబడిన ఉపవాసమును భంగపరిచే కార్యములు ప్రతి ముస్లింనకు తెలిసి వుండవలెను.

ఉపవాసములకు బదులు :-

రమదాన్ మాసములో ఒకవేళ ఏవైనా దినములలో ఉపవాసము పాటించని యెడల, ఎన్ని రోజులు ఉపవాసం పాటించలేదో అన్ని రోజుల పాటు ఆ తర్వాత అయినా తప్పక ఉపవాసం ఉండవలెను. ఎవరైనా రమదాన్ మాసములో ఉపవాస సమయంలో భార్యతో కలిసిన యెడల అతను

  1. ఒక బానిసను విముక్తి చేయాలి.
  2. లేనిచో ఎకధాటిగా రెండు మాసములు ఉపవాసములు ఉండవలెను.
  3. లేనిచో అరవై బీద ముస్లింలకు భోజనము పెట్టవలెను

Source: ఫిఖ్ హ్ – మూడవ స్థాయి  (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  షేఖ్ అబ్దుర్రబ్ & సయ్యద్ యూసుఫ్ పాషా

పుణ్యఫలాలు [పుస్తకం]

Punya-Falaalu-Doors-to-Great-Rewards


టైటిల్
: పుణ్యఫలాలు (Doors to Great Rewards)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ : దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు

(Great Rewards of certain acts of worship in Islam) – E-Book

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [37 పేజీలు]

దివ్య ఖుర్ఆన్ శ్రేష్ఠత

حفظ القرآن: عَنْ عَائِشَةَ رَضي الله عنها عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَثَلُ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ وَهُوَ حَافِظٌ لَهُ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَمَثَلُ الَّذِي يَقْرَأُ وَهُوَ يَتَعَاهَدُهُ وَهُوَ عَلَيْهِ شَدِيدٌ فَلَهُ أَجْرَانِ).

1-ఖుర్ఆన్ కంఠస్తం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఆయిషా ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).

تلاوة القرآن الكريم: عَنْ أَبِي أُمَامَةَ البَاهِلِي  رَضِيَ ٱللَّٰهُ عَنْهُ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (اقْرَءُوا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِي يَوْمَ الْقِيَامَةِ شَفِيعًا لِأَصْحَابِهِ).

2-ఖుర్ఆన్ పారాయణం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).

تعلم القرآن وتعليمه: عَنْ عُثْمَانَ رَضِيَ ٱللَّٰهُ عَنْهُ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ).

3- ఖుర్ఆన్ నేర్చుకోవటం, నేర్పించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆన్ నేర్చుకునేవాడు మరియు నేర్పేవాడు మీలో మేలైనవారు”. (బుఖారీ 5027).

4- సూర ఇఖ్లాస్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రశ్నించారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?” దానికి సహచరులు ‘ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగం ఎలా చదవగలడు? ప్రవక్తా!’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “ఖుల్ హువల్లాహు అహద్ (సూరా) ఖుర్ఆన్ లో మూడవ వంతుకు సమానం”. (ముస్లిం 811. బుఖారీ 5015).

5- “ముఅవ్విజతైన్”: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఈ రాత్రి అవతరించిన ఆయతుల గురించి నీకు తెలియదా? అంతటి గొప్ప ఆయతులు ఎప్పుడూ అవతరించలేదుః ‘ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్’ మరియు ‘ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్’ సూరాలు”. (ముస్లిం 814)

6- సూర బఖర: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీరు మీ ఇళ్ళను శ్మశానంగా చేసుకోకండి. సూర బఖర పారాయణం ఏ ఇంట్లో జరుగుతుందో అందులో నుంచి షైతాన్ పారిపోతాడు”. (ముస్లిం 780).

7-సూర బఖర మరియు ఆలె ఇమ్రాన్: అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానుః “ఖుర్ఆన్ చదవండి. అది ప్రళయదినాన తన్ను చదివినవారి పట్ల సిఫారసు చేస్తుంది. రెండు పుష్పములైన సూర బఖర, సూర ఆలె ఇమ్రాన్ లు చదవండి. అవి రెండు మేఘాలుగా లేక రెండు ఛాయాలుగా లేక రెండు వరుసల్లో ఎగురుతున్న పక్షుల్లాగా ప్రళయదినాన వస్తాయి. వాటిని చదివినవారి కోసం అవి వాదిస్తాయి. సూర బఖర చదవండి. దాన్ని చదివితే భాగ్యం. విడనాడితే దౌర్భాగ్యం. మాంత్రికులకు అది అసాధ్యం”. (ముస్లిం 804).

8- ఆయతుల్ కుర్సీ: ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “అబూ ముంజిర్! నీవు కంఠస్తం చేసిన అల్లాహ్ గ్రంథంలో గొప్ప ఆయతు ఏదో నీకు తెలుసా?” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ప్రశ్నించారు. ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేనన్నాను. ప్రవక్త మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. {అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం…} (సూర బఖరలోని 255వ ఆయతు) అని జవాబిచ్చాను. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (సంతోషంతో) నా ఛాతిపై కొట్టి “అల్లాహ్ సాక్షిగా! జ్ఞానం నీకు సులభంగా అబ్బుతుంది అబుల్ ముంజిర్” అని చెప్పారు. (ముస్లిం 810)

9- సూర బఖర చివరి ఆయతులు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సూర బఖరలోని చివరి రెండు ఆయతులు రాత్రి వేళ పఠించే వ్యక్తికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు”. (బుఖారీ 5009). ఇమాం నవవీ రహిమహుల్లాహ్ దీని భావం ఇలా చెప్పారుః ‘తహజ్జుద్ కొరకై లేవకున్నాపరవాలేదు అని ఒక భావం. షైతాన్ బారి నుండి కాపాడుకోవటానికి ఇవి సరిపోతాయనేది రెండవ భావం. ఆపదల నుండి రక్షించబడటానికి అనేది మూడవ భావం. అయితే ఇవన్నీ కూడా దీని భావంలో వస్తాయని కూడా చెప్పబడింది.

10- సూర కహఫ్ లోని మొదటి ఆయతులు కంఠస్తం చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ” సూర కహఫ్ యొక్క మొదటి ఆయతులు కంఠస్తం చేసిన వ్యక్తి దజ్జాల్ కీడు నుండి రక్షింపబడుతాడు”. (ముస్లిం 809). మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః “మొదటి పది ఆయతులు కంఠస్తం చేసినవారికి……”.

అల్లాహ్ స్మరణ మహత్త్వం

11-అల్లాహ్ యొక్క అధిక స్మరణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారరు: “‘ముఫర్రిదూన్’ ముందుకు వెళ్ళారు. ‘ముఫర్రిదూన్’ ఎవరు ప్రవక్తా! అని అడిగారు సహచరులు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారుః “అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు”. (ముస్లిం 2676).

12- “అల్లాహ్ ను స్మరించేవాని మరియు స్మరించనివాని ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 6407). ముస్లింలోని ఉల్లేఖనం ఇలా ఉందిః “అల్లాహ్ స్మరణ జరిగే ఇల్లు మరియు అల్లాహ్ స్మరణ జరగని ఇల్లు ఉదాహరణ జీవినిర్జీవి లాంటిది”. (ముస్లిం 779).

13- సుబ్ హానల్లాహ్: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమక్షంలో ఉండగా “ప్రతి రోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించడం మీలో ఎవరికైనా కష్టమా?” అని అడిగారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). ఆ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ‘మాలో ఎవరైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “వంద సార్లు సుబ్ హానల్లాహ్ అని స్మరిస్తే వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి. లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి” అని సమాధానమిచ్చారని సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2698).

14- “సుబ్ హానల్లాహి వబిహందిహీ” అని రోజుకు వంద సార్లు ఎవరు పఠిస్తాడో అతని పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ పాపాలు సముద్రపు నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం 2691).

15- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “సుబ్ హానల్లాహి వబి హందిహీ” అని ఉదయం వందసార్లు, సాయంకాలం వంద సార్లు ఎవరైతే పఠిస్తారో, అతనికంటే ఉత్తమమైన సత్కార్యం ప్రళయదినాన మరెవరిదీ ఉండదు. అదే విధంగా లేదా అంతకు మించి పఠించిన వ్యక్తి సత్కార్యం తప్ప”. (ముస్లిం 2692).

16- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః  “రెండు వచనాలున్నాయి. అవి (పఠించడానికి) నాలుక పై తేలిగ్గానే ఉంటాయి. కాని పరలోకపు త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడయిన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి, (అవేమిటంటేః) సుబ్ హానల్లాహి వబిహందిహీ, సుబ్ హానల్లాహిల్ అజీం (అల్లాహ్ పరమపవిత్రుడు, పరిశుద్ధుడు నేనాయన్ని స్తుతిస్తున్నాను. పరమోత్తముడైన అల్లాహ్ ఎంతో పవిత్రుడు). (బుఖారీ 6406. ముస్లిం 2694).

17- అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారుః “సూర్యుని కాంతి ఎన్నిటిపై పడుతుందో వాటన్నిటి కంటే అధికంగా “సుబ్ హానల్లాహి వల్ హందులిల్లాహి వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” అనడం నాకు చాలా ఇష్టం”. (ముస్లిం 2695).

18- “ఎవరైనా ప్రతి నమాజు తర్వాత 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ మరియు 33 సార్లు అల్లాహు అక్బర్ అని పఠిస్తే, ఇవి 99, మరియు లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అని 100 పూర్తి చేస్తే అతని పాపాలు క్షమించబడతాయి. ఒక వేళ అవి సముద్రం నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే. (ముస్లిం 597).

19-లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాః అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి “నేను స్వర్గ నిక్షేపాలలో ఒక నిక్షేపం వంటి ఒక వచనాన్ని నీకు తెలుపనా? అని చెప్పారు. తప్పకుండా తెలియజేయండని నేనన్నాను. అప్పుడాయన r “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”. (బుఖారీ 6409. ముస్లిం 2704).

20-సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్: అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వఅన అబ్దుక వఅన అలా అహ్దిక వవఅదిక మస్తతఅతు అఊజుబిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారుః “ఎవరు ఈ దుఆ పూర్తి నమ్మకంతో ఉదయం చదివి, సాయంకాలం రాక ముందే చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడు. ఎవరు రాత్రిపూట దాన్ని చదివి, తెల్లవారక ముందే చనిపోతాడో అతడూ స్వర్గవాసుల్లో ఒకడు”. (బుఖారీ 6306). (అనువాదం: ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడెవ్వడూ లేడు. నీవే నన్ను సృష్టించావు. నేను నీ దాసుణ్ణి. నేను నీతో చేసిన (దాస్య) ప్రమాణాన్ని, వాగ్దానాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకుంటాను. నా ద్వారా జరిగిన చెడు (వల్ల కలిగే దుష్పరిణామాల) నుండి నీ శరణు వేడుకుంటున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకొంటున్నాను. నేను చేసిన అపచారాలను ఒప్పుకుంటున్నాను. నా అపరాధాలను మన్నించు. పాపాలను మన్నించేవాడు నీవు తప్ప నాకు మరెవ్వరూ లేరు).

21- నిద్ర మధ్యలో మేల్కొన్న వ్యక్తి చదవ వలసిన దుఆ: “ఎవరు రాత్రి వేళ నిద్ర నుండి మేల్కొని ‘లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్ హందులిల్లాహ్, వ సుబ్ హానల్లాహ్, వల్లాహు అక్బర్, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్’ చదివి, ‘అల్లాహ్ నన్ను క్షమించు’ అని వేడుకుంటే లేదా మరేదైనా దుఆ చేసుకుంటే అది అంగీకరింపబడు తుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజ్ చేస్తే అదీ స్వీకరించబడుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1154).

22-లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ వచనాలను ప్రతి రోజూ వంద సార్లు పఠించే వాడికి పది మంది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది.  పైగా అతని కర్మల రికార్డులో వంద సత్కర్మలు అదనంగా వ్రాయబడతాయి. ఆ రికార్డులో నుంచి వంద దుష్కర్మలు తొలగించి వేయబడతాయి. అంతే గాకుండా ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ వచనాలు అతడ్ని షైతాన్ బారి నుండి రక్షిస్తాయని హామీ కూడా ఉంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాజాలదు. (బుఖారీ 6403. ముస్లిం 2691). [అనువాదం: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటి లేరు. రాజ్యాధికారం అంతా ఆయనదే. సర్వ స్తుతి, స్తోత్రాలకు ఆయనే యోగ్యుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు].

23- అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త ﷺ ప్రవచించారుః “ఎవరైనా “లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పది సార్లు చదివితే అతనికి ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురి మనుషులను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 2694).

24- జిక్ర్ సమావేశాల శ్రేష్ఠత: అబూ హురైరా మరియు అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః  “ఎవరైనా కొంత మంది అల్లాహ్ ను స్మరిస్తూ కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడుతారు. (అల్లాహ్) కారుణ్యం వారిని ఆవరిస్తుంది. శాంతి వారిపై అవతరిస్తుంది. అల్లాహ్ వారి ప్రస్తావన తన వద్ద ఉన్నవారి ముందు చేస్తాడు”. (ముస్లిం 2700).

25- ప్రవక్తపై దరూద్: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒకసారి దరూద్ పంపుతారో అతనిపై అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

26- తిన్నత్రాగిన తర్వాత అల్ హందులిల్లాహ్ అనండి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్ హందు లిల్లాహ్ అనడం అల్లాహ్ కు చాలా ఇష్టం. (ముస్లిం 2734).

వుజూ, నమాజుల ఘనత

27- ఉత్తమ రీతిలో వుజూ చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తాడో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”. (ముస్లిం 245).

28- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా ఎవరైనా వుజూ చేసి, ఆ తర్వాత (ఐదు పూటల) ఫర్జ్ నమాజులు చేస్తే, అవి వాటి మధ్యలో జరిగే పాపాల పరిహారానికి కారణమవుతాయి”. (ముస్లిం 231).

29- వుజూ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సజావుగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు” అని పలికితే అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తనకు ఇష్టమైన ద్వారం గుండా అందులో అతను ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

30- అజాన్ యొక్క జవాబు, ప్రవక్తపై దరూద్: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారుః “ముఅజ్జిన్ అజాన్ ఇస్తుండగా విన్నపుడు అతను చెప్పిన విధంగానే చెప్పి ఆ తరువాత నాపై దరూద్ పంపండి. నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ పదిసార్లు కరుణ పంపుతాడు”. (ముస్లిం 384).

31- అజాన్ తర్వాత దుఆ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ؆ ఉల్లేఖించారుః “అజాన్ విని (దాని జవాబు ఇచ్చిన  తర్వాత) ఈ దుఆ చదివిన వ్యక్తి ప్రళయం దినాన నా సిఫారసుకు అర్హుడవుతాడుః “అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ”. (బుఖారీ 614).

32- అజాన్ యొక్క మహత్తు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ యొక్క అజాన్ శబ్దాన్ని విన్న మానవులు, జిన్నాతులు ఇంకా ఎవరైనా సరే,  ప్రళయదినాన వారు దానికి తప్పక సాక్ష్యం ఇస్తారు. (బుఖారీ 609).

33- మస్జిద్ నిర్మాణం: ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) మస్జిదె నబవీని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారుః మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నానుః “కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం అల్లాహ్ అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు”. (బుఖారీ 450. ముస్లిం 533).

34- ఇమాంతో పాటు ఆమీన్ అనటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమామ్ ఆమీన్ అన్నప్పుడు మీరూ అమీన్ అని పలకండి. (అప్పుడు దైవదూతలు కూడా ఆమీన్ అంటారు). ఎవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ కు అనుగుణంగా ఉంటుందో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 780. ముస్లిం 410).

35- నమాజుకు తొలి వేళలో బయలుదేరటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశిం చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “వేళ కాగానే తొలి వేళలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే అందులో ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615. ముస్లిం 437).

36- ఇంట్లో వుజూ చేసి, మస్జిద్ కు కాలినడకతో వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారు: “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

37- మస్జిద్ కు నడచి వెళ్లటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం మహనీయ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి మాటల్ని నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 587).

38- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా  ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తికి అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (బుఖారీ 662. ముస్లిం 669).

39- సున్నతె ముఅక్కద: ఉమ్మె హబీబా ؅ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖించారుః “ఏ ముస్లిం భక్తుడు అల్లాహ్ కొరకు ప్రతి రోజు పన్నెండు రకాతుల నఫిల్ నమాజు చేస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు”. (ముస్లిం: 1696).

అవిః జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2 మరియు ఫజ్ర్ కు ముందు 2.

40- తహజ్జుద్ నమాజ్: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు ఏది? అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అడిగినప్పుడు “ఫర్జ్ నమాజు తరువాత ఎక్కువ ఘనతగల నమాజు అర్థ రాత్రి తరువాత చదివే (తహజ్జుద్) నమాజు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బదులిచ్చారు. (ముస్లిం 2756).

41- ఇషా మరియు ఫజ్ర్ నమాజ్ సామూహికంగా (జమాఅత్ తో) చేయటం: నేను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విన్నాను అని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

42- సక్రమంగా వుజూ చేసి జుమాకు వెళ్ళి, నిశబ్దంగా, శ్రద్ధగా ఖుత్బా వినటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా t ఉల్లేఖించారుః “ఎవరైతే సక్రమంగా వుజూ చేసి, జుమా కొరకు వచ్చి, నిశబ్దంగా ఉండి, శ్రద్ధగా ప్రసంగం వింటాడో అతని ఈ జుమా నుండి మళ్ళీ జుమా వరకు ఇంకా మూడు రోజుల అదనంగా (అంటే మొత్తం పది రోజుల పాపాలు) మన్నించబడతాయి”. (ముస్లిం 1987).

43-శీఘ్రంగా జుమా నమాజు కొరకు వెళ్ళుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జుమా రోజు దైవదూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు. ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు వ్రాసుకుంటారు. అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటె ఖుర్బానీ ఇచ్చిన వ్యక్తికి లభించే పుణ్యానికి సమానం. ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తరువాత వారికి ఒక పొట్టేలు ఖుర్బానీ ఇచ్చినంత, ఆ తర్వాత వారికి కోడి, ఆ తర్వాత వారికి గ్రుడ్డు అల్లాహ్ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం మెంబర్ పై వచ్చాక దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని, ఖుత్బా వింటారు. (అంటే ఆ తరువాత వచ్చేవారు ఆ దైవదూతల రిజస్టర్లో లిఖించబడరు). (బుఖారీ 929. ముస్లిం ). 

44- జనాజా నమాజ్ మరియు ఖననంలో పాల్గొనుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూహురైరా r ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధానమిచ్చారు. (బుఖారీ 1325. ముస్లిం 945).

ఉపవాస (రోజా) ఘనతలు

45- విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను రోజాలుండుట: “ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాను ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వ పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ 38. ముస్లిం 760).

46- విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ చేయుట: “విశ్వాసం మరియు పరలోక ప్రతిఫలాపేక్షతో రమజానులో తరావీహ్ పాటించిన వ్యక్తి పూర్వ పాపాలు క్షమించ బడున”ని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చినట్లు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 37. ముస్లిం 759). 

47- షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా రమజానుపవా సాలు పాటించి, ఆ తరువాత షవ్వాల్ నెలలో కూడా 6 ఉపవాసాలు పాటిస్తే, ఒక సంవత్సర కాలం రోజా ఉన్నంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 1164).

48- ప్రతి నెలలో మూడు రోజుల ఉపవాసాలు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చెప్పారుః ‘నా ప్రాణ స్నేహితులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు మూడు విష యాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ వదలి పెట్టను. ఆ మూడు విషయాలు ఇవిః (1) ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించడం. (2) చాష్త్ నమాజ్ చేయడం. (3) విత్ర్ నమాజు చేసి నిద్రపోవడం. (బుఖారీ 1178. ముస్లిం 721).

42- అరఫా దినాన ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) బోధించారని అబూఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అరఫా దినాన ఉపవాసం వల్ల, గడచిన సంవత్సరం పాపాలనూ, వచ్చే సంవత్సరం పాపాలనూ అల్లాహ్ మన్నిస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

43- ఆషూరా దినపు ఉపవాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు “ఆషూరా దినపు ఉపవాసం వలన అల్లాహ్ గడిచిన ఒక సంవత్సరపు పాపాలను దూరం చేస్తాడని నాకు నమ్మకం ఉంది”. (ముస్లిం 1162).

వివిధ ఘనతలు

51- పశ్చాత్తాపం: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః “పశ్చిమ దిశ నుండి సూర్యోదయానికి ముందు వరకు అల్లాహ్ పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు”. (ముస్లిం 2703).

52- హజ్, ఉమ్రాల ఘనత: “ఎవరైనా ఒక ఉమ్రా తరువాత మరొక ఉమ్రా చేస్తే, ఆ రెండు ఉమ్రాల మధ్య కాలంలో అతని వల్ల జరిగిన పాపాలకు రెండవ ఉమ్రా పరిహారం అవుతుంది. మబ్రూర్ హజ్ కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ కాదు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శుభవార్త ఇచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 1773. ముస్లిం 1349).

53- జిల్ హిజ్జ మొదటి దశకంలో అధికంగా సత్కార్యాలు చేయటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “జిల్ హిజ్జ మొదటి దశలో చేసిన సత్కార్యాలకున్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు”. జిహాద్ కు సయితం ఆ పుణ్యం లేదా? అని సహచరులు అడిగారు. దానికి ఆయన r “అవును జిహాద్ కు కూడా లేదు. కేవలం తన ధన ప్రాణంతో సహా జిహాద్ కు వెళ్ళి తిరిగిరాని అమరవీరునికి తప్ప” అని జవాబిచ్చారు. (బుఖారీ 969).

54- విద్యాభ్యాసం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లే ఖించారుః “విద్యాభ్యాసం కొరకు ఎవరైనా ఒక దారిన వెళ్తే అల్లాహ్ అతని కొరకు ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు. (ముస్లిం 2646).

55- ధర్మావగాహన: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని ముఆవియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “అల్లాహ్ ఎవరి పట్ల మేలు కోరుతాడో అతనికి ధర్మావగాహన ప్రసాదిస్తాడు”. (బుఖారీ 71. ముస్లిం 2389).

56- ధర్మప్రచారం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరు సన్మార్గం వైపునకు పిలుస్తారో, అతనికి దానిని అనుసరించేవారంత పుణ్యం లభిస్తుంది. (ఆచరించేవారి) పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. (ముస్లిం 2674).

57- మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అబూ సఈద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా చెడును చూసినచో తన చేత్తో దాన్ని రూపు మాపాలి. ఈ శక్తి లేకుంటే తన నోటి (మాట, ఉపదేశం)తో, ఈ శక్తి కూడా లేనిచో మనుస్సులో దాన్ని చెడుగా భావించి (దానికి దూరంగా ఉండాలి). ఇది విశ్వాసం యొక్క అధమ స్థానం”. (ముస్లిం 49).

58- సలాంను వ్యాపింపజేయటం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ‘ఏ ఇస్లాం మేలైనది’ అని ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని. ఆయన r ఇలా సమాధానమిచ్చారుః “అన్నం తినిపించు. నీకు పరి చయం ఉన్నవారికీ, లేనివారికీ సలాం చేయి”. (బుఖారీ 12. ముస్లిం 29).

59- అల్లాహ్ కొరకే ప్రేమ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “ప్రళయదినాన అల్లాహ్ ఇలా అంటాడుః నా కొరకే పరస్పర ప్రేమ సంబంధాలను పెంచుకున్న వారెక్కడున్నారు? ఈ రోజు నా ఛాయ తప్ప ఏ ఛాయాలేని రోజు, నేను వారిని నా ఛాయలో ఉంచుతాను”. (ముస్లిం 6548).

60- సత్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సత్యాన్ని మీరు విడనాడకండి. సత్యం మనిషిని పుణ్యకార్యాల వైపునకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లపుడు సత్యం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి)గా మార్చేస్తుంది”……. (బుఖారీ 6094. ముస్లిం 2607).

61- సత్ప్రవర్తన: “మీలో ఉత్తమ నడవడికగలవారే మేలైనవారు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనేవారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 3559. ముస్లిం 2321).

62- చిరునవ్వు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నన్ను ఉద్దేశించి ఇలా చెప్పారని అబూ జర్ r ఉల్లేఖించారుః “ఏ చిన్న సత్కార్యాన్ని కూడా విలువలేనిదిగా భావించకు – అది నీ తోటి సోదరునితో నగుమోముతో కలియుటయే అయినా సరే”. (ముస్లిం 2626).

63- మృదుత్వం: “మృదుత్వం కోల్పోయిన వ్యక్తి సర్వ మేళ్ళను కోల్పోయినట్లే” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని జరీర్ t ఉల్లేఖించారు. (ముస్లిం 2592).

64- రోగిని పరామర్శించటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఆయన r సేవకుడైన సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారుః “ఎవరు రోగిని పరామర్శించ టానికి వెళ్తాడో అతను (తిరిగి వచ్చే వరకు) స్వర్గపు తోటలో ఉంటాడు”. (ముస్లిం 2568).

65- సహనం: “ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప పరిహారానికి కారణభూతం అవుతుంది” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 5642. ముస్లిం 2573).

66- సత్కార్యం చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ప్రతి సత్కార్యం సదకాయే”. (బుఖారీ 6021. ముస్లిం 1005).

67- ఒకరి కష్టం దూరం చేయడం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారుః “ఇహలోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యే కష్టాల్లో ఏ ఒక కష్టాన్నయినా ఎవరయినా దూరం చేస్తే, పరలోకంలో అతనికి ఎదురయ్యే కష్టాల్లో ఒక పెద్ద కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఋణగ్రస్తునికి వ్యవధి ఇస్తాడో, ఇహపరాల్లో అతడికి అల్లాహ్ సుఖసంపదలు నొసంగుతాడు”. (ముస్లిం 2699).

68- అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “అల్లాహ్ ప్రళయదినాన ఆపదల నుండి కాపాడుట ఎవరికి ఇష్టమో వారు రుణగ్రస్తుని రుణ చెల్లింపుకై గడువు ఇవ్వాలి. లేదా మొత్తానికే మన్నించాలి”. (ముస్లిం 1563).

69- అనాథ సంరక్షణ: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ శుభవార్త ఇచ్చారని సహల్ బిన్ సఅద్ r ఉల్లేఖించారుః “నేను మరియు అనాథుల సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళ్ళను కలిపి చూపించారు. (బుఖారీ 6005).

70- వితంతువులు మరియు పేదలను ఆదుకోవటం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “పేదలు మరియు వితంతువుల సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారిలాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ రాత్రిళ్ళు దైవారాధనలో గడిపే వారితో సమానుడవుతాడు”. (బుఖారీ 5353. ముస్లిం 2982).

71- ముస్లిం సోదరుని కోసం దుఆ చేయుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా విని ఉల్లేఖిస్తున్నారు అబూ దర్దా t: “ఎవరు తన సోదరుని వెనక అతని కొరకు దుఆ చేస్తాడో, అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు, అతడు దానిపై ఆమీన్, నీకూ ఇలాంటి మేలే కలుగుగాక! అని దీవిస్తాడు”. (ముస్లిం 2732).  

72- రక్త సంబంధం పెంచుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “తన ఉపాధిలో సమృద్ధిని, దీర్ఘా యుష్షును కోరే వ్యక్తి బంధుత్వ హక్కులను నెరవేర్చాలి”. (ముస్లిం 2557).

73-సదఖా: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా తన మంచి (ధార్మిక) సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేస్తే -అల్లాహ్ మంచి వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు- అల్లాహ్ దాన్ని తన కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పెరిగి పర్వతం మాదిరిగా అయి పోతుంది”. (బుఖారీ 1410. ముస్లిం 1014).

74-ఇంటివారిపై ఖర్చు చేస్తూ పుణ్యాన్నాశించటం: అబూ మస్ఊద్ బద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “మనిషి పరలోకంలో సత్ఫలితం పొందే ఉద్దేశ్యంతో తన ఇంటివారిపై ఖర్చు చేస్తే, అది అతని ‘సదకా’ (మంచి దానం)గానే పరిగణించ బడుతుంది”. (బుఖారీ 55. ముస్లిం 1002).

75- కూతుళ్ళకు సుశిక్షణ: అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారుః “ఎవరైతే ఇద్దరు బాలికలకు వారు పెళ్ళి ఈడుకు చేరుకునే వరకు మంచి శిక్షణ ఇస్తాడో అతను మరియు నేను ప్రళయదినాన ఇలా ఉంటాము అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ వ్రేళ్ళను కలిపారు”. (ముస్లిం 2631).

76- ఎడతెగని పుణ్యం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మనిషి చనిపోయినపుడు అతని ఆచరణ అంతమయి పోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. (వాటి పుణ్య ఫలం మనిషికి లభిస్తునే ఉంటుంది). (1) సదకా జారియ. (2) ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. (3) అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం. (ముస్లిం 1631).

77- బాధాకరమైన వస్తువును దారి నుండి తొలగించుటం: అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారుః “ఒక వ్యక్తి దారిన నడచిపోతూ దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతని (గత పాపాల్ని) మన్నించాడు”. (బుఖారీ 2472 ముస్లిం 1914).

78- ఆరోగ్యం, తీరిక: హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారుః “రెండు వరాల పట్ల అనేక మంది నష్టములో పడియున్నారు. ఒకటిః ఆరోగ్యం. రెండవదిః తీరిక”. (బుఖారీ 6412).

79-సంతానం చనిపోయినవారు చేసే సహనానికి ఫలితం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః నేను నా దాసునికి ప్రియమైనవారిని చంపినపుడు అతను సహనం వహిస్తే, పుణ్యాన్నాశిస్తే దానికి బదులుగా నేను అతనికి స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారీ 6424).

80-ఏడుగురిని అల్లాహ్ తన ఛాయలో ఉంచుతాడు: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడా తప్ప మరెలాంటి నీడ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలోః (1) న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు. (2) తన యౌవన జీవితం అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు. (3) మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పరస్పర అభిమానించుకునే, అల్లాహ్ ప్రసన్నత కోసమే పరస్పరం కలుసుకొని విడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అంతస్తు, అందచందాలు గల స్త్రీ అసభ్య కార్యానికి పిలిచినప్పుడు, తాను అల్లాహ్ కు భయపడుతున్నానంటూ ఆమె కోరికను తిరస్కరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి సయితం తెలియనంత గోప్యంగా దానధర్మాలు చేసిన వ్యక్తి. (7) ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 1423. ముస్లిం 1031).

81- అల్లాహ్ కొరకు పరస్పర దర్శనం: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి తన సోదరుణ్ణి దర్శించటానికి వేరే గ్రామానికి వెళ్ళాడు. ఆ దారిలో అల్లాహ్ ఒక దైవదూతను మాటు వేసి ఉండమని పంపాడు. ఆ వ్యక్తి రాగానే దైవదూత “నీవు ఎటు వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆ గ్రామంలో నా ధార్మిక సోదరుడు ఒకడున్నాడు. అతన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాను అన్నాడతను. “అతడు నీకు ఏదైనా మేలు చేశాడని, నీవు దాన్ని తీర్చడానికి వెళ్తున్నావా?” అని అడిగాడు దైవదూత. అదేం కాదు. నేను అల్లాహ్ కొరకే అతన్ని ప్రేమించాను అని ఆ మనిషి జవాబిచ్చాడు. దానికి ఆ దూత ఇలా చెప్పాడుః “నేను అల్లాహ్ యొక్క దూతను, అల్లాహ్ నన్ను ఈ శుభవార్తతో పాటు నీ వైపు పంపాడు. నీవు అతడ్ని అల్లాహ్ కొరకే ప్రేమించినందుకు అల్లాహ్ నిన్ను ప్రేమించాడు”. (ముస్లిం 2567).

82- అతి స్వల్పమైన షిర్క్ నుండి కూడా దూరముండాలి: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పగా నేను విన్నానని జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ కు ఏ మాత్రం షిర్క్ చేయనివాడు (భాగస్వామ్యం కల్పించనివాడు) అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటే స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనకు సాటి కల్పించే మనిషి అదే స్థితిలో కలుస్తే నరకంలో చేరుతాడు”. (ముస్లిం 270).

83- బల్లిని చంపుట: ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దెబ్బకే బల్లిని చంపినవారికి 100 పుణ్యాలు లభిస్తాయి. రెండు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ. మూడు దెబ్బల్లో చంపినవానికి అంతకు తక్కువ”. (ముస్లిం 2240).

84- ఏదైనా నఫిల్ సత్కార్యం అది తక్కువైనా నిరంతరం చేయటం: ఆయిషా ؅ ఉల్లేఖనం ప్రకారం ‘అల్లాహ్ కు అన్నింటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?’ అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ని ప్రశ్నించగా, “అల్లాహ్ కు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం, అది తక్కువైనా సరే” అని ఆయన సమాధానమిచ్చారు. (బుఖారీ 6465. ముస్లిం 1828).

85- మంచి సంప్రదాయం (సున్నతె హసన): ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(ప్రజలు మరచిపోయిన) ఇస్లాంలోని ఒక మంచి సంప్రదాయాన్ని ఎవరు పునరారంభిస్తారో అతనికి దాని పుణ్యంతో పాటు అతని తర్వాత దాన్ని అనుసరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు.  ఇక ఎవరు ఇస్లాంలో ఒక చెడు సంప్రదాయాన్ని మొదలెడతారో దాని పాప భారం అతనిపై పడుతుంది. ఇంకా అతని తర్వాత ఎవరు దాన్ని అవలంబిస్తారో వారి పాప భారం కూడా అతనిపై పడుతుంది. మరి వారి పాపాల్లో ఏ కొరతా జరగదు”. (ముస్లిం 2351).


(1) రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరా కాయడంతో సమానమని అర్థం.

మీలాదున్నబీ – సంభాషణ (Milad-un-Nabee)

బిస్మిల్లాహ్
టైటిల్: మీలాదున్నబీ – సంభాషణ – Download

అనువాదకులు : సలీం సాజిద్ అల్ మదనీ
పునర్విచారకులు : అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్

క్లుప్త వివరణ: ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది – వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.


బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

జునైద్: అస్సలాము అలైకుమ్

అబ్దుల్లాహ్: వ అలైకుమ్ అస్సలామ్. ఏంటి పొద్దున ఇలా వచ్చారు? ఇవ్వాళ షాపు దగ్గరికి వెళ్ళలేదా?

జునైద్: ఇవ్వాళ మిలాదున్నబీ కదా! బజార్లో దుకాణాలన్నీ కూడా మూసే ఉంటాయి.

అబ్దుల్లాహ్: అంటే మీరు ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారన్న మాట.

జునైద్: ఎందుకని అడిగారు? మీరు జరుపుకోవటం లేదా?

అబ్దుల్లాహ్: ఇస్లాంలో మనకు పండుగలు రెండే కదా!

1) ఈదుల్ ఫిత్ర్
2) ఈదుల్ అజహా

జునైద్: ఈ మూడో పండుగ, ఈదె మీలాదున్నబీ కూడా ఉంది కదా!

అబ్దుల్లాహ్: అలాగా! మరయితే ఈదె మీలాదున్నబీ రోజున మనం ఈద్గాహ్ కు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నామా?

జునైద్: ఈదె మీలాదున్నబీ రోజునయితే ఈద్గాలో చేసే ప్రార్థనలే లేవు కదా?

అబ్దుల్లాహ్: మరి మిగతా రెండు పండుగ రోజుల్లో నమాజులు ఎందుకు చేస్తున్నాం?!

జునైద్: అవి చేయాలి కాబట్టి చేస్తున్నాం.

అబ్దుల్లాహ్: అదే; అవి ఎందుకు చేయాలి అని అడుగుతున్నాను.

జునైద్: ఎందుకంటే ఆ నమాజులు చేయమని మనకు ఆజ్ఞాపించబడింది.

అబ్దుల్లాహ్: ఈదె మీలాద్నుబీ రోజున నమాజు చేయాలని ఆజ్ఞాపించబడలేదా మరి?!

జునైద్: ఆజ్ఞాపించబడలేదేమో! అందుకనేగా ఎవరూ ఆ రోజు ఈద్గాహ్ కు వెళ్ళి నమాజ్ చేయనిది!

అబ్దుల్లాహ్: నమాజు సంగతి పక్కన పెడదాం. అసలు మీలాదున్నబీ జరుపుకోవాలని ఎక్కడైనా రాసి ఉందా?

జునైద్: అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు నేనెక్కడా వినలేదు. అలాగని జరుపుకోరాదని కూడా ఎక్కడా లేదుగా?!

అబ్దుల్లాహ్: మరి ఆ రోజు పండుగ నమాజు జరుపుకో రాదని మాత్రం ఎక్కడయినా ఉందా?!

జునైద్: లేదు, అలాంటిదేమీ లేదు.

అబ్దుల్లాహ్: మరి మీరు ఆరోజు పండుగ ప్రార్థన ఎందుకు చేయరు?

జునైద్: అసలు మీరు ఏం చెప్పదలచుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.

అబ్దుల్లాహ్: నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఇస్లాంలో ఈ పండుగకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవు. ఒకవేళ ఈ పండుగ గనక నిజంగా ఉండి ఉంటే ఇతర రెండు పండుగల్లాగా ఈ పండుగ రోజు కూడా నమాజు చేయబడేది. హదీసుల్లో దాని ప్రాధాన్యత వివరించబడేది. దాని ఆదేశాల గురించి, నియామాల గురించి దైవప్రవక్త వివరించి ఉండేవారు.

జునైద్: అంటే ఈ పండుగ జరుపుకునేవారు తప్పు చేస్తున్నారని నీ అభిప్రాయమా?

అబ్దుల్లాహ్: ముస్లింల ఆచరణ పేరు ఇస్లాం కాదు, ఖుర్ఆన్ హదీసుల వివరణే ఇస్లాం. ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కానిది ఇస్లాం ధర్మం కాదు. ఎవరయినా ఖుర్ఆన్ హదీసుల ద్వారా రూఢీ కాని దానిని ధర్మంగా భావిస్తున్నట్లయితే అతను ధర్మంలో కల్పితానికి పాల్పడుతున్నాడన్న మాట. అది ఘోరనేరం. దాన్ని ‘బిద్అత్’ అంటారు. బిద్అత్ లకు దూరంగా ఉండమని దైవ ప్రవక్త (సల్లల్లా హు అలైహి వ సల్లం) తన అనుచర సమాజాన్ని ఎంతగానో హెచ్చరించారు.

జునైద్: దైవప్రవక్త సహచరుల (సహాబాల) వారి శిష్యుల (తాబయీన్ల) కాలంలో ఎవరయినా ఈ పండుగ జరుపుకునేవారా?

అబ్దుల్లాహ్: ప్రసక్తే లేదు. సహాబాల, తాబయీన్ల తర్వాత ఏ ఇమామూ, ఏ హదీసువేత్త కూడా ఈ పండుగ జరుపుకోలేదు. అహెలె-సున్నత్ కు చెందిన నలుగురు ఇమాముల్లో ఎవరూ కూడా అసలు ఈ పేరు సైతం వినలేదు. ఈ కొత్త పోకడ (బిద్అత్) హిజ్రీ  శకం 625 నుంచి మొదలైంది.

జునైద్: అది సరే. నాదొక చిన్న సందేహం. ఒక ముస్లిం తనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పుకుంటూ ఆయన పుట్టిన రోజున, ఆయన గౌరవార్థం ఏ కార్యమూ చేయకుండా గడిపేయటం భావ్యమా చెప్పండి?!

అబ్దుల్లాహ్: అవునండీ, అదే భావ్యం. ఎందుకంటే సహాబాలుగాని, వారి శిష్యులుగాని, సలఫ్ పండితులుగాని ఈ పండుగ జరుపుకున్నట్లు మీకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇకపోతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పట్ల ప్రేమాభిమానాల సంగతి! ఖుర్ఆన్ గ్రంధాన్ని, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) చూపిన విధానాన్ని అనుసరించటం ద్వారా అవి వ్యక్తమవు తాయిగాని ఆయన పుట్టిన రోజు పండుగ జరుపుకోవటం ద్వారా కాదు. క్రీ.శ. 625కు పూర్వం గడిచిన ప్రజలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద ప్రేమ లేదంటారా? దైవప్రవక్త ( సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ కాలాన్ని ఉత్తమ కాలంగా అభివర్ణించారు మరి!

జునైద్: క్రైస్తవులు తమ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్ పండుగ (ఈద్ మిలాద్) జరుపు కుంటారు. మన ప్రవక్త, ప్రవక్తలందరిలో కెల్లా గొప్పవారు. అలాంటప్పుడు మన ప్రవక్త పుట్టిన రోజును మనం జరుపుకోకుండా ఎలా ఉంటాం?

అబ్దుల్లాహ్: క్రైస్తవులు తమ ప్రవక్తను ‘దేవుడు’, దేవుని కుమారుడు అంటారు. మరి వారికి పోటీగా మనం కూడా మన ప్రవక్తను ‘దేవుడు,’ ‘దేవుని కుమారుడు’ అని అందామా? మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకనేగా ఖుర్ఆన్, హదీసులు క్రైస్తవుల్ని మార్గ విహీనులుగా ఖరారు చేస్తున్నాయి. వాళ్లంతా తమ ప్రవక్త బోధనలకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. క్రిస్మస్ కూడా క్రైస్తవులు తాము స్వయంగా కల్పించుకున్న ఆచారమే తప్ప ఈసా ప్రవక్త దాని గురించి బోధించలేదు.

జునైద్: మిలాదున్నబీ పండుగ దురాచారమయితే కాదు కదా! అది మంచి ఆచారమే కదా!

అబ్దుల్లాహ్: అది మంచి ఆచారమే అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహ చరులు ఆ పండుగ ఎందుకు జరుపుకోలేదు? ఆ కాలంలో పండుగ జరుపుకోవటానికి వారి దగ్గర డబ్బులు లేకనా? సంవత్సరానికి రెండు పండుగలు జరుపుకునేవారికి ఇంకొక్క పండుగ భారమవుతుందా?

జునైద్: ప్రవక్త సహచరుల కాలంలో జరగని చాలా పనులు ఈ కాలంలో జరుగుతున్నాయి. ఈ రోజు మనం మోటారు వాహనాల్లో, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. మరి మీరు ప్రవక్త సహచరుల ఇస్లాంను అనుసరిస్తూ గాడిదలపై, గుర్రాలపైనే స్వారీ చేయవచ్చు కదా!

అబ్దుల్లాహ్: అయ్యా! విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల వల్ల ఇస్లాం కల్పితం కాదు. ధర్మంలో నూతన పోకడల వల్ల ఇస్లాం కల్పితం అవుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిం చారు: “ఎవరైనా ధర్మంలో ఏదైయిన కొత్త విషయాన్ని సృష్టిస్తే దాన్ని తిరస్కరించాలి” (సహీహ్ బుఖారి, ముస్లిం). దీని గురించి వివరిస్తూ హాఫిజ్ ఇబ్నెహజర్ (రహిమహుల్లాహ్) ఏమన్నారో చూడండి: “నూతన విషయం అంటే ధర్మంలో నూతన విషయం. ధర్మంలో ఎవరైనా నూతన విషయాలను జొప్పిస్తే దాన్ని తిరస్కరించాలన్నమాట” (ఫత్ హుల్ బారీ 5/322). దీని ద్వారా అర్థమయ్యిందేమిటంటే ప్రతి కొత్త విషయం ఖండించదగింది కాదు. ధర్మంతో, ధర్మజ్ఞానంతో సంబంధం ఉన్న వినూత్న కల్పితాలు మాత్రమే ఖండించదగినవి. అలాంటి కొత్త విషయాలను ధర్మంలో భాగంగా, పుణ్యప్రదంగా భావించి చేస్తే అలాంటి నూతన విషయాలన్నీ ఖండించదగినవే. ఇకపోతే ప్రాపంచిక విషయాలంటారా?! వాటి గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు! “ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. వారు వాటిపై స్వారీ చేయటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి, ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు.” (సూరయె నహ్లి:8). ఆ కాలంలో ప్రజలకు తెలియని వస్తువులను, వాహనాలను కూడా ఉపయోగించవచ్చని పై ఆయతుల్లో అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నాడు. అంటే ధర్మ సమ్మతమైన రీతిలో విజ్ఞాన శాస్త్రం ద్వారా ఉనికిలోకి వచ్చిన వినూత్న ఆవిష్కరణ లన్నిటినీ మనం ఉపయోగించవచ్చన్నమాట.

జునైద్: మరి సంతానం కలిగినప్పుడు వేడుక ఎందుకు జరుపుకుంటారు?

అబ్దుల్లాహ్: ఎందుకంటే సంతానం కలిగిన ఏడవ రోజున ‘అఖీఖా’ చేయమని షరీఅతు (ఇస్లామీయ ధర్మ శాస్త్రం) స్వయంగా ఆదేశించింది. ఏ పని చేయమని అయితే షరీఅత్ ఆదేశిస్తుందో అది ధర్మమైపోతుంది.

ఇప్పుడు చెప్పండి! రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపమని షరీఅత్ ఆదేశించిందా? లేక అలా చేయమని ఎవరైనా బోధించి ఉన్నారా? లేదు. షరీఅత్ లో అటువంటి ఆజ్ఞ ఏదీ లేదు, ప్రవక్తగాని ఆయన సహచరులుగాని దీని గురించి బోధించలేదు. అదీగాక సంతానం పుట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే వేడుక జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కాదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలై హి వ సల్లం) ప్రతి సంవత్సరం పుడుతూ ఉంటారా ఏమి? సంతానం పుట్టిన తర్వాత ఏదో రోజు వేడుక జరుపుకుంటారు. అదే రోజు వేడుక జరుపుకోవటమనేది ఎక్కడా లేదు. అదీ ఆ ఒక్క రోజు! ప్రతి యేడు కాదు!

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినప్పుడు అబూలహబ్ ఒక బానిసరాలిని విడుదల చేశాడని చెబుతారు?!

అబ్దుల్లాహ్: చేశాడు.. నిజమే! అది ఎందుకు? తనకు భాతృజుడు కలిగాడన్న ఆనందంతో అతను అలాచేశాడు. అంతేగాని ప్రపంచంలో ఒక గొప్ప ప్రవక్త పుట్టాడని అతను బానిసరాలిని విడుదల చేయలేదు సుమా! అది గుర్తుంచుకోవాలి. అతను చేసిన ఈ పని పుణ్యప్రదమైనదే అయితే తనకు ప్రవక్త పదవీ బాధ్యతలు లభించిన తరువాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్లీ ఎప్పుడన్నా అలా చేయమని ఆదేశించారా? ప్రపంచంలోని ఇతర జనాల్లాగే అబూలహబ్ కూడా తనకు భాతృజుడు కలిగాడని తెలియగానే సంబరపడ్డాడు. ఏ ఇంట పిల్లవాడు పుట్టినా ఆ ఇంటి వారికి ఆనందం కలగటమనేది సహజం. అతను ఆ రోజును పండుగగా తలచి బానిసను విడుదల చేయలేదు. దైవప్రవక్త పదవీ బాధ్యతల పట్ల అబూలహబ్ కు ప్రేమ ఉన్నట్లయితే అతను జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ద్వేషిస్తూ ఉండేవాడు కాదు. అతన్ని, అతని భార్యను శపిస్తూ ఖుర్ఆన్లో ఒక సూరా సాంతం అవతరించేది కాదు. అలాంటప్పుడు అబూలహబ్ చేసినదాన్ని సమర్ధిస్తూ మిలాదున్నబీ పండుగ జరుపుకుంటున్నట్లయితే అది దైవప్రవక్త సంప్రదాయం కాదు, అబూలహబ్ సంప్రదాయం.

జునైద్: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టిన తేది విషయంలో చరిత్రకారుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయని చెబుతుంటే విన్నాను. అసలు వాస్తవం ఏమిటి?

అబ్దుల్లాహ్: అల్లాహ్ అభీష్టం మేరకే అలా జరిగింది. ఇస్లాం ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచటానికి, ఇస్లాంలో ఇటువంటి కల్పనలు జరగకుండా ఉండటానికి అల్లాహ్ వారిని ఒకే అభిప్రాయం మీద నిలబడనీయలేదు. ఇప్పటివరకూ మేము చెబుతూ వస్తున్నది కూడా అదే కదా! పూర్వం ప్రజలు ఈ పండుగ జరుపుకునేవారు కాదు. తర్వాత కాలంలోనే ఈ ఆచారం సృష్టించబడింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాని, ఆయన సహచరులు గాని రబీవుల్ అవ్వల్ 12వ తేదిన పండుగ జరుపుకొని ఉన్నట్లయితే ముస్లింలందరూ ఆ తేదిని బాగా గుర్తు పెట్టుకునేవారు. ఇక ఆ తర్వాత ఆ తేది విషయంలో ముస్లింల మధ్య భేదాభిప్రాయమే నెలకొని ఉండేది కాదు.

జునైద్: సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టినరోజు పండుగ మొదటి నుంచి జరుపు కోవటం జరగలేదని నేను ఒప్పుకుంటున్నాను. మరి నేటి వైజ్ఞానిక యుగంలోనూ దైవప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) గారి నిజమైన పుట్టిన తేది కనుగొనబడ లేదేమిటి?

అబ్దుల్లాహ్: చూడండి! ఆయన మరణించిన తేది రబీవుల్ అవ్వల్ 12 అన్న విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఇకపోతే ఆయన పుట్టిన తేది గురించి జరిపిన ఆధునిక పరిశోధనల్లో తేలిందేమిటంటే ఆయన పుట్టింది రబీవుల్ అవ్వల్ 9వ తేదిన. ఖాజీ సులైమాన్ గారి ‘రహ్మతుల్లిల్ ఆలమిన్’ గ్రంధంలో, మౌలానా షిబ్లీ నోమానీ గారి “సీరతున్నబీ” గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి.

జునైద్: అసలు ఈ మిలాదున్నబీ పండుగ ఎక్కణ్ణుంచి ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది?

అబ్దుల్లాహ్: ఇదెక్కడి వింతండి బాబూ? ఒక విషయాన్ని వారు కనిపెట్టి దాని ఆధారాలు మమ్మల్ని అడుగుతున్నారు. ఏమైనా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలం నుంచి – ఇమాములు, హదీసువేత్తలకాలం వరకు ఈ పండుగ ఆనవాళ్లు కూడా చరిత్రలో కనిపించవు. ఈ ఆచారం హిజ్రీ  శకం 625 నుంచి ప్రారంభమైంది. ధర్మజ్ఞానం లేని కొందరు మనుషులు ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారు.

జునైద్: నిజంగా ఇది అన్యాయమే కదా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు చేయని పనిని మనమెందుకు చేయాలి?

అబ్దుల్లాహ్: జజాకల్లాహ్ ఖైరా! నేను చెప్పిన విషయం మీరు అర్థం చేసుకున్నందుకు అల్లాహ్  నాకు మేలు చేయాలని కోరుకుంటున్నాను.

జునైద్: మీరు చెప్పిన మాట అర్థమయింది. ఇంకొక చిన్న సందేహం. ఈ పండుగ జరుపుకునేవారు సామాన్యంగా మంచి ఉద్దేశ్యంతోనే చేస్తారు. మరో వైపు హదీసులో ఇలా ఉంది కదా! “ఆచరణలన్నీ సంకల్పం (ఉద్దేశం) పైనే ఆధారపడి ఉంటాయి”.

అబ్దుల్లాహ్: మీకు ఏదైనా సహీహ్ హదీసు చూపించి అది నా ఆచరణలకు భిన్నంగా ఉందని చెబితే అటువంటి సమయంలో వారు “మా మౌల్వీ సాహెబ్ గారు అలాగే చేస్తాము” అని చెప్పి దాటవేస్తారు. ఇప్పుడు మీకు సహీహ్ హదీసు గుర్తొచ్చింది. కాని మేమలా చేయము. ఆ హదీసు నూటికి నూరు పాళ్లు కరెక్టే. కాని బిద్అత్ అంటే ఏమిటో తెలుసా? ఆ ఆచరణ మంచి ఉద్దేశంతోనే చేయబడుతుంది. కాని అసలు ఆ పనిమాత్రం చెడ్డదై ఉంటుంది. స్వీకారానికి అనర్హమై ఉంటుంది. అల్లాహ్ సమక్షంలో ఒక పని స్వీకృతికి నోచుకోవాలంటే ఒకటి: ఆ పని మంచి ఉద్దేశంతో చేయ బడి ఉండాలి. రెండు: అది సున్నత్ కు అనుగుణంగా జరిగి ఉండాలి. ఈ రెండు నియమాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ ఆచరణ స్వీకరించబడదు. ఖుర్ఆన్ హదీసుల్లో చాలా చోట్ల ఈ విషయం పస్తావించబడింది.

జునైద్: మిలాదున్నబీ పండుగ చేస్తే అసలు ఎటువంటి పుణ్యం లభించదంటారా?

అబ్దుల్లాహ్: అసలు దాని ఉనికే ఇస్లాంలో లేనప్పుడు అది పుణ్యకార్యం ఎలా అవుతుంది చెప్పండి. పైగా ఇదొక బిద్అత్ (కొత్త పోకడ). ధర్మంలో కొత్త పోకడలకు పాల్పడటం సామాన్యమైన నేరం కాదు సుమా! మీరు పుణ్యం ఏమిటి అని అడుగుతున్నారు. అసలు పరలోకంలో ఇటువంటి వారికి కౌసర్ సరస్సు నీళ్ళు కూడా లభించవు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా వారిని తమ దగ్గరకు రానీరు. ఒక హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పి ఉన్నారు:

“ప్రళయదినాన నేను నా అనుచర సమాజం వారికి కౌసర్ సరస్సు నుంచి నీళ్లు త్రాపుతూ ఉంటాను. అప్పుడు నా అనుచర సమాజంలోని కొందరిపై దైవదూతలు లాఠీచార్జీ చేస్తుంటారు (వుజూ ప్రభావం మూలంగా వారి కాళ్ళు, చేతులు ప్రకాశిస్తూ ఉంటాయి). వారు ఏం తప్పు చేశారని వాళ్ళని కొడ్తున్నారు అని నేను అడుగుతాను. వాళ్లను నా దగ్గరికి రానీయండి వారు నా అనుచరులే అని అంటాను. అప్పుడు దూతలు సమాధానం ఇస్తారు: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీ తదనంతరం వీళ్ళు ధర్మంలో ఎటువంటి మార్పులు చేశారో మీకు తెలియదు”. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వాళ్ళని దూరంగా తరిమేయండి. ఎందుకంటే నా తదనంతరం వాళ్ళు నా ధర్మంలో మార్పులు చేశారు. అందులో కొత్త ఆచారాలు కల్పించారు” అని విసుక్కుంటారు.”

జునైద్: అమ్మో! విషయం చాలా భయంకరమైనదే! మీరు నాకు ఈ హదీసు వినిపించి నా కళ్లు తెరిపించారు. మీరు నాకు సరైన మార్గం చూపినందుకు అల్లాహ్ మీకు మేలు చేయుగాక! ఇన్షా అల్లాహ్ నేను కూడా నా స్నేహితులు, బంధువులందరికీ ఈ విషయం తెలియజేసి వారికి సరైనమార్గం చూపుతాను. వారు అన్ని రకాల బిద్అత్ లను, దురాచారాలను వదలిపెట్టి సరైన మార్గంలో నడిచేలా చేస్తాను.

అబ్దుల్లాహ్: అల్లాహ్ మనందరికి సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమిన్

రాసినవారు: మౌలానా అబ్దుల్ ఖుద్దూస్ సలఫీ ముహమ్మద్ సలీమ్ సాజిద్ అల్ మదనీ రియాద్.
పున:పరిశీలించిన వారు: షేఖ్ అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్

ఇస్లామిక్ తెలుగు డిక్షనరీ – Dr. Muhammad Taqiuddeen al-Hilaalee & Dr. Muhammad Muhsin Khan

The Islamic Telugu Dictionary – From the Translation of Meanings of Noble Quran By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee and Dr. Muhammad Muhsin Khan

[Download the PDF Here]

రుజు మార్గము (The Straight Path)

the-straight-path-telugu-islamమూలం :మౌలానా హాఫిజ్ ముహమ్మద్ తఖీయుద్దీన్
అనువాదం :ముహమ్మద్ అజీజుర్రహ్మన్
ప్రకాశకులు : అల్-హఖ్ తెలుగు పబ్లికేషన్స్ ,అక్బర్ బాగ్, హైదరాబాద్

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ [పుస్తకం]

Muslimula Dharmika Viswaasam
Muslimula Dharmika Viswasam – in Q&A format –
by Jemeel Zainoo [PDF]

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ మొబైల్ ఫ్రెండ్లీ] [42 పేజీలు]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/muslimula-dharmika-viswasam-cropped.pdf

విషయ సూచిక :

పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు:

  1. అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు?
  2. అల్లాహ్ దాస్యం మనం ఏ విధంగా చేయాలి?
  3. మనము అల్లాహ్ దాస్యం భయంతో, ఆశతో చేయాలా?
  4. ఆరాధనలో ‘ఇహ్సాన్’ అంటే ఏమిటి?
  5. అల్లాహ్ తన సందేశహరుల్ని ఎందుకు పంపాడు?
  6. ‘తౌహీదె ఉలూహియ్యత్’ అంటే ఏమిటి?
  7. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అర్ధం ఏమిటి?
  8. సిఫాతె ఇలాహీ (అల్లాహ్ గుణవిశేషాలు) లో తౌహీద్ అనగానేమి?
  9. తౌహీద్ (ఏకదైవారాధన) కు కట్టుబడిన ముస్లింకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
  10. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?
  11. మనతోపాటు అల్లాహ్ తన అస్థిత్వంతో ఉన్నాడా లేదా తన జ్ఞానంతో ఉన్నాడా?
  12. అతిపెద్ద పాపం ఏమిటి?
  13. షిర్కే అక్బర్ (అతిపెద్ద షిర్కు) అంటే ఏమిటి?
  14. అతిపెద్ద ‘షిర్కు’ కు ఒడిగడితే ఎలాంటి నష్టం కలుగుతుంది?
  15. ‘షిర్కు’ కు ఒడిగడుతూ సత్కార్యాలు ఆచరిస్తే ప్రయోజనం ఉంటుందా?
  16. ముస్లిముల్లో షిర్కు ఉందా?
  17. అల్లాహ్ తప్ప ఇతరులను వేడుకోవడం, అంటే వలి అల్లాహ్ లను వేడుకునే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
  18. వేడుకోవడం (దుఆ) దైవారాధన అవుతుందా?
  19. మృతులు పిలుపును వింటాయా?
  20. మృతులను సహాయం కొరకు ప్రార్ధించవచ్చా?
  21. అల్లాహ్ తప్ప ఇతరులను సహాయం కోరడం ధర్మసమ్మతమేనా?
  22. బ్రతికి ఉన్న సృష్టి సహాయం కోరవచ్చా ?
  23. అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుబడులు చెల్లించడం ధర్మసమ్మతమేనా?
  24. అల్లాహ్ తప్ప ఇతరులకోసం జిబాహ్ చేయడం ధర్మసమ్మతమేనా?
  25. సమాధుల ప్రదక్షిణం చేయటం ధర్మసమ్మతమేనా?
  26. సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం ధర్మసమ్మతం అవుతుందా?
  27. చేతబడి చేయటం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
  28. జ్యోతిష్కుని మాటలను నమ్మవచ్చా ?
  29. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉంటుందా?
  30. ముస్లిములు వేటిని తమ గీటురాయిగా చేసుకోవడం విధిగా చేయబడింది?
  31. ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేసే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
  32. దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమేనా?
  33. తాయత్తులు, గవ్వలు వ్రేలాడదీసుకోవడం ధర్మసమ్మతమేనా?
  34. మనము అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి?
  35. అల్లాహ్ ను వేడుకొనడానికి ఎవరి సహాయమైనా అవసరమవుతుందా?
  36. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పని ఏమిటి?
  37. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు ప్రసాదించమని మనం ఎవరిని వేడుకోవాలి?
  38. అల్లాహ్ ను ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మనం ఏవిధంగా ప్రేమించాలి?
  39. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశంసించే విషయంలో హద్దుమీరి ప్రవర్తించవచ్చా?
  40. అల్లాహ్ తన సృష్టిరాశుల్లో మొదటగా ఎవరిని సృష్టించాడు?
  41. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
  42. ‘విశ్వాసులతో స్నేహం’ అంటే ఏమిటి?
  43. వలీ అల్లాహ్ (అల్లాహ్ మిత్రుడు) ఎవరు?
  44. అల్లాహ్ ఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు?
  45. ఖుర్ఆన్ ఎలాగూ ఉంది కదా! అని మనం హదీస్ పట్ల విముఖత చూపగలమా?
  46. అల్లాహ్ , ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలపై మనము ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?
  47. వివాదం తలెత్తినప్పుడు మనం ఏం చేయాలి?
  48. ‘బిద్అత్’ అంటే ఏమిటి?
  49. ఇస్లాంలో ‘బిద్అతె హసనా’ ఉందా?
  50. ఇస్లాంలో ‘సున్నతె హసనా’ (మంచి విధానం) ఉందా?
  51. మనిషి కేవలం స్వీయ సంస్కరణ చేసుకొంటే సరిపోతుందా?
  52. ముస్లింలకు ఎప్పుడు ఆధిపత్యం లభిస్తుంది?
  53. ముస్లింలపై ముస్లింల హక్కులు ఎన్ని ఉన్నాయి ?
  54. సందేశ ప్రచార విషయంలో ఎలాంటి  ఆదేశం ఉంది?
  55. ప్రపంచంలో సన్మార్గ గాములు ఉన్నారా?
  56. ఏ వర్గం వారు ధార్మిక సేవ అందరికంటే ఎక్కువ చేసారు?
  57. సత్యం ఎవరి పక్షాన ఉంది?ఎవరు సాఫల్యం పొందుతారు?
  58. సామూహిక ప్రాముఖ్యం తెలుపండి ?
  59. అన్నింటికన్నా ప్రాముఖ్యం గల విధి ఏది?
  60. ధర్మంలో నైతికతకు ఎలాంటి స్థానం ఉంది?
  61. ఇస్లామీ వ్యవస్థ లేని దేశంలో మనం ఏ విధంగా జీవించాలి?
  62. దాసులలో అందరికంటే అధికంగా హక్కుగల వారెవరు?
  63. దేవుని అవిధేయత జరిగే పక్షంలో మానవులకు విధేయత చూపవచ్చా?
  64. జీవితం అనగా నేమి?

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

Al-Loolu-wa-Marjan (Maha Pravakta Mahitoktulu)
అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు)

పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి (Book Download) 
Part 01 (మొదటి భాగం)Part 02 (రెండవ భాగం)

[Hadiths from Sahih Bukhari and Sahih Muslim]

Compiled by: Muhammad Favvad Abdul Baaqui
Urdu Translator: Syed Shabbir Ahmed
Telugu Translator: Abul Irfan

అరబిక్ హదీసులుPart 010203 [MS Word]

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడం జరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్‌ ఫవ్వాద్‌ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (text)ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికల పేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్‌అలైహ్‌” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు, పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

Volume 1 (మొదటి భాగం)

[విషయ సూచిక] [Table of Contents]

  1. గ్రంధ పరిచయం
  2. భూమిక
  3. ఉపక్రమని
  4. విశ్వాస ప్రకరణం – [Text టెక్స్ట్ ]
  5. శుచి, శుభ్రతల ప్రకరణం – [Text టెక్స్ట్]
  6. బహిస్టు ప్రకరణం – [Text టెక్స్ట్]
  7. నమాజు ప్రకరణం – [Text టెక్స్ట్]
  8. ప్రార్ధనా స్థలాల ప్రకరణం – [Text టెక్స్ట్ ]
  9. ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం [Text టెక్స్ట్]
  10. జుమా ప్రకరణం [Text టెక్స్ట్]
  11. పండుగ (ఈద్ ) నమాజ్ ప్రకరణం [Text టెక్స్ట్]
  12. ఇస్తిస్ఖా నమాజ్ ప్రకరణం
  13. సలాతుల్ కుసూఫ్ ప్రకరణం
  14. జనాజ ప్రకరణం – [Text టెక్స్ట్]
  15. జకాత్ ప్రకరణం – [Text టెక్స్ట్]
  16. ఉపవాస ప్రకరణం
  17. ఎతికాఫ్ ప్రకరణం
  18. (a) హజ్ ప్రకరణం (b) నికాహ్ ప్రకరణం
  19. స్తన్య సంభందిత ప్రకరణం
  20. తలాఖ్ ప్రకరణం – [Text టెక్స్ట్]
  21. శాప ప్రకరణం
  22. బానిస విమోచనా ప్రకరణం
  23. వాణిజ్య ప్రకరణం
  24. లావాదేవీల ప్రకరణం
  25. విధుల ప్రకరణం
  26. హిబా ప్రకరణం
  27. వీలునామా ప్రకరణం
  28. మొక్కుబడుల ప్రకరణం – [Text టెక్స్ట్]
  29. విశ్వాస ప్రకరణం – (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు -వాటి ఆజ్ఞలు)
  30. సాక్షాధార ప్రమాణ ప్రకరణం

Volume 2 (రెండవ భాగం)

[విషయ సూచిక] [Table of Contents]

  1. హద్దుల ప్రకరణం – [Text టెక్స్ట్]
  2. వ్యాజ్యాల ప్రకరణం
  3. సంప్రాప్త వస్తు ప్రకరణం
  4. జిహాద్ (ధర్మ పోరాటం) ప్రకరణం
  5. పదవుల ప్రకరణం (పరిపాలన విధానం)
  6. జంతు వేట ప్రకరణం
  7. ఖుర్భానీ ప్రకరణం – [Text టెక్స్ట్]
  8. పానియాల ప్రకరణం
  9. వస్త్రధారణ , అలంకరణ ప్రకరణం
  10. సంస్కార ప్రకరణం
  11. సలాం ప్రకరణం
  12. వ్యాధులు – వైద్యం  ప్రకరణం – [టెక్స్ట్ Text]
  13. పద ప్రయోగ ప్రకరణం
  14. కవితా ప్రకరణం
  15. స్వప్న ప్రకరణం
  16. ఘనతా విశిష్టతల ప్రకరణం – [టెక్స్ట్ Text]
  17. ప్రవక్త సహచరుల (రది అల్లాహు అన్హు) మహిమోన్నతల ప్రకరణం
  18. సామాజిక మర్యాదల ప్రకరణం
  19. విధి వ్రాత ప్రకరణం – [టెక్స్ట్ Text]
  20. విద్యా విషయక ప్రకరణం
  21. ప్రాయశ్చిత్త ప్రకరణం
  22. పశ్చాత్తాప ప్రకరణం – [టెక్స్ట్ Text]
  23. కపట విశ్వాసుల ప్రకరణం
  24. స్వర్గ భాగ్యాల , స్వర్గ వాసుల ప్రకరణం – [టెక్స్ట్ Text]
  25. ప్రళయ సూచనల ప్రకరణం
  26. ప్రేమైక వచనాల ప్రకరణం
  27. వ్యాఖ్యాన ప్రకరణం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి

riyadus-saliheen-telugu-islam-1

Hadeesu Kiranaalu (Riyadus Saliheen) –  by Imam Nawawi
[పుస్తకం మొదటి సంపుటం – రెండవ సంపుటం ] 

Compiled by: Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi
Published by: AL-Huq Telugu Publications, Akbarbagh, Hyderabad

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

హదీసు కిరణాలు భాగము-1 :

[0] ప్రారంభ ప్రకరణం

1.     సకల అంతర్బాహ్య వాక్కర్మలలో , సర్వ కాల  సర్వావస్థల్లో  సంకల్ప శుద్ది  అవసరం
2.     పశ్చాత్తాపం (తౌబా)
3.     సహనం , ఓర్పు
4.     సత్యం
5.     దైవధ్యానం
6.     దైవభీతి
7.     ద్రుడనమ్మకం , దైవాన్నే నమ్ముకోవటం
8.     నిలకడ , స్థయిర్యం
9.     దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి …
10.   సత్కార్యాల కోసం తొందరపడటం , సత్కార్యానికి ఎలాంటి సంకోచం లేకుండా , చిత్త శుద్ధితో ….
11.   పోరాట పటిమ
12.   చరమ ఘడియల్లో ఎక్కువగా సత్కార్యాలు చెయ్యాలి
13.   మంచి పనులకు మార్గాలు అనేకం
14.   ఆరాధనలో మధ్యే మార్గం
15.   సత్కార్యాలను నిత్యం పాటిస్తూ వుండాలి
16.   ప్రవక్త సంప్రదాయాన్ని , మర్యాదలను కాపాడాలి
17.   ధైవాజ్ఞను పాలించటం అవసరం
18.   కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు
19.   ఒక మంచి పని లేక చెడు పనిని మొదలు పెట్టిన వాడు
20.   ప్రజల్ని మంచి లేక చెడు వైపుకు పిలవటం గురించి ….
21.   మంచికి , దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా వుండటం
22.   శ్రేయోభిలాష
23.   మంచిని గురించి ఆదేశించటం , చెడు నుంచి ఆపటం
24.   బుద్ది చెప్పి గడ్డి తినే వారి పర్యవసానం
25.   అమానతులు
26.   దుర్మార్గ నిషేధం , దౌర్జన్యాలను అడ్డుకోవాలి
27.   ముస్లింల మర్యాదలను గౌరవించాలి
28.   తోటి ముస్లింల లోపాలను కప్పి పుచ్చాలి
29.  తోటి ముస్లింల అవసరాలను తీర్చటం
30.   సిఫారసు చేయటం
31.   ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నిచటం
32.   దీన , నిరుపేద ముస్లింల విశిష్టత
33.   అనాధలు , బాలికలు , బలహీనుల ….పట్ల మృదువుగా మెలగాలి
34.   స్త్రీల పట్ల సద్ వ్యవహారం
35.   భర్త హక్కులు
36.   ఆలు ,బిడ్డలపై ఖర్చు చేయటం
37.   ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం
38.   తన ఇంటి వారిని , తన అధీనంలో వున్న వారిని దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం
39.   ఇరుగు పొరుగు వారి హక్కుల్ని నెరవేర్చాలి
40.   తల్లి దండ్రుల ఎడల గౌరవం , బంధువుల హక్కులు
41.   తల్లి దండ్రులను ఎదిరించటం , భందుత్వాలను తెంచటం నిషిద్ధం
42.   తల్లి దండ్రుల మిత్రుల పట్ల , ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా ….
43.   దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) పరివారాన్ని , వారి ఔన్నత్యాన్ని గౌరవించాలి
44.   పండితులను , పెద్దలను , పలుకుబడి గలవారిని గౌరవించాలి
45.   మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి …
46.    దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం , తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు తన ప్రేమను ప్రకటించటం
47.   దైవానికి ఇష్టమైన  దాసుని లక్షణాల గురించి ….
48.   సజ్జనుల్ని, బలహీనుల్ని , అభాగ్యుల్ని  హింసించటం మహాపాపం
49.   ప్రజలతో వారి బాహ్యాచరణల్ని  బట్టి వ్యవహరించాలి
50.   దైవ భీతి
51.   దైవ కారుణ్యం  పట్ల ఆశాభావం
52.   ఆశా భావ విశిష్టత
53.   దైవం పట్ల భీతి , ఆశ రెండూ వుండాలి
54.   దైవ భీతితో కంటతడి పెట్టటం …. దైవాన్ని కలుసు కోవాలని వేగిర పడటం
55.   ఐహిక అనాసక్తత …  నిరుపేద జీవితాన్ని గడపటం
56.   పస్తులతో , ఆర్ధిక ఇబ్బందులతో జీవితం గడపటం , మామూలు సౌకర్యాలతోనే తృప్తిగా బతకటం
57.   ఆత్మ తృప్తితో బ్రతకటం , ఇతరుల ముందు చేయిచాపకుండా వుండటం
58.   అర్ధింపు , అత్యాశలు లేకుండా లభించే ధనాన్ని స్వీకరించవచ్చు
59.   చెమటోడ్చి డబ్బు సంపాదించి , తన స్వయాన్ని పోషించుకోవడంతో పాటు ఇతరులకు కూడా సహాయం ….
60.   దాతృత్వం ,  ఔదార్యం , దైవ ప్రసన్నతా దృష్టితో మంచి పనులకోసం  ధనం  ఖర్చు పెట్టటం
61.   పిసినారితనానికి , పేరాశకు దూరంగా వుండాలి
62.   త్యాగం , సానుభూతి
63.   పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించి పోవటానికి ప్రయత్నించటం
64.   కృతజ్ఞుడైన ధనవంతుడు
65.   మరణాన్ని గుర్తు చేసుకుంటూ వుండటం , కోరికల్ని అదుపులో వుంచుకోవటం
66.   పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి
67.   ఆపదలు వచ్చినప్పుడు చావుని కోరుకోరాదు , ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం …
68.   సందేహాస్పద విషయాల జోలికి పోరాదు
69.   కల్లోలం , ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఏకాంతాన్ని ఆశ్రయించటం
70.   సహా జీవన శ్రేష్టత
71.   తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో … వ్యవహరించాలి
72.   గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం
73.   ఉత్తమ నడవడిక
74.   సౌమ్యం , విజ్ఞత , మృదుత్వం
75.   మన్నిం పుల  వైఖరి , మూర్ఖుల పట్ల ఉపేక్షా భావం
76.   కస్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం
77.   షరియత్ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం వ్యక్తం చేయాలి
78.   పాలకులు ప్రజల పట్ల మృదువుగా వ్యవహరించాలి
79.   న్యాయశీలుడైన పరిపాలకుడు
80.  ధర్మ సమ్మతమైన విషయాల్లో పాలకులకు విధేయత చూపటం విధి , అధర్మ విషయాల్లో వారికి విధేయత చూపటం నిషిద్ధం
81.   పదవుల్ని కాంక్షించకూడదు , తన అవసరం లేదను కున్నప్పుడు …
82.   రాజులు , న్యాయమూర్తులు … తమ కొలువులో సదాచార సంపన్నులైన వారినే ఉద్యోగులుగా నియమించు కోవాలి…
83.   పాలనాదికారాలను … అడిగేవారికి … ఇవ్వకూడదు

[1] సంస్కార ప్రకరణం

84.   వ్రీడ, దాని మహత్యం
85.   రహస్యాలను దాచటం
86.   వాగ్దాన పాలన
87.   మంచి అలవాట్లను కొనసాగించాలి
88.   ఇతరుల్ని కలుసుకునే టప్పుడు వారితో నవ్వుతూ మాట్లాడాలి
89.   ఎదుటి వ్యక్తికి అర్ధం అయ్యే విధంగా మాట్లాడాలి
90.  తోటి వారి మాటల్ని రహస్యం కాకపోతే వినవచ్చు …
91.   హిత భోధ లోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి
92.   ప్రశాంతత, హుందాతనం
93.   నమాజుకు గాని … ఇత్యాది ఆరాధనలకోసం గాని వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి
94.   అతిధులకు మర్యాద చేయటం
95.   శుభవార్తలు అందచేయటం, శుభాకాంక్షలు తెలుపటం ….
96.   బంధు మిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ సాగనంపాలి
97.   ఇస్తిఖార మరియు పరస్పరం సంప్రదింపులు జరుపుకోవటం గురించి
98.   పండుగ నమాజులకు … మరే ఆరాధనకైనా వెళ్లి నప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యంతో పాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లు అవుతుంది
99.   ప్రతి మంచి పనినీ కుడి వైపు నుంచి ఆరంభించటం అభిలషణీయం

[2] భోజన నియమాలు

100.    భోజనానికి ముందు బిస్మిల్లా పటించాలి , చివర్లో అల్హందులిల్లా  అనాలి
101.    అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు,బాగుంటే పొగడాలి
102.    ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే  అతను ఏమి చేయాలి?
103.    అతిధి తనతోపాటు మరెవరినైనా విందుకు తీసుకెల్లదలిచినపుడు
104.    కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి
105.    బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు
106.    ఎంత తిన్నా కడుపు నిండక పొతే ఏమి చేయాలి?
107.    పళ్ళెంలో ఒక ప్రక్క నుండి తినాలి
108.    ఒత్తిగిలి తినడం అవాంఛనీయం
109.    మూడు వ్రేళ్ళతో తినడం, అన్నం తిన్న తర్వాతా వ్రేళ్ళను నాక్కోవటం…
110.    అన్నం తక్కువగా ఉండి  తినే వాళ్ళు ఎక్కువమంది ఉంటె ఏం చేయాలి?
111.    పానీయం సేవించే పద్ధతి?
112.    కూజాల మూతికి నోరు తగిలించి నీళ్ళు త్రాగటం అవాంఛనీయం. అయితే..
113.    పానీయాల్లో ఊదటం అవాంఛనీయం
114.    పానీయం కూర్చొని త్రాగటం ఉత్తమం
115.    పానీయ పంపిణీ దారుడు  అందరికన్నా చివర్లో తాగాలి
116.    వెండి బంగారు పాత్రలు మినహా పరిశుభ్రమైన ఇతర పాత్రలన్నింటిలో  పానీయాన్ని సేవించవచ్చు

[3] వస్త్రధారణ ప్రకరణం

117.    తెల్లదుస్తులు  ధరించటం అభిలషణీయం .  ఎరుపు , ఆకుపచ్చ …
118.    చొక్కా ధరించటం అభిలషణీయం
119.    చొక్కా , చొక్కా చేతులు , లుంగీ , తలపాగా కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం
120.    అణకువ కొద్దీ ఖరీదైన దుస్తుల్ని ధరించకుండా వుండటం
121.    వస్త్రధారణలో మధ్యేమార్గాన్ని అవలంబించటం …
122.    పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్దం …
123.    గజ్జి , దురద వున్నవారు పట్టుబట్టలు ధరించవచ్చ్చు
124.    చిరుత తోలు మీద కూర్చోరాదు … దాన్ని వాహనం మీద ఆసనంగా ఉపయోగించరాదు
125.    కొత్తబట్టలు , కొత్తచెప్పులు మొదలగునవి తొడుకున్నప్పుడు  ఏమని పలకాలి ?
126.    దుస్తులు ధరించేటప్పుడు కుడివైపు నుండి ఆరంభించాలి?

[4] నిద్ర ప్రకరణం

127.    నిద్రపోయేటప్పుడు  చేయవలసిన ప్రార్ధనలు
128.    వెల్లకిలా పడుకోవటం , ఒక కాలి మీద మరొక కాలు పెట్టుకొని పడుకోవటం
129.    సమావేశ నియమాలు
130.    స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు

[5] సలాం ప్రకరణం

131.    సలాం విశిష్టత , సలాంను సర్వ సామాన్యం చేయాలి
132.    సలాం చేసే పద్ధతి
133.    సలాం నియమాలు
134.    మాటిమాటికీ  సలాం చేసుకుంటూ ఉండటం అభిలషణీయం ….
135.    ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి
136.    పిల్లలకు సలాం చేయటం
137.    పురుషుడు  స్త్రీలకు, స్త్రీలు పురుషులకు సలాం చేయటం గురించి
138.    దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం
139.    సమావేశం నుంచి లేదా తనతో పాటు కూర్చొని ఉన్నవారికి దగ్గర్నుంచి లేచి వెళ్ళేటప్పుడు వారికి సలాం చేసి వెళ్ళాలి
140.    అనుమతి కోరటం – దాని పద్ధతి
141.    అనుమతి కోరినప్పుడు ఎవరిని అడిగితే ‘నేను’ అని అనరాదు ….
142.    తుమ్ముకు సంబంధించిన ఆదేశాలు
143.    పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం …. నగుమోముతో పలకరించటం , మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం

[6] రోగుల పరామర్శ ప్రకరణం

144.    వ్యాదిగ్రస్తున్ని పరామర్శించటం , శవం వెంట వెళ్లటం ….
145.    వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్ధించాలి ?
146.    రోగి బాపతు వారిని రోగి యోగక్షేమాలు  అడుగుతూ ఉండటం అభిలషణీయం
147.    జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు ఏమని ప్రార్ధించాలి ?
148.    రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని రోగి ఇంటివారికి హితవు చెప్పాలి ….
149.    దైవం పట్ల అప్రసన్నతా భావంతో కాకుండా …. రోగి తనకు భాదగా , జ్వరంగా ఉందని చెప్పటంలో తప్పులేదు
150.    మరణం సమీపించిన వారిని కలిమా పాటించమని ప్రోత్సహించాలి
151.    మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్ధించాలి ?
152.    మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు , మృతుని కుటుంబీకులు ఏమని ప్రార్ధించాలి ?
153.    ఏడ్పులు , పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి విలపించటం ధర్మ సమ్మతమే
154.    మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు
155.    జనాజా నమాజ్ చేయటం …. జనాజా వెంట నడవటం …. జనాజా వెంట స్త్రీలు వెళ్లటం ….
156.    జనాజా నమాజ్ లో  ఎక్కువమంది పాల్గొనటం , మూడు లేదా అంతకంటే ఎక్కువ పంక్తులుగా నిన్చోవటం
157.    జనాజా నమాజ్ లో పాటించబడే దుఆల వివరణ
158.    జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి
159.    మృతుని అప్పు తీర్చటంలో , అంత్యక్రియల్లో తొందర చేయాలి
160.    శ్మశానంలో హితభోద చేయవచ్చు
161.    మృతున్ని  ఖననం చేసిన తరువాత అతని శ్రేయస్సు కొరకు ప్రార్ధించటం ….
162.    మృతుని తరుఫు నుండి దానధర్మాలు చేయటం , అతని శ్రేయస్సు కోసం ప్రార్ధించటం
163.    మృతుని మంచితనాన్ని కొనియాడ వచ్చు
164.    సంతాన వియోగం పట్ల సహనం వహించే వారికి లభించే పుణ్యం
165.    దుర్మార్గుల సమాధుల , అవశేషాల మీదుగా వెళ్ళినప్పుడు భయపడుతూ… విలపిస్తూ వెళ్ళాలి…..

[7] ప్రయాణ ప్రకరణం

166.    గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టటం అభిలషణీయం
167.    ప్రయాణానికి కలిసి బయలుదేరటం , ప్రయాణం లో తమలో ఒకనిని నాయకునిగా ఎన్నుకోవటం
168.    ప్రయాణానికి సంభందించిన ఇతర ఆదేశాలు
169.    తోటి ప్రయాణీకులకు సహాయం చేయటం
170.    వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు పాటించవలసిన దుఆలు
171.    ప్రయాణం లో మెరక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు “ అల్లాహు అక్బర్  “ అని అనాలి .పల్లపు ప్రాంతాలలో దిగుతున్నప్పుడు “సుబహానల్లా హ్ “ అని అనాలి
172.    ప్రయాణా వస్థ లో  దుఅ చేయటం మంచింది
173.    ప్రయాణం లో ఎవరైనా కీడు తలపెడ తారేమోనన్న్న భయముంటే ఈ దుఅ చేసుకోవాలి
174.    ప్రయాణంలో దిగిన చోట ఈ వాక్యాలు పాటించాలి
175.    బాటసారి పని ముగిసిన వెంటనే ఇంటి ముఖం పట్టాలి
176.    ప్రయాణం నుండి పగటిపూట ఇంటికి తిరిగిరావటం అభిలషణీయం . రాత్రివేళ తిరిగి రావటం అవాంచనీయం
177.    ప్రయాణం నుంచి తిరిగొచ్చి తమ నగరాన్ని చూడగానే ఏమని ప్రార్ధించాలి ?
178.    ప్రయాణం నుంచి తిరిగోచ్చేవారు  ముందుగా తమ ఇంటిని దగ్గరలో ఉన్న మజీద్ కు వెళ్లి రెండు రకాతుల నమాజ్ చేసుకోవటం అభిలషణీయం
179.    స్త్రీలు ఒంటరిగా ప్రయాణించటం నిషిద్ధం

హదీసు కిరణాలు భాగము 2 (Volume 2)

[8] మహత్యాల ప్రకరణం

180. దివ్య ఖురాన్ పారాయణ మహత్యం
181. ఖురాన్ ను కంటస్థం చేసుకున్న తర్వాత దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి
182. ఖురాన్ ను మధురాతి మధురంగా పారాయణం చేయటం , చదివించుకొని మరీ వినటం ….
183. కొన్ని ముఖ్యమైన సూరాల , సూక్తుల పటనం
184. అందరూ ఒక చోట చేరి ఖురాన్ పారాయణం చేయటం ….
185. వుజూ ఘనత
186. అజాన్ ఘనత
187. నమాజుల ఘనత
188. ఫజ్ర్ , అసర్ నమాజుల ఘనత
189. మస్జిద్ లకు కాలి నడకన వెళ్ళటం
190. నమాజ్ కై నిరీక్షించటం
191. సామూహిక నమాజ్ ఘనత
192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనటం
193. ఫజ్ర్ నమాజుల పరిరక్షణ విషయమై ఆజ్ఞలు , వాటిని త్యజించటం పై కటినమైన వారింపులు
194. మొదటి పంక్తి ఘనత , ముందుగా తొలి పంక్తుల్ని భర్తీ చేయాలి , పంక్తులు తిన్నగా మధ్యలో ఖాళీ స్థలం లేకుండా ఉండాలి
195. ఫర్జ్ నమాజులతో పాటు సున్నతే ము అకద్దా ఘనత
196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు
197. ఫజ్ర్ వేళ సున్నత్ నమాజును సంక్షిప్తంగాచేయాలి , ఆ నమాజులో పటించవలసిన సూరాలు …
198. ఫజ్ర్ వేళ సున్నత్ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి పడుకోవటం … తహజ్జుదు నమాజు ….
199. జుహర్ కు సంబంధిన సున్నత్ లు
200. అసర్ కు సంబంధిన సున్నత్ లు
201. మగ్ రిబ్ ముందు , దాని తర్వాత చేయబడే సున్నత్ లు
202. ఇషాకు ముందు , ఆ తర్వాత చేయబడే సున్నత్ లు
203. జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు
204. నఫిల్ నమాజులను ఇంట్లో చేయటం , ఫర్జ్ తరువాత నఫిల్ కోసం స్థలం మార్చటం ….
205. విత్ర్ నమాజు చేయమని ప్రోత్సాహం , అది సున్నతే ము అక్కదా ….
206. చాప్త్ నమాజు – దాని రకాతుల సంఖ్య
207. చాప్త్ నమాజుకు సమయం
208. తహియ్యతుల్ మస్జిద్ నమాజు ….
209. వుజూ తర్వాత రెండు రకాతుల నమాజు
210. జుమానాటి ఘనత , జుమా నమాజు …..
211. వరాలు ప్రాప్తిన్చినప్పుడు , ఆపదలు తొలగిపోయినపుడు కృతజ్ఞతా పూర్వకంగా దైవ సన్నిధిలో మోకరిల్లటం
212. రాత్రి పూట చేసే నమాజు ఘనత
213. రంజాన్ లో ఖియాం ( తరావీహ్ నమాజు )
214. లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు ….
215. మిస్వాక్ ఘనత ,మానవ సహజమైన ఆచరణలు
216. జకాత్ విధింపు – దాని ఘనత …
217. రంజాన్ ఉపవాసాల విధింపు , వాటి ఘనత ….
218. రంజాన్ మాసంలో ముఖ్యంగా చివరి దశకంలో దానధర్మాలు , సత్కార్యాలు అధికంగా చేయాలి
219. సగం షాబాన్ మాసం తరువాత రంజాన్ కి ముందు ఉపవాసం పాటించ కూడదు ….
220. నెలవంకను చూసినప్పుడు పటించ వలసిన దుఅ
221. సహరీ భోజనంలో ఆలస్యం చేయటం ….
222. ఇఫ్తార్ లో త్వరపడటం , ఇఫ్తార్ కోసం ఆహార పదార్ధాలు , ఇఫ్తార్ తరువాతి దుఆ
223. ఉపవాసి తన నాలుకను , ఇతర అవయవాలను అధర్మమైన పనుల నుండి కాపాడుకోవాలి
224. ఉపవాసానికి సంబంధించిన కొన్ని ఆదేశాలు
225. ముహర్రం , షాబాన్ మరియు గౌరవ ప్రదమైన మాసాల్లో ఉపవాసం పాటించటం
226. జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం ….
227. అరాఫా రోజు మరియు ముహర్రం మాసపు తొమ్మిదో పదో తేదీల్లో ఉపవాసం
228. షవ్వాల్ మాసపు ఆరు రోజుల ఉపవాసం
229. సోమ గురువారాల్లో ఉపవాసము ఉండటం
230. ప్రతి నెల మూడు రోజులు ఉపవాసం పాటించటం
231. ఇఫ్తార్ చేయించే వారి ఘనత , అతిధి ఆతిధ్య కర్తను దీవించే పద్ధతి 

[9] ఏతెకాఫ్ ప్రకరణం

232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం 

[10] హజ్ ప్రకరణం

233. హజ్ విధింపు ఘనత 

[11] జిహాద్ ప్రకరణం

234. జిహాద్ ఘనత
235. పరలోకపు పుణ్యం రీత్యా అమరగతులుగా భావింపబడేవారి భౌతిక గాయాలకు గుస్ల్ చేయించి నమాజు చేయటం … అవిశ్వాసులతో యుద్ధం చేస్తూ అమరులైన వారి భౌతిక గాయాలకు గుస్ల్ అవసరం లేదు ….
236. బానిస విమోచన విశిష్టత
237. బానిసలపట్ల సద్వ్యవహారం
238. యజమాని హక్కుల్ని నెరవేర్చే బానిస
239. ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం
240. పరస్పర వ్యవహారాల్లో మృదువుగా వ్యవహరించాలి .. 

[12] విజ్ఞాన ప్రకరణం

241. విజ్ఞానం ఘనత 

[13] దైవ స్తోత్రం , దైవ కృతజ్ఞతల ప్రకరణం

242. స్తోత్రం , కృతజ్ఞతల వైశిష్ట్యం
243. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) కోసం దరూద్ పంపించటం 

[14] దైవధ్యాన ప్రకరణం

244. ధైవస్మరణం విశిష్టత
245. నించొని , కూర్చొని ….ఏ స్థితిలో అయినా ధైవస్మరణ చేయవచ్చు ….
246. నిద్ర పోయేటప్పుడు , మేల్కొన్న తరువాత దుఆ
247. ధైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి….
248. ఉదయం, సాయంత్రం ధైవస్మరణ
249. నిద్ర పోయేటప్పుడు చేసే ప్రార్ధనలు 

[15] ప్రార్ధనల ప్రకరణం

250. ప్రార్ధన విశిష్టత
251. పరోక్ష ప్రార్ధన విశిష్టత
252. ప్రార్ధనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు
253. వలీల మహిమలు , వారి గొప్పదనం 

[16] వారింపబడిన విషయాల ప్రకరణం

254. పరోక్ష నింద నిషిద్ధం , నాలుకను అదుపులో ఉంచుకోవాలి
255. పరోక్ష నింద వినటం కూడా నిషిద్ధం ….
256. పరోక్ష నింద కొన్ని పరిస్థితుల్లో సమ్మతమే
257. చాడీలు చెప్పటం నిషిద్ధం
258. ప్రజల సంభాషణలు , వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు
259. రెండు నాల్కల ధోరణి
260. అబద్ధం చెప్పటం నిషిద్ధం
261. అబద్ధంలో ధర్మ సమ్మతమైన రకాలు
262. మనిషి తాము చెప్పే దానిని ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పాలి
263. అబద్దపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడినది
264. నిర్ణీత వ్యక్తిని లేక జంతువుని శపించటం నిషిద్ధం
265. నిర్ణీత వ్యక్తి పేరు తీసుకోకుండా అవిదేయతకు పాల్పడే వారందర్నీ శపించవచ్చు
266. అన్యాయంగా ముస్లిం ని దూషించటం నిషిద్ధం
267. చనిపోయిన వారిని దూషించటం నిషిద్ధం
268. ఇతరులను బాధ పెట్టరాదు
269. పరస్పరం పగతో, సంబంధాలు త్రెంచుకొని ఉండరాదు
270. అసూయ పడరాదు
271. ఇతరుల తప్పు లేన్నటం, ఇతరులకు ఇష్టం లేక పోయినా వారి మాటల్ని వినడానికి ప్రయత్నించటం
272. అనవసరంగా తోటి ముస్లింల గురించి దురనుమానాలు పెట్టుకోరాదు
273. ముస్లింలను చులకనగా చూడరాదు
274. ముస్లిం కి బాధ కలిగిందని సంబరాపడి పోవటం తగదు
275. వంశం గురించి దెప్పి పొడవటం నిషిద్ధం
276. నకిలీల తయారి , మోసం చేయటం నిషిద్ధం
277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం
278. కానుకలు వగైరా ఇచ్చి , తరువాత దెప్పి పొడవటం
279. గర్వ ప్రదర్శన , దౌర్జన్యం చేయరాదు
280. ముస్లిం లు మూడు రోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం
281. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు …..
282. బానిసను, పశువును, భార్యను,పిల్లల్ని అనవసరంగా శిక్షించరాదు
283. ఏ జీవాన్ని అగ్నితో కాల్చి శిక్షించరాదు
284. హక్కు దారునికి హక్కు చెల్లించకుండా వాయిదాలు వేయటం తగదు
285. ఇచ్చిన కానుకల్ని తిరిగి తీసుకోరాదు ….
286. అనాధుల సొమ్ము నిషిద్ధం
287. వడ్డీ కటినంగా నిషేధించబడినది
288. ఇతరులకు చూపించటం కోసం సత్కార్యాలు చేయటం నిషిద్ధం
289. ప్రదర్శనా బుద్ది ( రియా ) క్రిందికి రాణి విషయాలు
290. పర స్త్రీ వైపు , అందమైన బాలుని వైపు చూడటం నిషిద్ధం
291. ఏకాంతంలో పరస్త్రీ వెంట ఉండటం నిషిద్ధం
292. పురుషులు స్త్రీలను , స్త్రీలు పురుషులను అనుకరించరాదు
293. షైతాన్ ను , అవిశ్వాసుల్ని అనుకరించరాదు
294. శిరోజాలకు నల్ల రంగు వేసుకోరాదు
295. ‘ఖజా’ చేయరాదు, ఖజా అంటే ….
296. సవరాలు పెట్టుకోవటం , పచ్చబొట్లు పొడిపించు కోవటం నిషిద్ధం
297. తెల్ల వెంట్రుకల్ని పీకేయరాదు , ప్రాజ్ఞుడైన యువకుడు గడ్డం మీద వచ్చే తొలి వెంట్రుకల్ని పీకేయరాదు
298. కుడి చేత్తో మలమూత్ర విసర్జన చేసుకోరాదు
299. ఒంటి చెప్పుతో నడవటం అవాంచనీయం
300. నిప్పుని ఆర్పకుండా వదిలేయరాదు
301. ‘తకల్లుఫ్ ‘చేయరాదు , తకల్లుఫ్ అంటే ….
302. మృతుని మీద రోదించటం ….మొదలగునవి నిషిద్ధం
303. సోదె చెప్పేవారి వద్దకు …. మొదలగువారి వద్దకు పోరాదు
304. వేటినీ దుశ్శాకునంగా భావించరాదు
305. ప్రాణుల బొమ్మలు గీయరాదు …..
306. వేట కోసం , పశువుల పొలాల రక్షణ కోసం తప్ప కుక్కల్ని పెంచరాదు
307. జంతువుల మెడలకు గంటలు కట్టడం , ప్రయాణంలో కుక్కల్ని, గంటల్ని తోడున్చుకోవటం అవాంచనీయం
308. ‘జల్లాలా’ పశువు మీద స్వారీ చేయటం అవాంచనీయం
309. మస్జిద్ లో ఉమ్మివేయరాదు …..
310. మస్జిద్ లో బిగ్గరగా అరవటం , పోయిన వస్తువుల గురించి ప్రకటనలు వగైరా చేయటం తగదు
311. ఉల్లి, వెల్లుల్లి మొదలగునవి తిని మస్జిద్ కు వెళ్ళరాదు
312. జుమా ఖుత్బా జరుగుతున్నప్పుడు మోకాళ్ళు పొట్టకు ఆన్చి కూర్చోవటం అవాంచనీయం
313. ఖుర్బానీ చేసే వారు తమ ఖుర్బానీ సమర్పించే వరకు వెంట్రుకల్ని , గోళ్ళను కత్తిరించరాదు .
314. సృష్టి రాశుల మీద ప్రమాణం చేయరాదు ….
315. అబద్దపు ఒట్టేయటం కటినంగా వారించబదినది .
316. ఒక విషయం గురించి ప్రమాణం చేసిన తరువాత అంతకంటే మెరుగైన విషయం ముందుకు వచ్చినప్పుడు
317. పొరపాటు ప్రమాణం గురించి …..
318. లావాదేవీల్లో ప్రమాణం చేయటం అవాంచనీయం
319. అల్లాహ్ ను స్వర్గం కాకుండా వేరితర వస్తువులు అడగటం అవాంచనీయం
320. రాజులు మొదలగు వారిని చక్రవర్తులు అని అనరాదు , ఎందుకంటే…..
321. పాపాత్మున్ని , ధర్మంలో కొత్త పోకడలు పాల్పడేవాన్ని గౌరవ పదాలతో సంభోదించ రాదు
322. జ్వరాన్ని తూలనాడటం తగదు
323. గాలిని తిట్టరాదు , గాలి వీచేటప్పుడు దుఆ చేయటం గురించి …..
324. కోడిపుంజు ని తిట్టటం అవాచనీయం
325. ఫలానా నక్షత్రం మూలంగానే మీకు వర్షం కురిసింది అని చెప్పరాదు
326. ముస్లింని ‘ఓయీ ధైవతిరస్కారీ !’ అని పిలవటం నిషిద్ధం
327. అశ్లీలపు మాటలు మాట్లాడరాదు, దుర్భాషలాడరాదు
328. అసహజంగా మాట్లాడటం, అర్ధంకాని పదాలు ప్రయోగించటం , వత్తులు, పొల్లులను గురించి చాదస్తంగా వ్యవహరించటం తగదు
329. నా మనసు మలినమైపోయిందని చెప్పరాదు
330. ద్రాక్ష పండ్లను ‘కర్మ్’ అని అనరాదు
331. అనవసరంగా స్త్రీ సుగుణాలను ఇతర పురుషుని ముందు వివరించరాదు
332. “ఓ అల్లాహ్! నీకు ఇష్టముంటే నన్ను క్షమించు “ అని అనరాదు
333. దేవుడు తలచింది, ఫలానా అతను తలచింది అని అనటం అవాంచనీయం
334. ఇషా నమాజ్ తర్వాత మాట్లాడుకోవటం అవాంచనీయం
335. భార్య భర్త పిలుపును నిరాకరించటం నిషిద్ధం
336. భర్త ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీ అతని అనుమతి లేకుండా ఉపవాసాలు పాటించటం
337. రుకూలో లేక సజ్దాలో ముఖ్తదీ ఇమామ్ కంటే ముందు తలపైకేత్తటం నిషిద్ధం
338. నమాజ్ చేసేటప్పుడు జ్బ్బలమీద చేతులు పెట్టటం అవాంచనీయం
339. బాగా ఆకలిగా ఉండి అన్నం వడ్డించి ఉన్నప్పుడు…. నమాజ్ చేయటం అవాచనీయం
340. నమాజ్ లో దృష్టి పైకెత్తి ఆకాశం వైపు చూడరాదు
341. అకారణంగా నమాజులో దిక్కులు చూడరాదు
342. సమాధుల అభిముఖంగా నమాజ్ చేయరాదు
343. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళరాదు
344. ముఅజ్జిన్ ఇఖామత్ మొదలు పెట్టిన తరువాత ముఖ్తదీలు నఫిల్ నమాజులు చేయటం అవాంచనీయం
345. జుమా నాటి పగలుని ఉపవాసం కోసం , రాత్రిని నమాజుల కోసం ప్రత్యేకించుకోరాదు
346. విసాల్ ఉపవాసం పాటించటం నిషిద్ధం
347. సమాధి మీద కూర్చోవటం నిషిద్ధం
348. సమాధుల మీద గుమ్మటాలు కట్టటం నిషిద్ధం
349. బానిస తన యజమాని దగ్గరి నుంచి పారిపోవటం చాలా తీవ్రమైన విషయం
350. దేవుడు నిర్ణయించిన శిక్షల విషయంలో సిఫారసు చేయరాదు
351. ప్రజలు నడిచే దారుల్లో , నీడ ఉండే చోట….. మల మూత్ర విసర్జన చేయరాదు
352. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయరాదు
353. తండ్రి తన పిల్లలకు కానుకలు ఇవ్వటంలో ఒకరి మీద మరొకరికి ప్రాధాన్యత నివ్వటం అయిష్టకరం
354. మృతుని గురించి మూడు రోజులకు మించి సంతాపం ప్రకటించరాదు
355. పల్లెటూరి వాని కోసం పట్టణ వాసి బేరం చేయటం , తన సోదరుడు వివాహ సందేశం పంపిన చోట తను వివాహ సందేశం పంపటం తగదు
356. షరీఅత్ అనుమతించని పనుల మీద ధనం ఖర్చు పెట్టరాదు
357. ముస్లిం వైపు ఆయుధం చూపటం నిషిద్ధం, నగ్నఖడ్గం చేబూనటం తగదు
358. అజాన్ తర్వాత మస్జిద్ నుండి బయటికి వెళ్లి పోవటం అవాంచనీయం
359. సుగంధ ద్రవ్య కానుకను నిరాకరించటం అవాంచనీయం
360. గర్వాహన్కారాలకు లోనవుతాడేమోనన్న భయముంటే ఎవర్నీ వారి సమక్షంలో పొగడరాదు
361. అంటువ్యాధి ప్రబలి వున్న నగరం నుంచి పారిపోవటం, బయటివారు లోనికి ప్రవేశించటం అవాంచనీయం
362. చేతబడి చేయటం, నేర్చుకోవటం, కటినంగా నిషేధించబడినది
363. ఖుర్ఆన్ ను దైవ విరోధుల ప్రాంతాలకు తీసుకు వెళ్ళరాదు
364. వెండి బంగారు పాత్రలను ఉపయోగించరాదు
365. పురుషుల కాషాయరంగు దుస్తులు ధరించటం నిషిద్ధం
366. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం
367. తన రక్తసంబందాన్ని, తన బానిసత్వ సంబంధాన్ని వక్రీకరించుకోవటం నిషిద్ధం
368. దేవుడు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించిన విషయాల జోలికి పోరాదని హెచ్చరిక
369. నిషిద్ధ విషయాలకు పాల్పడినవాడు పాప నిష్కృతి కోసం ఏమి చేయాలి? 

[17] పలు విషయాల ప్రకరణం

370. ప్రళయ చిహ్నాలు 

[18] ఇస్తిగ్ఫార్ ప్రకరణం

371. మన్నింపు వేడుకోలు
372. అల్లాహ్ విశ్వాసుల కొరకు స్వర్గం లో తయారు చేసి ఉంచిన వాటి గురించి

షహాదహ్ – ఒక ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం

టైటిల్: షహాదహ్ – ఒక ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం
నిర్మాణం : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: షహాదహ్ అంటే ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవన మార్గం పై నడిపిస్తుందో, ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించబడెను. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది.

CONFESSION OF A MUSLIM

لا إلــه إلاالله محمد رسول الله

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

(అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు)

ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్థంభమైన – లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క మహోన్నత వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం:

لا إلاه إالله محمد رسول الله

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

అనే పవిత్ర వాక్యాన్ని మూడు భాగాలలో అర్థం చేసుకోవచ్చును: a (మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం, నాలుగవ నియమం), b & c

a) క్రింద తెలిపిన నాలుగు నియమాల పై సర్వలోకాల సృష్టకర్త, ఉనికిలో ఉన్న ప్రతి దానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదిన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.

మొదటి నియమం: “కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాని సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం. A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించ వలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకల లోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ఈ విశాల విశ్వపు ప్రతిదీ నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరియు కేవలం ఆయనే పోషిస్తాడు, సంరక్షిస్తాడు” దీనిని “అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.

రెండవ నియమం: “ఇతరులెవ్వరూ ఆరాధ్యులు కారు, కాని ఒక్క అల్లాహ్ తప్ప” అని హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వటం: ఇస్లామీయ భాషలో ఆరాధన అనే పదం అనేక విసృతార్థాలను ఇస్తుంది: అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే చెందును అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతున్నది. (అంటే ఇతరులెవ్వరూ – వారు దైవదూతలైనా, ప్రవక్తలైనా, సందేశహరులైనా, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా-జీసస్ అలైహిస్సలాం అయినా, ఉజైర్, ముహమ్మద్, సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, సన్యాసులు అయినా, ఇంకా వేరే ఇతర అసత్యపు ఆరాధ్య దైవాలన్నీ ఆరాధించటానికి అస్సలు అర్హులు కారు) కాబట్టి కేవలం అల్లాహ్ నే ఆరాధించవలెను, అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులెవ్వరినీ వేడుకోరాదు, అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరులెవ్వరి పేరు మీదా పశువులను బలివ్వరాదు, … etc, మరియు దీని అర్థం ఏమిటంటే – ఖుర్ఆన్ లో మరియు సున్నహ్ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు) లలో వేటినైతే ఆచరించమని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఆదేశించారో వాటిని మనం తప్పక ఆచరించ వలెను. మరియు ఏదైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించారో, వాటిని మనం అస్సలు చేయకూడదు. దీనినే “అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకైకత్వం” – తౌహీదుల్ ఉలూహియ్యహ్ అని అంటారు. కాబట్టి మనం అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ ను వదిలి ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు.