70- ఎంత గొప్ప వస్తువైనా ప్రసాదించడం అల్లాహ్‌కు కష్టతరమైన పని కాదు. సృష్టిరాసుల అవసరాలు పూర్తి చేయకుండా ఆయన్ని అడ్డుకునేవాడెవడూ లేడు. వారి అవసరాలు పూర్తి చేయటకు ఆయన్ని బలవంతం చేయువాడెవడూ లేడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీరు అల్లాహ్ తో దుఆ చేస్తున్నప్పుడు “అల్లాహ్! నీవు కోరితే నన్ను క్షమించు, అల్లాహ్! నీవు కోరితే నన్ను కరుణించు, అల్లాహ్! నీవు కోరితే నాకు ఆహరం ప్రసాదించు” అని దుఆ చేయవద్దు. దానికి బదులుగా దృఢ నమ్మకంతో దుఆ చేయాలి. ఆయన తాను కోరింది చేయగలవాడు. ఆయన్ని ఎవరూ బలవంతం పెట్ట లేరు”. (బుఖారి/ఫిల్ మషీఅతి వల్ ఇరాద 7477, ముస్లిం/ అల్ అజ్మ్ బిద్దుఆ…2678).
మరో ఉల్లేఖనంలో ఉందిః “తన కోరికను చాలా స్పష్టంగా తెలుపాలి. నిశ్చయంగా అల్లాహ్ ప్రాసదించేవాటిలో ఆయనకు కష్టతరమైనదేదీ లేదు”. (ముస్లిం 2679).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్” యొక్క వివరణ https://youtu.be/Y9EhNR3PhYw [27 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క రెండు గొప్ప నామాలైన “అల్-హయ్యు” (సజీవుడు) మరియు “అల్-ఖయ్యూమ్” (సర్వానికి ఆధారభూతుడు) యొక్క లోతైన అర్థాలను వివరిస్తారు. “అల్-హయ్యు” అంటే అల్లాహ్ శాశ్వతంగా, సంపూర్ణంగా జీవించి ఉన్నవాడని, ఆయన జీవంలో ఎలాంటి లోపం లేదని, మరియు సమస్త జీవరాశులకు ఆయనే జీవప్రదాత అని అర్థం. “అల్-ఖయ్యూమ్” అంటే అల్లాహ్ స్వీయ-ఆధారితమైనవాడని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని, అదే సమయంలో సృష్టి మొత్తాన్ని ఆయనే పోషిస్తూ, నిర్వహిస్తున్నాడని భావం. ఈ రెండు నామాలు కలిసి అల్లాహ్ యొక్క అన్ని ذاتي (దాతి) మరియు فعلي (ఫి’లీ) గుణాలను కలిగి ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు. ఈ నామాల ప్రాముఖ్యతను వివరించడానికి ఖురాన్ (సూరహ్ అల్-బఖరా, సూరహ్ ఆల్-ఇమ్రాన్, సూరహ్ తాహా) మరియు హదీసుల నుండి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కష్ట సమయాల్లో ఈ నామాలతో అల్లాహ్‌ను ప్రార్థించడం చాలా పుణ్యప్రదమని, ఆయన సహాయం మరియు క్షమాపణ పొందటానికి ఇది ఒక మార్గమని చెప్పబడింది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడటానికి ఈ నామాలను అర్థం చేసుకుని, వాటిపై ధ్యానం చేయాలని వక్త ప్రోత్సహించారు.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క శుభ నామాలలో చాలా గొప్ప నామాలలో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.
మీకు తెలిసిన విషయమే, అల్-హయ్యు అల్-ఖయ్యూమ్, ఇవి రెండూ కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు.
అల్-హయ్యు (The Ever-Living) – సజీవుడు
అల్-హయ్యు అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి, ప్రతీ ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు.
అందులో అల్లాహ్ యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తఆలా యొక్క గొప్ప గుణం, అల్లాహ్ సజీవుడు. స్వతహాగా, ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తఆలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు.
మన జీవితం, సృష్టి రాశుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వేలాది, లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉన్నా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమీ లేకుండా ఉన్నారు. ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది. కానీ అల్లాహు తఆలా ఆది, అంతము లేనివాడు. అల్లాహ్ మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాహ్ కే తెలుసు. అప్పటినుండి ఉన్నాడంటే, చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహ్ కు మరణం అన్నది, మరియు అలసట అన్నది, నిద్ర, కునుకు అన్నది ఏదీ కూడా లేదు. అదే విషయం సూరత్ అల్-బఖరా లోని ఆయతల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ ఇలా అంటాడు:
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌ وَلَا نَوْمٌ అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్ అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, అల్-హయ్యు (సజీవుడు), అల్-ఖయ్యూమ్ (సృష్టి యావత్తుకు ఆధారభూతుడు). ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.
ఇక్కడ అల్-హయ్యు యొక్క వివరణలో, “లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్” అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా.
అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వఅలైక తవక్కల్తు, వఇలైక అనబ్తు, వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ, అంతల్ హయ్యుల్లదీ లా యమూత్, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన్.
ఓ అల్లాహ్, నీకు నేను విధేయుడనయ్యాను, నిన్నే నేను విశ్వసించాను, నీపైనే నేను భారం మోపాను, నీ వైపునకే నేను మరలాను, నీ ఆధారంగానే నేను వాదిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీ ఘనత యొక్క శరణు కోరుతున్నాను, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయకుండా కాపాడు. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రాని వానివి. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారే.
అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా గానీ, వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ అల్లాహుల్లదీ ఖలఖకుమ్ అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. (సూరతుర్-రూమ్)
సూరతుర్-రూమ్ లో ఇంతకుముందు మనం ఆయత్ విని ఉన్నాము. అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తఆలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు.
అయితే సోదర మహాశయులారా, అల్-హయ్యు, ఇందులో అల్లాహు తఆలా యొక్క దీనిని “ఇస్మే దాత్” అని కూడా అంటారు. అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప, స్వతహాగా ఉండే అటువంటి గుణాలన్నిటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో తెలియజేశారు:
الحَيُّ الْجَامِعُ لِصِفَاتِ الذَّاتِ అల్-హయ్యు అల్-జామిఉ లి-సిఫాతిద్-దాత్ అల్-హయ్యు (అనే పేరు) అల్లాహ్ యొక్క స్వతస్సిద్ధమైన గుణాలన్నిటినీ సమీకరించేది.
అల్లాహ్ యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్-ఇల్మ్ (జ్ఞానం), వస్-సమ్’అ (వినడం), వల్-బసర్ (చూడడం), వల్-యద్ (చెయ్యి), ఇలాంటి అల్లాహ్ యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్, సహీహ్ హదీసులలో, వాటన్నిటినీ, అవన్నీ కూడా ఈ అల్-హయ్యు అన్న పేరులో వచ్చేస్తాయి.
అల్-ఖయ్యూమ్ (The Self-Sustaining) – సర్వ సృష్టికి ఆధారభూతుడు
ఇక అల్-ఖయ్యూమ్. దీని భావం ఏమిటంటే, అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే, ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ, వాటికి బాధ్యత తీసుకుని ఉన్నాడు. అందుకొరకే, సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్-ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు “సర్వ సృష్టికి ఆధారభూతుడు” అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ పేరు గురించి చెప్పారు,
القَيُّومُ الْجَامِعُ لِصِفَاتِ الأَفْعَالِ అల్-ఖయ్యూమ్ అల్-జామిఉ లి-సిఫాతిల్-అఫ్ఆల్ అల్-ఖయ్యూమ్ (అనే పేరు) అల్లాహ్ యొక్క కార్యాలకు సంబంధించిన గుణాలన్నిటినీ సమీకరించేది.
ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్-ఖల్ఖ్ (సృష్టించడం), అర్-రిజ్ఖ్ (ఉపాధి కలిగించడం), వల్-ఇన్ఆమ్ (అనుగ్రహాలు నొసంగడం), అల్-ఇహ్యా (బ్రతికించడం), వల్-ఇమాత (చంపడం), ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు “రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్” (అల్-ఖయ్యూమ్ అనే పేరు వైపు మరలుతాయి). ఇవన్నీ కూడా అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చేస్తాయి.
అల్-హయ్యు వల్-ఖయ్యూమ్, ఇవి రెండూ ఖురాన్ లో కూడా వచ్చి ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్ లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీహ్ హదీస్ కూడా ఉంది. అబీ హాతిమ్ లో, తిర్మిదీ లో, ఇబ్నే మాజా లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారు “సహీహుల్ జామిఅ” లో ప్రస్తావించారు (హదీస్ నం. 979).
اِسْمُ اللَّهِ الأَعْظَمُ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى ఇస్ముల్లాహిల్ అ’జమ్ అల్లదీ ఇదా దుఇయ బిహి అజాబ్, వ ఇదా సుఇల బిహి అ’తా అల్లాహ్ యొక్క గొప్ప పేరు, దాని ద్వారా దుఆ చేస్తే ఆయన వెంటనే స్వీకరిస్తాడు మరియు దాని ద్వారా అర్ధించడం జరిగితే ఆయన ప్రసాదిస్తాడు.
ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ లోని సూరతుల్ బఖరాలో, సూరత్ ఆల్-ఇమ్రాన్ లో మరియు సూరతు తాహా లో ఉన్నాయి. ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరహ్ బఖరాలో గనుక మనం చూస్తే ఆయత్ నంబర్ 255, ఆయతుల్ కుర్సీలో:
ఇక సూరత్ త్వాహాలో గనుక మనం చూస్తే, ఆయత్ నంబర్ 111:
وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ వ అనతిల్ వుజూహు లిల్-హయ్యిల్ ఖయ్యూమ్.
సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి.
ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతులలో గమనించారు కదా, సూరత్ బఖరాలోని 255, ఆల్-ఇమ్రాన్ లోని స్టార్టింగ్ ఆయత్లో, అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాహ్ ను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో, వారు ఒక్కసారి ఆలోచించాలి.
ఖురాన్ లో అల్లాహ్ ఏమంటున్నాడు?
وَتَوَكَّلْ عَلَى ٱلْحَىِّ ٱلَّذِى لَا يَمُوتُ వ తవక్కల్ అలల్-హయ్యిల్లదీ లా యమూత్. నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి, ఆధారపడి, అతని మీదనే భరోసా ఉంచు.
భరోసా ఉర్దూ పదం, కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇ’తిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడో, ఎన్నటికీ మరణించనివాడో. మరి ఈ రోజుల్లో మనలో ఎంతో మంది తాయెత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా?
ఏ అల్లాహ్ సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని ఆధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి, ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తమూ నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్ మనకు సృష్టికర్తగా, ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత్ నంబర్ 41 చదవండి.
إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا ఇన్నల్లాహ యుమ్సికుస్-సమావాతి వల్-అర్ద అన్ తజూలా. యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుండి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు.
ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నామా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా? సూరహ్ అంబియా లోని ఆయత్ చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి. కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మనం నివసించుటకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అవి గనుక తమ స్థానాల నుండి తొలగిపోతే, అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు.
ఈ ఆయత్ కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్-రూమ్ ఆయత్ నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం, మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా, బలంగా చేస్తుంది.
అల్లాహ్ అంటున్నాడు:
وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ వ మిన్ ఆయాతిహీ అన్ తఖూమస్-సమాఉ వల్-అర్దు బి-అమ్రిహ్ మరియు ఆయన సూచనలలో ఒకటి, ఆకాశం మరియు భూమి ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి.
ఈ “తఖూమ” అన్న పదం ఏదైతే ఉందో, దీని నుండే “ఖయ్యూమ్” అన్న అల్లాహ్ యొక్క పేరు వస్తుంది. (కాఫ్, యా, మీమ్) భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతుర్-ర’అద్ ఆయత్ నంబర్ 33లో కూడా కనబడుతుంది.
أَفَمَنْ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ అఫమన్ హువ ఖాఇమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్ ప్రతి ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షించేవాడు (అల్లాహ్).
అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నిలకొలిపి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. గమనించండి. అలాంటి అల్లాహ్ కు మనం ఎంత విధేయులుగా ఉండాలి.
ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేసి అల్లాహ్ పై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లాహ్ యొక్క దయతో మనకు ఏమీ కాదు, అల్లాహ్ మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు?
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్-హయ్యు లో అల్లాహ్ యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లాహ్ యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీసును చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనం గనుక వాస్తవంగా ఈ హదీసును అర్థం చేసుకుంటే, ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దుఆ చేస్తే, ఎలా ఈ దుఆ స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదీ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524.
كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَرَبَهُ أَمْرٌ قَالَ కానన్-నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా కరబహు అమ్రున్ ఖాల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దుఆ చేసేవారు.
(నోట్ చేసుకోండి మీరందరూ కూడా ఈ దుఆను. గుర్తుంచుకోండి. యాద్ చేసుకోండి. చిన్నదే. నాలుగే పదాలు ఉన్నాయి)
ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్“. నీ యొక్క కరుణ ఆధారంగా, తేరే రహ్మత్ కే వాస్తే సే, నీ కరుణ యొక్క వసీలాతో “అస్తగీస్”, నీ యొక్క సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఎక్కడా ఏ సహాయం దొరకనప్పుడు, అల్లాహ్ నే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు, ఏదైనా పని జరిగే మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో ముందు అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని? ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లాహ్, నఊజుబిల్లా అస్తగఫిరుల్లా, అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు, అల్లాహు తఆలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు, ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అల్లాహ్ చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకుని దుఆ చేస్తూ ఉంటావో, అంతే అల్లాహు తఆలా నీ యొక్క పనులను చక్కబరుస్తూ ఉంటాడు.
ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా కి నేర్పిన దుఆ ఏమిటి? అల్లాహు అక్బర్, గమనించండి. మరియు ఈ దుఆను కూడా మీరు గుర్తుంచుకోండి, ఉదయం సాయంకాలం దుఆలలో చదవండి.
నా సర్వ వ్యవహారాలను అల్లాహ్, నీవు చక్కబరుచు. స్వయం నా వైపునకు గానీ, ఇంకా వేరే ఎవరి వైపునకు గానీ, రెప్ప కొట్టేంత సమయంలో కూడా, అంత కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు, నా వైపునకు అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబరుచు.
అంతేకాదు సోదర మహాశయులారా, ఈ అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ రెండు పేర్లతో మనం ఏదైనా దుఆ చేస్తే కూడా అల్లాహ్ స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకోవాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు తిర్మిదీ లో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే:
أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَىُّ الْقَيُّومُ وَأَتُوبُ إِلَيْهِ అస్తగఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్-హయ్యుల్-ఖయ్యూమ్, వ అతూబు ఇలైహ్
అని చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా గానీ, ఇలాంటి దుఆ అర్థ భావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తఆలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు.
సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు, మరియు ఖురాన్ లో ఆయతు, ఖురాన్ లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మనం మన యొక్క అఖీదా బాగు చేసుకుందాము, ఇలాంటి గొప్ప అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ, దుఃఖ, కష్టం మరియు ఆరాం, స్వస్థత, అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ ను మాత్రమే మనం సజీవంగా, సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు, అలాంటి అల్లాహ్ “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్” అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల వివరణ ముగిస్తున్నాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.
1. అల్లాహ్ యొక్క సుందర నామాలతో వసీలా కోరడం 2. తన విశ్వాసము మరియు సత్కార్యాల మూలంగా వసీలా కోరడం 3. బ్రతికి ఉన్న పుణ్యాత్ములను అల్లాహ్ తో మనకోసం దుఆ చేయమని కోరడం
ఫిఖ్‘హ్ దుఆ – 5: ధర్మసమ్మతమైన వసీలా ఆధారాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[26 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ] {غافر :60} మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ (ప్రార్థనలను) ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు“.
1- అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయడం విధిగా ఉంది. 2- అల్లాహ్ తప్పక దుఆ అంగీకరిస్తాడన్న శుభవార్త ఉంది. 3- అల్లాహ్ తో దుఆ చేయడం తౌహీదె ఇబాదత్ (ఆరాధన). ఇతరులతో దుఆ చేయడం షిర్క్, మహాపాపం, గర్వాహంకారం.
[وَأَنَّ مَا يَدْعُونَ مِنْ دُونِهِ البَاطِلُ] {لقمان:30} ఆయన్ని వదలి ప్రజలు మొరపెట్టుకునేవన్నీ అసత్యం. (లుఖ్మాన్ 31:30).
3- ఇతరులతో దుఆ చేసేవాడు జాలిమ్.
[وَلَا تَدْعُ مِنْ دُونِ اللهِ مَا لَا يَنْفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ] {يونس :106} “అల్లాహ్‌ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు” (అని హెచ్చరించబడింది)
4- ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్.
[وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ] {النحل:86} ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు. అప్పుడు వారు (ఆ భాగస్వాములు), “మీరు చెప్పేది పచ్చి అబద్ధం” అని వారి మాటను ఖండిస్తారు. (నహ్ల్ 16:86)
[حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ الله قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ] {الأعراف: 37} ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
ప్రశ్న: అవిశ్వాసులు ఎవరినైతే పూజించేవారో వారు కేవలం విగ్రహాలే, పుణ్య పురుషులు కారు అని మన వద్ద కొందరి వాదన, ఇది నిజమేనా ?
జవాబు: నిజం కాదు. ఎందుకంటే అల్లాహ్ ఇలా తెలిపాడు
[إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ الله عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ] మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. (ఈ బహుదైవోపాసనలో) మీరు గనక సత్యవంతులయితే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి. (ఆరాఫ్ 7:194).
البخاري 4859 – عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، فِي قَوْلِهِ: {اللَّاتَ وَالعُزَّى} [النجم: 19] «كَانَ اللَّاتُ رَجُلًا يَلُتُّ سَوِيقَ الحَاجِّ» ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు సూర నజ్మ్(53:19) లో వచ్చిన “లాత్” గురించి చెప్పారు: అతను హాజీలకు సత్తూ తయారు చేసి తినిపించే ఓ మనిషి. (అంటే అరబ్బులు అతడ్ని పుణ్యాత్ముడిగా భావించేవారు కనుక అతడు మరణించాక, అతడ్ని పూజించడం మొదలెట్టారు, అల్లాహ్ దానిని ఖండించాడు).
5- ఇతరులతో దుఆ చేయడం వల్ల శిక్ష, విపత్తు కురుస్తుంది
[فَلَا تَدْعُ مَعَ اللهِ إِلَهًا آَخَرَ فَتَكُونَ مِنَ المُعَذَّبِينَ] {الشعراء:213} కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తో పాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా! (షుఅరా 26:213)
క్రింది హదీసుపై శ్రద్ధ వహించి, అందరినీ జాగృతపరచండి
البخاري 4497 – عَنْ عَبْدِ اللَّهِ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ «مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ اللَّهِ نِدًّا دَخَلَ النَّارَ» وَقُلْتُ أَنَا: مَنْ مَاتَ وَهْوَ لاَ يَدْعُو لِلَّهِ نِدًّا دَخَلَ الجَنَّةَ “అల్లాహ్ ను కాకుండా ఇతరులను మొరపెట్టుకుంటూ ఉండేవాడు అదే స్థితిలో చనిపోతే అతను నరకంలో ప్రవేశిస్తాడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దీనిపై నేను చెబుతున్నాను అని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ చెప్పారు: ‘ఎవరు అల్లాహ్ ను వదలి ఇతరులతో మొరపెట్టుకుంటూ ఉండకుండా (అల్లాహ్ తోనే దుఆ చేస్తూ ఉండీ) చనిపోతాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు’. (బుఖారీ 4497).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫిఖ్‘హ్ దుఆ – ఈ మొదటి క్లాస్ లో దుఆ నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు & అవరోధాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. వచ్చే క్లాసులలో ప్రతి పాయింట్ గురుంచి వివరంగా చెప్పబడుతుంది ఇన్ షా అల్లాహ్.
విశ్వాసి జీవితంలో దుఆ చాల ముఖ్యమైన అంశం. తప్పక వినండి. అర్ధం చేసుకొని మీ జీవితాలలో అమలు చేసుకోండి. మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్.
ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, దాని షరతులు, మర్యాదలు, అంగీకార సమయాలు మరియు అంగీకారానికి అడ్డంకులుగా ఉండే విషయాల గురించి వివరించబడింది. దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, అల్లాహ్ యే దుఆ చేయమని ఆదేశించి, దాని విధానాన్ని నేర్పించి, దానిని అంగీకరిస్తానని వాగ్దానం చేశాడని వక్త నొక్కిచెప్పారు. దుఆ అంగీకరించబడటానికి ఐదు ముఖ్య షరతులు ఉన్నాయి: ఇఖ్లాస్ (చిత్తశుద్ధి), ముతాబఆ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం), ప్రగాఢ నమ్మకం, ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయం. దుఆ చేసేటప్పుడు వుదూతో ఉండటం, ఖిబ్లా వైపు తిరగడం, చేతులు ఎత్తడం, అల్లాహ్ ను స్తుతించడం, దరూద్ పంపడం మరియు పశ్చాత్తాపం చెందడం వంటి మర్యాదలను పాటించాలని సూచించారు. అర్ధరాత్రి, అజాన్ మరియు ఇఖామత్ మధ్య, వర్షం కురుస్తున్నప్పుడు మరియు జుమా రోజు వంటి ప్రత్యేక సమయాల్లో దుఆ అంగీకరించబడుతుందని తెలిపారు. చివరగా, హరామ్ తినడం, తొందరపాటు, ఘోర పాపాలు చేయడం మరియు విధులను నిర్లక్ష్యం చేయడం వంటివి దుఆ అంగీకారానికి అడ్డంకులుగా నిలుస్తాయని హెచ్చరించారు.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్హందులిల్లాహి వహదహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.
సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క దయతో మనం అల్హందులిల్లాహ్ ఒక కొత్త సబ్జెక్ట్ ప్రారంభం చేయబోతున్నాము. ఈరోజు నుండి, తర్వాత కొన్ని వారాల వరకు అల్లాహ్ యొక్క దయతో ఈ క్లాస్ కొనసాగుతూ ఉంటుంది.
ఇందులో మనం దుఆ, దాని యొక్క నిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయాలు, సందర్భాలు, స్థలాలు, అవరోధాలు, అంటే దుఆ అంగీకరించబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
అయితే, ఈరోజు మనది ఫస్ట్ క్లాస్ గనుక, మొదటి క్లాస్. ఇందులో మనం అల్లాహ్ యొక్క దయతో, ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా ఏ విషయాలు చూస్తున్నారో, దుఆనిబంధనలు, మర్యాదలు, అంగీకార సమయ సందర్భాలు, స్థలాలు, అవరోధాలు అని, వీటి గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాము. వీటిలో ప్రతీ ఒక్కటి సంపూర్ణ ఆధారాలతో, వాటికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసుల నిదర్శనాలతో రాబోయే క్లాసుల్లో కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతారు.
అయితే, రండి ఏమీ ఆలస్యం చేయకుండా, దుఆ గురించి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు చూపించబడుతుంది, అలాగే ఆ విషయం తెలపబడుతుంది కూడా. అదేమిటంటే, దుఆ అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని మీరు ఒకసారి గ్రహించండి, దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. ఇంకా మీరు దుఆ చేస్తే నేను అంగీకరిస్తాను అన్న వాగ్దానం కూడా అల్లాహ్ చేశాడు.
గమనిస్తున్నారా? దుఆ చేయండని అల్లాహ్ యే ఆదేశించాడు. దుఆ ఎలా చేయాలి, దుఆ చేసే విధానం కూడా అల్లాహ్ యే నేర్పాడు. మనం దుఆ చేస్తే అంగీకరిస్తానని కూడా అల్లాహ్ వాగ్దానం చేశాడు. అంతేకాదు, మనం దుఆ చేస్తున్నందుకు అదనంగా మనకు ఇంకా వేరే పుణ్యాలు కూడా ప్రసాదిస్తాడు. విషయాన్ని గ్రహిస్తున్నారా ఇక్కడ?
ఇక్కడ విషయం గ్రహించండి. ఒకటి, మనం చేసే దుఆ, దుఆలో ఏం అడుగుతామో అది అల్లాహు త’ఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ఒక విషయం. మరొక విషయం ఏంటి? మనం దుఆ చేసినప్పుడు అల్లాహు త’ఆలా దానిని స్వీకరించడమే కాకుండా, దుఆ చేసినందుకు సంతోషపడి మనకు పుణ్య ఫలం కూడా ఇస్తాడు.
సోదర మహాశయులారా, ఇంతటి గొప్ప ఈ దుఆలో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైనా మీరు గ్రహించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు, దీనికి సంబంధించిన ఎన్నో సంఘటనలు కూడా గుర్తుకు వస్తున్నాయి. కానీ నేను చెప్పాను కదా, అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్, అవన్నీ కూడా నేను మీకు తర్వాత రోజుల్లో తెలియజేస్తాను.
ఇక్కడ మరో విషయం గమనించండి. సూరత్ అల్-ముఅ్‌మినూన్… సారీ, సూరత్ అల్-ముఅ్‌మిన్, దానిని గాఫిర్ అని కూడా అనడం జరుగుతుంది. సూర నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో ఉంది,
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వకాల రబ్బుకుముద్’ఊనీ అస్తజిబ్ లకుమ్) మరి మీ ప్రభువు చెప్పాడు: “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను.” (40:60)
మరి మీ ప్రభువు చెప్పాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. అంతేకాకుండా, సూరె ఫాతిహా, ఖురాన్ యొక్క ఆరంభం, దీనిని గనక మనం శ్రద్ధగా గమనించామంటే, స్వయంగా అల్లాహు త’ఆలా ఇందులో దుఆ చేసే విధానము, దుఆలో అతి ముఖ్యమైనవి ఏమిటి అన్న విషయాలు, ఇంకా మనం అల్లాహ్ తో దుఆ చేయడంలో ఏ పద్ధతిని అవలంబించాలి, ఆ విషయం అల్లాహు త’ఆలా తెలియజేశాడు. అలాగే ఖురాన్ చివరిలో రెండు సూరాలు గనక మీరు చూస్తే సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్ నాస్, అందులో కూడా మనం వాస్తవానికి అల్లాహ్ ను వేడుకుంటున్నాము. అల్లాహ్ యొక్క శరణులోకి వస్తున్నాము. ఆ గొప్ప విషయం అక్కడ ఉంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, ఎల్లవేళల్లో మనం దుఆ చేస్తూ ఉండాలి. ఈ దుఆ అనేది మన జీవితంలో చాలా చాలా గొప్ప మార్పు తీసుకువస్తుంది. ఈ దుఆ వల్ల విధి వ్రాత కూడా మార్చడం జరుగుతుంది అన్నటువంటి విషయం కూడా మనం వింటాము, దానికి కూడా సహీ హదీసుల ద్వారా ఆధారం దొరుకుతుంది. కానీ అది ఏ విధి వ్రాత? లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది కాదు. దైవదూతలకు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో మరియు ఏ దాని ద్వారానైతే ప్రతీ సంవత్సరం అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదైతే వ్రాయబడుతుందో అది అని భావం.
దుఆ యొక్క షరతులు (నిబంధనలు)
ఇక రండి, సోదర మహాశయులారా, దుఆ నిబంధనలు, దాని యొక్క షరతుల గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
దుఆ ఆయుధం అని చెప్పడం జరిగింది.
اَلدُّعَاءُ سِلَاحُ الْمُؤْمِنِ (అద్దుఆఉ సిలాహుల్ ముఅ్‌మిన్) దుఆ విశ్వాసి యొక్క ఆయుధం. అని మీరు మాటి మాటికి వింటూనే ఉంటారు కావచ్చు.
అయితే ఆయుధం ఎంత పదునుగా, మనం వాడుక భాషలో ఏమంటాము? కొచ్చగా. ఇలా పెడితేనే కోసేయాలి. అంత పదునుగా మరియు దానిని వాడేవాడు ఎంత నేర్పరి అయి ఉంటాడో, మరియు అది కరెక్టుగా పని చేయడానికి వేరే ఏ ఆటంకము, అడ్డు ఉండదో అప్పుడే ఆ ఆయుధం చాలా చక్కగా పనిచేస్తుంది, ఉద్దేశాన్ని పూర్తి చేస్తుంది.
ఈ మూడిటిలో, మూడు అంటే అర్థమయ్యాయా? ఆయుధం పదునుగా ఉండడం, వాడేవాడు నేర్పరి అయి ఉండడం మరియు ఏ ఆటంకము ఉండకపోవడం. ఈ మూడిటిలో ఏ ఒక్క లోపం ఉన్నా అది సరిగా పనిచేయదు, ఉద్దేశం పూర్తి కాదు. అందుకే, అన్నిటికీ ముందు దుఆ యొక్క షరతులు మరియు దుఆ అంగీకారంలో అడ్డు ఏమిటో తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా, దుఆ యొక్క షరతులలో మొట్టమొదటి షరతు, ఇఖ్లాస్. చిత్తశుద్ధి. అంటే, దుఆ కేవలం అల్లాహ్ తో మాత్రమే చేయాలి, అల్లాహ్ ప్రసన్నత కొరకే చేయాలి. పేరు ప్రఖ్యాతి, ప్రదర్శన బుద్ధి అనేది దుఆ చేయడంలో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, ముతాబఆ. అంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, అనుసరణ. అంటే, దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలోనే చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆకు సంబంధించి ఇంకా ఏ ఏ బోధనలు హదీసులు ఉన్నాయో, అందులో ఏ రీతిలో దుఆ చేయాలి అని, దుఆలో ఏ తొందరపాటు ఇంకా వేరే విషయాలు ఉండకూడదు అని చెప్పారో, వాటిని మనం పాటించాలి.
ఈ ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ప్రతీ సత్కార్యంలో అవసరం. తప్పనిసరి. నమాజ్, ఉపవాసం, హజ్, ఉమ్రా, జకాత్, విధిదానం , తల్లిదండ్రుల పట్ల సేవ, ఎవరికైనా ఏదైనా మనం దానం చేస్తున్నాము, ఎవరి పట్ల ఏదైనా మనం ఉత్తమ రీతిలో వ్యవహరిస్తున్నాము, మీరు ఏ ఏ విషయాన్ని సత్కార్యంగా భావిస్తారో వాటన్నిటిలో కూడా ఇఖ్లాస్ మరియు ముతాబఆ, ఈ రెండు షరతులు ఉండడం తప్పనిసరి. ఈ రెండు షరతులు లేవు అంటే, మన ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు, మన సలఫ్ సాలిహీన్ వారి యొక్క ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ తర్వాత రోజుల్లో అవి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మూడవ షరత్, అల్లాహ్ దుఆ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం ఉండాలి. అయ్యో, ఏదో మౌల్వీ సాబ్ చెప్పిండు కదా చేయమని, చేసి చూస్తాను. ఇలా ఉండకూడదు. అల్లాహ్ నా యొక్క దుఆను తప్పకుండా స్వీకరిస్తాడు. బలమైన నమ్మకం ఉండాలి.
నాల్గవ షరతు, మనస్సు పెట్టి దుఆ చేయాలి. దుఆ చేసే సందర్భంలో అశ్రద్ధగా ఉండకూడదు. నోటితో ఏ పలుకులు పలుకుతున్నామో మనస్సులో దాని అర్థ భావాలు తెలిసి, మనం పూర్తి శ్రద్ధా భక్తులతో దుఆ చేయాలి.
ఇక ఐదవ నిబంధన, దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి. అంటే ఏంటి దృఢ నిశ్చయంతో? ఓ అల్లాహ్ నీకు ఇష్టం ఉంటే నాకు ఆరోగ్యం ఇవ్వు, లేకుంటే లేదు. నీకు ఇష్టం ఉంటే నన్ను క్షమించు, లేకుంటే లేదు. ఇట్లాంటి ధోరణి, ఇట్లాంటి మాట విధానం ఉండకూడదు. దృఢంగా ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ఓ అల్లాహ్ నీవే క్షమించేవాడివి, ఇంక నేను ఎక్కడికి వెళ్లి క్షమాపణ కోరాలి? నీవు నన్ను తప్పకుండా క్షమించాలి. ఓ అల్లాహ్ ఇది నాకు అవసరం, ఆరోగ్యం, విద్య, సదాచరణ, ఇంకా సంతాన బాగోగుల గురించి, తల్లిదండ్రుల మంచి గురించి, ముస్లింలందరి మేలు గురించి మనం ఏదైతే అడుగుతున్నామో, ఓ అల్లాహ్ నీవు దీని శక్తి గలవానివి, నాకు తప్పకుండా ఇది ప్రసాదించు అని దుఆ చేయాలి.
అర్థమైంది కదా? ఈ షరతులు, నిబంధనలు గుర్తుంచుకోండి. ఒకటి ఇఖ్లాస్. రెండవది ముతాబఆ. మూడవది అల్లాహ్ అంగీకరిస్తాడని ప్రగాఢ నమ్మకం. నాలుగవది మనస్సు పెట్టి దుఆ చేయాలి, అశ్రద్ధగా ఉండొద్దు. ఐదవది దృఢ నిశ్చయంతో దుఆ చేయాలి, ఇష్టం ఉంటే ఇవ్వు అన్నటువంటి మాటలు ఉండకూడదు.
ఏమేం తెలుసుకున్నారు మీరు ఇప్పటి వరకు? దుఆ యొక్క ప్రాముఖ్యత. దుఆ ఎంత గొప్ప అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి అన్న విషయం తెలుసుకున్నారు. మనం దుఆ చేస్తూ ఉండాలి ఎల్లవేళల్లో అన్న మాట తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండవది దుఆ యొక్క షరతులు, దుఆ యొక్క నిబంధనలు తెలుసుకున్నారు.
దుఆ మర్యాదలు (ఆదాబ్)
ఇక రండి, ఇప్పుడు మనం మరికొంత ముందుకు వెళ్లి, దుఆ యొక్క కొన్ని ఆదాబ్, మర్యాదలు, పద్ధతులు తెలుసుకుందాం.
1- వుజూ స్థితిలో ఉండి దుఆ చేయలి. 2- ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. 3- రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. 4- అల్లాహ్ యొక్క స్తోత్రం, ప్రవక్తపై దరూద్. 5- అల్లాహ్ యొక్క మంచి నామాల, ఉత్తమ గుణవిషేశణాల, మన సత్కార్యాల మాధ్యమంతో. 6- పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ, క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. (సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్)
అయితే ఇక్కడ గమనించండి, శ్రద్ధ వహించండి. మీరు స్క్రీన్ లో ఏదైతే చూస్తున్నారో అంతవరకే కాకుండా, దాని యొక్క వివరణలో నేను చెప్పే మాటలు కూడా హృదయంలో నాటుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయిపోతారు.
మొదటిది, వుదూ స్థితిలో ఉండి దుఆ చేయాలి. అయితే వుదూ లేకుండా దుఆ చేయకూడదా? అలా భావం కాదు. షరతులు ఏవైతే మనం చదివామో అవి తప్పకుండా ఉండాలి. వాటిలో ఏ ఒక్కటి ఉన్నాగాని దుఆ అనేది పైకి వెళ్లదు, అల్లాహ్ అంగీకరించడు. కానీ, ఇక్కడ ఈ మర్యాదలు దుఆ అంగీకారానికి ఇవి మరింత ఎక్కువగా దోహదపడతాయి. ఏదైనా స్థితిలో ఇవి లేకున్నా గాని నడుస్తుంది. కానీ, వీటి అలవాటు చేసుకుంటే మన కొరకే చాలా మంచిది. దుఆ అంగీకారం కొరకు గానీ, దుఆ మనం చేయడంలో మంచి ఖుషూ వ ఖుదూ, దుఆ చేయడంలో మనకు మంచి కాన్సంట్రేషన్ ఉండడానికి ఈ విషయాలన్నీ కూడా దోహదపడతాయి.
అయితే ఇక్కడ గుర్తించాలి, మనం ఇక్కడ దుఆ అని ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, దుఆ యొక్క మర్యాదలో కొన్ని విషయాలు ఏవైతే ప్రస్తావిస్తున్నామో, ఇక్కడ ప్రత్యేకంగా ఏదైనా అవసరానికి మనం దుఆ చేసుకుంటాము కదా, అది ఇక్కడ ఉద్దేశం. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు దుఆ చదువుతారు, మజీద్ లో వెళ్ళినప్పుడు దుఆ చదువుతారు, ఇంట్లో వచ్చినప్పుడు దుఆ చదువుతారు. అక్రమకుముల్లాహ్ వఅజకుమ్, మీరు టాయిలెట్ లో వెళ్ళినప్పుడు, వచ్చిన తర్వాత దుఆ చదువుతారు, పడుకునే ముందు చదువుతారు, ఉదయం సాయంకాలం దుఆలు, జిక్రులు చదువుతారు, ఆ సందర్భం గురించి కాదు ఇక్కడ చెప్పడం జరిగేది.
అర్థమైందా? మనం దుఆ అన్న ఉద్దేశంతో, ప్రత్యేకంగా అల్లాహ్ తో వేడుకోవాలి. ఇప్పుడు ఈ నా ప్రాబ్లం సాల్వ్ కావాలి. నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ని ఎంతో శ్రద్ధా భక్తులతో ఏడ్చుకుంటూ అల్లాహ్ తో దీనంగా నేను ఇప్పుడు ఈ మాట నా అల్లాహ్ ముందు పెడతాను అని ఒక ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఒక విషయం కోరుతూ, ఒక ప్రాబ్లం పరిష్కరింపబడడానికి ఏదైతే దుఆ చేస్తాము కదా, అలాంటి దుఆ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. సలాం తిప్పిన తర్వాత కూడా మీరు దుఆ చేస్తారు లేక అజాన్ పూర్తయిపోయిన తర్వాత దుఆ చదువుతారు. అలాంటి దుఆల గురించి ఇక్కడ కాదు మనం చెప్పుకునేది ఇప్పుడు. అర్థమైంది కదా?
అయితే ఎప్పుడైతే ప్రత్యేకంగా, ఒక ఉద్దేశపూర్వకంగా మనం దుఆ చేయడానికి పూనుకుంటామో, అప్పుడు వుదూ ఉంటే చాలా మంచిది. అలాంటి సందర్భంలో కూడా ఒకవేళ వుదూ లేకుంటే దుఆ అంగీకరించబడుతుంది మరియు దుఆ చేయవచ్చు కానీ వుదూ ఉండడం మంచిది.
అలాగే ఖిబ్లా దిశలో ముఖం చేయాలి. ఇది కూడా ఉత్తమ విషయం. లేకుంటే దుఆ ఖుబూల్ కాదు అన్నటువంటి మాట కాదు ఇక్కడ కూడా.
మూడవది, రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి. నిన్న అంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలో దీనికి సమాధానం వివరంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి ఏదైనా ప్రత్యేక దుఆ చేయడానికి మనం కూర్చుంటే, అప్పుడు ఏం చేయాలి? రెండు చేతులు భుజాలకు సమానంగా ఎత్తాలి.
ఈరోజు నేను దీని గురించి ఎన్నో హదీసులు చదువుతూ చదువుతూ మరొక విషయం కూడా తెలిసింది. అదేమిటి? దుఆ చేస్తున్నప్పుడు రెండు చేతులు ఎప్పుడైతే మనం ఎత్తుతామో, ఆ చేతుల యొక్క లోపలి భాగం మన ముఖం వైపునకు, ఆ అరచేతుల యొక్క వీపు అంటే అరచేతుల యొక్క పై భాగం ఖిబ్లా దిశలో ఉండాలి. ఈ విధంగా మనం భుజాల వరకు ఎత్తాలి. భుజాల వరకు అంటే భుజాలకు సమానంగా మన ముఖం ముందు.
నాలుగవ మర్యాద, పద్ధతి, అదబ్, అల్లాహ్ యొక్క స్తోత్రం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్. దీని గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి చెప్పిన విషయాలు మనం ఇంతకుముందు ప్రవక్తపై దరూద్ ఓ సలాం అనే ఒక అంశం విన్నాము జుమా రోజు. గుర్తుందా? అందులో కూడా ఈ విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అదేంటి? దుఆ ఆరంభంలో, మధ్యలో, చివరిలో ఈ మూడు సందర్భాల్లో, మూడిటిలో ఏదైనా ఒక సందర్భంలో అల్లాహ్ యొక్క స్తోత్రము మరియు ప్రవక్తపై దరూద్ చదవాలి. అతి ఉత్తమ పద్ధతి ఏమిటి? ముందు అల్లాహ్ యొక్క స్తోత్రము, ఆ తర్వాత ప్రవక్తపై దరూద్, ఆ తర్వాత మనం అల్లాహ్ తో కోరుకునేది అంటే దుఆ, మళ్ళీ ఆ తర్వాత ప్రవక్తపై దరూద్ చదివి, అల్లాహ్ యొక్క స్తోత్రముతో సమాప్తం చేయాలి, ముగించాలి.
ఐదో విషయం శ్రద్ధ వహించండి. అల్లాహ్ యొక్క మంచి నామములు, ఉత్తమ గుణ విశేషణాలు మరియు మన సత్కార్యాల మాధ్యమంతో, వసీలాతో, ఆధారంతో దుఆ చేయడం ఉత్తమం. ఖురాన్లో కూడా అల్లాహ్ చెప్పాడు కదా మరి,
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా) అత్యుత్తమమైన పేర్లు అల్లాహ్ కే ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లతోనే మీరు ఆయనను ప్రార్థించండి.
నేను ముందే చెప్పాను మీకు, ఈరోజు నేను ముఖ్యమైన విషయాలు సంక్షిప్తంగా చెప్తున్నాను. తర్వాత రోజుల్లో మనం వివరంగా దలీల్ తో తెలుసుకుందామని. కానీ గుర్తుకు వచ్చేస్తుంది నాకు కూడా, ఇలాంటి ఆయతులు, హదీసులు ఎన్నో ఉన్నాయి. దీని ద్వారా కూడా మన దుఆ అంగీకరింపబడే అటువంటి గ్యారెంటీ అనేది పెరిగిపోతుంది.
సోదర మహాశయులారా, నేను ముందే చెప్పినట్లు, ఈ దుఆ మర్యాదలు అంశం స్టార్ట్ చేసే ముందు, ఏం చెప్పాను? ఈ మర్యాదలు ఏవైతే చెప్పబడుతున్నాయో వీటిని పాటించడం చాలా చాలా ఉత్తమం. ఇప్పుడు ఎమర్జెన్సీ మీకు ఏదైనా, ఒక దెబ్బ తగిలింది మీకు పోతూ పోతూ, నడుస్తూ నడుస్తూ ఫోటోరాయి తగిలింది లేదా మీరు బండిలో వెళ్తూ వెళ్తూ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కిక్ కొడుతున్నారు స్టార్ట్ కావట్లేదు. ఇక అక్కడ మీరు ఖిబ్లా దిశలో ఉండి, వుదూ చేసుకొని, అదబ్ లో కూర్చొని, ఇవన్నీ చేసుకుంటూ దుఆ చేస్తారా? లేదు వెంటనే మనస్సులో ఓ అల్లాహ్, నా యొక్క బండి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఓ అల్లాహ్ నీవు నాకు సహాయం చేయి. వెళ్తూ వెళ్తూ నడుస్తూ నడుస్తూ ఏదో కింద పడిపోయారు లేదా మీకు ఆ ఏమంటారు దాన్ని? చక్కర వచ్చినట్లు అయిపోయింది. ఆరోగ్యం కొరకు వెంటనే అక్కడ దుఆ చేస్తారు. అలా చేయకూడదా? చేయాలి. అదే ఉత్తమ పద్ధతి అక్కడ. విషయం అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ మర్యాదలు ప్రత్యేకంగా దుఆ చేయడానికి మనం కూర్చున్నప్పుడు ఈ పద్ధతులను పాటించడం చాలా చాలా ఉత్తమం.
ఆరవ మర్యాద,పాపాలపై పశ్చాత్తాపం వ్యక్తపరుస్తూ క్షమాభిక్ష కోరుతూ దుఆ చేయాలి. అవును, మనం ఏ విషయం కూడా అల్లాహ్ కు ఇష్టమైనది, పాపం కానిది అల్లాహ్ తో మనం కోరుకుంటున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు, నాకు కావాలి అని మనం అల్లాహ్ తో అర్ధిస్తున్నప్పుడు ముందు మన పాపాల విషయం, ఓ అల్లాహ్ నేను నా అన్ని రకాల పాపాల నుండి నీ క్షమాపణ కోరుతున్నాను. నా పాపాలే నీ కరుణ నా వరకు చేరడంలో అడ్డు కాకూడదు ఓ అల్లాహ్. ఈ పాపాలను వదులుకునేటువంటి భాగ్యం కూడా ప్రసాదించు ఓ అల్లాహ్. ఈ విధంగా మనం వేడుకోవాలి అల్లాహ్ తో, విన్నవించుకోవాలి.
పక్కన అరబీలో సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అని రాసి ఉంది. కన్ఫ్యూజ్ కాకండి. ఆ సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ అనే దుఆ ఏదైతే ఉందో, అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, అందులో ఈ విషయం చాలా గొప్పగా నొక్కి చెప్పడం జరిగింది అని గుర్తు రావడానికి కేవలం అది ఒక హింట్ ఇచ్చాను అంతే. అయితే మీరు ఒకసారి
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ (అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్దిక వ వ’అదిక మస్తత’అతు, అ’ఊదు బిక మిన్ షర్రి మా సన’అతు, అబూఉ లక బి ని’అమతిక అలయ్య, వ అబూఉ బి దంబీ ఫగ్ఫిర్లీ, ఫ ఇన్నహూ లా యగ్ఫిరుద్ దునూబ ఇల్లా అంత)
ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవే నన్ను సృష్టించావు మరియు నేను నీ దాసుడను. నేను నా శక్తి కొలది నీతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాను. నేను చేసిన చెడు నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై నీవు కురిపించిన అనుగ్రహాలను నేను ఒప్పుకుంటున్నాను. మరియు నా పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను క్షమించు. నిశ్చయంగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు మరొకడు లేడు.
చదివి చూడండి, దాని అర్థ భావాలను, ఈ మాట అనేది అక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పాను మీకు ఇప్పుడు హింట్స్ తెలుసుకుంటున్నాము.
దుఆ అంగీకార సమయాలు
దుఆ ప్రాముఖ్యత, దుఆ యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క ఇంత పెద్ద అనుగ్రహం అది. ఆ తర్వాత దాని యొక్క షరతులు, నిబంధనలు మరియు మర్యాదలు, ఆదాబ్, ఆ తర్వాత ఇప్పుడు దుఆ అంగీకార సమయాలు తెలుసుకుంటున్నాము.
1- అర్థ రాత్రి 2- రాత్రి మూడవ భాగంలో 3- అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు 4- అజాన్ ఇఖామత్ ల మధ్యలో 5- ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు 6- ఫర్జ్ నమాజుల తర్వాత 7- రాత్రి నిద్రమేల్కొన్నప్పుడు 8- వర్షం కురుస్తున్నప్పుడు 9- జుమా రోజు ఖుత్బా మధ్యలో, అస్ మగ్రిబ్ మధ్యలో 10- సహరీ సమయంలో
అయితే సోదర మహాశయులారా, మర్యాదల విషయంలో గాని ఇక్కడ అంగీకార సమయాల విషయంలో గాని ఇంక ఎన్నో ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైనవి, మన రోజువారీ జీవితంలో మనకు అవసరమయ్యేటివి నేను ఇక్కడ కొన్ని ప్రస్తావించాను.
అంగీకార సమయాలు, అర్ధరాత్రి, రెండవది రాత్రి మూడవ భాగంలో, మూడవది అజాన్ ఇవ్వబడుతున్నప్పుడు, నాలుగవది అజాన్, ఇఖామత్ ల మధ్యలో, ఐదవ సమయం ఇఖామత్ ఇవ్వబడుతున్నప్పుడు, ఆరవ సమయం రాత్రి నిద్ర మేల్కొన్నప్పుడు, ఎనిమిదవ సమయం వర్షం కురుస్తున్నప్పుడు, తొమ్మిదవ సమయం జుమా రోజు ఖుత్బా మధ్యలో అలాగే అస్ర్ మరియు మగ్రిబ్ మధ్యలో. సహీ హదీసుల ద్వారా ఈ రెండు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
పదవ సమయం, సహరీ సమయం. అంటే రోజా ఉంటే సహరీ చేస్తేనే అని కాదు. మనం ఉపవాసం లేకున్న రోజుల్లో కూడా సహరీ సమయం ఏదైతే ఉందో అది దుఆ అంగీకరింపబడడానికి,
وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ (వబిల్ అస్ హారి హుమ్ యస్తగ్ఫిరూన్) వారు రాత్రి జామున క్షమాపణ వేడుకునేవారు.
ఖురాన్ లో కూడా దీని గురించి మనకు ఆధారం కనబడుతుంది.
ఈ విధంగా సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? దుఆ అంగీకరింపబడే అటువంటి సమయాల గురించి తెలుసుకున్నాము.
దుఆ అంగీకారానికి అడ్డుపడే విషయాలు
ఇప్పుడు రండి దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు అడ్డుపడతాయి? ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం.
అల్లాహ్ యే కాపాడుగాక మనందరినీ. మనం ఈ విషయంలో ఒకవేళ జాగ్రత్తగా ఉండకుంటే, మనం ఎన్ని మర్యాదలు పాటించినా, మనం దుఆ అంగీకారం యోగ్యం పొందడానికి ఏ మంచి సమయం ఎన్నుకొని దుఆ చేసినా, అంతా వృధా అయిపోతుంది. ఎలాగో తెలుసా? అల్లాహ్ అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి, అన్ని రకాల రోగాల నుండి కాపాడాలి. ఒకవేళ వీరు షుగర్ పేషెంట్ అయి, షుగర్ వ్యాధిని ఇంకా పెరగకుండా, అల్లాహ్ యొక్క దయతో మొత్తమే దూరమైపోయి ఆరోగ్యవంతులు అవ్వడానికి మంచి మందులు వాడుతున్నారు. కానీ, అటు ఒకవైపున మందులు వాడుకుంటూ మంచి రసగుల్లాలు తింటున్నారు, పల్లి పట్టీలు తింటున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు పెద్దలు చూడటం లేదు కదా అని ఓ దోసెడు చక్కెర కూడా మింగేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుంది? మీ మందులు మీకు పనిచేస్తాయా? చేయవు కదా. అందుకొరకే అడ్డంకులు, ఆటంకాలు, అవరోధాలు, దుఆ అంగీకరింపబడడానికి ఏ విషయాలు ఇందులో ముఖ్యమో అవి తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
వాటిలో అతి ముఖ్యమైనవి నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేమిటి? మనిషి హరామ్ తినడం, త్రాగడం, ధరించడం, తొడగడం. వీటన్నిటికీ దూరం ఉండాలి.
నేను చెప్పాను కదా ఇంతకుముందే? హదీసులు, ఆధారాలు అవన్నీ కూడా తర్వాత మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాము. కానీ ఇప్పుడు సంక్షిప్తంగా ఏం తెలిసింది? మన దుఆ అంగీకరింపబడాలంటే మనం హరామ్ తిండికి దూరం ఉండాలి. వడ్డీ అయినా గాని, లంచం తీసుకోవడం అయినా గాని, ఇంకా వేరే దొంగతనం చేసి గాని, లేకుంటే తెలిసి తెలిసి ఈ రోజుల్లో ఎన్నో రకాల జూదములు, లాటరీలు, ఎన్నో రకాల చైన్ బిజినెస్, చైన్ సిస్టం బిజినెస్ లు వస్తున్నాయి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. హరామ్ సొమ్ము అనేది మన తిండిలో, మన త్రాగడంలో, మన దుస్తుల్లో, బట్టల్లో ఏమాత్రం ఉండకూడదు.
రెండవది, తొందరపాటు. అంటే ఏంటి? ఒకసారి, రెండుసార్లు, కొన్నిసార్లు దుఆ చేసి అయ్యో ఇంకా దుఆ అంగీకరింపబడటం లేదు, ఇంకా అంగీకరింపబడటం లేదు అని దుఆ చేయడం మానుకోవడం. ఇది కూడా చాలా ప్రమాదకరం. చేస్తూ ఉండండి దుఆ. మీ యొక్క కోరిక, మీరు ఏ విషయం గురించి అయితే అల్లాహ్ తో దుఆ చేస్తున్నారో, అలా చేయడం ఇస్లాం ప్రకారంగా యోగ్యమైనది ఉంటే, అది మీకు పొందే వరకు ఇహలోకపు ఏదైనా అవసరం కావచ్చు, మీ యొక్క మంచి ఉద్యోగం కొరకు కావచ్చు, మీ చదువులో ఉన్నత శిఖరానికి చేరి మంచి ర్యాంకులో పాస్ అవ్వడం కావచ్చు, ఇంకా మంచి భార్య దొరకాలని లేకుంటే మంచి భర్త దొరకాలని కావచ్చు, అలాగే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మీకు అది ప్రాప్తించే వరకు దుఆ చేస్తూనే ఉండండి కానీ, ఏంటయ్యా, ఓ సంవత్సరం నుండి దుఆనే చేస్తున్నాను, పది సంవత్సరాల నుండి దుఆ చేస్తున్నాను, నాకు సంతానమే కలగటం లేదు అని దుఆ చేయడం వదులుకోవడం, ఇంకా వేరే తప్పుడు మార్గాలు వెళ్ళడం, ఉదాహరణకు సంతానం లేనివారు ఎంతోమంది ఏం చేస్తారు? దర్గాల వద్దకు వెళ్ళిపోతారు. అది ఇంకా మరింత ఎక్కువ ప్రమాదంలో పడిపోతారు.
మూడో విషయం, ఘోరమైన పాపాలు. ప్రతీ పాపం కూడా చాలా ప్రమాదకరమైనది, నష్టం చేకూర్చేది. కాకపోతే, పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోకపోవడం. ఇది కూడా మన దుఆ అంగీకారానికి అడ్డు కలుగుతుంది. చూడండి కొన్ని సందర్భాల్లో స్వీకరించబడుతుంది, అది అల్లాహ్ యొక్క దయ. అల్లాహ్ ఖురాన్ లో చెప్పిన ప్రకారంగా మనకు ఏం తెలుస్తుంది? ఎన్నో సందర్భాల్లో, అలాగే సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారంగా ద’వతుల్ మజ్లూమ్, అవిశ్వాసి, కాఫిర్, ముష్రిక్, బహుదైవారాధకుల దుఆ కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. కానీ, మనం అల్లాహ్ ను నమ్ముకున్న వాళ్ళము, ముస్లింలము, విశ్వాసులము. మనం పాపాలను, ప్రత్యేకంగా పాపాలలో ఘోర పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవాలి.
ఇక నాలుగవది, అల్లాహు త’ఆలా మనపై విధించిన వాటిని పాటించకపోవడం. అల్లాహు త’ఆలా మనపై ఏ విధులను విధించాడో, ఆ విధులను మనం ఒకవేళ నెరవేర్చకుంటే, మన దుఆలు అంగీకారానికి అవి అడ్డుపడతాయి. అందుకొరకే అల్లాహ్ విధించిన ప్రతీ విధిని మనం పాటిస్తూ ఉండాలి.
ఐదవది, ఏ విషయం మనం అల్లాహ్ తో కోరుతున్నామో, అడుగుతున్నామో, ఇది నాకు కావాలి అని అంటున్నామో అది ఏదైనా పాప విషయం కాకూడదు. ఓ అల్లాహ్, నా కొడుకు టెన్త్ లో మంచిగా పాస్ అయ్యేది ఉంటే, అతడు పబ్జీ గేమ్ ఆడుకోవడానికి మరియు మంచి ఫిలింలు, సీరియల్లు చూసుకుంటూ ఉండడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తానని నేను వాగ్దానం చేశా. ఓ అల్లాహ్ ఇంకా జీతం దొరకట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు. నాకు మంచిగా డబ్బులు సమకూర్చు ఓ అల్లాహ్. నా కొడుక్కి నేను చేసిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాను. మంచిగా ఉందా? పాప కార్యానికి, పాప కార్యం కోరుతూ దుఆ చేయడం జరుగుతుంది కదా, ఇలాంటి దుఆ చేయకూడదు.
అలాగే, బంధుత్వాలు తెగిపోవడానికి, సత్సంబంధాలు ఉండకుండా దూరం కావడానికి అలాంటి దుఆ కూడా చేయకూడదు. ఎవరైనా ఒక బంధువు నుండి ఎప్పుడైనా ఏదైనా మాట మీకు ఇష్టం లేనిది విన్నారు కావచ్చు, ఓ అల్లాహ్ రేపటి నుండి నేను అతని ముఖమే చూడకుండా చెయ్. ఇలా బంధుత్వాల తెగ తెంపులకు దుఆ చేయకూడదు.
అయితే ముఖ్యంగా ఈ ఐదు విషయాలు ఏవైతే మనం మన యొక్క దుఆ అంగీకారానికి అడ్డుగా ఉంటాయో, వాటిని తెలుసుకున్నారు. ఇన్ షా అల్లాహ్ వచ్చే క్లాసులలో ఇందులో ఇంక ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి వివరాలు, ఖురాన్, హదీసుల ఆధారాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా మనందరికీ కూడా దుఆ అతనికి ఇష్టమైన రీతిలో, ప్రవక్త విధానంలో చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వ’స్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘దుఆ’ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, నియమాలు, మరియు విశిష్టతల గురించి చర్చించబడింది. దుఆ అనేది అల్లాహ్‌తో ప్రత్యక్ష సంభాషణ అని, ఆయనతో బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఒక సువర్ణ మార్గమని, మరియు ఆరాధనలలో అత్యంత విలువైనదని ఇది నొక్కి చెబుతుంది. పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు వంటి అపోహలను ప్రసంగికుడు సరిదిద్దుతాడు. ఆదం, నూహ్, ఇబ్రాహీం, మూసా, మరియు ముహమ్మద్ (వారిపై శాంతి కలుగుగాక) వంటి వివిధ ప్రవక్తల ప్రార్థనల నుండి ఉదాహరణలను ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి ఉదహరిస్తూ, విశ్వాసి జీవితంలో దుఆ యొక్క లోతైన ప్రాముఖ్యతను మరియు శక్తిని వివరిస్తాడు.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదా ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి ఈ ప్రసంగంలో మనం దుఆ, ప్రార్థన నియమాలు మరియు విశిష్టత గురించి ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మిత్రులారా, భక్తుడు భగవంతునితో తన సంబంధం దృఢపరుచుకోవడానికి, దౌర్జన్యానికి గురవుతున్న అభాగ్యులు ఆ పరిస్థితి నుండి బయటపడుటకు, వ్యాపారి తన సంపాదనలో శుభం మరియు వృద్ధి పొందుటకు, అన్ని సమస్యలను అందరూ పరిష్కరించుకొనుటకు లోక రక్షకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందజేసిన సువర్ణ మార్గం దుఆ.
దుఆ అనగా ఏమిటి?
దుఆ అంటే అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌ను ప్రార్థించటం. దీనిని మనము ఉర్దూ మరియు అరబీ భాషలో దుఆ అంటూ ఉంటాము కాబట్టి ప్రసంగంలో నేను ఎక్కడైనా దుఆ అని ప్రస్తావిస్తే దాని అర్థం అల్లాహ్‌ను వేడుకోవటం మరియు అల్లాహ్‌ను ప్రార్థించటం అనే అర్థం మీరు తెలుసుకోవాలి.
అల్లాహ్‌ను వేడుకోవాలని, అల్లాహ్‌తో దుఆ చేయాలని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని 40వ అధ్యాయం, 60వ వాక్యంలో తెలియజేశాడు.
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ మీ ప్రభువు ఇలా అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)
ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులను ఆయనను వేడుకోవాలని, ఆయనను ప్రార్థించాలని ఆదేశిస్తున్నాడు. కాబట్టి, భక్తులు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మనిషి, ప్రతి భక్తుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోవాలి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ప్రార్థించాలి.
మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు. కొంతమంది సందేహపడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అయితే పైన ఆకాశాల పైన ఉంటాడు కాబట్టి మనము ఆయనకు వేడుకుంటే ఆయన మన మాటలను, మన ప్రార్థనలను వింటాడా అని సందేహపడవచ్చు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు భరోసా కల్పిస్తున్నాడు, ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం 186వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ (ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును ఆలకిస్తానని వారికి చెప్పు. (2:186)
కాబట్టి అభిమాన సోదరులారా, ఎప్పుడైతే భక్తుడు అల్లాహ్‌ను వేడుకుంటాడో, అతని ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినటానికి, ఆమోదించడానికి, అతనికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
హదీసు వెలుగులో దుఆ
ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేసి ఉన్నారు. అది కూడా మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు:
الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ [అద్దుఆ’ఉ హువల్ ఇబాదా] మనిషి చేసే ఆరాధనలలో దుఆ చాలా ముఖ్యమైనది. అసలు ఆరాధన అంటేనే దుఆ, దుఆ అంటేనే ఆరాధన అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించారు.
ఇక్కడ మనం మరొక విషయం అర్థం చేసుకోవచ్చు, అదేమిటంటే ప్రార్థన ఆరాధనలోని ముఖ్యమైన భాగము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారంటే, ఏ భక్తుడైతే ఆరాధనలో ఎక్కువగా దుఆలు చదువుతాడో అతను అంతే విలువైన ఆరాధన చేస్తున్నాడని అర్థం. ఉదాహరణకు నమాజ్ ఉంది. ఒక వ్యక్తి నమాజ్ లోని దుఆలన్నీ నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. మరొక వ్యక్తి నమాజ్ లోని సగం దుఆలు మాత్రమే నేర్చుకొని ఆ నమాజ్ ఆరాధన ఆచరిస్తున్నాడు. ఇద్దరిలో ఎవరు ఉత్తముడు, ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే దుఆలు అన్నీ, ప్రార్థనలు అన్నీ నేర్చుకొని నమాజ్ ఆరాధన చేస్తున్నాడో, అతను మంచి విలువైన నమాజ్ ఆరాధన చేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవడానికి అర్హుడవుతాడు. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది.
అలాగే మరోచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఈ విధంగా తెలియజేశారు:
لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللَّهِ مِنَ الدُّعَاءِ అల్లాహ్ వద్ద దుఆ కంటే విలువైనది మరొకటి లేదు.
చూశారా? దుఆ సాధారణమైన విషయం అనుకుంటారు. కాదు అభిమాన సోదరులారా, దుఆ అల్లాహ్ వద్ద చాలా విలువైనది, చాలా పవిత్రమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దుఆ యొక్క విశిష్టత మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి మనిషి యొక్క విధివ్రాత అతను జన్మించక ముందే వ్రాయబడి ఉంది. అయితే, విధివ్రాతను మార్చగలిగే శక్తి కేవలం దుఆకు మాత్రమే ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:
لَا يَرُدُّ الْقَضَاءَ إِلَّا الدُّعَاءُ విధివ్రాతను కేవలం దుఆ ద్వారానే మనము మార్చుకోగలము. మన విధివ్రాత మారాలి అంటే మనము దుఆ చేయాలి. ఒక దుఆ ద్వారా మాత్రమే మన విధివ్రాత మారగలుగుతుంది. వేరే ఏ మార్గము ద్వారా కూడా మన విధివ్రాతను మనము మార్చుకోలేము.
అలాగే, మరో విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. అదేమిటంటే:
إِنَّهُ مَنْ لَمْ يَسْأَلِ اللَّهَ يَغْضَبْ عَلَيْهِ ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను వేడుకోడో ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.
అల్లాహు అక్బర్. చూడండి, ఒక మనిషి మరో మనిషి వద్ద వెళ్లి సహాయం కోరాడు. ఒకసారి సహాయం చేస్తాడు. రెండుసార్లు, మూడుసార్లు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతనితో వెళ్లి సహాయం అడిగితే మనిషి కోపం చూపిస్తాడు. సారికి నా దగ్గరికే వస్తున్నావు అని మనిషి ఏమైతాడు అంటే, సహాయం అడిగే వ్యక్తి సహాయం అడిగితే కోపగించుకుంటాడు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అలా కాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుడు సహాయం కోరినప్పుడల్లా సంతోషిస్తాడు. భక్తుడు అల్లాహ్‌తో సహాయం కోరకపోతే, దుఆ చేయకపోతే, వేడుకోకపోతే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఆ విషయం నచ్చదు, ఆ భక్తునితో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆగ్రహిస్తాడు.
ప్రవక్తల దుఆలు
అయితే అభిమాన సోదరులారా, అల్లాహ్‌ను వేడుకోవటం, అల్లాహ్‌తో దుఆ చేయటం భక్తుల లక్షణము. భక్తులలో ఉత్తమమైన భక్తులు ఎవరంటే ప్రవక్తలు. ప్రవక్తల లక్షణము కూడా అల్లాహ్‌తో దుఆ చేయటం, అల్లాహ్‌ను వేడుకోవటం. ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు అని, వారి దుఆ స్వీకరించబడింది అని తెలియజేసి ఉన్నాడు. ఉదాహరణకు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఆదం అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో ప్రస్తావించాడు. ఆదం అలైహిస్సలాం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారు?
رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ “ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు గనక నీవు మమ్మల్ని క్షమించకపోతే, మాపై కరుణించకపోతే మేము పూర్తిగా నష్టపోయిన వారిలో చేరిపోతాము.” (7:23)
అలాగే నూహ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారు?
رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ “ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులనూ, స్త్రీలనూ క్షమించు. (71:28)
ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థించారు. ఆయన ఏమని ప్రార్థించారు అంటే:
رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ “ఓ నా ప్రభూ! నన్నూ, నా సంతానాన్ని నమాజును నెలకొల్పేవారిగా చేయి. మా ప్రభూ! నా ప్రార్థనను స్వీకరించు. (14:40)
అలాగే, మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు. ఆయన ఏమని దుఆ చేశారంటే:
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي هَارُونَ أَخِي “ప్రభూ! నా వక్షాన్ని నా కోసం విశాలపరచు, నా పనిని నాకు సులభం చేయి, నా నాలుక ముడిని విప్పు, జనులు నా మాటను అర్థం చేసుకునేందుకు. నా వారిలో నుండి నాకు ఒక సహాయకుణ్ణి నియమించు. నా సోదరుడైన హారూనును. (20:25-30)
అలాగే, జకరియా అలైహిస్సలాం వారి గురించి మనం చూసినట్లయితే, జకరియా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు.
رَبِّ لَا تَذَرْنِي فَرْدًا وَأَنتَ خَيْرُ الْوَارِثِينَ “ప్రభూ! నన్ను ఒంటరిగా వదలి పెట్టకు. నీవే సర్వోత్తమ వారసుడవు.” (21:89)
అలాగే, అయ్యూబ్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో దుఆ చేశారు.
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ “నాకు బాధ కలిగింది. నీవు కరుణించే వారందరిలోకీ అధికంగా కరుణించేవాడవు.” (21:83)
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వేళలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను దుఆ చేస్తూ ఉండేవారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి నిద్రపోయే సమయం వరకు ప్రతి చోట, ప్రతి సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేసేవారు.
ఇక రండి అభిమాన సోదరులారా, దుఆ గురించి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దుఆ చేయడం ప్రవక్తల లక్షణమే కాదు, మన సజ్జన పూర్వీకులు సలఫ్ సాలిహీన్ మరియు గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో వారందరి యొక్క లక్షణం ఏమిటంటే వారు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేశారు, ప్రార్థించారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు క్లుప్తంగా చెప్తున్నాను.
మనము ధార్మిక పండితుల నోట వింటూ ఉంటాం, ఒకసారి ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వర్షం పడుతూ ఉంటే వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి ఒక గుహలోకి వెళ్లిపోయారు. అనుకోకుండా కొండచరియలు విరిగిపడి ఒక పెద్ద రాయి వచ్చి గుహ యొక్క ముఖద్వారం వద్ద వచ్చి అడ్డుపడిపోయింది. వీరు గుహలోనే ఉండిపోయారు. గుహ నుంచి బయటికి రావడానికి వేరే మార్గం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏ ఆయుధాన్ని వారు ఉపయోగించారు? ఎలా వారు బయటికి పడగలిగారు అంటే ఆ లోపల ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ప్రార్థించారు. ముందు ఒక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు, ఆ తర్వాత మరొక వ్యక్తి ప్రార్థించాడు. ఆ విధంగా ముగ్గురు గుహలో నుంచి అల్లాహ్‌ను ప్రార్థిస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ రాయిని తొలగించేశాడు, వారు ప్రాణాలతో బయటపడ్డారు.
అలాగే, మనము చూచినట్లయితే యూనుస్ అలైహిస్సలాం. యూనుస్ అలైహిస్సలాం వారికి, చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెప్తున్నాను. నా అంశానికి సంబంధించిన విషయం మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. యూనుస్ అలైహిస్సలాం వారికి సముద్రంలో పడవేయడం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగేసింది. చేప కడుపులో ఆయన ఉంటూ అల్లాహ్‌ను దుఆ చేశారు. ఓ అల్లాహ్ నన్ను కాపాడు, నన్ను మన్నించు అని
ఈ దుఆ ఆయన చేప కడుపులో నుంచి చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేప కడుపులో ఉన్న ఆయన దుఆను, ప్రార్థనను విని ఆయనకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి ఆ చేప కడుపులో నుంచి సముద్రం ఒడ్డున వచ్చేటట్టు చేసేశాడు.
ఈ విధంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చెప్పొచ్చే విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు క్లిష్టమైన పరిస్థితుల్లో అల్లాహ్‌ను దుఆ చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆను స్వీకరించి వారిని కష్టాల నుండి గట్టెక్కించాడు. కాబట్టి మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకోవాలి, అల్లాహ్‌ను వేడుకోవాలి, అల్లాహ్‌తో దుఆ చేయాలి. ఆయన మనకు కష్టాల నుండి గట్టెక్కించడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
దుఆ గురించి అపోహలు
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, అదేమిటంటే చాలామంది ప్రజలు ఒక అపోహకి గురై ఉన్నారు. ఏంటి ఆ అపోహ? కొంచెం శ్రద్ధగా వినండి. చాలామంది ఏమనుకుంటారంటే, పాపాలు చేసిన వారి దుఆను అల్లాహ్ స్వీకరించడు, పుణ్యాత్ముల దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడు. ఈ విధంగా కొంతమంది భావిస్తారు. మేము పాపాలు బాగా చేసామండి కాబట్టి మనము ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించడు, పుణ్యాత్ములు పాపాలు చేయని వారు వారు ఏ దుఆ చేసినా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆమోదిస్తాడు అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఇది నిజమేనా? అలా జరుగుతుందా? రండి మనము ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా ఈ విషయాన్ని ఇన్ షా అల్లాహ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
పాపాలు చేసిన వారి కోసం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేయింబవళ్ళు ఎదురుచూస్తూ ఉంటాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఉదయం పాపాలు చేసిన వ్యక్తులు రాత్రి పశ్చాత్తాపం చెంది అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారేమో అని రాత్రి మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. రాత్రి పాపాలు చేసిన వారు ఉదయం పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకుంటారేమో అని ఉదయం మొత్తం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎదురుచూస్తాడు. ఆ విధంగా రేయింబవళ్ళు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నా భక్తులు పాపక్షమాపణ కోరుకుంటారేమో అని, పాపాలు చేసిన వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అభిమాన సోదరులారా. కాబట్టి పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం భ్రమ మాత్రమే. అల్లాహ్ వారి పాపాలు మన్నించడానికి ఎదురుచూస్తున్నాడు. కాబట్టి పాపాలు చేసిన వాళ్ళు సైతం అల్లాహ్‌తో దుఆ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ వేడుకోవాలి.
పాపాలను చేసేవాళ్ళలో పెద్ద పాపిష్టుడు ఎవడండీ? పాపాలు చేసేవాడు కాదు, చేయించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? షైతాన్. షైతాన్ కంటే పెద్ద పాపిష్టుడు ఎవడైనా ఉన్నాడా? అంత పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేశాడు, దుఆ చేశాడు. ఏమని దుఆ చేశాడు? ఖుర్ఆన్ లో ఆ ప్రస్తావన ఉంది. అతను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో అడిగాడు.
قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ “అల్లాహ్ నాకు నీవు ప్రళయం వరకు సజీవంగా ఉంచు” అని అల్లాహ్‌తో దుఆ చేశాడు.
పాపిష్టులలోనే పెద్ద పాపి, పెద్ద పాపిష్టుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నాడు, ఓ అల్లాహ్ నాకు ప్రళయం వరకు నీవు సజీవంగా ఉంచు అంటున్నాడు. అల్లాహ్ ఏం చేశాడు? నువ్వు పాపిష్టుడివి, నేను నీ ప్రార్థన స్వీకరించను, నీ దుఆ స్వీకరించను అన్నాడా? సూర హిజ్ర్ 36 వ వాక్యంలో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:
قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ నువ్వు కోరుకున్నట్లుగానే నీకు నేను ప్రళయం వరకు వ్యవధి ఇచ్చేస్తున్నాను, నీకు ప్రళయం వరకు మరణం రాదు పో అని చెప్పేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. చూశారా? కాబట్టి, పాపి, పాపాలు చేసిన వారి దుఆలు స్వీకరించబడవు అని అనుకోవటం తప్పు అభిమాన సోదరులారా.
ఇక రండి, రెండో విషయం. పుణ్యాలు చేసే పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించబడిపోతాయా? అలాంటిది ఏమైనా ఉందా అంటే రండి ఆ విషయం కూడా మనము ఖుర్ఆన్, హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకుందాం. పుణ్యాత్ములలో, భక్తులలో గొప్ప భక్తులు ఎవరండీ? ప్రవక్తలు. పైగంబర్లు, ప్రవక్తల కంటే గొప్ప భక్తులు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో?
ప్రవక్తలలో గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారు. నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తున్నారు. ఏమని దుఆ చేస్తున్నారు?
رَبِّ إِنَّ ابْنِي مِنْ أَهْلِي ఓ అల్లాహ్ నా ఇంటి సభ్యుడు, నా కుమారుడు నా కళ్ళ ఎదుటే మునిగిపోతున్నాడు, కాపాడు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏం చేశాడు? నూహ్ అలైహిస్సలాం వారి ప్రార్థనను తిరస్కరించేశాడు. ఓ నూహ్,
إِنَّهُ لَيْسَ مِنْ أَهْلِكَ అతను నీ కుమారుడే కాదు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయటం తగదు. ఇంకొకసారి అలాంటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ప్రవక్తల జాబితాలో నుంచి నీ పేరు చెరిగిపోతుంది జాగ్రత్త అన్నాడు.
అల్లాహు అక్బర్. కాబట్టి నూహ్ అలైహిస్సలాం లాంటి గొప్ప ప్రవక్త, గొప్ప భక్తుడు దుఆ చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన ఒక దుఆను తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ స్వీకరించేస్తాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనం అనుకోవటం తప్పు.
ఇంకొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఉదాహరణ కూడా ఉంది, కాకపోతే సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అదేమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో మూడు కోరికలు కోరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరండీ? భక్తులలో, మానవులలోనే గొప్ప వ్యక్తి, ప్రవక్తలలోనే గొప్ప ప్రవక్త, ప్రపంచం మొత్తంలో ఆయన కంటే గొప్ప భక్తుడు, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. అలాంటి గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మూడు కోరికలు కోరితే, రెండు కోరికలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీర్చేశాడు, మూడవ కోరిక మాత్రము ఇది కుదరదు అని చెప్పేశాడు. అవేమిటంటే, అదంతా చెప్పుకుంటూ పోతే ఎక్కువ సమయం అయిపోతుంది కాకపోతే ఇది మీరు తెలుసుకోండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో కోరారు: ఓ అల్లాహ్ నా అనుచర సమాజం తుఫానులతో చెరిగిపోకూడదు అంటే అల్లాహ్ ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం కరువుకి గురికాకూడదు అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒప్పుకున్నాడు. నా అనుచర సమాజం పరస్పరం గొడవలు చేసుకోకూడదు అంటే ఇది కుదరదు అని చెప్పేశాడు. చూశారా? కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్‌తో దుఆ చేస్తే, వారి దుఆలలో ఒక దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరస్కరిస్తున్నాడు కాబట్టి, పుణ్యాత్ముల ప్రార్థనలన్నీ, దుఆలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరిస్తాడని అనుకోవటం కూడా తప్పే.
మరి వాస్తవం ఏమిటంటే, పాపిష్టులైనా పుణ్యాత్ములైనా ఎవరి దుఆ స్వీకరించాలి, ఎవరి దుఆ తిరస్కరించాలనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే అధికారం ఉంది. ఆయన తలచుకుంటే పాపిష్టుల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు, పుణ్యాత్ముల దుఆ కూడా స్వీకరించగలుగుతాడు. కాబట్టి, ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే, మేమంతా పాపిష్టులము మా దుఆలు అల్లాహ్ దగ్గర ఆమోదించబడవు, కాబట్టి పుణ్యాలు చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో చూడండి, వారితో దుఆ చేయిద్దాం అని చెప్పి వెతుకుతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కేవలం పుణ్యాలే చేసిన వాళ్ళు దొరకరు. ప్రతిచోట ప్రజలు పాపాలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా చివరకు? సజీవంగా ఉన్నవారిని వదిలేసి, మరణించిన వారి వద్దకు వెళ్ళిపోతారు. వారి గురించి రకరకాల కట్టుకథలు వ్రాయబడి ఉంటాయి అక్కడ. ఏమని అంటే, ఆయన అంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప భక్తుడు, ఇలాంటి ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేశాడు అని చెప్పేసి, చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటే, వారిని గొప్ప భక్తులు అని, పాపాలకు అతీతులు అని, పాపాలు చేయని వారు అని వారిని నమ్మి వెళ్లి వాళ్ళ దగ్గర ఇక వారిని సంతృప్తి పరచడానికి అక్కడ వెళ్లి లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటారు. గుండు కొట్టించుకోవడం అంట, తలనీలాలు సమర్పించుకోవడం అంట, అన్నాలు తినిపించడం అంట, అలాగే దుప్పటి కప్పడం అంట, చాదర్ ఎక్కించడం అంట, అలాగే రకరకాల కార్యాలన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు అభిమాన సోదరులారా. సమాధుల వద్ద, జెండా మానుల వద్ద, ఇవన్నీ అక్కడ వెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే, మేము పాపిష్టులము, మా దుఆ అల్లాహ్ స్వీకరించడు, వాళ్ళు గొప్ప భక్తులు వారి దుఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే స్వీకరిస్తాడు అని ఈ భ్రమలో పడిపోయి ఇలాంటి పాపాలన్నీ, ఇలాంటి చేరని తప్పులన్నీ చేస్తూ ఉంటారు.
కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి భావన నుండి బయటికి రండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే భక్తుడు రెండు చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో వేడుకుంటాడో, దుఆ చేస్తాడో, అతని రెండు చేతుల్ని ఖాళీగా పంపించడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సిగ్గుపడతాడు, నాకు తగిన విషయము కాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భావిస్తాడు. కాబట్టి అభిమాన సోదరులారా, అలాంటి అల్లాహ్‌తో దుఆ చేయండి. ఏ అల్లాహ్ అయితే మీకు ఖాళీ చేతులు ఇంటికి పంపించడానికి సిగ్గుపడతాడో, ఆ అల్లాహ్‌తో దుఆ చేయండి. ఆయన ఎదురు చూస్తున్నాడు, నా భక్తులు నన్ను అడిగితే వారి మొరలను, వారి దుఆలను నేను స్వీకరించానని ఆయన ఎదురు చూస్తున్నాడు. అభిమాన సోదరులారా, అపోహలు వదలండి, అల్లాహ్‌ను నమ్మండి, అల్లాహ్‌ను విశ్వసించండి, అల్లాహ్ కారుణ్యాన్ని అర్థం చేసుకోండి, అల్లాహ్‌ను వేడుకోండి అభిమాన సోదరులారా. ఆయన అందరి మొరలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు.
అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అల్లాహ్‌ను అర్థం చేసుకొని, అల్లాహ్‌ను ఎల్లవేళలా ప్రార్థించే వారిలాగా మార్చుగాక ఆమీన్.
أقول قولي هذا أستغفر الله لي ولكم ولسائر المسلمين فاستغفروه إنه هو الغفور الرحيم [అఖూలు ఖౌలీ హాదా అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వారితో ఇలా అనుః ఆకాశాలలోనూ, భూమిలోనూ అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. (మీరు ఆరాధి- స్తున్న)వారికి తాము ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు. (సూరె నమ్ల్ 27: 65).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.