సంతాన శిక్షణ [పుస్తకం & వీడియో పాఠాలు]

santana-sikshana

సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
రచయిత : Adil bin al Ashuddi عادل بن علي الشدي
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ PDF డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [88 పేజీలు]

సంతాన శిక్షణ [యూట్యూబ్ వీడియో ప్లే లిస్ట్]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV29mLjJ2PaLfrdKlJI0x1Ri

ఈ పుస్తకం ఆధారంగా జరిగిన వీడియో పాఠాలు

ఇతర ముఖ్యమైన వీడియో:

పిల్లల శిక్షణలో తల్లిదండ్రుల పాత్ర & ప్రశ్నోత్తరాలు – షేక్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్ [వీడియో]

చాల మంచి వీడియో, ప్రతి ఒక్కరూ వినవలసిన వీడియో, ఎన్నో విషయాలు షేఖ్ గారు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చాలా చాలా చక్కగా వివరించారు, అల్హందులిల్లాహ్. తప్పక విని ప్రయోజనం పొందండి మరియు మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్షా అల్లాహ్. [1:27: 39 నిముషాలు]

సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలువిషయ సూచిక

  1. విశ్వాసం పట్ల శ్రద్ధ
  2. నమాజు పట్ల శ్రద్ధ
  3. ముందు జాగ్రత్త వైద్యం కంటే మేలు
  4. ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట
  5. సమంజసమైన మందలింపు
  6. ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం నేర్పుట
  7. సధ్వర్తన నేర్పుట
  8. సధ్వర్తునలకు బహుమానం
  9. పిల్లల్ని ప్రేమిస్తున్నానని తెలియజేయుట
  10. సంతానం మధ్య న్యాయం
  11. క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

  1. శిక్షణ పట్ల నిర్భాధ్యత
  2. తండ్రుల ఆధిపత్యం
  3. వైరుద్ధ్య ఆదర్శం
  4. కఠినత్వం
  5. చెడును చూసి నిర్లక్ష్యం చేయడం
  6. యధా పూర్వ పరిస్థితిని వదలటం
  7. తప్పును ఒప్పుకోకపోవడం
  8. వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం
  9. ప్రత్యేకతలను గౌరవించక పోవడం
  10. దూర దూరంగా ఉంచడం

సంతాన శిక్షణలో 130 మార్గాలు

  1. విశ్వాసం
  2. ఆరాధన
  3. ప్రవర్తన
  4. సభ్యత సంస్కారం
  5. శారీరక నిర్మాణం
  6. మానసిక నిర్మాణం
  7. సామాజిక నిర్మాణం
  8. ఆరోగ్యకరమైన నిర్మాణం
  9. సంస్కృతి మరియు విద్యాపరమైన శిక్షణ
  10. సత్పలితం, దుష్పలితం

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా ఖుద్వతిస్సాలికీన్, వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్, అమ్మాబఅద్:

ఇది ఓ శిక్షణ పుస్తకం. ఇది మన సమాజములోని పిల్లల శిక్షణ స్థాయిని పెంచుటకు దోహదపడుతుంది. అందుకు ఈ([1]) తొలి చిరు పుస్తకంలో “సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు” అనే శీర్షికను పొందుపరుచుటయే సహజం. ఎందుకనగాః

  1. పిల్లల, టీనేజరుల శిక్షణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఉత్తమ పద్ధతి అవలంబించిన వారు సర్వమానవాళిలో ఎవ్వరూ లేరు.
  2. మనం మన జీవిత సర్వ వ్యవహారాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించాలని అల్లాహ్ ఆదేశం ఉంది. వాటిలో పిల్లల, టీనేజరుల (యుక్తవయస్కుల) శిక్షణ అతిముఖ్యమైనది. అల్లాహ్ ఆదేశం:

[لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللهَ وَاليَوْمَ الآَخِرَ] {الأحزاب:21}

“నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం కలిగి ఉన్నవారికి”. (అహ్ జాబ్ 33: 21).

  • మనలో అనేక మంది తమ సంతాన శిక్షణ విషయంలో ప్రవక్త పద్ధతికి చాలా దూరంగా ఉన్నారు.
  • మనలో అనేక మంది -ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నవారు- పాశ్చాత్యుల సిద్ధాంతాలను, విధానాలను ఆశ్చర్యకంగా, ఆదర్శవంతమైనవిగా భావిస్తున్నారు. అయితే ఆ సిద్ధాంతాల్లో, విధానాల్లో అనేక విషయాల మూలం మన ప్రవక్త పద్ధతిలో ఉన్న విషయం వారికి తెలియదు.

1. విశ్వాసం పట్ల శ్రద్ధ

ఇది ప్రతి ముస్లిం శిక్షకునిపై ఉన్న తొలి బాధ్యత. అల్లాహ్ ఈ ఉద్దేశ్యంతోనే సృష్టిని సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

“నేను జిన్నాతులను మరియు మానవులను నన్ను ఆరాధించు టకే పుట్టించాను”. (జారియాత్ 51: 56).

ఈ ఉద్దేశ్యం నెరవేరుటకే ప్రవక్తలు పంపబడ్డారు.

[وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] {النحل:36}

“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి”. (నహ్ల్ 16: 36).

పిల్లల మరియు టీనేజరుల హృదయాలు ఏ భాగస్వామి లేని ఏకైక అల్లాహ్ పట్ల అంకితం అయి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కాంక్షించేవారు. చిన్నారి అయిన ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఉపదేశంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

(احْفَظِ اللهَ يَحْفَظْكَ ، احْفَظِ اللهَ تَجِدْهُ تُجَاهَكَ ، إِذَا سَأَلْتَ فَاسْأَلِ اللهَ ، وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللهِ ، {تَعَرَّفْ إِلَيهِ فِي الرَّخَاءِ يَعْرِفُكَ فِي الشِّدَّة} وَاعْلَمْ أَنَّ الْأُمَّةَ لَوْ اجْتَمَعَتْ عَلَى أَنْ يَنْفَعُوكَ بِشَيْءٍ لَمْ يَنْفَعُوكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ لَكَ ، وَلَوْ اجْتَمَعُوا عَلَى أَنْ يَضُرُّوكَ بِشَيْءٍ لَمْ يَضُرُّوكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ عَلَيْكَ ، رُفِعَتِ الْأَقْلَامُ وَجَفَّتِ الصُّحُفُ ، {وَأَنَّ النَّصْرَ مَعَ الصَّبرِ وَأَنَّ الْفَرجَ مَعَ الْكَربِ }.

“నీవు అల్లాహ్ (దర్మం)ను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడతాడు. నీవు అల్లాహ్ (ధర్మం)ను కాపాడు నీవు అల్లా హ్ ను నీ ముందు పొందుతావు. (అంటే ఎల్లవేళల్లో అతని సహాయం నీ వెంట ఉంటుంది). [ఆనంద ఘడియల్లో నీవు ఆయన్ని జ్ఞాపకముంచుకో, ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు] ఏదైనా అడగవలసినప్పుడు అల్లాహ్ తో మాత్రమే అడుగు. సహాయం కోరవలసినప్పుడు అల్లాహ్­తో మాత్రమే సహాయం కోరు. తెలుసుకో! ప్రపంచవాసులంతా కలసి నీకేదైనా లాభం చేగూర్చుదలచితే అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ లాభం చేగూర్చలేరు. వారంతా కలసి నీకేదైనా నష్టం కలిగించాలన్నా అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ నష్టమూ కలిగించలేరు. (విధి వ్రాత వ్రాసే) కలములు లేపబడ్డాయి. (ఇక ఏమీ వ్రాయవు). ఆ పత్రాలు ఎండిపోయినవి (అంటే అందులో ఏ మార్పు కూడా ఇక జరుగదు. [సహనం వెంటే సహాయం ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది]“. (తిర్మిజి, 2516. సహీ ముస్నద్ అహ్మద్ 1/308).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పిల్లల విశ్వాసం పట్ల శ్రద్ధ చూపేవారు. ఈ రోజుల్లో మనలోని అనేక మంది విశ్వాసం మరీ అందులో విధివ్రాతపై విశ్వాసం పట్ల మరియు సర్వ వ్యవహారాలు అల్లాహ్ చేతులో ఉన్నాయనే దాని పట్ల చాలా అశ్రద్ధగా ఉన్నారు. వారు దీని ప్రకారం తమ సంతానానికి శిక్షణ ఇవ్వడం లేదు.

2. నమాజు పట్ల శ్రద్ధ

ప్రవక్త ఇచ్చిన శిక్షణలో వచ్చిన ఒక గొప్ప సూచన ఇలా ఉందిః

(مُرُوا أَوْلَادَكُمْ بِالصَّلَاةِ وَهُمْ أَبْنَاءُ سَبْعِ سِنِينَ وَاضْرِبُوهُمْ عَلَيْهَا وَهُمْ أَبْنَاءُ عَشْر).

“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. పది సంవత్సరాలకు చేరు కున్నప్పుడు దాని గురించి వారిని దండించండి”. (అబూ దావూద్ 495).

ఈ నమాజు విషయంలో తప్ప మరే విషయంలోనైనా దండించే ఆదేశం ఏదైనా హదీసులో ఉందా? నాకు తెలిసిన ప్రకారం లేదు. ఇది నమాజు ప్రాముఖ్యత మరియు దాని పట్ల గల తాకీదు వల్లనే. ఈ దండించడం కూడా పిల్లవాడు బుద్ధిగలవాడై (అంటే ఏడేళ్ళవాడై) అతనికి నమాజు ఆదేశమిచ్చిన తర్వాత 1080 రోజులకు వచ్చింది. ఈ వ్యవధిలో సుమారు 5400 సార్లు నమాజు ఆదేశం మరీమరీ ఇవ్వడమే కాకుండా పిల్లవాడు తన తల్లిదండ్రులను అనేక సార్లు నమాజు చేస్తూ ఉన్నది చూస్తూ ఉంటాడు.

సంతానం చెడిపోవడం గాని, వారు అవిధేయులవడం గాని, చదువే భాగ్యం కలగకపోవడం గాని, వీటన్నిటికి నమాజు చేయడం, చేయకపోవడం మరియు దానిని కాపాడడంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నది. సంతాన సద్వర్తన మరియు వారి ఉన్నత విద్యలో నమాజు ప్రభావంపై గనక శిక్షణపరమైన సైంటిఫిక్ పరిశోధన జరిగితే నమ్మశక్యం కలిగే ఫలితం వెలువడుతుంది. సంపూర్ణ సాఫల్యానికి నమాజు సంబంధం లోతుగా ఉందని తెలుస్తుంది.

3. ముందు జాగ్రత్త వైద్యము కంటే మేలు

పిల్లల మరియు టీనేజరుల పట్ల ప్రవక్త గారి శిక్షణ విధానంలో వైద్యము కంటే ముందు జాగ్రత్తే ప్రధానంగా ఉండేది. అల్లాహ్ దయతో ఇలాంటి శిక్షణ సంతానం అపాయాల్లో పడకుండా ఉండటానికి పటిష్ఠమైన అడ్డుగా నిలుస్తుంది.

ఈ నాటి శిక్షణలో మన స్పష్టమైన తప్పు ఏమిటంటే మనం ముందు జాగ్రత్తను విడనాడి అశ్రద్ధగా ఉంటాము, మరెప్పుడైతే మన పిల్లలు ఏదైనా అపాయానికి గురవుతారో అప్పుడు దాని చికిత్స కొరకు ప్రయత్నం చేస్తాము.

ఈ సందర్భంగా మనం, పదేళ్ళ పిల్లల గురించి “వారి పడకలను వేరుగా చేయండి” [وَفَرِّقُوا بَيْنَهُمْ فِي الْمَضَاجِعِ అబూ దావూద్ 495 సహీ] అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశాన్ని పసిగట్టగలం. అలాగే ఓసారి ఫజ్ల్ బిన్ అబ్బాస్ అను ఓ నవయువకుడిని ప్రవక్త తమ వెనక వాహనముపై ఎక్కించుకున్నారు. అక్కడ ఖస్అమియా వంశానికి చెందిన ఓ స్త్రీ వచ్చి ఏదో ప్రశ్న ప్రవక్తతో అడుగుతుంది. అప్పుడు ఆ నవయువకుడు తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అతని ముఖాన్ని మరో వైపు మరలించారు. (బుఖారీ 1513).

ముందుజాగ్రత్తను విడనాడుటలోని కొన్ని రూపాలు ఇవి: ఏ కట్టుబాట్లు లేకుండా కొడుకులు, కుమార్తెలు టీవీ ఛానళ్ళు చూడడం. వాటిలో కొన్ని ప్రోగ్రాములు తుచ్ఛమైనవి అయితే మరికొన్ని ఆలోచన, నడతలో ఘోర ప్రమాదాల్ని తెచ్చి పెడతాయి. ఏ ఆటంకము లేకుండా వారు ఇష్టమున్నవారితో ఇంటర్నెట్టుల ద్వారా సంబంధాలు ఏర్పరుచు కొనుట. ఏలాంటి పర్వవేక్షణ, అప్రమత్తత లేకుండా సెల్ ఫోన్ల ఉపయోగం. ఇలాంటి పనులు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ప్రవక్త గారి ముందుజాగ్రత్త పద్ధతిని ఎక్కడ అనుసరిస్తున్నట్లు మనం?

ఈ పరికరాల ఉపయోగంలో వారి వయస్సు, వారి మానసిక ఎదుగుదలను గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఉదాహరణకుః ఇంటర్నెట్, కొడుకు లేదా కూతుళ్ళ బెడ్ రూంలోనే ఎందుకు? ఎలాంటి పర్వవేక్షణ లేకుండా అన్ని వేళల్లో ఎందుకు దానిని వారు ఉపయోగించడం? అందరి దృష్టిలో ఉండే విధంగా అది హాలులో ఎందుకు ఉంచరాదు? దానిని అందరూ ఎందుకు ఉపయోగించలేరు? తండ్రి మరియు తల్లికి కొడుకు మరియు కూతుళ్ళు వాడే వాటి కోడ్ లు ఎందుకు తెలియకూడదు? అయితే తల్లిదండ్రులు ఉత్తమ పద్ధతిలో వారికి బోధించాక, (ఇంటర్నెట్ లాభనష్టాలు వారికి తెలిపాక) పర్యవేక్షణ జరపాలి.

4. ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట

ఓ రోజు ఏ కొడుకైనా తన తండ్రి వద్దకు వచ్చి “మత్తు సేవించుటకు, డ్రగ్స్ ఉపయోగించుటకు లేదా వ్యభిచారం చేయుటకు -అల్లాహ్ మనందరిని వీటి నుండి కాపాడుగాక!- నాకు అనుమతివ్వండి అని తండ్రిని అడుగుతే, సమాధానం ఏముంటుందని భావిస్తారు? సామాన్యంగా ఇలాంటి దురాలోచనగల కొడుకులు స్పష్టంగా ఎన్నడూ తమ తండ్రులతో సలహా తీసుకోరు, తమ స్నేహితుల వైపే మరలుతారు. వారు వారి అల్ప అనుభవం, తక్కువ జ్ఞానం వల్ల చెడుకే సహాయపడతారు. కాని ఇలాంటి ప్రశ్న ఎదురైన చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే పద్ధతి అనుసరించారు. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తా! నాకు వ్యభిచరించే అనుమతివ్వండి అని అడిగాడు. దానికి అక్కడున్న ప్రజలు అతడ్ని గద్దించి చీవాట్లు పెట్టారు. కాని ప్రవక్త అన్నారుః అతడ్ని నా దగ్గరికి తీసుకురండి. అతడు దగ్గరికి వచ్చాక, కూర్చోమన్నారు. అతడు కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారుః “నీవడిగిన విషయం నీ తల్లితో జరిగితే నీవు ఇష్టపడతావా?” లేదు, అల్లాహ్ సాక్షిగా! నేను మీ కొరకు అర్పితులయ్యే భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించు గాక! అని అతడన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రజలు కూడా తమ తల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడరు” అని చెప్పి “నీ చెల్లి, నీ కూతురు, నీ మేనత్త, నీ పినతల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడతావా” అని అడిగారు. ఆ యువకుడు అదే సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ (శుభ) హస్తం అతని మీద పెట్టి ఇలా దుఆ ఇచ్చారుః

اللَّهُمَّ اغْفِرْ ذَنْبَهُ وَطَهِّرْ قَلْبَهُ وَحَصِّنْ فَرْجَهُ

“అల్లాహ్! ఇతని పాపాల్ని మన్నించు. ఇతని హృదయాన్ని శుద్ధ పరచు. ఇతని మర్మాన్ని (మానాన్ని) కాపాడు”. (అహ్మద్ 5/256, బైహఖీ షుఅబ్ 5415లో, సహీహా 370)

ఇక్కడ గమనించండి, ప్రవక్త యువకుని ఆలోచన విధానాన్ని ఎలా మల్లించారో, అతను ఆలోచించలేని కోణాలను ఎలా స్పష్ట పరిచారో. మాట్లాడి, తన ఆవేదన వెళిబుచ్చే స్వేఛ్ఛ ప్రవక్త ఇస్తారన్న నమ్మకం అతనికి ఉన్నందుకే సృష్టిలో అతి పరిశుద్ధులైన వారితోనే ఈ ప్రశ్న అడుగుటకు ధైర్యం చేశాడు.

దీనికి భిన్నంగా ఒక తండ్రి నవయువకుడైన తన 16 సం. కొడుకును ఇంటి నుండి తరిమి వేశాడు. దీనికి కారణం: ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఒకసారి తన తండ్రి అడిగిన ప్రశ్నకు ‘నేను స్వతంతృడిని’ అన్న ఒక్క పదం పలికే ధైర్యం అతడు చేశాడు. తండ్రి ఇంటి నుండి గెంటివేసినందుకు తన బంధువుల వద్దకు వెళ్ళి కొద్ది రోజులు గడిపాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య సంధి కుదిరింది. అయితే తండ్రి కొడుకుల మధ్య స్పష్టమైన సంభాషణపై నిలబడే ప్రేమపూర్వకమైన సంబంధం చెడిపోయిన తర్వాత. ఓ రకంగా కొడుకు తప్పు చేశాడు. కాని తండ్రి తప్పు దానికంటే పెద్దది.

ఈ రోజుల్లో సంతానంతో సంభాషించే, మాట్లాడే మరియు వారి ఆవేదనలు, అవసరాలను (ప్రేమపూర్వకంగా) వినే అవసరం చాలా ఉంది. కాని అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం, దాని ఓ కోణాన్ని పైన తెలుపడం జరిగింది. ఫిర్ఔన్ పద్ధతి ప్రకారం కాదు. వాడన్నాడుః ]నాకు సముచితంగా తోచిన సలహానే మీకు ఇస్తున్నాను. సక్రమైన మార్గం వైపునకే నేను మిమ్మల్ని నడుపుతున్నాను. (మోమిన్ 40: 29). ఈ పద్ధతి ద్వారా పిల్లలపై ఒత్తిడి వేస్తే వారు దాన్ని ఒప్పుకోరు.

5. సమంజసమైన మందలింపు

మందలింపు విషయంలో ప్రజలు హెచ్చుతగ్గులకు గురయ్యే వారితో పాటు మధ్యరకమైన వారు కొందరున్నారు. కొందరు అతిగా ప్రేమించి వారిని ఏ మాత్రం మందలించరు. ఇది ఓ రకమైన నిర్లక్ష్యం. ఇది సవ్యమైన విధానం కాదు. ఇంకొందరు ప్రతీ చిన్న పెద్ద దానిపై గట్టిగా మందలిస్తారు. ఇది కూడా మెచ్చుకోదగిన విధానం కాదు. మధ్యరకమైన విధానమే ప్రవక్తవారి విధానం.

నవయువకుల తప్పిదాలపై ప్రవక్తగారు మందిలించేవారు, అయితే ఆ మందలింపు హెచ్చుతగ్గులకు అతీతంగా మధ్యరకంగా ఉండేది. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేది కాదు. తప్పు, దాని అపాయ పరిమాణాన్ని బట్టి మారేది. తప్పు చేసినవాడు తెలిసి కావాలని చేశాడా? లేదా చేసి పశ్చాత్తాపం పడ్డాడా? తెలియక చేశాడా? తెలిసి చేశాడా? ఇలాంటి ఇంకెన్నో రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవయువకుల శిక్షణలో శ్రద్ధ వహించే వారు. ఇలాంటి ఓ మందలింపు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హుతో జరిగింది. అతను ఓ యువకుడు. ఒక మస్జిదులో సామూహిక నమాజు చేయించే ఇమాం కూడాను. ఒకసారి చాలా దీర్ఘంగా నమాజు చేయించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “జనాన్ని చిక్కుల్లో పడవేసి ధర్మం పట్ల వారికి వెగటు కలిగించ దలిచావా?” (బుఖారి 705, ముస్లిం 6106). అతను చేసిన తప్పుపై ఊర్కోలేదు. అలా అని అతని తప్పుకు మించి మందలించలేదు.

ఒక్కోసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించి, ముఖవర్చస్సుపై కోపం వ్యక్తం చేసి సరిపుచ్చుకునేవారు. ఇలాంటి ఓ ఘటన మాతృమూర్తి ఆయిషా రజియయల్లాహు అన్హా ఉల్లేఖించారుః ఆమె చిత్రాలున్న ఓ దిండు ఖరీదు చేశారు. ప్రవక్త దాన్ని చూసి గడప పైనే ఆగిపోయారు. లోనికి ప్రవేశించలేదు. నేను ఆయన ముఖంలో అయిష్ట ఛాయల్ని గమనించి, “ప్రవక్తా! అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు మరలుతున్నాను. నాతో జరిగిన తప్పేమిటి? అని అడిగాను. దానికి ప్రవక్త “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు… (బుఖారి 2105, ముస్లిం 2107).

దీనికి భిన్నంగా ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ ను చాలా గట్టిగా మందలించారు. దానికి కారణం ఏమిటంటే; మఖ్జూమియా వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది, దానికి శిక్షగా ఆమె చేతులు నరికేయబడకుండా కొందరు ఉసామాను సిఫారసు చేయుటకై ప్రవక్త వద్దకు పంపారు. అతను వెళ్ళి అల్లాహ్ నిర్ణయించిన హద్దుల విషయంలో సిఫారసు చేశాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ హద్దుల్లో ఒకదాని గురించా నీవు సిఫారసు చేసేది” (ఇలా కాజాలదు) అని గట్టిగా మందలించారు.

6. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం నేర్పుట

పిల్లల మరియు టీనేజరుల ఆత్మస్థైర్యం బలహీనపడినదని మనం మొరపెట్టుకున్నప్పుడు లేదా పాశ్చాత్యుల పిల్లలు ఆత్మ స్థైర్యం మరియు తమ భావాలను వ్యక్తపరిచే శక్తి కలిగి ఉండడం మరియు మనలోని ఎక్కువ పిల్లల్లో ఈ అతిముఖ్య గుణం క్షీణించి పోవడంలో అంచన వేసినప్పుడు ప్రవక్తగారి శిక్షణశాలకు మరలుట మనపై విధిగా ఉంది, అక్కడ ఈ రోగానికి వైద్యం క్రియాత్మకంగా జరుగుతుంది.

మన పిల్లల్లో ఆత్మస్థైర్యం జనించాలంటే వారు స్వయంగా వారిని గౌరవించుకోవాలి మరియు వారు ముఖ్యులు అన్న బావం వారిలో కలగాలి. కాని వారు దాన్ని ఎలా గ్రహించగలరు? ఎందుకంటే మనం వారికి ఓ ప్రాముఖ్యత, గౌరవం ఇస్తున్నామని అనేక సందర్భాల్లో వ్యక్త పరచము.

వారు తమ స్వంత భావాలను వ్యక్తం చేసే అనుమతి మనం ఇస్తామా? ఎన్నుకునే స్వేచ్ఛ వారికి ప్రసాదిస్తామా? వారికి ప్రత్యేకించిన విషయాల్లో వారి అనుమతి కోరుతామా? లేదా గద్దించి, చిన్నచూపు చూచి, వారి ఇష్టం, కోరికలను అణచి, వారి -ప్రత్యేక విషయాల్లో- వారి అనుమతిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తామా? మనలోని అనేకుల వద్ద ఇదే ప్రవర్తన చెలామణి ఉంది. కొందరు పరిశోధకులు దీనికి “నోరుమూయించే ప్రవర్తన” అని పేరు పెట్టారు.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ పాలపాత్ర వచ్చింది ఆయన పాలు త్రాగారు, అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు, ఎడమ ప్రక్కన పెద్దవారున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్బాయిని ఉద్దేశించి “ఈ పాత్ర నా ఎడమ ప్రక్క ఉన్నవారికి ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు అబ్బాయి ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! మీ నుండి పొందే నావంతు భాగంలో ఇతరులకు ప్రాధాన్యత’నివ్వను అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. (బుఖారి, ముస్లిం).

ఈ సంఘటనలో; పిల్లల్లో స్వయ గౌరవాన్ని పెంచుటకు, వారు ముఖ్యులు అన్న భావన కలిగించుటకు శిక్షణ సంబంధమైన నాలుగు సూచనలున్నాయి.

1. పిల్లవాడు ప్రవక్తకు అతి సమీపములో కూర్చుండే స్థానం ఎలా పొందాడు? అది కూడా గొప్ప శ్రేష్ఠులైనవారి కుడి ప్రక్కన. మరి అందులో పెద్దలూ ఉన్నారు.

2. స్వయం త్రాగిన తర్వాత అతనికి వచ్చిన హక్కు నుండి అతను తొలిగి పోవుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లవాడితో అనుమతి కోరుతున్నారంటే అతనిలో ఎంత ఆత్మ స్థైర్యం పెరగవచ్చు. అయినా ఇది ఏమంతా గాంభీర్యమైన, ముఖ్య సమస్య అని? (కాని ప్రవక్త ఎంత శ్రద్ధ చూపారో చూడండి).

3. ప్రవక్త అడిగిన దానిని తిరస్కరించి, దానికి అనుకూలమైన సాకు/కారణం చెప్పగలిగాడంటే, ప్రవక్తగారి శిక్షణశాలలో పిల్లలకు ఎంతటి ఆత్మస్థైర్యం లభించిందో గమనించండి.

4. శిక్షణ విషయంలో క్రియ, మాట కంటే సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఉల్లేఖకుడు చెప్పాడుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. అంటే ఆ పాలపాత్ర అతనికి ఇస్తూ అతడు చెప్పిన నిదర్శనాన్ని మెచ్చుకుంటూ అతనికి గౌరవం ప్రసాదిస్తున్నట్లు అతను గ్రహించే విధంగా ప్రవక్త అతని చేతిలో ఆ పాత్ర పెట్టారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షణశాలలో నవయువకులకు వారి ప్రాముఖ్యత మరియు వారి గౌరవం వారికి తెలియజేయడం వరకే సరిపుచ్చుకోకుండా, ప్రయోగాత్మకంగా వారి శక్తికి తగిన కొన్ని బాధ్యతలు వారికి అప్పజెప్పి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేవారు.

ఇదిగో, ఇతను ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు; ఈ యువకుడు ప్రజలకు నమాజు చేయించేవాడు. ఎందుకనగా ఈ పని ఇతని శక్తికి తగినదైయుండెను.

ఇతను ఉసామా బిన్ జైద్ ఒక సైన్యానికే అధిపతిగా నిర్ణయించబడ్డాడు. అందులో పెద్ద పెద్ద సహాబాలు (ప్రవక్త సహచరులు)న్నారు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు దాటలేదు. ఎందుకు? అతని ఆత్మస్థైర్యం పెరగాలని, తద్వారా సమాజము అతనితో ప్రయోజనం పొందాలని. వీరిద్దరికంటే ముందు అలీ బిన్ అబీ తాలిబ్ ప్రవక్త వలస వెళ్ళే రాత్రి ఆయన పడకపై పడుకుంటాడు. అది ఓ పెద్ద బాధ్యత, అందులో ధైర్యత్యాగాల అవసరముంటుంది.

కాని ఈ రోజుల్లో మనలోని అనేకులు తమ సంతానంపై నమ్మకం కలిగి ఉండరు. కనీసం ఏ చిన్న బాధ్యత కూడా వారికి అప్పజెప్పరు.

7. సద్వర్తన నేర్పుట

పిల్లలకు అనుభవాలు తక్కువ ఉంటాయి గనక ఉపదేశ అవసరం ఎక్కువ ఉంటుంది. మంచి బోధన, శిక్షణకై ఎవరు ముందడుగు వేస్తారో వారే హృదయం మరియు మదిలో స్థానం పొందుతారు. అందుకే పిల్లల శిక్షణ విషయంలో ప్రవక్త ముందుగా చర్య తీసుకొని వారికి ఉత్తమ నడవడిక, మంచి సభ్యత సంస్కారాలు నేర్పేవారు.

ఉదాహరణకుః హసన్ బిన్ అలీ చిన్నగా ఉన్నప్పుడే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధచేశారుః “నిన్ను సందేహంలో పడవేసేదాన్ని వదలి సందేహం లేని దాన్ని ఎన్నుకో, సత్యంలో తృప్తి, నెమ్మది ఉంది. మరియు అబద్ధంలో అనుమానం”. (తిర్మిజి 2518. అల్బానీ దీనిని సహీ అని చెప్పారు). హసన్ రజియల్లాహు అన్హు దానిని మంచిగా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఎందుకనగా తన చిన్నతనంలోనే అది తన మదిలో నాటుకుంది.

అలాగే ఇబ్ను ఉమర్ చిన్నతనంలోనే ఈ పలుకులు ప్రవక్త నోట విన్నారుః “నీవు ప్రపంచంలో విదేశీయుని లేదా ప్రయాణికుని మాదిరిగా జీవించు. (బుఖారి 6416).

ఉమర్ బిన్ అబీ సలమ అనే బాలుడు భోజనం చేస్తున్నప్పుడు పళ్ళంలో అతని చేయి తిరుగుతున్నది చూసి “ఓ బాలుడా! అల్లాహ్ నామంతో (భోజనం ఆరంభించు), కుడి చేత్తో తిను మరియు పళ్ళంలో నీ దగ్గర ఉన్నదే తిను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితవు చేశారు. (బుఖారి 5376, ముస్లిం 2022).

చాలా బాధకరమైన విషయమేమంటే? కొందరు తల్లిదండ్రులు తమ సంతానానికి ఉత్తమ నడవడిక మరియు శిక్షణ అసలే బోధించరు. వారిద్దరు తమ కొడుకును అతని స్నేహితులతో కఠినంగా, కర్కశంగా ప్రవర్తిస్తూ చూస్తారు అయినా ఏమీ చెప్పరు. లేదా అతడ్ని ఒంటరిగా, దూరదూరంగా ఉండటం చూస్తారు కాని ఏమీ బోధించరు. ఇంకా ఇలాంటి ప్రవర్తనలు ఎన్నో ఉంటాయి, వాటికి సంబంధించిన సరియైన సూచనలు, చికిత్స చాలా అవసరం.

8. సద్వర్తనులకు బహుమానం

పిల్లలు ఉత్తమ సభ్యత, సంస్కార బోధన చేయబడి, దానికి అనుగుణంగా సద్వర్తన పాటించి, మంచి నడవడిక అవలంభించినప్పుడు మరింత ప్రోత్సహించి, ఏదైనా ప్రతిఫలం తప్పక ఇవ్వాలి. అది కనీసం వారిని ప్రశంసించడం, వారి కొరకు మంచి దుఆ ఇవ్వడం అయినా సరే.

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు తన చిన్నతనంలో ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడిపిన సంఘటన ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డికి వెళ్ళారు. ఆయన వుజూ చేసుకోవటం కోసం నేను నీళ్ళు పెట్టాను. ప్రవక్త (మరుగుదొడ్డి నుండి బైటికి వచ్చి) ఈ నీళ్ళు ఎవరు పెట్టారు? అని అడిగారు. పెట్టినవారి గురించి ఆయనకు తెలిసిన వెంటనే “అల్లాహ్! ఇతనికి ధర్మ అవగాహన మరియు ఖుర్ఆన్ వ్యాఖ్యానజ్ఞానం ప్రసాదించు” అని దీవించారు. ఈ బాలుడు చేసిన ఓ మంచితనానికి ప్రతిఫలంగా, అతను పాటించిన సద్వర్తనకు బదులుగా ఈ గొప్ప దుఆ లభించింది. (బుఖారీ 143, ముస్లిం 2477)

అలాగే జఅఫర్ బిన్ అబీ తాలిబ్ లో ఉన్న ఉత్తమ నడవడికను గురించి ప్రశంసిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి ఇలా అన్నారుః “రూపంలో మరియు నైతిక స్వభావంలో నీవు నాకు పోలి ఉన్నావు”. (బుఖారి 2699).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యువకుడైన ముఆజ్ బిన్ జబల్ లో, (ప్రవక్త) సంప్రదాయాల పట్ల అధిక శ్రద్ధ చూపడం, ఎక్కువగా ఆయన సమక్షంలో కూర్చుండటం లాంటి ఉత్తమ పద్ధతి చూసి అతడ్ని ప్రశంసిస్తూ రెండు సార్లు అన్నారుః “ముఆజ్! నేను అల్లాహ్ కొరకై నిన్ను ప్రేమిస్తున్నాను”. (అబూ దావూద్ 1522. అల్బానీ సహీ అన్నా). ప్రవక్తగారి ఈ ప్రోత్సాహం వల్ల మఆజ్ పై ఎంత గొప్ప ప్రభావం పడి ఉంటుంది?.

మనలో అనేకులు తమ కొడుకులను మంచి పనులు చేస్తూ, మరియు ఉత్తమ నడవడిక పాటిస్తూ చూసి, వారిని ప్రశంసించరు. అది ఓ సామాన్య విషయమే కదా అని భ్రమపడతారు. కాని అవే మంచితనాలు అతనిలో లేనప్పుడు చీవాట్లు పెడతారు. ఉదాహరణకుః పెద్దలను గౌరవించడం, చదువులో ముందుగా ఉండడం, నమాజులను పాబందీగా పాటించడం, సత్యం, అమానతు (అప్పగింత)లను పాటించడం లాంటివి వగైరా.

9. పిల్లల్ని ప్రేమిస్తున్నామని తెలియజేయుట

1. ప్రేమిస్తున్నామని వారికి తెలియజేయాలి

తల్లిదండ్రుల నుండి లేదా సంరక్షకుల నుండి ప్రేమ, అప్యాయత మరియు అంగీకారం ఉన్నట్లు పిల్లలకు తెలిసియుండుట అతిముఖ్య అవసరాల్లో లెక్కించబడుతుంది. ఈ విషయం వారికి తెలియనిచో వారిలో మానసికంగా చాలా లోటు ఏర్పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లల ఈ అవసరాన్ని చాలా వరకు తీర్చేవారు. సహీ బుఖారిలో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని తమ వడిలో తీసుకొని ఇలా అన్నారుః “అల్లాహ్! నేను ఇతడ్ని ప్రేమిస్తున్నాను. నీవు కూడా ఇతడ్ని ప్రేమించు మరియు ఇతడ్ని ప్రేమించేవారిని కూడా నీవు ప్రేమించు”. (బుఖారీ 5884)

ఒకసారి అఖ్ రఅ బిన్ హాబిస్ రజియల్లాహు అన్హు వచ్చాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ మరియు హుసైనులతో ముద్దాడుతున్నారు. ఇది చూసిన అఖ్ రఅ ‘మీరు మీ పిల్లలను ముద్దాడుతారా? నాకు పది మంది సంతానం, నేను ఎప్పుడు ఏ ఒక్కడిని ముద్దాడ లేదు’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః “నీ హృదయంలో నుండి అల్లాహ్ కరుణను తీసి వేస్తే నేనేమైనా చేయగలనా?”. (బుఖారి 5997).

ప్రవక్త ఎంతటి వివేకులైన శిక్షకులో గమనించండి; అఖ్ రఅ బిన్ హాబిస్ ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యంతో ఇచ్చారు. అది దాని జవాబు కంటే ఉత్తమం మరియు సంపూర్ణంగా ఉంది. దాని సారాంశం ఏమిటంటేః చిన్నారుల పట్ల కారుణ్యభావం చూపని మరియు వారికి ప్రేమభావం తెలియజేయని వారిలో కారుణ్య గుణం లేనట్లు. చిన్నారులతో మసలుకొనేటప్పుడు ఈ కారుణ్యం కోల్పోయే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు. “మా చిన్నారుల పట్ల కరుణభావంతో మెలగనివారు మాలోని వారు కారు”. (అబూ దావూద్ 4943 సహీ).

ప్రవక్త గారి పసిబాబు ఇబ్రాహీం ఈ లోకాన్ని వీడెటప్పుడు ఈ కారుణ్యమే ఆయన్ను కన్నీటిలో ముంచింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “నిశ్చయంగా కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచివేసింది”. (బుఖారి 1303).

“వీరిద్దరు ఈ లోకంలో నాకు రెండు పుష్పాలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్, హుసైన్ ల గురించి చెప్పినప్పుడు వారు విని మానసికంగా, శిక్షణపరంగా ఎంత సంతోషం కలిగి ఉండవచ్చురు?. (బుఖారి 3753).

దీనికి భిన్నంగా కొందరు ఎంతటి ఓర్వలేని మనస్తత్వం మరియు శిక్షణపరంగా తప్పుడు మార్గానికి ఒడిగడతారు; సంతానం పట్ల గల ప్రేమను వారికి తెలియజేయడం, వారితో ఉండే వాత్సల్యాన్ని వెల్లడించడం మానుకుంటారు, ఏ భ్రమతో అంటే; దీనివల్ల వారు చెడిపోతారని లేదా వారిని పురుషులుగా తీర్చిదిద్దడానికి మరియు వారి జీవిత సంసిద్ధతకు సరియైన విధానం కాదు అని.

2. వారితో ఆటలాడడం, వారి హృదయా-లకు చేరువవడం

ఈ విషయంలోని శ్రద్ధ వల్లనే ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములకు నమాజు చేయిస్తూ సజ్దా నుండి చాలా ఆలస్యంగా లేశారు. ఎందుకో తెలుసా?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నప్పుడు ఒక పసిబాలుడు అంటే హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీపుపై కూర్చున్నాడు. ఈ సందర్భంలో ప్రవక్త ఆ బాలుని సంతోషంలో అడ్డు కలిగించదలచలేదు. (అందుకే చాలా దీర్ఘంగా సజ్దా చేశారు). నమాజు ముగించిన తర్వాత తమ సహచరులతో ఇలా చెప్పారుః “(నేను దీర్ఘమైన సజ్దా ఎందుకు చేశానంటే) నా కొడుకు నాపై కూర్చున్నాడు అతని కోరిక తీరక ముందే లేవడం నాకు ఇష్టం లేకపోయింది”. (నిసాయి 1141, సహీ).

ఒక ప్రశ్న: ఇలాంటి సంఘటన ఈ రోజుల్లో మన మస్జిదుల్లోని ఏ ఒక్క ఇమాముతోనైనా జరిగితే ఎలా ఉంటుంది? పసిబాలుని పట్ల ప్రవక్త శ్రద్ధ చూపుతూ దీర్ఘంగా సజ్దా చేసినట్లు అతను గనక చేస్తే మన ముక్తదీలు ఎలా ప్రవర్తిస్తారు?.

ఇది పిల్లలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితి. నమాజులో ఉండి పిల్లల పట్ల ఇంత శ్రద్ధ చూపేవారు, వేరే సందర్భాల్లో పిల్లలతో హాస్యమాడే వారు, ఆటలాడే వారంటే ఏమిటాశ్చర్యం?. “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అబ్బాయితో ఆడుతూ తమ నాలుక బైటికి తీశారు. దాని ఎర్రపు భాగాన్ని ఆ అబ్బాయి చూశాడు”. (సహీహా అల్బానీ 70).

ఒక్కోసారి పిల్లల్లో కొందరితో ఇలా చెప్పేవారుః “ఎవరు నా వైపు ముందుగా పరుగెత్తుకు వస్తారో వారికి ఇదిస్తాను”. (అహ్మద్). ఇలా పిల్లలతో ఆటలాడుతూ ఉండడంలో శిక్షణపరంగా మంచి ప్రభావం ఉంటుంది. ఎవరు వారితో పరిహాసాలాడుతూ, ప్రేమ పూర్వకంగా ఉంటారో వారి పట్ల పిల్లలు ఎక్కువ దగ్గర అవుతారు. వారి మాట విన్నంత మరెవరి మాట వినరు.

10. సంతానం మధ్య న్యాయం

సంతానం పట్ల తల్లిదండ్రుల వ్యవహారంలో వ్యత్యాసం వల్ల వారు అతి తొందరగా ప్రభావితులవుతారు. అనేక సందర్భాల్లో సోదరుల మధ్య కపట, ద్వేషాల పరిస్థితులు అలుముకోడానికి మూలకారణం తల్లిదండ్రులు వారి మధ్య న్యాయం చేయకపోవటమే.

తల్లిదండ్రుల ప్రేమను కోల్పయారన్న అధిక భయం మరియు ఆ ప్రేమ సంతానంలో ఎవరో ఒకరివైపునకే మరలుట వల్ల మిగిత సంతానంలో అతని గురించి శత్రుత్వ గుణం జనిస్తుంది. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు ఇలాంటి తప్పుడు భావానికే గురై, వారి తండ్రి యూఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ (అలైహిస్సలాం)కే వారిపై అధిక్యత ఇస్తున్నాడని భ్రమ చెందారు, అందుకే ఇలా అన్నారుః

[إِذْ قَالُوا لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَى أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ] {يوسف:8}

వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్, అతని సొంత సోదరుడూ ఇద్దరూ అంటే మన తండ్రికి, మన అందరికంటే ఎక్కువ ప్రేమ (ఇష్టం). (యూసుఫ్ 12: 8).

ఈ దుష్భావనయే తమ సోదరుడైన యూసుఫ్ పట్ల వారి దౌర్జన్యానికి కారణమయ్యింది. అదే విషయం ఖుర్ఆనులో ఇలా ప్రస్తావించబడిందిః

[اقْتُلُوا يُوسُفَ أَوِ اطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ]

యూసుఫ్ ను చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పార వెయ్యండి, మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు .

దీని వెనక వారి ఉద్దేశం ఒకటే, అదేమిటంటే; యూసుఫ్ వీడి పోయాక వారు వారి తండ్రి ప్రేమను, శ్రద్ధను పొందుతారని.

ఒక తండ్రి స్వయంగా చెప్పిన సంఘటన ఇదిః అతను తన ఇద్దరి కుమారులతో ఇంటి బైటికి ఓ ఎడారి ప్రదేశంలో వెళ్ళాడు. అక్కడ వారు ఒక దీర్ఘ సీరియల్ ఫిల్మ్ వీక్షిస్తూ ఆనందోత్సవాల్లో గడిపారు. ఆ మధ్యలో అతని ఎనిమిది సంవత్సరాల చిన్న కుమారుడు నిద్రపోయాడు. అందుకు తండ్రి తను ధరించి ఉన్న కోటు తీసి అతని మీద కప్పాడు. ఆ సమావేశం సమాప్తమైన తర్వాత చిన్న కుమారుడిని ఎత్తుకొని బండిలో కూర్చున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో తండ్రి తన 12 సంవత్సరాల కొడుకుతో అతని అమూర్తాలోచన మరియు మౌనాన్ని చూసి, “ఇప్పటి వరకు చూసిన ఫిల్మ్ తో ఏ ప్రయోజనం పొందావు? అని అడిగాడు. దానికి కొడుకు “ఫిల్మ్ చూస్తూ చూస్తూ నేను కూడా పడుకుంటే, నాపై కూడా మీరు మీ కోట్ కప్పుతారా? నన్ను కూడా ఎత్తుకొని బండిలో పడుకోబెడతారా? అని తను అడిగిన ప్రశ్నకు ఏ సంబంధం లేని ప్రశ్న కొడుకు అడిగినందుకు తండ్రి ఆశ్చర్యపడ్డాడు.

అందుకే ఒకసారి నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తాను తన కొడుకుకు ఇచ్చిన ఓ బహుమానానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యంగా ఉండాలని కోరాడు. “నీ సంతానంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి బహుమానమే ఇచ్చావా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగి, మళ్ళీ చెప్పారుః “మీ సంతాన విషయంలో అల్లాహ్ కు భయపడండి, మీ సంతానం మధ్య న్యాయం పాటించండి”. మరో ఉల్లేఖనంలో ఉందిః “అన్యాయ విషయాల్లో నేను సాక్షుడ్ని కాను”. (బఖారి 2587, 2650).

11. క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ

ఏ విషయాలు ఆచరించాలని పిల్లవానితో చెప్పబడుతుందో, అవి అతనికి ఆదర్శంగా ఉన్న వారిలో ఆచరణ రూపం దాల్చి ఉన్నది అతను చూచుట చాలా ముఖ్యం. ప్రత్యేకంగా తల్లిదండ్రులు మరియు శిక్షకుల్లో.

నిశ్చయంగా ఆదర్శవంతమైన శిక్షణ ప్రవక్తగారి పిల్లల మరియు టీనేజరుల శిక్షణలో అతి ముఖ్య భాగం. ప్రవక్తగారి జీవిత కార్యాల్లో ప్రతీది మన కొరకు ఆదర్శమే. చదవండి అల్లాహ్ ఆదేశం సూరతుల్ అహ్ జాబ్ (33:21)లో

[لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ]

నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది .

ప్రవక్తగారి ఈ చరిత్ర గోప్యంగా, ఎవరికి తెలియకుండా ఏదో కొందరి ప్రత్యేకులకు తెలిసే విధంగా లేకుండినది. బహిరంగంగా అందరికి తెలిసినట్లే ఉండెను. పిన్నలు, పెద్దలు అందరికీ తెలిసి యుండెను.

ఇది ఎంత సంపూర్ణమైన శిక్షణ గమనించండి. ఇబ్ను అబ్బాస్ అనే బాలుడు తనకు ఆదర్శనకర్త అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక రాత్రి గడుపుతాడు. “సగం రాత్రి గడిసిన తర్వాత ప్రవక్త మేలుకొని వుజూ చేసి తహజ్జుద్ నమాజు చేయునది” చూశాడు. (బుఖారి).

ఇలాంటి క్రియాత్మక సంఘటనే పిల్లలకు అల్లాహ్ పట్ల స్వచ్ఛత, భయభీతి, తహజ్జుద్ నమాజు ద్వారా దైవ సన్నిధానం పొందే శిక్షణ ఇస్తుంది. వేరుగా శిక్షకుడు ప్రోత్సహకరమైన మాటలు చెప్పే అవసరమే ఉండదు.

నేటి కాలంలో ఆదర్శనకర్తలు, ప్రసిద్ధి చెందిన వ్యక్తులు; సినీ తారలు, క్రీడాకారులు అయిపోయారు. వాస్తవానికి వారు ఈ కొత్త తరానికి, వారి శిక్షణకు మరియు వారికి కావలసిన విలువలకు ఏ మాత్రం అర్హులు కారు. అంతెందుకు వారి క్రియాత్మక వ్యవహారం ఈ విలువలకు, వాటి వైపు ఆహ్వానానికి సయితం తోడ్పడదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శనాల అవసరం చాలా ఉంది. వాటిని టీనేజరుల ముందు ఆకర్శవంతమైన పరిపూర్ణ పద్ధతిలో పెట్టాలి. అది వారి పంచేద్రియాలకు అబ్బునట్లు ఉండాలి. వారు ఏ కాలంలో జీవిస్తున్నారో దానికి అనుగుణంగా ఉండాలి. వాటికి తోడుగా శిక్షకుల ఆదర్శం ఉండాలి.

సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు

అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలర్ రహ్మతిల్ ముహ్ దాతి వన్నిఅమతిల్ ముస్ దాతి నబియ్యినా ముహమ్మదివ్ వ అలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్. అమ్మా బఅద్:

సంతాన శిక్షణ సులభతరమైన, లక్ష్యరహితమైన పని కాదు, ప్రతి ఒక్కరు ఏ విద్యాజ్ఞానం లేకుండా దానిని పాటించటానికి. అది నిర్దిష్ట ప్రమాణాలతో, ధార్మిక నియమాలతో కూడిన క్లిష్టమైన పని. అంతే కాదు సంతానం మేళ్ళను సాధించుటకు, వారి జ్ఞానేంద్రియాల పెరుగుదల, దినదినానికి వారి మనోస్థితిని పెంచుటకు మరియు వారి నుండి చెడు అనే అపాయాన్ని దూరం చేయుటకు వ్యక్తిగత ప్రయత్నాలు, భావనాపూర్ణమైన అంతర్దృష్టి చాలా అవసరం.

కొందరు శిక్షణ విషయంలో తాతముత్తాతల గుడ్డి మార్గాన్ని అనుసరిస్తూ వంశపరమైన వారసత్వంలో పొందిన ఒకే ఒక సాలిడ్ (నిశ్చలమైన) పద్దతిని అవలంబిస్తున్నది చూస్తున్నాము. అందువల్ల శిక్షణ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. దీనికి ప్రభావితులవుతున్నది మన సంతానం. అందుకే వారిలో ఎన్నో దుష్ప్రవర్తనలు, చెడు అలవాట్లు జనిస్తున్నాయి. వాటిని కుటుంబాలు మరియు సమాజాలు భరించలేక పోతున్నాయి.

ఈ చిరుపుస్తకంలో కొన్ని ముఖ్యమైన పొరపాట్లను ప్రస్తావిస్తూ వాటి సరియైన నివారణపద్ధతి కూడా చూపే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ అందరికి సద్భాగ్యం ప్రసాదించుగాక.

1- శిక్షణ పట్ల నిర్బాధ్యత

కొందరు తల్లిదండ్రులు సంతానం శిక్షణలో ఏ మాత్రం శ్రద్ధ వహించరు. తమ సంతానం పట్ల ఏ చిన్న బాధ్యత వహించకుండా వదిలేస్తారు. వారు అట్లే పెరుగుతూ పోతారు. సంతానం పట్ల ఉన్న వారి బాధ్యత కూడు, గూడు, బట్ట కంటే మించినది లేదని భావిస్తారు. మరి అల్లాహ్ ఈ ఆదేశాన్ని మరచిపోతారు.

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا]

విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మీ భార్యపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. (తహ్రీమ్ 66: 6).

అలీ బిన్ తాలిబ్ రజియల్లాహు అన్హు చెప్పారు: వారికి విద్య నేర్పండి మంచి శిక్షణ ఇవ్వండి.

అలాగే వారు (తండ్రులు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాన్ని మరచిపోతారుః

(كُلُّكُمْ رَاعٍ وَمَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ فَالْإِمَامُ رَاعٍ وَهُوَ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ وَالرَّجُلُ فِي أَهْلِهِ رَاعٍ وَهُوَ مَسْئُولٌ عَنْ رَعِيَّتِهِ وَالْمَرْأَةُ فِي بَيْتِ زَوْجِهَا رَاعِيَةٌ وَهِيَ مَسْئُولَةٌ عَنْ رَعِيَّتِهَا)

“మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడు ప్రశ్నించబడుతాడు. నాయకుడు (తన ప్రజలకు) బాధ్యుడు, అతని బాధ్యత గురించి అతడ్ని ప్రశ్నించబడుతుంది. భర్త తనింట్లో బాధ్యుడు అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. భార్య తన భర్త ఇంట్లో భాధ్యురాలు. ఆమె బాధ్యతలో ఉన్నదాని గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. (బుఖారి 2409, ముస్లిం 1829).

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ ఇలా అన్నారుః ఎవరు తన సంతానానికి లాభదయకమైన విద్య నేర్పకుండా వదిలేశాడో అతడు వారి పట్ల మహా చెడు, కీడు చేసినవాడవుతాడు. సంతానంలో అలవడే చెడు అలవాట్లు ఎక్కువశాతం తండ్రుల వల్లనే అలవడతాయి. అది వారు, వారి పట్ల అవలంబించే అశ్రద్ధ మరియు ధార్మిక విధులను, సున్నతులను వారికి నేర్పకపోవడం వల్లనే. వారి చిన్నతనంలో వారిని వృధాగా వదిలేశారు. అందుకు వారు పెరిగి పెద్దగయిన తర్వాత స్వయానికే గాని లేదా తమ తండ్రులకేగాని ఏ లాభం చేకూర్చలేకపోయారు. వీరి సంగతి ఎలా ఉంటుందంటేః తనయుని అవిధేయత భరించలేక ఒక తండ్రి అతడ్ని గట్టిగా మందలించాడు. అప్పుడు అతడన్నాడుః నాన్నా! మీరు నా చిన్నతనంలో చేసిన దాని ఫలితమే ఇప్పుడు మీరు పొందుతున్నారు. నా చిన్నతనంలో మీరు నన్ను వృధా చేశారు. ఇప్పుడు మీరు ముసలివారయ్యాక నేను మిమ్మల్ని వదిలేశాను. (తొహ్ ఫతుల్ మౌదూద్ 229).

2- తండ్రుల ఆధిపత్యం

ఈ తప్పు మొదటి తప్పుకు వ్యతిరేకమైనది. కొందరు తండ్రులు తమ సంతానం యొక్క సర్వ చేష్టలపై తమదే ఆధికారం నడవాలని ప్రయత్నిస్తారు. ఇలా వారు (తండ్రులు) వారి (సంతానం) వ్యక్తిత్వాన్ని మట్టిలో కల్పుతారు. తమ ఆలోచనలో వచ్చిన ఆదేశాలిస్తారు. దానికి వారు (సంతానం) గుడ్డిగా వాటిని పాటించుట తప్ప మరొక ప్రసక్తే ఉండకూడదని భావిస్తారు. నిశ్చయంగా దీని వల్ల ఎన్నో అవాంఛనీయ చేష్టలు ఉద్భవిస్తాయిః

1. బలహీన వ్యక్తిత్వానికి గురి అవడం. ఆత్మవిశ్వాసం లోపించడం.

2. విముఖత భావం, పిరికితనం మరియు అనవసరపు లజ్జా గుణం చోటు చేసుకొనుట.

3. వింతైన, కొత్త విషయాలు కనుక్కునే యోగ్యత నశించిపోవుట.

4. యుక్తవయస్సుకు చేరిన తర్వాత చెడిపోయే అవకాశం, అప్పుడు అతడు బేడిలలో బందీగా ఉండి విడుదలైనట్లు ఫీల్ అవుతాడు. అందుకు అన్ని రకాల హద్దులను అతిక్రమించే ప్రయత్నం చేస్తాడు. అవి ధర్మపరమైనవి అయినా సరే.

5- మానసిక మరియు శారీరక రోగాలకు గురిఅవుతాడు.

పిల్లలకు వారి స్వంత విషయాల్లో కొంత పాటి స్వతంత్రం ఇవ్వాలని నిశ్చయంగా ఉత్తమ శిక్షణ హామీ ఇస్తుంది. అది ఏవైనా నిర్ణయాలు తీసుకొనుటకైనా, తమ కోరికను వెలిబుచ్చుటకైనా, బాధ్యత వహించుటకైనా. ఇవన్నియూ సవ్యమైన పద్ధతితో, ఉత్తమ సభ్యత తో ఉండేటట్లు తండ్రులు తమ సంతాన మదిలో నాటాలి.

3-వైరుద్ధ్య ఆదర్శం

మొదటిసారిగా పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావమే పడుతుంది. అతని గుణాలు, అలవాట్లలో వీరి ఛాయనే పడుతుంది. తల్లిదండ్రులు సద్వర్తన, ఉత్తమ నడవడిక కలవారైతే పిల్లలు కూడా సద్గుణాలు నేర్చుకుంటారు. వారు చెప్పేదొకటి చేసేది మరొకటైతే పిల్లలపై దాని చెడు ప్రభావం పడుతుంది.

వైరుద్ధ్యంలో మరొకటిః తండ్రి సత్యత గురించి తన సంతానానికి చెప్పి స్వయంగా అబద్ధం పలుకుతే లేదా అతను అమానతు గురించి ఆదేశించి స్వయంగా దొంగతనం చేస్తే, లేదా వాగ్దానానికి కట్టుబడి ఉండాలని బోధించి, తానే వాగ్దాన భంగం చేస్తే, లేదా మంచితనం మరియు సంబంధాల్ని పెంచుకోవాలని బోధించి అతడే తన తల్లిదండ్రుల పట్ల అవిధేయుడైతే, లేదా నమాజు గురించి ఆదేశించి స్వయంగా నమాజు వదులుతూ ఉంటే, లేదా పోగత్రాగరాదని హితువు చెప్పి స్వయంగా ధూమపానం చేస్తే, ఇలాంటి వైరుద్ధ్యం వలన శిక్షకుడు తన పిల్లల దృష్టిలో చులకన అయిపోతాడు. అతని మాటకు వారు ఏ మాత్రం విలువనివ్వరు. అల్లాహ్ అదేశం ఇలా ఉందిః

[أَتَأْمُرُونَ النَّاسَ بِالبِرِّ وَتَنْسَوْنَ أَنْفُسَكُمْ وَأَنْتُمْ تَتْلُونَ الكِتَابَ أَفَلَا تَعْقِلُونَ] {البقرة:44}

ఏమిటి, మీరు మంచిపనులు చేయమని ఇతరులకైతే హితబోధ చేస్తారు. కాని మిమ్మల్ని మీరు మరచి పోతారు. మీరు గ్రంథపారాయణం కూడా చేస్తున్నారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ప్రయోగించరేమిటి. (బఖర 2: 44).

4- కఠినత్వం

తండ్రులు తమ సంతానం పట్ల కరుణ, ప్రేమ మరియు మెతక వైఖరి అవలంభించాలి. చిన్నారుల పట్ల ప్రవక్త పద్ధతి ఇదే. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని ముద్దాడారు. అప్పుడు అక్కడ అఖ్ రఅ బిన్ హారిస్ ఉన్నారు. ఈ విషయం చూసి అతడన్నాడుః నాకు పది మంది సంతానం, కాని నేను ఇంతవరకు ఏ ఒక్కరినీ ముద్ధాడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు చూస్తూ ఇలా అన్నారుః

(مَنْ لَا يَرْحَمْ لَا يُرْحَمْ).

“కరుణించనివారు కరుణింపబడరు“. (బుఖారి 5997).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః పల్లెటూరి అరబ్బులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. “మీరు మీ పిల్లల ను ముద్దాడుతారా?” అని అడిగారు. “అవును” అని ప్రవక్త సమాధానమిచ్చారు. వారన్నారుః “కాని మేము అల్లాహ్ సాక్షిగా! ముద్దాడము”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః

(أَوَ أَمْلِكُ إِنْ كَانَ اللهُ نَزَعَ الرَّحْمَةَ مِنْ قُلُوبِكُمْ).

“అల్లాహ్ మీ హృదయాల్లో నుండి కరుణ తీసేస్తే నేనేమి చేయ గలుగుతాను”. (బుఖారి 5998, ముస్లిం 2317).

శిక్షించేటప్పుడు కఠినత్వం మరియు కర్కశత్వం పాటించటం అనేది తికమక వేసే ఆలోచనలు పుట్టిస్తాయి. అందువల్ల వారు తమనుతామే అదుపులో పెట్టుకోలేరు. ఇక ఇతరులను అదుపులో పెట్టే ప్రసక్తే రాదు.

వెనకటి కాలంలో ఉన్న (ఆలోచన ఏమిటంటే) కఠినత్వం, గట్టిగా కొట్టడం వల్లనే పిల్లల్లో శక్తి, బలం, పురుషత్వం లాంటివి పెరుగుతాయి, బాధ్యత వహించే శక్తి వస్తుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది అని. అయితే ఈ ఆలోచన తప్పు అని రుజువైపోయింది. ఎందుకనగా కఠినత్వం అనేది పిల్లల్లో వ్యదాభరితమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. అది వాళ్ళను తలబిరుసుతనం, శత్రుత్వం లోనికి నెట్టుతుంది. వారి మానసిక వికాసాని (Mental Maturity)కి అడ్డు పడుతుంది. ఎల్లప్పుడూ వారిలో హీనత్వం, తక్కువ స్థాయి మరియు అగౌరవ భావం కలుగజేస్తుంది.

ఏ మాత్రం శిక్షించనేవద్దు అని కూడా దీని భావం కాదు. ఎప్పుడైనా ఒక్క సారి శిక్షించాలి. అయితే ఈ శిక్ష అనేది కరుణ, కటాక్షాల హద్దులకు మించి ఉండకూడదు.

5- చెడును చూసి నిర్లక్ష్యం చేయడం

ఎలాగైతే కఠినత్వం మంచి విషయం కాదో, దానిని ఖండించడం జరిగిందో. అలాగే చెడును చూసి అశ్రద్ధ వహించడం కూడా మంచి విషయం కాదు. అనేక మంది తండ్రులు ఈ తప్పుకు గురి అవుతారు. వారి సాకు ఏమిటంటే వారు ఇంకా చిన్నారులే కదా, పెద్దగయిన తర్వాత ఈ చెడులను వారే వదులుకుంటారు. ఇది సరియైన మాట కాదు. ఎందుకనగా ఎవరైనా పసితనంలో ఓ అలవాటుకు బానిసయ్యాక పెరిగి పెద్దయ్యాక దాన్ని వదులుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఎందరో తండ్రులు తమ సంతానాన్ని తమ కార్జపుముక్కలను అట్లే వదిలేసి, వారి శిక్షణ మానుకొని, వారి వాంఛలు తీర్చుకొనుటకు దోహదపడి వారి ఇహపరాలను పాడు చేస్తున్నారు. వారిని గౌరవపరుస్తున్నాము అన్నది వారి భ్రమ, అసలు వారు వారిని అవమానపరుస్తున్నారు. కనికరం చూపుతున్నాము అన్నది వారి భ్రమ అసలు వారు వారిపై దౌర్జన్యం చేస్తూ వారిని దూరం చేస్తున్నారు. చివరికి తమ సంతానం నుండి ఏ లాభం కూడా పొందలేకపోతారు. అంతే కాదు ఇలా చేసి వారు ఇహపరాల మేళ్ళు సాధించకుండా చేస్తున్నారు. తనయుళ్ళలో ఉన్న చెడును గనక నీవు చూసినట్లైతే అది ఎక్కువశాతం తండ్రుల నుండి సోకినదే అని నీకు తెలుస్తుంది. (తుహ్ ఫతుల్ మౌదూద్).

నిర్లక్ష్యాల్లో అతి గొప్పది; పిల్లలను నమాజు చేయమని, దాని పట్ల శ్రద్ధ వహించమని ప్రోత్సహించకపోవడం. ప్రవక్త ﷺ చెప్పారుః

(مُرُوا أَبْنَاءَكُمْ بِالصَّلَاةِ لِسَبْعِ سِنِينَ وَاضْرِبُوهُمْ عَلَيْهَا لِعَشْرِ سِنِينَ وَفَرِّقُوا بَيْنَهُمْ فِي الْمَضَاجِعِ)

“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. వారు పది సంవత్సరాలకు చేరినప్పుడు వారిని దండించండి. వారి పడకలను వేరు చేయండి”. (అహ్మద్, అబూ దావూద్ 495. అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).

తనయులు నిద్రపోతున్నది లేదా ఆడుకుంటున్నది చూస్తూ (వారికేమీ చెప్పకుండా) తండ్రి నమాజు కొరకు వెళ్ళిపోవుట చాలా తప్పు విషయం. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం చదవండిః

[وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا] {طه:132}

నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు స్వయంగా నీవు కూడ దానిని పాటించు. (తాహా 20:132).

సంగీతం మరియు పాటలు వినుట నుండి వారిని వారించాలి. దుస్తుల్లో, అలవాట్లలో అవిశ్వాసుల పోలికల నుండి వారించాలి. ధరినిపై అల్లకల్లోలాన్ని సృష్టించే, సంస్కరణను చేపట్టని పేరుగల ప్రసిద్ధుల నుండి వారిని దూరం ఉంచాలి. వీటన్నిటిలో తండ్రి తమ సంతానంతో ప్రేమపూర్వకమైన సంబంధంతో పాటు మెతకవైఖరి, దయాగుణం అవలంభించాలి. సున్నితంగా, ఒప్పించగల పద్ధతిలో మాట్లాడాలి.

6- యధాపూర్వ స్థితిపై వదలటం

శిక్షణలోని తప్పుల్లో ఒకటి యధాపూర్వ పరిస్థితిని వదలి పాతరకమైన పద్ధతినే అవలంభించుట. కాలానికి తగిన నూతన విషయాల్ని విడనాడుట. ఉదాహరణకు కొందరు శిక్షణ ఇచ్చేవారు ఈతాడుట, బాణము విడుచుట మరియు గుఱ్ఱపు స్వారి నేర్పుట పట్ల మంచి శ్రద్ధ చూపుతారు మరి ఈ కాలానికి అవసరమైన ఇతర నైపుణ్యాలను వదిలేస్తారు. ఉదాహరణకుః కంప్యూటర్ శిక్షణ, అత్యవసరమైన ఇతర భాషలు, ప్రసంగం, రచన పద్ధతులు నేర్పాలి. తమ రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)కు పనికొచ్చే ఆధునిక ఆటల్లో ఏదైనా మంచి ఆటలో నైపుణ్యం ఉండేట్లు చేయాలి. శిక్షణ ఇచ్చేవారు వారి (శిక్షితుల) ఈ శక్తి సామర్థ్యాలను పెంచుతూ ఉండుటకు ఎక్కువ శ్రద్ధ చూపాలి. లేనిచో వారు తమ తోటి వాళ్ళతో వెనకే ఉండిపోతారు. అందువల్ల వారిలో న్యూనతాభావం జనిస్తుంది. జీవిత వ్వవహారాల్లో వారికంటే ముందుకు వెళ్ళిపోయిన వారి తోటివాళ్ళకు దూరదూరంగా ఉంటుంటారు.

7- తప్పును ఒప్పుకోకపోవడం

తన పిల్లవాని తప్పులేకున్నా అతడ్ని శిక్షించి అతనిపై అన్యాయం చేసిన తండ్రి మనలో లేడా?

తన పిల్లవాడు నిర్దోషి అయినా అతనిపై నిందమోపిన తండ్రి మనలో లేడా?

అబద్ధపు చాడీలను నమ్మి తన కొడుకును కొట్టిన తండ్రి మనలో లేడా?

అవును, నేను నా కొడుకు పట్ల తప్పు చేశాను అని తర్వాత తండ్రి తెలుసుకుంటాడు. కాని తన సంతానం ముందు తన పశ్చాత్తాప భావం వ్యక్త పరచడు, అస్సలు తన తప్పునే ఒప్పుకోడు. బహుశా అతని సంతానానికి ఏ హక్కూ, గౌరవం, మర్యాద మరియు వాటి భావాలు లేవు కావచ్చు అతని దృష్టిలో?

నిశ్చయంగా ఇది అసవ్యమైన పద్ధతి. ఇది పిల్లల మనస్సులో గర్వం, అహంకారం మరియు తప్పుడు అభిప్రాయంపైన పక్షపాతం లాంటి దుర్గుణాలను జనిస్తుంది. తప్పులో ఉండి కూడా తలబిరుసుతనం వహించే గుణాలు పుట్టిస్తాయి.

ఒకవేళ తండ్రి తన కొడుకు ముందు పశ్చాత్తాప భావం వ్యక్తపరిస్తే, ఇది చాలా మంచి పద్ధతి. ఇలా శిక్షకుడు తనతో జరిగిన తప్పును ఓ సానుకూల ప్రవర్తలో మార్చగలడు, దీని వల్ల పిల్లల్లో మంచి ప్రభావం కలిగి, ధర్మం మరియు సత్యం పట్ల అణకువ, తప్పు జరిగితే ఒప్పుకునే భావం, ఇతరుల పట్ల మన్నింపు వైఖరి తదితర గుణాలు పుడుతాయి.

8- వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం

తండ్రియే తనింట్లో బాధ్యుడు, వారి వ్యవహారాలు చూసేవాడు మరియు వారి గురించి అతనితోనే విచారించడం జరుగుతుంది. ఇలా అని ఇంట్లో ఉన్నవారితో సంప్రదించకుండా, ప్రతి విషయంలో తానే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కూడా సరి కాదు. దీని వల్ల పిల్లల మధ్య ఒకరిపై మరొకరు పెత్తనం నడిపించాలన్న బుద్ధి పుడుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళపై చేయిజేసుకుంటారు. వారిని అణచి ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎలాగైతే వారి తండ్రి నిర్ణయాలు తీసుకోవడంలో వారితో ప్రవర్తిస్తున్నాడో.

సెలవు రోజున తన భార్యపిల్లల్ని తన కారులో పార్క్ తీసుకెళ్లే ఒక వ్యక్తి నాకు ఇచ్చట గుర్తుకొచ్చాడు. అతడు వారిని ఎటు తీసుకెళ్తున్నాడో వారికేమీ తెలియదు. వారిలో ఏ ఒక్కడైనా (నాన్నా ఎక్కడికి వెళుతున్నారు? అని) అడిగితే, పాపం! వారు పార్క్ పోవడానికి ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్న ఆ సెలవు రోజు ‘వెనక్కి మళ్ళించి ఇంటికి తీసుకెళ్తాను’ అన్న బెదిరింపులతో శిక్షించేవాడు.

ఆ తండ్రి తన సంతానాన్ని దగ్గరికి పిలుచుకొని ఎటు వెళ్తే బాగుంటుందని వారితో సలహా తీసుకుంటే ఉత్తమం కాదా? ఇలా చేస్తే అతడు ఏమి నష్టపోతాడు? కాని కొందరు ఇతరులను అణచి ఉంచడం, వారిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారిపై తమ పెత్తనం చూపడమే మేలు అని అనుకుంటుంటారు.

9- ప్రత్యేకతలను గౌరవించకపోవడం

ప్రత్యేకతలకు సంబంధించిన గౌరవం మన పిల్లలకు నేర్పించడం ఎంతైనా అవసరం. దాని వల్ల వారు వారి వ్యక్తిగత వ్యవహారాలు మరియు ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల మధ్యగల వ్యత్యాసాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు.

విశ్రాంతి తీసుకునే సమయాల్లో మరియు ఇతరులతో కలవడం ఇష్టం లేని సమయాల్లో మనం మన సంతానానికి మరియు మన సేవలో ఉన్నవారికి మన గదిలోకి ప్రవేశించే ముందు అనుమతి తీసుకోవాలనే విషయం తప్పనిసరిగా నేర్పాలని ఖుర్ఆన్ మనకు బోధించింది.

అందుకే తల్లిదండ్రులు -ప్రత్యేకంగా తల్లి- ఇతరుల ప్రత్యేకతల గురించి వాటి హద్దుల గురించి తమ సంతానానికి తెలుపాలి. ఇతరులకు ప్రత్యేకించబడిన స్థలం లేక గదిలో వారు అనుమతి లేనిదే ప్రవేశించరాదు. మూయబడి ఉన్న ఏ వస్తువును తెరువరాదు. అది ఏ ఇంటి తలుపైనా, ఫ్రిజ్ అయినా, పుస్తకం, ఆఫీసు, పెట్టె లాంటిదేదైనా ఎప్పడి నుండి పడి ఉన్నా సరే.

కొన్ని ఇళ్ళల్లో ప్రత్యేకతల గౌరవం అనేది నశించిపోయింది. అందువల్ల సంతానం అరాచకత్వం, క్రూరత్వ వాతవరణంలో పెరుగుతూ ఇతరుల హక్కులను నెరవేర్చకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.

అందుకు తండ్రులు ముందు తమ సంతానం యొక్క ప్రత్యేకతలను గౌరవించాలి. వారి గదిలో ప్రవేశించే ముందు తలుపు తట్టాలి. వారి రహస్యాలను దాచి ఉంచాలి. ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే వారిని నిందించకుండా దాన్ని స్పష్టపరచకుండా ఉండాలి, మన్నించాలి. ఇలా తండ్రులు చేశారంటే ఇతరుల ప్రత్యేకతల గురించి వారికి నేర్పడంలో సఫలులైనట్లే.

10- దూరదూరంగా ఉంచడం

పెద్దల సమావేశంలో తమ సంతానం పాల్గొనటాన్ని కొందరు తండ్రులు ఒక న్యూనత, లోపంగా భావిస్తారు. ఎప్పుడు వారు పెద్దల సమక్షంలో రావాలనుకుంటారో వారిని నెట్టేస్తూ, చివాట్లు పెడుతూ, దూరం చేస్తూ ఉంటారు.

నిస్సందేహంగా ఒక్కోసారి పిల్లవాడిని పెద్దల సమావేశంలో కూర్చోనివ్వాలి. అతడు వారితో నేర్చుకుంటాడు. వారి అనుభవాలను సేకరిస్తాడు. బుఖారి (5620), ముస్లిం (2030)లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ త్రాగే పదార్థం వచ్చింది. ఆయన అందులో నుండి త్రాగారు. అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు. ఎడమ ప్రక్కన పెద్దమనుషులున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లవాడినుద్దేశించిః “ఇటువైపున ఉన్న పెద్దలకు ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు ఆ పసివాడు ‘అల్లాహ్ సాక్షిగా! ఓ ప్రవక్తా, మీ నుండి లభించే నా వంతులో నేను ఇతరులకు ప్రధాన్యత నివ్వను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి గొప్ప మార్గదర్శి, ఉత్తమ శిక్షకులు, మరియు మంచి విధంగా నేర్పేవారు. ప్రతి కాలం మరియు స్థలంలో ప్రతి వయస్సువారు ఆయన నుండి నేర్చుకోగలరు. ఇస్లామీయ దైవ విధానం పిల్లలను పెద్దల సమావేశంలో, వారున్న మస్జిదుల్లో, వారితో ప్రయాణానికి, వారు పోగు అయ్యే చోట పాల్గొనడాన్ని నివారించదు. వారు పాల్గొని వారి అనుభవాలను నేర్చుకుంటారు. వారితో పనుల్లో పాల్గొంటారు. బాధ్యత గుణాల్ని అన్వయించు కుంటారు.

చిన్నారులను పెద్దలతో వేరుంచడం అనేది అవాంఛనీయ విధానం, మరియు కార్య శూన్య పద్ధతి. ఇలా చిన్నారులను పరస్పరం ఒకరికొకరు కలసినట్లు వదిలేస్తే, వారు అల్లరి, చిల్లరి పనులు నేర్చుకుంటూ, షైతాన్ వారిని తన చిక్కులో పడవేసుకుంటాడు, అందువల్ల వారు చెడు నేర్చుకుంటారు. దానికి బదులు పెద్దలతో ఉంటే గొప్ప విషయాలు, అనుభవాలు నేర్చు కుంటారు.

సంతాన శిక్షణలో 130 మార్గాలు

అల్ హందు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, అమ్మాబఅద్:

నిశ్చయంగా సంతాన శిక్షణ ఒక కళ మరియు ఒక నైపుణ్యం. అతి తక్కువ మంది ఇందులో పరిపూర్ణులుగా తేలుతారు. ఈ విషయంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. అందులో కొన్ని సంక్షిప్తమైతే మరికొన్ని విపులంగా ఉన్నాయి. వాటిలోని కొన్నింటి సారాంశం మీ ముందు ఉంచదలిచాను. లాభదాయకమైన అనుభవాలతో వాటిని క్రమబద్ధీకరించాను. తమ చిన్నారులకు ఉత్తమ శిక్షణ ఇవ్వదలచిన తండ్రులు మరియు శిక్షకులు ఇలాంటి విషయాల అవసరం లేకుండా ఉండలేరు.

విశ్వాసం

1- నీవు నీ సంతానానికి కలిమయే తౌహీద్ (ఏకత్వ వచనం: లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు అందులో ఉన్న అంగీకారం మరియు నిరాకారం నేర్పు. “లాఇలాహ”లో నిరాకారం ఉంది. అంటే అల్లాహ్ తప్ప సమస్తములో నుండి ‘ఉలూహియత్’ (ఆరాధన హక్కు)ను నిరాకరించుట. “ఇల్లల్లాహ్” లో అంగీకారం ఉంది, అంటే అల్లాహ్ ఏకైకుడు మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని నమ్ముట.

2- మనమెందుకు పుట్టించబడ్డామో? ఈ ఆయతు ఆధారంగా వారికి నేర్పించు.

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 51: 56).

“ఆరాధన” యొక్క భావాన్ని విపులంగా నచ్చజెప్పు

3- అల్లాహ్ పేరు వింటేనే ఓ భయంకరమైన భావన వారి మదిలో కుదిరే విధంగా మాటిమాటికి నరకం, అల్లాహ్ కోపం, శిక్ష, విపత్తు గురించి బెదిరించకు.

4- అల్లాహ్ నే అధికంగా ప్రేమిస్తున్నవాడిగా వారిని తయారు చేయి. ఎందుకనగా? ఆయనే మనల్ని పుట్టించాడు, మనకు ఉపాధి ఇచ్చాడు, తినిపించాడు, త్రాగించాడు, ధరింపజేశాడు, ఆయనకు భక్తులుగా మెదులుకునే విధంగా చేశాడు.

5- ఏకాంతంలో తప్పు చేయుట నుండి వారించు. ఎందుకనగా అల్లాహ్ అన్ని స్థితుల్లో వారిని గమనిస్తున్నాడు.

6- అల్లాహ్ పేరుగల జిక్ర్ (స్మరణలు) వారి ముందు అధికంగా చేయి. ఉదాః తినేత్రాగేటప్పుడు, లోనికి, బయటికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహ్ అని. బోజనం చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని. ఆశ్చర్యం కలిగినప్పుడు సుబ్ హానల్లాహ్ అని. ఇంకా ఇలాంటి జిక్ర్.

7- వారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ కుదిరించు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు నేర్పించి, వారి ముందు ఆయన చరిత్ర తెలిపి, ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఆయనపై దరూద్ చదివి.

8- వారి మనస్సులో విధివ్రాతపై నమ్మకం పటిష్ఠంగా నాటు. అంటే అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ తలచనిది కానేకాదు.

9- వారికి విశ్వాస ఆరు మూలసూత్రాలు నేర్పు.

10- విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వారి ముందుంచు. ఉదాః నీ ప్రభువు ఎవరు? నీ ధర్మమేది? నీ ప్రవక్త ఎవరు? అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు ఉపాధి, తిను త్రాగు పదార్థాలు మరియు స్వస్థత ప్రసాదించువారు ఎవరు? తౌహీద్ యొక్క రకాలు ఏమిటి? షిర్క్, కుఫ్ర్, నిఫాఖ్ అంటేమిటి? ముష్రిక్, కాఫిర్, మునాఫిఖుల పర్యవసానం ఏమిటి? తదితర…

ఆరాధన

11- వారికి ఇస్లాం యొక్క ఐదు మూలసూత్రాలు నేర్పు.

12- వారికి నమాజు అలవాటు చేయించు. (ప్రవక్త ఆదేశం:) “మీ సంతానం వయస్సు ఏడు సంవత్సరాలు పూర్తి అయితే వారికి నమాజు గురించి ఆదేశించండి. వారి వయస్సు పది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నమాజు విషయంలో వారిని దండించండి”.

13- నీవు మస్జిదుకు వెళ్తూ నీ కూమారుడ్ని వెంట తీసుకెళ్ళు. వుజూ ఎలా చెయ్యాలో అతనికి నేర్పించు.

14- అతనికి మస్జిదులో పాటించవలసిన పద్ధతులు, మస్జిద్ గౌరవం, పవిత్రత తెలియజేయి.

15- ఉపవాసం అలవాటు చేయించు. చివరికి అతను పెద్దగయ్యాక దానికి అలవాటు పడి ఉండుటకు.

16- సాధ్యమైనంత వరకు ఖుర్ఆన్, హదీస్ మరియు సమయ సందర్భ స్మరణలు (అజ్కార్) కంఠస్తం చేయించుటకు ప్రోత్సహించు.

17- వారు ఖుర్ఆన్ కంఠస్తం చేస్తున్నా కొద్ది వారికి ఏదైనా బహుమానం ఇస్తూ ఉండు. ఇబ్రాహీం బిన్ అద్ హమ్ చెప్పాడుః నా తండ్రి నాతో ఇలా చెప్పారుః “పుత్రుడా! నీవు ప్రవక్త హదీసులు కంఠస్తం చేయి. నీవు కంఠస్తం చేసే ప్రతి హదీసుకు బదులుగా ఒక దిర్హమ్ ఇస్తాను”. ఈ విధంగా నేను హదీసులు కంఠస్తం చేశాను.

18- ఖుర్ఆన్ పేరు వింటెనే శిక్షగా భావించి, ఖుర్ఆన్ కంఠస్తాన్ని అసహ్యించుకునే విధంగా కంఠస్తం మరియు పారాయణం చేయమని అధికంగా ఒత్తిడి చేయకు.

19- నీవు నీ సంతానానికి ఒక ఆదర్శం అని తెలుసుకో. నీవు ఆరాధనల్లో అలసత్వం పాటిస్తే, లేదా ఎంతో ఇబ్బందిగా పాటిస్తే దాని ప్రభావం వారిపై పడుతుంది. వారు కూడా ఎంతో కష్టంగా దానిని పాటిస్తారు లేదా దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు.

20- వారికి దానధర్మాలు చేసే అలవాటు చేయించు. అదెలా అంటే ఒక్కోసారి వారు చూస్తుండగా నీవు ఏదైనా దానం చేయి. లేదా వారికి ఏదైనా ఇచ్చి ఎవరైనా బీదవానికి లేదా పేదవానికి దానం చేయమని చెప్పు. దీనికంటే మరీ ఉత్తమమేమిటంటే వారు స్వయంగా జమ చేసుకుంటున్న డబ్బులో నుండి దానం చేయాలని ప్రోత్సహించు.

ప్రవర్తన

21- నీ కొడుకు సత్యవంతుడు కావాలని నీవు కోరుకుంటే అతనిలో భయాన్ని జనింపజేయకు.

22- నీవు సత్యమే పలుకుతూ ఉండు అప్పుడు నీ కొడుకు నీతో సత్యం నేర్చుకుంటాడు.

23- సత్యం మరియు అమానత్ (అప్పగింత, బాధ్యత, విశ్వసనీయత)ల ఘనతను వివరించు.

24- అతనికి తెలియకుండానే అతని అమానతును ఒక్కోసారి పరీక్షించు.

25- ఓపిక అలవాటు చేయించు. తొందరపాటు

చేయకూడదని నచ్చజెప్పు. ఉపవాస అభ్యాసం ద్వారా లేదా ఓపిక మరియు నెమ్మదితో కూడిన విషయాలపై అమలు ద్వారా ఇది సంభవం కావచ్చు.

26- వారి మధ్య న్యాయం పాటించు. న్యాయగుణం వారికి నేర్పడానికి ఇదే అతిఉత్తమమైన పద్ధతి.

27- వారికి ప్రాధాన్యత గుణం అలవాటు చేయించు. అది క్రియారూపకంగానైనా లేదా ప్రాధాన్యత గుణం యొక్క ఘనతను చాటే కొన్ని సంఘటనలను ప్రస్తావించి అయినా.

28- మోసం, దొంగతనం మరియు అబద్ధాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించు.

29- వారు ఏదైనా సందర్భంలో ధైర్యం ప్రదర్శిస్తే వారిని ప్రశంసించి ఏదైనా బహుమానం ఇవ్వు. వాస్తవమైన మరియు అవసరం ఉన్న చోటే ధైర్యం ప్రదర్శించాలని బోధించు.

30- కఠినంగా ప్రవర్తించకు. దానివల్ల వారిలో భయం, అబద్ధం మరియు పిరికితనాలు చోటు చేసుకుంటాయి.

31- వారిలో నమ్రత, మెతకవైఖరి గుణాల ప్రేమతో పాటు అహంకారాన్ని వదలుకునే ప్రేమ కుదిరించు.

32- ఘనతల్లో వ్యత్యాసం భయభీతి మరియు సత్కార్యాల ద్వారా ఉంటుంది తప్ప వంశం, డబ్బుధనం వల్ల కాదని నేర్పు.

33- అన్యాయం, అత్యాచారం యొక్క పర్యవసానం మహా చెడ్డదని, దౌర్జన్యం అనేది దౌర్జన్యపరులనే తన పొట్టలో పెట్టుకుంటుందని మరియు నమ్మకద్రోహం అనేది వినాశనానికి దారి తీస్తుందని తెలియజేయి.

34- కొన్ని విషయాల్లో ఉన్న వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పు, బహుశా వారికి తెలియకుండా ఉండవచ్చు. ఉదాహరణకుః ధైర్యం, శౌర్యం మరియు వెర్రిసాహసంలోని వ్యత్యాసం. సిగ్గు మరియు జంకులోని వ్యత్యాసం([2]). వినయం, అణకువ మరియు పరాభవంలోని వ్యత్యాసం. చాతుర్యం మరియు మోసంలోని వ్యత్యాసం.

35- ఇతరులకు మేలు చేసే అలవాటు వారికి చేయించు. అందుకై నీవు స్వయంగా నీ ఇంట్లో ఉత్తమముగా మెదులు, ఇతరులకు మేలు చేస్తూ ఉండు.

36- ఎప్పుడూ వాగ్దానభంగం చేయకు. ప్రత్యేకంగా నీ సంతానంతో. అందువల్ల వాగ్దానం నెరవేర్చే ఘనత వారిలో మంచిగా చోటు చేసు కుంటుంది.

సభ్యత సంస్కారం

37- నీవు వారికి సలాం చేయి.

38- నీ మర్మ ప్రదేశాల మీద వారి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండు.

39- నీ పొరుగువారితో మంచి విధంగా మెలుగు.

40- వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించాలని వారికి నేర్పు. మరియు వారిని బాధించడంలో ఉన్న నష్టం గురించి తెలియజేయి.

41- నీవు నీ తల్లదండ్రుల పట్ల సద్వర్తన పాటించు. నీ బంధువులతో కలుస్తూ ఉండు. ఇలాంటి సందర్భాల్లో నీ సంతానాన్ని నీ వెంట ఉంచుకో.

42- ఇతరులకు ఇబ్బంది కలిగించని మంచి అలవాట్లు గల పిల్లలను ప్రజలు మెచ్చుకుంటారని తెలియజేయి.

43- వారికి ఒక పత్రం వ్రాసి పెట్టు. అందులో కొన్ని ఉత్తమ పద్ధతులు, హితోపదేశాలుండాలి.

44- కొన్ని పద్ధతులు మంచివి కావని తెలియజేస్తూ వాటి కారణం ఏమిటో స్పష్టపరచు.

45- వారితో కూర్చొని వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి గురించి చదువుతూ ఉండు. వారు దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో కనుక్కో. ఒక్కోసారి వారిలో ఎవరితోనైనా చదివించి నీవు వింటూ ఉండు.

46- వారిలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అతనికి ఒంటరిగా నచ్చజెప్పు. నలుగురి ముందు అతన్ని దండించకు.

47- సాధ్యమైనంత వరకు శాపనార్దాలు పెట్టకు.

48- వారి గదిలో ప్రవేశించేటప్పుడు, ముందుగా వారి అనుమతి తీసుకో, వారికి అనుమతి పద్ధతి నేర్పుటకు ఇది ఉత్తమ మార్గం.

49- నీవేదైనా ఆదేశించినప్పుడు తొలిమాటలోనే వారు అర్థం చేసుకుంటారని ఆశించకు. (ఒక్కోసారి ఏదైనా విషయం రెండు మూడు సార్లు కూడా చెప్పవలసి వస్తుంది అలాంటప్పుడు ఓపికతో చెప్పు):

[وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا] {طه:132}

నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. (తాహా 20: 132).

50- భోజనం చేసే ముందు బిస్మిల్లాహ్ అని, చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని వారికి వినబడే విధంగా చదవడం మరచిపోకు.

51- వారి కొన్ని తప్పిదాలను చూసిచూడనట్లుగా ఉండు. నీ మెదడును వారి తప్పిదాలను భద్రపరిచే స్టోర్ రూంగా చేయకు.

52- నీ నుండి ఏదైనా తప్పు జరిగితే దానికి నిజమైన సాకు చెప్పుకో.

53- నీవు విలక్షణం, ప్రత్యేక విశిష్టత గలవాడివని, నీవు ఇది చేయగలుగుతావని అతడ్ని ప్రోత్సహించు.

54- వారికి ఓ ప్రత్యేకత నీవు ప్రసాదించు.

55- అతని మాటను లేదా పనిని అవహేళన చేయకు.

56- అభినందన వాక్యాలు, శుభకాంక్ష పదాలు, స్వాగతం, మర్యాద పద్ధతులు నేర్పు.

57- (పెడమార్గం పట్టేవిధంగా) ఎక్కువగా గారాభం చేయకు.

58- ఏదైనా పని చేయించుకొనుటకు మాటిమాటికి డబ్బుల ఆశ చూపకు. అందువల్ల అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

59- వారిని నీ యొక్క నెంబర్ వన్ స్నేహితునిగా ఉంచు.

శారీరక నిర్మాణం

60- వారి ఆట కొరకు సరిపడు సమయం వారికివ్వు.

61- వారి కొరకు ప్రయోజనకరమై క్రీడాసామానులు తెచ్చిపెట్టు.

62- కొన్ని ఆటలు స్వయంగా వారే ఎన్నుకునే స్వేచ్ఛ వారికివ్వు.

63- వారికి ఈతాడుట, పరుగెత్తుట లాంటి శక్తిని పెంచే కొన్ని ఆటలు నేర్పు.

64- కొన్ని ఆటల్లో కొన్ని సందర్భాల్లో నీ కొడుకు నీపై గెలుపు పొందే అవకాశమివ్వు.

65- ఆచి తూచి మంచి ఆహారం వారికివ్వు.

66- వారి తిండి విషయంలో సమయపాలన పాటించు.

67- తిండి విషయంలో వారిని మితిమీరినతనం, అత్యాశ గుణాల నుండి హెచ్చరించు.

68- తినేటప్పుడు వారి ఒక్కో తప్పును లెక్కించే ప్రయత్నం చేయకు. (మంచి విధంగా నచ్చజెప్పు).

69- వారు ఇష్టపడే రుచుల వంటకాలు చేసే, చేయించే ప్రయత్నం చేయి.

మానసిక నిర్మాణం

70- వారు చెప్పే మాట నిశబ్దంగా విను. ఒక్కో పదం పట్ల శ్రద్ధ వహించు.

71- వారి ఇబ్బందులను వారే స్వయంగా ఎదురుకొని వాటి నుండి బైటికి రానివ్వు, పోతే వారు గ్రహించకుండా తగిన సహాయం కూడా వారికి అందించు.

72- వారిని గౌరవించు, వారు ఏదైనా మంచి కార్యం చేస్తే ధన్యవాదం తెలుపు.

73- ఏ మాటలోనైనా ప్రమాణం చేసే స్థితికి తీసుకురాకు, నీవు ప్రమాణం చేయకుండా చెప్పినా నేను నీ మాటను నమ్ముతాను అని ధైర్యం ఇవ్వు.

74- హెచ్చరికలు, బెదిరింపుల పదాలకు దూరంగా ఉండు.

75- వారు చాలా చెడ్డవాళ్ళు, మూర్ఖులు అర్థం చేసుకోరు అన్న భ్రమలో ఉండకు.

76- వారు ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటే వారిని కసరుకోకుండా, సంక్షిప్తంగా మరియు నమ్మే విధంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయి.

77- ఒక్కోసారి వారిని కౌగలించుకొని వారి పట్ల ప్రేమ, అప్యాయత చూపు.

78- కొన్ని విషయాల్లో వారి సలహా అడిగి, వారి సలహా ప్రకారం అమలు చేయి.

79- ఏవైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతపాటి స్వేచ్ఛ వారికిస్తున్నట్లు గ్రహింపనివ్వు.

సామాజిక నిర్మాణం

80- వేసవిలో (విద్యార్థుల కొరకు) ఏర్పాటయ్యే ప్రత్యేక శిబిరాల్లో వారి పేరు వ్రాయించి, అందులో పాల్గొనే స్వేచ్ఛనివ్వు. (అందులో ఇస్లాం ధర్మానికి వ్యెతిరేకమైన విషయాలు ఉంటే పాల్గోనివ్వకు). ఖుర్ఆన్ కంఠస్తం కొరకు ప్రత్యేకించబడిన క్లాస్ లో చేర్పించు. జి.కే. పోటీల్లో మరియు స్కౌట్ లో పాల్గొనె అవకాశం కలగజేయి.

81- అతిథుల ఆతిథ్యం స్వయంగా వారినే చేయనివ్వు, అది చాయ్, కాఫీ, ఫలహారాలు ఇవ్వడమైనా సరే.

82- నీవు నీ స్నేహితులతో ఉన్నప్పుడు నీ కొడుకు మీ వద్దకు వస్తే నీవు అతనికి స్వాగతం పలుకు.

83- మస్జిదులో అనాథల మరియు వితంతువుల సంక్షేమం లాంటి ఏవైనా సామాజిక కార్యక్రమం జరుగుతే అతడ్ని అందులో పాల్గొనే అవకాశమివ్వు.

84- కష్టపడి పని చేయడం మరియు క్రయవిక్రయాల, ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారా సంపాదించే పద్ధతులు నేర్పు.

85- ఇతరుల ఇబ్బందులను గ్రహించి వాటిని (తన శక్తానుసారం) తగ్గించే ప్రయత్నం చేయడం నేర్పు.

86- అలా అని లోకమంతటి దిగులు తనే మోసుకునే వానిగా కూడా చేయకు.

87- నీ సామాజిక సేవల ఫలం అతడు చూసే అవకాశం కల్పించు.

88- కొన్ని పనులు పూర్తి చేసుకొని రా అని నీ కుమారుడ్ని పంపు, ఇంకా నీవు అతడ్ని నమ్ముతున్నావని గ్రహించనివ్వు.

89- అతడికి స్వయంగా తానే తన స్నేహితుడిని ఎన్నుకునే స్వేచ్ఛనివ్వు. నీవు ఇష్టపడేవారిలో ఏ ఒకరినైనా తన స్నేహితునిగా ఎన్నుకోనివ్వు. కాని నీవు తెలిసితెలియనట్లుగా నటించు.

ఆరోగ్యకరమైన నిర్మాణం

90- వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు.

91- ఏ వయసులో ఏ టీకాలు ఇప్పించాలో అందులో అశ్రద్ధ వహించకు.

92- ఏ మందు ఏ పరిమాణంలో ఇవ్వాలో అంతే ఇవ్వు. నీ ఇష్టముతో ఎక్కువగా ఇవ్వకు.

93- వారిపై ధార్మిక దుఆలు చదవడం మరువకు.

94- వారిని రాత్రి తొందరగా పడుకోబెట్టి ప్రొద్దున తొందరగా మేల్కొలుపు.

95- తానే స్వయంగా తన శరీరం, పళ్ళు మరియు బట్టలు శుభ్ర పరుచుకునే అలవాటు చేయించు.

96- ఏదైనా రోగం ముదిరే వరకు వేచి ఉండకు.

97- అంటువ్యాదుల నుండి నీ సంతానాన్ని దూరంగా ఉంచు.

98- వారిలో ఎవరికైనా ఏదైనా భయంకరమైన వ్యాది సోకితే అది అతనికి తెలియనివ్వకు.

99- అల్లాహ్ వైపునకు మరలి ఆయన్నే వేడుకో. సర్వ రోగాల నివారణ ఆయన చేతుల్లోనే ఉంది.

సంస్కృతి మరియు విద్యాపరమైన శిక్షణ

100- వారికి కొన్ని పొడుపుకథలు తెలియజేయి.

101- తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఏదైనా వ్యాసం వ్రాయమని కోరు.

102- అతను వ్రాసేది నీవు ఎల్లప్పుడూ చదువు.

103- వ్యాకరణ, లేదా భాషా పరమైన ప్రతి తప్పు వద్ద ఆగి మందలించకు.

104- చదువుకొనుటకు తానే స్వయంగా ఏదైనా పుస్తకం లేదా కథలు ఎన్నుకోనివ్వు.

105- చదువుతూ ఉండమని ప్రోత్సహించు.

106- ఏదైనా చదవడంలో నీవు వారితో పాల్గొను.

107- చురుకుతనాన్ని పెంచే కొన్ని ఆటలు, క్రీడా సామానులు తెచ్చిపెట్టు.

108- అతడు ఎప్పుడూ తన చదువులో విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఉండు.

109- తన చదువులో ముందుకు వెళ్ళే దారిలో వచ్చే అంతరాయాలను అధిగమించేవానిగా అతడ్ని తయారు చేయి.

110- పూర్వికుల మరియు ప్రస్తుత కవుల కొన్ని మంచి కవిత్వాలు మరియు వారి వివేకవంతమైన విషయాలను జ్ఞాపకం చేసుకోమని ప్రోత్సహించు.

111- అరబీ (మరియు తన మాతృ) భాషలోని కొన్ని సామెతలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రోత్సహించు.

112- ప్రసంగం మరియు (ఎటువంటి స్థాన, సందర్భంలోనైనా) సంభాషించే కళ (పద్ధతి) నేర్పు.

113- అతనికి సంవాదన మరియు ఒప్పించే కళ (పద్ధతులను) నేర్పు.

114- వ్యక్తిగత యోగ్యతలను, సామర్థ్యాలను పెంచే క్లాస్ లలో పాల్గోనివ్వు.

115- మాతృ భాషే కాకుండా చాలా ప్రాచుర్యమైన వేరే భాష కూడా సంపూర్ణంగా నేర్చుకొనుటకు ప్రోత్సహించు.

సత్ఫలితం, దుష్ఫలితం

116- ఒక్కోసారి శిక్షా మరియు ప్రతిఫలాల పద్ధతి అనుసరించు.

117- ప్రతిఫలమైనా లేదా శిక్ష అయినా ఎల్లప్పుడూ ఇవ్వకు.

118- ఎల్లప్పుడూ డబ్బు రూపంలోనే కాకుండా వేర్వేరు రకాల బహుమానాలిస్తూ ఉండు. అది ఎటైనా టూర్/ ప్రయాణం గాని, లేదా కంప్యూటర్ ఆట గాని, లేదా గిఫ్టు గాని లేదా ఫ్రెండ్ తో కలసి బైటికి వెళ్ళడానికి అనుమతి గాని కావచ్చు.

119- అలాగే శిక్ష కూడా వివిధ రకాల్లో ఉండాలి. కేవలం కొట్టడం ఒకటే నీ దృష్టిలో ప్రధానంగా ఉండకూడదు. ఆగ్రహంతో కూడిన దృష్టి కావచ్చు, గద్దించటం కావచ్చు, కొంత సేపు వరకు మాట్లాడ కుండా ఉండడం కావచ్చు, రోజువారిగా ఇచ్చే ఏదైనా ప్రత్యేక వస్తువు ఇవ్వకుండా ఉండడం కావచ్చు లేదా సెలవు రోజు పార్కు లేదా మరే వినోదానికైనా వెళ్ళడం మానుకొనుట కావచ్చు.

120- తప్పును తిరిగి చేయకుండా ఉంచగలిగే శిక్ష సరైన శిక్ష.

121- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సేవకుడిని ఒక్కసారైనా కొట్టలేదన్న విషయం గుర్తుంచుకో.

122- తొలిసారే శిక్ష విధించకు.

123- శిక్షించడంలో కఠినత్వం వహించకు.

124- శిక్షించినప్పుడు ఎందుకని శిక్షించావో దాని కారణం విశదీకరించు.

125- నీవు శిక్షించి ఆనందిస్తున్నావన్న భావన రానివ్వకు. లేదా మనసులో అతని గురించి ఏదైనా కపటం ఉంచుకున్నావని కూడా అర్థం కానివ్వకు.

126- ప్రజల ముందు కొట్టకు అలాగే కోపంగా ఉన్నప్పుడు కొట్టకు.

127- అతని ముఖం మీద కొట్టకు. మరియు అవస్త, నొప్పి కాకూడదంటే అవసరం కంటే ఎక్కువ కొట్టకు.

128- కొట్టనని వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ కొట్టకు. ఇలా వారు నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు.

129- నీవు శిక్షిస్తున్నది అతని మేలు కొరకే అని గ్రహింపజేయి. మరియు నీ పట్ల గల ప్రేమే ఒక్కోసారి ఈ స్థితి తెప్పిస్తుందని నచ్చజెప్పు.

130- శిక్ష అనేది నిన్ను బాధించుటకు కాదు నీవు ఉత్తమ శిక్షణ పొందుటకు మాత్రమే అని తెలియజేయి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం, సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రవక్త పై అనేకానేక కరుణ, శాంతులు కురియింప జేయుగాక


[1] మూడు చిరు పుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా ముద్రించబడుతుంది. అయితే వాటిలో ఈ చిరుపుస్తకం మొదటిది.

[2] తప్పు చేసినందువల్ల లేదా లోపంవల్ల మనస్సుకు కలిగే జంకును హయా అని అరబీలో షేమ్ అని ఇంగ్లీషులో అంటారు. చేయవలసిన పని చేయకుండా సిగ్గు పడుటను ఖజల్ అని అరబీలో బాష్ ఫుల్ నెస్ అని ఇంగ్లీషులో అంటారు

సత్కార్య వనాలు [పుస్తకం]

gardens

సత్కార్య వనాలు
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి /Download PDF]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [82 పేజీలు] [2.45 MB]

విషయ సూచిక

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

حدائق المعروف

ప్రథమ వనం: ముస్లిముల రహస్యాలను కప్పి ఉంచుట

సోదర మహాశయ! కప్పి ఉంచుట అనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. బాహ్యముగా. 2. అంతర్యముగా.

అంతర్యముగా అంటే ఒక ముస్లిం ఏదైనా పాపం లేదా అశ్లీల కార్యానికి ఒడిగడితే నీవు అతడ్ని నలుగురి ముందుకు తెచ్చి అవమానపరచకు. అతడ్ని పాపం చేయకుండా నిరోధించు. మృదుత్వము, అప్యాయతతో కూడిన ఉపదేశం చేస్తూ అతనితో మెతకవైఖరి అవలంభించు. అతడ్ని దాచి ఉంచి, అతని తప్పిదాన్ని బహిర్గతం చేయకు. అల్లాహ్ ఎవరి తప్పిదాన్ని కప్పి ఉంచాడో నీవు దాన్ని బట్టబయలు చేయకు.

మాఇజ్ అస్లమీ  తాను పాల్పడిన వ్యబిచారం గురించి ప్రవక్త ﷺ ముందు స్వయంగా తన నోట ప్రస్తావించాడు. అయినా ప్రవక్త ﷺ మాఇజ్ తన తప్పిదాన్ని కప్పి ఉంచి, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే బావుండు అని తపన పడుతూ ఇలా అన్నారుః ఏమైంది నీకు, తిరిగి వెళ్ళు, క్షమాభిక్ష కోరి, అల్లాహ్ వైపునకు మరలిపో”. (ముస్లిం 1695). మాఇజ్  కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రవక్తా! నన్ను పవిత్రపరచండి అని అంటాడు. ప్రవక్త అదే సమాధానమిస్తారు. ఇలా మూడు సార్లు జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవక్తకు నమ్మకం కుదిరిందో అతను ఈ దుష్కార్యానికి పాల్పడ్డాడని; ఈ పాపం నుండి పవిత్రుడు అవదలుచు- కుంటున్నాడని; మరియు తాను తన ప్రభువుతో కలుసుకున్నప్పుడు అతనిపై ఈ పాపభారం ఉండద్దని ఆశిస్తున్నాడని. అప్పడు ప్రవక్త ﷺ అతనిపై “హద్” (శిక్ష) విధించాలని సహచరులకు ఆదేశించారు. వారు అతన్ని తీసుకెళ్ళి అతనిపై రాళ్ళు రువ్వడం ఆరంభించారు. రాళ్ళ తాకిడిని సహించలేక అక్కడి నుండి పరుగెత్తాడు. కొందరు సహచరులు అతని వెంటబడి రాళ్ళు రువ్వారు. చివరికి అతను చనిపోయాడు. అతని పారిపోయే విషయం తెలిసినప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః

 (هَلَّا تَرَكْتُمُوهُ لَعَلَّهُ أَنْ يَتُوبَ فَيَتُوبَ اللهُ عَلَيْهِ).

“వెంబడించకుండా మీరెందుకు అతన్ని విడిచి పెట్ట లేదు. అతను తౌబా చేసి ఉంటే అల్లాహ్ అతని తౌబాను అంగీకరించేవాడు”. (అబూ దావూద్ 4419). మరో ఉల్లేఖనంలో ఉందిః

(إِنَّهُ الْآنَ لَفِي أَنْهَارِ الْجَنَّةِ يَنْقَمِسُ فِيهَا).

“ఇప్పుడతను స్వర్గపు కాలువల్లో మునిగితేలుతూ ఉన్నాడు”. (అబూ దావూదు 4428. (ఇది జఈఫ్ హదీస్).

హా! ఎంతటి విచిత్రం! ఎక్కడ ఏ దుష్కార్యం, ఏ చెడు సంభవిస్తుందో అని కొందరు నిరీక్షిస్తూ ఉంటారు. ఎందుకు? దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తే వారు ధర్మపరమైన సాధనాలతో దాన్ని ఖండిస్తారు అనా? కాదు, దాన్ని ప్రజల్లో వ్యాపింపజేయాలని, అంతే కాదు సెల్, ఇంటర్ నెట్ లో మరియు ఇతర సాధనాలతో ప్రచురించాలని. ఇది వదంతులను వ్యాపింపజేయాలన్న వాంఛ, ఇది మహా విపరీతంగా పాకుతుంది. సరియైన ఇంక్వైరీ చేయుట, నిర్ధారించుట, దాచి ఉంచుట మరియు సభ్యతను పాటించుట లాంటి నిజమైన సాధనాలకు భిన్నంగా ఉంది ఈ వైఖరి. ధర్మపరమైన శ్రేయోభిలాష పునాదులను తెలుసుకోకుండా వీరు ఎక్కడు- న్నారు? అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని ఎందుకు చెవున బెట్టుట లేదు?

[إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَنْ تَشِيعَ الفَاحِشَةُ فِي الَّذِينَ آَمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالآَخِرَةِ وَاللهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ] {النور:19}

విశ్వాసుల మధ్య అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లాహ్ ఎరుగును. మీరు ఎరుగరు. (నూర్ 24: 19).

ప్రజల మరుగు విషయాల వెంట పడేవారు తమ ఈ అలవాటును వదులుకోకుంటే వారు స్వయంగా నీచాతినీచమైన స్థితిలో అవమానానికి గురి కావలసి వచ్చే సందర్భం నుండి ఇకనైన భయపడాలి.

عَنْ أَبِي بَرْزَةَ الْأَسْلَمِيِّ  قَالَ: نَادَى رَسُولُ الله ﷺ حَتَّى أَسْمَعَ الْعَوَاتِقَ فَقَالَ: (يَا مَعْشَرَ مَنْ آمَنَ بِلِسَانِهِ وَلَمْ يَدْخُلِ الْإِيمَانُ قَلْبَهُ لَا تَغْتَابُوا الْمُسْلِمِينَ وَلَا تَتَّبِعُوا عَوْرَاتِهِمْ فَإِنَّهُ مَنْ يَتَّبِعْ عَوْرَةَ أَخِيهِ يَتَّبِعِ اللهُ عَوْرَتَهُ حَتَّى يَفْضَحَهُ فِي بَيْتِهِ).

అబూ బర్జా అస్లమీ  ఉల్లేఖనం ప్రకారం: నవయువకురాళ్ళకు కూడా వినిపించే విధంగా ప్రవక్త ﷺ గొంతెత్తి చాటింపు చేస్తూ ఇలా చెప్పారుః “ఓ ప్రజలారా ఎవరైతే నోటి ద్వారా విశ్వసించారో, విశ్వాసం వారి ఆంతర్యంలో చేరలేదో! ముస్లిములను పరోక్షంగా నిందించకండి. వారి రహస్య విషయాల వెంటబడకండి. ఎవరు తన సోదరుని రహస్య విషయాల వెంట పడుతాడో అల్లాహ్ అతని రహస్య విషయాల వెంటపడతాడు. అతడు తన ఇంట్లో ఉండగానే అల్లాహ్ అతడిని అవమానం పాలు చేస్తాడు”. (అహ్మద్. సహీ లిగైరిహీ, దాని సనద్ హసన్).

బాహ్యముగా కప్పి ఉంచుట అంటే దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నవానికి దుస్తులు ధరించి ప్రజల చూపు పడకుండా ఉంచుట. అల్లాహ్ సాక్షిగా! ఇది ప్రియప్రవక్త పద్ధతి. మాఇజ్ అస్లమీ ﷜ సంఘటనలో ఈ రెండు రకాలు ఉన్నాయి. (మొదటి రకం గురించి పై హదీసులు చదివారు, రెండవ రకం గురించి) అబూ దావూద్(4377)లో ఉంది, ప్రవక్త ﷺ హజ్జాల్ అను వ్యక్తిని మాఇజ్ కు ఏదైనా గుడ్డ ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఇలా చెప్పారుః

(لَوْ سَتَرْتَهُ بِثَوْبِكَ كَانَ خَيْرًا لَكَ).

“నీ దుస్తులతో అతడ్ని దాచి ఉంచితే అది నీ కొరకే మేలుగా ఉండును”.

అల్లాహ్ నిన్ను కాపాడుగాక! ప్రవక్త ﷺ ముస్లిముల బాహ్యంతర రహస్యాలను, వారు సజీవంగా ఉన్నప్పుడు మరియు చనిపోయిన తర్వాత కూడా ఎలా దాచి ఉంచుతున్నారో గమనించు.

అల్లాహ్ నీకు సద్భాగ్యం ప్రసాదించుగాక! పూర్వపు ఇద్దరి పుణ్యపురుషుల్లో జరిగిన ఈ సంఘటన; వారు ముస్లిముల రహస్యాలను కప్పి ఉంచడంలో ఉన్న ప్రవక్త ﷺ యొక్క ఉత్తమ పద్ధతిని ఎలా ప్రస్తావించుకుంటున్నారో శ్రద్ధగా పఠించు (ఆలకించు): ఇదిగో ఇతను అబ్దుల్లాహ్ హౌజని, ఇలా తెలిపారుః నేను ప్రవక్తగారి మొఅజ్జిన్ బిలాల్ ﷜ ను హలబ్ అను ప్రాంతంలో కలిశాను. బిలాల్! ప్రవక్త ఖర్చులు ఎలా ఉండేవి ఏమైనా నాకు తెలుపుతావా అని అడిగాను. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడుః ఆయన వద్ద ఏమి లేకుండింది. అల్లాహ్ వారిని ప్రవక్తగా చేసినప్పటి నుండి ఆయన గతించే వరకు నేనే ఆయన ఖర్చులకు బాధ్యునిగా ఉంటిని. ఆయన వద్దకు ఎవరైనా ముస్లిం నగ్న స్థితిలో వచ్చింది చూస్తే నన్ను ఆదేశించేవారు. నేను ఎవరి నుంచైనా అప్పు తీసుకొని అతనికి దుస్తులు ధరించి, భోజనం చేయించేవాడిని. ఒకసారి ఒక బహుదైవారాధకుడు నన్ను కలసి, బిలాల్! నేను చాలా ఉన్నవాడిని, నా నుంచే నీవు అప్పు తీసుకో, చూడు సుమా! వేరెవ్వరి నుంచి తీసుకోవద్దు అని చెప్పాడు. నేను అలాగే చేసేవాడిని. ఒకనాడు నేను వుజూ చేసుకొని నమాజు కొరకు అజాన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను అప్పుడే అదే బహుదైవారాధకుడు కొందరి వ్యాపారుల మధ్య వస్తూ నన్ను చూడగానే ‘ఓ హబషీ!’ అని అరిచాడు. హాజరుగా ఉన్నాను చెప్పండి అన్నాను. అతి చెడ్డ ముఖంతో నా ముందుకు వచ్చి ఓ చెడ్డ మాట అని, తెలుసా నెల పూర్తి కావడానికి ఎన్ని రోజులున్నాయో? అని అడిగాడు. దగ్గరే ఉంది అని నేనన్నాను. కేవలం నాలుగు రోజులే అని చెప్పి, నీ మీద ఉన్న నా అప్పుకు బదులుగా నిన్ను తీసుకెళ్ళి నీవు గతంలో ఉన్నట్లు మేకల కాపరిగా ఉంచుతాను అని అనేశాడు. ఈ మాటలు విని నా గుండె చలించి పోయింది. ఇతరులకు కూడా ఇలాంటి బాధే అవుతుంది కదా. నేను ఇషా నమాజు చేసుకున్నాను, అప్పటికి ప్రవక్త ﷺ ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆయన వద్దకు వెళ్ళి నేను రావచ్చా అని అనుమతి కోరాను, ఆయన నాకు అనుమతించారు. నేను నా తల్లిదండ్రుల్ని మీకు అర్పిస్తును. ఏ బహు- దైవారధకునితో నేను అప్పు తీసుకునేవాడినో అతడు ఇలా ఇలా అన్నాడు. నా వైపు నుండి మీరు చెల్లించడానికి మీ వద్ద ఏమీ లేదు, అలాగే నా వద్ద ఏమీ లేదు. అతడు నా పరువుతీయనున్నాడు. మీరు అనుమతిస్తే గనక ఇస్లాం స్వీకరించిన ఫలాన తెగవారి వద్దకు వెళ్తాను. నా అప్పు తీర్చడానికి అల్లాహ్ తన ప్రవక్తకు ఏదైనా ప్రసాదించవచ్చు. అక్కడి నుండి బయలుదేరి నా ఇంటికి వచ్చాను. నా తలవారి, తిత్తి, చెప్పులు మరియు ఢాలు నా తలకడన పెట్టుకున్నాను. సహరీ సమయం (ఫజ్ర్ సమయానికి కొంచం ముందు) అవుతుంది. ఇక నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఎవరో ఒకరు పరుగెత్తుకుంటు వస్తూ బిలాల్! తొందరగా ప్రవక్త వద్దకు చేరుకో అని కేకేశాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చాను. అక్కడ నాలుగు జంతువులు సామానులతో సహా ఉన్నాయి. అనుమతి కోరాను. అప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ నీ అప్పు తేర్చడానికి పంపాడు అని శుభవార్త వినిపిస్తూ, అదిగో సామానులతో నిండి ఉన్న నాలుగు జంతువులను చూడటం లేదా? అని అడిగారు. అవును అని నేనన్నాను. ప్రవక్త ﷺ చెప్పారుః ఆ జంతువులు, వాటి మీద ఉన్న సామానులన్నియూ నీకే. వాటిలో బట్టలు, అన్నపానీయాలున్నాయి. ఫదక్ ప్రాంత రాజు బహుకరించాడు. వీటిని ఆధీనపరుచుకో నీ అప్పును చెల్లించు. …. (హదీసులో పూర్తి వివరణ ఉంది; బిలాల్  ప్రవక్త మీద ఉన్నఅప్పంత చెల్లించి వచ్చి ప్రవక్తకు తెలియజేశారు, అప్పుడు ప్రవక్త) ఆ సొమ్ము నా వద్ద ఉండగానే ఎక్కడ చావు వస్తుందో అన్న భయంతో (ఆ వార్త తెలిసినందుకు) అల్లాహ్ గొప్పతనాన్ని చాటుతూ, ఆయన స్తుతులు స్తుతించసాగారు. (అబూ దావూద్ 3055. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీ అని అన్నారు).

రహస్యాలను కప్పి ఉంచుట చాలా ఉత్తమ గుణం. గొప్ప మనస్సుగలవారు ఈ గుణాన్ని అవలంబించి వారి సమావేశాలు ప్రజల పరువుల జోక్యంతోనే నిండిపోకుండా దూరంగా ఉంటారు. వారి కలములు ప్రజల తప్పులు వ్రాయడానికి అవసరం లేకుండా ఉంటాయి. వారి చెవులు ప్రజల దోషాలు వినకుండా మూతబడి ఉంటాయి. ఈ అందమైన కప్పిఉంచే గుణంది ఎంతటి వైభవం. నిజంగా ఇందులో అల్లాహ్ యొక్క గొప్ప దయను అంగీకరిస్తున్నట్లుందిః ఆయన మనల్ని నగ్నంగా పుట్టించాక అందమైన దుస్తుల్లో కప్పి ఉంచాడు.

[يَا بَنِي آَدَمَ قَدْ أَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُوَارِي سَوْآَتِكُمْ وَرِيشًا وَلِبَاسُ التَّقْوَى ذَلِكَ خَيْرٌ ذَلِكَ مِنْ آَيَاتِ اللهِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ] {الأعراف:26}

ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింప జేశాము. అవి మీరు సిగ్గు పడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు శోభకు సాధనంగా ఉంటాయి. భయభక్తులు అనే దుస్తులే మంచి దుస్తులు. ఇది అల్లాహ్ సూచనలలోని ఒక సూచన. భహుశా ప్రజలు దీని ద్వారా గుణపాఠం నేర్చుకుంటారేమో!. (ఆరాఫ్ 7: 26).

మనం ఎన్నో పాపాలకు, దోషాలకు గురవుతున్నది చూస్తూ కూడా అల్లాహ్ మనల్ని సర్వ సృష్టి ముందు అవమాన పరచకుండా కాపాడి ఎంతో గొప్ప మేలు చేశాడు. ఏ రోజైతే మర్మావయవాలు బయటపడతాయో, పాపాలు అందరి ముందు ప్రత్యక్షంగా వస్తాయో ఆ రోజు అల్లాహ్ నిన్ను కప్పి ఉంచాడంటే ఇంతకంటే గొప్ప కప్పి ఉంచడం ఇంకేదైనా ఉంటుందా!! ప్రవక్త ﷺ చెప్పారుః

(إِنَّ اللَّهَ يُدْنِي الْمُؤْمِنَ فَيَضَعُ عَلَيْهِ كَنَفَهُ وَيَسْتُرُهُ فَيَقُولُ أَتَعْرِفُ ذَنْبَ كَذَا أَتَعْرِفُ ذَنْبَ كَذَا فَيَقُولُ نَعَمْ أَيْ رَبِّ حَتَّى إِذَا قَرَّرَهُ بِذُنُوبِهِ وَرَأَى فِي نَفْسِهِ أَنَّهُ هَلَكَ قَالَ سَتَرْتُهَا عَلَيْكَ فِي الدُّنْيَا وَأَنَا أَغْفِرُهَا لَكَ الْيَوْمَ فَيُعْطَى كِتَابَ حَسَنَاتِهِ وَأَمَّا الْكَافِرُ وَالْمُنَافِقُونَ فَيَقُولُ الْأَشْهَادُ هَؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَى رَبِّهِمْ أَلَا لَعْنَةُ الله عَلَى الظَّالِمِينَ).

“నిశ్చయంగా (ప్రళయదినాన) అల్లాహ్ విశ్వాసికి దగ్గరగా వచ్చి తన దండ అతని మీద పెట్టి అతన్ని దాచి పెట్టుకుంటాడు. మళ్ళీ నీవు చేసిన ఫలాన పాపం గుర్తుందా, ఫలాన పాపం చేశావు కదూ? అని అడుగుతాడు. అవును ఓ ప్రభువు అని అతడంటాడు. అల్లాహ్ అతన్ని తన పాపాల గురించి ఒప్పిస్తాడు. (అతడు వాటిని ఒప్పుకొని) ఇక నాశనమయ్యానని భావిస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుః “నీ పాపాలను (ప్రజలకు తెలియకుండా) ప్రపంచంలో దాచి ఉంచాను. మరి ఈ రోజు వాటిని కూడా నీ కొరకు క్షమిస్తున్నాను”. అప్పుడు (మిగిలిన) సత్కర్మల పత్రం అతనికి ఇవ్వబడుతుంది. అయితే అవిశ్వాసి మరియు వంచకుల విషయం ఇలా ఉందిః “తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వీరే అని అపుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను! దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది”. (ఈ విషయం ఖుర్ఆన్ సూర హూద్ 11: 18లో ఉంది). (బుఖారి 2441, ముస్లిం 2768).

ప్రియ పాఠకుడా! ముస్లిములను కప్పి ఉంచే వనానికి చిత్తశుద్ధి అనే నీరు పెడుతూ ఉండు. అప్పుడే దాని ఉత్తమ పంటను కోయగలుగుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(مَنْ سَتَرَ مُسْلِمًا سَتَرَهُ اللهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ)

“ఎవరు తన తోటి ముస్లిం (పాపాల)ను కప్పిపుచ్చుతాడో అల్లాహ్ ఇహలోకంలోనూ, పరలోకంలోనూ అతని (పాపాలను) కప్పిపుచ్చుతాడు”. (ముస్లిం 2699).

ఓ అల్లాహ్, ఓ కరుణమయా, కృపాసాగరా! నీ అందమైన ఛాయ తెరలో, ఉత్తమమైన క్షమామన్నింపులో మమ్మల్ని కప్పిఉంచు!!

2వ వనం: ముస్లిముల అవసరాలను తీర్చుట

ప్రియ సోదరా! ఈ వనం ఆరంభం ఒక చిన్న సంఘటన ద్వారా చేస్తాను, నా స్నేహితుడైన షేఖ్ (ఇబ్రాహీం బిన్ సాలిహ్, అహ్ సాలోని షరీఆ కాలెజ్ లెక్చరర్) చెప్పారుః

“సుమారు 18 సంవత్సరాల ఒక నవయువకుడు అహ్‘సా నుండి దమ్మామ్ తన కార్లో బయలుదేరాడు. అతడు అస్థమ రోగి. దమ్మామ్ చేరుకున్న వెంటనే అతనికి ఊపిరి ఆడనట్లు ఏర్పడింది. ఇది ఓ భయంకర విషయానికి సంకేతం అని అస్థమ రోగులకు ముందే తెలుసు. ఇలాంటప్పుడు వివేకవంతమైన చురుకుతనం, వెంటనే రోగి చుట్టు గుమిగూడి అతని ఆరోగ్యం గురించి సూక్ష్మమైన శ్రద్ధ చాలా అవసరం.

ఎప్పుడైతే తాను ఏ క్షణాన్నైనా స్పృహ తప్పి పోవచ్చని, పడిపోవచ్చనీ ఆ యువకునికి అర్థమయ్యిందో, అప్పడతను చుట్టాల ముందు పడిపోతే బాగుండదు కదా అన్న మరింత ఆవేదనతో దమ్మామ్ చేరుకొని ఏమంత సమయం కాక ముందే తిరిగి అహ్ సా చేరుకోవాలని నిశ్చయించు కున్నాడు. అతని ఛాతిలో ఏదో అవస్త ఉన్నట్లు, సరిగ్గా శ్వాస తీసుకోలేక పోతున్నాడని దగ్గరున్న వారు గ్రహించి, ఈ స్థితిలో వెళ్ళకుంటే బావుంటదని ప్రాధేయ పడ్డారు. ఎన్నో రకాలుగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా అతడు ఒక్కటీ పట్టించు కోకుండా తిరిగి పోవడానికి తన కారు ఎక్కాడు. ఒక్కో క్షణం అతి కఠినంగా గడుస్తుంది. ఒక్కో క్షణం ఒక్కో శ్వాసను ఆపుతున్నట్లుంది. ప్రక్కన తిరుగుతే ధైర్యం ఇచ్చే కారుణ్యతండ్రి లేడు. మమకారంతో గుండెకు హత్తుకునే మాతృమూర్తి లేదు. త్వరగా తొలి చికిత్స అందించే, ఆపద్బాంధువ సోదరుడు లేడు. రెప్పలార్పకుండా ముందుకు చూస్తూ పోతే పొడగాటి రొడ్డు. గమ్యానికి చేరుకునేంత శక్తి లేనట్లు ఏర్పడుతుంది. సగం దారి చేరుకున్నాడో లేదో అవస్త ఎక్కువై పోయింది. కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ళు తేటగిల్లుతున్నాయి. చావు సమీపించి- నట్లనిపిస్తుంది. ఇక చివరి ఘడియలే అని భావించాడు. ఒక బ్రిడ్జి క్రింద కారును ఆపాడు. దారి గుండా పోయేవారితో ఏదైనా సహాయం కోరుదామన్నా శక్తి లేకుండా అయిపోయింది. ఆశలు కోల్పోయాడు. ఇక అల్లాహ్ వైపునకు మరలాడు. అమానతుగా ఉన్న ఆత్మను అప్పజెప్పటానికి, ఒంటరి ప్రయాణంలో ఉండి, ఏమి చేయాలో దోయక అనుకోకుండా బండి నుండి దిగి దాని ముందు వచ్చి వెలకిల పడ్డాడు. బహుశా అల్లాహ్ కారుణ్యం కురుస్తేందేమో, జాడలేని ఒంటరితనంపై అల్లాహ్ కరుణ దృష్టి పడుతుందేమో. అదే క్షణంలో తనకు తానే మరచిపోయినట్లయింది. సృహ తప్పినట్లయింది. ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. ఒక విషయం తప్ప; ఇక ఈ జీవితాన్ని దాని అందచందాలను వీడిపోయే సమయం వచ్చేసిందని.

కాని అల్లాహ్ కారుణ్యం అతని వెంటే వెంబడిస్తూ ఉంది. ఎందుకు అలా కాదు? ఆయన కరుణామయుడు, క్షమించువాడు, కృపాసాగరుడు, ఓర్పుగల పరిశుద్ధుడు.

దారి గుండా పోతున్న ప్రయాణికుల్లో ఒకతను స్పృహ తప్పినట్లు తన కారుపై పడి ఉన్న పడచుపిల్లవాడిని చూడటానికి వస్తాడు. ఏ యాక్సిడెంట్ చిహ్నాలు లేవు, ఇతని ఈ స్థితికి అసలు కారణం ఏమిటో తెలియడం లేదు. అయినా అతను ప్రశ్నల మోతలకు తావివ్వకుండా ముందు ఈ అపరిచిత వ్యక్తికి సహాయం అందించాలి అని చెయితో పట్టి చూస్తే యువకుని చెయ్యి కదిలినట్లు చూశాడు అతడు తన మూతి, ముక్కు వైపు సైగ చేస్తున్నాడు. అంటే ఇక శ్వాస నడిచే అవకాశాల్లేవు అని తెలియజేస్తున్నాడు. అతడ్ని ప్రాణంతో చూసి ఈ పుణ్యాత్ముడు సంతోషపడ్డాడు. అల్లాహ్ అతడ్ని కాపాడడానికే నన్ను పంపాడెమో అని అనుకొని, దగ్గర ఉన్న ఓ ఊరిలో మంచి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడానికి తొందర పడ్డాడు. అక్కడికి చేరుకున్నాక తన మెడపై వచ్చి పడ్డ అమానతు పట్ల మంచి శ్రద్ధ చూపాడు ఓ డాక్టర్. ఆ పుణ్యాత్ముడు శ్వాస ఆగిపోతున్న, చావుగురకలకు గురైన యువకుని తలాపున నిలబడి చూస్తునే ఉన్నాడు. తాను ఏ ఉద్దేశంతో ప్రయాణానికి బయలుదేరాడో మరచి పోయాడు. లోకాన్నే తన వెనక వదిలాడు. ప్రాణం కోల్పోతున్న మనిషిని కాపాడుటకు ముందుకు వచ్చి అల్లాహ్ దయతో తిరిగి అతని స్థానంలో చేర్చడానికి. ఏదో ముందు నుండే పరిచయం ఉన్నట్లు కాదు. ఐహిక లాభాన్ని ఉద్దేశించీ అంతకు కాదు. అల్లాహ్ అనుగ్రహించిన ఓ సత్కార్యం చేసుకోవాలని మాత్రమే. అలాగే దృష్టి సారించి యువకుని వైపు చూస్తూ, తనకు తోచిన శ్రద్ధ చూపుతూ, అల్లాహ్ అతనికి స్వస్థత ప్రసాదించాలని, తిరిగి కొత్త జీవితం దొరకాలని అల్లాహ్ తో దుఆలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచం కొంచం మంచిగా శ్వాస తీసుకోగలుగు తున్నాడు. క్లిష్టపరిస్థితి దూరమవుతుంది. వ్రేళ్ళు ఆడుతన్నాయి. జీవితం మెరుపు కళ్ళల్లోని కాంతి ద్వారా మినుకుమినుకుమంటుంది. ఆ పుణ్యాత్ముడు ఎంతో ఆశతో డాక్టర్ కళ్ళల్లో కళ్ళేసి తదేకదృష్టి సారించి ఉన్నాడు. అతని మోమున ఒక ఆనందమైన చిరునవ్వు గురించి పెనగులాడుతున్నాడు. క్షణం తర్వాత క్షణం గడుస్తుంది. నీ ప్రభువు కారుణ్యం మేలుచేసేవారికి సమీపం కనబడుతుంది. యువకుని శరీరంగాలలో జీవచలనం మొదలయింది. డాక్టర్ ముఖకవలికల్లో సంతోషం తొనికిసలాడింది. అతని నూతన జీవిత శుభవార్త డాక్టర్ నోట వెలువడింది. ఆ పుణ్యాత్ముడు అప్పుడే అతని నోట అతని ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. అతని ఇంటివారికి తాను తెలియకుండా ఉండటానికి అక్కడి నుండి జారుకున్నాడు. తన ఈ సత్కార్యాన్ని వివేకవంతముతో గట్టెక్కించడానికి అతని ఇంటికి ఫోన్ చేసి వారి అబ్బాయి క్షేమ విషయంతో పాటు ప్రస్తుతం ఉన్న అడ్రస్ వారికి తెలిపేశాడు.

కాని: … మీరెవరండి మాట్లాడుతున్నది? చెప్పండి అల్లాహ్ మీకు సద్భాగ్యం ప్రసాదించుగాక? ఓ పుణ్యాత్ముడా మీరెవరో చెప్పండి? మీ శుభనామం తెలియజేయండి, మీ గొప్పతనం గురించి ప్రజలకు తెలుపనివ్వండి, మీరు చేసిన సత్కార్యం గురించి వివరించనివ్వండి, మీరు మాకు చేసిన మేలుకు బదులుగా మీకు మేలు చేయనివ్వండి, పరిశుద్ధుడైన అల్లాహ్ దయతో మా కొడుకు ప్రాణాన్ని కాపాడిన మీరు, మీకు ఏ మేలు చేస్తే సమతూలుతుంది. మిమ్మల్ని గౌరవించి, సత్కరించే భాగ్యం మాకివ్వరా? చెప్పండి మీరెవరు? అన అడిగిన ప్రశ్నకు      బదులుగా “పుణ్యం సంపాదించుకోదలిచిన వాడు”… అన్న రెండే రెండు పదాలు చెప్పి కరుణామయుడు, కనికరించేవాడైన అల్లాహ్ నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ ఆ పుణ్యాత్ముడు ఫోన్ పెట్టేశాడు.

సత్కార్యం చేసినవాడా నీకు శుభం కలుగుగాక, అల్లాహ్ నీకు సరిపోవుగాక, నీ అడుగులు మంచి వైపే పయనమవుగాక, అల్లాహ్ నిన్ను సర్వ చెడుల నుండి కాపాడి, రక్షణ కల్పించుగాక, అల్లాహ్ నీ ఆరోగ్యం, నీ జీవితం, నీ సంతానాల్లో శుభం, వృద్ధి కలుగజేయుగాక, మీకు, మాకూ స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించుగాక అని వారు దీవించారు.

షేఖ్ నాతో చెప్పాడు: ఇప్పటికీ దీనమైన, వినయపూర్వకమైన ఈ చేతులు ఆ పుణ్యాత్ముని కొరకు దుఆ చేయుటకై అల్లాహ్ ముందు ఎత్తబడుతాయి. అతని మేలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇదే పరిస్తితి ఉంటుంది.

తన సోదరుని ఓ అవసరాన్ని తీర్చాడు, చూడ్డానికి అదేమంతలే… కాని దానికి రెండు పక్కల్లో (ఇరువైపుల్లోని మధ్య) ఉన్న మనస్సు కావాలి. తన సోదరుని అవసరం తీర్చి ఎంత గొప్ప అదృష్టం సంపాదించాడు!! త్వరలో తీసుకెళ్ళి తొలి చికిత్స చేయించి ఏ సాఫల్యం, విజయం సాధించాడు!! నిశ్చయంగా అది గొప్ప సాఫల్యం, విజయం, దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః

[وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الخَيْرَ لَعَلَّكُمْ  تُفْلِحُونَ] {الحج:77}

మీ ప్రభువును ఆరాధించండి, మంచి పనులు చేయండి, వీటి ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంది. (హజ్ 23: 77).

సోదరా నీకు సద్భాగ్యం ప్రాప్తమవుగాక! నీ సోదరుని ఏదైనా అవసరం తీర్చడంలో వెనకాడకు, అది నీ సమయం కెటాయించైనా, నీ శ్రమ ద్వారానైనా సరే. నీ సృష్టికర్త నీ అవసరాల్ని తీరుస్తూ ఉంటాడని, నీ బాధను తేలికగా చేస్తాడని, నీ చింతను దూరం చేస్తాడని మరియు నీ ఉపాధిలో శుభం కలుగజేస్తాడని నమ్మకం ఉంచు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

 (وَمَنْ كَانَ فِي حَاجَةِ أَخِيهِ كَانَ اللهُ فِي حَاجَتِهِ).

ఎవరైతే తన  సోదరుని అవసరాన్ని తీరుస్తూ ఉంటాడో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తాడు“. (బుఖారి 2442, ముస్లిం 2580). మరో సందర్భంలో చెప్పారుః

(صَنَائِعُ الْـمَعْرُوفِ تَقِي مَصَارِعَ السُّوء).

సత్కార్యాలు చెడు స్థానాల నుండి కాపాడుతాయి“. (తబ్రానీ. ఇది హసన్ హదీసు). మరో సారి చెప్పారుః

(وَتُعِينُ الرَّجُلَ فِي دَابَّتِهِ فَتَحْمِلُهُ عَلَيْهَا أَوْ تَرْفَعُ لَهُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ).

ఒక వ్యక్తి వాహనము మీద కూర్చోడానికి లేదా అతని ఏదైనా సామాను దాని మీద పెట్టడానికి అతనికి సహాయపడుట కూడా సత్కార్యమే“. (ముస్లిం 1009, బుఖారి 2989).

బహుశా నీవు ఒక హవాల్దారునిగా పనిచేస్తున్న వీరుని సంఘటన విని ఉంటావు. అతని పేరు జుమ్ హూర్ బిన్ అబ్దుల్లాహ్ గామిదీ రహిమహుల్లాహ్. ఏదో కోర్ నిష్ లో మునుగుతున్న ఒక తండ్రి అతని ఇద్దరు కొడుకులను కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. అస్ర్ నమాజు చేసుకోవడానికి తాను ఓ మస్జిద్ వైపు వెళ్తుండగా ‘కాపాడండి, కాపాడండి’ అని అంతరాత్మ నుండి వెళ్తున్న, పరిచయమైన కేకలు విని, క్షణం పాటు ఆలస్యం చేయ కుండా మునుగ బోతున్న ఆ ముగ్గురి ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నం చేసి, ముందు తండ్రిని కాపాడి ఒడ్డుకు చేర్చి తన మిత్రునికి అప్పజెప్పాడు. అనంతమైన ధైర్యంతో, నిరుపమానమైన త్యాగంతో తన ఆత్మను, జీవితాన్ని ధారాపోసి తండ్రి లాంటి ప్రేమతో ఇద్దరు పిల్లలను కాపాడుటకు వెంటనే వెనక్కి తిరిగాడు. వారిద్దరిని కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. కాని క్షేమంగా ఒడ్డు చేరుకొనుటకు అతని శక్తి అతనికి తోడివ్వలేక పోయింది. విపరీతమైన అలసటకు గురయ్యాడు. సముద్ర సుడిగుండంలో పట్టు కోల్పోయాడు. కెరటాలు అతన్ని మరింత లోతుకే తీసుకెళ్ళ సాగాయి. శక్తి నశించి పోయింది. కళ్ళ ముందే కొంచెం కొంచెం జీవిత జ్యోతి ఆరిపోయింది. అతడు అల్లాహ్ మార్గంలో అమరవీరుడయ్యాడు. బహుశా ఈ అమరవీర పతకం తన గురించే ఎదిరి చూస్తుండవచ్చు. మనం ఇదే మంచి భావన ఉంచుతాము. అల్లాహ్ ఇదే మంచి స్థానం అతనికి ప్రాప్తి చేయుగాక. అయితే ఇలా ఈ వీరుడు కనుమరుగయి పోయాడు. సముద్రం లోతులోకి మునిగి పోయాడు. తన ఈ ధైర్యం మరియు శౌర్యంతో అరుదైన ఫిదాయీ మరియు ప్రాధాన్యత పలకలు చెక్కాడు. వాస్తవానికి మన ఈ కాలంలో ఇది అరుదైన నిదర్శన. నేను ఇంకేమనాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేను. అల్లాహ్ నీపై అనేకానేక కరుణలు కురిపించుగాక. విశాల స్వర్గంలో నివాసముంచుగాక. అమరవీరుల, పుణ్యాత్ముల స్థానం ప్రసాదించుగాక. ఆయన సత్కార్యఫలమిచ్చువాడు, కనికరం, దయ గలవాడు.

నీ సోదరుని అవసరం అంటేః అతనికి ఏదైనా బాధ ఉంటే నీవు దాన్ని సులువుగా చేయుట. అవస్త ఉంటే చికిత్స చేయించుట. అప్పు ఉంటే తీర్చుట. అతను అడిగినప్పుడు అప్పిచ్చుట. ఏదైనా లోపం ఉంటే దూరం చేసి అతని పరువు కాపాడుట. స్నేహం ద్వారా తృప్తినిచ్చుట. అతని వెనక అతని కొరకు దుఆ చేయుట. ప్రతి సత్కార్యంలో అతనికి చేయూతనిచ్చుట. మంచి విషయంలో సహాయపడుట. ఈ సత్కార్యాల ద్వారా అల్లాహ్ ప్రేమను చూరగొని, ఆయన కొరకే ప్రాయాసపడి ఆయన సంతృష్టి పొంది విజయ వంతునివి అయిపో.

3వ వనం: అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయుట

ప్రియ సోదరా! దైవ వాగ్దానాలు, అప్పులిచ్చేవారికి రెండితలు లభించే పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు, ఎల్లకాలం ఉండే ఫలాలు, నీడలు గల స్వర్గాలు. ఎవరికీ? మనస్తృప్తితో, ఆత్మసంతోషంతో, ఉదార గుణంతో దానం చేసేవారికి. అతని ముందు ఉత్తమ వాగ్దాన ఖుర్ఆన్ ఆయతులు అట్లే వచ్చేస్తాయిః

[مَن ذَا الَّذِي يُقْرِضُ اللهَ قَرْضاً حَسَناً فَيُضَاعِفَهُ لَهُ وَلَهُ أَجْرٌ كَرِيمٌ]

అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మేలైన రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (హదీద్ 57: 11).

[الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ] {البقرة:274}

తమ సంపదను రెయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. (బఖర 2: 274).

దానధర్మాలు ఐశ్వర్యవంతమైన చెలమ. దాని ప్రవాహంతో జీవిత పాపాలు, కష్టాలన్నీ కొట్టుకపోతాయి. మంచి విషయాల్లో ఖర్చు పెట్టుట ఎన్నో పెద్ద రోగాలకు బల్సమ్ చికిత్స లాంటిది. గుప్తంగా ఖర్చు పెట్టుట వలన ధనంలో అభివృద్ధి, శుభాలు కలుగుతాయి. భూమ్యాకాశాల ప్రభువు వీటి వాగ్దానం చేశాడు.

 [قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ وَمَا أَنْفَقْتُمْ مِنْ شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ] {سبأ:39}

ఇలా చెప్పండిః నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తన కిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధిప్రదాత. (సబా 34: 39).

ఔదార్యుడా! నీవు చేసే దానం ఒక బీజం లాంటిది. ఈ నేలపై కాలు మోపిన అతి ఉత్తమమైనవారు; అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని బీజం నాటారు. “వాస్తవానికి దానధర్మాలు చేయడంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు”. (బుఖారి 6, ముస్లిం 2308).

ఈ వనంలోని పూవుల్లో ఒక పూవును సమీపించడానికి ఈ పేజిలో ఈ సంఘటన చదువుదాము. తెల్ల జాతివారి ఇంట్లోని ఓ వ్యక్తి మధ్యలో ఉన్న మంచం మీద సంపూర్ణ జడత్వానికి గురి అయిఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న నాడిమితి (Pulsimeter), శ్వాసను కంట్రోల్ చేసే యంత్రం మరియు మెడికల్ సుల్యూషన్ ట్యూబుల  గురించి అతనికి ఏమీ తెలియదు.

సంవత్సరం పైగా ఎడతెగ కుండా ప్రతి రోజు అతని భార్య మరియు 14 సంవత్సరాల ఓ కొడుకు అతని వద్దకు వచ్చి, ప్రేమ, వాత్సల్యంతో అతని వైపు చూసి, అతనికి బట్టలు మార్చి, అతని క్షేమ విషయాలు తెలుసుకుంటూ, అతని గురించి డాక్టర్ తో కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. అతనిలో ఏ కొత్త మార్పు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అదే ఆరోగ్య స్థితిలో సంపూర్ణ జడత్వం (Coma)లో ఉన్నాడు. అల్లాహ్ తప్ప అతని స్వస్థత ఆశ ఎక్కడా లేకుండా అయిపోయింది. కాని ఓర్పుగల స్త్రీ మరియు యౌవనారంభదశలో ఉన్న అబ్బాయి ఇద్దరూ వినయ నమ్రతతో తమ చేతులు అల్లాహ్ వైపు ఎత్తి అతని స్వస్తత, ఆరోగ్యం గురించి దుఆ చేయనిదే అక్కడి నుండి వెళ్ళేవారు కారు.

అదే రోజు మళ్ళీ తిరిగి రావడానికి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేవారు. ఇలా ఎడతెగకుండా చికాకు, అలసట లేకుండా ప్రతి రోజు వస్తూ ఉండేవారు. హృదయాలు ప్రేమతో ఏకమైనాయి, సత్యంతో కలసిపోయాయి, కష్టాల్లో ఓర్పు, సానుభూతి, జాలి లాంటి పూర్ణసౌందర్య పుష్పాలు పుష్పించాయి.

ఏ కొత్త మార్పు లేని ఈ శవం లాంటి రోగి దర్శనానికి వస్తున్న స్త్రీ మరియు అబ్బాయిని చూసి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లే ఆశ్చర్యపోయేవారు. అల్లాహ్! అల్లాహ్!! ఎంతటి విచిత్రమైన సందర్భం! తన ప్రక్కన ఏముందో తెలియని రోగి దర్శనం రోజుకు రెండు సార్లా? డాక్టర్లు మరియు వారి అసిస్టెంటులు వారిద్దరిపై జాలి, దయ చూపుతూ అతని దర్శనమవసరం లేదు. వారంలో ఒకసారి రండి చాలు అని స్పష్టం చేశారు. అప్పుడు “అల్లాహుల్ ముస్తఆన్, అల్లాహుల్ ముస్తఆన్”(సహాయం కోసం అర్థింపదగినవాడు అల్లాహ్ మాత్రమే) అన్న పదాలే ఆ శ్రేయోభిలాష గుణం గల ఆడపడచు నోట వెళ్లేవి.

ఒకరోజు … భార్య, కొడుకుల దర్శానినికి కొంచెం ముందు ప్రభా- వితమైన ఓ వింత సంఘటన సంభవించింది; కోమలో ఉన్న మనిషి తన మంచంలో కదులుతున్నాడు, ప్రక్క మార్చుతున్నాడు, క్షణాలు గడవక ముందే కళ్ళూ తెరుస్తున్నాడు, ఆక్సిజన్ యంత్రాన్ని తన నుండి దూరం జేస్తూ, సరిగ్గా కూర్చుంటున్నాడు, నర్సును పిలుస్తూ ఓ కేక వేస్తున్నాడు. ఆమె బిత్తరపోయి వెంటనే హజరయింది. అతడు ఆమెతో వైద్య యంత్రాలన్నిటి (Medical equipents)ని తీయమని కోరాడు. ఆమె నిరాకరించి వెంటనే డాక్టర్ ను పిలిచింది. అతడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఎన్నో రకాల చెకప్ లు చేశాడు. కాని ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవును ఈ యంత్రాలన్నిటిని తీసేసి అతని శరీరాన్ని శుభ్రపరచండని ఆదేశించాడు.

నిష్ఠగల భార్య దర్శన సమయం సమీపించింది. భార్య మరియు కొడుకు తమ ప్రియమైనవారి వద్దకు వచ్చారు. నేను ఏ విధంగా ఆ దయార్థ క్షణాలను వర్ణించాలో, ఏ పదాలను కూర్చి నీ ముందు ఉంచాలో, వాస్తవానికి (వర్ణాతీతమైన ఘడియ అది) చూపులు చూపులను కౌగలించుకుంటున్నాయి, ఆశ్రువులు ఆశ్రువుల్లో మిశ్రమం అయిపోతున్నాయి. చిరునవ్వులు పెదవులపై నివ్వెర పరుస్తున్నాయి. అనుభూతులు నోరుమూతపడవేశాయి. కేవలం అమిత దయాలుడు, మహోపకారుడైన అల్లాహ్ స్తోత్రములు తప్ప. ఆయనే ఆమె భర్తకు స్వస్తత వరం ప్రసాదించాడు.

ఓ పుణ్యాత్ములారా ఈ సంఘటన ఇక్కడికే అంతం కాలేదు. ఇందులో ఓ గొప్ప రహస్యం ఉంది. అది స్పష్టమయ్యే వరకు డాక్టర్ కే ఓపిక లేదు. వెంటనే అతని భార్యను ‘నీవెప్పుడైనా ఇతడ్ని ఈ స్థితిలో చూడగలుతావని ఆశించావా?’ అని ప్రశ్నించాడు. ఆమె చెప్పిందిః ‘అవును, అల్లాహ్ సాక్షిగా! ఒక రోజు తప్పక రానుంది ఆయన మా రాక గురించి కూర్చుండీ వేచిస్తారు అని నేను ఆశించాను’.

డాక్టర్ చెప్పాడు: అతను ఈ స్థితికి రావడానికి ఎదో విషయముంది. అందులో వైద్యశాలకే గాని లేదా వైద్యులకే గాని ఏ ప్రమేయం, ఏ పాత్ర లేదు. అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను నీవు తప్పక చెప్పే తీరాలి. అవును? రోజుకు రెండేసి సార్లు నీవు ఎందుకని వస్తూ ఉంటివి? నీవు ఏమి చేస్తూ ఉంటివి?

ఆమె చెప్పింది: నీవు నాపై అల్లాహ్ పేరున ప్రమాణం చేసి అడగావు గనక చెబుతున్నానుః నేను మొదటి దర్శనానికి ఆయన తృప్తి మరియు ఆయన గురించి దుఆ చేయుటకు వచ్చేదానిని. మళ్ళీ నేను, నా కొడుకు అల్లాహ్ సామీప్యం కోరుతూ, అల్లాహ్ ఆయనకు స్వస్థత ప్రసాదించాలని బీదవాళ్ళ మరియు నిరుపేదల వద్దకు వెళ్ళి దానధర్మాలు చేసేవాళ్ళము.

అల్లాహ్ ఆమె ఆశను, దుఆను నిరాశగా చేయలేదు. ఆమె చివరి దర్శనానికి వచ్చి, ఆయన రాక కొరకు వేచిస్తూ ఉన్న ఆమె, ఆయన్ని తన వెంట తీసుకువెళ్ళసాగింది. ఆమె, ఆమె ఇంటి వారి కొరకు చిరునవ్వులు, సంతోషాలు తిరిగి రాసాగాయి.

ఎంత పరిపక్వమైన ఫలము అది. మరెంత రుచిగల పండు.

[الَّذِينَ يُنْفِقُونَ أَمْوَالَهُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ] {البقرة:274}

తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, దుఃఖంగాని కలిగే అవకాశం లేదు. (బఖర 2: 274).

ఈ సంఘటనను గౌరవనీయులైన అధ్యాపకులు అహ్మద్ సాలిమ్ బా దువైలాన్ “లా తయ్అస్” అన్న తన రచనలో పేర్కొన్నారు. అల్లాహ్ వారికి మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు మా వైపున ఉత్తమ ఫలితం నొసంగుగాక.

అల్లాహ్ దయ చాలా గొప్పది. ఆయనే ఇలా ఆదేశించాడుః

[لَنْ تَنَالُوا البِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ] {آل عمران:92}

మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. (ఆలిఇమ్రాన్ 3: 92).

దానధర్మాలు ఏ చోట చేస్తే చాలా మేలు ఉందో వెతకాలి. అయితే అన్నిట్లో కెల్లా అతిఉత్తమమైన స్థానం అల్లాహ్ వద్ద అతి చేరువ స్థానం పొందుటకు ఇల్లాలు, పిల్లలకు మరియు బంధువులపై ఖర్చు చేయాలి.

عَنْ أُمِّ سَلَمَةَ رضي الله عنها قُلْتُ يَا رَسُولَ الله ﷺ هَلْ لِي مِنْ أَجْرٍ فِي بَنِي أَبِي سَلَمَةَ أَنْ أُنْفِقَ عَلَيْهِمْ وَلَسْتُ بِتَارِكَتِهِمْ هَكَذَا وَهَكَذَا إِنَّمَا هُمْ بَنِيَّ قَالَ: (نَعَمْ لَكِ أَجْرُ مَا أَنْفَقْتِ عَلَيْهِمْ).

ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నేను అబూ సలమ సంతానం కొరకు ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని (దీన స్థితిలో చూస్తూ) వదలలేను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా?’ అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “అవును, నీవు వారి కొరకు ఖర్చు చేస్తున్నదాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది”. (బుఖారి 5369, ముస్లిం 1001).

మనం మన భార్యపిల్లలపై ఖర్చు చేయని రోజంటు ఏదైనా ఉంటుందా? కావలసిందేమిటంటే మనం సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ తో పుణ్యాన్నాశించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

(إِنَّكَ لَنْ تُنْفِقَ نَفَقَةً تَبْتَغِي بِهَا وَجْهَ الله إِلَّا أُجِرْتَ عَلَيْهَا حَتَّى مَا تَجْعَلُ فِي فَمِ امْرَأَتِكَ).

నీవు అల్లాహ్ ప్రసన్నత కోరుతూ ఖర్చు చేసే ప్రతీదానికి నీకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటికందించే దాని(ముద్ద, గుటక) పై కూడా నీకు పుణ్యం దొరుకుతుంది“. (బుఖారి 56, ముస్లిం 1628).

అల్లాహ్ నీ ఉపాధిలో వృద్ధి చేసి ఉంటే నీవు స్వయం నీపై మరియు దేశ, విదేశాల్లో ఉన్న నీ సోదరులపై ఎక్కువైనా, తక్కువైనా శుభప్రదమైన ఖర్చు చేస్తూ ఉండడంలో పిసినారితనం వహించకు.

తక్కువదాని ఉదాహరణ ఒక మస్జిద్ ఇమాం ఇలా ప్రస్తావించాడుః మస్జిద్ శుభ్రపరిచే పనిమనుషుల్లో ఒకరి విషయం చాలా గొప్పగా ఉంది; అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయుటకు ఎప్పుడు చెప్పినా వెంటనే అంగీకరించి, తాను స్వయంగా ఆర్థికంగా బలహీనుడు, దీనుడయినప్పటికీ వెనకాడకుండా అతని శక్తి ప్రకారంగా అర్థ రూపాయి దానం చేసేవాడు.

కేవలం అర్థ రూపాయి!! జాగ్రత్త! చాలా తక్కువే కదా అన్న హీనభావం నీలో కలగకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద దాని విలువ చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకనగా, ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః

 (مَنْ تَصَدَّقَ بِعَدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ وَلَا يَقْبَلُ اللهُ إِلَّا الطَّيِّبَ وَإِنَّ اللهَ يَتَقَبَّلُهَا بِيَمِينِهِ ثُمَّ يُرَبِّيهَا لِصَاحِبِهِ كَمَا يُرَبِّي أَحَدُكُمْ فَلُوَّهُ حَتَّى تَكُونَ مِثْلَ الْجَبَلِ).

అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపాదన (నుండి ఇచ్చే దానాల్ని) మాత్రమే స్వీకరిస్తాడు. అందుకే ఎవరైనా ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఖర్జూరపుటంత వస్తువేదైనా దానం చేస్తాడో అల్లాహ్ దానిని కుడి చేత్తో అందుకొని మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా దానిని దానం చేసినవాడి కోసం పెంచుతాడు. అలా పెరుగుతూ చివరకు అది పర్వతమంత పెద్దదిగా అయిపోతుంది“. (బుఖారి 1410).

అది అర్థ రూపాయి మాత్రమే.. కాని అల్లాహ్ ఆజ్ఞతో నరకాగ్ని నుండి రక్షణకై గొప్ప కారణం కావచ్చు. నాతో పాటు మీరు కూడా

ప్రవక్త ఈ ప్రవచనం గుర్తు చేసుకోలేరా?

 (اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ)

మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఒక ఖర్జూరపు ముక్క (దానం)తోనైనా సరే“. (బుఖారి 1417).

మనం నింపాదిగా అడుగులు ముందుకేస్తూ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ వైపుకెళ్దాము, అక్కడ ఓ దాతృత్వ దృశ్యాన్ని వీక్షిద్దాముః పండుగకు ఒకరోజు ముందు రాత్రి వేళ అక్కడి ఒక అధికారి వద్దకు పది సంవత్సరాలు కూడా దాటని ఒక అబ్బాయి వచ్చి సుమారు రెండు వందల రూపాలు దానం చేస్తాడు. ఎంతో ఆశ్చర్యంతో ‘నీకీ డబ్బలు ఎక్కడివి, మేము వీటిని ఏమి చేయాలి’ అని అతను అడుగుతాడు. అబ్బాయి ఇలా సమాధానమిస్తాడుః ఈ డబ్బులు నాకు నా తండ్రి పండుగ కొరకు బట్టలు ఖరీదు చేసుకోమని ఇచ్చాడు. అయితే ఈ డబ్బులతో అనాధ అబ్బాయి ఎవరైనా పండుగ సందర్భంగా తన కొరకు కొత్త బట్టలు ఖరీదు చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇక పోతే నాకు నా శరీరంపై ఉన్న ఈ బట్టలే చాలు అని అన్నాడు.

అల్లాహ్ మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ ఇంటివారికి ఎందులోనైతే నీవు పెరుగుతున్నావో ఎవరి ఒడిలో నీవు పెద్దగవుతున్నావో! అల్లాహ్ ఇహపరాల్లో నిన్ను వారి కళ్ళకు చల్లదనంగా చేయుగాక.

ప్రియపాఠకుడా! ఒకవేళ నీవు ఎక్కువ ధనం గలవాడివై ఉంటే అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన సంఘటనను గుర్తుచేసుకోః

كَانَ أَبُو طَلْحَةَ أَكْثَرَ الْأَنْصَارِ بِالْمَدِينَةِ مَالًا مِنْ نَخْلٍ وَكَانَ أَحَبُّ أَمْوَالِهِ إِلَيْهِ بَيْرُحَاءَ وَكَانَتْ مُسْتَقْبِلَةَ الْمَسْجِدِ وَكَانَ رَسُولُ الله ^ يَدْخُلُهَا وَيَشْرَبُ مِنْ مَاءٍ فِيهَا طَيِّبٍ قَالَ أَنَسٌ فَلَمَّا أُنْزِلَتْ هَذِهِ الْآيَةُ [لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ] قَامَ أَبُو طَلْحَةَ إِلَى رَسُولِ الله ^ فَقَالَ يَا رَسُولَ الله إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالَى يَقُولُ [لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوا مِمَّا تُحِبُّونَ] وَإِنَّ أَحَبَّ أَمْوَالِي إِلَيَّ بَيْرُحَاءَ وَإِنَّهَا صَدَقَةٌ لِله أَرْجُو بِرَّهَا وَذُخْرَهَا عِنْدَ الله فَضَعْهَا يَا رَسُولَ الله حَيْثُ أَرَاكَ اللهُ قَالَ: فَقَالَ رَسُولُ الله ^: (بَخٍ ذَلِكَ مَالٌ رَابِحٌ ذَلِكَ مَالٌ رَابِحٌ وَقَدْ سَمِعْتُ مَا قُلْتَ وَإِنِّي أَرَى أَنْ تَجْعَلَهَا فِي الْأَقْرَبِينَ) فَقَالَ أَبُو طَلْحَةَ: أَفْعَلُ يَا رَسُولَ الله فَقَسَمَهَا أَبُو طَلْحَةَ فِي أَقَارِبِهِ وَبَنِي عَمِّهِ.

మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరికంటే ఎక్కవ ఖర్జూరపు తోటల సంపద కలిగి ఉన్న వ్యక్తి అబూ తల్హాయే ఉండిరి. తన సంపదలో ఆయనకు ‘బైరుహా’ అనే తోటంటే చాలా ఇష్టం. అది మస్జిదె నబవికి ఎదురుగా ఉండింది. ప్రవక్త ﷺ కూడా ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచి నీళ్ళు త్రాగేవారు. ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే అల్లాహ్ ఆయతు అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, ‘ప్రవక్తా! ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే ఆయతు అల్లాహ్ మీపై అవతరింప జేశాడు. నా సంపద మొత్తంలో ‘బైరుహా’ తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుకు నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, అల్లాహ్ వద్ద అది నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక ప్రవక్తా! మీరు దీనిని అల్లాహ్ మీకు చూపిన పద్దుల్లో వినియోగించండి’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద, నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నీవు దానిని నీ బంధువుల్లో పంచిపెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి అబూ తల్హా ‘నేను అలాగే చేస్తాను ప్రవక్తా!’ అని అన్నారు. అన్న ప్రకారమే ఆయన దానిని తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు”. (బుఖారి 1461).

ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపోః

(اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا)

ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“. (బుఖారి 1442, ముస్లిం 1010).

ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడుః

(أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ)

ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను“. (బుఖారి 5352).

ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.

عَنْ عَائِشَةَ ؅ أَنَّهُمْ ذَبَحُوا شَاةً فَقَالَ النَّبِيُّ ^: (مَا بَقِيَ مِنْهَا؟) قَالَتْ: مَا بَقِيَ مِنْهَا إِلَّا كَتِفُهَا قَالَ: (بَقِيَ كُلُّهَا غَيْرَ كَتِفِهَا).

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషాతో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలి ఉంది?” అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).

కాదు.. మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది. ప్రవక్త ﷺ చెప్పారుః

(مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ) {مسلم  2588}

దానధర్మాలు ఎప్పుడూ సంపదలో లోటు ఏర్పరచవు“. (ముస్లిం).

ధర్మప్రచారంలో ఉన్న నా సోదరుడు డా. ఖాలిద్ బిన్ సఊద్ అల్ హులైబీ తెలిపాడుః దాతృత గుణంగల ఒక పెద్ద వ్యాపారి అహ్ సా పట్టణంలోని గొప్ప ధనవంతుల్లోని ఒకరు షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్నుఐమ్  ఇలా చెప్పేవారు: నేను అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, దాని ఘనత వల్ల అందులో చాలా శుభం నా కళ్ళార చూసేవాడిని.

ఈ హదీసుపై శ్రద్ధ వహించు, ఇది ఈ సుందర వనం ఫలాల్లోని ఓ ఫలాన్ని నీకు అతి చేరువుగా చేస్తుందిః

عَنْ أَبِي هُرَيْرَةَ  عَنْ النَّبِيِّ ^ قَالَ: (بَيْنَا رَجُلٌ بِفَلَاةٍ مِنْ الْأَرْضِ فَسَمِعَ صَوْتًا فِي سَحَابَةٍ اسْقِ حَدِيقَةَ فُلَانٍ فَتَنَحَّى ذَلِكَ السَّحَابُ فَأَفْرَغَ مَاءَهُ فِي حَرَّةٍ فَإِذَا شَرْجَةٌ مِنْ تِلْكَ الشِّرَاجِ قَدْ اسْتَوْعَبَتْ ذَلِكَ الْمَاءَ كُلَّهُ فَتَتَبَّعَ الْمَاءَ فَإِذَا رَجُلٌ قَائِمٌ فِي حَدِيقَتِهِ يُحَوِّلُ الْمَاءَ بِمِسْحَاتِهِ فَقَالَ لَهُ يَا عَبْدَ الله مَا اسْمُكَ قَالَ فُلَانٌ لِلِاسْمِ الَّذِي سَمِعَ فِي السَّحَابَةِ فَقَالَ لَهُ يَا عَبْدَ اللهِ لِمَ تَسْأَلُنِي عَنْ اسْمِي فَقَالَ إِنِّي سَمِعْتُ صَوْتًا فِي السَّحَابِ الَّذِي هَذَا مَاؤُهُ يَقُولُ اسْقِ حَدِيقَةَ فُلَانٍ لِاسْمِكَ فَمَا تَصْنَعُ فِيهَا قَالَ أَمَّا إِذْ قُلْتَ هَذَا فَإِنِّي أَنْظُرُ إِلَى مَا يَخْرُجُ مِنْهَا فَأَتَصَدَّقُ بِثُلُثِهِ وَآكُلُ أَنَا وَعِيَالِي ثُلُثًا وَأَرُدُّ فِيهَا ثُلُثَهُ) و في رواية: (وَأَجْعَلُ ثُلُثَهُ فِي الْمَسَاكِينِ وَالسَّائِلِينَ وَابْنِ السَّبِيلِ)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు’ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను”. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను”. (ముస్లిం 2984).

దానధర్మాలు చేయడం కూడా ఓ సద్గుణమే. ఎక్కడైతే అవసరం, బీదరికం ఉందో అక్కడ దాని అందం మరీ పెరుగుతుంది. అందులో దాతృత్వం మరియు ప్రాధాన్యత గుణాలు కలసి ఏకమవుతాయి. అత్యంత దాతృతుడు, మహోపకారుడైన అల్లాహ్ స్వయంగా ఆశ్చర్య(సంతోష) పడ్డాడన్న హదీసు ఒకటి శ్రద్ధగా చదువుః అబూ హురైరా  దానిని ఉల్లేఖించారుః

ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నేను తిండి లేక పరితపిస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ﷺ తమ ఒక భార్యకు ఈ వార్త పంపారు. ‘మిమ్మల్ని సత్య ధర్మం ఇచ్చిపంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని ఆమె చెప్పంపింది. తర్వాత మరో భార్య వద్దకు పంపారు. ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. చివరికి ఆయన భార్యలందరూ “మిమ్మల్ని సత్యధర్మం తో పంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అనే చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ తమ సహచరులనుద్దేశించి “ఈ రాత్రి ఇతనికి ఆతిథ్యమిచ్చే వారెవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. ఒక అన్సార్ వ్యక్తి లేచి, నేను ఇస్తాను ప్రవక్తా! అని అన్నారు. ఆయన అతడ్ని తనింటికి తీసుకెళ్ళాడు. తన భార్యతో ‘ఇతను ప్రవక్తగారి అతిథి, ఇతనికి మంచి ఆతిథ్యమివ్వాలి’ అని చెప్పాడు. మరో ఉల్లేఖనంలో ఉందిః ‘ఇంట్లో భోజనానికి ఏదైనా ఉందా’ అని తన భార్యను అడిగారు. దానికి ఆమె ‘పిల్లలకు సరిపోయేంత మాత్రమే ఉంది’ అని చెప్పింది. అప్పుడాయన చెప్పారుః రాత్రి భోజనం నుండి పిలవాళ్ళ మనస్సు మళ్ళించు. ఎప్పుడు వారు రాత్రి భోజనం కోరుతారో అప్పుడు వారిని పడుకోబెట్టు. ఇక అతిథి ఇంట్లోకి రాగానే (అన్నం వడ్డించి, తినేముందు) దీపం ఆర్పెయ్యి. ఆయన ముందు మనం కూడా అన్నం తిన్నట్లు నటిద్దాం. అందరూ భోజనానికి కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది) వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం పస్తుండిపోయారు. ఆ అన్సార్ సహచరుడు మరునాడు ఉదయం ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళగా ఆయన ﷺ ఇలా చెప్పారుః

 (قَدْ عَجِبَ اللهُ مِنْ صَنِيعِكُمَا بِضَيْفِكُمَا اللَّيْلَةَ)

నిశ్చయంగా రాత్రి మీరు మీ అతిథికి చేసిన సేవ చూసి అల్లాహ్ చాలా సంతోషించాడు“. (ముస్లిం 2054).

ఈ సమాజం ప్రవక్త ﷺ చూపిన సద్గుణాలపై శిక్షణపొందిన, స్వచ్చమైన చెలమ నుండి ఆస్వాదించిన సమాజం. అహం, స్వార్థం అంటే తెలియని సమాజం. ఇదిగో; సమాజంలో ఒక రకమైన సమాజాన్ని వారిలో ఉన్న ఆదర్శవంతమైన ఉత్తమ గుణాన్ని ప్రవక్త ﷺ ప్రశంసించారు. ఆ మనుగడపై గనక నేటి అనుచర సంఘం నడిచి ఉంటే వారిలో ఒక్క బీదవాడు అంటూ ఉండడు. వారు అష్అరీ తెగకు చెందినవారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

(إِنَّ الْأَشْعَرِيِّينَ إِذَا أَرْمَلُوا فِي الْغَزْوِ أَوْ قَلَّ طَعَامُ عِيَالِهِمْ بِالْمَدِينَةِ جَمَعُوا مَا كَانَ عِنْدَهُمْ فِي ثَوْبٍ وَاحِدٍ ثُمَّ اقْتَسَمُوهُ بَيْنَهُمْ فِي إِنَاءٍ وَاحِدٍ بِالسَّوِيَّةِ فَهُمْ مِنِّي وَأَنَا مِنْهُمْ)

అష్అరీ తెగవాళ్ళు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి ఆహార పదార్థాలు అయిపోవస్తే లేదా (స్వస్థలం) మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల ఆహారపదార్థాల్లో కొరత ఏర్పడితే ఎవరి వద్ద ఏ కొంత ఆహారం ఉన్నా వారు దాన్ని ఒక వస్త్రంలో పోగుచేస్తారు. మళ్ళీ ఒక పాత్రతో అందరూ సమానంగా వాటిని పంచుకుంటారు. అందుకే వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను“. (బుఖారి 2486, ముస్లిం 2500).

జాగ్రత్తా! ఓ ఉదారుడా! నిరాశ నిస్పృహలు నీపై తిష్టవేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఈ అనుచర సంఘంలో ప్రవక్త అడుగుజాడల్లో, పూర్వపు పుణ్యపురుషుల బాటలో నడిచే ఉపకా- రులున్నారు. ప్రతి చోట మన బలహీన సోదరుల కొరకు విరాళాల మరియు దానాల ఉద్యమాలు మనం ఎన్నటికీ మరవలేము. విరాళాల, దానాల ఈ రకాల్ని చూసి మనస్సు సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. వీటిని చూసేవాడు, వాస్తవానికి ఇవి భూమ్మీద ఓ మంచి రక్షక విధానం అని మరియు భూవాసుల శాంతి క్షేమాల రహస్యమని గ్రహించగలుగుతాడు. అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు, కృతజ్ఞతలు.

రెండు సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి. వాటిని షేఖ్ అలీ తంతావీ రహిమహుల్లాహ్ “జిక్రయాత్” అన్న తన రచనలోని భూమికలో ప్రస్తావించాడుః మా తండ్రిగారి అధ్యాపకులు షేఖ్ సలీమ్ అల్ మసూతీ రహిమహుల్లాహ్ స్వయంగా ఎంతో బీదవారైనప్పటికీ ఏ ఒక్క బీదవాడిని ఎప్పుడూ నెట్టలేదు. అతను ఓ చొక్కా ధరించి బైటికి వెళ్ళేవారు, దారిలో చలితో వణికిపోతున్న ఓ మనిషిని చూసి ఆ చొక్కా అతనికి ఇచ్చేసి, తాను కేవలం లాగు మీద ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక్కోసారి తన ఆలుబిడ్డలతో కలసి భోజనం చేస్తుండగా వారు తింటూ ఉన్న ఆహారపదార్థాలు తీసి ఇంటి ముందు వచ్చిన భిక్షకునికి ఇచ్చేవారు. ఒకసారి రమజానులో ఇఫ్తార్ గురించి తినుత్రాగు పదార్థాలు (దస్తర్ ఖ్వాన్ మీద) పెట్టి సైరన్ గురించి వేచిస్తుండగా ఒక భిక్షకుడు వచ్చి తనకు తన ఆలుబిడ్డలకు తినడానికి ఏమీ లేదు అని ప్రమాణాలు చేశాడు. షేఖ్ తన ఆవిడ అశ్రద్ధను గమనించి ఇఫ్తార్ గురించి వడ్డించిన మొత్తం ఆహారం అతనికిచ్చేశారు. కాని ఆవిడ చూసి అరవడం, విలపించడం మొదలెట్టి, నీ దగ్గరే కూర్చోను పో! అని ప్రమాణం చేసింది. ఆయన గారు మౌనంగా ఉన్నారు. అర్థ గంట కూడా గడవక ముందే ఎవరో తలుపు తట్టుతున్న శబ్దం విన్నారు. చూసే సరికి ఒక వ్యక్తి పెద్ద పళ్ళం ఎత్తుకువస్తున్నాడు. అందులో ఎన్నో రకాల తినుభంఢారాలు, స్వీట్లు, ఫలాలున్నాయి. ఏమిటి? అని అడిగితే, ఇక్కడి మన నగర పాలకుడు కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించాడు. వారు రానట్లుగా విన్నవించుకోగా, ఆయన కోపంతో నేనూ తినను అని ప్రమాణం చేసి ఇదంతా షేఖ్ సలీం అల్ మసూతీ ఇంటికి తరలించండని ఆదేశించాడు అని వారు చెప్పారు.

రెండవ సంఘటనః ఒక ఆడపడచు సంఘటన. ఆమె కొడుకు ఏదో ప్రయాణానికి వెళ్ళాడు. ఒకరోజు ఆమె తినడానికి కూర్చుంది. ఆమె ముందు ఓ రొట్టె ముక్క, దానికి సరిపడు కొంత కూర ఉంది. అంతలోనే ఒక భిక్షకుడు వచ్చాడు. అందుకు ఆమె తన నోట్లోకి తీసుకుపోయే ముద్దను ఆపేసి, అతనికిచ్చేసింది. తాను పస్తుండి పోయింది. ఆమె కొడుకు ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ప్రయాణంలో చూసిన విషయాల్ని చెప్పసాగాడు. అన్నిట్లోకెల్ల చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటేమిటంటేః ఒక దారిలో ఓ పులి నన్ను ఒంటరిగా చూసి వెంబడించింది. నేను పరుగులు తీశాను. ఒక్కసారి కొంచెం దగ్గరున్నప్పుడు అమాంతం దూకి నా మీద పడింది. ఇక నేను దాని నోట్లో పోయానని భావిస్తున్న వేళ ఒక మనిషి తెల్లని దుస్తుల్లో నా ముందుకు వచ్చి నన్ను పులి నుండి విడిపించి “ముద్దకు బదులు ముద్ద” అన్నాడు. కాని ఏమిటుద్దేశ్యం నాకు అర్థం కాలేదు. అప్పుడే అతని తల్లి సంఘటన జరిగిన రోజు, సమయం అడిగింది. అదే సమయానికి ఇక్కడ తల్లి బీదవానికి దానం చేసిన వేళ. తన నోట్లోకి పోయే ముద్దను వెనక్కి తీసుకొని అల్లాహ్ మార్గంలో దానం చేసింది. ఇలా తన కొడుకు పులి నోట్లో నుండి బయటికి తీయబడ్డాడు. ఇక్కడికి షేఖ్ తంతావీ మాట సమాప్తమయింది.

ఓ! ఇంతనా పిసినారితనం? పిసినారితనం, పిసినారిని అవమానం, అవహేళన పాలు జేస్తుంది. దాని పర్యవసానం వినాశకరం. దాని వాసన దుర్గంధమైనది. వ్యక్తిగతంగాగాని, జాతియపరంగాగాని అది వినాశనం పాలుజేస్తుంది. సత్యసంధులైన ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

 (اتَّقُوا الشُّحَّ فَإِنَّ الشُّحَّ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ حَمَلَهُمْ عَلَى أَنْ سَفَكُوا دِمَاءَهُمْ وَاسْتَحَلُّوا مَحَارِمَهُمْ)

పిసినారితనానికి బహుదూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించినవారిని సర్వనాశనం చేసింది. తమవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మసమ్మతం(హలాల్) గా చేసుకోవడానికి ప్రేరేపించింది“. (ముస్లిం 2578).

4వ వనం: కరుణ, కటాక్షాలు

మల్లె మరియు గులాబీ లాంటి సువాసన ఈ వనం వెదజల్లుతుంది. తాజాగా దాని కొమ్మలు కరుణగల హృదయుల ముందు వంగి ఉంటాయి. ఆ హృదయాలు కరుణామయుడైన అల్లాహ్ ముందు నమ్రతతో ఉండే విధంగా శిక్షణ పొంది ఉన్నాయి. అందుకే అవి తమ ప్రభువు కరుణను మరియు దయను కోరుతూ ఆయన సృష్టి పట్ల మెత్తగా, దాసుల పట్ల మృదువుగా ఉన్నాయి.

“కరుణామయులు”, ఇలాగే మన ప్రభువు మనల్ని నిర్వచించాడు. మనం సానుభూతి చెలమ దగ్గర మేశాము, మరియు దయాగుణ చెలమ నీటి త్రాగాము.

[مُحَمَّدٌ رَسُولُ اللهِ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِنَ اللهِ وَرِضْوَانًا] {الفتح:29}

ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. (ఫత్ హ్ 48: 29 ).

ఇదిగో కారుణ్యమూర్తి ప్రవక్త ﷺ ఊపిరాడుతున్న ఓ చంటి పాపను తమ చేతుల్లో తీసుకున్నారు. ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందన్న పరిస్థితిలో వున్న ఆ అబ్బాయిని చూసి ప్రవక్త చక్షువుల్లో కన్నీరు కారాయి. ఇది గమనించిన సఅద్ ‘ప్రవక్తా! ఇదేమిటి? అని అడిగారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః

(هَذِهِ رَحْمَةٌ جَعَلَهَا اللهُ فِي قُلُوبِ عِبَادِهِ وَإِنَّمَا يَرْحَمُ اللهُ مِنْ عِبَادِهِ الرُّحَمَاءَ)

ఇది కారుణ్యం. అల్లాహ్ తన దాసుల హృదయాల్లో దీనిని పెట్టాడు. తన దాసుల్లో కరుణామయులైన వారిని అల్లాహ్ కరుణిస్తాడు“. (బుఖారి 1384, ముస్లిం933).

అల్లాహ్ నిన్ను కాపాడుగాకా! తెలుసుకోః కారుణ్యం స్వర్గానికి బాట. ఇతర బాటల్లో కెల్లా మరీ అందమైన బాట. ఎలా కాదు? ఒక మనిషి మనస్సులో ఉన్న ఈ కారుణ్యం కారణంగానే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు. ఆ కారుణ్యం వల్ల అతడు ఏమి చేశాడు? రండి, సత్యసంధులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట సంక్షిప్త వాక్యాల్లో ఈ సంఘటన వివిరాలు చదువుదాముః

(بَيْنَا رَجُلٌ يَمْشِي فَاشْتَدَّ عَلَيْهِ الْعَطَشُ فَنَزَلَ بِئْرًا فَشَرِبَ مِنْهَا ثُمَّ خَرَجَ فَإِذَا هُوَ بِكَلْبٍ يَلْهَثُ يَأْكُلُ الثَّرَى مِنْ الْعَطَشِ فَقَالَ لَقَدْ بَلَغَ هَذَا مِثْلُ الَّذِي بَلَغَ بِي فَمَلَأَ خُفَّهُ ثُمَّ أَمْسَكَهُ بِفِيهِ ثُمَّ رَقِيَ فَسَقَى الْكَلْبَ فَشَكَرَ اللهُ لَهُ فَغَفَرَ لَهُ) قَالُوا: يَا رَسُولَ الله! وَإِنَّ لَنَا فِي الْبَهَائِمِ أَجْرًا؟ قَالَ: (فِي كُلِّ كَبِدٍ رَطْبَةٍ أَجْر).

“ఒక వ్యక్తి ఓ దారి గుండా నడచి వెళ్తుండగా అతనికి విపరీతంగా దాహం కలిగింది. ఒక బావిలో దిగి నీళ్ళు త్రాగి బైటికి వచ్చేశాడు. అంతలోనే ఓ కుక్క నాలుక వెళ్ళబెట్టి బురదమట్టిని నాకుతూ (కనబడింది). ‘నేను దప్పికతో అల్లాడిపోయినట్లు ఈ కుక్క కూడా బాధపడుతుందేమో’ అనుకొని (మళ్ళీ బావిలో దిగి) తన మేజోడును నీటితో నింపి, దాన్ని నోటితో పట్టుకొని పైకి తెచ్చాడు. ఆ నీరు కుక్కకు త్రాపించాడు. అప్పుడు అల్లాహ్ అతను చేసిన పనిని మెచ్చుకొని అతన్ని క్షమించాడు. సహచరులు ఈ వృత్తాంతం విని ‘ప్రవక్తా! భూతదయపై కూడా మాకు పుణ్యం లభిస్తుందా? అని అడిగారు. ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “తడి కాలేయం (అంటే ప్రతి ప్రాణం) గల జీవికి చేసే మేలుకు మీకు పుణ్యం లభిస్తుంది. (బుఖారి 2363, ముస్లిం 2244).

అహా! కర్శక నోరు మరియు కఠిన హృదయుల సంగతే విచిత్రం!! అతని వద్ద ఏ మనిషికి కరుణా కటాక్షాలు లభించవు. చివరికి అతని పెదవులపై చిన్నటి మందహాసమైనా కానరాదు. ఇలాంటి వాడు నోరులేని జీవులపై ఏ దయచూపగలడు? మహా దుస్థితి అతనిది. ఇలాంటి మానవుల దుస్థితి, దురదృష్టం గురించి నేను లేదా నువ్వు కాదు తీర్పు చేసింది? కారుణ్యమూర్తి ﷺ తీర్పు చేశారు.

 (لَا تُنْزَعُ الرَّحْمَةُ إِلَّا مِنْ شَقِيٍّ).

దురదృష్టుని నుండే కారుణ్యం తీసుకోబడుతుంది“. (అహ్మద్, తిర్మిజి 1923. దీని సనద్ హసన్. అబూ దావూద్ 4942).

నరకాగ్ని కంటే మించిన దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా? ఒక స్త్రీ అతి చెడ్డ స్థానమైన నరకానికి ఆహుతి అవుతుంది. కారుణ్య స్వభావం ఆమె చీకటి హృదయంలో నిరంకుశం మరియు కఠినత్వంలో మారింది. ఆమె దుష్ఫలిత సమాచారం మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారుః

 (عُذِّبَتْ امْرَأَةٌ فِي هِرَّةٍ سَجَنَتْهَا حَتَّى مَاتَتْ فَدَخَلَتْ فِيهَا النَّارَ لَا هِيَ أَطْعَمَتْهَا وَلَا سَقَتْهَا إِذْ حَبَسَتْهَا وَلَا هِيَ تَرَكَتْهَا تَأْكُلُ مِنْ خَشَاشِ الْأَرْضِ).

ఒక స్త్రీ పిల్లి కారణంగా శిక్షించబడింది. ఆమె దానిని బంధించింది చివరికి అది చనిపోయింది. అందుకు ఆమె నరకంలో చేరింది. ఆమె ఆ పిల్లికి అన్నం పెట్టలేదు. నీరు త్రాగించలేదు. కట్టి ఉంచింది. కనీసం ఆమె దానిని వదిలివేసినా అదే స్వయంగా నేల మీద తిరిగే క్రిమికీటకాలు తినిబ్రతికేది“. (బుఖారి 3482, ముస్లిం 2242).

ప్రియ సోదరా! నిద్ర లేకుండా చేసిన నొప్పి, రాత్రంత మేల్కొనే ఉండినట్లు చేసిన అవస్థ గల ఓ రోగిని పరామర్శించడం ద్వారా నీపై ఎలా కారుణ్యం కురుస్తుందో ఎప్పుడైనా నీవు అనుభవించావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

 (مَا مِنْ مُسْلِمٍ يَعُودُ مُسْلِمًا غُدْوَةً إِلَّا صَلَّى عَلَيْهِ سَبْعُونَ أَلْفَ مَلَكٍ حَتَّى يُمْسِيَ وَإِنْ عَادَهُ عَشِيَّةً إِلَّا صَلَّى عَلَيْهِ سَبْعُونَ أَلْفَ مَلَكٍ حَتَّى يُصْبِحَ وَكَانَ لَهُ خَرِيفٌ فِي الْجَنَّةِ)

ఒక ముస్లిం తోటి ముస్లింను ఉదయం పూట పరామర్శిస్తే, డెబ్బైవేల దైవదూతలు సాయంత్రం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అదే సాయంత్రంవేళ పరామర్శిస్తే డెబ్బై వేల దేవదూతలు ఉదయం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా అతని కోసం స్వర్గఫలాలు ఏరి ఉంచబడుతాయి“. (తిర్మిజి 969, అబూ దావూద్ 3098).

ప్రియసోదరా! తండ్రి ప్రేమను కోల్పోయిన అనాథ రక్షణకై చెయ్యి చాచు. అతడు ఎడబాటు బాధను చవిచూశాడు. నీవు చేసే ఈ పుణ్యంలో ప్రవక్త ﷺ చెప్పిన ప్రకారం నీకో వాట లభించుగాకః

(وَأَنَا وَكَافِلُ الْيَتِيمِ فِي الْجَنَّةِ هَكَذَا وَأَشَارَ بِالسَّبَّابَةِ وَالْوُسْطَى وَفَرَّجَ بَيْنَهُمَا شَيْئًا).

నేను మరియు అనాథ సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము అని ప్రవక్త ﷺ తమ చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళును  కలపకుండా కొంత సంధు ఉంచి చూపించారు“. (బుఖారి 5304).

విధవల పట్ల దయార్థ హృదయునివిగా ఉండు. చావు ఆమెను తన ప్రియభర్తతో దూరము చేసింది, ఈ దూరం ఆమె గుండెను చీల్చివేసింది. ప్రజల ముందు అవసరాలు ఉంచడం వీపు మీద మోయలేని భారం వేసుకున్నట్లయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

(السَّاعِي عَلَى الْأَرْمَلَةِ وَالْمِسْكِينِ كَالْمُجَاهِدِ فِي سَبِيلِ الله أَوْ الْقَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ).

“విధవలు మరియు నిరుపేదల బాగుకోసం కృషిచేసేవాడు అల్లాహ్ మార్గం లో పోరాడే యోధుడితో సమానం. లేదా రాత్రంతా నమాజు, పొద్దంతా ఉపవాసం ఉన్నవారితో సమానం”. (బుఖారి 5353, ముస్లిం 2982).

బలహీనుడి పట్ల నీ కారూణ్య ప్రక్కలను చాచు. బాధలు అతడిని బలహీనతకు గురిచేశాయి. ఈ బలహీనతే అతడ్ని ఒంటరిగా చేసింది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

[فَأَمَّا اليَتِيمَ فَلَا تَقْهَرْ ، وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ]. {الضُّحى 9، 10}.

కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు. (జుహా 93: 9,10).

నీ భార్య, సంతానం మరియు ఇతర బంధువుల పట్ల కారూణ్య ఛాయల్ని వేసి ఉంచు. వారు ధన, జ్ఞానపరంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా నీ అవసరం, వాత్సల్యం ఛాయ లేనిది ఉండలేరు. పుణ్య విత్తనం నాటువాడా గుర్తుంచుకో దాని కోత శుభపరం అయినది. ఫలాలు రుచికరమైనవి. ఆయిషా తెలిపిన ఓ సంఘటన ఎలా ఉందో గమనించు:

 (جَاءَتْنِي مِسْكِينَةٌ تَحْمِلُ ابْنَتَيْنِ لَهَا فَأَطْعَمْتُهَا ثَلَاثَ تَمَرَاتٍ فَأَعْطَتْ كُلَّ وَاحِدَةٍ مِنْهُمَا تَمْرَةً وَرَفَعَتْ إِلَى فِيهَا تَمْرَةً لِتَأْكُلَهَا فَاسْتَطْعَمَتْهَا ابْنَتَاهَا فَشَقَّتْ التَّمْرَةَ الَّتِي كَانَتْ تُرِيدُ أَنْ تَأْكُلَهَا بَيْنَهُمَا فَأَعْجَبَنِي شَأْنُهَا فَذَكَرْتُ الَّذِي صَنَعَتْ لِرَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ إِنَّ اللَّهَ قَدْ أَوْجَبَ لَهَا بِهَا الْجَنَّةَ أَوْ أَعْتَقَهَا بِهَا مِنْ النَّارِ)

ఓ నిరుపేద స్త్రీ తన ఇద్దరు బిడ్డలను ఎత్తుకొని నా వద్దకు వచ్చింది. నేనామెకు మూడు ఖర్జూర పండ్లు ఇచ్చాను. ఇద్దరు కూతుళ్ళకు ఒక్కో ఖర్జూరపండు ఇచ్చి మిగిలిన ఒకటి తన నోట్లో వేసుకోబోయింది. అంతలోనే అది కూడా ఇచ్చేయమని వారు కోరారు. వెంటనే ఆమె తాను తిందామనుకున్న ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలు చేసి తలోముక్క ఇద్దరు కూతుళ్ళకిచ్చింది. అది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నేనీ విషయాన్ని ప్రవక్తకు తెలియజేశాను. దానికి ఆయన ﷺ ఇలా సమాధానం చెప్పారుః “అల్లాహ్ ఆమె చేసిన పనిని మెచ్చుకొని ఆమె కోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. లేదా ఆమెకు నరకాగ్ని నుండి విముక్తి నొసంగాడు”. (ముస్లిం 2630).

బంధుత్వాల్ని కలుపుకోవడం నీపై విధిగా ఉంది. ఎందుకనగా “రహిమ్” (బంధుత్వం) అన్న అరబీ పదం “రహ్మత్” (కారూణ్యం) అన్న పదం నుండే వచ్చింది. బంధుత్వాన్ని కలుపుకుంటే, పెంచుకుంటే దాని సాఫల్య మాధుర్యం పరలోకం కంటే ముందు ఇహ లోకంలోనే నీవు చవిచూస్తావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(مَنْ سَرَّهُ أَنْ يُبْسَطَ عَلَيهِ رِزْقُهُ أَوْ يُنْسَأَ فِي أَثَرِهِ فَلْيَصِلْ رَحِمَهُ)

తన ఉపాధిలో సమృద్ధి, ఆయుష్యులో పెరుగుదల ఎవరికి ఇష్టమో వారు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి“. (ముస్లిం 2557, బుఖారి 2067).

అల్లాహ్ నీకు తన ప్రత్యేక దయ నొసంగి ఉంటే, గుర్తుంచుకో! నీ వద్ద పనిచేయుటకు వచ్చిన వ్యక్తి తన పరిస్థితి బాగులేక, ఆర్థిక దుస్థితి తన సంతానాన్ని శక్తిహీనంగా చేసినందుకు వచ్చాడు. అతనితో నీవు కఠినంగా ప్రవర్తించకు. అతనితో జరిగే లోపాల్ని మన్నించేసెయ్యి. అనస్ రజియల్లాహు అన్హు ప్రకారం:

(خَدَمْتُ النَّبِيَّ ﷺ عَشْرَ سِنِينَ فَمَا قَالَ لِي أُفٍّ وَلَا لِمَ صَنَعْتَ وَلَا أَلَّا صَنَعْتَ).

నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. ఒక్కసారి ఊఁ అనలేదు. ఎందుకు చేశావు, ఎందుకు చేయలేదు అనీ అనలేదు“. (బుఖారి 6038).

ఆయిషా ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఎన్నడూ తమ సేవకుణ్ణి- గానీ, భార్యనుగానీ కొట్టలేదు. కొట్టడానికి తమ చెయ్యి లేపినది కేవలం అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసిన్నప్పుడే. (అహ్మద్. ఇది సహీ హదీసు).

ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నా సేవకుడు చెడుగా ప్రవర్తిస్తాడు, అన్యాయం చేస్తాడు. అలాంటప్పుడు నేనతడ్ని కొట్టవచ్చా?’ అని అడిగాడు. అందుకు ప్రవక్త సమాధానమిస్తూ “నీవు అతడ్ని ప్రతి రోజు డెబ్బై సార్లు మన్నిస్తూ ఉండు” అని చెప్పారు. (అహ్మద్, తిర్మిజి. ఇది సహీ హదీసు).

అహా! ఎంత విచిత్రం!! మనం మనలో ఉన్న బలహీనుల హక్కులను నెరవేర్చడంలో వెనకబడి ఉన్నాము, అయినా అల్లాహ్ తో వర్షం కొరకు దుఆ చేస్తున్నాము. ప్రవక్త ﷺ ఈ ప్రవచనాన్ని మరచిపోయామా?

 (هَلْ تُنْصَرُونَ وَتُرْزَقُونَ إِلَّا بِضُعَفَائِكُمْ)

ఈ బలహీనుల చలువతోనే మీకు (అల్లాహ్) సహాయం లభిస్తుంది మరియు ఉపాధి దొరుకుతుంద”ని గ్రహించండి. (బుఖారి 2896).

బలహీనుల సహాయం చేయుట ప్రవక్త సంప్రదాయం. దీని అనుసరణలో పుణ్యం ఉంది. ఎల్లవేళల్లో దాన్ని పాటించుట మంచి గౌరవ మర్యాద గల విషయం.

كَانَ رَسُولُ الله ﷺ  يَتَخَلَّفُ فِي الْمَسِيرِ فَيُزْجِي الضَّعِيفَ وَيُرْدِفُ وَيَدْعُو لَهُمْ.

ప్రవక్త ﷺ ప్రయాణంలో నడచినప్పుడు అందరికన్నా వెనుక ఉండి బలహీనులకు ఊతమిచ్చి నడిపించేవారు. లేదా వారిని వాహనం మీద తన వెనుక కూర్చోబెట్టుకునేవారు. వారికోసం (అల్లాహ్ ను) ప్రార్థించేవారు“. (అబూ దావూద్ 2639. దీని సనద్ హసన్).

ఈ అనుచర సంఘంలో బీదవాళ్ళ, అగత్యపరుల (సహాయానికి) ఎందరో వీరులున్నారు; వారిలోని బలహీనుల పట్ల సానుభూతి చూపేవారు. వస్త్రాల్లేనివారికి వస్త్రాలు ధరించేవారు. వారిలోని అనాథలను పోషించేవారు. వారిలోని వితంతువుల పట్ల మేలు చేసేవారు.

ఈ సంఘటన ప్రజల్లో ప్రభలియుంది. అయినా నేను కూడా దాన్ని ప్రస్తావించడంలో తృప్తి, ఇతరులకు గుణపాఠం అని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి కలలో ప్రవక్త ﷺ తన వద్దకు వచ్చి “నీవు ఫలాన చోట ఫలాన బిన్ ఫలాన వద్దకు వెళ్ళి స్వర్గం శుభవార్త ఇవ్వు” అని చెప్పినట్లు విన్నాడు. ఇతను మేల్కొని, ప్రవక్త కలలో చెప్పిన వ్యక్తి పేరు ఆలోచించగలిగాడు. ఆ పేరు గల ఏ వ్యక్తి అతనికి గుర్తురాలేదు. అప్పుడు అతను స్వప్నభావం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్ళాడు. ఎవరి గురించి నీవు స్వప్న చూశావు అతనికి ఈ శుభవార్త వినిపించు అని అతడు చెప్పాడు. అడుగుతూ, తెలుసుకుంటూ చివరికి అతనుండే గ్రామం తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి గురించి అడిగాడు. ఎవరో అతని వద్దకు తీసుకెళ్ళారు. అతడ్ని కలిశాక ‘నా వద్ద నీకో శుభవార్త ఉంది. అయితే నీవు చేసే సత్కార్యాలేమిటో చెప్పనంత వరకు నేను కూడా శుభవార్త వినిపించను అని చెప్పేశాడు. ఇతర ముస్లింలు చేసే సత్కార్యాలే చేస్తున్నాను అని అతడన్నాడు. అయితే నేను చెప్పను అని అతను చేసే సత్కార్యమేమిటో చెప్పే తీరాలని మొండిపట్టు పట్టాడు. అప్పుడు అతడు ఇలా చెప్పాడుః “వినుః నేను ఓ చిన్న పాటి పని చేసుకొని నా భార్యసంతానానికి ఖర్చు పెడుతూ ఉంటాను. ఎప్పుడైతే నా పక్కింటి మనిషి చనిపోయాడో, అతనింట్లో భార్య, పిల్లలున్నారో అప్పటి నుండి నా నెలసరి జీతంలో రెండు వంతులు చేసి ఒక వంతు నా ఇంట్లో మరో వంతు నా పొరుగువారింట్లో ఖర్చు పెడుతున్నాను. అప్పుడు ఇతను చెప్పాడుః ఇదే సత్కార్యం నిన్ను ఇంతటి గొప్ప స్థానానికి చేర్చింది. తెలుసుకో! నేను ప్రవక్త ﷺ ని కలలో చూశాను. ఆయన నీకు స్వర్గం శుభవార్త ఇచ్చాడు అని చెప్పాడు

5వ వనం: తల్లిదండ్రుల విధేయత

సత్కార్యాల్లో ఓ కార్యం దానికి సరిసమానం మరో కార్యం లేదు. దాని గురించి నేను ఏ కోణం నుండి ఆరంభించి ఏ కోణంలో అంతం చేయాలో నాకే దోయడం లేదు. అదో సత్కార్యం, అల్లాహ్ తన ఏకత్వం తర్వాత దాని ఆదేశమే ఇచ్చాడు. ప్రవక్త ﷺ కూడా దాని గురించి చాలా ప్రోత్సహించారు. పండితులు, ఉపన్యాసకులు, వక్తలు దాని గురించి చాలా చెప్పారు. అల్లాహ్ ఆదేశం తర్వాత ఇక నేనేమి చెప్పగలనుః

[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُلْ لَهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا ، وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُلْ رَبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا ، رَبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ إِنْ تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا]. {الإسراء23-25}.

నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడుః మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారిముందు విసుగ్గా “ఛీ” అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు. మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే వారందరినీ ఆయన మన్నిస్తాడు [ (బనీ ఇస్రాఈల్ 17: 23-25).

ప్రవక్త చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏమి మిగిలి ఉంటుందిః

 (رَغِمَ أَنْفُهُ ثُمَّ رَغِمَ أَنْفُهُ ثُمَّ رَغِمَ أَنْفُهُ) قِيلَ: مَنْ يَا رَسُولَ الله؟ قَالَ: (مَنْ أَدْرَكَ وَالِدَيْهِ عِنْدَ الْكِبَرِ أَحَدَهُمَا أَوْ كِلَيْهِمَا ثُمَّ لَمْ يَدْخُلْ الْجَنَّةَ).

వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల!” అని మూడుసార్లు ప్రవక్త ﷺ శపించారు. ప్రవక్తా! వాడెవడు? అని మేమడగ్గా, “ఎవడైతే తన తల్లిదండ్రుల్లో ఇద్దరినీ లేదా ఒక్కరిని వారి వృద్ధాప్యంలో పొంది కూడా స్వర్గంలో ప్రవేశించలేక పోయాడో” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. (ముస్లిం 2551).

మన ఆపద ఏమిటంటే? తల్లిదండ్రుల సేవ వృక్షం తొందరగా ఫలిస్తుందన్నది, దాని ఫలాలు అతి చేరువుగా ఉంటాయన్నది మరచిపోతాము. మనిషి ఆ ఫలాన్ని ఇహంలోనే తన కళ్ళారా చూడగలుగుతాడు. అంతకంటే గొప్పగా తన కొరకు పరంలో సమ- కూర్చబడుతుంది. అయితే ప్రాపంచిక ఉపద్రవాలు మన ఈ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నాయి? చివరికి మన తల్లిదండ్రుల సేవ చేయకుండా చేసేస్తున్నాయి? ఉపకారం చేయలేని, లేదా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయలేని జీవితం అతి చెడ్డ జీవితం. తల్లిదండ్రులతో సత్ప్రవర్తన వారి పట్ల ఉపకారం కంటే విలువ గలది, సమానమైనది మరేదైనా ఉంటుందా?

అల్లాహ్ దయ తర్వాత తల్లిదండ్రుల సేవయే జీవితంలో సాఫల్య రహస్యం. అనేక ఆపదల నుండి రక్షణ. దానితో మనస్సులు తృప్తి చెందుతాయి. హృదయాలు వికసిస్తాయి. వారి సేవలో ఉండేవాడు అదృష్టాన్ని, తన ధన, ప్రాణ, సంతానంలో శుభాన్ని తన కళ్లారా చూస్తాడు.

చెవి మొగ్గి, హృదయాంతరంతో ఈ హదీసు విని మరచిపోకుండా ఉండు, అందులో ఉన్న సత్కార్యాల పట్ల మరియు వాటి ఫలం ఎలా ఉంటుందో గమనించుః

(بَيْنَمَا ثَلَاثَةُ نَفَرٍ يَتَمَشَّوْنَ أَخَذَهُمْ الْمَطَرُ فَأَوَوْا إِلَى غَارٍ فِي جَبَلٍ فَانْحَطَّتْ عَلَى فَمِ غَارِهِمْ صَخْرَةٌ مِنْ الْجَبَلِ فَانْطَبَقَتْ عَلَيْهِمْ فَقَالَ بَعْضُهُمْ لِبَعْضٍ انْظُرُوا أَعْمَالًا عَمِلْتُمُوهَا صَالِحَةً لِله فَادْعُوا اللهَ تَعَالَى بِهَا لَعَلَّ اللهَ يَفْرُجُهَا عَنْكُمْ فَقَالَ أَحَدُهُمْ اللَّهُمَّ إِنَّهُ كَانَ لِي وَالِدَانِ شَيْخَانِ كَبِيرَانِ وَامْرَأَتِي وَلِي صِبْيَةٌ صِغَارٌ أَرْعَى عَلَيْهِمْ فَإِذَا أَرَحْتُ عَلَيْهِمْ حَلَبْتُ فَبَدَأْتُ بِوَالِدَيَّ فَسَقَيْتُهُمَا قَبْلَ بَنِيَّ وَأَنَّهُ نَأَى بِي ذَاتَ يَوْمٍ الشَّجَرُ فَلَمْ آتِ حَتَّى أَمْسَيْتُ فَوَجَدْتُهُمَا قَدْ نَامَا فَحَلَبْتُ كَمَا كُنْتُ أَحْلُبُ فَجِئْتُ بِالْحِلَابِ فَقُمْتُ عِنْدَ رُءُوسِهِمَا أَكْرَهُ أَنْ أُوقِظَهُمَا مِنْ نَوْمِهِمَا وَأَكْرَهُ أَنْ أَسْقِيَ الصِّبْيَةَ قَبْلَهُمَا وَالصِّبْيَةُ يَتَضَاغَوْنَ عِنْدَ قَدَمَيَّ فَلَمْ يَزَلْ ذَلِكَ دَأْبِي وَدَأْبَهُمْ حَتَّى طَلَعَ الْفَجْرُ فَإِنْ كُنْتَ تَعْلَمُ أَنِّي فَعَلْتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فَافْرُجْ لَنَا مِنْهَا فُرْجَةً نَرَى مِنْهَا السَّمَاءَ فَفَرَجَ اللهُ مِنْهَا فُرْجَةً فَرَأَوْا مِنْهَا السَّمَاءَ).

“ముగ్గురు వ్యక్తులు నడచి వెళ్తుండగా దారిలో వర్షం కురిసింది. అందుకు వారు ఒక కొండ గుహలోకి వెళ్ళారు. అంతలోనే ఒక బండరాయి గుహ ముఖద్వారం మీద వచ్చిపడింది. వారు బైటికి వెళ్ళకుండా దారి మూతపడింది. అప్పుడు వారు పరస్పరం ఇలా అనుకున్నారుః ‘అల్లాహ్ కొరకే ప్రత్యేకంగా చేసుకున్న సత్కర్మల లో ఒకదాని ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేయండి. బహుశా అల్లాహ్ మన కొరకు సంది ఏర్పరుస్తాడు. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడుః ఓ అల్లాహ్! నాకు తల్లిదండ్రి, భార్య పిల్లలు ఉండే వారు. నేను మేకలు కాస్తూ వారిని పోషించేవాడిని. సాయంకాలం వేళ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నేను పాలు పితికి మొట్టమొదట నా తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని. పిలవాళ్ళకంటే ముందు వారికి త్రాగించేవాడిని. ఒక రోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. ఇంటికి చేరుకునే సరికి రాత్రయింది. అప్పటికే వారు నిద్రపోయారు. ప్రతి రోజు పాలు పితికే విధంగా పితికి పాల పాత్ర తీసుకొని వారి వద్దకు వచ్చి వారి తలాపున నిలబడ్డాను. వారిని నిద్ర నుండి మేల్కొలపటం భావ్యం కాదనుకున్నాను. వారికంటే ముందు పిల్లలకు త్రాగించడం కూడా నాకు ఇష్టం అనిపించ లేదు. పిల్లలు నా కాళ్ళ దగ్గర ఆకలితో తల్లడిల్లిపోతూ ఏడ్వసాగారు. (అయినా నేను నా తల్లిదండ్రులకు నిద్రా భంగం కలిగించలేదు). వారు పడుకునే ఉన్నారు. నేను కూడా తెల్లవారే దాకా అలాగే వారి ముందు నిల్చున్నాను. అల్లాహ్! నేనీ పని కేవలం నీ ప్రసన్నత కోసం చేశాను. అది నీకూ తెలుసు. అందుచేత మా గుహలో నుంచి మేము ఆకాశాన్ని చూడ గలిగే అంత సందు చెయ్యి. అప్పుడే అల్లాహ్ ఓ సందు చేశాడు. అందులో నుండి వారు ఆకాశాన్ని చూడగలిగారు”. (ముస్లిం 2743, బుఖారి 2215). ఈ విధంగా మిగితా ఇద్దరు వారు చేసుకున్న సత్కర్మల ఆధారంగా దుఆ చేశారు. అల్లాహ్ సాన్నిధ్యం పొందగోరారు. చివరికి అల్లాహ్ వారిని ఆ ఆపద నుండి వెలికి తీశాడు. వారందరూ గుహ నుండి బైటికి వచ్చేశారు.

ఓ రకంగా మృత్యువువాత పడి జీవం పొందారు. నామరూపాల్లే- కుండా నాశనమయ్యేవారు మోక్షం పొందారు. నిశ్చయంగా ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం.

ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం: తల్లిదండ్రుల పట్ల విధేయతగలవాడా! నీ సత్కార్యఫలం నీవు నీ సంతానంలో చూస్తావు. వారు సుగుణవంతులై, నిన్ను ప్రేమించేవారై, వారి తల్లి పట్ల ప్రేమ వాత్సల్యంతో మెలుగుతారు. నీవు చేసుకున్న పుణ్యానికి ఫలితం నీకు ఇహంలోనూ ఉంది. పరంలోనూ ఉంది.

ఇక తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడేవాడు -అల్లాహ్ కొరకు చెప్పండి- ఏమి సంపాదిస్తాడు? కేవలం దుర్భరమైన జీవితం, బిగుసుకుపోతున్న హృదయం, ఉపాధి విషయంలో అపశకునాలు, తన సంతానం నుండి ధూత్కారం. తల్లిదండ్రుల పట్ల కఠిన హృదయులుగా ఉండేవారు గనక అల్లాహ్ వైపునకు మరలకుంటే వారికి శాపమే పడుతుంది. తల్లిదండ్రులపై చేతులు లేపేవారు గనక అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయకుంటే వినాశనానికి గురవుతారు. కర్కశనోరు గలవారు గనక అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకోకుంటే నాశనమయిపోతారు.

అతడ్ని వాని తల్లి ఎంతో బలహీనతకు గురి అయి పెంచి పోషించింది. తన రక్తం (పాలుగా) అతనికి త్రాగించింది. తన మాంసం, ఎముకలను (కరిగించి) అతనికి ఆహారమిచ్చింది. అతడు బలపడుతూ ఉంటే తాను బలహీనపడుతుండేది. అతడు హాయిగా నిద్రిస్తుంటే తాను మేల్కొని ఉండేది. అతనికి చిన్న ఆపద ఎదురైనా ఆమె కళ్ళకు చీకటి క్రమ్ముకున్నట్లయ్యేది. అతను చిరునవ్వితే ఆమె ముందు జీవితమంతా చిరునవ్వులనిపించేది. అతని సుఖం కోసం తాను రుచికరమైన వాటిని వదిలేసేది. రుచికరమైన ఆహారాలు, ఆనందకరమైన త్రాగుపదార్థాలు అతనికి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చేదామె. అతడు చిన్నోడు గనక జోకొడుతూ ఉండేది కాని అతనిలో ఆమె పెద్ద ఆశలు చూసేది. శరీరం బలపడ్డాక, యుక్తవయస్సుకు చేరాక, నాలుక చకాచకా మాట్లడ్డం మొదలెట్టాక అతను కోరిన స్త్రీతో పెళ్ళి చేయించింది. అతని సంతోషంతో తాను సంతోషపడింది. అతనికంటే ఎక్కువ ఆనందపడింది. కాని…

ప్రియ సోదరా! టెలిఫోన్ మోగుతూ నా చెవులు గిల్లుమన్నాయి… ఇదేమిటి? బొంగురుపోయిన, ఏడుపుతో కూడిన ఓ శబ్దం వింటు- న్నాను… అస్థమ రోగి గురక లాంటి శబ్దం… హృదయవిదారక- మయిన ఏడుపు స్వరం… అది ఒక ముసలి తల్లి గొంతు, ఆమె తన కొడుకు అవిధేయత యొక్క వ్యధాభరితమైన సంఘటన నాకు ఇలా వినిపించసాగిందిః అతని తండ్రి గుండె ఆగిపోయి చనిపోయాడు. సుమారు పది సంవత్సరాల ఒక అబ్బాయి (అతని తమ్ముడు) నా వెంట ఉన్నాడు. నేను ఎన్నో దీర్ఘ కాలపు రోగాలకు గురయి ఉన్నాను. అతడు తన భార్యతో మీదంతస్తులో ఉన్నాడు. అతడు ఎప్పుడు క్రిందికి దిగి, నా దగ్గరి నుండి దాటినా నన్ను కించపరుస్తూ, అవమానపరుస్తూ, దూషించుకుంటూ వెళ్తాడు. అతని అనాథ తమ్ముడు ఎప్పుడైనా అతని కొడుకుతో కొట్లాడితే మరీ చెప్పరాని విధంగా అతని తమ్ముడ్ని కొడుతాడు. అసలే నేను ఒక రోగిని, పైగా వృద్ధురాలిని నేనెలా ఎదుర్కోగలుగుతాను. అంతే కాదు; తన రెండు చేతులతో తన తమ్ముడ్ని పట్టుకుంటాడు. అతని కొడుకు కాళ్ళు, చేతులతో మనస్సు తీరా అలసిపోయేంత వరకు కొడుతాడు. ఇలా తన తమ్ముని పట్ల సౌభ్రాత్రం, జాలి, దయ చూపే బదులు దౌర్భాగ్య, నిర్భంధ, దుర్భర స్థితి రుచి చూపిస్తూ వదలుతున్నాడు. అంతే కాదు ఒక్కోసారి నన్ను చూడవద్దని తన ముఖం కప్పుకుంటూ వెళ్తాడు. కఠోరంగా ‘నీవు నా తల్లే కావు’ అని అంటాడు. ఈ మాట వెనకే ఎలాంటి పదాలు వెళ్తాయంటే… ఎవరి మనస్సులోనైనా కనీస కారుణ్యం, కటాక్షం ఉన్నా అనలేడు. ఇంకా వాడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు…

ఇలాంటి వ్యదాభరితమైన మాటలు మన సురక్షిత సమాజం లో వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. కాని చాలా అరుదు, మరియు దౌర్భాగ్యం అంతే… బహుశా అతడు తన అలక్ష్యం నుండి మేల్కొంటాడు అని ఆమెకు నచ్చజెప్పగలిగాను. వెంటనే అందిః వద్దు, వద్దు, మీరు మాట్లాడకండి, నన్ను అతడి తమ్మున్ని మరింత బాధ పెడతాడేమోనని భయం అనిపిస్తుంది. అతని ముందు, అతని బలం, శక్తి ముందు నాదేం నడుస్తుంది. అప్పుడు నేను చెప్పానుః అయితే అతని గురించి కోర్టులో కేసు పెడతాను. ఇది విన్న వెంటనే గొంతెత్తుకుంటూ ఇలా అనసాగిందిః ‘కేసా!! నా కంటి చలువను గురించి నేను ఫిర్యాదు చేయాలా? నా చేతులతో పెంచినవాని మీద కేసు పెట్టాలా? నేను అతనికి పాలు పట్టలేదా? అతడు నా ప్రియకుమారుడు, అతడు నా జీవితపు చివరి ఆశ, అతనికి ఏదైనా అవమానం జరుగుతే నాకిష్టమేనా? నేను అతని సమస్య కరుణామయుడు, కృపాసాగరుని ముందు పెడతాను. ఆయనే అతనికి సన్మార్గం చూపుతాడు, అతని పరిస్థితి బాగుజేస్తాడు.

అప్పుడు నాకర్థమయింది; ఇదో గాయపడిన దీర్ఘ నిశ్వాసము. (ఎవరికైనా చెప్పుకొని) ఊపిరాడుటకు, భారం దించుకొనుటకు ఓ ప్రయత్నం ఆమె చేసింది.

లాఇలాహ ఇల్లల్లాహ్!! తల్లి గుండె ఎంతైనా ప్రేమ, కరుణతో నిండి ఉన్న గుండె. జాలి హృదయం.

ప్రియులారా! ఆ తర్వాత తెలిసింది; అతడు చాలా దుస్థితికి గురయ్యాడు, అతని నరాలు బిగుసుకుపోయేవి అని. అవును ఇందులో ఏలాంటి ఆశ్చర్యం లేదు. అతడు ఆనందకరమైన సత్కార్య తోట (తల్లిదండ్రుల విధేయత) దారి నుండి తప్పిపోయాడు. దానికి బదులుగా దౌర్భాగ్య యడారి అవిధేయత మైదానాన్ని కోరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు (అందులో కొట్టుమిట్టాడుతున్నాడు).

మనం ఇతరులతో గుణపాఠం నేర్చుకోవాలి. ఇతురలతో గుణ పాఠం నేర్చుకున్న వాడే భాగ్యవంతుడు.

6వ వనం: సంతాన సంరక్షన

ఈ తోట దారి చాలా పొడుగ్గా మరియు కష్టాలతో కూడి ఉంది. అయినా అందులో ఓ అలంకరణ, అందం ఉంది. దాని దూరం అలసట, ఆయాసానికి గురి చేస్తుంది. కాని దాని పర్యవసానం చాలా మంచిది, ప్రశంసనీయమైనది. సంతానం పచ్చని చిన్న చిన్న మొక్కల లాంటి వారు, వాటికి నీవు సద్వర్తన అనే నీటితో సాగు చేసి ఉంటే. అందమైన పూలు, వారికి నీవు మంచి శిక్షణ ఇచ్చి ఉంటే. మెరుస్తున్న ఇళ్ళు, విశ్వాస కాంతితో ప్రకాశించి ఉంటే. వారి శిక్షణ మార్గంలో ఓపిక వహించు, అప్పుడు నీవు నీ కళ్ళకు చలువగల, నీ మనస్సును సంతోషపెట్టే సమయం చూస్తావు. వారి ఒక్కసారి సాఫల్యం నీవు అనేక సార్లు భరించిన కష్టాల్ని మరిపిస్తుంది. వారి ఒక సంవత్సరపు విజయం నీవు సంవత్సరాల తరబడి చేసిన జాగారాలను మరిపిస్తుంది. వారి చిన్నతనంలో వారి గురించి నీవు కొంత శ్రమపడడం, వారు పెరిగిన తర్వాత మంచి అదృష్ట ఫలాన్నిస్తుంది. వారి దైనందిక స్కూల్ పాఠాలు (హోంవర్కులు), వారి శిక్షణ, వారి ఆరోగ్యం అన్నిట్లో నీవు శ్రద్ధ చూపు. నీవు నీ హృదయం, దేహంతో వారితో ఉండు. ఏదైనా కారణం వల్ల నీ అస్థిత్వంతో నీవు వారితో ఉండలేకపోతే కనీసం నీ మనస్సు, దుఆలతో. వారు నీ మెడలో న్యాసం అన్న విషయం తెలుసుకో. వారి పట్ల ఏలాంటి అశ్రద్ధ పాటించకు. ప్రవక్త ఆదేశాన్ని గమనించుః

(كُلُّكُمْ رَاعٍ وَكُلُّكُمْ مَسْؤُولٌ عَنْ رَعِيتِه)

మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతనితో ప్రశ్నింపబడును“. (బుఖారి).

కొన్ని సంవత్సరాల సంరక్షణ మరియు శ్రద్ధతో పుష్పవంతమైన, ఫలవంతమైన జీవితం లభిస్తుంది. కొన్నేళ్ళు నీవు సహనం వహించావంటే దాని ఫలితంగా వారు నీ ముందుకు వచ్చినప్పటికీ లోకమంత ఆనందంతో నిండిపోయినట్లు నీవు చూస్తావు. అప్పటికీ వారిలో ఒకడు ఇంజనీరింగ్ లో నైపుణ్యుడయి ఉంటాడు. లేదా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. లేదా ఏదైనా పనిలో మంచి నేర్పు గలవాడు (లేదా మ్యానుఫాక్చరర్ గా) అయి ఉంటాడు. లేదా ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడవుతాడు. లేదా సౌభాగ్యవంతుడైన బోధకుడవుతాడు. వీటన్నిటితో పాటు వారు నీ పట్ల మేలు చేస్తూ ఉంటారు. మరీ నీవు వారి సంస్కారం మరియు ధర్మనిష్ఠతతో సంతోషపడుతూ ఉంటావు. ఇంతకంటే ఐహిక అలంకారం ఇంకేమి కావాలి. ఇది రహ్మాన్ దాసుల దుఆల ఫలితం:

[وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا] {الفرقان:74}

వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారుః మా ప్రభూ! మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు, మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయు. (ఫుర్ఖాన్ 25: 74).

మంచి శిక్షణ తోట ద్వారా నీవు ఏరుకునే ఫలం ఇంతే కాదు; నీవు చనిపోయిన తర్వాత నీ సంతానం దుఆలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(إِذَا مَاتَ الإنسانُ انقَطَعَ عَمَلُهُ إلاّ مِن ثَلاثٍ: إلاّ مِن صَدَقةٍ جَارِيةٍ، أَو عِلمٍ يُنتَفَعُ بِه،ِ أَو وَلَدٍ صَالِحٍ يَدعُو لَهُ)

“మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణలు అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. (1) సదఖ జారియ (సుదీర్ఘ కాలం వరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం) (2) ప్రయోజనకరమయిన విద్యాజ్ఞానం. (3) అతనికై ప్రార్థించే ఉత్తమ సంతానం. (ముస్లిం).

దాని ఫలం అల్లాహ్ దయతో స్వర్గంలో ఉన్నత స్థానం రూపం లో కూడా నీకు ప్రాప్తమవుతుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(إِنَّ اللهَ عَزَّ وَجَلَّ لَيَرْفَعُ الدَّرَجَةَ لِلْعَبْدِ الصَّالِحِ فِي الْجَنَّةِ فَيَقُولُ يَا رَبِّ أَنَّى لِي هَذِهِ فَيَقُولُ بِاسْتِغْفَارِ وَلَدِكَ لَكَ)

అల్లాహ్ స్వర్గంలో పుణ్యపురుషునికి ఒక స్థానం పెంచుతాడు. అతడంటాడుః ప్రభూ! ఏ కారణంగా నాకిది ప్రాప్తమయింది? అప్పుడు అల్లాహ్ అంటాడుః నీ సంతానం నీ పాపాల క్షమాభిక్ష కోరుతున్నందు వల్ల“. (అహ్మద్, దీని సనద్ హసన్).

శిక్షణ శిబిరం దాని ఛాయ ఎంత అందమైనది! ! అందుకే మంచి కృషి చేస్తూ దానిపై నిలకడగా ఉండు. అప్పుడే నీవు అందమైన ఫలాలు పొందగలుగుతావు.

7వ వనం: ముస్లింల కొరకు సిఫారసు చేయుట

ఈ వనం, దీని యొక్క ఆచరణలో మన నుండి చాలా అలసత్వం జరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

[مَنْ يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُنْ لَهُ نَصِيبٌ مِنْهَا] {النساء:85}

మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. (నిసా 4: 85).

ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం; నీవు చేసే మంచి సిఫారసుకు బదులుగా ఓ వాట మేలు నీకు లభిస్తుంది. ఇంకా నీవు చేసిన సిఫారసు యొక్క పుణ్యం అదనంగా ఉంటుంది. తన సోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నవ్వక్తికి ఇవి అల్లాహ్ వాగ్దానాలు. అతను ఈ ప్రేమకు ప్రతీకగా చురుకతనంతో తన శక్తానుసారం తన పరపతి, మాట ద్వారా వారి అవసరాలు పూర్తి చేస్తాడు. సహీ హదీసులో ప్రవక్త ﷺ ఇలా ప్రవచించినట్లు ఉందిః

(الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا ثُمَّ شَبَّكَ بَيْنَ أَصَابِعِهِ وَكَانَ النَّبِيُّ ﷺ جَالِسًا إِذْ جَاءَ رَجُلٌ يَسْأَلُ أَوْ طَالِبُ حَاجَةٍ أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ فَقَالَ اشْفَعُوا فَلْتُؤْجَرُوا وَلْيَقْضِ اللهُ عَلَى لِسَانِ نَبِيِّهِ مَا شَاءَ)

“విశ్వాసులు పరస్పరం కట్టడంలా రూపొందాలి; అందులోని ఒక ఇటుక మరో ఇటుకతో కలసి బలపడినట్లు. మళ్ళీ ప్రవక్త ﷺ తమ ఒక చేతి వ్రేళ్ళను మరో చేతి వ్రేళ్ళలో జొప్పించి కలిపి చూపించారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుండి ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఏదో ప్రశ్నిస్తూ లేదా ఏదో అవసరం గురించి అడుగుతూ వచ్చాడు. అది విన్న ప్రవక్త ﷺ వెంటనే మా వైపు తిరిగి “సిఫారసు చేయండి పుణ్యం పొందండి, అల్లాహ్ తలచుకుంటే తన ప్రవక్త నోట వెలవడిన మాటను పూర్తి చేస్తాడు” అని అన్నారు. (బుఖారి 6028, ముస్లిం 2585, 2627).

ప్రియ సోదరా! నీ సిఫారసు అంగీకరింపబడకపోయిన, లేదా నీ కోరిక పూర్తి కాకపోయినా నీవు చేసిన సిఫారసుకు బదులుగా నీకు పుణ్యం లభించుట సరిపోదా?. ఇందులో నీకు ఆదర్శం ప్రియ ప్రవక్త ﷺ. ఆయన సిఫారసు చేశారు, అయినా అది అంగీకరింప బడలేదు. ఇబ్ను అబ్బాస్  ఉల్లేఖనం ప్రకారం: బరీర అను ఒక స్త్రీ యొక్క భర్త బానిసగా ఉండేవాడు. అతని పేరుః ముఘీస్ . అతను తన భార్య బరీరా వెనక వెనకనే తిరుగుతూ ఉండేవాడు. ఆమె కూడా బానిసగా ఉండినది. అయితే ఆమెకు విముక్తి ఇవ్వ బడింది. కాని అతడికి విముక్తి లభించలేదు. అందుకు ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోదామని నిర్ణయించింది. (కాని అతనికి బరీరా అంటే ఎనలేని ప్రేమ). అందుకు అతను చాలా ఏడుస్తూ ఉండేవాడు. అతని అశ్రువులు గడ్డం మీద పారుతూ ఉండేవి. అప్పుడు ప్రవక్త ﷺ అబ్బాస్ తో ఇలా చెప్పారుః

(يَا عَبَّاسُ أَلَا تَعْجَبُ مِنْ حُبِّ مُغِيثٍ بَرِيرَةَ وَمِنْ بُغْضِ بَرِيرَةَ مُغِيثًا) فَقَالَ النَّبِيُّ ﷺ لَوْ رَاجَعْتِهِ، قَالَتْ: يَا رَسُولَ الله تَأْمُرُنِي قَالَ: (إِنَّمَا أَنَا أَشْفَعُ) قَالَتْ: لَا حَاجَةَ لِي فِيهِ

“బరీరా పట్ల ముఘీస్ ప్రేమ మరియు ముఘీస్ పట్ల బరీరా ద్వేషాల్ని చూస్తే విచిత్రం అనిపించడం లేదా?” (ఆ సందర్భంలో) ప్రవక్త బరీరాతో చెప్పారుః “నీవు తిరిగి ముఘీస్ తో ఉంటే బావుంటుంది” అని. అప్పుడు బరీరా అడిగిందిః ప్రవక్తా! మీరు ఆదేశిస్తున్నారా? అని. అందుకు ప్రవక్త చెప్పారుః “లేదు, నేను సిఫారసు చేస్తున్నాను”. “నాకు అతని అవసరం లేదు” అని బరీరా నిక్కచ్చిగా చెప్పేసింది. (బుఖారి 5283).

అనుభవం చేసి చూడు; ప్రజల్లో ఎవరికైనా అతని ఓ అవసరం లో సిఫారసు చేయి. నీ సోదరుడ్ని సంతోష పెట్టిన సత్కార్యం నీ గుండెను ఎలా చల్లబరుచుతుందో, అతని దుఆ వల్ల నీ హృదయానికి ఎంత సంతోషం కలుగుతుందో తెలుస్తుంది. అది క్షణం పాటు శ్రమ కావచ్చు కాని దీర్ఘ కాల సంతోషాన్ని తెస్తుంది. ఓ గడియ సమయం వెచ్చించుటయే కావచ్చు కాని సుఖుసంతోష జీవితానికి కారణం అవుతుంది.

8వ వనం: ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించుట

[إِنَّمَا المُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ وَاتَّقُوا اللهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ]  {الحجرات:10}

విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి, మీపై దయచూపటం జరగవచ్చు. (హుజురాత్ 49: 10).

సోదరా! మంచి మనస్సులు అనైక్యత, భిన్నత్వం అంటే సహించవు, ఇష్టపడవు. అవి స్వచ్ఛత, పవిత్రతను ఇష్టపడని నైర్మల్యానికి దూరంగా కలుషితమైన సమాజంలో అవి దాన్ని లెక్కిస్తాయి. అందుకే అవి (మంచి మనస్సులు) పవిత్ర ఛాయలోనే నీడ వెతుకుతూ ఉంటాయి. సౌభ్రాతృత్వంతో వీచే గాలితోనే ప్రీతి చెందుతాయి. ప్రేమ పచ్చిక మరియు అనురాగ పుష్పాల మధ్యే తృప్తి చెందుతాయి. అందుకే ప్రేమంగా ఉండేవారి మధ్య ద్వేషాల తుఫాను గాలి వీస్తున్నప్పుడు మంచి మనస్సుగలవాడు తృప్తిగా ఉండలేని విషయం నీవు చూస్తావు. అప్పుడు అతడు శాంతిపావురం మాదిరిగా తహతహలాడుతూ హృదయాల్లో ప్రేమ, మనస్సులో నైర్మల్యం తిరిగి రానంత వరకు నిద్రపోడు. పరస్పరం సత్సంబంధాలు లేని వారి మధ్య రాజీ కుదిర్చే వ్యక్తి ఎంత చల్వ హృదయుడు. ఈ శ్రేయోభిలాషిది ఎంత మంచి మనస్సు.

ఈ తోట ఫలం అల్లాహ్ సంతృష్టితో పాటు గొప్ప పుణ్యం కూడాను.

[لَا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَاحٍ بَيْنَ النَّاسِ وَمَنْ يَفْعَلْ ذَلِكَ ابْتِغَاءَ مَرْضَاةِ اللهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا] {النساء:114}

ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (నిసా 4: 114).

నీ సోదరుల మధ్య రాజీ కుదిర్చే పని దుఆతో ఆరంభించు. ఇలా దుఆ చెయిః అల్లాహ్ ఈ మేలు కొరకు వారి హృదయాలను తెరువుగాక! అల్లాహ్ ఇలా అంటున్నాడుః [وَالصُّلْحُ خَيْر] ]రాజీ కుదుర్చడంలోనే ఎంతో మేలుంది[.

వేరు వేరు దృక్పథాల్ని దగ్గర చేసే, విభేదాల కారణాల్ని తక్కువ చేసే ప్రయత్నం చేయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలుగజేయి. ప్రతి ఒక్కరికి రెండోవాడు అతనితో చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడని, అతనిలో నీ మీద ఏలాంటి ద్వేషం, కపటం లేదని తెలియజేయి. ఇందులో నీకు కొంత అబద్ధం చెప్పవలసి వచ్చినా పరవాలేదు. (ఈ అబద్ధం అనుమతి కేవలం రాజీ కుదర్చడానికే సుమా, మరే దానికి కాదు). ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః

(لَيْسَ الْكَذَّابُ الَّذِي يُصْلِحُ بَيْنَ النَّاسِ فَيَنْمِي خَيْرًا أَوْ يَقُولُ خَيْرًا)

“ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే ఉద్దేశ్యంతో ఒకరి సద్గుణాలు మరొకరి ముందు వ్యక్తపరిచేవాడు లేదా ఒకిర్ని గురించి ఏదైనా మంచి విషయాన్ని మరొకరి ముందు వెలిబుచ్చేవాడు అబద్ధాలకోరు కాజాలడు”. (బుఖారి 2692, ముస్లిం 2605).

సోదరుల మధ్య సంధి కుదర్చడం కూడా ఓ సత్కార్యమే. అందుకు ఈ పని చేస్తూ పుణ్యాన్ని ఆశించడం మరచిపోకు. అదే సద్భాగ్య రహస్యం. సంధి కుదుర్చడానికి తాళంచెవి లాంటిది. స్వీకృతికి సబబు. ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః

(كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ يَعْدِلُ بَيْنَ الِاثْنَيْنِ صَدَقَةٌ)

“సూర్యుడు ఉదయించే ప్రతిదినమూ ఇద్దరి మధ్య న్యాయబద్ధంగా సంధి కుదుర్చడం కూడా సత్కార్యమే”. (బుఖారి 2989, ముస్లిం 1009).

9వ వనం: ప్రచారం, శిక్షణ

అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయ వంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.

ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.

సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.

[فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ

حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ المُتَوَكِّلِينَ] {آل عمران:159}

(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).

నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.

నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.

నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

[ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالحِكْمَةِ وَالمَوْعِظَةِ الحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالمُهْتَدِينَ] {النحل:125}

నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో (నహ్ల్ 16: 125).

నీ బాధ్యత సందేశం అందజెయ్యడమే.

[وَمَا عَلَينَا إِلَّا الْبَلَاغُ الْـمُبِين]. {يس 17}

స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత. (యాసీన్ 36: 17). హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.

[ذَلِكَ هُدَى اللهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ وَمَنْ يُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ] {الزُّمر:23}

ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు (జుమర్ 39: 23).

నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.

ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్  ఇలా ఉల్లేఖించారుః

 (كَانَ غُلَامٌ يَهُودِيٌّ يَخْدُمُ النَّبِيَّ ﷺ فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ ﷺ يَعُودُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُئ أَسْلِمْ فَنَظَرَ إِلَى أَبِيهِ وَهُوَ عِنْدَهُ فَقَالَ لَهُ أَطِعْ أَبَا الْقَاسِمِ ﷺ فَأَسْلَمَ فَخَرَجَ النَّبِيُّ ﷺ وَهُوَ يَقُولُ الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْقَذَهُ مِنْ النَّارِ)

ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు అన్నారు. (బుఖారి 1356).

తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్  కు కైబర్ రోజున ఇలా చెప్పారుః

 (ادْعُهُمْ إِلَى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ فَوَالله لَأَنْ يُهْدَى بِكَ رَجُلٌ وَاحِدٌ خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ)

వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం“. (బుఖారి 2942).

ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.

ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కా- ర్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.

అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini): నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని.

ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః

[وَمَنْ يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الآَخِرَةِ مِنَ الخَاسِرِينَ]

{آل عمران:85}

ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85). అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.

10వ వనం: ఉపవాస విరమణ (ఇఫ్తార్ చేయించుట)

కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రనా. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(مَنْ فَطَّرَ صَائِمًا كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ غَيْرَ أَنَّهُ لَا يَنْقُصُ مِنْ أَجْرِ الصَّائِمِ شَيْئًا)

ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్న వారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).

ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.

నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నర నరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కి చన్నీళ్ళు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.

వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళార నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.

(إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ فَليُنَاوِلْهُ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ أَوْ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ فَإِنَّهُ وَلِيَ عِلَاجَهُ)

మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు”. (బుఖారి 2557, ముస్లిం 1663).

11వ వనం: పేద రుణగ్రస్తునికి సౌలభ్యం కలుగజేయుట

ప్రియసోదరా! అల్లాహ్ నీపై తన ప్రత్యేక అనుగ్రహాన్ని అనుగ్రహించి ఉంటే డబ్బు అవసరం గల ఓ సోదరునికి నీవు సహాయం చేసి ఉంటే, అతడు నీ సొమ్ము తిరిగి ఇవ్వడానికి నీవు అతనిపై ఒత్తిడి తీసుకువచ్చి నీవు చేసుకున్న శుభప్రదమైన బహుమానాన్ని పాడుచేసుకోకు. అతనికి సౌలభ్యం కలుగజేయి. అతని వ్యవధిని కొంత పొడిగించు. అతన్ని ఎత్తిపొడచి, హెచ్చరించి లేదా మాటిమాటికి అడిగి నీ దానాన్ని కలుషితం చేయకు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః

(مَنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ يَسَّرَ اللهُ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ)

ఎవరు పేదరుణగ్రస్తునికి సౌలభ్యం కలుగుజేస్తారో అల్లాహ్ అతనికి ఇహపరాల్లో సౌలభ్యం కలుగజేస్తాడు“. (ముస్లిం 2699).

అతనికి వ్యవధి ఇవ్వడమే కాకుండా కొంత అప్పు అతని నుండి మాఫీ చేసి, అంటే ఇచ్చేదానికంటే మరీ తక్కువ తీసుకొని నీ ఈ ఉపకారతోటను మరింత అందంగా చేసుకో. ఇలా నీవు పుణ్యం సంపాదించుకొని ముందు నీపై గొప్ప ఉపకారం చేసినవాడివి అవుతావు. ఆ తర్వాత అతని భారాన్ని దించి అతని పట్ల ఉపకారం చేసినవాడివవుతావు. ప్రవక్త ﷺ ఇలా చెప్పారు:

(مَنْ سَرَّهُ أَنْ يُنْجِيَهُ اللهُ مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ فَلْيُنَفِّسْ عَنْ مُعْسِرٍ أَوْ يَضَعْ عَنْهُ)

“అల్లాహు తఆలా పరలోక కష్టాల నుండి కాపాడి, మోక్షం ప్రాప్తిం- చాలని ఎవరికి ఇష్టమో వారు పేద రుణగ్రస్తునికి తగినంత వ్యవధి ఇవ్వాలి.లేదా అతని అప్పును మాఫీ చేయాలి”. (ముస్లిం 1563).

మనం ఇహలోక సుఖం గురించి ఎంతో పాకులాడుతాము. కాని దాని వరకు చేర్పించే సరియైన దారిని తప్పిపోతాము. లేదా ఇలాంటి దైవమార్గాల్లో సుఖం ఉండదని భ్రమ చెందుతాము. అయితే ఇక నుండి అల్లాహ్ తన గ్రంథంలో మరియు ప్రవక్త తమ నోట చేసిన వాగ్దానాలను పూర్తి విశ్వాసంతో నమ్మాలి. అప్పుడే మనం ఇహపరాల సుఖాన్ని పొందగలుగుతాము.

12వ వనం: అల్లాహ్ మార్గంలో పోరాడేవ్యక్తి మరియు అతని ఇంటివారి అవసరాలు తీర్చుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

مَنْ جَهَّزَ غَازِيًا فِي سَبِيلِ اللهِ فَقَدْ غَزَا وَمَنْ خَلَفَ غَازِيًا فِي سَبِيلِ اللهِ بِخَيْرٍ فَقَدْ غَزَا

అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి కావలసిన సామాగ్రి సమకూర్చేవాడు యోధునిగా పరిగణింపబడతాడు, అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుని ఇంటివారి అవసరాలు తీర్చేవాడు కూడా యోధునిగా పరిగణింపబడతాడు“. (బుఖారి/ ఫజ్లు మన్ జహ్హజ గాజియ…2843, ముస్లిం/ ఫజ్లు ఇఆనతిల్ గాజీ…1895).

నీవు (బైటికి వెళ్ళకుండా) నీ ఇంటివారి మధ్య ఉండి, ఈ సత్కార్య వనం ద్వారా అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి సమానమైన పుణ్యం పొందుతావు. అందుకై నీవు ఆ యోధుని కుటుంబాన్ని కనిపెట్టుకుంటూ, తండ్రి లాంటి ప్రేమ, అప్యాయత చూపుతూ, వారి అవసరాలు తీరుస్తూ ఉండు.

13వ వనం: దారి నుండి ఇబ్బంది కలిగించే వాటిని తొలగించుట

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

(وَتُـمِيطُ الأذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ)

దారి నుండి అవస్త కలిగించే వస్తువును దూరం చేయుట ఒక సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).

ఈ పని కేవలం పాకీవాళ్ళు మరియు (మున్సిపాలిటీకి సంబంధించిన) సఫాయివాళ్ళదే కాదు. వాస్తవానికి ఇది మనందరి పని. ఈ సత్కార్యంలో మనం వెనకబడి దాని అవసరం లేనట్లుగా భావించాము. మరికొందరు మనలో ఈ పనికి అతీతులుగా భావించి ఈ పనిని నీచంగా చూడసాగారు. కాని అల్లాహ్ వద్ద దాని స్థానం చాలా గొప్పగా ఉంది. దాని బహుమానం ఎంతో విలువైనది. ప్రవక్త ﷺ తెలుపుతున్న ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా పఠించు:

(مَرَّ رَجُلٌ بِغُصْنِ شَجَرَةٍ عَلَى ظَهْرِ طَرِيقٍ فَقَالَ وَاللهِ لَأُنَحِّيَنَّ هَذَا عَنْ الْمُسْلِمِينَ لَا يُؤْذِيهِمْ فَأُدْخِلَ الْجَنَّةَ)

ఒక వ్యక్తి దారికి అడ్డంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ దగ్గర్నుంచి వెళుతూ, ‘అల్లాహ్ సాక్షిగా! ఇది ముస్లిములకు బాధ కలిగించ కుండా నేను దీన్ని ఇక్కడి నుండి దూరం చేస్తాను’ అని (దూరం చేసేశాడు కూడా, అందుకు) అతణ్ణి స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది“. (ముస్లిం 1914, బుఖారి 2472).

ఒక చెట్టు కొమ్మ, నీవు దారి నుండి తీసి పక్కకు వేస్తే, దాని ఫలితం భూమ్యాకాశాల వైశాల్యముగల స్వర్గం. ఇవి పుణ్య వనాలు, సత్కార్య తోటలు. మన ప్రభువు ఉదారుడు మరియు దయాశీలుడు.

14వ వనం: మంచి మాట

ప్రియసోదరా! నీవు దానధర్మాలు చేసేంత పొడుగుగా నీ చేయి లేనట్లయితే, నీ సమయం, నీ హోదా, నీ శక్తి సామర్థ్యాలను వ్యయం చేసి నీ తోటి సోదరులకు సహాయపడలేకపోతే, ఇంకే విధంగానైనా వారికి మేలు చేకూర్చలేక పోతే కనీసం ఒక మంచి మాట మాట్లాడడంలో వెనకాడకు. ఇది చాలా గొప్ప విషయం. దీని ద్వారా నీ ప్రభువును సంతోష పెట్టగలుగుతావు. నీ సోదరుడ్ని ఓదార్చగల్గుతావు. లెక్కలేనన్ని పుణ్యాలు సంపాదించుకోగల్గుతావు. ప్రవక్త ﷺ చెప్పారుః

(وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ)

మంచి మాట కూడా సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).

15వ మరియు చివరి వనం: ప్రజలకు బాధ కలిగించకుండా ఉండుట

సత్కార్య వనాలు అనేకం. వాటిలో అల్లాహ్ దయ చాలా ఎక్కువ. మేలైన మార్గాలు అనేకం. వ్రాస్తూపోతే స్థలం (కాగితం) సరిపోదు. సమయం తోడివ్వదు. కొంత మార్గం చూపడం కూడా సరిపోతుంది. అల్లాహ్ గ్రంథంలో, ప్రవక్త ﷺ హదీసుల్లో మన రోగ నివారణ చాలా ఉంది. పోతే కొందరు స్వయం తమ పట్ల లోభిగా ప్రవర్తిస్తారు. పిసినారిగా మెదులుతారు. ఆ మేలు తమ సోదరుల వరకు చెందకుండా మసలుకుంటారు. కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా మేలు చేయరు. దానికి వారు తమ శరీరంలోని నాలుకను కదలించడం తప్ప మరేమీ చేయనక్కరలేదు. కాని ఏ మేలు చేయరు. మంచి మాట మాట్లాడరు. అలాంటి వారికి చెప్పడానికి మిగిలింది ఇక ఒకే విషయం: మీరు కనీసం మీ పట్ల మేలు చేసుకోండి. ప్రజలకు హాని కలగకుండా మెదులుకోండి. తమ వాక్కర్మ ద్వారా బాధ కలిగించకండి. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

عَنْ أَبِي ذَرٍّ  قَالَ سَأَلْتُ النَّبِيَّ ﷺ أَيُّ الْعَمَلِ أَفْضَلُ؟ قَالَ: (إِيمَانٌ بِاللهِ وَجِهَادٌ فِي سَبِيلِهِ قُلْتُ: فَأَيُّ الرِّقَابِ أَفْضَلُ قَالَ: (أَعْلَاهَا ثَمَنًا وَأَنْفَسُهَا عِنْدَ أَهْلِهَا) قُلْتُ فَإِنْ لَمْ أَفْعَلْ قَالَ: (تُعِينُ ضَايِعًا أَوْ تَصْنَعُ لِأَخْرَقَ) قَالَ: فَإِنْ لَمْ أَفْعَلْ قَالَ: (تَدَعُ النَّاسَ مِنْ الشَّرِّ فَإِنَّهَا صَدَقَةٌ تَصَدَّقُ بِهَا عَلَى نَفْسِكَ)

“ఏ ఆచరణ చాలా శ్రేష్ఠమైనద”ని నేను ప్రవక్త ﷺని అడిగాను. “అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన మార్గంలో యుద్ధం చేయడం” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. “ఏలాంటి బానిసకు స్వేచ్ఛ కలిగించడం ఉత్తమం” అని అడిగాను. దానికి ప్రవక్త ﷺ అన్నారుః “ఎక్కువ ధర గలవాడికి మరియు యజమాని వద్ద ఉత్తమంగా ఉన్నవాడిని విముక్తి కలిగించడం”. “ఇది చేసే శక్తి లేనిచో ఎలా?” అని అడిగాను. “కష్టంలో ఉన్నవానికి సహాయం చేయు, పనిరాని వానికి పని చేసిపెట్టు” అని చెప్పారు ప్రవక్త. అది కూడా నేను చేయలేక పోయాననుకోండి, అప్పుడు? అని ప్రశ్నించినందుకు ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “ప్రజలకు నీ నుండి ఏ కీడు కలగకుండా జాగ్రత్తపడు. ఇది కూడా ఒక సదకా (సత్కార్యం). నీవు స్వయంగా నీపై సదకా చేసినవానివి అవుతావు”. (బుఖారి 2518, ముస్లిం 84).

సత్కార్య వనాలకు చేర్పించే 5 మార్గాలు

ఇవి సంక్షిప్త మార్గాలు. అల్లాహ్ దయతో వీటి ద్వారా నీవు నిన్ను మరియు నీవు చేసే సత్కార్యం వృధా కాకుండా కాపాడు కోవచ్చు.

1- నీవు చేసే ప్రతి కార్యంలో అల్లాహ్ సంతృప్తిని మాత్రమే కోరు. ప్రవక్త పద్ధతిని అనుసరించు. ఏ ఆచరణ అయినా ఈ రెండు షరతులు లేనివే సత్కార్యం కాదు.

[فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا]

]కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కా- ర్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు[. (కహఫ్ 18: 110).

2- ఏ సత్కార్యం గురించి విన్నా దానిని ఆచరించడంలో ఆలస్యం చేయకు. సంతోషంతో, ఇష్టాపూర్వంగా సద్మనస్సుతో ముందడుగు వేయి. ఇది దైవభీతి చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[وَسَارِعُوا إِلَى مَغْفِرَةٍ مِنْ رَبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَوَاتُ وَالأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ]

మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైనది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది (ఆలి ఇమ్రాన్ 3: 133).

దైవాదేశాల పాలనకు త్వరపడే ఓ అరుదైన సంఘటన శ్రద్ధగా చదవండిః అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ﷜నఫిల్ నమాజు చేస్తూ ఉన్నారు. నాఫిఅ అను ఆయన బానిస ప్రక్కనే కూర్చుండి, ఆయన ఏదైనా ఆదేశమిస్తే దాని పాలనకు వేచిస్తూ ఉన్నాడు. స్వయంగా నాఫిఅ ఓ గొప్ప పండితులు, ప్రఖ్యాతి గాంచిన హదీసు గ్రంథం మువత్త ఇమాం మాలిక్ యొక్క ఉల్లేఖకుల్లో ఒకరు. అతనిలో ఉన్న ఉన్నత గుణాల వల్ల అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అతణ్ణి చాలా ప్రేమించేవారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నమాజులో ఖుర్ఆన్ పఠిస్తూ]మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు[. (ఆలిఇమ్రాన్ 3: 92). చదివినప్పుడు వెంటనే తన చెయితో సైగ చేశాడు. ఆదేశపాలనకై సిద్ధంగా ఉన్న నాఫిఅకు ఆయన ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేక పోయింది. అర్థం చేసుకొనుటకై ఎంతో ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోయింది. అందుకు ఆయన సలాం తిప్పే వరకు వేచించి, ఎందుకు సైగ చేశారు? అని అడిగాడు. దానికి అబ్దుల్లాహ్ ఇలా సమాధానం చెప్పారు “అమితంగా నేను ప్రేమించే వస్తువులు ఏమిటని ఆలోచిస్తే నీవు తప్ప నాకు ఏదీ ఆలోచన రాలేదు. అయితే నేను నమాజులో ఉండగానే నీకు స్వేచ్ఛ ప్రసాదించుటకు సైగ చేయడమే మంచిదిగా భావించాను. నమాజు అయ్యే వరకు వేచిస్తే బహుశా నా కోరిక, వాంఛ ఆధిక్యత పొంది ఈ నిర్ణయానికి వ్యతిరేకం జరుగుతుందని భయం అనిపించింది. అందుకే వెంటనే సైగ చేశాను. ఈ మాటను విన్న నాఫిఅ వెంటనే “మీ సహచర్యం లభిస్తుంది కదా”? అని అడిగాడు. అవును నీవు నాతో ఉండవచ్చు అన్న హామీ ఇచ్చారు అబ్దుల్లాహ్.

3- అల్లాహ్ నీకు ఏదైనా సత్కార్యం చేసే భాగ్యం నొసంగాడంటే దానిని మంచి విధంగా సంపూర్ణంగా చేయుటకు ప్రయత్నించు.

[لِلَّذِينَ أَحْسَنُوا الحُسْنَى وَزِيَادَةٌ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ أُولَئِكَ أَصْحَابُ الجَنَّةِ هُمْ فِيهَا خَالِدُونَ] {يونس:26}

మంచి పనులు చేసే వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ అవమానం గానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడే శాశ్వతంగా ఉంటారు (యూనుస్ 10: 26).

నీ అవసరం ఎవరికి పడిందో అతని స్థానంలో నీవు నిన్ను చూసుకో, అప్పుడు ప్రవక్త ఈ ఆదేశాన్ని కూడా దృష్టికి తెచ్చుకోః

 (لَا يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ)

మీలో ఒకరు తాను తన గురించి కోరుకున్నట్లు తమ సోదరుని గురించి కోరనంత వరకు విశ్వాసి కాజాలడు“. (బుఖారి 13, ముస్లిం 45).

4- చేసిన పుణ్యాన్ని గుర్తు చేసుకోకు. ఎవరి పట్ల ఆ కార్యం చేశావో అతన్ని ఎత్తిపోడవకు, హెచ్చరించకు. దాని గురించి మరెవరికో చెప్పుకోబోకు. ఏదైనా ఔచిత్యం ఉంటే తప్ప. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది గమనించుః

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالمَنِّ وَالأَذَى] {البقرة:264}

విశ్వాసులారా! మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయ- పరచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. (బఖర 2: 264).

నీవు చేసిన దాన్ని అల్లాహ్ వద్ద నీ త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఎవరి పట్ల నీవు మేలు చేశావో వారు దాన్ని తిరస్కరించినా పరవా లేదు.

5- నీ పట్ల ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయి. అది కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా సరే. అల్లాహ్ దయ తర్వాత నీవు సత్కార్యం చేయునట్లు ఇది నీకు తోడ్పడుతుంది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

[وَلَا تَنْسَوُا الفَضْلَ بَيْنَكُمْ] {البقرة:237}

మీరు పరస్పర వ్వవహారాలలో ఔదార్యం చూపడం మరవకండి (బఖర 2: 237).

చివరిలో:

ఇవి కొన్ని సత్కార్యవనాలు, సత్కార్యతోటలు. అవి చేయుటకు సుగమమైన మార్గం ఉంది. ద్వారాలు తెరువబడి ఉన్నాయి. మంచి ఫలాలు ఉన్నాయి. ఇహపరాల్లో ఉత్తమమైన ఫలితాలూ ఉన్నాయి. ఓ అల్లాహ్! నీకు ఇష్టమైనవి, నీవు కోరినవి చేసే సద్భాగ్యం మాకు ప్రసాదించమని, మాకు స్వర్గం ప్రసాదించి, నరకం నుండి కాపాడమని నీతో వేడుకుంటున్నాము. నీ మార్గంలో అత్యంత కృషి సలుపుతున్నవారికి, నీ మార్గంలో పోరాడుతున్న వారికి సహాయం చేయి. అల్లాహ్ వారి గురి సరిచేయి. వారి సామాగ్రిలో శుభం కలుగజేయి. వారి బలం రెట్టింపు చేయి. వారిలోని రోగు లకు స్వస్థత ప్రసాదించు. అమరవీరులైనవారిని నీవు అంగీకరించు. వారిలోని బలహీనులకు అతిఉత్తమ సహాయకునివిగా అయిపో. ఓ అల్లాహ్ ఆక్రామకులైన యూదుల పంజా నుండి మస్జిద్ అక్సాను విడిపించు. ఓ అల్లాహ్ యూదులకు, వారికి తోడ్పడే వారికి ఓటమి పాలు చేయి. వారి మధ్య విభేదాలు పుట్టించు. వారిలో అనైక్యత ఏర్పరచు. వారిని ఇస్లాం మరియు ముస్లిముల కొరకు లాభకరంగా చేయి. అల్లాహ్ మా దేశంలో ప్రత్యేకంగా, తద్వారా ముస్లిములు జీవించే ప్రతి చోట శాంతిభద్రతలు వర్థిల్లునట్లుగా చేయి. అల్లాహ్ నీవు ప్రసాదించిన మా భార్య, సంతానం, సంపాదనల్లో శుభం కలుగజేయి. వారిని ఇహపరాల్లో మా కళ్ళకు చల్లదనంగా చేయి. అల్లాహ్! మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని, ముస్లిము- లందరిని క్షమించు. నిశ్చయంగా నీవు వినేవానివి, అంగీకరించేవానివి.

తౌబా (పశ్చాత్తాపం) [పుస్తకం]

repent-too-late

పశ్చాత్తాపం- Toubah – Repentence
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [34 పేజీలు]
[2 MB]

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

విషయ సూచిక :

క్రింది చాఫ్టర్లు PDF లింకులుగా ఇవ్వబడ్డాయి

  1. తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత [11p]
  2. తౌబా నిబంధనలు [3p]
  3. తౌబా విధానాలు [3p]
  4. సత్యమైన తౌబా [3p]
  5. తౌబా చేయుటకు సహాయపడే విషయాలు [3p]
  6. పాప పరిహారాలు [4p]
  7. ప్రశ్నోత్తరాలు [9p]
    1. పాపాలు చాలా ఎక్కువగా ఉంటే ఎలా తౌబా చేయాలి?
    2. స్నేహితులు అడుకున్నప్తుడు ఎలా తౌబా చేయాలి?
    3. స్నేహితులు అవమానపరుస్తారన్స్న భయంలో ఎలా తౌబా?
    4. తౌబా చేసిన తర్వత అదే తప్పు మళ్ళీ జరిగితే ఎలా?
    5. ఒక పాపం చేస్తూ వేరే పాపం నుండి తౌబా చేయవచ్చా?
    6. గతంలో తప్పిపోయిన నమాజు, ఉపవాసాలు… ఎలా?
    7. సొమ్ము దొంగతనం చేసిన ఉంటే ఎలా తౌబా చేయాలి?
    8. వ్యభిచారానికి పాల్యడిన వ్వక్తి ఎలా తౌబా చేయాలి?
    9. వివాహానికి ముందు జరిగిన తప్పు గురించి చెప్పాలా?
    10. పురుషులు పరస్పరం, స్త్రీలు పరస్పరం చెడుకు పాలడితే ఎలా?

ప్రియ సోదరా/సోదరీ ! ఒక తల్లి తన చంటి పిల్ల పట్ల చూపే ప్రేమకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అల్లాహ్ తన దాసుల పట్ల చూపుతాడు  అని గుర్తుంచుకో !! తన తౌబాలో  సత్యవంతుడైన వ్యక్తిని అల్లాహ్ తప్పక మన్నిస్తాడు. వ్యక్తిగతంగా తౌబా ద్వారం చివరి శ్వాస వరకు ఉంది. సామాన్యంగా ప్రళయానికి ముందు పశ్చిమ దిశ నుండి సూర్యోదయం అయ్యే వరకు ఉంది.

అల్లాహ్ మనందిరికీ క్షమాబిక్ష కోరుతూ, తౌబా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు గాక! అమీన్ !!

ఎవరైనా ఏదైనా పాపకార్యానికి పాల్పడటమో లేదా తనకు తాను అన్యాయం చేసుకోవడమో జరిగి ఆ తర్వాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే, అలాంటి వాడు అల్లాహ్ ను క్షమాశీలుడు, అపార కరుణాప్రదాతగా పొందగలడు. (నిసా 4: 110).

తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత

సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. కరుణ, శాంతి కురువుగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై.

ఒక వ్యక్తి ఇబ్రాహీం బిన్ అద్ హమ్ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి నేను పాపాలు చేసి స్వయంగా నాపైనే అన్యాయం చేసుకున్నాను. నాకేదైనా ఉపదేశం చేయండి అని విన్నవించుకున్నాడు. ఇబ్రాహీం చెప్పారుః “ఐదు విషయాలు నీవు పాటించగలిగితే పాపాల వల్ల నీకు నష్టం కలగదు (నీతో పాపం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది). అప్పుడు అవేమిటి? అని ఆ వ్యక్తి అడిగాడు. ఇబ్రాహీం ఇలా సమాధానం చెప్పారు:

ఇబ్రాహీం:  పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ ప్రసాదించే ఆహారం తినడం మానుకో.

ఆ వ్యక్తిః  ‘అయితే నేను ఎక్కడి నుండి తినాలి? ఈ ధర్తిపై ఉన్నదంతా అల్లాహ్ దే కదా?’

ఇబ్రాహీం: అల్లాహ్ ఇచ్చిన ఆహారం తిని, అల్లాహ్ అవిధేయతకు పాల్పడటం (పాపం చేయటం) న్యాయమేనా?

ఆ వ్యక్తిః  ‘కాదు’. ‘అయితే రెండవదేమిటి’?

ఇబ్రాహీం: నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ యొక్క భూమిపై నివసించకు.

ఆ వ్యక్తిః  ‘ఇది మొదటి దానికంటే మరీ కష్టమైనది, అయినా నేను ఎక్కడ ఉండాలి’?

ఇబ్రాహీం: అల్లాహ్ యొక్క భూమిపై ఉండి, దుష్కార్యానికి పాల్ప- డటం మంచిదేనా?

ఆ వ్యక్తిః  మంచిది కాదు. మూడవది ఏమిటో తెలుపండి.

ఇబ్రాహీం:     నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ చూడని ప్రాంతములోకి వెళ్ళు.

ఆ వ్యక్తిః  ఎక్కడికి వెళ్ళాలి? రహస్యబహిరంగాలన్నియూ ఆయనకు తెలుసు కదా!!

ఇబ్రాహీం:     నీవు అల్లాహ్ ప్రసాదించిన ఆహారం తింటూ, ఆయన ధర్తిపై నివసిస్తూ, ఆయన చూస్తూ ఉండగా పాపానికి ఒడిగడతావా?

ఆ వ్యక్తిః  అలా చేయను. అయితే నాల్గవది ఏమిటి?

ఇబ్రాహీం: ప్రాణంతీసే దూత వచ్చినప్పుడు “ఇప్పుడే నా ప్రాణం తీయకు, తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు నాకు వ్యవధి ఇవ్వు” అని చెప్పు.

ఆ వ్యక్తిః  అతడు నా మాట వినడు, నాకు వ్యవధి ఇవ్వడు కదా?

ఇబ్రాహీం:    తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు చావు నుండి తప్పించుకునే స్థోమత లేనివాడివి నీవు ఎలా పాపానికి ముందు అడుగు వేస్తావు?

ఆ వ్యక్తిః  సరే. ఐదవదేమిటి?

ఇబ్రాహీం:   నరకపాలకులు నిన్ను నరకంలోకి తీసుకుపోవటానికి వచ్చినప్పుడు నీవు వారి వెంట వెళ్ళకు.

ఆ వ్యక్తిః  వారు నన్ను వదలరు, నా అర్థింపును ఆలకించరు.

ఇబ్రాహీం: అలాంటప్పుడు నీకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది?

ఆ వ్యక్తిః  ఇక చాలండి. నేను అల్లాహ్ తో పశ్చాత్తాప భావంతో స్వచ్ఛమైన క్షమాపణ కోరుకుంటాను. (అంటే తౌబా, ఇస్తిగ్ఫార్ చేస్తాను).

 అల్లాహ్ విశ్వాసులందరికీ తౌబా ఆదేశమిచ్చాడుః

విశ్వాసులారా! మీరంత కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమా- భిక్షన వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు[. (నూర్ 24: 31).

తన దాసుల్లో రెండు రకాలవారున్నారు అని అల్లాహ్ తెలిపాడుః

  • 1-పాపం జరిగిన వెంటనే తౌబా చేయువారు.
  • 2-తౌబా చేయకుండా, తమ అత్మలపై అన్యాయం చేయువారు.

తౌబా చేయనివారే అన్యాయం చేయువారు[. (హుజురాత్ 49:11).

మానవుడు ఎల్లప్పుడూ తౌబా అవసరం గలవాడు. ఎందుకనగ అతని నుండి ఏదో అపరాధం జరుగతూ ఉంటుంది. అయితే అపరాధుల్లో తౌబా చేయువారే మంచివారు.

తౌబా చేయడం వల్ల ఇహపరాల్లో అనేక లాభాలు 

  • మనిషి తౌబా చేసి తన ప్రభువుకు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు అవుతాడు. (సూర బఖర 2: 222).
  • సాఫల్యానికి, మోక్షానికి మార్గం తౌబా. (సూర్ నూర్ 24: 31)
  • ఆ వ్యక్తి పట్ల అల్లాహ్ చాలా సంతొషిస్తాడు. (సహీ ముస్లిం 2675)
  • ఇహపరాల్లో సుఖసంతోషాలు ప్రాప్తమవుతాయి. (హూద్ 11: 3).
  • పాపాల ప్రక్షాళనం జరుగుతుంది. (జుమర్ 39: 53, తహ్రీమ్ 66: 8).
  • పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి. (ఫుర్ఖాన్ 25: 70).
  • వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, సంతానం ఇంకా అనేక శుభాలు వర్థిల్లుతాయి మరియు శత్రువులపై బలం పుంజుకుంటారు. (హూద్ 11: 52, నూహ్ 71: 10 – 12).

అనేక మందికి గురి అయిన ఒక పీడ ఏమనగ, నిర్లక్ష్యం కారణంగా వారు రేయింబవళ్ళు పాపాలకు పాల్పడుతూ ఉంటారు, మరికొందరు పాపాన్ని అతిచిన్న చూపుతో చూస్తూ, దానిని అల్పమైనదిగా భావిస్తారు. దానిని ఏ మాత్రం లక్ష్య పెట్టరు.

కాని మన ప్రవక్త సహచరుల దృష్టిలో పాపం యొక్క భయం ఎలా ఉండెనో ఈ క్రింది హదీసు ద్వారా గమనించండిః

قَالَ عَبْدُ اللهِ بْنُ مَسْعُودٍ : إِنَّ الْمُؤْمِنَ يَرَى ذُنُوبَهُ كَأَنَّهُ قَاعِدٌ تَحْتَ جَبَلٍ يَخَافُ أَنْ يَقَعَ عَلَيْهِ وَإِنَّ الْفَاجِرَ يَرَى ذُنُوبَهُ كَذُبَابٍ مَرَّ عَلَى أَنْفِهِ. {قَالَ بِهِ هَكَذَا فَطَارَ}

ఇబ్నుమస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః నిశ్చయంగా విశ్వాసుడు తన పాపాలను ఎలా భావిస్తాడంటే అతడు ఓ పర్వతం క్రింద కూర్చొని ఉన్నాడు, అది అతనిపై అప్పుడో, ఇప్పుడో పడనుందని భయపడుతూ ఉంటాడు. దుర్మార్గుడు తన పాపాల్ని తన ముక్కుపై వాలిన ఒక ఈగ మాదిరిగా భావిస్తాడు, అతడు తన చెయితో ఇలా అంటాడు అది లేచిపోతుంది. (బుఖారి 6308. తిర్మిజి 2497).

జ్ఞానంగల విశ్వాసుడు పాపం చిన్నదేకదా అని చూడడు, పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనదో, దానిని చూస్తాడు. అయినా మానవుడు నిరపరాధి కాడు, కనుక అల్లాహ్ అతని కొరకు తౌబా ద్వారం తెరచి ఉంచాడు. తౌబా చేయాలని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం శ్రద్ధగా చదవండిః

]ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

((التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لاَ ذَنْبَ لَهُ))

“పాపం చేసిన తర్వాత (పశ్చాత్తాపపడి) తౌబా చేసే వ్యక్తి, ఏ మాత్రం పాపం లేని వ్యక్తిగా మారుతాడు”. (ఇబ్ను మాజ).

ఇంతే కాదు, అతడు తన తౌబాలో సత్యవంతుడైతే అల్లాహ్ అతని పాపాల్ని పుణ్యాల్లో మారుస్తాడు. చదవండి ఈ ఆదేశం:

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటివారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

ముస్లిం చేసే తప్పుల్లో అతి పెద్ద తప్పు; తౌబా చేయడంలో జాప్యం చేయడం.

 కొంతమంది ఓ తప్పు చేస్తారు. అలా ఒక నిషిద్ధ కార్యానికి పాల్పడ్డారని తెలిసి కూడా తౌబా చేయడంలో జాప్యం చేస్తారు. వాస్తవానికి మృత్యువు ఆసన్నమయ్యే కాలాన్ని మనిషి ఎరుగడు గనక పాపాల మన్నింపుకై తౌబా చేయడంలో తొందరపడుట తప్పనిసరి.

తనకు గుర్తున్నవి, గుర్తు లేనివి అన్ని రకాల పాపాల మన్నింపుకై అధికంగా తౌబా చేస్తూ, అల్లాహ్ వైపునకు మరలుట తప్పనిసరి. అలాగే పాపాలు ఎంత ఘోరమైనవి అయినా సరే, తౌబా చేయడంలో తొందరపడుట కూడా అనివార్యం. (కొందరు తౌబా చేయడంలో తొందరపడరు, లేనిపోని తుచ్ఛమైన భావనాలకు గురి అయి, మరింత ఆలస్యమే చేస్తూ పోతారు, అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాలి) ‘మీ ప్రభువుని నేనే, మీ పూజలకు అర్హుడిని నేనే’ అన్న వాదన కంటే ఘోరమైన కుఫ్ర్, అవిశ్వాసం, తిరస్కారం మరొకటి లేదు. ఇలాంటి వాదనయే ఫిర్ఔన్ చేశాడు. అతని మాట ఖుర్ఆనులో ఇలా పేర్కొనబడినదిః ]ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు[. (ఖసస్ 28: 38). మరోచోట అతని వాదన ఇలా వచ్చిందిః ]నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును[. (నాజిఆత్ 79: 24). అతను ఇంతటి ఘోరాతిఘోరమైన వాదనలు చేసినప్పటికీ, పరమప్రభువైన అల్లాహ్, ప్రవక్త మూసా అలైహిస్సలాంను అతని వైపునకు పంపుతూ ఇలా ఆదేశించాడుః

ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, అతడు హద్దులు మీరాడు. అతనికి ఇలా బోధించుః పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే, నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా?[. (నాజిఆత్ 79: 17-19).

అతడు మూసా అలైహిస్సలాం మాటను స్వీకరించి, స్వచ్ఛమైన తౌబా గనక చేసి ఉంటే, అల్లాహ్ తప్పక అతడ్ని క్షమించేవాడు.

ఇది కూడా తెలుసుకో! ఎవరయినా ఒక పాపం నుండి తౌబా చేసిన తర్వాత మళ్ళీ అదే పాపానికి పాల్పడితే, మళ్ళీ తౌబా చేయాలి. తప్పు జరిగినప్పుడల్లా తౌబా చేస్తూ ఉండాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు.

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

 కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు [. (జుమర్ 39: 53).

మరికొందరు కొన్ని రకాల పాపాల నుండి తౌబా చేయరు. దానికి కారణం: ప్రజల మాటల, వదంతుల భయంతో, లేదా తాను ఏ సమాజంలో జీవితం గడుపుతున్నాడో అందులో అతని ప్రతిష్ఠకు ముప్పు కలుగుతుందన్న భయంతో, లేదా తన ఉద్యోగం పోతుందన్న భయంతో. అయితే ఇలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడు వీటిని మరవవద్దుః చనిపోయిన తర్వాత సమాధిలో మరియు తన ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు తాను ఒంటరిగానే ఉంటాడు. చివరికి ప్రభువు అతడ్ని అతని ఆచరణ గురించి ప్రశ్నించినప్పుడు ఏ ఒక్కడూ అతని వెంట ఉండడు. ఆ కరుణామయుని భయంతో తౌబా చేయకుండా, ఇతరుల భయంతో ఇంకెన్నాళ్ళు పాపపుజీవితమే గడుపుతూ ఉందాము ఆలోచించండి.

మరికొందరు తౌబా చేయకపోవడానికి కారణం; ఎవరో అతని తౌబాకు అడ్డుపడుతున్నారని, లేదా ఎవరో దుష్చేష్టలను ఆకర్షవంతగా, సరైనవిగా చూపిస్తున్నారని. అయితే వారు కూడా అల్లాహ్ యందు అతనికి ఏ మాత్రం ఉపయోగపడరు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ అతను స్వచ్ఛమైన తౌబా చేసి, ఏదైనా దుష్కార్యాన్ని వదులుకుంటే, తప్పక అల్లాహ్ దానికి బదులుగా అతనికి ఏదైనా మేలైనదానిని నొసంగుతాడు.

 మరికొందరు తప్పుపై తప్పు చేస్తునే ఉంటారు. అలా చేయకండి అని బోధ చేసినప్పుడు ‘అల్లాహ్ క్షమించేవాడు’ అని బదులిస్తారు. ఇది మూర్ఖత్వం, పిచ్చివాదం. ఇలా షైతాన్ వారిని దుర్మార్గ వలలోనే చిక్కుకొని ఉండి, బయటకు రాకుండా చేస్తున్నడాని తెలుసుకోవాలి. అల్లాహ్ అపార కరుణాప్రదాత, క్షమించేవాడు అన్నది వాస్తవమే. కాని ఎవరి కొరకు అన్నది కూడా తెలుసుకోవాలి కదా! అయితే తెలుసుకోః పాపాలను వదలి, సత్కార్యాలు చేసేవారి కొరకు అల్లాహ్ కారుణ్యం చాలా సమీపంలో ఉంది. మంకుతనంతో దుష్కార్యాలకు పాల్పడేవారి కోసం కాదు. అల్లాహ్ ఆదేశాన్ని గమనించండిః

నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది[. (ఆరాఫ్ 7: 56).

 అల్లాహ్ కరుణించే, క్షమించేవాడు అయినప్పటికీ, దుష్టులను శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ ఈ ఆదేశం చదవండిః

నేను చాలా క్షమించేవాడిని, కరుణించేవాడిని అనీ మరియు దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధకరమైన శిక్షే అని నా దాసులకు తెలియజేయుము[. (ఆరాఫ్ 7: 56).

 సోదరులారా! తౌబా చేయక పోవడానికి లేదా చేయడంలో ఆలస్యం అవడానికి సంబంధించిన కొన్ని కారణాలు, వాటి పరి- ష్కారాలు  గత పేజిలలో తెలిపాము. క్రింద తౌబా నిబంధనలు తెలుసుకుందాము.

తౌబా నిబంధనలు

తౌబా నిబంధనలు అంటేః ఒక మనిషి ఏదైనా పాపం నుండి తౌబా చేస్తున్నప్పుడు, అతని తౌబాను అల్లాహ్ స్వీకరించాలంటే,  ఈ మూడు నిబంధనలు ఉన్నాయి. అప్పుడే అది నిజమైన తౌబా అగును. వాటిని ధర్మ వేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా సేకరించారు.

1- ఏ పాపం నుండి తౌబా చేస్తున్నాడో ఆ పాపాన్ని విడనాడాలి.

2- ఆ పాపం గుర్తుకు వచ్చినప్పుడల్లా సిగ్గుతో కుమిలిపోవాలి.

3-ఇక ముందు ఆ పాపం చేయకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి.

పాపం యొక్క సంబంధం మానవుని మరియు అతని ప్రభువు మధ్య ఉంటే, పై మూడు నిబంధనలు పాటించాలి. ఒకవేళ పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే, పై మూడిటితో పాటు ఈ నాల్గవది కూడా పాటించాలిః

4- ఎవరిపైనా ధన, మాన, ప్రాణ సంబంధమైన హక్కులో ఏదైనా అన్యాయం చేసి ఉంటే, అతని హక్కు అతనికి తిరిగి ఇవ్వాలి. లేదా అతనితో క్షమాపణ కోరుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله : مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ الْيَوْمَ قَبْلَ أَنْ لَا يَكُونَ دِينَارٌ وَلَا دِرْهَمٌ إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా తన సోదరుని మానమర్యాదలకు సంబంధించిన విషయంలోగాని లేదా మరే విషయంలోగాని ఏదైనా దౌర్జన్యానికి/ అన్యాయానికి పాల్పడి ఉంటే, దీనార్లుగాని, దిర్హములుగాని (డబ్బు, ధనాల ప్రయోజనం) ఉండని ఆ రోజు రాక ముందు, ఈ రోజే అతను (హక్కుదారుని హక్కు ఇచ్చేసి, లేదా అతని ద్వారా మాఫీ పొంది) ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. (ఇలా చేయని పక్షంలో ఆ రోజు పాప ప్రక్షాళన పద్ధతి ఇలా ఉంటుందిః) దౌర్జన్యపరుని వద్ద సత్కార్యాలు ఉంటే, అతని దౌర్జన్యానికి సమానంగా సత్కార్యాలు అతని నుండి తీసుకొని (పీడుతులకు పంచడం జరుగుతుంది). ఒకవేళ అతని వద్ద సత్కార్యాలు లేకుంటే పీడుతుని పాపాలు తీసుకొని అతనిపైన మోపడం జరుగుతుంది”. (బుఖారి 2449).

ఏ బాధితుడైనా ఈ హదీసు తెలిసిన తర్వాత తన శక్తిమేర ప్రయత్నం చేసినప్పటికీ, తాను బాధించిన వ్యక్తిని కలుసుకోలేక, లేదా అతని హక్కు ఇవ్వలేక పోతే, ఈ స్థితిలో కేవలం అల్లాహ్ మన్నింపుకై ఆశించాలి. అల్లాహ్ మనందరిని తన కరుణ ఛాయలో తీసుకొని మన్నించుగాక.

హక్కుల్లో

 గత పేజిల్లో మాన, ప్రాణ, ధన సంబంధిత హక్కుల విషయం వచ్చింది గనక, వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

1-  ధనసంబంధిత హక్కుః ధనానికి సంబంధించిన హక్కు ఎలాగైనా హక్కుదారునికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదా అతడ్ని కలుసుకొని మాఫీ చేయించుకోవాలి. ఒకవేళ అతని చిరునామ తెలియక, లేదా సాధ్యమైనంత వరకు వెతికినప్పటికీ అతడ్ని పొందలేకపోతే, లేదా ధన పరిమాణం గుర్తు లేకుంటే, ఏదైనా ఒక పరిమాణం నిర్ణయించుకొని అతని తరఫున దానం చేయాలి.

ఒకటిః (ప్రాయశ్చితంగా, దౌర్జన్య ప్రమాణంలో) ఏదైనా ధనం కోర- వచ్చు. రెండవదిః దౌర్జన్య ప్రమాణంలో ప్రతీకారం తీసుకోవచ్చు. మూడవదిః మాఫీ చేయవచ్చు. ఒకవేళ హక్కుగల వ్యక్తి తెలియకుంటే అతని తరఫున దానం చేయాలి. అతని కొరకు దుఆ చేయాలి.

2- శారీర సంబంధిత హక్కుః శారీరకంగా ఎవరిపైనైనా ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, దౌర్జన్యపరుడు పీడితునికి లొంగిపోవాలి. అతడు తన హక్కు ఈ క్రింది మూడు పద్ధతుల్లో ఏదో ఒక రకంగా తీసుకోవచ్చుః

3- మానమర్యాద హక్కుః ఇది ఎన్నో రకాలుగా ఉంటుందిః పరోక్షంగా నిందించుట, ఏదైనా అపనింద మోపుట, చాడీలు చెప్పుట, కలసిఉన్నవారి మధ్య విభేదాలు సృష్టించి వారిని విడదీయుట వగైరా. ఈ రకంగా ఎవరినైనా బాధించి ఉంటే, అతని వద్దకు వెళ్ళి మన్నింపు కోరుకోవాలి. శక్తానుసారం వారికి చేసిన కీడుకు బదులుగా మేలు చేయాలి. వారి కొరకు దుఆ చేయాలి.

తౌబా విధానాలు

పాపాల్లో కొన్ని మహాఘోరమైన పాపాలున్నాయి. వాటికి పాల్పడినవారు ఎలా తౌబా చేయాలి అన్న విషయమే క్రింది భాగంలో తెలుసుకోబుతున్నాము. అయితే చాలా శ్రద్ధగా చదవండి, ఇతరులకు ప్రయోజనం కలగజేయండి.

1- హంతకుని తౌబాః ఉద్ధేశపూర్వకంగా ఎవరినైనా చంపిన వ్యక్తిపై మూడు రకాల హక్కులుంటాయి.

ఒకటి: అల్లాహ్ కు సంబంధించిన హక్కుః అంటే సత్యమైన తౌబా చేయాలి. ఇందులో పైన తెలిపిన మూడు/నాలుగు నిబంధనలు వస్తాయి.

రెండవది: హతుని వారసుల హక్కుః హంతకుడు వారికి లొంగిపోవాలి. వారు ఇతడి నుండి మూడిట్లో ఏదైనా ఒక రకంగా తమ హక్కు తీసుకుంటారు. A: ప్రాయశ్చితంగా అతని నుండి ధనం తీసుకుంటారు. లేదా B: అతడ్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు. లేదా C: అతడ్ని మన్నించి వదలుతారు.

మూడవది: హతుని హక్కుః ఈ హక్కు అతనికి ఇహలోకంలో ఇవ్వరాదు.

అందుకని హంతకుడు తన తౌబాలో సత్యవంతుడై, తనకు తాను హతునివారసులకు అప్పగిస్తే, అల్లాహ్ అతని ఆ అపరాధాన్ని మన్నిస్తాడు. హతునికి ప్రళయదినాన మేలైన ప్రతిఫలం నొసంగుతాడు.

2-  వడ్డీ తినే, తీసుకునే వారి తౌబాః వడ్డీ తీసుకొనుట, తినుట నిషిద్ధం అని తెలిసిన తర్వాత, తౌబా చేయు వ్యక్తి, వడ్డీ తీసుకోవడం మరియు తినడం మానుకోవాలి. ఇక ఎప్పుడూ తీసుకోకుండా, తినకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి. ఇంతకు ముందు ఏదైతే తిన్నాడో, తీసుకున్నాడో అది గుర్తుకు వచ్చినప్పుడు ‘ఛీ’ అని సిగ్గు చెందాలి. ఈ విషయాల్ని పాటించినప్పుడే అతని తౌబా నిజమగును. అతను వడ్డీ ద్వారా సంపాదించిన ధనం గురించి పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నవి. అయితే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా, షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ సఅదీ మరియు ఇబ్ను ఉసైమీన్ రహిమహుముల్లాహ్ ఇలా చెప్పారుః

తౌబా చేయటానికి ముందు తీసుకున్న వడ్డీ అతనిదే అయి యుంటుంది. అతను దానిని తన ఏ అవసరాలకైనా సరే ఉపయోగించ వచ్చును. అందులో ఏలాంటి అభ్యంతరం లేదు. ఏ వడ్డీ సొమ్ము వచ్చేది ఉందో దానిని తీసుకోకుండా అసలు సొమ్ము మాత్రమే తీసుకోవాలి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు, వడ్డీని నిషిద్ధం (హరాం) చేశాడు. కనుక తన ప్రభువు యొక్క ఈ హితబోధ అందిన వ్యక్తి, ఇక ముందు వడ్డీ తినడం త్యజిస్తే, పూర్వం జరిగిందేదో జరిగింది, దాని పరిష్కారం అల్లాహ్ చూసుకుంటాడు[. (బఖర 2: 275).

సత్యమైన తౌబా

చెడును వదులుకునేవారు సామాన్యంగా ఏదైనా కారణంగానే వదులుకుంటారు. కాని తన తౌబా అంగీకరించబడాలి అని కాంక్షించే వ్యక్తి, అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే తౌబా చేయుట తప్పనిసరి.

ఎవరైనా తన పాపం, తన ప్రఖ్యాతిలో మరియు ఉద్యోగంలో అడ్డు పడుతుందన్న భయంతో పాపాన్ని విడనాడితే అది తౌబా అనబడదు.

ఎవరు తన ఆరోగ్యం చెడిపోతుందని లేదా (ఏయిడ్స్) లాంటి వ్యాదికి గురి కావలసి వస్తుందన్న భయంతో ఏదైనా దుష్చేష్టను వదులుకుంటే అది తౌబా అనబడదు.

ఎవరైతే దొంగతనం చేసే శక్తి లేనందుకు, పోలీసు, లేదా కాపలాదారుని భయానికి దొంగతనం మానుకుంటే అది తౌబా కాదు.

డబ్బు లేనందుకు మత్తు సేవించడం, మాధకద్రవ్యాలు వాడటం మానుకుంటే అది తౌబా అనబడదు.

తన మనస్ఫూర్తిగా కాకుండా, వేరే ఏదైనా కారణం వల్ల, ఉదాహరణకు తప్పు చేసే శక్తి లేనందుకు తప్పు చేయకుంటే అది తౌబా అనబడదు.

తౌబా చేయు వ్యక్తి మొదట తప్పు యొక్క చెడును గోచరించాలి. ఉదాహరణకుః స్వచ్ఛమైన తౌబా చేసే వ్యక్తి, జిరిగిన ఆ తప్పును తలచి తృప్తి చెందడం, సంతోషించడం అసంభవం, లేక భవిష్యత్తులో తిరిగి చేయాలని కాంక్షించడం కూడా అసంభవం.

అదే విధంగా ఏ చెడు నుండి తౌబా చేశాడో, ఆ చెడుకు తోడ్పడే సాధనాలన్నిటికీ దూరంగా ఉండడం తప్పనిసరి. ఉదాహరణకుః మత్తు సేవించడం, సినిమాలు చూడడం నిషిద్ధం అని తెలిసిన తర్వాత, వాటి నుండి తౌబా చేసిన వ్యక్తి మత్తు మరియు సినిమాలకు సంబంధించిన పరికరాలన్నిటికి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రాంతంలో వెళ్ళ కూడదు. స్నేహితుల్లో వాటికి బానిస అయినవారి నుండి దూరం ఉండాలి.

 అనేక మంది చెడు పనులకు అలవాటు పడేది చెడు స్నేహితుల ద్వారానే. అయితే ఇక్కడ చెడు స్నేహితులను వదలుకోవడం కష్టంగా ఏర్పడినప్పుడు ప్రళయదినాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడి దుష్మిత్రులు అక్కడ పరస్పరం శత్రువులవుతారు, శపించుకుంటారు. (చూడండి సూర జుఖ్రుఫ్ 43: 67: الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు  శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు). అందుకే తౌబా చేసిన వ్యక్తి తన పాత స్నేహితులను, సత్కార్యాల వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే వారికి దూరంగానే ఉండాలి.

 తౌబా చేసిన వారిలో కొందరు తన పాత మిత్రులను సత్కార్యం వైపునకు పిలిచే సాకుతో మళ్ళీ వారితోనే కలసిపోవటానికి షైతాన్ ప్రేరేపిస్తాడు. స్వయంగా వారు కొత్తగా సత్కార్య మార్గాన్ని అవలంబించారు గనక, తమ మిత్రులపై మంచి ప్రభావం చూపలేకపోతారు. ఇలా ఇది పాత పాపానికి పాల్పడడానికి కారణం అవుతుంది. అందుకు అతను వారికి బదులుగా మంచి మిత్రుల్ని ఎన్నుకోవాలి. వారు అతని మంచికై తోడ్పడతారు, సన్మార్గంపై ఉండడానికి బలాన్నిస్తారు.

తౌబా చేయుటకు సహాయపడే విషయాలు

1- సంకల్పశుద్ధి, స్వచ్ఛత అల్లాహ్ కొరకే ఉండాలి:- పాపం వదలడానికి ఇది ప్రయోజనకరమైన ఆధారం. దాసుడు తన ప్రభువు కొరకే చిత్తశుద్ధి చూపినప్పుడు, పశ్చాత్తాపపడి, క్షమాభిక్షలో సత్యవంతుడైనప్పుడు అల్లాహ్ ఆ విషయంలో అతనికి సహాయపడతాడు. తౌబా చేయడానికి అతడ్ని అడ్డగించే వాటిని అతని నుండి దూరంగా ఉంచుతాడు.

2- మనుస్సును నిర్బంధించుటః- ఒక వ్యక్తి పాపం చేయకుండా తన మనస్సును నిర్బంధించాడంటే అల్లాహ్ అతనికి సహాయపడతాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము[. (అన్కబూత్ 29: 69).

3- పరలోక ధ్యాసః- అల్పమైన ఇహలోకాన్ని, అతిత్వరలో నశించే ఈ ప్రపంచాన్ని తలచి, విధేయులకు పరలోకంలో సిద్ధంగా ఉన్న భోగభాగ్యలు, అవిధేయుల గురించి ఉన్న కఠిన శిక్షను తలచుకుంటూ ఉంటే అపరాధానికి గురి కాకుండా ఉండడానికి ఇది ముఖ్యమైన అడ్డుగా నిలుస్తుంది.

4-ప్రయోజనకరమైన వాటిలో కార్యమగ్నుడై, ఒంటరితనం, తీరిక లేకుండా ఉండుటః- పాపాల్లో పడటానికి ముఖ్య కారణం తీరిక. ఇహపరాల్లో లాభం చేకుర్చేవాటిలో మనిషి నిమగ్నుడై ఉంటే, దుర్మార్గం చేయడానికి తీరిక పొందడు.

5-ఉద్రేకానికి గురి చేసే విషయాలకు, పాపాన్ని గుర్తు చేసే వాటికి దూరంగా ఉండాలిః- పాపానికి గురిచేసే కారణాల్ని ప్రేరేపించే వాటికి, సినిమాలకు, పాటలకు, అశ్లీల రచణలకు, నీతిబాహ్యమైన మ్యాగ్జిన్స్ (పత్రికల)కు ఇలా దుర్వాంఛల్ని ఉత్తేజ పరిచే వాటికి దూరంగా ఉండాలి.

6-సజ్జనులకు దగ్గరగా, దుర్జణులకు దూరంగా ఉండాలిః- సజ్జనుల తోడు మంచి చేయుటకు సహాయపడుతుంది, పుణ్యాత్ములను అనుసరిం- చాలని ప్రోత్సహిస్తుంది, దుర్మార్గానికి, చెడుకు అడ్డుపడుతుంది.

7-దుఆః- మహాప్రయోజనకరమైన చికిత్స ఇది. దుఆ విశ్వాసుల ఆయుధం. అవసరాలు తీర్చే బలమైన హేతువు. అల్లాహ్ ఆదేశాలను చదవండిః

నీ ప్రభువు ఇలా అంటున్నాడుః నన్ను ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను[. (మోమిన్ 40: 60).

విలపిస్తూ, గోప్యంగానూ మీ ప్రభువును వేడుకోండి. [. (ఆరాఫ్ 7:55).

నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి. నన్ను విశ్వసించాలి. ఇలా వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది[. (బఖర 2: 186).

పాప పరిహారాలు

అల్లాహ్ తన దాసులపై విధించిన ప్రార్థనల్లో తన గొప్ప దయ, కరుణతో కొన్నిటిని చిన్నపాపాల పరిహారానికి సాధనంగా చేశాడు. వాటిలో కొన్ని ఈ క్రిందివిః

1-విధిగా ఉన్న ఐదు పూటల నమాజులు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْخَطَايَا

“మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అతను అందులో ప్రతి రోజు ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని శరీరంపై మురికి ఉంటుందా”? అని ప్రవక్త అడిగారు. దానికి సహచరులు చెప్పారుః ఎలాంటి మురికి మిగిలి ఉండదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “ఐదు పూటల నమాజు సంగతి కూడా ఇలాంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు”. (ముస్లిం 667, బుఖారి 528).

2-జుమా నమాజు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ

“ఎవరైనా చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు కొరకు వచ్చి, అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా జుమా ప్రసంగం వింటే, వెనకటి జుమా నుండి ఈ జుమా వరకు, అదనంగా మూడు రోజుల పాపాల మన్నింపు జరుగుతుంది. (ముస్లిం 857).

3- రమజాను ఉపవాసాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశించి రమజాను ఉపవాసాలు పాటించాడో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారి 38, ముస్లిం 760).

4- హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ حَجَّ هَذَا الْبَيْتَ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ

“ఏలాంటి వాంఛలకు లోనవకుండా, అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లఘించకుండా కాబా గృహం యొక్క హజ్ చేసిన వ్యక్తి, అదే రోజు పుట్టినవానిలా హజ్ నుండి తిరిగి వస్తాడు”. (బుఖారి 1820, ముస్లిం 1350).

5- అరఫా (జిల్ హిజ్జ మాసం యొక్క 9వ) రోజు ఉపవాసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

صَومُ يَومِ عَرَفَةَ يُكَفِّرُ السَّنَةَ الْمَاضِيَةَ وَالْبَاقِيَة

“అరఫా రోజు యొక్క ఉపవాసము గడిసిన ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సర పాపాలన్నిటిని తుడిచివేస్తుంది”. (ముస్లిం 1162).

6- రోగాలు, కష్టాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَا يُصِيبُ الْمُسلِمَ مِنْ نَصَبٍ، وَلاَ وَصَبٍ، وَلاَ هَمٍّ، وَلاَ حُزنٍ، وَلاَ أَذًى، وَلاَ غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُّهَا إِلاَّ كَفَّرَ اللهُ بِهَا مِن خَطَايَاه

“ముస్లింకు అలసట, అవస్త, చింత, వ్యాకులత, బాధ మరియు దుఃఖం ఏదీ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అల్లాహ్ దాని కారణంగా అతని పాపాలను తుడిచివేస్తాడు”. (బుఖారి 5642, ముస్లిం 2573).

మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ

“అల్లాహ్ ఎవరికి మేలు చేయగొరుతాడో, అతనిని పరీక్షిస్తాడు”. (బుఖారి 5645).

7- ఇస్తిగ్ఫార్ (అంటే అస్తగ్‘ఫిఅల్లాహ్ అని పలకడం): అధికంగా పాపాల్ని మన్నించే కారణాలలో ఇది అతి ముఖ్యమైనది. చదవండి అల్లాహ్ ఆదేశం:

ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉన్నంత వరకు వారిని శిక్షించడం అనేది అల్లాహ్ సాంప్రదాయం కాదు[. (అన్ఫాల్ 8: 33).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

طُوبَى لِمَنْ وَجَدَ فِي صَحِيفَتِهِ اسْتِغْفَاراً كَثِيرًا

“ఎవరి కర్మపత్రంలో ఎక్కువగా క్షమాభిక్షలుంటాయో వారికి శుభవార్త”. (ఇబ్ను మాజ 3818).

ప్రశ్నోత్తరాలు

1- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాపాలు చాలా ఉన్నాయి. నేను గతంలో చేసిన పాపాలన్నిటినీ అల్లాహ్ మన్నిస్తాడో లేదో తెలియదు?

జవాబుః అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

 హదీసె ఖుదుసీలో ఇలా ఉందిః

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله  يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలై- హి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

అంతేకాదు, తన దాసుల కొరకు అల్లాహ్ కారుణ్యం మరీ విశాలమైనది. ఎవరు తమ తౌబాలో సత్యవంతుడయి తేలుతాడో అల్లాహ్, గతంలో వారితో జరిగిన పాపాలన్నిటినీ పుణ్యాల్లో మారుస్తాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

 అందుకు, పాపాలు ఎన్నీ ఉన్నా, ఎంతటి ఘోరమైనవైనా ఏ మాత్రం నిరాశ చెందకుండా తొందరగా తౌబా చేయుటకు ముందడుగు వేయాలి.

2- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటాను. కాని నా దుష్ట స్నేహితులు నన్ను తౌబా చేయనివ్వడం లేదు. ఇందుకు నా బలహీనత, నీరసం కూడా తోడ్పడుతుంది. అయితే నేను ఏమి చేయాలి?

జవాబుః తౌబా విషయంలో ఓపిక మరియు నిలకడ అవసరం ఎంతైనా ఉంటుంది. తన తౌబాలో మనిషి ఎంతవరకు సత్యత చూపుతున్నాడో తెలియడానికి ఇది ఓ పరీక్ష. అందుకు వారిని అనుసరించకుండా, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి వారి విషయమే అల్లాహ్ ఎంత చక్కగా తెలిపాడో గమనించుః

కనుక నీవు సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. విశ్వసించనివారు నిన్ను చులకన భావంతో చూడ- కూడదు సుమా! (అంటే నీవు వారి మాటలకు ఏమాత్రం లొంగి- పోకూడదు)[. (రూమ్ 30: 60).

దుష్ట స్నేహితులు అతడ్ని తమ వైపు మలుపుకోటానికి నానారకాల ప్రయత్నాలు చేస్తారన్నది తౌబా చేసే వ్యక్తి తెలుసుకోవాలి. కాని ఎప్పుడైతే వారు అతని సత్యత మరియు ధర్మంపై బలమైన నిలకడ చూస్తారో అతడ్ని వదిలేస్తారు.

3- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాత స్నేహితులు నన్ను నలుగురిలో అవమాన పరుస్తారని బెదిరిస్తున్నారు. వారి వద్ద నా పాత ఫోటోలు, కొన్ని నిధర్శనాలున్నాయి. నా ప్రఖ్యాతి మట్టిలో కలుస్తుందని నాకు భయం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో నేనేమి చేయాలి?

జవాబుః ముందు షైతాన్ మిత్రులతో సమరం చేయాల్సి ఉంటుంది. షైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవని కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నీవు వారికి మొగ్గు చూపావంటే వారు మరిన్ని రుజువులు నీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు అని కూడా తెలుసుకో. ఈ విధంగా మొదటికీ, చివరికి నీవు నష్టపోతావు. కాని నీవు అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉండు. “హస్బియల్లాహు వ నిఅమల్ వకీల్” (నాకు అల్లాహ్ యే చాలు ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు) అని చదువుతూ ఉండు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితోనైనా భయం చెందినప్పుడు ఈ దుఆ చదివేవారు.

اللَّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِي نُحُورِهِمْ، وَنَعُوذُ بِكَ مِنْ شُرُورِهِم

“అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిమ్ వ నఊజు బిక మిన్ షురూరిహిమ్”.

(ఓ అల్లాహ్ మేము నిన్ను వారి ఎదుట అడ్డుగా చేస్తున్నాము. వారి కీడు నుండి నీ శరణు కోరుతున్నాము).

వాస్తవంగా ఇది కఠిన సందర్భం. కాని అల్లాహ్ కూడా భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడు. ఆయన వారిని అవమాన పరచడు. భక్తులకు అల్లాహ్ సహాయంగా ఉన్న ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గాధ చదువుః

మర్సద్ బిన్ అబీ మర్సద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్లో ఒకరు. ఆయన, మదీనాకు వలసపోయే శక్తిలేని ముస్లిములను మక్కా నుండి మదీనా చేర్పించేవారు. మక్కాలో ఆయనకు ఇస్లాంకు ముందు పరిచయమున్న ఒక అభిసారిక ఉండేది. ఆమె పేరు ‘అనాఖ్’. ఆయన, మక్కాలో ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని మదీనా చేర్పిస్తానని మాట ఇచ్చి ఉండెను. తర్వాత సంఘటన ఆయన నోటే విందాము/ చదువుదాముః నేను మక్కా నగరానికి వచ్చి, పౌర్ణమి రాత్రిలో ఒక గోడ ఛాయలో నిల్చున్నాను. అనాఖ్ నన్ను దూరం నుండే చూసి, దగ్గరికి వచ్చి, నన్ను గుర్తు పట్టి ‘వచ్చేసెయి, ఈ రాత్రి మనం కలసి ఆనందంగా గడుపుకుందాము’ అని అంది. “అనాఖ్! అల్లాహ్ వ్యభిచారాన్ని నిషేధించాడు” అని నేను బదులిచ్చాను. ఇది విన్న వెంటనే అనాఖ్ ‘ఓ ప్రజలారా! ఈ వ్యక్తి మీ ఖైదీలను విడిపించుకు వెళ్తున్నాడు’ అని బిగ్గరగా అరిచింది. అప్పుడే ఎనిమిది మంది నా వెంట పడ్డారు. నేను పరిగెత్తి ఒక గుహలో ప్రనేశించాను. వారు గుహ వరకు వచ్చి నాపైనే, అంటే; గుహ ముఖంద్వారం వద్ద నిల్చున్నారు. కాని అల్లాహ్ వారిని అంధులుగా చేశాడు. వారు నన్ను చూడలేకపోయారు. చివరికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మాటిచ్చిన నా స్నేహితుని వద్దకు వెళ్ళి అతడ్ని మదీనా చేర్పించాను.

ఈ విధంగా అల్లాహ్, విశ్వాసులను, తౌబా చేసేవారిని కాపాడతాడు.

ఒకవేళ నీవు భయపడే విషయమే గనక బయటపడి, నీవు నీ విషయం స్పష్టం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, నీ నిర్ణయాన్ని ఎదుటివారి ముందు స్పష్టం చేయి, నీవు చేసిన దానిని ఒప్పుకుంటూ ‘అవును, నేను అపరాధునిగా ఉంటిని, కాని అల్లాహ్ వైపునకు మరలి నేను తౌబా చేశాను’ అని నిక్కచ్చిగా చెప్పేసెయి. అసలు అవమానం, ఇది కాదు. ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో, దైవదూతల, జిన్నాతుల మరియు సర్వమానవుల ముందు కలిగే అవమానమే అసలు అవమానము.

4- ప్రశ్నః నేను ఒక తప్పు చేసిన తర్వాత తౌబా చేస్తాను. నా మనుస్సు అదుపులో ఉండలేక అదే తప్పు మళ్ళీ జరిగితే, నేను ముందు చేసిన తౌబా వ్యర్థం అయిపోయి, మొదటి తప్పుతో పాటు తర్వాత తప్పు కూడా నా పత్రంలో ఉంటుందా?

జవాబుః ఒక తప్పు చేసిన తర్వాత నీవు తౌబా చేసినచో అల్లాహ్ ఆ తప్పును మన్నిస్తాడు. తర్వాత అదే తప్పు మళ్ళీ చేసినచో, కొత్తగా తప్పు చేసినట్లు లిఖించబడుతుంది. అందుకు మళ్ళీ తౌబా చేయాల్సి ఉంటుంది. కాని మొదటి తప్పు తన కర్మ పత్రంలో ఉండదు.

5-ప్రశ్నః నేను ఒక పాపంలో మంకుతనం వహిస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుందా?

జవాబుః ఒక పాపం చేస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుంది. కాని రెండు పాపాలు ఒకే రకమైనవి కాకూడదు. ఉదాహరణకుః వడ్డీ తినే, తీసుకునే వ్యక్తి ఇక నుండి వడ్డీ వ్యవహారానికి దూరంగా ఉంటానని తౌబా చేస్తున్నప్పుడు, అతను మత్తు సేవించేవాడు కూడా ఉండి, దీనిని నుండి తౌబా చేయకుంటే, వడ్డీ గురించి చేసిన తౌబా నిజమగును, అది అంగీకరించబడును. కాని ఒక వ్యక్తి ఇక నుండి మత్తు సేవించనని తౌబా చేసి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు మానుకోకుంటే, లేదా ఒక స్త్రీతో వ్యభిచారానికి పాల్పడి తౌబా చేస్తూ, మరో స్త్రీతో వ్యభిచారానికి ఒడిగడితే ఇలాంటి తౌబా అనేది అంగీకరించబడదు.

6- ప్రశ్నః నేను గతంలో నమాజ్, ఉపవాసం, జకాత్ మొదలయిన కొన్ని విధులను పాటించలేదు. అందుకు నేనేమి చేయాలి?

జవాబుః వదిలివేసిన నమాజులు తిరిగి చేయాలని (అంటే ఖజా) ఏమీ లేదు. కాని స్వచ్ఛమైన తౌబా చేయాలి. ఇక ముందు చాలా శ్రద్ధగా నమాజులను కాపాడాలి. ఎక్కువగా క్షమాపణ కోరుతూ ఉండాలి. అలాంటప్పుడు అల్లాహ్ తప్పక మన్నించవచ్చు.

ఉపవాసాలు వదిలిన వ్యక్తి, ఉపవాసాలు ఉండలేకపోయిన రోజుల్లో ముస్లింగానే ఉంటే ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక్కో నిరుపేదకు కడుపునిండా అన్నం పెట్టాలి. జకాత్ ఇవ్వలేకపోయిన ముస్లిం, గత ఎన్ని సంవత్సరాల జకాత్ ఇవ్వలేకపోయాడో అన్ని సంవత్సరాల జకాత్ లెక్కేసుకోని ఒకేసారి చెల్లించాలి.

7-ప్రశ్నః నేను కొంతమందికి సంబంధించిన సొమ్ము దొంగలించాను. ఆ తర్వాత తౌబా చేశాను. కాని నాకు వారి చిరునామాలు తెలియవు. అలాంటప్పుడు నేనేమీ చేయాలి?

జవాబుః పూర్తి ప్రయత్నాలు చేసి వారి చిరునామాలు కనుగొనాలి. వారి చిరునామాలు లభ్యమవుతే వారి నుండి దొంగలించిన సొమ్ము వారికి అప్పగించాలి. సొమ్ము ఎవరిదో ఆ వ్యక్తి చనిపోయినచో, ఆ సొమ్ము అతని వారసులకు ఇవ్వాలి. తగిన ప్రయత్నం చేసి వారిని వెతికినప్పటికీ వారు తెలియకుంటే వారి తరఫున, వారికి దాని పుణ్యం లభించే సంకల్పంతో దానం చేయాలి. వారు అవిశ్వాసులైనా సరే. వారికి దాని ప్రతిఫలం అల్లాహ్ ఇహములోనే ఇస్తాడు. పరలోకంలో ఇవ్వడు.

8-ప్రశ్నః నేను వ్యభిచారానికి పాల్పడ్డాను. నేను ఎలా తౌబా చేయాలి. ఆ స్త్రీ గర్భిణి అయితే ఆ సంతానం నాకే చెందుతుందా?

జవాబుః స్త్రీ యొక్క ఇష్టం, అంగీకారంతో చేసిన వ్యభిచారానికి నీపై కేవలం తౌబా విధిగా ఉండును. సంతానం అక్రమ సంబంధ ఫలితమైనందకు నీది కాదు. అతని ఖర్చులు ఇచ్చే బాధ్యత కూడా నీపై ఉండదు. ఇలాంటి సంతానం అతని తల్లితోనే ఉండును.

ఈ విషయాన్ని కప్పి ఉంచడానికి ఆ స్త్రీతో వివాహం కూడా చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి మరియు ఆ స్త్రీ ఇద్దరూ స్వచ్ఛంగా తౌబా చేస్తే, ఆ వ్యక్తి ఆమెతో వివాహం చేసుకోవచ్చును. కాని మొదటి అక్రమ సంబంధం వల్ల ఆమెకు గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే.

 ఒకవేళ అత్యాచారం, బలవంతంతో వ్యభిచారం జరిపి ఉంటే, ఆమెపై చేసిన అత్యాచారానికి బదులుగా, అతడు ఆమెకు ఆమె తోటి సోదరీమనులు తమ వివాహంలో పొందిన మహర్ కు సమానంగా ధనం ఇవ్వాలి. స్వచ్ఛమైన తౌబా చేయాలి. అతడు ఉన్న ప్రాంతంలో ఇస్లామీయ చట్టం అమలులో ఉండి, అతని వ్యవహారం చట్టం దృష్టిలోకి వస్తే ధర్మప్రకారంగా అతనిపై “హద్” (వ్యభిచార శిక్ష) విధింపబడును.

9-ప్రశ్నః ఒక మంచి వ్యక్తితో నా వివాహం జరిగింది. వివాహానికి ముందు అల్లాహ్ ఇష్టపడని కొన్ని సంఘటనలకు నేను గురయ్యాను. ఇప్పుడు నేనేమి చేయాలి?

జవాబుః స్వచ్ఛమైన తౌబా చేయి. గతంలో జరిగిన విషయాలు నీ భర్తకు తెలియజేయుట నీపై అవశ్యకత ఏమీ లేదు. అందుకు నీవు కుండ బద్దలు గొట్టి సంసారం పాడు చేసుకోకు.

10- ప్రశ్నః గుదమైధనం (సోడోమీ) లాంటి పాపానికి గురైన వ్యక్తి తౌబా చేయునప్పుడు ఏ విధులు వర్తిస్తాయి?

జవాబుః ఆ దుష్చర్యకు పాల్పడిన ఇద్దరూ స్వచ్ఛమైన తౌబా చేయాలి.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడిన లూత్ అలైహిస్సలాం జాతివారిపై అల్లాహ్ ఎలాంటి విపత్తు కుర్పించాడో అతనికి తెలియదా?

  • వారి చూపులను తీసుకొని వారిని అంధులుగా చేశాడు.
  • వారిపై పేలుడు వదిలాడు.
  • వారి ఆ నగరాన్ని తల్లక్రిందులుగా చేశాడు
  • దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళను ఎడతెగకుండా కుర్పించాడు. ఇలా వారందరినీ నాశనము చేశాడు.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడ్డవారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

مَنْ وَجَدْتُمُوهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوطٍ فَاقْتُلُوا الْفَاعِلَ وَالْمَفْعُولَ بِهِ

“లూత్ అలైహిస్సలాం జాతివారు పాల్పడిన లాంటి దుష్చర్యకు పాల్పడినవారిని మీరు చూసినట్లయితే ఆ ఇద్దరినీ నరికి వేయండి”. (అబూ దావూద్ 4462, తిర్మిజి 1456, ఇబ్ను మాజ 2561).

ఇలాంటి దుష్కార్యానికి పాల్పడినవారు స్వచ్ఛమైన తౌబా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ తో అధికంగా క్షమాభిక్ష కోరుట కూడా తప్పనిసరి.

ఇస్లామీయ నిషేధాలు – జాగ్రత్తలు (Prohibitions in Islam)


prohibitions-in-islamఅంశాల నుండి
: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ నసీరుద్దీన్

[ఇక్కడ Download PDF]

 

 

islamic-prohibitions1

islamic-prohibitions2

islamic-prohibitions3

036 సూరహ్ యాసీన్ – Telugu Quran Youtube Video

The Virtues of Surah Ya Sin ( Taken from Tafsir Ibn Kathir)

Al-Hafiz Abu Ya`la recorded that Abu Hurayrah, may Allah be pleased with him, said, “The Messenger of Allah said: (Whoever recites Ya Sin in the night, will wake up forgiven, and whoever recites Ha Mim in which Ad-Dukhan (the Smoke) is mentioned, will wake up forgiven.) Its chain of narration is good (Jayyid) .

Ibn Hibban recorded in his Sahih that Jundub bin `Abdullah, may Allah be pleased with him, said, “The Messenger of Allah said: (Whoever recites Ya Sin in the night, seeking the Face of Allah, will be forgiven.)

నమాజు నిధులు [పుస్తకం & వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

టైటిల్: నమాజు నిధులు
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ పుస్తకం చదవండి లేక డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [25 పేజీలు]

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్‌ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్‌ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్‌ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్‌) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుద్ధపతాకం ఎగిరేసి, గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్‌ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసేసమయం, సత్కార్యాల అకౌంట్‌ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు, మరి కొన్ని నమాజు మధ్యలో, మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము…….చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధి: (నమాజుకు ముందు) నమాజు కొరకు సిద్ధమవటం.
2- రెండవ నిధి: (నమాజు సందర్భంలో) నమాజు చేయటం.
౩- మూడవ నిధి: (నమాజు తర్వాత) జిక్ర్‌ మరియు కొన్ని ఆచరణలు.

నమాజు నిధులుయూట్యూబ్ ప్లే లిస్ట్ ( 10 వీడియోలు)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV21_VBmKxJdY1QzVcirxEfr

ఈ పుస్తకం మీద వీడియోపాఠాలు:

విషయ సూచిక:

మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్దత

1- వుజూ
2- వుజూ తర్వాత దుఆ
౩ మిస్వాక్‌
4- నమాజు కోరకు తొలి సమయంలో వెళ్ళటం
5- అజాన్‌ కు బదులు పలకటం
6- అజాన్‌ తర్వాత దుఆ
7- నమాజ్‌ కొరకు నడచి వెళ్ళడం
8- మొదటి పంక్తి, కుడి పంక్తి
9- సున్నతె ముఅక్కద
10- అజాన్‌ మరియు అఖామత్‌ మధ్వలో దుఆ
11- నమాజు కొరకు వేచియుండుట
12- ఖుర్‌ఆన్‌ పారాయణం, జిక్ర్
13- పంక్తులు సక్రమంగా ఉంచుట

రెండవ నిధి: నమాజు చేయటం

1- నమాజు ఘనత
2- సామూహిక నమాజు ఘనత
౩- ఖుషూ (అణుకువ, వినమత)
4- సనా
5- సూరె ఫాతిహ పారాయణం
6- ఆమీన్‌ పలకడం
7- రుకూ
8- రుకూ నుండి నిలబడిన తర్వాత
9- సజ్దాలు
10- మొదటి తషహ్హుద్
11- చివరి తషహ్హుద్ (ప్రవక్తపై దరూద్‌)
12- సలాంకు ముందు దుఆ

మూడవ నిధి: నమాజు తర్వాత అజ్కార్‌

[క్రింద పూర్తి పుస్తకం చదవండి]

ముందు మాట

అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అఫ్ జలిల్ ముర్ సలీన్, అమ్మాబాద్:

నిశ్చయంగా నమాజు ఇస్లాం మూల స్తంభాలలో రెండవది. అది ముస్లిం మరియు కాఫిర్ (సత్య తిరస్కారి)ల మధ్య వ్యత్యాస చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ المُشْرِكِينَ] {الرُّوم:31}
నమాజును స్థాపించండి. ముష్రికులలో కలసిపోకండి. (రూం 30: 31).

عَنْ بُرَيْدَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ×: (الْعَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمْ الصَّلَاةُ فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ)

బురైద రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉపదేశించారుః

“మనకి వారికి మధ్య ఉన్న ఒడంబడిక నమాజు విషయంలోనే, దాన్ని వదలిన వారు అవిశ్వాసానికి పాల్పడినట్లే”. (అహ్మద్ 5/346, తిర్మిజి 2621).

దానిని కాపాడే మనిషి తన ధర్మాన్ని కాపాడగలడు.

عَنْ نَافِعٍ مَوْلَى عَبْدِ اللهِ بْنِ عُمَرَ ^ أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ t كَتَبَ إِلَى عُمَّالِهِ: (إِنَّ أَهَمَّ أَمْرِكُمْ عِنْدِي الصَّلَاةُ فَمَنْ حَفِظَهَا وَحَافَظَ عَلَيْهَا حَفِظَ دِينَهُ وَمَنْ ضَيَّعَهَا فَهُوَ لِمَا سِوَاهَا أَضْيَعُ)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) బానిస నాఫిఅ రహిమహులాహ్ ఉల్లేఖనం ప్రకారం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తన గవర్నర్లకు ఇలా వ్రాసేవారుః “మీ సమస్త వ్యవహారాల్లో నా వద్ద అతి ముఖ్యమైనది నమాజ్. దానిని కాపాడి దానిపై స్థిరంగా ఉన్నవాడే తన ధర్మాన్ని కాపాడేవాడు. దాన్ని వృథా చేసేవాడు ఇతరవాటిని మరింత ఎక్కువగా వృథా చేసేవాడు“(ముఅత్త మాలిక్ 1/5, హ.నం.: 5.).

ఇస్లాం కడియాల్లో అన్నిటికంటే చివరిగా విరిగేది ఇదే. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ ÷ عَنْ رَسُولِ اللهِ ﷺ قَالَ: (لَيُنْقَضَنَّ عُرَى الْإِسْلَامِ عُرْوَةً عُرْوَةً فَكُلَّمَا انْتَقَضَتْ عُرْوَةٌ تَشَبَّثَ النَّاسُ بِالَّتِي تَلِيهَا وَأَوَّلُهُنَّ نَقْضًا الْـحُكْمُ وَآخِرُهُنَّ الصَّلَاةُ)

ఇస్లాం కడియాలు ఒక్కొక్కటి విరుగుతాయి. ఒక కడియం విరిగిన వెంటనే ప్రజలు దాని వెనక దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అన్నిట్లోకెల్లా ముందు విరిగే కడియం “హుకుం” అయితే చివరిగా విరిగేది “నమాజ్“([1]).

[1] అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.

ఈ హదీసు ఆధారంగానే ఇమాం అహ్మద్ ‘నమాజ్ వదిలేవారు అవిశ్వాసుల’ని సిద్ధాంతీకరించారు. దీనిపై అనేక ఆధారాలున్నాయి. అందుకే ‘నమాజు వదిలేవారు అవిశ్వాసానికి’ పాల్పడుతున్నారన్న విషయంపై ప్రవక్త సహచరులు ఏకీభవించారు.

ముజాహిద్, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించారు: ‘ప్రవక్త కాలంలో మీ వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్య వ్యత్యాస పరిచే ఆచరణ ఏముండినది’? అని, అందుకు ఆయన “నమాజ్” అని సమాధానం ఇచ్చారు([2]). “మీ వద్ద” అంటే ముస్లిముల వద్ద, వారు ప్రవక్త సహచరులు.

[2] తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.

అబుజ్జుబైర్ ఉల్లేఖనం ప్రకారం: ‘పాపాన్ని మీరు షిర్క్ అనేవారా?’ అని ఒక వ్యక్తి జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించగా నేను విన్నాను. దానికి ఆయన “లేదు” అని జవాబిచ్చారు. “మనిషి విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్యలో బేధం తెలుపునదేమిటి?” అని అడగ్గా “నమాజ్ వదలడం” అని సమాధానమిచ్చారు([3]).

[3] తాజీము కద్రిస్సలా 947.. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్న 1573.

ఇలాంటి మరో ఉల్లేఖనాన్ని అబుజ్జుబైర్ ఉల్లేఖించారు, పాపాన్ని మీరు కుఫ్ర్ (అవిశ్వాసం)గా భావించేవారా? అని జాబిర్ జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించినపుడు, “లేదు” అని జవాబిచ్చి, “మనిషి (విశ్వాసం) మరియు అవిశ్వాసంలో ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడమే” అని చెప్పారాయన(*).

ప్రవక్త సహచరులు ఇలా అనేవారని నాకు తెలిసిందని హసన్ ఉల్లేఖించారు([4]): “మనిషి (విశ్వాసం) మరియు షిర్క్ చేసి అవిశ్వాసుడయ్యే వాని మధ్య వ్యత్యాసం ఏదైనా ఉంటే, ధార్మిక పరమైన ఏ కారణం లేకుండా నమాజు విడనాడడం“. దీని సనద్ (ఆధారం) ప్రామాణికమైనది. హసన్ అంటే హసన్ బస్రీ, అతను అనేక మంది సహాబాలను కలసి వారితో హదీసులు విన్నారన్న విషయం తెలిసినదే.

[4] అస్సున్న 1372, అల్ ఇబాన 877, షర్హు ఉసూలి…..1539.

عَنْ عَبْدِ اللهِ بْنِ شَقِيقٍ الْعُقَيْلِيِّ قَالَ: (كَانَ أَصْحَابُ مُحَمَّدٍ ﷺ لَا يَرَوْنَ شَيْئًا مِنْ الْأَعْمَالِ تَرْكُهُ كُفْرٌ غَيْرَ الصَّلَاةِ)

అబ్దుల్లాహ్ బిన్ షఖీఖ్ ఇలా తెలిపారుః “మనిషి ఏదైనా ఆచరణ విడనాడితే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లగునని ప్రవక్త సహచరులు భావించేవారు కాదు. కాని నమాజ్ విడనాడితే మాత్రం అవిశ్వాసానికి గురి అయినట్లని అనుకునేవారు“. దీని సనద్ ప్రామాణికమైనది. మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “నమాజ్ తప్ప ఏదైనా ఆచరణ విడనాడితే అది అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుందనే విషయం మాకు తెలియదు“. (అంటే నమాజు విడనాడుట కుఫ్ర్ కు సమానం అని). (అస్సున్న 1378).

అయ్యూబ్ ఉల్లేఖించారుః “నమాజు విడనాడుట అవిశ్వాసం. ఇందులో ఏలాంటి భేదాభిప్రాయం లేదు“. (తాజీము కద్రిస్సలా 978).

ముహమ్మద్ బిన్ నస్ర్ తన గ్రంథం తాజీము కద్రిస్సలా 990లో ఇలా పేర్కొన్నారుః ఇస్ హాఖ్ చెప్పగా నేను విన్నానుః “సమయం దాటినప్పటికీ ఏ ధార్మిక ఆటంకం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ చేయనివాడు అవిశ్వాసి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రుజువైన విషయమే. ఇస్ హాఖ్ అంటే ఇస్ హాఖ్ బిన్ రాహ్ వైహ్. ఇతను సహాబాల తర్వాత వచ్చినవారిలో ఏ కొందరైతే ఈ విషయంలో విభేదించారో వారిలో ఒకరు కారు. అందుకే అతని శిష్యుడు ముహమ్మద్ బిన్ నస్ర్ ఇలా చెప్పాడుః “నమాజు విడనాడేవాడు అవిశ్వాసి (బేనమాజి కాఫిర్), అతను ధర్మ భ్రష్టుడు మరియు దానిని స్థాపించనివానితో యుద్ధం చేయాలని” ఉల్లేఖించబడిన ప్రవక్త సూక్తులను అతను (ఇస్ హాఖ్) ఉల్లేఖించాడు. ప్రవక్త సహచరులతో కూడా ఇలాంటి విషయమే రుజువైనది. సహచరుల్లో ఏ ఒక్కరు కూడా దీనికి భిన్నాభిప్రాయం గలవారని రుజువు లేదు. వారి తర్వాత వచ్చిన విద్వాంసుల్లో కొందరు “బేనమాజి కాఫిర్, దానిని స్థాపించని వానితో యుద్ధం చేయాలని” ప్రవక్త మరియు వారి సహచరులతో ఉల్లేఖించబడిన ఉల్లేఖనాల వేరు భావం తీసి విభేదించారు.

అబ్దుల్లాహ్ “సున్నహ్”లో, ఇబ్ను నస్ర్ “తాజీము కద్రిస్సలా”లో, ఖల్లాల్ “సున్నహ్”లో, ఆజుర్రి “షరీఅ”లో మరియు ఇబ్ను బత్త “ఇబాన”లో ఉల్లేఖించారుః “సహాబాల ఒక పెద్ద సంఖ్య మరియు తదితరులు నమాజు విడనాడినవారిని కాఫిర్ అనేవారు“. మరి కొందరైతే నమాజు వదిలేవాడు కాఫిర్ అనే అధ్యాయం ప్రత్యేకించి దానికి సంబంధించిన నిదర్శనాలు అందులో పేర్కొన్నారు.

సోదరుడు సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబీ “కునూజుస్సలా” (నమాజు నిధులు) పేరుతో చిరు పుస్తకం వ్రాసి అందులో ఈ గొప్ప విధిని, ఇస్లాంలో దాని స్థానాన్ని స్పష్టపరిచారు. నమాజు యొక్క లాభాల్ని దాని ప్రత్యేకతల్ని సైతం తెలియజేస్తూ ఇతర విధులపై దీని (నమాజ్) ప్రాముఖ్యతను చాటి చెప్పారు. దాన్ని నెరవేర్చే వారికి లభించే పుణ్యాలను కూడా మన ముందుంచారు. అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం నొసంగుగాక! మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక!

అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ అస్సఅ’ద్

భూమిక

అల్ హందు లిల్లాహిల్ మలికిల్ జబ్బార్, అల్ వాహిదిల్ ఖహ్హార్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీకలహూ రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ. అల్లాహ్ ప్రవక్తను ఆకాశాల వైపు ఆహ్వానించి విధి నమాజుల బహుమానం ప్రసాదించాడు. అది విశ్వాసం తర్వాత మొదటి విధి. విశ్వాసుల ఉత్తమ, ప్రథమ, ప్రముఖమైన గుణం.

నిశ్చయంగా నమాజ్ మనస్సుకు మంచి శిక్షణ ఇస్తుంది, ఆత్మను శుద్ధి పరుస్తుంది. హృదయాలను ప్రకాశవంతం చేస్తుంది, అందువల్ల మనిషిలో అల్లాహ్ యొక్క గొప్పతనం మొలకెత్తుతుంది. తద్వారా మనిషిని సౌభాగ్యవంతునిగా చేసి, అతని నడవడికలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒకరి వెనుక ఒకరు వచ్చిన అనేక ప్రవక్తల వద్ద తౌహీద్ తర్వాత అతి ముఖ్యమైన సంప్రదాయం ఇది. ఇస్మాఈల్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడుః

అతను తన ఇంటివారిని నమాజును పాటించండి అని ఆజ్ఞాపించేవాడు“. (మర్యం 19: 55).

ఈసా అలైహిస్సలాం విషయంలో ఇలా తెలిపాడుః

నేను జీవించి ఉన్నంత కాలం నమాజును, జకాతును పాటించాలని ఆజ్ఞాపించాడు“. (సూరె మర్యం 19: 31).

నమాజ్ ద్వారా ప్రతి రోజూ అల్లాహ్ తో సంబంధం పెరుగుతుంది. ఇలా భక్తునికి ఒక రకమైన ఆత్మబలం లభిస్తుంది. అది అతనికి ఇతర విధుల నిర్వహణకు సహాయపడుతుంది.

నిశ్చయంగా నమాజ్ లోని అమూల్యమైన నిధులు మన కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి. కాని గుడ్డివారు ఎలా చూడ గలుగుతారు? నమాజులో గుప్తమైన మూడు నిధులున్నాయి. అల్లాహ్ తో సహాయం కోరిన తర్వాత అన్వేషణ, పరిశీలన మరియు చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో నీవు చేసే ఒకే ఒక్క నమాజు వల్ల సర్వ ముస్లిములోకెల్లా ఎక్కువ ధనసంపత్తి గలవాడవు అవుతావు.

గుప్తమైన మొదటి నిధిః “నమాజు కొరకు సంసిద్ధత”. వుజూ, అజాన్ యొక్క జవాబు మరియు త్వరగా నమాజుకు వెళ్ళడం ద్వారా నీవు ఈ నిధిని పొందగలవు.

దాగి ఉన్న రెండవ నిధిః పూర్తి శ్రధ్ధాభక్తులతో ప్రవక్త పద్దతి ప్రకారం నమాజు చేస్తూ, దాని అంతరంగంలో మునిగి తేలాడుతూ సంపాదించవచ్చు.

ఇక మూడవ నిధిని నమాజు తర్వాత జిక్ర్, దుఆ మరి సున్నతుల ఆచరణ, ఇంకా దాని తర్వాత నమాజు ప్రతీక్షణలో ఉండి పొందవచ్చు.

ఈ రచనలో ఏదైనా లోటు, పొరపాటు జరిగి ఉంటే మన్నించాలని, దీనిని ముస్లిలకు ప్రయోజనకరమైనదిగా చేయాలని అల్లాహ్ నే వేడు కుంటున్నాను. నా ఈ కృషికి బదులుగా రెట్టింపు పుణ్యాలు; (1. ఇజ్తిహాద్, 2. సరియైన దాని పుణ్యం) ప్రసాదించాలని కూడా ఆ కరుణప్రదాతనే వేడుకుంటున్నాను.

 వ ఆఖిరు దఅవానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

అబూ సుల్తాన్ సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబి
పోస్ట్ బాక్స్ నం: 270144. రియాజ్. పిన్ కోడ్: 11352

నమాజు నిధులు

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుధ్ధపతాకం ఎగిరేసి గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు. మరి కొన్ని నమాజు మధ్యలో. మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము……..’చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధిః (నమాజుకు ముందు) నమాజు కొరకు సంసిద్ధత.

2- రెండవ నిధిః (నమాజు సందర్భంలో) నమాజు చేయుట.

3- మూడవ నిధిః (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.

మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్ధత

ఈ విలువగల నిధిని మనం నమాజులో ప్రవేశించక ముందు నమాజుకు సంబంధించిన ప్రథమ ఏర్పాట్లు మరియు మానసిక, ఆత్మీయ సంసిద్ధతల ద్వారా పొందగలము. దానికి అర్హులమయ్యే మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి.

1 – వుజూ

వుజూ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. పుణ్యాల సంపాదన, వాటి రెట్టింపులకై ఇది మొదటి మెట్టు. వుజూ ద్వారా ఈ క్రింద తెలుపబడే పుణ్యాలు పొందగలము.

(అ) అల్లాహ్ యొక్క ప్రేమ

అల్లాహ్ ఆదేశం:

నిశ్చయంగా తౌబా చేసేవారిని మరియు పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు“. (బఖర 2: 222).

అల్లాహ్ మనల్ని ప్రేమించటం కంటే గొప్ప పుణ్యమేమిటి?

షేఖ్ సఅదీ తన తఫ్సీర్ -తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్-లో చెప్పారుః “ఈ ఆయతులో ‘పరిశుద్ధతను పాటించేవారు’ అంటే పాపాల నుండి దూరముండడం, అయితే ఇందులో మలినము నుండి శుద్ధి పొందుట కూడా వస్తుంది. పరిశుభ్రత మరియు వుజూ ఒక ధార్మిక విషయం అని దీని ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే దాన్ని పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని వచ్చింది. అందుకే పరిశుభ్రత, వుజూ నమాజ్, తవాఫ్ మరియు ఖుర్ఆన్ పారాయణానికి ఒక షరతుగా ఉంది.”

(ఆ) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ أَوْ الْمُؤْمِنُ فَغَسَلَ وَجْهَهُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ يَدَيْهِ خَرَجَ مِنْ يَدَيْهِ كُلُّ خَطِيئَةٍ كَانَ بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ رِجْلَيْهِ خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوبِ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః

“ముస్లిం లేక మోమిన్ దాసుడు వుజూ చేస్తూ, తన ముఖం కడిగినపుడు ప్రవహించే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కళ్ళతో చూసి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది (మన్నించబడుతుంది). రెండు చేతులు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో చేయితో పట్టి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. రెండు కాళ్ళు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కాళ్ళు నడచి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. చివరికి అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడై వెళ్తాడు”. (ముస్లిం 244).

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ ÷ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ).

ఎవరు సక్రమంగా వుజూ చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలు దూరమయిపోతాయి. చివరికి అతని గోళ్ళ నుండి వెళ్ళిపోతాయి“. (ముస్లిం 245).

మరో గొప్ప ఘనత క్రింద పాదసూచికలో లో చూడండిః([5]).

[5] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

(ఇ) ప్రళయదినాన వుజూ అంగములు (కాంతిగా) ప్రకాశిస్తాయి:

عن أَبِي هُرَيْرَةَ ÷ قَالَ إِنِّي سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ فَمَنْ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“ప్రళయదినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకో దలిస్తే వారు అలా వృద్ధి చేసుకోవచ్చు”. (బుఖారి 136, ముస్లిం 246).

(ఈ) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: (إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ وَكَثْرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِدِ وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ فَذَلِكُمْ الرِّبَاطُ فَذَلِكُمْ الرِّبَاطُ).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 251).

పరిస్థితులూ అననుకూలంగా ఉండుటః అంటే చలి కాలంలో చల్ల దనం, లేక అనారోగ్యం వల్ల చలనం, కదలిక కష్టంగా తోచినపుడు వుజూ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో పాపాల మన్నింపు, పుణ్యాల రెట్టింపు, స్వర్గంలో ప్రవేశముద్దేశంతో పై మూడు కార్యాలు నెరవేర్చువాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాల మన్నింపు మరియు షహాదత్ అపేక్షతో శత్రువు మధ్యలో పహరా కాయడం (రిబాత్)తో పోల్చారు.

మరికొందరి అభిప్రాయ ప్రకారం, వీటిని ‘రిబాత్‘ అనటానికి కారణ మేమంటే అవి మనిషిని పాపాల నుండి దూరముంచుతాయి. నిజము దేవుడెరుగును. (అల్ మత్జరుర్రాబిహ్ ఫీ సవాబిల్ అమలిస్సాలిహ్ లిల్ హాఫిజ్ అబూ ముహమ్మద్ షర్ఫొద్దీన్ అబ్దుల్ మోమిన్ అద్దిమ్యాతి).

(ఉ) పాపాల క్షమాపణ మరియు స్వర్గ ప్రవేశం:

عَنْ عُثْمَانَ ÷ أنَّهُ تَوَضَّأَ ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ఉస్మాన్ రజియల్లాహు అన్హు వుజూ చేసి ఇలా చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వుజూ చేస్తూ ఉండగా చూశాను. పిదప ఆయన ఇలా ప్రవచించారుః “ఎవరు నా ఈ పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 1934, ముస్లిం 226).

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (مَا مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ الْوُضُوءَ وَيُصَلِّي رَكْعَتَيْنِ يُقْبِلُ بِقَلْبِهِ وَوَجْهِهِ عَلَيْهِمَا إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా ఒకరు ఉత్తమ రీతిలో వుజూ చేసుకొని, పూర్తి శ్రద్ధాభక్తులతో రెండు రకాతుల నమాజు చేసినచో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది”. (అబూ దావూద్ 906, ముస్లిం 234).

2 – వుజూ తర్వాత దుఆ

వుజూ తర్వాత దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. మొదటి నిధిలోని మరికొన్ని పుణ్యాల అన్వేషణలో మనం ఉన్నాము. వుజూ తర్వాత గల ప్రత్యేక దుఆల ద్వారా క్రింది పుణ్యాలు సంపాదించవచ్చు.

(అ) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

(ఆ) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయదినం వరకు తీయబడదుః

عَنْ أَبِي سَعِيدِ الخُدرِي ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَوَضَّأَ فَقَالَ: سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَن لاَ إِلَهَ إِلاَّ أَنتَ أَسْتَغْفِرُكُ وَأَتُوبَ إِلَيكَ، كُتِبَ فِي رِِقٍّ ثُمَّ جُعِلَ فِي طَابِعٍ فَلَمْ يُكسَرْ إِلى يَومِ الْقِيامة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా వుజూ చేసి, “సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక” చదువుతారో అతని పేరు తోలు కాగితంలో వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు”([6]).

[6] [సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170]

3 – మిస్వాక్

ఒక పుణ్యం తర్వాత మరో పుణ్యం సంపాదించడంలోనే ఉన్నాము, ఇప్పుడు మనం (మిస్వాక్) స్టేషన్ లో ఉన్నాము. ఈ గొప్ప పుణ్యం గురించి చదవండిః మిస్వాక్ నోటిని శుభ్రం చేయునది, అల్లాహ్ ను సంతృష్టి పరచునది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లఖించారుః

السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ مَرْضَاةٌ لِلرَّبِّ

మిస్వాక్ నోటికి శుభ్రత కలుగజేస్తుంది మరియు అల్లాహ్ ను సంతృష్టి పరుస్తుంది[7].

 [7] నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

4 – నమాజు కొరకు తొలిసమయంలో వెళ్ళటం

నమాజు కొరకు తొలి సమయంలో (త్వరగా, శీఘ్రముగా) బయలుదేరుట చాలా ఘనతగల విషయం. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).

“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).

జుమా నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటంలో ప్రత్యేక శ్రేష్ఠత మరియు చెప్పరాని విశిష్ఠత ఉంది. ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

عَنْ أَوسِ بنِ أَوسٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ غَسَّلَ وَ اغْتَسَلَ يَومَ الْـجُمُعَةِ وَ بَكَّرَ وَ ابْتَكَرَ وَدَنَا مِنَ الإِمَامِ فَأَنصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطوَةٍ يَخطُوهَا صِيامُ سَنَةٍ وَ قِيامُها وَ ذَلِكَ عَلَى اللهِ يَسير).

ఎవరు జుమా రోజు తలంటు స్నానం చేసి, తొలి సమయంలో అందరికంటే ముందుగా (మస్జిద్ చేరుకుని), ఇమాంకు సమీపంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ కు ఎంతో కష్టం కాదు“([8]).

[8] అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది

జుమా కొరకు ఒక్కో అడుగుపై ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు తహజ్జుద్ చేసినంత పుణ్యం!! ఇంతకంటే గొప్ప శ్రేష్ఠత, ఘనతగల ఫలితం ఇంకేముంది?

నిరంతరం నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటం మనసంతా మస్జిద్ లోనే ఉందన్నదానికి సంకేతం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశించారుః “అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడుః మస్జిద్ నుండి వెళ్ళినప్పటి నుండీ అక్కడికి తిరిగి వచ్చే వరకు మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి“. (తిర్మిజి 2391, బుఖారి 660, ముస్లిం 1031).

5 – అజాన్ కు బదులు పలకటం

ఇప్పటికీ మనం నమాజుకు సంబంధించిన నిధుల మధ్య ఉత్తమ మైన సుకృతాలు, అమూల్యమైన పుణ్యాల అన్వేషణలో ఉన్నాము. అజాన్ యొక్క జవాబు ద్వారా స్వర్గం పొందవచ్చన్న శుభవార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చియున్నారు. ఈ రెండు హదీసులపై శ్రద్ధ వహించండిః

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِذَا قَالَ الْـمُؤَذِّنُ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ فَقَالَ أَحَدُكُمْ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ ثُمَّ قَالَ حَيَّ عَلَى الصَّلَاةِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ حَيَّ عَلَى الْفَلَاحِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ مِنْ قَلْبِهِ دَخَلَ الجَنَّةَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే, అతను (ముఅజ్జిన్) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అంటే, అతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అన్నపుడు ఇతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అంటే, అతను హయ్య అలస్సలా అన్నపుడు ఇతను లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్ అంటే, అతను హయ్య అలల్ ఫలాహ్ అన్నపుడు ఇతను లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 385).

عًن أَبِي هُرَيْرَةَ ÷ يَقُولُ كُنَّا مَعَ رَسُولِ الله ﷺ بِتَلَعَاتِ الْيَمَنِ فَقَامَ بِلَالٌ يُنَادِي فَلَمَّا سَكَتَ قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ قَالَ مِثْلَ مَا قَالَ هَذَا يَقِينًا دَخَلَ الجَنَّةَ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668).

6 – అజాన్ తర్వాత దుఆ

అజాన్ తర్వాత దుఆ యొక్క ఘనత కూడా గొప్పగా ఉంది. కాని అనేకులు దీని పట్ల అశ్రద్ధ వహిస్తున్నరు. దాని సారాంశం క్రింది విధంగా ఉందిః

(అ) పాపాల మన్నింపుః

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ÷ عَنْ رَسُولِ الله ﷺ أَنَّهُ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْـمُؤَذِّنَ وَأَنَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ رَضِيتُ بِالله رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا وَبِالْإِسْلَامِ دِينًا غُفِرَ لَهُ ذَنْبُهُ).

సఅద్ బిన్ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ముఅజ్జిన్ అజాన్ విన్నాక ‘వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా’ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 386, అబూ దావూద్ 525, తిర్మిజీ 210, నిసాయీ 672, ఇబ్ను మాజ 721).

(ఆ) ప్రళయదినాన ప్రవక్త యొక్క సిఫారసుకు అర్హుడవుతాడుః

عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ النِّدَاءَ اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ).

“‘అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ’. ఈ దుఆ ఎవరు అజాన్ విన్న తర్వాత చదువుతారో వారు ప్రళయదినాన నా సిఫారసుకు అర్హులవు తార”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చినట్లు జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారు. (బుఖారీ 614).

7 – నమాజ్ కొరకు నడచి వెళ్ళడం

నమాజు కొరకు నడచి వెళ్ళడంలో అమూల్యమైన పుణ్యాలున్నాయి. అవి విశ్వాసి యొక్క సత్కర్మల అకౌంట్ ను పెంచుతాయి. దీనిని సంక్షిప్తంగా క్రింద తెలియజేస్తున్నాముః

(అ) స్వర్గంలో ఆతిథ్యం

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَنْ غَدَا إِلَى الْـمَسْجِدِ أَوْ رَاحَ أَعَدَّ اللهُ لَهُ فِي الْـجَنَّةِ نُزُلًا كُلَّمَا غَدَا أَوْ رَاحَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (ముస్లిం 669, బుఖారి 662).

(ఆ) పాపాల మన్నింపు మరియు స్థానాల ఉన్నతం

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

(ఇ) అతి గొప్ప ప్రతిఫలం

عَنْ أَبِي مُوسَى ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ أَعْظَمَ النَّاسِ أَجْرًا فِي الصَّلَاةِ أَبْعَدُهُمْ إِلَيْهَا مَمْشًى فَأَبْعَدُهُمْ وَالَّذِي يَنْتَظِرُ الصَّلَاةَ حَتَّى يُصَلِّيَهَا مَعَ الْإِمَامِ أَعْظَمُ أَجْرًا مِنَ الَّذِي يُصَلِّيهَا ثُمَّ يَنَامُ).

అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారుః “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు”. (ముస్లిం 662, బుఖారీ 651).

(ఈ) ప్రళయదినాన సంపూర్ణ కాంతి

عَنْ بُرَيْدَةَ ÷ عَنَ النَّبِيِّ ﷺ قَالَ: (بَشِّرْ الْـمَشَّائِينَ فِي الظُّلَمِ إِلَى الْـمَسَاجِدِ بِالنُّورِ التَّامِّ يَوْمَ الْقِيَامَةِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి”. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).

(ఉ) సదకా

عَن أَبي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ :…. (وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ وَكُلُّ خُطْوَةٍ تَمْشِيهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే”. (బుఖారీ 2891, ముస్లిం 1009).

మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).

8 – మొదటి పంక్తిలో నిలబడటానికి ముందంజ వేయటం

(అ) మొదటి పంక్తిలో ఉండే కాంక్ష

మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉందిః

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).

“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).

(ఆ) దైవదూతలతో పోలిక

عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ ÷ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُولُ الله ﷺ فَقَالَ :(أَلَا تَصُفُّونَ كَمَا تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا فَقُلْنَا يَا رَسُولَ الله وَكَيْفَ تَصُفُّ الْـمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا قَالَ يُتِمُّونَ الصُّفُوفَ الْأُوَلَ وَيَتَرَاصُّونَ فِي الصَّفِّ).

జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. (ముస్లిం 430).

(ఇ) పురుషులకు ఏది మేలు?

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పురుషుల మేలైన పంక్తి మొదటి పంక్తి, చెడ్డది చివరిది. స్త్రీల మేలైన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

(ఈ) వెనకుండే వారిని అల్లాహ్ వెనకనే ఉంచాలన్న ప్రవక్త శాపనార్థానికి దూరంగా ఉండవచ్చుః

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ÷ أَنَّ رَسُولَ الله ﷺ رَأَى فِي أَصْحَابِهِ تَأَخُّرًا فَقَالَ لَهُمْ (تَقَدَّمُوا فَأْتَمُّوا بِي وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمْ اللهُ).

అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారుః “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు”. (ముస్లిం 438).

(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలుః

عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ ÷ قَالَ: كَانَ رَسُولُ الله ﷺ يَتَخَلَّلُ الصَّفَّ مِنْ نَاحِيَةٍ إِلَى نَاحِيَةٍ يَمْسَحُ صُدُورَنَا وَمَنَاكِبَنَا وَيَقُولُ: (لَا تَخْتَلِفُوا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ) وَكَانَ يَقُولُ: (إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى الصُّفُوفِ الْأُوَلِ).

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారుః “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 664).

9 – సున్నతె ముఅక్కద

(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.

عَنْ أُمِّ حَبِيبَةَ ÷ زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.

ఫర్జ్ కంటే ముందున్నవిః

1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః

عَنْ عَائِشَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنْ الدُّنْيَا وَمَا فِيهَا).

ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).

నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండిః ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.

2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.

ఫర్జ్ తర్వాతవిః

1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.

(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ ﷠ ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (رَحِمَ اللهُ امْرَأً صَلَّى قَبْلَ الْعَصْرِ أَرْبَعًا).

అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!“. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).

10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ

నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (الدُّعَاءُ لَا يُرَدُّ بَيْنَ الْأَذَانِ وَالْإِقَامَةِ)

అజాన్ మరియు ఇఖామత్ మధ్యలోని దుఆ త్రోసిపుచ్చబడదు“. (తిర్మిజి 212, ముస్నద్ అహ్మద్ 3/119).

11 – నమాజు కొరకు వేచించుట

నమాజు కొరకు వేచియుండడం అనేక పుణ్యాలకు నిన్ను అర్హునిగా చేస్తుందిః

(అ) నమాజు కొరకు వేచియుండుట నమాజు ఘనతకు సమానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ﷜ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త ﷺ ప్రవచించారని అబూ హురైరా ﷜ ఉల్లేఖించారుః

“మీలో ఒక వ్యక్తి నమాజు కొరకు వేచి ఉన్నంత కాలం నమాజు చేస్తున్న పుణ్యం పొందుతాడు”. (బుఖారి 659, మస్లిం 649).

(ఆ) దైవదూతల ఇస్తిగ్ఫార్ (క్షమాభిక్షః)

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ الْعَبْدُ فِي صَلَاةٍ مَا كَانَ فِي مُصَلَّاهُ يَنْتَظِرُ الصَّلَاةَ وَتَقُولُ الْـمَلَائِكَةُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ حَتَّى يَنْصَرِفَ أَوْ يُحْدِثَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“మనిషి ఎంత వరకు నమాజు చేసుకున్న స్థలంలో కూర్చోని ఉంటాడో అంతవరకూ అతనికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపానవాయువు వెడిలే వరకు. దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తారుః అల్లాహ్ ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు”. (ముస్లిం 649, బుఖారీ 176). ఒక మనిషి కొరకు దైవదూతలు దుఆ చేస్తున్నారంటే అల్లాహ్ అతని గురించి చేస్తున్న వారి దుఆలను తప్పకుండా అంగీకరిస్తాడు. (అష్షర్హుల్ ముమ్తిఅలి షేఖ్ ఇబ్ను ఉసైమీన్).

(ఇ) పాపాల మన్నింపు, స్థానాల రెట్టింపు

عَنْ أَبِي هُرَيرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: ( أَلاَ أَدُلُّكُم عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ ؟) قَالُوا: بَلَى يَا رَسُولُ الله قاَلَ: ( إسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ ، وَكَثرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِد ، وَانتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ، فَذَلِكُمُ الرِّبَاط ).

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ﷺ ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 587). (రిబాత్ భావం పేజి నం. 15లో చూడండి).

12 – ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట

మస్జిద్ లో త్వరగా వచ్చిన వ్యక్తి అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు ఎన్నో రకాల ఆరాధనలు పాటించ గలుగుతాడు. ఉదాః జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ వరాల పట్ల యోచించటం, ఇహలోకం, దానికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం ఉండటం. దీని వల్ల మనుసును నమాజులోనే నిలిపి, వినయ వినమ్రత పాటించే అవకాశం ఉండును. అదే వెనక వచ్చే వ్యక్తి (పై లాభాలను నోచుకోలేడు) అతను నమాజు చేసినా అతని మనస్సు ఐహిక విషయాల్లో ఇరుక్కొని ఉంటుంది, నమాజులో లీనమై నమ్రత పాటించకపోవచ్చు. అతని శరీరం మస్జిదులో, నమాజులో ఉన్నా అతని అంతర్యం నమాజులో ఉండకపోవచ్చు.

ముస్లిం సోదరా! నీ పరలోక సేవింగ్ అకౌంట్ పెరుగుదలకై నీవు నమాజు కొరకు నిరీక్షిస్తున్నంత సమయంలో కొన్ని స్వర్ణవకాశాలు ఉదాహరణగా చూపిస్తున్నాను. వాటిపై శ్రద్ధ వహించుః

(అ) దివ్య ఖుర్ఆన్ పారాయణం
పారాయణ పరిమాణంఫలితంవిధానం
1- ప్రతి నమాజు యొక్క అజాన్ మరియు ఇఖామ- తుల మధ్యలో 5పేజిల పారాయణం. ఇలా ప్రతి రోజు 25 పేజిలవుతాయి.24 రోజుల్లో మొత్తం ఖుర్ఆన్ యొక్క పారాయణం అవుతుంది.ఖుర్ఆన్ పేజిలు 604 25 పేజిలు × 24 రోజులు = 600
2- నమాజుకై నిరీక్షిస్తూ ప్రతి రోజు ఒక్క పారా.30 రోజుల్లో పూర్తి ఖుర్ఆన్ పారాయణం ఖుర్ఆన్ పారాలు 30. నెల రోజులు 30.
30 పారాలు ÷ 30 రోజులు = రోజుకు 1 పార
3- నమాజు కొరకు నిరీక్షిస్తూ ప్రతి రోజు 3 ఆయతులు కంఠస్తం చేయుట.ఇన్షా అల్లాహ్ 8 సంవత్సరాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.అనుభవ పూర్వకమైన విషయం.
4- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు 1 ¼ పేజి కంఠస్తంసుమారు పదహారు మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం అవుతుంది. ఇన్షాఅల్లాహ్!604 ÷ 1¼ పేజి = 483.2 రోజులు 483.2 ÷ 30 రో. = 16 నెలల 10 రో.
5- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు రెండు పేజిలు కంఠస్తంసుమారు 10 నెలల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం ఇన్షాఅల్లాహ్604 ÷ 2 = 302 రోజులు = పది నెలలు.
6- మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణంపూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యంఅబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు. (బుఖారిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
7- నాలుగు సార్లు సూర ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్.పూర్తి ఖుర్ఆన్ చదివినంత పుణ్యం.ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఇబ్ను ఉమర్ ఉల్లేఖించారుః “సూర ఖుల్ హువల్లాహు అహద్ మూడోవంతు ఖుర్ఆన్ మరియు సూర ఖుల్  యా అయ్యుహల్ కాఫిరూన్ నాలుగోవంతు ఖుర్ఆన్ కు సమానం”. (తబ్రానీ ఔసత్ 1/66. 186. సహీహ లిల్ అల్బానీ 2/132).
8- ఒక్క సారి సూర ముల్క్ పారాయణంపాపాల మన్నింపుప్రవక్త ﷺ ఉపదేశిం-చారని అబూ హురైర ﷜ ఉల్లేఖించారుః “ఖుర్ఆనులో 30 ఆయతుల ఒక సూర ఉంది. (దాన్ని చదివిన వారి పట్ల) అది సిఫారసు చేస్తే దాని సిఫారసు అంగీకరింపబడుతుంది. అది తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ (సూర ముల్క్). (తిర్మిజిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు సూరతిల్ ముల్క్. 2816).

ఇప్పటికీ మనము పుణ్యాల వనంలోనే ఉన్నాము. నాతో పాటు మీరు కూడా ఖుర్ఆన్ పారాయణం యొక్క ఈ గొప్ప ఘనతపై శ్రద్ధ వహించండి.

عن عَبْدِ الله بْنِ مَسْعُودٍ ÷ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ وَالْـحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ الم حَرْفٌ وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ﷜ ఉల్లేఖించారు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “దివ్యగ్రంథంలోని ఒక అక్షరం చదివినవానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్, లామ్, మీమ్ ను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లాం ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (తిర్మిజి 2835).

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా ద్వారా దీని ఉదాహరణ చూడండిః

సూర కౌసర్ యొక్క అక్షరాలు 42.

ఒక పుణ్యం పది రెట్లు ఉంటుంది. ఇలా 42×10=420 అవుతాయి.

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా కౌసర్ యొక్క ఘనతను గ్రహించు, ఇక నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో నీవు చాలా పేజీలు చదివినప్పుడు నీకు ఎన్ని పుణ్యాలు లభిస్తాయో యోచించు?

(ఆ) అజ్ కార్ (అల్లాహ్ స్మరణ)
జిక్ర్ఘనత/ పుణ్యంనిదర్శనం
1- 100 సార్లు సుబ్ హానల్లాహ్1000 పుణ్యాలు లేదా 1000 పాపాల మన్నింపుసఅద్ తెలిపారుః మేము ప్రవక్త ﷺసన్నిధిలో ఉండగా ఆయన ఇలా ప్రశ్నించారుః ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు సంపా దించడం మీలోనెవరితోనైనా కాని పనియా? అచ్చట కూర్చున్నవారిలో ఒకరన్నారుః మాలో ఎవడైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగల డు? దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ చదవాలి. దానికి బదులు అతనికి వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి”. 
2- లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీక లహూ ల హుల్ ముల్కు వల హుల్ హందు వహు వ అలా కుల్లి షైఇన్ కదీర్. 100 సార్లు.పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా ﷜ ఉల్లేఖిం చారుః “ఎవరైతే ఒక రోజులో 100 సార్లు “లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీ క లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్” పఠిస్తాడో, అతనికి పది బానిసల్ని విడుదల చేసిన పుణ్యం ప్రాప్తమవుతుంది. 100 పుణ్యాలు లిఖించబడతాయి. 100 పాపాలు మన్నించబడతాయి. అతనికి సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షణ ఉంటుంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాదు. ‚
3- లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్స్వర్గ కోశాల్లో ఒకటిప్రవక్త ﷺ ఇలా ఉప దేశించారని అబూ మూసా అష్అరీ ﷜ ఉల్లేఖించారుః స్వర్గ కోశాల్లోని ఒక కోశం గురించి నీకు తెలుపనా? అని. తప్పక తెలుపండి ప్రవక్తా! అని నేను విన్నవించు కున్నాను. అప్పుడు చెప్పారుః “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”.ƒ
4- సుబ్ హా నల్లాహిల్ అజీం వ బి హందిహిఒక్క ఖర్జూ రపు చెట్టు స్వర్గంలో నాట బడు తుందిప్రవక్త ﷺ ఆదేశం: “ఎవరు సుబ్ హానల్లా హిల్ అజీం వ బిహందిహీ” అంటారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాట బడుతుంది.
5- విశ్వాసులైన స్త్రీ పురు షుల మన్నింపు కొరకు అల్లాహ్ ను కోరడంప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదు లుగా ఒక పుణ్యంప్రవక్త ﷺ ఇలా ఆదే శించారుః “ఎవరు విశ్వాస స్త్రీ పురుషుల మన్నింపు కొరకు అల్లాహ్ ను వేడుకుంటారో వారికి ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదులు ఒక పుణ్యం లభిస్తుంది.” [ముస్లిం 2698. బుఖారీ 6403. ముస్లిం 2691. ƒ బుఖారీ 6409, ముస్లిం 2704. „ తిర్మిజి 3464. … తబ్రానీ, సహీహుల్ జామి 6026.]

ఒక ముస్లిం ముఖ్యంగా నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి ఈ అమూల్యమైన సమయాన్ని ఈ శ్రేష్ఠ స్థలం (మస్జిద్)లో పై అజ్ కార్ చదవడంలో గడపడాన్ని అదృష్టంగా భావించాలి. తద్వారా అనేక పుణ్యాలు లభించవచ్చు.

13 – పంక్తులు సక్రమంగా ఉంచుట

నమాజు చేయుటకు పంక్తులను సరి చేసుకొనుట విధిగా ఉంది. దీని ఘనతలు చాలా ఉన్నాయి.

(అ) మనసుల మరియు ఉద్దేశాల ఐక్యతః

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ ÷ يَقُولُ: قَالَ النَّبِيُّ ﷺ: (لَتُسَوُّنَّ صُفُوفَكُمْ أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوهِكُمْ).

నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః “మీరు మీ పంక్తులను సక్రమంగా ఉంచుకోండి. అలా చేయకపోతే అల్లాహ్ మీ ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు”. (బుఖారి 717, ముస్లిం 436).

ఇమాం నవవీ ﷫ ఇలా చెప్పారుః ‘మీ మధ్య విరోధ ద్వేషాలను నాటుతాడు. మీ హృదయాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు‘.

ఇక పంక్తులను సరి చేయకపోవడం ఎంత పాపమో, ప్రవక్త సంప్ర దాయానికి విరుద్దమో తెలియనిది కాదు.

(ఆ) పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు పరిపూర్ణతలో ఒక భాగం:

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصُّفُوفِ مِنْ إِقَامَةِ الصَّلَاةِ).

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అనస్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః “మీ పంక్తులను తిన్నగా, సక్రమంగా ఉంచండి. పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు పరిపూర్ణతలో ఒక భాగం”. (బుఖారీ 723, ముస్లిం 433).

పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు విధుల్లో ఒకటి. నమాజు విధిని విడనాడినవాడు పాపాత్ముడవుతాడు.

(ఇ) షైతాన్ని ఇరకాటంలో పడవేయటం:

عَن عَبدِ الله بْنِ عُمَرَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَقِيمُوا الصُّفُوفَ وَحَاذُوا بَيْنَ الْـمَنَاكِبِ وَسُدُّوا الْـخَلَلَ وَلِينُوا بِأَيْدِي إِخْوَانِكُمْ وَلَا تَذَرُوا فُرُجَاتٍ لِلشَّيْطَانِ…).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః “పంక్తులను సరిచేసు కోండి, పరస్పరం భుజాలను కలపండి, సంధులను మూసివేయండి, మీ సోదరుల కొరకు మీ చేతులను మృదువుగా చేసుకోండి, షైతాన్ కొరకు సందులను వదలకండి”. (అబూ దావూద్ 666).

(ఈ) పంక్తులను కలిపి ఉంచిన వారితో అల్లాహ్ కలిసి ఉంటాడుః

عَن عَبدِ الله بْنِ عُمَرَ ﷠ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (…وَمَنْ وَصَلَ صَفًّا وَصَلَهُ اللهُ وَمَنْ قَطَعَ صَفًّا قَطَعَهُ اللهُ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ﷠ ఉల్లేఖించారుః “….. పంక్తులను కలిపి ఉంచినవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు. పంక్తు లను తెంచేవారితో అల్లాహ్ కలిసి ఉండడు”. (అబూ దావూద్ 666).

నమాజులోని మొదటి నిధి సారాంశం

కర్మఫలితం
1- వుజూ1) అల్లాహ్ యొక్క ప్రేమ
2) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు
3) ప్రళయదినాన వుజూ అవయవాలు ప్రకాశించటం
4) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం
5) పాపాల మన్నింపు మరియు స్వర్గ ప్రవేశం
2- వుజూ తర్వాత దుఆ(1) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము గుండా ప్రవేశించే స్వేచ్ఛ
(2) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయకాలం వరకు తీయబడదు
3- మిస్వాక్నోటి శుభ్రత, అల్లాహ్ సంతుష్టి
4) నమాజు కొరకు శీఘ్రముగా వెళ్ళుట1) గొప్ప ఘనత, శుభము మరియు మేలు
2) ఏలాంటి నీడ లభించని ప్రళయదినాన అల్లాహ్ నీడలో ఆశ్రయం (మస్జిద్లో మనసు నిలిపినతనికి) 3) ప్రతి అడుగుకు బదులు సంవత్సరపు ఉపవాసాలు మరియు తహజ్జుద్ పుణ్యం( జుమా)
5- అజాన్ జవాబుస్వర్గ ప్రవేశం
6- అజాన్ తర్వాత దుఆ1) పాపాల ప్రక్షాళనం
2) ప్రళయదినాన ప్రవక్త సిఫారసు
7- నమాజు కొరకు నడచి వెళ్ళటం1) స్వర్గంలో ఆతిథ్యం
3) గొప్ప పుణ్యం
2) పాపాల తుడిచివేత, ఉన్నత స్థానం
4) ప్రళయదినాన పూర్తి కాంతి
5) పాపాల తుడిచివేత 6) ప్రతి అడుగుపై ఒక సదకా
8- మొదటి పంక్తి, కుడి పంక్తి1) దైవతూతల పోలిక
2) మంచితనం
3) అల్లాహ్, ఆయన దూతల దీవెనలు
4) వెనక ఉండేవారికివ్వబడిన శాపం నుండి దూరం
9- సున్నతె ముఅక్కద1) స్వర్గంలో ఒక గృహం
2) అస్ర్ కు ముందు నాలుగు రకాతుల పై అల్లాహ్ కరుణ
10- అజాన్, ఇఖామత్ మధ్యలో దుఆదుఆ అంగీకరించబడుతుంది
11- నమాజుకై వేచి ఉండటం1) నమాజు ఘనతకు సమానం
2) అల్లాహ్ దూతల ఇస్తిగ్ఫార్
3) పాపాల మన్నింపు, ఉన్నత స్థానం
12- ఖుర్ఆన్ పారాయణం మరియు అజ్ కార్1) సంపూర్ణ ఖుర్ఆన్ పారాయణం
2) ఖుర్ఆన్ కంఠస్తం
3) గొప్ప పుణ్యాలు
1) వెయ్యి పుణ్యాలు, వెయ్యి పాపాల మన్నింపు
2) పది బానిసల విడుదల పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.
3) స్వర్గ కోశాల్లో ఒకటి.
4) స్వర్గంలో ఒక చెట్టు
13- పంక్తులను తీర్చిదిద్దటం1) మనసుల మరియు ఉద్దేశాల ఐక్యత
2) నమాజు పరిపూర్ణత
3) షైతాన్ని ఇరకాటంలో పడవేయటం
4) పంక్తులను కలిపేవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు

రెండవ నిధి (నిక్షేపం): నమాజు చేయటం

నమాజును నిర్ణీత పద్ధతిలో నెరవేరుస్తూ మనం ఈ అమూల్యమైన నిధిని పొందవచ్చు. దీనికి అర్హులయ్యే మార్గం క్రింది విధంగా ఉందిః

1 – నమాజు ఘనత

సామాన్యంగా నమాజు ఘనత చాలా ఉంది. దానితో పాటు ప్రత్యేక నమాజులకు ప్రత్యేక ఘనతలు కూడా ఉన్నాయి. ఉదాః ఫజ్ర్ నమాజు ఘనత, అస్ర్ నమాజు ఘనత, ఇషా నమాజు ఘనత…… దిగువ దీనినే సంక్షిప్తంగా తెలుపుతున్నాము.

నమాజుల సామాన్య ఘనత

దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త హదీసుల ద్వారా నమాజు నిక్షేపాలు స్పష్టమై ఉన్నాయి, వాటిని అదృష్టంగా భావించడం, వాటిని సక్రమంగా నెరవేర్చే పూర్తి ప్రయత్నం చేయడం ద్వారా మన పుణ్యాల బ్యాలెన్సును పెంచుకోవచ్చు.

(అ) ఉన్నత స్థానాలు, తప్పుల మన్నింపు, శ్రేష్ఠమైన ఆహారం

{ఎవరు నమాజును స్థాపిస్తారో, వారికి మేమిచ్చిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు పెడతారో అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం ఉంది}. (అన్ఫాల్ 8: 3,4).

{నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. మేము నీ నుండి ఉపాధినేమీ కోరడం లేదు. ఉపాధిని మేమే నీకు ఇస్తూ ఉన్నాము. చివరకు మేలు జరిగేది భయభక్తులకే}. (తాహా 20: 132).

(ఆ) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత

{నమాజును స్థాపించు, పగటి యొక్క సరిహద్దు సమయాలలోనూ, కొంత రాత్రి గడచిన తరువాతనూ, వాస్తవానికి సత్కార్యాలు దుష్కా ర్యాలను దూరం చేస్తాయి. హితవుగోరే వారికి ఇది ఒక హితబోధ}. (హూద్ 11: 114).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ؟) قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ: (فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْـخَطَايَا).

ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల ముందు ఇలా ప్రశ్న వేశారుః “మీలో ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, అతనా కాలువలో ప్రతి రోజు అయిదు సార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? ‘అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు’ అని వారు చెప్పారు, అప్పుడు ప్రవక్త ఇలా బోధించారుః “ఐదు వేళలా నమాజు చేయడం కూడా అంతే. వీటి ద్వారా అల్లాహ్ (ఐదు నమాజులను పాటించే దాసుని) పాపాలను తుడిచివేస్తాడు.” (బుఖారీ 528, ముస్లిం 667).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يَقُولُ: (الصَّلَوَاتُ الْـخَمْسُ وَالجُمعَةُ إِلَى الْـجُمعَةِ وَرَمَضَانُ إِلَى رَمَضَانَ مُكَفِّرَاتٌ مَا بَيْنَهُنَّ إِذَا اجْتَنَبَ الْكَبَائِرَ).

“ఐదు పూటలా చేసే నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు, రమజాను నుండి మరో రమజాను వరకు ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి పరిహారం అవుతాయి. అయితే పెద్ద పాపాల నుండి దూరంగా ఉండుట తప్పనిసరి.” అని ప్రవక్త ﷺ చెప్పారని అబూ హురైరా ఉల్లేఖించారు. (ముస్లిం 233).

(ఇ) కారుణ్యం

{నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడుతారని ఆశించవచ్చు}. (నూర్ 24: 56).

(ఈ) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం

{వారు తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకునే వారు, వారే స్వర్గాన్ని వరసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 9-11).

{తమ నమాజును కాపాడుకునేవారు, ఇలాంటి వారే సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు}. (మఆరిజ్ 70: 34,35).

(ఉ) కాంతి (నూర్)

عَنْ أَبِي مَالِكٍ الْأَشْعَرِيِّ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (… وَالصَّلَاةُ نُورٌ وَالصَّدَقَةُ بُرْهَانٌ وَالصَّبْرُ ضِيَاءٌ وَالْقُرْآنُ حُجَّةٌ لَكَ أَوْ عَلَيْكَ كُلُّ النَّاسِ يَغْدُو فَبَايِعٌ نَفْسَهُ فَمُعْتِقُهَا أَوْ مُوبِقُهَا).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిం అల్ అష్అరీ ﷜ ఉల్లేఖించారుః “నమాజు నూర్, సదకా నిదర్శనం, సహనం ప్రకాశం మరియు ఖుర్ఆన్ నీకు అనుకూలంగా లేక ప్రతికూలంగా సాక్షి. ప్రతి మానవుడు ఉదయం లేచి తన ఆత్మను విక్రయిస్తాడు, అయితే అల్లాహ్ దాన్ని (శిక్ష నుండి విముక్తి కలిగిస్తాడు) లేదా (కారుణ్యానికి దూరముంచి) నష్టపరుస్తాడు. (ముస్లిం 223).

నమాజు సామాన్యంగా ఒక నూర్ గనక ఇది భక్తిపరులకు కంటి చలువ కూడాను. ఇదే విషయం ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “నమాజు నా కళ్ళకు చల్లదనంగా చేయబడింది”. (నిసాయి 3940, ముస్నద్ అహ్మద్ 3/285).

ప్రత్యేక నమాజుల ఘనత

1) ఫజ్ర్, అస్ర్ నమాజుల ఘనత

(అ) పగలు దూతలు, రాత్రి దూతలు అందులో హాజరవుతారు

{ప్రాతఃకాలంలో ఖుర్ఆన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది}. (బనీ ఇస్రాఈల్ 17: 78).

ఖుర్ఆను వ్యాఖ్యానకర్తలు దీని వ్యాఖ్యానం ఇలా చెప్పారుః ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం అంటే ఫజ్ర్ నమాజులోని పారాయణం, అందులో పగటి మరియు రాత్రి పూట దైవదూతలు హాజరవుతారు, దానికి వారు సాక్ష్యంగా ఉంటారు. (బుఖారి 649, ముస్లిం 649).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (يَتَعَاقَبُونَ فِيكُمْ مَلَائِكَةٌ بِاللَّيْلِ وَمَلَائِكَةٌ بِالنَّهَارِ وَيَجْتَمِعُونَ فِي صَلَاةِ الْفَجْرِ وَصَلَاةِ الْعَصْرِ ثُمَّ يَعْرُجُ الَّذِينَ بَاتُوا فِيكُمْ فَيَسْأَلُهُمْ وَهُوَ أَعْلَمُ بِهِمْ كَيْفَ تَرَكْتُمْ عِبَادِي فَيَقُولُونَ تَرَكْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ وَأَتَيْنَاهُمْ وَهُمْ يُصَلُّونَ).

“మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్, నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతోపాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశానికి వెళ్ళినప్పుడు -ఇదంతా మీ ప్రభువు గుర్తెరిగి ఉంటాడు- అయినా వారినుద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదలిపెట్టి వచ్చారని” అడుగుతాడు. దానికి దైవదూతలు మేము వారి దగ్గర్నుంచి బయలుదేరేటప్పుడు వారు నమాజు చేస్తుండటం కనిపించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజు స్థితిలో చూశాము” అని సమాధానమిస్తారు అని ప్రవక్త ﷺ తెలుపుతుండగా నేను విన్నానని అబూహూరైరా ﷜ ఉల్లేఖించారు. (బుఖారీ 555, ముస్లిం 632).

(ఆ) స్వర్గ ప్రవేశం

عَنْ أَبِي مُوسَى ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْـجَنَّةَ).

ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారని అబూ మూసా ﷜ ఉల్లేఖించారుః “రెండు చల్లని వేళల్లోని నమాజు పాటించేవారు స్వర్గంలో చేరుతారు”. (బుఖారీ 574, ముస్లిం 635). చల్లని వేళలంటే ఫజ్ర్ మరియు అస్ర్.

(ఇ) నరక ప్రవేశం నుండి దూరం

عَن عُمَارَةَ بْنِ رُؤَيْبَةَ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (لَنْ يَلِجَ النَّارَ أَحَدٌ صَلَّى قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا)

ప్రవక్త సెలవియ్యగా నేను విన్నానని అబూ జుహైర్ ఉమార బిన్ రుఐబ ఉల్లేఖించారుః “సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు గల నమాజులను పాటించినతను నరకంలో ప్రవేశించడు”. (ముస్లిం 634). అంటే ఫజ్ర్, అస్ర్.

(ఈ) అల్లాహ్ రక్షణలో

عَنْ جُنْدُبِ بْنِ سُفْيَانَ الْبَجَلِيِّ ÷ عَن النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِي ذِمَّةِ الله عَزَّ وَجَلَّ فَانْظُرْ يَا ابْنَ آدَمَ لَا يَطْلُبَنَّكَ اللهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ)

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని జుందుబ్ బిన్ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఫజ్ర్ నమాజు చదివినవారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అయితే ఓ మానవుడా! అల్లాహ్ తన రక్షణలో ఉంచిన దాని గురించి నిన్ను మందలించకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండు”. (ముస్నద్ అహ్మద్ 4/313, ముస్లిం 657).

(ఉ) అల్లాహ్ దర్శనం

عَنْ جَرِيرٍ ÷ قَالَ: كُنَّا جُلُوسًا عِنْدَ النَّبِيِّ ﷺ إِذْ نَظَرَ إِلَى الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ قَالَ: (إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ لَا تُضَامُونَ فِي رُؤْيَتِهِ فَإِنْ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوا عَلَى صَلَاةٍ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَصَلَاةٍ قَبْلَ غُرُوبِها فَافْعَلُوا).

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మేము ఒకసారి దైవప్రవక్త ﷺ వద్ద కూర్చొని ఉండగా ప్రవక్త ﷺ పున్నమి చంద్రుడ్ని చూసి మాతో ఇలా అన్నారుః “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే మీరు (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి అడ్డంకి ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవ లసిన (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడ కుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. (బుఖారీ 7434, ముస్లిం 633).

(ఊ) ఇషా మరియు ఫజ్ర్ నమాజుల ఘనత

عَنْ عُثْمَان بْن عَفَّان ÷ قاَلَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا قَامَ نِصْفَ اللَّيْلِ وَمَنْ صَلَّى الصُّبْحَ فِي جَمَاعَةٍ فَكَأَنَّمَا صَلَّى اللَّيْلَ كُلَّهُ)

నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).

2 -సామూహిక నమాజు ఘనత

నమాజు సామూహికంగా చదవడంలో చాలా పుణ్యముంది. ఈ ఆచరణ ప్రవక్త ﷺ ద్వారా రుజువైనది. మీరు సయితం ఈ హదీసుపై శ్రద్ధ వహించండిః

عَنِ بنِ عُمَرَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (صَلاَةُ الْـجَمَاعَةِ أَفْضَلُ مِنْ صَلاَةِ الْفَذِّ بِسَبْعٍ وَعِشْرِينَ دَرجَة).

ప్రవక్త ﷺ ఇలా శుభవార్తిచ్చినట్లు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ﷠ ఉల్లేఖించారుః “వ్యక్తిగతంగా చేసే నమాజుకన్నా సామూహికంగా చేసే నమాజు ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది”. (బుఖారీ 645, ముస్లిం 650). ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభిస్తుంది గనక సామూహిక నమాజు పుణ్యం 27×10=270 ఉంటుంది.

3 – ఖుషూఅ (అణకువ, వినమ్రత)

ఖుషూఅనమాజుకు ప్రాణం లాంటిది, పుణ్యాల రెట్టింపు దానిపై ఆధారపడియుంది. దానికి సంబంధించిన కొన్ని లాభాలను క్రింద పేర్కొంటున్నాము గమనించండిః

(అ) సాఫల్యం (జన్నతుల్ ఫిర్ దౌసులో ప్రవేశ సాఫల్యం, నరకం నుండి విముక్తి)

{నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు. …… వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 1-3, 9-11).

(ఆ) అల్లాహ్ ప్రేమ

{ప్రేమతోనూ, భయంతోనూ మమ్మల్ని ప్రార్థించేవారు, మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు}. (అంబియా 21: 90).

ఈ ఆయతులో ‘వినమ్రత’ విశ్వాసులైన అల్లాహ్ దాసుల ప్రశంస నీయమైన గుణముగా పేర్కొనబడింది, అయితే ఈ వినమ్రత గుణం గలవారు అల్లాహ్ ప్రియులని అట్లే తెలుస్తుంది.

(ఇ) ప్రళయదినాన అల్లాహ్ తన నీడలో ఆశ్రయమిస్తాడు

عَنْ أَبِي هُرَيرَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (سَبْعةٌ يُظِلُّهُمُ الله فِي ظِلّه يَومَ لاَ ظِلَّ إِلاّ ظِلُّه) وَذَكَرَ رَجُلاً: (وَرَجُلٌ ذَكَرَ اللهَ خَالِيًا فَفَاضَتْ عَينَاه).

ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడ తప్ప మరెలాంటి నీడా లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో ఒకడుః ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 660, ముస్లిం 1031).

ఈ హదీసు నిదర్శనంగా ఎలా నిలిచిదంటే, నమాజులో ఖుషూఅ పాటించు వ్యక్తి ఇతర సందర్భాల కంటే ఏకాంతములో ఉన్నప్పుడు ఎక్కువ కంటి తడపెడతాడు. ఇలా ఆ ఎడుగురిలో ఒకడు కావడానికి అర్హుడవుతాడు.

(ఈ) ఖుషూఅ నమాజు పుణ్యాలను పెంచుతుంది.

عن عَمَّارِ بْنِ يَاسِرٍ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (إِنَّ الْعَبْدَ لَيُصَلِّي الصَّلَاةَ مَا يُكْتَبُ لَهُ مِنْهَا إِلَّا عُشْرُهَا تُسْعُهَا ثُمُنُهَا سُبُعُهَا سُدُسُهَا خُمُسُهَا رُبُعُهَا ثُلُثُهَا نِصْفُهَا).

ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నానని అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దాసుడు నమాజు చేస్తాడు కాని అతనికి తన నమాజు యొక్క పదవ వంతు లేక తొమ్మిదవ లేదా ఎనిమిదవ లేదా ఏడవ లేదా ఆరవ లేదా ఐదవ లేదా నాల్గవ లేదా మూడవ లేదా సగం పుణ్యము మాత్రమే వ్రాయబడుతుంది”. (ముస్నద్ అహ్మద్ 4/321 అబూ దావూద్ 796, ఇబ్ను హిబ్బాన్ ఇది సహీ అని ధృవీక రించారు). (దీని భావమేమిటంటే ఎవరిలో ఖుషూఅ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ పుణ్యాలు వారికి లభిస్తాయి).

(ఉ) పాపాల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫలం

అల్లాహ్ ఆదేశం సూర అహ్ జాబ్ 33: 35లో ఇలా ఉందిః

{వినమ్రత పాటించే పురుషులు మరియు స్త్రీలు}… {అల్లాహ్ వారి కొరకు క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు}.

4 -సనా

నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.

عَنْ ابْنِ عُمَرَ ÷ قَالَ: بَيْنَمَا نَحْنُ نُصَلِّي مَعَ رَسُولِ الله ﷺ إِذْ قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ: اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا فَقَالَ رَسُولُ الله ﷺ: (مَن الْقَائِلُ كَلِمَةَ كَذَا وَكَذَا) قَالَ رَجُلٌ مِنْ الْقَوْمِ أَنَا يَا رَسُولَ الله قَالَ: (عَجِبْتُ لَهَا فُتِحَتْ لَهَا أَبْوَابُ السَّمَاءِ).

ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).

5 -సూరె ఫాతిహ పారాయణం

(అ) ఖుర్ఆనులోని గొప్ప సూరా

నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించుః

عَنْ أَبِي سَعِيدِ بْنِ الْـمُعَلَّى ÷ قَالَ: كُنْتُ أُصَلِّي فِي الْـمَسْجِدِ فَدَعَانِي رَسُولُ الله ﷺ فَلَمْ أُجِبْهُ فَقُلْتُ: يَا رَسُولَ الله إِنِّي كُنْتُ أُصَلِّي فَقَالَ: (أَلَمْ يَقُلِ اللهُ â (#qç7ŠÅftGó™$# ¬! ÉAqߙ§=Ï9ur #sŒÎ) öNä.$tãyŠ $yJÏ9 öNà6‹ÍŠøtä† ( á) ثُمَّ قَالَ لِي لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ السُّوَرِ فِي الْقُرْآنِ قَبْلَ أَنْ تَخْرُجَ مِنَ الْـمَسْجِدِ ثُمَّ أَخَذَ بِيَدِي فَلَمَّا أَرَادَ أَنْ يَخْرُجَ قُلْتُ لَهُ أَلَمْ تَقُلْ لَأُعَلِّمَنَّكَ سُورَةً هِيَ أَعْظَمُ سُورَةٍ فِي الْقُرْآنِ قَالَ: (الْـحَمْدُ لله رَبِّ الْعَالَمِينَ هِيَ السَّبْعُ الْـمَثَانِي وَالْقُرْآنُ الْعَظِيمُ الَّذِي أُوتِيتُهُ).

అబూ సఈద్ బిన్ ముఅల్లా ﷜ తెలిపారుః నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారుః “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).

(ఆ) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ

ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَالَ اللهُ تَعَالَى: (قَسَمْتُ الصَّلَاةَ بَيْنِي وَبَيْنَ عَبْدِي نِصْفَيْنِ وَلِعَبْدِي مَا سَأَلَ فَإِذَا قَالَ الْعَبْدُ [الْـحَمْدُ لِله رَبِّ الْعَالَمِينَ] قَالَ اللهُ تَعَالَى: حَمِدَنِي عَبْدِي، وَإِذَا قَالَ: [الرَّحْمَنِ الرَّحِيمِ] قَالَ اللهُ تَعَالَى: أَثْنَى عَلَيَّ عَبْدِي، وَإِذَا قَالَ: [مَالِكِ يَوْمِ الدِّينِ] قَالَ: مَجَّدَنِي عَبْدِي، وَقَالَ: فَإِذَا قَالَ: [إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ] قَالَ: هَذَا بَيْنِي وَبَيْنَ عَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ، فَإِذَا قَالَ [اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ] قَالَ هَذَا لِعَبْدِي وَلِعَبْدِي مَا سَأَلَ).

అబూ హురైరా ﷜ ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395).

మరో ఘనత పేజి క్రింద పాదసూచికలో చూడండి([9])

[9] సహీ ముస్లింలో మరొక ఘనత ఇలా ఉంది.

عَنْ عَمَرِو بْنِ عَبَسَةَ ÷ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: … فَإِنْ هُوَ قَامَ فَصَلَّى فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَمَجَّدَهُ بِالَّذِي هُوَ لَهُ أَهْلٌ وَفَرَّغَ قَلْبَهُ لله إِلَّا انْصَرَفَ مِنْ خَطِيئَتِهِ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).

6 -ఆమీన్ పలకడం

నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ: [غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ] فَقُولُوا آمِينَ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْـمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ)

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ أَحَدُكُمْ آمِينَ وَقَالَتْ الْـمَلَائِكَةُ فِي السَّمَاءِ آمِينَ فَوَافَقَتْ إِحْدَاهُمَا الْأُخْرَى غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).

7 -రుకూ

రుకూ కు సంబంధించిన లాభాల్లో పాపాల ప్రక్షాళన ఒకటి.

عَنْ اِبْنِ عُمَرَ ÷ قَالَ : سَمِعْت رَسُولَ الله ﷺ يَقُولُ : (إِنَّ الْعَبْدَ إِذَا قَامَ يُصَلِّي أُتِيَ بِذُنُوبِهِ فَجُعِلَتْ عَلَى رَأْسِهِ وَعَاتِقِهِ فَكُلَّمَا رَكَعَ وَسَجَدَ تَسَاقَطَتْ عَنْه)

ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).

8 -రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు

రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.

(అ) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا قَالَ الْإِمَامُ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَقُولُوا اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.

(ఆ) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.

రిఫాఅ బిన్ రాఫిఅ అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).

9 – సజ్దాలు

సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.

(అ) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)

అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).

{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారుః ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం’. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).

(ఆ) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి

{ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్  అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).

{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)

(ఇ) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు

فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَ بِكَثْرَةِ السُّجُودِ لِله فَإِنَّكَ لَا تَسْجُدُ لِله سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيئَةً).

ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).

(ఈ) ప్రవక్త సామీప్యం

రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ “అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేన న్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).

(ఉ) దుఆ స్వీకారానికి తగిన సమయం

ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు)﷜ఉల్లేఖించారుః “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).

మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారుః “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).

(ఊ) పాపాల ప్రక్షాళన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).

(క) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు

ప్రవక్త ﷺ సెలవిచ్చారుః “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).

విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్గా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ…., 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)

10 -మొదటి తషహ్హుద్

భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం

మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండిః

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్’ ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురు షునికి ఈ దుఆ లభిస్తుంది. ‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్డహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).

నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.

11 -చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)

ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.

(అ) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ

{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్’ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్ లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).

(ఆ) పది రెట్ల పుణ్యం

عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرًا).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).

(ఇ) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవిః “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29([10])).

[10] ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.

12 -సలాంకు ముందు దుఆ

సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు ‘అత్తహియ్యాతు లిల్లాహి…’ చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి”, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.

నమాజులోని రెండవ నిధి సారాంశం

కర్మఫలితం
1- నమాజు ఘనత1) ఉన్నత స్థానాలు, పాపాల మన్నింపు, ఉత్తమ ఉపాధి.
2) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత
3) కారుణ్యం,
4) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం
5) కాంతి,
6) స్వర్గ ప్రవేశం, (ఫజ్ర్, అస్ర్)
7) పగటి మరియు రాత్రి దూతల ఆగమనం, (ఫజ్ర్, అస్ర్)
8) నరక విముక్తి (ఫజ్ర్, అస్ర్)
9) అల్లాహ్ రక్షణ (ఫజ్ర్).
10) అల్లాహ్ దర్శనం (అస్ర్)
11) అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఇషా), రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఫజ్ర్).
2- సామూహిక నమాజు270 పుణ్యాలు (27×10=270 పుణ్యాలు)
3- ఖుషూఅ (నమాజు లో అణుకువ)1) స్వర్గ ప్రవేశ సాఫల్యం, నరకం నుండి రక్షణ
2) అల్లాహ్ యొక్క ప్రేమ
3) ఏ నీడా లేని రోజు అల్లాహ్ నీడలో ఆశ్రయం
4) నమాజు పుణ్యాల రెట్టింపు
5) పాపాల మన్నింపు, గొప్ప ప్రతిఫలం.
4- సనాఆకాశ ద్వారాలు తెరవబడుట
5- సూర ఫాతిహా పారాయణం1) ఖుర్ఆనులోని గొప్ప సూరా పారాయణం
2) స్తోత్రము + దుఆ
6- ఆమీన్పాపాల మన్నింపు
7- రుకూపాపాలు రాలిపడుట
8- రుకూ తర్వాత దుఆలు1) పాపాల మన్నింపు.
2) వాటిని వ్రాయటానికి అల్లాహ్ దూతలు ఎగబడతారు
9- సజ్దాలు1) సాఫల్యం.
2) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
3) ప్రళయదినాన అల్లాహ్ దయ, ప్రసన్నత, కాంతి
4) స్వర్గంలో ప్రవక్త సన్నిహితం.
5) పాపాలు రాలిపడుట.
6) పాపాత్ములైన విశ్వాసుల సజ్దా అంగములను నరకాగ్ని కాల్చదు.
10- మొదటి తషహ్హుద్ఏ ఏ పుణ్యాత్ములకు నీవు సలా చేశావో వారందరి పుణ్యం
11- చివరి తషహ్హుద్, ప్రవక్త పై దరూద్1) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ
2) పది రెట్ల వరకు పుణ్యాలు పెరగడం
3) పది పుణ్యాలు లిఖించబడటం, పది పాపాలు తుడిచివేయబటడం
12- సలాం కు ముందు దుఆఅంగీకార సమయం.

మూడవ నిధి  (నిక్షేపం)

నమాజు తర్వాత అజ్కార్

నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః

(అ) పాపాల మన్నింపుః

అబూ హురైరా ﷜ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).

(ఆ) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు

అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త ﷺ వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త ﷺ అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).

ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).

నోటి పై 150, దీని ఫిగర్ ఇలా ఉంటుందిః

10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.

30 × 5 (నమాజులు) = 150

త్రాసులో 1500 యొక్క ఫిగర్ ఇదిః

150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు

(ఇ) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం

అబూ హూరైర(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).

(ఈ) సున్నతె ముఅక్కద = స్వర్గంలో ఒక గృహం

సున్నతె ముఅక్కద 12 రకాతులని గత పేజిల్లో మనం తెలుసు కున్నాము.

ప్రవక్త ﷺ చెప్పగా విని ఉమ్మె హబీబ బిన్తె సుఫ్యాన్ రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజు ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).

నమాజులోని మూడవ నిధి సారాంశం

కర్మఫలితం
1- సుబ్ హానల్లాహ్, అల్ హందు లిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్పాపాల మన్నింపు + అనుగ్రహం + ఉన్నత స్థానాలు + భోగభాగ్యాలు+ స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు
2- ఆయతుల్ కుర్సీ పఠనంస్వర్గ ప్రవేశం
3) సున్నతె ముఅక్కదస్వర్గంలో ఒక గృహం

[1]. అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.

[2]. తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.

[3]. తాజీము కద్రిస్సలా 947. *. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్న 1573.

[4]. అస్సున్న 1372, అల్ ఇబాన 877, షర్హు ఉసూలి…..1539.

[5] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

[6]. (సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170).

[7]. నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

[8]. అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది.

[9] సహీ ముస్లింలో మరొక ఘనత ఇలా ఉంది.

عَنْ عَمَرِو بْنِ عَبَسَةَ ÷ قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: … فَإِنْ هُوَ قَامَ فَصَلَّى فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَمَجَّدَهُ بِالَّذِي هُوَ لَهُ أَهْلٌ وَفَرَّغَ قَلْبَهُ لله إِلَّا انْصَرَفَ مِنْ خَطِيئَتِهِ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).

1 ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.

67 Surah Al-Mulk – Telugu Quran – Youtube Video

Telugu Quran : 090 Surah Al-Balad – Youtube Video

Telugu Quran : 114 Surah AnNaas – Youtube Video

Telugu Quran : Surah Qiyamah – Youtube Video