ప్రవక్త నమాజు విధానం
సంక్షిప్త రూపంలో నమాజు యొక్క పద్ధతి ఫోటోల ద్వారా తెలుసుకుంటారు.

[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
క్రింద వీడియోలు చూడండి :
(A) ఫోటోల వీడియో
(B) నమాజు చేస్తున్న వీడియో
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఇతరములు:
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
ప్రవక్త నమాజు విధానం
సంక్షిప్త రూపంలో నమాజు యొక్క పద్ధతి ఫోటోల ద్వారా తెలుసుకుంటారు.

[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
క్రింద వీడియోలు చూడండి :
(A) ఫోటోల వీడియో
(B) నమాజు చేస్తున్న వీడియో
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఇతరములు:
[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/
భాగం 01:
భాగం 02:
వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.
మరణాంతర జీవితం – పార్ట్ 25 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, అబూ సాలిహ్ రహిమహుల్లాహ్ ‘మర్ ఫూఅ’, ‘ముర్ సల్’ ఉల్లేఖించారుః
أَرْبَعُ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ، يَعْدِلْنَ بِصَلَاةِ السَّحَرِ
“జుహ్ర్ కు ముందు నాలుగు రకాతుల నమాజు సహర్ లో చేసే (తహజ్జుద్) నమాజుకు సమానమైనది”.
(ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబ 5940, అల్బానీ సహీహ 1431లో హసన్ అని చెప్పారు.
ఈ నాలుగు రకాతుల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి కొరకై ఆకాశపు ద్వారాలు తెరువబడతాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
أَرْبَعٌ قَبْلَ الظُّهْرِ تُفْتَحُ لَهُنَّ أَبْوَابُ السَّمَاءِ
“జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులున్నాయి, వాటి కొరకు ఆకాశపు ద్వారాలు తెరువబడతాయి”.
(అబూ దావూద్ 3128, షమాఇల్ తిర్మిజి, అల్బానీ సహీహుత్తర్గీబ్ 585లో హసన్ లిగైరిహీ అని చెప్పారు).
అందుకనే ప్రవక్త ﷺ ఈ రకాతులు చేయుటకు అతిగా కాంక్షించేవారు. అకాస్మాత్తుగా ఏదైనా కారణం వల్ల తప్పిపోయినా ఫర్జ్ నమాజు తర్వాత వాటిని చేసేవారు. ఈ విషయం ఆయిషా (రజియల్లాహు అన్హా) తెలిపారుః
“ఆయన ﷺ ఎప్పుడైనా జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయలేక పోతే జుహ్ర్ తర్వాత చేసేవారు.”
ఇంకా బైహఖీ ఉల్లేఖనంలో ఆమె రజియల్లాహు అన్హా ఇలా తెలిపినట్లు ఉందిః
“జుహ్ర్ కు ముందు నాలుగు రకాతులు తప్పిపోతే జుహ్ర్ తర్వాత చేసేవారు.”
(తిర్మిజి 426, బైహఖీ, అల్బానీ సహీ తిర్మిజి 350లో హసన్ అని అన్నారు).
అందుకు, ఈ నాలుగు రకాతులు ఎవరికైనా తప్పిపోతే, లేదా ఏదైనా పని వల్ల చేయుటకు వీలు పడకపోతే -ఉదాహరణకుః కొందరు టీచర్లు- ఆ పని అయిన తర్వాత తమ ఇంటికి వచ్చి చేసుకోవచ్చును.
Source: త్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezaan) – PDF Book
Great Rewards – చిన్న పనులు – గొప్ప పుణ్యాలు
[5:26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
1- అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్కస్సలాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.
(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నాను… అల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).
2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅ’త వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్ద్.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వ సామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు. (బుఖారి 844, ముస్లిం 593).
3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ’మతు వలహుల్ ఫజ్లు వలహుస్సనాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, ఆ అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము). (ముస్లిం 594).
4-సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలి: “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”.
* పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).
5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ఇబాదతిక.

(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి). (అబూదావూద్ 1522).
6- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ ఉరద్ద ఇలా అర్జలిల్ ఉమురి వ అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్.

(అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను). (బుఖారి 2822).
7- (1)బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.
2) బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, వ మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, వ మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్.
(3) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్.
(1)ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు.
(2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో.
(3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు) (అబూదావూద్ 1523).
8-అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లా తాఖుజుహూ సినతుఁ వలా నౌం, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇన్’దహూ ఇల్లా బిఇజ్నిహీ యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ ఫహుమ్ వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జు- హుమా వహువల్ అలీయ్యుల్ అజీం. (సూ. బఖర 255). (ఈ ఆయతును ‘ఆయతుల్ కుర్సీ’అని అంటారు).
(అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడువిశ్వవ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).
* ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహా 972).
9- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల. (ఫజ్ర్ నమాజు తర్వాత మాత్రమే.)
(ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను). (ఇబ్ను మాజ 925). ఇది ఫజ్ర్ తర్వాత.
కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
మరణాంతర జీవితం – పార్ట్ 25 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan
[6:21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN
ప్రవక్త ﷺ ఇలా సంబోధించారని, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
مَنْ صَلَّى الْعِشَاءَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ نِصْفِ لَيْلَةٍ، وَمَنْ صَلَّى الْعِشَاءَ وَالْفَجْرَ فِي جَمَاعَةٍ كَانَ كَقِيَامِ لَيْلَةٍ
“ఎవరు ఇషా నమాజు సామూహికంగా పాటిస్తారో వారికి అర్థ రాత్రి వరకు తహజ్జుద్ చేసినంత (పుణ్యం), మరెవరయితే ఇషా మరియు ఫజ్ర్ నమాజులు సామూహికంగా పాటిస్తారో వారిక రాత్రంతా తహజ్జుద్ చేసినంత (పుణ్యం) లభిస్తుంది”. (అబూ దావూద్ 555, ముస్లిం 656, అహ్మద్ 1/ 58, మాలిక్ 371, తిర్మిజి 221, దార్మి 1224).
అందుకే ఫర్జ్ నమాజులు సామూహికంగా మస్జిదులో చేసే కాంక్ష అధికంగా ఉండాలి. వాటి ఘనత చాలా ఎక్కువ గనుక ఎట్టిపరిస్థితిలోనూ తప్పకూడదు. ప్రత్యేకంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. ఇవి రెండు మునాఫిఖుల (కపట విశ్వాసుల)కు చాలా కష్టంగా ఉంటాయి. వాటిలోని ఘనత గనక వారికి తెలిసి ఉంటే వారు తమ కాళ్ళు ఈడ్చుకొని అయినా వచ్చేవారు. వాటిలో ప్రతి ఒక్క నమాజు పుణ్యం అర్థ రాత్రి తహజ్జుద్ నమాజు చేసిన పుణ్యంతో సమానం.
Source: త్రాసును బరువు చేసే సత్కార్యాలు (Meezaan) – PDF Book
382. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా అన్నారు :-
నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు వెళ్లి వారి ఇండ్లను తగలబెడదామని నేను (ఎన్నోసార్లు) అనుకున్నాను. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆశక్తి స్వరూపుని సాక్షం! ఇషా నమాజు చేస్తే ఓ పెద్ద మాంసపు ముక్కగాని లేదా శ్రేష్టమైన రెండు మేక కాళ్ళు గాని లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా ఇషా నమాజు చేయడానికి (మస్జిదుకు) వచ్చేవారు”.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 29 వ అధ్యాయం – వజూబి సలాతిల్ జమాఅత్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-
(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.
[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
You must be logged in to post a comment.