విశ్వాస మాధుర్యం పొందే మార్గాలు – ఇమాం ఇబ్నె బాజ్ ఉపదేశం [ఆడియో & టెక్స్ట్]

విశ్వాసమాధుర్యం పొందే మార్గాలు – ఇమాం ఇబ్నె బాజ్ సందేశం
https://youtu.be/_g4WtnZ01ms [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ఒక విశ్వాసి తాను హజ్ మరియు ఉమ్రా వంటి గొప్ప ఆరాధనలు చేసినప్పటికీ, తన హృదయంలో ‘ఈమాన్ మాధుర్యాన్ని’ (విశ్వాస మాధుర్యాన్ని) పొందలేకపోతున్నానని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది.

షేక్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) దీనికి అల్లాహ్ పట్ల విధేయత, ఖురాన్ పఠనం, మరియు అల్లాహ్ యొక్క జిక్ర్ అధికంగా చేయాలని సూచించారు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం, అల్లాహ్ కోసమే ఎవరినైనా ప్రేమించడం లేదా ద్వేషించడం ద్వారా ఈ మాధుర్యాన్ని పొందవచ్చని వివరించారు. సహాబాల జీవితాల నుండి అనస్ బిన్ నజర్ (రజియల్లాహు అన్హు) మరియు ఫిరౌన్ భార్య ఆసియా వంటి వారి ఉదాహరణలతో విశ్వాసం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

సమాహతుష్ షేక్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ తో ప్రశ్నించడం జరిగింది. షేక్, నేను ఒక విశ్వాసిని అల్హందులిల్లాహ్, హజ్, ఉమ్రా లాంటి గొప్ప ఆరాధనలను కూడా నేను నెరవేర్చాను. అయినా

لا اشعر بحلاوة الايمان
(లా అష్ ఉరు బి హలావతిల్ ఈమాన్)
నేను విశ్వాస మాధుర్యాన్ని పొందుతున్నట్లుగా నాకు ఏర్పడటం లేదు.

నాకు మీరు ఏదైనా ఉపదేశం చేయండి, దానిపై సమాహతుష్ షేక్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ జవాబిచ్చారు.

అల్లాహ్ త’ఆలా ఏ విషయాలకైతే ధర్మసమ్మతం చేశాడో, ధర్మపరంగా వాటిని పాటించాలని చెప్పాడో, ఆ విషయాల గురించే వాటిని మీరు పాటించాలనే నేను నీకు నసీహత్ చేస్తాను, మేము నీకు ఉపదేశిస్తాము.

పుణ్య కార్యాల్లో ఎక్కువగా సంపూర్ణ కాంక్షతో ముందుకు సాగుతూ ఉండు. అధికంగా ఖురాన్ యొక్క తిలావత్ చేస్తూ ఉండు. అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా చేస్తూ ఉండు. వాస్తవానికి ఇవి అల్లాహ్ యొక్క సంపూర్ణ ప్రేమను పొందడానికి, దాని మాధుర్యాన్ని పొందడానికి గొప్ప సబబ్ (కారణాలు, మార్గాలు) . అలాగే దీని ద్వారా విశ్వాస మాధుర్యాన్ని కూడా పొందగలము.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, అలాంటి వారే విశ్వాస మాధుర్యాన్ని పొందుతారు. వాటి ఆ మూడింటిలో మొదటిది

أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రేమ వారిద్దరి తప్ప ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రేమ కంటే ఎక్కువగా ఉండాలి.

మరియు ఒక మనిషి మరో మనిషిని ప్రేమిస్తున్నాడంటే అది కేవలం అల్లాహ్ ప్రేమ కొరకు మాత్రమే అయి ఉండాలి. ఇంకా మూడవ విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ హదీసులో చెప్పినది విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో, సత్య తిరస్కారంలో, షిర్క్ కుఫ్ర్ లో పడిపోవడాన్ని అగ్నిలో వేయబడటాన్ని ఎలా అసహ్యించుకుంటారో ఆ విధంగా అసహ్యించుకోవాలి.

ఏ మనిషి మనిషైతే అల్లాహ్ యొక్క ప్రేమలో, ప్రవక్త యొక్క ప్రేమలో సత్యవంతుడై ఉంటాడో, అల్లాహ్ పై విశ్వాసం, ప్రవక్తపై విశ్వాసంలో సత్యవంతుడై ఉంటాడో, తన యొక్క సోదరులను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రేమిస్తాడో మరియు కుఫ్ర్ ను, సత్య తిరస్కారాన్ని, అవిశ్వాసాన్ని అసహ్యించుకుంటాడో అప్పుడే విశ్వాస మాధుర్యాన్ని పొందగలడు.

మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరొక హదీసులో చెప్పారు:

ذَاقَ طَعْمَ الْإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولًا
(జాఖ త’మల్ ఈమాన్ మన్ రజియ బిల్లహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వబి ముహమ్మదిన్ రసూలా)

ఎవరైతే అల్లాహ్ ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని తన ప్రవక్తగా నమ్మి విశ్వసించి సంతృప్తిగా ఉన్నాడో, ఆనందంగా ఉన్నాడో అలాంటి వ్యక్తియే విశ్వాస మాధుర్యాన్ని పొందగలడు.

ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉంది:

ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు ఇతరులను ప్రేమిస్తాడో, ఎవరితోనైనా ఏదైనా ద్వేషిస్తే కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ద్వేషిస్తాడు, అల్లాహ్ కొరకు మాత్రమే ఎవరికైనా ఏదైనా ఇస్తాడు, ఎవరికైనా ఏదైనా ఇవ్వకుండా ఆపుకున్నాడంటే కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే, అలాంటి వ్యక్తియే విశ్వాస మాధుర్యాన్ని పొందుతాడు.”

వీటన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే అల్లాహ్ ను అత్యధికంగా స్మరించాలి, ఖురాన్ ఎక్కువగా తిలావత్ చేస్తూ ఉండాలి, అల్లాహ్ యొక్క విధేయత పై ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క ఇత్తిబా అనుసరణలో చాలా నిలకడగా ఉండాలి మరియు అల్లాహ్ ను, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ప్రేమించాలి, మన యొక్క విశ్వాస సోదరులను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రేమించాలి, అవిశ్వాసంలో పడటాన్ని, అవిశ్వాస పనులు చేయడాన్ని అసహ్యించుకోవాలి అలాగే ఇతర అన్ని రకాల పాపకార్యాలను చేయడాన్ని కూడా అసహ్యించుకోవాలి.

ఎవరైతే ఈ సాధనాలను అవలంబిస్తారో వారు హలావతల్ ఈమాన్, త’మల్ ఈమాన్, విశ్వాస మాధుర్యాన్ని పొందుతారు. అప్పుడే వారికి అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయతలో ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అయితే ఇలాంటి ఈ మనశ్శాంతి, ఈ మాధుర్యం పొందడం అంటే అల్లాహ్ యొక్క విధేయత, ప్రవక్త యొక్క విధేయత, అల్లాహ్ పట్ల ప్రేమ, ప్రవక్త పట్ల ప్రేమలోనే దాగి ఉన్నది.

ఇంకా సహాబాల జీవిత చరిత్రలో మనం చూస్తే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి. వారిపై ఎన్ని ఆపదలు వచ్చిపడ్డాయి, వారు ఎన్నో రకాల చిత్రహింసలకు గురయ్యారు అయినా గానీ విశ్వాసాన్ని విడనాడలేదు, పుణ్యకార్యాల నుండి దూరము కాలేదు, అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త విధేయతలో ఎప్పుడూ కూడా వెనుక ఉండలేదు.

అనస్ బిన్ నజర్ సహాబాలలో ఒక గొప్ప సహాబి, యుద్ధాని కంటే ముందు బయలుదేరారు. యుద్ధ మైదానంలో చేరుకుంటూ ఏమన్నారు? ఉహుద్ అటువైపు నుండి నాకు స్వర్గం యొక్క సువాసన వస్తుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.

ఒక సహాబియా, యుద్ధం జరిగిన తర్వాత ఆమెకు తెలిసింది ఆమె యొక్క భర్త, తండ్రి, సోదరుడు అందరూ ఆ యుద్ధంలో అమరవీరులయ్యారు అని. ఆ సమయంలో ఆమె అడిగింది, ప్రవక్త ఎలా ఉన్నారో ముందు చెప్పండి. ప్రవక్త బాగున్నారు అంటే అందరూ క్షేమంగా ఉన్నట్లే. ప్రవక్త బాగున్నారంటే నాకు ఎలాంటి కష్టం, ఆపద రాలేదు అని భావం.

ఎలా ఉండిందో వారి యొక్క విశ్వాసం అల్లాహ్ పై, ప్రవక్తపై, అల్లాహ్ యొక్క మరియు ప్రవక్త యొక్క ప్రేమ వారి హృదయాల్లో ఎలా చోటు చేసుకున్నదో మనం ఈ సంఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే సుమయ్యా రజియల్లాహు త’ఆలా అన్హా గానీ, ఉమ్మే అమ్మారా రజియల్లాహు త’ఆలా అన్హా గానీ ఇంకా వేరే ఎందరో సహాబాలు, సహాబియాత్ వారి యొక్క చరిత్రలు చదవండి. విశ్వాస మాధుర్యాన్ని పొందడానికి వారి ద్వారా చాలా గొప్ప గుణపాఠాలు మనకు లభిస్తాయి.

సూరతుత్ తహ్రీమ్ చివరి కంటే ముందు ఆయత్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ యొక్క భార్య సంఘటన ఏదైతే తెలిపాడో దాన్ని కూడా శ్రద్ధగా చదివి అర్థం చేసుకోండి.

వేదన చెందుతున్న ఆ సమయంలో ఆమె ఇలా వేడుకుంది:

وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْ

మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: “నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని (దుష్ట) పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.” (66:11)

అల్లాహ్ మనందరికీ విశ్వాస మాధుర్యం పొందే సాధనాలను అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.

[విశ్వాసము] – మెయిన్ పేజీ
https://teluguislam.net/?p=621

షీయా, సున్నీల మధ్య ఏమైనా తేడా ఉందా? – షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్

బిస్మిల్లాహ్

సమాహతుష్ షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారిని క్రింది విధంగా ప్రశ్నించడం జరిగింది

ప్రశ్న: షేఖ్ గారు! “సున్నీ (అహ్లుస్ సున్నహ్ ) మరియు షీయాలో చిన్నపాటి విషయాల్లో తప్ప (మూల విషయాల్లో) ఏ భేదం లేదు” అని మీరన్నట్లు విన్నాము, ఇది నిజమేనా? కాదా? వాస్తవానికి సున్నీ మరియు షీయాలో విభేదాలున్నాయా? 

షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారి జవాబు:

ఇది చాలా విచిత్రం. ఇది అబద్ధం, అపనింద. –అల్లాహ్ ఇలాంటి వాటి నుండి రక్షించాలి- ఇది అసత్యం, ఇలాంటి ఏ మాట గాని, దీనికి ఇంచుమించు లేదా ఈ భావం గల ఏ మాట నా నుండి వెల్లలేదు. మా (సున్నీల) మధ్య మరియు వారి (షీయాల) మధ్య భూమ్యాకాశాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా షీయాలో రాఫిదా , నుసైరియా మరియు వీరి లాంటి వర్గాల మధ్య (చాలా విభేదాలున్నాయి).

షియాలో ఎన్నో రకాలున్నాయి. ఒకే రకం కాదు. అనేక రకాలు, అనేక వర్గాలున్నాయి. షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ 22 వర్గాలు పేర్కొన్నారు. కొన్ని వర్గాలవారు దుర్మార్గంలో ఉన్నారు. కొందరు కేవలం అలీ (రదియల్లాహు అన్హు) గారు ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కంటే ఘనతగలవారంటారు. మరి కొందరు అలీ (రదియల్లాహు అన్హు) గారు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ల కంటే ఉత్తములు అని అంటారు. కాని దూషించరు, అలీ (రదియల్లాహు అన్హు) గారిని పూజించరు, వారి విషయంలో అతిశయించరు (గులువ్వ్ చేయరు). వీరు కూడా షీయాలే, కాని వీరి విషయం చిన్నపాటి తేలిగ్గా ఉంది, వీరు సహాబాలలో అతిఉత్తములెవరన్న విషయంలో సున్నీలకు భిన్నంగా ఉండి, తప్పులో పడ్డారు కాని ధర్మపరంగా మహా ఘోరమైన నష్టంలో పడలేదు. వీరి దుర్మార్గం, నష్టం ఇతర వర్గాల మాదిరిగా కాదు.

షీయాలో కొందరు ముఆవియ (రదియల్లాహు అన్హు) గారిని దూషిస్తారు, వీరు కూడా పప్పులో కాలేసి, తప్పులో పడ్డారు, వీరికి దీని పాపం కలుగును.షీయాలో మరికొందరు ఆయిషా (రదియల్లాహు అన్హా) గారిని దూషిస్తారు. (వీరు మహా ఘోర పాపంలో పడ్డారు).

అయితే షీయాలో కొన్ని ‘బాతినీ’ వర్గాలున్నాయి (అంటే బాహ్యానికి భిన్నమైన ఆంతర్యం గలవారు). అలీ (రదియల్లాహు అన్హు) గారిని ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రవక్త కుటుంబీకులను పూజిస్తారు, వారితో మొరపెట్టుకుంటారు, వారికి మ్రొక్కుబడులు చెల్లిస్తారు, వారికి అగోచర జ్ఞానం గలదన్న నమ్మకం కలిగి ఉంటారు, సహాబాలను దూషిస్తారు, అంతేకాదు – నఊజుబిల్లాహ్ – సహాబాలు కాఫిర్లయ్యారనీ, ఇంకా సహాబాలు అలీ (రదియల్లాహు అన్హు) పై దౌర్జన్యం చేశారని, ప్రవక్త తర్వాత అలీకి రావలసిన ఖిలాఫత్ హక్కును ఆక్రమించుకున్నారని అంటారు. అయితే సహాబాలలో కేవలం అమ్మార్, సల్మాన్, మిక్దాద్ బిన్ అస్వద్ మరి కొందరు సహాబాలను దూషించరు.

సారాంశం ఏమిటంటే: షీయాలో వర్గాలున్నాయి. వారి మధ్య మరియు సున్నీల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. ప్రత్యేకంగా సున్నీల మరియు బాతినీ వర్గాల మధ్య.

సున్నీలు సహాబాలను స్నేహితులుగా, సన్నిహుతులుగా భావిస్తారు, వారిని ప్రేమిస్తారు, వారి ప్రస్తావన వచ్చినప్పుడు రదియల్లాహు అన్హు/మ్ అంటారు, వారు ముస్లిం సమాజంలో అత్యుత్తములు, ఉన్నత శ్రేణికి చెందిన ఘనతగలవారు అని విశ్వసిస్తారు.

ఇక షీయాలోని రాఫిదా, నుసైరియా మరియు వీరి లాంటి వర్గాలు సున్నీల విశ్వసానికి భిన్నంగా ఉన్నారు. సున్నీలు కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. అగోచరజ్ఞానం (ఇల్మె గైబ్) అల్లాహ్ కు తప్ప ఎవరికీ లేదు అని నమ్ముతారు.

కాని రాఫిదా, బాతినీ వర్గాలు ఈ విశ్వాసాలకు భిన్నంగా ఉన్నారు.సున్నీ షీయాల మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మరిన్ని వివరాలు కోరే వారు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా గారి “మిన్ హాజుస్ సున్నహ్“, అబ్దుల్లాహ్ ముహమ్మద్ గరీబ్ గారి “వజాఅ దౌరుల్ మజూస్“, అల్లామా ఏహ్సాన్ ఇలాహీ జహీర్ లాంటివారు వ్రాసిన పుస్తకాలు చదువవచ్చు. ఈ అంశానికి సంబంధించి మరెన్నో పుస్తకాలున్నాయి.

తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


https://binbaz.org.sa/fatwas/4859/
ما-الفرق-بين-اهل-السنة-والشيعة

ما الفرق بين أهل السنة والشيعة؟

سمعنا يا سماحة الشيخ أنك تقول بأنه ليس هناك فرقٌ بين أهل السنة والشيعة إلا ببعض الفروع، فهل هذا صحيح أم لا؟ وهل هناك فعلًا فرقٌ بين أهل السنة والشِّيعة؟

هذا من العجائب، هذا كذبٌ وافتراءٌ -نسأل الله العافية- هذا كذبٌ، ولم يصدر مني هذا الكلام، ولا قريب من هذا الكلام، بل بيننا وبينهم مثل ما بين السماء الأرض، ولا سيما بينهم وبين الرافضة، الرافضة والنُّصيرية وأشباههم طوائف باطنية.
والشيعة أقسام، هم ليسوا قسمًا واحدًا، أقسام كثيرة، وفِرَقٌ كثيرة، حتى ذكرهم شيخُ الإسلام اثنتين وعشرين فرقة، هم أقسام، بعضهم ضالٌّ، وبعضهم يُفضّل عليًّا فقط على عثمان، وبعضهم يُفضله على الصديق وعمر، لكن لا يسبُّون، ولا يعبدون عليًّا، ولا يغلون فيه، هؤلاء شيعة، لكن أمرهم سهل، لا يضرُّهم ذلك من جهة الدين، وإن كانوا قد أخطأوا في مخالفة أهل السنة في التفضيل، لكن لا يضرُّهم مثل ضرر الطوائف الأخرى.

ومنهم مَن يسبُّ معاوية، وهؤلاء أيضًا قد أخطأوا وغلطوا، وعليهم إثم ذلك، ومنهم مَن يسبُّ عائشة كذلك، لكن فيهم طوائف باطنية، يعبدون عليًّا، ويعبدون أهل البيت، ويستغيثون بهم، وينذرون لهم، ويعتقدون أنهم يعلمون الغيب، ويَسُبُّون أصحاب النبي صلى الله عليه وسلم، ويُكفِّرونهم، ويقولون: إنهم ظلموا عليًّا وأخذوا عنه الولاية، إلا النفر القليل من أصحاب النبي لا يسبُّونهم: كعمار وسلمان والمقداد بن الأسود ونفر قليل.
فالحاصل أن الشيعة أقسام، وبينهم وبين أهل السنة فرقٌ بعيدٌ، خصوصًا الباطنية منهم:

فأهل السنة يُوالون الصحابة، ويُحبُّونهم، ويترضون عنهم، ويعتقدون أنهم أفضل الأمة، وخير الأمة، والرافضة والنُّصيرية وأشباههم بضدِّ ذلك.

وأهل السنة يعبدون الله وحده، ويقولون: الغيب لله، لا يعلمه إلا الله، والرافضة والباطنية بخلاف ذلك.

فالفرق عظيمٌ جدًّا، ومَن أراد ذلك فليُراجع ما كتبه الناسُ في هذا، مثل: “منهاج السنة” لشيخ الإسلام ابن تيمية، ومثل: “وجاء دور المجوس” لعبدالله محمد غريب، ومثل الكتب الأخرى: كتب الشيخ حافظ إحسان، وغيره ممن كتب في هذا الباب، وفي هذا كتابات كثيرة


ఇతరములు: