అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత – ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ [ఆడియో]

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన అల్లాహ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించినారు.

రాత్రి చివరి జామున జిక్ర్, దుఆ చేయడం

434. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

మహొన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతిరోజు రాత్రి చివరి మూడోజామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ)

“నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను ఆలకిస్తాను. నన్ను పిలిచే వారెవరైనా ఉన్నారా? నేను వారి పిలుపుకు సమాధానమిస్తాను. నన్ను క్షమాపణ కోరే వారెవరైనా ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను”

అని అంటాడు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 14 వ అధ్యాయం – అద్దుఆఇవస్సలాతి మిన్ ఆఖిరిల్లైల్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 24 వ అధ్యాయం [PDF]
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్