1247. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“ఒక వ్యక్తి దారిన నడుస్తుంటే ఒక చోట దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం కన్పించింది. అతనా ముళ్ళకంపను తీసి దారి పక్కన దూరంగా పారేశాడు. అతడు చేసిన ఈ సత్కార్యాన్ని ప్రతిఫలంగా దేవుడు అతని పాపాలను క్షమించాడు.” ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అమరగతుల్లో (షుహదా) అయిదు రకాల వాళ్ళుంటారు. (1) ప్లేగు వ్యాధి వల్ల చనిపోయిన వారు, (2) ఉదరవ్యాధితో చనిపోయిన వారు, (3) నీటిలో మునిగి చనిపోయినవారు, (4) ఏదైనా బరువు క్రింద నలిగి చనిపోయిన వారు, (5) దైవమార్గంలో పోరాడుతూ వధింప బడినవారు.”
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 32 వ అధ్యాయం – ఫజ్లిత్తహ్ జీరి ఇలజ్జుహ్రి]
You must be logged in to post a comment.