1687. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-
మంచి మిత్రుడ్ని – చెడ్డ స్నేహితుడ్ని, కస్తూరి అమ్మే వాడితో – కొలిమి ఊదే వాడితో పోల్చవచ్చు. కస్తూరీ అమ్మేవాడునీకు కస్తూరీని కానుకగానయినా ఇస్తాడు లేదా నీవతని దగ్గర దాన్ని కొననయినా కొంటావు. లేదా కనీసం అతని దగ్గర్నుంచి నీకు సువాసనయినా వస్తుంది. కాని కొలిమి ఊదేవాడు (నిప్పు రవ్వలు ఎగరేసి) నీ బట్టలను కాలుస్తాడు లేదా అతని దగ్గర్నుంచి నీకు దుర్వాసన అయినా వస్తుంది (నీ స్నేహితుల సంగతి కూడా అంతే).
[సహీహ్ బుఖారీ : 72 వ ప్రకరణం – అజ్జిబాయి వస్సైద్, 31 వ అధ్యాయం – అల్ మిస్క్]
Read English Version of this Hadeeth