హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 9.4 ధౌర్జన్యపరునితొ పోరాడటం, ధర్మ భ్రష్టున్ని వధించటం గురించి

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 9. అపరాధాల పుస్తకం, 9.4: దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1027 – 1033) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి

↑ విషయ సూచిక

باب قتال الجاني وقتل المرتد

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1027

హదీసు 1027

عَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مِنْ قُتِلَ دُونَ مَالِهِ فَهُوَ شَهِيدٌ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ప్రబోధించారు : “తన అస్తిపాస్తులను రక్షించుకునే ప్రయత్నంలో చంపబడినవాడు అమరగతుడు.” (అబూదావూద్, నసాయి, తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు- తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

'Abdullah bin 'Umar narrated that The Messenger of Allah (ﷺ) said: “He who is killed while defending his property is considered a martyr.” Related by Abu Dawud An-Nasa’i and At-Tirmidhi who graded it as Sahih.

సారాంశం

ఇతరుల సొమ్మును దోచుకునే ఉద్దేశ్యంతో వచ్చిన బందిపోటుతో పోరాడటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఈ పోరాటంలో యజమాని తన సొమ్మును కాపాడుకునే యత్నంలో మరణిస్తే అతడు అమరగతుడవుతాడు. ఒకవేళ సొమ్ముకు యజమాని అయిన వ్యక్తి చేతిలో బందిపోటు హతుడైతే, అప్పుడు యజమాని రక్తపరిహారంగానీ, జరిమానా గానీ చెల్లించవలసిన అవసరం లేదు. ఇంకా – ఈ హత్య పాపంగా కూడా పరిగణించబడదు. ఎందుకంటే యజమాని ఆత్మరక్షణ కోసం, ఆస్తి రక్షణ కోసం ప్రతిఘటించాడు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) వివరించిన హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ‘ఓ దైవప్రవక్తా ﷺ! ఎవరయినా నా సొమ్మును తీసుకోవడానికి వస్తే నేనేం చేయను?’ అని ఒక వ్యక్తి విన్నవించుకోగా “నువ్వతనికి ఇవ్వకు” అని ఆయన ﷺ సెలవిచ్చారు. ‘ఒకవేళ అతడు నాపై దాడి చేస్తే….?!’ అని అతను సందేహపడగా “నువ్వు అతన్ని ప్రతిఘటించు” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. ‘ఒకవేళ అతడు నన్ను హతమారిస్తే….?!’ అని ఆ వ్యక్తి మళ్ళీ సందేహం వెలిబుచ్చగా “నువ్వు అమరగతినొందుతావు” అని ఆయన ﷺ చెప్పారు. ‘ఒకవేళ నేనే అతన్ని హతమారిస్తే అప్పుడేమవుతుంది?’ అని ఆ వ్యక్తి సందేహపడగా “అతడు అగ్నికి ఆహుతి అవుతాడు” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు.

ఇది ఆస్తి రక్షణకు సంబంధించిన ఆజ్ఞ. ఒకవేళ మనిషి తన ప్రాణరక్షణ కోసం, తన రక్తం కోసం, తన ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించినా సరే అతడు అమరగతుడుగానే పరిగణించబడతాడు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1027

1028

హదీసు 1028

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { قَاتَلَ يُعْلَى بْنُ أُمِّيَّةَ رَجُلًا, فَعَضَّ أَحَدُهُمَا صَاحِبَهُ, فَانْتَزَعَ يَدَهُ مِنْ فِيهِ, فَنَزَعَ ثَنِيَّتَهُ, فَاخْتَصَمَا إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: "أَيَعَضُّ أَحَدُكُمْ أَخَاهُ كَمَا يَعَضُّ اَلْفَحْلُ? لَا دِيَةَ لَهُ" } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ.‏.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం : యాలా బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు) ఒక వ్యక్తితో తగాదా పడ్డారు. ఒండొకరు పళ్ళతో కొరుక్కున్నారు. వారిలో ఒకరు రెండవ వ్యక్తి నోటి నుంచి తన చేతిని గుంజారు. ఈ గుంజులాటలో ఒకరి నోటిలోని దంతం ఊడిపోయింది. ఇద్దరూ కలసి దైవప్రవక్త ﷺ కొలువుకు వచ్చారు. దైవప్రవక్త ﷺ వారి నుద్దేశ్యించి, “ఏమిటీ, మీరు మగ ఒంటె కొరికినట్లుగా పరస్పరం ఇలా కొరుక్కుతింటారా? దీనికి ఎలాంటి నష్టపరిహారం లేదు పొండి” అని మందలించారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లిం లోనివి)

English

'Imran bin Husain (RAA) narrated, ’Ya’la bin Umaiyah fought with another man. One of them bit the other man’s finger and the latter (whose finger was bit) pulled his hand out of the first man’s mouth (who was biting) by force, causing his incisors teeth to be pulled out. They presented their dispute to the Prophet who said, “One of you bit his brother as a male camel bites? Go and there is not Diyah for him (as a punishment for their foolishness).’Agreed upon and the wording is from Muslim.

సారాంశం

అవతలి వ్యక్తి బారి (కీడు) నుండి తన్ను కాపాడుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి ద్వారా ఏదన్నా తప్పు జరిగిపోతే దానికి గాను నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఈ హదీసు ద్వారా విదితమవుతున్నది. అత్యధిక మంది పండితుల అభిప్రాయం కూడా ఇదే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1028

1029

హదీసు 1029

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ أَبُو اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَوْ أَنَّ اِمْرَأً اِطَّلَعَ عَلَيْكَ بِغَيْرِ إِذْنٍ, فَحَذَفْتَهُ بِحَصَاةٍ, فَفَقَأْتَ عَيْنَهُ, لَمْ يَكُنْ عَلَيْكَ جُنَاحٌ } مُتَّفَقٌ عَلَيْهِ. وَفِي لَفْظٍ لِأَحْمَدَ, وَالنَّسَائِيِّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ: { فَلَا دِيَةَ لَهُ وَلَا قِصَاصَ }..

అబుల్ ఖాసిం (దైవప్రవక్త – సఅసం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకవేళ ఏ మగాడైనా అనుమతి లేకుండా నీ ఇంట్లోకి తొంగిచూసినందుకు రాయి రువ్వి నువ్వతని కన్నును పగులగొట్టినా అది పాపం కాదు.” (బుఖారీ, ముస్లిం).

“దానికి నష్టపరిహారం గానీ, కన్నుకు బదులు కన్నుగానీ లేదు” అని అహ్మద్, నసాయిలు పేర్కొన్న ఉల్లేఖనంలో వుంది. ఈ వాక్యాలను ఇబ్నె హిబ్బాన్ ప్రామాణికమైనవిగా ఖరారు చేశారు.

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “If anyone spies on you (tries to look at you) without your permission, and you thereupon throw a stone at him and because of it he lost his eye, you are not to be bIamed.” Agreed upon. In another version by Ahmad and an-Nasa'i and graded as Sahih by Ibn Hibban, “He has no right for Diyah or Qisas.”

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1029

1030

హదీసు 1030

وَعَنْ اَلْبَرَاءِ بْنِ عَازِبٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { قَضَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنَّ حِفْظَ اَلْحَوَائِطِ بِالنَّهَارِ عَلَى أَهْلِهَا, وَأَنْ حِفْظَ اَلْمَاشِيَةِ بِاللَّيْلِ عَلَى أَهْلِهَا, وَأَنَّ عَلَى أَهْلِ اَلْمَاشِيَةِ مَا أَصَابَتْ مَاشِيَتُهُمْ بِاللَّيْلِ } رَوَاهُ أَحْمَدُ, وَالْأَرْبَعَةُ إِلَّا اَلتِّرْمِذِيُّ,. وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ وَفِي إِسْنَادِهِ اِخْتِلَافٌ.‏.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ బరాబిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు : పగటిపూట తోట యజమాని తోటలకు కాపలాగా ఉండాలి. రాత్రిపూట పశువుల యజమాని తన పశువుల కాపలాకు బాధ్యుడు. ఒకవేళ రాత్రిపూట గనక ఏదైనా తోటలోకి పశువులు వచ్చి తోటకు నష్టం కలిగిస్తే ఆ నష్టపరిహారాన్ని పశువుల యజమాని చెల్లించవలసి ఉంటుంది.” (ఈ హదీసును అహ్మద్, మరియు ‘నలుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలిన వారంతా ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ‘సహీహ్’గా ఖరారు చేశారు. అయితే దీని పరంపరపై భిన్నాభిప్రాయాలున్నాయి)

English

Al-Bara bin 'Azib (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) ordained that the guarding of a garden is the responsibility of its owners during the day and the guarding of animals is the responsibility of their owners at night. However, the owners of the animals are responsible for any damage caused by their animals during the night (i.e. pay compensation for what they damaged of other’s property).’ Related by Ahmad and the four Imams except At-Tirmidhi. Ibn Hibban graded it as Sahih.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1030

1031

హదీసు 1031

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- ‏-فِي رَجُلٍ أَسْلَمَ ثُمَّ تَهَوَّدَ‏-: { لَا أَجْلِسُ حَتَّى يُقْتَلَ, قَضَاءُ اَللَّهِ وَرَسُولِهِ, فَأُمِرَ بِهِ, فَقُتِلَ.‏ مُتَّفَقٌ عَلَيْهِ }.. وَفِي رِوَايَةٍ لِأَبِي دَاوُدَ: { وَكَانَ قَدْ اُسْتُتِيبَ قَبْلَ ذَلِكَ }..

తొలుత ఇస్లాం స్వీకరించి తరువాత యూదునిగా మారిపోయిన వ్యక్తి గురించి హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు: “ఇతణ్ణి హతమార్చే వరకూ నేను కూర్చోను. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ﷺ నిర్ణయం” అని నేనన్నాను.

మరి అతన్ని హతమార్చాలని ఆజ్ఞాపించబడింది. ఆ ఆజ్ఞ అమలుపరచబడింది” (బుఖారీ, ముస్లిం). హతమార్చడానికి ముందు పశ్చాత్తాపం చెందమని అతనితో చెప్పబడిందని అబూదావూద్ ఉల్లేఖనంలో వుంది.

English

Mu’adh bin Jabal (RAA) narrated – concerning a man who embraced Islam and then turned to Judaism (i.e. apostated), ‘I shall not sit down until he is killed. That is the Command of Allah and His Messenger, and he gave an order that he must be killed and so he was.’ Agreed upon. In a version by Abu Dawud, ‘He was given a chance to repent and return to Islam but he refused.’

సారాంశం

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కూర్చోనని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ముఆజ్ (రదియల్లాహు అన్హు)కు ముందు దైవప్రవక్త ﷺ హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) గారిని యమన్ ప్రాంతానికి ప్రభుత్వాధికారిగా నియమించి పంపారు. కొన్ని రోజుల తరువాత ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను కూడా పంపించారు. ముఆజ్ (రదియల్లాహు అన్హు)గారు అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒంటెమీద నుంచి దిగమని అబూ మూసా అష్‌అరీ కోరారు. ఆయన దిగటానికి వీలుగా దిండును కూడా ఊతంగా సమర్పించారు. అయితే ఆ సమయంలో అక్కడ, ఒక వ్యక్తి నిర్బంధించబడి ఉండటం చూచి, ‘ఏమిటీ సంగతి?’ అని ఆయన దర్యాప్తు చేశారు. ఇతను మొదట్లో యూదుడనీ, తరువాత ఇస్లాం స్వీకరించి, మరిప్పుడు యూదుడుగా మారిపోయాడని అబూ మూసా (రదియల్లాహు అన్హు) వివరించారు. ఇతన్ని వధించే వరకూ నేను కూర్చోనని ఆ సందర్భంగా హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) పలికారు. అబూదావూద్‌లోని కథనంలో “ఇతన్ని హతమార్చేదాకా నేను ఒంటె మీది నుంచి దిగను” అని వుంది.

ధర్మభ్రష్టుడైన వ్యక్తికి శిక్ష విధించేముందు పశ్చాత్తాపం చెందేందుకు అవకాశం ఇవ్వాలని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. పశ్చాత్తాపం చెందేందుకు అవకాశమివ్వటం తప్పనిసరి (వాజిబ్) అని మెజారిటీ విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ధర్మభ్రష్టులైనవారు – పురుషుడైనా, స్త్రీ అయినాసరే – వారికి చేసిన తప్పును తెలుసుకుని ధర్మంపై మరలి వచ్చేందుకు ఒక అవకాశం ఇచ్చి తీరాలని, ఒకవేళ వారు ఈ అవకాశాన్ని త్రోసిపుచ్చితే మాత్రం మరణ దండన విధించాలని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో ఒక స్త్రీ ధర్మభ్రష్టతకు పాల్పడినందుకు మరణ దండన విధించబడింది. శిక్షను అమలుపరుస్తున్నప్పుడు మహాప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హు) కూడా అక్కడున్నారు. వారిలో ఎవరూ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ధర్మభ్రష్టతకు పాల్పడినవారికి మరణదండన విధించే విషయంలో ప్రవక్త సహచరుల మధ్య ఏకాభిప్రాయం ఉందన్న విషయానికి ఇది ప్రబల తార్కాణం. ఈ సంఘటన ద్వారా గమనార్హమైన మరికొన్ని ముఖ్యాంశాలు మన దృష్టికి వస్తున్నాయి. అవేమంటే;

1. గవర్నర్లను, ప్రభుత్వాధికార్లను నియమించే అధికారం రాజ్యాధికారికి ఉంటుంది.

2. అవసరమనుకుంటే ఏకకాలంలో ఒక పనిపై ఇద్దరు ప్రభుత్వాధికారులను కూడా నియమించవచ్చు.

3. ధర్మభ్రష్టతకు పాల్పడిన వారికి మరణదండన విధించే, షరీయత్‌ను (శాసనాంగాన్ని) అమలుపరచే బాధ్యత సంబంధిత ప్రభుత్వాధికారిపై ఉంటుంది.

4. తాను నియమించబడిన ప్రాంతానికి అధికారి వాహనంపై వెళ్ళవచ్చు.

5. కేంద్రం నియమించి పంపిన అధికారులను స్థానిక అధికారులు సాదరంగా ఆహ్వానించాలి, వారి యెడల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.

6. షరీయత్ చట్టాలను అమలు పరచటంలో తాత్సారం చేయరాదు. విచారణ జరిపి నేరస్థుని నేర నిర్ధారణ జరిగిన తక్షణమే శిక్షలను అమలుపరచాలి.

7. శిక్షలను బహిరంగంగా – ప్రజల సమక్షంలో – అమలు జరపాలి. ఇలా చేయటం వల్ల ప్రజలు శాసనోల్లంఘనకు పాల్పడకుండా ఉంటారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1031

1032

హదీసు 1032

وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ بَدَّلَ دِينَهُ فَاقْتُلُوهُ } رَوَاهُ اَلْبُخَارِيُّ

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “ఎవరయితే తన ధర్మాన్ని మార్చుకున్నాడో అతన్ని హతమార్చండి.” (బుఖారీ)

English

Ibn 'Abbas (RAA) narrated that The Messenger of Allah said, “He who changes his religion (i.e. apostates) kill him.” Related by Al-Bukhari.

సారాంశం

ధర్మభ్రష్టుడైన వ్యక్తికి విధించే దండన షరీయత్ ప్రకారం మరణ దండన మాత్రమేనని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతున్నది. ఈ ధర్మభ్రష్టతకు పాల్పడిన వ్యక్తి పురుషుడైనా, స్త్రీ అయినా సరే శిక్ష శిక్షే. అయితే ఎవరయినా బహిరంగంగా ధర్మభ్రష్టుడైనట్టు చెబితేనే న్యాయస్థానం విచారణ జరిపి-తగు సాక్ష్యాల ఆధారంగా – ఈ శిక్ష విధిస్తుంది. కాని ఎవరయినా తన ధర్మభ్రష్ట నిర్ణయాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే మాత్రం అతనికి మరణ దండన విధించబడదు. ఎవరయినా బలవంతంగా ధర్మభ్రష్టతకు గురిచేసినా సరే మరణ దండన అతనికి వర్తించదు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1032

1033

హదీసు 1033

وَعَنْ اِبْنِ عَبَّاسٍ; { أَنَّ أَعْمَى كَانَتْ لَهُ أُمُّ وَلَدَ تَشْتُمُ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-وَتَقَعُ فِيهِ, فَيَنْهَاهَا, فَلَا تَنْتَهِي, فَلَمَّا كَانَ ذَاتَ لَيْلَةٍ أَخْذَ اَلْمِعْوَلَ, فَجَعَلَهُ فِي بَطْنِهَا, وَاتَّكَأَ عَلَيْهَا.‏ فَقَتَلَهَا فَبَلَغَ ذَلِكَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ:"أَلَّا اِشْهَدُوا أَنَّ دَمَهَا هَدَرٌ }. رَوَاهُ أَبُو دَاوُدَ وَرُوَاتُهُ ثِقَاتٌ.‏

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక అంధుడుండేవాడు. ఆయన వద్ద ఒక బానిస యువతి ఉండేది. ఆమె తరచూ దైవప్రవక్త ﷺను దూషిస్తూ ఉండేది. తన వైఖరిని మార్చుకోమని ఆ సహాబి (రదియల్లాహు అన్హు) ఆమెకు ఎంతగానో నచ్చజెప్పారు. అయినా ఆమె వినలేదు. ఒక రోజు రాత్రి ఆయన గెడ్డపలుగును ఆమె పొట్టపై ఉంచి తన బరువునంతటినీ దానిపై వేశారు. దాంతో ఆమె చనిపోయింది. ఈ సంగతి దైవప్రవక్త ﷺకు తెలిసింది. “ఆమె రక్తం వృధా అయిపోయిందన్న విషయానికి మీరంతా సాక్షులుగా ఉండండి” అని ఆయన ﷺ చెప్పారు. (అబూదావూద్- దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు)

English

Ibn 'Abbas (RAA) narrated, ‘A blind man had a pregnant slave, who used to abuse the Messenger of Allah (ﷺ) and defame him. The blind man forbade her but she did not stop. One night she began to slander the Prophet (ﷺ) so he took an axe, placed it on her belly, pressed it and killed her. The Messenger of Allah (ﷺ) was told about it, and thereupon he said, “Oh people! Be witnesses that no Diyah is to be paid for her blood.” Related by Abu Dawud with a trustworthy chain of narrators.

సారాంశం

దైవప్రవక్త ﷺను దూషించే, తూలనాడే వారికి విధించబడే శిక్ష మరణ శిక్షేనని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయంపై యావత్తు ముస్లిం సమాజం ఏకీభావం వ్యక్తపరచిందని ఇమామ్ ఇబ్నె ముంజిర్ వక్కాణించారు. ఒకవేళ ముస్లిమేతరుడైన ‘జిమ్మీ’ వ్యక్తి ఈ విధంగా దూషించినా అతనికీ మరణ దండనే విధించబడుతుంది. దైవప్రవక్తను దూషించిన వ్యక్తులకు పశ్చాత్తాపం చెందేందుకు కూడా గడువు ఇవ్వబడదని మరికొంతమంది పండితులు వ్యాఖ్యానించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.4 దౌర్జన్యపరునితో పోరాడటం, ధర్మభ్రష్టుణ్ణి వధించటం గురించి|హదీసు 1033