హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 10. శిక్షల పుస్తకం, 10.1: వ్యభిచారికి విధించబడే శిక్ష. ఈ అధ్యాయంలో 15 హదీసులు (హదీసు 1034 – 1048) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష
باب حد الزاني
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 1034
عَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - وَزَيْدِ بْنِ خَالِدٍ اَلْجُهَنِيِّ رَضِيَ اَللَّهُ عنهما { أَنَّ رَجُلًا مِنَ اَلْأَعْرَابِ أَتَى رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -. فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! أَنْشُدُكَ بِاَللَّهِ إِلَّا قَضَيْتَ لِي بِكِتَابِ اَللَّهِ, فَقَالَ اَلْآخَرُ - وَهُوَ أَفْقَهُ مِنْهُ - نَعَمْ. فَاقَضِ بَيْنَنَا بِكِتَابِ اَللَّهِ, وَأْذَنْ لِي, فَقَالَ: "قُلْ". قَالَ: إنَّ اِبْنِي كَانَ عَسِيفًا عَلَى هَذَا فَزَنَى بِاِمْرَأَتِهِ, وَإِنِّي أُخْبِرْتُ أَنْ عَلَى اِبْنِي اَلرَّجْمَ, فَافْتَدَيْتُ مِنْهُ بِمَائَةِ شَاةٍ وَوَلِيدَةٍ, فَسَأَلَتُ أَهْلَ اَلْعِلْمِ, فَأَخْبَرُونِي: أَنَّ عَلَى اِبْنِيْ جَلْدُ مَائَةٍ وَتَغْرِيبُ عَامٍ, وَأَنَّ عَلَى اِمْرَأَةِ هَذَا اَلرَّجْمَ, فَقَالَ رَسُولُ ا للَّهِ - صلى الله عليه وسلم -"وَالَّذِي نَفْسِي بِيَدِهِ, لَأَقْضِيَنَّ بَيْنَكُمَا بِكِتَابِ اَللَّهِ, اَلْوَلِيدَةُ وَالْغَنَمُ رَدٌّ عَلَيْكَ, وَعَلَى اِبْنِكَ جَلْدُ مِائَةٍ وَتَغْرِيبُ عَامٍ, وَاغْدُ يَا أُنَيْسُ إِلَى اِمْرَأَةِ هَذَا, فَإِنْ اِعْتَرَفَتْ فَارْجُمْهَا" } مُتَّفَقٌ عَلَيْهِ, هَذَا وَاللَّفْظُ لِمُسْلِمٍ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) మరియు జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రదియల్లాహు అన్హుమా)ల కథనం : ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త ﷺసన్నిధికి వచ్చి, “దైవప్రవక్తా ﷺ! నేను దైవసాక్షిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను – తమరు నా వ్యవహారంలో దైవగ్రంథం ఆధారంగా తీర్పివ్వండి” అని విన్నవించుకున్నాడు. ఆ తరువాత అతని కన్నా కాస్త ఎక్కువ విజ్ఞుడైన వ్యక్తి ముందుకు వచ్చి, ‘మా వ్యవహారాన్ని దైవగ్రంథం ఆధారంగానే పరిష్కరించండి. అయితే ఈ సందర్భంగా అసలేం జరిగిందో చెప్పడానికి అనుమతించండి” అని అన్నాడు. “సరే చెప్పు” అని ఆయన ﷺ అన్నారు. “నా కొడుకు ఇతని దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. ఒక రోజు ఆ అబ్బాయి ఇతని భార్యతో వ్యభిచారం చేశాడు. నా కుమారునికి రాళ్లు రువ్వే శిక్ష విధించబడుతుందని నాకు తెలియగానే నష్టపరిహారంగా నేనితనికి నూరు మేకల్ని, ఒక బానిసరాలిని ఇచ్చాను. అయితే ఆ తరువాత నేను విద్వాంసులను విచారించగా, నా కొడుకుకు నూరు కొరడా దెబ్బలు కొట్టాలనీ, ఒక ఏడాది కాలంపాటు నగరం నుంచి బహిష్కరించాలనీ, ఇతని భార్యకు శిలా శిక్ష విధించాలని వారు చెప్పారు” అని జరిగిందంతా వివరించాడు. దైవప్రవక్త ﷺ ఇదంతా విని, “ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షి! నేను మీ వ్యవహారాన్ని దైవగ్రంథం ప్రకారమే పరిష్కరిస్తాను. నీవు ఇచ్చిన మేకలు, బానిసరాలు నీకు తిరిగి ఇచ్చేయబడతాయి. నీ కొడుక్కి నూరు కొరడా దెబ్బల శిక్షతో పాటు, ఒక సంవత్సర కాలంపాటు నగర బహిష్కరణ గావించబడుతుంది. (తరువాత ఆయన తన సహచరుడు అనీస్ నుద్దేశ్యించి) ఉనైస్! నీవు ఈ వ్యక్తి భార్య దగ్గరకెళ్ళి విచారించు. ఆమె గనక తన నేరాన్ని ఒప్పుకుంటే శిలా శిక్ష విధించాలి” అని తీర్పు ఇచ్చారు. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
English
Abu Hurairah and Zaid bin Khalid al-Juhani (RAA) narrated that a Bedouin came to the Prophet (ﷺ) and said, 'O Messenger of Allah! I beseech you by Allah, that you judge between us according to Allah's laws' The man's opponent who was wiser than him got up and said, 'Yes, judge between us according to Allah's Law and kindly allow me (to speak).' The Prophet (ﷺ) said: "Speak." He said, 'My son was a laborer working for that man (the Bedouin) and he committed illegal sexual intercourse with his wife, and I was informed that my son deserved to be stoned to death (as punishment for this offence). I ransomed him with one hundred sheep and a slave girl. But when I asked the knowledgeable people they told me that my son should receive a hundred lashes and be exiled for a year, and the man's wife should be stoned to death. The Messenger of Allah (ﷺ) replied, "By Him in Whose Hands my soul is, I shall judge between you according to the Law of Allah (i.e. His Book). The slave girl and the sheep are to be returned to you. As for your son, he has to receive one hundred lashes and be exiled for a year. O Unais! Go to this man's wife, and if she confesses, then stone her to death." Agreed upon, and this is Muslim's version.
సారాంశం
వ్యభిచరించిన వ్యక్తి వివాహితుడైతే రాళ్లు రువ్వే శిక్ష విధించబడుతుందనీ, అవివాహితుడైతే నూరు కొరడా దెబ్బలు కొట్టడంతోపాటు ఒక సంవత్సర కాలం పాటు నగర బహిష్కరణ చేయబడుతుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్నది. హనఫీ పండితులు నగర బహిష్కరణకు అనుకూలంగా లేరు. అయితే ఈ ధోరణి హదీసుకు విరుద్ధమైనదన్నది గమనార్హం. వ్యభిచార నేరానికి బదులుగా నష్టపరిహారం చెల్లించి అవతలి వారితో రాజీకి రావటం కూడా సరైనది కాదు. మానమర్యాదల పరిరక్షణ నోట్లతో సాధ్యం కాదు, దానికోసం శిక్షలు కఠినంగా ఉండాలి. శిక్షలను అమలు పరచాలి
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1034
హదీసు 1035
وَعَنْ عُبَادَةَ بْنِ اَلصَّامِتِ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ خُذُوا عَنِّي, خُذُوا عَنِّي, فَقَدْ جَعَلَ اَللَّهُ لَهُنَّ سَبِيلاً, اَلْبِكْرُ بِالْبِكْرِ جَلْدُ مِائَةٍ, وَنَفْيُ سَنَةٍ, وَالثَّيِّبُ بِالثَّيِّبِ جَلْدُ مِائَةٍ, وَالرَّجْمُ } رَوَاهُ مُسْلِمٌ..
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “(షరీయత్ ఆదేశాలను) నా నుండి గ్రహించండి. (సమాజ మర్యాదలను) నానుండి గ్రహించండి. అల్లాహ్ ఈ స్త్రీల కొరకు మార్గాన్ని స్పష్టపరిచాడు. అవివాహితుడైన వ్యక్తి అవివాహితురాలితో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటే వారికి నూరు కొరడా దెబ్బల చొప్పున కొట్టబడతాయి. ఒక ఏడాది కాలం పాటు నగరం నుంచి బహిష్కరించటం జరుగుతుంది. ఒకవేళ వివాహితుడు వివాహితురాలితో వ్యభిచరిస్తే నూరు కొరడా దెబ్బలతో పాటు రాళ్లు రువ్వబడతాయి.” (ముస్లిం)
English
'Ubadah bin As-Samit (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Receive from me (this revelation), receive from me (this revelation). Allah has ordained a way for those women (unmarried females who committed adultery). When an unmarried man, commits adultery with an unmarried woman, they should receive one hundred lashes and be exiled for a year. If they (fornicate while they) were married, they shall receive hundred lashes and be stoned to death. Reported by Muslim.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1035
హదీసు 1036
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: { أَتَى رَجُلٌ مِنْ اَلْمُسْلِمِينَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم --وَهُوَ فِي اَلْمَسْجِدِ- فَنَادَاهُ فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! إِنِّي زَنَيْتُ, فَأَعْرَضَ عَنْهُ, فَتَنَحَّى تِلْقَاءَ وَجْهِهِ, فَقَالَ: يَا رَسُولَ اَللَّهِ! إِنِّي زَنَيْتُ, فَأَعْرَضَ عَنْهُ, حَتَّى ثَنَّى ذَلِكَ عَلَيْهِ أَرْبَعَ مَرَّاتٍ, فَلَمَّا شَهِدَ عَلَى. نَفْسِهِ أَرْبَعَ شَهَادَاتٍ. دَعَاهُ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -فَقَالَ "أَبِكَ جُنُونٌ?" قَالَ. لَا. قَالَ: "فَهَلْ أَحْصَنْتَ?". قَالَ: نَعَمْ. فَقَالَ النَّبِيُّ - صلى الله عليه وسلم -"اِذْهَبُوا بِهِ فَارْجُمُوهُ" } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒక ముస్లిం వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ మస్జిద్లో ఉన్నారు. “ఓ దైవప్రవక్తా ﷺ! నేను వ్యభిచారం చేశాను” అన్నాడు బిగ్గరగా. దైవప్రవక్త ﷺ తన ముఖాన్ని అతని వైపు నుంచి తిప్పుకున్నారు. అతను మరోసారి దైవప్రవక్త ﷺ ముందుకు వచ్చి “నేను వ్యభిచారం చేశాను” అని అన్నాడు. ఆయన ﷺ తన ముఖారవిందాన్ని తిప్పుకున్నారు. ఈ విధంగా ఆ వ్యక్తి నాలుగుసార్లు – ఆయన ﷺ ముందుకు వచ్చి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు తనకు వ్యతిరేకంగా స్వయంగా నాలుగుసార్లు సాక్ష్యమిచ్చినందున ఆయన ﷺ అతణ్ణి తన దగ్గరికి పిలిచి “నీవేమైనా పిచ్చివాడివా?” అని అడిగారు. “లేదండీ” అని అన్నాడతను. “నీకు పెళ్ళయిందా?” అని మళ్ళీ ప్రశ్నించారాయన ﷺ. “అయిందండీ” అని బదులిచ్చాడు. అప్పుడు ఆయన ﷺ (తన సహచరులనుద్దేశ్యించి) “ఇతణ్ణి తీసుకెళ్ళి రాళ్లు రువ్వండి” అని ఆదేశించారు. (బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated, 'A Muslim man came to the Prophet (ﷺ) while he was in the mosque, and called him saying, 'O Messenger of Allah! I have committed adultery.' The Messenger of Allah (ﷺ) turned his face away from him, so the man came round (from the other side) towards his face and said, 'O Messenger of Allah! I have committed adultery.' The Messenger of Allah (ﷺ) again turned his face away from him, but the man repeated his statement four times. When he testified four times that he did it, the Messenger of Allah (ﷺ) called him saying, "Are you insane?" The man said, 'No.' The Messenger of Allah (ﷺ) then asked him, "Are you married?" The man answered, 'Yes.' The Messenger of Allah (ﷺ) said: "Take him away and stone him (to death)." Agreed upon.
సారాంశం
ఈ హదీసు ఆధారంగా కొంతమంది వ్యభిచార నేరం చేసిన మనిషి నాలుగుసార్లు నేరాన్ని ఒప్పుకోవాలన్న షరతు పెట్టారు. వాస్తవానికి హదీసులో ఆ వ్యక్తి తనంతట తానుగా నాలుగుసార్లు ఆ నేరానికి పాల్పడినట్లు చెప్పుకున్నాడు. ఆ మేరకు అతనిచేత ఎవరూ చెప్పించలేదు. నాలుగు సార్లు నేరాన్ని ఒప్పుకోవాలన్న షరతు ఇందులో ఎక్కడా లేదు. అతని ఒప్పుకోలుపై దైవప్రవక్త ﷺ మాటిమాటికీ దాటవేసే ప్రయత్నం చేశారు. నాలుగుసార్లు ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చిన తరువాత కూడా పలుకోణాల నుంచి ప్రశ్నలు వేసి ఈ వ్యవహారంలో ఎలాంటి అనుమానానికీ, మీమాంసకు తావు ఉండకుండా చేశారు. అన్ని విధాలుగా ఆ వ్యక్తి శిక్షార్హుడని స్పష్టంగా తేలిపోయిన తరువాతనే శిక్షను అమలుపరచమని ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ హదీసు ఆధారంగా వ్యభిచార నేరస్థుడు తన నేరాన్ని నాలుగుసార్లు ఒప్పుకుని తీరాలని షరతు పెట్టడం సమంజసం కాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1036
హదీసు 1037
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { لَمَّا أَتَى مَاعِزُ بْنُ مَالِكٍ إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ لَهُ: "لَعَلَّكَ قَبَّلْتَ, أَوْ غَمَزْتَ, أَوْ نَظَرْتَ?" قَالَ: لَا يَا رَسُولَ اَللَّهِ. } رَوَاهُ اَلْبُخَارِيُّ
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : మాయిజ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ వద్దకు వచ్చినప్పుడు ఆయన ﷺ అతన్ని ఉద్దేశ్యించి, “బహుశా నువ్వు ముద్దుపెట్టుకోవటం, కౌగిలించుకోవటం లేదా కవ్వించటం, లేదా చెడు చూపు చూడటం లాంటివి చేశావేమో!” అని విచారించారు. “లేదు దైవప్రవక్తా ﷺ!” అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. (బుఖారీ)
English
Ibn 'Abbas (RAA) narrated, 'When Ma'iz came to the Prophet (ﷺ) (admitting that he had committed adultery), he said to him, "Perhaps you have just kissed, or touched or looked (at the woman)." Ma'iz said,'No, O Messenger of Allah.' Related by Al-Bukhari.
సారాంశం
ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే వ్యభిచార నేరానికి పాల్పడిన వ్యక్తి స్పష్టంగా, తాను ఆ నేరానికి పాల్పడినట్లు అంగీకరించే వరకూ, అతడు ఎలాంటి ఒత్తిళ్ళకూ, ప్రలోభాలకు లొంగలేదని ఇదమిత్థంగా తెలియనంతవరకూ రాళ్లు రువ్వే శిక్షను అతనిపై విధించకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1037
హదీసు 1038
وَعَنْ عُمَرَ بْنِ اَلْخَطَّابِ - رضى الله عنه - { أَنَّهُ خَطَبَ فَقَالَ: إِنَّ اَللَّهَ بَعَثَ مُحَمَّدًا بِالْحَقِّ, وَأَنْزَلَ عَلَيْهِ اَلْكِتَابَ, فَكَانَ فِيمَا أَنْزَلَ اَللَّهُ عَلَيْهِ آيَةُ اَلرَّجْمِ. قَرَأْنَاهَا وَوَعَيْنَاهَا وَعَقَلْنَاهَا, فَرَجَمَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -وَرَجَمْنَا بَعْدَهُ, فَأَخْشَى إِنْ طَالَ بِالنَّاسِ زَمَانٌ أَنْ يَقُولَ قَائِلٌ: مَا نَجِدُ اَلرَّجْمَ فِي كِتَابِ اَللَّهِ, فَيَضِلُّوا بِتَرْكِ فَرِيضَةٍ أَنْزَلَهَا اَللَّهُ, وَأَنَّ اَلرَّجْمَ حَقٌّ فِي كِتَابِ اَللَّهِ تَعَالَى عَلَى مَنْ زَنَى, إِذَا أُحْصِنَ مِنْ اَلرِّجَالِ وَالنِّسَاءِ, إِذَا قَامَتْ اَلْبَيِّنَةُ, أَوْ كَانَ اَلْحَبَلُ, أَوْ اَلِاعْتِرَافُ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (స్వయంగా) ఇలా ప్రసంగించారు – ముహమ్మద్ ﷺ కు అల్లాహ్ సత్యాన్నిచ్చి పంపాడు. ఆయన ﷺ పై గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఆయన ﷺపై అవతరింపజేసిన దానిలో శిలాశిక్షకు సంబంధించిన సూక్తి కూడా ఉంది. మేము స్వయంగా దాన్ని పఠించాము, జ్ఞాపకం కూడా చేసుకున్నాము. ఇంకా దాన్ని బాగా అర్థం చేసుకున్నాము, మనో మస్తిష్కాలలో పదిలపరచుకున్నాము. అంతేకాదు, దైవప్రవక్త ﷺ శిలా శిక్షను అమలుపరచారు. ఆయన ﷺ తదనంతరం మేము సయితం ఆ శిక్షను అమలుపరచాము. కాని కొంతకాలం గడచిన మీదట ప్రజలు, ‘దైవగ్రంథంలో మేమెక్కడా శిలా శిక్ష గురించిన ప్రస్తావన చూడలేద’ని అంటారేమోనని నాకనుమానంగా ఉంది. ఈ విధంగా వారు దేవుడు అవతరింపజేసిన ‘విధి’ని పరిత్యజించి మార్గభ్రష్టులవుతారేమో! వాస్తవానికి దైవగ్రంథంలో శిలా శిక్ష ఉందన్నది సత్యబద్ధం. వివాహితుడై ఉండి, వ్యభిచారానికి పాల్పడిన వ్యక్తికి ఈ శిలా శిక్ష విధించబడుతుంది – వారు పురుషులైనా సరే, స్త్రీలైనా సరే – సాక్ష్యాలు ముందుకు వచ్చినమీదట లేదా గర్భవతి అని తెలిసినపుడు లేదా నేరస్థుడు తన నేరాన్ని స్వయంగా ఒప్పుకున్నప్పుడు (ఈ శిక్ష విధించబడుతుంది). (బుఖారీ)
English
'Umar bin al-Khattab (RAA) narrated that he addressed the people and said, 'Verily Allah has sent Muhammad with the Truth and sent down the Book to him, and the verse of stoning was included in what Allah sent down. We recited, memorized and comprehended it. The Messenger of Allah (ﷺ) accordingly (to what was in the verse) stoned to death (whoever committed adultery while being married), and we stoned after his death. But I am afraid that after a long time passes, someone may say, 'We do not find the Verses of stoning in Allah's Book, and thus they may go astray by abandoning an obligation that Allah has sent down. Verily, stoning is an obligation in the Book of Allah to be inflicted on married men and women who commit adultery, when their crime is proven, evident by pregnancy, or through the confession (of the adulterer).' Agreed upon.
సారాంశం
వ్యభిచార నేరం మూడు విధాలుగా నిరూపితం అవుతుందని ఈ హదీసు ద్వారా స్పష్టమవుతోంది. 1. నాలుగు సాక్ష్యాలుండాలి. 2. లేదా నేరస్థుడు తన నేరాన్ని తనంతట తానుగా అంగీకరించాలి. 3. లేదా స్త్రీ గర్భవతి అని నిర్ధారణ అవ్వాలి.
ఒకవేళ స్త్రీ పెళ్ళి కాకుండానే గర్భవతి అయినపక్షంలో ఏం చేయాలి? ఇట్టి స్థితిలో హద్దు (శిక్ష)ను విధించాల్సిందేనని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఆయన శిష్యులు భావిస్తున్నారు. అయితే కేవలం గర్భవతి అన్న కారణంపై హద్దు (శిక్ష) విధించబడజాలదని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్)లు అభిప్రాయపడుతున్నారు. ఈ హదీసు పలువురు సహాబీల (రదియల్లాహు అన్హు)చే ఉల్లేఖించబడింది.
హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ఇలా ఉంది : అహ్జాబ్ సూరా బఖరా సూరాకు సమానంగా ఉండేది. తరువాత అందలి కొన్ని భాగాలు రద్దు అయినాయి. వివాహితుడైన పురుషుడుగానీ, వివాహితురాలైన స్త్రీగానీ వ్యభిచారం చేస్తే రాళ్లు రువ్వండి అనే సూక్తిని మేము అందులో పఠించేవారము. తరువాత ఈ సూక్తి పారాయణం రద్దు పరచబడింది. అయితే ‘ఆదేశం’ మాత్రం మిగిలివుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1038
హదీసు 1039
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { "إِذَا زَنَتْ أَمَةُ أَحَدِكُمْ, فَتَبَيَّنَ زِنَاهَا, فَلْيَجْلِدْهَا اَلْحَدَّ, وَلَا يُثَرِّبْ عَلَيْهَا, ثُمَّ إِنْ زَنَتْ فَلْيَجْلِدْهَا اَلْحَدَّ, وَلَا يُثَرِّبْ عَلَيْهَا, ثُمَّ إِنْ زَنَتِ اَلثَّالِثَةَ, فَتَبَيَّنَ زِنَاهَا, فَلْيَبِعْهَا وَلَوْ بِحَبْلٍ مِنْ شَعَرٍ } مُتَّفَقٌ عَلَيْهِ وَهَذَا لَفْظُ مُسْلِمٍ.
దైవప్రవక్త ﷺ ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: “మీలోని ఎవరి బానిస స్త్రీ అయినా వ్యభిచారానికి పాల్పడి, ఆమె వ్యభిచరించినట్లు నిర్ధారణ అయితే అతడామెను శిక్షించాలి. అంతేగాని ఆమెను ఛీత్కరించకూడదు. రెండవసారి కూడా ఆ బానిస స్త్రీ వ్యభిచారానికి ఒడిగడితే అప్పుడు కూడా శిక్ష విధించబడుతుంది-దూషించటం జరగదు. మరి ఆ బానిస స్త్రీ మూడవసారి కూడా వ్యభిచారానికి పాల్పడితే, వ్యభిచరించినట్లు స్పష్టంగా రుజువైతే ఆమెను అమ్మివేయాలి. ఆఖరికి వెంట్రుకలతో పేనబడిన త్రాడుకు బదులుగా అమ్మవలసి వచ్చినా సరే ఆమెను వదిలించుకోవాలి. (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
English
Abu Hurairah (RAA) narrated, 'I heard the Messenger of Allah (ﷺ) say, "When the slave-woman of one of you commits adultery and she is proven guilty (through witnesses or confession), he should flog her as prescribed (for the slave woman), but he should not admonish her. If she does this again, then she should be flogged again but he should not admonish her. If she commits it for the third time, and she is proven guilty, then he must sell her even if it was for a rope of hair." Agreed upon, and the wording is from Muslim.
సారాంశం
ఈ హదీసు ద్వారానూ, రాబోయే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) హదీసు ద్వారానూ అర్థమయ్యే దేమిటంటే బానిస లేక బానిసరాలిపై యజమాని శిక్షను అమలుపరచగలడు. అయితే స్వతంత్రునిపై విధించే శిక్షలో ఇది సగం శిక్ష అయి ఉంటుంది. దివ్యగ్రంథంలో అల్లాహ్ సెలవిచ్చినట్లు; సౌశీల్యవతి అయిన స్వతంత్ర స్త్రీకి విధించబడే శిక్షలో ఇది సగం అయి ఉంటుంది. ఒకవేళ బానిసరాలు వివాహితురాలై ఉంటే, అట్టి పరిస్థితిలో ఆమెకు విధించబడే శిక్ష గురించి భేదాభిప్రాయం ఉంది. అంటే ఆమెపై శిక్ష విధించవలసింది ప్రభుత్వమా? లేక ఆమె యజమానా? యజమాని మాత్రమే ఈ స్థితిలోనూ శిక్ష విధించాలని మెజారిటీ విద్వాంసులు భావిస్తున్నారు. అయితే వివాహితురాలైన బానిసరాలిపై యజమాని శిక్ష విధించలేడని, ఎందుకంటే ఆమె ఒక్క యజమానికి మాత్రమే లోబడి లేదనీ, మరో వంక ఆమె భర్తకు కూడా ఆమెపై అజమాయిషీ ఉందనీ ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆ బానిసరాలి భర్త కూడా ఆ యజమానివద్దనే బానిసగా ఉంటే అట్టి స్థితిలో యజమానిదే తుది నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు.
ఒక స్వతంత్రురాలైన స్త్రీ అక్రమ సంబంధానికి పాల్పడినట్లు ఏ ఏ ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించబడతాయో అలాంటి సాక్ష్యాలే ఒక బానిసరాలి విషయంలో కూడా సమర్పించవలసి ఉంటుంది. మరి కొంతమంది దృష్టిలో ఈ సాక్ష్యాలేమీ అక్కరలేదు, ఆమె తప్పుచేసినట్లు ఆమె యజమాని దృఢ నిశ్చయానికి వస్తే చాలు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1039
హదీసు 1040
وَعَنْ عَلِيٍّ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَقِيمُوا اَلْحُدُودَ عَلَى مَا مَلَكَتْ أَيْمَانُكُمْ } رَوَاهُ أَبُو دَاوُدَ. وَهُوَ فِي "مُسْلِمٍ" مَوْقُوفٌ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : “మీ అధీనంలో వున్న బానిసరాలు (లేక బానిస – నేరస్థులని నిరూపితం అయినప్పుడు) శిక్షలు విధించండి.” (దీనిని అబూదావూద్ ఉల్లేఖించారు – ‘ముస్లిం’లో ఈ ఉల్లేఖనం ‘మౌఖూఫ్’గా ఉంది)
English
'Ali (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Inflict the prescribed punishment to those whom you possess (i.e. your slaves)." Related by Abu Dawud. And it is related by Muslim (but only traced to the Companion).
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1040
హదీసు 1041
وَعَنْ عِمْرَانَ بْنِ حَصِينٍ - رضى الله عنه - { أَنَّ اِمْرَأَةً مِنْ جُهَيْنَةَ أَتَتِ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم --وَهِيَ حُبْلَى مِنْ اَلزِّنَا-فَقَالَتْ: يَا نَبِيَّ اَللَّهِ! أَصَبْتُ حَدًّا, فَأَقِمْهُ عَلَيَّ, فَدَعَا رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -وَلِيَّهَا. فَقَالَ: "أَحْسِنْ إِلَيْهَا فَإِذَا وَضَعَتْ فَائْتِنِي بِهَا" فَفَعَلَ. فَأَمَرَ بِهَا فَشُكَّتْ عَلَيْهَا ثِيَابُهَا, ثُمَّ أَمَرَ بِهَا فَرُجِمَتْ, ثُمَّ صَلَّى عَلَيْهَا, فَقَالَ عُمَرُ: أَتُصَلِّي عَلَيْهَا يَا نَبِيَّ اَللَّهِ وَقَدْ زَنَتْ? فَقَالَ: "لَقَدْ تَابَتْ تَوْبَةً لَوْ قُسِّمَتْ بَيْنَ سَبْعِينَ مِنْ أَهْلِ اَلْمَدِينَةِ لَوَسِعَتْهُمْ, وَهَلْ وَجَدَتْ أَفَضَلَ مِنْ أَنْ جَادَتْ بِنَفْسِهَا لِلَّهِ? } ". رَوَاهُ مُسْلِمٌ.
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం : జుహైన తెగకు చెందిన ఒక స్త్రీ దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె తాను పాల్పడిన వ్యభిచార పాపఫలంగా గర్భవతి కూడా అయింది. “దైవప్రవక్తా ﷺ! నేను శిక్షార్హురాలిని. కనుక తమరు నాపై శిక్షను విధించండి” అని ప్రాధేయపడిందామె. దైవప్రవక్త ﷺ ఆమె తాలూకు సంరక్షకుణ్ణి పిలిపించి, “ఈమె యెడల దయాభావంతో మెలగు. ప్రసవించిన తరువాత ఈమెను నా వద్దకు తీసుకురా” అని సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ చెప్పినట్లే చేశాడు. ఆయన ﷺ ఆమె గురించి ఆదేశాలు జారీ చేశారు. ఆమె నిర్బంధించబడింది. ప్రవక్త ఆదేశానుసారం ఆమెపై రాళ్లు రువ్వబడ్డాయి. తరువాత ఆమె అంత్యక్రియల నమాజ్ చేయబడింది. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కల్పించుకుని, “ఓ దైవప్రవక్తా ﷺ! తమరు వ్యభిచారానికి పాల్పడిన ఒక పాపిష్ఠురాలి అంత్యక్రియల నమాజ్‌లో పాల్గొంటారా?” అని ఆశ్చర్యంగా అడగ్గా, ఆయన ﷺ ఇలా సమాధానమిచ్చారు : “ఈమె పశ్చాత్తాపం చెందింది. ఈమె చెందిన పశ్చాత్తాపం ఎంత గొప్పదంటే, ఒకవేళ దాన్ని మదీనా వాసుల్లోని డెబ్బయి మందికి పంచిపెట్టినా అది వారి (మన్నింపు)కై సరిపోతుంది. దైవం కోసం తన ప్రాణాన్ని సయితం ధారాదత్తం చేసిన ఇంతకన్నా గొప్ప త్యాగమయిని నీవు చూశావా?!” (ముస్లిం)
English
'Imran bin Husain (RAA) narrated, 'A woman from Juhainah came to the Prophet (ﷺ) while she was pregnant due to committing adultery and said, 'O Messenger of Allah! I have done something for which a prescribed punishment is to be inflicted, so please inflict it on me. The Messenger of Allah (ﷺ) called her guardian and said, "Be good to her, and when she delivers bring her back to me." Her guardian brought her back when she had delivered and the Messenger of Allah (ﷺ) gave his commands and her clothes were tied around her and then the Prophet (ﷺ) gave his commands and she was stoned to death. The Messenger of Allah (ﷺ) offered funeral prayer for her and thereupon 'Umar said, 'O Messenger of Allah! You offer funeral prayer for her even though she committed adultery?' The Messenger of Allah (ﷺ) replied, "She has offered such a repentance (for her sin) that if it was divided between seventy of the inhabitants of Madinah, it would be sufficient for them. Have you found such repentance better than sacrificing her life for the sake of Allah, the Almighty?" Related by Muslim.
సారాంశం
గర్భవతి అయిన మహిళపై వ్యభిచార శిక్ష వెంటనే అమలుపరచబడదనీ, ప్రసవించిన తరువాత, పుట్టిన శిశువుకు పాలుపట్టే బాధ్యతను ఎవరయినా తీసుకున్న తరువాతనే ఈ శిక్ష విధించబడుతుందని పై హదీసు ద్వారా అవగతమవుతోంది. ఒకవేళ పాలుపట్టే ఏర్పాటు జరగని పక్షంలో రెండేండ్ల పాల గడువు కూడా ముగిసిన తరువాతే శిక్ష అమల్లోకి వస్తుంది.
కాలు జారిన ఆ మహిళ పట్ల దయాభావంతో మెలగమని దైవప్రవక్త ﷺ హితవు పలకటం గమనార్హం. సాధారణంగా ఇలాంటి తప్పుచేసిన స్త్రీని అయినవారు, కానివారు, అమ్మలక్కలు – అందరూ సూటిపోటి మాటలతో బ్రతుకు దుర్భరం చేసివేస్తారు. ఇలాంటి ప్రతికూల వాతావరణం ఆమెను అస్వస్థతకు గురిచేయటమే గాకుండా, ఆమె కడుపులో పెరిగే బిడ్డకు కూడా హానికరంగా పరిణమిస్తుంది.
రాళ్లు రువ్వే శిక్షకు గురైన అపరాధి – పురుషుడైనా, స్త్రీ అయినా – వారి అంత్యక్రియల నమాజ్ చెయ్యటం మాత్రం సంప్రదాయమే (మస్నూన్). ఇటువంటి వ్యక్తుల జనాజా నమాజ్‌లో సాధారణ ప్రజలు, ప్రముఖులు కూడా పాల్గొనాలని మెజారిటీ విద్వాంసులు అభిప్రాయపడ్డారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1041
హదీసు 1042
وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { رَجَمَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -رَجُلًا مَنْ أَسْلَمَ, وَرَجُلًا مِنْ اَلْيَهُودِ, وَاِمْرَأَةً } رَوَاهُ مُسْلِمٌ. وَقِصَّةُ رَجْمِ اَلْيَهُودِيَّيْنِ فِي "اَلصَّحِيحَيْنِ" مِنْ حَدِيثِ اِبْنِ عُمَرَ.
హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ అస్లం తెగకు చెందిన ఒక వ్యక్తికి శిలా శిక్ష విధించారు. ఒక యూద పురుషునికీ, ఒక యూద స్త్రీకి కూడా ఇలాంటి శిక్షే విధించారు. (ముస్లిం – యూద స్త్రీ పురుషుల శిలా శిక్ష వృత్తాంతం ‘సహీహైన్’లో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)చే ఉల్లేఖించబడింది)
English
Jabir bin 'Abdullah (RAA) narrated, "The Messenger of Allah (ﷺ) stoned a man from Aslam to death, a Jewish man and a woman. Related by Muslim.
The story of stoning the two Jews is mentioned in Al-Bukhari and Muslim on the authority of Ibn 'Umar.
సారాంశం
వ్యభిచార నేరానికి పాల్పడిన ఒక యూద పురుషుడు, ఒక యూద స్త్రీకి సంబంధించిన సంఘటన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోనే గాక సునన్ గ్రంథాలలోనూ వచ్చింది. దాని ప్రకారం; మదీనాలో కొందరు యూదులు దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి; మాలోని ఒక పురుషుడు, ఒక స్త్రీ వ్యభిచారానికి పాల్పడ్డారు అని తెలియజేశారు. దానికి ఆయన ﷺ, “తౌరాత్ గ్రంథంలో శిలా శిక్ష గురించి ఏముంది?” అని అడిగారు. “మేము వ్యభిచరించిన ఇద్దరి ముఖాలకు మసిపూసి, గాడిదపై కూర్చోబెట్టి ఊరేగిస్తాము – ఈ విధంగా వారిని అవమానపరుస్తాము” అని వివరించారు యూదులు. “ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే తౌరాత్ గ్రంథాన్ని తెచ్చి, దాన్ని చదవండి” అని దైవప్రవక్త ﷺ సూచించారు. యూదులు తౌరాత్ గ్రంథం తెచ్చి చదవసాగారు. శిలా శిక్ష ఆదేశం వున్న సూక్తి దగ్గరకు చేరగానే, దాన్ని పఠించే యువకుడు ఆ సూక్తిపై చేయిపెట్టి, దానికి క్రిందా, పైనా ఉన్న సూక్తులను పఠించసాగాడు. ఆ సమయంలో హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) కూడా అక్కడున్నారు. “దైవప్రవక్తా! అతని చేయిని తీయమని చెప్పండి” అన్నారు. ఆ వ్యక్తి చెయ్యి తీస్తే అక్కడ శిలా శిక్షకు సంబంధించిన ఆజ్ఞ ఉంది. అప్పుడు దైవప్రవక్త ﷺ వారిద్దరినీ శిలా శిక్ష విధించమని ఆదేశించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1042
హదీసు 1043
وَعَنْ سَعِيدِ بْنِ سَعْدِ بْنِ عِبَادَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { كَانَ فِي أَبْيَاتِنَا رُوَيْجِلٌ ضَعِيفٌ, فَخَبَثَ بِأَمَةٍ مِنْ إِمَائِهِمْ, فَذَكَرَ ذَلِكَ سَعْدٌ لِرَسُولِ اَللَّهِ - صلى الله عليه وسلم -فَقَالَ: "اِضْرِبُوهُ حَدَّهُ". فَقَالُوا: يَا رَسُولَ اَللَّهِ! إِنَّهُ أَضْعَفُ مِنْ ذَلِكَ, فَقَالَ: "خُذُوا عِثْكَالًا فِيهِ مِائَةُ شِمْرَاخٍ, ثُمَّ اِضْرِبُوهُ بِهِ ضَرْبَةً وَاحِدَةً". فَفَعَلُوا } رَوَاهُ أَحْمَدُ, وَالنَّسَائِيُّ, وَابْنُ مَاجَهْ, وَإِسْنَادُهُ حَسَنٌ. لَكِنْ اخْتُلِفَ فِي وَصْلِهِ وَإِرْسَالِهِ.
హజ్రత్ సయీద్ బిన్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హుమా) కథనం : “మా ఇండ్లల్లో అత్యంత బలహీనుడు, బక్కవాడైన ఒక పొట్టి మనిషి ఉండేవాడు. అతడు మా బానిసరాళ్ళలో ఒకామెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంగతిని హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ దృష్టికి తీసుకురాగా; “అతణ్ణి శిక్షించండి” అని ఆయన ﷺ ఆదేశించారు. “దైవ ప్రవక్తా ﷺ! అతడు మరీ బలహీనంగా, బక్కపలచగా ఉన్నాడు కదా!” అని జనులు సందేహపడగా “నూరు రెమ్మలు గల ఒక ఖర్జూర మండను తీసుకుని ఒకేసారి వాడిపై ఝళిపించండి” అని దైవప్రవక్త ﷺ సూచించారు. ప్రజలు ఆయన ﷺ సూచనను యధాతథంగా పాటించారు. (దీనిని అహ్మద్, నసాయి, ఇబ్నె మాజాలు ఉల్లేఖించారు. దీని పరంపర ‘హసన్’ కోవకు చెందినది. ఇది మౌసూల్ మరియు ముర్సల్ కావటంపై భేదాభిప్రాయం ఉంది)
English
Sa'id bin Sa'd bin 'Ubadah (RAA) narrated, 'A small weak man was staying in our tribe, and he committed adultery with one of their slave-women. Sa'd mentioned this to the Messenger of Allah (ﷺ), and thereupon he said, "Flog him (according to) the prescribed penalty." The people then said, 'O Messenger of Allah! He is too weak to bear it.' The Messenger of Allah (ﷺ) then said, "Get a stalk of the raceme of a palm tree with a hundred twigs and strike him just once." So, they did. Related by Ahmad, An-Nasa'i and Ibn Majah with a good chain of narrators.
సారాంశం
ఈ హదీసు వల్ల అవగతమయ్యేదేమిటంటే అవివాహితుడైన వ్యభిచారి తీవ్ర వ్యాధిగ్రస్తుడుగానో, మరీ బలహీనుడిగానో ఉండి కొరడా దెబ్బలు తింటే చచ్చిపోతాడనుకున్నప్పుడు అతనిపట్ల కొంత సడలింపుల వైఖరిని అవలంబించవచ్చు. అయితే దెబ్బల సంఖ్యలో మాత్రం తగ్గింపు ఉండదు. నూరు రెమ్మలు గల మండను తీసుకుని ప్రతి రెమ్మా అతనికి తగిలేలా కొట్టాలని అత్యధికమంది ఉలమా భావించగా, నూరు రెమ్మలు గల మండతో ఒక్కసారి కొడితే సరిపోతుందని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు. షరీయత్ విధించే శిక్షల పరమార్థం ప్రజలకు గుణపాఠం నేర్పడం మరియు శాంతిభద్రతలను నెలకొల్పడమేగాని మనుషులను చంపటం కాదు.
హదీసు ఉల్లేఖకులు
సయీద్ బిన్ సాద్ బిన్ ఉబాదా అన్సారీ (రదియల్లాహు అన్హు) : సుప్రసిద్ధ సహాబీ. మరొక కథనం ప్రకారం తాబయీ అని తెలుస్తోంది. ఈయనచే కొన్ని హదీసులు ఉల్లేఖించబడ్డాయి. హజ్రత్ అలీ బిన్ అబూతాలిబ్ (రదియల్లాహు అన్హు) తన పరిపాలనా కాలంలో ఈయన్ని యమన్ అధికారిగా నియమించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1043
హదీసు 1044
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ: { مَنْ وَجَدْتُمُوهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوطٍ, فَاقْتُلُوا اَلْفَاعِلَ وَالْمَفْعُولَ بِهِ, وَمَنْ وَجَدْتُمُوهُ وَقَعَ عَلَى بَهِيمَةٍ, فَاقْتُلُوهُ وَاقْتُلُوا اَلْبَهِيمَةَ } ". رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ, وَرِجَالُهُ مُوَثَّقُونَ, إِلَّا أَنَّ فِيهِ اِخْتِلَافًا.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు : లూత్ జాతి చేష్టకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన వారిని – ఆ చేష్ట చేసిన వారినీ, చేయించుకున్నవారిని – ఇద్దరినీ చంపేయండి. అలాగే జంతువులతో, లైంగిక సంపర్కం చేస్తూ కంటపడిన వారిని – ఆ చేష్టకు ఒడిగట్టిన పురుషుణ్ణీ, ఆ జంతువును కూడా – వధించండి.” (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురూ’ ఉల్లేఖించారు. దీని ఉల్లేఖకులు ఎన్నదగ్గ వారుగా ధృవీకరించబడ్డారు. అయితే ఈ అంశంపై స్వల్పమయిన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి)
English
Ibn 'Abbas (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Whoever you find doing as the people of Lot did (i.e. homosexuality), kill the one who does it and the one to whom it is done, and if you find anyone having sexual intercourse with animal, kill him and kill the animal." Related by Ahmad and the four Imams with a trustworthy chain of narrators.
సారాంశం
‘లూత్ జాతి చేష్ట’ అంటే అసహజమైన లైంగిక ప్రక్రియ. దైవప్రవక్త లూత్ (అలైహిస్సలాం) కాలం నాటి ప్రజలు సహజమైన లైంగిక ప్రక్రియకు బదులు అసహజమైన రీతికి పాల్పడటం వల్ల వారిపై దైవాగ్రహం విరుచుకుపడింది. ఆ చేష్ట నేడు ‘హోమో సెక్సువాలిటీ’గా పిలువబడుతోంది. కొన్ని పాశ్చాత్య దేశాలు ఈ నీతిమాలిన చేష్టను చట్టబద్ధమైనదిగా ఖరారు చేశాయి కూడా.
అసహజమైన, పరమ జుగుప్సాకరమయిన ఈ చేష్టను ఇస్లాం నిషేధించటమే గాకుండా దీన్ని నీతిబాహ్యమైన పోకడగా కూడా భావిస్తోంది. సమాజంలోని సౌశీల్యాన్ని, పారిశుద్ధ్యాన్ని పాడుచేసి మానవతను ఉత్థానస్థితి నుంచి పతనానికి చేర్చే ఈ పోకడను సమూలంగా తుడిచిపెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఇటువంటి వికృత చేష్టకు పాల్పడేవారిని హతమార్చమని మహనీయ ముహమ్మద్ ﷺ ఆదేశించారు.
ఆధునిక యుగంలో ఎన్ని వైద్యసదుపాయాలు పెరిగినా, మరెన్ని రోగనిరోధక మాత్రలు, ఇంజెక్షన్లు కనుగొనబడినా మానవ సముదాయాలు మాయ రోగాల బారిన పడుతూనే ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఇస్లామీయ షరీయత్ సూచిస్తున్న నియమాల ఉల్లంఘనేనన్న వాస్తవాన్ని విస్మరించరాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1044
హదీసు 1045
وَعَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا: { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -ضَرَبَ وَغَرَّبَ وَأَبُو بَكْرٍ ضَرَبَ وَغَرَّبَ. } رَوَاهُ اَلتِّرْمِذِيُّ, وَرِجَالُهُ ثِقَاتٌ, إِلَّا أَنَّهُ اخْتُلِفَ فِي وَقْفِهِ وَرَفْعِهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ వ్యభిచారిని కొట్టడమేగాక నగరం నుంచి బహిష్కరించే శిక్ష కూడా విధించారు. హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) వ్యభిచారిని కొట్టడంతోపాటు నగర బహిష్కార శిక్ష విధించారు. (ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించారు – దీని ఉల్లేఖకులు విశ్వసనీయులు. కాని ఇది మౌఖూఫ్ మరియు మర్ఫూ అనే విషయంలో మటుకు అభిప్రాయభేదం ఉంది)
English
Ibn 'Umar (RAA) narrated, "The Messenger of Allah (ﷺ) applied the punishment of flogging and also that of exile, Abu Bakr (RAA) applied the punishments of flogging and exile and also 'Umar applied them." Related by At-Tirmidhi with a trustworthy chain of narrators, but scholars differed over its being traced back to the Prophet (ﷺ) or only to the companion.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1045
హదీసు 1046
وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: لَعَنَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -اَلْمُخَنَّثِينَ مِنْ اَلرِّجَالِ, وَالْمُتَرَجِّلَاتِ مِنْ اَلنِّسَاءِ, وَقَالَ: { أَخْرِجُوهُمْ مِنْ بُيُوتِكُمْ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఆడవారిలా వేషధారణ చేసే మగవారినీ, మగవారిలా తయారయ్యే ఆడవారినీ దైవప్రవక్త ﷺ శపించారు. “వారిని మీ ఇండ్లలో నుంచి వెళ్ళగొట్టండి” అని కూడా ఆయన ﷺ పలికారు. (బుఖారీ)
English
Ibn 'Abbas (RAA) narrated, "The Messenger of Allah (ﷺ) cursed men who are effeminate and women who take the similitude of men, and said, "Get them out of your homes." Related by Al-Bukhari.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1046
హదీసు 1047
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اِدْفَعُوا اَلْحُدُودَ, مَا وَجَدْتُمْ لَهَا مَدْفَعًا } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ, وَسَنَدُهُ ضَعِيفٌ وَأَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَالْحَاكِمُ: مِنْ حَدِيثِ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا بِلَفْظِ { ادْرَأُوا اَلْحُدُودَ عَنْ اَلْمُسْلِمِينَ مَا اِسْتَطَعْتُمْ } " وَهُوَ ضَعِيفٌ أَيْضًا. وَرَوَاهُ اَلْبَيْهَقِيُّ: عَنْ عَلِيٍّ - رضى الله عنه - (مِنْ) قَوْلِهِ بِلَفْظِ: { ادْرَأُوا اَلْحُدُودَ بِالشُّبُهَاتِ }
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: “శిక్షలను తప్పించడానికి ఎంతగా ప్రయత్నించవచ్చునో అంతగానూ ప్రయత్నించండి.” (దీనిని ఇబ్నెమాజా సేకరించారు. అయితే దీని ఆధారం బలహీనమైనది)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆధారంగా తిర్మిజీ, హాకీమ్లు వివరించిన హదీసు వాక్యం ఇలా వుంది : “సాధ్యమైనంత వరకు ముస్లిములను శిక్షల బారినుండి కాపాడటానికి ప్రయత్నించండి.” (ఇది కూడా బలహీనమైనదే)
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హా) ఆధారంగా బైహఖీ పొందుపరచిన హదీసులో ఇలా అనబడింది: “సాక్ష్యాధారాలు లేని (అనుమానాస్పదమయిన) వాటికి శిక్షలను విధించకండి.”
English
Abu Hurairah (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Avert the infliction of the prescribed punishment as long as you find a way out (i.e. to avoid their infliction). Related by Ibn Majah with a weak chain of narrators.
At-Tirmidhi and Al-Hakim transmitted on the authority of 'Aishah (RAA) with the wording, 'Allah's Messenger (ﷺ) said: "Avert infliction of the prescribed punishment on the Muslims as much as you can." It is also a weak hadith.
Al-Baihaqi transmitted on the authority of 'Ali (RAA) that he said, 'Avert the prescribed punishment by rejecting doubtful evidence.'
సారాంశం
నేర విచారణ సందర్భంగా ఏ కాస్త అనుమానం వచ్చినా తీర్పును వాయిదా వేయాలని ఈ హదీసు సూచిస్తోంది. నేరస్థుల్ని శిక్షించకుండా వదలివేయాలని దీని భావం ఎంతమాత్రం కాదు. కాకపోతే అన్ని కోణాల నుంచి సమగ్రమయిన విచారణ జరపాలి. పూర్తిగా నేరనిర్ధారణ జరగనిదే శిక్షల్ని విధించకూడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1047
హదీసు 1048
وَعَنْ اِبْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اِجْتَنِبُوا هَذِهِ اَلْقَاذُورَاتِ اَلَّتِي نَهَى اَللَّهُ تَعَالَى عَنْهَا, فَمَنْ أَلَمَّ بِهَا فَلْيَسْتَتِرْ بِسِتْرِ اَللَّهِ تَعَالَى, وَلِيَتُبْ إِلَى اَللَّهِ تَعَالَى, فَإِنَّهُ مَنْ يَبْدِ لَنَا صَفْحَتَهُ نُقِمْ عَلَيْهِ كِتَابَ اَللَّهِ عَزَّ وَجَلَّ } رَوَاهُ اَلْحَاكِمُ, وَهُوَ فِي "اَلْمُوْطَّإِ" مِنْ مَرَاسِيلِ زَيْدِ بْنِ أَسْلَمَ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ వారించిన పాడు పనులకు దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరయినా ఆ పాడు పనుల వాతన పడిపోతే దేవుడు వేసిన తెరమరుగున అతడు ఉండిపోవాలి. దైవసన్నిధిలో (లోలోపలే కుమిలిపోతూ) పశ్చాత్తాపం చెందాలి. ఎందుకంటే తన పార్థ్యాన్ని (దోషాన్ని) మా ముందు బహిర్గతం చేసిన వానిపై మేము దైవగ్రంథాన్ని (దైవాజ్ఞను) విధించి తీరుతాము.” (దీనిని హాకీమ్ ఉల్లేఖించారు. ఇది మువత్తాలో జైద్ బిన్ అస్లంచే ‘ముర్సల్’గా ఉల్లేఖించబడింది)
English
Ibn 'Umar (RAA) narrated that the Messenger of Allah (ﷺ) said: "Avoid these filthy practices which Allah, the Almighty has prohibited. He who commits any of these, should conceal with Allah's Most High Veil (i.e. should not speak about it), and should turn to Allah, the Most High in repentance, for if anyone uncovers his hidden sins (to us), we shall inflict on him the punishment prescribed by Allah, the Al-Mighty." Related by Al-Hakim and in Al-Muwatta' but traced to its narrator Zaid bin Aslam as hadith Mursal.
సారాంశం
మానవ సహజమైన దౌర్బల్యం వల్ల మనిషి చేత తప్పు జరగటం అనూహ్యం కాదు. అయితే అలాంటి తప్పు జరిగిపోయినప్పుడు మనిషి తన తప్పిదాన్ని ఇతరుల ముందు చెప్పుకుంటూ తిరిగేబదులు దైవసన్నిధిలోనే క్షమాభిక్ష వేడుకోవాలి. దేవుడు అతని దోషాలను తెరమరుగు చేయదలచినప్పుడు దైవ సమక్షంలోనే పశ్చాత్తాపంతో కుమిలిపోవటం శ్రేయస్కరం.
కాని ‘తౌబా’ అంటే చెడు నుంచి మంచి వైపునకు మరలటమన్న సంగతిని అతడు మరచిపోయాడు. తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన దాసులను దేవుడు మన్నించే మాట వాస్తవమేగాని, మాటిమాటికీ అక్రమాలకు పాల్పడవచ్చని మాత్రం దీని భావం కాదు. మానవుడు తన వల్ల జరిగిపోయిన తప్పిదం ఇంకోసారి పునరావృతం కాకుండా జాగ్రత్తపడటమే సిసలయిన పశ్చాత్తాపం (తౌబా). సిసలయిన పశ్చాత్తాపం చెందే దాసులను దేవుడు అమితంగా ఇష్టపడతాడు, వారి అంతస్తులను పెంచుతాడు.
హదీసు ఉల్లేఖకులు
జైద్ బిన్ అస్లం (రదియల్లాహు అన్హు) : ఈయన బనూ అజ్లాన్కు చెందిన వ్యక్తి. ఈయన బనీ అమ్రూ బిన్ ఔఫ్ అన్సారీకి మద్దతుదారులు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు. సిఫ్ఫీన్ యుద్ధంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) పక్షాన నిలిచారు. ఈయన్ని తులైహా బిన్ ఖువైలిద్ అసదీ బజాఖా యుద్ధదినాన హిజ్రీ 11లో హతమార్చాడని హిషామ్ కల్బీ తెలిపారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|10. శిక్షల పుస్తకం|10.1 వ్యభిచారికి విధించబడే శిక్ష|హదీసు 1048
You must be logged in to post a comment.