హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 9.2 నిందారోపణలు, దైవంపై ప్రమాణం చేసి చెప్పటం

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 9. అపరాధాల పుస్తకం, 2వ అధ్యాయం: నిందారోపణలు, దైవంపై ప్రమాణం చేసి చెప్పటం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1020 – 1021) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

9.2 నిందారోపణలు, దైవంపై ప్రమాణం చేసి చెప్పటం

↑ విషయ సూచిక

باب دعوى الدم والقسامة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1020

హదీసు 1020

عَنْ سَهْلِ بْنِ أَبِي حَثْمَةَ, عَنْ رِجَالٍ مِنْ كُبَرَاءِ قَوْمِهِ, أَنَّ عَبْدَ اَللَّهِ بْنَ سَهْلٍ ومُحَيِّصَةَ بْنَ مَسْعُودٍ خَرَجَا إِلَى خَيْبَرَ مِنْ جَهْدٍ أَصَابَهُمْ, فَأُتِيَ مَحَيِّصَةُ فَأُخْبِرَ أَنَّ عَبْدَ اَللَّهِ بْنِ سَهْلِ قَدْ قُتِلَ, وَطُرِحَ فِي عَيْنٍ, فَأَتَى يَهُودَ, فَقَالَ: أَنْتُمْ وَاَللَّهِ قَتَلْتُمُوهُ.‏ قَالُوا: وَاَللَّهِ مَا قَتَلْنَاهُ, فَأَقْبَلَ هُوَ وَأَخُوهُ حُوَيِّصَةُ وَعَبْدُ اَلرَّحْمَنِ بْنُ سَهْلٍ, فَذَهَبَ مُحَيِّصَةُ لَيَتَكَلَّمَ, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ "كَبِّرْ كَبِّرْ" يُرِيدُ: اَلسِّنَّ, فَتَكَلَّمَ حُوَيِّصَةُ, ثُمَّ تَكَلَّمَ مُحَيِّصَةُ, فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-"إِمَّا أَنْ يَدُوا صَاحِبَكُمْ, وَإِمَّا أَنْ يَأْذَنُوا بِحَرْبٍ".‏ فَكَتَبَ إِلَيْهِمْ فِي ذَلِكَ [كِتَابًا].‏ فَكَتَبُوا: إِنَّا وَاَللَّهِ مَا قَتَلْنَاهُ, فَقَالَ لِحُوَيِّصَةَ, وَمُحَيِّصَةُ, وَعَبْدِ اَلرَّحْمَنِ بْنَ سَهْلٍ: "أَتَحْلِفُونَ, وَتَسْتَحِقُّونَ دَمَ صَاحِبَكُمْ?" قَالُوا: لَا.‏ قَالَ: "فَيَحْلِفُ لَكُمْ يَهُودُ?" قَالُوا: لَيْسُوا مُسْلِمِينَ فَوَدَاهُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-مِنْ عِنْدِهِ, فَبَعَثَ إِلَيْهِمْ مَائَةَ نَاقَةٍ.‏ قَالَ سَهْلٌ: فَلَقَدْ رَكَضَتْنِي مِنْهَا نَاقَةٌ حَمْرَاءُ } مُتَّفَقٌ عَلَيْهِ.‏.

హజ్రత్ సహ్ల్ బిన్ అబూ హస్మ (రదియల్లాహు అన్హు) తన తెగకు చెందిన పెద్దవారు చెప్పిన వృత్తాంతాన్ని వివరించారు: (దీని ప్రకారం) అబ్దుల్లా బిన్ సహ్ల్, ముహైయ్యస బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) తన పేదరికం దృష్ట్యా ఖైబర్‌కు వలసపోయేందుకు బయలుదేరారు. అయితే ముహైయ్యసకు “అబ్దుల్లా బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) హత్య చేయబడ్డారనీ, హంతకులు ఆయన్ని ఒక బావిలో పడవేశార”ని సమాచారమందింది. తరువాత ముహైయ్యస యూదుల దగ్గరకు వచ్చి, “దైవసాక్షి! మీరే ఆయన్ని చంపేశారు” అని నిందించారు. దానికి వారు, “దేవుని తోడుగా చెబుతున్నాము- మేము ఆయన్ని చంపలేదు” అని అన్నారు. ఆ తరువాత ముహైయ్యస, అతని సోదరుడు హువైయ్యస మరియు అబ్దుర్రహ్మాన్ బిన్ సహ్ల్ – ముగ్గురూ కలసి దైవప్రవక్త ﷺ న్యాయస్థానానికి వచ్చారు. జరిగినదంతా ముహైయ్యస చెప్పబోయారు. “పెద్దాయన, పెద్దాయన” అని దైవప్రవక్త ﷺ అన్నారు. అంటే, మీలో వయసులో ఎవరు పెద్దవారో వారు మాట్లాడాలి అన్నది ఆయన ﷺ ఉద్దేశ్యం. అప్పుడు హువైయ్యస ఫిర్యాదు చేశారు. అనంతరం ముహైయ్యస వివరంగా చెప్పారు. ఇదంతా విని “వాళ్ళు మీ మనిషికి రక్తపరిహారమన్నా ఇవ్వాలి లేదా మీతో యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి” అని దైవప్రవక్త ﷺ సెలవిచ్చారు. ఆ తరువాత ఆయన ﷺ ఈ వ్యవహారం గురించి వాళ్ళకు లేఖ వ్రాశారు. దానికి సమాధానంగా వాళ్ళు (యూదులు), “దైవసాక్షి! మేము ఆయన్ని హత్య చేయలేదు” అని సంజాయిషీ వ్రాసి పంపారు. అప్పుడు దైవప్రవక్త ﷺ హువైయ్యస, ముహైయ్యస, అబ్దుర్రహ్మాన్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు)ల నుద్దేశ్యించి, “మీరు దేవునిపై ప్రమాణం చేసి మీ మనిషి రక్త పరిహారం కొరకు దావా చేయగలరా?” అని అడిగారు. “లేదు” అని వారు సమాధానమిచ్చారు. “పోనీ, మీ సమక్షంలో యూదుల చేత ప్రమాణం చేయించనా?” అని దైవప్రవక్త ﷺ ప్రశ్నించగా, “వారు ముస్లింలు కారు కదా! (వారి ప్రమాణాలను నమ్మేదెలా?)” అని వారు బదులిచ్చారు. అప్పుడు దైవప్రవక్త ﷺ హతుని రక్త పరిహారాన్ని తన వద్దనుంచి (కోశాగారం నుంచి) చెల్లించారు. పరిహారంగా వారివద్దకు నూరు ఒంటెలను పంపించారు. “వాటిలోని ఒక ఎర్రని ఒంటె తనను కాలితో తన్నింద”ని సహ్ల్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

English

Sahl bin Abi Khaithamah (RAA) narrated on the authority of some honored men from his people that 'Abdullah bin Sahl and Muhaiysah bin Mas'ud, went out to Khaibar because of a hardship they were undergoing. Muhaiysah came and told them that 'Abdullah bin Sahl had been killed and thrown into a well. He came to the Jews and said to them, ‘I swear by Allah that you have killed him.’ They replied, ‘We swear by Allah that we have not killed him.' Then Muhaiysah came along with his brother Huwaiysah and 'Abdur Rahman bin Sahl to the Prophet (ﷺ) and Muhaiysah started to talk. The Messenger of Allah (ﷺ) said to him, “Let an older one speak (take charge of this matter).” So Huwaiysah narrated what happened and then Muhaiysah spoke. The Messenger of Allah (ﷺ) said: “Either they pay the Diyah of your companion or be ready for war.” The Messenger of Allah (ﷺ) wrote to them about this and they wrote back saying, ‘By Allah, we have not killed him.’ The Messenger of Allah (ﷺ) then said to Huwaiysah, Muhaiysah and 'Abdur Rahman bin Sahl, “Would you take an oath (that they killed him) and then you will be entitled to the Diyah of your companion” 'They answered, ‘No (as they did not witness the crime).’The Messenger of Allah then said, “Then the Jews should take an oath (that they are innocent).” They said, ‘They are not Muslims.’ The Messenger of Allah (ﷺ) thereupon paid the Diyah of the victim himself and sent them 100 camels. Sahl commented, ‘A red she-camel (of these 100 camels) kicked me.’ Agreed upon.

సారాంశం

హంతకుడు ఫలానా వ్యక్తి అని ఇదమిత్థంగా తెలియకుండా – సందిగ్ధావస్థ ఏర్పడినప్పుడు అనుమానం వున్న వ్యక్తులచేత ‘ప్రమాణాలు’ చేయించవచ్చుని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. ఈ పద్ధతి అజ్ఞాన కాలంలోనూ అమల్లో ఉండేది. ఇస్లాం కూడా ఈ పద్ధతిని సమ్మతించింది. ఈ సందర్భంగా మొత్తం యాభైమంది చేత ప్రమాణాలు చేయించబడతాయి. మేముగానీ, మా తెగ (వర్గం) వారుగానీ, మా గ్రామస్థులుగానీ, ఈ పాపం ఎరుగరు అని ప్రమాణ సందర్భంగా ప్రకటించాలి. అయితే ఈ రకమయిన ప్రమాణం కేవలం రక్తపరిహారపు కేసులోనే ఉంటుంది. ఇతర అపరాధాలకు ఇది వర్తించదు. ప్రమాణం ఇరు పక్షాలలో ఎవరి తరపున అయినా చేయించవచ్చు. హతుని తరపు వారసులు ప్రమాణం చేస్తున్నప్పుడు; “మా మనిషిని చంపిన వాళ్ళు వీళ్ళే” అని ప్రకటించవలసి ఉంటుంది. నిందితుని తరపు మనుషులు ప్రమాణం చేస్తున్నప్పుడు; తాము ఈ ఘోరానికి పాల్పడలేదని 50 మంది ప్రమాణం చేసి మరీ చెప్పవలసి ఉంటుంది. సామూహిక వ్యవహారాలు చేస్తున్నప్పుడు తొలుత పెద్దవాళ్ళ మాటలకు ప్రాధాన్యమివ్వాలని కూడా ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతున్నది.

హదీసు ఉల్లేఖకులు

1. అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) : అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ బిన్ జైద్ బిన్ కాబ్ బిన్ ఆమిర్ అన్సారీ హారిసీ. ఖైబర్‌లో హత్య చేయబడ్డారు. ఈయన మృతదేహం ఒక బావిలో కనిపించింది. ఆయన మెడ విరిచివేయబడింది.

2. ముహైయ్యస (రదియల్లాహు అన్హు) : అబూ సయీద్ ముహైయ్యస బిన్ మస్‌వూద్ బిన్ కాబ్ హారిసీ- అన్సారీ – మదనీ. హతులైన అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) గారి బాబాయి కుమారుడు. సుప్రసిద్ధ సహాబీ. హిజ్రత్‌కు ముందే ఇస్లాం స్వీకరించారు. ఉహూద్, కందక యుద్ధాలతోసహా ముఖ్య సంగ్రామాలన్నింటిలోనూ పాల్గొన్నారు. దైవప్రవక్త ﷺ ఈయన్ని ఇస్లాం ధర్మప్రచారం నిమిత్తం ‘ఫిదక్’ ప్రాంతానికి పంపించారు.

3. హువైయ్యస (రదియల్లాహు అన్హు) : ఈయన ముహైయ్యస గారి పెద్దన్న. హిజ్రీ 3వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు. ఉహూద్, కందక పోరాటాలతో పాటు, ఇతర యుద్ధాలలో కూడా దైవప్రవక్త ﷺ తో కలసి పాల్గొన్నారు.

4. అబ్దుర్రహ్మాన్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) : ఈయన అబ్దుల్లాహ్ బిన్ సహ్ల్ గారి సోదరులు. ఈయన తల్లి పేరు లైలా బిన్తె నాఫె బిన్ ఆమిర్. ఈయన కూడా బద్ర్, ఉహూద్‌లతో సహా ముఖ్య పోరాటాలన్నింటిలో పాల్గొన్నారని అనబడుతోంది. ఒకసారి ఈయనకు పాము కాటేసింది. దైవప్రవక్త ﷺ సూచనానుసారం అమ్మారా బిన్ హజ్మ్ దివ్య ఖుర్ఆన్‌లోని సూక్తులను పఠించి ఈయనపై ఊదారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.2 నిందారోపణలు, దైవంపై ప్రమాణం చేసి చెప్పటం|హదీసు 1020

1021

హదీసు 1021

وَعَنْ رَجُلٍ مِنْ اَلْأَنْصَارِ; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَقَرَّ اَلْقَسَامَةَ عَلَى مَا كَانَتْ عَلَيْهِ فِي اَلْجَاهِلِيَّةِ, وَقَضَى بِهَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بَيْنَ نَاسٍ مِنَ اَلْأَنْصَارِ فِي قَتِيلٍ اِدَّعَوْهُ عَلَى اَلْيَهُودِ } رَوَاهُ مُسْلِمٌ.‏

ఒక అన్సార్ సహాబీ కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ అజ్ఞాన కాలం నాటి ‘ప్రమాణాలను’ యధాతథంగా కొనసాగించారు. అన్సార్ వర్గానికి చెందిన కొంత మంది మధ్య ఆయన ﷺ నిలబడి హతునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ హత్యారోపణ యూదులపై చేయబడింది. (ముస్లిం)

English

A man from the Ansar narrated that The Messenger of Allah (ﷺ) consented to the Qasamah (taking an oath that they did not kill the victim), which was practiced during the time of Jahiliyah (pre-Islam) and the Messenger of Allah (ﷺ) made a judgment between some men from the Ansar concerning a man who was killed and they claimed that the Jews had killed him.’ Related by Muslim.

సారాంశం

అజ్ఞానకాలం నాటి ‘ప్రమాణాల’ రీతి ఈ హదీసులో ప్రస్తావనకు వచ్చింది. ఈ రీతిని దైవప్రవక్త ﷺ కొనసాగించారు. దీని పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్ళి చూస్తే మక్కాలో ఒక ఖురైష్ వ్యక్తి హాష్మి వర్గానికి చెందిన ఒక మనిషిని హత్య చేశాడు. ఈ హత్య మూలంగా చాలా ఉద్రిక్తత నెలకొంది. హంతకుడు తనపై మోపబడిన ఆరోపణను త్రోసిపుచ్చాడు. ఆ క్లిష్ట పరిస్థితిలో అబూతాలిబ్ నిలబడి మూడు ప్రతిపాదనలు చేశారు : ఆ మూడింటిలో ఏదో ఒకదానిని ఎన్నుకోవచ్చుని సలహా ఇచ్చారు. అవేమంటే; మాకు రక్తపరిహారమన్నా ఇవ్వండి. లేదా 50 మందిచే తాము ఈ నేరానికి పాల్పడలేదని ప్రమాణాలు అన్నా చేసి మరీ చెప్పించండి. లేదా హంతకుడన్న నిందారోపణ ఆధారంగా మేము ఇతన్ని హతమార్చడానికైనా అనుమతి ఇవ్వండి. ఆ రోజునుంచీ హత్యానేరంపై అనుమానం రేకెత్తినపుడు ప్రమాణాలు చేయించే రివాజు కొనసాగుతూ వస్తోంది. నిందితునికి సంబంధించిన వారు ఈ ప్రమాణాలు గనక చేసినట్లయితే వారి నుంచి ఎలాంటి రక్తపరిహారం వసూలు చేయబడదు. ఈ వ్యవహారంలో ఇస్లామీయ షరీయత్ అవిశ్వాసుల ప్రమాణాలను సయితం స్వీకరిస్తుంది. అజ్ఞాన కాలం నాటి మంచి విషయాలను ఇస్లాం యధాతథంగా ఉంచిందని, వాటిని మార్చలేదని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|9. అపరాధాల పుస్తకం|9.2 నిందారోపణలు, దైవంపై ప్రమాణం చేసి చెప్పటం|హదీసు 1021